1
00:00:06,040 --> 00:00:08,560
ఎపిసోడ్లో ఆత్మహత్య వంటి
సున్నితాంశాలు కలవు.
2
00:00:08,560 --> 00:00:09,960
ప్రేక్షకుల విచక్షణ అవసరం.
3
00:00:44,520 --> 00:00:48,920
ద
డెవిల్స్ అవర్
4
00:01:42,880 --> 00:01:44,280
ఏఎన్పీఆర్ నుండి ఏం లేదు.
5
00:01:45,160 --> 00:01:48,360
కానీ అది కెమెరాలలో రెండుసార్లు
న్యూ పార్క్ రోడ్లో కనిపించింది.
6
00:01:48,360 --> 00:01:50,920
10:38, హై స్ట్రీట్ వైపు
పశ్చిమానికి వెళుతోంది.
7
00:01:50,920 --> 00:01:53,240
11:07, ఇంకోవైపు నుండి వస్తున్నట్టు.
8
00:01:53,760 --> 00:01:56,360
సమయం పేలుడుకు సరిపోలింది.
9
00:01:56,360 --> 00:01:58,800
దొంగిలించిన కారును వాడింది అందుకే.
10
00:01:58,800 --> 00:02:00,600
- దొంగతనం జరిగిన సమయం తెలుసా?
- లేదు.
11
00:02:01,640 --> 00:02:03,040
యజమాని జాక్ గ్రాహం.
12
00:02:03,040 --> 00:02:04,600
ఇరవై రెండేళ్లు, సంపన్న బిడ్డ.
13
00:02:05,360 --> 00:02:07,080
తాగి, గోడ మీద నుండి దూకాడు.
14
00:02:07,960 --> 00:02:10,800
వాడు కోలుకోనేలోపు ఎవరో దొంగిలించారు,
15
00:02:10,800 --> 00:02:12,840
గత ఎనిమిది రోజులలో.
16
00:02:12,840 --> 00:02:14,520
పొరుగున ఆరా తీద్దాం.
17
00:02:14,520 --> 00:02:18,280
ఇది యాదృచ్ఛికం కాదు.
దొంగను పట్టుకోండి. బాంబర్‌ను వెతకండి.
18
00:02:18,280 --> 00:02:20,360
పారిపోయే కారు అంత ఖరీదుది అవసరమా?
19
00:02:20,360 --> 00:02:23,160
ప్రొఫైల్ చదివావుగా.
ఆటోపైలెట్‌లో ఉన్నాడు.
20
00:02:23,280 --> 00:02:25,400
దెబ్బలు తగలవు.
తన ఇష్టం అనుకున్నాడు.
21
00:02:29,600 --> 00:02:32,000
ఫైబర్స్ కోసం వెతకవద్దు.
అక్కడంతా బూడిదే.
22
00:02:33,880 --> 00:02:36,560
కానీ కాలి గుర్తు దొరికింది.
23
00:02:36,560 --> 00:02:38,840
సైజ్ 10. ట్రైనర్. పెద్ద కాలు.
24
00:02:38,840 --> 00:02:40,760
మంచిది. అది కొంచెం క్లూ.
25
00:02:42,040 --> 00:02:43,880
ఇంకొంచెం సమాచారం కోసం వెతకవచ్చు.
26
00:02:43,880 --> 00:02:45,800
నీలం సుబారు. పసుపు హుడీ.
27
00:02:45,800 --> 00:02:47,760
గుర్తుకు రావచ్చు.
ఎవరికైనా తెలుసేమో.
28
00:02:48,640 --> 00:02:49,880
లేదంటే వాడో గాలోడేమో.
29
00:02:50,520 --> 00:02:53,480
ఎక్కడో ఒంటరిగా ఉన్నాడేమో.
అజ్ఞాతంగా. అనామకంగా.
30
00:02:54,880 --> 00:02:56,960
అవును, కానీ ప్రయత్నించి చూడవచ్చుగా.
31
00:02:58,000 --> 00:02:59,440
ప్రయత్నం చేయాలి. బాయిడ్.
32
00:03:03,520 --> 00:03:04,840
బై.
33
00:03:04,840 --> 00:03:06,320
ఆమె కనిపెడుతుందా?
34
00:03:07,440 --> 00:03:08,400
లేదు.
35
00:03:09,920 --> 00:03:11,200
ఈ జీవితకాలంలో కుదరదు.
36
00:03:42,400 --> 00:03:48,400
సీరియల్ కిల్లర్ గిడియన్ షెపర్డ్‌పై
10,000 పౌండ్ల బహుమానం ప్రకటించిన పోలీసులు
37
00:05:10,000 --> 00:05:11,560
అబ్బా! అబ్బా.
38
00:05:12,320 --> 00:05:13,800
అబ్బబ్బా.
39
00:05:17,120 --> 00:05:18,560
అబ్బా!
40
00:05:24,160 --> 00:05:25,320
అబ్బా, పర్వాలేదు.
41
00:05:26,640 --> 00:05:28,480
పీడకల కంటున్నావంతే.
42
00:05:29,040 --> 00:05:30,040
మనిద్దరం.
43
00:05:31,600 --> 00:05:32,520
అది...
44
00:05:36,280 --> 00:05:39,280
పద... లోపలికి వెళదాం సరేనా?
45
00:05:39,840 --> 00:05:40,880
అంతే.
46
00:05:40,880 --> 00:05:41,800
దేవుడా.
47
00:05:42,800 --> 00:05:44,280
కూర్చో. కదలకు.
48
00:05:45,840 --> 00:05:47,160
దుప్పటి తెస్తాను.
49
00:05:52,000 --> 00:05:54,200
ఎవరు... ఎవరది?
50
00:05:56,760 --> 00:06:00,200
ఎవరు... ఎవరు...
51
00:06:03,400 --> 00:06:06,160
ఎవరు... ఎవరది?
52
00:06:17,160 --> 00:06:18,200
పొరపాటు అంతే.
53
00:06:21,240 --> 00:06:22,240
ప్రతిధ్వని.
54
00:06:23,880 --> 00:06:25,040
అతను ఇక్కడ లేడు.
55
00:06:29,320 --> 00:06:30,320
మనం ఉన్నామా మరి?
56
00:06:43,760 --> 00:06:47,720
ఇవి... నా జ్ఞాపకాలు.
57
00:06:50,680 --> 00:06:52,640
ఉండాల్సిన చోటు నుండి తీసుకున్నవి.
58
00:06:54,400 --> 00:06:56,880
వాటి ప్రవాహం నుండి తొలగించినవి.
59
00:07:00,120 --> 00:07:03,520
కొన్నిసార్లు, నేను జారిపోతుంటే...
60
00:07:06,200 --> 00:07:07,880
గందరగోళం తిరగబెడుతుంటే...
61
00:07:11,200 --> 00:07:12,560
అవి మాయమయ్యేలా ఉన్నాయి.
62
00:07:15,000 --> 00:07:16,680
డబ్బా ఖాళీగా అనిపిస్తుంది.
63
00:07:21,520 --> 00:07:24,080
కానీ అది ఖాళీగా లేదు.
64
00:07:45,200 --> 00:07:46,280
అలాగే నువ్వు కూడా.
65
00:07:50,040 --> 00:07:53,080
నేను ఈ డబ్బాను
ఎవరికీ కనబడని చోట పాతి పెడుతుంటాను.
66
00:07:55,120 --> 00:07:56,360
ఇది నా ఖజానా.
67
00:07:58,400 --> 00:07:59,400
నా లంగరు.
68
00:08:14,520 --> 00:08:16,320
సిల్వియా, ఏం పాతిపెట్టావు?
69
00:08:22,600 --> 00:08:23,920
దేనికోసం తవ్వుతున్నావు?
70
00:09:17,600 --> 00:09:18,840
హలో?
71
00:09:22,040 --> 00:09:23,200
హాయ్, అమ్మా.
72
00:09:36,120 --> 00:09:37,320
ఇంకా ఏం తెలియలేదు.
73
00:09:37,320 --> 00:09:39,720
వాడు వస్తున్నాడు. త్వరలో.
74
00:09:40,440 --> 00:09:41,840
యజమాని ఆసుపత్రిలో ఉన్నాడు.
75
00:09:41,840 --> 00:09:44,720
చూసాను. రెండు కాళ్లు విరిగాయి,
అతిక్రమణలు లేవు.
76
00:09:45,640 --> 00:09:46,840
అదే దారిలో ఉన్నాడు.
77
00:09:48,880 --> 00:09:49,880
మంచిది.
78
00:09:54,360 --> 00:09:55,360
అమ్మా?
79
00:09:56,480 --> 00:09:58,480
బాగానే ఉన్నావా? ఏమన్నా అన్నావా?
80
00:10:02,960 --> 00:10:05,280
ఈవిడ నిన్న రాత్రి తోటలో కనిపించింది.
81
00:10:07,480 --> 00:10:08,600
అలా తిరుగుతుంది.
82
00:10:09,720 --> 00:10:10,720
దాదాపు మూడున్నరకు.
83
00:10:12,520 --> 00:10:13,520
ఏం చేస్తోంది?
84
00:10:14,360 --> 00:10:15,360
తవ్వుతోంది.
85
00:10:15,960 --> 00:10:17,880
అక్కడ ఏదో పాతిపెట్టింది.
86
00:10:18,000 --> 00:10:19,400
చాలా రోజుల క్రితం.
87
00:10:20,440 --> 00:10:21,480
ఏంటి?
88
00:10:22,640 --> 00:10:24,040
జ్ఞాపకం.
89
00:10:24,040 --> 00:10:25,200
ఉపయోగపడేది.
90
00:10:26,960 --> 00:10:28,200
అది సంచిలో ఉంది.
91
00:10:49,640 --> 00:10:50,880
నేను తేలేను.
92
00:10:54,880 --> 00:10:55,960
బ్యారెల్ కోసేశాను.
93
00:10:55,960 --> 00:10:57,680
దాచడానికి సులభంగా ఉంటుంది.
94
00:10:59,880 --> 00:11:02,120
ఆమె సమస్య కాదని అన్నావు.
95
00:11:03,000 --> 00:11:04,320
కాదు. గడియ వేసి ఉంచు.
96
00:11:04,320 --> 00:11:05,880
ఆమె వెళ్ళిపోకుండా చూడు.
97
00:11:09,080 --> 00:11:10,760
అరే, గిడియన్.
98
00:11:12,720 --> 00:11:15,120
ఆమె ఇక్కడే ఉంటుంది,
నాకు నువ్వో పని చేయాలి.
99
00:11:21,120 --> 00:11:22,120
సరే మరి.
100
00:11:22,120 --> 00:11:24,040
నా ఖైదుకు బహుమానం ప్రకటించారు.
101
00:11:24,680 --> 00:11:26,920
బాంబర్‌ను కనిపెట్టటానికి
నాలుగు రోజులే ఉంది.
102
00:11:27,680 --> 00:11:29,560
నేను తప్పుడు కెమెరాలో కనిపిస్తే చాలు,
103
00:11:29,560 --> 00:11:30,800
అంతా సర్వనాశనం.
104
00:11:31,480 --> 00:11:32,920
అంటే నేను బయటకు వెళ్లలేను.
105
00:11:33,480 --> 00:11:35,080
మనం కచ్చితంగా లేనంతవరకు.
106
00:11:35,080 --> 00:11:36,960
నేను డిటెక్టివ్ అవ్వాలంటావు.
107
00:11:36,960 --> 00:11:38,240
వదిలేసిన చోటే మొదలు.
108
00:11:38,880 --> 00:11:40,200
దొంగను పట్టుకో.
109
00:11:40,200 --> 00:11:41,680
బాంబర్‌ను వెతుకు.
110
00:11:46,200 --> 00:11:47,040
లూసీ?
111
00:11:47,040 --> 00:11:49,400
హా, నరహంతకుడిపై
నిఘా పెట్టుమంటున్నావు.
112
00:11:49,400 --> 00:11:50,480
నేను...
113
00:11:51,680 --> 00:11:53,160
అది నిఘా మాత్రమే కాదు.
114
00:11:54,760 --> 00:11:56,520
నిన్ను నువ్వు కాపాడుకోవాలి.
115
00:12:03,840 --> 00:12:07,720
"నిర్ణయం తీసుకో, సాహసోపేత అపరిచితుడా.
116
00:12:07,720 --> 00:12:10,640
"గంట కొట్టు, ప్రమాదాన్ని గుర్తించు,
117
00:12:11,640 --> 00:12:15,120
"లేదా ఆశ్చర్యపడు,
అది నిన్ను పిచ్చిగా చేసేవరకు,
118
00:12:15,120 --> 00:12:18,240
"నీవు ఆచరిస్తే ఏమి జరిగి ఉండేదోనని."
119
00:12:20,320 --> 00:12:21,720
సరే. నేను భోజనం వండాలి.
120
00:12:23,480 --> 00:12:24,680
మరో రెండు పేజీలు.
121
00:12:27,000 --> 00:12:28,880
ఒకటి, కానీ ఇప్పుడు చదవడం నీ వంతు.
122
00:12:32,760 --> 00:12:33,760
ఇదేంటి?
123
00:12:34,960 --> 00:12:36,240
మెరిడిత్ నా మీద గీసింది.
124
00:12:37,040 --> 00:12:39,120
ఇది శాశ్వతం కాదు కనుక
పర్వాలేదు అంది.
125
00:12:41,360 --> 00:12:42,920
నువ్వు కూడా ఒకటి వేసుకో.
126
00:12:42,920 --> 00:12:44,400
ఎలా వేయాలో చూపించింది.
127
00:12:48,440 --> 00:12:49,920
ఇప్పుడు ఎదురుచూడాలి.
128
00:12:52,320 --> 00:12:54,560
- ఎంతసేపు?
- 30 క్షణాలు.
129
00:12:54,560 --> 00:12:56,160
అంతేనా?
130
00:13:00,960 --> 00:13:02,120
నీకు ఎన్ని ఇచ్చింది?
131
00:13:03,160 --> 00:13:05,560
ఏడు. అవి చెరిగిపోయిన కొద్ది వాడుకోవడానికి.
132
00:13:08,640 --> 00:13:09,880
సంతోషంగా ఉన్నావు.
133
00:13:11,800 --> 00:13:13,560
మెరిడిత్ నీ గర్ల్‌ఫ్రెండ్ కనుకనా?
134
00:13:13,560 --> 00:13:14,920
నా గర్ల్‌ఫ్రెండ్ కాదు.
135
00:13:14,920 --> 00:13:16,440
కాదు. తెలుసు. తెలుసు.
136
00:13:17,640 --> 00:13:19,680
ఆమె నీ స్నేహితురాలు.
137
00:13:20,880 --> 00:13:22,240
ప్రాణ స్నేహితురాలేమో?
138
00:13:24,520 --> 00:13:25,960
నీవే ప్రాణ స్నేహితురాలివి.
139
00:13:40,440 --> 00:13:42,120
విచిత్రం, కానీ నిజం.
140
00:13:42,120 --> 00:13:44,080
వివరించలేని పరిణామం.
141
00:13:44,080 --> 00:13:45,760
అతీంద్రియ శక్తుల కలాపాలు.
142
00:13:45,760 --> 00:13:48,680
ఇవి ప్రధాన వార్తలకు ఎక్కని
యథార్థ గాథలు,
143
00:13:48,680 --> 00:13:51,040
ఇవి జనాలకు చాలా ఇబ్బందికరమైనవి.
144
00:13:51,040 --> 00:13:54,520
అపరిష్కృతాలను పరిష్కరించే
మా ప్రయత్నంలో పాలుపంచుకోండి.
145
00:13:54,520 --> 00:13:55,480
ఇదేంటి?
146
00:13:55,480 --> 00:13:56,960
చూస్తూ ఉండు.
147
00:13:56,960 --> 00:13:58,200
సోది అని కొట్టేయకు.
148
00:14:02,280 --> 00:14:03,280
పునర్జన్మ.
149
00:14:03,280 --> 00:14:08,040
శతాబ్దాలుగా, మానవాళిని తొలుస్తున్న ప్రశ్న,
చావు తరువాత జీవనం ఉందా అని?
150
00:14:08,040 --> 00:14:10,280
అంటే, దానికి సమాధానం సైన్స్‌లో ఉంది.
151
00:14:10,280 --> 00:14:11,920
బహుశా, ఇది మతంలోనూ ఉంది.
152
00:14:12,520 --> 00:14:15,720
లేదంటే, కుటుంబ ఇంటిలో
153
00:14:15,720 --> 00:14:19,880
హాక్రిడ్జ్ మార్కెట్ టౌన్
నిశ్శబ్ద వీధిలో ఉండవచ్చు.
154
00:14:20,520 --> 00:14:23,520
ఎవలిన్ వైజ్మన్ది సంతోషకరమైన జీవనం.
155
00:14:23,520 --> 00:14:25,480
చాలా తెలివి, జిజ్ఞాస కల పిల్ల.
156
00:14:25,480 --> 00:14:28,720
కానీ ఆమె పూర్తి వాక్యాలు
పలకటం మొదలుపెట్టగానే,
157
00:14:28,720 --> 00:14:32,440
ఆమె తల్లిదండ్రులు
ఏదో తేడా ఉన్నట్టు కనిపెట్టారు.
158
00:14:33,080 --> 00:14:35,440
ఆమె తన జ్ఞాపకాలను చెప్పడం ఆరంభించింది.
159
00:14:37,000 --> 00:14:40,080
అవి ఇంకా జరగని విషయాలు.
160
00:14:40,080 --> 00:14:41,920
మేము అంతగా పట్టించుకోలేదు.
161
00:14:41,920 --> 00:14:43,200
పిల్లలు అంతేగా అన్నట్టు?
162
00:14:43,200 --> 00:14:44,360
ఊహ.
163
00:14:44,960 --> 00:14:46,320
ఏం గీస్తున్నావు, ఎవలిన్?
164
00:14:46,320 --> 00:14:48,120
పునర్నిర్మాణం
165
00:14:48,120 --> 00:14:49,560
ఇదేంటి అసలు?
166
00:14:49,560 --> 00:14:50,640
చావు.
167
00:14:53,400 --> 00:14:55,920
ఆమె మూడేళ్లప్పుడు...
168
00:14:55,920 --> 00:14:58,480
పింక్ ఇంటిలో ఆడుకోవచ్చా అని అడిగేది.
169
00:14:59,440 --> 00:15:03,040
మేము "పింక్ ఇల్లా?
పింక్ ఇల్లు లేదే," అనేవాళ్లం.
170
00:15:03,040 --> 00:15:05,720
అప్పుడు ఒక రోజు,
పొరుగువారు ఇల్లు ఖాళీ చేస్తుంటే
171
00:15:05,720 --> 00:15:08,440
చిన్న పింక్ బొమ్మరిల్లు
బయటకు తెచ్చారు.
172
00:15:08,440 --> 00:15:12,920
అప్పుడు ఆమె ముఖం వికసించి అంది,
"అదిగో అక్కడుంది!" అని.
173
00:15:16,520 --> 00:15:18,400
అది రెండేళ్ల తరువాత.
174
00:15:20,680 --> 00:15:22,680
మేము వేరే పట్టణానికి వెళ్లాము.
175
00:15:23,960 --> 00:15:26,760
ఎవలిన్ చిన్నప్పుడే
చోటు మారటం గురించి చెప్పేది,
176
00:15:26,760 --> 00:15:29,680
ఆమె ఉండాల్సిన చోట ఉండట్లేదని గొడవ చేసేది.
177
00:15:29,680 --> 00:15:32,640
అందరూ కారు ప్రమాదంలో
మరణించాలని చెప్పేది
178
00:15:32,640 --> 00:15:35,560
1977, సెప్టెంబర్ 5న.
179
00:15:37,560 --> 00:15:40,400
అదే తేదీ కదా షెపర్డ్ టేపులలో చెప్పింది.
180
00:15:40,400 --> 00:15:41,880
కచ్చితమైన తేదీ.
181
00:15:44,080 --> 00:15:45,280
ఇది ఎక్కడిది?
182
00:15:46,440 --> 00:15:49,480
ఎవలిన్ పేరుతో సంబంధమున్న
పునర్జన్మ, పునరావృతం,
183
00:15:49,480 --> 00:15:52,040
టైమ్ లూప్స్ వంటి వాటిని గూగుల్ చేశాను.
184
00:15:53,360 --> 00:15:55,720
మనం ఆ కుటుంబాన్ని పట్టుకోవచ్చేమో.
185
00:15:56,280 --> 00:15:57,280
జవాబులు దొరకవచ్చు.
186
00:16:01,440 --> 00:16:02,800
నాకు తెలియాల్సిందల్లా...
187
00:16:04,680 --> 00:16:06,920
లూసీ చాంబర్స్‌కు ఆ పేరు ఎలా తెలుసని?
188
00:16:09,320 --> 00:16:11,520
ఆమె కూడా నీలాగే వెతికిందేమో.
189
00:16:11,520 --> 00:16:13,760
చూడు, నువ్వు ఆమెను నమ్మవచ్చు, కానీ...
190
00:16:13,760 --> 00:16:15,600
నమ్మాలి. నమ్మనని కాదు.
191
00:16:15,600 --> 00:16:17,640
అయితే ఆమెను ప్రశ్నించు.
192
00:16:17,640 --> 00:16:19,120
మనకు గట్టి ఆధారం దొరకాలిగా.
193
00:16:19,120 --> 00:16:22,040
- కానీ...
- లూసీని నిందిస్తే, ఆమె సమర్థించుకుంటుంది.
194
00:16:22,040 --> 00:16:23,600
స్నేహంగా ఇలానే ఉండనివ్వు.
195
00:16:23,600 --> 00:16:24,800
ఎంత స్నేహంగా?
196
00:16:24,800 --> 00:16:27,960
చూడు, క్షమించు, రవి,
కానీ ఇది ప్రమాదకరం.
197
00:16:27,960 --> 00:16:29,920
- ఆమె అనుమానితురాలు.
- కానే కాదు.
198
00:16:30,840 --> 00:16:32,080
ఆమె మీద అనుమానం అంతే.
199
00:16:32,080 --> 00:16:33,640
సరే, సరే.
200
00:16:33,640 --> 00:16:35,800
అందుకేనా ఆమెతో
అంత సమయం గడుపుతున్నావు?
201
00:16:37,320 --> 00:16:38,480
ఆసక్తితోనా.
202
00:16:38,480 --> 00:16:40,880
ఎవరికన్నా తెలిస్తే ఏంటి పరిస్థితి?
203
00:16:42,200 --> 00:16:44,240
నువ్వు చెపితేనే తెలుస్తుంది.
204
00:16:46,280 --> 00:16:47,480
ఆమె ప్రమాదకారి కాదు.
205
00:16:50,640 --> 00:16:52,640
నీ నడుం దగ్గర గట్టిగా పెట్టు.
206
00:16:52,640 --> 00:16:54,320
లేదంటే నీ మణికట్టు బెణకవచ్చు.
207
00:16:55,440 --> 00:16:56,440
ఇదిగో.
208
00:16:59,280 --> 00:17:00,760
ఇది లోడ్ అయిందంటే, పేలుతుంది.
209
00:17:00,760 --> 00:17:02,920
చావకూడదనుకునేవాటి వైపు గురిపెట్టకు.
210
00:17:04,640 --> 00:17:06,600
ఎవరూ చావాలని కోరుకోను.
211
00:17:06,720 --> 00:17:09,000
అలా కాదు జరిగేది.
అతను లేదంటే అతని బాధితులు.
212
00:17:13,320 --> 00:17:14,320
మళ్లీ చేసి చూడు.
213
00:17:14,440 --> 00:17:15,440
నడుం దగ్గర గట్టిగా.
214
00:17:21,680 --> 00:17:22,680
నేను గర్భవతిని.
215
00:17:26,560 --> 00:17:27,560
కచ్చితంగానా?
216
00:17:29,920 --> 00:17:31,200
అలా జరగకూడదే.
217
00:17:31,200 --> 00:17:33,000
అయినా మనకు జరిగింది.
218
00:17:34,800 --> 00:17:36,000
ఎవరో తెలుసా?
219
00:17:36,000 --> 00:17:37,320
రవి.
220
00:17:38,440 --> 00:17:39,440
అతనికి తెలుసా?
221
00:17:41,920 --> 00:17:43,080
ఇంకా తెలియదు.
222
00:17:54,040 --> 00:17:55,520
నేను జైలుకు వెళ్లలేను.
223
00:17:57,680 --> 00:17:58,680
నేను వెళ్లాను.
224
00:17:59,880 --> 00:18:00,920
25 ఏళ్ళు.
225
00:18:02,080 --> 00:18:04,000
అన్ని రోజులు నన్ను వేచి ఉంచావు.
226
00:18:05,040 --> 00:18:07,320
దీనికోసం. ఈ అవకాశం కోసం.
ఈ ఫలితం కోసం.
227
00:18:08,720 --> 00:18:10,680
ఇదే నువ్వు కోరుకున్నది.
నేను ఇచ్చినది.
228
00:18:11,400 --> 00:18:12,800
అది నేను కాదు.
229
00:18:12,800 --> 00:18:14,520
ఆమె నేను కాదు.
230
00:18:14,520 --> 00:18:16,560
ఆమెకు తల్లి లేదు.
ఆమెకు కొడుకు లేడు.
231
00:18:20,160 --> 00:18:22,800
కొన్ని రాత్రులు,
నాకు పిచ్చెక్కుతుందనిపిస్తుంది.
232
00:18:22,920 --> 00:18:24,520
అప్పుడు అనుకుంటాను, "లేదు, లేదు,
233
00:18:24,520 --> 00:18:27,280
"పిచ్చివాళ్లకు తమకు పిచ్చని తెలియదని."
234
00:18:27,280 --> 00:18:28,400
ఇక ఆలోచన మానేసాను.
235
00:18:28,400 --> 00:18:31,760
సరైన పని చేస్తున్నానని,
పిచ్చి లేదని సర్ది చెప్పుకున్నాను.
236
00:18:31,760 --> 00:18:33,960
అదే కదా పిచ్చివారు చేసే పని.
237
00:18:36,280 --> 00:18:39,160
అయితే, నాకు మళ్లీ పిచ్చా అనిపిస్తుంది.
238
00:18:39,160 --> 00:18:42,160
మళ్ళీ, అది అలా చక్రంలాగా
తిరుగుతూనే ఉంటుంది
239
00:18:42,160 --> 00:18:45,440
నేను నిద్రపోయి చావబోయే వారి గురించి
కలలు కనేవరకు.
240
00:18:48,320 --> 00:18:50,720
రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు,
241
00:18:50,720 --> 00:18:54,560
కానీ నువ్వు దీనిని వదిలి
పారిపోవని మాత్రం తెలుసు.
242
00:18:56,040 --> 00:18:57,440
ఎలా చెప్పగలవు?
243
00:18:59,960 --> 00:19:01,640
నువ్వు అలా ఉండవు కనుక.
244
00:19:10,080 --> 00:19:11,920
రిగ్బీస్ టాయ్స్
245
00:19:11,920 --> 00:19:14,000
సంతకం కావాలి.
246
00:19:15,720 --> 00:19:16,760
సరే, సరే.
247
00:19:39,960 --> 00:19:40,960
దొరికావు.
248
00:20:25,080 --> 00:20:27,320
ఐజాక్, చాలా మంచి కవిత.
249
00:20:28,320 --> 00:20:31,080
మంచి చేతి రాత. కచ్చితమైన స్పెల్లింగ్.
250
00:20:31,200 --> 00:20:32,520
ఎవరైనా సహాయం చేసారా?
251
00:20:36,720 --> 00:20:38,280
నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?
252
00:20:39,160 --> 00:20:40,320
నేనే ఆలోచించాను.
253
00:20:41,080 --> 00:20:43,280
ఏంటి, నీ సొంత ఆలోచనా?
254
00:20:43,280 --> 00:20:45,520
టీవీలో అలా చూసింది కాదా?
255
00:20:45,520 --> 00:20:47,240
లేదంటే పెద్దల మాట విని చేసిందా?
256
00:20:48,520 --> 00:20:49,760
ఇది అమ్మకు తెలుసు.
257
00:20:53,400 --> 00:20:54,800
"ద డెవిల్స్ అవర్."
258
00:20:57,280 --> 00:20:59,200
ద డెవిల్స్ అవర్ ఏంటి, ఐజాక్?
259
00:21:01,560 --> 00:21:02,800
అర్ధరాత్రి అనంతరం.
260
00:21:04,160 --> 00:21:05,400
పీడకలు వచ్చే సమయం.
261
00:21:07,040 --> 00:21:08,560
మనకు భయం వేసే సమయం.
262
00:21:09,800 --> 00:21:11,720
నీకు తరచుగా పీడకలలు వస్తాయా?
263
00:21:15,920 --> 00:21:20,200
అవి... అంటే రాత్రిపూట
అవి భయం కలిగించేలా ఉంటాయి, కదా?
264
00:21:21,800 --> 00:21:24,040
కొన్నిసార్లు పగటిపూట కూడా.
265
00:21:24,040 --> 00:21:25,080
అంటే అర్థం కాలేదే?
266
00:21:26,160 --> 00:21:27,760
దాని గురించి మాట్లాడకూడదు.
267
00:21:28,400 --> 00:21:30,400
నాతో ఏవైనా చెప్పవచ్చు.
268
00:21:33,560 --> 00:21:34,760
ఇది రహస్యమా?
269
00:21:36,280 --> 00:21:38,960
జనాలకు రహస్యమని చెపితే
అది రహస్యం కాదు.
270
00:21:39,800 --> 00:21:41,240
అమ్మ కూడా అదే అంటుంది.
271
00:21:42,880 --> 00:21:45,000
అమ్మ దగ్గర చాలా రహస్యాలున్నాయా?
272
00:21:49,720 --> 00:21:50,720
ఐజాక్...
273
00:21:52,120 --> 00:21:55,840
అమ్మ రహస్యాలతో
నీకు భయమేసినా, బాధేసినా,
274
00:21:56,840 --> 00:21:58,280
అవి దాచి ఉంచుకోకూడదు.
275
00:21:58,280 --> 00:21:59,920
అర్థమైందా?
276
00:22:02,200 --> 00:22:04,520
నువ్వు నాతో ఎప్పుడైనా చెప్పవచ్చు.
277
00:22:05,240 --> 00:22:06,880
నేను వెళ్లి ఆడుకోవచ్చా?
278
00:22:07,440 --> 00:22:10,320
తప్పకుండా. సారీ.
279
00:22:10,320 --> 00:22:13,160
- నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు.
- పర్వాలేదు.
280
00:22:19,760 --> 00:22:21,880
ఈ చోటు ఫోటోలు తీసుకోవటానికి బాగుంటుంది.
281
00:22:21,880 --> 00:22:23,240
ఏమంటావు?
282
00:22:24,960 --> 00:22:27,360
సరే, రా.
మంచి పిట్టలను చూద్దాము...
283
00:22:35,040 --> 00:22:36,400
నాకు ఒంట్లో బాగాలేదు.
284
00:22:38,240 --> 00:22:41,480
ఇంకో పార్కుకు వెళదాం, సరేనా?
285
00:23:04,840 --> 00:23:05,840
అమ్మా?
286
00:23:07,320 --> 00:23:08,320
హా.
287
00:23:57,120 --> 00:23:58,520
మనం వెళ్లిపోవాలి.
288
00:24:00,120 --> 00:24:01,280
ఏదైనా వేడి ప్రదేశానికి.
289
00:24:01,880 --> 00:24:03,560
బాగా ఖరీదైన చోటికి.
290
00:24:07,240 --> 00:24:08,240
రవి?
291
00:24:11,480 --> 00:24:12,600
నిద్రలో మాటలు.
292
00:24:15,440 --> 00:24:16,440
క్షమించు.
293
00:24:18,240 --> 00:24:19,320
కల వచ్చింది.
294
00:24:20,240 --> 00:24:21,240
దేని గురించి?
295
00:24:22,920 --> 00:24:23,920
తెలియదు.
296
00:24:24,800 --> 00:24:25,800
టైమెంత అయింది?
297
00:24:26,400 --> 00:24:27,400
బాగా రాత్రి.
298
00:24:28,280 --> 00:24:29,280
పడుకో ఇక.
299
00:24:48,560 --> 00:24:52,280
"ఏదైనా
300
00:24:55,160 --> 00:24:58,280
{\an8}నిద్రలో మాటలు
"ఏదైనా వేడి ప్రదేశానికి బాగా ఖరీదైన చోటికి
301
00:25:08,200 --> 00:25:09,200
ఛ.
302
00:25:14,680 --> 00:25:16,520
త్వరగా. అంతా నిద్రపోతున్నారు.
303
00:25:16,520 --> 00:25:17,600
అందరూ కాదు.
304
00:25:17,600 --> 00:25:18,680
బయలుదేరింది.
305
00:25:19,400 --> 00:25:20,840
మన నీలం సుబారు.
306
00:25:20,840 --> 00:25:22,800
అరగంట క్రితం దొంగిలించబడింది.
307
00:25:23,360 --> 00:25:24,840
ముఖం చూసావా?
308
00:25:25,840 --> 00:25:26,920
ఇంకో వివరం తెలుసు.
309
00:25:28,560 --> 00:25:29,560
తన దగ్గర తాళం ఉంది.
310
00:25:30,280 --> 00:25:32,040
యజమాని నుండి దొంగిలించి ఉండాలి.
311
00:25:32,680 --> 00:25:34,200
వాళ్లకు పరిచయం ఉందేమో.
312
00:25:35,320 --> 00:25:38,320
యజమాని హాస్పిటల్లో ఉన్నాడు,
అతనికి కారు పోయిందని తెలీదు.
313
00:25:39,280 --> 00:25:41,800
నువ్వే అతనికి చెప్పాలేమో.
314
00:25:44,320 --> 00:25:45,800
నాతో ఎందుకు మాట్లాడతాడు?
315
00:25:46,840 --> 00:25:50,520
నువ్వు హార్ట్ వ్యాలీ పోలీస్
డీఐ లూసీ చాంబర్స్వు కనుక.
316
00:25:50,520 --> 00:25:53,000
నువ్వు నేరాన్ని పరిశోధిస్తున్నావు.
317
00:25:54,040 --> 00:25:55,680
పోలీసు అధికారిలా నటించాలి.
318
00:25:58,240 --> 00:26:01,600
దొరికానంటే, దొరికితే,
ఆరు నెలలు జైలా?
319
00:26:01,600 --> 00:26:04,480
నువ్వు అందులో జీవిస్తావని అనిపిస్తోంది.
320
00:28:46,560 --> 00:28:48,080
కానివ్వు, కొట్టు నన్ను.
321
00:28:48,720 --> 00:28:50,040
కొట్టు నన్ను!
322
00:29:40,200 --> 00:29:41,280
వెధవ.
323
00:30:05,240 --> 00:30:06,240
ఆగు.
324
00:30:08,920 --> 00:30:09,920
హలో?
325
00:30:10,440 --> 00:30:11,640
హా, మాట్లాడుతున్నాను.
326
00:30:13,000 --> 00:30:14,920
విక్టోరియా చనిపోయింది.
327
00:30:14,920 --> 00:30:16,240
రెండేళ్ల క్రితం.
328
00:30:16,240 --> 00:30:17,680
ధన్యవాదాలు.
329
00:30:20,640 --> 00:30:23,320
హా. హా, గుర్తుంది.
330
00:30:25,040 --> 00:30:28,400
అంటే, అంతగా లేదు.
విక్టోరియా అది చేయాలనుకుంది.
331
00:30:28,400 --> 00:30:31,280
నిజం చెప్పాలంటే, నాకు అంత ఇష్టం లేదు.
332
00:30:33,880 --> 00:30:34,880
పోలీసులా?
333
00:30:35,520 --> 00:30:36,760
అంటే ఏంటి?
334
00:30:41,280 --> 00:30:42,560
వాళ్లకు ఆమె జాడ తెలుసా?
335
00:30:45,640 --> 00:30:47,760
హా, తప్పకుండా, వాళ్లతో మాట్లాడతాను.
336
00:30:47,760 --> 00:30:50,200
ఎప్పుడైనా సరే.
వాళ్లతో మాట్లాడటానికి సిద్ధం.
337
00:30:50,200 --> 00:30:53,840
ఏంటి... నీకు ఇంకేం చెప్పారు?
338
00:30:56,640 --> 00:30:57,720
ఏమన్నా క్లూ ఉందా?
339
00:31:00,240 --> 00:31:01,560
లేదు, అర్థమైంది.
340
00:31:04,120 --> 00:31:06,320
అంటే, వాళ్ల కాల్ కోసం వేచుంటాను.
341
00:31:06,320 --> 00:31:07,520
ధన్యవాదాలు.
342
00:31:07,520 --> 00:31:10,160
అవును, ధన్యవాదాలు.
343
00:31:12,320 --> 00:31:13,320
సరే, వీడ్కోలు.
344
00:31:42,480 --> 00:31:43,480
ఏమండీ?
345
00:31:43,480 --> 00:31:44,560
ఒక్క క్షణం, బంగారం.
346
00:31:47,560 --> 00:31:48,400
ఏం సహాయం కావాలి?
347
00:31:49,120 --> 00:31:50,320
డీఐ లూసీ చాంబర్స్‌ను.
348
00:31:50,320 --> 00:31:53,120
మీ పేషెంటుతో మాట్లాడాలి. జాక్ గ్రాహం.
349
00:31:53,120 --> 00:31:55,320
జాక్ గ్రాహం. చూస్తానుండండి.
350
00:32:06,920 --> 00:32:08,480
హాలింగ్బ్రుక్ వార్డ్ వెళ్లాలి.
351
00:32:08,480 --> 00:32:10,160
హాలు చివర, కుడివైపున మొదటిది.
352
00:32:11,800 --> 00:32:12,760
అవును.
353
00:32:13,240 --> 00:32:15,080
- రెండు రోజులు, ఇంకా...
- లేదు, తెలుసు.
354
00:32:15,080 --> 00:32:16,480
లేదు, ఇది ఎన్హెచ్ఎస్.
355
00:32:17,480 --> 00:32:19,120
అవును. సరైన ర్యాంక్.
356
00:32:19,120 --> 00:32:20,600
దేవుడా, తిండి చండాలం.
357
00:32:20,600 --> 00:32:22,480
అంటే, సూప్ కిచెన్ చెత్త.
358
00:32:24,320 --> 00:32:27,400
మందులు భలే అనుకో.
నా దగ్గర మాయా మీట ఉంది.
359
00:32:28,600 --> 00:32:30,520
క్లిక్-క్లిక్.
360
00:32:30,520 --> 00:32:32,360
హా, చెప్పండి.
361
00:32:33,680 --> 00:32:34,680
గ్రాహం గారు?
362
00:32:36,080 --> 00:32:37,080
ఊ?
363
00:32:37,080 --> 00:32:40,000
నా పేరు లూసీ...
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లూసీ చాంబర్స్.
364
00:32:40,000 --> 00:32:42,200
మాట్లాడవచ్చా?
365
00:32:42,960 --> 00:32:45,640
హా, ఛ. హా. ఛ.
366
00:32:45,640 --> 00:32:47,640
సారీ, మళ్లీ కాల్ చేస్తాను.
367
00:32:48,880 --> 00:32:50,560
డగీ గురించేనా?
368
00:32:50,560 --> 00:32:52,720
నాకు దానికి సంబంధం లేదు.
369
00:32:54,040 --> 00:32:55,400
నీకు ఏం సంబంధం లేదు?
370
00:32:55,400 --> 00:32:57,840
వాడు ఎవరి క్యాబిన్లోనో ఏరిగాడు.
371
00:32:57,840 --> 00:33:00,560
నేను వద్దన్నాను, అయినా చేసాడు.
372
00:33:00,560 --> 00:33:02,880
- నాతో వస్తారా?
- థాంక్యూ, సరే.
373
00:33:02,880 --> 00:33:06,320
లేదు, నేను అందుకు రాలేదు.
374
00:33:08,800 --> 00:33:12,000
గ్రాహం గారు, మీరు నీలం సుబారు
ఇంప్రెజా యజమానా కాదా అని
375
00:33:12,000 --> 00:33:14,000
నిర్ధారించి చెపుతారా,
376
00:33:14,000 --> 00:33:18,960
రిజిస్ట్రేషన్
కే-ఐ-జీ-ఒకటి-రెండు-ఐదు-సున్నా?
377
00:33:19,520 --> 00:33:20,520
అవును.
378
00:33:21,080 --> 00:33:22,080
ఎందుకు?
379
00:33:23,480 --> 00:33:27,320
నిన్న రాత్రి కారు దొంగిలించబడింది.
380
00:33:27,320 --> 00:33:28,600
ఏంటి?
381
00:33:28,600 --> 00:33:32,080
మీ పొరుగవారెవరో డాష్ కామ్‌లో
అంతా షూట్ చేసి పెట్టారు.
382
00:33:32,080 --> 00:33:33,560
ఏంటి? కిటికీ పగలగొట్టారా?
383
00:33:34,880 --> 00:33:36,680
వాళ్ల దగ్గర తాళం ఉంది.
384
00:33:36,680 --> 00:33:38,080
మీ సెట్ పోయిందా?
385
00:33:39,120 --> 00:33:40,120
అబ్బా.
386
00:33:43,400 --> 00:33:46,080
పబ్‌లో పోయినట్టుంది.
387
00:33:47,120 --> 00:33:48,440
మీ జేబు కొట్టేసారు.
388
00:33:49,160 --> 00:33:50,840
మీ దగ్గరివారు అయుంటారు.
389
00:33:51,520 --> 00:33:53,400
మీరు అతన్ని గుర్తు పట్టగలరేమో?
390
00:33:54,200 --> 00:33:57,880
ఛ, అబ్బా.
391
00:33:57,880 --> 00:33:59,080
మీకు తెలుసా?
392
00:33:59,080 --> 00:34:01,480
వాడు స్టీవ్ డన్.
393
00:34:01,480 --> 00:34:04,640
వాడే అయుండాలి, కదా?
అదంతా వాడి పనే.
394
00:34:04,640 --> 00:34:06,760
స్టీవ్ డన్ ఎవరు?
395
00:34:09,880 --> 00:34:11,280
ద మేసన్స్లో తాగుతాడు.
396
00:34:11,400 --> 00:34:13,600
అతను ముఠాలో ఉంటాడని అంటారు.
397
00:34:14,320 --> 00:34:16,600
అప్పులపాలయ్యాడు. ఎప్పుడూ దొంగతనాలే.
398
00:34:17,360 --> 00:34:18,360
పిచ్చివాడు.
399
00:34:18,360 --> 00:34:20,000
ఇంటి యజమానికి వాడంటే భయం.
400
00:34:20,760 --> 00:34:22,000
అతని తత్వం ఏంటి?
401
00:34:22,560 --> 00:34:23,880
అతని ఏంటి?
402
00:34:23,880 --> 00:34:25,040
లోకంపై తన అభిప్రాయం?
403
00:34:25,680 --> 00:34:27,320
నాకు తెలియదు. స్నేహితులం కాదు.
404
00:34:30,080 --> 00:34:31,440
కానీ ఇది అతనే కదా?
405
00:34:34,760 --> 00:34:35,760
సరే.
406
00:34:39,040 --> 00:34:43,160
మేము కనుక్కొని, వివరాలు తెలియచేస్తాము.
407
00:34:43,280 --> 00:34:44,560
అలాగే, చీర్స్.
408
00:34:44,560 --> 00:34:47,080
గ్రాహం గారు, మీ సమయానికి ధన్యవాదాలు.
409
00:34:47,920 --> 00:34:51,200
హే. మీరు వాడి వెంటపడితే జాగ్రత్తగా ఉండండి.
410
00:34:51,320 --> 00:34:53,680
వాడో పెద్ద సైకో.
411
00:35:03,120 --> 00:35:04,960
అంటే, అన్ని ఫ్రేమ్‌లు కట్టాను.
412
00:35:05,800 --> 00:35:07,640
విక్టోరియాకు అవి ఇంట్లో ఇష్టం లేదు.
413
00:35:07,640 --> 00:35:10,080
కానీ ఇక్కడే ఎక్కడో ఉండాలి.
414
00:35:10,080 --> 00:35:11,200
ఈ చెత్తలో.
415
00:35:12,360 --> 00:35:14,520
ఈ సైకిల్‌ను నడిపేలా చేయాలి.
416
00:35:14,520 --> 00:35:16,080
ఇది నా మనుమరాలి కోసం.
417
00:35:18,080 --> 00:35:19,880
అందులో ఎంత నిజం ఉంది?
418
00:35:20,840 --> 00:35:22,280
టీవీలో వచ్చే ఆ కథనంలో?
419
00:35:22,280 --> 00:35:24,920
అంతా. ప్రతి మాట.
420
00:35:25,640 --> 00:35:28,400
మేము కల్పించామని అన్నారు.
టీవీలో కనబడటానికి.
421
00:35:28,400 --> 00:35:30,760
కానీ నాకు షో చేయటం ఇష్టమే లేదు.
422
00:35:30,760 --> 00:35:35,000
లేదు, ఇష్టం లేదు...
దాని గురించి మాట్లాడను.
423
00:35:36,440 --> 00:35:37,440
సారీ.
424
00:35:37,440 --> 00:35:38,560
లేదు, లేదు. అది...
425
00:35:39,160 --> 00:35:40,920
ఎవలిన్ను ఆఖరిసారి చూసిందెప్పుడు?
426
00:35:41,600 --> 00:35:44,160
1986, నవంబర్ 21న.
427
00:35:44,800 --> 00:35:46,520
ఆమె అలా వెళ్ళిపోయిందా?
428
00:35:47,880 --> 00:35:48,880
అవును.
429
00:35:51,000 --> 00:35:53,520
ఆమె... వీడ్కోలు చెప్పింది.
430
00:35:53,520 --> 00:35:54,800
ఇంకా...
431
00:35:58,480 --> 00:36:00,880
ఆ ఉదయం పార్ట్ టైమ్ జాబ్‌కు వెళ్లింది.
432
00:36:00,880 --> 00:36:02,680
పరిస్థితులు మారుతున్నాయనుకున్నాము.
433
00:36:03,640 --> 00:36:06,360
ఇక తరువాత, ఆమె షిఫ్ట్‌కు వెళ్లే ముందు,
434
00:36:06,360 --> 00:36:09,320
ఆమె తిరిగి ఇలా అంది,
"నేను ఇక్కడ ఉండకూడదు," అని.
435
00:36:10,840 --> 00:36:13,160
దాని అర్థం ఏంటని విక్టోరియా అడిగితే,
436
00:36:13,280 --> 00:36:16,160
ఈ గోలకు దూరంగా వెళ్లాలని ఆమె అనింది.
437
00:36:16,160 --> 00:36:19,000
ప్రతిధ్వనులట. వెళ్లిపోవాలని అంది.
438
00:36:20,880 --> 00:36:22,080
ఆపే ప్రయత్నం చేయలేదా?
439
00:36:23,640 --> 00:36:25,400
అదేదో ఊరికే అందని అనుకున్నాం.
440
00:36:25,400 --> 00:36:28,880
అలాంటి మాటలు గతంలో కూడా అంది,
కానీ ఎప్పుడూ తిరిగి వచ్చేది.
441
00:36:30,040 --> 00:36:31,400
ఈసారి మాత్రం తను రాలేదు.
442
00:36:31,960 --> 00:36:33,480
ఇంకా ఏం చెప్పింది?
443
00:36:33,480 --> 00:36:35,560
ఎక్కడికి వెళుతుందనే వివరాలు ఏమైనా?
444
00:36:36,600 --> 00:36:38,120
నిశ్శబ్ద ప్రదేశానికట.
445
00:36:38,680 --> 00:36:39,840
దూరంగా.
446
00:36:39,840 --> 00:36:42,000
ఆమె కోసం మాత్రమే ఉండే చోటుకట.
447
00:36:48,120 --> 00:36:49,280
కానీ ఆమె కోసం వెతికాము.
448
00:36:49,280 --> 00:36:52,160
మాకు... ఎక్కడ మొదలుపెట్టాలో తెలియలేదు.
449
00:36:52,160 --> 00:36:54,120
సారీ, క్షమించు, క్షమించాలి.
450
00:36:56,640 --> 00:36:57,640
నన్ను క్షమించాలి.
451
00:36:58,200 --> 00:36:59,920
పర్వాలేదు.
452
00:37:00,920 --> 00:37:02,920
గతాన్ని గుర్తు చేసినందుకు క్షమించాలి.
453
00:37:05,760 --> 00:37:07,280
ఆ జ్ఞాపకాలు పోలేదుగా.
454
00:37:08,760 --> 00:37:10,640
ఆమె గురించి రోజూ మాట్లాడుకునేవాళ్లం.
455
00:37:15,440 --> 00:37:18,400
ఆమెను మేము
ఆర్థం చేసుకోలేకపోయామని వెళ్లిపోయింది.
456
00:37:18,400 --> 00:37:19,920
తెలుసుకొనే ప్రయత్నం చేసాము.
457
00:37:24,640 --> 00:37:25,920
అక్కడ జాగ్రత్త.
458
00:37:25,920 --> 00:37:27,640
సారీ, దానిని శుభ్రం చేయాలి.
459
00:37:28,640 --> 00:37:29,640
ఇది ఆమె గీసిందా?
460
00:37:30,640 --> 00:37:32,000
అవును. అవును.
461
00:37:32,680 --> 00:37:36,160
అది... అది
ఆమె "ప్రతికూల సమయం"లో భాగం.
462
00:37:36,880 --> 00:37:39,200
అది అందరికీ నచ్చదు,
463
00:37:39,320 --> 00:37:42,120
కానీ నేను ఏం చేయగలను,
వీటిని పారేయలేను.
464
00:37:42,120 --> 00:37:43,160
అవి ఆమె జ్ఞాపకాలు.
465
00:37:43,280 --> 00:37:45,280
కానీ ఇది, ఇది ఇంకా ప్రత్యేకం.
466
00:37:46,160 --> 00:37:48,440
పోర్లాక్ బే గురించి గీసింది.
467
00:37:48,440 --> 00:37:50,400
మేము అక్కడ కాటేజీ తీసుకొనేవాళ్లం.
468
00:37:53,640 --> 00:37:55,640
- చాలా అందంగా ఉంది.
- అవును.
469
00:37:57,200 --> 00:37:59,360
ఆమెకు పెయింటింగ్ ఇష్టం. అన్నింటికన్నా.
470
00:37:59,360 --> 00:38:01,480
తన లోకాన్ని తెలుసుకొనే ప్రక్రియ.
471
00:38:06,160 --> 00:38:07,400
దీని సంగతి ఏంటి?
472
00:38:08,120 --> 00:38:10,360
హా. అది చాలా గొప్పది.
473
00:38:11,680 --> 00:38:12,920
విక్టోరియాకు అది నచ్చదు.
474
00:38:13,760 --> 00:38:15,440
- ఎందుకు?
- ఆమెకు అదంటే దిగులేమో.
475
00:38:16,000 --> 00:38:17,640
ఎవలిన్ గుర్తు చేసుకుని గీసానంది.
476
00:38:17,640 --> 00:38:19,960
కానీ... అక్కడికి మేము వెళ్లనేలేదు.
477
00:38:19,960 --> 00:38:21,280
అది వాస్తవం కాదు.
478
00:38:21,280 --> 00:38:22,360
ఏమనుకోరుగా?
479
00:38:22,920 --> 00:38:24,160
పర్వాలేదు.
480
00:38:35,360 --> 00:38:36,800
ఇది చాలా వివరంగా ఉంది.
481
00:38:39,840 --> 00:38:41,840
"దూరంగా."
482
00:38:42,400 --> 00:38:44,280
ఆమెకు ఊహాశక్తి అధికం.
483
00:38:48,120 --> 00:38:49,680
క్షమించాలి. ఏమనుకోరుగా?
484
00:38:49,800 --> 00:38:52,280
లేదు. లేదు, సహాయపడతాయంటే తీసుకోండి.
485
00:38:53,640 --> 00:38:55,000
సహాయకారి కావచ్చు.
486
00:39:03,480 --> 00:39:05,000
"మాకు ఆమె దొరికింది.
487
00:39:05,000 --> 00:39:06,920
"బంజరులో ఓ పాత ఇంటిలో ఉంది."
488
00:39:07,600 --> 00:39:09,000
అదే అతను చెప్పింది.
489
00:39:10,040 --> 00:39:11,440
అస్సలు దొరకకుండా ఉండే చోటు.
490
00:39:12,360 --> 00:39:13,840
ఆమె దొరికిందనే అనాలి.
491
00:39:24,840 --> 00:39:27,120
చూసావా? ఇది పాడవలేదు.
492
00:39:28,480 --> 00:39:29,680
ఈరోజు కాదు.
493
00:39:31,800 --> 00:39:34,680
ఇది పాడైందని ఎందుకు అనుకున్నావు?
అలా కనిపించిందా?
494
00:39:43,800 --> 00:39:45,360
మన మాటలను రికార్డ్ చేస్తుంది.
495
00:39:45,360 --> 00:39:47,200
అమ్మ గదిలో లేనప్పుడు మాత్రమే.
496
00:39:47,320 --> 00:39:49,520
నేను ఆమెతో ఏమన్నా చెప్పదలుచుకుంటేనే.
497
00:39:50,200 --> 00:39:51,640
కంగారు పడాల్సింది ఏం లేదు.
498
00:39:52,400 --> 00:39:54,960
మారే వస్తువుల గురించి మాట్లాడుదాము.
499
00:39:55,760 --> 00:39:58,200
ఈ నగ విరిగింది అన్నావు.
500
00:39:58,320 --> 00:39:59,320
ఇంకేంటి?
501
00:40:03,040 --> 00:40:04,040
పూలా?
502
00:40:04,040 --> 00:40:06,440
అవును, పూలు ప్రతి వారం మారుతాయి.
503
00:40:06,440 --> 00:40:07,640
నేను తాజావి తెస్తాను.
504
00:40:08,960 --> 00:40:10,320
కొన్నిసార్లు అసలువి కాదు.
505
00:40:13,760 --> 00:40:15,200
ఇంకేం చూసావు?
506
00:40:16,320 --> 00:40:17,360
మిగతా పిల్లలు.
507
00:40:18,040 --> 00:40:19,880
నీతో మాట్లాడుతారా?
508
00:40:22,520 --> 00:40:23,840
వాళ్లున్నది వేరే లూప్‌లో.
509
00:40:25,000 --> 00:40:26,160
అంటే ఏంటి?
510
00:40:29,160 --> 00:40:30,600
అది రహస్యం.
511
00:40:31,400 --> 00:40:33,960
ఐజాక్, ఇక్కడ రహస్యాలు ఉండవు.
512
00:40:36,800 --> 00:40:38,480
ఇప్పుడు నువ్వు వారిని చూడగలవా?
513
00:40:41,680 --> 00:40:43,080
ఎందుకు చూడలేవు?
514
00:40:43,920 --> 00:40:44,960
నాకు చలిగా లేదు.
515
00:40:47,520 --> 00:40:50,440
మనం మాట్లాడుతున్నాము కనుకనా?
516
00:40:51,200 --> 00:40:54,000
మనం కనుక నిశ్శబ్దంగా ఉంటే
అప్పుడు వినపడతాయా?
517
00:40:54,000 --> 00:40:55,440
అలా చేసి చూద్దామా?
518
00:40:58,200 --> 00:40:59,280
సరే, మంచిది.
519
00:40:59,280 --> 00:41:01,680
సరే మరి. అంటే, నాకోసం కళ్లు మూసుకో.
520
00:41:04,040 --> 00:41:05,200
మూసే ఉంచు.
521
00:41:06,560 --> 00:41:08,280
నేను సంగీతం పెడతాను.
522
00:41:10,560 --> 00:41:15,040
ఇప్పుడు, నువ్వు సంగీతం వినవచ్చు,
523
00:41:15,040 --> 00:41:16,960
లేదంటే స్వరాలు వినవచ్చు.
524
00:41:17,800 --> 00:41:19,840
నీకు వినబడితే నాకు చెప్పు...
525
00:41:30,840 --> 00:41:32,000
ఐజాక్?
526
00:41:40,600 --> 00:41:41,600
హాయ్.
527
00:41:41,600 --> 00:41:42,640
లూసీ.
528
00:41:44,320 --> 00:41:45,480
ఎలా ఉన్నాడు?
529
00:41:45,480 --> 00:41:46,800
నేను...
530
00:41:49,400 --> 00:41:51,480
హాయ్, బంగారం. ఎలా జరిగింది?
531
00:41:53,040 --> 00:41:56,680
మంచిది. సరే, మనం వెళ్లాలిక.
అమ్మ మళ్లీ ఆలస్యం చేసింది.
532
00:41:56,800 --> 00:41:57,920
ఎలా జరిగింది?
533
00:41:58,640 --> 00:41:59,640
బాగుంది.
534
00:41:59,640 --> 00:42:02,480
సరే, మేము కొత్త విషయం కనిపెట్టాము.
535
00:42:02,480 --> 00:42:04,800
మంచిది. అంటే,
మనం ఫోన్లో మాట్లాడుకుందామా?
536
00:42:04,800 --> 00:42:06,840
ఐదింటికి ఒక చోటుకు తీసుకెళ్లాలి.
537
00:42:06,840 --> 00:42:07,920
తప్పకుండా.
538
00:42:07,920 --> 00:42:09,400
అరే, డార్లింగ్. పద.
539
00:42:09,400 --> 00:42:12,920
- ఏంటిది?
- సారీ. సరే, ధన్యవాదాలు. అది నాది.
540
00:42:12,920 --> 00:42:14,120
ధన్యవాదాలు, ఐజాక్.
541
00:42:15,000 --> 00:42:16,200
ధన్యవాదాలు, రూబీ.
542
00:42:16,320 --> 00:42:17,600
సరే, వచ్చే వారం కలుద్దాం.
543
00:42:17,600 --> 00:42:18,800
అలాగే, కలుస్తాను.
544
00:42:38,640 --> 00:42:40,280
నీ పైజమాలు మరిచిపోకు.
545
00:42:44,640 --> 00:42:47,160
డెబ్బీకి 5:30 కల్లా వస్తానని చెప్పాను.
546
00:42:50,320 --> 00:42:51,480
దాదాపు అయిందా?
547
00:42:55,760 --> 00:42:57,400
కావలసినవన్నీ ఉన్నాయా?
548
00:42:59,320 --> 00:43:00,480
బాగానే ఉన్నావా?
549
00:43:06,040 --> 00:43:07,080
రూబీకి తెలుసు.
550
00:43:07,080 --> 00:43:08,320
రూబీకి ఏం తెలుసు?
551
00:43:10,120 --> 00:43:11,120
నా గురించి.
552
00:43:11,120 --> 00:43:12,160
నీ గురించి ఏంటి?
553
00:43:13,440 --> 00:43:14,880
నా సమస్య తనకు తెలుసు.
554
00:43:15,640 --> 00:43:17,640
నీకు ఏ సమస్యా లేదు.
555
00:43:17,760 --> 00:43:18,760
అర్థమైందా?
556
00:43:18,760 --> 00:43:20,400
నువ్వు పరిపూర్ణం.
557
00:43:20,400 --> 00:43:21,640
నువ్వో అద్భుతానివి.
558
00:43:22,480 --> 00:43:24,000
నాకు అద్భుతంగా ఉండాలని లేదు.
559
00:43:26,640 --> 00:43:28,640
నీకు మెరిడిత్తో ఉండటం ఇష్టం కదా?
560
00:43:29,200 --> 00:43:30,280
నాకు ఇక్కడ నచ్చింది.
561
00:43:30,280 --> 00:43:31,360
నాకు తెలుసు.
562
00:43:31,920 --> 00:43:34,400
కానీ ఒక్క రాత్రికే ఇక్కడ, ఒట్టు.
563
00:43:34,400 --> 00:43:36,680
అది... నేను ఒక పని చేయాలి.
564
00:43:36,800 --> 00:43:39,760
ఆ తరువాత నీ దగ్గరే ఉంటాను. శాశ్వతంగా.
565
00:43:48,760 --> 00:43:51,080
సరే. ఇప్పుడే బయలుదేరుతున్నాను.
566
00:43:51,080 --> 00:43:53,680
ఇది విన్నావా? అది నా ముందు తలుపు.
567
00:43:54,880 --> 00:43:57,920
అంత భయపడకు. వస్తున్నాను.
568
00:43:58,800 --> 00:44:00,880
వస్తున్నాను అన్నానుగా.
569
00:44:01,480 --> 00:44:03,160
ఛ!
570
00:45:11,160 --> 00:45:13,080
ఖాళీగా ఉంచండి
571
00:45:43,480 --> 00:45:44,480
లోపల ఉన్నావా?
572
00:45:44,480 --> 00:45:45,560
అవును.
573
00:45:45,560 --> 00:45:47,160
డన్ ఇప్పుడే బయలుదేరాడు.
574
00:45:47,160 --> 00:45:48,280
ఏం వేసుకున్నాడు?
575
00:45:49,480 --> 00:45:50,640
పసుపువైతే కాదు.
576
00:45:58,920 --> 00:46:00,160
నేను గదులు వెతుకుతాను.
577
00:46:00,160 --> 00:46:05,760
విద్యుత్ చెత్త చూడు, సర్క్యూట్ బోర్డులు,
వైరింగ్, సోల్డరింగ్ కిట్స్ అలా.
578
00:46:05,760 --> 00:46:07,200
రసాయనాలు కూడా చూడు.
579
00:46:07,200 --> 00:46:10,360
అమ్మోనియం నైట్రేట్ ఎరువులు,
ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు.
580
00:46:11,200 --> 00:46:15,400
కప్ బోర్డ్‌లు, వదులు ఫ్లోర్ బోర్డ్‌లు,
అటకలు అన్నీ చూడు.
581
00:46:16,560 --> 00:46:17,480
లూసీ?
582
00:46:17,480 --> 00:46:18,480
10 యూకే
583
00:46:19,040 --> 00:46:20,040
లూసీ?
584
00:46:21,120 --> 00:46:22,640
హా, ఎలా వెతకాలో నాకు తెలుసు.
585
00:47:05,360 --> 00:47:06,960
ల్యాప్‌టాప్ దొరికింది.
586
00:47:09,000 --> 00:47:10,240
చాలా పెట్టెలు ఉన్నాయి.
587
00:47:12,040 --> 00:47:13,200
వాసన వస్తుందా?
588
00:47:14,760 --> 00:47:16,280
అంతా కంపే కొడుతుంది.
589
00:47:19,680 --> 00:47:20,880
జాగ్రత్త.
590
00:47:59,360 --> 00:48:02,440
నిండా ట్రైనర్లే ఉన్నాయి.
591
00:48:04,840 --> 00:48:06,160
ఖరీదైనవాటికి నకిలీలేమో.
592
00:48:08,160 --> 00:48:09,600
ఇలాంటివి వందల్లో ఉన్నాయి.
593
00:48:13,480 --> 00:48:14,480
ఛ.
594
00:48:14,480 --> 00:48:16,520
- ఏంటి?
- అంటే, ఇది చిన్న నేరమే.
595
00:48:16,520 --> 00:48:18,560
సరిగ్గా అనిపించట్లేదు.
అతను కాకపోతే?
596
00:48:18,560 --> 00:48:19,640
కాదు.
597
00:48:20,840 --> 00:48:22,160
కాదు, కాదు, వాడే.
598
00:48:23,280 --> 00:48:24,640
అతని కంప్యూటర్ తెరుస్తావా?
599
00:48:28,600 --> 00:48:30,840
దానికి పాస్వర్డ్ ఉంది.
600
00:48:32,160 --> 00:48:33,280
ఏ కంపెనీది?
601
00:48:33,840 --> 00:48:34,840
కనిపించట్లేదు...
602
00:48:36,480 --> 00:48:38,640
బ్రాండ్ పేరు తెలియట్లేదు.
603
00:48:38,640 --> 00:48:40,840
సరే మరి, "కీరింగ్ వన్" వాడు.
604
00:48:41,400 --> 00:48:43,000
సరే, ఆగు.
605
00:48:54,560 --> 00:48:55,560
గుర్తు చెయ్యి.
606
00:48:55,560 --> 00:48:57,480
ఎఫ్12.
607
00:49:04,760 --> 00:49:07,040
ఏ జీవితంలో కంప్యూటర్ హాకింగ్ చేసావు?
608
00:49:07,040 --> 00:49:08,120
ఎప్పుడూ చేయలేదు.
609
00:49:08,120 --> 00:49:11,360
నేను ఇంటర్నెట్ కేఫ్‌లో
14 ఏళ్ల పిల్లవాడి దగ్గర కొన్నాను.
610
00:49:16,720 --> 00:49:18,640
అతని పాస్వర్డ్ ఏంటో తెలుసా?
611
00:49:19,600 --> 00:49:20,880
అది "పాస్వర్డ్" ఆ?
612
00:49:23,640 --> 00:49:25,560
ఒక్కసారికే వచ్చేసింది. భలే.
613
00:49:26,480 --> 00:49:27,960
కానివ్వు, ఐజాక్, నీ వంతు.
614
00:49:29,840 --> 00:49:31,680
నా పిల్ల కన్నుతో నిఘా
615
00:49:31,680 --> 00:49:36,320
డీ... తో మొదలయ్యేది.
616
00:49:36,320 --> 00:49:38,360
డీ తో మొదలయ్యేది.
617
00:49:38,360 --> 00:49:41,960
డీ, డీ, డీ, డెబ్బీ.
618
00:49:43,320 --> 00:49:44,480
- కాదు.
- కాదా?
619
00:49:44,480 --> 00:49:46,200
డెబ్స్, మరీ అతి.
620
00:49:46,200 --> 00:49:48,200
డ్రైన్ కావచ్చా?
621
00:49:53,200 --> 00:49:54,240
ఐజాక్?
622
00:49:55,000 --> 00:49:56,120
అది డ్రైనా?
623
00:49:56,760 --> 00:49:57,960
కాదు.
624
00:49:58,880 --> 00:50:00,080
ఆగు.
625
00:50:01,240 --> 00:50:02,560
హాయ్.
626
00:50:02,560 --> 00:50:04,000
అవును. మాట్లాడుతున్నాను.
627
00:50:06,240 --> 00:50:07,360
మంచి శుభవార్త.
628
00:50:08,040 --> 00:50:09,800
రేపు పత్రాలను పంపిస్తాను.
629
00:50:10,320 --> 00:50:11,320
ధన్యవాదాలు.
630
00:50:12,120 --> 00:50:13,120
మళ్లీ మాట్లాడుతాను.
631
00:50:13,920 --> 00:50:14,920
వీడ్కోలు.
632
00:50:20,560 --> 00:50:21,560
ఐజాక్?
633
00:50:22,320 --> 00:50:23,920
మాయమైపోయాడు.
634
00:50:26,200 --> 00:50:27,480
ఇదంతా అయోమయంగా ఉంది.
635
00:50:27,960 --> 00:50:30,160
అతను తన శోధనా చరిత్రను తుడిచేసాడేమో.
636
00:50:30,160 --> 00:50:32,440
అతని పాస్వర్డ్ పాస్వర్డ్.
637
00:50:35,120 --> 00:50:36,720
బాంబ్ విషయం ఏదీ లేదు.
638
00:50:39,880 --> 00:50:41,280
పేలుడు.
639
00:50:41,880 --> 00:50:43,440
రిగ్బీస్ టాయ్స్ చూడు?
640
00:50:47,440 --> 00:50:49,120
లేదు. దాని గురించి ఏం లేదు.
641
00:50:54,840 --> 00:50:59,680
వాడేసిన సుబారుల ధరలు
చెక్ చేస్తున్నాడు.
642
00:50:59,680 --> 00:51:03,040
ఫ్రెంచ్ అనే అతనికి పంపాడు.
643
00:51:04,920 --> 00:51:05,920
ఏంటి?
644
00:51:06,760 --> 00:51:08,040
ఏంటది?
645
00:51:08,040 --> 00:51:10,400
- అతను కారు అమ్ముతున్నాడు.
- ఎప్పుడు?
646
00:51:10,400 --> 00:51:11,720
శనివారం, ఉదయం 11:00 కు.
647
00:51:11,720 --> 00:51:13,720
డబ్బులకు, మార్నెస్ హిల్ కార్ పార్క్.
648
00:51:13,720 --> 00:51:16,000
అది వీధి చివర.
రిగ్బీస్ వెనుకవైపుంది.
649
00:51:16,880 --> 00:51:18,960
కొనేవారు న్యూకాజిల్ నుండి.
650
00:51:18,960 --> 00:51:20,040
వాళ్లు...
651
00:51:20,880 --> 00:51:22,360
ఇంతకుముందు వ్యాపారం చేసారు.
652
00:51:26,000 --> 00:51:27,360
ఇది యాదృచ్ఛికం.
653
00:51:28,800 --> 00:51:30,440
ఎవరో కారు తగలబెట్టారు అన్నావు.
654
00:51:30,440 --> 00:51:32,600
మేము ఏపీడబ్ల్యూ హెచ్చరిక జారీ చేశాం.
655
00:51:32,600 --> 00:51:35,400
మనం వెతుకుతున్నామని తెలుసు.
తప్పు సమయం, తప్పు చోటు.
656
00:51:38,400 --> 00:51:40,040
గిడియన్, ఇతను కాదు.
657
00:51:40,920 --> 00:51:42,960
లేదు, లేదు. అతనే కావాలి.
658
00:51:43,520 --> 00:51:44,640
కాదు.
659
00:51:44,640 --> 00:51:45,880
తప్పు చేసాను.
660
00:51:48,440 --> 00:51:49,440
దేవుడా.
661
00:51:49,440 --> 00:51:50,600
ఏంటి?
662
00:51:51,400 --> 00:51:52,560
అతను వచ్చేసాడు.
663
00:51:55,560 --> 00:51:56,720
- ఐజాక్?
- ఐజాక్!
664
00:51:57,680 --> 00:51:58,680
ఐజాక్!
665
00:51:59,960 --> 00:52:01,360
- ఐజాక్!
- అమ్మా!
666
00:52:07,600 --> 00:52:08,680
దేవుడా.
667
00:52:08,680 --> 00:52:10,400
మెరిడిత్, నాన్నతో వెళ్లు.
668
00:52:10,920 --> 00:52:12,160
రా, బంగారం.
669
00:52:12,160 --> 00:52:15,240
- తనకేం కాలేదుగా?
- లేదు. కంగారుపడకు.
670
00:52:19,080 --> 00:52:20,160
ఐజాక్, ఏమైంది?
671
00:52:20,720 --> 00:52:21,800
ఏమైంది?
672
00:52:22,880 --> 00:52:24,080
నన్ను కరిచింది.
673
00:52:26,120 --> 00:52:27,120
ఏం కరిచింది?
674
00:52:29,000 --> 00:52:30,000
కుక్క.
675
00:52:33,680 --> 00:52:34,760
ఎటు వెళ్లింది?
676
00:52:36,240 --> 00:52:37,480
ఆమె భయపెట్టి తరిమేసింది.
677
00:52:37,480 --> 00:52:38,560
ఎవరు?
678
00:52:41,240 --> 00:52:43,640
ఐజాక్, ఎవరు తరిమేసారు?
679
00:52:46,800 --> 00:52:47,840
అమ్మ.
680
00:52:48,960 --> 00:52:52,080
లేదు, అది... విను, సరేనా?
681
00:52:52,080 --> 00:52:53,960
మనం అనుకున్న తేదీ అది కాదు.
682
00:52:54,680 --> 00:52:56,960
వారాంతం. వారాంతం అనుకున్నాం.
683
00:52:57,640 --> 00:52:59,840
చూడు, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను.
684
00:53:00,400 --> 00:53:03,440
ఒక్కసారి చెవులు పెట్టి విను, సరేనా?
685
00:53:03,440 --> 00:53:07,120
శనివారం, రేపు కాదు,
ఎల్లుండి, శనివారం.
686
00:53:07,120 --> 00:53:08,960
15 వేలకు మోటారు మారుస్తున్నాను.
687
00:53:08,960 --> 00:53:10,440
అదంతా వాడిదే.
688
00:53:10,560 --> 00:53:12,400
అసలు వింటావా, చెవిటి మేళం.
689
00:53:13,000 --> 00:53:15,440
నాకు డబ్బు వస్తేనే అతనికి వస్తుంది.
690
00:53:15,440 --> 00:53:17,160
15 వేలు, ఇక లెక్క సరిపోతుంది.
691
00:53:17,160 --> 00:53:19,680
ఆ పిల్లలను ఇక్కడకు పంపాడంటే,
692
00:53:19,680 --> 00:53:22,000
వాళ్లను చంపి చెత్త సంచీలలో పడేస్తాను.
693
00:53:42,600 --> 00:53:43,600
పని చేయవే.
694
00:53:45,520 --> 00:53:46,880
పని చేసి చావు!
695
00:53:48,360 --> 00:53:49,480
పని చేసి చావు!
696
00:54:04,600 --> 00:54:05,600
ఛ! ఛ!
697
00:54:05,720 --> 00:54:06,720
డెబ్బీ
కాలింగ్
698
00:54:34,120 --> 00:54:35,520
నువ్వెవరు?
699
00:54:37,760 --> 00:54:39,080
లోపలికి ఎలా వచ్చావు?
700
00:54:56,560 --> 00:54:59,720
నువ్వు బియాంకా స్నేహితురాలివా?
దొంగిలించటానికి వచ్చావా?
701
00:54:59,720 --> 00:55:01,200
లేదు, లేదు! కాదు, కాదు!
702
00:55:01,200 --> 00:55:03,120
- నీ పేరేంటి?
- దేవుడా.
703
00:55:03,120 --> 00:55:04,720
దయచేసి వదిలెయ్యి. దయచేసి.
704
00:55:08,200 --> 00:55:10,840
నువ్వెక్కడికి వెళ్లట్లేదు.
705
00:55:12,200 --> 00:55:13,640
- ఏం దొరికింది?
- లేదు...
706
00:55:13,640 --> 00:55:14,920
ఏం తీసుకున్నావు?
707
00:55:22,160 --> 00:55:24,720
ఛా!
708
00:55:41,600 --> 00:55:42,640
తలుపు తెరువు.
709
00:55:44,000 --> 00:55:46,080
తలుపు తెరువవే!
710
00:55:47,520 --> 00:55:49,920
నిన్ను చంపేస్తానే.
711
00:55:53,280 --> 00:55:55,160
చచ్చావే నా చేతిలో!
712
00:57:21,920 --> 00:57:23,920
{\an8}ఉపశీర్షికలు అనువదించినది BM
713
00:57:23,920 --> 00:57:26,000
{\an8}క్రియేటివ్ సూపర్వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి