1 00:00:40,415 --> 00:00:43,877 మేం 13 దేశాల గుండా 13,000 మైళ్ళు ప్రయాణించబోతున్నాం. 2 00:00:44,461 --> 00:00:49,049 ఉషువాయా నుండి అర్జెంటీనా, చిలీ మీదుగా అటకామా ఎడారి చేరుకుని, 3 00:00:49,132 --> 00:00:52,386 అక్కడి నుంచి టిటికాకా సరస్సు దాటడానికి ముందు లా పాజ్ వెళ్తాం, 4 00:00:52,469 --> 00:00:56,265 ఆ తర్వాత ఆండీస్ పర్వత శ్రేణిని అనుసరిస్తూ కొలంబియా, అక్కడి నుంచి పనామా మీదుగా 5 00:00:56,348 --> 00:01:01,019 సెంట్రల్ అమెరికా, మెక్సికోలను దాటి 100 రోజుల తర్వాత లాస్ ఏంజలెస్ చేరతాం. 6 00:01:01,562 --> 00:01:02,646 రస్ మాల్కిన్ దర్శకుడు-నిర్మాత 7 00:01:02,729 --> 00:01:04,480 మేం వీళ్ళకి వీడియో కెమెరాలు ఇస్తాం, 8 00:01:04,565 --> 00:01:08,026 పైగా వాళ్ళ క్రాష్ హెల్మెట్లలోనూ మైక్రోఫోన్ అమర్చిన కెమెరాలు ఉంటాయి, 9 00:01:08,110 --> 00:01:09,736 కాబట్టి, వాటితో బైక్ నడుపుతూనే చిత్రీకరణ చేయవచ్చు. 10 00:01:09,820 --> 00:01:13,240 ఇది అసలు రోడ్డేనా? దేవుడా! 11 00:01:13,323 --> 00:01:14,366 డేవిడ్ అలెగ్జానియన్ దర్శకుడు-నిర్మాత 12 00:01:14,449 --> 00:01:15,701 వాళ్ళతో మూడో బైక్ వెళ్తూ ఉంటుంది. 13 00:01:15,784 --> 00:01:17,077 దాని మీద కెమెరామెన్ క్లాడియో వెళతాడు. 14 00:01:17,160 --> 00:01:20,289 అది కాకుండా, నేను, రస్ రెండు ఎలక్ట్రిక్పి కప్ వాహనాల్లో వాళ్లని అనుసరిస్తాం, 15 00:01:20,372 --> 00:01:21,957 మాతో కెమెరామెన్లు జిమ్మీ, 16 00:01:22,040 --> 00:01:25,752 ఆంథోనీ, టైలర్ వస్తారు. వీళ్లు కావలసిన ఏర్పాట్లు కూడా చూసుకుంటారు. 17 00:01:25,836 --> 00:01:27,504 మేము కారు నుండే వాళ్ళని చిత్రీకరిస్తూ, 18 00:01:27,588 --> 00:01:29,131 వాళ్లని సరిహద్దుల్లో కలుస్తూ ఉంటాం, 19 00:01:29,214 --> 00:01:32,176 అది పక్కనబెడితే, వాళ్ళ ప్రయాణం వారిదే అన్నమాట. 20 00:01:36,597 --> 00:01:40,100 పాస్టో విమానాశ్రయం కొలంబియా 21 00:01:40,184 --> 00:01:42,603 మూడు గంటలుగా ఇక్కడ వేచి ఉన్నాము. 22 00:01:42,686 --> 00:01:45,397 మాకిప్పుడే తెలిసింది మా గమ్యస్థానం బోనెవెంచూరా 23 00:01:45,480 --> 00:01:47,107 పొగమంచు వల్ల మూసివేయబడిందని. 24 00:01:47,191 --> 00:01:48,984 అన్నీ ఒకదాని వల్ల ఒకటి నిలచిపోతాయి, 25 00:01:49,067 --> 00:01:51,445 ఎందుకంటే మేము అందుకోవలసిన పడవ బయల్దేరటానికి రెండు గంటలుంది. 26 00:01:51,528 --> 00:01:53,697 కనుక ఇదేం సరిగ్గా జరగనట్టే. 27 00:01:54,239 --> 00:01:56,909 పొగమంచు ఉండగా బోనేవెంచూరాలో దిగటం సాధ్యమేనా? 28 00:01:56,992 --> 00:01:57,993 పరవాలేదు. 29 00:01:58,076 --> 00:01:59,244 -అవును, దారుంది. -మంచిది. 30 00:01:59,328 --> 00:02:00,329 మార్లన్ పైలట్ 31 00:02:00,412 --> 00:02:01,455 అయితే బోనవెంచురాకి విమానాశ్రయం తెరిచారా? 32 00:02:01,538 --> 00:02:02,664 అవును, అంతా బాగానే ఉంది. 33 00:02:03,957 --> 00:02:06,210 మొత్తానికి మేము ఎదురుచూస్తున్న వార్త వచ్చింది, 34 00:02:06,293 --> 00:02:08,002 కానీ ఇక తొందరపడుతున్నాం... 35 00:02:09,463 --> 00:02:12,424 ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఎక్కించటం, దించటం పనులున్నాయి. 36 00:02:17,804 --> 00:02:19,598 -సిద్ధమేనా? -సిద్ధమే. 37 00:02:19,681 --> 00:02:20,766 పదండి. 38 00:02:20,849 --> 00:02:22,935 కొలంబియా 39 00:02:26,522 --> 00:02:29,024 బయల్దేరాక చాలా దూరం బైకులు నడిపాం, 40 00:02:29,107 --> 00:02:31,068 కానీ ఇప్పుడొక అడ్డంకి తగిలింది. 41 00:02:31,443 --> 00:02:33,654 డారియన్ గ్యాప్ లో రోడ్లు లేనందున. దక్షిణ అమెరికా, 42 00:02:33,737 --> 00:02:35,864 మధ్య అమెరికా మధ్య ఆటంకం వచ్చింది 43 00:02:35,948 --> 00:02:39,409 మా తరువాయి దేశం పనామాకు చేరటానికి విమానంలో, సముద్రంపై వెళ్ళాల్సిందే. 44 00:02:39,493 --> 00:02:40,494 పనామా నగరం -డారియన్ గ్యాప్ వెనెజూలా -కొలంబియా 45 00:02:40,577 --> 00:02:41,578 బాహియా సొలానో -బోనవెంచురా -పాస్టో 46 00:02:43,247 --> 00:02:46,083 చార్లీ, నేను మూడు బైకులతో ఒక విమానంలో ఉన్నాం, 47 00:02:46,166 --> 00:02:49,837 రస్, డేవిడ్, ఇతర సిబ్బంది సామగ్రితో పాటు వేరే విమానంలో ఉన్నారు. 48 00:03:05,477 --> 00:03:07,104 ఆ విమానం ఎక్కడుందా అని చూస్తున్నాం. 49 00:03:11,942 --> 00:03:13,610 ఇక్కడే ఉండి ఉండాలి. 50 00:03:18,073 --> 00:03:21,243 చాలా సులభం అనుకున్నదే కష్టమని ఇప్పుడు అర్థమవుతోంది. 51 00:03:21,702 --> 00:03:22,703 ఉండండి. 52 00:03:23,120 --> 00:03:24,997 -అదిగో అక్కడే ఉంది. -ఎక్కడ? 53 00:03:25,080 --> 00:03:26,081 ఎడమ వైపు. 54 00:03:26,164 --> 00:03:27,749 అదిగో. 55 00:03:31,128 --> 00:03:32,296 హే! 56 00:03:34,047 --> 00:03:35,424 చాలా దగ్గరగా వచ్చింది. 57 00:03:49,271 --> 00:03:52,900 కొలంబియన్ అడవులపై ఇలా ఈ రెండు విమానాల్లో ఎగరటం అద్భుతంగా ఉంది. 58 00:03:52,983 --> 00:03:55,319 రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ లాగా ఉంది అచ్చంగా. 59 00:04:13,795 --> 00:04:14,796 భలే ఉంది. 60 00:04:17,966 --> 00:04:20,302 బైకులు ఎలా పెట్టామో అలాగే ఉన్నాయి. అస్సలు ఒరిగిపోలేదు. 61 00:04:20,385 --> 00:04:25,140 పనామాకు చేరటంలోని మూడు భాగాల్లో ఒకటవది గడిచింది. 62 00:04:27,684 --> 00:04:29,061 బోనవెంచురా విమానాశ్రయం కొలంబియా 63 00:04:33,690 --> 00:04:36,777 పడవ బయల్దేరటానికి 45 నిమిషాలుంది. 64 00:04:37,444 --> 00:04:38,654 -సరే. -అదీ. 65 00:04:41,990 --> 00:04:42,991 ధన్యవాదాలు. 66 00:04:45,494 --> 00:04:47,704 -సరే. తరువాత ఫెర్రీ దగ్గరకేగా? -సరే. 67 00:04:50,165 --> 00:04:53,544 లాస్ ఏంజలిస్ కు 5,419 మైళ్ళు 68 00:04:56,547 --> 00:04:58,966 ఇప్పుడే అసలైన, లోతైన, అతి చీకటి కొలంబియాలోకి వెళ్తున్నాం. 69 00:04:59,049 --> 00:05:00,050 మాక్జిమ్ స్థానిక నిర్మాత 70 00:05:00,133 --> 00:05:02,052 కనీసం బోనవెంచురాకి రోడ్ అనుసంధానమై ఉంది, 71 00:05:02,636 --> 00:05:05,514 కానీ మనం వెళ్ళబోయే చోట లోపలకి, బయటకి దారులే లేవు. 72 00:05:06,932 --> 00:05:08,725 కనుక అక్కడకి వెళ్ళాలంటే ఓడ మీదే. 73 00:05:10,602 --> 00:05:13,021 పడవలో పసిఫిక్ తీరం గుండా వెళ్ళబోతున్నాం, 74 00:05:13,105 --> 00:05:15,566 దారిలో కొన్ని కుగ్రామాలను దాటుకుంటూ 75 00:05:15,649 --> 00:05:18,402 ఉత్తర కొలంబియాలోని బహియా సొలానోకు రెండు రోజుల ప్రయాణం. 76 00:05:18,485 --> 00:05:19,570 బహియా సొలానో బోనవెంచురా 77 00:05:20,612 --> 00:05:22,573 వాళ్ళవి... విడివిడిగా విస్తరించినట్టున్న సమూహాలు. 78 00:05:22,656 --> 00:05:25,033 వాళ్ళలో చాలా మంది ఒకప్పుడు బానిసలు. పారిపోయి 79 00:05:25,117 --> 00:05:28,370 తీరం వెంబడి ఇలా సమూహాలుగా స్థిరపడ్డారు. 80 00:05:28,453 --> 00:05:30,706 వ్యవసాయదారులుగా, మత్స్యకారులుగా జీవనం సాగించారు. 81 00:05:30,789 --> 00:05:33,959 బోనవెంచురా కొలంబియా 82 00:05:34,042 --> 00:05:36,753 ఇంకా బోనవెంచురా ఎందుకు సందర్శనీయ స్థలం కాలేదు? 83 00:05:36,837 --> 00:05:40,090 ముఖ్యంగా ఈ ప్రాంతం కాలేదు. ఎందుకంటే ఇది రేవు పట్టణం 84 00:05:40,174 --> 00:05:42,301 విసిరివేయబడ్డట్టు ఉంటుంది. 85 00:05:42,384 --> 00:05:45,387 ఇది సైనిక కార్యకలాపాలకు కేంద్రమై ఉంది, 86 00:05:45,470 --> 00:05:47,681 మాదక ద్రవ్యాలకు కూడా. 87 00:05:47,764 --> 00:05:51,435 ఫార్క్ కి, మిగిలిన గెరిల్లా సంస్థలకు మధ్య జరుగుతున్న 88 00:05:51,518 --> 00:05:54,563 వివాదాల వల్ల కూడా. 89 00:05:54,646 --> 00:05:56,648 -అవిగో పడవలు. -మనం అక్కడకి వెళ్తామా? 90 00:05:56,732 --> 00:05:57,733 లేదు. 91 00:05:59,902 --> 00:06:01,028 పడవ అక్కడుంది. 92 00:06:03,322 --> 00:06:04,948 -అదిగో మన పడవ. -నిజమా? 93 00:06:05,032 --> 00:06:07,034 -నిజంగానా? -అవును. అదే. 94 00:06:10,954 --> 00:06:13,665 మిత్రమా, ఇంగ్లీష్ లో మాట్లాడతారా? 95 00:06:13,749 --> 00:06:15,834 కాస్టిలియన్, తమ్ముడూ. 96 00:06:21,757 --> 00:06:24,968 ఇది చాలా ఆసక్తికరంగా ఉండేటట్టుంది. అది ఆసక్తికరంగా ఉండనుంది. 97 00:06:25,427 --> 00:06:26,428 ఇదా? 98 00:06:27,471 --> 00:06:29,264 చాలా దారుణంగా ఉంది. 99 00:06:29,348 --> 00:06:30,891 దీన్ని అక్కడకి తీసుకువెళ్ళేదెలా? 100 00:06:30,974 --> 00:06:32,976 డానీ 101 00:06:33,060 --> 00:06:34,186 వావ్. 102 00:06:34,269 --> 00:06:36,438 ఈ పడవలో 15 మంది వరకు నివసిస్తున్నారు. 103 00:06:36,522 --> 00:06:37,606 చాలా మంది ఉన్నారు. 104 00:06:38,440 --> 00:06:39,733 ఇది మన పడవ కాదేమో. 105 00:06:40,609 --> 00:06:42,903 అసలు పనిచేస్తుందా లేదా అన్నట్టుంది. 106 00:06:43,654 --> 00:06:45,989 మనం ఫోటోల్లో చూసింది దీన్ని కాదు. 107 00:06:46,073 --> 00:06:47,074 నిజమే, దీన్ని కాదు. 108 00:06:47,157 --> 00:06:48,909 మాకు కావలసింది ఇలాంటి పడవ కాదు. 109 00:06:49,826 --> 00:06:51,411 పదండి, పదండి. 110 00:06:51,954 --> 00:06:53,455 మా పడవ ఇది కాదు కదా? 111 00:06:54,081 --> 00:06:56,208 -ఏంటి? -ఫోటోల్లో ఉన్నది ఇది కాదు కదా? 112 00:06:57,000 --> 00:06:58,669 ఫోటోల్లో ఉన్నది అదిగో, అక్కడుంది. 113 00:06:58,752 --> 00:07:00,838 అక్కడున్న పచ్చ రంగుదే, ఖచ్చితంగా. 114 00:07:05,133 --> 00:07:07,427 అక్కడ మన కోసం వంట కూడా చేసేస్తున్నారు. 115 00:07:07,511 --> 00:07:08,512 అవునవును. 116 00:07:10,055 --> 00:07:11,682 -ఇదేగా? -ఇదే మన పడవ. 117 00:07:11,765 --> 00:07:12,766 ఇదేగా మన పడవ? 118 00:07:13,851 --> 00:07:14,852 సరే. 119 00:07:14,935 --> 00:07:16,103 దారుణమైన పడవ. 120 00:07:16,186 --> 00:07:18,897 అందులో వ్యంగ్యం ఏమీ లేదు. ఇది దారుణమైన పాత పడవ. 121 00:07:19,356 --> 00:07:21,316 దీని మీద రెండు రోజులు ప్రయాణం చేయాలి. 122 00:07:21,400 --> 00:07:25,487 ఇందులో నల్లులు, బొద్దింకలు, పురుగులు, ఎలుకలు ఉండవచ్చు... 123 00:07:25,571 --> 00:07:28,198 అవును. అయ్యో, మనం అడ్డంగా ఉన్నాం. ఇదంతా... 124 00:07:28,282 --> 00:07:30,325 అవును. వాళ్ళు బైకులు ఎక్కించేస్తున్నారు. 125 00:07:30,409 --> 00:07:32,286 అంతా కుదిరిపోయినట్లే ఇంక. 126 00:07:32,369 --> 00:07:34,913 ఇంకా మంచి పడవ కావాలని అడగబోయాం. 127 00:07:36,081 --> 00:07:37,624 ఇక వెను తిరిగే అవకాశం లేదు. 128 00:07:38,166 --> 00:07:39,168 దేవుడా! 129 00:07:39,251 --> 00:07:43,213 అమ్మో, నా బైక్ ని ఒక్కడే తోసేస్తున్నాడు. అది చాలా బరువైనది. 130 00:07:47,426 --> 00:07:49,219 ఇలా స్కూటర్లు ఎక్కించటం బహుశా వీళ్ళకి అలవాటే. 131 00:07:49,303 --> 00:07:52,181 హార్లీ-డేవిడ్సన్స్ తో అలవాటు ఉందనుకోను. 132 00:08:00,856 --> 00:08:01,899 పడవ బయల్దేరటానికి 15 నిమిషాలు 133 00:08:01,982 --> 00:08:05,235 ప్రవాహం పెరుగుతుందని వాళ్ళు తొందరపడుతున్నారు. 134 00:08:06,403 --> 00:08:08,864 ఇది ఎక్కించకపోతే పడవ కదపలేము. 135 00:08:09,698 --> 00:08:10,699 ఎక్కిస్తున్నాడు. 136 00:08:25,047 --> 00:08:26,507 లోపలకి వెళ్దామా? 137 00:08:31,970 --> 00:08:33,931 యంత్రాల గదిలో ఏదో సమస్య వచ్చింది. 138 00:08:34,014 --> 00:08:35,349 మీరు ఒకసారి వచ్చి చూడాలి. 139 00:08:38,352 --> 00:08:39,811 మీరు నమ్మరేమో. 140 00:08:40,354 --> 00:08:42,438 ఉన్నవి చాలదన్నట్టు బ్యాటరీ సమస్య వచ్చి పడింది. 141 00:08:42,523 --> 00:08:43,524 బ్యాటరీలు. 142 00:08:44,024 --> 00:08:46,193 ప్రధాన ఇంజన్ పనిచేయట్లేదు. 143 00:08:47,569 --> 00:08:49,696 అక్కడ చూస్తే బ్యాటరీ కనిపిస్తుంది. 144 00:08:49,780 --> 00:08:52,741 దానితో ప్రధాన ఇంజన్ ను ప్రారంభించారు. 145 00:08:53,784 --> 00:08:55,953 మొదలయ్యింది... ఇంజిన్ మొదలైపోయింది... 146 00:08:56,036 --> 00:08:57,871 ఒక్క క్షణంలోనే మొదలయింది. 147 00:08:57,955 --> 00:08:59,248 ఇది శుభశకునమే. 148 00:09:00,874 --> 00:09:05,337 నాకు నచ్చిందేమిటంటే, అక్కడున్న పడవ నుంచి బ్యాటరీ అరువు తీసుకొని... 149 00:09:05,420 --> 00:09:07,714 -జంప్ స్టార్ట్ చేశారు. -...పడవని జంప్ స్టార్ట్ చేయడం. 150 00:09:08,173 --> 00:09:11,134 క్విడాడ్ మూటిస్. నుక్వీ. చోకో. అంతే. 151 00:09:19,142 --> 00:09:20,352 ఆ శబ్దం. 152 00:09:20,435 --> 00:09:22,729 ఆ గొంతులు, ఆ సందడి నాకు బాగా నచ్చాయి. అద్భుతం కదా? 153 00:09:27,943 --> 00:09:29,486 ఇది... ఇది బాగుంది. 154 00:09:29,570 --> 00:09:31,321 చెప్పావు. పైకి రా. రా. 155 00:09:33,490 --> 00:09:36,118 ఈ సన్నివేశం సముద్రంలో దొరకటం కష్టం. 156 00:09:36,827 --> 00:09:37,828 అది నిజమే. 157 00:09:40,581 --> 00:09:45,085 ఆహా! కెరటాలపై ఎగురుతున్న ఆ పక్షులను చూడండి. 158 00:09:47,379 --> 00:09:51,008 దూరంగా వెళ్తున్న మత్స్యకారుడు. వావ్. 159 00:09:56,471 --> 00:09:59,057 -కెప్టెన్, ఓడ సిద్ధంగా ఉంది సర్. -మంచిది. 160 00:09:59,141 --> 00:10:02,186 దీపానికి ఫ్రేమ్ తీసేసి సాదా వాటికి ఫ్రేమ్ చేయండి. 161 00:10:02,269 --> 00:10:03,812 తప్పకుండా దీపాలను రెపరెపలాడిస్తాను సర్. 162 00:10:09,526 --> 00:10:12,946 జేమ్స్ మేసన్ ని, సముద్రపు దొంగలని కలిపి కొట్టేశాను. 163 00:10:17,618 --> 00:10:19,286 చూడు, మనం కదులుతున్నాం. బయలుదేరుతున్నాం! 164 00:10:48,690 --> 00:10:49,691 డైరీ క్యామ్ 165 00:10:49,775 --> 00:10:51,360 ఇది నా క్యాబిన్. 166 00:10:52,027 --> 00:10:54,112 మూడు పక్కలు ఉన్నాయి ఇక్కడ. 167 00:10:56,740 --> 00:10:57,950 ఇక్కడ ఇంకో మూడు. 168 00:10:59,326 --> 00:11:01,703 ఈ మధ్య దానిలో పడుకొనే ప్రయత్నం చేస్తాను, 169 00:11:01,787 --> 00:11:05,207 ఫ్యాన్ లేని ఏకైక క్యాబిన్ ను ఎంచుకున్నాను. 170 00:11:06,375 --> 00:11:09,753 పొగ గొట్టం... పక్కనే ఉన్నదాన్ని. 171 00:11:12,506 --> 00:11:13,799 భలే పిచ్చిపిచ్చిగా ఉంది కదా? 172 00:11:19,596 --> 00:11:21,598 దేవుడా. ఎంత బాగుంది! 173 00:11:26,436 --> 00:11:28,355 దేవుడా, అదిరిపోయింది. 174 00:11:28,438 --> 00:11:29,648 అంటే, అది తాజా చేప. 175 00:11:29,731 --> 00:11:31,358 -అవును, చాలా బాగుంది. -అవును. 176 00:11:31,441 --> 00:11:32,442 మరిన్ని చేపలా? 177 00:11:32,526 --> 00:11:34,069 -చాలా ఆనందంగా ఉంది. ఎంత బాగుందో. -అవునా? 178 00:11:34,152 --> 00:11:35,153 అవును. 179 00:11:35,821 --> 00:11:38,073 -చాలా రుచిగా ఉంది. చాలా బాగుంది. -అద్భుతంగా ఉంది. 180 00:11:43,036 --> 00:11:45,664 అవును. చార్లీ బూర్మాన్. 181 00:11:46,206 --> 00:11:48,750 -ఉన్నాను, చెప్పండి. -ఒకటి చెప్పు... 182 00:11:49,293 --> 00:11:50,294 ఎలా ఉన్నావు? 183 00:11:50,377 --> 00:11:51,962 చాలా బాగున్నాను. అవును. 184 00:11:52,045 --> 00:11:54,339 కొద్దిగా జైల్లో ఉన్నట్టుంది. 185 00:11:56,216 --> 00:11:57,968 అవును. ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను. 186 00:11:58,051 --> 00:11:59,887 జైల్ ఛాయలు ఉన్నాయి కదా? 187 00:11:59,970 --> 00:12:01,346 అవును, నిజమే. 188 00:12:01,930 --> 00:12:03,473 బాత్రూమ్ కి వెళ్తున్నా. 189 00:12:03,557 --> 00:12:04,766 అలాగే. 190 00:12:06,977 --> 00:12:08,812 శబ్దం ఎక్కువే ఉంది కానీ ఇది సురక్షితమే. 191 00:12:09,730 --> 00:12:10,981 కానిద్దాం. 192 00:12:13,859 --> 00:12:15,819 డైరీ క్యామ్ 193 00:12:15,903 --> 00:12:17,279 బాత్రూమ్ పనితీరు ఇలా ఉంది. 194 00:12:17,362 --> 00:12:21,658 సముద్రపు నీరు నిరంతరం ఇక్కడికి పంప్ అవుతున్నట్టుంది... 195 00:12:22,743 --> 00:12:24,161 ఇక్కడ... 196 00:12:24,661 --> 00:12:27,039 ఇక్కడ సెలవు తీసుకుంటాను మరి. 197 00:12:27,789 --> 00:12:32,503 వచ్చే వారం Long Way Up లో కలుద్దాం కుర్రాళ్ళు రేవుకు చేరటం చూడాలంటే. 198 00:12:56,109 --> 00:12:57,110 శుభోదయం. 199 00:12:57,194 --> 00:12:58,195 డైరీ క్యామ్ 200 00:12:58,278 --> 00:13:00,364 నాకు అంత గొప్పగా నిద్ర పట్టలేదు. 201 00:13:00,447 --> 00:13:04,868 మంచం మీద అంతసేపూ దొర్లుతూనే ఉన్నాను. 202 00:13:05,577 --> 00:13:07,371 ఉదయం కనిపించిన సన్నివేశం ఇది. 203 00:13:08,121 --> 00:13:11,083 సముద్రం బాగా విశాలంగా ఉంది. 204 00:13:28,767 --> 00:13:32,104 మనం చిన్న పడవలో ఉంటే, బయటకి వెళ్లినప్పుడు భూభాగం కనపడక, 205 00:13:32,187 --> 00:13:34,356 ఉన్నట్టుండి మనమెంత చిన్నవాళ్ళమో అనిపిస్తుంది, కదా? 206 00:13:34,439 --> 00:13:38,652 సముద్రం అలవాటు అవ్వటానికి ఒకటి రెండు రోజులు పట్టవచ్చు. 207 00:13:43,198 --> 00:13:44,491 -శుభోదయం. -శుభోదయం! 208 00:13:46,493 --> 00:13:48,704 నా చేతిలో కాఫీ ఉంది, 209 00:13:48,787 --> 00:13:51,248 అలా వరండాలో నడుస్తూ వెళ్లాను. 210 00:13:51,331 --> 00:13:52,457 అలా పడిపోయాను. 211 00:13:53,792 --> 00:13:55,210 కానీ ఒక్క చుక్క కూడా ఒంపలేదు. 212 00:14:02,342 --> 00:14:03,468 నాకు పడవ చాలా నచ్చింది. 213 00:14:03,552 --> 00:14:06,471 రోజూ తాజాగా వండబడుతున్న ఆహారం. ముఖ్యంగా చేప అనుకో. 214 00:14:10,184 --> 00:14:13,103 నన్ను చూసే నవ్వుతోంది. నాకు చేప వద్దు. 215 00:14:13,687 --> 00:14:16,356 తెలుసు. పొద్దున్నే చేప నావల్ల కాదు. 216 00:14:17,065 --> 00:14:18,859 -నువ్వు తినవా? -వద్దులే. 217 00:14:18,942 --> 00:14:20,110 ధన్యవాదాలు. 218 00:14:23,197 --> 00:14:26,992 ఈ పడవలో పనిచేస్తున్న ఎంతోమంది జీవితమంతా సముద్రం మీదే గడిపారు. 219 00:14:27,659 --> 00:14:30,495 ఇది... ఇది జీవనాధారం లాంటిది. 220 00:14:30,579 --> 00:14:31,580 పాబ్లో ఎంజినీర్ 221 00:14:31,955 --> 00:14:34,750 ఒకసారి ఈ జీవితానికి అలవాటు పడితే, 222 00:14:34,833 --> 00:14:39,254 వదలి వెళ్ళాలని అనిపించనంతగా బంధం ఏర్పడుతుంది. 223 00:14:39,338 --> 00:14:42,925 నాకిది... చాలా ప్రత్యేకమైనది. 224 00:14:47,054 --> 00:14:49,640 నా చిన్నప్పటి నుంచి ఇదే నా ఉద్యోగం. 225 00:14:50,140 --> 00:14:51,141 హువాన్ పడవ సిబ్బందిలో ఒకరు 226 00:14:51,225 --> 00:14:52,226 మేము మత్స్యకారుల మధ్య పెరిగాము. 227 00:14:52,309 --> 00:14:53,810 నా తోబుట్టువులు, నేను చేపలు పడుతూ పెరిగాము. 228 00:14:53,894 --> 00:14:57,523 ఇదే నా వృత్తి. 229 00:14:57,606 --> 00:15:02,110 జనవరి 16 కి నాకు 85 నిండుతాయి. 230 00:15:02,194 --> 00:15:03,654 వావ్! 231 00:15:06,990 --> 00:15:08,825 ఈ పడవ భలే ఉంది. 232 00:15:09,952 --> 00:15:12,829 ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళద్దు అంటే, 233 00:15:12,913 --> 00:15:15,541 అదే అద్భుతమైన చోటు అవుతుంది ఎప్పుడూ. 234 00:15:18,252 --> 00:15:21,672 అందుకే ఈ యత్రలు చేస్తుంటాము. దీని కోసమే. అందుకే నాకిదంటే ఇష్టం. 235 00:15:21,755 --> 00:15:25,342 ఈ మనుషులతో ఇలా పడవ ప్రయాణం చేయటం ఎప్పుడో తప్ప జరగదు, ఇంకా... 236 00:15:25,425 --> 00:15:27,386 భలే ఉంది. చాలా బాగుంది. 237 00:15:28,470 --> 00:15:31,306 ఆ భూభాగం చూడండి! దేవుడా! నాకు భూమంటే చాలా ఇష్టం. 238 00:15:35,811 --> 00:15:38,564 ఈ తీర ప్రాంతమంతా దాదాపు నిర్మానుష్యంగానే ఉంది, 239 00:15:38,647 --> 00:15:40,649 కానీ అక్కడక్కడా చిన్నచిన్న పల్లెటూళ్ళు ఉన్నాయి, 240 00:15:40,732 --> 00:15:42,526 కనుక అవి చూడవచ్చా అని అడిగాము. 241 00:15:43,819 --> 00:15:45,571 టక్కున. 242 00:15:46,822 --> 00:15:50,325 నిజానికి వంటవాళ్ళు ప్రతిసారీ ఇక్కడ దిగుతారట సామాను కోసం. 243 00:15:51,493 --> 00:15:53,245 నాకు హుడ్ ఉందా? అవును, ఉంది. 244 00:16:02,254 --> 00:16:04,089 దీన్ని చోకో ప్రాంతమంటారు, 245 00:16:04,173 --> 00:16:06,758 భూమిపై అతి తడి ప్రాంతాల్లో ఇది ఒకటి. 246 00:16:06,842 --> 00:16:08,969 మేము వెళ్ళబోయే పల్లెటూరి పేరు నూకీ. 247 00:16:09,052 --> 00:16:10,179 బహియా సొలానో - నూకీ బోనెవెంచూరా 248 00:16:13,765 --> 00:16:15,809 భలే ఉంది కదా? సరిగ్గా మధ్యలో... 249 00:16:15,893 --> 00:16:18,270 తీరప్రాంతంలో ఇది ఒక జన సమూహం. 250 00:16:18,353 --> 00:16:21,315 ఇక్కడ రోడ్లు ఉన్నాయని అనిపించట్లేదు. ఎవరైనా పడవ మీదే వస్తారు. 251 00:16:30,240 --> 00:16:32,951 -హేయ్, అది కావాలా? -కానిద్దాం. 252 00:16:39,833 --> 00:16:41,293 వావ్, మంచి బజారులా ఉంది. 253 00:16:41,752 --> 00:16:42,794 నూకీ కొలంబియా 254 00:16:44,171 --> 00:16:45,255 నమస్తే. 255 00:16:47,216 --> 00:16:48,217 హార్లీ-డేవిడ్సన్ 256 00:16:48,300 --> 00:16:50,302 మీ కొట్టు అందంగా ఉంది. బాగుంది, బాగుంది. 257 00:16:51,428 --> 00:16:55,557 నోట్లో సిగరెట్ బొమ్మ ఉన్న ఆ పుర్రె, ఎముకల బొమ్మ నచ్చింది. 258 00:16:57,518 --> 00:16:59,728 పడవ దగ్గరకి వెళ్ళాక... మనకున్నాయా... 259 00:17:00,479 --> 00:17:01,855 తువ్వాళ్ళు లేవు కదా? 260 00:17:01,939 --> 00:17:03,774 అవును, నా దగ్గర తువ్వాలు లేదు. 261 00:17:04,316 --> 00:17:06,026 తువ్వాళ్ళు కొనుక్కుంటే నయం కదా. 262 00:17:08,069 --> 00:17:09,570 ధన్యవాదాలు, మిత్రమా. 263 00:17:10,280 --> 00:17:11,114 నూకీ చోకో 264 00:17:11,198 --> 00:17:12,406 -నమస్తే. -నమస్తే. 265 00:17:14,867 --> 00:17:16,453 నాకీ చోటు బాగా నచ్చింది. 266 00:17:16,537 --> 00:17:18,747 ఈ రంగులన్నీ... అంతా రంగుల మయం. 267 00:17:19,830 --> 00:17:22,041 ఇక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ. 268 00:17:22,125 --> 00:17:23,126 అమరాల్డెస్ రైతు 269 00:17:23,210 --> 00:17:27,005 ఒక అరటి పిలక భూమిలో పాతితే, 270 00:17:27,089 --> 00:17:30,342 ఆరు నెలల్లో పంట చేతికొచ్చేస్తుంది. 271 00:17:30,425 --> 00:17:33,971 నీళ్ళ దగ్గరకి వెళ్తే చేపలన్నీ ఉండనే ఉన్నాయి. 272 00:17:34,054 --> 00:17:35,639 -ధన్యవాదాలండీ. -మంచిది. 273 00:17:37,391 --> 00:17:39,184 తిరగటానికి ఈ చోటు చాలా బాగుంది. 274 00:17:39,268 --> 00:17:40,602 స్నేహపూరితమైన మనుషులు, 275 00:17:41,603 --> 00:17:43,522 మనం చూసినదాని కంటే పూర్తి భిన్నంగా ఉంది. 276 00:17:43,605 --> 00:17:46,984 ఆఫ్రో-కరిబియన్ లాగా అనిపించింది. 277 00:17:47,067 --> 00:17:48,068 ఇది చూడు. 278 00:17:48,694 --> 00:17:49,695 సాచురియో ప్రాంతీయం 279 00:17:49,778 --> 00:17:50,779 ఏమిటది? నాటు సారా? 280 00:17:50,863 --> 00:17:52,364 -ఇది మందు. -ఏమిటది? 281 00:17:52,447 --> 00:17:53,532 ఇది వీచే. 282 00:17:53,615 --> 00:17:54,950 -వీచే. -అంటే చెరుకు సారా. 283 00:17:55,033 --> 00:17:57,953 -అవునా? వాసన చూద్దాం ఉండు. -వాసన చూడు. వాసన చూడు. 284 00:17:58,036 --> 00:17:59,496 అప్పుడు మీకొక వారం దాకా కనపడను. 285 00:18:00,205 --> 00:18:02,416 శుభవార్త ఏమిటంటే, తనేమీ తాగలేదు. దుర్వార్త ఏమిటంటే... 286 00:18:03,125 --> 00:18:04,126 అబ్బ! ఓహో! 287 00:18:04,209 --> 00:18:06,295 -ఘాటుగానే ఉంది. అవును. -ఘాటుగానే ఉంది. 288 00:18:17,973 --> 00:18:19,683 పడవ దిగి మంచి పని చేశాం. 289 00:18:19,766 --> 00:18:21,977 ఊరు చూడటం బాగుంది కదా? చాలా బాగుంది. 290 00:18:33,739 --> 00:18:34,990 సిద్ధమా, మిత్రులారా? 291 00:19:04,269 --> 00:19:07,272 హార్లీ-డేవిడ్సన్ నా బైక్ కి కావలసిన భాగాలు ఏమిటో తేల్చారు. 292 00:19:07,356 --> 00:19:10,692 కానీ మా దగ్గరకి అవి రావటానికి అతివేగమైన దారి కోస్టా రికాకు తెప్పించటమే, 293 00:19:10,776 --> 00:19:11,777 పనమాకు కాదు. 294 00:19:13,237 --> 00:19:14,780 పనామాకు వెళ్లినప్పుడు... 295 00:19:15,656 --> 00:19:19,576 ఒక ట్రక్ మీద నా బైక్ తో కోస్టా రికా వెళ్తాను. 296 00:19:19,660 --> 00:19:20,661 సరే. 297 00:19:20,744 --> 00:19:23,288 నా బైక్ ను నేనే చూసుకోవటమంటే నాకు చాలా ఇష్టం, 298 00:19:23,372 --> 00:19:25,415 కానీ మనిద్దరి తరఫున పనామాని నువ్వు చూసేసుకోవచ్చు. 299 00:19:26,291 --> 00:19:28,919 అలాగే, అది బాగానే ఉంది. 300 00:19:29,002 --> 00:19:30,295 నీపై బెంగ వచ్చేస్తుంది. 301 00:19:30,379 --> 00:19:31,380 నాకూ నీ మీద బెంగ వచ్చేస్తుంది. 302 00:19:32,047 --> 00:19:33,924 -కానీ అదొక సాహసయాత్ర అవుతుంది. -ఏమిటది? 303 00:19:41,223 --> 00:19:43,433 ఒక ఆంటనొవ్ కార్గో విమానాన్ని అద్దెకు తీసుకున్నాం, 304 00:19:43,517 --> 00:19:45,894 అందులో బైక్స్ ముందు మెడెల్లిన్ కు, తర్వాత పనామాకు రవాణా అవుతాయి. 305 00:19:45,978 --> 00:19:46,979 కోస్టా రికా -పనామా -కొలంబియా బహియా సొలానో -మెడెల్లిన్ 306 00:19:47,062 --> 00:19:49,898 అక్కడ నుంచి, నా బైక్ ను కోస్టా రికాకు తీసుకువెళ్తాను 307 00:19:49,982 --> 00:19:51,525 హార్లీ భాగాలను తీసుకొని బిగించుకోవటానికి, 308 00:19:51,608 --> 00:19:53,527 ఇక అప్పుడు నా బైక్ ను రోడ్డు పైకి తీసుకువెళ్ళవచ్చు. 309 00:19:53,610 --> 00:19:54,611 శాన్ హోసే బోర్డర్ క్రాసింగ్ 310 00:19:55,445 --> 00:19:59,449 బహియా సొలానో కొలంబియా 311 00:19:59,533 --> 00:20:03,620 ఉదయం 5 గంటలు. ఇప్పుడే దిగుతున్నాం. చాలా వేడిగా, ఉక్కగా ఉంది కదా? 312 00:20:08,917 --> 00:20:10,419 ఆంటనొవ్ ఒక కార్గో విమానం మాత్రమే, 313 00:20:10,502 --> 00:20:16,175 అంతర్జాతీయ సరిహద్దులు దాటి అందులో ప్రయాణికుల్ని తీసుకువెళ్ళకూడదు. 314 00:20:16,258 --> 00:20:18,635 కనుక అది నేరుగా పనామా సిటీకి బైక్స్ తీసుకువెళ్తుంది, 315 00:20:18,719 --> 00:20:22,306 నేను వీలైనంత త్వరగా కోస్టా రికాకు నా బైక్ తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. 316 00:20:22,389 --> 00:20:25,726 కనుక ఆంటనొవ్ లో ఎక్కటానికి ప్రయత్నిస్తాను... 317 00:20:26,894 --> 00:20:30,856 మెడెల్లిన్ లో దిగి, మీకు వీడ్కోలు చెప్పేసి బైక్ తో పనామా సిటీకి వెళ్తాను. 318 00:20:32,441 --> 00:20:34,860 -అది జరిగే పనేనా? -చూద్దాం. 319 00:20:34,943 --> 00:20:35,944 -సరే. -అలాగే. 320 00:20:38,447 --> 00:20:39,448 అలాగే! 321 00:20:39,531 --> 00:20:42,576 -కొలంబియా! యాహూ! -కొలంబియా, వచ్చేస్తున్నామోచ్! 322 00:20:44,703 --> 00:20:48,207 బహియా సొలానో విమానాశ్రయం కొలంబియా 323 00:20:49,499 --> 00:20:51,126 -అదేనా? -కాదు. 324 00:20:51,210 --> 00:20:54,630 దేవుడా. అది ప్రమాదానికి గురైన విమానం. 325 00:20:55,923 --> 00:20:57,758 మన విమానం ఇక్కడే ఉండాలి, 326 00:20:57,841 --> 00:21:00,844 మనమింకా డబ్బు కట్టలేదు కనుక అది బయల్దేరనేలేదు. 327 00:21:00,928 --> 00:21:02,763 ఇప్పుడా పని చేద్దామని చూస్తున్నాం. 328 00:21:03,972 --> 00:21:05,057 అవును. 329 00:21:07,017 --> 00:21:08,018 బైకులు దిగాయి. 330 00:21:08,852 --> 00:21:11,271 ఇవిక్కడ భద్రమే. పోలీస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. 331 00:21:11,355 --> 00:21:14,107 సామానంతా అక్కడ దిగుతోంది. దాదాపు అంతా దిగిపోయింది... 332 00:21:14,191 --> 00:21:15,192 బహియా సొలానో 333 00:21:15,275 --> 00:21:18,278 ...విమానం వచ్చేవరకు మనకి నచ్చింది మనం చేయవచ్చు. 334 00:21:18,362 --> 00:21:20,197 కాబట్టి, మనకి రెండు గంటల సమయం ఉంది. 335 00:21:22,699 --> 00:21:26,537 నాకు తెలుసులే 336 00:21:26,620 --> 00:21:30,832 నువ్వెవరికో సొత్తని 337 00:21:30,916 --> 00:21:35,921 కానీ ఈ రాత్రి నువ్వు నాకే సొంతం 338 00:21:37,965 --> 00:21:43,095 ఈ రాత్రి నువ్వు నా సొంతం 339 00:21:51,103 --> 00:21:52,437 చాలా బాగుంది. 340 00:21:53,897 --> 00:21:58,110 రెండు నిమిషాలు అలా గడిచాయి. ఇంకో గంటా 58 నిమిషాలే బయల్దేరటానికి. 341 00:22:01,405 --> 00:22:03,490 అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక సముద్రతీరం ఉంది. 342 00:22:05,701 --> 00:22:08,829 ఎల్ వ్యాలీ కొలంబియా 343 00:22:17,671 --> 00:22:20,424 కొలంబియాలోని ఈ మారుమూల ప్రాంతాలకు రావటం గొప్పగా ఉంది. 344 00:22:20,507 --> 00:22:22,134 మళ్లీ ఎప్పుడైనా ఖచ్చితంగా రావాలని నాకుంది. 345 00:22:23,302 --> 00:22:25,429 ఆంటనొవ్ నుంచి ఏమైనా కబురు వచ్చిందా? బయల్దేరిందా? 346 00:22:26,221 --> 00:22:27,973 లేదు, ఇప్పుడే కనుక్కుంటాను. 347 00:22:28,056 --> 00:22:29,349 ఇక్కడకి వచ్చుండాలి కదా... 348 00:22:30,017 --> 00:22:31,351 -రెండు గంటల క్రితమే? -మూడు గంటల క్రితం. 349 00:22:35,939 --> 00:22:38,150 వచ్చేసింది. మనం వెళ్తే మంచిది. 350 00:22:50,287 --> 00:22:51,580 ఆంటనొవ్ 26బీ 351 00:22:51,663 --> 00:22:53,207 సరే, జారు బల్ల ఉంది. 352 00:22:53,290 --> 00:22:56,418 మేమేమో సముద్ర తీరంలో బీర్ తాగుతూ సేద తీరుతున్నాం, 353 00:22:56,502 --> 00:22:59,087 ఇటు ఆంటనొవ్ రానే వచ్చేసింది. 354 00:22:59,171 --> 00:23:02,174 ముందుగా వచ్చి చూసి ఉంటే బాగుండేది, కానీ పోనీలే. 355 00:23:02,674 --> 00:23:04,343 ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. 356 00:23:07,137 --> 00:23:08,138 అది. 357 00:23:14,353 --> 00:23:17,689 ఇవాళ అక్కడకి నేను ప్రయాణమై వెళ్ళవచ్చో లేదో నాకింకా తెలియదు. 358 00:23:17,773 --> 00:23:19,650 -త్వరపడితే మంచిది. -సాధ్యమేనా? 359 00:23:19,733 --> 00:23:20,776 సాధ్యమే. 360 00:23:20,859 --> 00:23:24,363 బగోటా నుండి అనుమతి తెచ్చుకోవాలి. త్వరగా బయల్దేరితే మంచిది. 361 00:23:30,160 --> 00:23:31,453 ఈ విమానం చాలా బాగుంది. 362 00:23:31,537 --> 00:23:33,997 సోవియట్ సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనం. 363 00:23:40,212 --> 00:23:41,421 బాంబ్ వేయండి. 364 00:23:42,631 --> 00:23:44,216 రష్యా చేసిన అత్యుత్తమ విమానం. 365 00:23:44,299 --> 00:23:48,637 కానీ విచిత్రం. యూరప్, అమెరికాల వాయుపరిధుల్లో ఎగరకూడదు. 366 00:23:50,347 --> 00:23:53,767 దాన్ని బట్టే కథంతా తెలుస్తోందిగా? 367 00:23:59,815 --> 00:24:03,360 ఇది నీకోసం. మూడు బైకులతో ఒంటరి ప్రయాణం చేస్తున్నావు... 368 00:24:04,486 --> 00:24:05,487 వేరేగా. 369 00:24:05,946 --> 00:24:08,866 మనం చేరగానే, బహుశా నువ్వు వాటితోనే ఉంటావు. 370 00:24:08,949 --> 00:24:09,950 మరియా గేబ్రియేలా స్థానిక నిర్మాత 371 00:24:10,033 --> 00:24:11,994 కస్టమ్స్ మొదలైనవన్నీ చేస్తావు. 372 00:24:12,077 --> 00:24:15,539 ఆ జాకెట్ సాయం చేస్తుంది అనుకుంటున్నా నువ్వు తప్పిపోకుండా. 373 00:24:20,669 --> 00:24:23,755 నేను వాళ్ళతో ఇమ్మిగ్రేషన్ పని చేయబోతున్నాను... 374 00:24:25,132 --> 00:24:27,843 ఇమ్మిగ్రేషన్ పని అయిపోగానే, 375 00:24:27,926 --> 00:24:30,220 రాత్రికి పనామా సిటీకి వెళ్లిపోతాము. 376 00:24:43,567 --> 00:24:47,446 మెడెల్లిన్ విమానాశ్రయం కొలంబియా 377 00:24:50,532 --> 00:24:51,533 అలా ఉండకు. 378 00:24:51,617 --> 00:24:53,368 ఒకసారి చెప్తా వినండి. నేను ఇక్కడ... 379 00:24:53,452 --> 00:24:55,621 -కనుక నేను... అవును. -వీళ్ళతో ఉంటాను. 380 00:24:55,704 --> 00:24:58,123 కస్టమ్స్ కార్యాచరణ పూర్తయ్యే వరకు కలిసుండవచ్చు. 381 00:24:58,207 --> 00:24:59,791 ఇమ్మిగ్రేషన్ కు మాత్రం ఒక్కడివే వెళ్ళాలి. 382 00:24:59,875 --> 00:25:01,960 -సరే, మంచిది. -పద ఇవాన్. 383 00:25:07,007 --> 00:25:09,134 కస్టమ్స్ పని అవ్వటానికి 40 నిమిషాలుంది. 384 00:25:15,724 --> 00:25:17,893 దాన్ని బస్ లో పెట్టారు. 385 00:25:20,854 --> 00:25:22,105 బైకుల సంగతేమిటి? 386 00:25:22,189 --> 00:25:23,482 కస్టమ్స్ దగ్గరకు వెళ్ళే ముందు అవి దింపాలా? 387 00:25:23,565 --> 00:25:24,566 అవును. 388 00:25:24,650 --> 00:25:26,485 మూడిటినీ దింపి మళ్లీ ఎక్కించాలా? 389 00:25:26,568 --> 00:25:27,611 అది రేపు. 390 00:25:30,113 --> 00:25:31,740 రేపా? 391 00:25:31,823 --> 00:25:33,534 ఇప్పుడు బయల్దేరట్లేదా? 392 00:25:33,617 --> 00:25:35,118 సరే, నన్ను మాట్లాడనీ. 393 00:25:37,496 --> 00:25:39,456 ఈ రాత్రి నేను ఎక్కడకీ వెళ్ళేలా లేను. 394 00:25:41,625 --> 00:25:42,751 కొంచెం నిర్లిప్తంగా ఉంది. 395 00:25:43,544 --> 00:25:45,045 -వెళ్ళటానికి చాలా సిద్ధమయ్యావు. -అవును. 396 00:25:45,128 --> 00:25:46,672 "వెళ్ళొస్తానర్రా, సెలవు" అనేశావు. 397 00:25:46,755 --> 00:25:49,591 వీడ్కోలు వాక్యాలన్నీ అనేశాను. ఇప్పుడు ఏదోలా ఉంది. 398 00:25:54,221 --> 00:25:57,975 మెడెల్లిన్ కొలంబియా 399 00:26:00,018 --> 00:26:02,938 ఇక్కడ ఒంటరిగా ఉండిపోయాను. ఒంటరిగా. 400 00:26:03,021 --> 00:26:04,022 డైరీ క్యామ్ 401 00:26:05,190 --> 00:26:08,819 మొదటి రోజు విమానాశ్రయం పక్కనే ఉన్న హోటల్లో నిద్ర లేచాను 402 00:26:08,902 --> 00:26:11,530 నిన్న రాత్రి బైక్స్ కి సంబంధించిన కాగితాల పనంతా చేసిన చోట 403 00:26:11,613 --> 00:26:14,533 వాటితో పనామా నగరానికి వెళ్ళకూడదని... 404 00:26:15,242 --> 00:26:16,243 ఆపిన తర్వాత. 405 00:26:16,326 --> 00:26:17,911 కనుక రాత్రి వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పేశాను, 406 00:26:17,995 --> 00:26:19,913 అదో రకంగా అనిపిస్తోంది... 407 00:26:20,622 --> 00:26:21,790 ఇలా ఒంటరిగా ఉండటం. 408 00:26:22,708 --> 00:26:25,252 ఈరోజు ఎలాగైనా పనామా సిటీ వెళ్లిపోవాలి, 409 00:26:25,335 --> 00:26:27,838 అక్కడ నుండి డ్రైవ్ చేస్తూ కోస్టా రికా వెళ్తాను 410 00:26:27,921 --> 00:26:29,631 శాన్ హోసే లో హార్లీ భాగాలను తీసుకోవటానికి. 411 00:26:29,715 --> 00:26:30,716 శాన్ హోసే - పనామా సిటీ - మెడెల్లిన్ 412 00:26:30,799 --> 00:26:34,511 చార్లీ, సిబ్బంది పౌర విమానంలో రాత్రి పనామా సిటీకి బయల్దేరుతారు, 413 00:26:34,595 --> 00:26:37,097 నా బైక్ నేను బిగించుకుంటున్నప్పుడు, అతను కోస్టా రికాకు బైక్ పై వెళ్తాడు. 414 00:26:37,181 --> 00:26:38,182 కోస్టా రికా - పనామా - బోర్డర్ క్రాసింగ్ 415 00:26:38,724 --> 00:26:41,643 మెడెల్లిన్ విమానాశ్రయం కొలంబియా 416 00:26:41,727 --> 00:26:45,355 కోస్టా రికా సరిహద్దుకు అతి చేరువలోకి రాత్రికి వెళ్తావని ఆశిస్తున్నాను. 417 00:26:45,439 --> 00:26:46,440 -అవును. -అవును. 418 00:26:46,523 --> 00:26:48,108 అంతా బాగా జరిగితే... ఏమో. 419 00:26:48,192 --> 00:26:50,027 ఇలాంటివన్నీ మనం అనుకునే కంటే ఎక్కువ సేపు పడతాయి. 420 00:26:50,110 --> 00:26:51,945 గత రాత్రి లాగా, మనం అనుకున్నాం... 421 00:26:52,029 --> 00:26:54,656 ఒక్క నిమిషం అనుకున్నాం 6:30 విమానం ఎక్కేస్తానని, కానీ... 422 00:26:55,115 --> 00:26:56,158 అవును. 423 00:26:56,241 --> 00:26:57,242 హే, ఇవాన్. 424 00:26:58,285 --> 00:26:59,995 -అది కార్గో కదా? -తప్పు చోటు, అవును. 425 00:27:01,163 --> 00:27:02,247 వచ్చేశాం. 426 00:27:02,706 --> 00:27:04,583 బైక్స్ అయిపోయాయి. 427 00:27:05,918 --> 00:27:07,211 పైలట్లు వచ్చేశారు. 428 00:27:08,045 --> 00:27:09,505 విమాన సిబ్బంది అంతా వచ్చారు. 429 00:27:10,214 --> 00:27:13,342 మాదక ద్రవ్య అధికారుల చేత బైక్స్ తనిఖీ చేయించుకోవాలి, 430 00:27:13,425 --> 00:27:15,427 అప్పుడు పనామా సిటీకి బయల్దేరాలి. 431 00:27:25,103 --> 00:27:26,897 కుక్క దాని పని అది చేస్తోంది. 432 00:27:26,980 --> 00:27:29,983 అలా బైక్ లో ప్రతి మూలనీ వాసన చూడటం అద్భుతమైన విషయం, 433 00:27:30,067 --> 00:27:32,903 బైక్ చక్రాలు, ఎంజిన్ల పైన, కింద ముక్కు ఆడించి చూడటం కూడా. 434 00:27:32,986 --> 00:27:33,987 మొత్తం చూస్తోంది. 435 00:27:35,030 --> 00:27:38,283 క్లాడియో యొక్క నవ్వే లామా తో ఆడటానికి ఇష్టపడలేదు. 436 00:27:42,287 --> 00:27:44,831 ఆ పోలిస్ అధికారులు, మాదక ద్రవ్యాల అధికారులకి 437 00:27:44,915 --> 00:27:49,336 బైక్స్ లో, బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు లేవని ఖరారైనట్టుంది, 438 00:27:49,419 --> 00:27:51,004 కాబట్టి వాటిని చుట్టేస్తున్నారు. 439 00:27:51,922 --> 00:27:54,633 ఇక నేను వెళ్లి విమానాశ్రయంలో పాస్పోర్ట్ క్లియర్ చేసుకోవాలి. 440 00:27:56,885 --> 00:28:00,556 కార్గోతో అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా విమానంలో వెళ్ళటానికి నాకు ఒకటే దారి, 441 00:28:00,639 --> 00:28:02,558 విమాన సిబ్బందిలో ఒకడిని అవ్వటమే. 442 00:28:02,641 --> 00:28:03,642 ఇవాన్ మెక్ గ్రెగర్ 443 00:28:03,725 --> 00:28:05,018 ఇప్పుడే నాకు గుర్తింపు వచ్చింది, 444 00:28:05,102 --> 00:28:08,146 కనుక ఇప్పుడు అధికారికంగా నేను ఈ విమాన సిబ్బందికి నాయకుడిని. 445 00:28:08,605 --> 00:28:09,606 ఆంటనొవ్ లో. 446 00:28:10,148 --> 00:28:13,193 విమాన సిబ్బందిలో అధికారిక సభ్యుడిని. 447 00:28:14,361 --> 00:28:17,197 సిబ్బంది సభ్యుడిగా ఉండాలి. కార్గో మాస్టర్ గా ఉండాలి. 448 00:28:26,123 --> 00:28:27,165 ధన్యవాదాలు. 449 00:28:31,962 --> 00:28:34,173 ఇంజన్లు మొదలుపెట్టండి. బయల్దేరుదాం. 450 00:28:37,009 --> 00:28:40,220 శాన్ హోసే కు బైక్ తీసుకువెళ్లి మరలా దాన్ని రోడ్డుపైకి తేవటానికి ఉత్సాహంగా ఉన్నాను, 451 00:28:40,304 --> 00:28:43,765 కానీ కొలంబియా, పనామాలో మిగిలినదంతా చూడలేదని బాధగా ఉంది. 452 00:28:50,522 --> 00:28:51,940 అంతా బాగా జరగాలి, ఇవాన్. 453 00:28:52,941 --> 00:28:54,151 కొలంబియాను విడిచిపెట్టే ముందు, 454 00:28:54,234 --> 00:28:56,612 మెడెల్లిన్ అంతా చూడాలని బాగా అనిపిస్తోంది. 455 00:28:58,238 --> 00:28:59,323 అయితే ఎక్కడకి వెళ్తున్నాం? 456 00:28:59,406 --> 00:29:02,743 కమోనా 13 అనే పరిసర ప్రాంతానికి వెళ్తున్నాము, 457 00:29:02,826 --> 00:29:05,662 అది 80 లలో చాలా ప్రమాదకర ప్రాంతంగా ఉండేది. 458 00:29:05,746 --> 00:29:09,166 మాదక ద్రవ్యాల సంస్కృతిలో వచ్చిన సానుకూల శాశ్వత మార్పులకు... 459 00:29:09,249 --> 00:29:11,168 -నిలువెత్తు నిదర్శనం. -అవును. 460 00:29:11,251 --> 00:29:14,171 ప్రజా మౌలిక వ్యవస్థ మీద దృష్టి పెట్టినప్పుడు... 461 00:29:14,254 --> 00:29:15,255 మెడెల్లిన్ 462 00:29:15,339 --> 00:29:17,341 ...అది ఈ ప్రాంతంలోని, అలాగే అన్ని ప్రాంతాలలోని మనుషుల 463 00:29:17,424 --> 00:29:18,926 మనస్సును మార్చింది అన్నదానికి కూడా నిదర్శనం. 464 00:29:20,052 --> 00:29:23,889 పాబ్లో ఎస్కోబార్ లాంటి వాళ్ళ హయాంలో డిస్ట్రిక్ట్ 13 కు 465 00:29:23,972 --> 00:29:26,308 అసలు రాకపోకలే నిషిద్ధమని విన్నాను. 466 00:29:26,975 --> 00:29:32,189 2002 చివరలో, ఆ ప్రాంతం ఖాళీ చేయించటానికి పోలీసులు ట్యాంకులతో చొరబడి 467 00:29:32,272 --> 00:29:34,233 మొత్తానికి ఆ యుద్ధానికి చరమగీతం పాడారు. 468 00:29:38,445 --> 00:29:40,697 నేను కావాలంటే అలా చేయగలను. 469 00:29:43,867 --> 00:29:46,245 ఇప్పుడది ప్రసిద్ధ విహార యాత్రా స్థలం. 470 00:29:46,328 --> 00:29:50,374 ఆశా సంకేతాలను, కుడ్యచిత్రాలను చూడటానికి జనం రెక్కలు కట్టుకొని వాలుతుంటారు. 471 00:29:52,209 --> 00:29:55,254 ఈ ప్రాంతంలో ముఖ్యమైన గ్రాఫిటీలలో ఇదొకటి. 472 00:29:56,755 --> 00:29:59,424 ఈ కుడ్య చిత్రం కమూనాలో జరిగిన ఒక ముఖ్య సన్నివేశానికి చిహ్నం... 473 00:29:59,508 --> 00:30:00,509 యెస్గ్రాఫ్ కళాకారుడు 474 00:30:00,592 --> 00:30:02,845 ...అదే, ఆపరేషన్ ఒరియన్. 475 00:30:02,928 --> 00:30:07,599 మెడెల్లిన్ లో జరిగిన అతిపెద్ద సైనిక ఆపరేషన్లలో అది ఒకటి, 476 00:30:07,683 --> 00:30:13,021 ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరు సందర్శిస్తున్న ఈ వీధుల్లో జరిగింది. 477 00:30:13,105 --> 00:30:14,314 వావ్, అద్భుతం. 478 00:30:16,525 --> 00:30:20,153 ఇక్కడి కొండలు ఎంత నిటారుగా ఉంటాయంటే ఇళ్ళకు వెళ్ళటానికి, రావటానికి 479 00:30:20,237 --> 00:30:24,283 ఇక్కడి జనానికి వీలుగా ఉండటానికి ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. 480 00:30:24,366 --> 00:30:26,034 ఈ విద్యుత్ మెట్లు, 481 00:30:26,118 --> 00:30:29,246 ప్రపంచంలో ఇలాంటి చోట ఉన్న విద్యుత్ మెట్లన్నింటిలో ప్రత్యేకమైనవి. 482 00:30:29,329 --> 00:30:30,747 స్లమ్ లాంటి చోట. 483 00:30:31,206 --> 00:30:33,542 అయితే ఇక్కడకి వస్తున్న యాత్రికులకు ఇదే ఆకర్షణ. 484 00:30:33,625 --> 00:30:34,626 అవును. 485 00:30:34,710 --> 00:30:35,711 ఆర్నాల్డో గైడ్ 486 00:30:35,794 --> 00:30:38,130 కనుక దాని ద్వారా వచ్చే ఆదాయంతో 487 00:30:38,213 --> 00:30:41,091 ఈ ప్రాంతం అభివృద్ధి జరిగి ఉంటుంది అనుకుంటా. 488 00:30:41,175 --> 00:30:43,093 -అవును. ఖచ్చితంగా. -బాగుంది. 489 00:30:44,511 --> 00:30:48,140 బిల్ క్లింటన్ కొలంబియా పర్యటనకు వచ్చి ఇక్కడకి రావటం ప్రసిద్ధికెక్కింది. 490 00:30:48,223 --> 00:30:50,350 అలా వచ్చిన ఏకైక అమెరికన్ అధ్యకుడు ఆయనే. 491 00:30:51,727 --> 00:30:54,479 ప్రపంచపు అతి ప్రమాదకరమైన నగరాల్లో ఒకటి అన్న స్థితి నుంచి 492 00:30:54,563 --> 00:30:58,775 ఇలా మారగలగటం మా కొలంబియన్లందరికీ గొప్ప ఆదర్శం. 493 00:30:58,859 --> 00:31:00,402 కళలు, సంస్కృతిపై పెట్టే పెట్టుబడి... 494 00:31:00,485 --> 00:31:01,778 కళకు మద్ధతు ఇవ్వండి... 495 00:31:01,862 --> 00:31:04,448 ...మొత్తం సమాజాన్ని మార్చగలదని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. 496 00:31:04,531 --> 00:31:05,824 ఇదే దానికి తార్కాణం. 497 00:31:11,997 --> 00:31:15,334 పనామా సిటీ విమానాశ్రయం పనామా 498 00:31:20,422 --> 00:31:23,008 మధ్య అమెరికాకు తడి స్వాగతం చెప్తోంది. 499 00:31:30,390 --> 00:31:33,352 బైకులు ర్యాంప్ మీదుగా ఈ ప్యాలెట్ల పైకి ఎక్కుతాయి, 500 00:31:33,435 --> 00:31:36,688 వాటి మీదే కస్టమ్స్ దగ్గరకు తీసుకువెళ్ళబడతాయి. 501 00:31:36,772 --> 00:31:37,898 అది నాకు తెలియదు. 502 00:31:42,361 --> 00:31:44,821 వర్షం పడుతోంది, వేడిగా, జిడ్డుగా ఉంది. 503 00:31:45,697 --> 00:31:48,450 నీ బైక్ వెళ్లిపోతోంది, చార్లీ. నేను దాన్ని కాపాడలేకపోయాను. 504 00:31:49,243 --> 00:31:51,245 నేను చేయగలిగింది అంతా చేశాను. 505 00:31:57,209 --> 00:31:58,210 చార్లీ? 506 00:31:58,710 --> 00:32:01,755 నేను బాగానే ఉన్నాను. దాటగలిగాను ఇప్పుడే. ఇప్పుడే దాటేశాను. 507 00:32:02,339 --> 00:32:05,217 నేను ఇమ్మిగ్రేషన్ ను దాటాల్సి వచ్చింది, కానీ దాని కోసం... 508 00:32:05,300 --> 00:32:08,554 అధికారిక విమాన సిబ్బందిలో సభ్యుడిని అవ్వాల్సి వచ్చింది. 509 00:32:08,637 --> 00:32:10,514 కనుక నాకొక బ్యాడ్జ్ వచ్చింది. 510 00:32:10,597 --> 00:32:13,308 అంతా బాగానే ఉంది. బైకులకి ఏమీ కాలేదు. 511 00:32:13,392 --> 00:32:15,644 దాన్ని కుదిరినంత త్వరగా అక్కడకి తీసుకెళ్ళాలని నా ఆరాటం, 512 00:32:15,727 --> 00:32:16,895 తద్వారా దాన్ని వాళ్లు బాగుచేయవచ్చు. 513 00:32:20,566 --> 00:32:23,443 హార్లీ ఇంజనీర్లను కలవాలంటే 500 మైళ్ళు ప్రయాణం చేయాలి, 514 00:32:23,527 --> 00:32:26,238 వాళ్ళు ఈ బైక్ ను మళ్లీ దారిలో పెట్టగలరని ఆశ. 515 00:32:27,990 --> 00:32:30,242 పనామా సిటీ పనామా 516 00:32:31,368 --> 00:32:33,704 ఈరోజు ఇవాన్ కోస్టా రికాకు వెళ్తుండగా, 517 00:32:33,787 --> 00:32:35,664 నేను పనామా సిటీకి చేరాను. 518 00:32:35,747 --> 00:32:38,458 నేను నా బైకును తీసుకున్నాను, ఇక్కడ సందర్శించాలి అనుకుంటున్నాను. 519 00:32:39,334 --> 00:32:42,337 ముఖ్యంగా ఇక్కడ ప్రసిద్ధమైన కాలువను. 520 00:32:52,723 --> 00:32:53,724 వావ్. 521 00:32:54,474 --> 00:32:55,601 చాలా పెద్దది. 522 00:32:56,268 --> 00:32:58,478 చాలా చాలా పెద్దది. 523 00:33:10,407 --> 00:33:12,284 ఈ కాలువ దగ్గర దారి 524 00:33:12,367 --> 00:33:14,286 పసిఫిక్, అట్లాంటిక్ ల మధ్య వెళ్ళే ఓడలకు. 525 00:33:14,369 --> 00:33:15,370 పనామా సిటీ గటున్ లాక్స్ - మిరాఫ్లోరెస్ లాక్స్ 526 00:33:15,454 --> 00:33:16,455 కరీబియన్ సముద్రం పసిఫిక్ మహాసముద్రం 527 00:33:22,586 --> 00:33:23,962 నేను సంభ్రమాశ్చర్యలకు లోనయ్యాను. 528 00:33:24,046 --> 00:33:27,466 వంతెనపై ఇక్కడకు వచ్చి, ఈ చోటు చూస్తే, 529 00:33:27,549 --> 00:33:29,718 అత్యద్భుతంగా ఉంది. 530 00:33:29,801 --> 00:33:30,802 ఇల్యా ఎస్పినో డె మరోటా పనామా కాలువ 531 00:33:30,886 --> 00:33:32,054 అవును, అద్భుతమైనది. 532 00:33:32,137 --> 00:33:34,431 ఎన్ని ఓడలు దీని గుండా వెళ్ళగలవు? 533 00:33:34,515 --> 00:33:38,435 రోజుకు గరిష్ఠంగా 14 ఓడలు వెళ్ళగలిగేలా ఈ లాక్స్ ను రూపొందించారు. 534 00:33:38,519 --> 00:33:39,811 దాని విలువెంత? 535 00:33:39,895 --> 00:33:43,148 అలాంటి కంటైనర్ ఓడకి నిండా సామాను ఉంటే 1.2 మిలియన్ డాలర్లు. 536 00:33:43,232 --> 00:33:45,067 -ఒక కంటైనర్ కు. -1.2 మిలియన్ ఒకవైపు వెళ్ళటానికా? 537 00:33:45,150 --> 00:33:47,027 -అవును. ఒక వైపుకి. -ఒక వైపుకి. 538 00:33:47,903 --> 00:33:49,738 పనామాకి దీనివల్ల ఎంతో ఆదాయం. 539 00:33:49,821 --> 00:33:52,616 సామర్థ్యం పెంచటానికి ఈ లాక్స్ ను నిర్మించారు. 540 00:33:52,699 --> 00:33:58,038 5.5 బిలియన్ డాలర్ల ఖర్చుతో 2016 లో ప్రారంభించారు. 541 00:33:58,539 --> 00:34:01,625 ఇది మొదటి నుంచి మీ కింద జరిగిందన్నమాట. 542 00:34:01,708 --> 00:34:03,919 ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించిన నలుగురిలో నేను ఒకదాన్ని, 543 00:34:04,002 --> 00:34:07,172 2012 లో, నేను నిర్మాణానికి చీఫ్ ఇంజనీర్ ని అయ్యాను. 544 00:34:07,256 --> 00:34:08,257 కనుక ఆనందం అన్నమాట. 545 00:34:08,340 --> 00:34:11,134 ఈ రంగంలోకి వస్తున్న స్త్రీలను మీరెలా ప్రభావితం చేస్తారు? 546 00:34:11,217 --> 00:34:14,054 నా నియామకంపై అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు లేకపోలేదు. 547 00:34:14,137 --> 00:34:16,056 నేనొక గులాబీ రంగు తల టోపీ కొనుక్కున్నాను. 548 00:34:16,139 --> 00:34:18,433 దానికి చాలా పేరు వచ్చింది. 549 00:34:18,516 --> 00:34:21,436 అది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం జనానికి చెప్పాలని 550 00:34:21,520 --> 00:34:22,896 "నేను మహిళను, ఈ పని చేయగలను" అని. 551 00:34:22,980 --> 00:34:24,188 ఇప్పుడు పెద్ద విప్లవం జరుగుతోంది 552 00:34:24,273 --> 00:34:26,942 కార్పొరేట్ రంగంలో పైకి ఎదగాలని ప్రోత్సహిస్తూ. 553 00:34:27,484 --> 00:34:29,027 చాలా అధ్యయనాలు నిరూపించాయి 554 00:34:29,110 --> 00:34:33,364 వివిధ రకాల వ్యక్తులు నిర్ణయాధికారంలో ఉంటే ఆ రంగం వర్ధిల్లుతుందని. 555 00:34:33,447 --> 00:34:34,992 ఏం జరుగుతోంది? 556 00:34:35,074 --> 00:34:37,494 దాని అర్థం ఈ గేట్ తెరుచుకోబోతోందని, 557 00:34:37,578 --> 00:34:40,121 ఈ నౌక తదుపరి చెయిన్ వద్దకు వస్తుందని. 558 00:34:40,205 --> 00:34:43,292 రెండు చోట్లా నీటి ఉపరితలం సమానంగా ఉంది చూశారా? 559 00:34:43,375 --> 00:34:44,835 అద్భుతం! 560 00:34:45,627 --> 00:34:48,422 -దేవుడా, చాలా పెద్దది! -అవును! 561 00:34:50,799 --> 00:34:54,261 మొట్టమొదటి లాక్స్ కి వాడిన అదే సిద్ధాంతం అన్నమాట. 562 00:34:58,223 --> 00:34:59,224 వావ్. 563 00:34:59,308 --> 00:35:00,475 డిస్నీ! 564 00:35:01,602 --> 00:35:04,021 హలో. హలో చిన్నవాడా. 565 00:35:04,104 --> 00:35:05,439 మీరు ఎక్కడి వాళ్ళు? 566 00:35:05,522 --> 00:35:06,982 -లండన్. -లండనా? 567 00:35:07,065 --> 00:35:08,400 వావ్. సరే. 568 00:35:08,483 --> 00:35:09,985 ప్రపంచం చుట్టూ ఇంకోసారి తిరుగుతున్నారా? 569 00:35:10,068 --> 00:35:11,987 అవును. Long Way Up చేస్తున్నాం. 570 00:35:12,070 --> 00:35:13,906 విద్యుత్తు బైకుల మీద. 571 00:35:13,989 --> 00:35:15,240 -నమ్మగలవరా? -అద్భుతం. 572 00:35:15,324 --> 00:35:16,533 ఇప్పుడే మొదలుపెడుతున్నాం. 573 00:35:21,580 --> 00:35:24,875 ఏమి అద్భుతమైన చోటు. ఎంత ఆదర్శనీయ మహిళ. 574 00:35:25,584 --> 00:35:28,170 ఇంకా నేను కాలువను చూడటం అవ్వలేదు. 575 00:35:32,090 --> 00:35:38,680 చిరకాలంగా నా మనసులో ఉంది ఇది. 576 00:35:38,764 --> 00:35:41,308 మా నాన్న ఇక్కడ 'ద టైలర్ ఆఫ్ పనామా' అనే చిత్రం తీశారు. 577 00:35:41,391 --> 00:35:43,852 పియర్స్ బ్రోస్నన్, జేమీ లీ కర్టిస్ తో చేశారు. 578 00:35:43,936 --> 00:35:45,479 ఒక సన్నివేశం ఉంది... 579 00:35:45,562 --> 00:35:50,567 ఇక్కడ నీటిలో ఈత కొడుతుండగా పెద్ద ట్యాంకర్ పక్క నుంచి వెళ్తుంది. 580 00:35:50,651 --> 00:35:52,653 "నాన్నా, నేను పనామా వెళ్లిపోతున్నా" అన్నాను నేను. 581 00:35:52,736 --> 00:35:55,155 "అయితే ఈ సన్నివేశాన్ని నువ్వు మళ్లీ తీయాలి" అన్నారు. 582 00:35:55,822 --> 00:35:57,282 ఇప్పుడు ఇక్కడకి వచ్చాం. చూడండి... 583 00:35:57,366 --> 00:35:59,326 ఏంటి... ఏమిటిది, నా భుజం పైన? 584 00:35:59,409 --> 00:36:00,911 అంటే... ఏమో మరి. 585 00:36:06,416 --> 00:36:07,417 చాలా పెద్దది కదా? 586 00:36:10,546 --> 00:36:11,547 భయపడకు, చార్లీ. 587 00:36:13,340 --> 00:36:14,883 ఇది నీకోసమే, నాన్నా. 588 00:36:16,593 --> 00:36:18,303 ధన్యవాదాలు మా నాన్న అయినందుకు, 589 00:36:19,221 --> 00:36:23,892 ఈ సాహస యాత్రికుడికి ఆదర్శమైనందుకు. 590 00:36:24,351 --> 00:36:25,894 అంతా నీ నుంచే అబ్బింది, నాన్నా. 591 00:36:26,353 --> 00:36:27,354 సరే. 592 00:36:30,274 --> 00:36:31,275 దేవుడా! 593 00:36:37,948 --> 00:36:39,199 అది ఊహించలేదు! 594 00:36:47,165 --> 00:36:48,876 పుంటరినాస్ కోస్టా రికా 595 00:36:48,959 --> 00:36:51,211 చార్లీ పనామాలో ఎలా ఉన్నాడో. 596 00:36:51,295 --> 00:36:54,006 వాళ్ళ నాన్న ఆ చిత్రం తీసిన చోటుని సందర్శిస్తున్నాడని తెలుసు. 597 00:36:55,549 --> 00:36:58,218 కోస్టా రికాలో నేను నా సాహస యాత్రలో ఉన్నాను. 598 00:36:58,302 --> 00:37:00,137 నాకూ నా కుటుంబం గుర్తు వస్తోంది. 599 00:37:03,098 --> 00:37:06,351 నా నుండి దూరంగా ఉన్నావు 600 00:37:07,186 --> 00:37:09,813 కనపడనంత దూరాన ఉన్నావు 601 00:37:11,440 --> 00:37:13,066 శాన్ హోసేకు వెళ్ళాలని ఆరాటంగా ఉంది. 602 00:37:13,150 --> 00:37:16,945 బైక్ బాగుచేయడానికి మాత్రమే కాదు, నా కూతురు జమ్యాన్ ను చూడబోతున్నాను. 603 00:37:19,323 --> 00:37:20,532 ఈ కథ అప్పుడప్పుడూ చెప్తుంటాను 604 00:37:20,616 --> 00:37:24,828 ఎందుకంటే జీవితాన్ని మార్చేసే నిర్ణయం అన్నదానికి అది ఒక ఉదాహరణ. 605 00:37:24,912 --> 00:37:27,289 నా జీవితమే కాదు. జమ్యాన్ జీవితం కూడా 606 00:37:27,372 --> 00:37:30,250 నా కుటుంబం, తన సోదరి, తన తల్లి అందరి జీవితాలనూ అన్నమాట. 607 00:37:31,084 --> 00:37:32,419 Long Way Round మంగోలియా 2004 608 00:37:32,503 --> 00:37:36,423 మేము మంగోలియాలో ఉన్నప్పుడు, ఒక వారం గడిచింది. 609 00:37:36,507 --> 00:37:37,591 నాలుగైదు రోజులయ్యింది. 610 00:37:38,509 --> 00:37:41,762 మేము తడితో, మట్టితో ఇబ్బంది పడుతున్నాం, 611 00:37:41,845 --> 00:37:44,348 రోజుకి 20 మైళ్ళు వెళ్తున్నాం... 612 00:37:44,806 --> 00:37:45,807 అయితే అదే సమయంలో, 613 00:37:45,891 --> 00:37:48,143 మంగోలియా అందాన్ని ఆస్వాదిస్తున్నాం, 614 00:37:48,227 --> 00:37:51,355 అక్కడి జీవితంలోని సరళతను, 615 00:37:51,438 --> 00:37:53,065 అక్కడి ప్రజల జీవన విధానాన్ని కూడా, 616 00:37:53,148 --> 00:37:55,192 మైలేజ్ ను చూసి మాకు విసుగొచ్చేసింది, 617 00:37:55,275 --> 00:37:58,028 1000 మైళ్ళ దూరంలో ఉన్న ఉలాంబటార్ దిశగా వెళ్తున్నాం, 618 00:37:58,111 --> 00:38:00,781 అక్కడకి చేరుకుంటామో లేదో అన్న స్థితికి వచ్చేశాం. 619 00:38:00,864 --> 00:38:02,449 ఏది ముఖ్యమో ఏది కాదో తెలియని 620 00:38:02,533 --> 00:38:06,203 నీరస స్థితికి చేరుకున్నాం. 621 00:38:06,286 --> 00:38:09,289 ఇక మ్యాపులను తీసి, చూస్తున్నాం, 622 00:38:09,373 --> 00:38:10,374 నేను చెప్పాను. 623 00:38:10,457 --> 00:38:14,169 "చార్లీ, ఎడమ వైపుకు తిరిగితే ఒక్క రోజులో రష్యాలో ఉంటాం, 624 00:38:14,253 --> 00:38:16,421 మ్యాప్ లో ఉన్న ఆ రోడ్ ఎక్కేయచ్చు" అన్నాను. 625 00:38:16,880 --> 00:38:19,758 ఎడమ వైపుకు వెళ్ళాలా, తిన్నగా వెళ్లిపోవాలా అని ఆలోచనలో పడ్డాం. 626 00:38:20,551 --> 00:38:22,135 నాకు గుర్తుంది. డేవిడ్ ని పిలిచి... 627 00:38:22,219 --> 00:38:23,220 సపోర్ట్ టీమ్ తో శాటిలైట్ ఫోన్ లో 628 00:38:23,303 --> 00:38:25,889 అతను ఫోన్లో దొరకగానే అన్నాను, "చూడు, ఎడమ వైపుకి తిరిగి 629 00:38:25,973 --> 00:38:29,017 మంగోలియా నుంచి బయట పడాలనుకుంటున్నాం" అన్నాను. ఉలంబటార్ ను మిస్సయ్యేవాళ్ళం. 630 00:38:29,101 --> 00:38:32,479 డేవిడ్ ఆధ్యాత్మికంగా ఆలోచించాడు. 631 00:38:32,563 --> 00:38:34,606 మీకు నచ్చేదాన్ని వదులుకోకండి అన్నాడు. 632 00:38:34,690 --> 00:38:36,650 ఎందుకంటే ఇది జీవితంలో ఒక్కసారి జరిగేది, కనుక... 633 00:38:37,109 --> 00:38:38,110 నేను మీకు చెప్పేది అదే. 634 00:38:38,193 --> 00:38:40,612 అతని మాటలు వింటూనే నిజమనిపించాయి. 635 00:38:40,696 --> 00:38:43,740 కానీ విషయం ఏమిటంటే, ఇదొక పోరాటం, 636 00:38:43,824 --> 00:38:45,409 మనం సలుపుతూనే ఉండాలి. 637 00:38:46,410 --> 00:38:49,162 మేము తిన్నగానే వెళ్ళాము. ఉలంబటార్ చేరాము. 638 00:38:49,246 --> 00:38:50,455 వీధి బాలలకు ప్రభుత్వ గృహము, ఉలంబటార్ 639 00:38:50,539 --> 00:38:52,958 చార్లీ, నేను కలసి వీధి బాలల రక్షణా గృహానికి వెళ్ళాము. 640 00:38:55,502 --> 00:38:57,212 అది చూసి మేము కదలిపోయాము. 641 00:38:58,255 --> 00:38:59,339 అక్కడ అంత చిన్నపిల్లలు 642 00:38:59,423 --> 00:39:01,800 ఉంటారని నేను ఏమాత్రం ఊహించలేదు. 643 00:39:01,884 --> 00:39:03,635 రెండేళ్ళ ఆడపిల్లలు కూడా ఉన్నారు. 644 00:39:04,887 --> 00:39:07,806 రెండు వారాల క్రితం దొరికిన ఈ బుజ్జి పాప... 645 00:39:07,890 --> 00:39:08,891 జమ్యాన్ వయసు 3 646 00:39:08,974 --> 00:39:10,684 ...ఈ అమ్మాయితో మాత్రమే మాట్లాడుతుంది. 647 00:39:10,767 --> 00:39:13,020 వాళ్ళ మధ్య ఏదో బంధం అల్లుకున్నట్లుంది. 648 00:39:13,687 --> 00:39:15,105 ఆరోజు అక్కడ నుండి వచ్చేశాము, 649 00:39:15,189 --> 00:39:17,733 కానీ నేను ఆ పాపని మరచిపోలేకపోయాను. 650 00:39:17,816 --> 00:39:21,612 రెండేళ్ళు పట్టింది కానీ, మొత్తానికి జమ్యాన్ ని దత్తత తీసుకున్నాము. 651 00:39:24,198 --> 00:39:26,867 కనుక, జీవితంలో ఆ నిర్ణయం ఎలాంటిదంటే... 652 00:39:26,950 --> 00:39:28,619 వెనక్కి తిరిగి చూసుకొని, 653 00:39:28,702 --> 00:39:29,745 "అలా జరిగుంటే... 654 00:39:30,746 --> 00:39:33,457 అలా చేసుంటే మొత్తం వేరేగా ఉండేది" అన్నట్టు. 655 00:39:35,375 --> 00:39:38,337 మేము ఎడమ వైపుకు తిరిగి ఉంటే నేను తనని కలిసేవాడినే కాదు. 656 00:39:38,795 --> 00:39:39,963 కనుక అదొక అద్భుతమైన విషయం. 657 00:39:43,091 --> 00:39:44,092 క్షమించండి. 658 00:39:45,511 --> 00:39:48,013 అదొక గొప్ప క్షణం. సరదాగా కూడా అదో ముఖ్యమైన క్షణం. 659 00:39:56,688 --> 00:39:57,689 శాన్ హోసే కోస్టా రికా 660 00:39:57,773 --> 00:40:00,901 కొన్ని నెలల ప్రయాణం తర్వాత, జమ్యాన్ ను ఇంకో రెండు రోజుల్లో కలవబోతున్నా 661 00:40:00,984 --> 00:40:02,903 సమయానికి నా బైక్ బాగుపడితే చాలు. 662 00:40:03,946 --> 00:40:04,947 డెలివరీ! 663 00:40:05,948 --> 00:40:07,533 -ఎలా ఉన్నారు? -మిమ్మల్ని కలవటం సంతోషం. 664 00:40:07,616 --> 00:40:09,284 -తను కేలీ. -హాయ్ కేలీ. ఎలా ఉన్నారు? 665 00:40:09,368 --> 00:40:10,452 మిమ్మల్ని కలవటం బాగుంది. 666 00:40:12,788 --> 00:40:16,375 రేచల్, కేలీ మిల్వాకీ లోని హార్లీ-డేవిడ్సన్ నుంచి 667 00:40:16,458 --> 00:40:17,668 బైక్ ను బాగుచేయటానికి వచ్చారు. 668 00:40:18,168 --> 00:40:19,920 ఏమి జరగబోతోందో వివరించండి. 669 00:40:20,003 --> 00:40:22,589 ఫ్రేమ్, స్వింగ్ ఆర్మ్ తీసేయబోతున్నాం... 670 00:40:22,673 --> 00:40:23,674 కేలీ హార్లీ-డేవిడ్సన్ 671 00:40:23,757 --> 00:40:26,134 ...ఇక అది ఈవీపీటీ నుంచి వేరవుతుంది. 672 00:40:27,010 --> 00:40:28,303 అలాగే. 673 00:40:28,387 --> 00:40:29,680 అయ్యయ్యో. 674 00:40:42,818 --> 00:40:43,944 నేను ఒక చక్రం బండిని నడపగలను. 675 00:40:44,027 --> 00:40:45,028 రేచల్ హార్లీ-డేవిడ్సన్ 676 00:40:45,112 --> 00:40:46,864 ఎక్కువ దూరం కాకపోయినా, నడపగలను. 677 00:40:46,947 --> 00:40:48,615 చాలా భయంగా ఉంది. 678 00:40:53,662 --> 00:40:55,038 దేవుడా. 679 00:40:58,709 --> 00:41:01,628 మనిషికి శస్త్ర చికిత్స జరుగుతుంటే చూసినట్టుంది. బాగుంది. 680 00:41:01,712 --> 00:41:02,713 Long Way Up 681 00:41:02,796 --> 00:41:04,965 అలా విడి అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. 682 00:41:05,924 --> 00:41:08,385 బైక్ అలా భాగాలుగా విప్పుతుంటే అద్భుతంగా ఉంది 683 00:41:08,468 --> 00:41:10,095 ఇప్పుడిక మనం రాత్రంతా కష్టపడి 684 00:41:10,179 --> 00:41:11,638 అన్ని భాగాలు కలపాలి, 685 00:41:11,722 --> 00:41:13,849 అంతా బాగుంటే రేపటికి రోడ్ ఎక్కేయవచ్చు. 686 00:41:16,727 --> 00:41:17,728 చికీరీ పనామా 687 00:41:17,811 --> 00:41:19,563 ఇవాన్ బైక్ ని బాగుచేయించుకుంటూ ఉంటే, 688 00:41:19,646 --> 00:41:22,149 నాకు ఈ అసామాన్యమైన వ్యక్తి గురించి తెలిసింది. 689 00:41:23,233 --> 00:41:25,736 పచాంగా, అవును. పచాంగా, పచాంగా. 690 00:41:25,819 --> 00:41:26,904 ఇతను పచాంగా. 691 00:41:26,987 --> 00:41:27,988 పచాంగా స్థానికుడు 692 00:41:28,071 --> 00:41:30,949 ఇతని వయసు 85 ఏళ్ళు, ఇంకా మోటర్ బైక్ నడుపుతుంటాడు. 693 00:41:31,033 --> 00:41:32,492 -అద్భుతం. -అవును. 694 00:41:32,576 --> 00:41:33,577 హార్లీ-డేవిడ్సన్ 695 00:41:33,660 --> 00:41:35,454 వావ్! మీ దగ్గర గొప్ప వస్తువులు ఉన్నాయే. 696 00:41:37,456 --> 00:41:39,666 పెరుగుతున్నప్పుడు వీటిలో కొన్ని పోస్టర్లు చూడటం గుర్తుంది. 697 00:41:39,750 --> 00:41:41,126 -అవును, కదా? -అవును. 698 00:41:41,210 --> 00:41:43,670 హార్లీ-డేవిడ్సన్ పై మీకు ఎప్పటినుంచి ఆసక్తి? 699 00:41:43,754 --> 00:41:47,257 14 ఏళ్ళ వయసులో ఒక మామయ్య ఉండేవాడు. 700 00:41:47,341 --> 00:41:49,635 తనకొక ఆటోమొబైల్ దుకాణముండేది. 701 00:41:50,093 --> 00:41:53,847 ఒక హార్లీ ఉండేది. కానీ 1940 ల కాలం నాటిది. 702 00:41:53,931 --> 00:41:55,974 అంచు వరకు నడపటం నేర్పాడు తను. 703 00:41:56,475 --> 00:41:59,478 ఆరోజు నుంచి హార్లీ-డేవిడ్సన్ వ్యసనం పట్టుకుంది. అవును. 704 00:41:59,561 --> 00:42:01,730 -వావ్! -అవును. 705 00:42:01,813 --> 00:42:03,732 చాలా అందంగా ఉంది. 706 00:42:05,400 --> 00:42:08,153 ఇదిగోండి. స్టార్టవుతుందో లేదో చూద్దాం. 707 00:42:11,490 --> 00:42:12,574 హార్లీ-డేవిడ్సన్ 708 00:42:12,658 --> 00:42:14,785 -వినండి. వినండి. -సరే. 709 00:42:18,956 --> 00:42:20,290 భలే ఉంది. భలే ఉంది. 710 00:42:26,630 --> 00:42:28,799 85 ఏళ్ళకి నేనూ అలా చేయగలగాలని ఆశిస్తున్నాను. 711 00:42:35,430 --> 00:42:37,599 రాత్రంతా కష్టపడి బైక్ ని బాగుచేసేశారు. 712 00:42:38,267 --> 00:42:39,726 అమ్మయ్య. మరలా రోడ్డు ఎక్కుతున్నాను. 713 00:42:45,524 --> 00:42:47,192 ఈ బైక్ ఎంత బాగుందో. 714 00:42:51,029 --> 00:42:53,156 -సరే, మిత్రమా! -ఎలా ఉన్నావు మిత్రమా? 715 00:42:53,240 --> 00:42:55,117 ఇది చూడు. బైక్ చూడు. 716 00:42:55,701 --> 00:42:57,035 ఎలా ఉన్నారు, మిత్రులారా? 717 00:42:57,119 --> 00:42:58,120 నిన్ను చూడటం చాలా బాగుంది. 718 00:42:58,203 --> 00:43:00,497 అలా చుట్టూ తిరిగి వెళ్లు... అది ఈ భవనం వెనుక ఉంది. 719 00:43:00,581 --> 00:43:01,790 నా బైక్ ని గుర్తుపట్టటం తేలికే. 720 00:43:04,835 --> 00:43:06,170 అవును, వచ్చేశాం. 721 00:43:12,009 --> 00:43:15,971 సాహస యాత్రల సాహస యాత్రల్లో ఇంకో సాహస యాత్ర ఉంది. 722 00:43:16,638 --> 00:43:18,265 -హే! -అయ్యయ్యో. 723 00:43:18,348 --> 00:43:19,808 మిత్రమా, ఎలా ఉన్నావు? 724 00:43:20,267 --> 00:43:21,351 నిన్ను మిస్ అయ్యాను. 725 00:43:29,443 --> 00:43:32,946 నా తండ్రి కంగారుని వదిలేయాలి. 726 00:43:33,030 --> 00:43:35,324 తనని సిబ్బందితో కలవనిచ్చి, తనని... 727 00:43:35,407 --> 00:43:36,408 డైరీ క్యామ్ 728 00:43:36,491 --> 00:43:40,370 డాక్టర్ క్యారెన్ కు గానీ, జిమ్మీకి గానీ ఎవరికైనా సాయం చేయనివ్వాలి. 729 00:43:40,454 --> 00:43:44,833 నేను తండ్రిలా ఉన్నా కానీ, మరీ అతిగా ప్రవర్తించకుండా ఉండాలి. 730 00:43:44,917 --> 00:43:46,293 తనని... 731 00:43:46,376 --> 00:43:48,128 ఎదిగిన మనిషిలా ఉండనివ్వాలి... 732 00:43:51,882 --> 00:43:53,467 మళ్లీ బైక్ నడపటం చాలా బాగుంది, 733 00:43:53,550 --> 00:43:55,802 జమ్యాన్ ను కలవటానికి ఆరాటంగా ఉంది. 734 00:44:49,731 --> 00:44:51,733 ఉపశీర్షికలను అనువదించినది: రాంప్రసాద్