1 00:00:07,257 --> 00:00:09,837 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,676 జీవితంలో చిన్న చిన్నవాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,426 కానీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి... 4 00:00:18,101 --> 00:00:20,561 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,978 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,815 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,409 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,118 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:51,093 --> 00:00:53,053 పాల్ రడ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు 10 00:00:53,136 --> 00:00:57,266 ఆస్ట్రేలియా, అనేక అద్భుతమైన జీవులకు పుట్టినిల్లు. 11 00:00:59,226 --> 00:01:02,226 కేవలం కంగారూలు, కోలాలు మాత్రమే కాదు. 12 00:01:05,566 --> 00:01:10,196 ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లలో, ఇక్కడి వన్య ప్రపంచం, ఈ మండుటెండల ప్రాంతంలో 13 00:01:11,321 --> 00:01:12,871 జీవించడం మీద పట్టు సాధించిన... 14 00:01:15,284 --> 00:01:17,334 విచిత్రమైన చిట్టి జంతువులతో నిండి ఉంటుంది. 15 00:01:20,998 --> 00:01:23,378 అరచేతి పరిమాణంలో ఉండే షుగర్ గ్లైడర్, 16 00:01:23,458 --> 00:01:27,548 ఈ బంక చెట్ల మధ్య దానికి కావలసిన ఆహారాన్ని, ఆవాసాన్ని చక్కగా ఏర్పర్చుకుంటుంది. 17 00:01:32,634 --> 00:01:34,474 అలాగే దాని పరిసరాలలో ఉండే జీవులు కూడా. 18 00:01:39,516 --> 00:01:42,896 కానీ సమయం ఎంత అనుకూలంగా ఉన్నా, సవాళ్ళు అనేవి ఉంటూనే ఉంటాయి. 19 00:01:48,609 --> 00:01:52,859 ఇక వేసవి కాలం వచ్చి, సూర్యుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపినప్పుడు... 20 00:01:52,946 --> 00:01:54,526 నేటి అగ్గి రాజుకొనే అవకాశమున్న రేటింగ్ అధికం 21 00:01:57,159 --> 00:01:58,989 ...ఆ వేడిమిని తట్టుకోగల జీవులే 22 00:02:04,333 --> 00:02:05,963 ఆ కష్టకాలాన్ని అధిగమించగలవు. 23 00:02:14,426 --> 00:02:19,216 అవుట్‌బ్యాక్ 24 00:02:22,100 --> 00:02:26,270 జీవం ఉనికి ఉన్న అత్యంత పొడి ఖండంలో జీవించడంలో కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. 25 00:02:27,981 --> 00:02:33,901 ఎండ ఎక్కువగా కాయడం వలన బంక చెట్లు చక్కెరను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తాయి. 26 00:02:38,867 --> 00:02:42,447 వసంతంలో, చిట్టి షుగర్ గ్లైడర్ అధికంగా ఈ చక్కరనే తీసుకుంటుంది. 27 00:02:48,085 --> 00:02:51,085 ప్రస్తుతానికి, జీవితం మామూలుగా సాగిపోతోంది. 28 00:02:51,713 --> 00:02:55,973 బంక చెట్ల మధ్య ఎగురుతూ, ఎక్కడెక్కడ తీపి ఆహారం దొరుకుతుందా అని వెతుకుతుంటుంది. 29 00:02:59,221 --> 00:03:04,141 ఒక్క ఉదుటున, అది రెండు టెన్నిస్ కోర్టులంత దూరం ఎగరగలదు. 30 00:03:12,860 --> 00:03:15,950 ఈ చక్కెర, రైన్బో లారికీట్ పక్షులను కూడా ఆకర్షిస్తుంది. 31 00:03:16,613 --> 00:03:17,743 అవి వందల్లో వచ్చాయి. 32 00:03:25,622 --> 00:03:27,712 అన్ని జీవులకీ సరిపడినంత ఆహారం అక్కడ ఉంది. 33 00:03:30,127 --> 00:03:33,547 కాబట్టి, బాగా వేడిగా ఉన్న ఉదయం పూట, అది ఆహారాన్ని ఆ పక్షులకే వదిలేసి... 34 00:03:35,465 --> 00:03:37,795 హాయిగా ఒక చోట విశ్రాంతి తీసుకుంటుంది. 35 00:03:41,388 --> 00:03:45,178 దాని కొత్త పిల్ల, అది పుట్టి రెండు వారాలే అవుతుంది. 36 00:03:53,400 --> 00:03:55,190 ఆ పిల్ల మన బొటన వేలంత పొడవు ఉంటుంది, అంతే. 37 00:03:56,945 --> 00:03:59,565 అది పూర్తిగా తన తల్లి మీదనే ఆధారపడుతుంది. 38 00:04:02,075 --> 00:04:05,785 కానీ వేసవి సగం గడిచేసరికి, మరింత సవాలుతో కూడిన ప్రపంచంలో... 39 00:04:07,080 --> 00:04:09,580 ఆ పిల్ల తన బతుకు తానే బతకాల్సి వస్తుంది. 40 00:04:15,464 --> 00:04:17,804 ప్రస్తుతానికి, ఇక్కడ జీవితం హాయిగా ఉంది, 41 00:04:18,509 --> 00:04:21,389 లారికీట్ పక్షులు ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాయి. 42 00:04:25,807 --> 00:04:27,557 కానీ ఒక గూడును కనుగొనడం అంత తేలిక కాదు. 43 00:04:31,647 --> 00:04:35,107 చెట్లకు రంధ్రాలు పెట్టడానికి ఆస్ట్రేలియాలో వడ్రంగిపిట్టలు ఉండవు. 44 00:04:38,195 --> 00:04:41,405 కాబట్టి, దాచబడినట్లుగా ఉండే సురక్షితమైన ఆవాసాలకు గిరాకీ బాగా ఎక్కువ 45 00:04:49,873 --> 00:04:54,423 ఇతర జంతువులను క్రూరంగా చంపే ఒక భయంకరమైన జంతువు. 46 00:04:56,755 --> 00:04:59,465 లేస్ మానిటర్ ల బరువు, పసి పిల్లల బరువు అంత ఉంటుంది, 47 00:05:01,093 --> 00:05:03,933 అవి దాదాపు వేటినైనా తినేస్తాయి. 48 00:05:12,646 --> 00:05:14,186 దాని బరువులో రవ్వంత ఉండే 49 00:05:15,148 --> 00:05:19,148 ఒక ఫ్రిల్డ్ బల్లి, ఈ భారీ జంతువుకు చాలా సులువుగా ఆహారం కాగలదు. 50 00:05:25,868 --> 00:05:27,738 దీనికి దాక్కోవడానికి ఒక చెట్టు కావాలి. 51 00:05:32,124 --> 00:05:33,754 కానీ ఏ చెట్టూ ఖాళీగా లేదు. 52 00:05:38,839 --> 00:05:41,839 ఫ్రిల్డ్ బల్లులు, తమ పరిధి విషయంలో చాలా దూకుడుగా ఉంటాయి. 53 00:05:45,053 --> 00:05:46,723 తలని పైకీ కిందికీ అంటుందంటే, అది హెచ్చరిక అన్నమాట. 54 00:05:52,352 --> 00:05:55,112 కానీ కొత్తగా వచ్చిన ఈ బల్లికి వెళ్లడానికి వేరేచోటు అంటూ ఏదీ లేదు. 55 00:06:01,153 --> 00:06:06,203 గాయలపాలవ్వకుండా ఉండటానికి, ఈ బల్లులు తమ మెడల కుచ్చిళ్లతో కొట్టుకుంటాయి. 56 00:06:10,120 --> 00:06:11,710 ఎంత ప్రకాశవంతంగా ఉంటే, అంత మంచిది. 57 00:06:13,707 --> 00:06:15,417 కానీ ఆ రెండూ దాదాపుగా ఒకేలాగా ఉంటే... 58 00:06:15,959 --> 00:06:16,959 అవి బాహాబాహికి దిగుతాయి. 59 00:06:29,264 --> 00:06:31,564 కొత్తగా వచ్చిన బల్లి, అంత దృఢమైనదిగా అనిపించడం లేదు. 60 00:06:41,610 --> 00:06:43,740 పరాజయంతో భయపడి పలాయనం చిత్తగించింది అది, 61 00:06:45,531 --> 00:06:47,571 ఇప్పటికే ఉన్న బల్లి దాన్ని తరిమి కొట్టేసింది. 62 00:06:58,043 --> 00:07:00,003 తన కంటే బలమైన మగ బల్లి ద్వారా తరిమేయబడింది కనుక, 63 00:07:01,463 --> 00:07:03,173 ఈ బల్లి ప్రస్తుతానికి దీనితో సరిపెట్టుకోవాలి. 64 00:07:04,299 --> 00:07:08,179 కానీ త్వరలోనే, దీనికి మరింత సురక్షితమైన స్థలం అవసరం అవుతుంది. 65 00:07:10,973 --> 00:07:13,103 ముందు మరింత కష్ట కాలం పొంచి ఉంది. 66 00:07:17,604 --> 00:07:19,984 చీమలు ఇప్పటికే ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలో బిజీ అయిపోయాయి. 67 00:07:22,109 --> 00:07:24,189 కానీ ఆహార వేట అనేది ప్రమాదకరమైనది కావచ్చు. 68 00:07:25,279 --> 00:07:29,279 అవుట్‌బ్యాక్ అంతా చిత్రవిచిత్రమైన జీవులతో నిండి ఉంటుంది. 69 00:07:33,370 --> 00:07:35,500 పెద్ద పెద్ద గోళ్ళతో... 70 00:07:39,126 --> 00:07:43,456 ముళ్ళతో, ఇంకా బంకగా ఉండే ఒక పొడవాటి నాలుక ఉన్న జంతువు 71 00:07:46,758 --> 00:07:47,798 ఎకిడ్నా. 72 00:07:51,471 --> 00:07:53,681 చూడటానికి మరీ అంత భయంకరంగా ఉండకపోవచ్చు. 73 00:07:55,726 --> 00:07:57,936 కానీ చీమలకు మాత్రం, ఇది యమునికి ప్రతిరూపం. 74 00:08:02,816 --> 00:08:06,236 పది నిమిషాలలో ఇది 60,000 చీమలను హాంఫట్ చేసేయగలదు. 75 00:08:12,576 --> 00:08:15,496 చెట్లలో తినడం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. 76 00:08:20,542 --> 00:08:23,092 బంక ఆకుల నిండా విష పదార్థాలు ఉంటాయి, 77 00:08:23,170 --> 00:08:25,880 వాటిని తినగలిగే అతికొద్ది క్షీరదాలలో కోలా కూడా ఒకటి. 78 00:08:38,477 --> 00:08:41,097 కానీ వాటిని అరిగించుకోవడానికి కోలాలకు చాలా సమయం పడుతుంది... 79 00:08:41,772 --> 00:08:45,232 అవి ఒక రోజులో 15 గంటలు నిద్రలోనే గడుపుతాయి. 80 00:08:47,819 --> 00:08:50,659 అవి మేల్కొని ఉన్నప్పుడు కూడా మత్తుమత్తుగా ఉంటాయి. 81 00:08:56,286 --> 00:08:57,746 ఇది కల కాదు. 82 00:09:04,086 --> 00:09:05,706 ఇది నిజమైన జంతువే. 83 00:09:10,968 --> 00:09:12,968 దీని పేరు మ్యాడ్ హాటర్పిల్లర్. 84 00:09:13,679 --> 00:09:20,559 ప్రస్తుతం ఉన్న తన తల మీద, ఇంతకు ముందు వదిలేసిన తలల చర్మాన్ని ఉంచుకుంటుంది. 85 00:09:23,021 --> 00:09:25,691 వింతగానే ఉంటుంది, కానీ ఇది దాని ప్రాణాన్ని కాపాడుతుంది. 86 00:09:30,487 --> 00:09:35,827 అసాసిన్ బగ్స్, విషంతో ఇతర వాటిని చంపుతాయి, అది వాటి లోపలి అవయవాలను ద్రవంలా చేస్తుంది. 87 00:09:43,792 --> 00:09:45,462 కానీ దీనికి ఉన్న విచిత్రమైన మారువేషంతో, 88 00:09:46,086 --> 00:09:50,216 మ్యాడ్ హాటర్పిల్లర్, దాని శత్రువులను బోల్తా కొట్టించగలదు. 89 00:09:58,682 --> 00:10:02,312 బంక ఆకులను అరిగించుకోవడంలో చిట్టి జీవులు మరింత మేలు అని చెప్పుకోవచ్చు. 90 00:10:06,648 --> 00:10:09,398 ప్రిక్లీ స్టిక్ పురుగు, చూడటానికి బంక ఆకులాగానే ఉంటుంది. 91 00:10:11,737 --> 00:10:16,327 పరిసరాలతో చక్కగా కలిసిపోతుంది, దానితో అది ఆహారం కాకుండా ఆహారాన్ని తినగలదు. 92 00:10:18,076 --> 00:10:22,246 ఒకరోజుకు, అది ఎంత బరువు ఉందో అంత బరువు వరకూ ఆకులను తినగలదు. 93 00:10:29,588 --> 00:10:31,168 పిల్లలను చూసుకొనే సమయం దానికి అస్సలు ఉండదు. 94 00:10:34,092 --> 00:10:36,512 అందుకని, ఆ పనిని అది వేరేవాటికి అప్పగిస్తుంది. 95 00:10:53,987 --> 00:10:55,987 నోరూరించే గింజలను తలపించే 96 00:10:57,366 --> 00:11:00,446 దాని గుడ్లను, విషయం తెలియని చీమలు మోసుకొని వెళ్లిపోతాయి. 97 00:11:03,747 --> 00:11:06,287 కానీ గుడ్డు పై భాగం వరకే తినవచ్చు. 98 00:11:06,875 --> 00:11:08,995 మిగిలినది గూడులోకి పారేయబడుతుంది. 99 00:11:11,672 --> 00:11:13,172 ఇంక గుడ్డు అక్కడ... 100 00:11:14,842 --> 00:11:17,932 పొదిగే దాకా కొన్ని నెలల వరకూ... 101 00:11:18,387 --> 00:11:20,257 భూగర్భంలో సురక్షితంగా ఉంటుంది. 102 00:11:28,313 --> 00:11:29,863 సూర్యుడు తాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. 103 00:11:33,652 --> 00:11:37,032 షుగర్ గ్లైడర్ పొరుగు జీవులు బాగా ఎక్కువగా గోల చేస్తున్నాయి. 104 00:11:44,746 --> 00:11:46,866 కానీ అవి ఎప్పుడూ కూసే కిచకిచలు కావు. 105 00:11:49,710 --> 00:11:51,250 అదొక హెచ్చరిక. 106 00:11:59,011 --> 00:12:00,801 ఎండ ద్వారా శక్తిని పొందినదయి, 107 00:12:01,263 --> 00:12:04,273 లేస్ మానిటర్ ఒక భయంకరమైన వేటాడే జంతువులా మారుతుంది. 108 00:12:07,686 --> 00:12:12,436 దాని రెండు నాలుకలు, అది వేటాడే జంతువు ఎక్కడ దాక్కున్నా దాని అచూకీని కనిపెడతాయి. 109 00:12:23,785 --> 00:12:29,245 దీనికి ఉన్న శక్తివంతమైన వంపుగా ఉండే గోళ్లతో, ఇది చెట్లను కూడా ఎక్కేయగలదు. 110 00:12:39,009 --> 00:12:41,929 గ్లైడర్ పిల్ల, ఇప్పుడు మోయలేనంత పెద్దది అయింది. 111 00:13:01,782 --> 00:13:05,042 తొందరలోనే, ఈ లోకంలో అది తన సొంతంగా జీవనయానం సాగించాల్సి ఉంటుంది. 112 00:13:13,961 --> 00:13:17,261 రోజురోజుకూ ప్రమాదకరంగా మారే లోకంలో అన్నమాట. 113 00:13:27,766 --> 00:13:31,896 వేసవి ప్రారంభ రోజుల్లోనే, అవుట్‌బ్యాక్ ప్రాంతమంతా ఎండతో మండిపోతోంది. 114 00:13:34,898 --> 00:13:36,728 ఎండ నుండి తప్పించుకోవడానికి నీడ తక్కువగా ఉంది... 115 00:13:39,653 --> 00:13:41,743 తాగడానికి కూడా నీటి కొరత ఉంది. 116 00:13:53,000 --> 00:13:56,630 తోర్నీ డెవిల్, ఒక పెన్సిల్ అంత ఉంటుంది, అంతే, 117 00:13:57,546 --> 00:14:00,756 తన దేహంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు దీని వద్ద భలే చిట్కా ఉంది. 118 00:14:06,680 --> 00:14:11,270 ఇదంత త్వరిత పరిష్కారమేమీ కాదు, కానీ నీటి కోసం చూసేటప్పుడు సమయం గడిచినా పర్వాలేదు . 119 00:14:23,030 --> 00:14:28,870 ఎక్కడైనా కాసిన్ని నీరు కనిపిస్తే, ఇది అందులోకి వెళ్లి నిలబడుతుంది, అంతే. 120 00:14:41,882 --> 00:14:46,222 దీని ముళ్ళ మధ్య ఉన్న చిన్ని చిన్ని ఖాళీ ప్రదేశాలు, నీటిని పైకి లాగుతాయి. 121 00:14:47,596 --> 00:14:50,926 దాని నోటి దాకా లాగుతాయి. 122 00:14:56,605 --> 00:14:58,225 ఈ అద్భుతమైన చిట్కా వలన 123 00:14:58,690 --> 00:15:02,990 మండే ఉష్ణోగ్రతలను కూడా ఈ చిన్ని డెవిల్ తట్టుకోని నిలబడగలదు. 124 00:15:10,994 --> 00:15:13,834 ఈ బంక వృక్షాల అడవిలో కాస్తంత నీడ దొరుకుతుంది. 125 00:15:14,665 --> 00:15:15,955 కానీ ఇక్కడ కూడా, 126 00:15:16,583 --> 00:15:19,593 తమ జీవితాలను పరిపూర్ణం చేసుకుందామని ఈ చిట్టి జీవులన్నీ ఆత్రంగా ఉన్నాయి. 127 00:15:25,175 --> 00:15:29,555 ఒక మగ మెరిచే పీకాక్ సాలీడు తోడు కోసం వెతుకుతోంది. 128 00:15:32,975 --> 00:15:34,595 ఇది చెప్పడం తేలికే, కానీ చేయడమే కష్టం. 129 00:15:38,939 --> 00:15:41,569 ఇది ఒక కంది పప్పు అంత పరిమాణంలో ఉంటుంది, అంతే. 130 00:15:45,988 --> 00:15:52,158 ఇంకో మగ సాలీడు ఒక ఆడ సాలీడును ముందుగానే కనిపెట్టింది, కానీ అది దాన్ని మెప్పించాలి. 131 00:15:54,705 --> 00:15:57,535 ఆడ పీకాక్ సాలీడ్లు, జాగ్రత్తగా గమనించి ఎంచుకుంటాయి. 132 00:16:03,046 --> 00:16:07,836 మగ సాలీడు రూపు, దాని చిందులు అన్నీ సరిగ్గా ఉండాలి. 133 00:16:10,554 --> 00:16:11,764 ఎక్కడైనా పొరపాటు జరిగితే... 134 00:16:14,600 --> 00:16:15,890 తిరస్కారం తప్పదు. 135 00:16:22,024 --> 00:16:25,244 పీకాక్ సాలీడులలో 80కు పైగా విభిన్న రకాలు ఉన్నాయి, 136 00:16:26,069 --> 00:16:27,909 ఒక్కొక్క రకానిది ఒక్కో రకమైన ప్రదర్శన... 137 00:16:30,199 --> 00:16:34,329 ఆ జాతిలోని ఆడ సాలీడుకు నచ్చిన విధంగా ఆ చిందులు ఉంటాయి అన్నమాట. 138 00:16:51,220 --> 00:16:54,140 తనని కూడా తినగల ఆడ సాలీడు యొక్క సాంగత్యం కోరుకునేటప్పుడు 139 00:16:54,890 --> 00:16:56,560 మగ సాలీడు తన జీవితం దాని మీదనే ఆధారపడినట్టుగా చిందులేస్తుంది. 140 00:17:04,316 --> 00:17:06,896 కానీ ఈ మెరిచే మగ సాలీడు తోడు కోసం ఇంకా వెతుకుతూనే ఉంది. 141 00:17:07,944 --> 00:17:11,824 తన కాళ్ళని గాల్లోకి ఊపుతూ, ఆడ వాసన కోసం వెతుకుతోంది. 142 00:17:19,414 --> 00:17:20,624 ఆడ సాలీడు కనబడింది. 143 00:17:21,708 --> 00:17:23,378 మగ సాలీడు తన సత్తా చాటవలసిన సమయం వచ్చేసింది. 144 00:17:44,064 --> 00:17:45,364 మగ సాలీడు చిందులను బాగా వేస్తోంది... 145 00:17:47,234 --> 00:17:49,654 ఆడ సాలీడుకు అది నచ్చినట్టు ఉంది. 146 00:17:50,904 --> 00:17:56,374 పిరుదులను ఊపుతుందంటే, అది ఇంతకు ముందే సంభోగంలో పాల్గొందని సూచిస్తుంది అన్నమాట. 147 00:18:03,000 --> 00:18:05,210 మగ సాలీడు సమయం వృధా చేసుకుంది. 148 00:18:08,297 --> 00:18:11,087 సమయం మించిపోతోంది. 149 00:18:22,227 --> 00:18:23,767 కొన్ని వారాలలోనే, 150 00:18:23,854 --> 00:18:27,734 ఈ గ్లైడర్ పిల్ల, ఈ వింత ప్రపంచంలో తన కాళ్ళ మీద తను నిలబడి... 151 00:18:30,527 --> 00:18:32,607 అహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. 152 00:18:47,169 --> 00:18:48,669 ఏడాదిలోని ఈ సమయంలో, 153 00:18:48,754 --> 00:18:51,424 బంక చెట్ల ఆకుల మీద చిత్రవిచిత్రమైన చుక్కలు దర్శనమిస్తాయి. 154 00:18:54,092 --> 00:18:56,222 సిలిడ్ పురుగులు, తమ చక్కెర సారంతో 155 00:18:56,303 --> 00:18:59,933 గూళ్లని కట్టుకుంటాయి, ఇవి బియ్యపు గింజ అంత పరిమాణంలో ఉంటాయి. 156 00:19:04,353 --> 00:19:08,653 ఈ చిన్ని చిన్ని మిఠాయి ఇళ్లు ఎంతో కళాత్మకంగా నిర్మించినట్టు ఉంటాయి. 157 00:19:14,780 --> 00:19:16,030 వీటి రుచి కూడా బాగానే ఉంటుంది. 158 00:19:20,744 --> 00:19:25,464 కానీ ఇప్పుడు, తెల్లవార్లు కూడా ఎండ తీవ్రంగా ఉంటుంది, బయట సంచరించడం కష్టం. 159 00:19:29,962 --> 00:19:35,592 ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకోగానే, బంక చెట్ల ఆకులు వాడిపోయి, రాలిపోతాయి. 160 00:19:39,137 --> 00:19:44,387 కానీ వాటి నిండా విష రసాయనాలు ఉంటాయి కాబట్టి అవి చాలా నిదానంగా క్షీణిస్తాయి. 161 00:19:49,189 --> 00:19:53,859 రాలిన పెద్ద ఆకులు, వేటాడే జిత్తులమారి జంతువులకు కనబడకుండా ఉండటానికి పనికొస్తాయి. 162 00:19:59,116 --> 00:20:05,616 బర్టన్స్ లెగ్ లెస్ బల్లి, ఎక్కువగా ఇతర సరీసృపాలను వేటాడుతుంది. 163 00:20:21,180 --> 00:20:23,390 చాలా వరకు జీవులు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని పారిపోతాయి. 164 00:20:31,315 --> 00:20:33,315 కానీ గోల్డెన్ టెయిల్డ్ బల్లి మాత్రం పారిపోదు. 165 00:20:36,361 --> 00:20:40,071 చిన్నగా, పరిసరాలతో కలిసిపోయేదిలా ఉంటుంది కనుక, కాస్త సురక్షితంగానే ఉంటుంది... 166 00:20:42,659 --> 00:20:44,079 కానీ సూర్యుడి నుండి కాదులెండి. 167 00:20:46,163 --> 00:20:47,583 దానికి నీడ అవసరం. 168 00:20:48,415 --> 00:20:53,795 క్రెడిట్ కార్డ్ అంత పొడవు మాత్రమే ఉంటుంది కనుక, అక్కడ ఇది సరిగ్గా సరిపోతుంది. 169 00:21:06,183 --> 00:21:10,313 లెగ్ లెస్ బల్లుల కళ్లు, ఎంత చిన్న కదలికను అయినా పసిగట్టగలవు. 170 00:21:35,212 --> 00:21:39,882 తను ప్రమాదంలో ఉంది అని ఈ చిట్టి బల్లికి అనిపించినప్పుడు అది ఉగ్రరూపం దాల్చుతుంది. 171 00:21:52,312 --> 00:21:53,942 జిగడ పదార్థాన్ని విరజిమ్మే బల్లి. 172 00:22:02,030 --> 00:22:06,370 అ ద్రవం వల్ల ఏ ప్రమాదమూ లేదు, కానీ బాగా బంకగా, దుర్గంధంతో ఉంటుంది, 173 00:22:07,452 --> 00:22:10,292 ఎంతటి భయంకరమైన వేటాడే జీవిని అయినా ఇది తరిమికొట్టగలదు. 174 00:22:25,304 --> 00:22:26,684 నిదానంగా కానీ ఖచ్చితంగా... 175 00:22:28,724 --> 00:22:29,984 ఇది నీడకి చేరుకుంటుంది. 176 00:22:44,781 --> 00:22:48,081 వేసవి ఎండతో పాటే వేసవి తుఫానులు వస్తాయి. 177 00:22:54,666 --> 00:22:56,336 వాతావరణం ఎంత వేడిగా ఉంటుందంటే, 178 00:22:57,252 --> 00:23:01,382 మొదట పడే వాన చినుకులు, నేలను తాకక ముందే ఆవిరి అయిపోతాయి. 179 00:23:06,470 --> 00:23:11,100 కానీ పిడుగు పడినప్పుడు, వాడిపోయిన ఆకులన్నింటిలో నిప్పు రాజుకుంటుంది. 180 00:23:12,184 --> 00:23:15,194 ఇక వాటిలో ఉండే ఆవిరయ్యే గుణమున్న రసాయనాల వలన మంటలు పుడతాయి. 181 00:23:30,536 --> 00:23:34,666 శరవేగంగా దూసుకొస్తున్న కార్చిచ్చు నుండి బయటపడటం చిన్న జీవులకు ఒక సవాలు వంటిది. 182 00:23:40,504 --> 00:23:43,554 ఎకిడ్నాకు నేల కిందికి వెళ్లడం తప్ప మరో దారి లేదు. 183 00:23:47,970 --> 00:23:50,310 అది తనని ఖననం చేసే గొయ్యే కావచ్చు. 184 00:23:54,268 --> 00:23:55,688 జ్వాలలు పైకిపైకి వస్తున్నాయి, 185 00:23:57,396 --> 00:24:00,396 కానీ ఇప్పుడు గ్లైడర్ పిల్ల, మోసుకెళ్ళలేనంత పెద్దది అయింది. 186 00:24:02,276 --> 00:24:03,526 దాని తల్లికి ఉన్న ఏకైక దారి... 187 00:24:05,362 --> 00:24:06,912 దాని ప్రాణాలను అది కాపాడుకోవడం. 188 00:24:13,287 --> 00:24:15,457 ఇప్పుడు ఈ గ్లైడర్ పిల్లకు అండగా ఏదీ లేదు. 189 00:24:44,735 --> 00:24:48,195 పురుగులు పారిపోయే పనిలో ఉండగా, వేటాడే జీవులు రంగప్రవేశం చేస్తాయి. 190 00:24:54,745 --> 00:24:57,615 జ్వాలల వద్దకు గద్దలు పెద్ద సంఖ్యలో చేరుకుంటాయి. 191 00:24:59,166 --> 00:25:03,456 ఫైర్ హాక్స్ అని పిలవబడే ఈ గద్దలు ఇతర జీవుల భయాన్ని వాటికి అనుకూలంగా మలుచుకుంటాయి. 192 00:25:25,817 --> 00:25:27,647 గ్లైడర్ పిల్ల చుట్టూరా గద్దలు ఉన్నాయి. 193 00:25:32,407 --> 00:25:35,907 తొలిసారిగా అది చేసే ఎగిరే ప్రయత్నం ఆఖరిది కూడా అయ్యే అవకాశముంది. 194 00:26:31,466 --> 00:26:33,886 దావాగ్ని పోతూ పోతూ... 195 00:26:36,889 --> 00:26:39,139 ఆ ప్రాంతాన్ని నాశనం చేసి పోతుంది. 196 00:27:01,580 --> 00:27:04,080 కానీ జీవం తాలూకు జాడ లేదనుకుంటే పొరపాటే. 197 00:27:07,377 --> 00:27:12,927 బయట ఉన్న మంటలను తట్టుకోగలిగేలా ఎకిడ్నాలు తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోగలవు. 198 00:27:28,732 --> 00:27:31,572 గ్లైడర్ పిల్ల కూడా బతికి బట్టకట్టింది. 199 00:27:34,905 --> 00:27:38,615 ఇప్పుడు అది బూడిద అయిపోయిన ప్రపంచంలో బతకాల్సి వస్తుంది. 200 00:27:44,706 --> 00:27:50,626 మళ్లీ అడవిలోకి జీవం వచ్చేదాకా అది కాలిపోయిన పురుగులను తిని బతికేయగలదు. 201 00:27:54,550 --> 00:27:56,590 జీవం మళ్లీ ప్రాణం పోసుకుంది. 202 00:27:59,721 --> 00:28:02,181 బంక వృక్షాలకు తట్టుకొనే గుణం బాగా ఉంటుంది, 203 00:28:03,600 --> 00:28:06,310 ఇక పోషకాలమయమైన బూడిద వలన నేల సారవంతం అవుతుంది. 204 00:28:13,485 --> 00:28:14,695 కాస్తంత నీటిని అందిస్తే చాలు... 205 00:28:15,904 --> 00:28:18,284 అడవి మరలా జనియిస్తుంది. 206 00:28:36,091 --> 00:28:39,511 ఎంతో సమయం గడవక ముందే, అడవికి తన అసలు రూపం రావడం మొదలవుతోంది. 207 00:28:45,100 --> 00:28:46,640 కొత్త జీవం పురుడు పోసుకుంటోంది. 208 00:28:52,691 --> 00:28:54,691 మనకి బాగా తెలిసిన జంతువులు తిరిగి వచ్చేస్తున్నాయి. 209 00:28:56,820 --> 00:29:00,240 ఇక చిత్రవిచిత్రమైన అబ్బురపరిచే ఆన్ని రకాల చిట్టి జీవులకు 210 00:29:00,324 --> 00:29:03,584 బంక వృక్షాలు మరొక్కసారి ఆవాసాన్ని అందజేస్తున్నాయి. 211 00:29:10,709 --> 00:29:15,009 కొన్ని వేల సంవత్సరాలలో, అవి ఈ కార్చిచ్చు తాలూకు వార్షిక కాలచక్రానికి అలవాటుపడ్డాయి. 212 00:29:17,925 --> 00:29:22,175 కానీ ఈ కార్చిచ్చులు మరింత పెద్దవి, మరింత మండేవి, ఇంకా మరింత తరచుగా వస్తుంటే, 213 00:29:23,013 --> 00:29:26,103 ఆస్ట్రేలియాలోని చిన్ని జీవులకు వాటి నుండి తప్పించుకోవడం మరింత పెద్ద సవాలే అవుతుంది. 214 00:29:26,183 --> 00:29:28,483 మాకు మా ఫ్రిల్డ్ బల్లులు కులాసాగా ఉండాలి కాలిపోయి కాదు 215 00:29:35,067 --> 00:29:38,277 ప్రస్తుతానికి, అవుట్‌బ్యాక్ లోని పెనుసవాళ్లతో కూడిన జీవనాన్ని... 216 00:29:40,113 --> 00:29:44,743 ఎదుర్కోవడానికి షుగర్ గ్లైడర్ పిల్ల సంసిద్ధంగా ఉంది. 217 00:29:52,584 --> 00:29:54,804 అది ఒంటరిగా కూడా ఏమీ లేదు. 218 00:29:56,964 --> 00:29:59,684 ఇతర గ్లైడర్ ల మీద అస్సలు ఆధారపడకుండా జీవించే షుగర్ గ్లైడర్ లు కూడా... 219 00:30:01,468 --> 00:30:03,968 కొద్దిపాటి మిత్రుల సహవాసాన్ని కోరుకుంటాయి. 220 00:31:08,368 --> 00:31:10,368 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య