1 00:00:40,436 --> 00:00:43,898 మేం 13 దేశాల గుండా 13,000 మైళ్ళు ప్రయాణించబోతున్నాం. 2 00:00:44,482 --> 00:00:49,070 ఉషువాయా నుండి అర్జెంటీనా, చిలీ మీదుగా అటకామా ఎడారి చేరుకుని, 3 00:00:49,153 --> 00:00:52,407 అక్కడి నుంచి టిటికాకా సరస్సు దాటడానికి ముందు లా పాజ్ వెళ్తాం, 4 00:00:52,490 --> 00:00:56,286 ఆ తర్వాత ఆండీస్ పర్వత శ్రేణిని అనుసరిస్తూ కొలంబియా, అక్కడి నుంచి పనామా మీదుగా 5 00:00:56,369 --> 00:01:01,040 సెంట్రల్ అమెరికా, మెక్సికోలను దాటి 100 రోజుల తర్వాత లాస్ ఏంజలెస్ చేరతాం. 6 00:01:01,583 --> 00:01:02,667 రస్ మాల్కిన్ దర్శకుడు-నిర్మాత 7 00:01:02,750 --> 00:01:04,501 మేం వీళ్ళకి వీడియో కెమెరాలు ఇస్తాం, 8 00:01:04,586 --> 00:01:08,047 పైగా వాళ్ళ క్రాష్ హెల్మెట్లలోనూ మైక్రోఫోన్ అమర్చిన కెమెరాలు ఉంటాయి, 9 00:01:08,131 --> 00:01:09,757 కాబట్టి, వాటితో బైక్ నడుపుతూనే చిత్రీకరణ చేయవచ్చు 10 00:01:09,841 --> 00:01:13,261 ఇదీ అసలు రోడ్డేనా? దేవుడా! 11 00:01:13,344 --> 00:01:14,387 డేవిడ్ అలెగ్జానియన్ దర్శకుడు-నిర్మాత 12 00:01:14,470 --> 00:01:15,722 వాళ్ళతో మూడో బైక్ వెళ్తూ ఉంటుంది, 13 00:01:15,805 --> 00:01:17,098 దాని మీద కెమెరామెన్ క్లాడియో వెళతాడు. 14 00:01:17,181 --> 00:01:20,310 అది కాకుండా, నేను, రస్ రెండు ఎలక్ట్రిక్ పికప్ వాహనాల్లో వాళ్లని అనుసరిస్తాం, 15 00:01:20,393 --> 00:01:21,978 మాతో కెమెరామెన్లు జిమ్మీ, 16 00:01:22,061 --> 00:01:25,773 ఆంథోనీ, టైలర్ వస్తారు. వీళ్లు కావలసిన ఏర్పాట్లు కూడా చూసుకుంటారు. 17 00:01:25,857 --> 00:01:27,525 మేము కారు నుండే వాళ్ళని చిత్రీకరిస్తూ, 18 00:01:27,609 --> 00:01:29,152 వాళ్లని సరిహద్దుల్లో కలుస్తూ ఉంటాం, 19 00:01:29,235 --> 00:01:32,197 అది పక్కనబెడితే, వాళ్ళ ప్రయాణం వారిదే అన్నమాట. 20 00:01:36,284 --> 00:01:40,288 ఒహాకా మెక్సికో 21 00:01:42,123 --> 00:01:45,335 లాస్ ఏంజెలిస్ కు 2,306 మైళ్లు 22 00:01:50,215 --> 00:01:53,343 మనం మెక్సికోలో ఈ సమస్యాత్మక ప్రాంతాలన్నీ దాటాల్సి ఉంటుంది. 23 00:01:53,426 --> 00:01:55,261 కొంతమందేమో ఇవి చాలా ప్రమాదకరమైన ప్రాంతాలు అంటారు. 24 00:01:55,345 --> 00:01:57,722 మరికొందరు అంత ప్రమాదకరం కాదంటారు. 25 00:01:57,805 --> 00:02:00,934 రాత్రివేళల్లో ప్రయాణించకపోవడమే మంచిది. 26 00:02:01,017 --> 00:02:02,977 అది మంచి ఆలోచన కాదు. 27 00:02:03,061 --> 00:02:05,230 అవును, నిజంగానే. చూద్దాం, చూద్దాం. 28 00:02:05,313 --> 00:02:07,732 కానీ, బస్సు ఎక్కాక మన ప్రయాణం కాస్త సరదాగానే సాగేటట్లు ఉంది. 29 00:02:08,440 --> 00:02:10,068 ఇకపై మన ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలని ఆతృతగా ఉంది. 30 00:02:17,659 --> 00:02:19,953 ఆగుము 31 00:02:20,036 --> 00:02:21,621 అబ్బా, ఇది భలే ఉంది, డేవ్. 32 00:02:21,704 --> 00:02:24,457 -లోపలకి వచ్చి చూడండి. -చూద్దాం, పద. 33 00:02:24,541 --> 00:02:25,750 సరే. 34 00:02:25,833 --> 00:02:27,502 -సీటు బాగా కిందకు దిగుతోంది. -వావ్. 35 00:02:27,585 --> 00:02:29,420 -ఇది చాలా కిందకు ఉంది. -కాస్త కిందకే ఉంది. 36 00:02:30,296 --> 00:02:31,756 ఏదైనా సమస్య ఉంటే, ఇప్పుడే పరిష్కరించుకోవాలి, 37 00:02:31,839 --> 00:02:33,633 అంతేతప్ప, చివావా రాష్ట్రం చేరుకున్నాక కాదు, సరేనా? 38 00:02:33,716 --> 00:02:35,802 -చివావాలో ఏ సమస్యా తలెత్తకూడదనే ఆశిద్దాం. -హోసా? హోసాలా? 39 00:02:35,885 --> 00:02:37,303 అయినా చివావాలో కుక్కపిల్ల దొరుకుతుందేమో చూస్తాను. 40 00:02:37,887 --> 00:02:38,888 చివావా. 41 00:02:39,806 --> 00:02:42,267 -మీరే నిర్ణయించుకోండి. -వాళ్లు నీలం రంగు వేశాక... 42 00:02:42,350 --> 00:02:44,936 నీలం రంగు ఒకవైపు, నారింజ రంగు మరోవైపునా? 43 00:02:45,019 --> 00:02:46,771 ఆ సంగతి అడిగి ఉండాల్సింది. 44 00:02:46,855 --> 00:02:48,064 దేవుడా. 45 00:02:48,147 --> 00:02:49,148 చూడు. 46 00:02:49,232 --> 00:02:51,651 బహుశా అది తప్పుడు నిర్ణయమై ఉంటుంది. 47 00:02:51,734 --> 00:02:52,735 మైకేల్ స్థానిక నిర్మాత 48 00:02:52,819 --> 00:02:56,406 ఇదైతే... ఆగు నారింజ రంగు అయితే బాగుంటుంది. 49 00:02:56,489 --> 00:02:58,908 -ఆ నీలం రంగు నాకు బాగా నచ్చింది. -అదా? 50 00:02:58,992 --> 00:03:00,034 -అదీ. -అదే. 51 00:03:00,118 --> 00:03:01,494 అవును, అదైతే బాగుంటుంది. 52 00:03:01,578 --> 00:03:02,912 అవును, గురూ. 53 00:03:02,996 --> 00:03:04,455 -Long Way Up గురించి ఆలోచిస్తున్నా. -లేదంటే... 54 00:03:04,539 --> 00:03:07,458 -మనం Long Way Up లోగో వేయించాల్సింది. -దానిపై మెరుపు బొమ్మ వేయిస్తే? 55 00:03:07,542 --> 00:03:09,335 -అలాగే. -కరెంటు మెరుపు బొమ్మా? 56 00:03:09,419 --> 00:03:11,880 ఆ బొమ్మ పైనుంచి ఒక గీత ఉండాలి, ఎందుకంటే, ఇది ఎలక్ట్రిక్ బస్సు కాదు కదా. 57 00:03:13,798 --> 00:03:15,341 సరే. మరి సీట్ల సంగతి. 58 00:03:15,425 --> 00:03:16,968 మీకు ఎలా కావాలో చెప్పు. 59 00:03:17,051 --> 00:03:20,763 -నా ఉద్దేశం, ఇవి బాగానే ఉన్నాయి, అలాగే... -ఐదారు వరుసలు వదిలేయగలం 60 00:03:20,847 --> 00:03:24,017 అయినా కూడా బంకులు, బైకులకు కావలసినంత చోటు ఉంటుంది. 61 00:03:24,100 --> 00:03:26,811 కాళ్లు పెట్టుకునేందుకు ఇదీ మరీ దూరంగా ఉంది. 62 00:03:36,571 --> 00:03:38,239 ఈ బస్సు చాలా పెద్దగా ఉంది. 63 00:03:38,323 --> 00:03:39,866 ఇలాంటి కుర్చీలు ఇక్కడ చాలా ఉన్నాయి. 64 00:03:40,950 --> 00:03:41,951 అబ్బా. 65 00:03:42,035 --> 00:03:43,620 ఈ లైట్లు బ్రేకులవి. 66 00:03:43,703 --> 00:03:44,704 ఒమర్ ఎలక్ట్రీషియన్ 67 00:03:44,787 --> 00:03:47,790 ఇవి ఎమర్జెన్సీ బ్రేకులకోసం. పక్కనుంచి వెళ్ళేవారికి కనబడేందుకు. 68 00:03:47,874 --> 00:03:50,126 మరి అవి ఎక్కడ... ఇవి బ్రేక్ లైట్లు... 69 00:03:50,210 --> 00:03:51,544 -బ్రేకులు తొక్కండి. ఇక్కడ. -ఇవి బ్రేక్ లైట్లు. 70 00:03:51,628 --> 00:03:53,129 ఇక్కడ ఉంది, సరే. 71 00:03:56,758 --> 00:03:59,469 ఈ కుర్చీలన్నీ లేకపోతే బస్సు ఎంత తేలిగ్గా ఉంటుందంటావు? 72 00:03:59,969 --> 00:04:02,222 గాల్లో తేలిపోతుంది. గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. 73 00:04:02,305 --> 00:04:03,598 ఎగిరే బస్సు అన్నమాట. 74 00:04:05,391 --> 00:04:07,769 కింద ఉన్న స్క్రూలు అన్నీ విప్పాలనుకుంటాను, కదా? 75 00:04:08,269 --> 00:04:09,729 అవి కనిపిస్తున్నాయా? 76 00:04:09,812 --> 00:04:13,066 మనలో ఒకరు బస్సు కిందకు వెళ్ళి, నట్లను గట్టిగా పట్టుకుంటే, 77 00:04:13,149 --> 00:04:15,109 పైనుంచి మరొకరు వాటిని విప్పేస్తారు. 78 00:04:16,110 --> 00:04:18,278 సరే, నేను కిందకు దూరి... 79 00:04:22,367 --> 00:04:23,910 బస్సును తయారు చేసేస్తున్నా, గురూ. 80 00:04:25,870 --> 00:04:26,871 సరే. 81 00:04:28,498 --> 00:04:31,543 చార్లీ, నువ్వు రక్షణ కోసం వాడే కళ్లద్దాలు పెట్టుకోవాలి. 82 00:04:31,626 --> 00:04:33,795 రీడింగ్ కళ్ళద్దాలు పెట్టుకునే ఉన్నానులే. 83 00:04:37,382 --> 00:04:38,383 అబ్బా, మిత్రమా. 84 00:04:38,466 --> 00:04:40,426 ఈ స్క్రూ ఒక్కటీ నాకు రావడం లేదు. 85 00:04:40,510 --> 00:04:41,511 ఇదా? 86 00:04:41,594 --> 00:04:43,388 కనీసం నేను ఒక్క స్క్రూ అయినా తీయాలి. 87 00:04:44,013 --> 00:04:46,724 మనం చివరకు జోకర్లలా తయారవుతున్నాం... 88 00:04:46,808 --> 00:04:49,852 నేను ఇలాంటి పనులు చూస్తూ... నటిస్తూ కాదు సుమా, చేస్తూ జీవితం గడిపేసాను. 89 00:04:49,936 --> 00:04:51,062 ఇలాంటి షోలు చూస్తూ అన్నమాట. 90 00:04:51,145 --> 00:04:53,481 ఒంటిపై పచ్చబొట్లు ఉన్న శ్రామికులు, అమెరికావ్యాప్తంగా, 91 00:04:53,565 --> 00:04:55,483 బైకులూ, కార్లూ బాగుచేస్తూ, తయారు చేస్తూ జీవితం కొనసాగిస్తారు... 92 00:04:56,276 --> 00:04:59,362 మనం కెమెరా ముందు ఒక్క నట్టు విప్పేందుకు ప్రయత్నిస్తే, 93 00:04:59,445 --> 00:05:04,784 అప్పుడు తెలుస్తుంది వాళ్లు ఎంతటి పనిమంతులో. 94 00:05:05,285 --> 00:05:06,536 ఒక నట్టు విప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. 95 00:05:08,580 --> 00:05:09,581 కమాన్! 96 00:05:11,207 --> 00:05:14,752 స్టీలును తెప్పించినందుకు సంతోషం. ఎందుకంటే ర్యాంపు కట్టడం చాలా ముఖ్యం. 97 00:05:22,135 --> 00:05:23,887 అక్కడే ఉండు. దాన్ని అలాగే పట్టుకో. 98 00:05:25,179 --> 00:05:27,765 -ఇద్దరు కూర్చునే చోటు ఉందా అక్కడ? -అతను ఉందనే అంటున్నాడు. 99 00:05:27,849 --> 00:05:30,101 అయితే మనం 20 అంగుళాల చొప్పున రెండు సీట్లు ఏర్పాటు చేద్దాం. 100 00:05:30,184 --> 00:05:31,394 దీన్ని ఒక మీటరు వెడల్పున ఉంచుదాం. 101 00:05:33,104 --> 00:05:34,439 మూడు మీటర్లు. 102 00:05:34,522 --> 00:05:35,523 ఎన్రిక్ మెకానిక్ 103 00:05:35,607 --> 00:05:39,277 50 సెంటీమీటర్లు వెడల్పు, మూడు మీటర్లు పొడవు. 104 00:05:39,360 --> 00:05:40,737 -తను నా సమస్యలు పరిష్కరిస్తున్నాడు. -అవును. 105 00:05:44,073 --> 00:05:46,117 నాకు ఒక స్క్రూ కనిపించింది... 106 00:05:46,201 --> 00:05:47,452 -నాకు ఒకటి కనిపించింది. -సరే. 107 00:05:47,535 --> 00:05:50,121 దేవుడా, దాన్ని కనిపెట్టడమే కష్టంగా ఉంది. 108 00:05:50,205 --> 00:05:52,165 నాకు ఒకటి దొరికింది. 109 00:05:52,248 --> 00:05:56,920 ఇదెంత కష్టమైన పనో, నాకు ఇక్కడ స్థలం ఎంత ఇరుకుగా ఉందో అతనికి తెలియట్లేదు. 110 00:05:57,003 --> 00:05:58,004 అదీ. 111 00:05:58,087 --> 00:05:59,714 సరే, నాకు ఒకటి దొరికింది. ఆగు. 112 00:05:59,797 --> 00:06:00,798 ఆగు, ఆగు. 113 00:06:01,424 --> 00:06:02,592 దాన్నే విప్పేందుకు ప్రయత్నించు. 114 00:06:05,970 --> 00:06:08,097 నీకు దొరికిందిగా. కానీ, కానీ. 115 00:06:08,181 --> 00:06:09,474 అలాగే ప్రయత్నించు. కాస్త... 116 00:06:09,557 --> 00:06:10,558 దాదాపు పూర్తి కావొచ్చింది. 117 00:06:11,893 --> 00:06:12,894 అయిపోవచ్చింది. 118 00:06:14,145 --> 00:06:15,146 కానీ. 119 00:06:15,230 --> 00:06:16,356 పూర్తి కావచ్చింది. 120 00:06:18,858 --> 00:06:20,193 -ఇప్పడు ఇది... -ఒకటి ఊడదీశాం! 121 00:06:20,276 --> 00:06:21,694 -యా! -విప్పదీశాం. 122 00:06:24,781 --> 00:06:27,200 సరే, ధన్యవాదాలు. 123 00:06:27,700 --> 00:06:28,910 ఖచ్చితమైన టైమింగ్. 124 00:06:29,494 --> 00:06:30,745 ఒక దాన్ని బయటకు తెచ్చాం, డేవ్! 125 00:06:31,704 --> 00:06:35,291 ఇక ఇప్పుడు బెడ్లు తయారు చేయాలి, అందుకు జి రకం స్క్రూలు కావాలి, 126 00:06:35,375 --> 00:06:38,253 ఇంకా లైటింగ్, ఎలక్ట్రిక్ పనులు చేయాల్సి ఉంది, 127 00:06:38,336 --> 00:06:40,797 తలుపు పని మిగిలే ఉంది, తలుపు మరికాస్త తెరచుకునేలా చేయాలి, 128 00:06:40,880 --> 00:06:43,716 పైకప్పును ఉంచి, జనరేటర్లను పెట్టేందుకు చోటు చూడాలి, 129 00:06:43,800 --> 00:06:44,884 జనరేటర్లను పెట్టాలి కదా. 130 00:06:45,552 --> 00:06:46,803 అప్పుడే బస్సు పూర్తిగా సిద్ధమైనట్టు. 131 00:06:48,054 --> 00:06:49,847 పెద్దగా పనేం మిగల్లేదులే. 132 00:06:55,311 --> 00:06:58,815 ఉషువాయానుంచి బయల్దేరేటప్పుడు ఇదంతా మనం ఊహించామా? 133 00:06:58,898 --> 00:06:59,899 ఈ పనంతా చేయాల్సి వస్తుందని... 134 00:07:00,775 --> 00:07:04,070 పని పూర్తయ్యేంతవరకూ పది రోజులు ఈ బస్సు కిందే ఉండాలని అనుకున్నామా. 135 00:07:04,153 --> 00:07:06,281 పని పూర్తయ్యేందుకు ఇక ఇవాళ, రేపు మాత్రమే సమయం ఉంది. 136 00:07:11,119 --> 00:07:13,371 మనకు... నాకు పెద్దగా సమయం లేదు, గురూ... 137 00:07:13,454 --> 00:07:14,914 ఇంకా వెల్డింగ్ పని మొదలే కాలేదు, 138 00:07:14,998 --> 00:07:17,500 ఎందుకంటే, రావలసిన సామాను ఉదయం 8.00 గంటలకే రావలసింది. 139 00:07:17,584 --> 00:07:21,170 స్టీలు, అల్యూమినియం సామగ్రి ఈ పాటికే వచ్చేయాలి, నాకు ఇన్సూరెన్సు పాలసీ ఉంది. 140 00:07:21,671 --> 00:07:24,048 ఈ పని చక్కగా చేయాలి. 141 00:07:24,132 --> 00:07:28,636 అన్నింటికంటే ర్యాంపు కట్టడం చాలా ముఖ్యమైన పని. 142 00:07:28,720 --> 00:07:30,555 ప్రధాన బీమ్ ఇక్కడ వస్తుంది... 143 00:07:30,638 --> 00:07:31,639 మాట్ రివియన్ 144 00:07:31,723 --> 00:07:34,392 ...అదే బస్సు మొత్తానికి ఆధారమవుతుంది. బస్సు నిర్మాణానికి. 145 00:07:34,976 --> 00:07:36,060 ఇక్కడ కట్ చేయాల్సి వస్తుంది. 146 00:07:36,144 --> 00:07:39,898 నేను ఏం చేస్తానంటే, ఇక్కడ, అక్కడ నిలువుగా సపోర్ట్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను. 147 00:07:40,648 --> 00:07:43,902 ఈ పైన ఇక్కడనుంచి వచ్చేలా ఒక అతుకును పెడతాను 148 00:07:43,985 --> 00:07:48,281 నిలువుగా సపోర్ట్ ఇచ్చే చోట ఇరువైపులా 45 డిగ్రీల కోణంలో అది వస్తుంది. 149 00:07:48,364 --> 00:07:51,826 అలా చేస్తే, దీన్ని కట్ చేసి తీశాక, అది అన్నింటినీ పట్టి ఆపుతుంది. 150 00:07:51,910 --> 00:07:54,454 బ్రేక్ లైట్లు, ఇండికేటర్లు, హెడ్ లైట్లు. 151 00:07:54,537 --> 00:07:57,081 ఇది వెనుకవైపు పెట్టి, ఆ తర్వాత ఎల్ఇడీలు చూడాలి. 152 00:07:57,165 --> 00:07:59,042 -సమయం చాలా ముఖ్యం. -అవును. 153 00:07:59,667 --> 00:08:06,633 ఒకవేళ ఎల్ఇడి లైట్లు పనిచేయకపోతే, మరో ఆరు లైట్లు ఉంటాయి. 154 00:08:07,217 --> 00:08:09,010 దీనికి మద్దతుగా ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అమరుస్తాను, 155 00:08:09,093 --> 00:08:12,263 దానివల్ల నేను కట్ చేసేటప్పుడు, ఏమీ జరగకుండా ఉంటుంది. 156 00:08:12,347 --> 00:08:13,806 మన వద్ద ఇనుప తుక్కు ఏదైనా మిగిలిందా? 157 00:08:13,890 --> 00:08:15,350 దాంతో ఇదైనా తయారు చేద్దాం. 158 00:08:15,433 --> 00:08:17,435 -ర్యాంపు లోపలికి వెళ్ళిపోవాలి, దేవుడా! -అలాగే, నాకు తెలుసు. 159 00:08:19,354 --> 00:08:22,190 మనం గ్వాటెమాలా నుంచి రావడం వింతగా ఉంది, కదా? 160 00:08:22,273 --> 00:08:23,274 ఆ మరుసటి రోజు. 161 00:08:23,358 --> 00:08:25,652 నేను మ్యాప్ ను చూసి, "ఈ ప్రయాణం ఎలా చేశాం మనం?" అనుకున్నా. 162 00:08:25,735 --> 00:08:27,403 వెంటనే నాకు మనం బైకులపై వచ్చామన్న విషయం గుర్తుకొచ్చింది. 163 00:08:27,904 --> 00:08:29,113 ఇదంతా విచిత్రంగా అనిపిస్తోంది. 164 00:08:29,197 --> 00:08:31,282 నేను నమ్మలేకపోతున్నాను. 165 00:08:31,366 --> 00:08:35,578 ఒకసారి పరికించి చూస్తే, అర్జెంటీనా నుంచి మైళ్ల దూరం వచ్చామని అనిపిస్తుంది. 166 00:08:35,661 --> 00:08:39,165 అప్పుడు నీకు "దేవుడా, మేం... ఇంత దూరం ప్రయాణించామా" అనిపిస్తుంది. 167 00:08:39,707 --> 00:08:41,459 నిజంగా ఈ ప్రయాణం Long Way Up. 168 00:08:41,959 --> 00:08:42,961 కాదంటావా? 169 00:08:43,628 --> 00:08:45,922 మిగతా మన పర్యటనలకన్నా ఇదే సుదీర్ఘమైనదనిపిస్తోంది, కానీ కాదు. 170 00:08:46,005 --> 00:08:47,507 ఇదే చాలా చిన్నపాటి ప్రయాణం, కానీ పెద్దదని అనిపిస్తోందంతే. 171 00:08:48,258 --> 00:08:50,510 అవును. అలా ఎందుకు అనిపిస్తోందో తెలియదు మరి. 172 00:08:50,593 --> 00:08:51,594 వయసు పైబడుతోంది కదా. 173 00:08:52,387 --> 00:08:54,055 -నీకు అలా అనిపిస్తోందా? -మనం వయసు మళ్లినవాళ్లం, అలసిసొలసిన వాళ్లం. 174 00:08:55,181 --> 00:08:57,559 -ఛండాలం. -నిన్ను ఆ బస్సు కిందకు తోసేస్తాను. 175 00:09:04,357 --> 00:09:07,819 గత మూడు రోజులుగా నువ్వుచేసిన పని, నువ్వు లేకుండా నా వల్ల అయ్యేది కాదు. 176 00:09:07,902 --> 00:09:09,821 అద్భుతమైన పని, బాగుంది. దీన్ని చూడు. 177 00:09:09,904 --> 00:09:11,155 మన పని ఇంకా పూర్తి కాలేదు. 178 00:09:11,239 --> 00:09:12,615 రేపటిలోగా పూర్తి కావాలి, సరేనా? 179 00:09:12,699 --> 00:09:16,286 రేపు, అంతా అయిపోవాలి... మిగిలిన పనులన్నీ చక్కబెట్టాలి. 180 00:09:16,369 --> 00:09:18,788 -అలాగే. -రేపు ఒక గొప్ప రోజు అవుతుందని ఆశిద్దాం. 181 00:09:18,872 --> 00:09:21,499 -సరేనా? ధన్యవాదాలు, గురూ. -అలాగే, అలాగే. 182 00:09:24,002 --> 00:09:26,671 చూస్తే బస్సు భలేగా ఉంది. కానీ పూర్తి కావలసిన పనులు చాలానే ఉన్నాయి. 183 00:09:26,754 --> 00:09:29,090 ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. 184 00:09:29,173 --> 00:09:31,092 వాళ్ళు పనులన్నీ ఎలా పూర్తి చేస్తారో? 185 00:09:33,136 --> 00:09:35,096 సామగ్రి ఏమైనా వచ్చిందో లేదో ఒకసారి చూసి వస్తా. 186 00:09:35,179 --> 00:09:37,390 ర్యాక్ ఇక్కడ ఉండాలి. 187 00:09:38,141 --> 00:09:39,142 అవును! 188 00:09:40,518 --> 00:09:41,519 దీన్ని చూడు. 189 00:09:43,897 --> 00:09:46,608 దీన్ని ఒక్క రోజులో తయారు చేసేశారు. 190 00:09:47,734 --> 00:09:48,902 దీన్నీ, నిచ్చెనలనీ. 191 00:09:49,485 --> 00:09:51,362 దీన్ని ఎంత చక్కగా తయారు చేసి, రంగులు వేశారో చూడండి. 192 00:09:52,614 --> 00:09:53,615 ఒక్క రోజు. 193 00:10:01,497 --> 00:10:03,082 ఏం చేయాలని నేను వీళ్లని అడగను. 194 00:10:03,166 --> 00:10:06,878 ఎలా చేయాలో వాళ్లకు తెలుసు, నేను అనుకున్న దానికంటే చక్కగా చేస్తున్నారు. 195 00:10:07,962 --> 00:10:09,923 మా ప్రయాణం కోసం వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. 196 00:10:10,006 --> 00:10:11,007 ఇవాళ 5వ తేదీ. 197 00:10:11,090 --> 00:10:13,384 మేం ఈ పనులన్నీ మొదలుపెట్టింది 4వ తేదీన. 198 00:10:13,468 --> 00:10:15,720 ఇంత వేగంగా పనులు ఎక్కడా జరగవు. ఎక్కడా జరగవు. 199 00:10:15,803 --> 00:10:16,804 వాళ్ళని చూడండి. 200 00:10:20,058 --> 00:10:21,184 అవును, సమానం. 201 00:10:22,018 --> 00:10:23,019 ఇక్కడ, లేదా? 202 00:10:24,312 --> 00:10:25,480 అవును. 203 00:10:25,563 --> 00:10:27,148 ఈ అమరక అంతా భలేగా కుదిరింది. 204 00:10:27,232 --> 00:10:29,442 ఆ తర్వాత ఇదంతా ఇలా జరిగిపోతోంది... 205 00:10:29,526 --> 00:10:31,110 నాకు కాస్త ఇలా ఇచ్చావంటే... 206 00:10:34,364 --> 00:10:36,074 అవును, తను ఈ పనిని ఇలా... 207 00:10:38,952 --> 00:10:40,119 సరే. 208 00:10:51,047 --> 00:10:52,298 నారింజ రంగు వేసేస్తున్నారే! 209 00:10:54,384 --> 00:10:55,552 -చార్లీ. -అలా చూడు. 210 00:10:57,011 --> 00:10:58,137 దాన్ని ఆవిష్కరిస్తున్నాడు. 211 00:10:59,097 --> 00:11:00,557 చాలా బావుంది. 212 00:11:00,640 --> 00:11:02,225 -చూడు నీలం, నారింజ రంగులు భలే ఉన్నాయి. -అద్భుతంగా ఉన్నాయి. 213 00:11:02,308 --> 00:11:06,688 నాకైతే, నారింజ రంగు కాస్త కొట్టొచ్చినట్టు కనబడుతోంది... 214 00:11:11,818 --> 00:11:14,320 ఈ ర్యాంపుపైకి ఎక్కి, బైకులను లోపలకి ఎలా తీసుకువెళ్లాలా... 215 00:11:17,115 --> 00:11:18,616 అని నేను ఆలోచిస్తున్నాను. 216 00:11:18,700 --> 00:11:19,701 నువ్వేమంటావు... 217 00:11:20,326 --> 00:11:21,327 నేనేమన్నానో అర్ధమైందా? 218 00:11:22,245 --> 00:11:25,456 మళ్లీ ఒకసారి సరిగ్గా కొలిచి చూసి, 219 00:11:25,540 --> 00:11:28,543 వాస్తవానికి ఎంత చోటు ఉంటుందో చూస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. 220 00:11:28,626 --> 00:11:30,753 అలాగే. వెళ్లి బైకుల్ని కొలిచి వద్దాం. 221 00:11:30,837 --> 00:11:32,672 మనం ఎంత ఎత్తు ఉందన్నాం? 52 అంగుళాలా? 222 00:11:35,216 --> 00:11:36,759 -51. -51. 223 00:11:37,510 --> 00:11:39,804 రేపు ఉదయానికల్లా పని పూర్తయిపోతుందా? 224 00:11:40,388 --> 00:11:41,848 అవుతుంది కదా? కాదా? 225 00:11:42,473 --> 00:11:43,558 పూర్తి చేసేస్తాం. 226 00:11:51,065 --> 00:11:53,693 ఇప్పటివరకూ చూసిన మెక్సికో ఎంతో అద్భుతంగా ఉంది, 227 00:11:53,776 --> 00:11:55,653 ఇక్కడ జనం కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు, 228 00:11:55,737 --> 00:11:58,823 అయితే రాత్రివేళల్లో ప్రయాణించకూడదన్న సలహాను మనం గంభీరంగా తీసుకోవాలి. 229 00:11:58,907 --> 00:12:01,701 నేను ఎస్ఓఎస్ ఇంటర్నేషనల్ తో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను, 230 00:12:01,784 --> 00:12:04,787 మనకు భద్రతాపరమైన సలహాలు ఇస్తున్నది వాళ్లే కదా, 231 00:12:04,871 --> 00:12:07,332 వాళ్లు ఇలా వెళితే మంచిదన్నారు. 232 00:12:08,041 --> 00:12:10,376 -సరే, ఎల్ పాసోకా? -ఎల్ పాసోకి. 233 00:12:11,002 --> 00:12:14,088 మెక్సికో భయంకరంగా ఉందని చెప్పను, ఎందుకంటే ఇది నాకెంతగానో నచ్చింది... 234 00:12:14,172 --> 00:12:18,009 ఇక్కడ ఇంతదాకా స్నేహపూర్వక వాతావరణం, మంచి మనుషులే కనిపించారు. 235 00:12:19,135 --> 00:12:22,347 "ఎలా మొదలు పెట్టావన్నది కాదు, ఎలా పూర్తి చేశావన్నదే ముఖ్యం" అన్నారు కదా? 236 00:12:22,430 --> 00:12:24,015 -అవును. -మనం లక్ష్యాన్ని చక్కగా పూర్తి చేయాలి. 237 00:12:24,098 --> 00:12:26,809 మీరు జెనరేటర్లను సిద్ధం చేస్తే, 238 00:12:26,893 --> 00:12:28,895 నేను మన కుర్రాళ్లని పిలిచి, ఒకసారి నడిపి చూడమంటాను... 239 00:12:28,978 --> 00:12:30,855 అది నేను చూసుకుంటాను. నాకు హావియర్ తో పని ఉంది. 240 00:12:30,939 --> 00:12:32,607 సంబంధిత కాగితాల పని సజావుగా సాగాలి. 241 00:12:32,690 --> 00:12:34,067 అవసరమైన పత్రాల పని ఎంతవరకూ వచ్చింది? 242 00:12:34,150 --> 00:12:36,319 ఇన్సూరెన్సు కంపెనీ వాళ్ళు మరో 50 నిమిషాల్లో వస్తున్నారు. 243 00:12:36,402 --> 00:12:37,904 ప్లేట్లు, ఉదయం 11 గంటలకు తయారవుతాయి. 244 00:12:37,987 --> 00:12:39,739 -ఏంటవి? -ప్లేట్లు. 245 00:12:39,822 --> 00:12:41,449 కానీ, మనం ఉదయం 7.00 గంటలకే బయల్దేరాలి కదా. 246 00:12:41,533 --> 00:12:44,869 అవును, గురూ, కానీ అది ప్రభుత్వంతో పని. 247 00:12:44,953 --> 00:12:47,330 -నా చేతుల్లో లేదు కదా. -అది ప్రభుత్వ వ్యవస్థ పని. 248 00:12:47,413 --> 00:12:48,623 అది ఒక వ్యవస్థ. 249 00:12:48,706 --> 00:12:50,291 ఇంకేదైనా దారి ఉందా? 250 00:12:52,043 --> 00:12:54,254 -మరో దారి లేదు. -ఇప్పుడు ఆఫీసు మూసేస్తారు. 251 00:12:58,466 --> 00:12:59,467 మనకు సంబంధిత పత్రాలు సకాలంలో లభించవేమో, 252 00:12:59,551 --> 00:13:02,428 కానీ అసలు సమస్య ఏంటంటే, బస్సులోకి బైకులు పట్టేటట్లు లేవు, 253 00:13:02,512 --> 00:13:04,806 మనమేమో రేపే ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది. 254 00:13:05,765 --> 00:13:11,646 బైకు అద్దం వరకూ ఎత్తు చూస్తే 51 అంగుళాలు ఉంది. 255 00:13:12,438 --> 00:13:14,399 అద్దం వరకూ ఎత్తు ఎంత ఉంది? 256 00:13:14,983 --> 00:13:15,984 52. 257 00:13:16,067 --> 00:13:18,862 51 ఉంది, తలుపు ఎత్తేమో 52 అంగుళాలు ఉంది. 258 00:13:19,362 --> 00:13:21,531 కాబట్టి మనం స్క్రీన్ తీసేయాలన్నమాట. 259 00:13:21,614 --> 00:13:25,493 అయినా బైకులు లోపలకి వెళ్లకపోవచ్చు. 260 00:13:25,994 --> 00:13:31,249 మళ్లీ ఒకసారి చూసేందుకు ఇవాన్ వెళ్లాడు, హాండిల్ బార్ వరకూ 52 అంగుళాలు ఉంది, 261 00:13:31,332 --> 00:13:35,461 ఆపైన తలుపేమో 52 అంగుళాల ఎత్తే ఉంది, కాబట్టి బైకులు లోపలకి వెళ్లలేవు. 262 00:13:35,545 --> 00:13:36,838 కానీ సమస్య ఏంటంటే... 263 00:13:37,505 --> 00:13:39,716 ఇప్పుడు సమయం చూస్తే 5.30 అయింది. 264 00:13:39,799 --> 00:13:40,884 ఉదయమే మేం బయల్దేరాలి. 265 00:13:40,967 --> 00:13:42,385 ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. 266 00:13:51,436 --> 00:13:53,897 బైకుల్ని తీసుకువెళ్లేందుకుగాను బస్సుకు మళ్లీ మార్పులు చేస్తున్నాం. 267 00:13:53,980 --> 00:13:56,733 బైకులు ఇందులో పట్టకపోతే, చేసిన పనంతా వృథాయే. 268 00:13:57,525 --> 00:13:59,777 -ఇక్కడ, ఇక్కడ, అలాగే ఇక్కడ. -అలాగే. 269 00:14:00,486 --> 00:14:01,487 అవును, అవును. 270 00:14:01,571 --> 00:14:03,114 "గరిష్ఠంగా" అనడానికి స్పానిష్ లో ఏమంటారు? 271 00:14:03,198 --> 00:14:05,158 -మూచో. -మూచో? 272 00:14:05,241 --> 00:14:06,826 భలే చెప్పావు. 273 00:14:09,495 --> 00:14:10,788 -బాగా చెప్పావు. -అవును. 274 00:14:15,043 --> 00:14:20,215 ఇప్పుడు తెల్లవారుజామున 3.00 అయింది, మేం ఉదయాన్నే బయల్దేరాలి. 275 00:14:21,299 --> 00:14:22,634 వీళ్ళు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. 276 00:14:22,717 --> 00:14:24,093 రోజంతా కష్టపడుతూనే ఉన్నారు. 277 00:14:24,177 --> 00:14:26,512 రాత్రంతా కూడా పని చేశారు. అందరూ. 278 00:14:26,596 --> 00:14:28,014 ఇలాంటి పనిమంతుల్ని నేను ఎక్కడా చూడలేదు. 279 00:14:29,015 --> 00:14:31,017 ఇప్పుడు మేం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే 280 00:14:31,100 --> 00:14:32,560 ఈ ర్యాంపుల్ని లోపలకి ఎక్కించడం. 281 00:14:34,479 --> 00:14:36,648 రెండు ర్యాంపులు, ఒకదాని పక్కన ఒకటి, లోపలికి ఎక్కించడానికి సహాయపడతాయి. 282 00:14:37,232 --> 00:14:39,317 వీళ్ళు పడుతున్న కష్టం నన్నెంతగానో ఆకట్టుకుంది. 283 00:14:39,400 --> 00:14:41,402 వాళ్లు ఒక్క పైసా కూడా అదనంగా అడగలేదు. 284 00:14:41,486 --> 00:14:43,738 వాళ్లు అడిగింది అసలు ఎక్కువ కూడా కాదు. 285 00:14:43,821 --> 00:14:48,243 మాకు సాయం చేయాలనే ఉద్దేశంతో... ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. 286 00:15:01,589 --> 00:15:02,590 బస్ రోజు. 287 00:15:02,674 --> 00:15:04,217 బస్ రోజు, బస్ రోజు, బస్ రోజు. 288 00:15:05,218 --> 00:15:06,803 టీవీ ప్రతిబింబంలో మీకు నా వెనుకభాగం... 289 00:15:06,886 --> 00:15:07,887 డైరీ క్యామ్ 290 00:15:07,971 --> 00:15:09,722 ...కనిపించకుండా నేను జాగ్రత్త పడాలి. 291 00:15:10,223 --> 00:15:14,352 బస్సుని చూసి, దానికోసం ఇద్దరు మెకానిక్కులు, వెల్డర్లనూ,ఆ 292 00:15:14,435 --> 00:15:18,565 తలుపు కోసేందుకు మాట్ నూ తీసుకొచ్చి, డేవిడ్ అద్భుతమైన పని సుసాధ్యం చేసి చూపించాడు. 293 00:15:18,648 --> 00:15:21,609 ఈ పనులన్నీ సునాయాసంగా చేసి చూపించాడు. 294 00:15:21,693 --> 00:15:23,945 బస్సు చాలా గొప్పగా రూపుదిద్దుకుంటోంది. 295 00:15:24,028 --> 00:15:28,449 మా బైకుల్ని బస్సులోకి ఎక్కించి, రాత్రివేళ బస్సు నడుపుకుంటూ ప్రయాణిస్తాం. 296 00:15:28,533 --> 00:15:30,577 బస్సు వెళుతుంటే... లోపల బైకులు చార్జ్ అవుతూ ఉంటాయి, తెలుసా. 297 00:15:31,244 --> 00:15:32,328 నాకెంతో ఉత్కంఠగా ఉంది. 298 00:15:41,921 --> 00:15:43,131 చాలా బాగుంది. 299 00:15:43,214 --> 00:15:46,050 వాళ్లు పాతబడిన, కళావిహీనమైన ఈ బస్సుని 300 00:15:46,134 --> 00:15:48,720 ఇంత అందంగా, Long Way Upకి అనుకూలంగా తీర్చిదిద్దారు, 301 00:15:49,304 --> 00:15:50,680 బైకుల్ని లోపలికి తీసుకువచ్చేందుకు వీలుగా, 302 00:15:51,180 --> 00:15:54,767 మేం నిద్రించేందుకు అనువుగా తయారు చేశారు. 303 00:15:54,851 --> 00:15:55,852 ధన్యవాదాలు. 304 00:16:06,279 --> 00:16:07,280 అలా చూడు! 305 00:16:08,281 --> 00:16:09,324 భలే పని చేశావు, డేవ్. 306 00:16:09,407 --> 00:16:10,533 -అవును! -ఇది భలేగా ఉంది. 307 00:16:11,034 --> 00:16:13,620 -బస్సు చాలా బాగుంది. -వావ్, బంకు బెడ్లు కూడా ఉన్నాయి. 308 00:16:13,703 --> 00:16:15,496 -డేవ్, ఇది చాలా గొప్పగా ఉంది. -నమ్మశక్యంగా లేదు. 309 00:16:15,580 --> 00:16:16,414 బాగా పనిచేశావు, మిత్రమా. 310 00:16:17,207 --> 00:16:18,541 ఇక్కడ కుషన్లు ఉన్నాయి. 311 00:16:19,709 --> 00:16:22,170 యంత్రపరంగా చూస్తే, చాలా విడిభాగాలు పోయాయి, 312 00:16:22,253 --> 00:16:24,380 మెక్సికో అంతటా కలియదిరిగి వాటిని తీసుకొచ్చాం. 313 00:16:24,464 --> 00:16:27,425 యంత్రపరమైన పనినంతటినీ వాళ్లు పూర్తి చేశారు, ఎందుకంటే బస్సు బాగా నడవాలి కదా. 314 00:16:27,508 --> 00:16:29,469 ఆ తర్వాత మనకు అనుకూలమైన విధంగా మార్పులు చేర్పులు చేశాం. 315 00:16:29,552 --> 00:16:34,682 ఆపై, ఇనుప పని చేసే వ్యక్తిని తీసుకొచ్చి, బస్సు పైభాగం, ఈ మంచాలు 316 00:16:34,766 --> 00:16:37,727 బైకులు లోపలికి వచ్చేందుకు అవసరమైన భాగాలను తయారుచేయించాం. 317 00:16:37,810 --> 00:16:41,773 చెప్పుకోవలసిందేంటంటే, వాహనంలో ఇదే ఆకర్షణీయమైన భాగం. 318 00:16:41,856 --> 00:16:43,650 దీన్ని తయారు చేసేందుకు వాళ్లకి... ఇదిగో ఇదే. 319 00:16:43,733 --> 00:16:45,235 -దేవుడా. -వావ్! 320 00:16:45,318 --> 00:16:46,611 దీని పొడవు 8 అడుగులు కాదు. 321 00:16:46,694 --> 00:16:47,987 -ఇది 10-అడుగుల పొడవైనది. -ఈ ర్యాంపును వాళ్లే తయారు చేశారా? 322 00:16:48,071 --> 00:16:50,281 -ర్యాంపును మేమేం చేశాం. -ఒక్కొక్క మెట్టునూ తయారు చేశారా? 323 00:16:50,365 --> 00:16:51,658 ఒక్కొక్క మెట్టునూ. అన్నింటినీ కలుపుతూ వెల్డింగ్ చేశాం. 324 00:16:51,741 --> 00:16:55,161 డేవ్, గురూ. నీ సొంత షో చేసేశావు. 325 00:16:55,245 --> 00:16:56,371 దాని పేరు డేవ్స్ డూ-అప్స్. 326 00:16:57,872 --> 00:17:01,417 డేవ్స్ డూ-అప్స్ కార్యక్రమంలో ఈ వారం కూడా డేవ్ మళ్లీ సాధించి చూపించాడు. 327 00:17:01,501 --> 00:17:02,502 అతను ఎలా సాధించాడు? 328 00:17:04,337 --> 00:17:05,338 ఇది అద్బుతం, 329 00:17:05,421 --> 00:17:08,340 ఈ బైకులపై ఉన్న నీలి, నారింజ రంగుల్ని చూసినప్పుడు గొప్పగా అనిపిస్తాయి. 330 00:17:08,424 --> 00:17:10,510 అలాగే, బస్సు లోపల కూడా అన్ని ఏర్పాట్లూ చక్కగా చేశారు. 331 00:17:11,302 --> 00:17:13,846 ఈ క్షణం కోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం, స్టార్ట్ చేద్దామా? 332 00:17:14,347 --> 00:17:15,889 కాస్త నెమ్మదిగా. 333 00:17:15,974 --> 00:17:17,308 -ఒకటి. -పోనీ. 334 00:17:17,392 --> 00:17:19,476 -లేదు. ఆగు. -అదిగో. 335 00:17:19,561 --> 00:17:20,561 ఇప్పుడు బాగుందా? 336 00:17:20,645 --> 00:17:21,646 అవును. 337 00:17:26,484 --> 00:17:27,485 అదీ! 338 00:17:29,988 --> 00:17:33,491 జీవితంలో చిన్నా, పెద్దా విజయాలు ఉంటాయి. 339 00:17:33,575 --> 00:17:35,952 ఈ బస్సు రూపకల్పన అనేది ఒక పెద్ద విజయం. 340 00:17:36,661 --> 00:17:38,246 చక్కగా స్టార్టయింది. 341 00:17:40,957 --> 00:17:42,876 ఇది నాకెంతో ముఖ్యమైనది, తెలుసా? 342 00:17:42,959 --> 00:17:44,836 వాళ్లు ఎంతో కష్టపడ్డారు. ఈ పనిని ఎంతగానో ప్రేమించారు. 343 00:17:44,919 --> 00:17:47,589 ఈ పని పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 344 00:17:47,672 --> 00:17:48,965 మొత్తానికి సాధించారు. 345 00:17:49,883 --> 00:17:52,093 నిరాశ పరిచిన విషయం ఏమిటంటే, కాగితాల పని. 346 00:17:52,176 --> 00:17:53,761 గత రాత్రికే ప్లేట్లు వస్తాయని అనుకున్నాం. 347 00:17:54,262 --> 00:17:57,140 దురదృష్టవశాత్తూ, అవి ఈ ఉదయానికి మాత్రమే రానున్నాయి. 348 00:17:57,223 --> 00:17:59,684 వాళ్ల రాకకోసం నేను గేటువైపే చూస్తున్నాను, కానీ... 349 00:18:00,393 --> 00:18:03,271 ఏం చేద్దాం మరి? నువ్వు చెబితే మా అందరికీ తెలుస్తుంది. 350 00:18:03,354 --> 00:18:05,106 ఏం చేద్దామంటే వీళ్లిద్దరూ ముందు బయల్దేరి వెళతారు. 351 00:18:05,190 --> 00:18:07,734 ఈ పని పూర్తి చేసుకుని మేం మీ వెనకే వస్తాం. 352 00:18:07,817 --> 00:18:10,111 ఏది ఏమైనా, మనం అదే చోట కలుసుకుంటాం. 353 00:18:10,195 --> 00:18:13,364 కాగితాల పని పూర్తయిపోతే, అనుకున్నట్టుగానే ప్రయాణం సాగిద్దాం. 354 00:18:21,956 --> 00:18:23,625 కాబట్టి, మేం బస్సు లేకుండా ముందే బయల్దేరుతున్నాం. 355 00:18:23,708 --> 00:18:27,378 బస్సు తర్వాత మమ్మల్ని చేరుకుంటుంది. మేం ఇప్పుడు మెక్సికోలోకి వెళుతున్నాం. 356 00:18:27,462 --> 00:18:30,048 టియోటివాకాన్ ఒహాకా 357 00:18:31,299 --> 00:18:34,427 టెవాకాన్-కీకాట్లాన్ లోయ మెక్సికో 358 00:18:36,471 --> 00:18:38,890 ఓరి దేవుడా. ఎక్కడ చూసినా బ్రహ్మజెముడు మొక్కలే. 359 00:18:38,973 --> 00:18:40,350 ఇది బ్రహ్మజెముడు మొక్కలకు ఆవాసంలా ఉంది. 360 00:18:40,433 --> 00:18:42,143 ఇది బ్రహ్మజెముడు మొక్కల లోయ. 361 00:18:47,398 --> 00:18:50,235 బ్రహ్మజెముడు మొక్కల ఆకాశంలోంచి వంతెన ఇది. 362 00:19:00,119 --> 00:19:02,997 -అబ్బా, దాన్ని చూడు... -అది కోతి తోకలా ఉంది. 363 00:19:03,081 --> 00:19:05,542 అవును, వందలాది కోతి తోకలులా లేదా పాముల్లా... 364 00:19:05,625 --> 00:19:06,918 ఇది కాస్త మనలాగ ఉంది. 365 00:19:07,585 --> 00:19:09,420 నేను బ్రహ్మజెముడు మొక్కలా నటిస్తున్నాను. 366 00:19:17,929 --> 00:19:19,722 నేను ఇంతకుముందెన్నడూ గాలిగుమ్మటంలో ప్రయాణించలేదు... 367 00:19:19,806 --> 00:19:20,640 టియోటివాకాన్ మెక్సికో 368 00:19:20,723 --> 00:19:22,016 ...కానీ ఇప్పుడు అందుకు అవకాశం దొరికింది. 369 00:19:26,271 --> 00:19:28,106 దేవుడా! ఇది అద్భుతంగా ఉంది. 370 00:19:28,606 --> 00:19:30,275 దేవుడా. 371 00:19:40,118 --> 00:19:41,119 ఇవాన్. 372 00:19:44,330 --> 00:19:45,331 వావ్. 373 00:19:45,415 --> 00:19:48,543 -ఆ దృశ్యాన్ని చూడు, అద్భుతమే. -దేవుడా. దేవుడా. 374 00:19:52,380 --> 00:19:54,632 మనం పైకి ఎగురుతున్నాం. 375 00:19:57,510 --> 00:19:59,178 అదిగో, అక్కడ పిరమిడ్ ఉంది. చూడు. 376 00:19:59,262 --> 00:20:01,306 -వావ్, అక్కడ. -రెండున్నాయి, దేవుడా. 377 00:20:01,931 --> 00:20:05,268 భలే ఉన్నాయి, అలా చూడు. ఎంత అందమైన దృశ్యమో. 378 00:20:12,442 --> 00:20:16,446 మిగతా 40 గాలి గుమ్మటాలతోపాటుగా ఇలా గాల్లో ఎగురుతానని ఎప్పుడూ అనుకోలేదు. 379 00:20:16,529 --> 00:20:17,530 ఇది అసాధారణమైన అనుభవం. 380 00:20:17,614 --> 00:20:20,825 మెక్సికో మధ్యలో దేవాలయం మీదుగా. 381 00:20:20,909 --> 00:20:21,910 ఇది అసాధారణమే. 382 00:20:22,869 --> 00:20:24,871 అలా అడవులపైనుంచి బయటకు వచ్చి, 383 00:20:24,954 --> 00:20:28,208 మూడు అతి పెద్ద పిరమిడ్లనూ, వీధులనూ, దుకాణాలనూ చూస్తే ఎలా ఉంది? 384 00:20:28,291 --> 00:20:31,878 350 ఏడిలో మాయా నాగరికతను తలపించట్లేదూ? 385 00:20:32,879 --> 00:20:34,088 నాకు నచ్చింది. 386 00:20:34,172 --> 00:20:35,882 కిందకు చూడటం నాకు ఇష్టం ఉండదు. 387 00:20:35,965 --> 00:20:38,051 పడిపోతానేమోననే భయం నన్ను ఆవహిస్తుంది. 388 00:20:39,302 --> 00:20:43,181 కానీ ఆ అనుభూతి నాకిష్టం, ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. 389 00:20:43,848 --> 00:20:45,808 -చాలా చక్కగా ఉంది, కదా? -అవును. 390 00:20:45,892 --> 00:20:47,435 నాకు చాలా బాగా నచ్చింది. 391 00:20:52,357 --> 00:20:54,484 రోడ్డుకు ముందునుంచీ వెళతావా లేక వెనుకనుంచా? 392 00:20:54,984 --> 00:20:56,277 -నాకు తెలియదు. -సరే. 393 00:20:56,778 --> 00:20:58,780 ఎంత మామూలుగా వెళుతోందో. 394 00:20:58,863 --> 00:21:01,574 -భలే ఉంది. -నాకైతే భయం వేస్తోంది. 395 00:21:03,451 --> 00:21:04,452 మనం ఇంత పైన ఉన్నాం. 396 00:21:04,536 --> 00:21:05,537 అందరికీ శుభం కలగాలి. 397 00:21:10,500 --> 00:21:12,585 వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్నారు. 398 00:21:15,338 --> 00:21:16,339 భలే రసవత్తరంగా ఉంది. 399 00:21:17,131 --> 00:21:20,552 దీని తాడు ఎవరూ పట్టుకోకపోతే, అప్పుడు ఇంకా రసవత్తరంగా ఉంటుంది. 400 00:21:21,344 --> 00:21:22,345 చూడు ఎలా దిగుతున్నామో. 401 00:21:22,428 --> 00:21:23,429 వావ్. 402 00:21:26,349 --> 00:21:27,517 మమ్మల్ని బాగా తిప్పావు. 403 00:21:27,600 --> 00:21:28,810 ఎక్కడా కుదుపుల్లేవు. 404 00:21:32,397 --> 00:21:33,606 గాలిగుమ్మటంలో పైకి ఎగరడం మీకు నచ్చిందా? 405 00:21:33,690 --> 00:21:35,149 -బాగా నచ్చింది. ధన్యవాదాలు. -చాలా బాగుంది. 406 00:21:35,233 --> 00:21:37,277 -అవును, నీకు ధన్యవాదాలు. -భలే బాగుంది. 407 00:21:38,152 --> 00:21:40,113 నాకూ ఇదే మొదటిసారి, బాగుంది కదా? 408 00:21:47,954 --> 00:21:50,623 ఈ కుర్రాళ్లు పర్యాటక పరుగులాంటిదేదో నిర్వహిస్తున్నట్టుంది. 409 00:21:51,708 --> 00:21:53,668 కానీ దాని గురించి నాకు ఏమీ తెలియదు, 410 00:21:53,751 --> 00:21:55,962 వాళ్లు లారీలోంచి దూకుతున్నారని మాత్రమే తెలుసు. 411 00:22:21,905 --> 00:22:24,115 మొత్తం అంతా సిద్ధంగా ఉంది. 412 00:22:24,199 --> 00:22:25,200 స్థానిక నిర్మాతతో. 413 00:22:25,283 --> 00:22:27,702 -మంచాలు రెడీ, బస్సు రెడీ. -పద... 414 00:22:27,785 --> 00:22:29,370 యంత్రపరమైన సామగ్రి అంతా రెడీ. 415 00:22:29,454 --> 00:22:30,914 లైట్లు కూడా సిద్ధం. 416 00:22:31,706 --> 00:22:35,126 -సర్వం సిద్ధం. ఇక రోడ్డు ఎక్కడమే తరువాయి. -నేను... 417 00:22:35,210 --> 00:22:37,003 నిన్ను పట్టుకుని నలిపేసి, కొరికేస్తా. 418 00:22:37,086 --> 00:22:38,922 నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. 419 00:22:39,005 --> 00:22:40,048 ధన్యవాదాలు, నేస్తం. 420 00:22:40,632 --> 00:22:41,674 నాకు మతి పోతోంది. 421 00:22:41,758 --> 00:22:44,052 మేం మరికొన్ని నిమిషాల్లో బస్సునూ, బైకుల్నీ కలపబోతున్నాం. 422 00:22:46,262 --> 00:22:50,516 యుఎస్ఏ -మెక్సికో టియోటివాకాన్ -వారెజ్ 423 00:22:51,351 --> 00:22:52,685 చార్లీ, మనం బస్సును ఎక్కడ కలవాలనుకున్నామో, 424 00:22:52,769 --> 00:22:54,896 ఆ గమ్యం దగ్గర పడిందనుకుంటా. 425 00:22:54,979 --> 00:22:56,105 చాలా అందంగా ఉంది. 426 00:22:56,189 --> 00:22:57,982 బస్సును రోడ్డు మీద చూడాలని ఆరాటంగా ఉంది. 427 00:23:19,212 --> 00:23:20,463 ఎవరు వాళ్లు? ఏం చేస్తున్నారు? 428 00:23:21,923 --> 00:23:25,051 మేం జుకిలాకి యాత్రగా వెడుతున్నాం. 429 00:23:25,134 --> 00:23:27,845 మాతోపాటు వర్జిన్ బొమ్మను కూడా తీసుకువెళుతున్నాం. 430 00:23:27,929 --> 00:23:31,641 మాలో కొందరు కాలినడకన, ఇంకొందరు సైకిళ్లపైన బయల్దేరారు, మేం ట్రక్కులపై వెళుతున్నాం. 431 00:23:31,724 --> 00:23:32,725 వావ్. 432 00:23:32,809 --> 00:23:33,810 మాక్స్ స్థానిక నిర్మాత 433 00:23:33,893 --> 00:23:36,229 కాలినడకన వచ్చేవారు 13 రోజుల క్రితమే బయల్దేరారు. 434 00:23:36,312 --> 00:23:38,439 ఈ ప్రయాణం ఎక్కడవరకూ? దీని లక్ష్యం ఏమిటి? 435 00:23:38,523 --> 00:23:41,651 మేం గ్రామం చేరుకోగానే, అక్కడ మాకోసం గ్రామస్థులంతా ఎదురుచూస్తూ ఉంటారు. 436 00:23:41,734 --> 00:23:45,989 వర్జిన్ ను స్వాగతిస్తూ బాణసంచా కాల్చి, పాటలు పాడి, రంగురంగుల కాయితాలు విసురుతారు. 437 00:23:46,072 --> 00:23:47,073 హల్లో! 438 00:23:49,617 --> 00:23:51,035 ధన్యవాదాలు. ధన్యవాదాలు, 439 00:23:54,998 --> 00:23:55,999 వద్దొద్దు. సరే. ఈసారి... 440 00:23:56,082 --> 00:23:57,083 ఆహ్, నేను మళ్లీ అతన్ని పట్టుకున్నాను. 441 00:24:03,047 --> 00:24:04,048 బై-బై! 442 00:24:07,969 --> 00:24:09,637 అదిగో, అక్కడుంది మన బస్సు. 443 00:24:14,183 --> 00:24:15,685 మొదటిసారి ర్యాంపుపైకి ఎక్కుతున్నారు మీరు. 444 00:24:18,897 --> 00:24:20,648 -బాగుంది, మిత్రులారా. -మేం లోపలకు తీసుకొస్తున్నాం. 445 00:24:20,732 --> 00:24:22,901 -బాగా పనిచేశారు మీరు. -చాలా బాగా. బాగుంది. 446 00:24:22,984 --> 00:24:24,027 కాదు. 447 00:24:35,163 --> 00:24:36,331 వాళ్లు అన్నట్టుగా... 448 00:24:43,379 --> 00:24:45,298 మనం అనుకున్నది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. 449 00:24:45,381 --> 00:24:46,883 అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. 450 00:24:48,384 --> 00:24:50,011 మేం అధిగమిస్తున్న మొదటి మైలు ఇది. 451 00:24:50,094 --> 00:24:51,679 ఇలా 1,000 మైళ్లు దాటాలి. 452 00:25:09,697 --> 00:25:11,157 ఈ బస్సు అద్భుతంగా ఉంది, కదా? 453 00:25:12,325 --> 00:25:13,326 నాకు బాగా నచ్చింది. 454 00:25:14,661 --> 00:25:16,621 సీట్లు చక్కగా శుభ్రం చేసి, అమర్చారు. 455 00:25:16,704 --> 00:25:18,081 తేలిగ్గా దూసుకుపోతోంది. 456 00:25:18,164 --> 00:25:20,458 మరీ ముఖ్యంగా, ఈ బస్సుకు ఒక చక్కటి స్వభావం ఉంది. 457 00:25:20,542 --> 00:25:22,877 దీనికి కొంత వ్యక్తిత్వమూ ఉంది. 458 00:25:34,389 --> 00:25:35,306 బాగుంది. 459 00:25:44,566 --> 00:25:47,777 అక్కడక్కడ కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయి, తెలుసా... 460 00:25:48,820 --> 00:25:51,531 అటువంటి చోట్ల ఆగవద్దనీ, వెడుతూనే ఉండాలనీ మనకు చెప్పారు కదా. 461 00:25:51,614 --> 00:25:52,615 ఈరోజు... 462 00:25:52,699 --> 00:25:53,700 చివావా మెక్సికో 463 00:25:53,783 --> 00:25:56,327 ...మిగతా రోజులకంటే కూడా అలాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి... 464 00:26:04,752 --> 00:26:08,756 అలాంటి సంఘటనలు ఏమైనా ఎదురయితే, 465 00:26:08,840 --> 00:26:11,092 తప్పకుండా వాటిని మనం సీరియస్ గానే పరిగణించాలి. 466 00:26:11,175 --> 00:26:13,511 అలాగే, కొద్దిపాటి అదృష్టంతో అంతా మనకు అనుకూలంగానే ఉంటుందిలే. 467 00:26:19,475 --> 00:26:20,476 ఇంకా నిద్రపోనిది నేనొక్కడినే. 468 00:26:22,020 --> 00:26:23,021 మేలుకుని ఉన్నాను. 469 00:26:49,214 --> 00:26:51,883 అవును, ఉత్తర మెక్సికోలో భయోత్పాత సంఘటనలు ఎన్నో 470 00:26:51,966 --> 00:26:53,843 చోటు చేసుకుంటున్నాయి. 471 00:26:54,510 --> 00:26:56,804 మేం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. 472 00:26:59,057 --> 00:27:01,059 వాతావరణం అంత బాగోకపోయినా, వెలుతురు ఇంకా ఉంది. 473 00:27:01,142 --> 00:27:03,353 మనవాళ్ళు బస్సులోంచి బైకుల్ని బయటకు తీద్దామంటున్నారు. 474 00:27:18,201 --> 00:27:20,828 యునైటెడ్ స్టేట్స్ సరిహద్దుకు ఇంకా 95 మైళ్లు. 475 00:27:21,788 --> 00:27:23,706 బయల్దేరడానికి మేం సిద్ధం. 476 00:27:24,499 --> 00:27:26,543 మేం ఇవాళే సరిహద్దును దాటగలిగితే, 477 00:27:27,377 --> 00:27:29,504 మా పర్యటనలో మేం దాటే చివరి సరిహద్దు ఇదే అవుతుంది. 478 00:27:30,296 --> 00:27:33,758 మేం అమెరికాలోకి ప్రవేశించబోతున్నాం, అది మాకు ఎంతో ఉత్కంఠ కలిగిస్తోంది. 479 00:27:40,056 --> 00:27:43,810 మేం ఇప్పుడు ఉత్తర మెక్సికోలో ఉన్నాం. 480 00:27:43,893 --> 00:27:47,689 మళ్ళీ బైకులపై ప్రయాణం మొదలు పెట్టడం ఎంతో, ఎంతో బాగుంది. 481 00:27:49,274 --> 00:27:52,569 ఇది మేం ప్రయాణించబోతున్న అత్యంత ప్రమాదకరమైన 482 00:27:52,652 --> 00:27:54,028 దారి, తెలుసా. 483 00:27:54,112 --> 00:27:57,782 వాళ్ళు మళ్లీ బైకులపై ప్రయాణం మొదలెట్టారు. మేమంతా అమెరికా సరిహద్దువైపు వెడుతున్నాం. 484 00:27:57,866 --> 00:28:00,702 బహశా, ఈ సాయంత్రానికి మేం అమెరికాలోకి అడుగు పెట్టవచ్చు కూడా. 485 00:28:01,411 --> 00:28:03,955 ఇవాళే సరిహద్దు దాటుతామని నాకు నమ్మకంగా ఉంది. 486 00:28:05,039 --> 00:28:06,833 బాగా పరిచయమున్న ప్రాంతంలోకి మళ్లీ వెళ్లబోతున్నాం. 487 00:28:07,500 --> 00:28:08,501 "ఏమీ జరగదు, మేము 488 00:28:08,585 --> 00:28:11,170 అమెరికాలోకి ప్రవేశిస్తాం" అని అనుకోవడం తప్ప చేసేదేం లేదు. 489 00:28:11,254 --> 00:28:15,133 కానీ అలా జరగకపోవడానికి కూడా అవకాశం ఉంది. 490 00:28:15,717 --> 00:28:22,557 తలపెట్టిన ప్రతి ప్రయాణంలోనూ 5% అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందంటారు. 491 00:28:24,142 --> 00:28:25,143 అలా జరగకపోవచ్చు, 492 00:28:25,226 --> 00:28:30,064 పర్యటన చివరి ఘట్టానికి చేరుకుంటున్నామని, మేం సాధించవలసిందేదో సాధించబోతున్నామని 493 00:28:30,148 --> 00:28:32,692 మాకు మేము నచ్చజెప్పుకుంటున్నాం. 494 00:28:33,318 --> 00:28:35,945 మా ప్రయాణంలో మాకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతం ఇదొక్కటే. 495 00:28:43,161 --> 00:28:45,872 చార్లీ మనం వారెజ్ నగరం చేరుకోబోతున్నాం, తెలుసా? 496 00:28:46,581 --> 00:28:49,751 లేదు, నేను ఇదేమీ ఊహించడం లేదు, 497 00:28:50,543 --> 00:28:53,129 వాతావరణం నిన్నటిలాగే ఉంటుందని అనుకున్నాను, తెలుసా. 498 00:28:53,880 --> 00:28:54,881 పూర్తిగా. 499 00:28:57,217 --> 00:28:59,344 -జల్లు నా మొహాన్ని కొట్టింది. -నీకేం కాలేదుగా? 500 00:29:00,762 --> 00:29:02,096 అక్కడ నీళ్లు ఎలా నిలచిపోయాయో చూడు. 501 00:29:02,180 --> 00:29:03,181 అలా చూడు. 502 00:29:03,264 --> 00:29:04,933 అది ఒక నదిని తలపిస్తోంది. 503 00:29:05,016 --> 00:29:06,184 వారెజ్ మెక్సికో 504 00:29:09,270 --> 00:29:11,564 మనం 40 నిమిషాల వ్యవధిలో సరిహద్దును దాటే అవకాశం కోల్పోతున్నాం. 505 00:29:12,065 --> 00:29:14,108 2.00 గంటలకల్లా సరిహద్దును మూసేస్తారని మనకు ఎవరూ చెప్పలేదు. 506 00:29:14,192 --> 00:29:17,570 జనం 24 గంటలూ సరిహద్దును దాటొచ్చు, కానీ... 507 00:29:18,696 --> 00:29:21,032 మనం తీసుకువెడుతున్న కెమెరాలు, ఇతర సామగ్రికి అనుమతి ఉండదు. 508 00:29:21,866 --> 00:29:24,786 మనకు నావిగేటర్ నుంచి సమాచారం దొరకడం లేదు, 509 00:29:25,411 --> 00:29:27,872 దాంతో సరిహద్దు ఎక్కడుందో తేల్చుకోవడానికి తంటాలు పడుతున్నాం. 510 00:29:27,956 --> 00:29:30,166 నాకు బైకులు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. 511 00:29:30,250 --> 00:29:33,086 మనం సురక్షితమైన ప్రాంతంలో ఏమాత్రం లేము. 512 00:29:33,920 --> 00:29:35,672 కనుచూపు మేరలో లేవు. 513 00:29:35,755 --> 00:29:37,257 మనం నిజంగానే వారెజ్ లో చిక్కుకున్నామంటావా? 514 00:29:37,340 --> 00:29:39,300 అవును, వారెజ్ లో చిక్కుబడ్డాం. 515 00:29:39,384 --> 00:29:41,511 బహుశా మనం ముఠాలు రాజ్యమేలే ప్రాంతంలో ఉన్నాం. 516 00:29:44,806 --> 00:29:46,516 -మనం సరిహద్దుకు దూరంలో ఉన్నామా? -లేదు, లేదు, లేదు. 517 00:29:46,599 --> 00:29:49,102 మరో పది నిమిషాలు, అంతే దూరం. 518 00:29:49,185 --> 00:29:50,186 -సరే అయితే. -ప్లీజ్. 519 00:29:51,855 --> 00:29:54,232 ఊరుకోండి, మిత్రులారా. 520 00:29:58,027 --> 00:29:59,863 అనుకూలించని వాతావరణమే మన చిక్కులకు కారణం, 521 00:29:59,946 --> 00:30:02,490 సరిహద్దును దాటే అవకాశాన్ని మనం చేజార్చుకున్నట్టే, 522 00:30:02,574 --> 00:30:06,578 దానర్ధం ఏంటంటే, మనం ఎక్కడైతే అప్రమత్తంగా ఉండాలో అక్కడే చిక్కుబడ్డామన్నమాట. 523 00:30:13,084 --> 00:30:16,045 మెక్సికో / యుఎస్ఏ బోర్డర్ క్రాసింగ్ 524 00:30:17,338 --> 00:30:18,965 -ఇదేనా సరిహద్దు? -అవును. 525 00:30:19,048 --> 00:30:20,049 అది శరణార్ధుల శిబిరం. 526 00:30:20,133 --> 00:30:21,926 అదిగో, బైక్ అదిగో. 527 00:30:22,010 --> 00:30:23,845 అవిగో బైకులు. చార్లీ అక్కడున్నాడు. 528 00:30:25,638 --> 00:30:26,639 అవును. 529 00:30:30,184 --> 00:30:31,102 లికో డ్రైవర్ 530 00:30:31,185 --> 00:30:33,062 -బాగా నడిపావు. -ధన్యవాదాలు, ధన్యవాదాలు. 531 00:30:33,146 --> 00:30:34,147 లికో, ధన్యవాదాలు. 532 00:30:37,317 --> 00:30:39,068 మేం ఎల్ పాసో దాటేందుకు ప్రయత్నిస్తున్నాం. 533 00:30:39,152 --> 00:30:41,946 మాలో చాలామందికి ఈ బస్సుతో అనుబంధం పెరిగిపోయిందని అనిపిస్తోంది. 534 00:30:42,864 --> 00:30:44,449 దాన్ని సరిహద్దు దాటించేందుకు ప్రయత్నిస్తున్నాం. 535 00:30:45,325 --> 00:30:48,286 అందుకు బోలెడు పత్రాలు, అవీ సిద్ధం చేయాల్సి ఉంది, కానీ... 536 00:30:49,829 --> 00:30:52,373 కానీ మేము సరిహద్దు దాటాల్సిన పరిస్థితులు మాత్రం ఇలా ఉన్నాయి, అవునా? 537 00:30:52,457 --> 00:30:54,959 మేం పత్రాలన్నీ పూర్తి చేశాం. పాస్ పోర్టులపై స్టాంపింగ్ కూడా అయింది. 538 00:30:55,043 --> 00:30:57,128 కానీ ఇప్పుడు మరో చిక్కు వచ్చింది, 539 00:30:57,212 --> 00:31:02,383 ఇవాన్, చార్లీ తమ బైకులకోసం పాస్ పోర్టులపై స్టాంపింగ్ చేయించుకోవాలి, 540 00:31:02,467 --> 00:31:04,260 అది 25 మైళ్ల దూరం వెళ్లి అక్కడ చేయించుకోవాలి. 541 00:31:04,344 --> 00:31:05,345 ఎల్ పాసో వారెజ్ 542 00:31:05,428 --> 00:31:09,307 అక్కడినుంచి వెనక్కి వచ్చి, అప్పడు సరిహద్దు దాటి ఎల్ పాసో, టెక్సాస్ లోకి వెళ్లాలి. 543 00:31:09,390 --> 00:31:11,184 మాతోపాటు ఈ కెమెరా, ఇతర సామగ్రి ఉంది కాబట్టి, 544 00:31:11,267 --> 00:31:14,896 మేం వ్యతిరేక దిశలో ఈ సామగ్రితోపాటు 545 00:31:16,022 --> 00:31:17,023 20 మైళ్ళు వెళ్లాల్సిందే. 546 00:31:18,608 --> 00:31:20,485 కానీ ఇక్కడ అనేకమంది సరిహద్దు దాటేందుకు 547 00:31:20,568 --> 00:31:22,987 నెలల తరబడి వేచి చూస్తుంటే, మాకు ఆలస్యమవుతోందని అనడం 548 00:31:23,071 --> 00:31:24,697 సమంజసంగా ఉండదు. 549 00:31:24,781 --> 00:31:27,992 ఈ శిబిరాలూ, ఇవన్నీ చూస్తుంటే సరిహద్దు ఇక్కడే ఉందని అనిపిస్తుంది. 550 00:31:28,076 --> 00:31:29,244 వీళ్ళంతా ఎవరు? 551 00:31:29,327 --> 00:31:31,538 ఈ జనమంతా అమెరికాలో ఆశ్రయం పొందేందుకు... 552 00:31:31,621 --> 00:31:32,622 క్లెమెంటె స్థానిక నిర్మాత 553 00:31:32,705 --> 00:31:34,207 ...ఎదురుచూస్తున్న దక్షిణ మెక్సికోవాసులు. 554 00:31:34,290 --> 00:31:38,795 మెక్సికో రాష్ట్రాల్లో ఉన్న అభద్రత కారణంగా వీళ్లు వెళ్లిపోవాలనుకుంటున్నారు. 555 00:31:38,878 --> 00:31:43,091 వ్యవస్థీకృతమైన నేరగాళ్ల నుంచి వీళ్ళకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. 556 00:31:43,174 --> 00:31:48,096 మాదకద్రవ్యాలు అమ్మకపోతే, వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకర్ని నేరగాళ్ళు చంపేస్తారు. 557 00:31:48,179 --> 00:31:50,348 అందువల్ల వీళ్లు పారిపోయి వచ్చేస్తున్నారు. 558 00:31:50,431 --> 00:31:52,183 అతను ఇక్కడ ఎంతకాలంనుంచి ఉంటున్నాడు? 559 00:31:52,267 --> 00:31:53,685 రెండున్నర నెలలుగా. 560 00:31:54,185 --> 00:31:56,396 అబ్బా. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. 561 00:31:59,691 --> 00:32:02,193 ఇక్కడ నెలకొన్న పరిస్థితులకు ఈ సంఘటన ఒక వాస్తవిక దర్పణం. 562 00:32:02,277 --> 00:32:07,365 ముఠాల దురాగతాల కారణంగా సామాన్య జన జీవనం కష్టమైపోతోంది. 563 00:32:09,325 --> 00:32:12,579 అందరికీ అవకాశం కావాలి, గురూ. 564 00:32:16,124 --> 00:32:18,626 వాళ్ళు మరీ నిశితంగా చెక్ చేస్తున్నారు. 565 00:32:18,710 --> 00:32:19,711 జైమె డ్రైవర్ 566 00:32:19,794 --> 00:32:22,130 ప్రతి వాహనాన్నీ, ప్రతి కారునూ వాళ్లు పరిశీలిస్తున్నారు. 567 00:32:22,213 --> 00:32:26,843 సరిహద్దు దాటేందుకు జనం ఐదు గంటల సేపు వేచి ఉండాల్సి వస్తోంది. 568 00:32:26,926 --> 00:32:30,388 యుఎస్ కి వెళ్లే వారిలో ఎక్కువమంది పనికోసమే వెడతారు, తెలుసా. 569 00:32:31,472 --> 00:32:33,099 కొందరు చాలా శ్రమజీవులు. 570 00:32:33,683 --> 00:32:35,643 వెస్ట్ గేట్ బోర్డర్ క్రాసింగ్ 571 00:32:35,727 --> 00:32:36,728 టెక్సాస్ యూనివర్శిటీ ఎల్ పాసో వద్ద 572 00:32:36,811 --> 00:32:38,062 సరే, మంచిది. 573 00:32:38,146 --> 00:32:39,147 సరే. 574 00:32:40,148 --> 00:32:42,525 వాస్తవానికి మేమింకా... మెక్సికోను వదల్లేదు, 575 00:32:42,609 --> 00:32:45,445 అమెరికాలోకి అడుగు పెట్టలేదు, కాబట్టి... 576 00:32:46,446 --> 00:32:47,864 విచిత్రం, మనవాళ్లంతా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. 577 00:32:47,947 --> 00:32:49,407 -ఏమో మరి. -ఒక్కరి జాడకూడా తెలియట్లేదు. 578 00:32:49,490 --> 00:32:50,491 ఈస్ట్ గేట్ బోర్డర్ క్రాసింగ్ 579 00:32:50,575 --> 00:32:51,743 రస్ ఎక్కడున్నాడో ఏమో. డేవ్ కి ఏమైందో తెలియదు. 580 00:32:51,826 --> 00:32:52,827 అసలు వీళ్లంతా ఏం చేస్తున్నారో మరి. 581 00:32:52,911 --> 00:32:54,621 చూడు, నాకు తెలిసిందల్లా రస్ నాతో ఏమన్నాడంటే, "ఏదో ఒక విధంగా 582 00:32:54,704 --> 00:32:57,290 సరిహద్దు దాటి అమెరికాలోకి అడుగు పెట్టండి" అని. 583 00:32:57,373 --> 00:32:58,374 ఆ తర్వాత అతని ఫోన్ పనిచేయలేదు. 584 00:32:59,626 --> 00:33:00,710 సరే. 585 00:33:00,793 --> 00:33:01,961 అబ్బా, నా పిరుదులు తడిసిపోయాయి. 586 00:33:10,553 --> 00:33:12,513 యునైటెడ్ స్టేట్స్ కి స్వాగతం 587 00:33:18,019 --> 00:33:19,646 ఇప్పుడు తెల్లవారుజామున 2.00 గంటలు అయింది. 588 00:33:19,729 --> 00:33:24,651 ఇప్పటికి మేం సరిహద్దు వద్ద 12 గంటలనుంచీ పడిగాపులు పడుతున్నాం, ఇప్పుడే బయటకొచ్చాం. 589 00:33:24,734 --> 00:33:26,945 సానుకూల అంశం ఏమిటంటే, మనవాళ్లందరూ సరిహద్దు దాటగలిగారు. 590 00:33:27,028 --> 00:33:28,029 బైకులు కూడా వచ్చేశాయి. 591 00:33:28,112 --> 00:33:29,364 ఇప్పుడు మేం అమెరికాలో ఉన్నాం. 592 00:33:30,406 --> 00:33:32,534 Long Way Up అమెరికాకు చేరుకుంది. 593 00:33:35,411 --> 00:33:38,540 ఎల్ పాసో టెక్సాస్ 594 00:33:42,126 --> 00:33:44,045 అమెరికాలోకి అడుగు పెట్టడం నాకు ఎంతో ఉత్తేజం కలగజేస్తోంది. 595 00:33:44,128 --> 00:33:45,713 అతను నాతో అలా అన్నప్పుడు... 596 00:33:45,797 --> 00:33:49,008 అతను "స్వదేశానికి స్వాగతం, సర్" అని అంటాడనుకున్నా. ఎందుకంటే... 597 00:33:49,092 --> 00:33:50,093 నా పోస్ పోర్టు తిరిగి నా చేతిలో పెడుతూ, 598 00:33:50,176 --> 00:33:51,803 మా పర్యటన గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. 599 00:33:51,886 --> 00:33:53,763 బైక్ కేసి ఒకసారి చూశాడు, తర్వాత... 600 00:33:53,846 --> 00:33:56,224 నా పాస్ పోర్టు నాకు ఇచ్చేస్తూ, "జాగ్రత్తగా ప్రయాణించండి, సర్" అన్నాడు. 601 00:33:56,307 --> 00:33:57,934 అతను చాలామంచి వ్యక్తి. 602 00:33:58,017 --> 00:34:00,728 చాలా అందగాడు కూడా. పొడుగ్గా ఉన్నాడు. కళ్లు మెరుస్తున్నాయి. 603 00:34:00,812 --> 00:34:02,021 నేనేమనుకున్నానంటే... 604 00:34:02,105 --> 00:34:05,358 "ఏదో ఒక సినిమాలో, ఇతను బోర్డర్ గార్డ్ గా నటించినట్లున్నాడు" అని. 605 00:34:05,859 --> 00:34:06,860 అలాగే... 606 00:34:07,569 --> 00:34:08,486 కానీ తను "జాగ్రత్తగా వెళ్ళండి" అన్నాడు. 607 00:34:08,570 --> 00:34:10,780 తర్వాత మేం సరిహద్దు దాటాం. నేనూ దాటి వచ్చాను. 608 00:34:10,863 --> 00:34:12,282 ఇవాళ నాకు ఉత్కంఠగా ఉంది, 609 00:34:12,365 --> 00:34:15,118 దేనికంటే అమెరికాలో ప్రయాణం నాకు తెలియని అనుభూతి కలిగిస్తోంది. 610 00:34:15,200 --> 00:34:17,537 ఈరోజు మేం 200 మైళ్లు ప్రయాణించేందుకు ప్రయత్నిస్తాం. 611 00:34:18,746 --> 00:34:19,914 యునైటెడ్ స్టేట్స్ లో మొదటి రోజు. 612 00:34:19,997 --> 00:34:21,791 జాగ్రత్త, చార్లీ. 613 00:34:21,874 --> 00:34:23,001 పడబోయి, తృటిలో తప్పించుకున్నాడు. 614 00:34:23,084 --> 00:34:24,419 యునైటెడ్ స్టేట్స్ లో మొదటి రోజు. 615 00:34:25,753 --> 00:34:28,006 ఈ రోడ్డు నేరుగా లాస్ ఏంజెలిస్ కు వెడుతుంది. 616 00:34:28,089 --> 00:34:29,090 అదీ. 617 00:34:29,173 --> 00:34:30,466 లాస్ ఏంజెలిస్ -పామ్ స్ప్రింగ్స్ విల్కాక్స్ -ఎల్ పాసో 618 00:34:54,574 --> 00:34:57,493 మేము ఎలక్ట్రిక్ బైక్ నడపాలా వద్దా అని సంఘర్షణకు లోనైన సందర్భాలున్నాయి. 619 00:34:57,577 --> 00:34:59,704 ఎందుకంటే మేం పెట్రోల్ బైకులకే అలవాటు పడినవాళ్ళం. 620 00:34:59,787 --> 00:35:01,748 కానీ వాటి వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. 621 00:35:01,831 --> 00:35:04,125 పెట్రోల్ బైకుల నుంచి మారవలసిన అవసరం ఉంది. 622 00:35:10,006 --> 00:35:12,759 మేం మారాలనుకున్న విధానం ఆసక్తికరమైంది. 623 00:35:13,259 --> 00:35:16,012 ఎవరైనా మొదట పెట్రోల్ కార్లు నడపడం మొదలు పెట్టినప్పుడు, 624 00:35:16,095 --> 00:35:17,555 దానిలో ఇంధనం నింపడం ఒక పెద్ద పని. 625 00:35:17,639 --> 00:35:21,601 పైగా, మళ్ళీ పెట్రోల్ అయిపోతే ఎక్కడ దొరుకుతుందో తెలియదు. 626 00:35:21,684 --> 00:35:24,562 దానికి తగిన మౌలిక సదుపాయాలు లేవు, మేమూ అలాగే భావించి, పంథా మార్చుకున్నాం. 627 00:35:25,563 --> 00:35:28,191 ఆ క్షణంలో మేం సరైన నిర్ణయం తీసుకున్నాం. 628 00:35:28,274 --> 00:35:29,776 మీకు తెలుసా? మేం వెనక్కి తిరిగి చూసుకుని, 629 00:35:29,859 --> 00:35:32,737 ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లోనే "దేవుడా, మేం సాధించాం" అని అనుకుంటాం, 630 00:35:33,321 --> 00:35:36,324 ఆ అసాధ్యాన్ని సాధించాం కనుక ఇప్పుడు మాకెంతో ఉత్తేజంగా ఉంది. 631 00:35:42,539 --> 00:35:45,041 ఇలా చూడు. ఇది పని చేస్తోంది. 632 00:35:45,124 --> 00:35:47,460 మూడు నిమిషాల్లోనే 6% ఇంధనం భర్తీ అయింది. 633 00:35:47,544 --> 00:35:49,128 ఈ యంత్రాలు అద్భుతంగా ఉన్నాయి. 634 00:35:49,212 --> 00:35:50,755 ఇది నిజంగానే ఒక వరం. 635 00:35:50,838 --> 00:35:52,090 భలేగా ఉంది, గురూ. 636 00:35:53,508 --> 00:35:56,135 అవును. బాగా పని చేస్తున్నాయి. 637 00:35:56,970 --> 00:35:58,972 వీటి గురించి నేను విన్నాను, చూశాను... 638 00:35:59,055 --> 00:36:00,056 బిల్లీ స్థానికుడు 639 00:36:00,139 --> 00:36:02,892 ...కానీ ఇవి రోడ్ల మీద పరుగెడుతుండగా 640 00:36:03,810 --> 00:36:05,979 చూడటం మాత్రం ఇదే మొదటిసారి. 641 00:36:08,648 --> 00:36:09,649 ఇది నమ్మశక్యంగా లేదు. 642 00:36:19,033 --> 00:36:21,953 విల్కాక్స్ అరిజోనా 643 00:36:26,332 --> 00:36:27,667 ఈ ఉదయం ఇక్కడ ఎలాంటి వాతావరణ... 644 00:36:27,750 --> 00:36:28,751 డైరీ క్యామ్ 645 00:36:28,835 --> 00:36:30,753 ...పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించాలనుకుంటున్నాను. 646 00:36:31,504 --> 00:36:35,049 ఇక్కడ గడ్డ కట్టిన మంచును మీరు చూడవచ్చు, 647 00:36:35,133 --> 00:36:37,927 కాబట్టి కాస్త ఆగి బయల్దేరడం మంచిది. 648 00:36:38,011 --> 00:36:39,012 ఇప్పుడు 7.00 గంటలయింది. 649 00:36:39,512 --> 00:36:41,431 8.00 లేక 9.00 గంటలకు బయల్దేరితే బాగుంటుంది. 650 00:36:41,514 --> 00:36:45,059 ఎక్కడైనా కాఫీ దొరికితే, నిజంగానే బ్రహ్మాండంగా ఉంటుంది. 651 00:36:45,727 --> 00:36:48,396 ఒక చక్కటి పర్యటన ముగింపుకి ఇది ఎంత చక్కని విధానమో కదా. 652 00:36:48,479 --> 00:36:49,480 డైరీ క్యామ్ 653 00:36:51,316 --> 00:36:52,609 నాకు కాస్త విచారంగా ఉంది. 654 00:36:53,401 --> 00:36:55,028 విచారపు తెర నన్ను కమ్ముకుంటోంది. 655 00:36:59,073 --> 00:37:01,659 ఇవాళ ఎందుకో నేను విచారంలో మునిగిపోతున్నాను. 656 00:37:01,743 --> 00:37:03,786 పర్యటన పరిసమాప్తం కాబోతోందని తెలిశాక, 657 00:37:03,870 --> 00:37:04,871 ఒక రకమైన విచారం కలుగుతుంది మరి. 658 00:37:05,413 --> 00:37:08,124 ఇది ముగింపుకి చేరుకుంది, నాకు "అయ్యో, అప్పుడేనా!" అని అనిపిస్తోంది. 659 00:37:14,380 --> 00:37:16,591 నీతో కలసి చేసిన ఈ ప్రయాణం ఎంతో రమ్యంగా ఉంది, చార్లీ. 660 00:37:16,674 --> 00:37:18,301 అద్భుతం, అద్భుతంగా ఉంది. 661 00:37:24,933 --> 00:37:26,893 కానీ నువ్వు బైక్ మీద ఉంటే, 662 00:37:26,976 --> 00:37:30,438 ప్రయాణంలో లీనమైపోతావు, నువ్వూ బైక్ లో ఒక భాగమైపోతావు, 663 00:37:30,522 --> 00:37:34,609 ప్రకృతితో నీ అనుబంధం చాలా గాఢంగా ఉంటుంది. 664 00:37:35,401 --> 00:37:36,528 మోటార్ సైకిల్ నడుపుతూ, 665 00:37:36,611 --> 00:37:39,822 ఇలా వేర్వేరు ప్రాంతాలకు, శివారు ప్రాంతాలకూ, 666 00:37:39,906 --> 00:37:42,909 చిన్న చిన్న కుగ్రామాలకూ, పట్టణాలకూ వెళ్ళడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. 667 00:37:42,992 --> 00:37:46,579 అలాంటప్పుడు సహజంగానే జనాన్ని నువ్వు ఆకట్టుకుంటావు. 668 00:37:46,663 --> 00:37:48,456 నువ్వు వాళ్ళ పరిసరాల్లో ఒక భాగమవుతావు. 669 00:37:54,587 --> 00:37:56,923 నువ్వు చెమటతో తడిసి ముద్దయితే, లేదా దుమ్ము కొట్టుకుపోయి ఉంటే, 670 00:37:57,006 --> 00:37:59,968 నీ గురించి వాళ్లెంతగానో బాధపడతారు. 671 00:38:00,051 --> 00:38:03,096 దానికి కారణం నువ్వు వాళ్ల మధ్యలోకి వాళ్లలో ఒకడిగా బైక్ మీద వెళ్లావు, 672 00:38:03,179 --> 00:38:06,099 ఏదో విమానంలోంచి ఊడి పడలేదు కాబట్టి. 673 00:38:06,182 --> 00:38:08,768 వాళ్ల మధ్యకు వెళ్లినప్పుడు నీ వాలకం అలాగే ఉంటుంది మరి. 674 00:38:08,851 --> 00:38:10,061 అది నువ్వే. 675 00:38:25,410 --> 00:38:28,329 ఎక్కడ చూసినా మన బ్రహ్మజెముడు స్నేహితులే కనిపిస్తున్నారు! 676 00:38:29,455 --> 00:38:30,915 నాకు ఇవంటే ఇష్టం. 677 00:38:30,999 --> 00:38:32,458 మన సోదరులు ఆయుధాలు చేతపట్టి నిలుచున్నట్టుంది. 678 00:38:37,630 --> 00:38:39,674 ప్రయాణం సాఫీగా సాగిపోయిన రోజులు మనకు గుర్తుండవు. 679 00:38:39,757 --> 00:38:41,801 ఒకళ్లతో ఒకరు మమేకమై ప్రయాణించిన రోజులూ గుర్తుండవు. 680 00:38:41,885 --> 00:38:44,846 కానీ జీవితాంతం ఎలాంటి సంఘటనలు గుర్తుంటాయంటే 681 00:38:44,929 --> 00:38:46,806 మనం ప్రయాణంలో కష్టాలు పడిన సంఘటనలే. 682 00:38:47,515 --> 00:38:50,810 నువ్వు అధిగమించిన ఇబ్బందులూ, కష్టాలే నీకు గుర్తుంటాయి. 683 00:38:50,894 --> 00:38:54,689 అవి లేకపోతే, మనకు ఇంతటి మధురానుభూతులు లభించేవే కాదు, తెలుసా. 684 00:38:55,315 --> 00:38:59,694 ఫలానా పని ప్రమాదకరమైనదనీ, ఫలానా పని సంక్లిష్టమైనదని ఆలోచించేవాణ్ని కాను... 685 00:38:59,777 --> 00:39:01,112 అది చేసేందుకు ఉత్సుకత చూపేవాణ్ని. 686 00:39:01,196 --> 00:39:02,363 నేనలా అనుకునేవాణ్ని కాను. 687 00:39:02,447 --> 00:39:05,700 అయితే, బైక్ ను నడపటంలో స్వాభావికంగా ఇబ్బందులు ఉండనే ఉంటాయి. 688 00:39:05,783 --> 00:39:08,161 నేను వాటిని లెక్క చేయను, నాకు వాటిని ఎదుర్కోవడం ఇష్టం కూడా... 689 00:39:08,244 --> 00:39:10,038 బైక్ నడపటం ప్రమాదకరమని నడపకుండా ఉండను. 690 00:39:10,121 --> 00:39:12,790 నాకు అదంటే పిచ్చి, అది నాలో ఒక భాగం. 691 00:39:31,059 --> 00:39:34,395 దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికోల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, 692 00:39:34,479 --> 00:39:38,024 అక్కడి ప్రజలు ఎంతో స్నేహ తత్పరత కనబరిచారు, సాయం చేసేందుకు ఎప్పుడూ 693 00:39:38,107 --> 00:39:40,026 ముందుండేవారు, మన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించేవారు. 694 00:39:42,529 --> 00:39:44,030 బొలీవియాలో అయితే నాకు చాలా భయమేసింది. 695 00:39:44,113 --> 00:39:46,407 అక్కడి రోడ్లను చూసి, చార్లీ ఎలా నడుపుతాడా అని భయపడ్డాను, 696 00:39:46,491 --> 00:39:49,160 ఎందుకంటే చార్లీ కాళ్లు బలహీనంగా ఉంటాయి. గాయాలు తగలడానికి ఆస్కారం ఎక్కువ. 697 00:39:50,620 --> 00:39:53,873 కోలుకునే సమయంలో ఎవరైనా సహజంగానే రక్షణాత్మకంగా వ్యవహరిస్తారు. 698 00:39:53,957 --> 00:39:56,751 మచుపిచ్చులాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు, 699 00:39:56,834 --> 00:39:59,462 అన్ని మెట్లు ఎక్కాక 700 00:39:59,546 --> 00:40:03,216 నేను అనుకున్నదానికంటే మరింత ఎక్కువ కష్టపడగలనని నాకు అనిపించింది. 701 00:40:10,473 --> 00:40:14,978 కాలిఫోర్నియాకు స్వాగతం 702 00:40:16,813 --> 00:40:18,481 ఎంతో గొప్ప ప్రదేశం 703 00:40:24,654 --> 00:40:25,655 అవును. 704 00:40:31,327 --> 00:40:34,247 పామ్ స్ప్రింగ్స్ లో కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులు మనల్ని కలుస్తున్నారు, 705 00:40:34,330 --> 00:40:36,541 కాబట్టి అందరం కలసి రేపు లాస్ ఏంజెలిస్ కి కాన్వాయ్ లాగ బయల్దేరి వెళ్దాం. 706 00:40:36,624 --> 00:40:39,586 పామ్ స్ప్రింగ్స్ కాలిఫోర్నియా 707 00:40:43,882 --> 00:40:45,049 నా ప్రియతమా. 708 00:40:45,133 --> 00:40:47,093 -ఆ హెల్మెట్ తీసెయ్. -నా ప్రియా. 709 00:40:47,176 --> 00:40:49,470 నా డార్లింగ్, హలో. 710 00:40:49,554 --> 00:40:51,097 -హేయ్, బేబీ. -హాయ్, బేబీ. 711 00:40:51,180 --> 00:40:53,725 నా డార్లింగ్. నా డార్లింగ్, డార్లింగ్. 712 00:40:59,105 --> 00:41:00,106 మొత్తానికి వచ్చేశాం. 713 00:41:00,190 --> 00:41:01,733 ఆఖరి రోజున. 714 00:41:01,816 --> 00:41:04,402 మేం బైకులు, ఇతరత్రా సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నాం. 715 00:41:04,485 --> 00:41:07,238 మా పర్యటనకు ఇదే చివరిరోజని తెలిసి, బ్యాగు సిద్ధం చేసుకుంటుంటే చిత్రంగా అనిపించింది. 716 00:41:07,322 --> 00:41:08,823 గత మూడు నెలలుగా, రోజూ ఉదయమే లేచి, 717 00:41:08,907 --> 00:41:12,869 సామాన్లన్నిటినీ నా నల్లటి రోడ్డు బ్యాగులో సర్దుకుని, 718 00:41:12,952 --> 00:41:14,454 దాన్ని బైకు వెనకాల కడుతుంటే... 719 00:41:15,747 --> 00:41:16,998 నాకు అకస్మాత్తుగా ఇక 720 00:41:17,081 --> 00:41:18,708 రేపటినుంచి ఇదంతా చేయక్కర్లేదు కదాని అనిపించింది. 721 00:41:46,569 --> 00:41:48,613 ఈ రోజు కోసం మేం సమాయత్తమయ్యాం. 722 00:41:48,696 --> 00:41:50,323 మేం కొంతమంది ఇతర వాహన ప్రయాణికులను కలవబోతున్నాం. 723 00:41:50,406 --> 00:41:53,368 ఈ మా పర్యటనలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన కొందరిని కలుస్తున్నాం. 724 00:41:53,451 --> 00:41:55,078 మా భాగస్వాములు ఎంతో మంచివాళ్లు. 725 00:41:55,787 --> 00:42:00,500 వారిని కలిశాక, తర్వాత 20 మైళ్ళు ప్రయాణించి లాస్ ఏంజెలిస్ చేరుకుంటాం. 726 00:42:00,583 --> 00:42:02,544 ఇక... అదీ విషయం. 727 00:42:14,264 --> 00:42:15,890 శాన్ బెర్నార్డినో లాస్ ఏంజలెస్ 728 00:42:22,856 --> 00:42:28,736 హార్లీ-డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ 729 00:42:37,161 --> 00:42:38,955 సోదరా, ఎలా ఉన్నావు? 730 00:42:39,038 --> 00:42:40,039 జాన్ హార్లీ-డేవిడ్సన్ 731 00:42:40,123 --> 00:42:41,875 మా పర్యటనకు అన్ని విధాలా చేయూతను అందించింది ఈయనే. కాస్త బాగా తియ్యి. 732 00:42:41,958 --> 00:42:43,459 -ఆర్జె! ప్లీజ్. -ఎలా ఉన్నావు, మిత్రమా? ఇలా కలవడం సంతోషం. 733 00:42:43,543 --> 00:42:44,544 ఆర్జే రివియన్ సిఇఓ మరియు వ్యవస్థాపకుడు 734 00:42:44,627 --> 00:42:47,755 -ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు కదా? -దేవుడా, నువ్విక్కడే ఉన్నందుకు సంతోషం. 735 00:42:47,839 --> 00:42:49,215 -చాలా ఆశ్చర్యంగా ఉంది. -అవి ప్రోటోటైప్ మోటార్ సైకిళ్లు, 736 00:42:49,299 --> 00:42:52,176 మీరు వచ్చేవరకూ ఆగాం... అవి రెట్టింపు శక్తితో పరుగెడతాయి. 737 00:42:52,260 --> 00:42:54,596 -వాటిని మేం పరీక్షకు నిలబెట్టాం. -అవును. 738 00:42:54,679 --> 00:42:56,097 రోజూ ఉదయమే అవి నావైపు చూసి, "అంతేనా? మరింత భారం 739 00:42:56,180 --> 00:42:57,765 -వేస్తారా?"అని అడుగుతున్నట్లు ఉంటుంది. -నీకు మరింత కావాలా? 740 00:42:58,975 --> 00:43:02,186 బైకులు బాగోవడం కాదు, అద్భుతంగా ఉన్నాయి, నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. 741 00:43:02,270 --> 00:43:03,938 ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. 742 00:43:04,022 --> 00:43:06,357 నువ్వు ఎప్పుడూ అలా మీసం పెంచుకోవుగా? 743 00:43:06,441 --> 00:43:07,442 -లేదు... -ఇది మెక్సికో కోసం పెంచాను. 744 00:43:07,525 --> 00:43:10,361 వాళ్ళలో కలిసిపో అని నాతో ఎవరో చెప్పారు. కాబట్టి, నా వంతు ప్రయత్నం చేశాను. 745 00:43:10,445 --> 00:43:13,781 మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే, తాను స్థానికుణ్నేనని చెప్పుకునేందుకు పెంచాడు. 746 00:43:13,865 --> 00:43:16,826 -"వాళ్లు నన్నేం కిడ్నాప్ చేయరులే, సోదరా" -"ఇంగ్లీషు వాళ్లనే పట్టుకోండి." 747 00:43:18,161 --> 00:43:20,538 -ఓ ప్రియతమా, ఎలా ఉన్నావు? -హలో. 748 00:43:20,622 --> 00:43:22,874 ఈ హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు భలే అందంగా ఉన్నావు. 749 00:43:22,957 --> 00:43:25,793 చిన్నగా ఉండే నీ మొహం ఈ హెల్మెట్లో చక్కగా ఉంది. 750 00:43:25,877 --> 00:43:27,086 సరే, పదండి బయల్దేరదాం. 751 00:43:37,305 --> 00:43:40,099 పైగా చార్లీ తన ముద్దులపట్టీ అయిన రెండో కూతుర్ని కారులో 752 00:43:40,183 --> 00:43:43,478 ఎక్కించుకుని, ఒత్తిడిని మరింత పెంచాడు. 753 00:43:43,561 --> 00:43:44,562 కిన్వారా చార్లీ కుమార్తె 754 00:43:44,646 --> 00:43:46,689 -హేయ్, అందాల బొమ్మా! -హేయ్, నాన్నా! 755 00:43:47,232 --> 00:43:48,608 హాయ్, ప్రియతమా. 756 00:43:49,901 --> 00:43:52,028 దేవుడా, నాన్నా, దేనికి? 757 00:43:52,111 --> 00:43:53,363 జాగ్రత్తగా కూర్చో. 758 00:43:53,446 --> 00:43:54,864 నమ్మశక్యంగా లేదు. 759 00:43:55,448 --> 00:43:59,285 మాట్లాడే స్థితిలో లేను, చార్లీ, కానీ ముగింపు అప్పుడే వద్దనిపిస్తోంది. 760 00:44:06,668 --> 00:44:08,795 కార్లో ఆర్జే ఉన్నాడా లేక నేను కల కంటున్నానా? ఎవరైనా నన్ను గిచ్చండి. 761 00:44:08,878 --> 00:44:10,421 ఇప్పుడు నేను కల కంటున్నట్టుంది. 762 00:44:12,799 --> 00:44:14,259 చూడు, రోడ్డంతా మనమే ఆక్రమించినట్టుంది. 763 00:44:31,359 --> 00:44:32,569 నిష్క్రమణ ద్వారం 50 ప్రధాన రహదారి 764 00:45:10,190 --> 00:45:13,818 చార్లీ అంటే నాకెంతో ఇష్టం, మేమిద్దరం కలసి ఈ మూడో పర్యటనను పూర్తి చేశాం. 765 00:45:15,236 --> 00:45:17,280 కాస్త వయసు పైబడ్డాక, ఇంకాస్త తెలివితేటలు వచ్చాక మూడో పర్యటన 766 00:45:17,363 --> 00:45:20,867 చేయాలని మేం ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్లం. 767 00:45:20,950 --> 00:45:23,119 ఏమో మరి. మాకు ఇప్పుడు వయసు పైబడినట్టే. 768 00:45:24,746 --> 00:45:29,792 అర్జెంటీనా 769 00:45:29,876 --> 00:45:33,755 చిలీ 770 00:45:33,838 --> 00:45:37,800 బొలీవియా 771 00:45:37,884 --> 00:45:42,722 పెరూ 772 00:45:42,805 --> 00:45:46,976 ఈక్వెడార్ 773 00:45:47,060 --> 00:45:51,356 కొలంబియా 774 00:45:51,439 --> 00:45:55,818 పనామా 775 00:45:55,902 --> 00:45:59,822 కోస్టా రికా 776 00:45:59,906 --> 00:46:03,993 నికరాగువా 777 00:46:04,077 --> 00:46:08,039 హోండూరాస్ 778 00:46:08,122 --> 00:46:10,333 గ్వాటెమాలా 779 00:46:10,416 --> 00:46:14,128 మెక్సికో 780 00:46:19,801 --> 00:46:23,805 ఈ ప్రపంచంలో మేం ఎంతో దూరాన్ని చుట్టి వచ్చామంటే నమ్మశక్యంగా లేదు. 781 00:46:23,888 --> 00:46:26,057 ఈ యాత్ర నిజంగా నా జీవితాన్ని మార్చివేసింది. 782 00:46:26,140 --> 00:46:28,601 ఆ జ్ఞాపకాలన్నింటికీ జోహార్లు. ఆ యాత్రలన్నింటికీ జోహార్లు. 783 00:46:28,685 --> 00:46:30,687 నా జీవితంలో మార్పు తెచ్చినందుకు ధన్యవాదాలు. 784 00:46:35,984 --> 00:46:37,861 ఇలా యాత్రల గురించీ, బైకులు, రోడ్ల గురించి నేను 785 00:46:37,944 --> 00:46:42,156 నిజంగానే పగటి కలలు కనేవాణ్ని... 786 00:46:42,240 --> 00:46:44,367 కానీ నేను బైక్ పైనే ఈ ప్రపంచ యాత్రను పూర్తి చేస్తున్నాను. 787 00:46:44,450 --> 00:46:46,202 ఇప్పుడు నాకు నిజంగానే బాధగా ఉంది. 788 00:46:50,331 --> 00:46:53,042 కొన్ని సందర్భాల్లో "నేను చేయగలను... 789 00:46:53,126 --> 00:46:54,252 నేను చేయగలను, తెలుసా" అని అనుకునేవాణ్ని. 790 00:46:55,044 --> 00:46:56,963 నువ్వు దీన్ని సాధించగలవు. 791 00:46:57,046 --> 00:46:59,799 నేను నా బైక్ పై కూర్చుని, ఇది నాకోసమే ఉందని అనుకున్నాను. 792 00:46:59,883 --> 00:47:01,718 ఇది ఎలాగైనా నేను సాధించగలను అనుకున్నాను. 793 00:47:06,222 --> 00:47:09,183 లాస్ ఏంజలెస్ కాలిఫోర్నియా 794 00:47:21,362 --> 00:47:22,780 అందరూ చక్కగా పనిచేశారు! 795 00:47:41,716 --> 00:47:43,009 వావ్, అలా చూడు. 796 00:47:43,885 --> 00:47:46,179 బైక్ షెడ్ మోటో కంపెనీ. 797 00:47:49,182 --> 00:47:50,183 మొత్తానికి తను సాధించాడు! 798 00:47:50,975 --> 00:47:51,976 సాధించావు, గురూ. 799 00:47:54,771 --> 00:47:56,648 -నువ్వు సాధించావు! -అవును అనక తప్పదు. 800 00:47:56,731 --> 00:47:57,774 నువ్వు సాధించావు. 801 00:47:57,857 --> 00:48:00,902 మొత్తానికి పూర్తయింది. అంతా శుభప్రదంగా జరిగింది. 802 00:48:18,378 --> 00:48:19,921 అవును, ధన్యవాదాలు. 803 00:48:29,597 --> 00:48:31,224 13,000 మైళ్లు. 804 00:48:32,267 --> 00:48:33,560 ఏకబిగిన చుట్టేసి వచ్చాం. 805 00:48:33,643 --> 00:48:36,437 నాపై భారం దిగిపోయింది. ఎంతో సంతోషంగా ఉంది. 806 00:48:54,080 --> 00:48:56,541 ఈ యాత్ర ముగిసిందని నాకు అనిపించడం లేదు. 807 00:48:56,624 --> 00:48:58,626 వాస్తవమేమిటో తెలియడానికి ఒక వారం పడుతుంది. అప్పుడు "ఓహో! 808 00:49:00,545 --> 00:49:01,963 మేం ఇప్పుడు పర్యటనలో లేము కదా. 809 00:49:02,046 --> 00:49:04,048 తదుపరి యాత్రకు ఇక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి" అని అనుకుంటాను. 810 00:50:02,106 --> 00:50:04,108 ఉపశీర్షికలను అనువదించినది: రాంప్రసాద్