1 00:00:18,393 --> 00:00:19,728 రాత్రి. 2 00:00:24,399 --> 00:00:30,364 మన గ్రహంలో ఉన్న సగం జంతువులకు పైగా దాచే ఒక అంధకారపు ప్రపంచం. 3 00:00:33,617 --> 00:00:38,747 ఇప్పటిదాకా, కెమెరాలు వాటి జీవితాలలోని ఒక చిన్ని భాగాన్ని మాత్రమే అందించాయి. 4 00:00:41,792 --> 00:00:44,878 కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 5 00:00:44,962 --> 00:00:49,800 మనం రాత్రి సమయంలో కూడా పగలు చూసినట్టుగానే స్పష్టంగా చూడవచ్చు. 6 00:00:56,557 --> 00:01:00,811 మానవ నేత్రం కన్నా వంద రెట్లు సున్నితంగా ఉండే కెమెరాల సాయంతో... 7 00:01:04,105 --> 00:01:06,942 ఇప్పుడు మనం రాత్రి అందాన్ని... 8 00:01:09,361 --> 00:01:10,487 రంగులలో చూడవచ్చు. 9 00:01:15,325 --> 00:01:17,202 భూమికి చెందినవి కాదా అని అనిపించే ప్రకృతి దృశ్యాలు. 10 00:01:20,247 --> 00:01:24,877 అంధకారంలో బయటకు వచ్చే వింత వింత జీవులు. 11 00:01:27,713 --> 00:01:30,215 ఇదివరకు చూడని ప్రవర్తనలు. 12 00:01:37,306 --> 00:01:40,767 భూగ్రహం యొక్క ఆఖరి అసలైన అరణ్యంలో 13 00:01:41,643 --> 00:01:44,104 ఇప్పుడు మనం జంతువుల జీవితాలను గమనించవచ్చు. 14 00:01:46,565 --> 00:01:47,566 రాత్రి. 15 00:02:11,632 --> 00:02:16,887 ఇండోనేషియాలోని ట్రాపికల్ దీవులలో సంధ్యాకాలం రంగప్రవేశం చేస్తోంది. 16 00:02:20,182 --> 00:02:22,226 టామ్ హిడ్లస్టన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు 17 00:02:22,309 --> 00:02:24,686 ఈ అలల దిగువున... 18 00:02:26,605 --> 00:02:31,610 ఈ గ్రహానికి చెందిన ఒకానొక ప్రాచీన జలాంతర్గత ప్రపంచం దాగుంది. 19 00:02:39,868 --> 00:02:41,078 పగడపు దిబ్బలు... 20 00:02:47,042 --> 00:02:50,087 మన సముద్రాలలో వివిధ రకాల జీవులకు ఆవాసాలు. 21 00:02:53,507 --> 00:02:58,637 ప్రపంచమంతా కలిపి చూస్తే, సముద్రగర్భం మీద వీటి విస్తీర్ణం ఒక శాతం కూడా ఉండదు... 22 00:03:01,265 --> 00:03:05,519 కానీ మన మహాసముద్రాలలోని మొత్తం జీవంలో మూడొంతుల జీవానికి ఇవే ఆధారం. 23 00:03:14,403 --> 00:03:18,073 పగడపు దిబ్బ అనేది ఎప్పుడూ రద్దీగా ఉండే సముద్రగర్భంలో ఉన్న నగరం... 24 00:03:20,742 --> 00:03:24,538 ఇక్కడ వివిధ ఆకారాల, అలాగే వివిధ పరిమాణాల జీవులు ఆహార వేటలో బిజీగా ఉంటాయి. 25 00:03:29,543 --> 00:03:33,046 పగడపు దిబ్బల పాలిట బుల్ డోజర్ల లాంటి హంప్హెడ్ ప్యారెట్ ఫిష్, 26 00:03:33,130 --> 00:03:35,674 వాటికి ఉన్న పక్షిలాంటి ముక్కులతో దిబ్బలను తింటాయి... 27 00:03:41,972 --> 00:03:45,809 ఇక గట్టిగా ఉన్న పగడపు దిబ్బల దిగువున పెరిగే మెత్తాటి స్పాంజులను 28 00:03:45,893 --> 00:03:48,228 హాక్స్ బిల్ తాబేళ్లు హాంఫట్ చేసేస్తాయి. 29 00:03:59,072 --> 00:04:04,620 తెలివైన జీవులు, ఆహారం దొరుకుతుందని అనుకోని ప్రదేశాలలో కూడా ఆహారాన్ని సంపాదించగలవు. 30 00:04:08,332 --> 00:04:12,503 చిన్నదైన క్లీనర్ రాస్ చేపలు, ప్రొఫెషనల్ సర్వీస్ అందజేస్తాయి. 31 00:04:13,504 --> 00:04:18,175 అవి తమ పక్కనున్న చేపల నోట్లో ఇరుక్కొని ఉన్న ఆహారాన్ని లాగిస్తాయి. 32 00:04:29,603 --> 00:04:32,314 సాయంత్రం తర్వాత వెలుగు ఉండదు కనుక, ఉన్న వెలుగును 33 00:04:33,065 --> 00:04:37,569 సద్వినియోగపరుచుకోవడానికి అన్నీ ఆరాటపడతాయి కనుక, సాయంకాలం దిబ్బలో రద్దీగా ఉంటుంది. 34 00:04:50,082 --> 00:04:52,376 కానీ ఈ బిజీ ప్రపంచం... 35 00:04:54,211 --> 00:04:55,796 త్వరలోనే మారనుంది. 36 00:05:05,722 --> 00:05:08,600 ఎందుకంటే పగడపు దిబ్బలలో మరో కోణం ఉంది... 37 00:05:11,520 --> 00:05:16,233 ఇది సూర్యాస్తమయం తర్వాతే బహిర్గతం అవుతుంది. 38 00:05:28,871 --> 00:05:31,081 ఆధునిక చిత్రీకరణ టెక్నిక్ ల సాయంతో... 39 00:05:33,250 --> 00:05:36,086 మనం ఈ దాగున్న లోకాన్ని చూసి... 40 00:05:37,504 --> 00:05:44,511 రాత్రివేళ ప్రపంచపు పగడపు దిబ్బలలో జరగబోయే పరిణామాలను వీక్షించగలం. 41 00:05:58,942 --> 00:06:04,531 చీకటి పడ్డాక, చిన్నిచిన్ని చేపలు సురక్షితంగా ఉందామని ఒకే చోట గుమికూడతాయి. 42 00:06:08,785 --> 00:06:13,874 పగడపు దిబ్బలలో అత్యంత ప్రమాదకరమైన సమయం, రాత్రి మొదలయ్యే సమయం అని చెప్పవచ్చు. 43 00:06:20,547 --> 00:06:21,757 కోర్నెట్ చేప. 44 00:06:22,591 --> 00:06:26,595 ఒక మీటరు పొడవు ఉండి, పొడవాటి మూతి కలిగి ఉంటుంది. 45 00:06:28,639 --> 00:06:31,350 పగడపు దిబ్బలోని నిశాచర వేటగాడు. 46 00:06:37,064 --> 00:06:40,234 లైట్ సెన్సిటివ్ అయిన పెద్ద కళ్ళతో... 47 00:06:42,236 --> 00:06:45,072 అవి చేపల సమూహం మీద... 48 00:06:50,160 --> 00:06:54,456 గురితప్పని ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. 49 00:07:05,133 --> 00:07:09,763 తమకున్న సూదిలాంటి నోళ్లతో అవి ఇతర చేపలను పట్టి తినేస్తాయి. 50 00:07:15,769 --> 00:07:19,398 ఒక్కోసారికి ఒక్కో చేపను పట్టుకుంటాయి. 51 00:07:32,703 --> 00:07:34,621 పట్టుకున్నవాటిని అవి మింగాక... 52 00:07:35,497 --> 00:07:37,082 వాటికి సంబంధించి మిగిలేది... 53 00:07:39,710 --> 00:07:42,087 కేవలం కాసిన్ని పొలుసులు మాత్రమే. 54 00:07:48,385 --> 00:07:52,973 కానీ చీకట్లో తిరిగే వేటాడే చేపలు కేవలం కోర్నెట్ చేపలు మాత్రమే కాదు. 55 00:07:58,061 --> 00:08:01,899 దిబ్బ యొక్క జీవులు పగుళ్లు, సందుల మధ్య లోతుగా దాక్కున్నాయి... 56 00:08:02,941 --> 00:08:07,779 ఎందుకంటే, పెద్దవి, భయంకరమైనవి అయిన వేటాడే చేపలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. 57 00:08:09,865 --> 00:08:14,244 పగడపు దిబ్బ దగ్గర వేటాడే పద్ధతి ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. 58 00:08:32,596 --> 00:08:39,144 వైట్ టిప్ రీఫ్ షార్క్, దిబ్బపైన మరీ ఎక్కువ సేపు తిరిగే చేపలను లాగించేస్తుంది. 59 00:08:42,481 --> 00:08:44,816 ఇక్కడ వేటాడేది కేవలం అది మాత్రమే కాదు. 60 00:08:48,612 --> 00:08:53,534 ప్రతీ చేప వెన్నులో వణుకు పుట్టించే స్టింగ్ రే. 61 00:08:56,036 --> 00:09:03,001 దాని బారిన పడేవాటికి, రాత్రి కటిక చీకటిగా కనిపిస్తుంది. 62 00:09:05,629 --> 00:09:07,673 అది దాడి చేస్తున్నట్టు అవి పసిగట్టలేవు. 63 00:09:10,717 --> 00:09:12,177 కానీ అది పగడపు దిబ్బ దగ్గర... 64 00:09:13,512 --> 00:09:15,514 ఎలా వేటాడుతుందో మా కెమెరాలు చూపాయి. 65 00:09:17,933 --> 00:09:20,686 దిబ్బలో దాగున్న చేపలను... 66 00:09:21,728 --> 00:09:26,149 అలాగే ఇసుకలో దాగున్న పీతలను కనిపెట్టడానికి, అది కంటిచూపును వాడదు... 67 00:09:28,735 --> 00:09:31,280 ఎలక్ట్రోరిసెప్టార్లను ఉపయోగిస్తుంది. 68 00:09:36,368 --> 00:09:40,873 రెండు మీటర్ల దాకా వెడల్పుండే దాని మొప్పలు, సముద్ర నేల మీద ఉన్నవాటిని ఇరికించేస్తాయి. 69 00:09:47,754 --> 00:09:52,217 ఇసుకను తవ్వడం ద్వారా అందులో దాగున్నని బయటపడతాయి... 70 00:09:59,850 --> 00:10:02,186 వెనువెంటానే వ్యాకుమ్ లాంటి నోటితో... 71 00:10:07,524 --> 00:10:08,734 అది వాటిని హాంఫట్ చేసేస్తుంది. 72 00:10:28,420 --> 00:10:30,839 రాత్రి వేళ వేటాడే చేపలు చాలానే సంచరిస్తూ ఉంటాయి కనుక... 73 00:10:34,551 --> 00:10:36,428 దాగి ఉండటమే ఉత్తమ మార్గం. 74 00:10:48,690 --> 00:10:50,359 కానీ ఇన్ని ప్రమాదాలు ఉన్నా కూడా... 75 00:10:52,569 --> 00:10:58,283 ఒక చిట్టి రంగురంగుల చేప, సురక్షిత చోటు అయిన దిబ్బను వదిలి బయటకు వెళ్లనుంది. 76 00:11:02,829 --> 00:11:04,373 మ్యాండరిన్ చేప. 77 00:11:07,876 --> 00:11:09,127 ఈ మగ చేప... 78 00:11:09,837 --> 00:11:12,464 తోడు కోసం వెతుకుతోంది. 79 00:11:15,926 --> 00:11:21,932 ఈరాత్రి, ఒక గంటలో సుమారు ఎనిమిది చేపలతో సంభోగం చేయాలనే ఆశతో ఉంది. 80 00:11:25,394 --> 00:11:31,316 కానీ వాటిని కనిపెట్టాలంటే, అది చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. 81 00:11:43,662 --> 00:11:46,164 ఆ అంధకారంలో, రొయ్యలాంటి జీవులను... 82 00:11:47,791 --> 00:11:49,001 ఆరగిస్తున్న... 83 00:11:50,252 --> 00:11:55,507 ఒక ఆడ చేపను అది పసిగడుతుంది. 84 00:11:58,927 --> 00:12:01,722 కానీ ఆ ఆడ చేప, తన ఆహారాన్ని ఎలా అయితే ఆచితూచి ఎంచుకుంటుందో... 85 00:12:04,600 --> 00:12:07,603 తోడు విషయంలో కూడా అలాగే ఎంచుకుంటుంది. 86 00:12:17,154 --> 00:12:21,575 దాని మనస్సును గెలుచుకోవడానికి, మగ చేప తన మొప్పలను చాచి... 87 00:12:23,327 --> 00:12:28,457 వీలైనంత పెద్దగా, కాదనుకోలేనంతగా కనబడాలని ప్రయత్నిస్తుంది. 88 00:12:36,048 --> 00:12:37,883 ఆడ చేప ముగ్ధురాలైపోయింది. 89 00:12:48,477 --> 00:12:54,149 కానీ సంభోగంలో పాల్గొనాలంటే, మరింత ధైర్యవంతమైన పని చేయాల్సి ఉంటుంది... 90 00:12:56,151 --> 00:12:59,404 అంధకారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాల్సి ఉంటుంది. 91 00:13:05,202 --> 00:13:08,413 వాటి గుడ్లను తినే చేపలు దిబ్బ మధ్యలో దాక్కొని ఉంటాయి... 92 00:13:14,378 --> 00:13:18,340 కాబట్టి ఈ కొత్త జంట దిబ్బ పైకి వచ్చి... 93 00:13:20,050 --> 00:13:23,971 కళ్లుచెదిరేటి శృంగార నాట్యం చేస్తుంది. 94 00:13:40,529 --> 00:13:42,656 వాటి రాత్రి ప్రదర్శన ముగిశాక... 95 00:13:43,866 --> 00:13:46,660 ఈ జంట సురక్షిత ప్రదేశమైన దిబ్బలోకి వెళ్లిపోతాయి... 96 00:13:49,913 --> 00:13:51,623 కానీ మరీ అంత ఎక్కువ సేపటికి కాదులెండి. 97 00:13:55,252 --> 00:13:58,172 ఇంకా సుమారుగా ఏడు ఆడ చేపలను వెతికే పని ఉంది కాబట్టి... 98 00:14:00,215 --> 00:14:04,469 ఈ మన్మథుడు, తనతో చిందులేసే తోడు కోసం వెతకడానికి, 99 00:14:04,553 --> 00:14:07,931 అంధకారంలో మరో సాహసానికి పూనుకుంటాడు. 100 00:14:20,569 --> 00:14:22,070 రాత్రి పురోగమించేకొద్దీ... 101 00:14:23,113 --> 00:14:27,284 ప్రకృతిలోని ఒకానొక అబ్బురపరిచే మర్మమైన అద్భుతాలకు చీకటి తెరతీస్తుంది... 102 00:14:33,207 --> 00:14:38,545 ఈ సంఘటన ఏదో మాయ జరిగినట్టుగా పగడపు దిబ్బలో ఒక మార్పును తీసుకువస్తుంది. 103 00:14:43,050 --> 00:14:48,639 సముద్ర లోలోతుల నుండి, చిట్టి జీవుల సైన్యం బయటకు వస్తోంది... 104 00:14:51,391 --> 00:14:54,311 ఒక గ్రహాంతర లోకం నుండి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. 105 00:14:58,857 --> 00:15:03,111 భూమ్మీద ఎక్కడ కూడా ఇటువంటి భారీ స్థాయిలో వలస అనేది జరగదు, 106 00:15:03,987 --> 00:15:07,491 ఇది మన మహాసముద్రాలలో ప్రతిరాత్రీ జరుగుతుంది. 107 00:15:11,036 --> 00:15:14,665 అనేక బిలియన్ల టన్నులు ఉండే ప్లాంక్టన్ జీవులు, 108 00:15:14,748 --> 00:15:19,169 ఆహారం కోసమని సముద్రపు ఉపరితలం మీదకి వస్తాయి. 109 00:15:28,762 --> 00:15:32,558 ఈ జీవులలో కొన్ని బియ్యపు గింజ అంత కూడా ఉండవు... 110 00:15:34,059 --> 00:15:36,728 కానీ ఇవే సముద్రానికి ప్రాణాధారం. 111 00:15:42,067 --> 00:15:45,946 చాలా చాకచక్యంగా ఉన్నట్టు అనిపించే వాటిలోని వెలుతురు, వాటి కదలిక ద్వారా... 112 00:15:49,867 --> 00:15:54,079 చీకట్లో సముద్రంలో తారాడే ఆహార పదార్థాలను తింటాయి. 113 00:16:16,143 --> 00:16:20,105 కొన్ని జీవులు, పూర్తిగా ఈ దాగి ఉన్న ప్రపంచంలోనే జీవిస్తాయి. 114 00:16:23,609 --> 00:16:26,612 ఈ మ్యాంటిస్ ష్రింప్ లార్వా లాంటి ఇతర జీవులు, 115 00:16:27,196 --> 00:16:31,450 తమ జీవితంలోని తొలి భాగాలనే ఈ పరలోకపు జీవనాన్ని సాగిస్తాయి, 116 00:16:32,034 --> 00:16:35,621 పెరిగాక మళ్లీ పగడపు దిబ్బ వద్దకి వచ్ఛేస్తాయి. 117 00:16:58,519 --> 00:17:00,812 ఒక్కసారిగా జీవుల సంఖ్య పెరగడం కారణంగా... 118 00:17:01,522 --> 00:17:07,277 పగడపు దిబ్బ రూపురేఖలు ఇంద్రజాలం చేసినట్టుగా మారిపోతాయి. 119 00:17:13,367 --> 00:17:16,994 ఊరికే పడి ఉన్నట్టుగా అనిపించే బండరాళ్లు ప్రాణం పోసుకుంటాయి. 120 00:17:43,522 --> 00:17:49,695 చిన్న చిన్న జీవులు భారీ సంఖ్యలో ఒకేచోట చేరి పగడపు దిబ్బలుగా అవుతాయి. 121 00:17:51,446 --> 00:17:54,992 పగటి వేళ, పగడపు దిబ్బ సూర్యుని శక్తిని శోషించుకుంటుంది. 122 00:17:58,036 --> 00:17:59,246 కానీ రాత్రి అయ్యేసరికి... 123 00:18:01,999 --> 00:18:06,044 నిశాచర సూక్ష్మ ప్రపంచంలో, తమ కోరలను చాచి... 124 00:18:07,713 --> 00:18:10,841 వేటాడే జీవులుగా మారిపోతాయి. 125 00:18:18,515 --> 00:18:20,851 ఇక్కడికి కొట్టుకొచ్చే చిన్ని ప్రాణులకు... 126 00:18:22,769 --> 00:18:29,776 ఈ రంగురంగుల తోట, ఇప్పుడు లెక్కలేనన్ని నోళ్లతో నిండిన ఒక గోడను తలపిస్తుంది. 127 00:18:52,591 --> 00:18:57,471 ఈ రాత్రి వేళ విందు, దిబ్బలకు కావలసిన పోషకాలను అందిస్తుంది, 128 00:18:57,554 --> 00:18:59,681 దిబ్బ పెరగడానికి ఇవి చాలా కీలకం. 129 00:19:03,602 --> 00:19:08,440 పెరుగుతున్న సముద్రపు ఉష్ణోగ్రతల వల్ల పగడపు దిబ్బలకు నష్టం జరుగుతోందని మనకి తెలుసు, 130 00:19:09,024 --> 00:19:13,779 కనుక ఈ రాత్రి వేళ తమ కడుపులను నింపుకోవడం ఇప్పుడు తమ ఉనికికి మరింత కీలకంగా మారింది. 131 00:19:33,924 --> 00:19:39,555 కానీ ప్లాంక్టన్ తాలూకు ఈ రాత్రి వలస మీద చిన్ని పగడపు దిబ్బలు మాత్రమే ఆధారపడిలేవు. 132 00:19:43,058 --> 00:19:48,939 ఇతర భారీ జీవులు కూడా రాత్రి వేళ విందుకు హాజరవుతున్నాయి: 133 00:19:53,735 --> 00:19:59,783 నాలుగు మీటర్ల వరకు వెడల్పున్న విహంగాలతో ఈదేటటువంటి మాంటా రే. 134 00:20:02,661 --> 00:20:04,204 మాంటా రేలు ఒంటరి జీవితాన్నే గడుపుతాయి... 135 00:20:05,747 --> 00:20:10,294 ప్లాంక్టన్ విరివిగా లభించే ట్రాపికల్ ప్రదేశాలలో, 136 00:20:10,377 --> 00:20:12,921 అవన్నీ ఒకేచోటకు చేరి ఆరగిస్తాయి. 137 00:20:18,302 --> 00:20:22,556 ఒక టన్ను బరువు ఉండే ఈ భారీ జీవులు, 138 00:20:23,056 --> 00:20:29,188 రాత్రి వేల ఈ చిన్ని ప్లాంక్టన్ జీవులను తిని మనుగడ సాగిస్తాయనేది నమ్మలేని నిజం. 139 00:20:37,487 --> 00:20:42,534 వంపులు తిరిగిన మొప్పలతో, తెరిచి ఉన్న తమ నోళ్ళలోకి ప్లాంక్టన్ ని మళ్లించుకొని... 140 00:20:48,457 --> 00:20:50,918 కావలసిన అహార పదార్థాలను ఫిల్టర్ చేసుకుంటాయి. 141 00:21:01,261 --> 00:21:03,347 ఇప్పుడు ఈ నిశిరాత్రిలో... 142 00:21:04,473 --> 00:21:09,853 రాత్రి వేళ సమృద్దిగా దొరికే అహారాన్ని తినడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. 143 00:21:35,796 --> 00:21:38,715 పదే పదే వంపులు తిరుగుతూ... 144 00:21:39,591 --> 00:21:42,886 అవి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్లాంక్టన్ ని తీసుకునే ప్రయత్నం చేస్తాయి... 145 00:21:44,429 --> 00:21:46,932 ఆ తర్వాత వాటిని తినేస్తాయి. 146 00:22:17,629 --> 00:22:22,759 అన్ని చేపల కన్నా మాంటా రే మెదడు పెద్దగా ఉంటుందనే విషయం ఇప్పుడు మనకు తెలుసు. 147 00:22:24,761 --> 00:22:29,308 కానీ చిమ్మచీకటిగా ఉండే సముద్రలోతుల్లో ఆహార వేటలో భాగంగా 148 00:22:29,391 --> 00:22:34,479 అవి అంతంత దూరాలు ఎలా ప్రయాణిస్తాయో అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. 149 00:22:42,821 --> 00:22:47,534 రాత్రివేళ మన సముద్రాలలో జరిగే ఇంకా ఛేదించలేని అనేక అంతుచిక్కని వాటిలో... 150 00:22:48,118 --> 00:22:50,579 ఇది కూడా ఒకటి. 151 00:23:06,261 --> 00:23:10,349 రాత్రి సమయాన భూమి 152 00:23:10,432 --> 00:23:13,894 చీకట్లో చిత్రీకరించబడింది 153 00:23:15,312 --> 00:23:19,149 పగడపు దిబ్బలలో రాత్రి వేళ చోటుచేసుకొనే సంగతులను చిత్రీకరించడానికి, 154 00:23:19,233 --> 00:23:24,071 వాస్తవ స్థితిలో ఉన్న ట్రాపికల్ సముద్రాలలో రాత్రి సమయాన భూమి బృందం చిత్రీకరించింది. 155 00:23:28,951 --> 00:23:31,119 కెమెరామెన్ డేవిడ్ రైకార్ట్ ఎదుర్కొన్న 156 00:23:31,203 --> 00:23:36,124 అతిపెద్ద సవాలు ఏంటంటే, రాత్రి వేళ పగడపు దిబ్బల వేటాడే జంతువులను చిత్రీకరించడం. 157 00:23:38,544 --> 00:23:43,006 షార్క్ చేపలు, అలాగే ఇతర వేటాడే చేపలు రాత్రి మరింత చురుకుగా ఉంటాయి... 158 00:23:45,843 --> 00:23:49,304 సురక్షితంగా వాటి వద్దకు వెళ్లి చిత్రీకరించడం కూడా కాస్త కష్టమైన పనే. 159 00:23:53,183 --> 00:23:55,394 రాత్రి వేళ చిత్రీకరించడం అనేది పూర్తిగా ఒక కొత్త ప్రపంచం అన్నమాట. 160 00:23:59,898 --> 00:24:02,693 చీకటి మాటు నుండి ఏం వస్తుందో మనకు అస్సలు తెలీదు. 161 00:24:04,278 --> 00:24:05,279 డేవిడ్ రైకార్ట్ కెమెరామెన్ 162 00:24:05,362 --> 00:24:06,947 చూద్దాం మరి. మేము ఇక దూకుతున్నాం. 163 00:24:17,875 --> 00:24:21,628 డేవిడ్, అతని డైవ్ లను పౌర్ణమి సమయాలలో ప్లాన్ చేసుకున్నాడు, 164 00:24:21,712 --> 00:24:24,381 అప్పుడయితే బలమైన ప్రవాహాలు, పగడబు దిబ్బ వద్దకు ఆహారం వచ్చేలా చేస్తాయి... 165 00:24:25,215 --> 00:24:27,968 దానితో వేటాడే చేపలు అప్పుడు మరింత చురుకుగా ఉంటాయి. 166 00:24:32,139 --> 00:24:34,474 కానీ ఇది ఒక పెద్ద సమస్యను సృష్టిస్తుంది. 167 00:24:34,975 --> 00:24:38,437 ఉపరితలం నుండి డైవర్లకు. ప్రవాహ ఉధృతి ఎలా ఉంది? 168 00:24:40,105 --> 00:24:43,192 అంత బాగా లేదు. ప్రవాహం బాగా బలంగా ఉంది. 169 00:24:44,818 --> 00:24:47,321 మేము పడవ వద్దకు వస్తున్నాం. పైకి వచ్చేస్తున్నాం. 170 00:24:51,658 --> 00:24:53,952 లోపల ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది, 171 00:24:54,036 --> 00:24:57,789 ఒకేచోట కుదురుగా ఉండటం అస్సలు సాధ్యమవ్వడం లేదు. 172 00:24:57,873 --> 00:24:59,249 అది మంచి విషయం కాదు. 173 00:25:00,667 --> 00:25:01,752 అవును... 174 00:25:03,212 --> 00:25:05,297 ప్రవాహం బాగా ఉన్నప్పుడు, మంచి హాడావిడి ఉంటుంది, 175 00:25:05,380 --> 00:25:07,132 అలాగే చాలా చిత్రీకరించవచ్చు కూడా... 176 00:25:07,216 --> 00:25:08,800 ఇంకా ఉధృతంగా ఉంది. 177 00:25:08,884 --> 00:25:11,512 మాకు ఒకే చోట కుదురుగా ఉండటానికి చాలా ఇబ్బందిగా ఉంది. 178 00:25:11,595 --> 00:25:13,055 మా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది మరి. 179 00:25:16,683 --> 00:25:22,397 రాబోయే రాత్రుళ్లలో, పౌర్ణమి పోయినప్పుడు, ప్రవాహం తగ్గుతుంది. 180 00:25:24,691 --> 00:25:29,613 అప్పుడు డైవింగ్ సులభంగానే ఉంటుంది, కానీ పగడపు దిబ్బలన్నీ ఖాళీగా ఉంటాయి. 181 00:25:32,533 --> 00:25:33,534 అవును. 182 00:25:33,617 --> 00:25:38,205 అవును, ప్రవాహం తగ్గిపోయింది, ఆ తర్వాత, నేనేమనుకుంటున్నానంటే... 183 00:25:38,288 --> 00:25:39,706 అన్నీ ఇళ్లకు వెళ్లిపోయినట్టున్నాయి. 184 00:25:39,790 --> 00:25:41,250 -అవును. -అవును. 185 00:25:42,626 --> 00:25:45,379 బృందం అనువైన పరిస్థితుల కోసం వెతుకుతూ ఉండగా... 186 00:25:45,462 --> 00:25:48,340 ఒక ప్రవాహానికి మరొక ప్రవాహానికి మధ్య సమయంలో నీళ్లు శాంతంగా ఉన్న... 187 00:25:49,383 --> 00:25:52,177 కాసింత సమయంలో తాము పని పూర్తి చేయాలని వారు గ్రహించారు. 188 00:26:00,602 --> 00:26:02,104 అలా చిత్రీకరించడం చాలా కష్టం, 189 00:26:02,187 --> 00:26:06,483 ఎందుకంటే అలా 6 గంటలకు సూర్యాస్తమయం అయినప్పుడు జరగవచ్చు, 190 00:26:06,567 --> 00:26:11,363 ఆ సమయాన్ని కనుక చేజార్చుకుంటే, మళ్లీ తెల్లవారు 4 గంటల దాకా వేచి చూడాలి. 191 00:26:11,446 --> 00:26:12,906 కాబట్టి, షెడ్యూల్ అంతా గజిబిజిగా ఉంటుంది, 192 00:26:12,990 --> 00:26:18,161 ఒక 40 నిమిషాల డైవ్ కోసం మేము రాత్రంతా వేచి చూడాల్సి ఉంటుంది. 193 00:26:20,581 --> 00:26:21,832 నాకు ఒక కప్పు టీ ఇవ్వండి. 194 00:26:24,960 --> 00:26:27,921 సహనంతో, ఇంకా అనేక నిద్రలేని రాత్రులు గడిపాక... 195 00:26:28,964 --> 00:26:32,009 డేవిడ్ మరియు బృందం, తాము ఎదురుచూస్తున్న కొత్త ప్రవర్తనలను 196 00:26:32,092 --> 00:26:35,220 ఎట్టకేలకు చిత్రీకరించడం మొదలుపెట్టారు. 197 00:26:36,263 --> 00:26:39,766 కోర్నెట్ చేపలు అలా వేటాడటం నేనెన్నడూ చూడలేదు. 198 00:26:40,642 --> 00:26:42,728 అనుకున్నవన్నీ మనకి దొరక్కపోవచ్చు, కానీ ఇది మాత్రం మనకి దొరికింది. 199 00:26:47,316 --> 00:26:51,403 వేటాడటంలో ఒక్కో చేపది ఒక్కో పద్ధతి. 200 00:26:53,447 --> 00:26:58,285 మోరే ఈళ్లు ఆహార వేట కోసమని పగడపు దిబ్బ వద్దకు చేరుకుంటున్నాయి. 201 00:26:58,368 --> 00:27:00,954 మోరే, దిబ్బ పైన తన వేటను కొనసాగిస్తూ ఉంది. 202 00:27:02,372 --> 00:27:05,459 అక్కడ ఒక చిన్న రంధ్రం ఉంది, అది అందులోకి దూరి లోపలికి వెళ్లింది. 203 00:27:13,050 --> 00:27:14,843 ఊహించినట్టుగానే, లోపల ఒక చిన్న చేప ఉంది, 204 00:27:14,927 --> 00:27:16,053 మోరే అక్కడికి చేరుకుంది. 205 00:27:17,221 --> 00:27:18,305 అదుగో అక్కడుంది. 206 00:27:23,101 --> 00:27:24,353 ఇక, హాంఫట్. 207 00:27:28,398 --> 00:27:31,693 పట్టేసుకుంది! సరిగ్గా కెమెరా ముందు. రంధ్రంలోనే అనుకోండి. బాగా వచ్చింది. 208 00:27:36,490 --> 00:27:38,992 ఈ పగడపు దిబ్బలలో చాలా జరుగుతున్నాయి. 209 00:27:39,952 --> 00:27:43,288 రాత్రి వేళే ప్రాణం పోసుకున్నట్టుగా అనిపించే ఈ వైవిధ్యబరితమైన జీవరాశి 210 00:27:43,372 --> 00:27:45,999 మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. 211 00:27:50,295 --> 00:27:54,091 ఈ అబ్బురపరిచే సముద్రపు లోలోతులలో ఉన్న ప్రపంచానికి చెందిన 212 00:27:54,174 --> 00:27:57,678 ఈ ప్రత్యేక కోణాన్ని సిబ్బంది, వారి కెమెరాలలో బంధించగలిగింది. 213 00:28:42,055 --> 00:28:44,057 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య