1 00:00:07,341 --> 00:00:09,843 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,680 జీవితంలో చిన్న చిన్న వాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,643 కానీ తీక్షణంగా చూస్తే... 4 00:00:18,143 --> 00:00:20,562 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,983 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,861 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,406 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,040 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:58,600 --> 00:01:02,104 15 కోట్ల సంవత్సరాల పాటు మడగాస్కర్ దీవిలోని వ్యన్య ప్రాణులు... 10 00:01:02,187 --> 00:01:03,230 వ్యాఖ్యాత పాల్ రడ్ 11 00:01:03,313 --> 00:01:07,693 ...మిగతా ప్రపంచానికి భిన్నంగా నెమ్మదిగా పరిణామం చెందుతూ వచ్చాయి. 12 00:01:09,862 --> 00:01:13,532 అజ్ఞాతంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉండిపోయిన ప్రాణులు 13 00:01:13,615 --> 00:01:17,744 విచిత్రమైన, అద్భుతమైన మార్గాల్లో పరిణామం చెందుతూ వచ్చాయి. 14 00:01:20,581 --> 00:01:24,501 భూమిమీద ఎక్కడా కనిపించని అసాధారణమైన జంతుజాలానికి 15 00:01:25,627 --> 00:01:27,671 ఈ విలువైన వర్షారణ్యాలు నిలయాలు. 16 00:01:33,844 --> 00:01:35,053 అన్నింటిలోకీ చిన్నవి... 17 00:01:36,430 --> 00:01:38,265 అన్నిటికంటే అద్భుతమైనవి. 18 00:01:40,809 --> 00:01:42,144 ఒక బుల్లి టెన్రెక్. 19 00:01:45,480 --> 00:01:48,442 ఇప్పటివరకూ, తల్లి దానికి మార్గదర్శకత్వం వహించింది. 20 00:01:50,235 --> 00:01:51,904 కానీ కేవలం నాలుగు వారాల వయసులో... 21 00:01:53,447 --> 00:01:55,282 నాలుగు సెంటీమీటర్ల ఎత్తుకే... 22 00:01:56,408 --> 00:01:58,285 స్వతంత్రంగా బతికే సమయం వచ్చింది. 23 00:02:08,044 --> 00:02:09,838 ఈ నిగూఢమైన అడవిలో, 24 00:02:10,672 --> 00:02:13,425 జంతువులు రహస్య ఆయుధాల్ని కలిగి ఉన్నాయి. 25 00:02:14,676 --> 00:02:15,677 ప్రత్యేకమైన నైపుణ్యాలు... 26 00:02:17,721 --> 00:02:19,181 మోసపూరిత రక్షణా చర్యలు. 27 00:02:26,063 --> 00:02:27,773 ఇక్కడ మనగలగాలంటే, 28 00:02:28,482 --> 00:02:32,152 తన సొంత సూపర్ పవర్ ఏమిటో బుల్లి టెన్రెక్ కనుగొనాలి. 29 00:02:34,154 --> 00:02:38,158 వర్షారణ్యం 30 00:02:49,545 --> 00:02:51,797 ఒంటరిగా ప్రయాణం ప్రారంభించడానికి ఇది కష్ట సమయం. 31 00:02:57,302 --> 00:02:58,762 ఈ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యాయి. 32 00:03:06,687 --> 00:03:08,146 అడవి ఎండిపోతోంది. 33 00:03:11,567 --> 00:03:12,985 ఆహారానికి కొరత ఉంది. 34 00:03:14,152 --> 00:03:16,697 జంతువులు ఎంత ఎక్కువగా ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయో... 35 00:03:19,199 --> 00:03:22,077 అంత ఎక్కువగా అవి బహిర్గతం అయి, వేటగాళ్ళ కంట్లో పడతాయి. 36 00:03:26,540 --> 00:03:28,834 ట్రీ బో పొంచి ఉండి ఆకస్మికంగా దాడి చేస్తుంది. 37 00:03:31,962 --> 00:03:34,840 మాంసాహారి ఫోసా అడవి నేలంతా కలియదిరుగుతుంది. 38 00:03:39,428 --> 00:03:41,889 బుల్లి ప్రాణులు వేటగాళ్లకు దూరంగా ఉండాలి, 39 00:03:45,976 --> 00:03:48,312 కనిపించకుండా ఉండేందుకు చేయగలిగినంత చేయాలి. 40 00:04:02,367 --> 00:04:07,664 ప్రాణాంతకమైన ఈ దాగుడుమూతలాట పరిణామక్రమంలో గెలిచేందుకు కొత్త సామర్ధ్యాలను అందించింది. 41 00:04:11,585 --> 00:04:13,670 మోసపూరితమైన మారువేషాలు మరింతగా వేస్తూ... 42 00:04:14,671 --> 00:04:17,716 మరింత ప్రమాదకర బెదిరింపులను ఎదుర్కొంటాయి. 43 00:04:24,139 --> 00:04:26,808 ఇక్కడున్న కొందరు వేటగాళ్లకు కంటిచూపు ఎంత తీక్షణంగా ఉంటుందంటే... 44 00:04:30,812 --> 00:04:34,525 పూర్తిగా మభ్యపెట్టేలా మారిన ప్రాణులను కూడా ఇట్టే కనిపెట్టగలవు. 45 00:04:39,655 --> 00:04:41,406 పాంథర్ కమీలియన్. 46 00:04:43,450 --> 00:04:46,662 మానవ కంటిచూపు కంటే ఐదు రెట్లు స్పష్టంగా చూస్తూ... 47 00:04:47,996 --> 00:04:51,166 360 డిగ్రీల కోణంలో నిఘా వేయగల దీన్ని తప్పించుకోవడం 48 00:04:52,960 --> 00:04:54,920 అంత తేలిక కాదు. 49 00:05:05,472 --> 00:05:07,349 చూడడానికి ఎండుటాకులా కనిపించే ఇది... 50 00:05:11,186 --> 00:05:13,814 వాస్తవానికి ఒక ఘోస్ట్ మాంటిస్. 51 00:05:23,323 --> 00:05:26,285 కమీలియన్ కంటిచూపు కదలికను ఇట్టే పసిగడుతుంది. 52 00:05:32,708 --> 00:05:36,628 మాంటిస్ నిశ్చలంగా ఉంటే, అది జీవించి ఉండే అవకాశం ఉంటుంది. 53 00:05:42,759 --> 00:05:44,553 కానీ అది కూడా తినాలిగా మరి. 54 00:06:01,612 --> 00:06:03,405 కమీలియన్ లక్ష్యాన్ని ఎంచుకుని... 55 00:06:06,200 --> 00:06:09,119 తన మారణాయుధాన్ని ప్రయోగిస్తుంది. 56 00:06:13,916 --> 00:06:17,753 సెకనులో ఇరవైయవవంతులో దాని వేగం గంటకు 100కు చేరుతుంది. 57 00:06:28,555 --> 00:06:32,267 దొంగదాడి చేసే పాంథర్ నుండి కొన్ని కీటకాలు సురక్షితంగా ఉన్నాయి. 58 00:06:39,358 --> 00:06:42,653 హెల్మెట్ వాంగా బారినుండి కొన్ని బల్లులు సురక్షితంగా ఉన్నాయి... ప్రత్యేకించి 59 00:06:46,406 --> 00:06:49,326 ...అది ఇద్దరి కోసం వేటాడాల్సివస్తే. 60 00:07:04,758 --> 00:07:06,927 తన పిల్లలకు ఆహారంగా టెన్రెక్ పనికిరాదు. 61 00:07:10,514 --> 00:07:14,434 కానీ లీఫ్ టైల్డ్ గెకో సరిగ్గా సరిపోతుంది. 62 00:07:18,105 --> 00:07:19,648 అది పట్టుకోగలిగతే చాలు. 63 00:07:23,610 --> 00:07:28,407 ఈ బుల్లి బల్లికి కళాత్మకత ఎక్కువ, తప్పించుకోవడంలో దీనికి సాటి ఎవరూ లేరు. 64 00:07:31,827 --> 00:07:35,998 తన శరీర రంగు, ఆకారం చెట్టు రంగులో కలిసిపోయేలా 65 00:07:38,959 --> 00:07:41,044 సరైన కొమ్మను ఎంచుకుని... 66 00:07:44,548 --> 00:07:47,259 అందులో కలిసిపోయేలా ముసుగు వేసుకుంటుంది. 67 00:07:58,770 --> 00:08:00,772 మడగాస్కర్ అడవులు భూమ్మీది కొన్ని 68 00:08:00,856 --> 00:08:04,193 అత్యంత నిగూఢమైన జీవులకు ఆలవాలం. 69 00:08:08,530 --> 00:08:11,950 అయితే కనిపెట్టడం కష్టమైనప్పుడు, 70 00:08:12,951 --> 00:08:15,370 ఒకరినొకరు కనిపెట్టడం కూడా కష్టమే కదా. 71 00:08:20,042 --> 00:08:22,127 పిన్నీసు పరిమాణంలో ఉండే ఇది, 72 00:08:22,211 --> 00:08:25,839 ప్రపంచంలోనే అతిచిన్న కమీలియన్లలో ఒకటి. 73 00:08:27,174 --> 00:08:29,343 మగ లీఫ్ కమీలియన్. 74 00:08:30,844 --> 00:08:32,804 జత వెతికే లక్ష్యంతో బయలుదేరింది. 75 00:08:41,480 --> 00:08:43,357 అన్ని వైపులనుండీ ప్రమాదం పొంచి ఉండగా, 76 00:08:44,107 --> 00:08:45,943 అది చాలా ఓర్పుతో ఒక్కో అడుగూ వేస్తుంది. 77 00:08:49,530 --> 00:08:53,992 ఎవరికంటా పడకుండా అడుగడుగుకూ మధ్య స్థాణువులా ఉండిపోతుంది. 78 00:08:59,790 --> 00:09:06,380 ఈ కమీలియన్లు దాక్కుని ఉండడంతో, ఆడదాన్ని కనిపెట్టేందుకు మగదానికి సూపర్ పవర్ కావాలి. 79 00:09:10,342 --> 00:09:12,803 ఇతరులు చూడలేని వాటిని మగది చూడగలదు. 80 00:09:17,933 --> 00:09:20,352 ఆడదాని నుండి ప్రకాశించే వెలుగు. 81 00:09:26,233 --> 00:09:29,236 ఆమె శరీరం అతినీలలోహిత కిరణాల్ని పరావర్తనం చేస్తుంది. 82 00:09:32,573 --> 00:09:34,575 అవి అతనికి కంటికి మాత్రమే కనిపిస్తాయి. 83 00:09:40,414 --> 00:09:42,749 ఆడదాన్ని కనిపెట్టడం తేలికైన విషయం కాదు. 84 00:09:45,878 --> 00:09:47,171 దాని దగ్గరికి వెళ్ళడం... 85 00:09:49,631 --> 00:09:51,758 మరింత సవాలుతో కూడిన పని. 86 00:10:00,767 --> 00:10:03,103 ఎలాంటి మభ్యపెట్టే విద్య లేకుండా... 87 00:10:04,479 --> 00:10:06,190 టెన్రెక్ భూగర్భంలో దాక్కుంటుంది. 88 00:10:14,323 --> 00:10:18,577 వర్షాలు వచ్చేవరకూ దాక్కోడానికి దాని బుల్లి బొరియ సురక్షితమైన స్థలం. 89 00:10:21,914 --> 00:10:24,041 ఇంటిని కాస్తంత అలంకరించుకుంటే... 90 00:10:24,917 --> 00:10:26,919 ఒక కుటుంబం మొత్తానికీ చక్కగా సరిపోతుంది. 91 00:10:45,229 --> 00:10:48,732 మడగాస్కర్లోని మిల్లిపిడ్లకు దాక్కోవాల్సిన పనేలేదు. 92 00:10:50,817 --> 00:10:54,446 వాటినిండా విషం నిండి ఉన్న కారణంగా వేటగాళ్ళు దాని జోలికి పోవు. 93 00:10:56,323 --> 00:10:58,492 అవి వర్షారణ్యం మొత్తం స్వేచ్ఛగా తిరుగుతాయి. 94 00:11:03,413 --> 00:11:04,748 అధికభాగం. 95 00:11:09,545 --> 00:11:12,798 ఇంత పరిమాణంలో ఉండే లేమర్ను మిల్లిపిడ్ విషం ఏమీ చేయలేదు. 96 00:11:14,174 --> 00:11:16,677 వాటి బొచ్చులో పెరిగే పరాన్నజీవులకు 97 00:11:16,760 --> 00:11:19,388 ఈ పురుగు సరైన మందులాగా పనిచేస్తుంది. 98 00:11:29,398 --> 00:11:33,610 లేమర్లు ఒక వింత దుష్ప్రభావాన్ని కూడా కనుగొన్నాయి. 99 00:11:40,033 --> 00:11:41,243 ఒక చిన్న ముక్క కొరికితే... 100 00:11:43,453 --> 00:11:45,163 మరింత విషం విడుదలవుతుంది. 101 00:11:47,791 --> 00:11:49,543 కొద్దిపాటి మోతాదుల్లో... 102 00:11:50,210 --> 00:11:52,379 విషం వాటి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. 103 00:11:59,970 --> 00:12:02,723 మిల్లిపిడ్స్ దాదాపుగా సురక్షితంగా వదిలి వేయబడతాయి. 104 00:12:04,391 --> 00:12:07,352 కానీ పైనున్న చెట్లపై నుండి లేమర్స్... 105 00:12:08,061 --> 00:12:09,771 ఇప్పడప్పుడే కిందికి దిగవు. 106 00:12:38,884 --> 00:12:40,594 చీకటి ముసుగులో... 107 00:12:41,470 --> 00:12:45,265 పురుగుల్ని వేటాడడానికి టెన్రెక్ బయటకు వచ్చింది. 108 00:12:47,768 --> 00:12:49,811 రోజుకు అది సుమారు 50 వరకూ తింటుంది. 109 00:12:54,024 --> 00:12:58,362 దాని కంటిచూపు ఎంత తక్కువగా ఉంటుందంటే, అది వాసన సాయంతో పురుగుల్ని వెతుకుతుంది. 110 00:13:03,951 --> 00:13:07,412 కానీ ట్రీ బో పాము వాసన పసిగట్టే శక్తి మరింత శక్తివంతంగా ఉంటుంది. 111 00:13:17,965 --> 00:13:22,177 ఫోర్కులా ఉండే నాలుక సాయంతో గాలిని రుచి చూడడం ద్వారా అది ఎరను కనిపెడుతుంది. 112 00:13:37,067 --> 00:13:41,572 దగ్గరలోకి రాగానే, హీట్ సీకింగ్ మోడ్లోకి మారుతుంది. 113 00:13:43,490 --> 00:13:48,203 నోటి చుట్టూ ఉండే గుంటలు ఉష్ణోగ్రతను బట్టి ఉష్ణ రక్త ప్రాణుల్ని కనిపెడుతుంది. 114 00:14:10,392 --> 00:14:13,312 ప్రాణాంతక వేటగాళ్లకు కూడా ఒక్కోరాత్రి అదృష్టం దక్కదు. 115 00:14:16,523 --> 00:14:19,318 బహుశా పైకి వెళితే అయినా విజయం దొరుకుతుందేమో. 116 00:14:28,869 --> 00:14:31,663 కానీ టెన్రెక్ని అదృష్టం వరించింది. 117 00:14:36,710 --> 00:14:37,920 మగ టెన్రెక్. 118 00:14:42,007 --> 00:14:45,802 కేవలం రెండు నెలల వయసులోనే, టెన్రెక్లు జతకట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. 119 00:14:52,518 --> 00:14:55,187 ఈ లేమర్ మౌస్కు ఇప్పటికే పిల్లలున్నాయి. 120 00:14:58,232 --> 00:15:00,400 ప్రపంచంలోనే అతిచిన్న వానరాల్లో ఒకటి, 121 00:15:00,484 --> 00:15:04,279 బుల్లి చెట్టు తొర్రల్లో అది వాటిని సురక్షితంగా ఉంచుతుంది. 122 00:15:10,786 --> 00:15:12,913 అవి పూర్తిగా తల్లిమీదే ఆధారపడతాయి. 123 00:15:13,539 --> 00:15:15,958 కాబట్టి ఆ తల్లికి ఎంత సంపాదించగలిగితే అంత శక్తి కావాల్సి ఉంటుంది. 124 00:15:18,502 --> 00:15:20,546 తనకు ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు. 125 00:15:24,007 --> 00:15:29,221 అందుకోసం పైకి ఎక్కాలి, మౌస్ లేమర్ తన శరీర పొడవు కంటే ఎనిమిది రెట్లు దూకగలుగుతుంది. 126 00:15:42,067 --> 00:15:43,569 పెద్ద పెద్ద కళ్ళతో... 127 00:15:44,278 --> 00:15:46,113 చీకటిలో అది తేలిగ్గా దారిని వెతకగలదు. 128 00:15:51,577 --> 00:15:53,579 రాత్రిపూట స్పష్టంగా చూడగలిగే జీవుల్లో 129 00:15:53,662 --> 00:15:56,874 అత్యంత ఆసక్తికరమైనది అడవి నేలపై వేటాడుతుంది. 130 00:16:03,172 --> 00:16:08,635 మనిషి కంటే 2,000ల రెట్లు సున్నితమైన కంటిచూపు ఒగర్-ఫేస్డ్ స్పైడర్స్ సొంతం. 131 00:16:13,098 --> 00:16:15,434 సాలీళ్ళలో ఇంతపెద్ద కళ్ళు దేనికీ ఉండవు. 132 00:16:21,899 --> 00:16:24,234 అది సాలెగూడుకు బదులుగా ఒక వలను అల్లుతుంది. 133 00:16:29,448 --> 00:16:30,574 తర్వాత వేచి చూస్తుంది. 134 00:16:49,218 --> 00:16:51,970 ఇప్పుడు దాని దివ్వదృష్టి పనిచేస్తుంది. 135 00:16:56,266 --> 00:16:57,392 ప్రతి రాత్రీ, 136 00:16:57,476 --> 00:17:01,772 చీకటిలో చూసే విధంగా ఒక ప్రత్యేక కోటింగ్ దాని కళ్ళపై అభివృద్ధి చెందుతుంది. 137 00:17:19,414 --> 00:17:24,877 వేటాడేందుకు ముందువైపు స్పష్టంగా చూడగలగడం మంచి విషయం. 138 00:17:31,677 --> 00:17:37,307 రాత్రివేళల్లో, సాటానిక్ లీఫ్ టెయిల్డ్ గెకో వేటాడేందుకు బయటికి వస్తుంది, పురుగుల్నీ... 139 00:17:45,440 --> 00:17:46,608 సాలీళ్ళను కూడా. 140 00:17:56,285 --> 00:18:00,247 పైన ఎత్తులో, మౌస్ లేమర్ తనకు కావాల్సిన దాన్ని కనుక్కుంది. 141 00:18:10,048 --> 00:18:11,592 ఫ్లవర్ బగ్స్. 142 00:18:19,349 --> 00:18:23,604 వేటగాళ్ళను ఏమార్చేందుకు, ఆసక్తికరమైన ఈ బుల్లి ప్రాణులు పూల రెక్కలను అనుకరిస్తాయి. 143 00:18:37,159 --> 00:18:38,994 కానీ ఆమె వాటిని తినాలని అనుకోవడం లేదు. 144 00:18:41,330 --> 00:18:45,959 చెట్టుబెరడు నుండి కారే రసాలను తింటూ, అవి చిన్న తీపి చుక్కలను విడుదల చేస్తాయి. 145 00:18:55,719 --> 00:18:58,472 బిజీగా ఉండే తల్లికి అధిక కేలరీలు అందించే చిరుతిండి. 146 00:19:02,059 --> 00:19:04,811 కానీ ఈరాత్రి బయటకు వచ్చినవన్నీ అంత తియ్యగా ఉండవు. 147 00:19:30,879 --> 00:19:34,675 భారీగా, విచిత్రంగా ఉండే రాత్రిళ్ళు దాడిచేసే జీవి. 148 00:19:41,974 --> 00:19:43,183 అదే ఆయ్-ఆయ్. 149 00:19:46,645 --> 00:19:51,191 జానపద కథల్లో కనిపించే విచిత్రమైన లేమర్ జాతికి చెందిన రాకాసి. 150 00:19:52,442 --> 00:19:53,652 గబ్బిలాల్లాంటి చెవులు. 151 00:19:54,611 --> 00:19:56,613 ఎలుకలాంటి పళ్ళు. 152 00:20:00,242 --> 00:20:01,785 మంత్రగత్తెకు ఉండే వేలు. 153 00:20:05,372 --> 00:20:08,750 చెట్టు బెరడుపై తడుతూ లోపల ఖాళీగా ఉందేమో వింటుంది. 154 00:20:16,258 --> 00:20:18,427 అది మౌస్ లేమర్లను వేటాడడం లేదు. 155 00:20:20,387 --> 00:20:23,140 అది మరింత చిన్నవాటికోసం వెతుకుతోంది. 156 00:20:25,309 --> 00:20:26,518 అవే గ్రబ్స్. 157 00:20:29,646 --> 00:20:33,317 వంగిన దాని వేలు తవ్వి తీసేందుకు కూడా అనువైన పనిముట్టు. 158 00:20:40,407 --> 00:20:43,202 ఈ వర్షారణ్యంలో, ఎంత విచిత్రమైన పద్ధతిలో అయినా, 159 00:20:44,286 --> 00:20:46,205 పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. 160 00:21:08,477 --> 00:21:10,479 తెల్లవారి వెలుగు ఖాళీ గూటిని... 161 00:21:11,396 --> 00:21:12,606 చూపించింది. 162 00:21:19,488 --> 00:21:22,407 కానీ వాంగా బిడ్డకోసం పడిన కృషి వల్ల, అంత తేలిగ్గా ఆశ వదులుకోలేదు. 163 00:21:41,385 --> 00:21:45,305 గూటికి కాస్తంత దూరంలో, దాని పిల్ల బతికే ఉంది. 164 00:21:50,686 --> 00:21:55,524 పూర్తిగా ఎదగకముందే, పిల్లలు భయపడిపోయి ఒక్కోసారి గూట్లోంచి ఎరిగి పోతాయి. 165 00:22:04,867 --> 00:22:09,580 సొంతగా బ్రతకగలదని నిర్ధారించుకునే వరకూ, తల్లి దాని బాగోగులు చూస్తుంది. 166 00:22:28,307 --> 00:22:29,308 చివరికి... 167 00:22:32,311 --> 00:22:33,937 వర్షాకాలం వచ్చేసింది. 168 00:22:57,878 --> 00:23:00,589 వర్షారణ్యం రూపురేఖల్ని నీరు మార్చివేస్తుంది. 169 00:23:07,054 --> 00:23:08,555 కొత్త జీవాన్ని చిగురింపజేస్తుంది. 170 00:23:16,939 --> 00:23:18,357 కొత్త ఆహారం కూడా. 171 00:23:24,571 --> 00:23:29,660 ఆకులు పచ్చదనంతో తొణికిసలాడగానే, మభ్యపెట్టడంలో కొత్త ధోరణి మొదలవుతుంది. 172 00:23:36,625 --> 00:23:39,795 కానీ వర్షారణ్యంలో కొన్ని విషయాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. 173 00:23:43,924 --> 00:23:50,264 ఇప్పటి వరకూ మనగలిగిన ప్రాణులు ఇప్పుడు మరింత పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాలి. 174 00:23:52,182 --> 00:23:57,855 వర్షాలు రాగానే, సంతానోత్పత్తి చేసే అన్ని రకాల జీవుల్లో జతల కోసం పోటీ మొదలవుతుంది. 175 00:24:07,114 --> 00:24:10,242 మగ జిరాఫీ వీవిల్స్ తమ పొడవాటి మెడలతో 176 00:24:10,742 --> 00:24:14,621 ఆడదానికోసం యుద్ధభూమిలో తలపడతాయి. 177 00:24:23,046 --> 00:24:25,799 బటానీ గింజ పరిమాణంలో జరిగే పోటీల్లో గాయలపాలవడం అరుదుగానే జరుగుతుంది. 178 00:24:28,552 --> 00:24:33,724 కానీ రెండు పాంథర్ కమీలియన్లు తలపడితే మాత్రం పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. 179 00:24:43,066 --> 00:24:44,776 అవి ప్రకాశవంతమైన రంగుల్లోకి మారతాయి. 180 00:24:46,737 --> 00:24:48,238 అది మభ్యపెట్టే చర్య కాదు. 181 00:24:50,490 --> 00:24:51,992 యుద్ధం ముందు పూసుకునే రంగు. 182 00:24:54,786 --> 00:24:58,415 జతను గెలవాలంటే భూభాగం కోసం జరిగే యుద్ధాలు చాలా ప్రధానమైనవి. 183 00:25:29,363 --> 00:25:31,823 విజేత ఈ చెట్టుని తనదిగా ప్రకటించుకుంటుంది. 184 00:25:33,534 --> 00:25:35,369 ఓడినవాడు మరోచోటు చూసుకోక తప్పదు. 185 00:25:39,456 --> 00:25:41,500 పోటీలో గెలవడం కేవలం ప్రారంభం మాత్రమే. 186 00:25:43,418 --> 00:25:46,129 జతను కాపాడుకోగలగడం మరింత కష్టమైన విషయం. 187 00:25:56,056 --> 00:25:58,392 లిటిల్ లీఫ్ కమీలియన్ పురోగతి సాధిస్తోంది. 188 00:26:02,646 --> 00:26:03,981 పక్కనే ఉన్నప్పటికీ... 189 00:26:04,773 --> 00:26:06,233 ఇంకా దూరంగానే ఉంది. 190 00:26:10,737 --> 00:26:11,905 వాంగా. 191 00:26:13,782 --> 00:26:16,201 ఎప్పటికంటే జాగ్రత్తగా అడుగేయాల్సి ఉంటుంది. 192 00:26:27,713 --> 00:26:29,131 ఇక్కడ చూడడానికి ఏమీ లేదు. 193 00:26:32,301 --> 00:26:36,180 రెండు క్లాన్డెస్టైన్ కమీలియన్లు ఆకుల అడుగున రహస్యంగా కలుసుకుంటున్నాయి. 194 00:26:40,851 --> 00:26:44,521 జత దొరికింది, మరో తరాన్ని వృద్ధి చేసే సమయం వచ్చింది. 195 00:26:48,901 --> 00:26:53,280 ఆడ జిరాఫీ వీవిల్ తన గుడ్లను కాపాడుకునేందుకు ఎంతో కృషి చేస్తుంది. 196 00:26:56,700 --> 00:26:58,160 మగది కాపలా కాస్తుంది... 197 00:26:59,119 --> 00:27:02,289 ఆడది ఆకు మడతలో ఒక్కో గుడ్డునూ పెడుతుంది. 198 00:27:09,838 --> 00:27:12,633 ఇప్పుడిక తన మెడకు పని కల్పిస్తుంది. 199 00:27:17,429 --> 00:27:20,182 అత్యద్భుతమైన బలాన్ని ప్రదర్శిస్తూ, 200 00:27:20,265 --> 00:27:25,354 ఈ సూపర్ మామ్ తన పరిమాణంకంటే పదిరెట్లు పెద్దదైన ఆకును చుట్టగా చుడుతుంది. 201 00:27:32,986 --> 00:27:34,196 తర్వాత దాన్ని ఆరుబయటే... 202 00:27:37,282 --> 00:27:38,867 దాచిపెడుతుంది. 203 00:27:48,710 --> 00:27:50,838 బుల్లి టెన్రెక్ మరింత బిజీ అయిపోయింది. 204 00:27:56,009 --> 00:28:00,639 తన తల్లిని వదిలిన నాలుగు నెలలలోనే, దాని బొరియ నిండిపోయింది. 205 00:28:04,852 --> 00:28:06,854 ఒక్కసారే మూడు పిల్లలు. 206 00:28:08,438 --> 00:28:10,858 టెన్రెక్లు చూడడానికి హత్తుకునేలా ఉండకపోవచ్చు... 207 00:28:12,818 --> 00:28:14,736 కానీ మొదటి రెండు వారాల్లో, 208 00:28:14,820 --> 00:28:18,782 ఒళ్ళంతా ముళ్ళున్న ఈ బుల్లి జీవులు వెచ్చగా ఉండేందుకు ఒకదాన్నొకటి హత్తుకుని ఉంటాయి. 209 00:28:34,464 --> 00:28:38,552 అలాగే అడవిని అన్వేషించడం మొదలు పెట్టినపుడుకూడా, అవి ఒక్కటిగానే ఉండాలి. 210 00:28:41,388 --> 00:28:46,977 ఈ ప్రమాదకర ప్రపంచంలో తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచేదెలాగో తల్లికి అనుభవమే. 211 00:28:50,856 --> 00:28:52,274 కానీ ఒకటి ఎప్పుడూ... 212 00:28:53,317 --> 00:28:54,818 వెనకబడిపోతుంది. 213 00:29:16,548 --> 00:29:19,009 దాక్కోవాలని ఆ బుల్లి పిల్లకి సహజంగానే తెలుసు. 214 00:29:24,806 --> 00:29:29,770 కానీ ఎలాగోలా, ఫోసా కంట్లో పడకుండా తన బిడ్డను తిరిగి తేవాల్సి ఉంటుంది. 215 00:29:42,449 --> 00:29:45,452 వీపుపై ఉన్న ప్రత్యేకమైన వెన్నెముకలను రుద్దడం ద్వారా, 216 00:29:45,536 --> 00:29:48,121 ఇంటికి రమ్మని ఒక రహస్య సందేశాన్ని తల్లి పంపిస్తుంది. 217 00:29:55,879 --> 00:29:58,924 ఈ హై-ఫ్రీక్వెన్సీ శబ్దం తన బిడ్డకు చేరుతుంది. 218 00:30:00,884 --> 00:30:02,469 తప్పిపోయిన బిడ్డ సురక్షిత ప్రాంతానికి 219 00:30:03,136 --> 00:30:04,346 వెళ్ళేలా దిశానిర్దేశం చేస్తుంది. 220 00:30:10,435 --> 00:30:16,149 చూడబోతే, చివరికి బుల్లి టెన్రెక్కు కూడా సొంత సూపర్ పవర్ ఉంది. 221 00:30:31,039 --> 00:30:34,710 మడగాస్కర్ లోని చిట్టి ప్రాణులు, ఈ వింత ప్రపంచంలో 222 00:30:36,920 --> 00:30:38,130 మనగలగడం కోసం... 223 00:30:39,464 --> 00:30:41,383 విచిత్రమైన పద్ధతిలో పరిణామం చెందాయి. 224 00:30:52,895 --> 00:30:56,356 కానీ వాటి శక్తి ఎంత మాత్రం సరిపోని ఒక ముప్పు పొంచి ఉంది. 225 00:31:06,408 --> 00:31:10,913 ఒకప్పుడు విస్తారంగా ఉన్న మడగాస్కర్ వర్షారణ్యం అటవీ నిర్మూలన కారణంగా... 226 00:31:12,456 --> 00:31:15,250 కుదించుకుపోతూ, విచ్చిన్నమైన ప్రపంచంగా మారుతోంది. 227 00:31:18,337 --> 00:31:20,214 ఎనభై శాతం ఇప్పటికే నాశనమై పోయింది. 228 00:31:25,636 --> 00:31:26,970 కానీ ఒక్కొక్కటిగా మనం... 229 00:31:30,974 --> 00:31:33,435 విధ్వంసం దిశను మార్చి... 230 00:31:39,149 --> 00:31:43,904 ఈ అజ్ఞాత ప్రపంచాన్ని పునర్నిర్మించవచ్చు. 231 00:32:35,038 --> 00:32:37,040 సబ్ టైటిల్స్ అనువదించినది: రాధ