1 00:00:25,318 --> 00:00:27,237 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 2 00:00:27,320 --> 00:00:29,406 బాధ మరో రోజుకు 3 00:00:29,489 --> 00:00:31,491 సంగీతం ప్లే అవనివ్వండి 4 00:00:31,575 --> 00:00:33,410 ఫ్రాగుల్ రాక్ వద్ద 5 00:00:33,493 --> 00:00:35,704 మీ బాధలను మర్చిపోండి 6 00:00:35,787 --> 00:00:37,747 డాన్సు మరో రోజుకు 7 00:00:37,831 --> 00:00:39,374 ఫ్రాగుల్స్ ని పాడనివ్వండి 8 00:00:39,457 --> 00:00:40,417 -మేము గోబో. -మోకీ. 9 00:00:40,500 --> 00:00:41,334 -వెంబ్లీ. -బూబర్. 10 00:00:41,418 --> 00:00:42,419 రెడ్. వూ 11 00:00:45,755 --> 00:00:47,215 జూనియర్! 12 00:00:47,299 --> 00:00:48,633 హలో! 13 00:00:50,218 --> 00:00:51,344 ఆ. నా ముల్లంగి. 14 00:00:52,470 --> 00:00:54,431 మీ బాధలను మర్చిపోయి డాన్స్ చేయండి 15 00:00:54,514 --> 00:00:56,558 బాధ మరో రోజుకు 16 00:00:56,641 --> 00:00:58,643 సంగీతం ప్లే అవనివ్వండి 17 00:00:58,727 --> 00:01:02,147 ఫ్రాగుల్ రాక్ వద్ద ఫ్రాగుల్ రాక్ వద్ద 18 00:01:02,731 --> 00:01:04,148 ఫ్రాగుల్ రాక్ వద్ద. 19 00:01:12,741 --> 00:01:15,035 యాహూ! గుడ్ మార్నింగ్, ఫ్రాగుల్ రాక్. 20 00:01:15,118 --> 00:01:18,538 సరే. చాలా పని ఉంది. బోలెడన్ని సమస్యలను పరిష్కరించాలి. 21 00:01:18,622 --> 00:01:22,834 డూజర్లు ఎక్కడ పడితే అక్కడ నిర్మిస్తున్నారు, నీళ్లు రావడం లేదు, 22 00:01:23,877 --> 00:01:29,424 నేను కాస్త వ్యాయామం చేస్తే మరింత చురుగ్గా పని చేయగలను, కాబట్టి... 23 00:01:31,760 --> 00:01:34,221 మంచిగా ఈత కొట్టి ఇవాళ్టిని ప్రారంభిస్తా. 24 00:01:34,304 --> 00:01:37,682 గాగుల్స్? ఉన్నాయి. టవల్? నా మెడ చుట్టూ ఉంది. 25 00:01:37,766 --> 00:01:40,310 నేను, బయటకి పోతున్నానా? ఒక్క క్షణం. 26 00:01:41,519 --> 00:01:44,731 ఉదయమే ఈత కొట్టడం కంటే మంచి పని ఇంకే ఉండదు. 27 00:01:44,814 --> 00:01:47,400 ఉదయమే ఈత కొట్టడం కంటే ఉత్తమం. యాహూ! 28 00:01:55,075 --> 00:01:58,954 నా రోజులో ఉత్తమమైన సమయం, ఇక్కడే... 29 00:02:02,040 --> 00:02:03,959 క్షమించు, రెడ్. 30 00:02:04,042 --> 00:02:05,043 దూకవద్దు. క్రింద చూడు! 31 00:02:05,794 --> 00:02:07,587 నీరు మొత్తం జిగటలా అయిపోయాయి! 32 00:02:08,754 --> 00:02:12,759 ఆ చెత్త డూజర్ స్టిక్స్ కరిగిపోయాయి. నువ్వు అందులో ఈత కొట్టలేవు. 33 00:02:14,803 --> 00:02:18,181 అలాగే ఇంకొక విషయం, నాకు ఒకరు ఈ విజిల్ ఇచ్చారు! 34 00:02:27,524 --> 00:02:29,693 హ. నేను అనుకున్నట్టే జరిగింది. 35 00:02:29,776 --> 00:02:33,113 ఆ డూజర్ స్టిక్స్ లో ఉన్న జిగట నీళ్లను పాడు చేసేసింది, 36 00:02:33,196 --> 00:02:34,823 కారణంగా మెర్గుల్స్ కి వెక్కిళ్లు వస్తున్నాయి. 37 00:02:37,409 --> 00:02:39,077 అది మనకు ముందే తెలుసుగా? 38 00:02:39,160 --> 00:02:43,039 అవును. కానీ నేను ఇవాళ నా డాక్టర్ బట్టలు వేసుకున్నా కాబట్టి అలా అన్నాను. 39 00:02:44,207 --> 00:02:46,293 నీ నిజాయితీకి ధన్యవాదాలు, బూబర్. 40 00:02:46,376 --> 00:02:50,505 కనీసం మేము ఇప్పుడు ఆ చెడ్డ నీళ్లలో లేము. 41 00:02:50,589 --> 00:02:51,464 అవును. 42 00:02:51,548 --> 00:02:55,927 నీ బట్టలు ఉతికే తొట్టెలో ఉండడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు, బూబర్. 43 00:02:56,011 --> 00:02:57,262 అదేం పర్వాలేదు. 44 00:02:58,138 --> 00:03:00,849 ఇవి నాకు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రియమైనవి అంతే. 45 00:03:01,474 --> 00:03:02,851 వాటిని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? 46 00:03:09,691 --> 00:03:12,527 సరే. మనం మెర్గుల్స్ ని భయపెడితే ఎలా ఉంటుంది, ఆహ్? 47 00:03:12,611 --> 00:03:14,863 మనం భయపెట్టి వాళ్ళ వెక్కిళ్ళను పోగొట్టోచ్చు. 48 00:03:15,572 --> 00:03:18,783 అద్భుతం! నా స్నేహితుడు ఒక మేధావి! 49 00:03:18,867 --> 00:03:21,161 -కాదు, నువ్వే మేధావివి. -కాదు, నువ్వే మేధావివి. 50 00:03:21,244 --> 00:03:22,954 -కాదు, నువ్వే మేధావివి! -నువ్వే. 51 00:03:23,038 --> 00:03:24,873 -నువ్వే. నువ్వే. -నువ్వే. నువ్వే. 52 00:03:24,956 --> 00:03:28,126 సరే. సరే! మీ ఇద్దరూ మేధావులే, సరేనా? 53 00:03:28,209 --> 00:03:29,753 -సరే. -ఇప్పడు, వెంబ్లీ. 54 00:03:29,836 --> 00:03:33,590 మనం ఇద్దరం వెళ్లి వాళ్ళను ఎలా భయపెట్టాలో ఆలోచిద్దాం, సరేనా? 55 00:03:33,673 --> 00:03:34,674 కచ్చితంగా! 56 00:03:35,175 --> 00:03:37,636 ముందుగా, ఆలోచిద్దాం అంటే ఏమిటి? 57 00:03:38,178 --> 00:03:39,679 ఇక్కడ మనకు కొత్తగా ఏం కనిపించడం లేదు కదా? 58 00:03:40,305 --> 00:03:41,765 ఓహ్, వావ్. 59 00:03:43,934 --> 00:03:46,519 హే, రెడ్! వామ్మో. ఎలా ఉన్నావు? 60 00:03:46,603 --> 00:03:48,605 నిజం చెప్పాలంటే, అంత గొప్పగా ఏం లేను. 61 00:03:48,688 --> 00:03:51,316 ఫ్రాగుల్ రాక్ లో చాలా సమస్యలు ఉన్నాయి. 62 00:03:51,399 --> 00:03:52,817 నాకు సహాయం చేయాలని ఉంది. 63 00:03:52,901 --> 00:03:55,320 కానీ నేను ఈత కొట్టిన తర్వాతే బాగా సహాయం చేయగలను. 64 00:03:55,403 --> 00:03:58,990 కానీ నీళ్లు పాడైపోవడం వల్ల ఇప్పుడు నేను ఈత కట్టలేను. 65 00:03:59,074 --> 00:04:02,452 నేను సహాయం చేయాలనుకుంటున్న సమస్యల్లో ఈ నీటి సమస్య కూడా ఒకటి. 66 00:04:02,535 --> 00:04:04,079 కానీ నేను ఈత కొట్టేంత వరకు సహాయం చేయలేను. 67 00:04:04,162 --> 00:04:06,998 దాంతో నేను ఈ విష చక్రంలో ఇరుక్కుపోయాను. 68 00:04:07,082 --> 00:04:09,459 రెడ్, నీకు ఎంతగా సహాయం చేయాలని ఉందో మాకు తెలుసు. 69 00:04:09,542 --> 00:04:12,087 సహాయం చేయలేకపోవడం చాలా బాధపెడుతుంది. 70 00:04:13,588 --> 00:04:16,382 కానీ నువ్వు నాకు మరొక సమస్యలో సహాయం చేయాలి. 71 00:04:16,466 --> 00:04:21,846 రెడ్, రెడ్, రెడ్. రెడ్, నువ్వు ఎన్నో రకాలైన భావోద్వేగాలకు నిలయం. 72 00:04:21,930 --> 00:04:23,890 మనకు సమస్యలు ఎక్కువే ఉన్నాయి, 73 00:04:23,974 --> 00:04:28,144 కానీ అది మనం కాస్త నెమ్మదించి విశ్రాంతి తీసుకోవాలని విధి మనకు నేర్పుతున్న పాఠమేమో. 74 00:04:29,396 --> 00:04:30,981 రిలాక్స్ అవ్వు... 75 00:04:31,481 --> 00:04:34,025 రిలాక్స్ అవ్వు. 76 00:04:34,609 --> 00:04:36,152 లేదు. అది నా వల్ల కాదు. 77 00:04:36,236 --> 00:04:38,947 బహుశా డైవింగ్ మాత్రమే నిన్ను ఉత్సాహపరిచేది కాదేమో. 78 00:04:39,030 --> 00:04:42,409 కొత్తగా ఏమైనా ట్రై చెయ్. కొత్తగా బోలెడన్ని ట్రై చేసేవాడు ఎవరో తెలుసా? 79 00:04:42,492 --> 00:04:45,829 -దయచేసి అంకుల్ మ్యాట్ అని మాత్రం అనకు. -అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్. నీకెలా తెలుసు? 80 00:04:45,912 --> 00:04:48,456 ఆయన రాసిన ఉత్తరాన్ని చదువుతా. అది మనకు సహాయపడొచ్చు. 81 00:04:49,082 --> 00:04:50,917 "ప్రియమైన గోబో అల్లుడా..." 82 00:04:51,001 --> 00:04:55,672 నిన్నటి రోజున, నేను ఈ అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నాను. 83 00:04:55,755 --> 00:04:57,799 అది చాలా సీరియస్ పని. 84 00:05:02,596 --> 00:05:03,889 అప్పుడే నేను వాటిని చూసాను. 85 00:05:03,972 --> 00:05:08,435 ప్రకృతిలో మనకు కనిపించే అత్యద్భుతమైనవి: పీచు ప్రాణులు. 86 00:05:08,518 --> 00:05:10,520 అవి చాలా ప్రశాంతంగా కనిపించాయి. 87 00:05:10,604 --> 00:05:14,524 నాకు కూడా తేలాలని ఉంది. అవును, అవును. 88 00:05:14,608 --> 00:05:18,111 అందుకే, నా యువ గోబో, ఆ రోజు నా అదృష్టం పండింది. 89 00:05:18,194 --> 00:05:21,948 నేను ఆ పీచు ప్రాణులను వాటి ప్రదేశంలోనే కలవడానికి మార్గం దొరికింది. 90 00:05:22,032 --> 00:05:26,244 అంటే, అంతకు మించి రిలాక్స్ అవ్వడానికి నీకు ఇంకేమైనా తడుతుందా, గోబో? 91 00:05:27,579 --> 00:05:28,580 కాపాడండి! 92 00:05:29,164 --> 00:05:33,543 ఎలాంటి సహాయం లేకుండా, నేను పీచు ప్రాణులతో కలిసి ఎగిరాను. 93 00:05:33,627 --> 00:05:34,628 నాకిది ఏం నచ్చలేదు! 94 00:05:34,711 --> 00:05:37,714 నాకది చాలా నచ్చింది, గోబో, నిజంగా నచ్చింది. 95 00:05:37,797 --> 00:05:39,716 అలాగే ఎప్పటికీ ఉండిపోతే బాగుండు అనుకున్నాను. 96 00:05:39,799 --> 00:05:42,677 ఆపాండ్రో. వేంటనే ఆపేయండి! 97 00:05:45,680 --> 00:05:48,475 ఆ రోజు మీ అంకుల్ మ్యాట్ కి విజయవంతమైన దినం. 98 00:05:48,558 --> 00:05:52,646 ఈ కథలో నీకు నేను చెప్పాలనుకునే నీతి ఏమిటంటే: 99 00:05:52,729 --> 00:05:55,398 కొత్త వాటిని ప్రయత్నించడానికి భయపడకు. 100 00:05:57,150 --> 00:05:58,985 "ప్రేమతో, నీ అంకుల్ ట్రావెలింగ్ మ్యాట్." 101 00:05:59,486 --> 00:06:03,031 హే, మీ అంకుల్ మ్యాట్ సరిగ్గా చెప్పారు. 102 00:06:03,114 --> 00:06:04,532 -ఏంటి? -ఏంటి? 103 00:06:04,616 --> 00:06:07,452 నేను ఈ మాట అంటున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను, కానీ ఆయన సరిగ్గా చెప్పారు. 104 00:06:07,535 --> 00:06:10,080 నా మనసును ప్రశాంతపరచుకోవడానికి ఈత ఒక్కటే మార్గం అయ్యుండదు. 105 00:06:10,163 --> 00:06:13,041 నాకు ఏదైనా ఒక కొత్త అలవాటు కావాలి. 106 00:06:14,084 --> 00:06:17,629 నేను మహోన్నత హాల్ నుండి జిప్-లైన్ దగ్గరకు వెళ్తున్నాను! 107 00:06:18,380 --> 00:06:20,257 అయ్యో, వద్దు, రెడ్. అది వినడానికి భయంకరంగా ఉంది. 108 00:06:20,340 --> 00:06:24,052 చెప్తున్నా కదా, రెడ్, విశ్వమే నిన్ను నెమ్మదించమని చెప్తుంది. 109 00:06:24,135 --> 00:06:27,222 -అవును. -నేను నెమ్మదించేది లేదు. నేను రెడ్ ని! 110 00:06:27,305 --> 00:06:32,018 నేను కథలలో, గెంతాలి, దూకాలి, అంతేకాని ఊరికే కూర్చొని ఉండను. 111 00:06:36,189 --> 00:06:38,775 నేను ఊరకనే ఇక కూర్చొను. 112 00:06:38,858 --> 00:06:41,444 ఫ్రాగుల్స్ మన భవనాలను తినడం మానేసిన నాట నుండి 113 00:06:41,528 --> 00:06:45,282 మనం పని చేయలేకపోతున్నాం, నా మతి పోతున్నట్టు ఉంది, డాక్టర్ లెవెల్. 114 00:06:46,366 --> 00:06:48,493 సరే. మాతో ఆ విషయాన్నీ పంచుకున్నందుకు ధన్యవాదాలు. 115 00:06:48,577 --> 00:06:52,205 ఆ విషయాన్నీ చర్చించడం మనకు చాలా విధాలుగా సహాయపడుతుంది. 116 00:06:52,289 --> 00:06:53,665 అవునా? 117 00:06:53,748 --> 00:06:54,958 అవునా? 118 00:06:57,752 --> 00:06:58,753 ఊరుకో, తల్లి. 119 00:07:00,213 --> 00:07:03,091 ఈ నీటిని వడకట్టేది ఆ జిగటను తీసేస్తుందని ఆశిద్దాం 120 00:07:03,174 --> 00:07:05,176 కనీసం అప్పుడైనా మనం తిరిగి నిర్మించవచ్చు. 121 00:07:09,848 --> 00:07:14,603 నేను ఆ గొట్టాన్ని పగలగొట్టి, ఆ చెత్త జిగటను కనిపెట్టి ఉండకపోతే బాగుండు. 122 00:07:14,686 --> 00:07:16,146 కాటర్పిన్! 123 00:07:16,229 --> 00:07:18,940 మనం మహా స్థంభనలో ఉన్నాం, కానీ నువ్వు పని చేస్తున్నావు. 124 00:07:19,024 --> 00:07:23,486 వచ్చి మాతో కలువు. డాక్టర్ లెవెల్ అందరికీ చాలా సహాయం చేస్తున్నాడు. 125 00:07:23,570 --> 00:07:27,115 నేను నిన్న రాత్రి దాదాపు అయిదు నిముషాలు పడుకున్నాను. హ! 126 00:07:27,198 --> 00:07:30,577 ఈ నీటి నుండి జిగటను వేరు చేసేంత వరకు నేను విశ్రమించలేను. 127 00:07:30,660 --> 00:07:32,913 నేను ద్రుష్టి పెట్టాలి. 128 00:07:32,996 --> 00:07:37,500 సరే. నేను అర్ధం చేసుకోగలను, అలాగే నీ ఇష్టాన్ని గౌరవిస్తాను. 129 00:07:38,168 --> 00:07:39,753 డాక్టర్ లెవెల్ నాకు ఇది నేర్పించాడు. 130 00:07:39,836 --> 00:07:42,047 ఆయన, చాలా, గొప్పవాడు! 131 00:07:44,007 --> 00:07:48,094 ఆకాశ బకెట్! ఆకాశం నుండి బకెట్ దిగుతుంది! 132 00:07:55,310 --> 00:07:56,478 అంతే! 133 00:07:56,561 --> 00:08:01,566 జూనియర్ జూనియర్, అమ్మానాన్నల స్నానానికి నాకు కావాల్సిన చివరి బకెట్ ఇదే. 134 00:08:01,650 --> 00:08:03,652 నేను మంచి పనే చేశాను... 135 00:08:06,613 --> 00:08:07,739 అయ్యయ్యో. 136 00:08:10,283 --> 00:08:11,993 ఈ జిగట ఏంటి? 137 00:08:12,077 --> 00:08:14,704 ఇది అమ్మా, నాన్నల దగ్గరకి పోకుండా ఉంటే... 138 00:08:14,788 --> 00:08:15,789 జూనియర్! 139 00:08:15,872 --> 00:08:19,084 నా స్నానం గదిలో ఈ జిగట ఏంటి? 140 00:08:19,167 --> 00:08:22,587 అవును, ఇది చాలా జిగురుగా ఉంది! 141 00:08:22,671 --> 00:08:24,965 ఏం జిగట? నేను... నేను ఏం చూడలే... 142 00:08:25,048 --> 00:08:27,133 మాకు ఇది చాల నచ్చింది. 143 00:08:27,217 --> 00:08:31,471 నా గడ్డం మునుపెప్పుడు లేనంత మృదువుగా అయింది. 144 00:08:31,555 --> 00:08:34,599 మంచి పని చేసావు, బుజ్జి కొండ. 145 00:08:35,933 --> 00:08:38,019 నేను మరికొన్ని జిగట నీళ్లను తెస్తాను. 146 00:08:38,520 --> 00:08:39,645 అవును. 147 00:08:39,729 --> 00:08:41,106 జిగట నీళ్లు, జిగట నీల్... 148 00:08:42,941 --> 00:08:43,942 మళ్లీనా? 149 00:08:45,026 --> 00:08:46,820 సరే, సరే, స్ప్రాక్! 150 00:08:47,862 --> 00:08:50,615 నీకు పేలు పట్టుకున్నాయి అంటే నమ్మలేకపోతున్నాను. 151 00:08:50,699 --> 00:08:53,868 ఇప్పుడు నాకు ఇవన్నీ చేయించే ఖాళీ అస్సలు లేదు. 152 00:08:53,952 --> 00:08:57,497 లేదు, వద్దు, స్ప్రాక్, గోక్కోవద్దు! దానికి మన దగ్గర మందు ఉంది. 153 00:09:02,043 --> 00:09:05,422 ఏమైనా కానీ, నువ్వు అందమైన లైట్ లాగ ఉన్నావు. 154 00:09:07,173 --> 00:09:10,302 సరే. కుక్క డాక్టర్ ఈ మందు పని చేస్తుందని చెప్పారు. 155 00:09:10,385 --> 00:09:13,930 కానీ పని త్వరగా పూర్తి చేయాలి ఎందుకంటే నేను ప్లాస్టిక్ తినే బ్యాక్టీరియాపై పని చేయాలి. 156 00:09:15,056 --> 00:09:16,141 ఏది, నోట "ఆ" అను. 157 00:09:20,145 --> 00:09:22,647 సరే, అయిపోయింది. ఇక తిరిగి ల్యాబ్ లో పని చేసుకోవాలి. 158 00:09:26,026 --> 00:09:27,569 నువ్వు దాన్ని ఉమ్మేసావా? 159 00:09:29,779 --> 00:09:33,491 పాపం మెర్గుల్స్. ఆ డూజర్ జిగట వాళ్ళను చాలా వేధిస్తుంది. 160 00:09:34,659 --> 00:09:36,661 మనం వాళ్ళను భయపెట్టి ఆ వెక్కిళ్ళను పోగొట్టలేకపోతే, 161 00:09:36,745 --> 00:09:40,248 -వాళ్ళ పరిస్థితి ఇక ఇంతేనేమో. -నాకు నా బకెట్లు కూడా తిరిగి రావు. 162 00:09:41,666 --> 00:09:44,002 అది పెద్ద సమస్య కాదు లెండి. 163 00:09:44,085 --> 00:09:45,629 కానీ సమస్య కాకుండా పోదు కదా. 164 00:09:45,712 --> 00:09:47,005 సరేలే, బాధపడకు. 165 00:09:47,088 --> 00:09:51,676 నేను, వెంబ్లీ బాగా అలోచించి బాగా భయపెట్టగల ఒక వ్యూహం రచించాము. 166 00:09:51,760 --> 00:09:52,594 అవును! 167 00:09:52,677 --> 00:09:54,596 -సిద్ధమా, వెంబ్లీ? వెళ్లి అదరగొట్టు. -ఓహ్, అవును. 168 00:10:03,647 --> 00:10:08,026 అయితే, మీరు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నారు కదా. 169 00:10:09,194 --> 00:10:10,612 ఇదేనా మీరు ఆలోచించింది? 170 00:10:10,695 --> 00:10:13,573 అంటే, వెంబ్లీ చాలా సేపు డాన్స్ వేస్తూ గడిపాడు. 171 00:10:13,657 --> 00:10:15,450 అవును, నాకు డాన్స్ వేయడం అంటే ఇష్టం పుట్టింది. 172 00:10:19,871 --> 00:10:21,998 ఈ సారి నేను సహాయపడితే మంచిదేమో. 173 00:10:22,082 --> 00:10:24,668 సరే. నువ్వు ఎలా సహాయపడగలవో నాకైతే తెలీదు మరి. 174 00:10:25,252 --> 00:10:26,169 అవును. 175 00:10:29,130 --> 00:10:31,675 నా స్నేహితులు అనవసరంగా భయపడ్డారు. 176 00:10:31,758 --> 00:10:35,262 ప్రమాదం లేదు, జమాదం లేదు. నాకేం కాదు. 177 00:10:38,431 --> 00:10:39,599 అవును! 178 00:10:43,895 --> 00:10:45,105 నేనేం బాలేను. 179 00:10:48,149 --> 00:10:51,653 నా తోకకి దెబ్బ తగిలిందని మాత్రం చెప్పకండి. 180 00:10:53,321 --> 00:10:55,240 అది నీ తోకే! 181 00:10:55,323 --> 00:10:56,408 హాయ్, రెడ్! 182 00:10:59,995 --> 00:11:01,580 మంచి పీనట్ బటర్. 183 00:11:07,752 --> 00:11:09,212 చీజ్! 184 00:11:12,757 --> 00:11:15,635 ఊరుకో. అది నా దగ్గర ఉన్న బెస్ట్ చీజ్. 185 00:11:16,428 --> 00:11:17,804 కితకితలు! 186 00:11:17,888 --> 00:11:20,223 తిను! నోరు తెరువు! నువ్వు నీ మందు వేసుకోవాలి! 187 00:11:20,307 --> 00:11:21,558 రా. మారం చేయకు! 188 00:11:21,641 --> 00:11:23,643 అంతే. అవును! 189 00:11:26,938 --> 00:11:30,901 ఓహ్, బాగుంది. నా తోక బెణికింది! 190 00:11:32,444 --> 00:11:35,572 ఇప్పుడిక నేను మొత్తానికే ఎవరికీ సహాయం చేయలేను. 191 00:11:35,655 --> 00:11:38,158 నాకు ఏం చేయాలో తోచడం లేదు. 192 00:11:39,534 --> 00:11:44,164 ఒకపుడు నాకేం చేయాలో తెలుసు 193 00:11:44,247 --> 00:11:47,792 ఒకప్పుడు నాకు నా పేరు తెలుసు 194 00:11:48,960 --> 00:11:50,420 ఎక్కడున్నా నేనెవరో నాకు తెలుసు 195 00:11:50,503 --> 00:11:53,006 అన్నీ స్పష్టంగా అర్దమయ్యేవి 196 00:11:53,089 --> 00:11:56,092 బ్రతుకే ఒక ఆటలా సాగేది 197 00:11:57,427 --> 00:12:01,890 కానీ ఇప్పుడు ఊహల్లోనే విహరిస్తున్నాను 198 00:12:01,973 --> 00:12:06,436 ఏదీ నేను అనుకున్నట్టు లేదు 199 00:12:07,270 --> 00:12:10,398 ఇలా ఎంత కాలం ఉండాలి 200 00:12:11,816 --> 00:12:14,903 మళ్ళీ అన్నీ సులభం కావడానికి 201 00:12:15,612 --> 00:12:19,491 ఒకప్పటిలా ఉండడానికి 202 00:12:19,574 --> 00:12:21,618 నాకు నా పేరు తెలిసి ఉండేది 203 00:12:24,579 --> 00:12:29,000 ఎవరూ నిరాశకు అతీతులు కారని నాకు తెలుసు 204 00:12:29,084 --> 00:12:33,713 ఒక్కోసారి ఇదేదీ నిజం కాదని అనుకుంటుంటాను 205 00:12:34,214 --> 00:12:37,842 అప్పుడు రాత్రుళ్ళు నిద్ర నుండి లేచేదానిని 206 00:12:38,635 --> 00:12:41,888 ఏది సరైనదో ఏది కాదో చెప్పలేకపోతున్నాను 207 00:12:42,889 --> 00:12:46,351 ఒకానొకప్పుడు 208 00:12:46,434 --> 00:12:53,108 నాకు నా పేరు తెలిసేది 209 00:13:04,244 --> 00:13:06,121 రెడ్? రెడ్? 210 00:13:06,788 --> 00:13:08,331 నువ్వు బానే ఉన్నావా? 211 00:13:10,667 --> 00:13:11,668 నేను బానే ఉన్నాను. 212 00:13:11,751 --> 00:13:16,298 నీకే సహాయం అవసరమైనప్పుడు నువ్వు ఎవరికైనా ఎలా సహాయం చేయగలవు? 213 00:13:17,215 --> 00:13:18,925 రెడ్. 214 00:13:23,179 --> 00:13:26,975 సరే. అవును. బాధను... అంతా వెళ్లగక్కేయ్. 215 00:13:27,767 --> 00:13:29,185 హే, రెడ్, రెడ్, రెడ్! 216 00:13:29,269 --> 00:13:32,522 నిన్ను సంతోషపెట్టగలది ఒకటి నాకు తెలుసు! 217 00:13:32,606 --> 00:13:35,025 అది ఈత కొట్టడమా? 218 00:13:35,108 --> 00:13:38,528 నాతో రా, నీకే తెలుస్తుంది. 219 00:13:44,159 --> 00:13:46,244 ఈ ప్రదేశం ఏమిటి? 220 00:13:46,328 --> 00:13:49,039 ప్రియమైన రెడ్, ఇదే భావోద్వేగాల గుహ. 221 00:13:49,664 --> 00:13:52,876 ఇక్కడే నువ్వు ధ్యానం చేయడం నేర్చుకోబోతున్నావు. 222 00:13:57,547 --> 00:14:00,967 సరే. ఇది గుర్తుంచుకోండి, మిత్రులారా, మనం మెర్గుల్స్ ని భయపెట్టాలి. 223 00:14:03,762 --> 00:14:06,598 సరే. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 224 00:14:06,681 --> 00:14:09,559 వాళ్ళు ఎంతగా భయపడనున్నారో వాళ్లకు అస్సలు తెలీదు. 225 00:14:10,602 --> 00:14:12,145 ఇప్పుడు, భయపెట్టండి! 226 00:14:21,529 --> 00:14:22,906 మీరు బాగానే ఉన్నారా? 227 00:14:22,989 --> 00:14:23,990 నేను బానే ఉన్నాను. 228 00:14:26,868 --> 00:14:28,411 ధ్యానమా? 229 00:14:28,495 --> 00:14:32,082 ఊరకనే కూర్చోవడం నా వల్ల కానీ పని అని నీకు చెప్పా కదా. 230 00:14:32,165 --> 00:14:35,377 ధ్యానం ఎవరైనా చేయగలరు. చాలా సులభం. నేను నీకు చూపుతాను చూడు. 231 00:14:39,714 --> 00:14:41,883 లైటింగ్ మారుతుంది. సరే. 232 00:14:45,470 --> 00:14:48,848 చూడు! ఆ ఉండల్లాంటివి ఎగురుతున్నాయి. 233 00:14:48,932 --> 00:14:52,143 అవి ఆలోచనల బల్బులు, ఒక్కొక్కటి ఒక రకమైనది: 234 00:14:52,227 --> 00:14:56,189 చింత, ఒత్తిడి, సంతోషం, భయం. 235 00:14:56,273 --> 00:14:59,568 వాటిని గుర్తించి, వదిలి పెట్టడమే మనం తెలుసుకోవాల్సిన విషయం. 236 00:15:00,902 --> 00:15:05,240 అవును, నాకు కూడా ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా బ్రతకలేనేమో అని భయం వేస్తుంది. 237 00:15:05,323 --> 00:15:07,742 కానీ నేను ఎంత చేయగలనో అంతే చేయగలను. ధన్యవాదాలు, బల్బ్. 238 00:15:11,705 --> 00:15:14,583 నాకు ఇప్పుడు హాయిగా ఉంది. ఇప్పుడు నీ వంతు. 239 00:15:16,126 --> 00:15:18,503 అంటే, నేను వెళ్లి నా జుట్టు ముడుల్ని లెక్కించాలి. 240 00:15:19,129 --> 00:15:22,716 అదేం సులభమైన పని కాదు. ఒకటి, రెండు. కానీ నేను మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టాలి. 241 00:15:22,799 --> 00:15:26,928 -చాలా పెద్ద పని. -రెడ్. తిన్నగా, ప్రశాంతంగా కూర్చొని ఉండు. 242 00:15:30,181 --> 00:15:32,392 నాకు చాలా బోర్ కొడుతోంది. 243 00:15:32,475 --> 00:15:33,727 ఊపిరి పీల్చుకో. 244 00:15:33,810 --> 00:15:36,313 నాకు ఎలా చేయాలో తెలియడం లేదు. 245 00:15:36,396 --> 00:15:40,442 నీ చింత అంతటిని ఊపిరి రూపంలోకి మార్చు. 246 00:15:43,486 --> 00:15:45,196 నేను ఇంకా ఊపిరి పీల్చుతున్నానా? 247 00:15:45,280 --> 00:15:49,034 సరే, ఇప్పుడు నీ ఆలోచనలను అంగీకరించి, నెమ్మదిగా వాటిని బయటకు వదిలేయ్. 248 00:15:51,161 --> 00:15:55,665 వాటిని పోనివ్వు. వాటిని కొట్టకు. పోవడానికి అనుమతి ఇవ్వు. 249 00:15:55,749 --> 00:15:58,126 -నేను ప్రయత్నిస్తున్నాను. -ఆ ప్రయత్నమే చేయకు. 250 00:15:58,209 --> 00:16:00,128 నాకు ఇదేమి అర్ధం కావడం లేదు. 251 00:16:00,212 --> 00:16:01,755 రిలాక్స్ అవ్వు చాలు! 252 00:16:01,838 --> 00:16:06,051 ఇక్కడ రిలాక్స్ అయ్యే విషయం ఏమైనా ఉంటే కదా! 253 00:16:08,803 --> 00:16:12,057 సరే. మొదటి ప్రయత్నం బాగుంది. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిద్దాం. 254 00:16:12,140 --> 00:16:15,810 -కాకపోతే మునుపటికంటే ఈసారి బాగా చేయాలి. -కుదరదు. ఇక నా వల్ల కాదు. 255 00:16:16,853 --> 00:16:18,063 కానీ, రెడ్... 256 00:16:19,356 --> 00:16:20,440 నా తోక. 257 00:16:22,275 --> 00:16:25,111 నాకు తెలుసు, బల్బ్. నాకు కూడా తనని చూస్తే బాధగానే ఉంది. 258 00:16:26,279 --> 00:16:28,073 -కాటర్పిన్. -చెప్పు. 259 00:16:28,156 --> 00:16:31,451 నువ్వు రోజంతా పని చేస్తూనే ఉన్నావు. నీకు విశ్రాంతి కావాలి. 260 00:16:31,534 --> 00:16:35,121 సమస్య పరిష్కరించబడకుండా నేను విశ్రాంతి ఎలా తీసుకోగలను? 261 00:16:35,205 --> 00:16:40,168 కొన్నిసార్లు, పనిముట్లను పక్కన పెట్టి, కొంచెం సేపటి తర్వాత కొత్త ఆలోచనలతో మొదలుపెట్టాలి. 262 00:16:40,752 --> 00:16:42,712 వావ్, రెంచ్. సరిగ్గానే చెప్పావు. 263 00:16:42,796 --> 00:16:47,217 బహుశా నేను కాస్త నెమ్మదించి నూతన దృక్కోణంతో ఈ సమస్యను పరిష్కరించాలేమో. 264 00:16:49,135 --> 00:16:51,388 రండి మిత్రులారా. బిస్కెట్లు తిందాం. 265 00:16:57,227 --> 00:16:59,771 అమ్మా, నాన్నకు నేను బాగా నచ్చేసాను. 266 00:17:00,397 --> 00:17:03,191 ఆ జిగట పుణ్యమా నేను ఇవాళ మంచి పని చేశాను. 267 00:17:03,275 --> 00:17:05,901 నేను మళ్ళీ ఇంకొంచెం జిగట తీసుకొస్తాను, జూనియర్ జూనియర్. 268 00:17:08,446 --> 00:17:11,491 జ... జూనియర్ జూనియర్? నీకు ఏమైంది? 269 00:17:11,574 --> 00:17:14,202 ఆ జిగట నీకు హాని కలిగిస్తుందా? ఆగు, మిత్రమా. 270 00:17:14,285 --> 00:17:18,747 నీకు గోర్గ్ నీళ్ల తొట్టె నుండి కొన్ని మంచి నీళ్లు తీసుకొస్తాను. 271 00:17:18,832 --> 00:17:22,752 బహుశా గోర్గ్స్ కి మంచి చేసేది అందరికీ మంచి చేయకపోవచ్చు. 272 00:17:25,921 --> 00:17:27,424 నేను నిన్ను కాపాడుకుంటా. 273 00:17:28,550 --> 00:17:29,885 నీకు ఏమీ కాదు. 274 00:17:36,641 --> 00:17:38,810 -మిత్రులారా. ఇది చాలా బాగుంటుంది. -అవును. 275 00:17:38,894 --> 00:17:40,145 -హాయ్, మోకీ. ఏమైందో చెప్పనా? -హాయ్. 276 00:17:40,228 --> 00:17:43,106 ఈ సారి మెర్గుల్స్ ని భయపెట్టడానికి మా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. 277 00:17:43,189 --> 00:17:45,775 సరే, ఇవాళైనా ఇది పని చేస్తే బాగుండు. 278 00:17:45,859 --> 00:17:47,402 అవును, సరే. ఏం చేద్దామో చూద్దాం. 279 00:17:47,485 --> 00:17:50,822 సరే. నేను పై దగ్గరకు వెళ్లి, 280 00:17:50,906 --> 00:17:55,327 "హలొ, మెర్గుల్స్. మీకు రుచికరమైన స్వీట్ కావాలా? 281 00:17:55,410 --> 00:17:58,830 ఇది చాలా బాగుంటుంది" అంటాను. 282 00:17:58,914 --> 00:18:02,250 బాగుంది. నువ్వు వాళ్ళ భాషలో మాట్లాడుతున్నావు. 283 00:18:02,334 --> 00:18:04,002 -అవును. -అందరికీ స్వీట్ ఉంది. 284 00:18:04,085 --> 00:18:07,380 పళ్ళు ఇష్టం లేకపోతే చాక్లెట్ క్రీమ్ తినండి. అది నచ్చకపోతే ఇంకొకటి. 285 00:18:07,464 --> 00:18:10,050 చీజ్ తో చేసినది కావాలా? తలక్రిందులు ముల్లంగి స్వీట్ తినండి. 286 00:18:10,133 --> 00:18:11,343 -నీలి రంగు స్వీట్ కూడా ఉంది! -అద్భుతం! 287 00:18:11,426 --> 00:18:12,719 -అవును! -సరే, వెంబ్లీ. ఇప్పుడు నువ్వు చెప్పు. 288 00:18:13,345 --> 00:18:15,430 అప్పుడు నేను కొన్ని పొగ పుట్టించే పండ్లను క్రింద పడేసి... 289 00:18:15,513 --> 00:18:17,849 -అవును. -...భయం పుట్టించే వాతావరణం సృష్టిస్తా. 290 00:18:18,600 --> 00:18:20,435 అబ్బా, నాకు అప్పుడే వొళ్ళు గగుర్పాటుగా ఉంది. 291 00:18:20,518 --> 00:18:23,855 అప్పుడు బూబర్ పొగమంచులోకి మాయం అవుతాడు. నేను వెంబ్లీని దీని మీద నిలబెట్టి 292 00:18:23,939 --> 00:18:26,024 పెద్ద, భారీ రాక్షసుడిలా చూపిస్తా. 293 00:18:27,234 --> 00:18:31,321 అప్పుడు, మెర్గుల్స్, "అయ్యో, స్వీట్స్ తెచ్చాను అన్న వాడు ఎక్కడికి పోయాడు" అనుకుంటారు. 294 00:18:31,404 --> 00:18:35,242 అప్పడు మన పెద్ద, భయంకరమైన వెంబ్లీ పొగ మంచులో నుండి వచ్చి... 295 00:18:35,325 --> 00:18:36,701 నేను వాడిని తినేసా అంటాడు! 296 00:18:38,161 --> 00:18:41,498 అంతే! భయంతో వెక్కిళ్లు పారిపోతాయి. సరేనా, చేద్దాం రండి. 297 00:18:48,547 --> 00:18:50,131 రండి, అంతే. 298 00:18:53,927 --> 00:18:56,012 అయ్యయ్యో. నేను పొగ పుట్టుంచే పళ్ళను పడేసాను. 299 00:18:56,888 --> 00:18:59,140 ఆగు. అవి పొగ పుట్టించే పళ్ళు కాదు. 300 00:18:59,224 --> 00:19:02,269 -వెంబ్లీ, ఏం జరుగుతుంది? -అవి గ్రీస్ బెర్రీలు! 301 00:19:09,401 --> 00:19:10,902 ఓహ్, అయ్యో. 302 00:19:15,448 --> 00:19:19,911 సరిపోయింది. మనం భయపెట్టే ప్రయత్నం వాళ్లకు నవ్వు తెప్పించేంత ఛండాలంగా ఉంది. 303 00:19:27,419 --> 00:19:31,089 సరే, మోకీ. మనం పాడు చేశామని తెలుసు. నువ్వేం నవ్వాల్సిన పని లేదు. 304 00:19:31,172 --> 00:19:32,632 -అవును. -లేదు, లేదు. మిత్రులారా, నా మాట వినండి. 305 00:19:33,300 --> 00:19:35,010 వాళ్ళ వెక్కిళ్లు పోయాయి. 306 00:19:36,553 --> 00:19:37,721 అంటే... 307 00:19:37,804 --> 00:19:40,432 -మనం సాధించాం! -సరే. 308 00:19:40,515 --> 00:19:42,893 మనం వాళ్లకు నయం చేసాం, మిత్రులారా. 309 00:19:42,976 --> 00:19:46,438 నువ్వు నీ ప్లాను మాపై రుద్దాలని చూసావు, కానీ అది పని చేయలేదు. 310 00:19:46,521 --> 00:19:48,523 నేను రెడ్ విషయంలో కూడా అదే చేశాను. 311 00:19:49,190 --> 00:19:50,483 కానీ ఇప్పుడు చూడు. 312 00:19:50,567 --> 00:19:54,321 మీరు అనుకున్నది, అనుకోని విధంగా జరిగింది. 313 00:19:56,072 --> 00:19:58,700 అవును, ఆలోచనల బల్బ్. మంచి ఐడియా. 314 00:20:06,207 --> 00:20:09,669 నేను ఎడమకు తిరిగినప్పుడు, మీరు కుడికి పోవచ్చు 315 00:20:09,753 --> 00:20:13,173 కానీ మనమంతా సమయానికే చేరుకుంటాం 316 00:20:13,256 --> 00:20:16,676 అందరూ అప్పుడు పండుగ జరుపుకోవాలి 317 00:20:16,760 --> 00:20:19,804 మనం నేర్చుకున్న విషయాలన్నింటిని గుర్తించాలి 318 00:20:19,888 --> 00:20:23,350 ఎందుకంటే మనందరికీ లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి 319 00:20:23,433 --> 00:20:26,978 ఆ మార్గాలలో మనం లెక్కలేనన్ని విధాలుగా గమ్యం చేరుకోవచ్చు 320 00:20:27,062 --> 00:20:30,106 -డో-డో-డో-డో -ఎలా వెళ్ళాం అన్నది ముఖ్యం కాదు 321 00:20:30,190 --> 00:20:33,818 వెళ్లే గమ్యం ఒక్కటే అయినపుడు 322 00:20:33,902 --> 00:20:35,737 -వేర్వేరు మార్గాలు అంటూ ఏమీ ఉండవు -వేర్వేరు మార్గాలు అంటూ ఏమీ ఉండవు 323 00:20:35,820 --> 00:20:37,530 -అన్నీ ఒక్కటే -అన్నీ ఒక్కటే 324 00:20:37,614 --> 00:20:39,824 వేర్వేరు మార్గాలు అంటూ ఏమీ ఉండవు 325 00:20:39,908 --> 00:20:41,409 డో-డో-డో-డో 326 00:20:41,493 --> 00:20:44,913 నీకే మంచి మార్గం తెలుసని అనుకోవచ్చు 327 00:20:44,996 --> 00:20:48,458 అందరూ నిన్నే అనుసరించాలని నువ్వు అనుకోవచ్చు 328 00:20:48,541 --> 00:20:52,003 కానీ నీకు పనిచేసేది 329 00:20:52,087 --> 00:20:55,382 ఇతరులకు పని చేయకపోవచ్చని గుర్తుంచుకో 330 00:20:55,465 --> 00:20:58,635 ఎందుకంటే మనందరికీ లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి 331 00:20:58,718 --> 00:21:02,514 ఆ మార్గాలలో మనం లెక్కలేనన్ని విధాలుగా గమ్యం చేరుకోవచ్చు 332 00:21:02,597 --> 00:21:05,433 -డో-డో-డో-డో -ఎలా వెళ్ళాం అన్నది ముఖ్యం కాదు 333 00:21:05,517 --> 00:21:08,937 వెళ్లే గమ్యం ఒక్కటే అయినపుడు 334 00:21:09,020 --> 00:21:10,939 -వేర్వేరు మార్గాలు అంటూ ఏమీ ఉండవు -వేర్వేరు మార్గాలు అంటూ ఏమీ ఉండవు 335 00:21:11,022 --> 00:21:12,774 -అన్నీ ఒక్కటే -అన్నీ ఒక్కటే 336 00:21:12,857 --> 00:21:14,734 వేర్వేరు మార్గాలు అంటూ ఏమీ ఉండవు 337 00:21:14,818 --> 00:21:17,821 మార్గాలన్నీ వేర్వేరుగా ఉంటాయి 338 00:21:18,822 --> 00:21:20,323 నేను వెళ్లి రెడ్ ఎక్కడ ఉందో చూడాలి. 339 00:21:23,743 --> 00:21:25,745 ఏం చింతించకు. ఏదో ఒక్కసారి వచ్చింది. 340 00:21:31,167 --> 00:21:32,502 ఇవాళ చాలా కష్టపడ్డాను. 341 00:21:33,169 --> 00:21:35,589 సోలార్ ప్యానెల్స్ అస్తమాను పని చేయడం ఆగిపోతున్నాయి. 342 00:21:35,672 --> 00:21:38,466 ఆరవ జార్ కూడా పని చేయలేదు. ఏదీ ప్లాస్టిక్ ని తినడం లేదు. 343 00:21:38,550 --> 00:21:41,928 ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్ధం కావడం లేదు. 344 00:21:44,306 --> 00:21:48,018 కనీసం నీ మందులైన వేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటావా? 345 00:21:49,185 --> 00:21:51,938 నువ్వు ఏం చేస్తున్నా దానిని పట్టించుకొనే టైం నాకు లేదని నీకు తెలుసు. 346 00:21:53,899 --> 00:21:56,026 సరే, అలాగే. 347 00:21:58,028 --> 00:21:59,070 ఏంటి? 348 00:22:01,406 --> 00:22:02,908 నువ్వు భలే ముద్దుగా ఉంటావు. 349 00:22:05,994 --> 00:22:07,913 కాస్త నెమ్మదించడం మంచిదే, కదా? 350 00:22:12,834 --> 00:22:15,462 ఏంటి, నిజంగా? మందులు వేసుకుంటావా? 351 00:22:16,129 --> 00:22:17,797 నీకు నా దగ్గరగా ఉండాలని అనిపించింది అంతేనా. 352 00:22:27,641 --> 00:22:28,725 నోరు తెరువు. 353 00:22:31,144 --> 00:22:32,687 నా కుక్క అంటే ఇలా ఉండాలి. 354 00:22:33,980 --> 00:22:36,483 నీ గురించి నేను నా చీజ్ పాడు చేసానంటే నమ్మలేకపోతున్నాను. 355 00:22:36,566 --> 00:22:38,109 నువ్వు నాకు చీజ్ తెచ్చిపెట్టాలి. 356 00:22:42,280 --> 00:22:44,491 రెడ్, ఇప్పుడు ఎలా ఉన్నావు? 357 00:22:44,574 --> 00:22:47,994 ఏం బాలేదు. అస్సలు బాలేను. 358 00:22:48,078 --> 00:22:49,746 రెడ్, నన్ను క్షమించు. 359 00:22:49,829 --> 00:22:54,459 నాకు సహాయం చేస్తుందని నిన్ను కూడా ధ్యానం చేయమని బలవంతం చేశా, కానీ... 360 00:22:54,542 --> 00:22:56,753 నాకు తెలిసి అది నీకు సహాయపడవచ్చు. 361 00:22:56,836 --> 00:23:00,799 కానీ అది నీ విధానంలోనే చెయ్, నేను చేస్తున్నట్టు కాదు. 362 00:23:00,882 --> 00:23:05,178 కాబట్టి, నీకు అది ఎక్కడో తెలుసుకోవాలని అనిపిస్తే, నేను ఉన్నానని గుర్తుంచుకో. 363 00:23:05,262 --> 00:23:07,097 చాలా సంతోషం, మోకీ. 364 00:23:07,180 --> 00:23:11,351 కానీ ధ్యానం చేయడం నాకు ఇష్టం లేదు. 365 00:23:11,434 --> 00:23:15,564 నేను యాక్షన్ చేసే ఫ్రాగుల్ ని. నా మనసు కుదుటపడేది అలాగే. 366 00:23:15,647 --> 00:23:18,441 నేను "యాహూ" అనుకుంటూ విన్యాసాలు చేయాలి, 367 00:23:18,525 --> 00:23:23,071 దేనికి పడితే దానికి గుద్దుకొని వస్తువులను విరగగొట్టాలి. 368 00:23:23,154 --> 00:23:25,532 అది వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది. 369 00:23:25,615 --> 00:23:26,616 అవును. 370 00:23:26,700 --> 00:23:30,829 నాకు నా జుట్టు నీటిలో మెలికెలు తిరుగుతుండగా ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. 371 00:23:30,912 --> 00:23:32,622 అవును. 372 00:23:32,706 --> 00:23:35,292 ఎవరో నన్ను హత్తుకున్నంత సంతోషంగా ఉంటుంది. 373 00:23:35,375 --> 00:23:37,794 నాకు హత్తుకోవడాలు అంటే చాలా ఇష్టం. 374 00:23:53,351 --> 00:23:56,605 ఇంతకంటే సంతోషం ఇంకేం ఉండదు. 375 00:23:56,688 --> 00:23:58,023 నేను కూడా వస్తే పర్లేదు కదా? 376 00:23:58,106 --> 00:24:00,025 నువ్వు వస్తే బాగుండు అనుకుంటున్నాను. 377 00:24:16,708 --> 00:24:19,628 మోకీ, ఇది చాలా బాగుంది. 378 00:24:19,711 --> 00:24:22,005 నాకు మళ్ళీ నాలాగ అనిపిస్తుంది. 379 00:24:22,756 --> 00:24:25,425 రెడ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది... 380 00:24:25,508 --> 00:24:27,135 నేను ఇంకా ధ్యానం నుండి బయటకు రాలేదు. 381 00:24:27,219 --> 00:24:28,595 క్షమించు. క్షమించు. 382 00:26:07,444 --> 00:26:09,446 ఉపశీర్షికలు అనువదించినది జోసెఫ్