1 00:00:07,341 --> 00:00:09,841 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,676 జీవితంలో చిన్న చిన్నవాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,426 కానీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి... 4 00:00:18,101 --> 00:00:20,561 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,978 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,815 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,409 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,118 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:53,929 --> 00:00:55,969 లాటిన్ అమెరికా అడవులు, 10 00:00:57,766 --> 00:00:59,266 చిట్టి ప్రాణులకు ఆవాసాలు... 11 00:00:59,351 --> 00:01:00,351 వ్యాఖ్యానించింది పాల్ రడ్ 12 00:01:00,435 --> 00:01:01,975 ...భూగ్రహం మీద మరెక్కడా లేని వింత. 13 00:01:04,565 --> 00:01:09,145 కిందున్న ఆకుల కుప్పలో ఒక కొత్త జీవి ప్రాణం పోసుకుంటోంది. 14 00:01:11,655 --> 00:01:15,945 ఈ స్ట్రాబెర్రీ డార్ట్ కప్ప తన చిట్టి టాడ్ పోల్ ని వీపుపై మోస్తూ తిరుగుతోంది. 15 00:01:19,288 --> 00:01:22,078 అది కేవలం బియ్యపు గింజంత పరిమాణంలో ఉంది. 16 00:01:35,804 --> 00:01:38,434 అడవిలో నేలమీది ప్రపంచం తన పాపకు చాలా ప్రమాదకరం. 17 00:01:43,228 --> 00:01:45,648 అది పెరగడానికి సురక్షితమైన చోటును కప్ప వెతకాలి. 18 00:01:49,401 --> 00:01:56,281 అడవిలో ఉన్న ఈ 40 మీటర్ల ఆకాశహర్మ్యమే దానికి తగిన చోటు. 19 00:01:59,786 --> 00:02:01,616 ద్రాక్షపండు పరిమాణంలో ఉన్న కప్పకు... 20 00:02:02,998 --> 00:02:05,168 ఇదొక ఎవరెస్ట్ శిఖరం లాంటిది. 21 00:02:19,640 --> 00:02:21,310 జిగటగా ఉండే పాదాలు మంచిపట్టును అందిస్తాయి. 22 00:02:24,311 --> 00:02:26,731 కానీ ఒక్కసారి పట్టు జారినా అది ప్రాణాంతకం కావొచ్చు. 23 00:02:35,614 --> 00:02:37,914 చెట్లమీద దానికి బోలెడంత సహచర్యం దొరుకుతుంది. 24 00:02:40,702 --> 00:02:41,702 వేర్లు మొదలుకుని... 25 00:02:43,539 --> 00:02:44,539 ...చిటారు కొమ్మల వరకూ. 26 00:02:47,459 --> 00:02:50,799 ఒక్కో చెట్టు మీద దాదాపు 5,000 రకరకాల చిట్టి ప్రాణులు 27 00:02:50,879 --> 00:02:52,509 నివసిస్తూ ఉండవచ్చు. 28 00:03:06,186 --> 00:03:10,186 చివరికి ఎండ తగిలే చోట, చిన్న డొప్పలా ఉన్న చోటికి చేరింది. 29 00:03:16,655 --> 00:03:19,365 బ్రోమెలియడ్ మొక్క కప్ప పిల్ల పెరగడానికి అనువైన 30 00:03:19,449 --> 00:03:21,079 స్విమ్మింగ్ పూల్ గుంతని తయారు చేస్తుంది. 31 00:03:29,585 --> 00:03:33,585 కానీ ఆహారం, నివసించే చోటు కోసం పోటీపడే ఎన్నో చిట్టి జీవరాసుల మధ్య, 32 00:03:34,882 --> 00:03:37,182 అడవిలో జీవితం అస్థిరమైనది. 33 00:03:39,720 --> 00:03:42,140 కేవలం నిజమైన నైపుణ్యం మాత్రమే మనగలదు. 34 00:03:45,809 --> 00:03:50,399 అడవి 35 00:03:58,405 --> 00:04:00,615 ప్రపంచంలోనే అతి చిన్న కోతిని కలవండి... 36 00:04:03,660 --> 00:04:05,080 పిగ్మీ మార్మాసెట్. 37 00:04:09,416 --> 00:04:11,626 ఎదిగిన కోతి మీ అరచేతిలో అమరగలదు. 38 00:04:23,263 --> 00:04:29,813 చిన్న పరిమాణం ఉన్న కారణంగా స్నేహితుడెవరో, శత్రువెవరో, ఆహారమేదో తెలుసుకోవడం కష్టం. 39 00:04:37,945 --> 00:04:39,815 అయితే తమ కాళ్ళ కింద ఉన్న ఆహార వనరుని 40 00:04:39,905 --> 00:04:41,105 తేలిగ్గా వినియోగించుకోగలవు. 41 00:04:44,618 --> 00:04:46,698 పదునైన పళ్ళతో, బెరడుని చీల్చి 42 00:04:46,787 --> 00:04:51,247 చిన్న గుంతలను సృష్టిస్తే, అవి తియ్యని బెరడు రసంతో నిండిపోతాయి. 43 00:04:53,168 --> 00:04:56,048 ఒక పెద్ద చెట్టుపై అలాంటివి సుమారు వెయ్యికి పైగా ఉండొచ్చు. 44 00:05:02,094 --> 00:05:04,054 పెరిగే కుటుంబానికి లోటు లేకుండా సరిపోతుంది. 45 00:05:07,933 --> 00:05:11,813 మంచి విషయం. బృందంలో కొత్త సభ్యులు చేరారు. 46 00:05:15,566 --> 00:05:17,816 ఒక్కొక్కటి నిమ్మకాయ పరిమాణంలో ఉంటుంది. 47 00:05:30,122 --> 00:05:32,752 మార్మాసెట్లు దాదాపుగా కవలలను కంటాయి. 48 00:05:35,335 --> 00:05:40,085 తల్లిదండ్రులిద్దరూ వంతుల వారీగా పిల్లల్ని చూసుకుంటాయి, కొట్టుకునే పని లేకపోతే, 49 00:05:42,009 --> 00:05:43,219 ఒక్కోసారి ఎదిగిన పిల్లలు కూడా ఆ బాధ్యత తీసుకుంటాయి. 50 00:05:47,264 --> 00:05:50,604 జేబు పరిమాణంలో ఉన్న ప్రధాన తరగతికి చెందిన ఈ జీవులకు సహకారం అనేది ప్రాథమిక జీవన శైలి. 51 00:05:54,688 --> 00:05:57,318 చెట్టుపై షికార్లు కొట్టడం కూడా అలాంటిదే. 52 00:06:00,402 --> 00:06:02,032 నేలమీద బోలెడన్ని ప్రమాదాలు... 53 00:06:08,744 --> 00:06:10,754 పైనేమో జన సమ్మర్దం. 54 00:06:12,581 --> 00:06:18,211 మార్మాసెట్ కు అరవై రెట్లు అధిక పరిమాణంలో ఉండే హౌలర్ కోతులు ఇక్కడ రాజ్యం ఏలతాయి. 55 00:06:27,679 --> 00:06:31,849 అడవిలోని 80% జంతుజాలం చెట్టు పైభాగంలోనే జీవిస్తాయి. 56 00:06:47,950 --> 00:06:51,410 అడవి నేలపై జీవితం నిత్యం పోరాటమే. 57 00:06:55,415 --> 00:06:59,035 ఎండ పెద్దగా తగలని నేలమీద, పెద్దగా ఏవీ పెరగవు. 58 00:07:10,681 --> 00:07:13,811 ఈ బుల్లి అగూటి పైనుంచి కింద పడే వాటిమీదే ఆధారపడుతుంది. 59 00:07:27,406 --> 00:07:29,826 అడవికి వర్షం జీవధార లాంటిది. 60 00:07:33,662 --> 00:07:35,662 ప్రతి సంవత్సరం సుమారు మూడు మీటర్ల వరకూ కురుస్తుంది. 61 00:07:39,668 --> 00:07:43,878 చిట్టి జీవులపై ప్రతి వర్షపు చినుకూ భారీ ప్రభావం చూపుతుంది. 62 00:07:46,925 --> 00:07:50,175 టాడ్ పోల్ గుంతని చినుకులు నీటితో నింపేస్తున్నాయి. 63 00:07:53,765 --> 00:07:56,765 ఒక్కోసారి మంచి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. 64 00:07:58,353 --> 00:08:04,993 మొక్కలు, చెట్ల బెరడు నీటిని పీల్చుకుని పురాతన వృక్షాలపై ఎనలేని బరువుని మోపుతాయి. 65 00:08:12,659 --> 00:08:15,449 కుండపోత వర్షాల వల్ల పలుచని మట్టి కొట్టుకుపోతుంది. 66 00:08:20,375 --> 00:08:24,085 భారీ వృక్షాలు శతాబ్దాల తరబడి తుఫానుల్ని తట్టుకుని నిలబడతాయి... 67 00:08:28,217 --> 00:08:29,547 కానీ ఒక రోజు... 68 00:09:02,876 --> 00:09:05,086 ఇంతటి భారీ పరిమాణంలో ఉన్న చెట్టు కూలితే... 69 00:09:06,588 --> 00:09:08,838 అడవి జీవుల జీవితంలో అదొక వెలితిని సృష్టిస్తుంది. 70 00:09:15,222 --> 00:09:17,722 స్ట్రాబెర్రీ డార్ట్ కప్ప బతికి బట్టకట్టింది. 71 00:09:20,602 --> 00:09:22,602 కానీ దాని టాడ్ పోల్ పిల్ల మాత్రం ఇప్పుడు రక్షణ లేకుండా ఉంది. 72 00:09:30,988 --> 00:09:33,818 ఆ విషయం ఫైర్ బెల్లీడ్ పాముకి తెలిసిపోతుంది. 73 00:09:52,092 --> 00:09:53,932 తల్లి చేయగలిగింది ఏమీ లేదు... 74 00:09:58,182 --> 00:09:59,392 మళ్ళీ మొదలుపెట్టడం తప్ప. 75 00:10:10,903 --> 00:10:15,573 ఒకరికి జరిగిన విధ్వంసం మరొకరికి లాభం చేకూర్చుతుంది. 76 00:10:18,869 --> 00:10:21,409 లీఫ్ కట్టర్ చీమలు ఇప్పుడు చెట్టు ఎక్కాల్సిన పనిలేదు. 77 00:10:27,836 --> 00:10:30,506 సాధారణంగా ఆకులు వాటి పరిమాణంలోనే ఉంటాయి. 78 00:10:32,758 --> 00:10:36,348 కానీ ఒక్కో చీమ తన కంటే పదిరెట్ల బరువుని మోయగలదు. 79 00:10:47,940 --> 00:10:51,820 ఇక 80 లక్షల చీమల కాలనీ ఇలాంటి చెట్టుని 80 00:10:51,902 --> 00:10:53,782 కొద్ది రోజుల్లోనే ఖాళీ చేయగలదు. 81 00:11:04,665 --> 00:11:08,875 కూలిపోయిన ఈ భారీ చెట్టు మరిన్ని ఆకులు తినే జీవుల్ని ఆకర్షిస్తుంది. 82 00:11:11,338 --> 00:11:14,218 దురదృష్టవశాత్తూ, మార్మాసెట్లు ఆకుల్ని తినవు. 83 00:11:16,802 --> 00:11:20,222 బెరడు రసాన్ని అందించే ఇలాంటి చెట్టుని కోల్పోవడం భారీ నష్టమే. 84 00:11:28,230 --> 00:11:32,230 అయితే ఆశ్చర్యకరంగా, ఈ చిట్టి రాకాసులకి దాడి చేయగల నైపుణ్యం ఉంది. 85 00:11:44,997 --> 00:11:48,627 స్ప్రింగ్ లాగా ఎగరగలిగిన కాళ్ళవల్ల, అవి మూడు మీటర్ల వరకూ దూకగలుగుతాయి. 86 00:11:52,129 --> 00:11:54,839 వంపు తిరిగిన గోళ్ళు చిన్ని కొక్కాల్లాగా పనిచేస్తాయి. 87 00:12:05,976 --> 00:12:10,056 బెరడుని తవ్వగలిగే పదునైన పళ్ళు కీటకాలని తేలిగ్గా కొరికి తినగలవు. 88 00:12:18,197 --> 00:12:23,407 విరిగిపోయిన కొమ్మలపై పరిగెడుతూ వేటాడడం ఈ బుల్లి కోతులకి చాలా సులభం. 89 00:12:32,002 --> 00:12:34,052 వాటికి దొరికిన దేన్నైనా ఇవి తినేయగలవు. 90 00:12:52,773 --> 00:12:55,233 కానీ కనిపించేదంతా నిజం కాదు. 91 00:12:57,611 --> 00:12:59,911 అద్భుతమైన మిమిక్రీ. 92 00:13:00,614 --> 00:13:04,624 ఈ గొంగళిపురుగు అచ్చం ఒక పాములాగా మారిన తీరు నమ్మితీరాలనిపించేలా ఉంది. 93 00:13:06,828 --> 00:13:08,078 అది భయంగొలిపేలా ఉంది. 94 00:13:21,176 --> 00:13:23,006 వందల ఏళ్ళ పాటు నీడలో ఉండి, 95 00:13:23,554 --> 00:13:28,684 ఒక్కసారిగా అడవి నేల సూర్యరశ్మితో జలకాలాడింది. 96 00:13:36,567 --> 00:13:40,987 అవకాశం కోసం చూస్తోన్న గింజలు చిన్నగా పెరిగి, ఎత్తుకి చేరాలని తాపత్రయపడతాయి. 97 00:13:44,575 --> 00:13:47,995 ఇప్పుడిక వెలుగు కోసం జరిగే పోటీ ప్రారంభం. 98 00:13:51,623 --> 00:13:54,043 తీగ మొక్కలు అందరికంటే ముందుండాలని తపిస్తాయి... 99 00:13:57,129 --> 00:14:00,759 ఎండకోసం పోటీపడుతూ దారిలో అడ్డుగా ఉన్న మొక్కల్ని అల్లుకుంటూ పోతాయి. 100 00:14:14,396 --> 00:14:17,816 కొద్ది రోజుల్లోనే, నేల కూలిన ఆ భారీ వృక్షం కొత్తగా మొలిచిన మొక్కలతో నిండిపోతుంది. 101 00:14:25,574 --> 00:14:30,624 ఖాళీ స్థలం తిరిగి పచ్చగా మారిపోతుంది. 102 00:14:38,545 --> 00:14:40,205 కానీ ఇది స్వర్గం కాదు. 103 00:14:44,259 --> 00:14:46,679 హమ్మింగ్ బర్డ్స్ కాగితమంత తేలిగ్గా ఉంటాయి. 104 00:14:48,889 --> 00:14:52,179 పరిమాణం దృష్ట్యా కోల్పోయిన లోటుని, పైచేయి సాధించడానికి వాడతాయి. 105 00:15:02,569 --> 00:15:06,409 కొన్నింటికి కత్తులు, పళ్ళలాంటి ముక్కులు ఉంటాయి. 106 00:15:10,702 --> 00:15:12,702 ఇదంతా పువ్వుల కోసం జరిగే యుద్ధమే. 107 00:15:17,042 --> 00:15:19,592 హమ్మింగ్ బర్డ్స్ ప్రతి కొద్ది నిమిషాలకొకసారీ ఆహారం తీసుకోవాలి. 108 00:15:21,296 --> 00:15:25,756 ఈకల్లాంటి నాలుకలతో, సెకనుకి 20 సార్లు అవి తేనెను జుర్రుకుంటాయి. 109 00:15:29,972 --> 00:15:31,352 అవి వేగంగానే పనిచేయాల్సి ఉంటుంది. 110 00:15:35,310 --> 00:15:37,310 ఎందుకంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. 111 00:15:40,232 --> 00:15:42,152 కానీ ఇది ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. 112 00:15:47,573 --> 00:15:49,993 నెలవంక ఆకారంలో ఉండే హెలికోనియా పూలు 113 00:15:50,075 --> 00:15:52,695 హమ్మింగ్ బర్డ్స్ కి ఎక్కువ భాగం అందని ద్రాక్షలాంటివి. 114 00:15:57,124 --> 00:15:59,924 కానీ గ్రీన్ హెర్మిట్ పక్షికి పొడవాటి, వంపు తిరిగిన ముక్కు ఉంటుంది. 115 00:16:03,213 --> 00:16:05,723 ప్రశాంతంగా తేనెను జుర్రడానికి దానికి అవకాశం కల్పిస్తుంది. 116 00:16:17,644 --> 00:16:19,564 చెప్పాలంటే, దాదాపుగా. 117 00:16:21,398 --> 00:16:22,818 గుండుసూది మొనకంటే చిన్నగా ఉండే 118 00:16:23,650 --> 00:16:27,280 ఈ పురుగులు ఈ హెలికోనియా పూలలోని తేనెనంతటినీ ఖాళీ చేశాయి. 119 00:16:30,157 --> 00:16:32,987 మరో పువ్వుని చేరాలంటే, వాటికి మరో జీవి సాయం కావాలి. 120 00:16:41,084 --> 00:16:43,924 వాటి పరిమాణంతో పోల్చితే, అవి చిరుతపులితో సమానంగా పరిగెడతాయి. 121 00:16:47,299 --> 00:16:49,129 హమ్మింగ్ బర్డ్ ముక్కు దగ్గరికి పరిగెత్తి... 122 00:16:51,637 --> 00:16:53,717 దాని ముక్కు రంధ్రాల్లో దాక్కుని... 123 00:16:58,810 --> 00:17:01,360 మరో పువ్వు మీదికి ఆకాశంలో ప్రయాణానికి సిద్ధంగా ఉంది. 124 00:17:13,700 --> 00:17:15,120 ఖాళీ స్థలం తిరిగి మొక్కలతో నిండిపోయాక, 125 00:17:15,202 --> 00:17:18,622 అడవి నేల తిరిగి మరోసారి చీకటిమయం అవుతుంది. 126 00:17:24,211 --> 00:17:26,511 ఇటువంటి తేమ వాతావరణంలో ఫంగస్ వృద్ధి చెందుతుంది... 127 00:17:28,674 --> 00:17:31,094 నేల కూలిన వృక్షాల అవశేషాలను కుళ్ళిపోయేలా చేస్తుంది. 128 00:17:37,057 --> 00:17:40,057 ఇక్కడ తాజా ఆహారం దొరకడం చాలా కష్టం. 129 00:17:52,114 --> 00:17:55,164 చాలా జంతువులకి బ్రెజిల్ నట్ తినడం సాధ్యం కాదు. 130 00:17:58,120 --> 00:17:59,330 కానీ అగూటికి అది వర్తించదు. 131 00:18:06,879 --> 00:18:09,509 ఇప్పుడు తినలేని దాన్ని, అది తరువాత తినడం కోసం పాతి పెడుతుంది. 132 00:18:12,718 --> 00:18:14,138 అది స్వతహాగా ఎప్పుడూ కంగారుగానే ఉంటుంది. 133 00:18:16,346 --> 00:18:17,756 దానికి కారణం లేకపోలేదు. 134 00:18:24,897 --> 00:18:27,727 మార్గే పెంపుడు పిల్లి కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. 135 00:18:31,361 --> 00:18:33,361 కానీ చాలా ప్రమాదకారి. 136 00:18:59,014 --> 00:19:02,314 చీకటిగా ఉండే అడవి నేలపై బోలెడన్ని దాడిచేసే జంతువులు దాక్కుని ఉంటాయి. 137 00:19:05,062 --> 00:19:08,902 చిట్టివైనా కూడా, కపట బుద్ధి కలిగినవి కూడా ఉంటాయి. 138 00:19:12,277 --> 00:19:13,737 40 బుల్లి కాళ్ళు కలిగి, 139 00:19:13,820 --> 00:19:18,030 వేలు పొడవు ఉండే వెల్వెట్ పురుగు నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. 140 00:19:19,535 --> 00:19:22,575 దాని వేటాడే పద్ధతి సైన్సు ఫిక్షన్ కి ఎంతమాత్రం తీసిపోదు. 141 00:19:28,961 --> 00:19:32,801 దాని ఒంటిపై ఉన్న వైబ్రేషన్ సెన్సర్లు బలి కాబోయే జీవి కదలికలను అందిస్తాయి. 142 00:19:38,470 --> 00:19:40,220 కానీ తన రహస్య ఆయుధాన్ని వాడాలంటే... 143 00:19:43,141 --> 00:19:45,021 మరింత దగ్గరికి వెళ్ళాల్సిందే... 144 00:19:55,237 --> 00:19:56,657 వెబ్-స్లింగర్స్. 145 00:20:05,247 --> 00:20:07,877 ఆ జిగురు దారాలు క్షణాల్లో గట్టిపడతాయి. 146 00:20:13,714 --> 00:20:14,924 తప్పించుకునే దారే లేదు. 147 00:20:26,268 --> 00:20:29,688 చిన్ని ప్రాణులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. 148 00:20:34,401 --> 00:20:38,241 ఆడ స్ట్రాబెర్రీ డార్ట్ కప్ప కొత్తగా మరికొన్ని గుడ్లు పెట్టింది. 149 00:20:41,950 --> 00:20:44,370 కానీ వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మగ కప్పది. 150 00:20:58,217 --> 00:21:00,837 వేటాడే జంతువులకు నిండు ఎర్ర రంగు ఒక ప్రమాద సంకేతం. 151 00:21:04,139 --> 00:21:06,559 దాని చర్మం నుండి ప్రాణాంతకమైన విషం ఊరుతుంది. 152 00:21:10,062 --> 00:21:11,272 కానీ ఒక సమస్య... 153 00:21:15,025 --> 00:21:17,025 ఫైర్ బెల్లీడ్ పాములను ఆ విషం ఏమీ చేయలేదు. 154 00:21:19,071 --> 00:21:22,121 చిన్న కదలికను కూడా అవి తేలిగ్గా పసిగట్టగలవు. 155 00:21:26,286 --> 00:21:27,956 నిశ్చలంగా ఉన్నట్లయితే... 156 00:21:30,415 --> 00:21:32,075 అది బతికి బయటపడే అవకాశం ఉంది. 157 00:21:45,347 --> 00:21:47,177 కానీ అది ప్రతి దానినుండీ దాక్కోలేదు. 158 00:21:54,106 --> 00:21:55,316 శత్రువు మగ కప్ప. 159 00:21:58,610 --> 00:22:00,030 స్థలంలో పాగా వేయడం కోసం వచ్చింది. 160 00:22:07,870 --> 00:22:10,870 గెలిస్తే, అది గుడ్లన్నింటినీ తినేస్తుంది. 161 00:22:14,793 --> 00:22:17,213 ఈ చిన్నారి నాన్న పోరాడకపోతే అన్నింటినీ కోల్పోతాడు. 162 00:22:27,055 --> 00:22:31,685 ద్రాక్షపండు బరువులో ఉండే అవి రెండూ సమఉజ్జీలే. 163 00:22:46,617 --> 00:22:49,077 ఆ విధంగా అరగంట పాటు పోరాడగలవు. 164 00:23:00,088 --> 00:23:02,298 చిన్నారి నాన్న కప్ప అలసిపోవడం మొదలైంది. 165 00:23:10,516 --> 00:23:12,346 కానీ చివరికి నాన్నదే గెలుపు. 166 00:23:15,437 --> 00:23:18,857 దాని శత్రువు ప్రస్తుతానికి అక్కడినుండి వెళ్ళిపోయింది. 167 00:23:21,818 --> 00:23:25,448 ఆ గుడ్లు పొదిగే లోపు అది రెండు వారాల పాటు కాపలా కాయాల్సి ఉంటుంది. 168 00:23:34,915 --> 00:23:38,955 అడవిలో రుతువులు మారేకొద్దీ, మరింత సంక్లిష్టమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. 169 00:23:47,928 --> 00:23:50,558 ఈ ఆర్కిడ్ బీ ఒక అసాధారణమైన లక్ష్యాన్ని చేరే పనిలో ఉంది. 170 00:23:52,432 --> 00:23:55,142 ఇక్కడికి రావడానికి దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించింది. 171 00:23:58,355 --> 00:23:59,475 అది ఒంటరి కాదు. 172 00:24:02,734 --> 00:24:07,664 అన్నీ మగ పురుగులే, అన్నీ ఒకే ఒక విషయం కోసం వచ్చాయి. 173 00:24:10,284 --> 00:24:11,494 అది పుప్పొడి కాదు. 174 00:24:12,870 --> 00:24:13,910 పరిమళం. 175 00:24:16,498 --> 00:24:18,168 ఈ ఆర్కిడ్ మొక్క ఒక పరిమళాన్ని ఉత్పత్తి చేస్తుంది, 176 00:24:18,250 --> 00:24:20,880 దానితో ఆడ పురుగులు మగ పురుగు దరిచేరకుండా ఉండలేవు. 177 00:24:23,297 --> 00:24:25,757 అందుకోసం అది వీలైనంత పరిమళాన్ని సేకరిస్తుంది. 178 00:24:28,177 --> 00:24:29,597 కానీ అది జాగ్రత్తగా ఉండకపోతే... 179 00:24:32,848 --> 00:24:33,848 అందులో మునిగిపోతుంది. 180 00:24:44,985 --> 00:24:46,395 బయటపడడానికి ఒకటే దారి. 181 00:24:54,912 --> 00:24:56,412 కానీ చాలా ఇరుకైన దారి. 182 00:25:02,127 --> 00:25:04,957 అయితే వెళ్ళే సమయంలో ఒక బహుమతి ఇవ్వకుండా ఆర్కిడ్ ఊరుకోదు. 183 00:25:09,593 --> 00:25:11,803 దాని వీపుకి అంటించిన ఒక పుప్పొడి బస్తా. 184 00:25:21,396 --> 00:25:23,976 జత కోసం పురుగు చేపట్టిన పని కొనసాగుతుంది, 185 00:25:24,983 --> 00:25:26,403 అయితే ఆర్కిడ్ మొక్క పని మాత్రం పూర్తయింది. 186 00:25:41,875 --> 00:25:46,205 పిగ్మీ మార్మాసెట్ల విషయంలో, జీవితం మళ్ళీ గాడిలో పడుతోంది. 187 00:25:50,217 --> 00:25:52,467 కీటకాలు రావడం తగ్గిపోయాయి. 188 00:25:56,139 --> 00:25:57,219 పరవాలేదు. 189 00:25:58,308 --> 00:26:01,558 కొత్త చెట్ల మీద బెరడు రసాల కోసం గుంతలు తవ్వడంలో అవి బిజీగా ఉన్నాయి. 190 00:26:10,112 --> 00:26:11,992 గోల చేసే చుట్టపక్కాలు కూడా తిరిగొచ్చాయి. 191 00:26:18,579 --> 00:26:22,999 పెద్దగా చప్పుడు చేస్తూ, ఆహారాన్ని ఎవరికీ దక్కనివ్వకుండా... 192 00:26:32,009 --> 00:26:33,429 ఆగం చేస్తూ ఉంటాయి. 193 00:26:42,394 --> 00:26:43,774 కడుపు ఖాళీ చేసినప్పుడు, 194 00:26:44,938 --> 00:26:47,268 దాన్ని శుభ్రం చేసే పని చిట్టి జీవులపై పడుతుంది. 195 00:26:54,531 --> 00:26:57,951 చెట్టు పైభాగంలో అన్నీ శుభ్రంగా ఉంచే బాధ్యత ఈ చిట్టి సూపర్ హీరోదే. 196 00:27:04,875 --> 00:27:07,335 పావలా పరిమాణంలో ఉండే పేడ పురుగు. 197 00:27:08,504 --> 00:27:09,924 ఏ పనీ బ్రహ్మాండం కాదు. 198 00:27:17,888 --> 00:27:19,058 20 మీటర్ల పైనుండి... 199 00:27:21,225 --> 00:27:23,345 గట్టిగా పట్టుకుంటుంది అంతే. 200 00:27:43,580 --> 00:27:45,750 దానితో పాటే శుభ్రం చేసే మిగిలిన బృందం కిందికి దిగుతుంది. 201 00:28:00,305 --> 00:28:03,135 పాతి పెట్టడం కోసం ఆ పేడ ఉండల్ని దొర్లించుకుంటూ వెళ్తాయి. 202 00:28:06,270 --> 00:28:07,480 తమ చిన్నారులకు అది ఆహారం. 203 00:28:10,691 --> 00:28:12,691 అడవి నేలకి ఎరువు కూడా. 204 00:28:19,199 --> 00:28:23,199 అత్యద్భుతమైన జంతుజాలంతో నిండిన అడవి ఒక సంక్లిష్టమైన ప్రపంచం. 205 00:28:24,663 --> 00:28:26,793 ప్రతి ఒక్కరి పాత్రా ప్రత్యేకమైనదే. 206 00:28:32,129 --> 00:28:34,969 ఈ బుల్లి జీవులకు కూడా వాటి స్థానం దక్కింది. 207 00:28:41,555 --> 00:28:44,385 వారిని చుట్టుముట్టి ఉన్న అటవీ ప్రాంతం నిరంతరం మారుతూనే ఉంటుంది. 208 00:28:48,437 --> 00:28:51,357 కానీ ప్రస్తుతానికి, జీవితం తియ్యనైనది. 209 00:28:56,195 --> 00:28:57,235 కింద నేల మీద... 210 00:28:58,614 --> 00:29:01,414 అగూటి వదిలేసిన ఒక బ్రెజిల్ నట్... 211 00:29:07,206 --> 00:29:09,416 నీడలో నెమ్మదిగా ఎదుగుతోంది. 212 00:29:13,086 --> 00:29:14,506 దానిది దీర్ఘకాల ప్రణాళిక. 213 00:29:17,424 --> 00:29:22,434 చిన్న ప్రారంభంనుండే, బ్రహ్మాండం సృష్టించబడుతుంది. 214 00:29:34,358 --> 00:29:37,188 అడవి చూడడానికి అనంతమైన ఆకుపచ్చ సాగరంలాగా కనిపించవచ్చు... 215 00:29:40,739 --> 00:29:45,579 కానీ ప్రతి ఒక్క చెట్టూ చిట్టి అద్భుతాల ప్రపంచానికి నిలయం. 216 00:29:51,166 --> 00:29:52,576 ఒక స్ట్రాబెర్రీ డార్ట్ కప్ప 217 00:29:53,085 --> 00:29:55,915 తన చిన్నారి టాడ్ పోల్ కోసం సురక్షితమైన చోటుని వెతుకుతోంది. 218 00:30:00,300 --> 00:30:01,390 తన తరువాతి తరాన్ని పెంచడం కోసం... 219 00:30:13,981 --> 00:30:15,981 అది త్వరపడితే మంచిది. 220 00:30:17,943 --> 00:30:19,613 అదొక సుదీర్ఘ ప్రయాణం... 221 00:30:20,404 --> 00:30:22,164 పైపైకి. 222 00:31:10,454 --> 00:31:12,464 సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ