1 00:00:18,393 --> 00:00:19,394 రాత్రి. 2 00:00:24,399 --> 00:00:30,364 మన గ్రహంలో ఉన్న సగం జంతువులకు పైగా దాచే ఒక అంధకారపు ప్రపంచం. 3 00:00:33,534 --> 00:00:38,747 ఇప్పటిదాకా, కెమెరాలు వాటి జీవితాలలోని ఒక చిన్ని భాగాన్ని మాత్రమే అందించాయి. 4 00:00:41,750 --> 00:00:44,837 కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 5 00:00:44,920 --> 00:00:49,842 మనం రాత్రి సమయంలో కూడా పగలు చూసినట్టుగానే స్పష్టంగా చూడవచ్చు. 6 00:00:56,515 --> 00:01:00,769 మానవ నేత్రం కన్నా వంద రెట్లు సున్నితంగా ఉండే కెమెరాల సాయంతో... 7 00:01:04,063 --> 00:01:06,859 ఇప్పుడు మనం రాత్రి అందాన్ని... 8 00:01:09,319 --> 00:01:10,445 రంగులలో చూడవచ్చు. 9 00:01:15,325 --> 00:01:17,202 భూమికి చెందినవి కాదా అని అనిపించే ప్రకృతి దృశ్యాలు. 10 00:01:20,205 --> 00:01:24,835 అంధకారంలో బయటకు వచ్చే వింత వింత జీవులు. 11 00:01:27,713 --> 00:01:30,215 ఇదివరకు చూడని ప్రవర్తనలు. 12 00:01:37,222 --> 00:01:40,767 భూగ్రహం యొక్క ఆఖరి అసలైన అరణ్యంలో 13 00:01:41,602 --> 00:01:44,104 ఇప్పుడు మనం జంతువుల జీవితాలను గమనించవచ్చు. 14 00:01:46,565 --> 00:01:47,566 రాత్రి. 15 00:02:09,420 --> 00:02:13,759 నమీబియాలోని స్కెలిటన్ కోస్ట్ ప్రాంతంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. 16 00:02:13,842 --> 00:02:15,969 టామ్ హిడ్లస్టన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు 17 00:02:16,053 --> 00:02:20,265 ఇక్కడ ఆఫ్రికన్ ఎడారి, అట్లాంటిక్ మహాసముద్రం రెండూ కలుసుకుంటాయి. 18 00:02:28,649 --> 00:02:31,193 ఇది నిర్జీవంగా ఉన్నట్టు కనిపిస్తుంది. 19 00:02:35,280 --> 00:02:37,991 కానీ, ప్రతీ ఏడాది కొన్ని నెలల పాటు, 20 00:02:38,075 --> 00:02:42,829 ఈ సముద్ర తీరాలు, సముద్రం నుండి వచ్చే యాత్రికులతో కిక్కిరిసిపోతాయి. 21 00:02:45,123 --> 00:02:47,668 కేప్ ఫర్ సీళ్లు. 22 00:02:54,216 --> 00:02:59,263 ప్రతీ వసంత కాలం, అయిదు లక్షలకు పైగా సీళ్లు ఇక్కడికి పిల్లలను పెంచడానికి వస్తుంటాయి. 23 00:03:05,227 --> 00:03:09,982 అప్పుడే పుట్టిన పిల్లలను పెంచడానికి ఇది సరిగ్గా సరిపోయే చోటుగా అనిపిస్తుంది. 24 00:03:22,202 --> 00:03:24,413 కేవలం కొన్ని వారాల వయస్సుగల, 25 00:03:25,247 --> 00:03:29,793 ఈ పసి సీల్, ఇంకా దాని తల్లి మీదనే పూర్తిగా ఆధారపడుతుంది. 26 00:03:36,133 --> 00:03:37,759 తొలి నాలుగు నెలల వరకు, 27 00:03:38,427 --> 00:03:41,722 అది కేవలం క్యాలరీలు అధికంగా ఉన్న దాని తల్లి పాలనే తాగుతుంది. 28 00:03:52,649 --> 00:03:56,820 కానీ ఆకలితో ఉన్న పిల్లకి పాలు ఇవ్వడమనేది బాగా అలసట తెప్పించేసే పని. 29 00:03:59,907 --> 00:04:04,411 కాబట్టి, ఆహారం తినడానికి తల్లులు క్రమం తప్పకుండా సముద్రంలోకి వెళ్లాలి, 30 00:04:04,494 --> 00:04:06,413 ఎక్కువ సందర్భాల్లో, దీనికోసం వాటికి కొన్ని రోజుల సమయం పడుతుంది. 31 00:04:15,130 --> 00:04:16,964 నివాస స్థలంలో వాటి పిల్లలను... 32 00:04:19,009 --> 00:04:20,511 ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాయి. 33 00:04:32,981 --> 00:04:36,068 కానీ సాయంత్రం సురక్షితమైన సమయం కాదు. 34 00:04:45,994 --> 00:04:48,872 రెండు బ్లాక్-బ్యాక్డ్ నక్కలు. 35 00:04:59,258 --> 00:05:01,635 వాటిని రక్షించడానికి వాటి తల్లులు లేవు కనుక... 36 00:05:04,805 --> 00:05:07,266 వాటి ప్రాణాలను అవే కాపాడుకోవాలి. 37 00:05:13,939 --> 00:05:17,025 పదునైన పళ్ళే వాటి ఆత్మరక్షణ. 38 00:05:32,249 --> 00:05:36,670 పగటి సమయంలో, సాధారణంగా సీల్ పిల్లలు నక్కలను తరిమేయగలవు. 39 00:05:39,506 --> 00:05:43,969 కానీ చీకటి పడేకొద్దీ, పరిస్థితులు తారుమరవుతాయి. 40 00:05:47,055 --> 00:05:51,226 చీకటి పడ్డాక, నక్కలు ఏమరపాటుగా ఉన్న క్షణాన హఠాత్తుగా దాడి చేయగలవు. 41 00:05:57,024 --> 00:06:03,322 ఈ పసి పిల్లలకు, ఇది ఒక సుదీర్ఘపు కాళరాత్రి కానుంది. 42 00:06:17,628 --> 00:06:19,963 చీకటి పడ్డాక ఈ తీరప్రాంతంలో జరిగే తంతును 43 00:06:20,047 --> 00:06:23,300 ఇప్పటిదాకా మనం చూడలేకపోయాము. 44 00:06:27,930 --> 00:06:30,474 కానీ ఆధునిక సాంకేతికత ఇప్పుడు... 45 00:06:31,808 --> 00:06:34,478 ఇదివరకు ఎన్నడూ సాధ్యంకాని విధంగా దీన్ని రహస్యాలను బహిరంగపరిచే... 46 00:06:38,774 --> 00:06:40,484 అవకాశాన్ని మనకి కల్పించింది. 47 00:06:56,917 --> 00:07:01,880 చీకటి పడ్డాక తొలి ఘడియలలో, కాలనీలో గోలగోలగా ఉంటుంది. 48 00:07:09,638 --> 00:07:13,350 ఆ గోలలో, ఒక ఒంటరి పిల్ల తన అమ్మ కోసం కేకలు వేస్తోంది. 49 00:07:19,106 --> 00:07:22,818 కానీ పక్కనున్న పెద్ద సీళ్లు, దాన్ని బుజ్జగించే ప్రయత్నమే చేయవు. 50 00:07:27,030 --> 00:07:30,784 కేప్ ఫర్ సీళ్లు, తమ పిల్లలను తప్ప వేరే వాటి పిల్లలను పట్టించుకోవు. 51 00:07:37,249 --> 00:07:39,126 ఈ పిల్ల దాని జాగ్రత్తను అదే చేసుకోవాలి. 52 00:07:48,427 --> 00:07:53,932 కానీ అదృష్టవశాత్తు, తీరం నిండా ఆహారం కోసం సముద్రంలోకి వెళ్లిన తల్లుల పిల్లలున్నాయి. 53 00:08:10,407 --> 00:08:16,705 వెన్నెలలో, ఒక నర్సరీలాగా ఆ పిల్లలన్నీ ఒకే చోటుకు చేరుకుంటాయి. 54 00:08:25,464 --> 00:08:28,717 సురక్షితంగా ఉండటానికి, ఆ పిల్లలకు ఇదే ఉత్తమమైన మార్గం. 55 00:08:30,469 --> 00:08:33,764 రాత్రి వేళ, అవి జాగ్రత్త పడటానికి మంచి కారణం కూడా ఉంది. 56 00:08:42,147 --> 00:08:47,027 తీరప్రాంతంలో, ఇసుకలో కూరుకుపోయిన ఓడ తాలూకు శిథిలం ఒకటి ఉంది. 57 00:08:57,913 --> 00:09:03,293 అది ఆ తీరంలోని అతి భయంకరమైన నక్కల మందకి ఆవాసంగా మారింది. 58 00:09:06,713 --> 00:09:09,216 వాటి ఆహారంలో 95 శాతానికి పైగా 59 00:09:09,299 --> 00:09:12,970 ఒక్క సీల్ పిల్లలే ఉంటాయి. 60 00:09:22,729 --> 00:09:28,610 ఈ భయంకరమైన ఊళలు, వేట ప్రారంభించాల్సిందిగా అన్నిటినీ ప్రేరేపించే పిలుపులు. 61 00:09:45,794 --> 00:09:47,921 తొలిసారి చిత్రీకరించబడిన ఈ చిత్రీకరణలో, 62 00:09:48,714 --> 00:09:52,759 రాత్రివేళ దాడి చేయడానికి బయలుదేరిన నక్కలను నైట్ కెమెరాలు అనుసరించాయి. 63 00:10:02,186 --> 00:10:05,439 ఎదిగిన సీళ్లు పెద్దగా ఉంటాయి, వాటి మీద దాడి చేయడం కష్టం. 64 00:10:09,067 --> 00:10:14,615 కాబట్టి, ఈ నక్కల మంద ఆ కాలనీ మధ్య భాగంలోకి చొరబడి, పిల్లల కోసం వెతకసాగాయి. 65 00:10:18,160 --> 00:10:19,536 మన కళ్లకు... 66 00:10:22,206 --> 00:10:24,750 సీల్ పిల్లలు చీకట్లో కనిపించవు. 67 00:10:29,379 --> 00:10:32,299 కానీ నక్కలు చీకట్లో చాలా బాగా చూడగలవు... 68 00:10:34,176 --> 00:10:37,930 దీని వల్ల అవి ఎలాంటి అవకాశాన్ని అయినా సద్వినియోగపరుచుకొగలవు. 69 00:10:50,984 --> 00:10:52,528 ఒక పిల్ల నిద్రపోతోంది. 70 00:11:07,501 --> 00:11:09,419 పెద్ద సీల్ పక్కనే ఉండటం వల్ల, 71 00:11:10,045 --> 00:11:13,090 ప్రస్తుతానికి, నక్క వెనుకంజ వేసింది. 72 00:11:20,013 --> 00:11:24,309 కానీ ఇంకో పిల్ల, సురక్షితమైన పిల్లల నర్సరీ నుండి పక్కకు వచ్చింది. 73 00:11:29,231 --> 00:11:31,066 దీన్ని నక్కలు చూశాయి. 74 00:11:38,282 --> 00:11:41,493 అది సముద్రంలోకి వెళ్తే తప్ప దాని ప్రాణాలు నిలువవు, 75 00:11:41,577 --> 00:11:43,745 సముద్రంలోకి నక్కలు రాలేవు. 76 00:12:06,643 --> 00:12:08,228 అదృష్టంకొద్దీ తప్పించుకోగలిగింది. 77 00:12:16,737 --> 00:12:18,447 అలలకు దూరంగా... 78 00:12:19,615 --> 00:12:23,243 ఎడారి నుండి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. 79 00:12:30,876 --> 00:12:34,421 పగటి వేళ సూర్యుని ప్రతాపం నుండి తలదాచుకొని, 80 00:12:34,505 --> 00:12:39,760 రాత్రి చల్లబడ్డాక, కొన్ని చిట్టి ఎడారి జీవులు తమ కలుగుల నుండి బయటకు వస్తాయి. 81 00:12:45,390 --> 00:12:49,686 ఒక మగ బార్కింగ్ గెకో ఆడ తోడు కోసం వెతుకుతోంది. 82 00:12:51,980 --> 00:12:55,442 కానీ చీకట్లో, ఆ తోడును కనుక్కోవడం కష్టం. 83 00:12:57,152 --> 00:12:58,612 అందుకని అది అరుస్తుంది. 84 00:13:16,171 --> 00:13:20,092 ఈ ఆడ గెకోకి, తనకి వినబడే శబ్దం బాగా నచ్చింది. 85 00:13:25,222 --> 00:13:27,140 కానీ తన చెలికాడి చెంతకి చేరాలంటే... 86 00:13:29,017 --> 00:13:30,894 తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. 87 00:13:38,235 --> 00:13:40,237 వైట్ లేడీ స్పైడర్. 88 00:13:43,866 --> 00:13:45,367 ఇది గెకోలను వేటాడుతుంది... 89 00:13:48,453 --> 00:13:51,623 దీని కాటులో భయంకరమైన విషం ఉంటుంది. 90 00:14:00,549 --> 00:14:06,138 ఈ కటిక చీకట్లో, ఇది ఇసుకలోని ప్రకంపనల ఆధారంగా వేటాడవలసిన గెకోని గుర్తిస్తుంది. 91 00:14:33,373 --> 00:14:39,421 అది సాలీడు అందుకోలేనంత వేగంతో ఉడాయించింది, ఇక సాలీడు తన కలుగులోకి వెళ్లిపోయింది. 92 00:14:44,426 --> 00:14:49,181 బార్కింగ్ గెకోల విషయంలో, నచ్చిన తోడును చేరుకోవడమనేది ప్రమాదాలతో కూడుకున్నది. 93 00:14:56,772 --> 00:14:58,774 కానీ ప్రమాదాలు ఉన్నా ఇది విజయవంతమైంది. 94 00:15:08,700 --> 00:15:13,872 రాత్రివేళ, ఈ తీరప్రాంతంలో ఇంకా ఇతర రహస్యాలు దాగున్నాయి. 95 00:15:17,125 --> 00:15:20,295 ఇసుక, కేవలం ఓడలను మాత్రమే మింగేయలేదు... 96 00:15:22,089 --> 00:15:24,967 ఊర్లు ఊర్లనే మింగేసింది. 97 00:15:39,773 --> 00:15:42,901 నిర్మానుష్యమైన పాత గనుల తవ్వకాల క్వార్టర్స్... 98 00:15:44,319 --> 00:15:47,489 ఇక్కడ రాత్రి వేళ వింత వింత ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి. 99 00:15:59,751 --> 00:16:05,340 ఒక బ్రౌన్ హైనా, స్థానికులు దీన్ని ఒంటరి తోడేలు అని పిలుస్తుంటారు. 100 00:16:08,886 --> 00:16:12,389 ఈ జంతువుల నిశాచర జీవితాలలోకి 101 00:16:12,472 --> 00:16:16,101 మనం చూడగలగడం ఇదే తొలిసారి. 102 00:16:18,687 --> 00:16:24,568 నిర్మానుష్యమైన కసీనో, ఒక చిన్న కుటుంబానికి ఆవాసంగా మారింది. 103 00:16:32,117 --> 00:16:33,202 ఒక తల్లి... 104 00:16:34,703 --> 00:16:39,291 యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టిన తన రెండు ఆడ పిల్లలు. 105 00:16:40,918 --> 00:16:43,795 ఈ పిల్లలు ఈ రోజంతా ఏమీ తినలేదు. 106 00:16:45,589 --> 00:16:46,882 వాటికి ఆకలిగా ఉంది. 107 00:16:49,843 --> 00:16:51,345 బాగా చికాకుగా కూడా ఉంది. 108 00:16:59,144 --> 00:17:04,483 రాత్రివేళ జరిగే ఈ వింత కొట్లాటనే మూతుల కుస్తీ అని పిలుస్తారు. 109 00:17:08,153 --> 00:17:12,031 యువ హైనాలు, తమ బలాన్ని ఈ విధంగానే పరీక్షించుకుంటాయి. 110 00:17:26,672 --> 00:17:31,802 అవి ఇలా కొట్టుకుంటుండగా, వాటికి ఆహారం తేవలసిన బాధ్యత వాటి తల్లి మీద ఉంది. 111 00:17:36,723 --> 00:17:39,935 బ్రౌన్ హైనాలను, చనిపోయిన వాటిని తినే జంతువులుగా పరిగణిస్తారు. 112 00:17:41,895 --> 00:17:47,442 కానీ ఈ తీరప్రాంతంలోని హైనాలు వేటాడటం కూడా నేర్చుకున్నాయి... 113 00:17:48,694 --> 00:17:49,862 సీల్ పిల్లలను అన్నమాట. 114 00:18:03,750 --> 00:18:05,586 ఇప్పుడు, తొలిసారిగా, 115 00:18:05,669 --> 00:18:10,132 వేటాడటంలో వాటికి చీకటి ఎలా సహాయపడుతుందో మేము అందరికీ తెలియచేయగలము. 116 00:18:14,344 --> 00:18:15,846 మా కెమెరాలు లేకపోతే... 117 00:18:18,182 --> 00:18:21,685 ఈ చీకట్లో హైనాను చూడటం అసాధ్యం అయ్యుండేది. 118 00:18:24,229 --> 00:18:26,481 నీడల మాటున దాగి ఉండి... 119 00:18:30,027 --> 00:18:32,154 అది సీళ్ల వెంట పడదు... 120 00:18:34,740 --> 00:18:38,285 సీళ్లే తన వద్దకి వచ్చేదాకా వేచి చూస్తుంది. 121 00:18:56,261 --> 00:18:58,180 అవి సరిగ్గా అందనంత దూరంలో ఉన్నాయి. 122 00:19:09,441 --> 00:19:14,029 కానీ పరిస్థితులు హైనాకు అనుకూలంగా మారనున్నాయి. 123 00:19:17,783 --> 00:19:19,701 అర్థరాత్రి దాటి కొన్ని గంటలు గడిచాక, 124 00:19:19,785 --> 00:19:25,290 సముద్రం నుండి పొగమంచు కమ్ముకొస్తుంది, అది వెన్నెలను అడ్డుకుంటుంది. 125 00:19:31,421 --> 00:19:36,510 ఇప్పుడు సీళ్లకు హైనాల ఉనికిని పసిగట్టడం మరింత కష్టమవుతుంది. 126 00:19:49,106 --> 00:19:51,775 తను బండ రాళ్ల మధ్య కనబడకుండా కూర్చొని... 127 00:19:53,360 --> 00:19:54,778 వేచి చూస్తుంది. 128 00:20:03,704 --> 00:20:07,082 ఎట్టకేలకు, ఒక పిల్ల తన కక్ష్యలోకి వచ్చింది. 129 00:20:18,260 --> 00:20:21,138 హైనా శక్తివంతమైన దవళ్ళు సీల్ పిల్లని చంపేస్తాయి. 130 00:20:25,184 --> 00:20:28,604 ఈ వేట, వెనువెంటనే అనవసరమైన వాటి దృష్టిని ఆకర్షిస్తుంది. 131 00:20:34,776 --> 00:20:40,407 ఇప్పటికీ ఆహారం కోసం మొహం వాచి ఉన్న 20 నక్కలు, హైనాను చుట్టుముట్టేశాయి. 132 00:20:49,750 --> 00:20:55,464 కానీ నక్కల మంద అంతా కలిసి వచ్చినా కూడా ఈ నిశాచర వేటాడే జంతువుకు పోటీ కాలేవు. 133 00:21:03,847 --> 00:21:06,767 ఈ రాత్రికి వేట ముగిసింది. 134 00:21:21,823 --> 00:21:24,159 సూర్యాస్తమయం ప్రారంభమవుతుండగా... 135 00:21:25,619 --> 00:21:29,706 నక్కల మంద, తమ శిథిలమైన ఓడ ఆవాసానికి తిరిగి చేరుకుంటాయి. 136 00:21:40,759 --> 00:21:44,471 కాలనీలోని సీళ్లన్నీ మేల్కొంటున్నాయి. 137 00:21:50,686 --> 00:21:55,315 అన్నీ కలిసి ఒకే చోట ఉండటం వలన, చాలా వరకు రాత్రి తమ ప్రాణాలను కాపాడుకోగలిగాయి. 138 00:22:00,821 --> 00:22:05,534 ఈ పిల్లకి, తెలిసిన పిలుపు వినిపిస్తోంది. 139 00:22:34,229 --> 00:22:36,607 అమ్మ తిరిగి వచ్చేసింది. 140 00:22:47,034 --> 00:22:50,329 ఎట్టకేలకు పిల్లకు పాలు దక్కాయి. 141 00:22:55,250 --> 00:23:00,255 కొన్ని నెలల తర్వాత, ఈ పిల్లలు ఎదిగి, ఈ సముద్రతీరాలను వదిలి వెళ్లిపోయి... 142 00:23:03,425 --> 00:23:07,137 తమ జీవితంలోని తదుపరి అధ్యాయాన్ని సముద్రంలో మొదలుపెడతాయి. 143 00:23:13,685 --> 00:23:19,942 మళ్లీ నమీబియాలోని స్కెలిటన్ కోస్ట్ ప్రశాంతంగా మారిపోతుంది. 144 00:23:30,369 --> 00:23:32,788 రాత్రి సమయాన భూమి 145 00:23:32,871 --> 00:23:37,876 చీకట్లో చిత్రీకరించబడింది 146 00:23:42,673 --> 00:23:46,385 రాత్రి సమయాన భూమి బృందానికి ఎదురైన అతి పెద్ద సవాలు, 147 00:23:46,468 --> 00:23:49,930 అంత తేలిగ్గా దొరకని బ్రౌన్ హైనాను చిత్రీకరించడం, 148 00:23:50,013 --> 00:23:53,058 దాని కోసం, వాళ్లు ఆ నిర్మానుష్యమైన ఊరికి వెళ్లే సాహసం చేయాల్సి వచ్చింది. 149 00:23:55,102 --> 00:23:57,688 కొన్ని మైళ్ల దూరం దాకా మనం తప్ప మరో మనిషి జాడే లేదు. 150 00:23:57,771 --> 00:23:59,147 కరీనా థామస్ సహాయక నిర్మాత 151 00:23:59,231 --> 00:24:01,108 రాత్రి వేళ అది మరీ భయంకరంగా మారిపోతుంది. 152 00:24:02,568 --> 00:24:05,070 ఒక పెద్ద హైనా వాళ్లకు ఎదురు వచ్చాక, 153 00:24:05,153 --> 00:24:08,532 ఆ భయం ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకుంది. 154 00:24:10,951 --> 00:24:12,452 చాలా దగ్గరగా ఉంది. 155 00:24:13,036 --> 00:24:17,499 రాత్రి వేళ ఈ జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరికీ తెలీదు, 156 00:24:17,583 --> 00:24:21,295 హైనా శాస్త్రవేత్త అయిన డా. ఇంగ్రిడ్ వీసిల్ కి కూడా తెలీదు. 157 00:24:21,378 --> 00:24:23,046 పగటి పూట హైనాలను గమనిస్తూ నేను ఎన్నో ఏళ్లు పరిశోధన చేశాను. 158 00:24:23,130 --> 00:24:24,423 ఇంగ్రిడ్ వీసిల్ బ్రౌన్ హైనా పరిశోధనా ప్రాజెక్ట్ 159 00:24:25,757 --> 00:24:28,468 కానీ రాత్రి వేళల్లో వాటి ప్రవర్తన వేరుగా ఉండవచ్చు. 160 00:24:29,386 --> 00:24:31,138 ఈ వీడియోని చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. 161 00:24:36,143 --> 00:24:40,772 ఒక నైట్ విజన్ డ్రోన్ సాయంతో సిబ్బంది శిథిలమైన భవనాలను పరిశీలించారు, 162 00:24:40,856 --> 00:24:44,359 కెమెరాలు ఎక్కడెక్కడ పెడితే బాగుంటుందో తెలుసుకున్నారు. 163 00:24:47,863 --> 00:24:51,950 శిథిలైమైన కసీనోలో వారు హైనాల ఆవాసాన్ని కనిపెట్టారు. 164 00:24:54,703 --> 00:24:56,371 ఇది చాలా గొప్ప విషయం. 165 00:24:57,414 --> 00:25:00,083 హైనాల మీద అధ్యయనం చేస్తూ నేను ఇరవై ఏళ్లు గడిపాను, 166 00:25:00,167 --> 00:25:04,671 రాత్రి సమయంలో కూడా చిత్రీకరించగల ఒక ఫిల్మ్ కంపెనీతో నేను పని చేయడం ఇదే తొలిసారి. 167 00:25:08,842 --> 00:25:11,637 ఎన్నో వారాల పాటు నిఘా పెట్టి ఉండటం వలన, 168 00:25:11,720 --> 00:25:17,059 హైనాల నిశాచర జీవనాన్ని చూసి సిబ్బంది తరచుగా ఆశ్చర్యానికి లోనయ్యేవాళ్లు. 169 00:25:22,898 --> 00:25:26,527 కొన్నింటిని అయితే ఇప్పటిదాకా ఇంగ్రిడ్ కూడా చూడలేదు. 170 00:25:27,569 --> 00:25:30,280 వావ్, ఈ రాత్రి తీసిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. 171 00:25:30,364 --> 00:25:31,657 నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. 172 00:25:33,784 --> 00:25:36,411 కానీ తనకి ఆసక్తిని కలిగించిన విషయం ఏంటంటే, 173 00:25:36,495 --> 00:25:41,333 హైనాల పక్కన ఉన్న నక్కలు కూడా ఎలా ఆ సరదా కుమ్ములాటలో చేరాయా అని. 174 00:25:42,835 --> 00:25:45,879 ఈ నక్కలు, ఈ హైనాను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. 175 00:25:48,173 --> 00:25:50,801 ఇలా ఎక్కువగా రాత్రి సమయాల్లోనే జరుగుతుందనుకుంటా. 176 00:25:53,846 --> 00:25:56,223 ఒక నక్క అయితే హైనాల ఆవాసం మీద 177 00:25:56,306 --> 00:26:00,227 దొంగ చాటుగా దాడి చేసే ప్రయత్నానికి కూడా సాహసించింది. 178 00:26:03,355 --> 00:26:04,982 అది ఎప్పటికీ మంచి ఆలోచన కాబోదు. 179 00:26:05,941 --> 00:26:08,902 ఇవి రాత్రి వేళ ఏం చేస్తాయో చూడటం చాలా బాగుంది. చాలా ప్రత్యేకంగా ఉంది. 180 00:26:11,113 --> 00:26:14,449 శాస్త్రవేత్తలు, అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో, 181 00:26:14,533 --> 00:26:18,745 మర్మమైన నిశాచర జీవనాన్ని గడిపే ఈ జంతువుల జీవితాలకి సంబంధించి 182 00:26:18,829 --> 00:26:23,417 ఇదివరకు ఎన్నడూ చూడశక్యం కాని ఎన్నో ఘటనలను బృందం చిత్రీకరించగలిగింది. 183 00:27:07,044 --> 00:27:09,046 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య