1
00:01:15,040 --> 00:01:17,280
రిగ్బీస్ టాయ్స్
2
00:02:21,800 --> 00:02:25,080
17 మంది చనిపోయారు, 11 మంది పిల్లలు.
3
00:02:26,040 --> 00:02:27,440
అసలైన దెయ్యం బయట ఉంది.
4
00:02:28,880 --> 00:02:30,280
నీడలలో తిరుగుతుంది.
5
00:02:31,960 --> 00:02:34,000
ఫోటో చివరన మసకలో ఉంటుంది.
6
00:02:34,560 --> 00:02:38,160
నాకు ముఖం గుర్తు లేదు,
కానీ అతని శక్తి తెలుసు. నీకు కూడా.
7
00:02:38,160 --> 00:02:40,400
వచ్చే ఏడాది, 17 మంది చనిపోతారు.
8
00:02:42,720 --> 00:02:44,000
ఇవి ప్రింటర్లో ఉన్నాయి.
9
00:02:45,040 --> 00:02:46,040
ధన్యవాదాలు.
10
00:02:53,040 --> 00:02:54,040
ఇంటికి వెళ్లావా?
11
00:02:54,040 --> 00:02:55,440
వెళ్లి ఏం చేయాలి.
12
00:02:55,440 --> 00:02:57,920
రవి ఇంకా లీడ్స్‌లో శిక్షణలో ఉన్నాడు.
13
00:02:59,360 --> 00:03:00,360
నిద్ర పోయావా?
14
00:03:02,520 --> 00:03:03,520
తెలియదు.
15
00:03:06,040 --> 00:03:08,000
అంటే, బాధితులందరి లెక్క చూసాము.
16
00:03:09,680 --> 00:03:12,320
ఏవీ ప్రొఫైల్‌కు సెట్ కాలేదు.
బాంబర్ తప్పించుకున్నాడు.
17
00:03:13,760 --> 00:03:15,600
ఇంకా సీసీటీవీ చూస్తున్నాము.
18
00:03:15,600 --> 00:03:17,520
- ఏవైనా ఆధారాలు?
- ఆధారాలు లేవు.
19
00:03:18,160 --> 00:03:20,240
ప్రతిబింబం అంతే. ఇది చూడు.
20
00:03:20,960 --> 00:03:24,840
ఫోటోలో మూలన చూడు,
పసుపు హుడీ. కానీ...
21
00:03:26,560 --> 00:03:28,000
స్పష్టంగా కనిపించట్లేదు.
22
00:03:29,840 --> 00:03:32,960
హా, ఇలాంటివి ప్లాన్ చేసావంటే,
కెమెరాల సంగతి తెలిసుండాలి.
23
00:03:32,960 --> 00:03:35,240
అంటే, అన్నింటినీ తప్పించుకోలేవు.
24
00:03:35,240 --> 00:03:36,320
వాడిని కనిపెడతాము.
25
00:03:37,480 --> 00:03:39,680
లేదు. లేదు, కనిపెట్టగలమని అనుకోను.
26
00:03:41,560 --> 00:03:44,960
అవును, అలా ఉండాలి.
అలా కూర్చొని ఏడుస్తుండాలి.
27
00:03:45,520 --> 00:03:47,440
షెపర్డ్ పెద్ద తిక్కలోడు.
28
00:03:48,160 --> 00:03:49,600
ఇది చేసినవాడి లాగానే.
29
00:03:50,080 --> 00:03:51,720
ఏదో దారుణం జరగబోతుందని తెలుసు,
30
00:03:51,720 --> 00:03:53,760
నాకు తెలిసినట్టుగానే,
31
00:03:53,760 --> 00:03:56,160
ఎందుకంటే ఎప్పుడూ ఏదో దారుణం
జరుగుతూనే ఉంటుంది!
32
00:03:58,520 --> 00:04:04,520
లోకంలో ఒక దారుణం తర్వాత మరొకటి
జరుగుతూనే ఉంటుంది.
33
00:04:13,000 --> 00:04:14,520
అతను లెక్క తప్పాడు.
34
00:04:18,600 --> 00:04:20,440
లేదు, అతను 17 మంది చస్తారన్నాడు.
35
00:04:21,720 --> 00:04:23,360
నేను చూస్తే, 16 మందే ఉన్నారు.
36
00:04:29,560 --> 00:04:30,560
ఏంటి?
37
00:04:35,480 --> 00:04:37,360
కెల్లీ వాట్సన్, ఆమె...
38
00:04:41,240 --> 00:04:42,920
ఆమె తొమ్మిది నెలల గర్భవతి.
39
00:04:48,800 --> 00:04:50,440
చూడు, ఇది...
40
00:04:50,440 --> 00:04:51,920
- లేదు, ఇది...
- సరే.
41
00:04:52,040 --> 00:04:54,040
- యాదృచ్ఛికం అంతే.
- సరే, నిక్!
42
00:05:02,480 --> 00:05:04,560
అసలు దాన్ని నువ్వెన్నిసార్లు చూసావు?
43
00:05:04,560 --> 00:05:06,000
పాటలు వింటున్నాను అంతే.
44
00:05:07,440 --> 00:05:08,520
అవును అంతే.
45
00:05:09,880 --> 00:05:10,880
నాదే పొరపాటు.
46
00:05:12,800 --> 00:05:15,120
మనుగడ ఒక వలయం. పునరావృతం.
47
00:05:15,760 --> 00:05:19,880
ప్రతి పునరావృతంలో,
నువ్వూ నేను ఇదే గదిలో కూర్చుంటాం.
48
00:05:19,880 --> 00:05:23,200
నువ్వు నీ ప్రశ్నలు అడుగుతావు.
నేను నిజం చెపుతాను.
49
00:05:23,800 --> 00:05:27,160
నువ్వు నన్ను నమ్మకపోతే
ఏం జరుగుతుందో హెచ్చరిస్తాను.
50
00:06:02,280 --> 00:06:06,680
ద డెవిల్స్ అవర్
51
00:06:14,360 --> 00:06:17,440
ఇప్పటికి ఏడాది అయినా
అతను ఇంకా మంట కలలే కంటున్నాడు.
52
00:06:18,240 --> 00:06:21,360
పీడకలలు ఆగిపోతాయని అనుకుంటే
ఇంకా పెరుగుతున్నాయి.
53
00:06:22,960 --> 00:06:27,720
అతను మరిచిపోయే మార్గం
నాకు దొరికితే బాగుండు.
54
00:06:29,600 --> 00:06:31,080
కలలతో కొంచెం జాగ్రత్త.
55
00:06:31,080 --> 00:06:34,280
అవి పిచ్చిగా తికమకగా ఉండవచ్చు.
56
00:06:35,080 --> 00:06:37,240
అయితే ఒకటే నేపథ్యంలో ఉన్నాయి.
57
00:06:39,120 --> 00:06:40,880
ఐజాక్ నాన్నను ఆఖరిగా కలిసింది?
58
00:06:42,320 --> 00:06:43,480
ఆ రాత్రే ఆఖరు.
59
00:06:45,160 --> 00:06:46,800
- లూసీ, అది కారణం...
- లేదు.
60
00:06:47,280 --> 00:06:49,120
ఇంకోసారి మైక్‌ను కలవడు.
61
00:06:51,960 --> 00:06:53,800
- పర్యవేక్షణలో...
- తనను వదిలేసాడు!
62
00:06:58,520 --> 00:07:02,600
తలుపు మూసేసి
వీడిని మంటలలో కాలిపొమ్మని వదిలేసాడు.
63
00:07:03,840 --> 00:07:06,920
నిరూపించగలిగితే, అతను జైలులో ఉంటాడు,
కానీ కుదరదు.
64
00:07:06,920 --> 00:07:08,400
నువ్వింకా నన్ను నమ్మట్లేదు.
65
00:07:08,400 --> 00:07:11,640
- ఇది పునరావృత పీడకల...
- జ్ఞాపకంపై ఆధారపడింది!
66
00:07:11,640 --> 00:07:13,360
విషాద జ్ఞాపకం.
67
00:07:13,920 --> 00:07:16,920
గజిబిజి. కల్పనలతో నిండింది.
68
00:07:20,080 --> 00:07:22,160
అయితే, వాడు ఊహించుకోకపోతే అప్పుడేంటి?
69
00:07:22,720 --> 00:07:24,520
అంటే, ఊహాత్మకంగా.
70
00:07:24,520 --> 00:07:29,040
అతను నిజంగా ఆ అసాధ్యమైనవన్నీ
అనుభవించి ఉండుంటే.
71
00:07:30,720 --> 00:07:34,640
నువ్వెలా చికిత్స చేస్తావు,
ఎలా అంగీకరించేలా చేస్తావు?
72
00:07:37,880 --> 00:07:40,160
నాకు అర్థం కాలేదనుకుంటాను?
73
00:07:43,600 --> 00:07:45,120
లేదు. వదిలెయ్.
74
00:07:49,960 --> 00:07:52,040
అతని భయం పోవాలి అంతే.
75
00:07:53,600 --> 00:07:56,080
స్విచ్ వేసి వదిలినట్టుగా.
76
00:07:57,320 --> 00:07:58,320
అవును.
77
00:07:58,840 --> 00:08:02,920
లూసీ, మనం అప్పుడప్పుడు
ఏకాంతంగా సెషన్స్ చేద్దామా?
78
00:08:03,560 --> 00:08:06,320
ప్రతిసారీ వద్దు, కానీ తెలుసుగా,
79
00:08:06,320 --> 00:08:10,000
కొన్నిసార్లు, తను నీ ప్రవర్తన ఆధారంగా
నడచుకుంటాడని అనిపిస్తుంది.
80
00:08:15,600 --> 00:08:16,600
లూసీ?
81
00:08:19,640 --> 00:08:22,120
సరే. అలాగే.
82
00:08:22,120 --> 00:08:23,600
అంటే, ఆలోచిస్తాను.
83
00:08:24,400 --> 00:08:25,400
ధన్యవాదాలు.
84
00:09:04,720 --> 00:09:05,720
ఏమంటావు?
85
00:09:07,000 --> 00:09:08,000
నాకు కనిపించట్లేదు.
86
00:09:19,080 --> 00:09:20,080
ఇక్కడ.
87
00:09:23,080 --> 00:09:24,080
దీనిని ఒత్తు.
88
00:09:28,080 --> 00:09:29,080
ఇప్పుడు బాగుందా?
89
00:09:38,200 --> 00:09:40,640
అరే. నీ గదికి కొన్ని సామాన్లు తెచ్చాను.
90
00:10:07,160 --> 00:10:08,160
ఐదు.
91
00:10:10,520 --> 00:10:11,720
పదిహేను.
92
00:10:20,960 --> 00:10:22,000
ఏం పర్వాలేదు.
93
00:10:22,520 --> 00:10:24,000
ఇది ఇంటి నిర్మాణం అంతే.
94
00:10:24,840 --> 00:10:28,840
కొత్త ఇళ్లు అంతే,
సర్దుకోవటానికి సమయం పడుతుంది. మనలాగే.
95
00:10:31,000 --> 00:10:32,000
ఐజాక్.
96
00:10:33,840 --> 00:10:37,120
ఇక్కడ దెయ్యాలు లేవు, ఒట్టు.
97
00:10:39,000 --> 00:10:40,160
ఏమైంది?
98
00:10:41,320 --> 00:10:43,480
మెరిడిత్ దెయ్యాలు అవీ లేవని అంటుంది.
99
00:10:45,080 --> 00:10:46,080
కానీ ఉన్నాయి.
100
00:10:48,520 --> 00:10:50,760
ఆమె చెప్పేటప్పుడు ఆమె వెనుకనే ఒకటి ఉంది.
101
00:10:52,880 --> 00:10:54,960
ఇదెప్పుడు జరిగింది? ఆటలలోనా?
102
00:10:58,720 --> 00:11:00,240
బంగారం.
103
00:11:01,840 --> 00:11:03,040
ఇక్కడ అంతా వేరు.
104
00:11:04,680 --> 00:11:09,360
ఈ ఇంట్లో ఎవరూ నివసించలేదు.
105
00:11:09,360 --> 00:11:13,880
మనమే ఉన్నాము అంతే.
ఈ జీవితానికి. సరేనా?
106
00:11:13,880 --> 00:11:15,040
ఈ లూప్.
107
00:11:16,520 --> 00:11:18,160
నేను ఇక్కడ ఉండకూడదేమో.
108
00:11:19,840 --> 00:11:21,560
"ఏమోలు" లాంటివి ఉండవసలు.
109
00:11:23,360 --> 00:11:26,040
మన ఇష్ట ప్రకారమే మనం ఇక్కడకు వచ్చాం.
110
00:11:28,600 --> 00:11:32,120
నేను నిన్ను పెంచుతున్నట్టుగా.
111
00:11:40,800 --> 00:11:45,600
నేను ఈ ఆటలో గెలుస్తాను అంతే.
112
00:13:02,200 --> 00:13:03,360
బాబు!
113
00:13:04,040 --> 00:13:05,200
ఎక్కడికి వెళుతున్నావు?
114
00:13:06,240 --> 00:13:09,400
- వెళ్లిపోండి.
- అదేంటి, కామాంధుడా?
115
00:13:09,520 --> 00:13:10,840
కామాంధుడిలాగా బట్టలు ఏంటి?
116
00:13:10,840 --> 00:13:12,720
- ఓయ్, పట్టుకో!
- హే.
117
00:13:12,720 --> 00:13:16,040
డబ్బులు ఇవ్వు,
లేదంటే కామాంధుడివని ఫిర్యాదు చేస్తాము.
118
00:13:16,640 --> 00:13:19,200
మిమ్మల్ని కొట్టాలని లేదు, అందుకే...
119
00:13:19,720 --> 00:13:20,800
అబ్బా.
120
00:13:20,800 --> 00:13:22,960
వాడి ఫోన్ లాక్కో. త్వరగా. ఫోన్ లాక్కో.
121
00:13:24,960 --> 00:13:26,200
వెధవ!
122
00:13:26,200 --> 00:13:27,920
హే, చూసుకో!
123
00:14:15,520 --> 00:14:19,560
డిలన్, నా మాట వింటున్నావా? డిలన్!
124
00:14:20,960 --> 00:14:21,960
క్షమించు.
125
00:14:21,960 --> 00:14:23,440
ఇక్కడ కళ్లు తిరిగి పడకు.
126
00:14:24,800 --> 00:14:26,720
దేవుడా!
127
00:14:26,720 --> 00:14:28,560
నాకు వివరాలు చెప్పు అంతే.
128
00:14:29,040 --> 00:14:31,200
బాధితుడిని మూడుసార్లు పొడిచారు.
129
00:14:31,200 --> 00:14:33,720
పుర్రె పగిలింది, ఇక్కడ, ఇక్కడ.
130
00:14:33,720 --> 00:14:35,400
దానివల్ల రక్తనాళాలు చిట్లాయి.
131
00:14:35,400 --> 00:14:38,520
చావుకు కారణం మెదడులో రక్తస్రావం.
132
00:14:38,520 --> 00:14:39,680
వెంటనే కాలేదు.
133
00:14:39,680 --> 00:14:41,600
అందుకే కొంతసేపు నడిచాడు.
134
00:14:41,600 --> 00:14:43,360
- తన రక్తం పోయింది.
- లోపల జరిగింది.
135
00:14:43,360 --> 00:14:45,920
రక్తస్రావం మెదడు, పుర్రెల మధ్యలో అయింది.
136
00:14:45,920 --> 00:14:47,000
అబ్బబ్బా.
137
00:14:48,120 --> 00:14:49,120
ఇంకేమన్నా ఉందా?
138
00:14:49,680 --> 00:14:50,720
ముఖ్యమైనవైతే లేవు.
139
00:14:50,720 --> 00:14:52,560
తల గాయంతో మృతి. అంతే ఇక.
140
00:14:52,560 --> 00:14:54,000
నేరస్తుడిని శిక్షించవచ్చు.
141
00:14:54,000 --> 00:14:55,160
సరే.
142
00:14:55,160 --> 00:14:56,440
వాడిని వదలకు.
143
00:14:57,120 --> 00:14:59,720
హాస్యాస్పదం. కొత్త జోకులు వాడు, గిబ్సన్.
144
00:15:07,800 --> 00:15:09,120
డీఐ డిలన్.
145
00:15:09,120 --> 00:15:12,520
రవి. సామ్‌ను. సామ్ బాయిడ్.
146
00:15:13,360 --> 00:15:16,200
బాయిడ్... హాయ్, సారీ, కొత్త ఫోన్.
147
00:15:16,200 --> 00:15:17,920
నీ నంబర్ సేవ్ చేసుకోలేదు.
148
00:15:17,920 --> 00:15:20,360
సరే, హఠాత్తుగా కాల్ చేసినందుకు సారీ.
149
00:15:20,360 --> 00:15:22,800
ఏం పర్వాలేదు. రిఫరెన్స్ కావాలా?
150
00:15:23,880 --> 00:15:25,760
సహాయం. చాలా పెద్దది.
151
00:15:26,760 --> 00:15:29,680
కచ్చితంగా "కాదు," అంటావు,
అయినా కానీ అడుగుతాను.
152
00:15:30,400 --> 00:15:31,400
నీ సంగతి తెలుసులే.
153
00:15:34,480 --> 00:15:38,000
గిడియన్ షెపర్డ్ నిన్న రాత్రి
హాక్రిడ్జ్ పార్క్ దగ్గర కనిపించాడు.
154
00:15:38,800 --> 00:15:40,520
హాట్బీ అక్కడ డీఐ కావాలన్నాడు.
155
00:15:41,400 --> 00:15:43,440
మీ దగ్గర చాలా మంది డీఐలు ఉన్నారుగా.
156
00:15:43,440 --> 00:15:47,640
బాగా చేసేవాడు షెఫీల్డ్‌కు వెళ్లాడు,
అతను ఈ కేసులో నిపుణుడు.
157
00:15:48,840 --> 00:15:51,680
నన్ను దాదాపు ఫైర్ చేసిన కేసు.
ఎందుకు వచ్చాననుకుంటున్నావు?
158
00:15:52,360 --> 00:15:55,120
మీ డీసీఐతో మొత్తం క్లియర్ చేయించాను.
159
00:15:56,240 --> 00:15:57,640
సామ్, నా అవసరం లేదు.
160
00:15:57,640 --> 00:16:01,120
ఎందుకని? వాడిని పట్టుకోవాలని లేదా?
161
00:16:01,120 --> 00:16:02,200
నిజం చెప్పనా?
162
00:16:03,320 --> 00:16:04,320
నాకు లేదులే.
163
00:16:05,320 --> 00:16:08,160
రవి, వాడు బయటున్నాడు.
164
00:16:09,280 --> 00:16:10,280
సమీపంలో ఉన్నాడు.
165
00:16:11,280 --> 00:16:13,560
వాడేదో ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది.
166
00:16:15,640 --> 00:16:16,720
కచ్చితంగా చేస్తాడు.
167
00:16:17,640 --> 00:16:19,960
అందుకే దయచేసి నాకు సహాయపడు.
168
00:16:21,040 --> 00:16:23,720
చూడు, నువ్వే చేయాలి.
వాడి గురించి నీకే బాగా తెలుసు.
169
00:16:26,040 --> 00:16:27,360
అది పూర్తిగా నిజం కాదు.
170
00:16:31,840 --> 00:16:35,360
అనుమానితుడి దగ్గరికి వెళ్లవద్దని,
ఏదైనా సమాచారం ఉంటే
171
00:16:35,360 --> 00:16:38,200
పోలీసులకు తెలియజేయాలని
ప్రజలను హెచ్చరిస్తున్నాము.
172
00:16:39,000 --> 00:16:42,280
గిడియన్ షెపర్డ్
కచ్చితంగా కనిపించిన మొదటి సందర్భం
173
00:16:42,280 --> 00:16:45,440
11 నెలల క్రితం
పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాక,
174
00:16:45,440 --> 00:16:49,360
ఆ సమయంలో ఇద్దరు ఆఫీసర్లను
గాయపరిచాడు. కావలెను...
175
00:16:54,240 --> 00:16:55,360
అబ్బా.
176
00:17:48,800 --> 00:17:54,560
నీలం సుబారు
ఇంప్రెజా - దొంగిలించబడింది
177
00:18:00,240 --> 00:18:01,480
రావద్దని చెప్పానుగా.
178
00:18:04,520 --> 00:18:06,480
నువ్వు ఫోన్ ఎత్తట్లేదు.
179
00:18:08,280 --> 00:18:09,920
నీ వెనుక ఎవరైనా వచ్చారంటే...
180
00:18:10,880 --> 00:18:12,720
నా ముఖం కాదు పేపరులో వచ్చింది.
181
00:18:14,040 --> 00:18:15,240
జనాలను కొట్టావు.
182
00:18:16,440 --> 00:18:17,680
నాకు మరో దారి లేకుండే.
183
00:18:17,680 --> 00:18:19,560
- పిల్లలు.
- మరీ అంత కాదు.
184
00:18:21,080 --> 00:18:23,200
ఎక్కువమంది ఉన్నారు. ఆత్మరక్షణ.
185
00:18:24,480 --> 00:18:26,080
అంటే, నీకోసం వెతుకుతున్నారు.
186
00:18:27,400 --> 00:18:29,320
నా తొమ్మిదేళ్ల నుండి చేస్తున్నారు.
187
00:18:30,080 --> 00:18:31,920
వెయ్యి జన్మల క్రితం. ఏ మార్పు లేదు.
188
00:18:31,920 --> 00:18:34,680
అంతా మారిపోతుంది.
భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు.
189
00:18:36,320 --> 00:18:37,320
నాకు తెలుసు.
190
00:18:39,560 --> 00:18:42,160
అక్కడ బయట కంపరమైనదేదో తిరుగుతోంది.
191
00:18:42,160 --> 00:18:43,760
{\an8}పసుపు
హుడీ - నల్ల బ్యాగు
192
00:18:43,760 --> 00:18:46,280
నన్ను దాటి వెళ్లినా
నేను అతనిని గుర్తించలేను.
193
00:18:47,240 --> 00:18:50,080
అతను ఎవరికైనా ఏదైనా చేయగలడు.
194
00:18:51,640 --> 00:18:52,640
కానీ చేయడు.
195
00:18:53,520 --> 00:18:54,800
అతను ఏం చేస్తాడో తెలుసు.
196
00:18:56,320 --> 00:18:57,520
ఎప్పుడో కూడా తెలుసు.
197
00:18:59,400 --> 00:19:01,240
ఆ రాక్షసుడికి గుర్తింపు కావాలంతే.
198
00:21:18,400 --> 00:21:20,920
అక్కడ పొగ తాగకు.
కర్టెన్లు కంపు కొడతాయి.
199
00:21:38,480 --> 00:21:40,080
ఇది విని నీకు కోపం వస్తుంది.
200
00:21:41,000 --> 00:21:42,160
అయితే చెప్పకు మరి.
201
00:21:43,640 --> 00:21:45,080
కొంచెం విశ్రాంతి తీసుకో.
202
00:21:47,640 --> 00:21:50,240
పోయినేడాది, షెపర్డ్, స్లేడ్లతో.
203
00:21:50,720 --> 00:21:52,120
ఇప్పుడు ఈ బాంబింగ్.
204
00:21:54,280 --> 00:21:55,880
నిన్ను కృంగదీస్తుందని భయం.
205
00:21:57,320 --> 00:21:58,400
నాకు కంగారుగా ఉంది...
206
00:22:00,120 --> 00:22:01,120
ఏంటి?
207
00:22:02,200 --> 00:22:05,360
శరీరం ఇక్కడే ఉన్నా మనస్సు ఎక్కడో ఉంది.
208
00:22:07,760 --> 00:22:08,880
మిస్సవుతున్నాను.
209
00:22:12,160 --> 00:22:13,760
అది స్వార్థమే కావచ్చు, అది...
210
00:22:15,280 --> 00:22:17,840
- చెప్పాలంటే? వదిలెయ్యి.
- లేదు, పర్వాలేదు.
211
00:22:19,760 --> 00:22:20,880
నిజం చెప్పావు.
212
00:22:22,760 --> 00:22:23,760
అవునా?
213
00:22:25,160 --> 00:22:26,600
ఒక్కటే జీవితం ఉంటుంది.
214
00:22:28,480 --> 00:22:29,960
నేనూ నిన్ను మిస్సవుతున్నాను.
215
00:22:34,040 --> 00:22:35,600
మనం దూరంగా పోవాలి.
216
00:22:36,280 --> 00:22:39,680
మంచి విలాసవంతమైన, వేడి ప్రదేశానికి.
217
00:22:42,000 --> 00:22:43,480
నాకు వెళ్లాలని లేదు.
218
00:22:48,520 --> 00:22:49,960
నాకు బిడ్డను కనాలనుంది.
219
00:23:04,760 --> 00:23:06,040
{\an8}గర్భవతి ||
గర్భవతి కాదు |
220
00:24:52,120 --> 00:24:54,560
నేను నీ సోది మాత్రలు వేసుకోను.
221
00:25:12,720 --> 00:25:14,120
ఆమె సదా ఇక్కడే ఉంటుంది.
222
00:25:15,600 --> 00:25:18,160
అక్కడ కూర్చొని ఉంటుంది,
మంచం చివర అంతే.
223
00:25:27,440 --> 00:25:28,920
నన్ను అలా చూడకు.
224
00:25:30,120 --> 00:25:31,520
నన్ను అలా చూడకు!
225
00:25:32,000 --> 00:25:33,280
నన్ను చూడకు!
226
00:25:38,320 --> 00:25:40,240
డాక్టర్ ఎల్లిస్ పొద్దునే చూసారు.
227
00:25:41,320 --> 00:25:42,720
ఆమెను నిద్రపుచ్చలేకపోయాను.
228
00:25:45,280 --> 00:25:47,760
- అమ్మా?
- ఆమె నిన్న చాలా చక్కగా ఉంది.
229
00:25:48,720 --> 00:25:50,120
ఏం జరిగిందో మాకు తెలియదు.
230
00:25:52,080 --> 00:25:53,720
అమ్మా, అది...
231
00:25:53,720 --> 00:25:55,720
అరే, కూర్చో. కూర్చో.
232
00:25:56,800 --> 00:25:57,800
సరే మరి.
233
00:25:58,680 --> 00:25:59,680
సరే, కూర్చో.
234
00:26:05,280 --> 00:26:07,920
అమ్మా? నన్ను చూడు.
235
00:26:12,200 --> 00:26:14,560
డాక్టర్ ఎల్లిస్ ఇప్పుడు ఎక్కడున్నారు?
236
00:26:14,560 --> 00:26:16,000
ఇంకో పేషెంట్ దగ్గర ఉన్నాడు.
237
00:26:17,600 --> 00:26:18,600
అంతేగా.
238
00:26:20,480 --> 00:26:22,520
ఏం జరిగింది? ఆమెకు ఏం ఇస్తున్నారు?
239
00:26:23,280 --> 00:26:26,560
అదే డోసు.
ఆమెకు తట్టుకోవడం పెరిగినట్టుంది.
240
00:26:27,560 --> 00:26:29,200
మనం వేరేవి చూడాలి.
241
00:26:30,160 --> 00:26:31,160
బొమ్మ ఎక్కడ?
242
00:26:32,720 --> 00:26:36,320
డాక్టర్ ఎల్లిస్ ఆమె ఆ బొమ్మనే చూస్తుందా
లేక ఊరకే అలా చూస్తుందా...
243
00:26:37,440 --> 00:26:38,880
అనేది తెలుసుకోవాలని.
244
00:26:41,400 --> 00:26:43,640
మళ్లీ పెడతారా? దయచేసి.
245
00:26:53,440 --> 00:26:54,440
అమ్మా?
246
00:26:58,080 --> 00:27:00,200
నాతో మాట్లాడు. హే. ఏమైంది?
247
00:27:03,160 --> 00:27:04,480
ఏమైంది?
248
00:27:08,440 --> 00:27:09,840
- అమ్మా!
- వదిలెయ్యి.
249
00:27:10,680 --> 00:27:11,920
నేను వదిలేసాను.
250
00:27:11,920 --> 00:27:14,040
ఇంకా దారుణంగా అవుతోంది.
ఈ చోటు వల్లే.
251
00:27:14,760 --> 00:27:17,000
- ఆమెకు ఇదే మంచి చోటు.
- అవునా?
252
00:27:17,840 --> 00:27:19,160
స్పెషలిస్టులు కావాలి.
253
00:27:20,600 --> 00:27:22,400
డా. ఎల్లిస్‌తో మాట్లాడతానంటే...
254
00:27:22,400 --> 00:27:24,480
వాళ్లకు సమస్యే తెలియదు.
మీకు కూడా.
255
00:27:24,480 --> 00:27:26,680
మీరు నా మాట వినరు.
ఎవరూ వినరు!
256
00:27:30,400 --> 00:27:31,520
క్షమించు, నేను...
257
00:27:35,760 --> 00:27:37,720
కొంచెం ఏకాంతం ఇస్తావా, దయచేసి?
258
00:27:52,560 --> 00:27:53,720
ఎక్కడున్నావు?
259
00:27:56,240 --> 00:27:57,560
ఎటు వెళ్లావు?
260
00:27:59,680 --> 00:28:02,200
నిన్ను వదిలేసి వెళ్లనివ్వను ఇక. అర్థమైందా?
261
00:28:03,680 --> 00:28:05,240
నువ్వు తిరిగి రావాలి అంతే.
262
00:28:10,240 --> 00:28:12,200
నువ్వు తిరిగి రావాలి.
263
00:28:41,200 --> 00:28:42,200
డీఐ డిలన్.
264
00:28:43,520 --> 00:28:44,800
డీఎస్ బాయిడ్.
265
00:28:46,040 --> 00:28:47,040
వచ్చినందుకు సంతోషం.
266
00:28:47,960 --> 00:28:50,440
- ఇది తాత్కాలికం.
- అయినా సరే.
267
00:28:50,440 --> 00:28:53,640
నాకు ఆయా కావాలంటే,
నేను ఏడిపించగలిగేవాళ్లు అయిండాలి.
268
00:28:53,640 --> 00:28:55,640
నిన్ను ప్రమోట్ చేయుమని అడగాల్సింది.
269
00:28:56,480 --> 00:28:59,760
అంటే, నా భార్యతో చెప్పు.
ఇంకా నా మూడేళ్ల పాపకు.
270
00:29:00,320 --> 00:29:01,920
పైగా డీఐలకు ఆదివారాలు పని.
271
00:29:03,000 --> 00:29:04,320
ఇంకా చర్చిలో పాడుతున్నావా?
272
00:29:05,800 --> 00:29:07,800
ఘోరంగా. కానీ నీకు ఆ భావన తెలుసుగా.
273
00:29:10,600 --> 00:29:12,880
పైన నీకోసం బల్ల సిద్ధం చేసాను, అందుకే.
274
00:29:15,120 --> 00:29:17,120
నా పాస్ తెచ్చుకుంటాను.
నేరుగా వెళదాము.
275
00:29:18,440 --> 00:29:20,520
ఏంటి? పలకరింపులు కూడా లేవా?
276
00:29:21,320 --> 00:29:22,760
నిన్ను నిందించట్లేదు, రవి.
277
00:29:29,360 --> 00:29:32,080
షెపర్డ్ గురించా? లేక నిక్ గురించా?
278
00:29:34,720 --> 00:29:36,240
సామ్, ఇది పునఃకలయిక కాదు.
279
00:29:37,920 --> 00:29:39,640
హా, అంటున్నానంతే.
280
00:29:39,760 --> 00:29:40,880
ధన్యవాదాలు.
281
00:29:41,600 --> 00:29:44,680
అంతా ఒకటే అయితే,
అక్కడికెళ్లి సరిచేయాలని వచ్చానంతే.
282
00:29:46,080 --> 00:29:47,200
సరే, నీ ఇష్టం.
283
00:29:49,200 --> 00:29:50,440
ఐతే, ఎక్కడి నుండి మొదలు?
284
00:29:53,840 --> 00:29:57,640
ఇప్పుడు, ఈ కెమెరాలు స్కూలు సొంతం,
అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి.
285
00:29:58,720 --> 00:30:00,800
జేసన్ విలియమ్స్, వింటున్నావా?
286
00:30:01,920 --> 00:30:02,920
లేదు.
287
00:30:03,040 --> 00:30:05,440
మీరు వాటిని ఇంటికి తీసుకెళుతారు.
288
00:30:05,440 --> 00:30:09,880
అందుకే అవి సరిగ్గా ఉండటం కూడా మీ బాధ్యతే.
289
00:30:09,880 --> 00:30:11,520
మార్టిన్, నీకు కూడా అంతే.
290
00:30:12,440 --> 00:30:15,040
లేదు, జానీ. అలా చేయకు, బాబు.
291
00:30:15,720 --> 00:30:19,080
మనం గాని, ఒకరినొకరు గాని
ఫోటోలు తీసుకోవటం లేదు.
292
00:30:20,240 --> 00:30:24,480
దయచేసి శ్రద్ధ పెడతారా?
ఐజాక్ చాంబర్స్, నీకు కూడా వర్తిస్తుంది.
293
00:30:27,280 --> 00:30:28,280
ధన్యవాదాలు.
294
00:30:30,320 --> 00:30:32,280
మానవ లెన్స్ దృక్కోణంలో
295
00:30:32,280 --> 00:30:35,160
మీరు ప్రకృతి ఫోటోలు తీయాలి.
296
00:30:35,960 --> 00:30:40,720
అంటే, పశువులు, చెట్లు, నదులు, బీచులు.
297
00:30:41,520 --> 00:30:43,840
కానీ మనం ప్రకృతి గురించే ఆలోచించట్లేదు.
298
00:30:43,840 --> 00:30:45,800
- వినండి...
- మన దృష్టి...
299
00:30:45,800 --> 00:30:47,880
...మీరంతా దీని మీద
చాలా బాగా పని చేసారు.
300
00:30:47,880 --> 00:30:50,320
- ఇదేం ప్రభావం?
- చాలా మంచి ఉపాయాలు.
301
00:30:50,320 --> 00:30:52,880
- సానుకూలమా, ప్రతికూలమా?
- సైమన్, ధ్యాస పెట్టు.
302
00:30:52,880 --> 00:30:55,600
- ఇంకోసారి చెప్పను.
- బాధ్యత ఉందా లేదా?
303
00:30:55,600 --> 00:30:59,640
- మీలో కొంతమందితో మాట్లాడాలి...
- చెత్త గురించి ఇంకోసారి ఆలోచించండి.
304
00:31:00,560 --> 00:31:02,160
జేసన్, దాన్ని కింద పెట్టు!
305
00:31:04,920 --> 00:31:07,280
ఐజాక్, నేను ఇప్పుడు ఏం చెప్పాను?
306
00:31:08,520 --> 00:31:09,960
"నేను ఇప్పుడు ఏం చెప్పాను?"
307
00:31:12,240 --> 00:31:13,840
అంత తమాషాగా ఉందా?
308
00:31:18,880 --> 00:31:19,880
ఏమైంది?
309
00:31:21,160 --> 00:31:22,480
నీకు ఏం కాలేదుగా?
310
00:31:32,800 --> 00:31:34,680
పర్వాలేదు. ఇది విరగలేదు.
311
00:31:35,800 --> 00:31:36,880
నిశ్శబ్దంగా ఉండండి!
312
00:31:46,080 --> 00:31:47,400
ఎవరినీ భయపెట్టాలని కాదు.
313
00:31:47,400 --> 00:31:48,880
ముందు జాగ్రత్త అంతే.
314
00:31:48,880 --> 00:31:51,520
కానీ యాదృచ్ఛికాలను
పట్టించుకోకుండా ఉండలేము.
315
00:31:52,400 --> 00:31:55,920
షెపర్డ్ దగ్గరలోనే ఉన్నాడు.
అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు.
316
00:31:55,920 --> 00:31:58,400
సరే, కొంతమంది పిల్లలు
ఆ పార్కు నుండే వస్తుంటారు.
317
00:31:59,000 --> 00:32:01,240
తల్లిదండ్రులకు
ప్రమాదాల గురించి తెలియజేయాలి,
318
00:32:01,240 --> 00:32:03,360
కానీ వాళ్లు కంగారు పడకుండా.
319
00:32:03,360 --> 00:32:05,360
లేదు. అలాగే. నేను...
320
00:32:07,600 --> 00:32:12,080
క్షమించాలి. సారీ, మీ పేరు మరిచిపోయాను.
321
00:32:12,640 --> 00:32:14,680
డీఐ డిలన్. రవి.
322
00:32:15,360 --> 00:32:16,360
అంతా బాగేనా?
323
00:32:19,400 --> 00:32:22,560
- సారీ. డీఎస్ బాయిడ్.
- మిస్ రోజర్స్.
324
00:32:22,560 --> 00:32:25,080
ఎలీనా. ఐజాక్ టీచరును.
325
00:32:25,080 --> 00:32:26,280
మంచిది.
326
00:32:26,280 --> 00:32:30,120
అంటే, ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే,
మాకు కాల్ చేయండి.
327
00:32:30,120 --> 00:32:32,360
నేరుగా మొబైల్‌కు.
ఆఫీసుకు కూడా వద్దు.
328
00:32:33,480 --> 00:32:34,480
ధన్యవాదాలు.
329
00:34:52,800 --> 00:34:56,640
"ఇది నీకోసం, అన్నది దయగల కుక్క.
ధన్యవాదాలు, అన్నాడు థామస్.
330
00:34:56,640 --> 00:34:58,480
"నేను ఇక బాధపడనక్కరలేదు.
331
00:34:59,040 --> 00:35:01,480
"ఇది నా దగ్గర ఉన్నంత వరకు
నీ జ్ఞాపకం ఉంటుంది
332
00:35:01,480 --> 00:35:03,600
"నేను ఒంటరిని కాను."
333
00:35:15,520 --> 00:35:16,920
052 క్వీన్స్గేట్
334
00:35:50,400 --> 00:35:51,640
లూసీ, ఏం చేస్తున్నావు?
335
00:35:52,400 --> 00:35:53,400
సామాను పెడుతున్నాను.
336
00:35:56,560 --> 00:35:57,640
ఇవన్నీ ఏంటి?
337
00:35:58,560 --> 00:36:00,080
చాక్లెట్ పెస్ట్రీలు.
338
00:36:01,000 --> 00:36:03,280
చాక్లెట్ పెస్ట్రీలు తినలేదని చెప్పకు.
339
00:36:03,280 --> 00:36:06,080
- లేదు.
- అంటే, బాగుంటాయి.
340
00:36:06,080 --> 00:36:07,360
టిఫిన్‌గా తినవచ్చు.
341
00:36:08,400 --> 00:36:09,920
చాక్లెట్ టిఫిన్గానా?
342
00:36:10,480 --> 00:36:11,640
నీకున్నది ఏకైక జీవితం.
343
00:36:13,160 --> 00:36:14,160
లేదు, అలా కాదు.
344
00:36:14,160 --> 00:36:15,760
అనవసరం. అవి నీకోసం కాదు.
345
00:36:17,960 --> 00:36:18,960
అవి ఎవరికోసం?
346
00:36:22,520 --> 00:36:23,520
లూసీ కోసమా?
347
00:36:26,640 --> 00:36:27,760
అమ్మ కారులో ఉంది.
348
00:36:30,960 --> 00:36:34,080
వద్దు. వద్దు, వద్దు. అలా చేయలేవు.
349
00:36:34,080 --> 00:36:36,960
ఆమెకు ఈ ఇల్లు తెలుసు.
ఇక్కడ జ్ఞాపకాలు ఉన్నాయి.
350
00:36:36,960 --> 00:36:38,600
ఆమెకు అవి ఇక్కడే ఉన్నాయి.
351
00:36:38,600 --> 00:36:41,640
- నీ ఆలోచనలు సరిగ్గా లేవు.
- లేదు. ఆలోచించట్లేదు.
352
00:36:41,640 --> 00:36:44,600
నేను ఇప్పుడు ఏం చేయకుంటే
ఆమెను శాశ్వతంగా కోల్పోతాను కనుక.
353
00:36:44,600 --> 00:36:46,360
శాశ్వతం అనేదే లేదు.
354
00:36:47,760 --> 00:36:49,080
ఆమె తిరిగి వస్తుంది.
355
00:36:50,120 --> 00:36:51,640
నువ్వూ, నేను, అందరం.
356
00:36:52,560 --> 00:36:54,160
అలాగే మిగతావారంతా కూడా.
357
00:36:54,680 --> 00:36:57,880
ఇదంతా వలయంలాగా తిరుగుతూనే ఉంటుంది.
358
00:37:00,160 --> 00:37:04,080
ఆమెను కాపాడబోయాను,
ఆమెకు జీవమివ్వబోయాను.
359
00:37:04,080 --> 00:37:05,920
కానీ ఆమె దేహం తిరస్కరించింది.
360
00:37:06,920 --> 00:37:08,400
నువ్వు చేయగలిగింది ఏం లేదు.
361
00:37:09,560 --> 00:37:11,400
- అది నీకు తెలియదు.
- నాకంతా తెలుసు.
362
00:37:13,400 --> 00:37:15,840
నా మనస్సుకు వెయ్యేళ్లు.
363
00:37:17,160 --> 00:37:20,160
నీ తలలో రెండు జీవితాలున్నాయి.
నాకు వందలున్నాయి.
364
00:37:21,160 --> 00:37:24,360
నేను కాలాను, మునిగాను,
రక్తం కారి చచ్చాను,
365
00:37:24,360 --> 00:37:26,160
బ్రతికాను, నవ్వాను.
366
00:37:29,040 --> 00:37:30,040
నీకు సహాయపడలేను.
367
00:37:30,040 --> 00:37:31,600
నీ సహాయం అడగట్లేదు.
368
00:37:31,600 --> 00:37:34,440
నేను రోజూ వస్తాను.
ఆమె తిండి, స్నానం చూస్తాను.
369
00:37:34,440 --> 00:37:36,520
- వద్దు.
- ఆమె ఉన్నట్టు కూడా తెలియదు.
370
00:37:36,520 --> 00:37:38,000
వద్దని చెప్పానుగా.
371
00:37:38,640 --> 00:37:41,200
నాకు దూరంగా ఉండు.
సురక్షితంగా ఉన్నావనుకుంటావు.
372
00:37:42,120 --> 00:37:43,320
కానీ లేవు.
373
00:37:43,880 --> 00:37:46,160
నా గురించి తెలుసనుకుంటున్నావు.
కానీ తెలియదు.
374
00:37:47,160 --> 00:37:48,320
నేను హంతకుడిని.
375
00:37:50,600 --> 00:37:53,480
పక్కవాళ్లను బాధించేవారిని చంపుతావు.
376
00:37:53,480 --> 00:37:56,200
నా దారికి అడ్డు వచ్చినవారిని చంపుతాను.
377
00:38:01,480 --> 00:38:02,840
ఆమె అడ్డు రాదు.
378
00:38:16,640 --> 00:38:17,640
మన్నించాలి.
379
00:38:19,120 --> 00:38:20,120
హలో.
380
00:38:20,120 --> 00:38:23,000
డీఐ డిలన్,
మనం పోయిన ఏడాది కలిసామనుకుంటాను.
381
00:38:23,880 --> 00:38:24,880
కలిసామా?
382
00:38:24,880 --> 00:38:26,640
గిడియన్ షెపర్డ్ కేసులో.
383
00:38:27,640 --> 00:38:28,640
నిజమే.
384
00:38:29,200 --> 00:38:30,880
డీఎస్ బాయిడ్.
385
00:38:30,880 --> 00:38:33,200
బాస్‌తో ఓ మాట మాట్లాడాలి, పర్వాలేదంటేనే.
386
00:38:33,320 --> 00:38:35,600
హా, తప్పకుండా. కూర్చోండి.
చూసి చెపుతాను.
387
00:38:38,480 --> 00:38:40,600
లేదు, ఆమె ఇక్కడ నెలలుగా పని చేయట్లేదు.
388
00:38:40,600 --> 00:38:43,360
- ఇంకా కలుస్తున్నావా?
- అప్పుడప్పుడు.
389
00:38:43,920 --> 00:38:47,440
అదంతా జరిగాక ఆమె మానేసింది.
390
00:38:47,440 --> 00:38:49,360
ఆమె ఇప్పుడు ఎక్కడ పని చేస్తోంది?
391
00:38:49,360 --> 00:38:50,680
చేయట్లేదు.
392
00:38:52,000 --> 00:38:53,400
మాకు తెలిసినంతవరకు.
393
00:38:54,640 --> 00:38:56,480
డబ్బు ఎలా సంపాదిస్తుంది?
394
00:38:56,480 --> 00:38:59,000
ఇల్లు కాలాక బీమా డబ్బు వచ్చింది.
395
00:38:59,000 --> 00:39:00,920
భర్తకు విడాకులు,
కొంచెం డబ్బు ఉంది.
396
00:39:00,920 --> 00:39:02,920
తను జూదం ఆడుతోంది.
397
00:39:03,800 --> 00:39:05,840
బుకీస్తోటి కొన్నిసార్లు చూసాను.
398
00:39:05,840 --> 00:39:06,880
గుర్రపు పందేలా?
399
00:39:07,800 --> 00:39:11,120
వింబుల్డన్ ఫైనల్. బాగా డబ్బు గెలిచింది.
400
00:39:11,120 --> 00:39:14,880
టెన్నిస్‌లో అంత డబ్బు ఉండదు,
అందుకే బాగా పందేలు కాచి ఉంటుంది.
401
00:39:15,760 --> 00:39:18,040
అందరికీ అదృష్టం కలిసి వస్తుందేమో.
402
00:39:18,640 --> 00:39:21,120
ఈ సీజన్ విగన్కు
అసలు అచ్చి రాలేదు, కదా?
403
00:39:21,120 --> 00:39:22,160
రగ్బీ సూపర్
2వ వారం
404
00:39:22,280 --> 00:39:25,320
ఏ గేమ్ ఫలితాలనూ ఊహించలేము,
అందరినీ అవాక్కు చేస్తాయి.
405
00:39:25,320 --> 00:39:26,560
నిజమే.
406
00:39:26,560 --> 00:39:27,680
హెలెన్స్ 23
6 డెవిల్స్
407
00:39:27,800 --> 00:39:30,160
ఇబ్బందులను ఎదుర్కొని తిరిగి వచ్చారు.
408
00:39:30,280 --> 00:39:32,840
ఐదు వారాల ఎత్తుపల్లాలలో
తక్కువ నష్టాలే చూసాము.
409
00:39:32,840 --> 00:39:34,960
ఆఖరి రెండు ఆటలు అవాక్కు చేసాయి.
410
00:39:34,960 --> 00:39:36,880
గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు.
411
00:39:36,880 --> 00:39:39,040
కొత్త కోచ్ మంచిగా నిరూపించాడు...
412
00:39:48,560 --> 00:39:49,600
రవి.
413
00:39:49,600 --> 00:39:50,640
హాయ్.
414
00:39:52,080 --> 00:39:54,600
- ఏం చేస్తున్నావు...
- నేను... తిరిగి వచ్చాను.
415
00:39:54,600 --> 00:39:56,640
కలిసి మాట్లాడుదామని వచ్చాను.
416
00:39:56,640 --> 00:39:58,440
నీ నంబరు లేదు, అందుకే.
417
00:40:02,000 --> 00:40:03,320
మమ్మల్ని ఎలా కనిపెట్టావు?
418
00:40:04,600 --> 00:40:05,640
డిటెక్టివ్‌ను కదా.
419
00:40:09,680 --> 00:40:13,440
- ఇబ్బందంటే, నేను...
- లేదు. కలవటం సంతోషం.
420
00:40:17,680 --> 00:40:20,000
హలో, ఐజాక్, చాలా రోజులైంది.
421
00:40:28,320 --> 00:40:29,800
హే! నీకు గుర్తున్నాను!
422
00:40:31,320 --> 00:40:33,960
ఐజాక్, యూనిఫామ్ మార్చుకుంటావా? సరేనా?
423
00:40:34,520 --> 00:40:35,520
మంచి పిల్లవాడు.
424
00:40:39,000 --> 00:40:40,680
చాంబర్స్, ఇక్కడంతా విచిత్రం.
425
00:40:42,040 --> 00:40:43,320
అంటే. అది...
426
00:40:44,920 --> 00:40:46,560
నా టీవీ లైసెన్స్ తీసుకోలేదు.
427
00:40:46,560 --> 00:40:49,080
అందుకే ఎవరికీ ఇక్కడ ఉన్నట్టు తెలియదు.
428
00:40:50,120 --> 00:40:51,920
అంటే, నీ రహస్యం భద్రంగా ఉంటుంది.
429
00:40:54,040 --> 00:40:55,280
లోపలికి వస్తావా?
430
00:40:58,560 --> 00:41:01,360
బీర్ కావాలా? లేదంటే డ్యూటీలో ఉన్నావా?
431
00:41:01,920 --> 00:41:02,920
అలాంటిదే.
432
00:41:04,640 --> 00:41:05,640
"అలాంటిదేనా."
433
00:41:06,480 --> 00:41:08,560
అతనికోసం వచ్చావు కదా?
వార్తలలో చూసాను.
434
00:41:10,160 --> 00:41:11,320
ముగిసిందని అనుకున్నా.
435
00:41:12,440 --> 00:41:17,560
రేజర్ బ్లేడులు, గాట్ల గురించి
వాడి గోలంతా విని అనుకున్నాను,
436
00:41:18,360 --> 00:41:20,120
- కేవలం...
- చేతులు కోసుకున్నాడంతే?
437
00:41:22,000 --> 00:41:23,600
సారీ, సారీ.
438
00:41:26,560 --> 00:41:28,120
ఎన్ని రోజులు ఉంటావు?
439
00:41:29,000 --> 00:41:30,160
అవసరమైనన్ని రోజులు.
440
00:41:31,880 --> 00:41:33,120
ఐజాక్ టీచర్లను కలిసాను.
441
00:41:33,640 --> 00:41:35,840
వారు గంభీరంగా తీసుకుంటున్నారు.
442
00:41:37,920 --> 00:41:40,400
అతను మనల్ని ఏడాదిపాటు వదిలేసాడు.
443
00:41:41,360 --> 00:41:42,640
వాడో పెద్ద రాక్షసుడు.
444
00:41:43,320 --> 00:41:44,520
అతనికి నువ్వంటే పిచ్చి.
445
00:41:45,800 --> 00:41:48,120
ఐజాక్ స్కూలు పార్క్ దగ్గర కనిపించాడు.
446
00:41:48,120 --> 00:41:49,320
నీకు కంగారులేదా?
447
00:41:50,840 --> 00:41:52,120
కంగారుపడాలా?
448
00:41:53,360 --> 00:41:56,400
నన్ను బాధించలేదు,
ఎప్పుడూ బెదిరించలేదు.
449
00:41:56,400 --> 00:41:59,160
అవును, నన్నయితే
చచ్చేలా కొట్టాడు. అందుకే...
450
00:42:04,640 --> 00:42:05,640
నేను...
451
00:42:07,480 --> 00:42:08,880
కారులో టేజర్ ఉంచుకుంటున్నా.
452
00:42:12,880 --> 00:42:14,000
అనుమతి ఉందా?
453
00:42:15,640 --> 00:42:16,640
నిజానికి లేదు.
454
00:42:25,160 --> 00:42:27,800
నిన్ను ఆసుపత్రిలో కలవాలని చూసాను.
455
00:42:30,320 --> 00:42:31,320
కలవాలని చూసావా?
456
00:42:32,280 --> 00:42:33,840
బాస్ మంచి పని కాదన్నాడు.
457
00:42:34,880 --> 00:42:36,160
నా ఉద్యోగం కాపాడుకోవాలిగా.
458
00:42:42,320 --> 00:42:46,920
తరువాత కాల్ చేసాను,
కానీ నువ్వు నంబర్ మార్చావు.
459
00:42:48,840 --> 00:42:51,440
స్థాయి తగ్గించాను. డిజిటల్ డీటాక్స్.
460
00:42:51,440 --> 00:42:52,600
తెలివైన పని.
461
00:42:53,640 --> 00:42:55,600
లేదు, అదే అసలు విషయం.
462
00:42:58,440 --> 00:42:59,800
భోజనానికి ఉండు.
463
00:42:59,800 --> 00:43:01,640
క్యాసులే చేసాను.
464
00:43:01,760 --> 00:43:03,280
క్యాసరోలా అది, తేడా ఏంటో...
465
00:43:03,280 --> 00:43:06,080
క్యాసులేకు, క్యాసరోల్కు తేడా ఏంటి?
466
00:43:06,080 --> 00:43:08,360
అది, నాకు తెలియదు... అది ఇగురు తేడా.
467
00:43:09,840 --> 00:43:10,840
ఇబ్బంది పెట్టను.
468
00:43:10,840 --> 00:43:12,360
లేదు, చాలా చేసాను.
469
00:43:14,280 --> 00:43:17,160
పైగా, నువ్వు మా గురించి చింతిస్తున్నావంటే,
470
00:43:17,280 --> 00:43:19,920
కొన్ని రోజులు ఉంటే మంచిది, కదా?
471
00:43:19,920 --> 00:43:21,400
మా భద్రత కోసం.
472
00:43:21,400 --> 00:43:23,000
నీ భద్రత కోసం నా అవసరం లేదు.
473
00:43:23,000 --> 00:43:24,160
నీ అవసరం ఉంది.
474
00:43:27,640 --> 00:43:31,200
అంతేకాక, నువ్వే అన్నావుగా,
రాక్షసుడు తిరుగుతున్నాడని.
475
00:43:36,000 --> 00:43:39,040
అంతా తినక్కరలేదు.
మరీ ఎక్కువ పెట్టినట్టున్నాను.
476
00:43:39,600 --> 00:43:42,280
- కుదరదు. భలే రుచిగా ఉంది.
- అవును.
477
00:43:42,960 --> 00:43:44,360
మంచి తిండి తినే అదృష్టం.
478
00:43:44,360 --> 00:43:46,280
మేము కెప్టెన్ బర్డ్స్ఐ తింటాము.
479
00:43:46,280 --> 00:43:49,240
లేదా నాకు ఒత్తిడి ఎక్కువైతే
కల్నల్ సాండర్స్.
480
00:43:50,520 --> 00:43:52,680
గడ్డాలున్న మగవాళ్లంటే ఇష్టం.
481
00:43:58,960 --> 00:44:01,040
ఐజాక్‌కు ఫిష్ ఫింగర్స్ ఇష్టం, కదా?
482
00:44:03,000 --> 00:44:05,040
బ్రసెల్స్ మొలకలు అంతగా నచ్చవు.
483
00:44:07,240 --> 00:44:10,960
మంచి చిట్కా.
వాటిని వేయిస్తే మంచి రుచి వస్తుంది.
484
00:44:11,920 --> 00:44:13,640
ఉడికిస్తే కొంచెం సాగుతాయి.
485
00:44:14,240 --> 00:44:16,920
అంటే, నా సాగే మొలకలు
నువ్వు తినక్కరలేదు.
486
00:44:16,920 --> 00:44:20,600
తినలేదు. నువ్వు చూడనప్పుడు
నా జేబులో వేసుకున్నాను.
487
00:44:20,600 --> 00:44:21,960
నమ్మలేకపోతున్నాను.
488
00:44:21,960 --> 00:44:24,040
ఆ పని చేసినందుకు,
అంట్లు అన్నీ తోము.
489
00:44:24,040 --> 00:44:25,960
- ఎలాగైనా చేసేవాడిని.
- అవునా?
490
00:44:25,960 --> 00:44:29,040
- అవును, నేను మంచివాడిని కదా.
- అవును.
491
00:44:39,920 --> 00:44:41,040
సరే.
492
00:44:43,000 --> 00:44:45,080
ధన్యవాదాలు.
493
00:44:45,080 --> 00:44:46,480
ఇది చేయటానికి తయారా?
494
00:44:52,720 --> 00:44:54,360
సరే, నీకు వెచ్చగా ఉందా?
495
00:44:57,200 --> 00:44:59,040
నార్నియా ఇంకొన్ని పేజీలు చదువుదామా?
496
00:45:00,440 --> 00:45:01,720
అలసిపోయాను.
497
00:45:03,240 --> 00:45:07,960
అంటే, చూడు, మెటల్ మిక్కీ పెట్టాను.
498
00:45:08,800 --> 00:45:11,120
- నీ పీడకలలను తరిమేస్తాడు.
- సరే.
499
00:45:12,320 --> 00:45:13,400
పడుకో, డార్లింగ్.
500
00:45:14,240 --> 00:45:15,520
సంతోషంగా ఉన్నావు.
501
00:45:17,000 --> 00:45:18,000
అవునా?
502
00:45:20,320 --> 00:45:21,360
అలా ఎందుకు అన్నావు?
503
00:45:22,000 --> 00:45:23,320
అతను నిన్ను నవ్వించాడు.
504
00:45:24,800 --> 00:45:26,040
అతనిని నవ్వించావు.
505
00:45:27,080 --> 00:45:28,280
అందుకే అతనిని ముద్దాడు.
506
00:45:29,200 --> 00:45:31,640
నచ్చిన వాళ్లందరినీ ముద్దాడలేము.
507
00:45:31,640 --> 00:45:34,240
చూడు, బదులుగా నిన్ను ముద్దాడుతాను. ఇలా రా.
508
00:45:37,600 --> 00:45:40,480
- శుభ రాత్రి.
- శుభ రాత్రి.
509
00:46:06,600 --> 00:46:08,800
విరూపాలు
510
00:46:17,040 --> 00:46:20,800
ఎవలిన్ వైజ్మన్
511
00:46:28,680 --> 00:46:30,280
ఏం చేస్తున్నావు?
512
00:46:30,280 --> 00:46:33,560
- సారీ. కావాలని...
- అవును, అది వ్యక్తిగతం.
513
00:46:33,680 --> 00:46:35,160
తెలుసు. నేను తెరిచి ఉండకూడదు.
514
00:46:37,760 --> 00:46:39,040
కానీ తెరిచాను.
515
00:46:44,360 --> 00:46:45,760
- లూసీ.
- ఏంటి?
516
00:46:47,160 --> 00:46:48,480
అది కలల డైరీ అంతే.
517
00:46:48,480 --> 00:46:53,440
నా... ఐజాక్ థెరపిస్ట్ రాసి ఉంచుమన్నారు.
518
00:46:56,520 --> 00:46:57,720
కలల డైరీనా?
519
00:47:04,040 --> 00:47:05,040
సరే.
520
00:47:08,560 --> 00:47:09,560
సరే.
521
00:47:12,040 --> 00:47:13,280
లూసీ, ఏమన్నా ఉంటే...
522
00:47:17,880 --> 00:47:18,880
సారీ.
523
00:48:08,520 --> 00:48:10,320
- హే!
- శుభోదయం.
524
00:48:10,320 --> 00:48:14,080
- ఇప్పుడు 8:30.
- సారీ, ఆలస్యంగా లేచాను.
525
00:48:14,640 --> 00:48:15,680
ఎక్కడ?
526
00:48:19,600 --> 00:48:22,240
లూసీ చాంబర్స్‌ను కలిసావా?
527
00:48:23,840 --> 00:48:25,640
ఆలస్యమైంది. సోఫాలో పడుకున్నాను.
528
00:48:27,640 --> 00:48:29,640
ఐదు నిమిషాలలో వస్తాను.
ముఖం కడుక్కొని.
529
00:48:31,880 --> 00:48:32,880
{\an8}రవి.
530
00:48:35,760 --> 00:48:37,240
నేను టేపులు చూసాను.
531
00:48:38,280 --> 00:48:40,600
గిడియన్ షెపర్డ్, ఆమె దగ్గరికి వెళ్లాడు.
532
00:48:41,800 --> 00:48:43,720
- నువ్వు చూడవని నాకు తెలుసు.
- చూసాను.
533
00:48:48,560 --> 00:48:50,040
నువ్వు ఒక పేరు వెతుకు.
534
00:48:53,800 --> 00:48:55,040
ఎవలిన్ వైజ్మన్.
535
00:48:56,480 --> 00:48:58,000
ఏమన్నా సంబంధం ఉందేమో చూడు.
536
00:48:58,560 --> 00:48:59,720
ఎవలిన్ వైజ్మన్.
537
00:49:01,800 --> 00:49:03,200
ఆమె చెప్పిందా?
538
00:49:04,920 --> 00:49:06,080
ఐదు నిమిషాలలో వస్తాను.
539
00:51:26,760 --> 00:51:28,760
{\an8}ఉపశీర్షికలు అనువదించినది BM
540
00:51:28,760 --> 00:51:30,840
{\an8}క్రియేటివ్ సూపర్వైజర్
నల్లవల్లి రవిందర్