1 00:00:07,341 --> 00:00:09,843 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,677 --> 00:00:13,680 జీవితంలో చిన్న చిన్న వాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,643 కానీ తీక్షణంగా చూస్తే... 4 00:00:18,101 --> 00:00:20,562 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,983 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,819 చిన్నారి రాకాసులకు... 7 00:00:28,987 --> 00:00:31,406 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,040 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:58,141 --> 00:01:01,520 ఈ గ్రహం మీద అత్యంత వైవిధ్యభరిత ప్రాంతాల్లో పగడపు దిబ్బలు కొన్ని. 10 00:01:01,603 --> 00:01:03,021 వ్యాఖ్యాత పాల్ రడ్ 11 00:01:05,190 --> 00:01:09,319 భారీ దిబ్బలకు, అద్భుత జీవులకు నిలయం. 12 00:01:13,031 --> 00:01:14,241 కానీ వాటి అడుగున... 13 00:01:14,908 --> 00:01:16,493 ఒక చిన్న ప్రాణుల మహానగరమే ఉంటుంది... 14 00:01:19,830 --> 00:01:23,250 అసాధారణమైన బుల్లి ప్రాణులతో సందడిగా ఉంటుంది. 15 00:01:27,129 --> 00:01:28,964 ఈ జీవులు చిన్నవే కావొచ్చు... 16 00:01:29,882 --> 00:01:32,092 కానీ అవి చేసే పని ఎంతో ఆవశ్యకం. 17 00:01:35,387 --> 00:01:38,390 ప్రస్తుతం, అవి ఎప్పటికంటే బిజీగా ఉన్నాయి. 18 00:01:40,684 --> 00:01:44,897 ఏడాదికొకసారి, పగడపు దిబ్బ మనోహరమైన పునరుత్పత్తి ప్రక్రియను చేపడుతుంది... 19 00:01:45,772 --> 00:01:48,025 దాని భవిష్యత్తుకు అది ఎంతో కీలకం. 20 00:01:50,277 --> 00:01:53,780 భారీ పగడపు దిబ్బలో బుల్లి చేపగా ఉండడం తేలికైన విషయం కాదు. 21 00:01:56,658 --> 00:02:03,290 తమ పగడాల నగరాన్ని సజీవంగా ఉంచుకోవడం కోసం బుల్లి ప్రాణులు భారీ సవాళ్ళను ఎదుర్కోవాలి. 22 00:02:06,668 --> 00:02:10,839 పగడపు దిబ్బ 23 00:02:15,511 --> 00:02:19,723 అన్ని నగరాలలాగే, పగడపు దిబ్బ కూడా ఎంతో సంక్లిష్టంగా, రద్దీగా ఉంటుంది. 24 00:02:23,227 --> 00:02:27,564 ప్రతిరోజూ బిజీగా, గొడవతో మొదలవుతుంది. 25 00:02:30,817 --> 00:02:36,323 నగరవాసులన్నీ ఒకరినొకరు పిలుచుకుంటూ, నీటికింద తెల్లవారుజామున పాడుతున్నాయి. 26 00:02:39,576 --> 00:02:41,495 కండరాలను విరుస్తూ... 27 00:02:43,288 --> 00:02:44,706 మొప్పలు కొట్టుకుంటూ... 28 00:02:46,083 --> 00:02:47,501 పళ్ళు కొరుకుతూ శబ్దాలు చేస్తుంటాయి. 29 00:02:53,507 --> 00:02:58,220 చిన్న జీవుల పెరిగే సమాజం ఉన్న ఆరోగ్యకరమైన పగడపు దిబ్బ మాత్రమే 30 00:02:58,887 --> 00:03:00,389 ఇంత పెద్దగా పాడుతుంది. 31 00:03:09,815 --> 00:03:13,193 ఇక్కడి చేపల్లో సగం బాటిల్ మూత పరిమాణంలో ఉంటాయి. 32 00:03:17,447 --> 00:03:20,075 కానీ వారి సేవలకు మాత్రం అధిక డిమాండ్ ఉంది. 33 00:03:28,834 --> 00:03:31,128 ఒక తాబేలు క్లీనింగ్ స్టేషనుకు వచ్చింది. 34 00:03:33,005 --> 00:03:34,673 తన డిప్పను మెరిపించడం కోసం. 35 00:03:49,688 --> 00:03:53,317 ఒంటరిగా ఆ పనంతా చూసుకోవడం బుల్లి బ్లెన్నీ వల్ల కాని పని. 36 00:03:57,988 --> 00:04:02,284 కాబట్టి ఆల్గే తొలగించే నిపుణుల బృందం ఒకటి పోలిష్ చేయడంలో సాయం చేస్తుంది. 37 00:04:18,550 --> 00:04:21,970 ఒక క్లౌన్ ఫిష్ కుటుంబం తమ అనిమోన్ ఇంటిపని చూడడంలో బిజీగా ఉంది. 38 00:04:25,724 --> 00:04:28,936 వాటి ముళ్ళ మీసాలలోకి కొన్ని వేటగాళ్ళు మాత్రమే ప్రవేశించే ధైర్యం చేస్తాయి. 39 00:04:31,438 --> 00:04:34,399 కానీ క్లౌన్ ఫిష్ చుట్టూ బంకతో ఒక రక్షణ కవచం ఉంటుంది. 40 00:04:34,483 --> 00:04:36,485 అది ఇక్కడ శాశ్వతంగా నివసించే అవకాశం కల్పిస్తుంది. 41 00:04:42,699 --> 00:04:46,578 బదులుగా, అవి అనిమోన్ను శుభ్రంగా, ఆక్సిజనీకరణ జరిగేలా చేస్తాయి. 42 00:04:51,792 --> 00:04:56,255 వాటి కింద దాచిన 500ల గుడ్లను మగ చేపలు చేసుకోవాలి. 43 00:04:58,131 --> 00:05:00,843 ఒక్కొక్కటి బియ్యపు గింజకంటే చిన్నగా ఉంటుంది. 44 00:05:05,514 --> 00:05:08,600 పగడపు దిబ్బ పునరుత్పత్తి జరిగే అదే రాత్రి గుడ్లు కూడా పొదిగితే, 45 00:05:08,684 --> 00:05:11,520 అవి బతకడానికి ఉత్తమ అవకాశం దొరుకుతుంది. 46 00:05:17,609 --> 00:05:20,028 అప్పటివరకూ, అవి సురక్షితంగా ఉండాలి. 47 00:05:21,613 --> 00:05:24,616 పగడపు దిబ్బలో అత్యంత సురక్షితమైన ఇళ్ళలో ఇది ఒకటి. 48 00:05:26,785 --> 00:05:28,662 కుటుంబం ఎప్పుడూ దూరంగా పోదు. 49 00:05:33,208 --> 00:05:36,837 ఈ ప్రాంతంలో పెద్ద చేపలు ఎప్పుడూ ఉంటాయి. 50 00:05:43,760 --> 00:05:45,762 లెపర్డ్ కోరల్ గ్రూపర్. 51 00:06:02,946 --> 00:06:05,949 గ్రూపర్ చేతికి చిక్కకుండా బుల్లి డాంసెల్ ఫిష్... 52 00:06:07,826 --> 00:06:09,661 పగడాల మధ్య దాక్కుంటాయి. 53 00:06:12,664 --> 00:06:14,499 కానీ ఈ తెలివైన చేప అంత తేలిగ్గా వెనక్కి తగ్గదు. 54 00:06:16,001 --> 00:06:17,336 అది తన సైన్యాన్ని... 55 00:06:18,295 --> 00:06:19,296 పిలుస్తుంది. 56 00:06:25,969 --> 00:06:28,847 ఆక్టోపస్ చూడ్డానికి అసహజమైన సహచరిలాగా కనిపిస్తుంది. 57 00:06:30,682 --> 00:06:33,393 కానీ కలిసికట్టుగా, అవి హంతకుల ముఠాగా మారతాయి. 58 00:06:37,439 --> 00:06:40,359 మభ్యపెట్టేందుకు గ్రూపర్ తన రంగుని మార్చుకుంటే... 59 00:06:41,818 --> 00:06:43,946 వేట మొదలైందని అర్థం. 60 00:07:00,754 --> 00:07:02,965 డాంసెల్ ఫిష్ అడకత్తెరలో పడింది. 61 00:07:15,769 --> 00:07:17,980 అవి దాక్కునే చోటుని గ్రూపర్ కనిపెట్టింది. 62 00:07:19,815 --> 00:07:21,900 దాన్ని చూపించేందుకు తన రంగు మార్చుకుంటుంది. 63 00:07:30,075 --> 00:07:31,285 టెంటకిల్స్ కిందికి వస్తాయి. 64 00:07:32,578 --> 00:07:34,121 చేప భయపడుతుంది. 65 00:07:35,622 --> 00:07:37,791 నేరుగా గ్రూపర్ ఒడిలోకి వచ్చి పడుతుంది. 66 00:07:43,338 --> 00:07:44,923 చాలా పెద్ద తప్పిదం. 67 00:07:46,633 --> 00:07:50,679 కదలకుండా ఉంటే, ఆక్టోపస్ చేతికి చిక్కుతుంది. 68 00:07:52,347 --> 00:07:53,432 లేదా పారిపోతే... 69 00:07:55,017 --> 00:07:57,686 గ్రూపర్ చేతికి దొరుకుతుంది. 70 00:08:05,027 --> 00:08:06,612 తప్పించుకునే మార్గం లేనప్పుడు... 71 00:08:08,071 --> 00:08:11,283 ఒక్కోసారి తిరిగి పోరాడడమే ఏకైక పరిష్కారం. 72 00:08:18,957 --> 00:08:21,293 ఆక్టోపస్ మీద డాంసెల్ ఫిష్ మూకుమ్మడిగా దాడిచేసి, 73 00:08:22,669 --> 00:08:24,296 అక్కడినుండి వెళ్ళిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాయి. 74 00:08:29,134 --> 00:08:33,013 ఈ గందరగోళం మరింత పెద్ద చేపల్ని ఆకర్షిస్తుంది. 75 00:08:41,063 --> 00:08:43,899 బుల్లి చేపలు తప్పించుకోవడానికి ఇదొక అవకాశం. 76 00:08:50,948 --> 00:08:52,616 షార్క్ చేపలు గుమిగూడటంతో... 77 00:08:55,035 --> 00:08:58,872 ఒక్కసారిగా, ఎవరికి వారే అయిపోయారు. 78 00:09:04,670 --> 00:09:06,088 కృషి ఫలించలేదు. 79 00:09:16,640 --> 00:09:19,059 భారీ షార్క్ చేపలు చిన్న చేపల్ని పట్టించుకోవు. 80 00:09:22,104 --> 00:09:27,943 ఇతర వేటగాళ్ళను చెదరగొట్టి, బుల్లిజీవులు తిరిగి పనిలో పడడానికి సాయం చేస్తాయి. 81 00:09:32,865 --> 00:09:35,075 ఆల్గే బారినుండి పగడపు దిబ్బను గ్రేజర్లు కాపాడతాయి. 82 00:09:39,121 --> 00:09:41,748 నెమ్మదిగా పెరిగే పగడాలకు అవకాశం కల్పిస్తాయి. 83 00:09:47,629 --> 00:09:51,675 వాస్తవానికి పగడాలు బుల్లి ప్రాణులతో నిర్మితమైన కాలనీలు. 84 00:09:53,468 --> 00:09:59,516 ప్రతి దానిలో సూక్ష్మాకారంలో ఉండే మొక్కల కణాలు వెలుగును ఆహారంగా మార్చుతాయి. 85 00:10:02,644 --> 00:10:06,648 ఒక అద్భుతమైన కూటమిలాగా పగడపు దిబ్బ మొత్తం నిర్మించబడింది. 86 00:10:10,819 --> 00:10:14,198 కోట్లకొద్దీ బుల్లి ప్రాణులన్నీ కలిసి... 87 00:10:15,782 --> 00:10:18,994 భూమ్మీది అతిపెద్ద జీవ నిర్మాణాన్ని సృష్టిస్తాయి. 88 00:10:26,668 --> 00:10:28,879 కానీ ఈ పగడపు నగరాలు దుర్బలంగా ఉంటాయి. 89 00:10:32,090 --> 00:10:34,301 వేడెక్కే సముద్రాల వల్ల... 90 00:10:35,969 --> 00:10:37,179 కాలుష్యం వల్ల... 91 00:10:38,222 --> 00:10:39,348 అతిగా చేపలు పట్టడం వల్ల... 92 00:10:40,516 --> 00:10:42,601 దాడుల వల్ల నాశనమౌతాయి. 93 00:10:46,396 --> 00:10:48,690 గొట్టాల లాంటి పాదాలపై నడిచేది. 94 00:10:52,444 --> 00:10:54,655 విషపూరితమైన ముళ్ళు కలిగినది. 95 00:11:02,788 --> 00:11:03,997 రాక్షసిలా ఉంటూ... 96 00:11:04,915 --> 00:11:06,124 పగడాల్ని తినే... 97 00:11:07,084 --> 00:11:09,503 క్రౌన్-ఆఫ్-థార్న్స్ స్టార్ ఫిష్. 98 00:11:13,632 --> 00:11:16,927 ప్రతి ఏడాది వందలకొద్దీ పగడాలను మింగేస్తుంది. 99 00:11:20,722 --> 00:11:22,933 అది కేవలం ఒక్కటి కాదు. 100 00:11:24,101 --> 00:11:26,103 ఒక పెద్ద సైన్యమే ఉంది... 101 00:11:27,479 --> 00:11:30,607 అన్ని బుల్లి ప్రాణుల ఇళ్ళను నాశనం చేసేస్తాయి. 102 00:11:38,866 --> 00:11:41,285 కానీ తమవైపు ముంచుకొస్తున్న ముప్పు గురించి తెలియని 103 00:11:42,703 --> 00:11:47,332 పగడపు దిబ్బ వాసులు బిజీగా ఉన్నాయి, సంతానోత్పత్తి కోసం సిద్ధమవుతున్నాయి. 104 00:11:48,750 --> 00:11:50,377 ఆహారం కోసం వెతుకుతున్నాయి. 105 00:11:55,966 --> 00:11:59,178 జంతు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కళ్ళు. 106 00:12:00,596 --> 00:12:03,807 మానవ నేత్రం కంటే నాలుగు రెట్ల కలర్ రిసెప్టార్లు కలిగిన 107 00:12:05,142 --> 00:12:10,147 పీకాక్ మాంటిస్ రొయ్య ప్రపంచాన్ని పూర్తిగా వేరే పద్ధతిలో చూస్తుంది. 108 00:12:14,026 --> 00:12:19,740 ఒక టూత్ పేస్టు ట్యూబు కంటే పెద్దది కాదు, కానీ రక్షణా చర్యలు చేపట్టడంలో దిట్ట. 109 00:12:22,743 --> 00:12:28,790 తొమ్మిది మిల్లీమీటర్ల బుల్లెట్ దూసుకు పోయేంత వేగంగా పంచ్ విసురుతుంది. 110 00:12:30,626 --> 00:12:33,629 ఎంత వేగంగా అంటే, నీరు కూడా ఆవిరవుతుంది. 111 00:12:39,176 --> 00:12:41,512 ఒక మెరుపును కూడా సృష్టించగలదు. 112 00:12:50,854 --> 00:12:53,982 కానీ ఇన్ని ఆయుధాలు కలిగిన మాంటిస్ రొయ్యకు కూడా సురక్షితమైన స్థలం కావాలి. 113 00:12:58,445 --> 00:13:01,448 త్వరలో నర్సరీగా మారనున్న దాని బొరియ. 114 00:13:03,700 --> 00:13:05,327 పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక. 115 00:13:12,543 --> 00:13:14,378 జతకోసం ఎదురుచూసే ఒక మగ అతిధి... 116 00:13:16,213 --> 00:13:17,464 ఇప్పటికే సిద్ధంగా ఉంది. 117 00:13:18,799 --> 00:13:20,801 లేదా ఆమె గూటిని దొంగిలించడానికి వచ్చి ఉండొచ్చు. 118 00:13:27,766 --> 00:13:28,809 ఎలా చూసినా... 119 00:13:30,602 --> 00:13:33,856 మెరుపు వేగంతో విసిరే గుద్దులు స్పష్టంగా తెలియజేసేది ఏమంటే... 120 00:13:37,276 --> 00:13:39,403 ఆమె అతిధులకు సిద్ధంగా లేదు అని. 121 00:13:44,616 --> 00:13:47,786 కానీ ఇది బహిరంగంగా పట్టుబడే అవకాశం ఉన్న చోటు. 122 00:14:01,341 --> 00:14:02,801 ఒక తిండిబోతు వేటగాడు. 123 00:14:08,599 --> 00:14:09,933 టీ కప్పు పరిమాణంలో... 124 00:14:12,227 --> 00:14:13,228 ఉంటుంది. 125 00:14:16,690 --> 00:14:18,525 డ్వార్ఫ్ కటిల్ ఫిష్. 126 00:14:19,484 --> 00:14:23,322 సంతానోత్పత్తి చేయాలంటే, దాని పరిమాణం ఇంకా పెరగాలి. 127 00:14:24,364 --> 00:14:26,658 అంటే బోలెడంత ఆహారం తినాలి. 128 00:14:29,494 --> 00:14:32,331 కానీ తనే ఒక సున్నితమైన లక్ష్యం. 129 00:14:34,750 --> 00:14:39,421 కాబట్టి వేటాడబడకుండా వేటాడడమే ఇక్కడ కీలకం. 130 00:14:42,174 --> 00:14:47,012 మారువేషంలో ఆరితేరిన ఇది తన చర్మం రంగు, రూపం మార్చడంలో... 131 00:14:48,764 --> 00:14:50,182 వేటగాళ్ళను, ఎరను... 132 00:14:51,308 --> 00:14:52,476 ఏమార్చడంలో దిట్ట. 133 00:15:02,611 --> 00:15:06,156 ఏడాది కూడా బతకని ఇది, వేగంగా పెరగాల్సి ఉంటుంది, 134 00:15:07,241 --> 00:15:09,576 కదిలే దేన్నైనా తినగలుగుతుంది. 135 00:15:14,790 --> 00:15:17,376 పాచిని భోంచేయడానికి చేతులు ఊపుతూ ఉన్న... 136 00:15:19,920 --> 00:15:24,174 బటన్ పరిమాణంలో ఉండే బాక్సర్ పీత ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదు. 137 00:15:33,475 --> 00:15:34,893 ఒక బాధాకరమైన తప్పిదం. 138 00:15:38,772 --> 00:15:42,568 ఈ పీత తన చేతిలో పొడుచుకునే సూక్ష్మమైన అనిమోన్స్ కలిగి ఉంటుంది. 139 00:15:44,278 --> 00:15:47,322 వేటగాళ్లను తరమడానికి చిన్న టేజర్స్తో షాక్ ఇస్తుంది. 140 00:15:51,493 --> 00:15:53,161 అవి ఎంత ప్రభావం కలిగిస్తాయంటే, 141 00:15:53,245 --> 00:15:56,456 వాటిని సంపాదించడానికి శత్రువులు ఎంతకైనా తెగిస్తాయి. 142 00:16:05,048 --> 00:16:07,092 అది ఒక సున్నితమైన పోరాటం. 143 00:16:10,387 --> 00:16:13,015 రెంటిలో ఏదీ కూడా అనిమోన్స్ పాడవ్వాలని కోరుకోదు. 144 00:16:17,978 --> 00:16:23,192 ప్రత్యర్థిని బిగించి, శత్రువు జాగ్రత్తగా తన బహుమతిని సొంతం చేసుకుంటుంది. 145 00:16:32,326 --> 00:16:34,161 ఇప్పుడు ఇద్దరి దగ్గరా ఒక్కొక్కటి ఉంది, 146 00:16:34,244 --> 00:16:39,166 మళ్ళీ పూర్తి జత పెరిగేలా రెండు పీతలూ వాటిని పంచుకుంటాయి. 147 00:16:45,005 --> 00:16:48,467 అన్ని రకాల బుల్లి జీవులకూ అనిమోన్స్ రక్షణ అందిస్తాయి. 148 00:16:52,137 --> 00:16:54,139 పారదర్శకంగా ఉండే బుల్లి అనిమోన్ రొయ్య. 149 00:16:56,141 --> 00:16:58,101 క్లౌన్ ఫిష్తో పాటు కలిసి జీవిస్తోంది. 150 00:17:01,772 --> 00:17:03,982 అవి కేవలం పేపర్ క్లిప్ సైజులో ఉండొచ్చు... 151 00:17:06,443 --> 00:17:10,280 కానీ అవి పగడపు దిబ్బలో ఉండే పెద్ద చేపలతో కలిసి పనిచేసేంత ధైర్యంగా ఉంటాయి. 152 00:17:19,289 --> 00:17:22,917 ఊగడం ద్వారా రొయ్యలు తమ సేవలను ప్రకటిస్తాయి. 153 00:17:26,880 --> 00:17:29,007 కస్టమర్ ఒకవేళ వేటగాడు అయితే... 154 00:17:31,552 --> 00:17:35,264 చప్పట్లు కొట్టడం ద్వారా చేపలను శుభ్రం చేసే సేవలు సిద్ధమని... 155 00:17:35,347 --> 00:17:36,974 అవి స్పష్టం చేస్తాయి. 156 00:17:53,824 --> 00:17:55,951 సురక్షితమేనని నిర్ధారించుకోగానే, 157 00:17:56,869 --> 00:17:58,829 ఒక బుల్లి రొయ్య తన పని ప్రారంభిస్తుంది. 158 00:18:00,539 --> 00:18:02,416 మృతచర్మాన్ని పొరలుగా తీసేస్తూ... 159 00:18:03,667 --> 00:18:05,294 పరాన్నజీవులను ఏరివేస్తూ... 160 00:18:06,086 --> 00:18:07,796 మొప్పలను శుభ్రం చేస్తుంది. 161 00:18:16,763 --> 00:18:20,934 పళ్ళను శుభ్రం చేసేందుకు ధైర్యంగా నోటి లోపలికి కూడా వెళ్తుంది. 162 00:18:26,899 --> 00:18:30,277 బుల్లి ప్రాణులు అందించే ఆరోగ్య సేవలు 163 00:18:30,360 --> 00:18:33,864 పెద్ద చేపలు మంచి స్థితిలో ఉండేందుకు అవసరం. 164 00:18:39,953 --> 00:18:44,833 పగడపు దిబ్బ అంతటా జతకట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 165 00:18:50,756 --> 00:18:53,634 మాంటిస్ రొయ్య నర్సరీని నిర్మించడం దాదాపు పూర్తయింది. 166 00:18:57,638 --> 00:19:01,683 గూటిని సురక్షితంగా చేసేందుకు మూడు కిలోల చెత్తను ఎత్తి పడేసింది. 167 00:19:06,480 --> 00:19:12,194 అత్యవసర ద్వారాలను శుభ్రం చేసి, శత్రువులు గందరగోళానికి గురయ్యేలా చేసింది. 168 00:19:15,155 --> 00:19:20,452 దాని నిర్మాణ పని ఎంత విసృతంగా సాగిందంటే, ఇతరులు కూడా ఇక్కడ ఇంటిని ఏర్పరుచుకున్నారు. 169 00:19:25,249 --> 00:19:29,086 కానీ దాని ఇంటిపక్క ఒకరితో సమస్య ఏర్పడింది. 170 00:19:34,091 --> 00:19:35,384 అది టస్క్ ఫిష్. 171 00:19:36,468 --> 00:19:39,096 పనిముట్లను వాడే కొన్ని చేపల్లో ఇదీ ఒకటి. 172 00:19:41,807 --> 00:19:44,935 నత్తగుల్లల్ని పగలగొట్టడానికి దానికి సొంత దాగలి కూడా ఉంది. 173 00:19:53,068 --> 00:19:55,404 దానికి మాంటిస్ రొయ్యను తినాలన్న కోరిక లేదు. 174 00:19:58,156 --> 00:20:01,827 కానీ ఆహారం కోసం అది పాటించే పద్ధతి వల్ల దీని గూడు చెదిరిపోవచ్చు. 175 00:20:05,581 --> 00:20:09,418 ఆహారం కోసం వెతుకుతూ అది భారీ రాళ్ళను ఎత్తి పడేస్తుంది. 176 00:20:20,971 --> 00:20:22,306 దానికి కావాల్సింది దొరికినట్లే. 177 00:20:24,641 --> 00:20:28,520 కానీ దీని నర్సరీ నిర్మాణం అనుకున్న సమయానికంటే బాగా వెనుకపడిపోయింది. 178 00:20:32,900 --> 00:20:37,487 రోజు ముగిసే నాటికి, పగడపు దిబ్బ బిజీగా మారుతోంది. 179 00:20:43,702 --> 00:20:46,121 క్లౌన్ ఫిష్ గుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉన్నాయి. 180 00:20:52,920 --> 00:20:55,130 క్లీనర్ రాస్ బృందం ఒళ్ళొంచి పనిచేస్తోంది. 181 00:20:58,258 --> 00:21:00,177 వేలంత పొడవు మాత్రమే ఉండే వీటిని, 182 00:21:00,260 --> 00:21:03,555 వాటి మీదుండే నీలం, నలుపు చారల ద్వారా తేలిగ్గా గుర్తు పట్టొచ్చు. 183 00:21:17,569 --> 00:21:21,156 ప్రతీదీ చూడ్డానికి కనిపించేంత మంచి బుద్ధి కలిగినవి కాదు. 184 00:21:27,162 --> 00:21:28,580 ఫాంగ్ బ్లెన్నీ. 185 00:21:32,626 --> 00:21:36,547 క్లీనర్ రాస్ లాగా కనిపించేలా, ఈ మోసగాడు తన రంగులు మార్చుకుంటుంది. 186 00:21:36,630 --> 00:21:38,841 గుర్తించకుండా వాటిలో కలిసిపోతుంది. 187 00:21:44,972 --> 00:21:46,515 కానీ అది వచ్చింది శుభ్రం చేయడం కోసం కాదు. 188 00:21:54,439 --> 00:21:57,985 అనుమానించని చేపల చర్మానికి రాసుకుంటూ వెళుతూ... 189 00:22:01,154 --> 00:22:03,574 అది పొలుసులను ఆహారంగా దోచేస్తుంది. 190 00:22:13,750 --> 00:22:16,003 తమను గుద్దింది ఏదో బాధితులు గ్రహించేలోగా, 191 00:22:17,004 --> 00:22:19,506 ఈ తెలివైన మోసగాడు తన గూటివైపు... 192 00:22:20,924 --> 00:22:22,176 మాయమైపోతుంది. 193 00:22:25,554 --> 00:22:29,975 రహస్య కార్యకలాపాలు బుల్లి ప్రాణులకు పగడపు దిబ్బలో జీవించేందుకు సహాయపడతాయి. 194 00:22:34,605 --> 00:22:37,941 డ్వార్ఫ్ కటిల్ ఫిష్ జీవించి ఉండడానికి... 195 00:22:39,318 --> 00:22:40,777 ఆహారం సంపాదించడానికి అదే కారణం. 196 00:22:47,868 --> 00:22:50,537 ప్రతి వేట విజయవంతం అయ్యేకొద్దీ, అది పెద్దగా మారుతుంది. 197 00:22:58,712 --> 00:23:00,714 ఈ ఆడది ఆకర్షించబడినట్లే కనిపిస్తోంది. 198 00:23:01,381 --> 00:23:05,219 ఈ ఒక్కసారికి, ఆహారం మొదటి ప్రాధాన్యత కాదు. 199 00:23:13,685 --> 00:23:16,522 మాంటిస్ రొయ్య తన ఇంటికి మరమ్మతులు చేసుకుంటోంది. 200 00:23:21,527 --> 00:23:22,778 చెత్తను ఏరి పారేస్తోంది. 201 00:23:24,905 --> 00:23:27,032 అన్నీ సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకుంటోంది. 202 00:23:29,785 --> 00:23:31,954 ఆఖరి మెరుగులు దిద్దుతోంది. 203 00:23:43,715 --> 00:23:47,511 చివరికి, అతిధిని ఆహ్వానించడానికి సిద్ధమయింది. 204 00:24:00,816 --> 00:24:04,069 ఏడాదిలో ముఖ్యమైన కార్యక్రమానికి పగడపు దిబ్బ సిద్ధం కాగానే, 205 00:24:04,945 --> 00:24:06,864 పగడాల హంతకులు వచ్చేశాయి. 206 00:24:15,497 --> 00:24:17,916 గుట్టలు గుట్టలుగా క్రౌన్-ఆఫ్-థార్న్స్ స్టార్ ఫిష్. 207 00:24:26,216 --> 00:24:30,429 వాటి పొట్టల్ని బయటికి లాగి, పగడాల జీవ కణజలాన్ని జీర్ణం చేసుకుంటాయి. 208 00:24:33,682 --> 00:24:36,602 తెల్ల అస్తి పంజరాన్ని మాత్రమే మిగుల్చుతాయి. 209 00:24:49,114 --> 00:24:52,409 తమ దారిలో వచ్చే ప్రతి పగడాన్ని నాశనం చేసే 210 00:24:52,492 --> 00:24:57,706 స్టార్ ఫిష్ వరదను అడ్డుకునేందుకు, పగడపు దిబ్బ నివాసులు చేయగలిగింది ఏమీ లేదు. 211 00:25:08,675 --> 00:25:12,638 వరుసలో ఉన్నది ఈ బుల్లి పీత ఇల్లు. 212 00:25:22,564 --> 00:25:24,775 అది ఎంతగా ప్రయత్నించినప్పటికీ... 213 00:25:26,777 --> 00:25:29,613 స్టార్ ఫిష్ శరీరం దాదాపు దుర్భేధ్యమైనది. 214 00:25:34,284 --> 00:25:36,745 కానీ ముళ్ళ అడుగున ఉండే సున్నితమైన భాగం... 215 00:25:38,580 --> 00:25:40,249 దాని కవచంలో బలహీనత. 216 00:25:44,253 --> 00:25:46,213 ఒక బుల్లి పీత, ఒక రకాసిని మట్టి... 217 00:25:47,339 --> 00:25:49,007 కరిపించే సమయం వచ్చింది. 218 00:26:09,736 --> 00:26:13,407 గార్డ్ పీతలతో పోటీ పడడం అనవసరం. 219 00:26:24,418 --> 00:26:27,045 బుల్లి ప్రాణుల వైవిధ్యభరిత సమాజం... 220 00:26:28,088 --> 00:26:29,756 అన్నీ తమ వంతు పాత్ర పోషిస్తూ... 221 00:26:31,216 --> 00:26:37,431 పగడపు దిబ్బలను ఆరోగ్యవంతంగా ఉంచుతూ, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తాయి. 222 00:26:44,938 --> 00:26:48,942 ఈ సజీవ నగరాల్లోని దెబ్బతిన్న ప్రాంతాలు కూడా తిరిగి జీవం పోసుకుంటాయి. 223 00:26:55,032 --> 00:26:56,825 ఏడాదికొకసారి 224 00:26:56,909 --> 00:27:00,913 ఆటుపోట్లు, ఉష్ణోగ్రత సరైన రీతిలో కలుస్తాయి. 225 00:27:08,795 --> 00:27:10,380 ఈరాత్రే ఆరోజు... 226 00:27:11,715 --> 00:27:14,801 పగడపు దిబ్బ తనంతట తానే పునరుత్పత్తి ప్రారంభిస్తుంది. 227 00:27:22,017 --> 00:27:26,480 ఒక బుల్లి ఉండ, మిరియం పరిమాణంలో ఉంటుంది. 228 00:27:28,440 --> 00:27:33,654 ఒక్కసారిగా బుజ్జి పగడాలను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ. 229 00:27:37,241 --> 00:27:39,034 పగడాలు అండోత్పత్తి చేస్తున్నాయి. 230 00:27:42,746 --> 00:27:45,541 పగడపు దిబ్బలోని మరెన్నో ఇతర ప్రాణులు కూడా పునరుత్పత్తి చేస్తున్నాయి. 231 00:27:48,335 --> 00:27:50,921 డ్వార్ఫ్ కటిల్ ఫిష్ తన జతను సొంతం చేసుకుంది. 232 00:27:56,093 --> 00:27:59,972 పగడంలోకి తన గుడ్లను చొప్పించే సమయం వచ్చింది. 233 00:28:03,934 --> 00:28:06,103 మాంటిస్ రొయ్య కూడా గుడ్లు పెట్టింది. 234 00:28:07,229 --> 00:28:08,480 ఇరవై వేల గుడ్లు. 235 00:28:16,238 --> 00:28:18,740 తండ్రితో మరోసారి శుభ్రం చేయించుకుని... 236 00:28:21,493 --> 00:28:25,038 వందలాది క్రౌన్ ఫిష్ లార్వాలు విడుదలయ్యాయి. 237 00:28:35,215 --> 00:28:39,386 కలిసికట్టుగా పొదగడం వల్ల ఎక్కువభాగం జీవించే అవకాశం ఉంటుంది 238 00:28:40,429 --> 00:28:42,764 అలతో పాటుగా సురక్షిత ప్రాంతానికి తరలి వెళతాయి. 239 00:28:52,107 --> 00:28:55,152 త్వరలోనే, బుల్లి అద్భుతాలు పెరుగుతున్నాయి. 240 00:29:00,908 --> 00:29:03,035 వేరుశనగ గింజ పరిమాణంలో ఉంటూ, 241 00:29:03,118 --> 00:29:07,497 కటిల్ ఫిష్ పిల్ల ఇప్పుడే సముద్రంలో సాహసయాత్ర మొదలుపెట్టింది. 242 00:29:13,795 --> 00:29:19,468 బహుశా అన్నిటికంటే ప్రధానమైనది, ఒక మిల్లీమీటర్ సైజులో ఉండే కోరల్ ప్లానులా. 243 00:29:25,265 --> 00:29:27,351 పగడపు దిబ్బ చేసే చప్పుళ్ళకు ఆకర్షించబడి... 244 00:29:36,193 --> 00:29:39,738 ...ఈ బుల్లి ముక్క ఒక భారీ పగడంలాగా ఎదుగుతుంది. 245 00:29:41,865 --> 00:29:46,745 ఈ పగడాల నగరంలో నివసించే ప్రాణులన్నింటికీ భవిష్యత్తును నిర్మిస్తోంది. 246 00:30:29,913 --> 00:30:31,915 సబ్ టైటిల్స్ అనువదించినది: రాధ