1 00:00:18,435 --> 00:00:19,478 రాత్రి. 2 00:00:24,441 --> 00:00:30,822 మన గ్రహంలో ఉన్న సగం జంతువులకు పైగా దాచే ఒక అంధకారపు ప్రపంచం. 3 00:00:33,534 --> 00:00:38,747 ఇప్పటిదాకా, కెమెరాలు వాటి జీవితాలలోని ఒక చిన్ని భాగాన్ని మాత్రమే అందించాయి. 4 00:00:41,750 --> 00:00:44,795 కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 5 00:00:44,878 --> 00:00:49,800 మనం రాత్రి సమయంలో కూడా పగలు చూసినట్టుగానే స్పష్టంగా చూడవచ్చు. 6 00:00:56,557 --> 00:01:00,727 మానవ నేత్రం కన్నా వంద రెట్లు సున్నితంగా ఉండే కెమెరాల సాయంతో... 7 00:01:04,147 --> 00:01:06,859 ఇప్పుడు మనం రాత్రి అందాన్ని... 8 00:01:09,361 --> 00:01:10,487 రంగులలో చూడవచ్చు. 9 00:01:15,367 --> 00:01:17,202 భూమికి చెందినవి కాదా అని అనిపించే ప్రకృతి దృశ్యాలు. 10 00:01:20,289 --> 00:01:24,751 అంధకారంలో బయటకు వచ్చే వింత వింత జీవులు. 11 00:01:27,713 --> 00:01:30,215 ఇదివరకు చూడని ప్రవర్తనలు. 12 00:01:37,222 --> 00:01:40,767 భూగ్రహం యొక్క ఆఖరి అసలైన అరణ్యంలో 13 00:01:41,602 --> 00:01:44,104 ఇప్పుడు మనం జంతువుల జీవితాలను గమనించవచ్చు. 14 00:01:46,565 --> 00:01:47,608 రాత్రి. 15 00:02:10,672 --> 00:02:13,217 ఆర్కిటిక్ ప్రాంతంలో చలికాలం. 16 00:02:17,471 --> 00:02:19,932 ఉదయాన, సూర్యుడు వచ్చాడా వెళ్ళాడా అన్నట్టు ఉంటుంది. 17 00:02:20,015 --> 00:02:23,227 టామ్ హిడ్లస్టన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు 18 00:02:23,936 --> 00:02:26,021 త్వరలోనే అస్తమిస్తాడు కూడా. 19 00:02:27,356 --> 00:02:32,361 ఈ మంచు ప్రపంచాన్ని ఒక నెలకు పైగా అంధకారంలోకి వదిలిపెట్టి వెళ్లిపోతాడు. 20 00:02:38,909 --> 00:02:44,748 ఒక ఆర్కిటిక్ ప్రాంతపు జీవికి, ఇది ఒక పెను మార్పుకు శ్రీకారం చుట్టే సమయం. 21 00:02:49,753 --> 00:02:52,548 తల్లి ధృవపు ఎలుగుబంటికి కవలలు ఉన్నాయి. 22 00:03:00,973 --> 00:03:03,600 అది వాటిని రెండేళ్ల పాటు చూసుకుంటుంది, 23 00:03:04,434 --> 00:03:08,105 ఈ కాలంలో మనుగడ సాగించడానికి కావలసిన నైపుణ్యాలన్నింటినీ వాటికి నేర్పుతుంది. 24 00:03:18,615 --> 00:03:20,242 పిల్లలు ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ ఉంటాయి. 25 00:03:24,788 --> 00:03:26,415 అది సులువైన పని కాదు. 26 00:03:33,672 --> 00:03:35,883 నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. 27 00:03:45,517 --> 00:03:49,354 శీతాకాలం ప్రారంభంలో, ఆహారం చాలా తక్కువగా ఉంటుంది, 28 00:03:50,063 --> 00:03:53,901 తల్లి ధృవపు ఎలుగుబంట్లు రోజుకు ఒక కిలో దాకా బరువును కోల్పోగలవు. 29 00:03:59,323 --> 00:04:00,949 బలహీనంగా, అదే సమయంలో ఆకలితో ఉన్న దానికి, 30 00:04:01,450 --> 00:04:05,287 రాబోవు గడ్డకట్టుపోయే చలిరాత్రుళ్లలో తన పిల్లలను సంరక్షించడం అనేది, 31 00:04:05,370 --> 00:04:07,998 ఒక పెద్ద సవాలు అనే చెప్పవచ్చు. 32 00:04:13,253 --> 00:04:16,255 అంతేకాకుండా, అక్కడ ఉన్నది కేవలం ఈ కుటుంబం మాత్రమే కాదు. 33 00:04:19,635 --> 00:04:25,474 ఆర్కిటిక్ సముద్రతీర ప్రాంతానికి, ఆకలితో ఉన్న ఇతర ఎలుగుబంట్లు చేరుకుంటున్నాయి. 34 00:04:28,268 --> 00:04:31,271 ఉష్ణోగ్రత బాగా పడిపోయి సముద్రం కూడా గడ్డకట్టుకుపోయే 35 00:04:32,272 --> 00:04:35,984 తరుణం కోసం అక్కడ వేచి చూస్తున్నాయి. 36 00:04:38,737 --> 00:04:43,242 ఆ తర్వాత అవి గడ్డకట్టిన సముద్రం మీద ప్రయాణిస్తూ, సీళ్ల కోసం వేటాడతాయి, 37 00:04:43,325 --> 00:04:47,329 ఆకలితో దహించుకుపోతున్న ఈ ఎలుగుబంట్లకు ఆ ఆహారం చాలా ముఖ్యమైనది. 38 00:04:53,502 --> 00:04:55,921 కానీ ఆ గడ్డకట్టుకుపోయే క్షణం వచ్చేదాకా, 39 00:04:56,463 --> 00:04:58,549 తల్లి ఎలుగుబంటి, అలాగే తన పిల్లలు, 40 00:04:59,925 --> 00:05:05,013 ఇంకా ఇతర ఎలుగుబంట్లు కూడా వేచి చూడటం తప్ప ఇంకేమీ చేయలేవు. 41 00:05:16,483 --> 00:05:18,694 ఆర్కిటిక్ లో శీతాకాలం పురోగమించే కొద్దీ... 42 00:05:22,239 --> 00:05:23,866 రాత్రి వేళల సమయం పెరుగూతూ పోతుంది. 43 00:05:29,538 --> 00:05:33,375 ఈ గడ్డకట్టిన ప్రాంతం కూడా మారిపోతుంది. 44 00:05:42,342 --> 00:05:44,970 కేవలం వెన్నెల కాంతి సహాయంతోనే చిత్రీకరిస్తూ... 45 00:05:51,393 --> 00:05:56,231 ఇదివరకు ఎన్నడూ సాధ్యంకాని విధంగా లో లైట్ కెమెరాలు 46 00:05:56,732 --> 00:05:58,567 ఈ మంచు ప్రపంచాన్ని చిత్రీకరించాయి. 47 00:06:08,869 --> 00:06:10,996 నక్షత్రాల నీడలో ధృవపు ఎలుగుబంట్లు 48 00:06:12,289 --> 00:06:16,502 ఏమేం చేస్తాయో అని మనకి దగ్గరి నుండి చూపాయి. 49 00:06:27,179 --> 00:06:32,643 ఈరాత్రికి, తల్లి ఎలుగుబంటి మొదటి పని ఆకలితో ఉన్న తన పిల్లలకు పాలు ఇవ్వడం. 50 00:06:45,489 --> 00:06:48,617 తను ఇచ్చే పాలులో 30 శాతానికి పైగా కొవ్వు ఉంటుంది... 51 00:06:52,329 --> 00:06:57,543 శీతాకాలంలో పిల్లల మనుగడకు కావలసిన మందమైన కొవ్వు పొర ఏర్పడటంలో అది తోడ్పడుతుంది. 52 00:07:02,714 --> 00:07:06,635 తర్వాత, అర్థరాత్రి వేళ శుభ్రపర్చుకొనే సమయం ఆసన్నమైంది. 53 00:07:10,347 --> 00:07:14,852 మంచులో దొర్లుతూ, ధృవపు ఎలుగుబంట్లు తమ దట్టమైన బొచ్చును శుభ్రపరుచుకుంటాయి. 54 00:07:29,491 --> 00:07:31,660 పిల్లలు తల్లిని అనుకరిస్తాయి. 55 00:07:38,000 --> 00:07:42,296 క్రమం తప్పకుండా చేసే మంచు స్నానం వాటి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. 56 00:07:46,466 --> 00:07:50,637 ఈరాత్రి, వాటికి చాలా వెచ్చదనం కావాలి మరి. 57 00:07:53,223 --> 00:07:54,892 ఆర్కిటిక్ శీతాకాలంలో, 58 00:07:56,059 --> 00:07:58,812 ఏ మాత్రం చడీచప్పుడు చేయకుండా తుఫానులు దాడిచేయగలవు. 59 00:08:01,023 --> 00:08:04,651 ఈ తుఫానులు, చిన్నపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమించగలవు కూడా. 60 00:08:16,038 --> 00:08:18,749 కానీ గడ్డకట్టే శీతాకాలపు రాత్రులు చురుకుగా ఉంటూ గడిపే జీవులు 61 00:08:18,832 --> 00:08:21,960 కేవలం ధృవపు ఎలుగుబంట్లు మాత్రమే కావు. 62 00:08:24,463 --> 00:08:27,966 ఆర్కిటిక్ సర్కిల్ అంచున ఉన్న మంచుతో నిండిన అడవులలో, 63 00:08:28,509 --> 00:08:33,096 వెన్నెల కాంతిలో అంతే గట్టిదైన ఒక చిట్టి జీవి బయటకు వస్తుంది. 64 00:08:36,265 --> 00:08:37,808 మౌంటేయిన్ హేర్. 65 00:08:40,520 --> 00:08:44,483 వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి, అవి చీకటి పడ్డాకే బయటకు వస్తాయి. 66 00:08:48,487 --> 00:08:53,158 శీతాకాలం ప్రారంభమయ్యే సమయానికి, వాటి తోలు చామనఛాయ నుండి తెల్లరంగుకు మారుతుంది. 67 00:08:56,537 --> 00:08:58,539 దీనితో అవి మంచులో చక్కగా కలిసిపోగలవు. 68 00:09:06,713 --> 00:09:10,342 ఈ యువ మగ కుందేలు అర్థరాత్తి వేళ ఆహారాన్ని తింటోంది. 69 00:09:14,638 --> 00:09:19,059 ఆహారం పరిమితంగా అందుబాటులో ఉంది కనుక, దానికి చేతనైనప్పుడల్లా అది తినాలి. 70 00:09:21,854 --> 00:09:25,148 కానీ ఆకలితో ఉన్న కుందేలు అదొక్కటే కాదు. 71 00:09:28,569 --> 00:09:31,572 ప్రత్యర్థులను తరిమేయాల్సిన అవసరముంది. 72 00:09:38,954 --> 00:09:42,416 ఆహారానికి, తోడుకు పోటీ చాలా తీవ్రం కాగలదు. 73 00:09:48,046 --> 00:09:52,050 వెంటాడే సమయంలో అవి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. 74 00:10:04,313 --> 00:10:06,815 కానీ తన ప్రత్యర్థి వెనక్కి తగ్గనప్పుడు... 75 00:10:09,234 --> 00:10:11,737 ఇక బాహాబాహీకి దిగుతాయి. 76 00:10:19,203 --> 00:10:21,580 కొన్ని ముష్టిఘాతాలు లక్ష్యాన్ని తాకుతాయి. 77 00:10:24,791 --> 00:10:27,878 ఎవరు దృఢంగా కనపడతారన్న దాని మీదే విజయం ఆధారపడుంది. 78 00:10:49,233 --> 00:10:52,361 ఈరాత్రికి, ఈ కుందేలును విజయం వరించింది. 79 00:10:54,571 --> 00:10:56,990 అది ఈ నిశాచార విజేతకు, రానున్న సుదీర్ఘపు శీతాకాలపు రాత్రులను 80 00:10:57,074 --> 00:11:00,994 తట్టుకొని నిలబడటానికి అవసరమైన మెరుగైన అవకాశాన్ని అందిస్తుంది. 81 00:11:08,961 --> 00:11:10,921 ఇక తీరప్రాంతానికి తిరిగి వచ్చేస్తే, 82 00:11:11,755 --> 00:11:15,342 ఇక్కడ ధృవపు ఎలుగుబంటి, తన పిల్లలూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కనుక 83 00:11:15,425 --> 00:11:17,177 నేలను అతుక్కొని ఉన్నాయి. 84 00:11:20,430 --> 00:11:25,394 శీతాకాలపు రాత్రుళ్లలో, ధృవపు తుఫానులు సమద్రం నుండి 85 00:11:25,936 --> 00:11:29,439 మైనస్ 50 డిగ్రీల ఎముకలు కొరికే చలితో దూసుకొని వస్తాయి. 86 00:11:48,333 --> 00:11:52,212 తీవ్రమైన చలి వల్ల ధృవపు ఎలుగుబంటి పిల్లలకు ప్రాణ ముప్పు ఉంది. 87 00:11:55,007 --> 00:11:58,677 తమ తొలి శీతాకాలాన్ని రెండింట ఒక పిల్ల మాత్రమే తట్టుకొని బతికి బట్టకట్టగలదు. 88 00:12:04,725 --> 00:12:10,189 కానీ తల్లి దగ్గర అందుకు ఒక తెలివైన పరిష్కారముందని నైట్ కెమెరాలు చూపాయి. 89 00:12:16,361 --> 00:12:17,654 తను నేలను తవ్వుతుంది. 90 00:12:19,489 --> 00:12:21,575 తుఫాను నుండి తలదాచుకోవడానికి 91 00:12:23,035 --> 00:12:25,996 అది మెల్లగా తన పిల్లలకు ఒక ఆశ్రయాన్ని నిర్మిస్తోంది. 92 00:12:36,965 --> 00:12:40,761 ఇలాంటి గొయ్యలలో ధృవపు ఎలుగుబంట్ల కుటుంబాలు 93 00:12:40,844 --> 00:12:42,971 నాలుగు రాత్రుళ్ల వరకూ గడపగలవు. 94 00:12:46,308 --> 00:12:50,187 తల్లులు, తమకు ఎంతో అమూల్యమైన తమ పిల్లలకు ఏమీ కాకుండా చూసుకొనే మార్గం ఇదొక్కటే. 95 00:12:57,194 --> 00:12:58,862 తుఫాను వెళ్లిపోయేదాకా... 96 00:13:02,074 --> 00:13:04,201 కుటుంబం తలదాచుకొని ఉండాలి. 97 00:13:20,384 --> 00:13:22,135 తుఫాను వెళ్లిపోయింది. 98 00:13:25,597 --> 00:13:31,603 కుటుంబం బయటకు వచ్చి గాలులు తీసుకొచ్చిన పెను మార్పును చూశాయి. 99 00:13:40,279 --> 00:13:42,364 ఒకప్పుడు మహాసముద్రం ఉన్న చోట, 100 00:13:44,157 --> 00:13:46,660 ఇప్పుడు మంచు గడ్డ ఉంది. 101 00:13:47,786 --> 00:13:49,997 తమకు ఎంత దూరం కనిపిస్తోందో, అంత దూరమూ మంచు గడ్డే ఉంది. 102 00:13:55,878 --> 00:14:00,299 తొలిసారిగా, తల్లి ఎలుగుబంటి తన పిల్లలను సముద్రపు మంచు గడ్డ వైపుకు తీసుకెళ్తోంది. 103 00:14:04,553 --> 00:14:09,057 వాటి జీవితాలలోని తదుపరి అధ్యాయానికి శ్రీకారం చుట్టడానికని. 104 00:14:13,395 --> 00:14:14,855 రాబోవు వారాలలో, 105 00:14:14,938 --> 00:14:18,442 సుదీర్ఘ కాలం పాటు సాగే ఆర్కిటిక్ శీతాకాలంలో, ఈ గడ్డకట్టిన ప్రాంతంలో 106 00:14:19,067 --> 00:14:21,153 ఎలా మనుగడ సాగించాలని అది తన పిల్లలకు నేర్పుతుంది. 107 00:14:30,162 --> 00:14:32,789 కానీ చీకట్లో, ఈ గడ్డకట్టిన ప్రాంతంలో 108 00:14:33,498 --> 00:14:37,377 అన్వేషణ సాగిస్తోన్న తల్లి ఎలుగుబంటి కేవలం అదొక్కటి మాత్రమే కాదు. 109 00:14:41,798 --> 00:14:43,675 ఈ మంచుగడ్డ మీదనే ఒక సుదూరపు చోట, 110 00:14:44,259 --> 00:14:47,679 మరో తల్లికి మరింత సవాలుతో కూడిన సంరక్షణా బాధ్యతలు ఉన్నాయి. 111 00:14:56,563 --> 00:15:00,901 నాలుగేళ్ల వయస్సు గల తన పిల్లలు, దాదాపుగా పూర్తిగా ఎదిగాయనే చెప్పవచ్చు. 112 00:15:02,444 --> 00:15:04,029 తుంటరి టీనేజర్లు అని వాటిని పిలవవచ్చు. 113 00:15:11,328 --> 00:15:14,665 లో లైట్ కెమెరాలు ఒక అరుదైన విషయాన్ని చిత్రీకరించాయి. 114 00:15:15,707 --> 00:15:19,294 రాత్రివేళ ఈత కొడుతున్న పిల్లలు. 115 00:15:35,853 --> 00:15:38,105 అప్పటికి వాటికి ఈదడం బాగా వచ్చేస్తుంది. 116 00:15:39,731 --> 00:15:44,236 కానీ ఈ వయస్సులో, నీటి నుండి బయటకు ఎలా రావాలో నేర్చుకోవడమే కష్టమైన విషయం. 117 00:15:50,450 --> 00:15:53,912 మొదటి పిల్లకు అది ఎలాగో తెలుసు. 118 00:16:02,045 --> 00:16:03,380 కానీ దాని సోదరునికి... 119 00:16:08,010 --> 00:16:09,386 అది ఒక సవాలుతో కూడిన పని. 120 00:16:23,233 --> 00:16:24,234 ఎట్టకేలకు. 121 00:16:26,570 --> 00:16:28,238 ఎవ్వరూ చూడటం లేదులే. 122 00:16:31,033 --> 00:16:35,537 పిల్లలు అంత ఎదిగినా కూడా, తల్లి ఎప్పుడూ వాటిని కనిపెట్టే ఉండాలి. 123 00:16:38,999 --> 00:16:42,002 నాలుగేళ్ల ప్రాయంలో, అవి తమ సామర్థ్యాలను పరీక్షిస్తున్నాయి. 124 00:16:46,548 --> 00:16:50,010 చుట్టూరా ఎదిగిన మగ ఎలుగుబంట్లు ఉన్నాయి కనుక, అది ప్రమాదకరం కావచ్చు. 125 00:16:51,929 --> 00:16:56,058 రాబోవు రాత్రుళ్లలో అది వాటిని జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. 126 00:17:06,234 --> 00:17:09,154 ఈ గడ్డకట్టిన ప్రపంచంలో, సుదీర్ఘ కాలం సాగే 127 00:17:09,238 --> 00:17:12,324 అంధకారపు శీతాకాలంలో, రాత్రి సమయంలో ఆకాశం, 128 00:17:12,991 --> 00:17:17,996 భూగ్రహం మీద అత్యంత కనులవిందుగా సాగే లైట్ షోకి వేదికగా మారుతుంది. 129 00:17:21,040 --> 00:17:23,001 అరోరా బొరియాలిస్. 130 00:17:30,926 --> 00:17:33,595 సౌర తుఫానులలోని శక్తి 131 00:17:34,179 --> 00:17:37,808 మన వాతావరణంతో ఢీ కొట్టి కాంతుల ధారలను... 132 00:17:39,685 --> 00:17:42,312 వందల కిలోమీటర్ల ఎత్తులో పుట్టిస్తాయి. 133 00:17:56,243 --> 00:17:59,037 అవి రాత్రనకా పగలనకా జిగేలుమంటూనే ఉంటాయి. 134 00:18:01,081 --> 00:18:05,586 కానీ మనకి అవి రాత్రి ఆకాశంలో మాత్రమే కనబడతాయి. 135 00:18:25,814 --> 00:18:27,441 శీతాకాలం చివరిదశకు వచ్చేటప్పటికి, 136 00:18:29,151 --> 00:18:31,737 అంధకారం తన పట్టును కాస్తంత సడలిస్తుంది. 137 00:18:35,032 --> 00:18:38,368 చాలా వారాల తర్వాత, సూర్యుడు కాస్తంత సేపు 138 00:18:39,286 --> 00:18:41,997 ఉదయించి వెళ్లిపోతాడు. 139 00:18:51,715 --> 00:18:54,009 అ ముంజీకటి తొలి ఘడియలలో, 140 00:18:54,551 --> 00:19:00,057 తల్లి, అలాగే తన ఎదిగిన పిల్లలు ఒక గడ్డకట్టిన గ్లేషియల్ బేకి చేరుకుంటాయి. 141 00:19:02,935 --> 00:19:05,437 అమ్మ సీళ్లను వేటాడటానికి వెళ్లగా... 142 00:19:09,399 --> 00:19:12,194 ఈ నాలుగేళ్ల పిల్లలు హాయిగా ఆడుకుంటాయి. 143 00:19:18,992 --> 00:19:20,327 కానీ అది ఎక్కువ సేపు సాగదు. 144 00:19:25,832 --> 00:19:29,002 అదే బేలో మరో ఒంటరి ఎలుగుబంటి కూడా ఉంది. 145 00:19:43,559 --> 00:19:47,062 ఒంటరిగా తిరిగే ఎలుగుబంట్లు చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. 146 00:19:50,732 --> 00:19:55,028 కానీ పిల్లలకు కాస్త కుతూహలంగా ఉంది. 147 00:20:10,711 --> 00:20:13,839 పరిచయం లేని ఎలుగుబంటి వద్దకు వెళ్లడం ప్రమాదంతో కూడుకున్నది. 148 00:20:27,603 --> 00:20:30,480 కొట్లాట వల్ల తీవ్రంగా గాయలపాలయ్యే అవకాశం ఉంది. 149 00:20:55,214 --> 00:20:58,634 కానీ, ఏదైతే ఆవేశపూరితంగా అనిపించిందో... 150 00:21:01,720 --> 00:21:04,723 హఠాత్తుగా అది సరదాభరితంగా మారిపోయింది. 151 00:21:14,149 --> 00:21:17,778 విషయం ఏమిటంటే, ఈ అపరిచిత ఎలుగుబంటి, ఆడది. 152 00:21:19,488 --> 00:21:23,242 ఇదంతా ఒక శృంగారభరితమైన సరదా ఆట అన్నమాట. 153 00:21:30,582 --> 00:21:32,960 ధృవపు ఎలుగుబంట్ల సరదా కొట్లాట. 154 00:21:35,712 --> 00:21:40,217 ఇలాంటి సున్నితమైన సామాజిక ప్రవర్తనను ఇదివరకు చూసిన దాఖలాలు అరుదు అనే చెప్పాలి. 155 00:21:52,729 --> 00:21:55,357 తన పిల్లలు వేగంగా పెరుగుతున్నాయి కనుక, 156 00:21:57,609 --> 00:22:00,571 ఈ తల్లి ఎలుగుబంటి పని కూడా దాదాపు పూర్తయినట్టే. 157 00:22:03,740 --> 00:22:09,162 తన చివరి నాలుగేళ్లు, వీటిని చూసుకోవడానికి ఆ తల్లి అంకితం చేసింది. 158 00:22:16,044 --> 00:22:20,174 రాబోవు రోజులలో, రొమ్ము విరుచుకొని తన పిల్లలు తనని విడిచి వెళ్లిపోతాయి. 159 00:22:20,841 --> 00:22:23,677 తదుపరి సంవత్సరం, శీతాకాలంలో 160 00:22:24,261 --> 00:22:29,600 ఎదురయ్యే సుదీర్ఘపు, చీకటి రాత్రుళ్లని అవి తమంతట తామే ఒంటరిగా ఎదుర్కోవాలి. 161 00:22:40,819 --> 00:22:45,824 రాత్రి సమయాన భూమి చీకట్లో చిత్రీకరించబడింది 162 00:22:48,827 --> 00:22:50,495 -సిద్ధమా? -సిద్ధమే. 163 00:22:52,080 --> 00:22:57,419 ఎలుగుబంట్లను రాత్రి వేళ చిత్రీకరించడం, సిబ్బందికి పరీక్షా సమయం. 164 00:22:59,546 --> 00:23:02,841 మొదటి రాత్రి ధృవపు తుఫాను తాకినప్పుడు, 165 00:23:02,925 --> 00:23:05,594 రాబోవు అంధకారపు రాత్రులలో తాము ఎదుర్కోబోతున్న సవాళ్ల గురించి 166 00:23:05,677 --> 00:23:07,471 వారికో అవగాహన ఏర్పడింది. 167 00:23:07,554 --> 00:23:09,765 ఇక్కడ ప్రస్తుతం మైనస్ 30 డిగ్రీలు ఉంది. 168 00:23:10,265 --> 00:23:11,934 కెమెరాలు, పరికరాలు ఎంత మేరకు తట్టుకోగలవు... 169 00:23:12,017 --> 00:23:13,268 స్టువర్ట్ ట్రోవెల్ కెమెరామెన్ 170 00:23:13,352 --> 00:23:15,354 ...అనే విషయానికి సంబంధించి ఇది పరీక్షా సమయం అనుకుంటా. 171 00:23:17,814 --> 00:23:20,234 కాబట్టి, మేముండే చోటుకి వెళ్లడానికి వీటి మీద చాలా సేపు ప్రయాణించాలి. 172 00:23:24,488 --> 00:23:25,614 రాబిన్ 173 00:23:25,697 --> 00:23:27,950 దారి పొడవునా వారు తుఫానులో చిక్కుకున్న కారణంగా, 174 00:23:28,033 --> 00:23:32,871 తాము ఉండే చోటుకు వెళ్లడానికి మార్గం కోసం వారు జీపీఎస్ మీద ఆధారపడాల్సి వచ్చింది. 175 00:23:38,961 --> 00:23:42,172 తర్వాతి రోజు రాత్రి కూడా, ఆర్కిటిక్ వాతావరణ పరిస్థితులు, 176 00:23:42,256 --> 00:23:44,800 వారి ఎలుగుబంట్ల అన్వేషణకు బ్రేకులు వేశాయి. 177 00:23:45,259 --> 00:23:46,301 సిద్ధం! 178 00:23:50,389 --> 00:23:54,726 ప్రస్తుతం మంచుగడ్డలో ఇరుక్కుపోయాం. ఇదంతా ఉపరితలపు నీరే. 179 00:23:56,603 --> 00:24:00,315 మంచి నీరు నేల మీది నుండి సముద్రపు మంచు గడ్డ మీదికి చేరుకున్నప్పుడు, 180 00:24:00,399 --> 00:24:03,235 అది కరిగి, బురదలాగా మారగలదు. 181 00:24:05,487 --> 00:24:07,739 సిబ్బంది ఇరుక్కుపోయారు. 182 00:24:09,533 --> 00:24:13,537 ప్రతి అడుగూ వారిని మరింత లోతుకి, కిందనున్న సముద్రానికి దగ్గరగా తీసుకువెళ్తోంది. 183 00:24:18,792 --> 00:24:21,712 నేను చేసిన చిత్రీకరణలలో ఇదే చాలా కష్టమైనది అనడంలో సందేహమే లేదు. 184 00:24:22,880 --> 00:24:25,632 ధృవపు ఎలుగుబంట్లు లేవు, తీవ్రమైన వాతావరణం మాత్రమే ఉంది. 185 00:24:31,013 --> 00:24:33,724 పరిస్థితులు మరింతగా దిగజారనున్నాయి. 186 00:24:35,601 --> 00:24:39,897 రాత్రికిరాత్రే, ఎలుగుబంట్లకు వేటాడటానికి కావలసిన సముద్రపు మంచుగడ్డ 187 00:24:39,980 --> 00:24:42,608 హఠాత్తుగా విరిగిపోయి మాయమైపోయింది. 188 00:24:44,234 --> 00:24:49,198 తీరం నుండి దూరంగా వెళ్తూ, దానితో పాటు ధృవపు ఎలుగుబంట్లను కూడా తీసుకెళ్లిపోయింది. 189 00:24:52,910 --> 00:24:55,162 శీతాకాలం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా, 190 00:24:56,371 --> 00:24:58,999 ఇక్కడి సముద్రపు మంచుగడ్డ కుచించుకుపోతోంది. 191 00:25:02,544 --> 00:25:07,549 వాతావరణంలో మార్పులు, ధృవపు ఎలుగుబంట్ల భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెడుతున్నాయి. 192 00:25:14,389 --> 00:25:16,266 చిత్రీకరణ మొదలయి మూడు వారాలైంది, 193 00:25:16,808 --> 00:25:19,019 సిబ్బందికి తమ దశ తిరగాల్సిన అవసరముంది. 194 00:25:20,437 --> 00:25:25,400 అస్సలు ఊహించనటువంటి ప్రాంతంలో వాళ్లకి రవ్వంత ఆశ పుట్టింది. 195 00:25:27,486 --> 00:25:29,863 ఇవాళ, మేము ఎలుగుబంట్ల జాడ కోసం వెతుక్కుంటూ వెళ్ళాం, 196 00:25:29,947 --> 00:25:32,282 కానీ ఇక్కడ చూస్తుంటే, ఒక ఎలుగుబంటి మా కోసం వచ్చినట్టుంది. 197 00:25:32,366 --> 00:25:36,787 అది నేరుగా మా టాయిలెట్ కె వెళ్లినట్టుంది. 198 00:25:37,788 --> 00:25:41,208 వావ్. ఇక్కడ మీరు దాని పళ్ల గుర్తులను, 199 00:25:41,291 --> 00:25:44,253 ఎలుగుబంటి వచ్చిన చోట, దాని గోళ్ళ గుర్తులను స్పష్టంగా చూడవచ్చు. 200 00:25:44,837 --> 00:25:47,130 మీరు టాయిలెట్ లో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే మీకు పిచ్చెక్కిపోయుండేది. 201 00:25:52,219 --> 00:25:56,014 తర్వాతి రాత్రి, వాళ్లు అపరాధిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 202 00:26:02,187 --> 00:26:05,732 అదృష్టవశాత్తూ, అప్పుడు టాయిలెట్ లో ఎవ్వరూ లేరు. 203 00:26:12,114 --> 00:26:16,326 ఎలుగుబంట్ల సంచారంతో, ఎట్టకేలకు సిబ్బందికి తమ దశ తిరుగుతున్నట్టు అనిపించసాగింది. 204 00:26:17,160 --> 00:26:21,540 త్వరలోనే. వారి కఠోర శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది. 205 00:26:22,708 --> 00:26:25,752 20వ రోజు, ఎట్టకేలకు మాకు ఎలుగుబంట్లు కనిపించాయి. 206 00:26:25,836 --> 00:26:27,546 కేవలం ఒక్క ఎలుగుబంటి మాత్రమే కాదు. 207 00:26:27,629 --> 00:26:29,131 రాబిన్ డింబిల్బీ సహాయక నిర్మాత 208 00:26:29,214 --> 00:26:32,134 ఒక తల్లి, రెండు పిల్లలు. 209 00:26:33,135 --> 00:26:34,261 ఎట్టకేలకు. 210 00:26:45,314 --> 00:26:47,983 దేవుడా. అవి చాలా అందంగా ఉన్నాయి, గురూ. 211 00:26:52,905 --> 00:26:55,365 అనేక ఆర్కిటిక్ సాహసాల తర్వాత, 212 00:26:55,449 --> 00:26:58,952 వెన్నెలకాంతిలో ధృవపు ఎలుగుబంట్లకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోని 213 00:26:59,036 --> 00:27:01,455 ఎట్టకేలకు సిబ్బంది చిత్రీకరించగలిగారు. 214 00:27:06,084 --> 00:27:11,507 అలాగే, ఇదివరకు ఎన్నడూ సాధ్యంకాని విధంగా ఆర్కిటిక్ రాత్రి రహస్యాలను బహిరంగపరిచారు. 215 00:27:54,007 --> 00:27:56,009 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య