1 00:00:06,006 --> 00:00:08,717 నా పేరు డానీ రూబిన్, నేను రాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలబడుతున్నాను. 2 00:00:08,800 --> 00:00:10,594 -నాన్నా, టీవీ! -ఈమె నా అందాల భార్య, షీలా, 3 00:00:10,677 --> 00:00:13,222 -తను మా కూతురు, మాయా. -అవును, బంగారం. నాన్న టీవీలో ఉన్నాడు. 4 00:00:13,305 --> 00:00:16,600 విన్నావా, బంగారం? తను "నాన్నా, టీవీ" అని అంది. అది భలే ముద్దుగా ఉంది కదా? 5 00:00:16,683 --> 00:00:18,227 -మన సముద్రాన్ని కాపాడుకుందాం... -అవును. ముద్దుగా ఉంది. 6 00:00:18,310 --> 00:00:20,145 హేయ్, బంగారం. 7 00:00:21,104 --> 00:00:22,147 ఇది నీ వల్లే సాధ్యమైంది. 8 00:00:22,231 --> 00:00:24,316 మెచ్చుకోవలసిన చోట మెచ్చుకోవలసిందే. 9 00:00:26,276 --> 00:00:28,028 అది మీ అభిమానుల్లో ఒకరు అయ్యుంటారు. 10 00:00:28,904 --> 00:00:30,197 చూద్దాం. 11 00:00:30,280 --> 00:00:31,365 -హలో. -హలో. 12 00:00:31,448 --> 00:00:33,867 ఇది అసెంబ్లీ పదవికి పోటీ చేస్తున్న రూబిన్ ప్రధాన కార్యాలయమా? 13 00:00:33,951 --> 00:00:35,494 దయచేసి మీరెవరో చెప్పగలరా? 14 00:00:35,577 --> 00:00:38,163 తప్పకుండా. నేను కే.టి.ఎస్.డీ అకౌంటింగ్ నుండి మ్యాగీని మాట్లాడుతున్నాను. 15 00:00:38,247 --> 00:00:39,498 ఇవాళ మీరు ఎలా ఉన్నారు? 16 00:00:40,541 --> 00:00:41,542 బాగున్నాను. 17 00:00:41,625 --> 00:00:43,627 మీరు చెల్లించడానికని పంపించిన చెక్ తో సమస్య ఉంది. 18 00:00:43,710 --> 00:00:45,420 అది మాకు రిటర్న్ అయి వచ్చింది. 19 00:00:47,005 --> 00:00:51,009 మేము చూసుకోకుండా ఏదైనా పొరపాటు చేసుంటాం. 20 00:00:51,552 --> 00:00:53,428 మేము వెంటనే మీకు ఇంకో చెక్ పంపిస్తాం. 21 00:00:53,512 --> 00:00:56,139 మంచిది. ఏమనుకోకపోతే, అది కాస్త త్వరగా పంపితే చాలా బాగుంటుంది, 22 00:00:56,223 --> 00:00:59,685 ఎందుకంటే, అప్పుడే మేము ప్రకటనని నిరంతరాయంగా ప్రసారం చేయగలం. 23 00:00:59,768 --> 00:01:02,437 మేము ఈ సమస్యని వెంటనే సరిదిద్దుతాం. ఇలా గడబిడ అయినందుకు మన్నించండి. 24 00:01:03,355 --> 00:01:04,480 జర్నల్ 25 00:01:08,986 --> 00:01:10,320 డానీ + షీలా రూబిన్ 26 00:01:10,404 --> 00:01:12,573 మేము బిడ్డకు జన్మనివ్వబోతున్నాము 27 00:01:12,656 --> 00:01:13,740 మా ఇంటికి రండి! 28 00:01:19,621 --> 00:01:21,498 ఆ దద్దమ్మకి ఇది చెప్తే ఎగిరి గంతేస్తుంది. 29 00:01:30,299 --> 00:01:32,342 టాన్యా, నేను షీలాని. 30 00:01:32,426 --> 00:01:34,511 షీలా, హాయ్. నేను గర్భవతినని తెలిసిందా? 31 00:01:34,595 --> 00:01:41,518 అవును. నీ కార్డ్ అందింది. చాలా బాగుంది. ఇల్లూ, నువ్వు కూడా. 32 00:01:41,602 --> 00:01:43,145 దేవుడా. అవును, కదా? 33 00:01:43,228 --> 00:01:45,230 మీ ఇద్దరి విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. 34 00:01:45,314 --> 00:01:49,735 ఇప్పుడు అంతా చాలా బాగుంది. నువ్వూ, డానీ ఎలా ఉన్నారు? 35 00:01:49,818 --> 00:01:55,032 అంత బాగా ఏమీ లేము. అడిగినందుకు ధన్యవాదాలు. మా ఇద్దరికీ నీ సాయం అవసరం ఉంది. 36 00:01:57,534 --> 00:02:01,914 మాకు లాస్ ఏంజలెస్ అంటే చిరాకు. మాకు ఆ పేరు అంటేనే పడదు. ఒకప్పుడు అసహ్యించుకునేవాళ్ళం. 37 00:02:01,997 --> 00:02:05,709 ఇప్పుడు కూడా. లాస్ ఏంజలెస్ లో దుర్మార్గులూ, ద్రోహులూ ఉంటారు. 38 00:02:05,792 --> 00:02:08,669 అదీకాక, ఈ వారాంతంలో మనకి మూడు ఈవెంట్లు ఎలాగూ ఉన్నాయి. 39 00:02:09,128 --> 00:02:12,341 మొన్న జరిగిన పసిఫిక్ బీచ్ మాటామంతీలో అయిదు మంది వచ్చారు, అలాంటిదేనా? 40 00:02:12,424 --> 00:02:14,218 అలా అనకు, వాళ్ళు అయిదుగురు ఓటర్లు. 41 00:02:14,301 --> 00:02:17,763 లాస్ ఏంజలెస్ లోని జనాలు, బ్యాలెట్ ని చదవగలిగినా కానీ, వాళ్లు నీకు ఓటేయలేరు. 42 00:02:17,846 --> 00:02:21,308 జెర్ చెప్పేదాంట్లో నిజముంది, బంగారం. అంటే, సమయం మించిపోతోంది. 43 00:02:21,391 --> 00:02:24,102 సమయం మించిపోతోంది, నా నియోజకవర్గం కాని వారిని కలిసి, 44 00:02:24,186 --> 00:02:27,231 వాళ్లతో పళ్ళు ఇకిలిస్తూ మాట్లాడటం వలన, ఆ సమయం వృథా అయిపోతుంది. 45 00:02:27,314 --> 00:02:32,277 చూడు, నీకు ఆ ఊహల ప్రపంచంలోకి వెళ్లి అక్కడి ప్రముఖులతో కులకాలని ఉంటే, ఆనందంగా చేసుకో. 46 00:02:32,903 --> 00:02:34,488 కానీ నువ్వు ఎన్నికయ్యే దాకా ఆగు. 47 00:02:34,571 --> 00:02:36,532 సరేనా? కానీ ఇప్పుడు వెళ్ళడం వలన మన పని ఆగిపోతుంది. 48 00:02:36,615 --> 00:02:39,159 ఈ దేశదిమ్మరిగాడు దీన్ని చెడగొట్టకుండా చూసుకో. 49 00:02:39,243 --> 00:02:41,411 హేయ్, నాకు కూడా ఆ చోటు అంటే అస్సలు ఇష్టం లేదు, 50 00:02:41,495 --> 00:02:44,039 కానీ అక్కడ అయితే మనకి నిధులు బాగా వస్తాయి. 51 00:02:44,122 --> 00:02:46,333 శాన్ డీయాగలో ఒక నెల తిరిగినా రానన్ని నిధులు, 52 00:02:46,416 --> 00:02:49,002 జాక్, టాన్యాల పార్టీలో ఒక్కరాత్రే మనం సమీకరించవచ్చు. 53 00:02:49,753 --> 00:02:52,172 అలా నీ సమయం, శక్తి చాలా ఆదా చేసుకోవచ్చు. 54 00:02:52,256 --> 00:02:54,758 మన ప్రచారం ఇప్పుడు ఒక ఊపులో ఉంది. అది తగ్గకూడదు. 55 00:02:55,801 --> 00:02:56,802 సరే! 56 00:02:56,885 --> 00:02:59,054 బాడీ బై బన్నీ 57 00:02:59,137 --> 00:03:01,390 బాగా చేశారు, అమ్మాయిలూ. 58 00:03:03,267 --> 00:03:06,395 హేయ్! ఏంటి సంగతి? 59 00:03:07,354 --> 00:03:09,940 అంటే, నువ్వు ఇటువైపు వచ్చి చాలా కాలమైంది కదా. 60 00:03:10,023 --> 00:03:12,442 అవును. ఆ విషయంలో మన్నించు, టైలర్. 61 00:03:12,943 --> 00:03:16,405 మనం కవర్ ఆర్ట్ ని ఖరారు చేస్తే, నా టేప్ మనిషి మరిన్ని కాపీలు చేసి ఇస్తాడు. 62 00:03:16,488 --> 00:03:18,782 కాబట్టి, రెండు ఆప్షన్లను సిద్ధం చేశాను. 63 00:03:18,866 --> 00:03:21,201 నీకు వీటిలో ఏదైనా నచ్చిందా. నేను... 64 00:03:21,785 --> 00:03:24,246 నీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పేయ్. 65 00:03:24,329 --> 00:03:25,330 షీలా + బన్నీ 66 00:03:28,709 --> 00:03:31,712 కానీ బాగాలేకపోతే, ఆ విషయం చెప్పడానికి నువ్వేమీ తెగ కష్టపడిపోనక్కర్లేదు. 67 00:03:32,296 --> 00:03:34,756 -ఇవి చాలా బాగున్నాయి. -నిజంగానా? 68 00:03:36,175 --> 00:03:37,176 అంటే... 69 00:03:38,802 --> 00:03:41,013 అంటే, నీకు అవి నచ్చాయంటే, అది చాలా మంచి విషయం. 70 00:03:41,597 --> 00:03:44,808 -అవును, ఇదయితే ఇంకా బాగుంది. -నాకు కూడా అది చాలా బాగా నచ్చింది. 71 00:03:44,892 --> 00:03:47,895 నిజం చెప్పాలంటే, ఇది అస్సలు బాగాలేదు. 72 00:03:48,395 --> 00:03:52,482 అంటే, ఇంత బాగా వస్తుందని నేను ఊహించనేలేదు. 73 00:03:52,566 --> 00:03:54,193 చాలా... చాలా అంటే చాలా బాగుంది. 74 00:03:54,818 --> 00:03:57,946 మొదటి దఫాకి రెండు వేలు సరిపోతాయి. మనకి బాగా నచ్చాయంటే, నాలుగు వేలు పెట్టవచ్చు. 75 00:03:58,530 --> 00:04:00,157 ఇవి హాట్ కేకుల్లా అముడయిపోతాయి... 76 00:04:00,240 --> 00:04:01,575 నీ దగ్గర రెండు వేలు లేవు. 77 00:04:01,658 --> 00:04:03,577 నిజానికి, నీ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. 78 00:04:03,660 --> 00:04:04,661 అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? 79 00:04:04,745 --> 00:04:06,747 అయితే, నేను కొన్ని రోజులకు ఊర్లో ఉండను. 80 00:04:06,830 --> 00:04:09,124 -బన్నీ ఏమైనా... -నువ్వు బయలుదేరుతున్నావు. 81 00:04:11,835 --> 00:04:13,045 అది అర్థవంతంగానే ఉందిలే. 82 00:04:13,128 --> 00:04:15,130 -అవును, కొన్ని రోజులకేలే. -అవును, బన్. 83 00:04:15,214 --> 00:04:16,214 కొన్ని రోజులకు. 84 00:04:16,298 --> 00:04:18,926 నేను వచ్చాక, మనం మన పని కొనసాగిద్దాం. 85 00:04:19,009 --> 00:04:21,261 అవును, బన్. తను వచ్చాక. 86 00:04:21,345 --> 00:04:24,056 -ఈ చెత్త బ్యాగ్. -ఇప్పుడు జిప్ లాగు, బంగారం. 87 00:04:27,017 --> 00:04:28,560 అప్పటికే వేసేశాలే, కానీ ధన్యవాదాలు. 88 00:04:28,644 --> 00:04:30,687 దానిదేముందిలే. 89 00:04:30,771 --> 00:04:31,855 ఎక్కువే సర్దుకున్నట్టున్నావు. 90 00:04:31,939 --> 00:04:34,024 ఒక వారానికే వెళ్తున్నావా, ఇంకొన్ని రోజులు ఉంటావా? 91 00:04:34,107 --> 00:04:35,484 ఎందుకైనా మంచిదని ఎక్కువ పెట్టుకున్నా. 92 00:04:35,567 --> 00:04:37,361 నాకు డ్రాయర్ వేసుకోవాలనుంది. అంటే ఏంటో తెలుసా? 93 00:04:37,444 --> 00:04:39,571 అక్కడ మీ అమ్మానాన్నలను కలుస్తున్నావా? 94 00:04:43,116 --> 00:04:44,826 ఆ విషయం చెప్తే, డానీ ఎగిరిగంతేస్తాడు. 95 00:04:47,746 --> 00:04:49,206 నేను మా అమ్మానాన్నలతో మాట్లాడటం లేదు. 96 00:04:52,251 --> 00:04:56,171 నా కంటే చాలా విషయంలో డానీ తెలివైనవాడే. 97 00:04:56,255 --> 00:04:58,841 పెద్ద విషయాల్లో కానీ, ఆలోచనల్లో కానీ. 98 00:05:01,426 --> 00:05:03,303 కానీ అతనిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. 99 00:05:10,185 --> 00:05:12,187 వారాంతం కులాసాగా గడుపు, జెర్రీ. 100 00:05:20,737 --> 00:05:21,738 ఏం చేశావు నువ్వు? 101 00:05:21,822 --> 00:05:23,866 మనం ఎలాగూ వెళ్తున్నాం కనుక, అదేదో అదిరిపోయేలా వెళ్దాం. 102 00:05:24,366 --> 00:05:26,952 -కానీ దీనికి ఎంత ఖర్చయింది? -అదేం లేదు. కాస్త శాంతించు. 103 00:05:27,035 --> 00:05:28,328 దీనికి నయాపైసా కూడా ఖర్చు కాలేదు. 104 00:05:28,412 --> 00:05:31,456 అవును, ఒక జాగింగ్ మిత్రుడు దీన్ని అరువుగా ఇచ్చాడు. అతని ప్రాణం కాపాడానులే. 105 00:05:31,540 --> 00:05:32,958 కానీ అప్పుడు అతని కాలు బెణికిందంతే. 106 00:05:33,041 --> 00:05:35,586 కానీ ఏదేమైనా, అప్పుడు నా ఒక్కడి దగ్గరే ఐస్ ఉండింది. 107 00:05:36,628 --> 00:05:37,629 పద. 108 00:05:38,380 --> 00:05:39,506 ఇలా ఇవ్వు, కారెక్కు. 109 00:05:40,007 --> 00:05:41,466 సరే. నువ్వు అటువైపు ఎక్కు. 110 00:05:43,343 --> 00:05:44,970 -అది అదిరిపోయింది కదా? -నీకేమనిపిస్తోంది? నచ్చిందా? 111 00:05:45,053 --> 00:05:47,055 -నాకు పనుంది, కనుక లోపలికి వెళ్తాను. -అవునా? 112 00:05:47,139 --> 00:05:48,891 -క్షేమంగా వెళ్లండి. -నీకు నచ్చిందా? 113 00:05:50,851 --> 00:05:52,144 సరే జెర్రీ. 114 00:05:52,227 --> 00:05:56,732 పుట్టినరోజు జేజేలు 115 00:05:56,815 --> 00:05:57,858 అందరికీ ధన్యవాదాలు. 116 00:05:59,193 --> 00:06:00,485 ధన్యవాదాలు, బంగారం. 117 00:06:01,862 --> 00:06:03,614 ఏంటి? నువ్వేమీ కోరుకోలేదే. 118 00:06:03,697 --> 00:06:05,991 ఈ వయస్సులో కూడా నేను ఏమైనా కోరుకోవాలంటావా? 119 00:06:06,074 --> 00:06:07,618 కోరుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు. 120 00:06:07,701 --> 00:06:08,702 సరే. 121 00:06:10,287 --> 00:06:13,165 నా కుటుంబం ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. 122 00:06:13,248 --> 00:06:16,210 నువ్వు కోరికని బయటకు చెప్పకూడదు. అది అశుభం. 123 00:06:16,752 --> 00:06:18,337 అది కూడా ఈ సంవత్సరమే మనకి కలిసిరాలేదు, 124 00:06:18,420 --> 00:06:21,632 నువ్వేమో ఒక సంవత్సరం వయసు పెరుగుతున్నావు, మీ నాన్నని వెనక్కి పిలిపించారు. 125 00:06:21,715 --> 00:06:24,676 మనది మతవిశ్వాసాలు ఉన్న కుటుంబం, మూఢ నమ్మకాలను నమ్మే కుటుంబం కాదు, 126 00:06:24,760 --> 00:06:26,720 కానీ మనం జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు కదా. 127 00:06:26,803 --> 00:06:28,597 అమ్మా. ధన్యవాదాలు. 128 00:06:30,974 --> 00:06:35,896 పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న 129 00:06:42,611 --> 00:06:45,739 ఇదిగో. కేక్ తిను. 130 00:06:46,698 --> 00:06:48,367 ఇంకెవరికైనా కేక్ కావాలా? 131 00:06:49,993 --> 00:06:51,453 నేను తింటాను. 132 00:06:55,832 --> 00:07:00,087 ఇంకెవరికైనా? ఎవరికైనా కేక్ కావాలా? 133 00:07:02,089 --> 00:07:05,217 నువ్వు టాయిలెట్ కు ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం లేదంటావా? వెళ్లాలంటే ఇప్పుడే వెళ్లు. 134 00:07:07,010 --> 00:07:08,011 హేయ్. 135 00:07:09,471 --> 00:07:12,724 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 136 00:07:13,350 --> 00:07:15,477 ఏంటి? లేదు, నేను పరమ దరిద్రంగా ఉన్నాను. 137 00:07:15,561 --> 00:07:18,021 -ఈ గాలికి... నా జుట్టు. -లేదు, లేదు, లేదు. ఆలస్యమైపోయింది. 138 00:07:18,105 --> 00:07:19,731 నువ్వు నవ్వేశావు. 139 00:07:19,815 --> 00:07:21,024 ఇప్పుడు వెనక్కి తీసుకోలేను. 140 00:07:28,991 --> 00:07:30,742 ఇవేవీ కలకాలం ఉండవు. 141 00:07:32,911 --> 00:07:34,621 నేల, నింగి, నీరు. 142 00:07:36,415 --> 00:07:39,334 మాయా కోసం వీటిని సంరక్షించడానికి మనం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప. 143 00:07:39,418 --> 00:07:40,419 నిజమే. 144 00:07:42,171 --> 00:07:43,213 డ్రగ్స్ తీసుకున్నావా? 145 00:07:43,297 --> 00:07:45,382 నేను చూడనప్పుడు గంజాయి ఏమైనా కొట్టావా? 146 00:07:45,465 --> 00:07:46,633 అవును. 147 00:07:46,717 --> 00:07:48,468 మత్తులో ఉన్నప్పుడు బాగా నడపగలను. 148 00:07:48,552 --> 00:07:49,553 బాగా దృష్టి కేంద్రీకరించగలను. 149 00:07:50,804 --> 00:07:51,805 నేను నడుపుతానులే. 150 00:07:51,889 --> 00:07:52,890 -అంతే అంటావా? -అవును. 151 00:07:54,141 --> 00:07:56,351 -సరే. నీకెలా కావాలంటే అలా. -పద, బంగారం. బయలుదేరుదాం. 152 00:08:04,985 --> 00:08:06,153 ఒక్క నిమిషం! 153 00:08:06,236 --> 00:08:07,696 నన్ను లోపలికి రానివ్వు. 154 00:08:08,906 --> 00:08:09,907 సరే. 155 00:08:15,996 --> 00:08:18,248 -హేయ్, నేను ఈతకు వెళ్తున్నాను. -హేయ్. 156 00:08:18,332 --> 00:08:19,416 నువ్వు కూడా వస్తావా? 157 00:08:19,499 --> 00:08:20,709 లేదులే. 158 00:08:20,792 --> 00:08:23,670 గోల్ఫ్ కోర్టు మధ్యలో ఉన్న హోటల్ లో చికెన్ కబాబ్ తినవద్దని నాకు గుర్తుచేయ్. 159 00:08:23,754 --> 00:08:25,214 అవి తింటే కడుపులో అదోలా ఉంటుంది. 160 00:08:35,640 --> 00:08:38,227 స్వర్గానికి స్వాగతం, మిత్రులారా. అడుగు చూసి వేయండి. 161 00:08:38,309 --> 00:08:39,352 యూదుల మారణకాండ నుండి 162 00:08:39,436 --> 00:08:43,232 బయటపడిన జోసెఫ్ సోలొకోఫ్, ఈ ఇంటిని నిర్మించారు. 163 00:08:43,315 --> 00:08:44,942 అతను అంత అంధకారాన్ని చవిచూసిన తర్వాత, 164 00:08:45,025 --> 00:08:48,820 అతను కాలిఫోర్నియాలో నిర్మించిన ఇళ్లలో 165 00:08:48,904 --> 00:08:50,781 వెలుతురు తాలూకు ఛాయలను, ఆ తేజస్సును, 166 00:08:50,864 --> 00:08:53,283 ఇంకా చెప్పాలంటే జీవాన్నే మీరు గమనించవచ్చు. 167 00:08:54,660 --> 00:08:56,578 జోనీ మిచెల్, సోలొకోఫ్ నిర్మించిన ఇంట్లో ఉంటున్నారు. 168 00:08:56,662 --> 00:08:58,413 -నిజమే. -నిజంగా, తను అందులోనే ఉంటుంది. 169 00:08:58,830 --> 00:09:00,707 ఇది చాలా అద్భుతంగా ఉంది... 170 00:09:00,791 --> 00:09:02,668 ...నటనలో మేమిద్దరం ఎన్.టీ.ఆర్ నే తలదన్నేలా ఉన్నాం. 171 00:09:02,751 --> 00:09:05,003 మెడలో ఎన్ని నెక్లెస్లు వేసుకొన్నాడు బాబూ? 172 00:09:05,087 --> 00:09:06,755 నువ్వు మాయాని గమనిస్తూ ఉండు. 173 00:09:06,839 --> 00:09:08,173 -సరే. -గ్రిల్స్ ఏమీ లేవు. 174 00:09:08,257 --> 00:09:10,717 -సోలొకోఫ్ అలానే నిర్మిస్తాడు. -అవును. 175 00:09:10,801 --> 00:09:12,886 అవును. కింద పడితే ఇక అంతే. 176 00:09:12,970 --> 00:09:16,056 అవును, అవును. అప్పుడప్పుడూ నా కళ్లు తిరుగుతూ ఉంటాయి. 177 00:09:17,349 --> 00:09:19,476 -అది భలే గమ్మత్తుగా ఉంటుంది. -తనకి తిరుగుతాయి. అది చిన్న విషయం కాదు. 178 00:09:20,269 --> 00:09:22,688 అదేం లేదులే... అది చాలా సరదాగా ఉంటుంది. 179 00:09:22,771 --> 00:09:25,023 కాన్యన్ లోకి పడిపోతున్నప్పుడు ప్రాణాలు పోతాయనే 180 00:09:25,107 --> 00:09:27,150 భయంతో తన ముఖం ఎలా ఉంటుందో నాకు చూడాలనుంది... 181 00:09:27,234 --> 00:09:30,737 డెబ్బై ఆరు అడుగులు. కింద ప్యూమాలు ఉంటాయి. 182 00:09:30,821 --> 00:09:32,656 -ఏంటి? -మిగతా అన్ని చోట్లా గ్రిల్స్ ఉంటాయి. 183 00:09:33,240 --> 00:09:34,241 కానీ ఇక్కడ ఉండవు. 184 00:09:34,324 --> 00:09:36,243 ఇక్కడంతా మోటూగా, మాస్ గా ఉంటారు. 185 00:09:36,326 --> 00:09:38,620 దరిద్రంగా, మడ్డిగా ఉంటారు అని కూడా చెప్పు. 186 00:09:38,704 --> 00:09:43,375 ఇంట్లోని ప్రతీ అంతస్థులో కూడా ఒక ప్రత్యేకమైన వీక్షణ ఉంటుంది. 187 00:09:43,917 --> 00:09:46,587 వాటన్నింట్లో బాత్రూమ్లు ఉంటాయా? 188 00:09:46,670 --> 00:09:47,754 అన్నింట్లో ఉంటాయి. 189 00:09:47,838 --> 00:09:50,340 -అన్నింట్లో బాత్రూమ్లు ఉంటాయి. -బాత్రూమ్లు ఉన్నాయి. 190 00:09:50,424 --> 00:09:53,135 మంచిది, దూర ప్రయాణం చేశాం కదా, ఇక్కడ వెళ్లవచ్చని ఆపుకున్నాను. 191 00:09:53,927 --> 00:09:54,803 ఇప్పుడే వస్తా. 192 00:09:54,887 --> 00:09:55,888 -ఇటు రా, బంగారం. -సరే. 193 00:10:07,649 --> 00:10:08,650 ఎలా ఉన్నావు? 194 00:10:09,401 --> 00:10:11,403 -నువ్వెలా ఉన్నావు? -ఏంటి సంగతి? 195 00:10:11,486 --> 00:10:13,655 పెద్ద సంగతేం లేదు. సర్ఫ్ బోర్డులు చేసుకుంటూ గడిపేస్తున్నా. 196 00:10:13,739 --> 00:10:17,451 -నీకు నచ్చినట్టు ఉంటున్నావు, బాసూ. -అదరగొట్టేస్తున్నాను, గురూ. 197 00:10:17,534 --> 00:10:19,453 మరి, ఏంటి సంగతి, గురూ? 198 00:10:19,536 --> 00:10:22,623 ఏదైనా పని ఉందా? కాపీలు చేసే పని? నువ్వు ఇచ్చిన పని దాదాపు అయిపోవచ్చింది. 199 00:10:22,706 --> 00:10:24,541 నాకు డబ్బులతో పని ఉంది కూడా. 200 00:10:24,625 --> 00:10:25,751 లేదు, మన్నించు. 201 00:10:25,834 --> 00:10:28,754 నాకు నగదు వచ్చే విషయంలో కాస్త ఆలస్యమవుతోంది. 202 00:10:28,837 --> 00:10:30,839 -కొంత కాలం ఆగాలి. -బాసూ. 203 00:10:30,923 --> 00:10:32,132 నాకు తెలుసు, బాసూ. 204 00:10:33,175 --> 00:10:38,138 అయితే, నేను పోర్న్ వాళ్లకి కాల్ చేసి, ఏమైనా పనుందేమో కనుక్కోవాలేమో. 205 00:10:38,222 --> 00:10:41,975 నాకు ఆ పనంటే అస్సలు ఇష్టం లేదు, బాసూ. నేను ఒక క్రైస్తవ మతస్థుడిని. 206 00:10:42,893 --> 00:10:44,978 -నా అంతరాత్మకి బాధగా ఉంటుంది. -నాకు అర్థమైంది. 207 00:10:45,479 --> 00:10:49,775 క్రైస్తవ మతం గురించి కాదు, నేను బౌద్ధ నాస్తికుడిని, కానీ నాకూ అంతరాత్మ ఉంది. 208 00:10:49,858 --> 00:10:52,653 అంటే, నేను చాలా భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేస్తాను, బాసూ. 209 00:10:52,736 --> 00:10:54,947 కానీ ఈ దరిద్రం నన్ను వదలడం లేదు. 210 00:10:55,030 --> 00:10:57,741 అంటే కొన్ని వారాల క్రిందట ఒక పొట్టోడు వచ్చి, 211 00:10:57,824 --> 00:10:59,868 5'8" సర్ఫ్ బోర్డును ఆర్డర్ చేశాడు. 212 00:10:59,952 --> 00:11:01,537 కొన్ని వారాల పాటు దాని మీద పని చేశాను. 213 00:11:01,620 --> 00:11:03,580 అంత అందమైన సర్ఫ్ బోర్డును ఇప్పటిదాకా నేను చేయనేలేదు. 214 00:11:03,664 --> 00:11:05,415 ఆ తర్వాత ఏమైందో తెలుసా? 215 00:11:05,499 --> 00:11:07,626 ఆ పొట్టోడు ఏమైపోయాడో తెలీదు. నన్ను నిలువునా ముంచేశాడు. 216 00:11:07,709 --> 00:11:10,337 ఆ 5'8" సర్ఫ్ బోర్డుతో నేనేం చేసుకోవాలి? 217 00:11:15,968 --> 00:11:18,095 ఆ బోర్డు నాకు సరిపోతుంది. 218 00:11:18,178 --> 00:11:19,304 సరే మరి. 219 00:11:21,390 --> 00:11:23,934 కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నా దగ్గర అన్ని పైసలు లేవు. 220 00:11:24,017 --> 00:11:25,644 నా ఉద్దేశం, నా ప్రేయసి నన్ను చంపేస్తుంది. 221 00:11:25,727 --> 00:11:27,563 మేము డబ్బులను దాచుకోవాల్సిన అవసరం ఉంది. 222 00:11:27,646 --> 00:11:28,689 పర్వాలేదులే. 223 00:11:28,772 --> 00:11:30,023 నేను అర్థం చేసుకోగలను. 224 00:11:30,107 --> 00:11:32,401 నీకు కావాలంటే మేము క్రెడిట్ కార్డులను కూడా తీసుకుంటాం. 225 00:11:32,484 --> 00:11:34,152 కానీ ఏదేమైనా. 226 00:11:34,945 --> 00:11:37,197 గంజాయి స్టిక్స్ ఏమైనా తింటావా? వీటిని నా ప్రేయసి చేస్తుంది. 227 00:11:37,281 --> 00:11:39,616 నాకు ఇవాళ పనులు ఉన్నాయి, లేకపోతే ఖచ్చితంగా తినుండేవాడిని. 228 00:11:39,700 --> 00:11:42,369 మంచి నిర్ణయం. అది మంచి నిర్ణయం. అవి మరీ ఘాటుగా ఉంటాయి. 229 00:11:42,452 --> 00:11:45,205 కానీ, సరేలే. బై, గురూ. 230 00:11:45,289 --> 00:11:46,456 ప్రభువు ఆశిస్సులు నీకు ఉంటాయి. 231 00:11:49,209 --> 00:11:50,335 ఓ విషయం చెప్పనా? నేను... 232 00:11:50,836 --> 00:11:55,132 కానీ, వాటి పరిమళం నాకు మత్తెక్కిస్తోంది. 233 00:11:55,799 --> 00:11:58,302 బాసూ, వచ్చి కావలసినంత లాగించు. 234 00:11:59,636 --> 00:12:00,888 మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 235 00:12:00,971 --> 00:12:03,307 నువ్వు ఈ విషయంలో సాయపడుతున్నారు, ప్రచారంలో ఇది మాకు 236 00:12:03,390 --> 00:12:04,808 చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 237 00:12:04,892 --> 00:12:06,351 -అది నా భాగ్యం. -ధన్యవాదాలు. 238 00:12:06,935 --> 00:12:09,188 దేవుడా. ఆపలేకపోతున్నా. 239 00:12:09,271 --> 00:12:10,772 నాకు చాలా ఆకలిగా ఉంటోంది. 240 00:12:11,732 --> 00:12:13,442 నీ కడుపులో మాయా ఉన్నప్పుడు నీకు కూడా ఇలాగే ఉండేదా? 241 00:12:14,026 --> 00:12:15,194 అవుననుకుంటా. 242 00:12:15,277 --> 00:12:16,278 గర్భధారణలోని ఈ సమయంలో, 243 00:12:16,361 --> 00:12:17,446 నేను కోరికలను ఆపుకోలేకపోతున్నాను. 244 00:12:20,032 --> 00:12:20,908 పాపం, జాక్. 245 00:12:20,991 --> 00:12:25,495 పగలనకా రాత్రనకా సెక్స్ కోసం అడుగుతూ అతనికి విసుగు తెప్పిస్తున్నాను. 246 00:12:25,579 --> 00:12:28,290 -ఒకసారి అతిథుల జాబితాని చూద్దామంటావా? -దీనికి కారణం, 247 00:12:28,373 --> 00:12:31,001 నా నరాల్లో ప్రవహిస్తున్న అధిక రక్తమా, లేక గర్భధారణ సమయంలో 248 00:12:31,084 --> 00:12:35,380 ఇది మామూలేనా అని నాకు తెలీదు, కానీ నేను కోరికలను ఆపుకోలేకపోతున్నాను. 249 00:12:37,716 --> 00:12:40,969 అయ్యబాబోయ్. ఏది పడితే అది తినేస్తుంది, మహాతల్లి. 250 00:12:41,053 --> 00:12:43,222 ...మరీ మోటు, సెక్స్ ఆలోచనలు అంతే. 251 00:12:43,305 --> 00:12:46,433 అంటే... కేవలం వెచ్చదనం మాత్రమే అన్నమాట. నేనేమంటున్నానో అర్థమవుతోందా? 252 00:12:46,517 --> 00:12:47,768 దేహం దేహం కలుసుకోవడం. 253 00:12:47,851 --> 00:12:49,311 ఫోన్ మోగుతోంది, ఎత్తుతావా? 254 00:12:51,146 --> 00:12:52,064 వినబడలేదు. 255 00:12:54,900 --> 00:12:55,901 హలో. 256 00:12:56,818 --> 00:12:58,070 మీరెవరో చెప్పగలరా? 257 00:12:58,820 --> 00:13:00,280 తప్పకుండా. ఒక్క నిమిషం. 258 00:13:00,364 --> 00:13:03,033 షీలా, నీకే. జెర్రీ అట. ఎవరో జెర్రీ. 259 00:13:04,618 --> 00:13:08,038 ఒక్క నిమిషం, జెర్రీ గోల్డ్మాన్? బర్కిలీలో చదివేటప్పుడు నగ్నంగా తిరిగేవాడా? 260 00:13:08,121 --> 00:13:11,917 -దేవుడా. తను ఇంకా బతికే ఉన్నాడా? -అదే కదా. 261 00:13:12,000 --> 00:13:13,085 వావ్. 262 00:13:13,168 --> 00:13:16,338 జెర్ బాబూ, నేను టాన్యాని. అవును. 263 00:13:16,421 --> 00:13:18,382 -ఓ విషయం తెలుసా? నేను గర్భవతిని. -నాకు ఇవ్వు. 264 00:13:19,800 --> 00:13:20,801 హేయ్, జెర్. 265 00:13:20,884 --> 00:13:24,137 హేయ్. హేయ్, షీల్. విను, మనకొక సమస్య వచ్చి పడింది, సరేనా? 266 00:13:24,221 --> 00:13:28,267 నేను రోజంతా కూర్చొని టీవీనే చూస్తూ గడిపాను, 267 00:13:28,350 --> 00:13:30,310 కానీ మనోడు మాత్రం కనబడలేదు. 268 00:13:30,394 --> 00:13:32,312 అయితే, నువ్వు మిస్ అయ్యుంటావేమో. 269 00:13:32,396 --> 00:13:34,398 నేను ఆ ష్మిత్ దరిద్రుడిని మూడు సార్లు చూశాను. 270 00:13:34,481 --> 00:13:37,150 మన ప్రకటనని వాళ్లు ఒక్కసారి కూడా వేయలేదు. కనీసం ఒక్కసారి కూడా వేయలేదు. 271 00:13:37,234 --> 00:13:39,069 ఇక్కడ ఏం జరుగుతోందో నీకు తెలుసా? 272 00:13:39,152 --> 00:13:41,029 బాగా ఎంజాయ్ చేస్తుంటావు అనుకుంటా. 273 00:13:41,113 --> 00:13:43,991 ఆ దరిద్రుడు వాళ్లకి బాగా ముట్టజెప్పుతున్నాడు, అర్థమైందా? 274 00:13:44,074 --> 00:13:46,952 మన ప్రకటనను వేయకుండా ఉండటానికి వాళ్లకి రెట్టింపు ముట్టజెప్పాడు. 275 00:13:47,035 --> 00:13:50,372 కాబట్టి నేను టీవీ స్టేషన్ వద్దకు వెళ్లి, 276 00:13:50,455 --> 00:13:51,999 వాళ్ళకి కాస్త హితబోధ చేసి వస్తాను. 277 00:13:52,082 --> 00:13:54,376 వద్దు, జెర్రీ. వద్దు, వద్దు. విను. చెప్పేది విను. 278 00:13:54,459 --> 00:13:57,337 నువ్వన్నది నిజమే కావచ్చు, కానీ నువ్విలా అత్యుత్సాహపడినప్పుడల్లా, 279 00:13:57,421 --> 00:14:01,091 నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటుంటావు. చట్టపరమైన సమస్యల్లో. 280 00:14:01,175 --> 00:14:02,176 నాకు తెలుసు. 281 00:14:02,259 --> 00:14:05,137 ప్రచారం ఈ దశలో ఉండగా, నిన్ను మేము మిస్ చేసుకోలేము. 282 00:14:05,637 --> 00:14:07,222 నువ్వు మాకు చాలా అవసరం. 283 00:14:07,306 --> 00:14:09,850 వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏం జరుగుతోందో నేను కనుక్కుంటా. 284 00:14:09,933 --> 00:14:11,268 సరే. 285 00:14:15,063 --> 00:14:17,691 హేయ్, ఇంట్లో ఏమైనా హ్యాండ్ లోషన్ ఉందా? 286 00:14:17,774 --> 00:14:19,109 నా చేతులు బాగా పొడిగా ఉన్నాయి. 287 00:14:19,193 --> 00:14:21,236 ఉంది. గెస్ట్ బాత్రూమ్ లో ఉంది. 288 00:14:21,320 --> 00:14:22,529 ధన్యవాదాలు, బంగారం. 289 00:14:22,613 --> 00:14:23,614 సరే. 290 00:14:25,407 --> 00:14:26,867 నువ్వు ఊహించినట్టే జరిగింది. 291 00:14:28,076 --> 00:14:31,413 -నేను థ్యాంక్యూ నోట్స్ ని చేసేశాను. -మంచి పని చేశావు. 292 00:14:31,914 --> 00:14:33,415 వాటి మీద నువ్వు సంతకం పెడితే చాలు. 293 00:14:35,417 --> 00:14:37,002 ఈ పని ఇప్పుడే చేసేస్తే మంచిది. 294 00:14:37,085 --> 00:14:40,547 లేకపోతే, అలాగే పెండింగ్ లో ఉండిపోతుంది. రోజుల తరబడి వాయిదా అవుతూనే ఉంటుంది. 295 00:14:42,841 --> 00:14:43,717 నీకు సంతోషంగానే అనిపించిందా? 296 00:14:45,219 --> 00:14:47,763 -దేని గురించి? -పార్టీ గురించి. 297 00:14:47,846 --> 00:14:50,474 నేను చక్కగా ఉండేలా ప్లాన్ చేశాను. అది సింపుల్ గానే ఉందని తెలుసు. 298 00:14:51,016 --> 00:14:53,101 నువ్వు ఎప్పటిలాగానే చాలా చక్కగా చేశావు. 299 00:14:53,685 --> 00:14:56,271 మంచిది. పక్కాగా తెలుసుకుందామని అడిగానంతే. 300 00:14:57,648 --> 00:15:01,527 ఎందుకంటే, నువ్వు భావావేశపరంగా నలిగిపోయినట్టు అనిపించింది. 301 00:15:02,361 --> 00:15:06,490 అంటే, శారీరకంగా, మానసికంగా నువ్వు బాగా ఒతిడిలో ఉన్నట్టుగా అనిపించింది 302 00:15:07,074 --> 00:15:11,245 బహుశా మీ నాన్నగారి వలన, ఇంకా కొన్ని జ్ఞాపకాల వలన కావచ్చు. 303 00:15:11,328 --> 00:15:15,082 ధన్యవాదాలు, కానీ... ఆ విషయంలో నాకేమీ ఒత్తిడి లేదు. 304 00:15:15,582 --> 00:15:17,209 ఎన్నికల గురించే నా ఆలోచన అంతా. 305 00:15:17,292 --> 00:15:19,294 మరీనా ప్రాజెక్ట్ లో నేను చాలా పెట్టుబడి పెట్టాను, 306 00:15:19,378 --> 00:15:22,381 మనం కనుక గెలవకపోతే, అది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 307 00:15:22,881 --> 00:15:29,137 కాబట్టి నాకు నిజంగానే ఒత్తిడి ఉంది, కానీ అది బయటి కారణాల వలన కలిగిన ఒత్తిడి. 308 00:15:29,972 --> 00:15:32,182 నేను కూడా అదే అనుకున్నాను. నిర్ధారించుకుంటున్నానంతే. 309 00:15:45,070 --> 00:15:48,198 అదేదో జంతువు అయ్యుంటుంది. తను అయ్యుండదు. 310 00:15:49,533 --> 00:15:51,577 కానీ అలా ఏ జంతువు అరుస్తుంది? 311 00:15:53,078 --> 00:15:55,247 మనకి సన్సెట్ పెద్ద దూరంలో ఏం లేదు. 312 00:15:55,330 --> 00:15:58,959 నువ్వు జాక్ చేసే శబ్దాలు వింటే, ఏదో జూలో ఉన్నట్టు అనిపిస్తుంది. 313 00:16:01,461 --> 00:16:03,046 అయ్యో. అది... అది... 314 00:16:04,548 --> 00:16:05,549 ఆ అరుపులన్నీ ఆమెవే. 315 00:16:07,885 --> 00:16:09,428 అతను తనని ఏం చేస్తున్నాడు? 316 00:16:11,388 --> 00:16:12,806 నాకెలా తెలుస్తుంది? 317 00:16:14,641 --> 00:16:18,103 చాలులే. అది చాలా కాలం క్రిందటి సంగతి. అప్పుడు మనం ఇంకా పిల్లలమే. 318 00:16:18,187 --> 00:16:19,938 చాలా కాలం ఏం కాదులే. 319 00:16:22,149 --> 00:16:23,275 తను ఎలా చేశాడు? 320 00:16:26,195 --> 00:16:27,321 గుర్తులేదు. 321 00:16:30,824 --> 00:16:33,410 -సరే. సరే, సరే. -ఇప్పుడు తను... 322 00:16:33,952 --> 00:16:36,121 తను చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది. 323 00:16:42,252 --> 00:16:43,337 మనం... 324 00:16:43,420 --> 00:16:44,755 మనం ఇంకా బాగా చేయగలం అనుకుంటా. 325 00:16:45,255 --> 00:16:48,050 ఏమో మరి. నువ్వు నిరూపించుకోవలసి ఉంటుంది. 326 00:17:29,007 --> 00:17:30,926 ఇప్పుడు చాలా బాగుంది. 327 00:17:48,151 --> 00:17:49,611 నేను చూడలేదనుకుంటున్నాడా? 328 00:17:50,237 --> 00:17:51,321 హేయ్. 329 00:17:52,865 --> 00:17:56,201 డానీ, షీలా, నాకు బాగా కావలసినవారిని మీకు పరిచయం చేస్తాను. 330 00:17:57,494 --> 00:17:58,912 వీళ్లు సెక్స్ ఎలా చేస్తారో ఏమో. 331 00:17:58,996 --> 00:18:01,039 ఆ బండోడు ఆమె మీద పడతాడేమో. 332 00:18:01,123 --> 00:18:03,250 లేకపోతే, వాడు వెల్లకిల్లా ఓ శవంలా పడుకుంటాడేమో, 333 00:18:03,333 --> 00:18:05,252 అప్పుడు ఆమె అతని పైకెక్కి పని కానిస్తుంది... 334 00:18:05,335 --> 00:18:06,712 -బంగారం. సరే. -చెప్పు? 335 00:18:06,795 --> 00:18:09,381 నాకు జాక్ ఎంత కాలం నుండి తెలుసు? నీకు గుర్తుందా? 336 00:18:09,464 --> 00:18:11,633 పది, లేదా... కళాశాల రోజుల నుండి. 337 00:18:11,717 --> 00:18:13,635 అయితే... మేము కళాశాలలో కలిశాం అనుకోండి. 338 00:18:13,719 --> 00:18:15,888 నేనెప్పుడూ నా హాస్టల్ గదిలోనే గడిపేవాడిని. 339 00:18:17,514 --> 00:18:19,057 నాకు కూడా లెక్కలు అంత బాగా రావు. 340 00:18:19,141 --> 00:18:21,602 కానీ నేను పజిల్స్ బాగా చేయగలను. ఏదైనా చూస్తేనే నేర్చుకోగలను. 341 00:18:21,685 --> 00:18:23,937 -అది అసలైనది అయ్యుండదు. -అది పింక్ డైమండ్. 342 00:18:25,480 --> 00:18:26,940 అసలైనదేనని నిర్ధారించుకోవడానికి తనిఖీ చేయించాను కూడా. 343 00:18:27,024 --> 00:18:29,818 ...స్థానిక ప్రాతినిధ్యమే ప్రజాస్వామ్యానికి పునాది. 344 00:18:30,569 --> 00:18:33,447 జాక్, నీ స్థానిక ఎం.ఎల్.ఏ ఎవరు? 345 00:18:33,530 --> 00:18:37,159 నువ్వు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు, మేము ఈ మధ్యే ఇక్కడికి వచ్చాం కదా. 346 00:18:37,242 --> 00:18:38,619 -కానీ... -సరే. 347 00:18:38,702 --> 00:18:40,704 నాకు... నాకు అస్సలు తెలీదు. 348 00:18:40,787 --> 00:18:42,247 ఏమోనా? నీకు తెలీదా? 349 00:18:42,331 --> 00:18:44,666 -తెలీదు. -పర్వాలేదులే. నీలా చాలా మంది ఉన్నారు. 350 00:18:44,750 --> 00:18:47,878 సోమరిపోతుల్లా, ఏమీ పట్టనట్టు ఉండే ఆధునిక భావాలు ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు, 351 00:18:47,961 --> 00:18:50,881 ప్రత్యేకించి కాలిఫోర్నియాలో అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. 352 00:18:50,964 --> 00:18:52,758 అందువల్లనే పాత పద్ధతులు గల వాళ్ళు ఇంకా వర్ధిల్లుతున్నారు. 353 00:18:52,841 --> 00:18:57,262 నేను నియోజకవర్గాల విభజన గురించి, సామాజిక సేవల విధ్వంసం గురించి మాట్లాడుతున్నా. 354 00:18:57,346 --> 00:18:59,556 -అది నమ్మశక్యంగా లేదు కదా? -మరీ రాజకీయాల్లోకి వెళ్లిపోయే ముందు, 355 00:18:59,640 --> 00:19:01,350 -వాళ్ళని ఏదైనా డ్రింక్ తీసుకోనివ్వరాదూ. -అవును. 356 00:19:01,433 --> 00:19:02,726 -డ్రింక్స్ దగ్గరికి వెళ్దామా? -సరే. 357 00:19:02,809 --> 00:19:04,937 -వీళ్ళకి డ్రింక్స్ ఇవ్వు. -నాతో రండి. 358 00:19:05,812 --> 00:19:07,731 సరే, మళ్లీ మాట్లాడుకుందాం, బ్రయాన్. 359 00:19:08,357 --> 00:19:10,108 నేను ఇంకో మార్గరీటా పుచ్చుకుంటాను. 360 00:19:10,984 --> 00:19:11,860 దేవుడా. 361 00:19:11,944 --> 00:19:13,237 -ఇది మంచిదే. మనకి మంచిదే. -అవును. 362 00:19:13,320 --> 00:19:15,364 -ఇక్కడ చాలా మంది ఉన్నారు. -అవును. కాదు, ఇది నిజంగా... 363 00:19:15,447 --> 00:19:17,991 -బాగా సాగుతోంది. -ఇది అద్భుతంగా సాగుతోంది. 364 00:19:30,879 --> 00:19:33,507 -గురూ. -హేయ్. 365 00:19:33,590 --> 00:19:34,800 నువ్వు ఇప్పుడల్లా లేయలేవనుకున్నా. 366 00:19:36,593 --> 00:19:38,428 నేను నిద్రలోకి జారుకొని ఎంత సేపయింది? 367 00:19:39,096 --> 00:19:40,556 ఏమో. 368 00:19:40,639 --> 00:19:43,809 నువ్వు ఒక స్టిక్ మొత్తాన్ని తినేశావు, అలా ఎవ్వరూ తినడం ఇప్పటిదాకా నేను చూడలేదు. 369 00:19:43,892 --> 00:19:46,436 నీ పర్సనాలిటీ ఉన్న వాడు అలా చేయడమంటే చిన్న విషయం కాదు. 370 00:19:46,520 --> 00:19:48,480 అవును. అప్పుడు నాకు బాగా ఆకలి వేసుండుంటుంది. 371 00:19:48,564 --> 00:19:51,567 బాసూ, తినగలిగే గంజాయితో పెట్టుకోకపోతేనే మంచిది. 372 00:19:51,650 --> 00:19:54,736 కానీ అదేం పర్వాలేదులే. మనం బోర్డ్ సంగతి చూద్దాంలే. 373 00:19:56,321 --> 00:19:57,322 బోర్డ్? 374 00:19:57,823 --> 00:20:00,492 బాసూ, చూడు, నీకు గుర్తులేదని మాత్రం చెప్పకు. 375 00:20:00,576 --> 00:20:03,370 నేను రాత్రంతా కూర్చొని నీ ట్యాగ్ ని బోర్డు మీద చెక్కాను. 376 00:20:03,453 --> 00:20:08,625 దీనికి అదనంగా మూడు వందలు అవుతుంది, కానీ అది చాలా బాగుంది. 377 00:20:11,211 --> 00:20:13,797 టైటై 378 00:20:17,384 --> 00:20:19,219 -హేయ్. -ఒకటి తిను. చాలా బాగున్నాయి. 379 00:20:19,303 --> 00:20:21,889 వద్దులే. నేను శాకాహారిని, అవి తినలేను. అడగడానికి సరైన సమయం వచ్చిందనుకుంటా. 380 00:20:21,972 --> 00:20:23,765 అందులో ఆలుగడ్డలు, చీజ్ ఉంది, మాంసమే లేదు. 381 00:20:23,849 --> 00:20:25,767 -నువ్వు ఒకటి తిను. -పర్వాలేదులే. నాకు తినాలని లేదు. 382 00:20:25,851 --> 00:20:29,354 సరిపడినంత మంది అతిథులు వచ్చేశారనుకుంటా, ఇప్పుడు అడిగితే బాగుంటుంది. 383 00:20:29,438 --> 00:20:31,106 డానీని పరిచయం చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంటే, 384 00:20:31,190 --> 00:20:33,650 -ఆ పని నేను చేయగలను. -చూడు, షీలా. 385 00:20:33,734 --> 00:20:35,402 -ఆ పని ఇక్కడే చేస్తాను. -షీలా. 386 00:20:36,403 --> 00:20:39,531 చూడు, నా మాటలు నీకు వేరే విధంగా అనిపించి ఉంటే నన్ను మన్నించు. 387 00:20:39,615 --> 00:20:44,203 కానీ అందరినీ డబ్బులు అడగడం, అది అందరికీ చిరాకు తెప్పించే పనిలా ఉంటుంది. 388 00:20:44,286 --> 00:20:45,287 అంటే... 389 00:20:46,580 --> 00:20:51,210 కానీ ఫోన్లో నేను స్పష్టంగా చెప్పాను కదా, మేము నిధులను సేకరించాలి అని. 390 00:20:51,293 --> 00:20:54,463 అవును, నేను జనాలను ఆనందంగా పరిచయం చేస్తాను అని కూడా చెప్పాను. 391 00:20:54,546 --> 00:20:58,383 కానీ జనాలని ఇరుకున పెట్టడం, అలాంటిది ఇక్కడ జరగడానికి వీల్లేదు. 392 00:20:58,467 --> 00:21:01,053 నువ్వు దద్దమ్మవి. నీకు సాయపడాలన్న ఆలోచనే తనకి లేదు. 393 00:21:01,136 --> 00:21:02,846 తను కేవలం నిన్ను అవమానపరచాలనుకుంటుంది, అంతే. 394 00:21:02,930 --> 00:21:05,140 వ్యక్తిగత కథనం యొక్క గొప్పదనం, 395 00:21:05,224 --> 00:21:10,687 మనం చెప్పబోయే అతిముఖ్యమైన కథను, ఎంత బాగా చెప్పగలం అనేదాని మీద ఆధారపడుంటుంది. 396 00:21:11,188 --> 00:21:13,982 అదే మన జీవిత గాథ. 397 00:21:14,066 --> 00:21:18,320 రాజకీయాలు, పరిశ్రమలు, రాజనీతి, అంతే కదా? 398 00:21:18,403 --> 00:21:22,366 మనం ఏం చేశామన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎలా వర్ణించామన్నదే ముఖ్యం. 399 00:21:22,449 --> 00:21:24,993 దాన్నే మరోలా చెప్పాలంటే, అది... 400 00:21:25,077 --> 00:21:26,578 అబద్ధాలాడటం. అది అబద్ధాలాడటం. 401 00:21:27,162 --> 00:21:30,499 నువ్వు వాస్తవాలు ముఖ్యం కాదు అని వీళ్లకి చెప్తున్నావు. 402 00:21:30,582 --> 00:21:31,583 కాదు, నన్ను క్షమించు. 403 00:21:31,667 --> 00:21:36,004 నిజానికి, నీ లాభం కోసం, నువ్వు వాస్తవాలు ముఖ్యం కాదని వీళ్లని ప్రలోభ పెడుతున్నావు. 404 00:21:36,088 --> 00:21:39,091 మీరు నా మిత్రుడు డానీని మన్నించాలి, ఎవ్వరూ అతడిని పట్టించుకోకపోతే, 405 00:21:39,174 --> 00:21:41,093 అతనికి మండుతుంది. 406 00:21:41,176 --> 00:21:42,761 బెలిండా. బెలిండా. 407 00:21:42,845 --> 00:21:45,806 -నీ కోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. -నీకు బెలిండా వెస్ట్ బ్రుక్ ఎలా తెలుసు? 408 00:21:45,889 --> 00:21:48,016 మేము ఒకే నీటి ఫిట్నెస్ క్లాసుకు వెళ్తున్నాం. తను ఏది పడితే అది అనేస్తుంది. 409 00:21:48,100 --> 00:21:52,354 -హాయ్! అవును. -షీలా డేల్ నార్టన్! 410 00:21:52,437 --> 00:21:53,981 -ఇప్పుడు రూబిన్ ని. -అవును. రూబిన్. 411 00:21:54,064 --> 00:21:56,275 -అవును. -క్షమించు. మర్చిపోయాను. 412 00:21:56,358 --> 00:21:59,945 మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించాలని ఆ యూద దేశదిమ్మరిని పెళ్ళాడావు కదా. 413 00:22:00,779 --> 00:22:02,447 -తను ఏది పడితే అది అనేస్తుంది. -ఓరి దేవుడా. 414 00:22:02,531 --> 00:22:07,077 అదేమీ... నేను అలా ఏమీ... నేను అందుకోసమని ఏమీ పెళ్లి చేసుకోలేదు. 415 00:22:07,160 --> 00:22:10,205 ఎప్పటిలాగానే, ఇప్పడు కూడా అందరిలోకల్లా నువ్వు సన్నగా ఉన్నావు. 416 00:22:10,289 --> 00:22:11,415 నీకు తెలుసా, టాన్యా, 417 00:22:11,498 --> 00:22:16,003 బ్యాలే క్లాస్ ముందు ఎలా వాంతి చేసుకోవాలో తనకి నేనే నేర్పాను. 418 00:22:16,086 --> 00:22:17,546 అప్పట్లో మేమందరమూ అలా చేసేవాళ్లం. 419 00:22:17,629 --> 00:22:20,007 -అది చాలా దారుణమైన విషయం. -అవును. 420 00:22:20,090 --> 00:22:21,091 -వావ్. -ఓరి దేవుడా. 421 00:22:21,175 --> 00:22:23,552 ఆ దరిద్రపు అలవాటు నుండి బయటపడటానికి నాకు చాలా ఏళ్లు పట్టింది. 422 00:22:24,928 --> 00:22:30,017 అదృష్టంకొద్దీ, నేను ఒక గొప్ప సైకాలజిస్ట్ ని కలిశాను... 423 00:22:30,100 --> 00:22:31,894 డాక్టర్ శాల్వటోర్ అమానీ, 424 00:22:32,519 --> 00:22:35,981 అతను నాకు కనువిప్పు కలిగించాడు. 425 00:22:39,526 --> 00:22:43,197 నువ్వు రీగన్ కన్నా దారుణమైన మనిషివి. నిజంగానే చెప్తున్నాను. 426 00:22:43,280 --> 00:22:45,866 నా ఉద్దేశం, అతను యుద్ధాల్లో పాల్గొని, ఒంటిచేత్తో గెలిపించాడని 427 00:22:45,949 --> 00:22:48,327 కట్టుకథలు చెప్పి మనల్ని నమ్మించే సత్తా అతనికి ఉంది. 428 00:22:48,410 --> 00:22:51,330 నా పుస్తకం రాజకీయానికి సంబంధించినది కాదు. 429 00:22:51,413 --> 00:22:54,541 అన్నీ రాజకీయాలే. ఎక్కడ చూసినా రాజకీయాలే. 430 00:22:54,625 --> 00:22:59,338 అమెరికన్ విద్యార్థుల మీద రీగన్ నేషనల్ గార్డ్ వాళ్ళ చేత తుపాకులను 431 00:22:59,421 --> 00:23:01,089 ఎక్కుపెట్టేలా చేసినప్పుడు అది రాజకీయం కాదా. 432 00:23:01,757 --> 00:23:06,220 వియత్నాం మీద ఆక్రమణకి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న పౌరులు వాళ్ళు. 433 00:23:06,303 --> 00:23:08,972 బాబోయ్. మళ్లీ వియత్నాం గురించి మొదలుపెట్టాడ్రా బాబు. 434 00:23:09,056 --> 00:23:12,643 నువ్వు ఇప్పటికీ ఆ పని చేయడం లేదు కదా? అదే, దొంగతనంగా తిని వాంతి చేసుకోవడం? 435 00:23:13,143 --> 00:23:15,562 ఏంటి? ఓరి దేవుడా. లేదులే. 436 00:23:15,646 --> 00:23:17,898 అవన్నీ కుర్ర చేష్టలు. 437 00:23:18,524 --> 00:23:20,943 ఇప్పుడు నేనేమీ టీనేజ్ పిల్లని కాదు కదా. పెద్దదాని అయిపోయా కదా. 438 00:23:21,026 --> 00:23:22,945 నువ్వు ముసలిదానివి, పనికిమాలినదానివి కూడా. 439 00:23:23,028 --> 00:23:24,154 అంతకన్నా నీచమైనదానివి. 440 00:23:24,238 --> 00:23:28,534 ఆ విషయంలో ముఖ్యమైనది ఆహారం కాదని డాక్టర్ అమానీ నేను గ్రహించేలా చేశాడు. 441 00:23:29,493 --> 00:23:30,494 నియంత్రణ ముఖ్యమని తెలిపాడు. 442 00:23:30,577 --> 00:23:31,578 నియంత్రణ. 443 00:23:31,662 --> 00:23:34,414 అది పచ్చి నిజం. అక్కడ నేను ఉన్నాను, నువ్వు కూడా ఉన్నావు. 444 00:23:34,498 --> 00:23:37,125 చివరకు నువ్వు గుట్టల వైపు పారిపోయావు, 445 00:23:37,751 --> 00:23:40,671 కానీ అక్కడున్న మమ్మల్ని చితకబాదారు, జైల్లో వేశారు. 446 00:23:41,338 --> 00:23:44,842 అయినప్పటికీ, మా ఇంటికి ఆహ్వానించమని నువ్వు మమ్మల్ని బతిమాలావు. 447 00:23:45,342 --> 00:23:46,802 మా ఆవిడ నిన్ను బతిమాలింది. 448 00:23:47,886 --> 00:23:50,681 అది నీ కథ, నాది కాదు. 449 00:23:52,516 --> 00:23:54,768 ఒకసారి మీరు ఇప్పుడు జరిగిన చర్చ గురించి అలోచిస్తే, 450 00:23:54,852 --> 00:23:57,729 ఇప్పటిదాకా మీకు నేనేం చెప్పానో అర్థమవుతుంది, ఎందుకంటే, ఇది డానీ కథ. 451 00:23:57,813 --> 00:24:01,692 నేను ఫిట్నెస్ మీద బాగా దృష్టి సారించాను. ఏయిరోబిక్స్. దాన్ని నేను బోధిస్తున్నాను. 452 00:24:01,775 --> 00:24:06,321 ఇంకా, అది వ్యసనంలా అయిపోయింది నాకు. అంటే మంచిగానే అనుకోండి. 453 00:24:06,405 --> 00:24:08,991 కానీ, నువ్వు... నువ్వు బోధిస్తున్నావా? 454 00:24:09,074 --> 00:24:12,077 అంటే, కేవలం... ఆటవిడుపుగానా? 455 00:24:12,160 --> 00:24:14,830 లేదా, కేవలం ఏదోక వ్యాపకం కల్పించుకోవాలనా? 456 00:24:15,664 --> 00:24:19,001 లేదు, ఉద్యోగంగా. అదే, వ్యాపారంగా. నేను ఒక ప్రతిభావంతురాలైన... 457 00:24:19,084 --> 00:24:20,544 ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? 458 00:24:20,627 --> 00:24:23,547 ఏమో, నువ్వు ఎప్పుడూ లొడాలొడా వాగుతూనే ఉంటావు కదా, అందుకేనేమో. 459 00:24:23,630 --> 00:24:26,008 మొదట్నుంచీ నువ్వు బ్యాలేలో టాప్ లోనే ఉండేదానివి. 460 00:24:26,091 --> 00:24:30,429 కానీ హఠాత్తుగా వదిలేశావు, ఎందుకో మాకెవ్వరికీ తెలీలేదు. 461 00:24:31,471 --> 00:24:32,973 కానీ మేము కొన్ని కథలను అనుకున్నామనుకో. 462 00:24:33,056 --> 00:24:35,684 అవును, నాకు సరిగ్గా గుర్తురావడం లేదు. 463 00:24:35,767 --> 00:24:37,769 అయినా కారణం ఏదైతే నీకెందుకే, పిచ్చిదానా? 464 00:24:37,853 --> 00:24:40,063 అయ్యో. నేను... ఓ విషయం చెప్పనా? 465 00:24:40,147 --> 00:24:43,108 -వెళ్లి మాయా ఏం చేస్తుందో చూసి వస్తాను. -అక్కర్లేదులే. తను బాగానే ఉంది. 466 00:24:43,192 --> 00:24:44,860 మా పాప తనతో ఉంది, వాళ్లిద్దరూ... 467 00:24:44,943 --> 00:24:47,571 -...పెద్ద తెరపై డిస్నీవీడియో చూస్తున్నారు. -మంచిది. సరే. 468 00:24:51,700 --> 00:24:53,744 అయ్యయ్యో. నన్ను మన్నించండి. 469 00:25:30,822 --> 00:25:34,409 ఒసేయ్ పిచ్చిదానా. ఆపేయ్! వెంటనే ఆపేయ్! 470 00:25:35,911 --> 00:25:36,912 ఆపేయ్! 471 00:25:37,663 --> 00:25:40,415 ఆపు! ఆపు! ఆపు! 472 00:25:43,210 --> 00:25:46,672 నీకు ఇది అక్కర్లేదు. నీకు ఈ సోదంతా అక్కర్లేదు. 473 00:26:06,817 --> 00:26:08,485 నువ్వు ఈ పని చేయగలవు. 474 00:26:09,069 --> 00:26:10,362 నువ్వు చేయగలవని నీకు తెలుసు. 475 00:26:12,781 --> 00:26:13,991 నువ్వు చేయగలవు. 476 00:26:43,770 --> 00:26:46,523 నువ్వు తప్పకుండా చేయగలవు. ఆ విషయం నీకు తెలుసు. 477 00:26:47,566 --> 00:26:48,775 నువ్వు చేయగలవు. 478 00:27:16,053 --> 00:27:17,054 హాయ్, అమ్మా. 479 00:28:49,813 --> 00:28:51,815 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య