1 00:00:44,628 --> 00:00:47,089 సరే మరి, రేడార్. ఇక వెళ్దాం పద. 2 00:00:52,678 --> 00:00:54,304 లియొనోరా లేక్ 3 00:05:25,075 --> 00:05:26,577 -అంతా బాగానే ఉందా? -అవును. 4 00:05:26,660 --> 00:05:27,744 అవునా? 5 00:05:29,621 --> 00:05:31,498 -నువ్వు దాన్ని... -నేను చూసుకుంటాను. 6 00:05:54,104 --> 00:05:57,107 -తను సమయంలోపు పూర్తి చేయలేదు కదా? -మీరు మీ సిస్టమ్స్ దగ్గరకి వెళ్ళండి. 7 00:05:57,191 --> 00:05:59,651 మేము ఇద్దరమూ ఒక వారంగా చేస్తూ ఉన్నాం. చేయడానికి ఇంకేం ఉంది? 8 00:05:59,735 --> 00:06:01,695 -తను పూర్తి చేయగలదా? -తను చేయగలదు. 9 00:06:01,778 --> 00:06:02,779 మార్క్. 10 00:06:02,863 --> 00:06:03,864 ఏంటి? 11 00:06:03,947 --> 00:06:06,200 -ఒకటి చెప్తా నవ్వకు. -దేనికి? 12 00:06:06,909 --> 00:06:10,245 మనం తన వెనక నిలబడి తన పేరును నినదిస్తే 13 00:06:10,329 --> 00:06:12,331 దాని వలన ప్రయోజనం ఉండవచ్చేమో అనిపిస్తోంది. 14 00:06:15,250 --> 00:06:18,712 అదేం అక్కర్లేదులే. తను పూర్తి చేయగలదు. తనని శ్రద్ధగా పని చేసుకోనిద్దాం. 15 00:06:28,847 --> 00:06:30,015 తన పురోగతి ఎలా ఉంది? 16 00:06:30,557 --> 00:06:32,518 చివరిదాకా తెలిసేలా లేదు. 17 00:06:38,899 --> 00:06:40,192 తను సాధిస్తుంది. 18 00:06:40,901 --> 00:06:43,070 తను సాధిస్తుంది అనుకొని, దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేయ్. 19 00:06:48,408 --> 00:06:49,618 ఇంకో విషయం, మార్క్ కి 20 00:06:49,701 --> 00:06:52,746 ఆఖరి సారిగా, త్రైమాసిక ముగింపు సందర్భంగా ఒక సంరక్షణా సెషన్ ని... 21 00:06:54,248 --> 00:06:55,374 ఏర్పాటు చేయ్. 22 00:06:57,918 --> 00:06:59,044 నిజంగానే అంటున్నారా? 23 00:07:04,508 --> 00:07:05,509 సెత్. 24 00:07:06,885 --> 00:07:09,555 ఈ త్రైమాసికం అందరం బాగా కష్టపడాల్సి వచ్చింది, 25 00:07:09,638 --> 00:07:11,807 నువ్వు అన్నిటినీ బాగానే సద్వినియోగపరుచుకున్నావు. 26 00:07:14,101 --> 00:07:16,854 మిస్టర్ గ్రేనర్ చనిపోయి కియర్ చెంతకి వెళ్లిపోయాడు, 27 00:07:17,646 --> 00:07:20,774 వాళ్లిద్దరూ ఇప్పుడు సంతృప్తిగానే ఉంటారనుకుంటా. 28 00:07:52,389 --> 00:07:53,765 హేయ్. 29 00:07:55,684 --> 00:07:56,685 నువ్వు... 30 00:07:57,311 --> 00:07:58,395 సాధించాననే అనుకుంటున్నా. 31 00:08:13,452 --> 00:08:14,703 -తను పూర్తి చేసిందా? -తను సాధించింది! 32 00:08:17,789 --> 00:08:19,041 తస్సాదియ్యా. 33 00:08:19,124 --> 00:08:21,126 ఓరి దేవుడా. 34 00:08:21,210 --> 00:08:22,503 సియానా, 100% పూర్తయింది లూమన్ 35 00:08:41,145 --> 00:08:43,815 నువ్వు సాధించగలవని నాకు తెలుసు, హెల్లీ ఆర్. 36 00:08:45,317 --> 00:08:48,445 ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ, నువ్వు సాధించగలవని నాకు తెలుసు. 37 00:08:50,155 --> 00:08:54,701 నీ మ్యాక్రోడేటా ఫైల్ కి మెరుగులు దిద్దడం ద్వారా నువ్వు ఈ సంస్థకు, నాకు మంచి పేరు తీసుకొచ్చావు. 38 00:08:55,494 --> 00:08:56,828 కియర్ ఈగన్. 39 00:08:57,329 --> 00:09:00,582 నువ్వు... నువ్వు నాకు నచ్చావు. 40 00:09:01,708 --> 00:09:05,295 కానీ ఇప్పుడు నేను వేరే చోటికి వెళ్లాలి, అక్కడి వాళ్లకి నా అవసరం ఉంది. 41 00:09:06,213 --> 00:09:09,550 సెలవు, హెల్లీ ఆర్, నీకు థ్యాంక్యూ. 42 00:09:26,567 --> 00:09:29,945 సూపర్! కోటాను సాధించేశాం. 43 00:09:30,654 --> 00:09:31,655 అదరగొట్టేశావు. 44 00:09:36,243 --> 00:09:37,327 అయితే, మన ప్లాన్ పట్టాలెక్కినట్టేనా? 45 00:09:53,844 --> 00:09:56,680 మార్క్, త్రైమాసికం ముగిసే సమయంలో 46 00:09:56,763 --> 00:09:59,725 నాకు గుండె పోటు తెప్పించాలని నీకు ఎందుకు అనిపించింది! 47 00:10:02,227 --> 00:10:05,814 సిబ్బంది విషయంలో గడబిడ ఎదురైనా కానీ మొత్తానికి మేము సాధించాం. 48 00:10:05,898 --> 00:10:10,068 అవును, సగం సమయం వరండాల్లోనే తిరిగారు. 49 00:10:10,152 --> 00:10:12,779 అయినా కానీ మీరు సాధించారు. 50 00:10:12,863 --> 00:10:16,325 వాఫుల్ పార్టీకి ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకున్నావా? 51 00:10:16,867 --> 00:10:18,076 డిలన్ అని అనుకుంటున్నా. 52 00:10:21,580 --> 00:10:25,083 నువ్వు డిలన్ ని తప్ప నిన్ను కానీ ఇంకెవరినైనా కానీ ఎంచుకోవచ్చు. 53 00:10:25,918 --> 00:10:30,923 అవును, కానీ అలాంటివి అతనికి చాలా ఇష్టం, అదీగాక అతను బాగా కష్టపడ్డాడు కూడా. 54 00:10:37,054 --> 00:10:38,555 సరే అయితే, నేను ఆ ఏర్పాట్లు చేస్తా. 55 00:10:39,139 --> 00:10:40,641 -మంచిది. -కానీ మీరు వేడుక చేసుకొనే ముందు, 56 00:10:41,558 --> 00:10:43,393 నువ్వు సంరక్షణా కేంద్రానికి వెళ్లాలి. 57 00:10:43,477 --> 00:10:44,478 నిజంగానా? 58 00:10:44,561 --> 00:10:48,190 అవును. డిపార్టుమెంట్ చీఫ్ లని అందరినీ త్రైమాసిక ముగింపు సందర్భంగా అక్కడికి పంపుతున్నాను. 59 00:10:49,024 --> 00:10:53,529 ఈ ఒత్తిడి, మిస్టర్ గ్రేనర్ పదవీ విరమణ తీసుకోవడం, ఈ హడావిడిలో అది చాలా అవసరం. 60 00:10:54,905 --> 00:10:55,906 తప్పకుండా. 61 00:11:01,119 --> 00:11:03,247 మార్క్, ఇక నవ్వులను పక్కకు పెడితే... 62 00:11:04,164 --> 00:11:05,374 చెప్పండి. 63 00:11:07,042 --> 00:11:08,085 థ్యాంక్యూ. 64 00:11:10,254 --> 00:11:11,255 నేను... 65 00:11:11,922 --> 00:11:13,799 లూమన్ కి ఇది చాలా అవసరం. 66 00:11:19,221 --> 00:11:21,098 మీ జీవితంలో భయానికి చోటు ఇవ్వవద్దు 67 00:11:21,181 --> 00:11:22,182 కియర్ ఈగన్ 68 00:11:26,812 --> 00:11:27,813 మార్క్. 69 00:11:28,981 --> 00:11:30,065 మిస్ కేసీ. 70 00:11:38,574 --> 00:11:39,741 ఇక్కడ ఉండాల్సిన చెట్టు ఏమైంది? 71 00:11:43,036 --> 00:11:44,246 వెళ్లి కూర్చో. 72 00:11:48,959 --> 00:11:50,460 అన్నీ పెట్టెల్లో ఉన్నాయేంటి? 73 00:11:53,380 --> 00:11:56,550 లూమన్ కి కొత్త సంరక్షణా డైరెక్టర్ దొరికినట్టున్నారు. 74 00:11:57,926 --> 00:12:00,971 కాబట్టి, ఈ సెషన్ అయ్యాక నేను రిటైర్ అయిపోతున్నాను, కాబట్టి ఈ గది... 75 00:12:01,054 --> 00:12:02,222 ఏంటి? ఒక్క నిమిషం. 76 00:12:03,307 --> 00:12:04,558 ఆ విషయం నీకు ఎప్పుడు చెప్పారు? 77 00:12:07,811 --> 00:12:10,522 ఇప్పుడే, ఒక క్షణం క్రితం. 78 00:12:30,792 --> 00:12:31,835 మార్క్ ఎస్, 79 00:12:33,045 --> 00:12:36,965 మీరు త్రైమాసిక కోటాను పూర్తిచేయడంలో భాగంగా మీ మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ డిపార్టుమెంటును 80 00:12:37,049 --> 00:12:38,717 విజయవంతంగా ముందుండి నడిపించారు, 81 00:12:39,510 --> 00:12:43,931 ఆ కారణంగా ఈ ప్రత్యేకమైన, మరింత మెరుగైన సంరక్షణా సెషన్ కి మీరు అర్హత సాధించారు. 82 00:12:44,014 --> 00:12:45,849 మిమ్మల్ని తీసివేస్తారని నేను అనుకోలేదు. 83 00:12:49,436 --> 00:12:51,772 "నువ్వు బయట చాలా మంచివాడివి. 84 00:12:52,940 --> 00:12:58,195 కేవలం ఒక చిరునవ్వుతో ఆయన ఇతరులలో ఉత్సాహాన్ని నింపగలడు. 85 00:12:59,112 --> 00:13:02,741 ఏ పరిస్థితుల్లోనైనా కానీ, ఆయన..." 86 00:13:02,824 --> 00:13:04,493 హేయ్, నేను ఎవరితో అయినా మాట్లాడతాను. 87 00:13:16,129 --> 00:13:19,341 ఆ రోజంతా నీతో ఆఫీసులో ఉన్నాను కదా, నాకు అప్పుడు చాలా హాయిగా అనిపించింది. 88 00:13:22,344 --> 00:13:23,846 మీకందరికీ చిరాకు తెప్పించానని నాకు తెలుసు. 89 00:13:24,513 --> 00:13:27,140 నేను... కాస్త వింతగా ఉంటానని నాకు తెలుసు. 90 00:13:27,933 --> 00:13:30,269 అదేమీ లేదు. 91 00:13:30,978 --> 00:13:33,605 నేను ఇక్కడ 107 గంటలు పని చేశాను. 92 00:13:34,439 --> 00:13:37,234 వాటిలో ఎక్కువగా అరగంట పాటు నడిచే ఇలాంటి సెషన్లే ఉంటాయి. 93 00:13:39,319 --> 00:13:43,407 నాకు మాత్రం, హెల్లీని గమనిస్తూ మీ డిపార్టుమెంట్లో 94 00:13:43,490 --> 00:13:47,327 గడిపిన ఆ ఎనిమిది గంటలే చాలా ఇష్టం. 95 00:13:50,122 --> 00:13:52,457 అంత ఎక్కువ సేపు నేను ఇక్కడ ఎప్పుడూ ఉండలేదు. 96 00:13:56,295 --> 00:13:59,089 దాన్ని నువ్వు నా జీవితంలోని అత్యంత మధురమైన క్షణంగా అభివర్ణించవచ్చు. 97 00:14:04,303 --> 00:14:06,054 మనం ఇలా జరగకుండా చేయగల మార్గం ఏదోకటి ఖచ్చితంగా ఉంటుంది. 98 00:14:15,981 --> 00:14:18,275 నాకు ఏమైతే నీకు ఎందుకు? 99 00:14:31,371 --> 00:14:34,750 ఎందుకంటే మనం కూడా మనుషులమే, మనుషుల్లో భాగం కాదు. 100 00:14:35,959 --> 00:14:39,046 వాళ్లు మనకి ఎనిమిది గంటలే ఇచ్చినా, ఈ ఎనిమిది గంటలు కూడా మన జీవితాలే. 101 00:14:40,881 --> 00:14:42,966 దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. 102 00:14:48,555 --> 00:14:49,890 నువ్వు చాలా మంచివాడివి, మార్క్. 103 00:15:07,199 --> 00:15:09,576 "నువ్వు బయట చాలా మంచివాడివి. 104 00:15:11,161 --> 00:15:16,041 ఆయన మూడు నిమిషాల్లో టెంట్ ని ఏర్పాటు చేసేయగలడు. 105 00:15:17,584 --> 00:15:21,964 మట్టిలో కూడా మాణిక్యాన్ని పసిగట్టల నైపుణ్యం అతని సొంతం. 106 00:15:23,382 --> 00:15:25,676 ఆయనకి ఇవ్వడమంటేనే..." 107 00:15:26,969 --> 00:15:28,679 ఇది సూపర్ విషయం కదా? 108 00:15:30,097 --> 00:15:31,807 వాళ్ళు ఒకరినొకరు గుర్తుపట్టలేకపోడం? 109 00:15:34,017 --> 00:15:36,061 అంటే చిప్స్ పని చేస్తున్నాయనే అర్థం. 110 00:15:38,647 --> 00:15:39,773 మనం విజయం సాధించినట్టే. 111 00:15:43,694 --> 00:15:45,362 ఆమెని టెస్టింగ్ అంతస్థుకు 112 00:15:46,905 --> 00:15:49,449 తీసుకువెళ్లు. 113 00:16:45,339 --> 00:16:48,509 నేను బయట ఆనందంగానే ఉండే మనిషినా? 114 00:16:50,135 --> 00:16:51,136 అవును. 115 00:16:52,012 --> 00:16:54,473 నువ్వు చాలా చాలా గొప్ప పనులు చేస్తుంటావు. 116 00:17:12,574 --> 00:17:14,242 -నేను ఒక్క నిమిషం... -మన్నించాలి. 117 00:17:15,327 --> 00:17:16,869 నాకు ఇవాళ చాలా పనులు ఉన్నాయి. 118 00:17:17,663 --> 00:17:18,997 నువ్వు బయలుదేరు. 119 00:17:58,704 --> 00:18:00,455 -మార్క్? -ఏమైపోయావు? 120 00:18:00,539 --> 00:18:02,416 నాపై సంరక్షణా సెషన్ జరిగింది. 121 00:18:03,208 --> 00:18:05,878 సరే. నువ్వు వాఫుల్ పార్టీకి సిద్ధంగా ఉండు. 122 00:18:06,503 --> 00:18:07,504 మిస్ కేసీ ఎలా ఉంది? 123 00:18:07,588 --> 00:18:09,631 అంటే, నాకు తనపై ఉన్న ఆసక్తి తగ్గిపోయింది, కానీ తనతో స్నేహం చేయాలనుంది. 124 00:18:12,885 --> 00:18:14,428 -ఆమెని తీసేశారు. -ఏంటి? 125 00:18:14,511 --> 00:18:15,596 అవును. తనకి కూడా ఇందాకే తెలిసింది. 126 00:18:15,679 --> 00:18:18,015 మనం తనకు ఏమైనా సాయం చేయగలమా? మనం చేయగలిగింది ఏమైనా ఉందా? 127 00:18:18,891 --> 00:18:20,017 నాకు తెలీదు. 128 00:18:22,060 --> 00:18:23,979 అందరూ మన ప్లాన్ కి సిద్ధమేనా? 129 00:18:25,022 --> 00:18:27,524 అందరూ పార్టీకి సిద్ధమేనా? 130 00:18:28,942 --> 00:18:29,943 సిద్దమే. 131 00:18:33,405 --> 00:18:35,866 డిలన్ జీ వాఫుల్ పార్టీ పని వేళలు అయిపోయాక ప్రారంభమవుతుంది. 132 00:18:36,617 --> 00:18:37,993 ఈలోపు, 133 00:18:38,076 --> 00:18:41,830 వాఫుల్ పార్టీకి ముందు నేను రకరకాల గుడ్డు వంటకాలను తెప్పించాను. 134 00:18:42,664 --> 00:18:45,792 సూపర్! ప్రయోజనాలు! వావ్! 135 00:18:45,876 --> 00:18:48,879 కోటాను చేరుకున్నందుకు మీ అందరూ దీనికి అర్హులే. 136 00:18:49,546 --> 00:18:51,173 కానీ మనం ప్రారంభించే ముందు... 137 00:18:53,300 --> 00:18:57,554 సూపర్ డిలన్ కి సూపర్ గిఫ్ట్. 138 00:18:58,430 --> 00:19:01,225 ఈ త్రైమాసికంలోని అత్యుత్తమ రిఫైనర్! 139 00:19:01,975 --> 00:19:04,853 తన పళ్లలాగే పదునైన బుర్ర గల మనిషి. 140 00:19:05,395 --> 00:19:06,438 ఏమంటావు, బాసూ? 141 00:19:14,696 --> 00:19:15,739 తెరువు. 142 00:19:15,822 --> 00:19:19,493 అబ్బా, ఆశ. నేను గెలుచుకొన్న దాన్ని నేనే చూసుకుంటా, కాబట్టి... 143 00:19:19,576 --> 00:19:21,328 నువ్వు వాళ్లకి చూపిస్తే మంచిదేమో, డిలన్. 144 00:19:21,828 --> 00:19:23,539 నువ్వు ఏం కోరుకున్నావో వాళ్లకి చూపించు. 145 00:19:24,957 --> 00:19:26,250 అవును, చూపు, గురూ. 146 00:19:27,167 --> 00:19:28,335 సరే. 147 00:19:41,640 --> 00:19:43,892 సరే మరి. ఇక మీ అందరిలో జోష్ నింపుతాను. 148 00:19:50,357 --> 00:19:51,358 సరేనా? 149 00:20:13,714 --> 00:20:16,383 బాబోయ్, ఇది చాలా బాగుంది. 150 00:20:16,884 --> 00:20:19,178 అవును, ఈ ఎగ్ బార్ అదిరిపోయింది. 151 00:20:27,394 --> 00:20:29,313 ఈ వంటకాన్ని చూడు. 152 00:20:29,396 --> 00:20:30,606 చూడటానికి బాగుంది. 153 00:20:39,114 --> 00:20:40,949 నిజానికి ఇక్కడ ఉండాల్సింది నేను. 154 00:20:41,783 --> 00:20:42,826 వద్దు. 155 00:20:44,828 --> 00:20:46,538 మళ్లీ నీ కొడుకును చూడాలని నీకు లేదా? 156 00:20:47,664 --> 00:20:50,000 మనం ఈ రాత్రి చేయబోయేది తొలి దశ మాత్రమే. 157 00:20:54,171 --> 00:20:55,339 నువ్వే చేస్తాను అంటావా? 158 00:21:23,784 --> 00:21:26,161 హెల్లీ ఆర్ మూడు వారాల క్రిందట ఆత్మహత్యాయత్నం చేసింది. 159 00:21:28,497 --> 00:21:29,665 అవును. 160 00:21:32,376 --> 00:21:33,627 మరి మాకు ఎందుకు చెప్పలేదు? 161 00:21:36,046 --> 00:21:37,756 అవి నీకు మిల్చెక్ ఇచ్చాడా? 162 00:21:39,883 --> 00:21:41,218 అడిగినదానికి సమాధానం చెప్పు. 163 00:21:43,303 --> 00:21:44,930 నేను బోర్డుతో మాట్లాడుతున్నానా? 164 00:21:47,266 --> 00:21:49,309 నువ్వు మార్క్ స్కౌట్ వాళ్ల అక్క ఇంటికి కూడా 165 00:21:49,393 --> 00:21:51,353 అప్పుడప్పుడూ వెళ్తున్నావనే విషయం మాకు తెలిసింది. 166 00:21:55,065 --> 00:21:56,066 అవును. 167 00:21:57,067 --> 00:22:01,822 తక్షణమే నీ స్థానం నుండి నిన్ను సస్పెండ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. 168 00:22:03,699 --> 00:22:04,825 నిన్ను తీసేస్తున్నాం. 169 00:22:06,910 --> 00:22:08,161 నీ యెంకమ్మ... 170 00:22:10,831 --> 00:22:12,875 పిచ్చి పట్టిందా, నాటలీ! 171 00:22:14,459 --> 00:22:16,044 అసలు బోర్డు లైన్ లో ఉందా? 172 00:22:22,217 --> 00:22:23,510 అవును. 173 00:22:33,687 --> 00:22:35,355 క్షమించాలి. నేను నోరు జారాను. 174 00:22:36,815 --> 00:22:40,569 ఈ రాత్రి నేను బోర్డుకు అన్నీ వివరంగా చెప్తాను, దయచేసి నా మాట వినండి. 175 00:22:44,323 --> 00:22:45,949 బోర్డు కాల్ ని ముగించేసింది. 176 00:23:06,637 --> 00:23:08,972 లూమన్ నియమావళి 177 00:23:22,402 --> 00:23:25,030 "నీ ఆయుధానికి నువ్వు పని చెప్పిన ప్రతిసారి, 178 00:23:25,113 --> 00:23:29,243 లేదా నీ కలాన్ని కాగితంపై పెట్టిన ప్రతిసారి, నీ భావావేశాలన్నింటినీ అందులో పొందుపరుచు, 179 00:23:30,118 --> 00:23:33,205 నా ద్వారా అవి పునీతం చేయబడి 180 00:23:34,289 --> 00:23:35,624 మీకు అందించబడతాయి. 181 00:23:39,461 --> 00:23:42,047 ఇంతకన్నా మీకు మరో పరమార్థం దక్కదు. 182 00:23:44,716 --> 00:23:48,554 అలాగే... మరింత ఎక్కువ ప్రేమ లభించదు." 183 00:24:18,125 --> 00:24:19,334 నేను కనిపెట్టేశా. 184 00:24:20,252 --> 00:24:22,212 ఆ మేకలు గుడ్లు పెడుతున్నాయి. 185 00:24:22,296 --> 00:24:23,547 ఓరి దేవుడా. కనిపెట్టేశావుగా! 186 00:24:39,021 --> 00:24:40,314 ఈ రాత్రి జరగబోయేదానికి నీకు భయంగా ఉందా? 187 00:24:44,484 --> 00:24:45,485 అవును. 188 00:24:48,697 --> 00:24:51,408 పట్టుబడతామేమోనని భయంగా ఉంది. 189 00:24:55,662 --> 00:24:58,832 మనల్ని పట్టించుకోకుండా వదిలేశారు, మనం కనిపెట్టలేమని అనుకున్నారు. 190 00:24:59,875 --> 00:25:01,460 దీన్ని వాళ్లు అసలు పసిగట్టలేరు. 191 00:25:04,963 --> 00:25:06,423 లేదా మనం బయట, పని అవతారం ఎత్తలేమేమో. 192 00:25:17,434 --> 00:25:19,061 లేదా మనం బయట మంచివాళ్లం కాదేమో. 193 00:25:20,771 --> 00:25:22,189 నేనేతై చెడ్డదాన్ని అని తేలిపోయింది. 194 00:25:26,109 --> 00:25:30,489 నా విషయంలో, నిజంగా నేను పట్టించుకొనే విషయాలు ఉంటే బాగుండని అనిపిస్తుంది. 195 00:25:31,532 --> 00:25:32,658 నిజంగానే అన్నమాట. 196 00:25:35,744 --> 00:25:37,871 నా గురించి శ్రద్ధ ఉన్నట్టు బాగానే నటించావుగా. 197 00:25:43,669 --> 00:25:45,546 నీ మీద శ్రద్ధ చూపడానికి ఎవరైనా ఇష్టపడతారు. 198 00:25:53,011 --> 00:25:54,012 థ్యాంక్యూ. 199 00:25:56,807 --> 00:25:57,808 నీపై కూడా అంతే. 200 00:25:58,308 --> 00:25:59,309 థ్యాంక్స్. 201 00:26:02,980 --> 00:26:04,314 సరే మరి, మిత్రులారా! 202 00:26:05,274 --> 00:26:07,985 నేను ఒక మేనేజ్మెంట్ సమస్యను చూసుకోవాలి, ఇంతటితో ఈ పార్టీ ముగిసింది. 203 00:26:09,903 --> 00:26:11,405 ఆహారాన్ని ఇక్కడే ఉంచేస్తున్నాను. 204 00:26:11,488 --> 00:26:12,990 థ్యాంక్యూ, మిస్టర్ మిల్చెక్. 205 00:26:13,073 --> 00:26:16,577 డిలన్, కాసేపట్లో పర్పెటువిటీ వింగ్ కి నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను. 206 00:26:53,697 --> 00:26:54,698 కీ కార్డ్. 207 00:27:10,297 --> 00:27:11,465 ఇక బయలుదేరండి. 208 00:27:34,488 --> 00:27:37,324 గుర్తుంచుకో, నువ్వు ఇంకే డిపార్టుమెంట్ల జోలికి వెళ్లకు, 209 00:27:37,407 --> 00:27:38,867 -కేవలం మా ముగ్గురినే. -తెలుసు. 210 00:27:39,743 --> 00:27:41,453 నిజానికి, ఈ మెషీన్ పై ఇద్దరు... 211 00:27:41,537 --> 00:27:42,871 ఇద్దరు. నేను చూసుకుంటాలే. 212 00:27:42,955 --> 00:27:44,289 ఇక నాకు కావలసిన సామాగ్రిని ఇస్తారా? 213 00:27:51,463 --> 00:27:54,466 చూడండి, మనం పని అవతారం ఎత్తినప్పుడు మన చుట్టూ జనాలు ఉండవచ్చు. 214 00:27:54,550 --> 00:27:57,678 డ్రైవింగ్ చేస్తూ ఉండవచ్చు, స్కీయింగ్ చేస్తూ ఉండవచ్చు, ఏదైనా చేస్తూ ఉండవచ్చు. 215 00:27:57,761 --> 00:27:59,930 కాబట్టి మీరు లిఫ్ట్ దాటి బయటకు వెళ్ళేటప్పుడు దేనికైనా సిద్ధంగా ఉండండి. 216 00:28:00,013 --> 00:28:01,014 సరేనా? 217 00:28:01,598 --> 00:28:04,852 ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు నమ్మకస్తులైన వారి దగ్గరకు మీరు వెళ్లి 218 00:28:04,935 --> 00:28:07,145 మొత్తం చెప్పేయాలి. 219 00:28:07,229 --> 00:28:09,189 డిలన్ ఎంత సేపు మనకి పని అవతారం ఇస్తాడో తెలీదు, 220 00:28:09,273 --> 00:28:11,483 కాబట్టి మన బయటి జీవితాల గురించి తెలుసుకోవాలని పక్కదారి పట్టకూడదు. 221 00:28:11,567 --> 00:28:13,610 అవును. మన లక్ష్యమే మనకు ముఖ్యం. 222 00:28:20,576 --> 00:28:21,910 నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పి ఉండాలి... 223 00:28:21,994 --> 00:28:22,995 నువ్వు అనబడే నువ్వు డాక్టర్ రికెన్ 224 00:28:27,040 --> 00:28:29,459 కానీ, నేను దీన్ని దాచి ఉంచాను. 225 00:28:31,253 --> 00:28:33,589 ఇందులో ఒక భాగం ఉంది... 226 00:28:35,424 --> 00:28:36,633 అది... 227 00:28:42,723 --> 00:28:46,685 "మన పని... స్వతంత్రంగా ఉండటం. 228 00:28:48,478 --> 00:28:53,901 పని వేళలో మీపై మీ బాస్ పెత్తనం చలాయించవచ్చు. 229 00:28:53,984 --> 00:28:56,695 -కానీ, మిత్రులారా..." -"కానీ, మిత్రులారా, జీవితం మీదే." 230 00:29:02,576 --> 00:29:04,203 ఆ 197వ పేజీ చాలా బాగుంది. 231 00:29:20,636 --> 00:29:21,803 సరేమరి, పిల్లలూ. 232 00:29:25,807 --> 00:29:27,476 రాత్రి సంగతేంటో చూద్దాం. 233 00:29:34,399 --> 00:29:36,443 ఇప్పుడు మనం మన జీవిత భాగస్వాములని కలుసుకుంటాం అంటావా? 234 00:29:37,736 --> 00:29:38,946 కావచ్చు. 235 00:29:39,780 --> 00:29:40,948 నా జీవిత భాగస్వామివి నువ్వే కావచ్చేమో. 236 00:29:42,074 --> 00:29:43,325 అప్పుడు సూపర్ గా ఉంటుంది కదా. 237 00:29:43,408 --> 00:29:44,493 అవును. 238 00:29:45,827 --> 00:29:49,790 అవును, షాపింగ్ కూపన్ల మీద పోట్లాడుకుంటూ ఉండవచ్చేమో. 239 00:29:50,707 --> 00:29:52,417 "బంగారం, నువ్వు వాటిని సరిగ్గా చించట్లేదు!" 240 00:30:00,092 --> 00:30:01,218 -సరే మరి. -సరే. 241 00:30:26,159 --> 00:30:27,786 మళ్లీ మనం ఇక్కడికి రాలేకపోతే, అలా పడుంటుందని. 242 00:30:29,121 --> 00:30:30,747 లేదా, మనం వచ్చినా, అలా పడుంటుందేమో? 243 00:30:31,331 --> 00:30:32,332 సరే. 244 00:30:39,673 --> 00:30:41,049 బయట గుడ్ లక్, బాస్. 245 00:31:11,663 --> 00:31:13,498 "టైప్ చేయాలి. ట్రాక్ బాల్. టైప్ చేయాలి. తిప్పాలి. 246 00:31:13,582 --> 00:31:17,377 ట్రాక్ బాల్. ఎంటర్ నొక్కాలి. షిఫ్ట్ నొక్కాలి. ఎంటర్ నొక్కాలి." 247 00:31:19,588 --> 00:31:20,589 ఓవర్ రైడ్ ఏ ఆన్ ఆఫ్ 248 00:31:20,672 --> 00:31:21,757 సరే. 249 00:31:22,341 --> 00:31:24,551 సిద్ధంగా ఉన్నావా, డిలన్ జీ? 250 00:31:28,222 --> 00:31:29,223 డిలన్ జీ? 251 00:31:30,516 --> 00:31:31,850 ఇదిగో, వచ్చేస్తున్నా! 252 00:31:31,934 --> 00:31:33,352 "ఎంచుకోవాలి, తిప్పాలి..." 253 00:31:51,203 --> 00:31:53,705 లూమన్ మిత్రులకు సుస్వాగతం 254 00:32:27,114 --> 00:32:31,285 అందరి హృదయాల్లో ఉండేవాడు ఎప్పటికీ జనుల నుండి దూరమైపోడు. 255 00:32:31,368 --> 00:32:32,744 కియర్ ఈగన్ 256 00:32:35,747 --> 00:32:36,748 పండగ చేస్కో. 257 00:33:40,729 --> 00:33:44,066 దాన్ని నరికి పారేయాలి! 258 00:33:44,149 --> 00:33:49,196 ముక్కలు ముక్కలుగా కోసి కాకులకూ, గద్ధలకూ పారేయాలి! 259 00:33:50,072 --> 00:33:54,284 దాన్ని, దాన్ని కంత్రీ ముఖాన్ని పచ్చడి చేసిపారేయాలి! 260 00:33:55,118 --> 00:33:56,453 ఓరి దేవుడా. 261 00:33:57,579 --> 00:34:00,249 అది కుక్కచావు చస్తుంది! 262 00:34:24,523 --> 00:34:27,067 ఇక వ్యవస్థాపకుని మంచం వద్దకు వెళ్ళండి 263 00:34:42,331 --> 00:34:43,708 లూమన్ 264 00:36:10,420 --> 00:36:11,547 అయ్యయ్యో. 265 00:36:24,977 --> 00:36:26,144 ఎందుకు? 266 00:36:46,540 --> 00:36:47,875 కొబెల్. చార్లెట్ పుట్టిన రోజు: 3-17-44 267 00:37:32,461 --> 00:37:33,629 మార్క్. 268 00:37:35,005 --> 00:37:36,131 హాయ్, మిసెస్ సెల్విగ్. 269 00:37:36,215 --> 00:37:37,716 ఇలా చెప్పా పెట్టకుండా వచ్చినందుకు క్షమించండి... 270 00:37:37,799 --> 00:37:39,593 పర్వాలేదు. చెప్పు. 271 00:37:40,802 --> 00:37:42,971 నేను డెవన్, రికెన్ల ఇంటికి వెళ్తున్నాను. 272 00:37:43,055 --> 00:37:45,224 -ఇవాళ వాళ్ల ఇంట్లో పార్టీ ఉంది. -అయితే? 273 00:37:45,849 --> 00:37:50,437 మీరు కూడా రాగలరేమో అని డెవన్ మిమ్మల్ని అడిగి చూడమంది. 274 00:37:52,147 --> 00:37:57,694 క్షమించు, మార్క్. నాకు... నాకు సాయంత్రం నుండి అదోలా ఉంది. 275 00:37:58,278 --> 00:38:00,614 అయ్యయ్యో. నేను అర్థం చేసుకోగలను. 276 00:38:01,114 --> 00:38:03,242 నా ఉద్దేశం, అది అంత్యక్రియలు కాదు. కాబట్టి... 277 00:38:10,374 --> 00:38:12,709 నేను నా కారులో వస్తానులే. 278 00:38:14,878 --> 00:38:15,963 అవును! 279 00:38:16,046 --> 00:38:19,383 అలా అయితే, నా అసౌకర్యాన్ని కానీ లేదా భయాన్ని కానీ దూరం చేసుకోవచ్చు. 280 00:38:19,883 --> 00:38:21,635 తప్పకుండా. అలాగే. 281 00:38:30,143 --> 00:38:31,270 హేయ్. 282 00:38:36,108 --> 00:38:37,276 నన్ను మిస్ అయ్యావా? 283 00:39:19,318 --> 00:39:22,988 -చిక్కని దొరకని మార్క్. -నన్ను నేను ఎప్పుడూ అలా అనుకోలేదే. 284 00:39:24,072 --> 00:39:25,657 స్వాగతం. సుస్వాగతం. 285 00:39:26,200 --> 00:39:30,537 సరే మరి. పఠనం ఎనిమిది నిమిషాల్లో మొదలవుతుంది. 286 00:39:31,121 --> 00:39:33,874 మార్క్, మాతో చదవడానికి నీ కాపీని నువ్వు తెచ్చుకున్నావు కదా? 287 00:39:34,917 --> 00:39:38,795 నేను... అంటే, నేను బెడ్ మీద మర్చిపోయాను. 288 00:39:40,339 --> 00:39:41,673 అయ్యయ్యో. నిజంగానా? 289 00:39:42,341 --> 00:39:44,426 -అయ్యయ్యో! -అవును. నన్ను మన్నించు. 290 00:39:44,510 --> 00:39:47,471 మీ ఇంటికి వెళ్లడానికి 15 నిమిషాలు పడుతుంది, తీసుకొని వచ్చేస్తే, అప్పటికీ నువ్వు మాతో... 291 00:39:48,222 --> 00:39:49,681 ఓ విషయం చెప్పనా? పర్వాలేదులే. 292 00:39:49,765 --> 00:39:51,016 -నీకు వెళ్లి తీసుకురావాలనుంటే తప్ప. -అంటే... 293 00:39:51,099 --> 00:39:52,351 మిత్రులారా. 294 00:39:52,434 --> 00:39:53,685 -హేయ్. -హాయ్. 295 00:39:53,769 --> 00:39:56,063 నా బంగారు పాప నాకు ఇస్తున్న తొలి పార్టీ ఇది. 296 00:39:56,146 --> 00:39:57,814 చూడండి, కడుపు నిండా తాగుంది, బుజ్జిది. 297 00:39:57,898 --> 00:39:59,733 అక్కడ చాలా ఆహారం ఉంది. 298 00:39:59,816 --> 00:40:03,237 రిబెక్! మీ ఇద్దరూ కలిసి తన కాపీని చదవడానికి తను అభ్యంతరం చెప్పకపోవచ్చు. 299 00:40:03,320 --> 00:40:06,490 కానీ నేరుగా నేనే తనని అడిగితే బాగుంటుంది, లేదంటే తను నొచ్చుకోవచ్చు. 300 00:40:06,573 --> 00:40:08,200 -ఒక్క నిమిషం. -అలాగే. 301 00:40:09,076 --> 00:40:10,994 -మనోడు బాగా సీరియస్ గా ఉన్నాడే. -అవును. 302 00:40:11,995 --> 00:40:13,872 -అక్కాతమ్ముళ్లు. -ఎట్టకేలకు వాళ్లకి ఏకాంతం లభించింది. 303 00:40:13,956 --> 00:40:16,041 ఏడ్చినట్టు ఉంది నీ జోక్. నీ కోట్ ఇలా ఇస్తావా? 304 00:40:17,751 --> 00:40:18,836 ఇదంతా బాగుంది. 305 00:40:18,919 --> 00:40:20,045 -అవునా? -అవును. 306 00:40:20,796 --> 00:40:24,633 -నువ్వు మంచి భార్యవి, తల్లివి వగైరా వగైరా. -థ్యాంక్స్. 307 00:40:24,716 --> 00:40:26,885 అవునులే. మహోన్నత డెవన్ కి జై! 308 00:40:26,969 --> 00:40:29,054 అవును, జై కొట్టి, చితగ్గొట్టాలి. 309 00:40:29,555 --> 00:40:31,807 -హేయ్, మనిద్దరం తర్వాత ఒక విషయం గురించి చర్చించాలి. -అవునా? 310 00:40:31,890 --> 00:40:35,644 అవును. నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం గురించి నేను గత కొంతకాలంగా ఆలోచిస్తూ ఉన్నాను. 311 00:40:35,727 --> 00:40:36,770 అవునా! 312 00:40:36,854 --> 00:40:39,481 సరే, నేను వెళ్లి అందరినీ పలకరిస్తాను, వచ్చినందుకు థ్యాంక్యూ. 313 00:40:39,565 --> 00:40:40,899 -భలేదానివే. రాకుండా ఎలా ఉంటాను! -దగ్గరికి రా. 314 00:40:43,986 --> 00:40:45,445 పాప ఒంటేలు పోసుంటుంది. చూసుకో, మార్క్. 315 00:40:45,529 --> 00:40:47,364 హాయ్, మిసెస్ సెల్విగ్. 316 00:41:19,688 --> 00:41:21,315 కానీ, మార్క్, 317 00:41:21,398 --> 00:41:24,401 ఇందాక నేను దురుసుగా ప్రవర్తించాను, అందుకు నన్ను క్షమించు. 318 00:41:24,484 --> 00:41:25,694 అయ్యో, పర్వాలేదండి. 319 00:41:27,696 --> 00:41:30,449 దుకాణంలో ఇవాళ అంతా తేడాతేడాగా గడిచింది. 320 00:41:30,532 --> 00:41:34,745 అయ్యయ్యో. కానీ... మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 321 00:41:35,996 --> 00:41:37,164 అవును. 322 00:41:38,415 --> 00:41:40,542 పని విషయమే కదా? 323 00:41:45,422 --> 00:41:46,840 అవును. 324 00:42:11,198 --> 00:42:12,533 వేర్పాటు పద్ధతి జరిపించుకొన్న సిబ్బంది ఇన్పుట్ ఎంటర్ చేయండి 325 00:42:23,377 --> 00:42:24,378 బాబోయ్, సరే. 326 00:42:27,464 --> 00:42:32,761 సరే మరి, "ట్రాక్ బాల్, ట్రాక్... ఫ్లిప్ టైమింగ్ స్విచ్. టైప్ చేయాలి. ట్రాక్ బాల్." 327 00:42:33,679 --> 00:42:35,722 సరే మరి, అయితే ఇది... 328 00:42:35,806 --> 00:42:38,183 ఎక్కడ... ఎండిఆర్ ఎక్కడ? 329 00:42:39,893 --> 00:42:41,562 షిఫ్ట్. 330 00:42:42,062 --> 00:42:43,480 అడ్మిన్ మోడ్ 331 00:42:45,482 --> 00:42:46,984 మేనేజ్ మోడ్. 332 00:42:48,110 --> 00:42:49,444 నిర్ధారిస్తున్నా. సరే. 333 00:42:55,158 --> 00:42:56,285 అది... 334 00:42:57,286 --> 00:42:58,287 ఫంక్షన్స్ 335 00:43:00,914 --> 00:43:02,165 "ఫంక్షన్." పుచుక్. 336 00:43:02,249 --> 00:43:03,250 ఫంక్షన్స్ 337 00:43:07,087 --> 00:43:08,755 ఇప్పుడు హెల్లీ ఆర్. 338 00:43:08,839 --> 00:43:09,840 హెల్లీ ఆర్ దగ్గరికి వెళ్లాలి 339 00:43:11,925 --> 00:43:13,468 హెల్లీ. ఆర్ శాఖ: ఎండిఆర్ 340 00:43:13,552 --> 00:43:15,137 కానివ్వు. కానివ్వు. కానివ్వు. 341 00:43:15,846 --> 00:43:16,680 మార్క్. 342 00:43:16,763 --> 00:43:17,598 ఎండిఆర్, శోధనల్లో వీరిని కూడా చేర్చండి 343 00:43:18,515 --> 00:43:19,516 మార్క్. ఎస్ 344 00:43:19,600 --> 00:43:20,642 సరే మరి. అర్వింగ్. 345 00:43:33,947 --> 00:43:35,782 ఈ జాబితాని నిర్ధారించాలా? హెల్లీ ఆర్ - మార్క్. ఎస్ - అర్వింగ్. బీ 346 00:43:39,786 --> 00:43:42,873 సర్క్యూట్ ని తెరవడానికి మీకు 00:00:19 సమయం ఉంది 347 00:43:43,457 --> 00:43:44,416 అబ్బా. 348 00:43:45,125 --> 00:43:46,335 ఇప్పుడు, "తిప్పాలి." 349 00:43:48,212 --> 00:43:50,506 అర్వింగ్, హెల్లీ, మార్క్. 350 00:43:54,009 --> 00:43:55,302 ఏదేమైనా, నేను... 351 00:43:55,385 --> 00:43:57,513 -నేను నీ వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టాలనుకోవట్లేదు... -అదేం లేదు. 352 00:43:57,596 --> 00:44:01,600 ...కానీ, నువ్వు డెవన్ తో ఏదో జీవితంలోని ముఖ్యమైన విషయమని మాట్లాడుతుండగా విన్నాను. 353 00:44:05,229 --> 00:44:10,234 నేను తనతో నా ఉద్యోగం గురించి మాట్లాడదామనుకుంటున్నాను. 354 00:44:11,235 --> 00:44:12,361 లూమన్ లోని ఉద్యోగం గురించా? 355 00:44:12,444 --> 00:44:13,445 అవును. 356 00:44:14,238 --> 00:44:18,534 నేను ఉద్యోగం మానేసే అవకాశం ఉందని తనతో చెప్పాలనుకుంటున్నా. 357 00:44:20,953 --> 00:44:21,954 మానేసే అవకాశమా? 358 00:44:24,206 --> 00:44:25,249 సీ:\సిస్టమ్_ఫంక్షన్స్ 359 00:44:25,332 --> 00:44:26,583 "తేనెపట్టు." 360 00:44:28,961 --> 00:44:31,255 "లాలిపాట, ఓపెన్ హౌస్, ఓవర్ టైమ్." 361 00:44:31,338 --> 00:44:32,464 సూపర్. 362 00:44:32,548 --> 00:44:34,049 నిజంగా అంటున్నావా? 363 00:44:34,550 --> 00:44:36,093 అవును, నాకు... 364 00:44:37,678 --> 00:44:39,513 ఈ వేర్పాటు పద్ధతి... 365 00:44:42,099 --> 00:44:43,767 నాకు ఇక అక్కర్లేదు అనుకుంటా. 366 00:44:51,358 --> 00:44:53,318 పూర్తి సీక్వెన్స్ రీసెట్ చేయడానికి మీకు 00:00:40 సమయం ఉంది 367 00:44:56,947 --> 00:44:57,948 సరే. 368 00:44:59,616 --> 00:45:00,617 "ఇప్పుడు..." 369 00:45:00,701 --> 00:45:01,535 ఆన్ ఆఫ్ 370 00:45:01,618 --> 00:45:02,619 "...ఏ కోసం చూడండి." 371 00:45:05,497 --> 00:45:06,331 మంచిది. 372 00:45:06,415 --> 00:45:07,708 చేసేయ్. 373 00:45:08,709 --> 00:45:09,960 అయ్యయ్యో. 374 00:45:12,629 --> 00:45:13,964 కమాన్. 375 00:45:14,047 --> 00:45:17,467 వాళ్లకి దూరంగా వచ్చేయ్, మార్క్. 376 00:45:25,934 --> 00:45:27,227 చేతికి చిక్కు. 377 00:46:32,626 --> 00:46:34,628 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య