1 00:00:13,557 --> 00:00:15,767 అనుభవం ఉన్న అమ్మాయి సలహా తీసుకోండి. 2 00:00:15,850 --> 00:00:19,980 సిటీ హాల్ నుండి మీ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని పారిపోవాలని చూస్తే, 3 00:00:20,063 --> 00:00:23,525 సెక్యూరిటీ గార్డులు ఖచ్చితంగా మీ వెంట పడతారు. 4 00:00:23,608 --> 00:00:25,402 నాకు వేరే దారిలేదు. 5 00:00:25,485 --> 00:00:29,531 నా విషయంలో జరిగిన తప్పుని సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను, అది చేసింది మరెవరో కాదు... 6 00:00:30,532 --> 00:00:32,409 నా సొంత తల్లిదండ్రులు. 7 00:00:33,994 --> 00:00:36,663 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 8 00:00:36,746 --> 00:00:38,415 మనకు నచ్చినట్లు ఉండాలి 9 00:00:39,541 --> 00:00:42,377 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 10 00:00:42,460 --> 00:00:44,379 నాదే తుది నిర్ణయం 11 00:00:44,462 --> 00:00:47,424 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 12 00:00:47,507 --> 00:00:49,885 నాకు నచ్చిందే వేసుకుంటాను 13 00:00:49,968 --> 00:00:55,974 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 14 00:00:56,057 --> 00:00:58,852 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 15 00:00:58,935 --> 00:01:01,271 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 16 00:01:01,354 --> 00:01:02,355 "ఎం" అక్షరం మూలం 17 00:01:04,523 --> 00:01:05,525 లూయిస్ ఫిట్జ్ హ్యూ రచనపై ఆధారపడింది 18 00:01:05,609 --> 00:01:06,610 పెయిజ్ బుక్ స్టోర్ 19 00:01:06,693 --> 00:01:09,946 చట్టం ముందు దోషిగా ఎలా నిలబడ్డానో అర్థం అవ్వాలంటే, 20 00:01:10,030 --> 00:01:14,075 ఇక్కడ మొదలుపెట్టడం మంచిది, రచయితలు, స్పైలు పవిత్రంగా భావించే రోజుతో మొదలుపెడదాం. 21 00:01:15,201 --> 00:01:17,287 కొత్త నోట్ బుక్ అందిన రోజు. 22 00:01:22,042 --> 00:01:25,420 ఇప్పటివరకూ నా జీవితంలో నేను పన్నెండు నోట్ బుక్స్ నింపాను. 23 00:01:25,503 --> 00:01:28,131 అందంగా కనబడడం కోసం రూళ్ళ పుస్తకంలో రాస్తాను. 24 00:01:28,215 --> 00:01:30,592 ఆఖరి పుస్తకాన్ని చాలా త్వరగా నింపేశాను. 25 00:01:35,972 --> 00:01:37,224 నాకు మిసెస్ ప్లంబర్ అంటే ఇష్టం. 26 00:01:37,307 --> 00:01:40,268 ఆవిడ కుక్కల్లో నేను కూడా ఒకదాన్ని అయ్యుంటే, వాటిలా డ్రెస్ వేసుకోవాల్సి వస్తే, 27 00:01:40,352 --> 00:01:42,395 ఆమెని కూడా అలాంటిది వేసుకోమని బలవంతపెట్టేదాన్ని. 28 00:01:44,522 --> 00:01:45,523 పూర్తయింది. 29 00:01:48,860 --> 00:01:51,780 ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకుంటున్నావా, హ్యారియట్? 30 00:01:51,863 --> 00:01:53,240 ఖచ్చితంగా. 31 00:01:53,323 --> 00:01:56,076 నేను దీన్ని మూడు నెలల్లో నింపేస్తాను. 32 00:01:56,159 --> 00:01:58,620 లేదు, రెండు నెలల్లో. బహుశా ఒకటి. 33 00:02:05,126 --> 00:02:09,421 గుడ్ మార్నింగ్, మిస్టర్ హొరేషియో. ఈరోజు ఎలా ఉన్నారు? 34 00:02:09,506 --> 00:02:12,175 -నీ సీట్లో కూర్చో, హ్యారియట్. -సంతోషంగా కూర్చుంటా. 35 00:02:12,259 --> 00:02:15,971 పుస్తకాన్ని మరీ బలంగా, జాయింట్ ఊడిపోయేలా తెరవకూడదని ఓల్ గోలీ చెప్పింది. 36 00:02:16,054 --> 00:02:20,100 కానీ నోట్ బుక్? అది మీ మెదడులో మెదిలే ఆలోచనలకు అక్షర రూపం. 37 00:02:20,183 --> 00:02:23,019 కాబట్టి దాన్ని మీరు ఇష్టమొచ్చినట్లు చేయాలనుకుంటే, చేసేయండి. 38 00:02:23,103 --> 00:02:25,355 ఒక్క చోట తప్ప: 39 00:02:26,064 --> 00:02:28,191 మీ పేరు రాసుకునే చోట. 40 00:02:28,275 --> 00:02:29,276 ఈ పుస్తకం ఎవరిదంటే: 41 00:02:29,359 --> 00:02:31,653 కొత్త నోట్ బుక్ లో రాసే ప్రత్యేకమైన క్షణం. 42 00:02:31,736 --> 00:02:35,073 ఒక్క తప్పు చేస్తే, అది ఎప్పటికీ ఉండిపోతుంది. 43 00:02:36,783 --> 00:02:39,536 రెండువేల నలభై ఏడవ సంవత్సరం… కావొచ్చు 44 00:02:40,245 --> 00:02:43,915 ప్రపంచంలోనే అతిగొప్ప నవలని రాయబోయే ముందు 45 00:02:43,999 --> 00:02:47,002 హ్యారియట్ ఎం. వెల్ష్ రాసిన నోట్ బుక్ ఇదే. 46 00:02:47,085 --> 00:02:48,086 వావ్. 47 00:02:48,169 --> 00:02:49,963 -అద్భుతమైన విషయం. -నేను చదివాను. 48 00:02:50,046 --> 00:02:52,048 ఆవిడ పేరు సరిగ్గా రాసి ఉండడం మనం చూడొచ్చు… 49 00:02:52,132 --> 00:02:53,133 హ్యారియట్ ఎం. వెల్ష్ 50 00:02:53,216 --> 00:02:54,384 …అది ఏం తెలియజేస్తోందంటే, 51 00:02:54,467 --> 00:02:57,804 ప్రపంచంలోనే అతిగొప్ప రచయిత అవుతుందని అది నిర్ధారిస్తుంది. 52 00:03:00,056 --> 00:03:02,934 హ్యారియట్ క్లాస్మేట్ అయిన మేరియన్ హాతోర్న్ 53 00:03:03,018 --> 00:03:04,561 అంతగా ప్రాచుర్యం పొందలేకపోయింది. 54 00:03:06,021 --> 00:03:10,108 రచయితగా విఫలమైన తర్వాత, ఆమె ప్రెసిడెంట్ పదవితో సర్దుకోవాల్సి వచ్చింది. 55 00:03:10,191 --> 00:03:13,612 ప్రపంచ శాంతి సాధించినా, రోబోట్లకు ఫీలింగ్స్ కలిగేలా చేసినా అది ఎవరికి కావాలి? 56 00:03:13,695 --> 00:03:15,614 తన పేరు ఎలా రాసిందో చూడండి. 57 00:03:16,656 --> 00:03:17,657 ఘోరంగా ఉంది. 58 00:03:20,493 --> 00:03:23,788 హ్యారియట్ ఎం. వెల్ష్ 59 00:03:24,581 --> 00:03:28,501 హాయ్, హ్యారియట్. నేను ఎప్పుడూ అడగాలనుకుంటాను, నీ పేరులో "ఎం" అంటే ఏంటి? 60 00:03:28,585 --> 00:03:31,004 ఓహ్, అది ఒట్టి "ఎం" మాత్రమే. దానికి ఎలాంటి అర్థం లేదు. 61 00:03:31,087 --> 00:03:33,173 అది కొంచెం వింతగా ఉంది. 62 00:03:34,841 --> 00:03:37,510 -నీకు మధ్య పేరు లేదా? -లేదు. 63 00:03:37,594 --> 00:03:40,263 మధ్య పేరు లేకపోతే మరి "ఎం" అని ఎందుకున్నట్లు? 64 00:03:40,347 --> 00:03:42,766 హ్యారియట్ ఎం, "ఫుల్ స్టాప్" వెల్ష్, అంతే. 65 00:03:42,849 --> 00:03:46,144 ఆగు, నువ్వు ఫుల్ స్టాప్ లేకుండా రాసేదానివని అనుకుంటానే. 66 00:03:46,228 --> 00:03:47,354 నాకలా అనిపించడం లేదు. 67 00:03:47,437 --> 00:03:48,813 నీకు అనిపిస్తోందనుకుంటా. 68 00:03:48,897 --> 00:03:51,191 నీ పూర్తి పేరు ఎలా రాయాలో కూడా నీకు గుర్తులేదా? 69 00:03:52,025 --> 00:03:56,404 నేనెప్పుడూ 'ఎం' తర్వాత ఫుల్ స్టాప్ రాసేదాన్ని. అదే ఫైనల్. అంతే. ఫుల్ స్టాప్. 70 00:03:56,488 --> 00:03:59,783 దురదృష్టవశాత్తూ, అది కథకి ముగింపు కాదు. 71 00:03:59,866 --> 00:04:01,409 అది కేవలం ప్రారంభం మాత్రమే. 72 00:04:05,413 --> 00:04:06,998 "ఎం, ఫుల్ స్టాప్." 73 00:04:07,082 --> 00:04:08,250 ఒట్టి "ఎం." 74 00:04:08,333 --> 00:04:09,501 ఒట్టి "ఎం." 75 00:04:09,584 --> 00:04:11,086 "ఎం, ఫుల్ స్టాప్." 76 00:04:11,169 --> 00:04:15,674 నేను ఎవరనేది నాకే సరిగ్గా తెలియకపోతే, నేను ప్రపంచ ప్రఖ్యాత రచయితని ఎలా కాగలను? 77 00:04:15,757 --> 00:04:19,302 'ఎం' పక్కన ఫుల్ స్టాప్ ఉన్నట్లా లేక లేనట్లా? 78 00:04:28,895 --> 00:04:32,190 ఒక ఆశ్చర్యకరమైన పరిశోధనలో, మా ఆర్కియాలజిస్ట్ కనుగొన్నది ఏంటంటే 79 00:04:32,274 --> 00:04:37,153 ప్రఖ్యాత రచయిత హ్యారియట్ ఎం. వెల్ష్, తన మధ్య పేరులో ఉన్న 'ఎం' పక్కన 80 00:04:37,237 --> 00:04:39,698 కొన్నిసార్లు ఫుల్ స్టాప్ పెట్టేవారు, కొన్నిసార్లు పెట్టేవారు కాదు. 81 00:04:40,615 --> 00:04:42,117 అంటే దానర్థం ఏంటి? 82 00:04:42,200 --> 00:04:46,746 అంటే, దానర్థం ఏంటంటే హ్యారియట్ ఎం. వెల్ష్ అసలు ఉనికిలో లేదు, 83 00:04:46,830 --> 00:04:48,540 అది ఒక అద్భుతమైన రచయిత పెట్టుకున్న 84 00:04:48,623 --> 00:04:52,168 కలం పేరు, ఆవిడే ప్రెసిడెంట్ మేరియన్ హాతోర్న్. 85 00:04:59,050 --> 00:05:00,427 అమ్మా, నాన్న. 86 00:05:00,510 --> 00:05:04,598 నా పేరు "హ్యారియట్ ఎం. వెల్షా" లేక "హ్యారియట్ ఎం వెల్షా"? 87 00:05:04,681 --> 00:05:07,058 నాకు ఇప్పుడే తెలియాలి! 88 00:05:08,059 --> 00:05:10,061 -'ఎం' పక్కన ఫుల్ స్టాప్ ఉంది. -'ఎం' పక్కన ఫుల్ స్టాప్ లేదు." 89 00:05:13,315 --> 00:05:15,859 బంగారం, 'ఎం' పక్కన ఫుల్ స్టాప్ ఉంది, ఎందుకంటే... 90 00:05:15,942 --> 00:05:17,360 అదీ… 91 00:05:17,444 --> 00:05:21,573 లేదు, ఫుల్ స్టాప్ ఉండదు. ఒట్టి 'ఎం'. 92 00:05:22,282 --> 00:05:25,410 మీ ఇద్దరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? నా పేరు పెట్టింది మీరే కదా! 93 00:05:25,493 --> 00:05:28,038 అదీ, చెప్పాలంటే కొంచెం కష్టం. 94 00:05:28,121 --> 00:05:30,123 మనం చెప్పి తీరాలి, కారొల్. 95 00:05:33,168 --> 00:05:35,378 చూడు హ్యారియట్, నేను నీ బర్త్ సర్టిఫికేట్ నింపేటప్పుడు... 96 00:05:36,379 --> 00:05:37,881 మేము నీకు మధ్యపేరు ఇవ్వాలని అనుకోలేదు. 97 00:05:45,722 --> 00:05:47,974 కానీ అప్పుడు చిన్న పొరబాటు జరిగింది. 98 00:05:48,058 --> 00:05:49,059 హ్యారియట్ వె 99 00:05:51,603 --> 00:05:54,064 చెత్త పెన్ను. ఇంకు రావడం లేదు. 100 00:06:02,864 --> 00:06:05,158 నేను దాని గురించి ఆలోచించలేదు, కానీ వాళ్ళు 101 00:06:05,242 --> 00:06:10,205 ఆ చిన్న పిచ్చిగీతని వాళ్ళు నోట్ చేసేటపుడు 'ఎం'గా గుర్తించారు. 102 00:06:10,997 --> 00:06:13,208 అంటే, నేను పిచ్చిగీతనా? 103 00:06:17,837 --> 00:06:20,840 తన మధ్య పేరు నిజంగా 'ఎం' అనే పిచ్చిగీతా? 104 00:06:20,924 --> 00:06:24,553 ఆమె దేన్నీ సాధించకపోవడంలో వింతేముంది. 105 00:06:24,636 --> 00:06:29,432 ఈ విశ్వ చరిత్రలోనే గొప్ప రచయిత-ప్రెసిడెంట్ అలా కాదు. 106 00:06:29,516 --> 00:06:32,060 మేరియన్ ఏంజెలినా హాతోర్న్. 107 00:06:32,143 --> 00:06:35,855 గ్రీకులో "ఏంజెలినా" అంటే అర్థం "మెసెంజర్" మరియు "ఏంజెల్" అని అర్థం. 108 00:06:37,148 --> 00:06:40,277 హిప్ హిప్ హుర్రే! హుర్రే! హిప్ హిప్ హుర్రే! హుర్రే! 109 00:06:40,360 --> 00:06:42,320 హిప్ హిప్ హుర్రే! హుర్రే! 110 00:06:43,488 --> 00:06:45,073 నువ్వు దాన్ని సరిచేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు? 111 00:06:45,156 --> 00:06:46,575 మా పొరబాటు తెలుసుకునే నాటికి, 112 00:06:46,658 --> 00:06:49,911 మాకు 'ఎం' బాగానే అనిపించి, దాన్ని ఉంచేయాలని నిర్ణయించుకున్నాం. 113 00:06:49,995 --> 00:06:52,163 నువ్వు అనుకున్నంత ఘోరంగా ఏమీ లేదు. 114 00:06:53,623 --> 00:06:55,166 సరిగ్గా చెప్పారు. అంతకంటే దారుణంగా ఉంది. 115 00:06:55,250 --> 00:06:58,712 పిచ్చిగీతని మధ్యపేరుగా ఉంచుకుని రచయితని ఎలా కాగలను. 116 00:06:59,546 --> 00:07:01,590 ఓల్ గోలీ, మీ మధ్య పేరు ఏంటి? 117 00:07:01,673 --> 00:07:04,259 విల్లా. రచయిత విల్లా కేథర్ లాగా. 118 00:07:05,176 --> 00:07:09,180 అదొక అందమైన మధ్య పేరు. 119 00:07:15,478 --> 00:07:18,607 తరువాతి రోజు ఉదయం నా ఆవేశం చల్లారింది. 120 00:07:19,190 --> 00:07:24,029 పూర్తిగా జావగారి పోయాను. పేపర్లో జోకులు చదివినా ఉపయోగం లేదు. 121 00:07:24,112 --> 00:07:25,822 జోకులు 122 00:07:25,906 --> 00:07:27,073 అది కాదు హ్యారియట్... 123 00:07:27,157 --> 00:07:31,202 దయచేసి నన్ను "పిచ్చిగీత" అని పిలువు. నేను ఆ పిలుపుని అలవాటు చేసుకోవాలి. 124 00:07:31,786 --> 00:07:35,498 మమ్మల్ని క్షమించు, డియర్. నువ్వు ఇంతగా బాధపడతావని మేము అనుకోలేదు. 125 00:07:35,582 --> 00:07:37,334 మేము ఆ తప్పును సరిదిద్దాలని అనుకుంటున్నాం. 126 00:07:39,336 --> 00:07:40,337 మూడు వేల పిల్లల పేర్లు 127 00:07:40,420 --> 00:07:42,756 ఇదిగో పిల్లల పేర్ల పుస్తకం. మేము ఏమనుకున్నామంటే... 128 00:07:42,839 --> 00:07:45,842 నువ్వు 'ఎం'తో మొదలయ్యే పేరేదైనా ఎంచుకో. 129 00:07:45,926 --> 00:07:49,596 అప్పుడు సిటీ హాలుకు వెళ్లి దాన్ని రికార్డుల్లో మార్పించుకుందాం. 130 00:07:49,679 --> 00:07:53,725 హ్యారియట్ "ఎం, ఫుల్ స్టాప్"... ఎందుకంటే ఇప్పుడు ఆ అక్షరం ఏదో ఒక పదాన్ని సూచిస్తుంది... వెల్ష్. 131 00:07:53,808 --> 00:07:56,561 నేను ఎంతగా దాన్ని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించినా, 132 00:07:56,645 --> 00:07:59,522 ఈ పుస్తకం నన్ను ఊరిస్తోంది. 133 00:08:00,523 --> 00:08:04,653 కానీ నేను ఒక నిర్ణయానికి రాబోయే ముందు కొందరు టాప్ లెవెల్ నిపుణుల్ని సంప్రదించాలి. 134 00:08:05,278 --> 00:08:06,655 -హ్యారియట్… -పిచ్చిగీత… 135 00:08:06,738 --> 00:08:08,114 వెల్ష్? 136 00:08:09,824 --> 00:08:13,495 హేయ్, సీరియస్ గా అంటున్నా. ఇకపై నేనెవరో కూడా నాకు తెలీదు. 137 00:08:13,578 --> 00:08:17,707 నేను ఇప్పటికీ గూఢచారినేనా? నాకు ఇప్పటికీ టమాటో శాండ్విచ్ లు ఇష్టమా? ఆగండి. 138 00:08:22,879 --> 00:08:24,923 ఓకే, ఇప్పటికీ దానిపై ఇష్టం అలాగే ఉంది. 139 00:08:25,465 --> 00:08:28,426 ఆగు, నాకు గందరగోళంగా ఉంది. పిచ్చిగీత ఉంటే ఏంటి సమస్య? 140 00:08:28,510 --> 00:08:30,845 "హ్యారియట్ పిచ్చిగీత వెల్ష్" కూడా బాగానే ఉంది. 141 00:08:30,929 --> 00:08:34,849 జేనీ, మధ్యపేరు "పిచ్చిగీత" అని ఉన్న రచయితని ఎవరినైనా చూశారా? 142 00:08:34,933 --> 00:08:37,977 లుయీసా "పిచ్చిగీత" ఆల్కాట్ అని పేరున్న పుస్తకం నువ్వు చదువుతావా? 143 00:08:38,061 --> 00:08:40,230 అవును, కనీసం రెండుసార్లు చదువుతాను. 144 00:08:40,897 --> 00:08:44,150 ఈ పుస్తకంలోంచి 'ఎం'తో మొదలయ్యే పేరేదైనా ఎంచుకోమని మా అమ్మానాన్న చెప్పారు. 145 00:08:44,234 --> 00:08:45,777 దాని గురించి పట్టించుకోవాలా వద్దా? 146 00:08:46,611 --> 00:08:48,405 నీ మధ్యపేరు ఎంచుకునే అవకాశం నీకు దొరికిందా? 147 00:08:48,488 --> 00:08:50,115 నువ్వు ఖచ్చితంగా పట్టించుకోవాలి. 148 00:08:50,198 --> 00:08:54,077 నువ్వు చేయాల్సిందల్లా నీకు సరిగ్గా సరిపోయే 'ఎం' పేరుని ఎంచుకోవడమే. 149 00:08:58,456 --> 00:09:00,292 ముందు "మెలనీ" సంగతి చూద్దాం. 150 00:09:03,879 --> 00:09:05,297 తర్వాత "మే." 151 00:09:08,049 --> 00:09:09,342 "మార్గో." 152 00:09:14,431 --> 00:09:15,432 "మోర్డెకాయ్." 153 00:09:15,515 --> 00:09:16,516 హ-హా! 154 00:09:20,770 --> 00:09:24,065 అన్నిటికంటే చెత్త పేరు 'మెర్లిన్' ఆఖరుకి ఉంచుకుంటాను. 155 00:09:29,112 --> 00:09:30,530 ఈగ! 156 00:09:35,243 --> 00:09:37,662 ఇంకో ఎగ్ క్రీం ఇవ్వు, డార్బీ. 157 00:09:38,330 --> 00:09:41,041 ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశావు, అమ్మాయి. 158 00:09:41,124 --> 00:09:43,209 డార్బీ, నేను చిన్నపిల్లని కాదు. 159 00:09:43,293 --> 00:09:46,880 నా ఎగ్ క్రీమ్స్ విషయంలో జోక్యం చేసుకోకు, లేదంటే నిన్ను కొరుకుతాను! 160 00:09:51,343 --> 00:09:53,011 సరే, ఇక ఆపుకోవడం నా వల్ల కాదు. 161 00:09:53,094 --> 00:09:54,971 "పిచ్చిగీత"తో సమస్యేంటో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు. 162 00:09:56,056 --> 00:09:58,975 హ్యారియట్ "ఎం పిచ్చిగీత" వెల్ష్ భవిష్యత్తు చూశాను, 163 00:09:59,059 --> 00:10:00,477 అదేమంత గొప్పగా లేదు. 164 00:10:00,560 --> 00:10:03,271 అక్కడ కొన్ని విచిత్రమైన రోబోట్లున్నాయి, మేరియన్ ప్రెసిడెంట్ గా ఉంది. 165 00:10:05,690 --> 00:10:09,027 డార్బీ సరిగ్గా చెప్పింది. నువ్వు మరీ ఎక్కువ ఎగ్ క్రీములు తిన్నట్లున్నావు. 166 00:10:09,110 --> 00:10:10,487 ప్రయత్నించినందుకు థాంక్స్. 167 00:10:10,570 --> 00:10:13,782 నాకు 'ఎం' అనే మధ్య పేరు సహజంగానే పనికిరాదేమో. 168 00:10:14,407 --> 00:10:16,451 అసలు నువ్వు చెప్పిందేదీ నిజం కాకపోతే? 169 00:10:16,534 --> 00:10:17,619 ఏంటి నీ ఉద్దేశం? 170 00:10:17,702 --> 00:10:20,330 బర్త్ సర్టిఫికేట్ మీద మీ నాన్న గీసిన పిచ్చిగీతని 171 00:10:20,413 --> 00:10:22,207 అసలు ఎవరైనా నిజంగా చూశారా? 172 00:10:22,290 --> 00:10:24,459 అది ఖచ్చితంగా 'ఎం'లాగా కనిపిస్తోందని ఏంటి గ్యారంటీ? 173 00:10:25,377 --> 00:10:27,337 మనకు తెలీదు. నువ్వు చెప్పింది నిజమే. 174 00:10:27,420 --> 00:10:31,007 అది పూర్తిగా వేరే అక్షరం కూడా అయ్యుండొచ్చు. దీన్ని పరీక్షించాలి. 175 00:10:31,633 --> 00:10:36,930 ఫ్రెండ్స్, ఈ ప్రయాణం నా గుర్తింపు కోసం జరుగుతున్నది. 176 00:10:37,472 --> 00:10:38,765 నేను ఒంటరిగా వెళ్ళాలి. 177 00:10:43,687 --> 00:10:46,356 తనకు "పిచ్చిగీత" అవసరం లేకపోతే, నేను తీసుకుంటాను. 178 00:10:48,233 --> 00:10:51,361 వాస్తవం తెలుసుకోవడం కోసం నేను సిటీ హాల్ చేరుకున్నాను. 179 00:10:51,444 --> 00:10:53,572 నేను నిజంగా ఎవరో చూడడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీగా... 180 00:10:56,700 --> 00:11:00,996 మిస్సిసిపి నది కంటే పొడవైన లైనులో నిలబడడం. 181 00:11:01,496 --> 00:11:03,498 అయ్య బాబోయ్! 182 00:11:09,504 --> 00:11:13,508 ఇదేమీ సరదా కాదు. నా మధ్య పేరేంటో నాకు తెలియడం లేదు. 183 00:11:22,225 --> 00:11:25,145 పింకీ వైట్ హెడ్ పెద్దయ్యాక ఎలా ఉంటాడో, ఆ క్లర్క్ అచ్చం అలాగే ఉన్నాడు. 184 00:11:25,228 --> 00:11:29,065 బహుశా 1964కి వెళ్లిన భవిష్యత్తు పింకీ కావొచ్చు, 185 00:11:29,149 --> 00:11:33,403 లైన్ వీలైనంత నెమ్మదిగా కదిలేలా చేయడమే వాడి లక్ష్యంలా ఉంది. 186 00:11:36,114 --> 00:11:37,115 ఒక చిన్న సలహా. 187 00:11:37,198 --> 00:11:38,658 ఈసారి మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటే, 188 00:11:38,742 --> 00:11:41,578 ఆ నంబరుకు కాల్ చేయడం ద్వారా మీరు లైన్ ను తప్పించుకోవచ్చు. 189 00:11:46,082 --> 00:11:47,792 మీకేదైనా ప్రశ్న ఉంటే, 555 - 7568కు కాల్ చేయండి 190 00:11:47,876 --> 00:11:50,712 ఆ నెంబర్ చూసేసరికి నాకో పెద్ద ఐడియా వచ్చింది. 191 00:11:50,795 --> 00:11:55,175 దానికి కావలసిన ధైర్యం, నైపుణ్యం, కపటత్వం 192 00:11:55,258 --> 00:11:59,596 కేవలం ఒక గొప్ప గూఢచారికి మాత్రమే ఉంటాయి. 193 00:12:12,317 --> 00:12:13,902 ఒక్క క్షణం ఆగండి. 194 00:12:14,861 --> 00:12:17,113 సిటీ హాల్ నేమ్ రిజిస్ట్రీ. చార్లెస్ మాట్లాడుతున్నాను. 195 00:12:17,197 --> 00:12:21,826 హలో చార్లెస్. నాపేరు కారొల్ వెల్ష్, అవును, కారొల్ వెల్ష్, 196 00:12:21,910 --> 00:12:26,331 ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, కాబట్టి మా అద్భుతమైన అమ్మాయి తన బర్త్ సర్టిఫికేట్ 197 00:12:26,414 --> 00:12:28,041 చెక్ చేయడం కోసం అక్కడికి వస్తోంది. 198 00:12:28,124 --> 00:12:29,709 సరే, మేడం, నా ఉద్దేశం... 199 00:12:29,793 --> 00:12:34,673 ముందుగా చేతిరాతతో తన పేరు ఏమని రాసుందో ఒకసారి మీరు చదివి వినిపించగలరా? 200 00:12:35,757 --> 00:12:36,758 ఖచ్చితంగా. 201 00:12:37,592 --> 00:12:41,179 ఓహ్, సరే, దొరికింది మిసెస్ వెల్ష్. చేతిరాత ఏమి రాసి ఉందంటే, "హ్యారియట్... 202 00:12:41,263 --> 00:12:43,348 హ్యారియట్…" 203 00:12:43,431 --> 00:12:44,724 చెప్పండి? చెప్పండి? 204 00:12:45,517 --> 00:12:46,518 హ్యారియట్ తర్వాత ఏంటి? 205 00:12:46,601 --> 00:12:50,564 హ్యారియట్ "డబ్ల్యూ"? హ్యారియట్ "ఆర్"? లేదా "క్యు" అయ్యుండొచ్చా? 206 00:12:50,647 --> 00:12:53,650 సారీ, అది కేవలం ఒక పిచ్చిగీతలాగా కనిపిస్తోంది, మేడమ్. 207 00:12:54,359 --> 00:12:57,529 పిచ్చిగీతా? ఖచ్చితంగా అంటున్నారా? 208 00:12:57,612 --> 00:13:00,532 అవును. ఎవరో పెన్ను సరిగా రాయకపోతే గీకినట్లుంది. 209 00:13:00,615 --> 00:13:04,828 ఆ సమయంలో నేను పూర్తిగా నాపై నియంత్రణ కోల్పోయాను. 210 00:13:04,911 --> 00:13:07,497 మేడమ్? మేడమ్? మీరు లైన్లో ఉన్నారా? 211 00:13:08,957 --> 00:13:10,083 హలో? హేయ్. 212 00:13:10,166 --> 00:13:13,378 సారీ, చార్లెస్. నేను రెండే క్షణాల్లో ఒక విషయం పరిశీలించాలి. 213 00:13:13,461 --> 00:13:14,462 హ్యారియట్ వెల్ష్ 214 00:13:14,546 --> 00:13:18,550 క్లర్క్ చెప్పింది నిజమే. అది ఒక పిచ్చిగీత, అంతకుమించి ఏమీ లేదు. 215 00:13:20,886 --> 00:13:24,723 చూడమ్మా, రెండు క్షణాలు పూర్తయ్యాయి. ఆ పేపర్ తిరిగి ఇచ్చేయ్. 216 00:13:26,016 --> 00:13:29,102 నేను ఇవ్వలేను, చార్లెస్. నన్ను క్షమించు. 217 00:13:30,604 --> 00:13:32,689 హేయ్! ఆగు. సెక్యూరిటీ! 218 00:13:32,772 --> 00:13:35,025 నా కాళ్ళు ఏం చేస్తున్నాయో నాకే తెలీలేదు. 219 00:13:35,108 --> 00:13:38,320 నా మెదడు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా నన్ను పురికొల్పింది. 220 00:13:38,403 --> 00:13:43,283 నాకు తెలిసినదల్లా నేనొక పిచ్చిగీతని, నేను ఆ ఆధారాన్ని నాశనం చేయాలి. 221 00:13:57,380 --> 00:13:58,840 వెనక్కి రా! 222 00:14:06,014 --> 00:14:08,767 నేను సెక్యూరిటీ గార్డులకి అన్ని విషయాలూ వివరించాను, 223 00:14:08,850 --> 00:14:10,769 అయినా కూడా వాళ్ళు మా అమ్మానాన్నని పిలిచారు. 224 00:14:12,354 --> 00:14:15,315 లేదు, పక్కనుండి చూస్తే, "ఇ" లాగా కనిపిస్తోంది. "ఎం" కాదు. 225 00:14:15,398 --> 00:14:16,691 నాకు "టూ" లాగా అనిపిస్తోంది. 226 00:14:16,775 --> 00:14:19,527 మమ్మల్ని క్షమించండి. సారీ. 227 00:14:20,862 --> 00:14:22,322 హ్యారియట్ ఎం... 228 00:14:22,405 --> 00:14:25,825 హ్యారియట్ వెల్ష్, నువ్వసలు ఏం చేశావు? 229 00:14:33,333 --> 00:14:35,293 నన్ను క్షమించండి. నేను... 230 00:14:35,377 --> 00:14:38,547 నేనొక పిచ్చిగీతలాగా ఉండాలనుకోలేదు. 231 00:14:38,630 --> 00:14:44,678 మేఘన్ లాగా, మెలనీ లాగా, చివరికి మెర్లిన్ లాగా ఉండాలని ప్రయత్నించాను. ఎంత పొరబాటు. 232 00:14:44,761 --> 00:14:50,058 కానీ నాకు ఏదీ సరిగా అనిపించలేదు, ఇప్పుడు నేనెవరో నాకు తెలియడం లేదు! 233 00:14:51,351 --> 00:14:55,146 హ్యారియట్ ఎం. వెల్ష్ నుండి హ్యారియట్ "పిచ్చిగీత" వెల్ష్ గా మారిపోయా. 234 00:14:55,230 --> 00:14:56,731 తర్వాత హ్యారియట్ "క్రిమినల్" వెల్ష్, 235 00:14:56,815 --> 00:14:59,609 చివరికి హ్యారియట్ "పిచ్చివాగుడు వాగే పిల్ల" వెల్ష్ గా మారాను. 236 00:14:59,693 --> 00:15:01,236 ఓహ్, హ్యారియట్. 237 00:15:01,319 --> 00:15:02,737 మమ్మల్ని క్షమించు. 238 00:15:02,821 --> 00:15:04,739 మిస్టర్ అండ్ మిసెస్ వెల్ష్? 239 00:15:05,490 --> 00:15:07,826 నాకు అనుమతిస్తే, ఈ విషయం నేను చూసుకుంటాను. 240 00:15:09,369 --> 00:15:12,122 హ్యారియట్ పిచ్చిగీత-డూడుల్-చికెన్-స్క్రాచ్ వెల్ష్, 241 00:15:12,205 --> 00:15:14,833 నువ్వు ఖాళీగా ఉంటే, నువ్వు నాతో రావాలని కోరుకుంటున్నాను. 242 00:15:19,212 --> 00:15:23,174 మనం ఎక్కడికి వెళ్తున్నాం? జైలుకా? జైలుకే కదా? 243 00:15:23,258 --> 00:15:26,219 హ్యారియట్, నీకొకటి చూపించాలని నిన్ను ఒకచోటికి తీసుకెళుతున్నాను. 244 00:15:26,303 --> 00:15:28,138 అది జైలు కూడా కావొచ్చు. 245 00:15:28,221 --> 00:15:30,557 ఏ తల్లిదండ్రులూ పర్ఫెక్ట్ గా ఉండరని, 246 00:15:30,640 --> 00:15:34,644 కొన్నిసార్లు మనకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటారనీ నీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. 247 00:15:35,312 --> 00:15:39,107 మీకు చెప్పడం చాలా తేలిక, కేథరిన్ విల్లా గాలియానో. 248 00:15:43,653 --> 00:15:45,822 మనం జైలుకు వెళుతున్నాం, కదూ? 249 00:15:45,906 --> 00:15:48,158 నువ్వు ఇలాగే అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా వెళతాం. 250 00:15:56,249 --> 00:15:59,336 కేథరిన్! నా బంగారు తల్లీ! 251 00:15:59,419 --> 00:16:00,420 హలో, అమ్మా. 252 00:16:00,503 --> 00:16:02,130 అమ్మా? 253 00:16:02,214 --> 00:16:05,967 ఓహ్, నా ఇంటికి ఎవరూ రారు. లోపలికి రా, లోపలికి రా. 254 00:16:08,720 --> 00:16:09,804 కూర్చో, కూర్చో. 255 00:16:11,848 --> 00:16:14,184 మీ ఇల్లే అనుకో తల్లీ. 256 00:16:17,938 --> 00:16:20,148 ఇవన్నీ తిను, సిగ్గుపడకు. 257 00:16:20,232 --> 00:16:24,778 కేథరిన్, నేను ఇన్నాళ్ళకి హ్యారియట్ ని కలిశానంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. 258 00:16:24,861 --> 00:16:28,031 తన విలువైన బుజ్జి డ్రెస్ వేసుకున్న బుజ్జి హ్యారియట్. 259 00:16:29,157 --> 00:16:33,161 మైక్రోస్కోప్ కింద ఉంచిన ఒక విలువైన అమీబా లాగా ఫీలయ్యాను. 260 00:16:33,245 --> 00:16:35,455 నువ్వు విలువైన దానివి కదూ? 261 00:16:36,331 --> 00:16:40,377 నీ బుల్లి కళ్ళద్దాలకు అద్దాలు లేవా? 262 00:16:40,460 --> 00:16:42,045 అవి నిఘా వేసేందుకు మాత్రమే. 263 00:16:42,128 --> 00:16:48,593 అయ్యుండొచ్చు. ముద్దుగా ఉన్నాయి! ఆ బుగ్గలు చూడు. కమాన్. 264 00:16:48,677 --> 00:16:50,679 అమ్మా, తనని ఉక్కిరిబిక్కిరి చేయకు. 265 00:16:51,304 --> 00:16:54,724 నువ్వు ఇంటి నుండి బయటకి వెళ్లిపోయాక ముద్దు చేయడానికి నాకు ఎవరూ లేరు. 266 00:16:56,351 --> 00:17:00,397 ఓల్ గోలీని వాళ్ళ అమ్మతో చూడడం అంటే, టీచర్ ని స్కూలు బయట చూడడమే. 267 00:17:00,480 --> 00:17:02,566 అన్నీ గందరగోళంగా అనిపించాయి. 268 00:17:03,233 --> 00:17:07,112 కేథరిన్, నీ జాకెట్ చాలా పలుచగా ఉంది. నువ్వు చలికి ఇబ్బంది పడతావు. 269 00:17:07,195 --> 00:17:09,322 నా గదిలోంచి ఒక స్వెట్టర్ తెచ్చుకుని వేసుకో. 270 00:17:09,406 --> 00:17:12,659 అమ్మా, ఇప్పుడు న్యూయార్క్ లో ఆకురాలు కాలం, యుకోన్ లో లాగా చలికాలం కాదు. 271 00:17:14,660 --> 00:17:15,661 సరే. 272 00:17:20,750 --> 00:17:24,754 అయితే, హ్యారియట్, ఈరోజు నువ్వు దూరంగా ఉన్న రాక్ అవే కి రావడానికి కారణమేంటి? 273 00:17:24,838 --> 00:17:27,173 నాకు తెలిసిందల్లా నేను తప్పు చేసి దొరికిపోయాను, 274 00:17:27,257 --> 00:17:29,384 ఓల్ గోలీ నాకేదో చూపించాలని అనుకుంది. 275 00:17:29,467 --> 00:17:31,803 కానీ మధ్య పేరులో పిచ్చిగీత ఉన్నవాళ్లు, "విల్లా" లాంటి ఒక మంచి మధ్య పేరు 276 00:17:31,887 --> 00:17:34,848 ఉన్నవారి నుండి సలహా తీసుకునేటప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు 277 00:17:34,931 --> 00:17:36,808 కాబట్టి ఇది పనిచేస్తుందని నేననుకోను. 278 00:17:37,976 --> 00:17:40,186 మీరు బానే ఉన్నారా, మిసెస్ గాలియానో? 279 00:17:40,937 --> 00:17:44,316 విల్లా? విల్లా? 280 00:17:44,399 --> 00:17:49,154 కేథరిన్ గాలియానో, వెంటనే ఇక్కడికి రా! 281 00:17:49,237 --> 00:17:50,488 ఏంటమ్మా. ఏంటి సంగతి? 282 00:17:50,572 --> 00:17:55,452 నువ్వు ఇప్పటికీ ఆ చెత్త మధ్య పేరుతోనే కొనసాగుతున్నావా? 283 00:17:57,037 --> 00:17:59,164 నన్ను క్షమించండి. నాకేం తెలీదు. 284 00:17:59,247 --> 00:18:02,292 నీ మధ్య పేరు విల్లా కాదు, మర్టిల్. 285 00:18:02,375 --> 00:18:07,172 మీ ఆంటీ వాళ్ళ ఆంటీ పేరు. ఇది కుటుంబ పేరు, నీకు బాగా తెలిసి ఉండాలి. 286 00:18:07,255 --> 00:18:10,175 అమ్మా, మనం చిన్నప్పటి నుండి దీని గురించి గొడవపడుతున్నాం. 287 00:18:10,258 --> 00:18:13,220 నాకు "మర్టిల్" ఇష్టం లేదు. అది నాకు సరిపోదు. 288 00:18:13,303 --> 00:18:19,476 నువ్వు నీ బర్త్ సర్టిఫికేట్ చూడాలనుకుంటున్నావా? నీ పేరు కేథీ మర్టిల్ గాలియానో. 289 00:18:20,227 --> 00:18:23,605 నన్ను మర్టిల్ అని పిలవొద్దు. అలాగే కేథీ అని కూడా. 290 00:18:23,688 --> 00:18:27,984 బాగుంది. పిచ్చిగీత వల్ల కలిగిన శాపం కేవలం నా జీవితాన్ని నాశనం చేయడమే కాదు, 291 00:18:28,068 --> 00:18:30,654 ఓల్ గోలీ, ఇంకా వాళ్ళమ్మ మధ్య కూడా గొడవలు పెడుతోంది. 292 00:18:30,737 --> 00:18:34,199 ఆ దిక్కుమాలిన పిచ్చిగీత ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో? 293 00:18:34,282 --> 00:18:37,202 "విల్లా." ఇంతకీ అదసలు పేరేనా? 294 00:18:37,285 --> 00:18:39,454 మర్టిల్ కంటే బాగానే ఉంది. 295 00:18:39,537 --> 00:18:43,375 మర్టిల్ కూడా మర్టిల్ లాగా ఉండాలనుకోదు. మరి ఎవరు మర్టిల్ కావాలనుకుంటారు? 296 00:18:43,458 --> 00:18:49,798 నేను! హ్యారియట్ వెల్ష్ అనే నేను... నాకు మర్టిల్ అనే పేరు నచ్చింది. 297 00:18:49,881 --> 00:18:52,592 అందువల్ల దాన్ని నా మధ్య పేరుగా స్వీకరిస్తున్నాను. 298 00:18:52,676 --> 00:18:55,762 మీకు అభ్యంతరం లేకపోతేనే, మిసెస్ గాలియానో. 299 00:18:55,845 --> 00:18:59,057 నాకు తోక మొలిచిందేమో అన్నంత వింతగా ఓల్ గోలీ నావైపు చూసింది. 300 00:18:59,140 --> 00:19:01,810 ఆవిడ చూపు ఎంత వింతగా ఉందంటే, అది నిజం కాదని నేను నిర్ధారించుకోవాల్సి వచ్చింది. 301 00:19:02,936 --> 00:19:05,313 అది అద్భుతంగా ఉంటుంది. 302 00:19:05,397 --> 00:19:09,818 అద్భుతం, హ్యారియట్! మర్టిల్ పేరు కొనసాగుతుంది. 303 00:19:09,901 --> 00:19:12,529 ఇకపై నన్ను ఒట్టి హ్యారియట్ అని పిలవకండి. 304 00:19:12,612 --> 00:19:15,532 "హ్యారియట్ మర్టిల్ వెల్ష్" అని మాత్రమే పిలవండి. 305 00:19:15,615 --> 00:19:18,034 నా బాష నచ్చకపోతే క్షమించండి, కానీ హుర్రే! 306 00:19:18,118 --> 00:19:21,162 -నేనంటున్నది... -ఇప్పుడు నువ్వు గాలియానో కుటుంబంలో 307 00:19:21,246 --> 00:19:25,625 అధికారికంగా సభ్యురాలివి, హ్యారియట్ మర్టిల్ వెల్ష్. 308 00:19:26,668 --> 00:19:31,298 పేరు: హ్యారియట్ మర్టిల్ వెల్ష్. మరణానికి కారణం: కౌగిలింతలో ఊపిరి ఆడక. 309 00:19:32,007 --> 00:19:35,594 హ్యారియట్, నాతో రా. నీకొకటి చూపించాలి. 310 00:19:41,808 --> 00:19:45,478 "పుస్తకాలని పాడు చేయొద్దు" అని నేను ఇందుకే చెబుతాను. 311 00:19:45,562 --> 00:19:48,440 పుస్తకాలు విలువైనవి, వాటిని ప్రేమతో చూసుకోవాలి. 312 00:19:48,523 --> 00:19:50,483 ఇవన్నీ మీవేనా? 313 00:19:52,485 --> 00:19:54,529 "విల్లా" పేరు ఎలా వచ్చిందంటే, 314 00:19:54,613 --> 00:19:57,198 నా చిన్నతనంలో, నేను రచయితని కావాలనుకున్నాను 315 00:19:57,282 --> 00:20:00,493 ది గ్రేట్ ప్లెయిన్స్ రాసిన 'విల్లా కేథర్' లాగా. 316 00:20:00,577 --> 00:20:02,495 కాబట్టి నేను నా మధ్య పేరుని 'విల్లా' అని మార్చుకున్నాను. 317 00:20:02,579 --> 00:20:03,997 ఓ పయనీర్స్! విల్లా కేథర్ 318 00:20:04,080 --> 00:20:07,709 ఆగండి, మీరు రచయిత కావాలనుకున్నారా, ఓల్ గోలీ? ఏం జరిగింది? 319 00:20:07,792 --> 00:20:11,838 నీకు ఉన్నంతగా నాకు అభిరుచి లేదు. 320 00:20:11,922 --> 00:20:15,175 కానీ నాకు పుస్తకాలు సేకరించడం ఇష్టమని తెలుసుకున్నాను. 321 00:20:15,258 --> 00:20:18,720 ఏదో ఒకరోజు ఇవన్నీ నా బుక్ స్టోర్ లో ఉంటాయి. 322 00:20:18,803 --> 00:20:20,764 నేను దానికి "విల్లాస్" అని పేరు పెడతాను. 323 00:20:21,556 --> 00:20:25,393 ప్రదర్సనకు అందరికంటే ముందుగా ఎవరి నవల ఉంటుందో తెలుసా? 324 00:20:26,269 --> 00:20:29,648 అమ్మాయిలూ, వెళ్లబోయే ముందు మిగిలిన స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. 325 00:20:29,731 --> 00:20:32,400 ఈ కాన్నోలిస్ వృధా అయితే నాకు నచ్చదు. 326 00:20:38,323 --> 00:20:42,285 గుడ్ బై, నా బుజ్జి హ్యారియట్ మర్టిల్ వెల్ష్. 327 00:20:42,369 --> 00:20:45,580 మా కేథరిన్ ని జాగ్రత్తగా చూసుకో, సరేనా? 328 00:20:45,664 --> 00:20:47,582 తప్పకుండా. బాధపడకండి! 329 00:20:56,758 --> 00:20:58,677 నీకు మర్టిల్ పేరు నచ్చలేదు, కదూ? 330 00:20:58,760 --> 00:20:59,844 అవును. 331 00:21:00,929 --> 00:21:02,097 నాకు తెలుసు. 332 00:21:02,847 --> 00:21:05,392 ముందైతే, మీ గొడవ ఆపాలని నేను ఆ పేరు పెట్టుకుంటానని చెప్పాను. 333 00:21:05,475 --> 00:21:07,936 కానీ దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, 334 00:21:08,019 --> 00:21:11,481 మర్టిల్ మీకు సంబంధించింది కాబట్టి, నేను ఉంచుకుంటాను. 335 00:21:11,565 --> 00:21:15,735 అయితే, ఇకపై నిన్ను "హ్యారియట్ మర్టిల్ వెల్ష్" అని పిలవాలా? 336 00:21:15,819 --> 00:21:17,904 ఖచ్చితంగా కాదు. జోక్ చేస్తున్నారా? 337 00:21:17,988 --> 00:21:20,323 నా పేరు హ్యారియట్ "ఎం, ఫుల్ స్టాప్" వెల్ష్. 338 00:21:20,407 --> 00:21:24,160 అయితే ఇప్పుడు 'ఎం' అంటే ఏమిటో నాకు తెలుసు. ఎప్పటికీ. 339 00:21:24,244 --> 00:21:25,954 నువ్వు ఒక గొప్ప రచయితవి అయ్యాక, 340 00:21:26,037 --> 00:21:28,498 నీ పేరులో మర్టిల్ ఉందని జనం తెలుసుకుంటారు. 341 00:21:29,916 --> 00:21:32,085 నేను పట్టించుకోను. నాకు ఎదురైన అనుభవాల తర్వాత, 342 00:21:32,168 --> 00:21:34,796 నాకు అర్థమయింది ఏంటంటే, మంచి రచయిత కావాలంటే బాగా రాయాలి, 343 00:21:34,880 --> 00:21:35,922 అంతేకానీ మంచి పేరుంటే సరిపోదు. 344 00:21:42,637 --> 00:21:44,723 -ఏం జరిగింది? -నేను ఊరికే ఆలోచిస్తున్నాను, 345 00:21:44,806 --> 00:21:47,601 ఏదో ఒకరోజు మీరు బుక్ స్టోర్ తెరిస్తే, 346 00:21:47,684 --> 00:21:50,478 మీరు ఎప్పటికీ నన్ను చూసుకునే నానీగా ఉండలేరు కదా. 347 00:21:51,605 --> 00:21:54,190 అవును, హ్యారియట్. ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతాను. 348 00:21:54,274 --> 00:21:57,611 కానీ కంగారుపడకు. మన మధ్య బంధం ఇలాగే ఉంటుంది. 349 00:21:57,694 --> 00:22:01,531 ఎందుకంటే మనిద్దరం 'ఎం' కథని పంచుకుంటున్నాం, అవునా? 350 00:22:01,615 --> 00:22:02,741 ఇప్పుడు మనమొక కుటుంబం. 351 00:22:03,408 --> 00:22:08,663 మంచి కథ. మనం కానోలీస్ ని రైల్లోనే వదిలేశాం. 352 00:22:18,632 --> 00:22:21,384 కాబట్టి ఏదేమైనా, నేను మా అమ్మానాన్నల్ని క్షమించాను. 353 00:22:21,468 --> 00:22:26,640 ఓల్ గోలీ చెప్పినట్లు, అందరూ తప్పులు చేస్తారు, అమ్మానాన్నలతో సహా. ముఖ్యంగా వాళ్ళే. 354 00:22:26,723 --> 00:22:30,560 తప్పులు చేస్తేనే గొప్ప కథలు వస్తాయి. 355 00:22:33,104 --> 00:22:35,190 నేను పిచ్చిగీతతో నా కథని ప్రారంభించాను... 356 00:22:37,317 --> 00:22:39,778 తద్వారా నా జీవితమే ప్రస్నార్థకంగా మారింది, 357 00:22:39,861 --> 00:22:45,200 చివరికి నా పేరులో 'ఎం' ఫుల్ స్టాప్ మిగిలిపోయింది. 358 00:22:45,283 --> 00:22:46,284 ఎం. 359 00:22:46,868 --> 00:22:49,371 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 360 00:22:49,454 --> 00:22:51,122 మనకు నచ్చినట్లు ఉండాలి 361 00:22:52,249 --> 00:22:54,793 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 362 00:22:54,876 --> 00:23:00,382 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 363 00:23:02,551 --> 00:23:08,223 నా చుట్టపక్కల అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తాను 364 00:23:08,306 --> 00:23:10,850 నేను అందంగా నవ్వుతాను 365 00:23:10,934 --> 00:23:14,062 నిజం మాత్రమే చెప్పాలని తపిస్తాను 366 00:23:14,145 --> 00:23:16,648 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 367 00:23:16,731 --> 00:23:18,567 మనకు నచ్చినట్లు ఉండాలి 368 00:23:19,442 --> 00:23:22,195 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 369 00:23:22,279 --> 00:23:25,031 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 370 00:23:25,115 --> 00:23:27,617 నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అదే అవుతాను 371 00:23:27,701 --> 00:23:29,619 నాదే తుది నిర్ణయం 372 00:23:30,328 --> 00:23:33,123 నాకు నచ్చినట్లు ఉండాలి నీకు నచ్చినట్లు ఉండాలి 373 00:23:33,206 --> 00:23:35,125 మనకు నచ్చినట్లు ఉండాలి 374 00:23:35,208 --> 00:23:37,794 లేదు, నా జుట్టు కత్తిరించుకోను 375 00:23:37,878 --> 00:23:40,630 నాకు నచ్చిందే వేసుకుంటాను 376 00:23:40,714 --> 00:23:46,219 నాకు నచ్చినట్లుగా ఉండడం నాకిష్టం 377 00:23:46,303 --> 00:23:49,222 నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు 378 00:23:49,306 --> 00:23:54,019 మేమేం చేయాలో చెబితే మాకు ఇష్టం లేదు 379 00:23:54,102 --> 00:23:56,104 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ