1 00:00:07,257 --> 00:00:09,843 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,680 జీవితంలో చిన్న చిన్న వాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,643 కానీ తీక్షణంగా చూస్తే... 4 00:00:18,143 --> 00:00:20,562 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,983 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,861 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,406 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,040 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:50,968 --> 00:00:52,386 చిన్నగా ఉండడం తేలికైన విషయం కాదు... 10 00:00:56,974 --> 00:00:58,642 భారీ జీవుల మధ్యన జీవిస్తూ... 11 00:00:58,725 --> 00:01:00,853 వ్యాఖ్యాత పాల్ రడ్ 12 00:01:00,936 --> 00:01:02,938 నిరంతరం అణచివేయబడుతూ ఉంటాయి. 13 00:01:06,024 --> 00:01:08,151 ఒక్కోసారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. 14 00:01:13,073 --> 00:01:17,744 కానీ భారీ జంతువులకు చిక్కని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. 15 00:01:20,038 --> 00:01:23,834 చిన్నగా ఉండడం వల్ల అక్కడ ప్రయోజనం ఉంటుంది. 16 00:01:31,300 --> 00:01:32,509 మండే ఎండలు... 17 00:01:34,011 --> 00:01:35,220 విపరీతమైన పొడి వాతావరణం... 18 00:01:37,556 --> 00:01:38,807 కుమ్మేసే గాలి... 19 00:01:41,768 --> 00:01:44,271 అత్యంత ప్రమాదకరమైన ఈ ఇసుక దిబ్బల్లో... 20 00:01:46,481 --> 00:01:48,525 కేవలం తెలివి తేటలు ఉన్నవారు... 21 00:01:50,068 --> 00:01:51,528 చిన్నగా ఉన్నవారికి మాత్రమే... 22 00:01:53,530 --> 00:01:55,449 మనగలిగే సామర్ధ్యం ఉంటుంది. 23 00:02:04,958 --> 00:02:10,589 ఇసుకదిబ్బ 24 00:02:16,094 --> 00:02:20,307 భూమ్మీది అత్యంత నివాసయోగ్యం కాని కొద్ది ప్రాంతాల్లో ఇదీ ఒకటి. 25 00:02:22,768 --> 00:02:27,814 భూమ్మీది అతిపెద్ద, అతి పురాతనమైన ఇసుకదిబ్బలు నమిబ్ ఎడారిలో ఉన్నాయి. 26 00:02:28,857 --> 00:02:30,734 గాలివాటం వల్ల అవి తన స్థానాన్ని మార్చుకుంటున్నాయి. 27 00:02:33,820 --> 00:02:37,616 కేవలం ఆరు నెలల్లో, మొత్తం ప్రకృతి దృశ్యం మారిపోతుంది. 28 00:02:44,331 --> 00:02:45,582 కానీ ఏదో ఒకలాగా... 29 00:02:46,542 --> 00:02:51,922 ఈ అనంత ఇసుక సాగరంలో తమ మార్గమేంటో బుల్లి ప్రాణులు తెలుసుకోవాలి. 30 00:02:54,633 --> 00:02:56,134 నమాక్వా కమీలియన్ 31 00:02:57,052 --> 00:02:59,012 మన చేతి పరిమాణంలో ఉంటుంది. 32 00:03:00,639 --> 00:03:04,017 ఇక్కడున్న మిగిలిన బుల్లి ప్రాణుల మాదిరిగా, ఇసుకదిబ్బల్లో జీవితానికి 33 00:03:05,060 --> 00:03:06,728 ఇది అంతగా పరిణామం చెందినట్లుగా కనిపించదు. 34 00:03:11,024 --> 00:03:12,484 దాని పరిమాణంలో పావువంతు... 35 00:03:13,569 --> 00:03:15,279 మాత్రమే ఉండే షోవెల్ స్నౌటెడ్ బల్లి 36 00:03:15,362 --> 00:03:19,950 ఒక్క సెకనులో వేడి ఇసుకలో మూడు మీటర్ల దూరం గెంతగలదు. 37 00:03:25,747 --> 00:03:26,957 మరి కమీలియన్? 38 00:03:28,792 --> 00:03:30,002 అంతగా కాదు. 39 00:03:35,215 --> 00:03:37,676 కొమ్మలు పట్టుకునేలా దాని పాదాలు రూపొందాయి. 40 00:03:38,886 --> 00:03:40,012 ఇసుక కోసం కాదు. 41 00:03:54,943 --> 00:04:00,616 కానీ ఈ అసాధారణమైన సంచార జీవులు ఒక ముఖ్యమైన పనిమీద ఇసుకదిబ్బల్లో తిరుగుతున్నాయి. 42 00:04:03,827 --> 00:04:05,287 ఇక్కడే ఎక్కడో ఒకచోట... 43 00:04:06,246 --> 00:04:09,249 జతను వెతుక్కోవడమే దాని పని. 44 00:04:17,423 --> 00:04:20,093 ఇసుక మీదుగా గాల్లో ఎగరడం తేలికైన పని. 45 00:04:26,183 --> 00:04:28,977 సాండ్ గ్రౌస్ ఇసుకదిబ్బల్లో జీవించేందుకు అనువుగా ఉంటాయి. 46 00:04:30,729 --> 00:04:32,564 కానీ ఇక్కడ తాగడానికి ఏమీ దొరకదు. 47 00:04:35,692 --> 00:04:40,656 కాబట్టి ప్రతిరోజూ, ఈ బుల్లి పక్షులు నీటికోసం ఒక సుదీర్ఘ ప్రయాణం చేపడతాయి. 48 00:04:49,748 --> 00:04:51,375 ఎనభై కిలోమీటర్ల ఆవల... 49 00:04:53,502 --> 00:04:55,712 అవి మరో ప్రపంచంలోకి అడుగు పెడతాయి. 50 00:04:59,842 --> 00:05:02,386 భారీ, ఆకలిగొన్న వేటగాళ్ళలో ఒకటి. 51 00:05:12,729 --> 00:05:14,648 ఇక్కడికి చేరిన పక్షులన్నిటిలాగానే... 52 00:05:16,191 --> 00:05:17,734 ఈ మగ పక్షి కూడా దాహం తీర్చుకోవాలి. 53 00:05:33,500 --> 00:05:35,460 అందుకని అది వేచి ఉంటుంది. 54 00:05:47,723 --> 00:05:49,683 వేగంగా ఒక గుక్క తాగేందుకు సరైన సమయం. 55 00:06:06,033 --> 00:06:11,121 ఇసుకదిబ్బల మధ్యనున్న గూట్లో ఉన్న జీవితకాల భాగస్వామి దగ్గరికి అది తిరిగి వస్తుంది. 56 00:06:14,249 --> 00:06:16,877 గుడ్లను పొదిగేందుకు అంకిత భావం కలిగిన ఈ జంట వంతులు వేసుకుంటాయి. 57 00:06:17,794 --> 00:06:19,838 అప్పుడే రెండవది నీటికోసం వెళ్ళగలదు. 58 00:06:24,092 --> 00:06:26,970 కానీ జీవితం మరింత సంక్లిష్టంగా మారబోతోంది. 59 00:06:29,348 --> 00:06:31,099 వాటి గుడ్లు పగలడానికి సిద్ధంగా ఉన్నాయి. 60 00:06:32,017 --> 00:06:36,355 అప్పుడే పుట్టిన పిల్లలకు నీళ్ళు కావాలి, లేదా అవి ఎండకు మాడి చనిపోతాయి. 61 00:06:44,613 --> 00:06:49,326 మధ్యాహ్నం అయ్యే సరికి, శరీరాన్ని చల్లబరచుకోవడం జీవన్మరణ సమస్యగా మారుతుంది. 62 00:06:53,288 --> 00:06:56,416 ఈసారికి, కమీలియన్ తన చర్మాన్ని తెల్లగా మార్చుకుని... 63 00:07:00,212 --> 00:07:03,966 సూర్య కిరణాలు పరావర్తించేలా పరిణితి చెందింది. 64 00:07:17,479 --> 00:07:23,235 కానీ షోవెల్ స్నౌటెడ్ బల్లి, ఎప్పటిలాగే తన తెలివితేటలతో 65 00:07:24,361 --> 00:07:26,530 ఒక అడుగు ముందంజలో ఉంది. 66 00:07:38,166 --> 00:07:42,171 ఇసుక ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 70 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరుతుంది. 67 00:07:43,922 --> 00:07:47,676 కానీ ఒక సెంటీమీటర్ పైన, అది పది డిగ్రీలు తక్కువగా ఉంటుంది. 68 00:07:49,178 --> 00:07:52,764 కాబట్టి పాదాల్ని పైకి లేపడం ద్వారా, అది వేగంగా వేడిని కోల్పోతుంది. 69 00:08:00,856 --> 00:08:02,399 వేడి భరించలేనంతగా పెరిగినప్పుడు... 70 00:08:03,483 --> 00:08:06,904 దాని వెడల్పాటి ముక్కే ప్రాణదాత అవుతుంది. 71 00:08:11,408 --> 00:08:15,370 కేవలం 20 సెంటీమీటర్ల దిగువన, ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా 30 డిగ్రీలు ఉంటుంది. 72 00:08:21,627 --> 00:08:25,255 ఈ పోంపిలిడ్ వాస్ప్ని వేడి ఏమీ చేయలేదు. 73 00:08:27,508 --> 00:08:32,304 సున్నితమైన యాంటెనా సాయంతో, ఇసుకలో దాగి ఉన్న జీవుల్ని కూడా అది పసిగట్టగలదు. 74 00:08:51,990 --> 00:08:53,825 సుమారు పేపర్ క్లిప్ పరిమాణంలో ఉండే ఇది, 75 00:08:53,909 --> 00:08:58,705 తను దాడి చేయాలనుకున్న జీవికోసం రెండు బక్కెట్లకు పైగా ఇసుకను తవ్వుతుంది. 76 00:09:12,344 --> 00:09:14,096 ఒక గోల్డెన్ వీల్ సాలీడు. 77 00:09:19,184 --> 00:09:21,228 వాస్ప్ కుడితే, శరీరం చచ్చుబడుతుంది. 78 00:09:23,313 --> 00:09:25,524 సాలీడు కాటు ప్రాణాంతకమైంది. 79 00:09:30,946 --> 00:09:35,784 ఈ ఎడారి యోధులు తలపడితే, సాలీడు అరుదుగా పైచేయి సాధిస్తుంది. 80 00:09:43,417 --> 00:09:44,585 కానీ తప్పించుకునేందుకు దాని దగ్గర... 81 00:09:46,295 --> 00:09:48,881 ఒక అద్భుతమైన వ్యూహం ఉంది. 82 00:10:01,435 --> 00:10:03,145 వాస్ప్ కనుచూపు మేరలో లేకుండా పారిపోవడం. 83 00:10:09,026 --> 00:10:10,652 ప్రమాదాన్ని దాటుకుని పోవడం. 84 00:10:17,409 --> 00:10:18,619 దాదాపుగా. 85 00:10:22,456 --> 00:10:23,665 సగం మధ్యాహ్నం దాటేసరికి... 86 00:10:24,708 --> 00:10:26,293 ఇసుకదిబ్బలు నిర్జీవంగా తయారయ్యాయి. 87 00:10:27,461 --> 00:10:30,881 గాలిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్కు చేరింది. 88 00:10:36,470 --> 00:10:39,598 సాయంత్రం అవుతుండగా మాత్రమే వేడి కాస్తంత తగ్గడం మొదలవుతుంది. 89 00:10:43,268 --> 00:10:48,023 ఇసుకదిబ్బల అంచులదాకా వెళ్ళే యువ బబూన్లకు అది సరిపోతుంది. 90 00:10:52,694 --> 00:10:53,987 ఆడుతూ పాడుతూ, ఆసక్తిగా ఉంటాయి... 91 00:10:56,615 --> 00:10:58,450 ...కానీ ఆహ్వానించదగ్గ సందర్శకులు కావు. 92 00:11:06,458 --> 00:11:08,585 డిసర్ట్ రెయిన్ ఫ్రాగ్స్ నిశాచరులు. 93 00:11:10,546 --> 00:11:13,382 వాటిని లేపడం కొరివితో తల గోక్కోవడమే. 94 00:11:19,471 --> 00:11:21,306 కేవలం గోల్ఫ్ బాల్ పరిమాణంలో ఉంటాయిగానీ... 95 00:11:24,560 --> 00:11:25,644 తలపొగరు చాలా ఎక్కువ. 96 00:11:40,784 --> 00:11:43,203 పగటిజీవులు నిశాచరులకు చోటు 97 00:11:43,537 --> 00:11:47,332 కల్పించేలోగా ఇంకొద్దిసేపు నిద్రపోవచ్చు. 98 00:11:55,215 --> 00:11:56,633 చీకటిపడేకొద్దీ... 99 00:11:57,926 --> 00:11:59,261 ఉష్ణోగ్రత కూడా పడిపోతుంది. 100 00:12:04,683 --> 00:12:06,602 ఎడారి రద్దీగా మారుతుంది. 101 00:12:07,352 --> 00:12:09,146 సందడిగా కూడా. 102 00:12:15,319 --> 00:12:16,904 అలసిపోయిన ప్రాణానికి జోలపాట. 103 00:12:20,657 --> 00:12:23,202 నిశాచర రాకాసులకు మేలుకొలుపు. 104 00:12:26,163 --> 00:12:29,249 వేటగాళ్లకు భోజనాల గంట. 105 00:12:33,670 --> 00:12:38,050 బుల్లి ఎర దొరుకుతుందేమో అని గుడ్లగూబ ఇసుకదిబ్బలంతా వెతుకుతోంది. 106 00:12:44,264 --> 00:12:46,183 కానీ కాచుకుని ఉన్న ఒక జంతువు... 107 00:12:47,392 --> 00:12:48,769 పొంచి చూస్తోంది. 108 00:12:52,856 --> 00:12:53,941 ఇసుక కింద... 109 00:12:55,192 --> 00:12:56,401 ఈదుతూ ఉంది. 110 00:13:06,119 --> 00:13:08,205 ఎడారిలో షార్క్ లాంటిది. 111 00:13:20,843 --> 00:13:22,719 నమిబ్ గోల్డెన్ మోల్. 112 00:13:24,721 --> 00:13:28,433 గుడ్డిది, గుడ్డు కంటే చిన్న పరిమాణంలో ఉంటుంది. 113 00:13:35,232 --> 00:13:39,319 పెద్ద పరిమాణంలో ఉండే పుర్రె ఒక శాటిలైట్ డిష్ లాగా పనిచేస్తుంది, 114 00:13:39,403 --> 00:13:41,697 అది చెదపురుగులు చేసే చిన్నచిన్న శబ్దాలను పసిగడుతుంది. 115 00:13:43,866 --> 00:13:46,118 దానికి కావాల్సిన నీరు, ఆహారం అన్నీ వాటినుండే అందుతాయి. 116 00:13:47,452 --> 00:13:49,872 కాకపోతే ఒక రాత్రికి కనీసం 60 చీమల్ని తినాల్సి ఉంటుంది. 117 00:13:53,292 --> 00:13:56,128 ఈ విందు భోజనంలో మరిన్ని నిశాచరులు పాలుపంచుకుంటాయి. 118 00:14:04,720 --> 00:14:10,517 నిద్రావస్థలో ఉన్న కప్ప చీమల వేటగాడిగా మారుతుంది. 119 00:14:21,403 --> 00:14:23,989 కానీ చీమలు తిరిగి కుట్టేస్తాయి. 120 00:14:31,747 --> 00:14:34,875 దాని పెద్ద తలకాయ వాటిని అంత తేలిగ్గా చెదరగొట్టలేదు. 121 00:14:54,436 --> 00:14:58,273 కుట్టే చీమల బారినుండి, కనిపించని ఇతర ప్రమాదాలనుండి తప్పించుకోవడానికి... 122 00:15:05,155 --> 00:15:07,115 ఇసుకే ఏకైక మార్గం. 123 00:15:25,717 --> 00:15:26,844 తెల్లవారుజాము. 124 00:15:29,263 --> 00:15:32,391 కమీలియన్ ఆకలితో అలమటిస్తూ, చలితో వణుకుతోంది. 125 00:15:34,977 --> 00:15:39,398 వెచ్చదనం కోసం, సూర్యుడికి అభిముఖంగా ఉన్న భాగం రంగును నిండుగా మార్చుతుంది. 126 00:15:46,196 --> 00:15:48,282 దాంతో పేడపురుగులు బయటికి వచ్చే సమయానికి... 127 00:15:52,119 --> 00:15:54,621 కమీలియన్ సిద్ధంగా ఉంటుంది. 128 00:16:06,800 --> 00:16:07,843 అనుభవ రాహిత్యంతో చేసిన తప్పు. 129 00:16:13,348 --> 00:16:17,352 ఈ జాతి పేడపురుగుల రుచి దారుణంగా ఉంటుంది, 130 00:16:17,436 --> 00:16:20,272 ఏ కమీలియన్ కూడా ఒకే తప్పును రెండోసారి చేయదు. 131 00:16:29,948 --> 00:16:33,118 డార్క్లింగ్ బీటిల్ ముందు చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉంది. 132 00:16:36,663 --> 00:16:43,295 బాటిల్ మూత పరిమాణంలో ఉన్న పురుగుకు 350 మీటర్ల కొండెక్కడం తేలికైన విషయం కాదు. 133 00:16:47,216 --> 00:16:48,759 కానీ కష్టానికి ఫలితం ఉంటుంది. 134 00:16:53,764 --> 00:16:57,309 కొన్ని ప్రత్యేక ఉదయాల్లో, ఇసుకదిబ్బలు పొగమంచుతో నిండిపోతాయి. 135 00:17:02,105 --> 00:17:04,983 ఈ బుల్లి పేడపురుగు అందుకే వేచి చూస్తోంది. 136 00:17:08,819 --> 00:17:12,782 దాని వీపుపై ఉన్న ఉబ్బెత్తులు పొగమంచును కరిగించి... 137 00:17:17,871 --> 00:17:19,665 దాని నోటి వైపుకు మళ్ళిస్తాయి. 138 00:17:26,003 --> 00:17:29,132 పలుచని గాలినుండి అది నీటిని సృష్టిస్తుంది. 139 00:17:37,474 --> 00:17:40,102 వాటి శరీర బరువులో సగం నీటిని అవి తాగగలవు. 140 00:17:43,772 --> 00:17:45,524 దిబ్బమీది నుండి కిందికి వచ్చే పేడపురుగులు... 141 00:17:47,025 --> 00:17:49,653 పైకి వెళ్ళే వాటికంటే జ్యూసీగా ఉంటాయి. 142 00:17:55,951 --> 00:17:59,079 ఇక్కడున్న మిగతా జీవులకంటే కమీలియన్ జీవితం అనుకూలంగా ఉండకపోవచ్చు. 143 00:17:59,663 --> 00:18:01,748 కానీ వాటిని ఓడించలేక పోయినా... 144 00:18:03,208 --> 00:18:04,376 తినేయచ్చు కదా. 145 00:18:24,938 --> 00:18:26,982 సాండ్ గ్రౌస్ పిల్లలు గుడ్లలోంచి బయటికి వస్తున్నాయి. 146 00:18:29,568 --> 00:18:33,238 లేత ఎండలో కూడా, వాటికి తల్లి నీడ అవసరం. 147 00:18:35,991 --> 00:18:39,411 ఎండ తాకిడి పెరిగిందంటే, అవి నీరు లేక చనిపోతాయి. 148 00:18:43,540 --> 00:18:45,334 వాటి ఆశను తీర్చగలిగేది తండ్రి మాత్రమే. 149 00:18:48,795 --> 00:18:52,424 భారీ జంతువులు కొన్ని మాత్రమే ఉన్న ఒక కొత్త నీటి గుంతను అది కనుగొంది. 150 00:18:54,927 --> 00:18:56,428 కానీ అంత చిన్న పక్షికి... 151 00:18:58,764 --> 00:19:02,059 సాధు జంతువులతో సంప్రదించడం కూడా కష్టమైన పనే. 152 00:19:20,035 --> 00:19:23,247 తన పిల్లల దగ్గరికి నీటిని తీసుకెళ్ళడం మరింత కష్టం. 153 00:19:34,216 --> 00:19:35,342 గాస్హాక్ దాహం తీర్చుకోవడానికి వచ్చిన... 154 00:19:36,385 --> 00:19:38,053 ...జీవులకోసం మాటు వేసింది. 155 00:20:03,120 --> 00:20:07,457 పిల్లలను కాపాడడం కోసం, తండ్రి తన ప్రాణాన్ని పణంగా పెడతాడు. 156 00:20:23,015 --> 00:20:25,559 పొట్టమీద ప్రత్యేకంగా రూపొందిన ఈకల ద్వారా, 157 00:20:25,642 --> 00:20:29,938 ఒక షాట్ గ్లాసును నింపే అంత నీటిని మగ సాండ్ గ్రౌస్ పీల్చుకోగలదు. 158 00:20:35,110 --> 00:20:37,237 తన పిల్లల కోసం మోసుకెళ్లడానికి నీరు సిద్ధం. 159 00:20:54,213 --> 00:20:57,674 బరువుతో కూడిన రెండు గంటల ప్రయాణం. 160 00:21:07,142 --> 00:21:08,477 సమయానికి చేరుకుంది. 161 00:21:10,771 --> 00:21:14,525 తండ్రి రెక్కల నుండి పిల్లలు మొదటిసారిగా నీటిని తాగుతాయి. 162 00:21:18,320 --> 00:21:22,449 రెండు నెలలపాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ప్రతిరోజూ ఇదే ప్రయాణాన్ని కొనసాగించాలి. 163 00:21:22,533 --> 00:21:24,535 పిల్లలు తమంతట తాము ఎగరగలిగే వరకూ. 164 00:21:37,506 --> 00:21:40,467 కమీలియన్ ప్రయాణం దాన్ని నారా పొదలోకి తీసుకుపోయింది. 165 00:21:42,052 --> 00:21:43,929 నీడ కోసం మంచి ప్రదేశం. 166 00:21:47,391 --> 00:21:49,893 అదృష్టవశాత్తూ... 167 00:21:51,144 --> 00:21:52,187 ఒక ఆడది. 168 00:21:57,818 --> 00:21:59,903 మరి లక్ష్యం సాధించడంలో విజయం సాధిస్తుందా? 169 00:22:09,162 --> 00:22:12,040 తన భావాల్ని చూపించడం కోసం, ఆమె రంగుల్ని మార్చుతుంది... 170 00:22:17,546 --> 00:22:19,089 నాట్యం చేస్తుంది. 171 00:22:43,906 --> 00:22:47,034 ఆమె కోరుకున్నది అతన్ని కాదేమో అన్నట్లుగా కనిపిస్తోంది. 172 00:22:50,913 --> 00:22:53,290 కానీ ఇక్కడ జత దొరకడమే కనాకష్టం. 173 00:22:54,750 --> 00:22:56,418 బహుశా అతనికి సరిపెట్టుకోక తప్పదు. 174 00:23:04,843 --> 00:23:06,386 సంయోగం పూర్తయ్యాక ఆమె అక్కడ ఉండదు. 175 00:23:09,598 --> 00:23:11,433 త్వరలోనే ఆమె గుడ్లు పెడుతుంది. 176 00:23:15,771 --> 00:23:17,314 మగదానికి సంతృప్తి కలిగిస్తుంది... 177 00:23:18,857 --> 00:23:20,234 కానీ పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. 178 00:23:32,788 --> 00:23:35,916 ఐదు కోట్ల 50 లక్షల సంవత్సరాల పరిణామక్రమం 179 00:23:35,999 --> 00:23:40,170 ఎడారి జీవులు అత్యద్భుతంగా పరిణామం చెందేలా చేసింది. 180 00:23:44,675 --> 00:23:46,593 దేన్నైనా ఎదుర్కొనే సామర్థ్యం, చాతుర్యాల సాయంతో... 181 00:23:47,803 --> 00:23:53,225 నమీబియాలోని నిర్జన ఇసుకదిబ్బల్లో చిట్టి జీవులు విజయం సాధిస్తాయి. 182 00:24:01,859 --> 00:24:07,781 నెలల తరబడి ఇసుకలో పూడ్చబడిన ఒక బిడ్డ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 183 00:24:14,454 --> 00:24:16,957 కమీలియన్ వారసత్వం కొనసాగుతుంది. 184 00:24:20,002 --> 00:24:22,129 ఎదురుగా ఎన్నో సవాళ్ళు. 185 00:24:23,755 --> 00:24:27,759 నెమ్మదిగా ఒక్కో అడుగేస్తూ భవిష్యత్తులోకి ప్రయాణం సాగిస్తుంది. 186 00:25:11,470 --> 00:25:13,472 సబ్ టైటిల్స్ అనువదించినది: రాధ