1 00:00:01,000 --> 00:00:02,628 Long Way Upలో ఇంతకు ముందు... 2 00:00:02,711 --> 00:00:05,714 అందుకే ఈ యత్రలు చేస్తుంటాము. దీని కోసమే. అందుకే నాకిదంటే ఇష్టం. 3 00:00:06,173 --> 00:00:09,134 నేను వీలైనంత త్వరగా కోస్టా రికాకు నా బైక్ తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. 4 00:00:09,218 --> 00:00:12,346 కనుక, దానితో పాటు పనామా సిటీ దాకా వెళ్ళగలనేమో చూస్తాను. 5 00:00:12,429 --> 00:00:13,764 పచాంగా, పచాంగా. 6 00:00:13,847 --> 00:00:16,558 ఇతని వయసు 85 ఏళ్ళు, ఇంకా మోటర్ బైకులు నడుపుతుంటాడు. 7 00:00:17,351 --> 00:00:18,936 శాన్ హోసేకు వెళ్ళాలని ఆరాటంగా ఉంది. 8 00:00:19,019 --> 00:00:22,648 బైకు బాగుచేయడానికి మాత్రమే కాదు, నా కూతురు జమ్యాన్ ను చూడబోతున్నాను. 9 00:00:22,731 --> 00:00:24,399 అమ్మయ్య. మరలా రోడ్డు ఎక్కుతున్నాను. 10 00:00:40,415 --> 00:00:43,877 మేం 13 దేశాల గుండా 13,000 మైళ్ళు ప్రయాణించబోతున్నాం 11 00:00:44,461 --> 00:00:49,049 ఉషువాయా నుండి అర్జెంటీనా, చిలీ మీదుగా అటకామా ఎడారి చేరుకుని, 12 00:00:49,132 --> 00:00:52,386 అక్కడి నుంచి టిటికాకా సరస్సు దాటడానికి ముందు లా పాజ్ వెళ్తాం, 13 00:00:52,469 --> 00:00:56,265 ఆ తర్వాత ఆండీస్ పర్వత శ్రేణిని అనుసరిస్తూ కొలంబియా, అక్కడి నుంచి పనామా మీదుగా 14 00:00:56,348 --> 00:01:01,019 సెంట్రల్ అమెరికా, మెక్సికోలను దాటి 100 రోజుల తర్వాత లాస్ ఏంజలెస్ చేరతాం. 15 00:01:01,562 --> 00:01:02,646 రస్ మాల్కిన్ దర్శకుడు-నిర్మాత 16 00:01:02,729 --> 00:01:04,480 మేం వీళ్ళకి వీడియో కెమెరాలు ఇస్తాం, 17 00:01:04,565 --> 00:01:08,026 పైగా వాళ్ళ క్రాష్ హెల్మెట్లలోనూ మైక్రోఫోన్ అమర్చిన కెమెరాలు ఉంటాయి, 18 00:01:08,110 --> 00:01:09,736 కాబట్టి, వాటితో బైక్ నడుపుతూనే చిత్రీకరణ చేయవచ్చు 19 00:01:09,820 --> 00:01:13,240 ఇదీ అసలు రోడ్డేనా? దేవుడా! 20 00:01:13,323 --> 00:01:14,366 డేవిడ్ అలెగ్జానియన్ దర్శకుడు-నిర్మాత 21 00:01:14,449 --> 00:01:15,701 వాళ్ళతో మూడో బైక్ వెళ్తూ ఉంటుంది, 22 00:01:15,784 --> 00:01:17,077 దాని మీద కెమెరామెన్ క్లాడియో వెళతాడు. 23 00:01:17,160 --> 00:01:20,289 అది కాకుండా, నేను, రస్ రెండు ఎలక్ట్రిక్ పికప్ వాహనాల్లో వాళ్లని అనుసరిస్తాం, 24 00:01:20,372 --> 00:01:21,957 మాతో కెమెరామెన్లు జిమ్మీ, 25 00:01:22,040 --> 00:01:25,752 ఆంథోనీ, టైలర్ వస్తారు. వీళ్లు కావలసిన ఏర్పాట్లు కూడా చూసుకుంటారు. 26 00:01:25,836 --> 00:01:27,504 మేము కారు నుండే వాళ్ళని చిత్రీకరిస్తూ, 27 00:01:27,588 --> 00:01:29,131 వాళ్లని సరిహద్దుల్లో కలుస్తూ ఉంటాం, 28 00:01:29,214 --> 00:01:32,176 అది పక్కనబెడితే, వాళ్ళ ప్రయాణం వారిదే అన్నమాట. 29 00:01:35,971 --> 00:01:38,891 గునకాస్టే కోస్టా రికా 30 00:01:40,684 --> 00:01:41,518 ఇదిగో బయల్దేరాం. 31 00:01:42,394 --> 00:01:43,395 లాస్ ఏంజెలిస్ కు 3,881 మైళ్లు 32 00:01:43,478 --> 00:01:45,022 గురూ. నీతోపాటు ఇలా ప్రయాణించడం ఎంతో బాగుంది, చార్లీ. 33 00:01:45,105 --> 00:01:46,565 ఎన్నో యుగాల నుంచీ మన ప్రయాణం ఇలా సాగుతున్నట్టుంది. 34 00:01:46,648 --> 00:01:48,483 అవును, అసలు నువ్వు... 35 00:01:48,567 --> 00:01:50,402 -ఇది అద్భుతంగా ఉంది. -ఎంతో బాగుంది. 36 00:01:50,485 --> 00:01:53,113 ఇద్దరు వ్యక్తులు, రెండు బైకులు మళ్లీ కలిశాయి. 37 00:01:54,698 --> 00:01:55,741 వేగంగా పద. 38 00:01:57,993 --> 00:02:00,537 ఈ వర్షారణ్యంలో ప్రయాణం నాకెంతో ఇష్టం, చాలా బాగుంటుంది. 39 00:02:13,008 --> 00:02:16,303 నా అందమైన కుమార్తె, జమ్యాన్ ను కలిసేందుకు నేను సిద్ధమవుతున్నాను, 40 00:02:16,386 --> 00:02:18,597 Long Way Round ప్రయాణం లేకపోయినట్లయితే, తను, 41 00:02:18,680 --> 00:02:20,057 నా కూతురై ఉండేదే కాదు. 42 00:02:20,724 --> 00:02:22,184 తను వస్తుండటం నాకెంతో నచ్చింది. 43 00:02:22,643 --> 00:02:25,521 మరొక రాత్రి కోస్టా రికాలో బస చేసి, ఆ తర్వాత నికరాగువాకు బయల్దేరతాం. 44 00:02:25,604 --> 00:02:26,438 ప్లాయా హెర్మొసా గ్రెనడా 45 00:02:30,692 --> 00:02:32,361 సరే, నేస్తం? బాగానే ఉన్నావా? 46 00:02:32,903 --> 00:02:34,029 భలే ఉంది. 47 00:02:35,405 --> 00:02:37,449 ముందుకు చూడు, చార్లీ. ముందుకు చూడు. 48 00:02:37,533 --> 00:02:38,367 అందంగా ఉంది. 49 00:02:38,450 --> 00:02:41,453 అలా సముద్రంలోకి 50 00:02:51,588 --> 00:02:55,008 ప్లాయా హెర్మొసా కోస్టా రికా 51 00:02:57,886 --> 00:02:59,471 దేవుడా, అది నా జుట్టులా ఉంది. 52 00:02:59,555 --> 00:03:00,556 జమ్యాన్ ఇవాన్ కుమార్తె 53 00:03:00,639 --> 00:03:01,807 బాగుంది, నేస్తం. 54 00:03:01,890 --> 00:03:03,392 భలే బాగుంది కదా, నేస్తం. 55 00:03:03,475 --> 00:03:05,310 అది అసలు ఆస్ట్రేలియా యాస కానే కాదు. 56 00:03:05,811 --> 00:03:08,730 -ఆస్ట్రేలియా యాసలో ఎలా మాట్లాడతావు నేస్తం? -ఆ యాసలో నేనస్సలు మాట్లాడలేను. 57 00:03:08,814 --> 00:03:10,774 ఇసుక ఎంత నల్లగా ఉందో చూడు. 58 00:03:10,858 --> 00:03:11,775 ఎందుకో తెలుసా నీకు? 59 00:03:11,859 --> 00:03:13,569 -ఎందుకు? -ఎందుకంటే ఇది అగ్నిపర్వతం బూడిద. అందుకని. 60 00:03:13,652 --> 00:03:14,653 అలాగా. 61 00:03:17,281 --> 00:03:18,490 కావచ్చు... ఆగు. 62 00:03:20,617 --> 00:03:21,743 అది హాట్ సాస్. 63 00:03:21,827 --> 00:03:23,328 -అది హాట్ సాస్. -అవును. వద్దు. 64 00:03:24,746 --> 00:03:26,456 తినగా మిగిలిన ఈ పొత్తును మంటల్లోకి విసిరేస్తాను, సరేనా? 65 00:03:26,540 --> 00:03:29,710 -నీ వల్ల కాదని నా ఉద్దేశం. -చూద్దాం, సిద్ధమేనా? ఒకటి, రెండు, మూడు. 66 00:03:30,836 --> 00:03:32,045 లేదు, నువ్వు విసరలేదు! 67 00:03:32,129 --> 00:03:34,173 -అది చాలా దూరంగా ఉంది మరి. -అబ్బా... 68 00:03:41,889 --> 00:03:43,891 ఆ మంటలు చూడు, ఎవరో బొమ్మ గీసినట్టు లేదూ? 69 00:03:43,974 --> 00:03:46,226 -అది ఎలా ఉందంటే... -చాలా అందంగా ఉంది. 70 00:03:49,146 --> 00:03:50,147 జమల్లమా. 71 00:03:58,572 --> 00:04:00,949 జామ్స్, అసలైన అగ్నిపర్వతం ఎలా ఉంటుందో చూడాలని ఉందా? 72 00:04:03,035 --> 00:04:04,203 అత్యధిక సంఖ్యలో సందర్శకులు 73 00:04:04,286 --> 00:04:06,413 వీక్షించే నికరాగువా నేషనల్ పార్కుని మనం ఇప్పుడు చూడబోతున్నాం... 74 00:04:06,496 --> 00:04:07,497 రెనె స్థానిక నిర్మాత 75 00:04:07,581 --> 00:04:09,208 ...ఓల్కన్ మసాయా నేషనల్ పార్క్. 76 00:04:09,291 --> 00:04:12,794 దేశంలో ఎప్పుడూ రగులుతూ ఉండే అగ్ని పర్వతం ప్రస్తుతానికి ఇదే. 77 00:04:22,179 --> 00:04:26,016 మసాయా అగ్నిపర్వతం నికరాగువా 78 00:04:27,476 --> 00:04:31,063 చివరిసారి మేం లావాను 80వ దశకంలో చూశాం. 79 00:04:32,147 --> 00:04:34,066 కొన్నేళ్ల తర్వాత, లావా మాయమైంది, 80 00:04:34,650 --> 00:04:37,152 మళ్లీ ఆరేళ్ల క్రితం కనిపించింది. 81 00:04:37,986 --> 00:04:39,238 దేవుడా, ఆశ్చర్యంగా ఉందే. 82 00:04:39,821 --> 00:04:40,864 వావ్. 83 00:04:41,698 --> 00:04:43,116 నువ్వు... విను. 84 00:04:46,620 --> 00:04:48,997 ఆ చప్పుడు వింటున్నావా? అది సముద్ర ఘోషలా ఉంది. 85 00:04:51,792 --> 00:04:54,127 చూస్తే, రాత్రి వేళే చూడాలి. అప్పుడే బాగా కనబడుతుంది. 86 00:04:55,420 --> 00:04:58,215 అది దాని కేంద్ర స్థానం, పైకి ఎగసిపడుతోంది. 87 00:04:59,132 --> 00:05:03,554 అగ్నిపర్వతం లోపల ఉష్ణోగ్రత సుమారు 1,200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 88 00:05:03,637 --> 00:05:05,514 పర్వతం కింద కాగడాలు పట్టుకుని మనుషులు ఉన్నారు, చూడు. 89 00:05:05,597 --> 00:05:07,307 చూశావా? కింద ఉన్నారు చూడు. 90 00:05:11,603 --> 00:05:16,149 అగ్నిపర్వతాన్ని పర్యవేక్షించేందుకు చుట్టుపక్కల 80 సెన్సర్లు ఉన్నాయి 91 00:05:16,233 --> 00:05:20,696 అగ్నిపర్వతం బద్దలయ్యే ప్రమాదం ఉన్నదీ లేనిదీ అవి చెబుతాయి. 92 00:05:22,197 --> 00:05:23,657 ప్రపంచం పేలిపోతోంది. 93 00:05:23,740 --> 00:05:25,951 ఇది అంతిమ సమయం. ముగింపుకి ఇది ప్రారంభం. 94 00:05:26,577 --> 00:05:29,246 అంత్యకాలానికి సిద్ధంగా ఉండండి. ప్రేతాత్మల కాలం దాపురిస్తుంది. సిద్ధంకండి. 95 00:05:30,414 --> 00:05:31,498 పారిపోయి దాక్కుందాం, పదండి. 96 00:05:31,582 --> 00:05:33,917 భయపడాల్సిందే. బాగా భయపడాలి. 97 00:05:34,251 --> 00:05:37,045 నాన్నా, నువ్వు భయపడుతుంటే నీ ముఖం భలే ఉంటుంది. 98 00:05:43,594 --> 00:05:46,388 గ్రెనడా నికరాగువా 99 00:05:47,806 --> 00:05:48,891 పద, జమూల్స్. 100 00:05:49,308 --> 00:05:50,559 జమ్యాన్ మెక్ గ్రెగర్. 101 00:05:51,852 --> 00:05:53,061 ఆ రంగులు చూడు. 102 00:05:53,145 --> 00:05:54,771 -ఈ పట్టణం నాకు నచ్చింది. -ఇంకాస్త దూరం నడవాలి. 103 00:05:54,855 --> 00:05:58,108 ఓరి దేవుడా! దేవుడా, బుజ్జి కుక్క భలే ఉంది. 104 00:05:59,568 --> 00:06:01,820 పరుపులు నెత్తిపై పెట్టుకుని వెళ్తున్న ఆ వ్యక్తిని చూడు. 105 00:06:01,904 --> 00:06:02,905 అలా చూడు. 106 00:06:06,283 --> 00:06:08,202 ఈ వీధి చాలా వింతగా ఉంది. 107 00:06:12,080 --> 00:06:13,832 రాలీ సైకిల్. చూడు. 108 00:06:13,916 --> 00:06:15,959 ఏటవాలుగా వెళ్ళేటప్పుడు ఇవి నిలకడగా ఉండవు. 109 00:06:16,043 --> 00:06:19,046 ముందు చక్రం చాలా చిన్నది, రోడ్డు మీద ఇలా వెళ్లిపోతుంది. 110 00:06:19,755 --> 00:06:20,756 నాకూ ఇలాంటిది ఒకటి కావాలి. 111 00:06:26,053 --> 00:06:27,095 ఆ తలను తగిలించుకుంటావా? 112 00:06:27,679 --> 00:06:29,890 సరేనా? ఇప్పుడిది నీ తలపై ఉంది. సరిపోయిందా? 113 00:06:32,976 --> 00:06:33,977 భలే ఉంది. 114 00:06:34,770 --> 00:06:35,771 దేవుడా! 115 00:06:39,942 --> 00:06:41,109 ఇక్కడ ఆహార పదార్ధాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 116 00:06:42,945 --> 00:06:45,030 -మీకు ఆకలేస్తోందా? -చక్కటి వాసన వస్తోంది. 117 00:06:45,113 --> 00:06:46,532 నిజానికి ఘుమఘుమలాడిపోతున్నాయి. 118 00:06:47,157 --> 00:06:48,450 ఎంత దూరం, జామ్స్? 119 00:06:48,534 --> 00:06:49,535 బనానా బర్జర్ 120 00:06:49,618 --> 00:06:50,869 ఇక్కడన్నీ సహజసిద్ధమైనవే. 121 00:06:50,953 --> 00:06:52,829 ఇది డ్రెస్సింగ్. 122 00:06:52,913 --> 00:06:54,206 సహజసిద్ధమైన డ్రెస్సింగ్. 123 00:06:54,289 --> 00:06:58,460 ఇది ఉల్లిపాయలు, అల్లం, యాపిల్ వెనిగార్ తో కలిపి చేసినది. 124 00:06:58,544 --> 00:06:59,378 యాపిల్ వెనిగార్. 125 00:06:59,753 --> 00:07:00,587 సరే. 126 00:07:07,094 --> 00:07:08,262 ఇప్పుడు బాగుంటుంది. 127 00:07:10,055 --> 00:07:12,474 వావ్. అద్భుతం. 128 00:07:12,558 --> 00:07:14,226 -దేవుడా. -ఎందుకంటే ఇవన్నీ తాజావే మరి. 129 00:07:14,309 --> 00:07:19,022 ఇది అవకాడో, అల్లం, ఆలివ్ నూనె, వెనిగార్ తో చేసినది. 130 00:07:19,106 --> 00:07:20,524 -అంతే, వాటినే కలిపి చేశారు. -దేవుడా. 131 00:07:21,149 --> 00:07:22,609 ఇది జుకిని. 132 00:07:22,693 --> 00:07:25,237 ఇది కూడా, ఇవన్నీ సహజసిద్ధంగా తయారు చేసిన డ్రెస్సింగ్లు. 133 00:07:26,321 --> 00:07:27,322 బాగుందా? 134 00:07:27,406 --> 00:07:30,117 -దేవుడా, చాలా బాగుంది. -ఇవన్నీ స్థానికంగా తయారైనవే. 135 00:07:30,200 --> 00:07:31,034 అవును, అవును, అవును. 136 00:07:31,118 --> 00:07:32,703 -సూపర్ మార్కెట్లలోవి కావు, స్థానిక తయారీ. -సరే, సరే. 137 00:07:32,786 --> 00:07:33,787 అమోస్ చెఫ్ 138 00:07:33,871 --> 00:07:35,163 డ్రెస్సింగ్ ని ఆఖరి నిమిషంలో తయారు చేస్తారు. 139 00:07:35,247 --> 00:07:36,248 -అలాగా. -తాజాది. 140 00:07:36,331 --> 00:07:37,332 -అదే రహస్యం. -నాకు నచ్చింది. 141 00:07:37,416 --> 00:07:38,458 చాలా రుచిగా ఉంది. చాలా రుచిగా. 142 00:07:38,542 --> 00:07:40,085 బనానా బర్జర్ టోస్టో మెట్రో 143 00:07:40,169 --> 00:07:42,004 ఈ రెండూ ఎలా తయారు చేయాలో వివరాలు కావాలా? 144 00:07:42,087 --> 00:07:43,547 -అవును. -బాగుంది, సరే. పద. 145 00:07:43,630 --> 00:07:45,632 -నేను చిత్రీకరించానులే. -పద, బైక్ లపై బయల్దేరుదాం. 146 00:07:51,221 --> 00:07:53,098 ఇక్కడికి రావడం నాకు నచ్చింది. 147 00:07:53,515 --> 00:07:56,518 నికరాగువా బాగుంది. నాకు నచ్చింది. 148 00:07:57,644 --> 00:07:59,605 సరే, మిత్రులారా, రోడ్డుకు ఆ పక్కన చూడండి. 149 00:08:02,232 --> 00:08:04,860 మాతోపాటు జమ్యాన్ కూడా రావడం చాలా బాగుంది. 150 00:08:04,943 --> 00:08:07,237 ఇక్కడికి రావడానికి తాను చాలా సుదీర్ఘ ప్రయాణం చేసింది. 151 00:08:07,321 --> 00:08:09,656 బహుశా ఆమె, ఇతర సిబ్బందితోపాటు ప్రయాణిస్తున్నట్టుంది. 152 00:08:15,871 --> 00:08:19,875 గ్రెనడా - హోండూరస్ - నికరాగువా గ్వాటెమాల - శాన్ పెడ్రో సులా 153 00:08:23,879 --> 00:08:27,216 రోడ్డుకి అటువైపుగా వెళ్తున్న ఓ సాహస యాత్రికుడు కనిపించాడు. 154 00:08:27,299 --> 00:08:29,801 అతను వెనక్కి తిరిగి మమ్మల్ని అనుసరిస్తున్నాడనుకుంటా. 155 00:08:29,885 --> 00:08:30,886 ఇతనేనా? 156 00:08:34,515 --> 00:08:36,058 హేయ్, గురూ. ఎలా ఉన్నావు? 157 00:08:36,140 --> 00:08:37,183 చాలా బాగుంది. 158 00:08:37,808 --> 00:08:41,730 నువ్వు పనామాకు వస్తున్న ఫొటో ఒకటి నేను చూశాను. 159 00:08:41,813 --> 00:08:42,898 అలాగా. 160 00:08:42,981 --> 00:08:44,733 "భలే మంచి సమయం" అని నాకు అనిపించింది. 161 00:08:44,816 --> 00:08:45,817 జకారి సాహస యాత్రికుడు 162 00:08:45,901 --> 00:08:47,986 "సరే, వాళ్లు ఏ దారిన వెళ్తున్నారో? 163 00:08:48,070 --> 00:08:50,697 ఎటువైపు వెళ్తున్నారో?" అని నేను అనుకున్నాను. 164 00:08:50,781 --> 00:08:54,660 మీ ప్రయాణాన్ని కొనసాగించండి. జనానికీ, నాకూ మీరు స్ఫూర్తిదాయకం. 165 00:08:54,743 --> 00:08:56,828 -ధన్యవాదాలు. -నీకు అంతా మంచి జరగాలి. 166 00:08:59,331 --> 00:09:00,374 ఈ రోజు నమ్మశక్యంగా లేదు. 167 00:09:03,085 --> 00:09:04,419 ఇదిగో. సరిహద్దు వచ్చేసింది. 168 00:09:05,379 --> 00:09:07,506 "శుభ ప్రయాణం." 169 00:09:08,882 --> 00:09:11,844 నికరాగువా / హోండూరస్ బోర్డర్ క్రాసింగ్ 170 00:09:11,927 --> 00:09:12,928 సరే. 171 00:09:13,512 --> 00:09:16,181 అబ్బా, కావలిసిన పత్రాలన్నీ సరిగ్గా ఉంటే బాగుండును. 172 00:09:19,351 --> 00:09:20,310 హేయ్, జామ్స్. 173 00:09:20,394 --> 00:09:23,105 ఆమె మాతోపాటుగా, మా బృందంతో కలిసి ప్రయాణించడం భలేగా ఉంది! 174 00:09:23,605 --> 00:09:25,023 కావలసిన పత్రాలన్నీ పూర్తి చేశావా? 175 00:09:28,318 --> 00:09:30,445 నా దగ్గరో పెద్ద సంచి ఉంది, మీరు దాన్ని చూస్తే నవ్వుతారు. 176 00:09:35,909 --> 00:09:37,035 ఇదిగో, అది ఇక్కడ ఉంటుంది. 177 00:09:37,452 --> 00:09:39,580 మీకు చూపించా కదా... నా సంచి ఉపయోగమేమిటో. 178 00:09:42,040 --> 00:09:44,126 మీరు రెడి అయితే, బయల్దేరండి, సరేనా? 179 00:09:44,209 --> 00:09:45,586 సరే, జామ్స్, నేను బయల్దేరుతున్నా. 180 00:09:45,669 --> 00:09:47,129 -అలాగే. -ఐ లవ్ యూ. 181 00:09:50,174 --> 00:09:53,969 నేను మా నాన్నతో అన్నాను... "నాన్నా, ఈ ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉన్నట్టుంది" అని. 182 00:09:54,052 --> 00:09:56,430 దానికి ఆయన "ఇది మిగతా ప్రయాణాలంత సుదీర్ఘమైనది కాదు" అన్నాడు. 183 00:09:56,513 --> 00:09:59,433 "అవును, కానీ చాలా సుదీర్ఘమైనదని అనిపిస్తోంది" అని నేను అన్నాను. 184 00:09:59,516 --> 00:10:01,059 "ఎందుకంటే, మేం ముసలివాళ్ళం అయిపోయాం కదా" అన్నాను. 185 00:10:01,143 --> 00:10:03,270 దానికి ఆయన "అవును. ముసలితనం, నాయనా, నిజమే మరి" అన్నాడు. 186 00:10:04,605 --> 00:10:05,772 ఈ కుర్రాడెవరో దూసుకుపోతున్నాడు. 187 00:10:05,856 --> 00:10:07,733 నువ్వు అతన్ని వేళాకోళం చేస్తున్నావా... 188 00:10:07,816 --> 00:10:11,153 చూడు, అతని జుట్టు వెనకాల ఎంత పొడుగ్గా ఉందో...- 189 00:10:12,321 --> 00:10:15,240 ఆ బైక్ 25 సిసి సామర్థ్యం గలదా? 190 00:10:15,324 --> 00:10:16,909 డుక్ డుక్ మని చప్పుడు చేస్తోంది. 191 00:10:16,992 --> 00:10:18,243 అదొక చిన్నపాటి మోటార్ సైకిల్. 192 00:10:26,752 --> 00:10:29,880 కొలొమా హొండూరస్ 193 00:10:32,591 --> 00:10:33,926 మేం యునిసెఫ్ కు వెళ్తున్నాం 194 00:10:34,009 --> 00:10:37,262 ముఠాల హింసకు గాయపడిన పిల్లలు అక్కడున్నారు, 195 00:10:37,346 --> 00:10:39,264 ఇక్కడ భద్రత ఒక పెద్ద సమస్య. 196 00:10:39,348 --> 00:10:42,267 కాబట్టి, మేం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. 197 00:10:46,522 --> 00:10:50,150 యునిసెఫ్ సామాజిక కేంద్రం హోండూరస్ 198 00:10:51,443 --> 00:10:54,446 మాదక ద్రవ్యాలు, వేధింపులు, కిడ్నాపులు. 199 00:10:54,530 --> 00:10:57,324 ఈ ప్రాంతం చాలా ప్రమాదభరితమైనది. 200 00:10:57,407 --> 00:10:58,408 హెక్టార్ యునిసెఫ్ 201 00:10:58,492 --> 00:11:00,327 వీధుల్లో జనం నడిచేవారు కాదు. 202 00:11:00,410 --> 00:11:02,955 ఈ ప్రదేశంలో, ఎవరూ తిరిగేవారే కాదు. 203 00:11:03,372 --> 00:11:05,499 పిల్లలు ఇంటికే పరిమితమైపోయేవారా? 204 00:11:05,582 --> 00:11:09,628 స్కూళ్లకు, పార్కులకు వెళ్ళడం, ఆడుకోవడం వంటివి లేకుండా ఇళ్లలోనే ఉండేవారా? 205 00:11:09,711 --> 00:11:12,631 పూర్తిగా. వాళ్లు బయటకు వచ్చేవారే కాదు. 206 00:11:12,714 --> 00:11:16,885 నాలుగేళ్ల నుంచి వాళ్లు కాస్త వీధుల్లో తిరగడం మొదలైంది. 207 00:11:16,969 --> 00:11:18,637 వీధుల్లోకి వస్తే ఏమయ్యేది? 208 00:11:18,720 --> 00:11:21,390 -చంపేసేవాళ్లు. -బయటకు వస్తేనే చంపేసేవాళ్లా? 209 00:11:21,473 --> 00:11:23,183 అవును. వీధుల్లో నడిస్తే చంపేసేవాళ్లు. 210 00:11:23,267 --> 00:11:25,686 ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించడంలో మాకు సాయపడిన యువతీ యువకులతో 211 00:11:25,769 --> 00:11:27,145 మేం ఒక పర్యటన ప్రారంభించబోతున్నాం. 212 00:11:31,024 --> 00:11:35,779 నేనుండే చోట, ఇల్లు వదలి బయటకు వచ్చేదాన్ని కాను, 213 00:11:35,863 --> 00:11:39,616 కానీ ఇందులో చేరాక బయటకు వస్తున్నాను, 214 00:11:39,700 --> 00:11:42,119 ఇక్కడ నేను ఒకదానికి శిక్షణని తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు. 215 00:11:42,202 --> 00:11:45,289 పైగా, మా అమ్మ కూడా నన్ను తరచు బయటకు రానిస్తోంది. 216 00:11:45,372 --> 00:11:49,710 అంతకుముందు మాత్రం నేనసలు ఇల్లు వదిలేదాన్నే కాను. 217 00:11:49,793 --> 00:11:50,794 అదేమిటి? 218 00:11:56,925 --> 00:12:00,220 ఇక్కడ, యువతీ యువకులు ముఠాల సంస్కృతిపై చైతన్యం 219 00:12:00,304 --> 00:12:02,514 తెచ్చేందుకు నాటకాలు నిర్వహించి, పిల్లల్ని జాగరూకుల్ని చేస్తున్నారు. 220 00:12:02,931 --> 00:12:04,057 నీకేమైనా పిచ్చా? 221 00:12:04,141 --> 00:12:06,268 నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు? పిచ్చా నీకు? 222 00:12:06,351 --> 00:12:07,269 ఏమైంది నీకు? 223 00:12:07,352 --> 00:12:09,855 ఏం కాలేదు. జీవితం గురించి ఆలోచించుకుంటున్నా. 224 00:12:09,938 --> 00:12:11,356 డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? 225 00:12:12,107 --> 00:12:13,692 నీకు డబ్బులు వద్దా? 226 00:12:17,070 --> 00:12:19,239 లేదు! నాన్నా, ఇలా జరగడానికి వీల్లేదు! 227 00:12:33,837 --> 00:12:34,838 సరే. 228 00:12:59,279 --> 00:13:02,199 ఇక్కడ ముఠాల సంస్కృతి జనాలలోకి చొరబడి... 229 00:13:02,282 --> 00:13:05,577 తాము చేసే వెధవ పనుల కోసం పిల్లలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 230 00:13:05,661 --> 00:13:09,498 పిల్లలు కూడా అదే జీవితానికి అలవాటు పడుతున్నారు, "మేం చెప్పినట్టు చెయ్యి, లేదా 231 00:13:09,581 --> 00:13:11,834 మీ అమ్మను చంపేస్తాం" అని బెదిరిస్తే, ఒక పిల్లవాడిగా మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. 232 00:13:11,917 --> 00:13:12,835 "ఏమిటి?" అంటూ కలవరపడతాం. 233 00:13:12,918 --> 00:13:17,506 అలాంటి జీవితాన్ని ఊహించుకోండి, అలాగే ఈ కేంద్రం చేస్తున్న మంచిని గమనించండి. 234 00:13:17,589 --> 00:13:19,591 వాళ్లు సంగీతం నేర్చుకోవచ్చు. బ్యాండ్ గా ఏర్పడవచ్చు. 235 00:13:19,675 --> 00:13:23,428 సర్కస్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు, కళాకృతులు వేయడం నేర్చుకోవచ్చు. 236 00:13:23,971 --> 00:13:24,972 ఇది చాలా అద్భుతంగా ఉంది. 237 00:13:25,639 --> 00:13:27,140 ప్రజలకు తమ భావాల అభివ్యక్తీకరణకు ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. 238 00:13:27,224 --> 00:13:29,810 మీ మనసులోని భావాలకు కళారూపం ఇవ్వొచ్చు, అది మీకు మంచిది కూడా. 239 00:13:29,893 --> 00:13:30,727 వాళ్లను బాధల్లోంచి గట్టెక్కిస్తుంది. 240 00:13:51,123 --> 00:13:53,000 శాన్ పెడ్రో సులా - పనాజాచెల్ గ్వాటెమాల - హోండూరస్ 241 00:13:53,083 --> 00:13:56,003 మేం గ్వాటెమాల వద్ద సరిహద్దు దాటేందుకు వెళ్తున్నాం. 242 00:13:56,086 --> 00:13:58,338 -గ్వాటెమాల! -గ్వాటెమాల! 243 00:13:58,839 --> 00:14:00,132 అద్భుతంగా ఉంది కదా? 244 00:14:00,799 --> 00:14:01,925 సరే! 245 00:14:02,634 --> 00:14:03,635 హోండూరస్ / గ్వాటెమాల బోర్డర్ క్రాసింగ్ 246 00:14:03,719 --> 00:14:07,639 ఈ పర్యటనలో పాల్గొనడం వల్ల నాకేమనిపిస్తోందంటే, మళ్లీ తిరిగి వచ్చి... 247 00:14:07,723 --> 00:14:09,933 ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనాలని... 248 00:14:10,017 --> 00:14:11,226 చాలా మంచి విషయం. 249 00:14:11,310 --> 00:14:14,146 మా యాత్ర పర్యాటక ప్రధానమైనదే అయినా, మేం వెళ్లిన ప్రతి చోటా, 250 00:14:14,229 --> 00:14:17,191 ప్రతి రోజూ ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం కలుగుతోంది. 251 00:14:17,274 --> 00:14:20,527 రోడ్డుపై సాగించే ఇలాంటి యాత్రల వల్ల లభించే ప్రయోజనం ఇది. 252 00:14:20,611 --> 00:14:24,114 ఒకచోట నుంచి మరొక చోటకు మేం వెళ్లడం వల్ల అక్కడి వాస్తవిక జీవన విధానం తెలుసుకోగలం, 253 00:14:24,198 --> 00:14:26,408 ఇలాంటిది రోడ్డు ప్రయాణాల్లో మాత్రమే సాధ్యం, కదా? 254 00:14:36,084 --> 00:14:38,462 అలా చూడు. ఎంత అందంగా ఉంది. 255 00:14:38,545 --> 00:14:41,089 -ఇదే గ్వాటెమాల అంటే మరి. -గ్వాటెమాల. 256 00:14:41,715 --> 00:14:42,716 పెద్ద చెరువు. 257 00:14:43,509 --> 00:14:45,260 అద్భుతమైన అగ్నిపర్వతం. 258 00:14:45,928 --> 00:14:47,471 నాకు ఆ అగ్నిపర్వతంలో ఈదాలని ఉంది. 259 00:14:49,097 --> 00:14:53,268 అకస్మాత్తుగా ఈ అడవి వచ్చేసింది, 260 00:14:53,352 --> 00:14:57,189 ఇక్కడ పెద్ద యెత్తున కాఫీ తోటలు ఉన్నాయి, 261 00:14:59,399 --> 00:15:00,234 గ్వాటెమాల! 262 00:15:00,317 --> 00:15:01,735 గ్వాటెమాల! 263 00:15:05,656 --> 00:15:07,908 జమ్యాన్ తో కలసి క్యాంపింగ్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. 264 00:15:07,991 --> 00:15:09,368 నాకు క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం. 265 00:15:09,451 --> 00:15:12,120 అందమైన ప్రకృతిలో ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 266 00:15:12,204 --> 00:15:14,623 ఇలా స్వేచ్ఛగా విహరించడం నచ్చింది. 267 00:15:23,048 --> 00:15:24,466 అది చాలా బాగుంది. 268 00:15:24,550 --> 00:15:27,177 ఇపాలా అగ్నిపర్వతం గ్వాటెమాల 269 00:15:27,261 --> 00:15:28,262 అద్భుతంగా ఉంది. 270 00:15:28,887 --> 00:15:30,597 దేవుడా, ఆ అగ్నిపర్వతం మధ్యలో చూడు. 271 00:15:30,681 --> 00:15:32,599 -దేవుడా! -ఇది చాలా బావుంది. 272 00:15:33,267 --> 00:15:35,352 ఇంతకుముందెన్నడూ ఇలా అగ్నిపర్వతాన్ని సమీపం నుంచి నేను చూడలేదు. 273 00:15:37,771 --> 00:15:39,565 ఇది జురాసిక్ పార్కు సినిమాలా ఉంది. 274 00:15:43,610 --> 00:15:44,611 క్షమించు. 275 00:15:45,654 --> 00:15:47,614 -అయితే, నువ్వు ఆ వెనక నుంచి వెయ్యి. -అలాగే. 276 00:15:51,535 --> 00:15:52,536 అబ్బా, ఛీ. 277 00:15:55,914 --> 00:15:57,958 టెంటు ఏ దిశగా వేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నాను. 278 00:15:59,001 --> 00:16:00,502 నా మనసు తడవ తడవకూ మారుతోంది. 279 00:16:00,961 --> 00:16:02,713 అక్కడ నీకు బాగానే ఉందా, చార్లీ? 280 00:16:03,130 --> 00:16:05,215 నాకు బాగానే ఉంది. 281 00:16:05,299 --> 00:16:06,550 అక్కడ బాగానే ఉందా? 282 00:16:08,010 --> 00:16:09,011 దేవుడా! 283 00:16:10,554 --> 00:16:11,555 పాపిష్ఠి గాలి. 284 00:16:13,015 --> 00:16:14,975 రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్లు. 285 00:16:15,058 --> 00:16:17,311 రా. నన్ను తీసుకెళ్లు. వచ్చి తీసుకెళ్లు మరి. 286 00:16:19,146 --> 00:16:20,189 దేవుడా. 287 00:16:20,689 --> 00:16:21,773 దేవుడా. 288 00:16:22,149 --> 00:16:24,109 చూడు. ఎక్కడబడితే అక్కడ చీమలు. 289 00:16:24,193 --> 00:16:25,194 చూడు. 290 00:16:25,277 --> 00:16:27,112 నన్ను కుట్టేస్తున్నాయి, చూడు. 291 00:16:28,447 --> 00:16:31,283 చీమల పుట్ట. చూడు, అంతటా చీమలే చీమలు. 292 00:16:36,079 --> 00:16:36,914 బాగుంది. 293 00:16:37,956 --> 00:16:38,957 ఇక నా వల్ల కాదు. 294 00:16:50,677 --> 00:16:51,887 భలే ఉంది కదా? 295 00:16:51,970 --> 00:16:53,764 పారా గ్లైడింగ్ లేకపోతే హేంగ్ గ్లైడింగ్. 296 00:16:53,847 --> 00:16:55,682 నువ్వు అందుకోగల దూరం అది, కదా? 297 00:16:55,766 --> 00:16:58,060 ఇంజనేమీ ఉండదు. పవన శక్తితోనే. 298 00:17:05,692 --> 00:17:07,109 నీళ్లు బాగా చల్లగా ఉన్నాయి. 299 00:17:09,820 --> 00:17:10,739 భలే. 300 00:17:10,821 --> 00:17:12,115 ఇవాన్ పని అయిపోయింది. 301 00:17:19,957 --> 00:17:21,666 ఈ పర్యటన నాకెంతో నచ్చింది. 302 00:17:21,750 --> 00:17:23,167 మనం ఇక్కడికి రావడం బాగుంది. 303 00:17:24,837 --> 00:17:28,048 టెంటు వేసుకునేందుకు ఇంతకంటే మంచి చోటు మరొకటి 304 00:17:28,882 --> 00:17:29,883 ఉందని నేనుకోను, తెలుసా? 305 00:17:31,593 --> 00:17:32,594 మహాద్భుతం. 306 00:17:35,556 --> 00:17:36,974 ఇప్పుడు, మేం గుమ్మడికాయతో వంట చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 307 00:17:37,057 --> 00:17:39,184 ఎందుకంటే ఇవాళ థాంక్స్ గివింగ్ రోజు, తెలుసా? 308 00:17:39,935 --> 00:17:43,856 గ్వాటెమాలలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటున్న తొలి అమెరికన్ ఇవాన్. 309 00:17:43,939 --> 00:17:45,440 అవును మరి. 310 00:17:51,238 --> 00:17:53,824 దీన్ని పవిత్రమైన కొలనుగా మయాన్లు భావిస్తారు. 311 00:17:53,907 --> 00:17:57,995 ఆ నీళ్లలో నువ్వు స్నానం చేస్తే, నీలో శక్తి పునరుద్ధరణ జరుగుతుందని అంటారు, 312 00:17:58,078 --> 00:17:59,705 తాతాల ఆశీర్వాదం కూడా లభిస్తుందంటారు. 313 00:17:59,788 --> 00:18:02,124 అందుకనే వాళ్లు షామాన్లు అంటారు. 314 00:18:02,207 --> 00:18:03,208 మాన్యుయేలా స్థానిక నిర్మాత 315 00:18:03,292 --> 00:18:05,586 ఇక్కడ ఈత కొడితే నీలో శక్తి పునరుత్తేజితం అవుతుంది 316 00:18:05,669 --> 00:18:10,340 అలాగే ఈ ప్రదేశానికి నువ్వు తీసుకువచ్చిన దుష్టశక్తులు పరిహరింపబడతాయి. 317 00:18:11,091 --> 00:18:12,426 అవును, నాకు కొత్త శక్తి లభించినట్టుగా ఉంది. 318 00:18:31,069 --> 00:18:32,654 నేను నిద్ర లేచే సమయానికి ఇక్కడ ఏం ఉందో చూడండి. 319 00:18:33,238 --> 00:18:34,239 బుజ్జి స్నేహితుడు. 320 00:18:34,740 --> 00:18:35,741 హలో, బుజ్జీ. 321 00:18:42,539 --> 00:18:43,373 వావ్. 322 00:18:52,466 --> 00:18:54,885 నా టెంటు వెనక కుప్పగా పడిపోయింది. 323 00:18:55,677 --> 00:18:57,429 నామీద పూర్తిగా పడిపోయింది. 324 00:18:59,932 --> 00:19:00,933 క్యాంపింగ్. 325 00:19:09,608 --> 00:19:11,777 ఆ కోడిపై ఉన్న మచ్చలు చూడు, భలే ఉన్నాయి, కదా? 326 00:19:14,029 --> 00:19:15,364 అది నీకు అర్థమైంది కదా. 327 00:19:15,447 --> 00:19:18,700 ఈ కోడి భలేగా ఉంది. 328 00:19:20,619 --> 00:19:21,453 బాగుంది కదా? 329 00:19:21,537 --> 00:19:23,789 కానీ ఇది 100% అని చూపిస్తోంది. 330 00:19:24,706 --> 00:19:25,707 అదే సరైన ఫలితం. 331 00:19:26,333 --> 00:19:27,459 అది నాకు సంతోషంగానే ఉంది. 332 00:19:29,670 --> 00:19:30,671 హలో. 333 00:19:31,171 --> 00:19:33,340 -శుభోదయం. -శుభోదయం, మిత్రమా. 334 00:19:34,758 --> 00:19:36,343 బై-బై... నువ్వూ వస్తున్నావా? 335 00:19:36,426 --> 00:19:37,427 నువ్వూ మాతో వస్తావా? 336 00:19:37,511 --> 00:19:38,846 బై-బై, డార్లింగ్. 337 00:19:49,731 --> 00:19:51,567 అద్భుతమైన అనుభవం. 338 00:19:51,650 --> 00:19:55,696 మనం ఈ పర్యటనను ఎంత బాగా ఆస్వాదించామో కదా. 339 00:19:55,779 --> 00:19:57,072 నాకు చాలా నచ్చింది. బాగా నచ్చింది. 340 00:19:57,155 --> 00:19:59,366 మన పర్యటన పూర్తయిపోయినట్లుగానే మాట్లాడుతున్నాను నేను, 341 00:19:59,449 --> 00:20:02,369 మనం గ్వాటెమాలలో పర్యటించాల్సింది చాలానే ఉంది. 342 00:20:16,049 --> 00:20:18,594 ఇలాంటి రోడ్ల మీద రాత్రివేళల్లో ప్రయాణించకూడదని మమ్మల్ని హెచ్చరించారు. 343 00:20:18,677 --> 00:20:20,137 కాబట్టి ఎక్కడో అక్కడ ఆగిపోతాం. 344 00:20:20,220 --> 00:20:22,389 ఈ ట్రాఫిక్ ఇలా ఉంటూనే ఉంటుంది. 345 00:20:24,516 --> 00:20:26,894 మేం మూడు గంటలుగా ఈ ట్రాఫిక్ లో చిక్కుబడిపోయాం. 346 00:20:27,519 --> 00:20:29,438 ఇది వెర్రితనం. 347 00:20:31,648 --> 00:20:34,943 గ్వాటెమాల, మెక్సికోల్లో రాత్రివేళల్లో ప్రయాణం మంచిది కాదని, హింసకు, 348 00:20:35,027 --> 00:20:38,530 మాదక ద్రవ్యాల రవాణాకు ఈ ప్రాంతాలు పేరు మోశాయని మమ్మల్ని హెచ్చరించారు. 349 00:20:38,614 --> 00:20:43,952 మా జాగ్రత్తలో మేం ఉండాలని అనుకోవడానికి కారణం ఇదే. 350 00:20:44,036 --> 00:20:45,495 మేం వింతగా ఉన్న ఈ బస్సుల్ని చూస్తున్నాం. 351 00:20:45,579 --> 00:20:50,417 పగలంతా ప్రయాణం చేసి, రాత్రివేళల్లో బైకుల్ని ఈ బస్సులో ఎక్కించి, 352 00:20:50,501 --> 00:20:53,462 మర్నాడు ఉదయం వరకూ అందులోనే ప్రయాణిస్తే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నాం, 353 00:20:53,545 --> 00:20:54,546 ఉదయమే మళ్లీ బైకులపై ప్రయాణించవచ్చు. 354 00:21:00,344 --> 00:21:01,428 పనాజాచెల్ గ్వాటెమాల 355 00:21:01,512 --> 00:21:04,014 భద్రతాపరమైన సమస్యలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది, 356 00:21:04,348 --> 00:21:06,892 మేం క్షేమంగా ఇల్లు చేరాలంటే ఒక పథకం ప్రకారం ప్రయాణం చేయడం అవసరం. 357 00:21:08,602 --> 00:21:10,229 ఏంటా ప్లాన్, మిత్రులారా? 358 00:21:10,312 --> 00:21:13,607 అర్జెంటీనా కంటే చిన్నది కాని దేశంలో మనం ఉన్నాం. 359 00:21:13,690 --> 00:21:16,109 ఇక్కడ మనకు ఒక విధమైన సమస్యలు ఎదురవుతున్నాయి. 360 00:21:16,193 --> 00:21:18,070 ఇక్కడ మనం అడుగుపెట్టకూడని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. 361 00:21:18,153 --> 00:21:21,573 మాదక ద్రవ్యాల రవాణా ముఠాలు దానికి కారణం, ప్రమాదభరిత ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి 362 00:21:21,657 --> 00:21:23,408 వీలైనంత సురక్షితంగా ఉండటం ముఖ్యం. 363 00:21:23,492 --> 00:21:24,326 అవును. 364 00:21:24,409 --> 00:21:25,702 -ఇవి ఎరుపు రంగు ప్రాంతాలు. -సరే. 365 00:21:25,786 --> 00:21:26,954 ఇవేమో "వెళ్లకూడదు" అనేవి. 366 00:21:27,037 --> 00:21:29,540 ఇవి గోధుమ రంగు ప్రాంతాలు, "వెళ్లకపోవడం మంచిది" అనేవి. 367 00:21:29,623 --> 00:21:33,961 రాత్రివేళల్లో ప్రయాణం మంచిది కాదని నా ఉద్దేశం, 368 00:21:34,044 --> 00:21:38,382 అలా చూస్తే, మనం ప్రమాదకరమైన ప్రదేశంలోనే చిక్కుబడ్డాం. 369 00:21:38,715 --> 00:21:40,717 మీరు ఎప్పటిలాగే పగటి వేళే ప్రయాణం చేయండి 370 00:21:40,801 --> 00:21:44,638 చూడదగిన ప్రాంతాలన్నీ ఆగి చూడండి 371 00:21:44,721 --> 00:21:47,516 చీకటిపడ్డాక, మీ బైకులకి చార్జింగ్ సౌకర్యం దొరుకుతుంది, 372 00:21:47,599 --> 00:21:48,934 ఎందుకంటే రాత్రిళ్లు పది గంటలసేపు బస్సులో ప్రయాణం చేస్తారు కదా. 373 00:21:49,017 --> 00:21:52,521 మీరు బస్సులో ప్రయాణించాలనుకుంటే, మేం ఈ మధ్యాహ్నానికి అందుకు ఏర్పాట్లు చేస్తాం. 374 00:21:52,938 --> 00:21:55,899 ఇక్కడికి వెళ్లామంటే మాత్రం, "ఇది పని చేయదు, మిత్రులారా" అని హెచ్చరిస్తుంది. 375 00:21:56,275 --> 00:21:58,986 -ఇక అప్పుడు, మేం మరో దారి... -మరొక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. 376 00:21:59,069 --> 00:21:59,903 మరొక ప్రయత్నం చేస్తాం. 377 00:21:59,987 --> 00:22:02,281 బస్సులో ప్రయాణం కుదిరితే, అన్ని సమస్యలూ పరిష్కారమైనట్టే. 378 00:22:02,364 --> 00:22:03,740 -కుదిరితే, అవును. నిజమే. -అవును. 379 00:22:03,824 --> 00:22:04,825 నీకు అర్థమైందా? 380 00:22:04,908 --> 00:22:09,621 కట్ చేస్తే, తెల్లవారుజామున 4:00 గంటలకు రోడ్డు పక్కన బస్సు తగలడుతూ ఉంటుంది. 381 00:22:10,664 --> 00:22:12,666 హార్లీ-డేవిడ్సన్ 382 00:22:20,632 --> 00:22:24,344 పనాజాచెల్ బోర్డర్ క్రాసింగ్ 383 00:22:24,428 --> 00:22:25,596 ఆ బస్సును చూడు. 384 00:22:27,639 --> 00:22:28,473 అవును. 385 00:22:29,308 --> 00:22:30,350 చాలా బాగుంది. 386 00:22:34,271 --> 00:22:35,939 ఆ బస్సుపై వెలుగుతున్న లైట్లు చూడు. 387 00:22:36,023 --> 00:22:38,025 చూశావా? క్రిస్మస్ ట్రీలా ఉంది కదా. 388 00:22:41,987 --> 00:22:42,988 పాఠశాల బస్ 389 00:22:50,787 --> 00:22:53,040 ఇలాంటి బస్సయితే సరిగ్గా సరిపోతుంది. 390 00:22:53,123 --> 00:22:55,375 -ఇదైతే చక్కగా ఉంటుంది. -ఇది బాగుంటుంది. ఇలాంటిదే. 391 00:22:55,792 --> 00:22:58,754 -అవును, అది బాగానే ఉంటుంది. -ఇలాగ, ఇది సరైన కోణం. 392 00:22:59,087 --> 00:23:00,881 ఇక్కడ పెట్టు. ఇది ఇక్కడ, నాలుగు మీటర్లు. 393 00:23:00,964 --> 00:23:01,965 ఇక్కడ పెట్టగలవా? 394 00:23:02,883 --> 00:23:05,385 -సరిగ్గా ఇక్కడ... ఉబ్బెత్తుగా ఉన్నచోట. -సరే. 395 00:23:05,469 --> 00:23:07,513 బైకుల్ని పైకి ఎక్కించేందుకు ఈ తలుపుని 396 00:23:07,596 --> 00:23:09,306 పెద్దగా కత్తిరించాలనుకుంటాను... 397 00:23:09,806 --> 00:23:12,851 ఆ తర్వాత బైక్ ని అక్కడ వీల్ చోక్ పై ఉంచాలి, 398 00:23:12,935 --> 00:23:15,521 అటుపై వెనుక నుంచి ముందుకి తిప్పాలి, 399 00:23:15,604 --> 00:23:17,064 రెండు బైకుల్నీ ఇక్కడే ఉంచాలి. 400 00:23:17,481 --> 00:23:20,651 తరువాత, ఆ వీల్ టబ్ కు ముందు నుంచి 401 00:23:20,734 --> 00:23:22,653 -నీకు ఏం కావాలంటే అలా చేసుకోవచ్చు. -అవును. 402 00:23:22,736 --> 00:23:24,446 లేదంటే నువ్వు ఇక్కడ పైన పడుకోవచ్చు, చార్లీ. 403 00:23:24,530 --> 00:23:26,156 -అవును. -అలా చూడు, అదే నీ బంక్. 404 00:23:26,240 --> 00:23:28,784 అవును, నా బంక్, నువ్వేమో ఆ బైక్ ల పైన పడుకోవచ్చు. 405 00:23:28,867 --> 00:23:31,870 నాకు మంచి పరుపు దొరికితే అంతకంటే ఏం అక్కర్లేదు. 406 00:23:34,748 --> 00:23:36,291 ఈ అద్దం సైజు చూడు. 407 00:23:37,125 --> 00:23:38,794 మూల మలుపు తిరగాలంటే ఎలా తిరుగుతాడో? 408 00:23:45,676 --> 00:23:47,469 -అవును! -అదీ, ఇప్పుడు పనిచేస్తుంది. 409 00:23:47,553 --> 00:23:48,762 ఈ బస్సు కొనడం నాకు ఇష్టమే. 410 00:23:50,264 --> 00:23:51,181 అంతర్జాతీయం 411 00:23:51,265 --> 00:23:52,599 మళ్లీ కలుద్దాం, మిత్రులారా. 412 00:23:54,101 --> 00:23:55,477 ఇక రిజిస్ట్రేషన్ విషయానికొస్తే, 413 00:23:55,561 --> 00:23:59,356 లైసెన్సు కోసం గ్వాటెమాల అధికారులకీ, మెక్సికన్ అధికారులకీ 414 00:23:59,439 --> 00:24:01,483 ఎంత చెల్లించాలో అంతా చెల్లిస్తాం. 415 00:24:01,567 --> 00:24:03,318 మేం మరికొన్ని విషయాలు కూడా చూసుకోవాలి, 416 00:24:03,402 --> 00:24:05,487 అప్పుడే ఈ బస్సును కొనగలమో, లేదో తేల్చుకోగలం. 417 00:24:05,571 --> 00:24:07,656 మనం ఎవరితో పరిహాసాలు ఆడుతున్నాం? ఇది అసాధ్యమైన విషయం. 418 00:24:07,739 --> 00:24:09,241 మనం ప్రయత్నించి చూడవచ్చు. 419 00:24:09,324 --> 00:24:11,785 ఎవరో ఒకరు ముందుగా సరిహద్దు వద్దకు వెళ్లి, 420 00:24:11,869 --> 00:24:16,039 ప్రత్యేక పర్మిట్ తో సరిహద్దును దాటగలమేమో చూద్దాం, 421 00:24:16,123 --> 00:24:20,460 వీలైతే ప్రత్యేక ఇన్సూరెన్సు గానీ, లేదా కేవలం లైసెన్సు ప్లేటు గానీ కొందాం, 422 00:24:20,544 --> 00:24:22,754 దానివల్ల "ఇది గ్వాటెమాల నుంచి వాణిజ్య నిమిత్తం వచ్చింది" అని తెలియదు. 423 00:24:22,838 --> 00:24:24,798 దానికి ముందు దీనిపై కొంత పరిశోధన చేయాలి. 424 00:24:28,051 --> 00:24:30,637 ఈ బస్సులను చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. కానీ కొనగలమో, లేదో చూడాలి. 425 00:24:31,221 --> 00:24:32,306 మనకేది అవసరమో వాళ్లకి తెలుసు. 426 00:24:32,389 --> 00:24:35,100 మనం రెండు బైకుల్ని బస్సులోకి, జనరేటర్లని బస్సు పైకి ఎక్కించాలి. 427 00:24:36,476 --> 00:24:39,146 ఇదంతా... ఈ బస్సూ, మెక్సికోకి చేరుకోవడం... 428 00:24:39,771 --> 00:24:41,398 ఇదంతా నమ్మశక్యంగా లేదు. 429 00:24:42,024 --> 00:24:44,318 ఇది మనకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తోంది. 430 00:24:44,985 --> 00:24:45,986 ఉత్కంఠభరితంగానూ ఉంది. 431 00:24:53,118 --> 00:24:56,163 మనం సరిహద్దుకు చేరుకోగానే, జమ్యాన్ వెనక్కి వెళ్ళిపోతుంది, 432 00:24:56,246 --> 00:24:58,957 నాకు బాధగా ఉంది, ఎందుకంటే, ఆమెతో ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 433 00:24:59,499 --> 00:25:00,876 ఇది అద్భుతంగా ఉంది. 434 00:25:03,086 --> 00:25:04,213 ఆమె కూడా చక్కగా గడిపింది. 435 00:25:04,296 --> 00:25:07,925 అవును, నేనూ గమనించాను, ప్రతి ఒక్కరితోనూ కలిసిపోయింది. 436 00:25:08,008 --> 00:25:10,552 నా స్నేహితులూ, సిబ్బందితో ఆమె మెలగడం నాకు... 437 00:25:11,220 --> 00:25:13,055 చాలా సంతోషాన్నిచ్చింది. 438 00:25:14,223 --> 00:25:16,767 ఇలాంటి పర్యటనలో ఈ అనుభవం ఎంతో విశేషమైనది, 439 00:25:16,850 --> 00:25:18,644 ఈ సంతోషాన్ని ఆమెతో పంచుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. 440 00:25:21,772 --> 00:25:24,107 మరి కాసేపట్లో సరిహద్దును దాటబోతున్నాం. 441 00:25:28,111 --> 00:25:30,531 మొత్తానికి చేరుకున్నాం, ఇది సరిహద్దు పట్టణం, గురూ. 442 00:25:31,865 --> 00:25:32,866 ఇదే. 443 00:25:34,326 --> 00:25:36,161 మన ముందున్నదే మెక్సికో. 444 00:25:37,329 --> 00:25:39,581 నమ్మలేకపోతున్నాను. వావ్. కానీ వచ్చేశాం. 445 00:25:40,707 --> 00:25:42,292 మెక్సికోలోకి ప్రవేశిస్తున్నాం. 446 00:25:43,210 --> 00:25:45,128 సరిహద్దు పట్టణం లోలోపల ఉందంటావా? 447 00:25:46,380 --> 00:25:47,506 కావచ్చు. 448 00:25:51,426 --> 00:25:54,888 గ్వాటెమాల / మెక్సికో బోర్డర్ క్రాసింగ్ 449 00:26:01,311 --> 00:26:03,230 కొంతమంది నా స్నేహితులతో కలసి 450 00:26:04,398 --> 00:26:06,024 సరిహద్దు వద్ద నేను ఇరుక్కుపోయాను 451 00:26:08,569 --> 00:26:10,362 సరిహద్దు వద్ద ఇరుక్కుపోయాను 452 00:26:11,113 --> 00:26:13,156 కొందరు నా స్నేహితులతో కలసి 453 00:26:15,534 --> 00:26:17,369 చార్లీతో కలసి దూసుకుపోయాను 454 00:26:17,870 --> 00:26:20,247 కాస్త అనారోగ్యానికి గురయ్యాను 455 00:26:22,708 --> 00:26:24,293 మేం బైక్ నడుపుతున్నాం 456 00:26:25,043 --> 00:26:27,087 దానికి పెట్రోల్ అవసరం లేదు 457 00:26:29,464 --> 00:26:31,425 అవును, మేం బైక్ నడుపుతున్నాం 458 00:26:31,508 --> 00:26:34,178 దానికేమో పెట్రోల్ అవసరం లేదు 459 00:26:36,221 --> 00:26:38,390 పెట్రోల్ లాంటి మరో పదం కోసం చూస్తున్నాను నేను. 460 00:26:38,473 --> 00:26:39,892 -పిరుదులు. -అవును. 461 00:26:40,225 --> 00:26:42,269 ఉషువాయా నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం 462 00:26:42,352 --> 00:26:45,022 దేవుడా, నా పిరుదులు 463 00:26:47,357 --> 00:26:49,526 సరిహద్దు సమస్యల్లో పడ్డాను 464 00:26:50,444 --> 00:26:51,987 సరిహద్దు సమస్యలు 465 00:26:56,658 --> 00:26:57,659 అదీ సంగతి. 466 00:26:58,577 --> 00:26:59,411 పదండి! 467 00:26:59,494 --> 00:27:00,370 సరిహద్దు చింతలు. 468 00:27:04,374 --> 00:27:06,835 ఆయన నన్ను దత్తత తీసుకోవాలని ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు... 469 00:27:08,420 --> 00:27:10,088 మిగతా పిల్లల్ని చూస్తే నాకు జాలి వేస్తోంది. 470 00:27:10,172 --> 00:27:11,840 తను నన్ను ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. 471 00:27:11,924 --> 00:27:13,759 లేకపోతే, నేను ఎక్కడ ఉండేదాన్నో కూడా తెలియదు. 472 00:27:14,134 --> 00:27:16,094 దాని గురించి ఆలోచించాలని నాకు అనిపించదు, కానీ... 473 00:27:16,720 --> 00:27:21,808 "మేం ఒక బిడ్డను దత్తత తీసుకోవాలి" అని తను ఎందుకు అనుకున్నాడో మరి. 474 00:27:21,892 --> 00:27:23,060 నాకు తెలియదు. 475 00:27:23,143 --> 00:27:25,938 అలా ఎన్నడూ ప్రశ్నించుకోలేదు, ఎందుకంటే దానికి సమాధానం దొరకదు కాబట్టి. 476 00:27:26,021 --> 00:27:28,982 జరిగిన దానికి సంతోషించాలి, అంతే. 477 00:27:30,692 --> 00:27:31,985 జాగ్రత్తగా ఉండు. 478 00:27:32,069 --> 00:27:33,570 -సరే, బై. -ఐ లవ్ యూ, తల్లీ. 479 00:27:33,654 --> 00:27:37,032 చాలా బాగుంది. తనేమో మోటార్ సైకిళ్లపై ప్రపంచమంతా చుట్టేస్తూ ఉంటాడు... 480 00:27:38,116 --> 00:27:39,117 కలుద్దాం, జామ్స్. 481 00:27:39,493 --> 00:27:42,037 తనకి ఎంతో ఇష్టమైన రెండు పనులను చేస్తున్నాడు. 482 00:27:42,454 --> 00:27:45,624 కాబట్టి, మా నాన్నతో కలసి ఇలా పర్యటించడం ఎంతో గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. 483 00:27:46,166 --> 00:27:47,584 -బై! -బై! 484 00:27:55,342 --> 00:27:58,637 మెక్సికోకు స్వాగతం 485 00:27:58,720 --> 00:28:00,722 అలెక్స్, ఇక్కడి సంగతుల గురించి మాకు కాస్త చెబుతావా? 486 00:28:00,806 --> 00:28:01,807 అలాగే. 487 00:28:01,890 --> 00:28:05,477 ఇక్కడ దేశమంతటా చిన్నపాటి మాదక ద్రవ్యాల రవాణా ముఠాలు ఉంటాయి. 488 00:28:05,561 --> 00:28:07,354 వాటిలో హలిస్కో కొత్త తరం ముఠా ఒకటి. 489 00:28:07,437 --> 00:28:10,566 అలాగే సినలోవా ముఠా ఉంది, దానికి నాయకుడు చాపో. 490 00:28:10,649 --> 00:28:12,025 మరొకటి జెటాస్... 491 00:28:12,109 --> 00:28:13,110 అలెక్స్ స్థానిక నిర్మాత 492 00:28:13,193 --> 00:28:16,363 ...అందులోని హంతకులు గల్ఫ్ ముఠా కోసం పనిచేస్తూ ఉంటారు. 493 00:28:16,446 --> 00:28:17,739 గల్ఫ్ ముఠా గురించి అదీ సంగతి. 494 00:28:17,823 --> 00:28:19,616 ఇలాంటివి చాలానే ముఠాలు ఉన్నాయి. 495 00:28:19,700 --> 00:28:21,243 విశ్వసనీయతకు అక్కడ చోటు ఉండదు. 496 00:28:21,618 --> 00:28:23,370 నీకు ఎవరు తెలుసన్నది ముఖ్యం కాదు. 497 00:28:23,912 --> 00:28:26,415 బాధితులు ఎవరు, వాళ్ల దగ్గర ఎంత విలువైన సరకు ఉందన్నదే వాళ్లకి ముఖ్యం. 498 00:28:27,416 --> 00:28:30,169 ముందు మనం ఇక్కడి నుంచి బయల్దేరుదాం. 499 00:28:30,252 --> 00:28:34,506 సరిహద్దు నుంచి బయల్దేరి మూడున్నర గంటలు ప్రయాణిస్తే, 500 00:28:34,590 --> 00:28:36,925 మొదటి చెక్ పాయింట్ చేరుకుంటాం. 501 00:28:37,551 --> 00:28:43,182 ఒహాకా నగరం నుంచి, పూయబ్లా మీదుగా వెళ్లాలి... అది ప్రధాన రహదారి. 502 00:28:44,183 --> 00:28:47,311 అక్కడి నుంచి మెక్సికో సిటీలో నుంచి గానీ, లేదా చుట్టూ తిరిగి గానీ వెళ్లాలి. 503 00:28:47,394 --> 00:28:48,478 అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. 504 00:28:48,562 --> 00:28:52,816 ఈ ప్రాంతంలో మనం రాత్రి కాకుండా పగలు ప్రయాణిస్తేనే 505 00:28:52,900 --> 00:28:55,903 భద్రతపరంగా మంచిది. 506 00:28:56,403 --> 00:28:59,072 ప్రత్యేకించి, మీకు ప్రమాదకరమైన కొన్ని ప్రాంతాల మీదుగా 507 00:28:59,156 --> 00:29:01,950 ప్రయాణం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. 508 00:29:04,286 --> 00:29:07,789 సరే, మంచిది. ఒకవేళ మేం మా బైకుల్ని బస్సులోకి ఎక్కించి, 509 00:29:07,873 --> 00:29:09,124 ఆ బస్సులోనే ప్రయాణిస్తే, 510 00:29:09,208 --> 00:29:13,212 అలాంటి ప్రయాణం మంచిదేనంటావా? 511 00:29:13,545 --> 00:29:15,214 అక్కడ కూడా మమ్మల్ని అడ్డుకునే మాదక ద్రవ్యాల ముఠాలు ఉంటాయా? 512 00:29:15,297 --> 00:29:18,634 వాళ్లని హాక్స్ లేదా హల్కానీస్ అంటారు... 513 00:29:18,717 --> 00:29:20,969 అలాంటి వాళ్లు దేశమంతటా ఉన్నారు, 514 00:29:21,053 --> 00:29:25,182 ప్రధాన రహదారి పక్కన కారులో కూర్చుని, వచ్చేపోయేవారిని గమనిస్తూ ఉంటారు. 515 00:29:25,766 --> 00:29:27,017 వాళ్లకి తెలుస్తుంది. 516 00:29:27,100 --> 00:29:31,563 పైగా, ఇవాన్ పేరున్నవాడు కాబట్టి, 517 00:29:31,939 --> 00:29:37,110 సామాజిక మాధ్యమాల ద్వారా, మనం ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోతుంది. 518 00:29:37,194 --> 00:29:40,197 ఇలాంటి వాటికి మీరు మానసికంగా సంసిద్ధంగా ఉండరు. 519 00:29:40,280 --> 00:29:45,494 మనం ఎవరి కంటా పడకుండా, జాగ్రత్తగా ప్రయాణించగలిగితే, 520 00:29:45,577 --> 00:29:46,703 దానంత అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. 521 00:29:47,704 --> 00:29:50,249 అసలు ఏం జరిగే అవకాశం ఉండవచ్చు? 522 00:29:50,332 --> 00:29:51,625 మిమ్మల్ని ఆపవచ్చు... 523 00:29:52,125 --> 00:29:54,711 మిమ్మల్ని అడ్డుకుని, డబ్బు కోసం అడుగుతారు. 524 00:29:55,087 --> 00:29:56,129 లేదంటే కిడ్నాప్ చేయవచ్చు. 525 00:29:56,588 --> 00:29:59,925 మరీ దారుణమైన పరిస్థితుల్లో మీ శాల్తీ గల్లంతు కావచ్చు కూడా. 526 00:30:15,315 --> 00:30:19,319 ముఠాల గురించి దారుణమైన సంగతులు విన్నాం... 527 00:30:20,070 --> 00:30:22,531 ఈ మధ్యనే మెక్సికోకు చెందిన ఒక నటుడు మెక్సికో సిటీకి 528 00:30:22,614 --> 00:30:25,534 నైరుతి ప్రాంతంలో కిడ్నాప్ కు గురయ్యాడు. 529 00:30:25,617 --> 00:30:27,661 మనం మన పర్యటన గురించి ప్రచారమేమీ చేసుకోవడం లేదు. 530 00:30:27,744 --> 00:30:30,038 మనం ఇక్కడ ఉన్నామని ఎవరికీ చెప్పడం లేదు కూడా. 531 00:30:30,455 --> 00:30:33,584 కానీ, తెలుసు కదా, మనతో సెల్ఫీ తీసుకునేవాళ్ళు 532 00:30:33,667 --> 00:30:38,172 దాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి, మన వివరాలు చాటింపు వేస్తున్నారు. 533 00:30:38,589 --> 00:30:43,135 ఇది చాలా సంక్లిష్టమైన విషయం. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. 534 00:30:43,218 --> 00:30:46,096 పగటి వేళ మాత్రమే బండి నడపాలన్నది నిజంగా మంచి ఆలోచన. 535 00:30:46,180 --> 00:30:50,392 మరీ ఆలస్యమైతే, మనం ప్రమాదాన్ని కోరి ఆహ్వానించినట్లే. 536 00:30:51,602 --> 00:30:57,983 నేను ఇప్పటివరకూ భద్రత గురించి, ఇతర బాధల గురించి ఆలోచించనేలేదు, 537 00:30:58,066 --> 00:31:03,071 కానీ ఇప్పటి పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ఏదైనా జరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. 538 00:31:03,155 --> 00:31:04,615 ఎవరో నన్ను కిడ్నాప్ చేయాలని నేను కోరుకోవడం లేదు. 539 00:31:04,698 --> 00:31:05,908 అస్సలు కోరుకోవడం లేదు. 540 00:31:11,163 --> 00:31:12,956 జనాల భావనతో నేను పోరాడుతున్నాను. 541 00:31:13,040 --> 00:31:19,087 మెక్సికో ఒక ప్రమాదకరమైన ప్రాంతమనే వెర్రి భావనతో పోరాడుతున్నాను. 542 00:31:19,171 --> 00:31:22,382 మీకోసం మరికొందరు కూడా పనిచేస్తున్నారు, కాబట్టి మీరు బాధ్యత వహించాలి, తప్పదు. 543 00:31:22,466 --> 00:31:27,429 మీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలనుకున్నా, మీరు కూడా సాహస యాత్రలో ఉన్నారు, 544 00:31:27,513 --> 00:31:29,640 కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. 545 00:31:29,723 --> 00:31:30,724 కాబట్టి, ఇది... 546 00:31:31,558 --> 00:31:32,768 ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి. 547 00:31:32,851 --> 00:31:35,604 కానీ నేను ఎంతో నమ్మకంతో, ఆశావాహ దృక్పథంతో, విశ్వాసంతో 548 00:31:35,687 --> 00:31:37,523 మెక్సికోలోకి అడుగు పెడతాను... 549 00:31:39,399 --> 00:31:43,237 దిన పత్రికలు, ఎదుటి వారిలో 550 00:31:44,029 --> 00:31:46,949 ఉత్తి పుణ్యాన భయం రేకెత్తించేవాళ్లూ ఏమంటున్నారన్నది ప్రశ్న కాదు. 551 00:31:56,416 --> 00:31:57,709 ఇదే... 552 00:31:59,044 --> 00:32:00,546 మెక్సికో. 553 00:32:05,801 --> 00:32:06,927 మెక్సికో. 554 00:32:08,053 --> 00:32:09,847 అకస్మాత్తుగా ఇక్కడంతా భిన్నంగా కనిపిస్తోంది, కదా? 555 00:32:09,930 --> 00:32:12,975 రోడ్లూ, భవంతులూ కాస్త తేడాగా ఉండి ఉండవచ్చు 556 00:32:13,725 --> 00:32:15,352 ఇక్కడ వ్యవసాయ భూములే ఎక్కువగా ఉన్నాయి. 557 00:32:15,435 --> 00:32:19,815 ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. 558 00:32:20,482 --> 00:32:21,483 భలే ఆశ్చర్యంగా ఉంది. 559 00:32:21,567 --> 00:32:25,696 అధికారికంగా, మేం దక్షిణ అమెరికా, మధ్య అమెరికాల్లో పర్యటన పూర్తి చేశాం. 560 00:32:26,321 --> 00:32:27,322 ఇప్పుడు మెక్సికోలోకి ప్రవేశించాం. 561 00:32:34,121 --> 00:32:35,956 చార్లీ, నేనూ తీరం వైపు ప్రయాణిస్తున్నాం, 562 00:32:36,373 --> 00:32:38,792 డేవిడ్, రస్ నేరుగా ఒహాకాకు వెళ్లిపోతారు. 563 00:32:39,459 --> 00:32:42,796 సరిహద్దు వద్ద గ్వాటెమాల బస్సును కొనలేదు, కాబట్టి దానికోసం అన్వేషణ సాగుతోంది. 564 00:32:45,966 --> 00:32:48,677 Long Way Up. 565 00:32:48,760 --> 00:32:49,803 ఇది నాకు నచ్చింది. 566 00:32:51,388 --> 00:32:52,681 ఇక్కడొక కందిరీగ ఉంది. 567 00:33:07,613 --> 00:33:08,947 బోర్డర్ క్రాసింగ్ మెక్సికో - గ్వాటెమాల 568 00:33:09,031 --> 00:33:11,450 శాన్ క్రిస్టోబాల్ డె లా కేసాస్ టెవాంటెపెక్ 569 00:33:11,533 --> 00:33:12,701 ఒహాకా 570 00:33:28,759 --> 00:33:31,720 ఒహాకా మెక్సికో 571 00:33:31,803 --> 00:33:33,222 మెక్సికో 572 00:33:39,019 --> 00:33:40,771 బస్సు యజమాని ఇతడేనా? 573 00:33:41,146 --> 00:33:44,233 -డేవిడ్. -అవును, అరియల్ గార్షియా. 574 00:33:44,316 --> 00:33:46,276 మేం ఒక బస్సును కొనాలనుకుంటున్నాం. 575 00:33:46,360 --> 00:33:48,612 ఆ బస్సు ఇదే కావచ్చు. 576 00:33:50,656 --> 00:33:54,117 బస్సు అన్ని విధాలా బాగుండి, నడపడానికి అనుకూలంగా ఉండాలి. 577 00:33:54,201 --> 00:33:55,285 దీన్ని అతను ఎందుకు అమ్ముతున్నాడు? 578 00:33:55,369 --> 00:33:57,371 నా బస్సు చక్కగా ఉంది. 579 00:33:57,454 --> 00:33:58,872 అయితే ఆపరేటర్లతోనే సమస్య... 580 00:33:58,956 --> 00:33:59,957 అరియల్ బస్సు యజమాని 581 00:34:00,040 --> 00:34:01,792 ...ఎందుకంటే వాళ్లు, "బస్సు చాలా పొడుగ్గా ఉంది," అంటారు. 582 00:34:02,584 --> 00:34:04,002 నేను లోపలికి వెళ్లవచ్చా? వెళ్లవచ్చా? 583 00:34:04,086 --> 00:34:05,838 ఇది బాగానే ఉంది. 584 00:34:06,338 --> 00:34:09,341 ఫోటోలు చూసినప్పుడు నాకు లోపల భాగం నచ్చలేదు, 585 00:34:09,424 --> 00:34:10,759 కానీ ఇలా చూస్తే భలే ఉంది. 586 00:34:10,842 --> 00:34:12,761 -ఇది భేషుగ్గా ఉంది. -అందంగా ఉంది, కదా? 587 00:34:12,844 --> 00:34:15,013 దీన్ని మనం కొనవచ్చు. 588 00:34:15,097 --> 00:34:16,764 ఇక సంబంధిత పత్రాలన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి 589 00:34:16,849 --> 00:34:18,141 అవన్నీ ఉంటే, మనం సరిహద్దు దాటి అమెరికాలోకి బస్సును తీసుకెళ్లవచ్చు. 590 00:34:18,225 --> 00:34:19,059 టేలర్ 591 00:34:19,141 --> 00:34:21,478 "వావ్, మనం మెక్సికోలో బస్సులో వెళ్దాం " అని నాకు అనిపించింది. 592 00:34:21,562 --> 00:34:23,063 నాకూ ఈ బస్సును కొనాలనే ఉంది. 593 00:34:23,146 --> 00:34:26,149 కానీ ఒకళ్ల అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. అది మాట్ ది. 594 00:34:26,567 --> 00:34:28,777 ఈ బస్సును కొనడం సమస్యల్ని కొనితెచ్చుకోవడమేనని మాట్ అంటే... 595 00:34:28,860 --> 00:34:29,902 చిన్నపాటి సమస్యలైతే ఫరవాలేదు, 596 00:34:29,987 --> 00:34:32,197 కానీ అవి పెద్దవని తను చెబితే బస్సును కొనబోం. 597 00:34:32,281 --> 00:34:33,407 మాట్, ఏమంటావు? 598 00:34:33,489 --> 00:34:36,702 బస్సు కింద భాగంలో ఇంధనం పైపుల్లో ఒక దానిలో చిన్నపాటి లీకేజీ ఉంది. 599 00:34:36,784 --> 00:34:37,786 మాట్ రివియన్ 600 00:34:37,870 --> 00:34:40,038 యు-జాయింట్లలో ఒకటి లూజుగా ఉంది. 601 00:34:40,121 --> 00:34:42,081 బహుశా వాటికి చాలాకాలంగా గ్రీజు పెట్టలేదనుకుంటా. 602 00:34:42,165 --> 00:34:44,001 ఇంజన్ ని మామూలుగా చూశాను. 603 00:34:44,083 --> 00:34:45,918 ఇంటర్ కూలర్ బూట్ అమర్చాల్సిన అవసరం ఉంది. 604 00:34:46,420 --> 00:34:50,382 అది కొద్దిగా విరిగింది, అది... అది విరిగితే, మీ ప్రయాణం సాగదు. 605 00:34:50,465 --> 00:34:51,507 సరే. 606 00:34:51,842 --> 00:34:53,092 అలా చుట్టూ తిరిగి వద్దామా? 607 00:34:53,177 --> 00:34:54,887 అతన్ని కూడా రమ్మను. బస్సులో అలా తిరిగి వద్దాం. 608 00:34:54,969 --> 00:34:55,971 అలాగే. 609 00:34:56,471 --> 00:34:57,764 కాస్త ఆగు, మాట్లాడుతున్నాం. 610 00:34:57,848 --> 00:34:59,683 -పద, డేవిడ్! -పద, వెళ్దామా? 611 00:35:04,271 --> 00:35:05,647 -స్టార్ట్ కావట్లేదా? -నేను ఏమైనా... 612 00:35:07,357 --> 00:35:08,358 చెప్పు... 613 00:35:11,361 --> 00:35:12,863 బ్యాటరీలో సమస్య. 614 00:35:16,408 --> 00:35:19,745 కాస్త తోద్దాం, అప్పుడు స్టార్ట్ అవుతుంది. 615 00:35:19,828 --> 00:35:21,580 అలాగే, పదండి! 616 00:35:21,663 --> 00:35:23,498 -తోద్దామా? -అలాగే. 617 00:35:23,582 --> 00:35:24,875 పద, గురూ. నిజంగా? 618 00:35:25,709 --> 00:35:26,919 వాళ్లు నిజంగానే తోస్తున్నారా? 619 00:35:27,336 --> 00:35:30,339 నా జీవితంలో ఒక స్కూల్ బస్సుని ఇలా తోసి స్టార్ట్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. 620 00:35:31,423 --> 00:35:32,633 అదీ మెక్సికోలో. 621 00:35:38,722 --> 00:35:39,765 తిప్పు! 622 00:35:39,848 --> 00:35:40,849 అలాగే. 623 00:35:49,066 --> 00:35:50,067 పద, బస్సు తల్లీ! 624 00:35:51,527 --> 00:35:53,946 -ఆపు, ఆపు. ఆపు. -ఆపాలా? దేన్ని ఆపాలి? 625 00:35:54,988 --> 00:35:57,533 ఇదంతా టెక్నిక్ గురూ. నువ్వు నన్ను అనుమానించావు. 626 00:36:00,536 --> 00:36:01,370 మొత్తానికి సాధించాం. 627 00:36:01,453 --> 00:36:03,163 -సరే. ఎక్కాం కదా. -గురూ. 628 00:36:03,247 --> 00:36:04,498 పద, అలా వెళ్ళొద్దాం. 629 00:36:04,998 --> 00:36:06,959 జోస్, లూయీ మాకోసం వేచి ఉండండి. 630 00:36:13,924 --> 00:36:14,925 చూస్తున్నా. 631 00:36:17,636 --> 00:36:18,720 పోనీ. 632 00:36:24,184 --> 00:36:25,602 గేరులో సమస్య. 633 00:36:27,855 --> 00:36:29,106 నాకు భలే నచ్చింది, గురూ. 634 00:36:29,189 --> 00:36:31,191 ఇదంతా నాకు ఉత్కంఠగా ఉంది. 635 00:36:35,070 --> 00:36:36,488 చహుయీట్స్ మెక్సికో 636 00:36:36,572 --> 00:36:38,866 అసలు సిసలు మెక్సికో పట్టణాన్ని చూడటం భలేగా ఉంది. 637 00:36:38,949 --> 00:36:40,409 ఇది చక్కటి అనుభవాన్ని ఇచ్చింది, కదా? 638 00:36:40,492 --> 00:36:42,411 -ఇది పర్యాటక పట్టణం కాదు. -కాదు, ఇది చాలా బాగుంది. 639 00:36:42,494 --> 00:36:43,328 ఇది సిసలైన పర్యాటక ప్రాంతం. 640 00:36:43,412 --> 00:36:46,999 ఇక్కడ చేపలతో రకరకాల రుచికరమైన పదార్ధాలు చేస్తారని నాకు తెలుసు. 641 00:36:47,291 --> 00:36:50,836 ఇక్కడ మనకు మెక్సికన్ ఇంటి భోజనం కూడా దొరుకుతుంది. 642 00:36:52,129 --> 00:36:53,130 అది బాగుంటుంది కదా? 643 00:36:54,423 --> 00:36:56,216 నా గడ్డం ఇక్కడ ఇలా రెండుగా విడిపోయి ఉండటంపై 644 00:36:56,300 --> 00:36:57,676 నువ్వు ఏమంటావు? 645 00:36:57,759 --> 00:36:58,760 చూడటానికి బాగోలేదు, కదూ? 646 00:36:58,844 --> 00:37:01,513 ఈవైపు ఇక్కడ, మరి కాస్త ఇక్కడ, 647 00:37:01,597 --> 00:37:04,266 రెండుగా గడ్డం విడిపోయి ఉంది. 648 00:37:04,349 --> 00:37:07,186 ఇది చూడటానికి డబుల్ చిన్ లాగ కనిపిస్తోంది. 649 00:37:07,269 --> 00:37:08,770 -అవును. -డబుల్ చిన్ కనిపించకుండా చేయాలి. 650 00:37:09,313 --> 00:37:11,273 -ఇలా చూడు. -గడ్డం కింద మరో గడ్డం పెరిగిందా? 651 00:37:11,356 --> 00:37:12,191 ఇలా చేస్తే కనుక... 652 00:37:12,691 --> 00:37:15,360 ఇప్పుడు వెళ్లి అద్దంలో చూసుకో... 653 00:37:15,444 --> 00:37:18,822 జుట్టుని కాస్త కిందకు తోస్తే, చక్కగా ఉంటుంది. 654 00:37:23,035 --> 00:37:25,204 నేను బైక్ నడిపేటప్పుడు జుట్టు ఇలా రెండుగా విడిపోతోంది. 655 00:37:25,746 --> 00:37:28,999 ఇలాంటి గడ్డం చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది... 656 00:37:30,250 --> 00:37:31,084 ఇప్పుడు బాగుంది. 657 00:37:31,418 --> 00:37:32,419 సరే. 658 00:37:32,794 --> 00:37:34,755 ఇక్కడ బస చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. 659 00:37:35,506 --> 00:37:37,591 నా బైక్ పై అలా తిరిగి వచ్చాను. ఇప్పుడు దీన్ని చార్జ్ చేయాలి. 660 00:37:41,553 --> 00:37:42,721 జాగ్రత్త. 661 00:37:44,473 --> 00:37:45,349 స్కూటర్. 662 00:37:48,852 --> 00:37:50,312 ఇది సెట్ అయితే బాగుండును. 663 00:37:51,230 --> 00:37:52,773 -పది గంటలా? -అవును. 664 00:37:52,856 --> 00:37:54,066 అద్భుతం. 665 00:37:54,149 --> 00:37:55,442 ఇప్పుడు సంతృప్తిగా ఉంది. 666 00:37:55,526 --> 00:37:56,944 నా బైకును నేను ఇక్కడే పెట్టుకోవచ్చు. 667 00:37:57,653 --> 00:38:00,572 నాకూ, చార్లీకి మధ్య స్నేహపూర్వకమైన పోటీని మీరు గమనించారా? 668 00:38:00,656 --> 00:38:01,657 అలాంటిదేదైనా గమనించారా? 669 00:38:01,740 --> 00:38:05,661 కొన్నిసార్లు, నేను ఉదయం 5.00 గంటలకే లేచి "తను అప్పుడే తన బైక్ ని 670 00:38:06,411 --> 00:38:07,996 సిద్ధం చేసేశాడా, ఏంటి?" అని అనుకుంటాను. 671 00:38:08,413 --> 00:38:12,626 దాంతో వెంటనే నాలో టెన్షన్ పెరిగిపోతుంది... నిజానికి మేం బయల్దేరేది 672 00:38:13,126 --> 00:38:16,171 8.00 గంటలకే అయినా, "నేనూ వెళ్ళి నా బైక్ ని రెడీ చేయాలి" అనుకుంటాను. 673 00:38:16,255 --> 00:38:18,131 ఎవరైనా నాతో పోటీకి వస్తే, 674 00:38:18,215 --> 00:38:19,591 నేను కూడా సందర్భానికి తగినట్టుగా ప్రతిస్పందిస్తూ ఉంటాను, మీరూ అంతేగా? 675 00:38:19,675 --> 00:38:22,302 లేకపోతే, మిమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు ఉండరు. 676 00:38:22,386 --> 00:38:23,387 కాబట్టి, దీనంతటికీ కారణం నేను కాదు. 677 00:38:23,887 --> 00:38:25,681 అది చార్లీ నుంచి వచ్చిందన్నమాట. 678 00:38:27,474 --> 00:38:28,475 హమ్మయ్య, కనెక్ట్ అయింది. 679 00:38:29,560 --> 00:38:30,894 ఓకే, బాగుంది. సరేమరి. 680 00:38:46,451 --> 00:38:48,328 -నీ గది ఎలా ఉంది? బాగుందా? -బ్రహ్మాండంగా ఉంది. 681 00:38:48,412 --> 00:38:50,038 షవర్ ఉంది, షేవ్ ఉంది, 682 00:38:50,122 --> 00:38:53,083 -అలాగే, నేననుకున్నాను, "నేను..." -ఇంకోటి ఏదైనా చేద్దామనా? 683 00:38:54,126 --> 00:38:56,086 ఆ ట్రక్కు మనపైకి దూసుకు వస్తోందనుకోకు. 684 00:38:57,754 --> 00:39:00,591 మనకోసం బస్సును వెదకడంలో డేవిడ్ కి అదృష్టం కూడా తోడైనట్టుంది. 685 00:39:01,133 --> 00:39:04,303 బస్సుకి తక్షణం చేయించాల్సిన మరమ్మతులు ఏమిటంటే 686 00:39:04,761 --> 00:39:07,764 ముందువైపు సిగ్నల్ లైట్లు, ఇంటర్ కూలర్ బూట్ ఏర్పాటు చేయడం, 687 00:39:07,848 --> 00:39:09,349 వెనుకవైపు బ్రేకులు కొత్తవి అమర్చడం. 688 00:39:09,433 --> 00:39:10,601 ఇంధనం పైపుకి పడిన రంధ్రాన్ని మూయడం. 689 00:39:10,684 --> 00:39:13,395 -ఆయిల్ మార్చడం తప్పనిసరి. -అలాగే. అవన్నీ చేయిస్తాను. 690 00:39:13,478 --> 00:39:15,397 -ఇతర నిర్వహణాపరమైన... -వీలైతే ఆయిల్స్ అన్నీ మారుస్తాం. 691 00:39:15,480 --> 00:39:18,483 నాకు ఆందోళన కలిగించే విషయాలు, నాకంత ఆందోళనగా లేదనుకోండి, 692 00:39:18,901 --> 00:39:20,694 క్లచ్, ఇంధనం పంపిణీ వ్యవస్థ, వాటిని నువ్వు చూడలేవు కదా. 693 00:39:20,777 --> 00:39:22,738 వాటి గురించి నాకు తెలియదు. తెలీనే తెలీదు. 694 00:39:22,821 --> 00:39:25,574 నాకంటే నీకే బాగా తెలుసు. వాటికి మరమ్మతులు చేయించలేదు కదా? 695 00:39:25,657 --> 00:39:28,952 ఇక కూలర్ రిజర్వాయర్ సంగతి, ఎందుకంటే అది పేలిందంటే... 696 00:39:29,745 --> 00:39:30,871 దాన్ని మరమ్మతు చేయించడమొక్కటే దారి, కదా? 697 00:39:30,954 --> 00:39:33,248 ఇక మిగతావాటికి మా దగ్గర అంతగా సమయం లేదు. 698 00:39:48,555 --> 00:39:49,556 మీకు శుభప్రదమైన రోజు. 699 00:39:56,146 --> 00:39:58,023 అతను రోజుకి ఎన్ని చేయగలడు? 700 00:39:58,106 --> 00:39:59,066 మూడు కిలోలు. 701 00:39:59,483 --> 00:40:01,276 -చూడు, చూడు, చూడు. -చాలా తేలిక. 702 00:40:02,486 --> 00:40:03,487 వావ్! 703 00:40:03,570 --> 00:40:05,113 భలే ఉంది. అద్భుతం. 704 00:40:05,197 --> 00:40:07,032 అవును, అది తయారు చేయడానికి ఎంత శ్రమ పడాలో ఊహించలేవు. 705 00:40:07,783 --> 00:40:09,368 ఎక్కడ చూసినా చేపల వంటకాలు అమ్మేవాళ్లే ఉన్నారు, కదా? 706 00:40:09,785 --> 00:40:10,786 మీకు శుభప్రదమైన రోజు. 707 00:40:12,246 --> 00:40:14,748 ఈ చిన్న చిన్న చేపలతో అతను కూర చేస్తాడా? 708 00:40:15,290 --> 00:40:17,626 -ఈ చేప పేరు ఏమిటి? -దీన్ని రెడ్ స్నాపర్ అంటారు. 709 00:40:17,709 --> 00:40:18,710 ధన్యవాదాలు. 710 00:40:19,253 --> 00:40:20,087 చాలా చాలా ధన్యవాదాలు. 711 00:40:20,170 --> 00:40:21,505 -హేయ్, హాయ్. -చీర్స్, గురూ. 712 00:40:21,588 --> 00:40:23,507 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 713 00:40:37,271 --> 00:40:38,856 హలో, ఎలా ఉన్నారు? 714 00:40:41,024 --> 00:40:42,025 -చీర్స్, చీర్స్... -చీర్స్, మిత్రులారా. 715 00:40:45,362 --> 00:40:47,447 అసలైన గుకాములేని ఎలా తయారు చేస్తారు? 716 00:40:47,531 --> 00:40:48,532 మాక్స్ స్థానిక నిర్మాత 717 00:40:48,615 --> 00:40:51,201 ఇక్కడ మెక్సికోలో, మేం దీన్ని ఇలా తయారు చేస్తాం. 718 00:40:51,285 --> 00:40:52,286 జీసస్ మేనేజర్ 719 00:40:52,369 --> 00:40:54,621 అవకాడో కాయను సగానికి కోయాలి. 720 00:40:54,705 --> 00:41:01,211 తర్వాత దాంట్లోని ముట్టిని తీసేసి, చెంచాతో బాగా నూరాలి. 721 00:41:01,295 --> 00:41:04,590 ముక్కలుగా తినాలనుకుంటే, తరిగిన కొన్ని టమోటా ముక్కలు, 722 00:41:04,673 --> 00:41:08,635 ఉల్లిపాయ ముక్కలు, జలపెనో, నిమ్మ రసం, ఉప్పు కలపాలి. 723 00:41:08,719 --> 00:41:10,554 వీటన్నింటినీ బాగా మిశ్రమం చేయాలి. 724 00:41:10,637 --> 00:41:12,264 ఇదే మేం తయారు చేసే గుకాములే. 725 00:41:12,347 --> 00:41:14,141 భలే. చాలా బాగుంది. ఇందులో... 726 00:41:22,191 --> 00:41:23,650 ఇది హబనెరో, కానీ కాస్త పెద్దవి. 727 00:41:23,734 --> 00:41:26,528 దేవుడా, ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి, చాలా ఘాటుగా. 728 00:41:26,612 --> 00:41:28,864 ఇవి తిని చూడండి. 729 00:41:28,947 --> 00:41:31,033 -చాలా స్పైసీగా ఉంది కదా? -ఒక ముక్క మాత్రమే కొరికి చూడు. 730 00:41:31,116 --> 00:41:33,076 అతను నిన్ను కొద్దిగా కొరికి చూడమంటున్నాడు. 731 00:41:33,702 --> 00:41:34,536 తప్పదు. 732 00:41:34,620 --> 00:41:36,330 అలా కాదు. గుర్తుంచుకోండి, అది తేలు లాంటింది. 733 00:41:36,413 --> 00:41:38,707 తేలు ఎంత చిన్నగా ఉంటే, దాని కొండె అంత బలంగా ఉంటుంది. 734 00:41:43,086 --> 00:41:45,506 నా నోరు ఇప్పటికే ఘాటెక్కిపోయింది. నాకు రుచేమీ తెలియడం లేదు. 735 00:41:51,845 --> 00:41:53,972 ఒహాకా మెక్సికో 736 00:41:54,056 --> 00:41:56,725 మెక్సికోలో అరుదైన ప్రాంతాల్లో తిరుగుతూ మనవాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. 737 00:41:56,808 --> 00:41:58,519 కానీ ఇక మనం బస్సు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. 738 00:42:06,401 --> 00:42:07,402 అద్భుతం. 739 00:42:08,529 --> 00:42:09,530 మహాద్భుతం. 740 00:42:11,657 --> 00:42:12,658 మనం ట్రాఫిక్ కి అవరోధం కల్పిస్తున్నాం. 741 00:42:28,090 --> 00:42:29,883 బస్సు పైకి వచ్చేందుకు ర్యాంపు కావాలనుకుంటా? 742 00:42:37,558 --> 00:42:39,893 నేను ర్యాంపు లాంటిది ఏదైనా తయారు చేస్తాను. 743 00:42:40,894 --> 00:42:44,022 వెనుక టైర్ల దగ్గరే అడ్డంకులన్నీ ఏర్పడుతున్నాయి. 744 00:42:44,106 --> 00:42:46,275 ముందువైపు మాటేమిటి మరి? 745 00:42:46,358 --> 00:42:48,110 ముందు దాన్ని లోపలకి పోనిద్దాం. 746 00:43:07,462 --> 00:43:09,214 అవును, అదే వైపు నుంచి పోనీ... 747 00:43:11,216 --> 00:43:12,217 పోనీ! 748 00:43:15,179 --> 00:43:16,180 పోనీ! 749 00:43:20,017 --> 00:43:23,187 మొత్తానికి సాధించాడు కదా? హమ్మయ్య, ఆగు! 750 00:43:26,773 --> 00:43:29,610 పోనీ, లోపలకు పోనీ! 751 00:43:33,363 --> 00:43:34,364 అదీ! 752 00:43:37,367 --> 00:43:38,368 ఇవి చిన్న చిన్న విజయాలు. 753 00:43:39,161 --> 00:43:40,162 నేనే సాధించాను. 754 00:43:41,163 --> 00:43:45,334 మూషెలని పిలవబడే, స్త్రీ వేషధారణలో ఉండే మగవారిని కలిసేందుకు 755 00:43:45,417 --> 00:43:48,795 మేము టెవాంటెపెక్ వెళ్తున్నాం. 756 00:43:49,213 --> 00:43:51,715 మూషేలు జపాటెక్ సంతతిలోని వారే, 757 00:43:51,798 --> 00:43:54,176 వారి సాంస్కృతిక వారసత్వానికి చెందినవారే. 758 00:43:54,510 --> 00:43:56,470 టెవాంటెపెక్ 759 00:43:56,553 --> 00:44:02,851 ఓహాకాలోని శాంటో డొమింగో టెవాంటెపెక్ కు చెందిన మూషెలం మేము. 760 00:44:03,352 --> 00:44:08,357 నా వరకూ నాకు, మూషెగా ఉండటం ఒక వరమని భావిస్తాను. 761 00:44:09,274 --> 00:44:12,986 నాకు గుర్తున్నంతవరకూ నా అంతట నేనే మూషేగా మారాను. 762 00:44:13,070 --> 00:44:16,114 ఈ సమాజం మనుషుల్ని మగవాళ్లనీ, ఆడవాళ్లనీ చూస్తుంది కదా, నేను 763 00:44:16,198 --> 00:44:19,243 వాళ్లకు భిన్నమైనవాడినని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. 764 00:44:20,702 --> 00:44:23,539 ఈ జీవిత విధానం విభిన్నమైనది, 765 00:44:23,622 --> 00:44:27,793 నా ఆలోచనలను ఇలా కళారూపంలోకి మారుస్తూ ఉంటాను. 766 00:44:27,876 --> 00:44:31,338 ఇలా నన్నెవరూ మార్చలేదు. ఇదే నేను. 767 00:44:32,714 --> 00:44:34,383 చాలా బాగుంది. నీ పనితనం అద్భుతంగా ఉంది. 768 00:44:34,466 --> 00:44:35,300 ధన్యవాదాలు. 769 00:44:35,717 --> 00:44:38,053 నా డెనిమ్ జాకెట్ వెనుకవైపు... 770 00:44:38,720 --> 00:44:40,681 ఇలా బొమ్మ వేయించుకోవాలని ఉంది. 771 00:44:41,014 --> 00:44:42,015 ఇది చాలా బాగుంది. 772 00:44:42,099 --> 00:44:43,976 ఇది సాంప్రదాయకమైన కళారూపం. 773 00:44:44,059 --> 00:44:47,145 ఇవి నాలుగేళ్ల బాలిక కోసం తయారు చేస్తున్న దుస్తులు. 774 00:44:48,063 --> 00:44:48,897 డొనాజీ మూషె 775 00:44:48,981 --> 00:44:49,982 ఇది ఒక తరం నుంచి మరొక తరానికి అందజేయబడుతుంది. 776 00:44:50,065 --> 00:44:53,402 కూతురు గురించో లేక మేన కోడలి గురించో ఒకటి తయారు చేస్తాం. 777 00:44:53,485 --> 00:44:56,530 వాళ్లు దాన్ని తమ కూతుళ్లకి అందజేస్తారు. 778 00:44:56,613 --> 00:45:00,742 ఇది ఒకవిధంగా నీ సంస్కృతిని, సాంప్రదాయాల్నీ భావి తరాలకు అందజేయడమే. 779 00:45:00,826 --> 00:45:04,121 మొదటి నుంచీ మా పద్ధతులు ఇవే. 780 00:45:04,204 --> 00:45:08,834 మేము కుటుంబ సాంప్రదాయాలకు ఎంతో విలువనిస్తాం. 781 00:45:08,917 --> 00:45:11,420 మేం కుటుంబంలో ఒక భాగంగానే ఉంటూ వస్తున్నాం. 782 00:45:14,840 --> 00:45:16,049 డేవిడ్. 783 00:45:16,425 --> 00:45:21,305 మేం రోడ్డు పర్యటన ప్రారంభించడానికి ముందే, ఈ బస్సుకు సంబంధించి 784 00:45:21,388 --> 00:45:23,307 యంత్రపరమైన సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలనుకుంటున్నాం. 785 00:45:23,390 --> 00:45:24,975 దీన్ని పూర్తిగా తనిఖీ చేసి, మరమ్మతులు చేయాలి... 786 00:45:25,058 --> 00:45:26,059 ఏబెల్ మెకానిక్ 787 00:45:26,143 --> 00:45:28,353 ...కానీ సమస్య ఏవిటంటే మా దగ్గర ఎక్కువ సమయం లేదు. 788 00:45:28,437 --> 00:45:32,524 ఇంధన పంపిణీ, క్లచ్, ఇంజన్ అన్నింటినీ పరిశీలించేందుకు చాలా తక్కువ సమయం ఉంది. 789 00:45:32,608 --> 00:45:33,567 చాలా తక్కువ సమయం. 790 00:45:33,650 --> 00:45:36,570 -మీకు ఎంత సమయం కావాలి? -ఎంత లేదన్నా వారం రోజులు కావాలి. 791 00:45:36,653 --> 00:45:38,280 మాకు మూడు రోజులే సమయం ఉంది. 792 00:45:38,363 --> 00:45:40,949 మూడు, నాలుగు, ఐదు. మూడు రోజుల్లో పూర్తి కావాలి. 793 00:45:41,491 --> 00:45:43,619 శుక్రవారం రాత్రికల్లా బస్సు సిద్ధమవుతుందా? మూడు రోజుల్లో? 794 00:45:43,702 --> 00:45:46,413 ఇవాళ్టి నుంచే మొదలు పెట్టండి. ఈ రోజు పూర్తిగా పని చేయండి. 795 00:45:46,496 --> 00:45:49,833 మొదలు పెడతాం, ఎందుకంటే, ముందుగా క్లచ్ ని మరమ్మతు చేయాలి. 796 00:45:49,917 --> 00:45:54,213 కావలసిన విడి భాగాలన్నీ తెప్పించండి, పని మొదలు పెట్టండి. 797 00:45:54,630 --> 00:45:56,298 పనైతే వెంటనే మొదలు పెట్టాలి, అర్థమైందా? 798 00:45:56,381 --> 00:45:58,759 సరేనా? ధన్యవాదాలు. సరే. 799 00:45:59,259 --> 00:46:02,471 పది రోజుల పనిని మూడు రోజుల్లో పూర్తి చేయాలి, మాకు అసలు సమయమే లేదు. 800 00:46:03,597 --> 00:46:06,016 మనకు కావలసిన విడి భాగాల జాబితా తయారు చేయండి. 801 00:46:06,099 --> 00:46:10,854 ఇది పెద్ద నగరం కాబట్టి అన్ని విడి భాగాలు ఇక్కడే దొరుకుతాయని అనుకుంటున్నాను 802 00:46:10,938 --> 00:46:12,689 కాబట్టి, విడి భాగాలన్నీ తెప్పించండి. 803 00:46:12,773 --> 00:46:16,944 మేం 6వ తేదీ ఉదయం 6:00 గంటలకల్లా బయల్దేరాలి. 804 00:46:17,027 --> 00:46:19,613 చాలా సామాన్లు కావాలి, కానీ కావలసిననంత సమయం లేదు. 805 00:46:19,696 --> 00:46:20,906 కానీ కొనసాగించాలి కదా? 806 00:46:27,704 --> 00:46:30,040 టైర్లు, కూలంట్ రిజర్వాయర్ తదితరమైనవి. 807 00:46:30,123 --> 00:46:31,458 మెక్సికన్ దుప్పట్లు కూడా. 808 00:46:37,297 --> 00:46:40,050 ఇది లోహాన్ని కోసే రంపం. 809 00:46:45,222 --> 00:46:48,642 ఏం కొనాలో అన్నీ కొని ఒకచోట పెట్టండి. 810 00:46:48,725 --> 00:46:51,603 ఇవాళ సమయాన్ని వృథా చేయకూడదు. ఎందుకంటే ఇక రెండు రోజులే సమయం ఉంది. 811 00:46:51,687 --> 00:46:53,689 నాకు విడి భాగాలు కావాలి, నాకు సిబ్బంది కావాలి. 812 00:47:00,737 --> 00:47:03,031 అలా బరువులు ఎత్తితే త్వరగా వెన్నెముక దెబ్బతింటుంది. 813 00:47:07,035 --> 00:47:09,246 నాకేం తెలియదు. ఇది చాలా కష్టంగా ఉంది. 814 00:47:10,998 --> 00:47:12,291 నీకు కావలసింది మెక్సికో దుప్పట్లు కదా. 815 00:47:12,374 --> 00:47:14,001 ఇదెలా ఉందంటావు? 816 00:47:19,256 --> 00:47:21,008 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 817 00:47:21,091 --> 00:47:22,092 సాధించాం. 818 00:47:27,097 --> 00:47:29,224 నీ టెలిఫోన్ నంబర్ ఇస్తావా? 819 00:47:31,185 --> 00:47:32,895 ఇంటర్నేషనల్ డీజ్ 820 00:47:32,978 --> 00:47:34,188 నా కాలు తెగింది. 821 00:47:34,855 --> 00:47:35,856 ఏంటీ? 822 00:47:36,398 --> 00:47:37,566 -అవును. -మిత్రమా! 823 00:47:38,609 --> 00:47:40,903 అవును, ఇంత పెద్దగా కోసుకుంది. 824 00:47:40,986 --> 00:47:42,863 మరి, అత్యవసర వైద్య చికిత్స ఏమైనా తీసుకోకపోయావా? 825 00:47:43,322 --> 00:47:44,573 ఫరవాలేదు, బాగానే ఉన్నాను. 826 00:47:54,499 --> 00:47:57,711 ఈ క్లచ్ ను బాగు చేసేందుకు ఒక పనిముట్టు అవసరం. 827 00:48:01,924 --> 00:48:02,758 సరే, నేను ఇక్కడే ఉన్నాను. 828 00:48:02,841 --> 00:48:04,343 నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు, 829 00:48:04,426 --> 00:48:05,719 నేను కనీసం నాలుగు లైట్లు తీసుకుని నీ దగ్గరకు వస్తాను 830 00:48:05,802 --> 00:48:07,095 పని జరుగుతూ ఉండాలి. 831 00:48:08,722 --> 00:48:09,556 అలాగే. 832 00:48:10,224 --> 00:48:11,642 దేవుడా, అప్పుడే సమయం మూడు అయింది. 833 00:48:12,392 --> 00:48:13,227 పదండి. 834 00:48:13,310 --> 00:48:16,772 నాకు వీలైనన్ని విడిభాగాలు కావాలి. నిన్ను వేడుకుంటున్నా. 835 00:48:20,776 --> 00:48:21,777 చాలా సౌకర్యవంతంగా ఉంది. 836 00:48:22,402 --> 00:48:23,403 ఇవి పరుపులు. 837 00:48:27,783 --> 00:48:29,326 ఈ రోజు ఎంతో బాగుంది. 838 00:48:29,409 --> 00:48:31,703 ఈ వాతావరణం, ఉష్ణోగ్రత అన్నీ చక్కగా ఉన్నాయి. 839 00:48:31,787 --> 00:48:34,790 ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది, రంగు రంగుల వర్ణాలు. 840 00:48:35,582 --> 00:48:38,377 ఎదురుగా వచ్చేవారంతా నేను చేయి ఊపితే వాళ్ళూ చేయి ఊపుతున్నారు. 841 00:48:38,460 --> 00:48:39,628 ఈ ప్రాంతం చాలా బాగుంది. 842 00:48:39,711 --> 00:48:41,380 నాకు మెక్సికో బాగా నచ్చింది. భలే నచ్చింది. 843 00:48:42,339 --> 00:48:44,758 ఈ దేశంలో పర్యటన పూర్తవుతుందంటే నాకు బెంగగా ఉంది. 844 00:48:44,842 --> 00:48:49,888 ఇలా ప్రపంచంలోని వింత వింత ప్రదేశాలన్నీ చూస్తూ ప్రయాణం చేయడం ఎంతో బాగుంది. 845 00:48:49,972 --> 00:48:52,432 ఇదంతా నిజంగా ఎంతో బాగుంది. 846 00:48:53,225 --> 00:48:57,396 మన లాంగ్ వే అప్ పర్యటనలో బస్సు బొనాంజోతో ఈ షో రక్తి కడుతుంది. 847 00:49:10,033 --> 00:49:13,287 త్వరగా ఒహాకా వెళ్లి, మన బృందాన్ని కలవాలనీ, బస్సును చూడాలని తహతహలాడుతున్నా. 848 00:49:15,581 --> 00:49:19,168 ఒహాకా మెక్సికో 849 00:49:19,251 --> 00:49:20,460 బస్సు చాలా వరకూ సిద్ధమైంది. 850 00:49:20,544 --> 00:49:23,088 ఈ రాత్రికి మనం బయల్దేరడానికి బస్సు సర్వసన్నద్ధంగా ఉంటుందని అనుకుంటున్నాను. 851 00:49:23,172 --> 00:49:25,924 మన లాంగ్ వే అప్ పర్యటనలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో పర్యటించబోతున్నాం. 852 00:49:26,008 --> 00:49:28,260 ఇలాంటిది పర్యటన చివర్లో ఉండటం దురదృష్టకరం. 853 00:49:28,969 --> 00:49:32,556 మనం సూడాన్, ఈజిప్టు, తూర్పు రష్యా, ఇతర శివారు ప్రాంతాల్లోనూ పర్యటించాం. 854 00:49:32,639 --> 00:49:35,517 "ఇలాంటివి ఎన్నడూ ఎదురుకాలేదు" అని మనం అనుకుంటున్నాం. 855 00:49:35,601 --> 00:49:38,103 కానీ ఇక్కడ, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 856 00:49:41,064 --> 00:49:42,065 ఇదిగో వచ్చేశాం. 857 00:49:42,149 --> 00:49:44,276 వావ్, చాలా బిజీగా ఉన్న పట్టణమిది. 858 00:49:44,359 --> 00:49:46,278 అవును. ఇదొక వింత అనుభవం, కాదంటావా? 859 00:49:47,112 --> 00:49:48,614 అది చాలా పెద్ద చర్చి. 860 00:49:49,823 --> 00:49:51,575 మనవాళ్లు వచ్చేస్తున్నారు, 861 00:49:51,909 --> 00:49:54,077 భద్రతాపరమైన హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది. 862 00:49:54,578 --> 00:49:56,079 ఎలా వెళ్తే బాగుంటుందో చెప్పు. 863 00:49:56,163 --> 00:50:01,084 రూట్లు, ముఠాలు వంటివి దృష్టిలో ఉంచుకుని ఎలా వెళ్తే బాగుంటుందో సలహా ఇవ్వు. 864 00:50:01,168 --> 00:50:02,169 జోస్ సెక్యూరిటీ 865 00:50:02,252 --> 00:50:05,756 ఐదు వేర్వేరు పట్టణాలు, ప్రాంతాలు ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. 866 00:50:06,089 --> 00:50:10,844 మనం ప్రయాణించబోయే చిన్నపాటి నగరాల గురించి నిన్న రాత్రి... 867 00:50:10,928 --> 00:50:13,805 నాకు హెచ్చరికలు అందాయి, తెలుసా? 868 00:50:14,223 --> 00:50:16,433 ఈ సమయంలో ఆ పట్టణాల మీదుగా వెళ్లడం ప్రమాదకరం. 869 00:50:16,517 --> 00:50:17,851 -అవును. అవును. -ఇవాళా? 870 00:50:18,644 --> 00:50:21,355 పట్టణానికి వెలుపల వాళ్ళు... 871 00:50:21,438 --> 00:50:22,481 బిబిసి - లేఫ్ లాంగ్ ఫోర్డ్ బాధితుడి బంధువు 872 00:50:22,564 --> 00:50:28,487 ...దాడి చేసి, కాల్పులు జరిపి ఒక వాహనాన్ని పేల్చేశారు. 873 00:50:28,570 --> 00:50:29,696 జనాన్ని ఊచకోత కోశారు. 874 00:50:29,780 --> 00:50:33,408 క్రిస్టినా వాహనం నుంచి బయటకు దూకి 875 00:50:33,492 --> 00:50:37,746 ముఠా సభ్యులను ఉద్దేశించి, కాల్పులు జరపవద్దంటూ చేతులు ఊపుతూ ప్రాధేయపడింది. 876 00:50:37,829 --> 00:50:40,707 వాళ్లు బహుశా పొరబడి కాల్పులు జరిపినట్టున్నారు, 877 00:50:41,416 --> 00:50:45,045 కానీ చనిపోయినవాళ్లంతా అమాయకులు, మహిళలు, పిల్లలూను. 878 00:50:45,128 --> 00:50:49,299 కాబట్టి నేనేం ఆలోచిస్తున్నానంటే మనం వెళ్లే దారిలో ఏవైనా 879 00:50:49,383 --> 00:50:52,845 ప్రమాదాలు పొంచి ఉన్నాయా లేక 880 00:50:52,928 --> 00:50:54,555 చుట్టూ తిరిగి వెళ్లడం మంచిదా అని. 881 00:52:01,914 --> 00:52:03,916 ఉపశీర్షికలను అనువదించినది: రాంప్రసాద్