1 00:00:07,007 --> 00:00:09,927 సరే, అమ్మాయిలూ, ఇప్పుడు వేగంగా చేద్దాం. 2 00:00:10,010 --> 00:00:11,261 మీరు చేయగలరు. 3 00:00:11,345 --> 00:00:13,138 మోకాలిని పైకి లేపండి. 4 00:00:13,222 --> 00:00:14,806 మోకాలు. బాగా చేస్తున్నారు. 5 00:00:14,890 --> 00:00:15,974 మోకాలు! 6 00:00:16,058 --> 00:00:17,100 పక్కకి అనండి. 7 00:00:17,184 --> 00:00:18,894 అంతే. అలాగే చేయండి. 8 00:00:18,977 --> 00:00:22,147 మోకాలు, కుడివైపుకు, రెండు, మూడు. వేరే వైపుకు. 9 00:00:22,231 --> 00:00:27,778 ఇప్పుడు జంపింగ్ జ్యాక్స్. జ్యాకింగ్. జ్యాకింగ్. పైకి, చాచండి, లోపలికి, చాచండి. 10 00:00:28,779 --> 00:00:31,573 ఇప్పుడే మీ తలలో ఒక స్వరం మొదలవుతుంది కదా? 11 00:00:31,657 --> 00:00:36,495 అది శాంతించమని, విశ్రాంతి తీసుకోమని, ఇది కష్టంగా ఉందని చెప్తుంది. 12 00:00:36,578 --> 00:00:38,080 మనం ఆ గొంతును పట్టించుకుందామా? 13 00:00:38,163 --> 00:00:39,164 లేదు. 14 00:00:39,248 --> 00:00:40,499 నాకు సరిగ్గా వినిపించలేదు. 15 00:00:40,582 --> 00:00:43,794 -మీరు ఆ గొంతును పట్టించుకుంటారా? -లేదు! 16 00:00:43,877 --> 00:00:47,631 ఇక ముందుకు వచ్చి చేద్దాం. ఒకటి, రెండు, మూడు, మోకాలు! 17 00:00:48,674 --> 00:00:51,093 మోకాలు! వూ! 18 00:00:51,176 --> 00:00:52,344 మైక్ ష్మిత్ రాష్ట్ర అసెంబ్లీ కోసం 19 00:00:52,427 --> 00:00:53,971 మోకాలు! వూ. 20 00:00:54,054 --> 00:00:55,639 కాళ్ళను చక్కగా చాచండి. 21 00:00:55,722 --> 00:00:58,016 నడుమును కాస్త దించండి. అంతే. 22 00:00:58,517 --> 00:00:59,768 డీప్ స్క్వాట్ చేయండి. 23 00:00:59,852 --> 00:01:01,186 అయిదు, ఆరు. 24 00:01:01,270 --> 00:01:03,105 అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది. 25 00:01:03,188 --> 00:01:05,399 ఎడమ వైపుకు ప్రెస్ చేయండి. 26 00:01:05,983 --> 00:01:08,861 నడుమును ఊపండి. ఊపండి, ఊపండి, 27 00:01:08,944 --> 00:01:13,699 ఎనిమిది, ఏడు, ఆరు, అయిదు, నాలుగు, మూడు, 28 00:01:14,324 --> 00:01:16,410 రెండు, ఒకటి, చాలు. 29 00:01:20,998 --> 00:01:22,875 మీ నడుమును చక్కగా కదపండి. 30 00:01:25,961 --> 00:01:27,421 నడుమును ఊపండి, అమ్మాయిలూ. 31 00:01:27,504 --> 00:01:30,424 ఊపండి, ఆపకండి. ఊపండి, రెండు సార్లు. 32 00:02:14,218 --> 00:02:16,762 స్టాక్ లో ఉన్న వీసీఆర్ లన్నీ అయిపోయాయని తెలిసింది. 33 00:02:17,596 --> 00:02:20,766 ఇవాళ టేపును కొని జనాలు వాళ్ళ ఇళ్లల్లో వర్కవుట్ చేయాలనుకుంటున్నారు. 34 00:02:20,849 --> 00:02:22,559 -అది చాలా బాగుంది. -ధన్యవాదాలు. 35 00:02:22,643 --> 00:02:23,852 నా పేరు ఆగీ కార్ట్ రైట్. 36 00:02:23,936 --> 00:02:25,187 స్టాల్/గ్రన్నర్ లో పని చేస్తాను, 37 00:02:25,270 --> 00:02:27,689 మా సంస్థ హోమ్ వీడియో మార్కెట్ కోసం ప్రోగ్రామ్లను నిర్మిస్తుంది. 38 00:02:28,190 --> 00:02:29,816 మీరు టేపుల విషయంలో గొప్ప విజయాన్నే సాధించారు. 39 00:02:29,900 --> 00:02:31,735 మీరేం అనుకోకపోతే, మీ తర్వాత ప్లాన్ ఏంటని అడగవచ్చా? 40 00:02:32,361 --> 00:02:34,863 ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఇంకా నాకే పూర్తిగా తెలీదు. 41 00:02:36,114 --> 00:02:37,241 నాకు తెలుసేమో. 42 00:02:37,741 --> 00:02:39,701 మరి మీకు ఒక జ్యూస్ కొనిచ్చే అవకాశం నాకు ఇచ్చారంటే, 43 00:02:39,785 --> 00:02:40,953 అదేంటో మీకు చెప్పగలను కూడా. 44 00:02:41,870 --> 00:02:43,413 మిమ్మల్ని 10 నిమిషాలలో ఫుడ్ కోర్ట్ లో కలుసుకుంటా. 45 00:02:47,251 --> 00:02:48,252 అలాగే. 46 00:02:49,586 --> 00:02:52,130 అవును, కానీ, మరిన్ని సంతకాలు కావాలి. 47 00:02:52,214 --> 00:02:54,424 జనాలు తాము పోలింగ్ ఎక్కడ వేయాలో వాళ్లకి తెలిసేలా చూసుకోవాలి. 48 00:02:54,508 --> 00:02:55,884 అక్కడే కొన్ని అటూఇటూ... 49 00:02:55,968 --> 00:02:58,387 షీలా, చాలా మంది వచ్చారు. అదిరిపోయింది. 50 00:02:58,470 --> 00:03:01,515 అదిరిపోయింది కదా? మనం చేసిన ప్రతీ వీడియో టేపు కూడా అమ్ముడైపోయింది. 51 00:03:01,598 --> 00:03:04,142 దానితో పాటు మనం క్యాంపెయిన్ బ్రోచర్ ని కూడా ఇచ్చాం కదా? 52 00:03:04,226 --> 00:03:07,354 ఇచ్చేశాం. రిపబ్లికన్ అయినా డెమోక్రాట్ అయినా, అందరికీ ఇచ్చాం. 53 00:03:09,064 --> 00:03:11,358 వావ్. ఇందాక నీలో ఏదో కనిపించింది. 54 00:03:11,441 --> 00:03:14,069 అవును, నిన్నెప్పుడూ అలా నేను చూడలేదనుకుంటా, కనుక... 55 00:03:17,656 --> 00:03:18,490 -కనుక? -అదే... 56 00:03:18,574 --> 00:03:21,660 -అల్లాడించావు? ఆకట్టుకున్నావు? -శక్తివంతంగా అనిపించావు. అవును. 57 00:03:24,079 --> 00:03:25,122 ఇక మనం ప్రధాన కార్యాలయానికి వెళ్దాం. 58 00:03:25,205 --> 00:03:27,416 ఇవాళ ఇంటింటికీ తిరగమని జెర్రీ చెప్పాడు, కాబట్టి... 59 00:03:27,499 --> 00:03:28,500 సరే. తప్పకుండా. 60 00:03:29,001 --> 00:03:31,712 నిజానికి, నేను ఇక్కడే ఉండి, ఇదంతా శుభ్రం చేయడంలో సాయపడాలి. 61 00:03:31,795 --> 00:03:34,339 నేను నిన్ను ఇంట్లో కలుసుకుంటే పర్లేదా? పెద్ద సమయమేమీ పట్టదు. 62 00:03:35,090 --> 00:03:36,592 అలాగే, తప్పకుండా. ఏం పర్వాలేదు. 63 00:03:37,926 --> 00:03:42,181 నువ్వు మాత్రం చాలా కొత్తగా అనిపించావు. వేరుగా... అనిపించావు. 64 00:03:44,099 --> 00:03:45,392 సరే మరి. 65 00:03:54,860 --> 00:03:56,987 మన తర్వాతి టేపు కోసం నా దగ్గర కొన్ని కొత్త ఐడియాలు ఉన్నాయి. 66 00:03:57,571 --> 00:03:58,697 నిన్న రాత్రి నాకు నిద్రే పట్టలేదు. 67 00:03:58,780 --> 00:04:00,991 ఒత్తిడి. ఇంకా గంజాయి. 68 00:04:02,159 --> 00:04:03,285 -ఐడియా ఏంటో వింటావా? -అలాగే. 69 00:04:03,368 --> 00:04:04,870 వింటాను. కానీ తర్వాత వింటాను. 70 00:04:04,953 --> 00:04:07,664 -అది పర్లేదు కదా? -పర్లేదు. నాకు కూడా వేరే పని ఉంది. 71 00:04:07,748 --> 00:04:11,210 -ఇవాళ నేను నిన్ను కలవకపోతే, గుడ్ లక్. -దేనికి గుడ్ లక్? 72 00:04:11,293 --> 00:04:12,878 ఎన్నికలకు మహాతల్లి. 73 00:04:12,961 --> 00:04:14,087 -అవును. -మీరు గెలవాలని కోరుకుంటున్నా. 74 00:04:16,048 --> 00:04:17,216 సరేమరి. ఉంటా. 75 00:04:17,966 --> 00:04:19,218 స్టాల్ అండ్ గ్రన్నర్ లో, 76 00:04:19,301 --> 00:04:22,763 మేము ఒరిజినల్ ప్రోగ్రామ్స్ ని నాలుగు విభాగాల్లో నిర్మిస్తాము: 77 00:04:22,846 --> 00:04:26,558 వినోదం, పిల్లలు, ఎలాగో తెలుసుకోండి, ఇంకా స్పోర్ట్స్ మరియు ఫిట్నెస్. 78 00:04:26,642 --> 00:04:28,435 మీది చివరి విభాగం. అనే అనుకుంటున్నా. 79 00:04:30,145 --> 00:04:32,022 నా పాత్ర? మరి ఇందులో నా పాత్ర ఏంటి? 80 00:04:34,107 --> 00:04:37,236 మీ ప్రశ్నకు ఇంకో ప్రశ్న ద్వారా సమాధానం ఇస్తాను. 81 00:04:38,654 --> 00:04:40,197 మీరు డ్రెయిన్ గురూ గురించి విన్నారా? 82 00:04:40,948 --> 00:04:42,366 అంటే... విన్నాను. 83 00:04:42,449 --> 00:04:44,159 -అతని పేరును అందరూ వినే ఉంటారు. -అతనికి మంచి జనాదరణ ఉంది కదా? 84 00:04:44,243 --> 00:04:47,538 మీరు అంతకంటే ఎక్కువ జనాదరణ పొందవచ్చు. మీలో నైపుణ్యం ఉంది, లుక్స్ కూడా ఉన్నాయి. 85 00:04:47,621 --> 00:04:48,747 మీలాంటి వాళ్లని, జనాలు 86 00:04:48,830 --> 00:04:50,999 తమ ఇళ్లలో రోజూ చూడటానికి ఇష్టపడతారు. 87 00:04:51,083 --> 00:04:53,252 బ్లాక్ అయిన టాయిలెట్ ని కాదు. అంతే కదా? 88 00:04:53,335 --> 00:04:55,212 అంతే అనుకుంటాను. 89 00:04:55,295 --> 00:04:58,715 దేశమంతా వీసిఆర్లు ఉంటాయి, వాటిలో మీరు ఉంటారు. 90 00:04:59,675 --> 00:05:01,593 నేను చేసిన టేపు ఇప్పటికే బాగానే అమ్ముడైపోతోంది. 91 00:05:02,344 --> 00:05:03,762 నేను మీకు ఇది ప్రతిపాదిస్తున్నాను: 92 00:05:04,638 --> 00:05:05,848 వ్యక్తిగత ప్రొడక్షన్, 93 00:05:06,390 --> 00:05:07,891 అధిక సంఖ్యలో రీప్రొడక్షన్, 94 00:05:08,642 --> 00:05:10,394 ఇంకా విస్తృతమైన పంపిణీ. 95 00:05:10,477 --> 00:05:13,146 దీన్ని ఇంటికి తీసుకెళ్ళండి, మీ భర్తను అడిగి ఇందులోని వివరాలను తెలుసుకోండి. 96 00:05:13,230 --> 00:05:14,523 ఆ తర్వాత మీరు నాకు కాల్ చేస్తే, 97 00:05:14,606 --> 00:05:17,609 మేము మిమ్మల్ని ఒక ఇంటి పేరు చేసే పనిని మొదలుపెట్టేయగలం. 98 00:05:18,110 --> 00:05:21,363 పాన్ అమెరికన్ ఎయిర్వేస్, స్టెట్సన్, షీలా. 99 00:05:24,116 --> 00:05:27,786 "మీరు ఇవాళ షీలాని చేశారా?" "నేను ఇవాళ షీలాని చేశాను." 100 00:05:27,870 --> 00:05:29,621 "నేను ప్రతీరోజు నా షీలాని చేస్తాను." 101 00:05:30,247 --> 00:05:31,999 అది చాలా బాగుంది కదా? 102 00:05:33,625 --> 00:05:34,626 ఎస్.జీ స్టాల్/గ్రన్నర్ 103 00:05:34,710 --> 00:05:36,128 హోమ్ వీడియో మార్కెట్ కోసం ప్రోగ్రామ్లను నిర్మించే సంస్థ 104 00:05:36,211 --> 00:05:39,006 -అంతా సజావుగా సాగినట్టు అనిపించింది. -నాకు కూడా అలాగే అనిపించింది. 105 00:05:39,089 --> 00:05:41,884 మా డిపాజిట్ మాకు ఇచ్చేయగలరా? మేము దేన్ని విరగ్గొట్టలేదు. 106 00:05:41,967 --> 00:05:42,968 తప్పకుండా. 107 00:05:44,178 --> 00:05:47,598 మీకు ముందే ఇద్దామనుకున్నాను, కానీ అంతరాయం కలిగించాలనుకోలేదు. 108 00:05:48,473 --> 00:05:50,475 -అది చాలా ముఖ్యమైనదిగా అనిపించింది? -ఏది? 109 00:05:51,518 --> 00:05:54,146 మీ సంభాషణ. ఒక ఖరీదైన సూట్ కేసుతో ఉన్న వ్యక్తితో. 110 00:05:55,647 --> 00:05:56,940 అవును, అతను... 111 00:05:57,566 --> 00:05:58,734 అతను ప్రొడక్షన్ సంస్థ మనిషి. 112 00:05:58,817 --> 00:06:01,945 వాళ్ళు ఉత్పత్తుల టేపులు చేసి పంపిణీ చేస్తారు. 113 00:06:03,071 --> 00:06:04,072 డ్రెయిన్ గురూ. 114 00:06:04,156 --> 00:06:05,490 డ్రెయిన్ గురూ. 115 00:06:06,450 --> 00:06:09,786 అయితే, ఆ సూట్ కేసు మనిషి మిమ్మల్ని డ్రెయిన్ గురూగా మారుద్దామనుకుంటున్నాడా? 116 00:06:10,495 --> 00:06:13,248 -అంటే అలాగే నన్ను చూపెడతారు అన్నమాట. -మరి మీ భాగస్యామి మాటేమిటి? 117 00:06:13,332 --> 00:06:16,418 అదే, తన అద్దె ఒప్పందానికి ఒక సృహనాత్మక రూపాన్ని ఇచ్చిన మహిళ. 118 00:06:17,044 --> 00:06:18,921 అతను, ఆమెను కూడా డ్రెయిన్ గురూగా మార్చాలనుకుంటున్నాడా? 119 00:06:19,004 --> 00:06:21,048 లేదా అందుకే తను మీ సమావేశంలో లేదా? 120 00:06:21,131 --> 00:06:23,842 మేము మరీ వివరాల్లోకి వెళ్లలేదు, ఎవరెవరు... 121 00:06:23,926 --> 00:06:27,221 అవునులెండి, కానీ ఆమె కూడా ఉన్నట్టు అతనికి తెలుసు కదా? 122 00:06:28,096 --> 00:06:30,891 మీ భర్త సామాజికవాద నమ్మకాలను, మీరు కూడా నమ్ముతారని 123 00:06:30,974 --> 00:06:33,018 మీరు నాకు చెప్పిందే నిజమైతే... 124 00:06:36,313 --> 00:06:38,982 సరే. నేను... నేను ఇక ఇంటికి బయలుదేరతాను. 125 00:06:39,733 --> 00:06:41,443 -మీరు నన్ను అడిగితే... -నేను మిమ్మల్ని అడగలేదు. 126 00:06:41,527 --> 00:06:42,528 కానీ ఒకవేళ అడిగి ఉంటే, 127 00:06:42,611 --> 00:06:45,155 ఈ విషయంలో పెట్టుబడే ఎవరైనా 128 00:06:45,739 --> 00:06:47,574 మిమ్మల్ని చూసే ఆ పని చేస్తున్నారని చెప్పగలను. 129 00:06:47,658 --> 00:06:49,326 జనాలు మిమ్మల్ని చూడటానికే వచ్చారు. 130 00:06:50,077 --> 00:06:52,579 -అది మీకు సంబంధించిన విషయం కాదు. -కాదనుకోండి. 131 00:06:52,663 --> 00:06:53,705 కానీ అది మీకు సంబంధించినది. 132 00:06:53,789 --> 00:06:55,791 మీ విలువైన పెట్టుబడి. 133 00:06:55,874 --> 00:06:57,334 దాన్ని మీరు పరిరక్షించుకోవాలి. 134 00:06:57,417 --> 00:07:00,879 అందుకే మీరూ, ఇంకా ఆ నిర్మాత ఫుడ్ కోర్టులో ఆనందంగా జ్యూస్ తాగుతున్నప్పుడు 135 00:07:00,963 --> 00:07:04,299 మిస్ కజామ్ అక్కడ లేదు కాబోలు. 136 00:07:05,717 --> 00:07:09,763 అదస్సలు జ్యూస్ కాదు. నిజానికి అది సోడా. అయినా నా గురించి మీకేమీ తెలీదు, కాబట్టి... 137 00:07:09,847 --> 00:07:11,014 కానీ దేవునికి తెలుసు. 138 00:07:13,183 --> 00:07:14,852 దేవునికి, ఇంకా మీ భర్తకు కూడా అనుకుంటా. 139 00:07:16,186 --> 00:07:17,187 డానీ రూబిన్ రాష్ట్ర అసెంబ్లీ కోసం 140 00:07:17,271 --> 00:07:18,730 గురూ, నువ్వేదోకటి తినాలి. 141 00:07:19,314 --> 00:07:22,025 లేదు. నేను ఇంత టెన్షన్ లో ఉన్నప్పుడు, నాకు ఆపకుండా మోషన్స్ వచ్చేస్తాయి. 142 00:07:22,109 --> 00:07:23,861 నాకు కూడా అంతే. కానీ నాకు ఎప్పటికీ బుద్ధి రాదుగా. 143 00:07:23,944 --> 00:07:25,696 షీలా. షీలా, నా దగ్గర వార్తాపత్రిక ఉంది. 144 00:07:25,779 --> 00:07:27,698 -దేవుడా. -షీలా, ఫోన్ పెట్టేయ్. 145 00:07:27,781 --> 00:07:29,032 -ధన్యవాదాలు. -"టైమ్స్"లోని స్టయిల్ సెక్షన్ లో 146 00:07:29,116 --> 00:07:30,784 -నీ గురించి మొదటి పేజీలో రాశారు. -ఏంటి? 147 00:07:30,868 --> 00:07:33,120 ఆ దరిద్రుడు మన క్యాంపెయిన్ గురించి ఏమైనా రాశాడా? 148 00:07:33,203 --> 00:07:34,204 సరే మరి, చదువుతున్నా. 149 00:07:34,288 --> 00:07:35,372 స్టయిల్ షీలాతో పాటు వర్క అవుట్ 150 00:07:35,455 --> 00:07:37,791 "ఆమె వైపు అంతకంతకూ ఆకర్షితులవుతున్న జనాలకు ఈ విషయం తెలియకపోవచ్చు, 151 00:07:37,875 --> 00:07:42,212 ఈ నిధులన్నీ తన భర్త అయిన డానీ రూబిన్ క్షేత్రస్థాయి ప్రచారానికి వెళ్తాయి, 152 00:07:42,296 --> 00:07:46,967 గెలవబోయే రిపబ్లికన్ అభ్యర్థి, మైక్ ష్మిత్ మీద ఇదొక నిష్ఫలమైన కానీ ధైర్యమైన ప్రయత్నం. 153 00:07:47,050 --> 00:07:48,594 నిష్ఫలమైన కాని ధైర్యమైన. 154 00:07:48,677 --> 00:07:50,929 వావ్, షీల్. మంచి ప్రచారమే చేశావే. 155 00:07:51,013 --> 00:07:52,097 అది "టైమ్స్" పత్రిక. 156 00:07:52,181 --> 00:07:54,141 వాళ్ల ఎజెండాకి తగ్గట్టుగా ఏదేదో రాస్తారు. 157 00:07:54,224 --> 00:07:56,101 -అహా. -అవును, వాళ్లు... 158 00:07:56,185 --> 00:08:00,856 ఆరంభం నుండే మనల్ని అడ్డుకోవాలని చూశారు, కానీ మనం ధీటుగా ఎదుర్కొంటున్నాం కదా? 159 00:08:00,939 --> 00:08:01,940 -ఆ. -అవును. 160 00:08:02,024 --> 00:08:03,150 హేయ్, జెర్రీ. 161 00:08:03,817 --> 00:08:07,571 -నాకు 50 డాలర్లు కావాలి. -అలాగే, బాసూ. నన్నొకసారి... 162 00:08:07,654 --> 00:08:08,655 నా దగ్గర ఉన్నాయిలే. 163 00:08:08,739 --> 00:08:09,740 నేనిస్తాను. 164 00:08:10,908 --> 00:08:13,243 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు, గురూ. అక్కడ పెట్టు. 165 00:08:14,453 --> 00:08:15,829 ఓరి దేవుడా. 166 00:08:15,913 --> 00:08:19,082 మొదటి పేజీ అంతా అదే ఉంది. మొత్తం వేశారు. 167 00:08:19,166 --> 00:08:21,585 ప్రచారానికి సంబంధించిన వార్తలన్నీ రెండో పేజీకి మార్చారు. 168 00:08:21,919 --> 00:08:23,086 నువ్వు భలే ఉన్నావు, షీలా. 169 00:08:23,962 --> 00:08:25,255 తను ఎంతో అందంగా ఉంది. 170 00:08:29,468 --> 00:08:32,513 బెడ్రూమ్ బీరువాకి ముడుచుకునే తలుపులు ఉన్నాయి. 171 00:08:33,013 --> 00:08:34,847 వాటిలో ఒకటి కొద్దిగా విరిగింది. 172 00:08:34,932 --> 00:08:37,476 బహుశా అది నావల్లే కావచ్చు. ఇప్పుడే అలా జరిగింది. 173 00:08:37,558 --> 00:08:40,645 నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడాలి, టైలర్. 174 00:08:43,482 --> 00:08:44,650 ఇక్కడ నా గురించి అస్సలు రాయలేదు. 175 00:08:45,275 --> 00:08:47,945 ఇది నిజమైన వ్యాసం కాదు. మొత్తం ఫోటోలతోనే నింపేశారు. 176 00:08:48,028 --> 00:08:49,238 అవి కూడా ఆమెవే. 177 00:08:51,573 --> 00:08:56,578 ఇది స్టూడియోకి ఉచిత పబ్లిసిటీయే కదా. అదే అసలు విషయం, అంతే కదా? 178 00:08:56,662 --> 00:08:58,455 అసలు ఇందులో స్టూడియో పేరే ప్రస్తావించలేదు. 179 00:08:58,539 --> 00:09:00,082 కేవలం ఆమె గురించి మాత్రమే రాశారు. 180 00:09:00,582 --> 00:09:01,667 ఏమన్నావు? 181 00:09:01,750 --> 00:09:03,335 టైలర్, అరవడం ఆపు. 182 00:09:03,418 --> 00:09:04,503 క్షమించు. 183 00:09:05,003 --> 00:09:08,966 ఇంతకీ ఈ చోటు గురించి ఏమంటావు? ఇది చాలా బాగుందని నా ఉద్దేశం. 184 00:09:09,049 --> 00:09:14,471 నువ్వు ఇంకా ఇక్కడ చెత్తను పడేసే సదుపాయం కూడా ఉంది. ఇది చాలా విలాసవంతంగా ఉంది. 185 00:09:15,222 --> 00:09:20,519 దాని గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదు. నాకు ఏదో తేడా కొడుతోంది. 186 00:09:20,602 --> 00:09:21,812 నాకు ఎంతో బాగుంది. 187 00:09:21,895 --> 00:09:23,397 మన గురించి ఊహించుకోగలను. 188 00:09:25,023 --> 00:09:28,277 నేను నాకేదో తేడా కొడుతోంది అన్నా, టైలర్. 189 00:09:28,360 --> 00:09:30,904 తేడా కొడుతోంది అంటే బాగా ఉందని అర్థం కాదు. 190 00:09:30,988 --> 00:09:35,325 తను మనల్ని ఉపయోగించుకుంటున్నట్టు. మనల్ని వదిలేస్తున్నట్టు. 191 00:09:35,409 --> 00:09:37,327 తను ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవెేర్చదు... 192 00:09:38,871 --> 00:09:39,705 బంగారం! 193 00:09:39,788 --> 00:09:42,291 లేదు, లేదు, లేదు, లేదు. అయ్యో, అయ్యో, అయ్యో. 194 00:09:42,374 --> 00:09:44,168 టైలర్? అయ్యో. బేబీ. 195 00:09:44,626 --> 00:09:45,961 ఎవరైనా ఉన్నారా? 196 00:09:46,044 --> 00:09:48,422 దేవుడా, ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి, ప్లీజ్! 197 00:09:48,505 --> 00:09:49,506 బేబీ. 198 00:09:50,799 --> 00:09:53,177 -అతనికి కాస్త సమయం ఉంటే. -ఉంటుందిలే. 199 00:09:53,260 --> 00:09:56,722 అతను లొసుగుల కోసం వెతకవచ్చు. 200 00:09:56,805 --> 00:09:58,390 లేదు, ఎర్నీ ఒప్పంద పత్రాలను సరదా కోసం చూస్తాడు. 201 00:09:58,473 --> 00:10:00,309 నీకు సరైన ఒప్పందం కుదురుతుందో లేదో అతను నీకు చెబుతాడు. 202 00:10:00,392 --> 00:10:01,393 ధన్యవాదాలు. ధన్య... 203 00:10:01,476 --> 00:10:03,145 అలా అన్నావు బాగుంది. ఇది బాగుంది. ఇక్కడ బాగుంది. 204 00:10:03,228 --> 00:10:04,396 అయితే... 205 00:10:04,897 --> 00:10:08,984 హేయ్. ఎర్నీ ఈ ఒప్పందం గురించి డానీతో చెప్పాలా వద్దా? 206 00:10:10,110 --> 00:10:11,111 అప్పుడే వద్దు. 207 00:10:12,446 --> 00:10:13,739 దీని గురించి డానీకి చెప్పావా? 208 00:10:13,822 --> 00:10:14,823 చెబుతాను. 209 00:10:16,408 --> 00:10:18,785 షీల్, నీకు నా మద్దతు ఉంటుంది. అది నీకూ తెలుసు. 210 00:10:18,869 --> 00:10:21,163 కానీ, ఇది ఎలా పని చేస్తుందంటావు? 211 00:10:21,246 --> 00:10:23,332 ఒకవేళ డానీ గెలిస్తే, 212 00:10:23,415 --> 00:10:26,168 అతను మొత్తం సమయమంతా శాక్రిమెంటోలోనే గడుపుతాడు 213 00:10:26,251 --> 00:10:28,545 నేనేమో ఇక్కడే ఉండి నా వ్యాపారం చూసుకుంటాను. 214 00:10:29,046 --> 00:10:33,050 అతను అక్కడ తన వ్యవహారాలు చూసుకుంటాడు, నేను ఇక్కడ నా పని చూసుకుంటాను. 215 00:10:34,843 --> 00:10:36,637 మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకింక? 216 00:10:37,221 --> 00:10:38,222 సంతోషంగా ఉండేందుకు. 217 00:10:39,223 --> 00:10:40,807 కానీ అదంతా డానీ గెలిస్తేనే కదా. 218 00:10:45,896 --> 00:10:48,524 సరే, అలాగే, వాటిలో ఇదే చివరిది. 219 00:10:48,607 --> 00:10:51,485 నువ్వు మళ్లీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మరికొన్ని తేవాలనుకుంటున్నావా? షీలా? 220 00:10:51,568 --> 00:10:55,447 షీలా! షీలా! అలా చేయకూడదు, తప్పు. 221 00:10:56,073 --> 00:10:57,616 -ఏంటి... అబ్బా, దేవుడా. -పోనీ, పోనీ, పోనీ! 222 00:10:57,699 --> 00:10:58,992 -తలుపు వెయ్యి! -పద, పోనీ, పోనీ! 223 00:10:59,076 --> 00:11:00,410 -పోనీ, పోనీ! -షీలా, దేవుడా! 224 00:11:06,208 --> 00:11:07,584 మేడమ్, మరేం పరవాలేదు. 225 00:11:09,294 --> 00:11:10,796 తాజా సమాచారం ఏంటి? 226 00:11:10,879 --> 00:11:14,174 మేం సర్జరీ పూర్తి చేశాం. బాగానే ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు. 227 00:11:14,258 --> 00:11:17,094 చెవిలోకి వెళ్లిన నీళ్లు అక్కడే నిలిచిపోవడం వల్ల 228 00:11:17,177 --> 00:11:19,596 అతని చెవి నాళానికి ఇన్ ఫెక్షన్ సోకి మూర్ఛ వచ్చింది, 229 00:11:19,680 --> 00:11:21,431 -దీన్ని ఏమంటారంటే... -నాకు తెలుసు. 230 00:11:21,515 --> 00:11:24,226 ఇన్ ఫెక్షన్ మెదడుకు పాకనందుకు అతను చాలా అదృష్టవంతుడు. 231 00:11:24,309 --> 00:11:26,979 సరే, మేం అతన్ని రెండు రోజులు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. 232 00:11:27,855 --> 00:11:29,815 అది మా వల్ల కాదు. 233 00:11:30,524 --> 00:11:32,442 మేం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. 234 00:11:32,526 --> 00:11:34,069 వీలైతే ఇప్పుడే. 235 00:11:34,152 --> 00:11:35,445 అతనికి ఇప్పుడే సర్జరీ జరిగింది. 236 00:11:35,946 --> 00:11:38,907 మీరు ఏం ప్లాన్ చేసుకున్నా సరే, వాటిని వెంటనే రద్దు చేసుకోండి, సరేనా? 237 00:11:38,991 --> 00:11:42,202 అబ్బా. మేం ఏం చేయాలో నువ్వేం చెప్పక్కర్లేదు, చెత్త డాక్టర్. 238 00:11:45,914 --> 00:11:50,502 క్షమించండి. మాకు మొత్తం వైద్యానికి సరిపడా ఇన్సూరెన్స్ కవరేజీ లేదు. 239 00:11:51,086 --> 00:11:53,881 అలాగైతే, డబ్బు ఎలా కట్టాలో మా అకౌంట్ డిపార్టుమెంటులో ఎవరైనా చెబుతారు. 240 00:12:01,805 --> 00:12:04,057 అతడిని తేడాగా చూశారు. 241 00:12:04,141 --> 00:12:05,976 అతన్ని అందరూ తక్కువ అంచనా వేస్తారు. 242 00:12:06,059 --> 00:12:09,938 తరచూ అతనిపై ప్రతిపక్షం దాడి చేస్తూ ఉంటుంది. 243 00:12:10,022 --> 00:12:15,068 సరిగ్గా మాట్లాడలేడనీ, నాగరికత తెలియదనీ గేలిచేస్తూ ఉంటారు. 244 00:12:15,611 --> 00:12:20,824 నీ విలువలను దిగజార్చే, నీ డబ్బుకోసం పాకులాడే, మీ అమ్మాయిల వెంటపడే 245 00:12:20,908 --> 00:12:22,326 అమెరికాకు చెందిన ఒక కమ్యూనిస్టు. 246 00:12:25,746 --> 00:12:27,998 కానీ అతని హృదయంలో ఏముందనే దాని గురించి 247 00:12:28,081 --> 00:12:29,958 నేను మీ అందరికీ మళ్లీ చెప్పక్కర్లేదు... 248 00:12:31,293 --> 00:12:32,294 కానీ చెబుతాను. 249 00:12:34,171 --> 00:12:39,218 ఎంతో ఎత్తుకి ఎదిగిన ఈ మనిషి, 250 00:12:39,301 --> 00:12:43,680 కష్టాల్లో ఉన్న మన సమాజాన్ని ఆదుకోవడమే కాదు... 251 00:12:44,181 --> 00:12:46,433 సోదరా, నువ్వు ఇప్పటికే నాకెంతో సాయం చేశావు. 252 00:12:46,517 --> 00:12:50,354 హాస్యాస్పదమైన ఈ ప్రక్రియను నేను విశ్వసించేలా చేసావు. 253 00:12:50,979 --> 00:12:54,691 దీని ద్వారా మంచి జరుగుతుందని నాలో నమ్మకం కలిగించావు. 254 00:12:56,527 --> 00:12:58,070 నన్ను చూడండి. 255 00:12:58,153 --> 00:13:02,032 మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటూ, 256 00:13:02,115 --> 00:13:04,660 ఒక వెర్రివాడిలా కంటతడి పెడుతున్నాను. 257 00:13:05,869 --> 00:13:07,412 జెర్రీ, నేనూ మాట్లాడనా? 258 00:13:07,496 --> 00:13:10,415 నువ్వు వేదికపైకి వచ్చి, ఇక్కడి నుంచి కిందకు దిగే అవకాశం నాకు ఇస్తావా, దయచేసి? 259 00:13:12,042 --> 00:13:13,377 డానీ రూబిన్ వస్తున్నాడు! 260 00:13:19,466 --> 00:13:20,467 మిత్రులారా, 261 00:13:20,551 --> 00:13:24,346 మీ అందరితో కలసి ఇక్కడ ఇలా సమావేశం కావడం 262 00:13:24,429 --> 00:13:27,474 ఎంతో అద్భుతంగా ఉంది. 263 00:13:27,558 --> 00:13:31,562 నా స్నేహితుడు ఒక యోధుడిలా వచ్చి మనల్ని అగ్రపథంలో నిలిపేందుకు 264 00:13:31,645 --> 00:13:35,774 తన వ్యూహాన్ని అమలు చేసి, మనలో స్ఫూర్తిని నింపేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. 265 00:13:36,275 --> 00:13:37,776 అది నా ధర్మం, మిత్రమా. 266 00:13:37,860 --> 00:13:41,113 అలాగే నా భార్య షీలా కూడా. నువ్వు కూడా వేదికపైకి వస్తావా? 267 00:13:41,905 --> 00:13:42,906 షీలా! 268 00:13:47,119 --> 00:13:48,662 ఈ అందమైన మహిళ, 269 00:13:48,745 --> 00:13:53,333 నాకు అండదండలు అందిస్తోందంటే మీరంతా తప్పక ఏకీభవిస్తారు. 270 00:13:53,417 --> 00:13:54,418 మరి... 271 00:13:54,501 --> 00:13:58,547 మొదటి నుంచి నాపై ఆమెకు గల అపారమైన నమ్మకమే దీనికంతటికీ ఆరంభం. 272 00:13:59,923 --> 00:14:03,677 కాబట్టి తనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 273 00:14:05,262 --> 00:14:07,639 భలే భలే. యాహూ. 274 00:14:09,141 --> 00:14:10,517 సరే. అలాగే. 275 00:14:10,601 --> 00:14:13,395 ఈ భావోద్రేకాలు కట్టిపెట్టండి. మనం మద్దతు కూడగట్టడంపై దృష్టి పెట్టాలి, సరేనా? 276 00:14:13,478 --> 00:14:15,606 ఇవాళ మనకు ఎంతో కీలకమైన రోజు. 277 00:14:16,565 --> 00:14:19,985 తళతళలాడే కెరటాలతో కూడిన చల్లటి గాలులు వీచే తీరం లాంటి రోజు ఇది. 278 00:14:21,737 --> 00:14:23,947 మనమంతా ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, సరేనా? 279 00:14:24,031 --> 00:14:25,532 ఎవరెవరు ఏమేం చేయాలో చూద్దాం. 280 00:14:25,616 --> 00:14:28,452 గుర్తుంచుకోండి, స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి, 281 00:14:28,535 --> 00:14:32,206 ఒకే ఒక నిజమైన అమెరికా సామెత ఉంది: 282 00:14:32,289 --> 00:14:34,291 ఎవ్వరూ పట్టించుకోరు అని. 283 00:14:34,958 --> 00:14:37,211 ఈ రోజు ఆ సామెతను వమ్ము చేద్దాం. 284 00:14:37,294 --> 00:14:38,420 ఓట్ల వేట సాగిద్దాం! 285 00:14:38,504 --> 00:14:39,922 -అలాగే! -అవును, అవును. 286 00:14:40,005 --> 00:14:41,465 నువ్వేమైనా బాధపడుతున్నావా, డియర్? 287 00:14:41,548 --> 00:14:43,842 ఎన్నికలల్లో గెలుపు గురించా? లేదు, ఎందుకని? 288 00:14:43,926 --> 00:14:46,929 నువ్వు ఇలా చీటికీ మాటికీ ఫోన్ చేస్తూ ఉంటావని అనుకోలేదు. 289 00:14:47,554 --> 00:14:53,060 ఎన్నికల పనుల్లోకి దిగేముందు ఒకసారి ఫోన్ చేద్దామనిపించి, చేశాను. 290 00:14:53,143 --> 00:14:54,561 -ఎలా ఉన్నావు? -బాగానే ఉన్నాను. 291 00:14:55,145 --> 00:14:57,397 ఈ రాత్రి డిన్నర్ లోకి ప్రత్యేకంగా ఏమైనా వండమంటావా? 292 00:14:57,481 --> 00:14:58,649 లెగ్ పీస్ చేద్దామని అనుకుంటున్నా. 293 00:14:58,732 --> 00:15:00,943 నాకెందుకనో అకస్మాత్తుగా పంది మాంసం తినాలనిపిస్తోంది. 294 00:15:02,069 --> 00:15:04,154 బాగుంటుంది. బాగా వేడి చేసి వండు. 295 00:15:04,238 --> 00:15:05,656 ఇవాళ రాత్రంతా పని ఉండవచ్చు. 296 00:15:05,739 --> 00:15:09,034 ఉదయం పరీక్ష చేయించుకుంటే నేను గర్భవతినని తేలింది, అందుకే కావచ్చు. 297 00:15:11,537 --> 00:15:13,205 ఫలితాలు వెలువడ్డాక పార్టీ ఎక్కడ చేసుకుంటున్నారు? 298 00:15:17,668 --> 00:15:19,044 థరోబ్రెడ్ క్లబ్ లో. 299 00:15:20,087 --> 00:15:21,129 మంచిది, సరదాగా గడుపు. 300 00:15:21,213 --> 00:15:22,965 నువ్వు ఇంటికి వచ్చాక, నన్ను మాత్రం లేపకు. 301 00:15:33,350 --> 00:15:36,270 ఆ వరుస చూడు, మిత్రమా. 302 00:15:36,353 --> 00:15:39,690 వాళ్లందరూ మనవాళ్లే. ష్మిత్ అనుచరులెవరూ లేరు. 303 00:15:41,567 --> 00:15:42,609 అదెలా చెప్పగలవు? 304 00:15:43,986 --> 00:15:46,530 వాళ్లు వేసుకున్న జోళ్లు చూడు, షీల్. 305 00:15:46,613 --> 00:15:48,240 ఒక్కరైనా బోట్ బూట్లు వేసుకోలేదు. 306 00:15:48,323 --> 00:15:51,159 ఇక నడుము చుట్టూ పట్టీ గురించి చెప్పక్కర్లేదు. 307 00:15:52,661 --> 00:15:54,454 ఈ క్షణం ఎంతో చరిత్రాత్మకమైనదని అనిపిస్తోంది. 308 00:15:54,538 --> 00:15:58,792 మనిద్దరం కలసి గతంలో నాటాం, అది ఇప్పుడు ఫలాలనివ్వబోతోంది. 309 00:15:58,876 --> 00:16:00,460 -నేను చెప్పింది అర్థమైందా? -అయింది, గురూ. 310 00:16:00,544 --> 00:16:01,879 అర్థమైంది. 311 00:16:04,756 --> 00:16:08,177 నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, తెలుసా? నాపై నీకున్న నమ్మకం అలాంటిది. 312 00:16:08,260 --> 00:16:09,928 నువ్వు లేకపోతే ఇవేమీ సాకారం అయ్యేవి కావు. 313 00:16:10,012 --> 00:16:12,848 లేదు. అలా చెప్పడం నీ మంచితనం. కానీ, నా ప్రమేయం ఏమీ లేదు. 314 00:16:12,931 --> 00:16:15,267 -అవును. నేను అన్నది నిజం. నిజం. -నువ్వొక... 315 00:16:15,350 --> 00:16:17,644 నీకు ముందుచూపు ఉంది. చురుకైనదానివి. 316 00:16:19,605 --> 00:16:21,982 -నువ్వే నాకు ఇంధనం. -బాబులూ. 317 00:16:22,065 --> 00:16:23,650 -నీకు తెలుసుగా మిత్రమా. -మిత్రులారా! 318 00:16:23,734 --> 00:16:26,778 రాష్ట్ర అసెంబ్లీకి మైక్ ష్మిత్ 319 00:16:31,825 --> 00:16:34,453 సరే. వాళ్లు ఒక బస్సును అద్దెకు తీసుకున్నారన్నమాట. 320 00:16:34,536 --> 00:16:35,954 అయితే ఏంటి? 321 00:16:36,788 --> 00:16:40,667 ఇవన్నీ మనల్ని భయపెట్టేందుకు వేసే ఎత్తుగడలు. రెచ్చగొట్టే పనులు. 322 00:16:43,837 --> 00:16:45,881 ఎంతమంది ఉన్నారు వాళ్లు? 323 00:16:47,174 --> 00:16:48,759 వాళ్లకు కుటుంబ నియంత్రణపై నమ్మకం లేదనుకుంటాను. 324 00:16:54,681 --> 00:16:55,974 వాడొక వెధవ. 325 00:17:15,618 --> 00:17:18,704 అదిగో తను అక్కడుంది. రాత్రంతా ఇక్కడే ఉన్నావా. 326 00:17:18,789 --> 00:17:20,790 సాయం చేస్తున్నాను. అతిథులు చాలామందే ఉన్నారు కదా. 327 00:17:20,874 --> 00:17:23,252 అవును. నువ్వేదో దాస్తున్నావు. నాకు అర్థమైంది. నాకు కూడా అదేదో దాచాలనే ఉంది, 328 00:17:23,335 --> 00:17:26,171 కానీ ప్రతి ఒక్కరూ నన్ను గమనిస్తున్నారు, కాబట్టి అలా కుదరదు. 329 00:17:27,256 --> 00:17:28,549 దేవుడా, ఇదంతా నాకు అక్కర్లేదనిపిస్తోంది. 330 00:17:28,632 --> 00:17:30,300 కేవలం ఫలితాలు వెల్లడైతే చాలు, దేవుడా. 331 00:17:30,384 --> 00:17:32,970 -బంగారం, నువ్వు చిందరవందర చేస్తున్నావు. -నన్ను క్షమించు. 332 00:17:33,053 --> 00:17:35,639 తిన్నందుకు నన్ను మన్నించు. నువ్వు కూడా ఎప్పుడైనా తిని చూడాలి. 333 00:17:36,807 --> 00:17:38,016 -అలా చేయకు. -హేయ్. 334 00:17:38,600 --> 00:17:41,019 హేయ్, నీతో పని ఉంది. మాట్లాడుతుంటే అలా వెళ్లిపోకు. 335 00:17:41,103 --> 00:17:43,939 ఏంటి? నేను చేతులు కడుక్కుంటున్నాను. ఏంటి? 336 00:17:44,022 --> 00:17:45,023 ఇది తిను. 337 00:17:45,691 --> 00:17:46,692 -వద్దు. -తిను. 338 00:17:46,775 --> 00:17:49,069 జీవితంలో ఒకసారైనా ఎంజాయ్ చేయ్. నాకోసం తిను. 339 00:17:49,152 --> 00:17:51,029 -నేను ఇప్పటికే తిన్నాను. ఇప్పుడు వద్దు. -అది అబద్దం. 340 00:17:52,531 --> 00:17:53,699 సిమోన్ చెప్పింది నిజమే. 341 00:17:54,408 --> 00:17:57,452 -సిమోన్? ఆమె ఏం చెప్పింది? -నువ్వు చేసే వర్కవుట్ గురించి చెప్పింది. 342 00:17:57,536 --> 00:17:59,454 అదంతా ఎవరికోసం, 343 00:18:00,622 --> 00:18:03,375 నేను ఓడిపోతే నన్ను వదిలి వెళ్లిపోవడానికి కావలసిన బిల్డప్ కోసమే ఇదంతా చేస్తున్నావా? 344 00:18:03,458 --> 00:18:05,335 -ఈ రాత్రి నువ్వు బాగా ఒత్తిడిలో ఉన్నావు. -అవును. 345 00:18:05,419 --> 00:18:07,546 బహుశా నీ జీవితంలోనే ఇంత ఒత్తిడిని నువ్వెప్పుడూ ఎదుర్కొని ఉండవు. 346 00:18:07,629 --> 00:18:08,881 అర్థమైంది. 347 00:18:10,048 --> 00:18:13,427 బేబ్, అన్నీ సర్దుకుంటాయి... 348 00:18:15,470 --> 00:18:16,471 -ఇది... -ఏంటి? 349 00:18:16,972 --> 00:18:19,683 ఏది ఎలా జరిగినా, మనకేం కాదు. 350 00:18:19,766 --> 00:18:21,018 అవునా? ఒకవేళ నేను ఓడిపోతే? 351 00:18:22,477 --> 00:18:24,438 అప్పుడు కూడా నన్ను ఇదివరకటిలానే చూస్తావా? 352 00:18:24,521 --> 00:18:25,522 నువ్వు ఓడిపోవు. 353 00:18:26,273 --> 00:18:27,274 అప్పుడు నన్ను వదిలి వెళ్లవుగా? 354 00:18:27,858 --> 00:18:29,526 లేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించక్కర్లేదు. 355 00:18:29,610 --> 00:18:32,738 -అలాగైతే ఈ క్రీమ్ పఫ్ తిను మరి. -వద్దు. 356 00:18:32,821 --> 00:18:34,281 -తినాలి. -వద్దు. 357 00:18:37,451 --> 00:18:40,662 క్షమించు, షీలా. నన్ను క్షమించు. క్షమించు. 358 00:18:40,746 --> 00:18:42,789 నన్ను క్షమించాల్సిందే. ఇలా ఎందుకు చేశానో నాకే తెలియదు. 359 00:18:42,873 --> 00:18:44,291 నేనొక దుర్మార్గుడిని. 360 00:18:45,083 --> 00:18:46,919 -పరవాలేదు. పరవాలేదు. -ఒకవేళ ఏమైనా అయితే? 361 00:18:47,002 --> 00:18:48,795 -ఏమైనా జరిగితే, ఏంటి షీలా? -ఏమీ కాదు. 362 00:18:48,879 --> 00:18:50,589 ఏమీ కాదు. ఏమీ కాదు. 363 00:18:52,257 --> 00:18:53,842 -ఆమె పేరు చెప్పనీ. -వద్దు. 364 00:18:53,926 --> 00:18:56,220 వెనక్కి వెళ్లకపోయావో ఒక్క తన్ను తంతా! 365 00:18:56,303 --> 00:18:58,222 హేయ్, షీలా, ఇక్కడొక గొడవ జరుగుతోంది! 366 00:18:58,305 --> 00:19:00,349 -నన్ను ముట్టుకోకు, మహాతల్లి. -సరే. 367 00:19:00,432 --> 00:19:02,851 తను నా స్నేహితురాలు. పర్వాలేదు. తను నా స్నేహితురాలు. వెళ్లిపో ఇక్కడి నుంచి. 368 00:19:02,935 --> 00:19:04,394 అయినా నేనేం తనను ముట్టుకోలేదు. 369 00:19:04,478 --> 00:19:05,479 -సరే. -తనే నన్ను ముట్టుకుంది. 370 00:19:05,562 --> 00:19:06,897 -మనం అలా బయటకు వెళ్లి మాట్లాడుకుందామా? -మనం మాట్లాడుకోవాలి... 371 00:19:06,980 --> 00:19:08,315 -మనం ఇప్పుడే మాట్లాడుకోవాలి... -అలాగే. 372 00:19:08,398 --> 00:19:10,067 -బయట. -...ఎందుకంటే నువ్వు ఇప్పటికిప్పుడే... 373 00:19:10,150 --> 00:19:13,612 -ఇది సరైన సమయం కాదు. -ఆ చెత్త వెధవ నాతో... 374 00:19:16,532 --> 00:19:17,533 ఓరి దేవుడా. 375 00:19:18,033 --> 00:19:19,493 టైలర్ కి ఏమైంది? 376 00:19:20,494 --> 00:19:23,080 నిన్న రాత్రి భలే వింత జరిగింది. ఎవరో నన్ను తీవ్రంగా కొట్టారు. 377 00:19:23,163 --> 00:19:25,999 తనకు సర్జరీ అయింది. నీ భవిష్యత్తు ఆలోచనలేంటో మాకు తెలియాలి, 378 00:19:26,083 --> 00:19:28,585 ఎందుకంటే మేం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాం. 379 00:19:28,669 --> 00:19:30,045 మిగతావారిలాగే నువ్వు కూడా 380 00:19:30,128 --> 00:19:31,630 మమ్మల్ని వాడుకొని వదిలేస్తే, మేము... 381 00:19:31,713 --> 00:19:34,049 నేను కాసేపు పడుకోవాలి. ఒక శ్యాండ్విచ్ ఇస్తే ఇంకా మంచిది. 382 00:19:34,925 --> 00:19:36,426 ఇది ఎన్నికల రాత్రి. 383 00:19:36,510 --> 00:19:38,470 ఏ క్షణంలోనైనా ఫలితాలు వెలువడవచ్చు. 384 00:19:38,554 --> 00:19:40,055 ఇంట్లో అతిథులు చాలామంది ఉన్నారు. 385 00:19:40,138 --> 00:19:41,348 మాకు ఇల్లు కూడా లేదు. 386 00:19:41,431 --> 00:19:43,141 ఒక ఇంటిని కొనబోయాం. 387 00:19:43,225 --> 00:19:45,978 టైలర్ తలకు ఎంతో డబ్బు వెచ్చించి సర్జరీ చేయించవలసి వచ్చింది. 388 00:19:46,061 --> 00:19:49,022 పేపర్లో మేం చదివినదాన్ని బట్టి నువ్వు మరింత డబ్బు సంపాదించేందుకు 389 00:19:49,106 --> 00:19:51,817 మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నావని అర్థమైంది. 390 00:19:51,900 --> 00:19:53,193 నేను అలాంటి దాన్ని కాదు. 391 00:19:53,277 --> 00:19:55,404 నువ్వొక అబద్ధాలకోరువి. నువ్వు ఎలాంటిదానివో ఆమెకు తెలుసు. 392 00:19:57,281 --> 00:20:01,910 అప్పుడప్పుడూ ఈ ప్రపంచం స్వార్ధంతోనూ, క్రూరత్వంతోనూ నిండిపోయిందని అనిపిస్తుంది, 393 00:20:01,994 --> 00:20:04,788 కానీ అందరూ అలా ఉండరు. 394 00:20:04,872 --> 00:20:07,457 కొంతమంది దయ, కరుణ వంటి విలువలకు కట్టుబడి ఉంటారు. 395 00:20:07,541 --> 00:20:11,295 నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వెలాంటిదానివో ఆమె గమనిస్తోందిలే. 396 00:20:11,378 --> 00:20:13,463 తను మొదట్నుంచి కనిపెడుతూనే ఉంది. తనకి తెలుసు. 397 00:20:13,964 --> 00:20:15,549 సరే. అందరూ సిద్ధంగా ఉండండి. సమయం వచ్చేసింది. 398 00:20:15,632 --> 00:20:18,552 నన్ను క్షమించు. నేను వెళ్లాలి, క్షమించు. 399 00:20:42,910 --> 00:20:45,954 విజేతలంతా అక్కడున్నారు. 400 00:20:47,581 --> 00:20:53,003 వీళ్లంతా పరాజితులు. స్థానిక ఎన్నికల్లోనూ గెలవలేక చతికిలపడ్డారు. 401 00:20:54,755 --> 00:20:56,840 నువ్వు పోయిపోయి వీళ్ల దగ్గర ఇరుక్కుపోయావు. 402 00:20:57,841 --> 00:20:59,092 పాత ఆలోచనలు. 403 00:20:59,176 --> 00:21:00,260 సర్ఫింగ్ మా హక్కు 404 00:21:00,344 --> 00:21:02,262 ప్రజాదరణ లేదు. నీ అవసరం అంతకంటే లేదు. 405 00:21:03,388 --> 00:21:04,389 అలసిపోయారు. 406 00:21:06,975 --> 00:21:09,853 దారుణంగా ఓడిపోయారు. 407 00:21:11,939 --> 00:21:15,442 అదీ నీ స్థానం, ఇప్పుడున్న స్థానం అదే. 408 00:21:15,984 --> 00:21:18,195 చతికిల పడ్డావు. మునిగిపోయావు. 409 00:21:19,196 --> 00:21:20,197 అంతా అయిపోయింది. 410 00:21:28,330 --> 00:21:30,457 వదిలెయ్. ఇక చాలు. 411 00:21:30,541 --> 00:21:34,169 నువ్వు ఓడిపోయిన మూర్ఖురాలివి. నిండా మునిగిపోయావు. నీ పని అయిపోయింది. 412 00:21:35,295 --> 00:21:37,256 అబ్బా. క్షమించు! ఒక్క క్షణం! ఒక్క క్షణం టైమివ్వు! 413 00:21:37,339 --> 00:21:39,550 నీకు ఒక్క క్షణం కూడా టైమ్ లేదు. నువ్వు బద్దలవ్వడానికి రెడీగా ఉన్నావు. 414 00:21:39,633 --> 00:21:42,761 అర్థమవుతోందా? నువ్వు బద్దలు కాబోతున్నావు. 415 00:21:42,845 --> 00:21:46,306 -పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు... -పద. పద, పద. 416 00:21:46,390 --> 00:21:48,225 -హాయ్. నమస్తే. -హాయ్, హాయ్. 417 00:21:49,268 --> 00:21:50,686 -హేయ్. -హాయ్. 418 00:21:50,769 --> 00:21:55,107 గ్రెటా... గ్రెటా, నీ కాంట్రాక్టును గ్రెటా చూపించింది. 419 00:21:56,525 --> 00:21:58,777 -బాగుంది. అవును. -అది చాలా బాగుంది. 420 00:21:58,861 --> 00:22:02,990 నువ్వు దాన్ని చక్కగా కొనసాగించవచ్చు. మరెప్పుడైనా. 421 00:22:03,073 --> 00:22:05,701 అవును, నా ఉద్దేశంలో బాగున్నట్టే ఉంది. సరే. 422 00:22:06,827 --> 00:22:07,828 బాగుంది. 423 00:22:08,579 --> 00:22:09,788 నన్ను క్షమించు. 424 00:22:09,872 --> 00:22:12,666 టెన్షన్ ఆపుకోలేకపోయాము, అందుకే. 425 00:22:13,375 --> 00:22:15,169 ఫలితాలు వచ్చేశాయా? మనం గెలిచామా? 426 00:22:16,837 --> 00:22:17,838 షీలా. 427 00:22:19,965 --> 00:22:21,300 క్షమించు. 428 00:22:22,134 --> 00:22:25,596 బాధపడాల్సింది నువ్వే. ఇరుక్కుపోయావు, వేరే గతిలేదు. 429 00:22:27,431 --> 00:22:29,349 నీకు బాధగా ఉంది కదూ? 430 00:22:29,433 --> 00:22:31,268 పో, పోయి బాగా క్రీమ్ పఫ్ పూసుకో. 431 00:22:36,690 --> 00:22:38,692 అతను గెలిచి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. 432 00:22:38,775 --> 00:22:41,278 నువ్వు సంతోషంగా, వేడుక చేసుకునేదానివి. కానీ అతను గెలవలేదు. 433 00:22:41,361 --> 00:22:45,199 అతనొక పరాజితుడు. బలహీనుడు, దిక్కుమాలినవాడు. 434 00:22:45,282 --> 00:22:47,242 దేవుడా. అతనేనా... 435 00:22:48,994 --> 00:22:50,204 ఓరి దేవుడా. 436 00:23:14,102 --> 00:23:17,064 కనీసం నా పక్కన నా భార్య అయినా ఉంది. 437 00:23:17,147 --> 00:23:18,690 అది నిజమే. నా పక్కన తను లేదు. 438 00:23:18,774 --> 00:23:21,068 ఎందుకంటే నన్ను మళ్లీ ఒంటరిని చేసి వెళ్లిపోయింది. 439 00:23:21,151 --> 00:23:24,112 ఆమె కూడా ఈ ప్రపంచంలోని మిగతా అందరిలాంటిదే, గురూ. 440 00:23:24,821 --> 00:23:27,407 నన్ను క్షమించు. ఇది మనం వేడుక చేసుకునేందుకు తెప్పించిన కొకైన్. 441 00:23:28,450 --> 00:23:29,993 ఓదార్చేందుకూ ఉపయోగపడుతుంది. 442 00:23:30,077 --> 00:23:32,371 నేను మనవాళ్ళతో కూడా కలవలేనేమో. 443 00:23:32,454 --> 00:23:35,499 రీగన్, అతని గూండాలూ గెలుస్తూనే ఉన్నారు. 444 00:23:35,582 --> 00:23:37,960 -ఎందుకంటే ఎవరికీ... -ఎవరికీ నిజమేమిటో అక్కర్లేదు. 445 00:23:38,043 --> 00:23:40,587 -ఈ ప్రపంచం అదుపు తప్పుతోంది. -ఈ ప్రపంచం. 446 00:23:40,671 --> 00:23:42,756 -ఇది దారుణం. నాశనమైపోతుంది. -ఈ గ్రహం నాశనమైపోతుంది. 447 00:23:42,840 --> 00:23:44,091 జోక్ చేస్తున్నావా? ఈ సముద్రాలు... 448 00:23:44,174 --> 00:23:45,175 ఈ గాలి! కమాన్. 449 00:23:45,259 --> 00:23:47,344 దీనంతటి గురించీ ఆలోచిస్తున్నది కేవలం మనం మాత్రమే, గురూ. 450 00:23:47,427 --> 00:23:49,012 దేవుడా, మనం మంచివాళ్లం అయినంతమాత్రాన లాభం ఏంటి. 451 00:23:49,096 --> 00:23:51,056 వదిలెయ్. మనం గొప్పవాళ్లం, అంతే. 452 00:23:51,139 --> 00:23:53,016 అదేం లెక్కలోకి రాదు. ఎవరూ పట్టించుకోరు. మనమంటే జనాలకు పడదు. 453 00:23:53,100 --> 00:23:54,643 మనం ఎందుకూ పనికి రానివాళ్ళం. మనకు చెల్లుబాటు లేదు. 454 00:23:54,726 --> 00:23:57,104 -చివరకు అదే తేలింది మరి. -చెల్లుబాటు, అంటే ఏంటి? 455 00:23:57,187 --> 00:23:59,022 అనిశ్చిత పరిస్థితి. దాన్ని మనిషే సృష్టించాడు. 456 00:23:59,106 --> 00:24:00,315 -కాదు, కాదు, కాదు. కాదు. -కాదా? 457 00:24:00,399 --> 00:24:02,192 -ఇది ఇప్పటిదాకా అంతా తప్పుగా... -మనది తప్పుగా భావించాం. 458 00:24:02,276 --> 00:24:04,361 -...భావించాం. -ఇప్పటిదాకా మనం తప్పుగానే భావించాం. 459 00:24:04,444 --> 00:24:06,697 మనం ఈ వ్యవస్థలో పనిచేయలేం. 460 00:24:06,780 --> 00:24:09,950 -కాబట్టి మనం వ్యవస్థకు ఆవల పనిచేయాలి. -వ్యవస్థకు బయట. 461 00:24:10,033 --> 00:24:12,494 మనకొక మేధోవర్గం కావాలి. 462 00:24:30,679 --> 00:24:35,642 దానికి పేరు ఏం పెడదామంటే "సంయుక్త సమీకరణ..." 463 00:24:35,726 --> 00:24:38,395 -"ప్రజాస్వామిక ఉద్యమ..." -కాదు. 464 00:24:38,478 --> 00:24:40,689 -"ప్రజా వేదిక." -కాదు, కాదు. "సంకీర్ణ వేదిక." 465 00:24:40,772 --> 00:24:43,692 -"ప్రజాస్వామిక సంకీర్ణ వేదిక..." -సంకీర్ణం. ప్రజాస్వామిక. 466 00:24:44,776 --> 00:24:46,236 -ఛీ! -రాజభక్తా? కాదు! 467 00:24:46,904 --> 00:24:47,863 ఛీ! 468 00:24:47,946 --> 00:24:49,698 -పేరు పెట్టడానికి ఇంత కష్టపడుతున్నామేంటి? -ఏమో మరి, గురూ. 469 00:24:49,781 --> 00:24:50,741 నాకు పేరుపెట్టడం కూడా చేత కావట్లేదు. 470 00:24:50,824 --> 00:24:53,035 -అయిపోయింది. ఇక వదిలేయ్. -మనం ఇప్పుడు... 471 00:24:53,118 --> 00:24:55,454 మనం... మనకు చాలా సమయం ఉంది. తీరిగ్గా ఆలోచిద్దాంలే. 472 00:25:23,190 --> 00:25:26,235 -మనం మరీ తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాం. -తక్కువ స్థాయిలోనే ఆలోచిస్తున్నాం. 473 00:25:26,318 --> 00:25:28,403 -మరీ తక్కువ స్థాయిలో. -నువ్వు ఈ ఊరికే పరిమితమైపోకూడదు. 474 00:25:28,487 --> 00:25:31,740 -తొక్కలో ఊరు. -నువ్వు ఈ రాష్ట్రానికే పరిమితమైపోకూడదు. 475 00:25:31,823 --> 00:25:34,117 -చెత్త ఊరు. చెత్త రాష్ట్రం. దరిద్రపు... -నీకు అర్థమవుతోందా? 476 00:25:34,201 --> 00:25:35,536 నువ్వు జాతీయ స్థాయిలో ఉండాల్సిన వాడివి. 477 00:25:35,619 --> 00:25:38,288 లేదు, లేదు. జాతీయ స్థాయి కూడా కాదు. 478 00:25:38,372 --> 00:25:41,500 -ప్రపంచస్థాయిలో ఉండాల్సినవాడివి, గురూ. -జెర్రీ. 479 00:25:41,583 --> 00:25:44,628 -జెర్రీ. ప్రపంచస్థాయి. -ప్రపంచస్థాయి. 480 00:26:06,525 --> 00:26:07,526 షీలాతో వర్కవుట్ 481 00:26:07,609 --> 00:26:09,820 నావైపు చూడు. నావైపు చూడు. నావైపు చూడు, అవును! 482 00:27:45,624 --> 00:27:47,626 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య