1 00:00:14,473 --> 00:00:16,808 నన్ను తాగు 2 00:00:16,892 --> 00:00:18,060 అంతే. 3 00:00:22,606 --> 00:00:23,607 లేచేశారు అన్నమాట. 4 00:00:24,525 --> 00:00:25,526 నేను ఎక్కడ ఉన్నాను? 5 00:00:25,609 --> 00:00:26,985 ముందు ఆ డ్రింక్ తాగండి. 6 00:00:31,490 --> 00:00:33,200 అక్కడ టైలర్ ఉన్నాడు. అతని పని దాదాపు అయిపోవచ్చిందిలే. 7 00:00:33,283 --> 00:00:37,079 ఇంటర్నెట్ కి సంబంధించిన సినిమాలు ఏవో చేస్తుంటాడు. 8 00:00:37,162 --> 00:00:38,830 తాగండి, ఇంకేమీ ఆలోచించవద్దు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? 9 00:00:44,169 --> 00:00:46,004 మీరు నన్ను ఇక్కడికెలా తీసుకొచ్చారు? ఇప్పుడు... 10 00:00:46,088 --> 00:00:47,840 -ఇప్పుడు సమయం ఎంత? -ప్రశ్నలు నేను అడుగుతున్నా. ఎవరు? 11 00:00:48,882 --> 00:00:50,259 స్టూడియో సిండీ? బాడీ-బై-ద-బే? 12 00:00:50,342 --> 00:00:52,928 నా క్లాస్ ని దొంగతనంగా చూసి నా స్టెప్స్ ని దొంగలించమని మిమ్మల్ని ఎవరు పంపారు? 13 00:00:53,929 --> 00:00:54,930 ఎవ్వరూ పంపలేదు. 14 00:00:55,764 --> 00:00:57,683 మీరు నన్ను కారులో అనుసరించడం నేను చూశాను. 15 00:00:59,434 --> 00:01:00,978 అది బ్రీమ్ పనా? 16 00:01:02,855 --> 00:01:04,857 మీరు కూడా అతని నైతిక విలువల పరిరక్షక దళ సభ్యులా? 17 00:01:08,110 --> 00:01:10,320 ముందు ఆ డ్రింక్ తాగండి. మొత్తం తాగేయండి. 18 00:01:13,407 --> 00:01:14,533 ఇందులో ఏం కలిపారు? 19 00:01:14,616 --> 00:01:16,368 షుగర్ ఫ్రీ లెమన్ సోడా... 20 00:01:16,869 --> 00:01:17,828 ఇంకా గంజాయి కూడా. 21 00:01:18,954 --> 00:01:21,081 నా గంజా సిగరెట్ ఎక్కడ? 22 00:01:21,164 --> 00:01:23,792 నువ్వు ప్రతీసారి దాన్ని ఒకేచోట పెట్టాలి. 23 00:01:24,459 --> 00:01:26,587 నాతో గొడవపడటం ఆపు. నేను రాత్రంతా పడుకోలేదు. 24 00:01:28,088 --> 00:01:30,007 మీరు ఇక్కడ మాల్ లోనే ఉంటారా? 25 00:01:31,133 --> 00:01:34,094 -తన మాటలు గుఢాచారి మాటల్లా ఉన్నాయి. -తను గుఢాచారి అయ్యుండవచ్చని చెప్పా కదా. 26 00:01:37,431 --> 00:01:38,765 ఇది నా స్టూడియో. 27 00:01:39,474 --> 00:01:42,144 అప్పుడప్పుడూ, నేను ఇంటర్నెట్ కు సంబంధించి వీడియోలు చేస్తుంటాను. 28 00:01:42,227 --> 00:01:45,689 అప్పుడప్పుడూ మేము పొద్దుపోయేదాకా పని చేసి, ఇక ఇక్కడే నిద్రపోతాం. 29 00:01:46,315 --> 00:01:48,817 కానీ మేం ఇక్కడే శాశ్వతంగా ఉండిపోం, ఎందుకంటే అది నియమాలకు వ్యతిరేకం. 30 00:01:51,612 --> 00:01:53,030 మీ గంజా సిగరెట్ మీ తల పైనే ఉంది. 31 00:01:59,077 --> 00:02:00,787 కనీసం మీరైనా చెప్పగలిగారు. 32 00:02:01,538 --> 00:02:03,040 ఇక, మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతే, 33 00:02:03,123 --> 00:02:04,875 తిరిగి నా పని నేను చేసుకోవడం కొనసాగిస్తాను. 34 00:02:05,501 --> 00:02:07,252 నీ పనా? 35 00:02:08,836 --> 00:02:10,255 నీ ఉద్దేశం ఏంటి? 36 00:02:10,339 --> 00:02:13,467 నా క్రెడిట్ కార్డ్ తో నువ్వు ఓ చెత్త వీడియో కెమెరా కొన్నంత మాత్రాన, 37 00:02:13,550 --> 00:02:15,844 నువ్వేమీ ఓ పెద్ద సినిమా దర్శకుడివి అయిపోవు. 38 00:02:15,928 --> 00:02:19,348 ఓ విషయం చెప్పనా? ఈ మాటలన్నీ పడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నన్ను నమ్మాలి. 39 00:02:22,392 --> 00:02:23,352 మనకి డబ్బు అవసరం అవుతుంది. 40 00:02:25,646 --> 00:02:27,523 నా క్రెడిట్ కార్డుతో వీడియో కెమెరా కొన్నావు... 41 00:02:27,606 --> 00:02:29,316 వీడియో వరల్డ్! 42 00:02:32,319 --> 00:02:33,320 డబ్బు. 43 00:02:42,162 --> 00:02:44,873 నాకు వెయ్యి డాలర్లు ఇవ్వండి, లేదంటే మీరు దొంగచాటుగా, తన మాల్ లో 44 00:02:44,957 --> 00:02:47,459 బూతు సినిమాలు చేస్తున్నారని నా మిత్రుడు జాన్ బ్రీమ్ తో చెప్పేస్తా, 45 00:02:47,543 --> 00:02:49,253 ఇక మీ ఇద్దరినీ ఇక్కడి నుండి తరిమేస్తారు. 46 00:02:56,969 --> 00:02:58,220 కాఫీ డబ్బా తీసుకురా. 47 00:02:58,804 --> 00:03:00,013 నిజంగానా? 48 00:03:00,889 --> 00:03:02,057 కాఫీ డబ్బా తీసుకురా. 49 00:03:13,443 --> 00:03:15,571 కల భలే విచిత్రంగా ఉందే. 50 00:03:16,488 --> 00:03:19,950 అయినా, ఒక్క నిమిషం. ఎందుకు నాకు అదోలా... 51 00:03:29,877 --> 00:03:33,213 ఓరి దేవుడా. నువ్వు నిజంగానే ఆ పని చేశావు. నీ... 52 00:03:34,006 --> 00:03:37,176 "మనం గాలిలో పక్షుల్లా విహరించాం 53 00:03:37,259 --> 00:03:40,304 సముద్రంలో చేపల్లా ఈదాం, 54 00:03:40,387 --> 00:03:43,182 కానీ భూమ్మీద సహోదరుల్లా మెలిగేంత 55 00:03:43,265 --> 00:03:46,351 తేలికైన పనిని మనం ఇంకా నేర్చుకోలేదు." 56 00:03:47,352 --> 00:03:49,479 అలా ఎవరు అన్నారు? నీకేం అనిపిస్తుంది? 57 00:03:51,064 --> 00:03:52,065 నాకు తెలీదు. 58 00:03:52,149 --> 00:03:56,361 మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. 59 00:03:57,029 --> 00:03:58,030 అవును. 60 00:03:58,113 --> 00:04:00,991 అతను పౌర హక్కులకి, పర్యావరణ హక్కులకు ముడి పెట్టాడు. 61 00:04:01,074 --> 00:04:05,204 అలా చేసి, శాస్త్రీయ పురోగతి మరియు ఆర్థిక అభివృద్ధి వైపు పరుగులు తీసేవారికి, 62 00:04:05,287 --> 00:04:09,374 మనముంటున్న గ్రహాన్ని గాలికి వదిలేయవద్దని గట్టిగా చెప్పాడు. 63 00:04:09,458 --> 00:04:11,168 అదీ లెక్క! నాకు దొరికేసింది. 64 00:04:11,251 --> 00:04:15,047 నా ఎజెండాలో ఒక కీలకమైన భాగం. ఇది చాలా బాగుంది కదా? 65 00:04:15,714 --> 00:04:16,714 అవును. 66 00:04:18,800 --> 00:04:20,260 నీ ముఖం చూస్తే అదంత బాగున్నట్టు అనిపించడంలేదు. 67 00:04:21,803 --> 00:04:23,222 ఏంటి? నా ముఖం ఎలా ఉంది? 68 00:04:23,305 --> 00:04:26,099 నేను ఓ మాయగాడిని అన్నట్టు, ఇంకా నా ఫీలింగ్స్ ని బాధపెట్టాలని నీకు లేదన్నట్టు. 69 00:04:26,183 --> 00:04:30,812 బంగారం, అలా ఏమీ కాదు. నేను ఇప్పుడే కదా లేచాను. మన్నించు. 70 00:04:30,896 --> 00:04:32,481 నాకు సపోర్ట్ ని సంపాదించి 71 00:04:32,564 --> 00:04:34,608 పెట్టే అవకాశమున్న పనులను నేను ప్రయత్నిస్తున్నాను. 72 00:04:34,691 --> 00:04:36,735 మళ్లీ చెప్పు. నాకు మళ్లీ చెప్పు. 73 00:04:36,818 --> 00:04:38,695 నువ్వు కనీసం వినను కూడా లేదా? మంచిది. 74 00:04:38,779 --> 00:04:40,155 నా మాటలను నువ్వే వినడం లేదు. 75 00:04:40,239 --> 00:04:43,242 ఇక పేరున్న వాళ్ళు నేను చెప్పేవి వింటారని ఎలా అనుకోమంటావు? 76 00:04:43,325 --> 00:04:44,618 ఎలా అనుకోమంటావు? సరే. 77 00:04:44,701 --> 00:04:46,662 నా ఉద్దేశం... 78 00:04:46,745 --> 00:04:48,622 నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు కదా? 79 00:04:48,705 --> 00:04:50,874 అవును, నాకు సహాయం కావాలి అని అడుక్కుంటున్నావు. 80 00:04:50,958 --> 00:04:53,710 నాకు తెలియడం లేదు, దాన్ని నువ్వు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటా. 81 00:04:54,253 --> 00:04:55,337 ఎలాంటిది చెప్పాలంటే... 82 00:04:55,420 --> 00:04:56,839 వినసొంపైన పిచ్చి కోట్లు చెప్పాలా. 83 00:04:56,922 --> 00:04:59,758 ఏదైనా నినాదాలను కనిపెట్టు. "జై జన్మభూమి" లాగా. 84 00:04:59,842 --> 00:05:01,510 "డానీ రావాలి, దరిద్రం రావాలి." 85 00:05:02,636 --> 00:05:03,846 ఏమో, నువ్వు అన్నది నిజమేనేమో. 86 00:05:05,055 --> 00:05:09,351 సోమవారం ఉదయాన లేవగానే కాలేజీకి వెళ్లాల్సిన పని లేదు, కనీసం తయారవ్వాల్సిన 87 00:05:09,434 --> 00:05:12,980 అవసరం కూడా లేదు, ఇలా నేను ఏడేళ్ళ క్రితం ఉన్నాను... 88 00:05:13,897 --> 00:05:18,110 నేను చెప్తున్నా కదా, ఈ స్వేచ్ఛ, ఇది... 89 00:05:19,361 --> 00:05:22,030 ఇది స్వేచ్ఛనిస్తుంది... అనుకుంటా. 90 00:05:23,824 --> 00:05:25,492 మరి నీ సంగతి ఏంటి? రోజూ నువ్వు ఏం చేస్తావు? 91 00:05:25,576 --> 00:05:28,287 పాపని బడిలో వదిలేసి... ఆ తర్వాత ఏం చేస్తావు? 92 00:05:28,370 --> 00:05:30,706 నీకు అంతకన్నా ముఖ్యమైన పని ఏం లేదా. 93 00:05:30,789 --> 00:05:32,249 ఎందుకంటే నేను కూడా... 94 00:05:32,916 --> 00:05:34,251 నేను కూడా నీతో వస్తాను. 95 00:05:34,334 --> 00:05:37,212 మనం మాట్లాడుకోవచ్చు, మనం లోతుగా చర్చించుకోవచ్చు కూడా. 96 00:05:38,463 --> 00:05:40,674 మాయా? టిఫీన్! 97 00:05:40,757 --> 00:05:41,717 మనిద్దరం అన్నమాట. 98 00:05:41,800 --> 00:05:43,260 ఏదోకటి చెప్పేయ్. 99 00:05:43,343 --> 00:05:44,970 రోజంతా వీడు నీకు తోకలా ఉండకూడదు. 100 00:05:45,053 --> 00:05:46,054 బంగారం. 101 00:05:47,222 --> 00:05:49,183 నాతో వస్తే... నీకు బాగా బోరింగ్ గా ఉంటుందనుకుంటా. 102 00:05:49,266 --> 00:05:50,934 కేవలం ఒక ఇల్లాలు చేసే పనులనే చేస్తుంటా. 103 00:05:51,018 --> 00:05:52,144 ఏంటి? భలేదానివే. 104 00:05:52,227 --> 00:05:54,771 నేను ఆఫీసుకు వెళ్లాక, నువ్వు ఏం చేస్తావో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. 105 00:05:54,855 --> 00:05:57,608 ఇంటికి ఒక అందమైన పనివాడు వచ్చి నీకు సుఖాన్ని అందిస్తాడేమో. 106 00:05:58,859 --> 00:06:01,195 చెప్పేయ్. పనోడితో పడక పంచుకుంటున్నావని చెప్పేయ్. 107 00:06:01,278 --> 00:06:03,780 నువ్వు నిజంగా చేసే పని కంటే అది మేలైనదే, ఇంకా అంత చండాలమైనది కాదు కూడా. 108 00:06:04,323 --> 00:06:07,492 ఇవాళ నేను కూడా నీతో వస్తున్నాను, సరేనా? 109 00:06:08,952 --> 00:06:10,871 నువ్వే పని చేసినా నీ వెంటే ఉంటాను. 110 00:06:14,917 --> 00:06:15,918 సరే. 111 00:06:36,813 --> 00:06:41,568 శాండీ ఫీట్ ప్రీస్కూల్ 112 00:07:01,338 --> 00:07:03,841 కోస్ట్ బ్యాంక్ 113 00:07:07,636 --> 00:07:10,055 నువ్వు ఇక్కడే ఉండరాదూ? నేను త్వరగానే వచ్చేస్తానులే. 114 00:07:11,640 --> 00:07:12,683 సరే. అలాగే. 115 00:07:12,766 --> 00:07:15,185 తొమ్మిది వందల తొంభై అయిదు, 1,000. 116 00:07:15,269 --> 00:07:18,480 సరే మరి. నేను మా సూపర్వైజర్ కి చెప్పి వీటిని జమ చేయమని చెప్తాను. 117 00:07:19,690 --> 00:07:20,691 ఏమన్నారు? 118 00:07:21,191 --> 00:07:24,486 వెయ్యి డాలర్లకు పైగా జరిగే నగదు డిపాజిట్ లను రికార్డ్ చేయాలి. 119 00:07:24,570 --> 00:07:25,654 అది కేవలం ఫార్మాలిటీలెండి. 120 00:07:25,737 --> 00:07:26,905 దీనికి నీ మీద అనుమానం కలిగింది. 121 00:07:26,989 --> 00:07:30,033 ఈలోపు, మీరు మా ప్రత్యేకమైన తాజా ఓట్ మీల్ కుక్కీలను ఆస్వాదించండి. 122 00:07:30,617 --> 00:07:32,286 ముందు తినిపించి తర్వాత నా పని పడతారన్నమాట. 123 00:07:32,786 --> 00:07:34,705 నాకు, నేను... 124 00:07:34,788 --> 00:07:36,415 నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్న విషయం మర్చిపోయా, 125 00:07:36,498 --> 00:07:38,750 కాబట్టి నేను... నేను మళ్లీ వస్తాను. 126 00:07:46,133 --> 00:07:47,134 ధన్యవాదాలు. 127 00:07:47,217 --> 00:07:48,552 మీకు ఈ విషయం తెలుసో లేదో, 128 00:07:48,635 --> 00:07:51,138 కానీ నిజానికి బరీటో అంటే "చిన్న గాడిద" అని అర్థం. 129 00:07:51,221 --> 00:07:54,975 అవును, ఎందుకంటే బహుశా అది కూడా గాడిదలాగా మనకి పోషకాలను అందిస్తుందేమో. 130 00:07:55,058 --> 00:07:57,227 అది మన తోటి రోజువారీ కూలీలకు చాలా ఉపయోగకరమైనది. 131 00:07:57,311 --> 00:07:59,021 వాళ్లు ఏ అహారం లేకుండా కొన్ని గంటల పాటు... 132 00:07:59,104 --> 00:07:59,938 హేయ్. 133 00:08:00,022 --> 00:08:01,148 ఇక దొబ్బేయండి. 134 00:08:02,399 --> 00:08:03,609 ఇక బయలుదేరుదామా, బంగారం? 135 00:08:03,692 --> 00:08:04,943 సరే మరి. జాగ్రత్త, అమ్మాయిలూ. 136 00:08:05,027 --> 00:08:06,069 తొక్కలే. 137 00:08:06,153 --> 00:08:07,946 నువ్వు తోలతావా? సరే. 138 00:08:10,616 --> 00:08:14,912 మరి ఈరోజు మనం ఇంకేం సాహసం చేయబోతున్నాం? 139 00:08:14,995 --> 00:08:16,622 నేను బ్యాలే క్లాస్ కి వెళ్లాలి. 140 00:08:17,247 --> 00:08:18,248 వెళ్లాలంటావా? 141 00:08:18,332 --> 00:08:19,625 నిన్ను వదిలించుకోవాలంటే తప్పదు. 142 00:08:19,708 --> 00:08:21,668 నాకు వెళ్లాలనుంది. నేను నా ఫిగర్ ని అలాగే కాపాడుకుంటున్నా. 143 00:08:21,752 --> 00:08:22,961 ముందు నిన్ను ఇంట్లో దింపేస్తాను. 144 00:08:28,258 --> 00:08:31,178 కావలసింది దక్కించుకోవడానికి నీకు ఇది మంచి అవకాశం. చెడగొట్టుకోకు. 145 00:08:31,261 --> 00:08:32,261 హేయ్. 146 00:08:33,054 --> 00:08:34,222 చెప్పండి. 147 00:08:34,306 --> 00:08:35,349 చెప్పండి? 148 00:08:36,475 --> 00:08:37,518 తను మంచిదే. 149 00:08:38,059 --> 00:08:39,561 -చెప్పండి? -తను మంచిదే. 150 00:08:40,520 --> 00:08:43,398 నువ్వు మంచిదానివని అనుకుంటున్నారు, అలాగే ప్రవర్తించు. 151 00:08:43,482 --> 00:08:46,485 నీ ఉద్దేశాన్ని బయటపెట్టకు, మాహాతల్లి. వీడి అవసరం నీకు ఉంది. 152 00:08:46,985 --> 00:08:48,278 ఇవాళ అలలు అనూకూలంగా ఉన్నాయా? 153 00:08:50,197 --> 00:08:52,991 మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి. 154 00:08:53,575 --> 00:08:54,993 ఆదిలోనే చుక్కెదురైంది. 155 00:08:55,077 --> 00:08:56,870 -నేను... -మేం బతకడానికి చెమటోడ్చాల్చి వస్తుంది. 156 00:08:57,496 --> 00:08:59,331 ఇప్పుడు, నేను సర్ఫింగ్ చేస్తున్న విషయాన్ని పక్కనబెడితే, 157 00:08:59,414 --> 00:09:03,043 నేను సర్ఫింగ్ చేయనప్పుడు వేరే పనులు చేస్తూ చాలా కష్టపడతాను. 158 00:09:04,044 --> 00:09:08,507 కాబట్టి మీరు మా దగ్గరి నుండి అన్నీ లాగేసుకుంటూ ఉంటే... 159 00:09:11,134 --> 00:09:13,262 నేను బన్నీ క్లాస్ కి వద్దామనుకుంటున్నా. 160 00:09:13,846 --> 00:09:15,639 ఆమె క్లాస్ ని చాలా బాగా చెప్తుంది. 161 00:09:15,722 --> 00:09:18,433 ఆమె చెప్పే విధానం, అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది, 162 00:09:19,393 --> 00:09:20,394 అది నాకు... 163 00:09:21,812 --> 00:09:23,146 శక్తివంతురాలిననే భావనను కలిగిస్తుంది. 164 00:09:23,230 --> 00:09:24,690 నేను ఆ ఫీలింగ్ ని కొనసాగించాలని... 165 00:09:25,399 --> 00:09:26,525 అనుకుంటున్నా. 166 00:09:28,151 --> 00:09:30,362 బాసూ, ఏం చేస్తున్నావు? 167 00:09:30,445 --> 00:09:31,613 అవకాశం ఉన్నప్పుడే కానిద్దాం. 168 00:09:33,782 --> 00:09:35,200 అవకాశం ఉన్నప్పుడే అని అంటాడేంటి? 169 00:09:35,284 --> 00:09:36,827 మీకు తెలీదా ఏంటి. 170 00:09:37,619 --> 00:09:39,621 మీ స్నేహితుడు బ్రీమ్, నది సముద్రంలో కలిసే చోటును తవ్వి, 171 00:09:39,705 --> 00:09:41,290 ఈ మొత్తం రూపాన్నే మార్చబోతున్నాడు, 172 00:09:41,373 --> 00:09:45,085 మాకు ఆనందాన్నిచే ఒకే ఒక విషయమైన అలలను చంపేస్తున్నాడు. 173 00:09:45,794 --> 00:09:49,214 పెద్ద పెద్ద అలలు, దేవుడు పంపే యమదూతలు అని జనాలు అనుకుంటూ ఉంటారు. 174 00:09:49,298 --> 00:09:53,343 అది జోక్ కదా? అవి సున్నితమైన భౌగోళిక, ఇంకా సముద్ర సంబంధిత అంశాల మీద ఆధారపడి ఉంటాయి. 175 00:09:53,427 --> 00:09:55,387 వాటితో పెట్టుకుంటే, ఇక అంతే. 176 00:09:58,599 --> 00:09:59,600 ఏదేమైనా. 177 00:10:01,059 --> 00:10:03,061 మీరు బన్నీ క్లాస్ లో చేరడం విషయానికి వస్తే... 178 00:10:04,438 --> 00:10:05,939 అది జరిగే అవకాశం లేదు. 179 00:10:06,607 --> 00:10:07,941 అంటే కుదరదని అంటున్నారా? 180 00:10:08,025 --> 00:10:09,526 నేను అన్నది అదే కదా. 181 00:10:10,736 --> 00:10:11,737 మళ్లీ కలుద్దాం. 182 00:10:19,786 --> 00:10:21,997 మామూలు డ్రెస్ వేసుకొని రావచ్చు అనే అన్నాడంటావా? 183 00:10:22,080 --> 00:10:23,248 అతను ఏమన్నాడో నాకు తెలీదు. 184 00:10:23,749 --> 00:10:24,750 నేను నిన్ను అడిగా, 185 00:10:24,833 --> 00:10:26,793 అతను, తన ఇంట్లో చిన్న పార్టీకి రమ్మన్నాడు అని అన్నావు, 186 00:10:26,877 --> 00:10:29,296 -అప్పుడు నేను "మామూలు డ్రెస్ ఓకేనా..." -ఏదైతే ఏంటి? 187 00:10:29,379 --> 00:10:32,174 నన్ను మన్నించు. నాకు చాలా కంగారుగా ఉంది. 188 00:10:32,257 --> 00:10:33,425 నాకు వీళ్ల సపోర్ట్ తప్పకుండా కావాలి. 189 00:10:33,509 --> 00:10:36,261 నువ్వెలా ఉంటే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? నువ్వు చాలా బాగున్నావు. సరేనా? 190 00:10:38,972 --> 00:10:42,601 బాబోయ్. ఈ ఇల్లేంటి ఇంత పెద్దగా ఉంది. హోటల్ లా ఉంది. 191 00:10:43,268 --> 00:10:45,395 -హేయ్! మీరు వచ్చేశారు. -హేయ్. 192 00:10:45,979 --> 00:10:46,980 -హాయ్. -అవును. 193 00:10:47,064 --> 00:10:51,026 అతి విశాలంగా, అతి భారీగా ఉండే మా ఇంటికి స్వాగతం. 194 00:10:51,109 --> 00:10:53,153 -వావ్. ధన్యవాదాలు. -నమ్మశక్యంగా లేదు. అవును. 195 00:10:53,237 --> 00:10:55,113 నా పేరు ఎర్నీ హాజర్. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. 196 00:10:55,197 --> 00:10:57,491 నేను మోచేతులతో పలకరిస్తాను. పరిశుభ్రత అంటే పిచ్చి. 197 00:10:57,574 --> 00:11:00,452 మన్నించండి. ఈవిడ నా భార్య, షీలా. తను నా కూతురు, మాయా. 198 00:11:00,536 --> 00:11:03,372 -హేయ్, మాయా. హాయ్, హలో. -హాయ్. 199 00:11:03,956 --> 00:11:06,291 మీకు నా భార్య, గ్రెటాని పరిచయం చేస్తాను. 200 00:11:06,375 --> 00:11:07,668 గ్రెటా, గ్రెటా బంగారం! 201 00:11:08,585 --> 00:11:11,213 ప్రీస్కూల్ దగ్గర రోజూ మేము కలుస్తూనే ఉంటాం. 202 00:11:11,296 --> 00:11:12,381 అవునా, సూపర్! 203 00:11:12,464 --> 00:11:15,217 అయితే మీరు కూడా గ్రెటా సైన్యంలో సభ్యులన్నమాట. 204 00:11:15,300 --> 00:11:17,594 లేదు, ఆమె సాధారణంగా తన పాపని దింపేసి వెళ్లిపోతుంది. 205 00:11:19,179 --> 00:11:20,180 సరే. 206 00:11:22,307 --> 00:11:24,268 -మార్గరీటా తాగుతారా? -తప్పకుండా. 207 00:11:24,351 --> 00:11:26,103 నా భార్య అవి చాలా బాగా చేస్తుంది. మీరు ఇలా వస్తారా? 208 00:11:26,186 --> 00:11:27,271 -వెళ్లి మార్గరిటా తాగండి. -మళ్లీ కలుస్తాను. 209 00:11:28,772 --> 00:11:30,941 -నాకు అస్సలు తెలీదు... -మాకు ఎంత ఆస్తి ఉందో అనా? 210 00:11:31,024 --> 00:11:33,026 అవును. మరీ ఎక్కువ ఉంది. నాకు తెలుసులెండి. 211 00:11:33,110 --> 00:11:35,195 అవును, నాకు మీ భర్త ఎవరో కూడా తెలీదు. 212 00:11:35,988 --> 00:11:37,281 నేను మీకు చెప్పాను, 213 00:11:37,364 --> 00:11:39,575 మీరు మొదటిసారి సరిగ్గా వినలేదని రెండోసారి కూడా చెప్పాను. 214 00:11:39,658 --> 00:11:41,952 రెండోసారి కూడా మీరు విన్నట్టు లేదు. 215 00:11:42,035 --> 00:11:44,288 పింకీకి ఆకలిగా ఉంది. ఏదైనా తినాలనుకుంటోంది. 216 00:11:45,581 --> 00:11:47,875 పిల్లలందరూ టీవీ గదిలో ఉన్నారనుకుంటా. 217 00:11:47,958 --> 00:11:49,459 పింకీకి అక్కడ ఆహారం దొరుకుతుందేమో చూద్దామా? 218 00:11:49,543 --> 00:11:51,378 -అలాగే. -సరే. పద వెళ్దాం. పద. 219 00:11:51,461 --> 00:11:53,005 -ధన్యవాదాలు. -పర్వాలేదు. 220 00:11:53,088 --> 00:11:58,177 అనగనగా ఒకరోజు, ఒక అడవి మధ్యలో ఇద్దరు పిల్లలు జీవించేవారు. 221 00:11:58,260 --> 00:11:59,887 అబ్బాయి పేరు హాంసెల్. 222 00:11:59,970 --> 00:12:01,013 నా పేరు హాంసెల్. 223 00:12:01,096 --> 00:12:03,098 -అమ్మాయి పేరు గ్రెటెల్. -నా పేరు గ్రెటెల్. 224 00:12:03,182 --> 00:12:05,434 ఈ ఇల్లు చాలా విశాలంగా ఉంది. 225 00:12:06,351 --> 00:12:07,895 ఇంత పెద్ద ఇంట్లో ఎవరు ఉంటారు? 226 00:12:08,645 --> 00:12:10,314 అంత బండగా ఉన్న ఆమెలాంటి వాళ్లు. 227 00:12:11,315 --> 00:12:13,525 అయ్యో. దొరికేశావు. 228 00:12:15,736 --> 00:12:18,780 ఇప్పుడు, నువ్వు ఆ తింగరిదానితో పళ్లు ఇకిలిస్తూ మాట్లాడాలి... 229 00:12:18,864 --> 00:12:20,324 ఇక్కడ అంతా ఏదో భారీ సెట్ వేసినట్టుంది. 230 00:12:20,407 --> 00:12:23,702 అంత పెద్ద టీవీని నేను ఇప్పటిదాకా చూడలేదు. సినిమా స్క్రీన్ అంత పెద్దగా ఉంది. 231 00:12:24,828 --> 00:12:27,623 ఎర్నీ కొన్నాడు. ఏది కొత్తగా వచ్చినా, దాన్ని కొనేయాలనుకుంటాడు. 232 00:12:27,706 --> 00:12:29,333 అందులో అది అన్నింటికన్నా పెద్దదైతే, కొనేయాల్సిందే. 233 00:12:30,000 --> 00:12:32,920 నేనయితే మైక్రోవేవ్ ఓవెన్ కొనివ్వమని స్టీవెన్ ని ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నాను. 234 00:12:33,003 --> 00:12:35,506 వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని అతను అనుకుంటున్నాడు. 235 00:12:36,173 --> 00:12:38,050 మేము మా ఓవెన్ ని పాప్ కార్న్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. 236 00:12:38,133 --> 00:12:39,843 -ఆయిల్ ఉండదు, ఏ గోలా ఉండదు. -బాగుంది. 237 00:12:39,927 --> 00:12:42,888 హాట్ డాగ్ పది సెకన్లలో అయిపోతుందంటే క్యాన్సర్ రిస్క్ సైతం నేను తీసుకుంటా. 238 00:12:42,971 --> 00:12:45,933 అది సురక్షితం కానప్పుడు ఇంట్లో వాడుకోవడానికి వారు అనిమతించరు కదా? 239 00:12:46,016 --> 00:12:48,143 కార్పొరేట్ వాళ్ళ అత్యాశకి ప్రభుత్వ అసమర్థత తోడైతే అంతేకదా మరి? 240 00:12:50,729 --> 00:12:52,898 అందుకే నీ ఆలోచనలన్నీ నీలోనే ఉంచుకోవాలి, మహాతల్లి. 241 00:12:52,981 --> 00:12:55,901 మీరు బర్కిలీ నుండి ఇక్కడికి వచ్చారు కదా? 242 00:12:55,984 --> 00:12:56,985 అవును. 243 00:12:57,569 --> 00:12:59,112 ఆయిల్ ఉండదు, ఏ గోలా ఉండదు. 244 00:13:03,242 --> 00:13:04,368 ఆయిల్ అవసరం ఉండదు. 245 00:13:04,451 --> 00:13:06,411 దేవుడా, అతని పరిస్థితి నీ కంటే దారుణంగా ఉంది. 246 00:13:06,495 --> 00:13:07,496 ఒక నిమిషం అండి. 247 00:13:11,917 --> 00:13:13,794 నువ్వు తగినవాడివి కాదని ఎవ్వరూ అనలేదు కదా. 248 00:13:13,877 --> 00:13:17,214 వాళ్ళ అంతరార్థం అదే, షీలా. అది చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. 249 00:13:17,297 --> 00:13:20,467 "ఇక అన్నీ సర్దుకొని బయలుదేరు, యూదుబాబూ. ఇక అన్నీ సర్దుకొని బయలుదేరు." 250 00:13:20,551 --> 00:13:24,179 ఇప్పుడు నేను ఆ వెధవలని రేపు డీన్ ఇంట్లో ఏ మొహం పెట్టుకొని కలవాలి. 251 00:13:24,263 --> 00:13:25,347 నేనేం చెప్పాలి? 252 00:13:25,430 --> 00:13:27,182 త్వరలోనే, డబ్బులు అందడం ఆగిపోతుంది. 253 00:13:27,266 --> 00:13:29,685 ఇంకెంత కాలం మనం మన పొదుపు చేసుకొన్న సొమ్ము మీద బతకగలం? 254 00:13:29,768 --> 00:13:30,978 పొదుపా? నయాపైసా లేదు. 255 00:13:31,061 --> 00:13:32,688 హలో! నేను నిజంగానే అడుగుతున్నాను. 256 00:13:32,771 --> 00:13:35,899 కంగారుపడాల్సిందేమీ లేదు. నేను నా ఖాతాలను తనిఖీ చేసి చూడాలి, అంతే. 257 00:13:35,983 --> 00:13:38,527 అబ్బా, అక్కడేం ఉందని. అబద్ధాలడకు. అక్కడేమీ లేదు. 258 00:13:38,610 --> 00:13:41,446 అసలు ఎర్నీ ఏమన్నాడో చెప్తావా? 259 00:13:41,989 --> 00:13:45,242 అవునులే, మళ్లీ ఆ అవమానాన్ని నేను తలుచుకొని బాధపడటానికా? బాగుంది. 260 00:13:45,325 --> 00:13:47,119 కాదు. తెలుసుకోవాలని, దాని బట్టి నీకు సాయపడాలని. 261 00:13:47,202 --> 00:13:51,748 సరే, నేను అభ్యర్థిగా సరిపోనని అతను అనుకుంటున్నాడట. 262 00:13:51,832 --> 00:13:57,045 నిజానికి, నేను వెనుక ఉండి, వ్యూహరచనలు చేసే పనికి బాగా సరిపోతానట. 263 00:13:58,630 --> 00:14:01,425 ఓ విషయం చెప్పనా? అతడిని కాస్తంత ఒప్పించాలంతే. అంతకు మించి ఏం లేదు. 264 00:14:01,508 --> 00:14:03,343 తిరస్కరించడానికి నన్ను అక్కడికి ఎందుకు ఆహ్వానించినట్టు? 265 00:14:03,427 --> 00:14:05,929 ఏదో మారింది. ఏదో జరిగింది. 266 00:14:06,013 --> 00:14:07,639 దానికి కారణం నువ్వే. 267 00:14:07,723 --> 00:14:09,641 ఇంకో విషయం చెప్పనా? మనం కొన్ని మార్పులు చేయాలి. 268 00:14:09,725 --> 00:14:13,520 నేనేదోకటి తేల్చేదాకా అదనపు ఖర్చులు, బ్యాలే క్లాసులు ఏమీ వద్దు. సరేనా? 269 00:14:14,062 --> 00:14:15,981 మాయాని మనం ఆ నర్సరీ స్కూల్ మాన్పించేయాలనుకుంటా. 270 00:14:16,064 --> 00:14:17,524 అది బాగా ఖరీదైన స్కూల్, కదా? 271 00:14:17,608 --> 00:14:19,568 లేదు, అది నిజానికి, ఒక కో-ఆపరేటివ్ స్కూల్. 272 00:14:19,651 --> 00:14:21,737 ఏదైనాకానీ, దానికి ఎంతోకొంత ఖర్చవుతుంది కదా, షీలా. 273 00:14:21,820 --> 00:14:23,322 మనం ఏదోకటి చేయాలి కదా. 274 00:14:23,405 --> 00:14:25,407 మనం అంటే, అతని ఉద్దేశం నువ్వు అని. 275 00:14:26,325 --> 00:14:27,826 ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన సమయం వచ్చింది. 276 00:14:31,538 --> 00:14:32,956 అందరికీ శుభోదయం. 277 00:14:33,040 --> 00:14:35,667 శుభోదయం. మాయా అంతా బాగానే ఉందా? 278 00:14:36,210 --> 00:14:37,211 బాగానే ఉంది. 279 00:14:38,128 --> 00:14:39,505 ఇక్కడ ఏమైనా పని చేద్దామని స్వచ్ఛందంగా వచ్చా. 280 00:14:40,589 --> 00:14:42,382 స్వాగతం. ఎంత మంది ఉంటే అంత మంచిది. 281 00:14:43,091 --> 00:14:45,219 ఇక్కడి పనులన్నీ గ్రెటా చూసుకుంటుంది. 282 00:14:46,762 --> 00:14:48,138 శుభోదయం. 283 00:14:49,223 --> 00:14:50,641 నేను కూడా ఏదోక సాయం చేద్దామనుకుంటున్నా. 284 00:14:50,724 --> 00:14:51,892 సరే. అలాగే. 285 00:14:53,227 --> 00:14:55,270 శ్యాండ్ బాక్స్ విషయంలో మాకు సాయం చేయగలరా. 286 00:14:55,854 --> 00:14:57,439 అక్కడ కుక్క పెంట ఉంటుంది, అది తీయాలి. 287 00:14:58,690 --> 00:14:59,733 అది... 288 00:14:59,816 --> 00:15:01,485 -ప్రతీకారంగా, ఘర్షణాత్మకంగా ఉంది. -...బాగుంది. 289 00:15:03,946 --> 00:15:06,490 అంటే, ఇంకా హెలన్ రాలేదు, మామూలుగా ఆ పనిని తనకే అప్పగించేదాన్ని. 290 00:15:07,699 --> 00:15:09,701 -ఆ తర్వాత, సాంగ్ సర్కిల్ లో నాకు సాయపడండి. -సరే. 291 00:15:09,785 --> 00:15:12,996 ఆ తర్వాత మనం టిఫిన్ కి కానీ, ఇంకెక్కడీకైనా కానీ వెళ్లవచ్చు. 292 00:15:13,080 --> 00:15:14,122 బాగుంది. 293 00:15:14,831 --> 00:15:16,333 -పాట పాడే సమయం అయింది! -సరే. 294 00:15:17,292 --> 00:15:19,253 ఇవాళ "నా దేహమంటే నాకు ప్రాణం" పాట పాడదామా? 295 00:15:19,336 --> 00:15:20,629 మంచిది. 296 00:15:22,714 --> 00:15:24,633 -నాకు నా... -పాదాలంటే చాలా ఇష్టం! 297 00:15:25,717 --> 00:15:27,344 అవును 298 00:15:28,720 --> 00:15:32,891 అవి చేయగల అద్భుతమైన పనులంటే నాకు ఇష్టం 299 00:15:32,975 --> 00:15:34,935 రోజంతా వీళ్లు ఈ పనే చేస్తారా? దేవుడా. 300 00:15:35,018 --> 00:15:38,146 నేను వాటిని అందరికీ చూపిస్తాను పెంచుకుంటాను 301 00:15:38,230 --> 00:15:40,732 ప్రపంచానికి వాటి గురించి తెలియజేస్తాను 302 00:15:41,316 --> 00:15:45,028 ఎందుకంటే అవి నాలో ఉండేవే నీలోనూ ఉండేవే 303 00:15:46,321 --> 00:15:47,281 నాకు నా... 304 00:15:47,364 --> 00:15:48,574 యోని అంటే ఇష్టం. 305 00:15:49,324 --> 00:15:50,659 అవును 306 00:15:52,160 --> 00:15:55,956 అది చేయగల అద్భుతమైన పనులంటే నాకు ఇష్టం 307 00:15:56,039 --> 00:15:57,082 వాడు మా అబ్బాయి. 308 00:15:58,584 --> 00:16:01,503 నేను దాన్ని అందరికీ చూపిస్తాను పెంచుకుంటాను 309 00:16:01,587 --> 00:16:03,881 ప్రపంచానికి దాని గురించి తెలియజేస్తాను 310 00:16:03,964 --> 00:16:06,466 నేను ఎర్నీని తొలిసారి కలిసినప్పుడు, అతను కేవలం ఒక ఇంజనీర్, అంతే. 311 00:16:07,050 --> 00:16:08,927 అతనేం చేసేవాడో చెప్పినప్పుడల్లా జనాలకి నిద్ర వచ్చేసేది. 312 00:16:09,011 --> 00:16:10,637 ఏదో "పాలియూరిథేన్ కాంపౌండ్స్" అనుకుంటా. 313 00:16:10,721 --> 00:16:12,598 అదో పరమ బోరింగ్ గా, జోల పాటలా ఉంటుంది. 314 00:16:13,098 --> 00:16:15,851 ఏదేమైనా, ఆ సాంకేతికతకు పేటెంట్ హక్కులు తీసుకోవాలనే ముందుచూపు అతనికి ఉండింది. 315 00:16:16,351 --> 00:16:18,270 నువ్వు ఆ క్రీమ్ బన్ ని తాకావంటే, అంతే. 316 00:16:18,353 --> 00:16:20,314 అంటే, పేటెంట్ హక్కుల కోసం ఎన్ని దరఖాస్తులను 317 00:16:20,397 --> 00:16:21,690 పూరించాల్సి ఉంటుందో కూడా అతనికి తెలీదు. 318 00:16:21,773 --> 00:16:24,318 ఎయిరోస్పేస్ కోసం, స్కేట్ బోర్డ్ వీల్స్ కోసం. 319 00:16:24,401 --> 00:16:26,403 ఇప్పుడు అందరూ అతనిలో ఒక మెరుపును చూస్తున్నారు, కదా? 320 00:16:26,486 --> 00:16:30,115 ఓ పేరున్న వ్యక్తిలా, కానీ అది భలే కామెడీగా ఉంది. నాకు మాత్రం తను ఆ పాత ఎర్నీయే. 321 00:16:30,199 --> 00:16:33,035 ఆయన్ని చూస్తుంటే నాకు డానీయే గుర్తువస్తాడు. 322 00:16:33,702 --> 00:16:35,495 అతను కూడా చక్కని ఆవిష్కర్త. 323 00:16:36,455 --> 00:16:39,583 తనని నేను తొలిసారి కలుసుకున్నప్పుడు, మైక్ పట్టుకొని మిల్క్ క్రేట్ మీద నిలబడున్నాడు. 324 00:16:39,666 --> 00:16:40,834 మీరు కాస్త తిని చూడండి. 325 00:16:40,918 --> 00:16:43,128 ఆ స్టాల్ లో దొరికేవాటి రుచి, ఇంకే బేకరీలో కూడా దొరకదు. 326 00:16:43,212 --> 00:16:45,172 పర్వాలేదులెండి. ధన్యవాదాలు. 327 00:16:45,255 --> 00:16:46,423 నిజంగానే, దీనికన్నా రుచికరమైనదాన్ని నేనెక్కడా తినలేదు. 328 00:16:46,507 --> 00:16:47,799 తన మాటలతో పక్కదారి పట్టకు. 329 00:16:47,883 --> 00:16:50,427 మీ భర్త అంటే డానీకి ఎంతో ఆరాధ్య భావం ఉందని నాకు తెలుసు, 330 00:16:51,261 --> 00:16:54,014 ప్రత్యేకించి, ఆయనెంత విజయవంతమైనా నమ్మిన దాన్ని వదులుకోకపోవడం డానీకి నచ్చింది. 331 00:16:54,097 --> 00:16:55,098 ఒక ముక్క తిని చూడండి. 332 00:16:55,766 --> 00:16:56,767 ఎందుకు తిన్నానా అని అనుకోరు. 333 00:16:57,434 --> 00:17:00,145 నేను ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నాలే. కానీ నాకు మరో దారి ఉందా? 334 00:17:00,229 --> 00:17:02,523 నువ్వు తినేదాకా తను నిన్ను వదలదు. 335 00:17:05,651 --> 00:17:07,361 అబ్బా! అదిరిపోయింది. 336 00:17:08,028 --> 00:17:10,781 ఈమెకి బన్నుల రుచి బాగానే తెలుసన్నది మాత్రం వాస్తవం. 337 00:17:13,450 --> 00:17:16,578 ఎర్నీకి సపోర్ట్ విషయంలో మీకు సాయపడాలనే నాకూ ఉంది, 338 00:17:16,662 --> 00:17:19,080 కానీ ఆయన నేను చెప్పే మాటే వినడు. 339 00:17:20,249 --> 00:17:22,125 కానీ మేము ఆ పరిస్థితిని మెరుగుపరచడానికి థెరపీ తీసుకుంటున్నాం. 340 00:17:22,709 --> 00:17:25,753 ఏదేమైనా, దాని కోసమే మీరు నాతో ఇంత మంచిగా ఉండటం లేదనుకుంటున్నా. కనుక... 341 00:17:26,839 --> 00:17:28,590 నిస్సందేహంగా దాని కోసమే. 342 00:17:28,674 --> 00:17:31,426 ఇక తినీ తినీ పేలిపోక ముందే క్లాస్ కి బయలుదేరు. 343 00:17:31,510 --> 00:17:33,220 ఇప్పుడు కాళ్లను కుడి వైపుకు! 344 00:17:38,976 --> 00:17:40,602 ఇప్పుడు మోకాళ్లతో. 345 00:17:45,983 --> 00:17:47,568 చప్పట్లు. చప్పట్లు. 346 00:17:50,237 --> 00:17:51,530 మోకాళ్లు పైకి! 347 00:17:56,201 --> 00:17:57,828 మళ్లీ చప్పట్లు. 348 00:17:57,911 --> 00:18:01,039 మోకాళ్లను ఇంకా పైకి! ఉర్రూతలూగించండి. 349 00:18:11,675 --> 00:18:12,759 మన్నించాలి. క్లాస్ లో ఖాళీ లేదు. 350 00:18:12,843 --> 00:18:15,846 ఇక్కడ వెనుక పక్క చాలా ఖాళీ స్థలం ఉన్నట్టుందే. 351 00:18:15,929 --> 00:18:20,100 అంటే ఇంతకంటే ఎక్కువ మందిని చేర్చుకోకూడదు. చేర్చుకుంటే, నాకు సమస్య ఎదురవుతుంది. 352 00:18:20,184 --> 00:18:22,436 నాకు సమస్య ఎదురయితే, నన్ను ఇక్కడ ఉండనివ్వరు. 353 00:18:22,519 --> 00:18:24,354 ఎవరికైనా నేను ఇక్కడ ఉండకూడదని ఉందా? 354 00:18:24,438 --> 00:18:25,522 లేదు. 355 00:18:26,273 --> 00:18:27,399 అయితే, ఇక మీరు బయలుదేరాలి. 356 00:18:28,775 --> 00:18:29,985 షీలా. 357 00:18:30,068 --> 00:18:31,069 షీల్. 358 00:18:31,904 --> 00:18:34,615 షీలా. అంతే కదా, షీలా? 359 00:18:34,698 --> 00:18:35,991 -అవును. అవును. -అవును. 360 00:18:36,074 --> 00:18:37,618 -అవును, నాకు తనే స్ఫూర్తినిచ్చింది. -అవును. 361 00:18:37,701 --> 00:18:38,785 నా ఉద్దేశం మీకర్థమైంది కదా? 362 00:18:38,869 --> 00:18:40,662 అసలైన ప్రపంచంలోకి అడుగు మోపాల్సిన సమయం వచ్చింది. 363 00:18:40,746 --> 00:18:43,373 రాజకీయ చరిత్రను బోధించడం పక్కన పెట్టి, చరిత్రను సృష్టించాలనుకుంటున్నా. 364 00:18:43,457 --> 00:18:45,959 అంటే, మా తదుపరి కార్యచరణ అదే అని అనుకున్నాం. 365 00:18:46,043 --> 00:18:47,669 మీ విషయంలో నాకు ఆనందంగా ఉంది. 366 00:18:48,295 --> 00:18:50,088 జనాల దృష్టిని ఆకర్షించే గుణం మీకు పుట్టుకతోనే వచ్చిందిలే. 367 00:18:50,172 --> 00:18:53,425 ఇలా అయితే, ప్రచురించాలనే ఒత్తిడి మీ మీద ఉండదు. 368 00:18:53,509 --> 00:18:55,177 నిధుల సేకరణ పని ఎలా సాగుతోంది? 369 00:18:55,886 --> 00:18:57,638 అంటే, అదే కదా ముఖ్యమైన విషయం. 370 00:18:57,721 --> 00:19:01,016 అవును, అది బాగానే సాగుతోంది. ఇప్పుడిప్పుడే మొదలవుతోంది, కానీ, బాగానే సాగుతోంది. 371 00:19:01,099 --> 00:19:04,061 -చీజ్ పఫ్? -తప్పకుండా, ధన్యవాదాలు. 372 00:19:04,144 --> 00:19:05,729 వీటిని తినకుండా ఉండలేను. 373 00:19:05,812 --> 00:19:08,815 సిమోన్, లెక్చరర్స్ కి ఆహారాన్ని వడ్డించే పని నీకు చెప్పారా? 374 00:19:08,899 --> 00:19:11,193 అవును. ఇది నా వర్క్-స్టడీ ప్రోగ్రామ్. 375 00:19:11,276 --> 00:19:14,988 పోయిన ఏడాది, నేను తోట పని చూసుకున్నా, కాబట్టి... 376 00:19:15,739 --> 00:19:16,740 చీజ్ పఫ్ కావాలా? 377 00:19:17,324 --> 00:19:18,325 వద్దులే. 378 00:19:18,408 --> 00:19:19,785 నిన్ను చూడటం బాగుంది. 379 00:19:19,868 --> 00:19:22,120 ఆ వడ్డించే పని తొందరగా పుర్తి చేసి, పుస్తకాలు పట్టుకుంటావని ఆశిస్తున్నా. 380 00:19:22,788 --> 00:19:24,790 ధన్యవాదాలు, డానీ. సరే. 381 00:19:24,873 --> 00:19:27,417 మీకు కూడా ధన్యవాదాలు, షీలా. 382 00:19:27,960 --> 00:19:29,920 ఎప్పటిలాగానే మీరు చాలా బాగా ఉన్నారు. 383 00:19:30,003 --> 00:19:32,089 తొక్కేం కాదు. నువ్వు అచ్చోసిన ఆంబోతులా ఉన్నావు. 384 00:19:32,172 --> 00:19:35,050 ఈ జనాల ముందుకు ఈ డ్రెస్ వేసుకొని రావాలని నీకు ఎందుకు అనిపించింది? 385 00:19:35,133 --> 00:19:36,134 వర్క్-స్టడీ? 386 00:19:37,094 --> 00:19:42,015 ప్రజల మధ్య తారతమ్యాలు, చారిత్రకపరంగా జరిగిన అన్యాయాలను చాటిచెప్పే శాఖలో, 387 00:19:42,099 --> 00:19:44,434 పేద విద్యార్థులను ఫెయిల్ చేసేలా ఇలాంటి పనులు చెప్తారా, 388 00:19:44,518 --> 00:19:47,729 అదే డబ్బున్న విద్యార్థులైతే తాగి తందనాలాడి తమ ఇళ్లలో మధ్యాహ్యం దాకా విశ్రమించవచ్చా? 389 00:19:47,813 --> 00:19:50,190 -వాళ్లు ప్రైవేట్ టీచర్లను పెట్టుకుంటారా? -మళ్లీ మొదలుపెట్టాడు. 390 00:19:50,774 --> 00:19:52,442 ఒక్క నిమిషం అండి. రెస్ట్ రూమ్ కి వెళ్లి వస్తాను. 391 00:19:53,026 --> 00:19:54,027 సరే. 392 00:19:54,111 --> 00:19:55,571 అది దారుణమని మీకు కూడా తెలుసు, కదా? 393 00:19:55,654 --> 00:19:56,864 కాస్త పక్కకి జరుగుతారా. 394 00:19:58,949 --> 00:20:00,200 షీలా. 395 00:20:01,285 --> 00:20:03,662 హాయ్, ప్రొఫెసర్ మెండెల్సన్. 396 00:20:03,745 --> 00:20:06,164 మన్నించాలి, నేను... ఇక్కడ ఉన్నది మీరని అనుకోలేదు. 397 00:20:06,248 --> 00:20:09,293 లేదు, మీరు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారేమో అనుకున్నా. 398 00:20:09,376 --> 00:20:11,336 అలా చాలా మంది తప్పించుకోవాలని చూశారు అనుకోండి. 399 00:20:13,005 --> 00:20:14,423 అది ఒక లెస్బియన్ జోక్ అన్నమాట. 400 00:20:14,506 --> 00:20:16,091 అందరూ అనుకుంటున్నట్టు మాకు జోకులు రావనుకోకండి. 401 00:20:19,428 --> 00:20:22,681 డానీ కాలేజీ నుండి వెళ్లిపోయినా కూడా, 402 00:20:23,390 --> 00:20:26,018 మీ గ్రాడుయేషన్ ని మీరు కొనసాగించడానికి సిద్ధంగా ఉంటే, 403 00:20:26,101 --> 00:20:27,186 ఆ ఏర్పాట్లు మేము చేయగలం. 404 00:20:27,769 --> 00:20:29,146 అది మీ మంచితనం. 405 00:20:29,229 --> 00:20:31,607 పాపని ఇంకా నేనే దగ్గర ఉండి చూసుకోవాలి, కాబట్టి... 406 00:20:31,690 --> 00:20:33,066 ఏ పాప? 407 00:20:35,444 --> 00:20:37,446 నేనిది అని చెప్పకూడదు, 408 00:20:37,529 --> 00:20:40,782 కానీ, రెండు గ్లాసుల వైన్ ని తాగాను కదా, అందుకని చెప్పేస్తున్నాను. 409 00:20:42,367 --> 00:20:43,493 మొదలుపెడుతున్నాను. 410 00:20:44,286 --> 00:20:46,455 ఆ బఫూన్ గాడి కోసం 411 00:20:46,538 --> 00:20:48,832 నీ పై చదువులను వదులుకుంటున్నావంటే 412 00:20:48,916 --> 00:20:51,418 నాకు చాలా కోపంగా ఉంది. 413 00:20:51,960 --> 00:20:55,047 నీ దగ్గర చాలా ప్రతిభ ఉంది, చాలా నైపుణ్యం ఉంది. 414 00:20:55,756 --> 00:20:57,883 అలా అనడం మీ మంచితనం, ప్రొఫెసర్ మెండెల్సన్... 415 00:20:57,966 --> 00:20:59,218 మంచితనం కాదు, తొక్కా కాదు. 416 00:20:59,301 --> 00:21:01,595 ఇక్కడున్న వాళ్లలో ఎవ్వరూ మహిళా విద్య గురించి పట్టించుకోరు, 417 00:21:01,678 --> 00:21:03,430 నేను నా శక్తినంతా కూడదీసుకొని పోరాడాల్సి వస్తోంది. 418 00:21:03,514 --> 00:21:07,267 ఓవైపు, వనరులన్నీ పొలిటికల్ సైన్స్ కే వెళ్లిపోతున్నాయి. ఇక నేను... 419 00:21:09,770 --> 00:21:14,816 ఇవి చాలా అద్భుతంగా, అలాగే తమాషాగా ఉంటాయి, తినకుండా నేను ఉండలేను. 420 00:21:14,900 --> 00:21:17,444 అవునులే. తనని తాను అస్సలు నియంత్రించుకోలేదు. 421 00:21:17,528 --> 00:21:20,948 కొంచెం కూడా ఆత్మాభిమానం లేని ఒక ముసలి లెస్బియన్ ఈవిడ. 422 00:21:21,031 --> 00:21:22,699 నేను రెస్ట్ రూమ్ కి వెళ్లొస్తాను. 423 00:21:23,283 --> 00:21:25,160 నువ్వేమీ పెద్ద పిస్తావి కాదులే. ఇవాళ పందిలా తింటున్నావు. 424 00:21:25,244 --> 00:21:28,121 ఐస్ క్రీమ్ పాస్ట్రీలా? ఇక వదిలేసుకో. ఇక అంతా వదిలేసుకున్నా వదిలేసుకుంటావు. 425 00:21:28,205 --> 00:21:29,540 -చీజ్ పఫ్? -వద్దు! 426 00:21:32,668 --> 00:21:35,671 ఒకప్పుడు నీకు విలువ ఉండేది. ఒకప్పుడు నిన్ను గొప్పగా చూసేవాళ్లు. 427 00:21:35,754 --> 00:21:38,048 ఇప్పుడు నువ్వు డ్రెస్ సరిగ్గా వేసుకోవడం చేతకాని, ముసలితనం ఆవహించిన, 428 00:21:38,131 --> 00:21:41,426 ఎందుకూ పనికి రాని, సమాజంలో ఇప్పుడు ఏమాత్రం ప్రాముఖ్యత లేని ఒక మగవాడికి భార్యవి. 429 00:21:57,776 --> 00:21:58,652 వీడ్కోలు డానీ 430 00:21:58,735 --> 00:21:59,736 దొరికిందిరా. 431 00:22:40,694 --> 00:22:41,820 ఇక మీరు బయలుదేరాలి. 432 00:22:42,446 --> 00:22:44,823 అంతే. అయిపోయిందిగా. 433 00:22:45,490 --> 00:22:48,952 ఇదే చివరిసారి, చిట్టచివరిసారి. 434 00:22:49,036 --> 00:22:50,746 ఇప్పుడు నీకేం చేయాలో తెలుసు కదా. 435 00:22:50,829 --> 00:22:53,123 ఏం చేయాలో నీకు బాగా తెలుసు. 436 00:22:54,291 --> 00:22:55,959 హలో? లోపల ఎవరైనా ఉన్నారా? 437 00:22:56,043 --> 00:22:57,294 వచ్చేస్తున్నాను. 438 00:22:59,922 --> 00:23:04,092 ఎన్నికల్లో గెలవడంలో తనకి సహకరిస్తున్నావు. మన సముద్రాన్ని కాపాడబోతున్నావు. 439 00:23:06,303 --> 00:23:09,806 "మనకంటే శక్తివంతమైనది ఒక్కటే ఒక్కటుంది. 440 00:23:09,890 --> 00:23:14,686 అది రీగన్ కానీ, ఆయన యుద్ధప్రేమికులు కానీ, బ్రీమ్ కానీ, అతని బుల్ డోజర్లు కానీ కాదు. 441 00:23:15,312 --> 00:23:16,438 అది సముద్రం." 442 00:23:17,231 --> 00:23:21,860 "అది చాలా శక్తివంతమైనదే కావచ్చు, కానీ బలహీనమైనది కూడా. 443 00:23:22,444 --> 00:23:26,657 ఈ అందమైన తీరప్రాంతంతో ఎన్నో అనుబంధాలు ముడి పడి ఉన్న 444 00:23:26,740 --> 00:23:30,327 కాలిఫోర్నియా వాసులుగా, దాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత, 445 00:23:30,994 --> 00:23:32,037 మన కర్తవ్యం." 446 00:23:32,120 --> 00:23:36,083 నా పేరు డానీ రూబిన్, నేను రాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలబడుతున్నాను. 447 00:23:37,292 --> 00:23:38,418 మన సముద్రాన్ని కాపాడుకుందాం 448 00:23:38,502 --> 00:23:41,380 ఈమె నా అందాల భార్య, షీలా, తను మా కూతురు, మాయా. 449 00:23:41,463 --> 00:23:43,757 మాకు మీ అండ కావాలని కోరుతున్నాం, 450 00:23:43,841 --> 00:23:47,219 ఎందుకంటే మీ సాయంతో మనం మన సముద్రాన్ని కాపాడుకోగలం. 451 00:23:47,302 --> 00:23:50,973 మన సముద్రాన్ని కాపాడుకుందాం! మన సముద్రాన్ని కాపాడుకుందాం! 452 00:23:51,056 --> 00:23:52,933 నాన్నకు గుడ్ నైట్ చెప్తావా? 453 00:23:53,851 --> 00:23:56,562 ఇప్పుడు, దాన్ని మనం... 454 00:23:56,645 --> 00:23:58,814 అవును. ఓరి దేవుడా. అది భలేగా ఉంది. సూపర్ ఉంది. 455 00:23:58,897 --> 00:24:00,649 అది యుద్ధం. అది యుద్ధం. 456 00:24:00,732 --> 00:24:02,985 నేను... నేను నిజంగా చాలా మంది విద్యార్థులను అడిగా... 457 00:24:03,569 --> 00:24:04,945 నేను అలసిపోయాను. 458 00:24:05,028 --> 00:24:06,446 సరే. అలాగే. 459 00:24:06,530 --> 00:24:08,115 నీకు ఈ అవమానాలు కొత్త కాదు కదా. 460 00:24:08,198 --> 00:24:09,741 ఈరోజు ఏం ప్రత్యేకం కాదు కదా? 461 00:24:12,327 --> 00:24:13,537 మరి, మీరు ఏమనుకుంటున్నారు? 462 00:24:14,371 --> 00:24:16,331 అతను చెప్పింది నాకు బాగానే నచ్చింది. 463 00:24:17,249 --> 00:24:18,250 కానీ ఏమో. 464 00:24:18,333 --> 00:24:21,336 రాజకీయ నాయకులు పని అదే కదా? చిలక పలుకులు పలకడం. 465 00:24:22,796 --> 00:24:24,923 ఒకవేళ అతని దగ్గర నేను నీకు పని ఇప్పిస్తానంటే? 466 00:24:25,924 --> 00:24:26,967 షూటింగ్ చేసే పని. 467 00:24:27,676 --> 00:24:31,805 మీరు ఇప్పుడు చేసేది కాకుండా, అతని ప్రచారాన్ని సపోర్ట్ చేస్తూ షూటింగ్ చేయాలి. 468 00:24:32,472 --> 00:24:34,224 అసలు మీ అంతరార్థం ఏంటి? 469 00:24:34,850 --> 00:24:36,894 అంటే, నిన్నటి దాకా, బ్రీమ్ కోసం పని చేశారు, 470 00:24:36,977 --> 00:24:38,604 ఇప్పుడేమో ఆయనకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 471 00:24:38,687 --> 00:24:40,355 అసలు, మీరు ఏ పక్షం వైపు ఉన్నారు? 472 00:24:40,981 --> 00:24:42,441 నాకు అంతా అయోమయంగా ఉంది. 473 00:24:42,524 --> 00:24:44,151 "వర్టిగో"లా ఉంది. 474 00:24:45,027 --> 00:24:46,361 అది సినిమా అండి. 475 00:24:47,946 --> 00:24:49,114 నేను నా పక్షాన ఉన్నాను. 476 00:24:49,198 --> 00:24:50,324 సరే. 477 00:24:51,491 --> 00:24:54,161 అయితే నాకు షూటింగ్ చేసే పని దొరుకుతుందన్నమాట. 478 00:24:54,912 --> 00:24:55,996 మరి మీకేం కావాలి? 479 00:24:59,958 --> 00:25:04,171 సరే, కానీ తను ఫ్యాన్ దగ్గర ఉండాలి. 480 00:25:06,089 --> 00:25:07,090 మన్నించండి. 481 00:25:07,758 --> 00:25:09,927 సరే, అమ్మాయిలూ. ఇక మొదలుపెడదాం! 482 00:25:11,261 --> 00:25:13,263 ఇక ఉర్రూతలూగిద్దాం! 483 00:25:13,347 --> 00:25:16,350 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు. 484 00:25:50,050 --> 00:25:52,135 ఇక డాన్స్ అదరగొట్టేద్దాం! 485 00:27:43,163 --> 00:27:45,165 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య