1 00:00:06,590 --> 00:00:09,927 అనగనగా, మరో లోకంలో, 2 00:00:10,010 --> 00:00:13,431 టాల్‌డొరై అనే అద్భుత రాజ్యం ఉండేది. 3 00:00:13,973 --> 00:00:16,809 ఒకానొకప్పుడు దేవుళ్లకు, టైటాన్లకు యుద్ధభూమి, 4 00:00:16,892 --> 00:00:22,398 ఇప్పుడు ఇంద్రజాలం, వింత, రహస్యాలకు కేంద్రం అయింది. 5 00:00:22,481 --> 00:00:24,275 అది శాంతియుతంగా ఉండేది... 6 00:00:26,193 --> 00:00:29,196 గొప్ప శత్రువు అరుదెంచేవరకూ. 7 00:00:30,489 --> 00:00:36,287 ధైర్యవంతులైన ఓ ధీరోధాత్తుల బృందం, ఈ శత్రువును ఎదిరించడానికి సిద్ధమైంది. 8 00:00:36,370 --> 00:00:39,957 సిద్ధంగా ఉండండి! రాకాసి దగ్గరవుతోంది. 9 00:00:49,508 --> 00:00:50,468 ఏంటీ దారుణం? 10 00:00:50,551 --> 00:00:53,429 దీనికి అనుభవిస్తావు... 11 00:00:54,346 --> 00:00:56,265 అయ్యో ఛ! 12 00:00:56,348 --> 00:00:59,143 నీకు మానవ జాతి ఎన్నటికీ లొంగదు... 13 00:01:02,897 --> 00:01:06,734 సరే, అది ఒక విషయం. 14 00:01:07,443 --> 00:01:12,823 ఛత్! మన వధకులు అందరినీ గొర్రెలలా నరికేశారు. 15 00:01:12,907 --> 00:01:14,992 మళ్లీ చెబుతున్నాను, సావరిన్ యురియెల్. 16 00:01:15,075 --> 00:01:18,037 ఆ రాకాసి ఏదైనా సరే అది రాజ్యమంతా నాశనం చేయకముందే 17 00:01:18,120 --> 00:01:20,498 దాన్ని నాశనం చేయడానికి మన సైన్యం పంపండి. 18 00:01:20,581 --> 00:01:23,959 బహుశా మనకు మన వ్యూహంపై తప్పుడు సలహా అందింది, ప్రభూ. 19 00:01:24,043 --> 00:01:26,587 ఆ రాకాసిని బంధించి, మన ప్రత్యర్థులపై 20 00:01:26,670 --> 00:01:28,923 ఓ ఆయుధంగా ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నాను. 21 00:01:29,006 --> 00:01:32,551 అభ్యంతరం, సర్ ఫిన్స్. అసలది ఏ జీవి అనేది కూడా మనకు తెలియదు. 22 00:01:32,635 --> 00:01:36,430 దెయ్యమా? పదార్ధమా? మనం ఎలా పట్టుకోవాలని ప్రతిపాదిస్తారు? 23 00:01:36,514 --> 00:01:37,807 లేడీ అల్యూరా మాట నిజం. 24 00:01:37,890 --> 00:01:38,766 కానీ, ప్రభూ... 25 00:01:38,849 --> 00:01:41,977 శత్రువు ఎవరో, ఏమిటో తెలిసేవరకూ మన మిగిలిన సైన్యాన్ని 26 00:01:42,061 --> 00:01:44,688 నగరపు గోడలు దాటి బయటకు పంపను. 27 00:01:44,772 --> 00:01:46,357 మనం మరింతమంది వధకులను కనుగొనాలి. 28 00:01:46,440 --> 00:01:48,108 అదెక్కడ, అడగవచ్చా? 29 00:01:48,192 --> 00:01:51,821 టోరియన్ బచ్చర్‌లను ఊచకోత కోశారు, మర్డర్ హోబోస్‌లను వధించారు. 30 00:01:51,904 --> 00:01:53,948 డెత్ డీలర్లందరూ చనిపోయారు! 31 00:01:54,031 --> 00:01:56,826 అయితే తగినవాళ్లను ఎవరినైనా వెతకండి! 32 00:01:56,909 --> 00:01:59,161 టాల్‌డొరై అంతటిలోను గొప్ప వధకుల బృందాన్ని 33 00:01:59,245 --> 00:02:03,082 వెతికి నా దగ్గరకు తెచ్చేవరకూ ఎవరూ విశ్రాంతి తీసుకోకండి! 34 00:02:03,165 --> 00:02:06,627 తాగు! తాగు! తాగు! తాగు! తాగు! తాగు! తాగు! 35 00:02:12,424 --> 00:02:17,555 యే! అంతే! ఎవరు ఉత్తమం? అంతే! 36 00:02:17,638 --> 00:02:20,474 గ్రాగ్ గెలిచాడు. మళ్లీ. 37 00:02:21,267 --> 00:02:25,813 అబ్బా. మనకు రెట్టింపు ఉన్న సైజులో ఉన్నవాడితో తాగే ఆటలు ఎందుకు ఆడతాం? 38 00:02:25,896 --> 00:02:29,191 తెగ తాగడానికి అదే వేగమైన మార్గం, కచ్చితంగా. 39 00:02:29,316 --> 00:02:32,820 ఎవరు తాగున్నారు? నేను కాదు, బాగానే ఉన్నా. 40 00:02:32,903 --> 00:02:36,365 మనం పోటీ పడవచ్చు మరోసారి... మరోసారి... 41 00:02:38,075 --> 00:02:40,119 నువ్వు ఒక్క గ్లాసు సారానే తాగావు కదా? 42 00:02:41,120 --> 00:02:42,204 బాగా చిక్కగా ఉంది. 43 00:02:43,539 --> 00:02:45,583 చూసుకో, గాలిదానా! 44 00:02:45,708 --> 00:02:47,960 హేయ్! నువ్వే చూసుకోరా, దున్నపోతా! 45 00:02:48,043 --> 00:02:52,131 ఊరుకో, గ్రాగ్, దరిద్రులతో మాట్లాడేందుకు మన సమయం వృథా చేసుకోం, గుర్తుందా? 46 00:02:53,007 --> 00:02:56,510 ఓయ్, అంగడి యజమానీ! మొత్తం రాజ్యంలోనే ఎంతో గొప్ప వథకుల బృందమైన 47 00:02:56,594 --> 00:02:59,471 వాక్స్ మాకినా కోసం మరొక రౌండ్! 48 00:03:01,140 --> 00:03:02,308 అతి గొప్పదా? 49 00:03:02,391 --> 00:03:06,103 తగలబడే చావిడిలో ఓ పశువును కూడా కాపాడలేరని విన్నాను. 50 00:03:06,186 --> 00:03:09,523 వాక్స్ మాకినా, భలే చెత్త జోక్! 51 00:03:12,735 --> 00:03:15,195 నేస్తం, నోటికొచ్చింది వాగకు. 52 00:03:15,279 --> 00:03:17,114 మాకు సమస్య తెచ్చుకోవాలని లేదు. 53 00:03:17,197 --> 00:03:18,824 నీకేమీ సమస్య ఉండదులే. 54 00:03:18,908 --> 00:03:21,952 అసలు పని కూడా దొరకని పనికిమాలిన వాళ్లెవరో 55 00:03:22,036 --> 00:03:24,330 అందరికీ తెలుసుగా. 56 00:03:24,413 --> 00:03:26,540 నీ బలహీన రూపం చూసుకో. 57 00:03:26,624 --> 00:03:29,251 నీది నువ్వు ఊపుకోవడానికీ పనికిరాదు. 58 00:03:29,335 --> 00:03:30,628 ఊపడంలో సాయం చేస్తావా? 59 00:03:30,711 --> 00:03:34,173 ఆ. అబ్బే, లేదు. నీ... యబ్బ! 60 00:03:35,090 --> 00:03:37,343 ఓ చేయి ఇవ్వమన్నానంతే. 61 00:03:40,095 --> 00:03:43,933 వాక్స్, వాడికి ఇష్టమే అనుకుంటా! నేనిది ఉంచుకోవచ్చా? 62 00:03:45,142 --> 00:03:47,311 తాగుబోతులారా, అలా నుంచుని చూడకండి. 63 00:03:47,394 --> 00:03:48,771 వాళ్లను చంపెయ్యండి! 64 00:03:51,690 --> 00:03:55,569 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మాకినా 65 00:04:07,790 --> 00:04:09,208 -వాడిని చంపా! -వాడిని చంపా! 66 00:04:15,381 --> 00:04:17,424 -వస్తున్నా, పెర్సీ! -అయ్యో, వద్దు! 67 00:04:25,265 --> 00:04:27,685 పైక్, బంగారం, దారికి అడ్డుగా ఉండకుండా ఉంటావా? 68 00:04:27,768 --> 00:04:29,812 హేయ్, ఊరుకో! నా మీద పడ్డావు. 69 00:04:30,479 --> 00:04:31,772 అది నేను చూసుకుంటా. 70 00:04:32,856 --> 00:04:34,400 పర్వాలేదులే, సోదరా. 71 00:04:46,412 --> 00:04:50,165 మనం తాగేందుకు బయటకు వెళ్లిన ప్రతిసారీ ఎందుకిలా జరుగుతుంది? 72 00:04:57,089 --> 00:04:59,800 మంచి బాలుడు, ట్రింకెట్. ఇదుగో ఇక్కడ! 73 00:05:06,890 --> 00:05:08,684 గ్రాగ్, పక్కకు జరుగు! 74 00:05:09,852 --> 00:05:12,438 -అయ్యో. -అసలు స్కాన్లన్ ఎక్కడ? 75 00:05:17,401 --> 00:05:20,070 నా ప్రేయసి పువ్వను పెకలిస్తాను నేను 76 00:05:20,154 --> 00:05:22,823 నా ప్రియా, ఇదే మనకు ఆ సమయం... 77 00:05:23,490 --> 00:05:27,953 అబ్బా ఛ! పెర్సీ, అరేయ్? నీవు మాతో చేరాలంటే, మొదట అడగాలి. 78 00:05:28,037 --> 00:05:29,830 స్కాన్లన్, నాకు తెలిసి ఉండాల్సింది. 79 00:05:29,913 --> 00:05:31,999 ప్యాంట్ వేసుకుని, మాకు సాయపడతావా? 80 00:05:36,712 --> 00:05:38,630 మీకు నాతో వేళాకోళంగా ఉంది! 81 00:05:39,548 --> 00:05:40,632 ఆపండి! 82 00:05:42,301 --> 00:05:46,847 మొదట, మీరు నా మందంతా తాగేశారు, తర్వాత సారాయి అంగడి నాశనం చేశారు. 83 00:05:46,930 --> 00:05:50,059 ఇక ఆ పొట్టి వెధవ నా కూతురుతో ఏం చేస్తున్నాడు? 84 00:05:51,643 --> 00:05:53,437 అది నీకు తెలియకపోవడమే మంచిది. 85 00:05:54,229 --> 00:05:56,106 దీనంతటికీ ఎవరు డబ్బు కడతారు? 86 00:05:56,190 --> 00:05:59,735 అయ్యో, ఎంతటి దారుణం! కచ్చితంగా భీకరంగా జరిగింది. 87 00:05:59,818 --> 00:06:03,530 కానీ భరోసా ఇస్తాను, బంగారం, బాధ్యులను వాక్స్ మాకినా కనిపెట్టి... 88 00:06:03,614 --> 00:06:07,076 ఆ ప్రయత్నం కూడా చేయకు. డబ్బు. ఇప్పుడే. 89 00:06:07,159 --> 00:06:08,535 సరే, చూడండి... 90 00:06:09,078 --> 00:06:13,165 మా దగ్గర అస్సలు డబ్బు లేదు, ప్రమాణం, కానీ మీరు మాకు ఐదు... 91 00:06:17,711 --> 00:06:19,755 హలో? సరే, వినండి. 92 00:06:20,756 --> 00:06:23,634 -ధన్యవాదాలు, మెచ్చుకుంటా! -బయటే చావండి! 93 00:06:25,511 --> 00:06:29,515 ఎమాన్‌లో ప్రతి సారాయి అంగడి నుంచి మనల్ని నిషేధించారని దీని అర్థమా? 94 00:06:30,265 --> 00:06:31,642 చాలా బాగుంది. 95 00:06:31,725 --> 00:06:35,896 మనకు డబ్బు లేదు, ఉండే చోటు లేదు, ఏ అవకాశం కూడా లేదు. 96 00:06:35,979 --> 00:06:38,690 సరే, బహుశా మనల్ని చివరగా నియమించుకున్న వ్యక్తి 97 00:06:38,774 --> 00:06:40,609 తలను ఎవరైనా తెంచుండకపోతే... 98 00:06:40,692 --> 00:06:42,569 సరే, నేను క్షమాపణ చెప్పా, కదా? 99 00:06:42,653 --> 00:06:47,574 మనకు కొండంత అప్పు ఉంది, ఇంకా, అబ్బా, మన దగ్గరున్నది మూడు నాణేలు. 100 00:06:47,658 --> 00:06:50,285 మనకు పని కావాలి. ఏదైనా సరే, ఈ సమయంలో. 101 00:06:50,369 --> 00:06:53,038 అంటే, మోసగాళ్ల నుంచి బళ్లను రక్షించడం, 102 00:06:53,122 --> 00:06:55,999 బంగారం కోసం గాబ్లిన్‌లను చంపడం మనకేమీ ఉపయోగపడదు. 103 00:06:56,667 --> 00:07:01,964 బహుశా, మనం ఈసారి ఏదైనా మంచి పని ప్రయత్నించాలేమో? 104 00:07:03,173 --> 00:07:04,508 -లేదు. -విసుగు. 105 00:07:04,591 --> 00:07:08,512 పైక్, నీతులు ఖరీదైనవి ఇప్పుడు మనం వాటిని భరించలేం. 106 00:07:09,596 --> 00:07:14,935 మనం ఇలా చేయకూడదేమో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 107 00:07:15,018 --> 00:07:17,896 నా ఉద్దేశ్యం, వెక్స్, వాక్స్ తమ గురించే ఆలోచిస్తారు. 108 00:07:17,980 --> 00:07:19,189 సర్లే, పోరా. 109 00:07:19,273 --> 00:07:21,150 గ్రాగ్ అందరినీ హత్య చేయాలంటాడు. 110 00:07:21,233 --> 00:07:22,192 చాలా ఎక్కువగా. 111 00:07:22,276 --> 00:07:26,155 మనం జనాల్లో కనిపించకూడదని పెర్సీ భావిస్తాడు. ఇంకా స్కాన్లన్... 112 00:07:26,238 --> 00:07:27,948 ఈ లోకంలో అందరితో పడుకోవాలంటాడు. 113 00:07:28,031 --> 00:07:31,034 అవును, నీవలా చెప్పవచ్చు, కీలెత్. నేను సిగ్గు పడను. 114 00:07:31,535 --> 00:07:35,622 నిజాయితీగా ఉంటే, మనం అసలెందుకు కలిసున్నాం? 115 00:07:39,126 --> 00:07:44,173 సరే, మీరంతా ఇలా పిచ్చవాగుడు కొనసాగిస్తే నేనెళ్లి ఉచ్చ పోసుకుని వస్తాను. 116 00:07:49,970 --> 00:07:51,221 హమ్మయ్య. 117 00:07:52,472 --> 00:07:54,016 కావలెను - కిరాయి వధకులు బహుమానం 118 00:07:54,892 --> 00:07:56,643 -క్షమాపణలు! -అసలు నీకు... 119 00:07:56,727 --> 00:08:00,898 -అప్పుడప్పుడు నీ ఇష్టానుసారంగా ఉంటావు. -అసలు నీకేమైంది? ఊరుకో! 120 00:08:02,691 --> 00:08:05,694 ఇదే! ఇదే మన ప్రయోజనం. 121 00:08:05,777 --> 00:08:10,657 న్యాయం, కీర్తి కోసం పోరాడడం, రాజ్యాన్ని ఇతరులను కాపాడడం. 122 00:08:10,741 --> 00:08:14,578 ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా, బోలెడంత... 123 00:08:14,661 --> 00:08:16,455 డబ్బు! 124 00:08:24,963 --> 00:08:28,091 మనం నిజంగానే సార్వభౌమాధికారిని ఇలా కలుస్తున్నామా? 125 00:08:28,508 --> 00:08:29,426 ఆగండి! 126 00:08:32,262 --> 00:08:35,974 సరే, మిమ్మల్ని లోపలకు తీసుకెళతాం. కానీ ఎలుగుబంటి బయటే ఉంటుంది. 127 00:08:43,982 --> 00:08:46,693 పర్వాలేదు, బుజ్జీ. మేము త్వరగా వచ్చేస్తాం. 128 00:08:50,864 --> 00:08:54,493 లేడీ కీమా, మనతో ప్రభువు, లేడీ బ్రయర్‌వుడ్ చేరడం ముఖ్యం. 129 00:08:54,576 --> 00:08:57,371 ప్రభూ, నెలలుగా వైట్‌స్టోన్ నుంచి ఏం తెలియలేదు. 130 00:08:57,454 --> 00:08:59,831 -మన్నించండి? -మన చివరి దూత తిరిగి రాలేదు. 131 00:08:59,915 --> 00:09:03,085 వాళ్లు ఈ దాడులను హెచ్చరించాల్సింది. మరో రక్షకభటుడిని పంపండి. 132 00:09:08,131 --> 00:09:10,050 క్షమించండి, అసలు మీరు ఎవరు? 133 00:09:10,133 --> 00:09:14,304 వాక్స్ మాకినా. చూడండి, అది నిజానికి పదాలతో అల్లిన తెలివైన పదబంధం... 134 00:09:14,388 --> 00:09:16,139 నిజానికి, మేము పట్టించుకోము. 135 00:09:16,223 --> 00:09:20,269 ప్రభూ, ఈమాన్‌లో చెత్తను ఈ నోటీసులు ఆకర్షిస్తాయని హెచ్చరించాను. 136 00:09:20,352 --> 00:09:21,561 నిన్ను మన్నించాలా? 137 00:09:21,645 --> 00:09:25,357 ఇంత ఘోరమైన శత్రువు కోసం మరింత నిలకడ కావాలని సర్ ఫిన్స్ ఉద్దేశ్యం... 138 00:09:25,440 --> 00:09:29,111 క్రెయిగ్, ఈ తాగుబోతు బఫూన్లను పట్టించుకోకండి. భటులారా! 139 00:09:30,862 --> 00:09:35,951 బఫూన్లా? స్పష్టంగా, మీరు వాక్స్ మాకినా గొప్పదనం గురించి వినలేదు. 140 00:09:36,034 --> 00:09:39,079 మీకు తగిన పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి. 141 00:09:39,162 --> 00:09:40,539 దేవుడా! ఇక వినండి. 142 00:09:40,622 --> 00:09:43,417 ఉత్తమ యోధులను ప్రయత్నించారు ప్రభువు 143 00:09:43,500 --> 00:09:46,086 ఎన్నో సాహసాలను చేశారు ఆయన 144 00:09:46,169 --> 00:09:49,006 కానీ ఈ విషయం చెప్పి తీరాలి మీకు 145 00:09:49,089 --> 00:09:53,093 ఇంత అర్హత గల వారిని మీరు కలవలేదని 146 00:09:54,720 --> 00:09:58,056 అడిగో గ్రాగ్, మా భారీకాయుడు సరళమైన మనసు గల దృఢకాయుడు 147 00:09:58,140 --> 00:10:01,101 ఇక పెర్సీ పేల్చే తుపాకీ పేల్చేయగలదు మీ బుర్రను 148 00:10:01,518 --> 00:10:04,813 కోపం లేదు ప్రకృతికి అచ్చం కీలెత్ మాదిరి 149 00:10:04,896 --> 00:10:08,942 మొక్కలు, జంతువులను నియంత్రించే తనొక మాయాజాల సఫారీ 150 00:10:09,026 --> 00:10:10,819 వెక్స్, వాక్స్ కవలలు 151 00:10:10,902 --> 00:10:13,822 పేల్చుతుంది ఆమె చీకటిలో దాగుతాడు అతను 152 00:10:13,905 --> 00:10:18,035 వాళ్లు రహస్యమైనా చాలా భయానకం ఎవరు ఎవరో పోల్చలేను 153 00:10:18,118 --> 00:10:19,494 -అతడు వాక్స్ -ఆమె వెక్స్ 154 00:10:19,953 --> 00:10:23,498 పైక్ దైవత్వం వరిశుద్ధం ఆమె చేతులెప్పడూ చేస్తాయి చికిత్స 155 00:10:23,582 --> 00:10:26,835 ఓహో, మాకో ఎలుగుబంటి ఉందన్నానా? ట్రింకెట్, చిన్న విషయమే 156 00:10:26,918 --> 00:10:29,379 ఇక నా గురించి చెబితే నా పేరు స్కాన్లన్ 157 00:10:29,463 --> 00:10:31,298 పదునైన చురుకైన చేయి గలవాడిని 158 00:10:31,381 --> 00:10:32,758 నా సంగీతం గొప్పది అలరించేది 159 00:10:32,841 --> 00:10:34,468 ఎవరూ ఆగలేరు కుదురుగా ఉండలేరు 160 00:10:34,551 --> 00:10:35,886 మీ కూతుళ్లను దాచండి... 161 00:10:36,261 --> 00:10:37,179 క్షమించండి. 162 00:10:37,262 --> 00:10:40,432 మేము ధీరులైన యోధులం నక్కల కంటే ఎంతో తెలివైనవాళ్లం 163 00:10:40,515 --> 00:10:42,225 అడిగితే తెలుస్తాయి మా దోపిడీలు 164 00:10:42,309 --> 00:10:48,231 ద లెజెండ్ ఆఫ్ వాక్స్... 165 00:10:48,899 --> 00:10:50,484 మాకినా! 166 00:10:51,068 --> 00:10:52,319 మీకెంతో ధన్యవాదాలు! 167 00:10:52,944 --> 00:10:54,404 సరే. 168 00:10:55,405 --> 00:10:59,493 మీ ఆత్రమైన బృందంపై చర్చించేందుకు మా కౌన్సిల్‌కు సమయం ఇవ్వండి. 169 00:10:59,576 --> 00:11:03,121 ఇంతటి కీలకమైన పని కోసం మీరు నిజంగా వాళ్లను పరిగణిస్తారా? 170 00:11:03,205 --> 00:11:06,625 సావరిన్, వాళ్లకున్న గుర్తింపు చాలా దారుణమైనది. 171 00:11:06,708 --> 00:11:08,752 సరే, వాళ్ల దగ్గరో ఎలుగు ఉంది. 172 00:11:08,835 --> 00:11:10,379 అది భయానకంగా కనిపిస్తోంది. 173 00:11:10,462 --> 00:11:12,047 ఇంకా ఆ పాట వినోదం ఇచ్చింది. 174 00:11:12,130 --> 00:11:14,341 వాళ్లకో అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? 175 00:11:14,424 --> 00:11:17,761 బహుశా ఈ యోధులు కనిపించే దానికంటే ఎక్కువ సత్తా గలవారేమో... 176 00:11:20,722 --> 00:11:24,935 సరే, అనుమానమే. ఏగర్ అస్సాసిన్‌లను మళ్లీ పిలుద్దాం. 177 00:11:25,644 --> 00:11:29,648 బార్‌లో జరిగిన గొడవలో ఏగర్ చేయి నరికివేయబడింది. 178 00:11:29,731 --> 00:11:30,774 అబ్బా, ఛ! 179 00:11:35,862 --> 00:11:38,615 మంచిది. మిమ్మల్ని నియమించాం, వాక్స్ మాకినా. 180 00:11:39,324 --> 00:11:41,034 ముఖ్యంగా నాకా ఎలుగు నచ్చడంవలన. 181 00:11:41,118 --> 00:11:43,662 చివరి దాడి జరిగిన షేల్ స్టెప్స్ గ్రామ సమీపానికి 182 00:11:43,745 --> 00:11:45,831 లేడీ అల్యూరా మీకు తోడుగా వస్తుంది. 183 00:11:47,541 --> 00:11:52,337 అయితే, మేము దేన్ని చంపుతున్నాం, ఇంకా మాకు ఎంత లభిస్తుంది? 184 00:11:52,421 --> 00:11:56,425 మీరు దేన్ని చంపుతారో మాకు తెలియదు, కానీ చంపిన తర్వాత, ఇదంతా మీదే. 185 00:11:59,302 --> 00:12:02,681 మరొక ప్రశ్న. ఆ, మేమక్కడకు ఎలా వెళ్లాలి? 186 00:12:14,234 --> 00:12:16,403 అన్నా, చెబుతున్నా, నాకొకటి అనిపించింది. 187 00:12:16,486 --> 00:12:18,613 ఆ సింహాసనం ఉన్న గదిలోనే. 188 00:12:18,697 --> 00:12:20,407 నాకెన్నడూ అలా అనిపించలేదు... 189 00:12:20,490 --> 00:12:23,743 ఈ ఓడ అమోఘం కదా? కింద అంతస్తులో రెండు బాత్రూంలున్నాయి. 190 00:12:23,827 --> 00:12:26,705 మాకేదో వినబడనట్టుగా మీ ఇద్దరి గుసగుసలేంటి? 191 00:12:26,788 --> 00:12:29,332 ఓసారి నీ పని చూసుకుంటావా, పొట్టోడా? 192 00:12:30,834 --> 00:12:34,087 మీరు చూస్తున్నట్లుగా, ఈ జీవి ఇప్పటికే మూడు గ్రామాలను 193 00:12:34,171 --> 00:12:36,465 ఇంకా మైళ్ల కొద్దీ పొలాలను నాశనం చేసింది. 194 00:12:36,882 --> 00:12:40,594 ఈ రాకాసి ఇలాగే ఉంటే, రాజ్యమంతా ఆకలితో చనిపోతుంది. 195 00:12:41,761 --> 00:12:46,433 ఈ మిషన్ ప్రాణాంతకంగా అనిపిస్తోంది. మనం నిజంగా దీన్ని చేయాలా? 196 00:12:46,516 --> 00:12:48,602 అవును, ఈ పని ప్రమాదకరమే. 197 00:12:48,685 --> 00:12:52,022 అందుకే అత్యంత కీర్తి గల, ధీరోధాత్తమైన, నిజమైన... 198 00:12:52,105 --> 00:12:56,276 "కీర్తి, ధీరత్వం" అంతా బాగుంది, కానీ మనం డబ్బు కోసం ఒప్పుకున్నాం. 199 00:12:56,359 --> 00:13:01,448 అలాగా. సంపదకు, వ్యక్తిత్వానికి సవాలు. ఆశ్చర్యమేమీ కాదు. 200 00:13:12,918 --> 00:13:15,420 ఆ కొండ అవతలే షేల్ స్టెప్స్. మీకు మంచి జరగాలి. 201 00:13:15,504 --> 00:13:20,091 దయచేసి... అదేదో సామెత ఉంటుందిగా, దీన్ని చెడగొట్టకండి. 202 00:13:20,175 --> 00:13:23,637 చక్కని ప్రయాణానికి ధన్యవాదాలు. తర్వాత తీసుకెళతావు, కదా? 203 00:13:28,808 --> 00:13:30,560 అవును, ఆమె తిరిగొస్తుంది. 204 00:13:38,527 --> 00:13:39,986 ఇక్కడకొచ్చి ఏం చేస్తున్నాం? 205 00:13:40,070 --> 00:13:42,072 చివరి దాడి ఇక్కడకు దక్షిణంలోనే. 206 00:13:42,155 --> 00:13:44,908 ఇక్కడంతా అడిగి, ఎవరికైనా ఏమైనా తెలుసేమో చూడాలి. 207 00:13:44,991 --> 00:13:46,201 అంతా అడగాలి... 208 00:13:46,284 --> 00:13:47,869 వినండి, పచ్చని నేస్తాల్లారా? 209 00:13:48,203 --> 00:13:52,457 మీరు రాకాసి మంత్రగాళ్లు, భారీ రాక్షసులు ఇటు వెళ్లడం చూశారా? 210 00:13:52,874 --> 00:13:54,417 -ఏంటి? -అది వింతగా ఉంది. 211 00:13:55,961 --> 00:13:57,879 కాదు, చాలా మంచు ఉంది. 212 00:13:57,963 --> 00:14:00,966 మేము చూసినది కారు మేఘాలు, మెరుపులే. 213 00:14:01,049 --> 00:14:02,717 అది తుఫాను అనుకున్నాం. 214 00:14:03,343 --> 00:14:05,011 మీరు ఏమీ చూడలేదా? 215 00:14:05,095 --> 00:14:09,599 భలే దాటవేత, చేపలబాబూ, అది నీ నిజమైన పేరే అయితే. 216 00:14:09,683 --> 00:14:13,228 సరే. ఈ విషయం నన్ను చూడనివ్వు, స్కాన్లన్. 217 00:14:13,311 --> 00:14:15,605 అతని విషయంలో క్షమించు. 218 00:14:15,689 --> 00:14:17,816 మీరు ప్రార్థనలు చేస్తారు, కదా? 219 00:14:17,899 --> 00:14:20,735 మా ఇంటిని దీవిస్తారా? రాకాసి నుంచి రక్షిస్తారా? 220 00:14:20,819 --> 00:14:22,612 దీవెనా? సరే, తప్పకుండా. 221 00:14:22,988 --> 00:14:24,322 సమస్యేమీ లేదు. 222 00:14:24,739 --> 00:14:26,366 సరే, ఇదిగో చేద్దాం. 223 00:14:27,742 --> 00:14:31,830 ఆ కాంతి దేవత మీ ఇంటిపై వెలుగొందాలి. 224 00:14:31,913 --> 00:14:34,457 అన్నీ పుష్కలంగా లభించాలి. 225 00:14:34,541 --> 00:14:39,170 సరే, మీరు ఈ కీలక సమయాన్ని తట్టుకుంటారని నా నమ్మకం, మంచి జరగాలి అంతేగా? 226 00:14:40,630 --> 00:14:43,425 మీరు నిజంగానే పవిత్ర వ్యక్తేనా? 227 00:14:43,508 --> 00:14:45,677 అవును, కాస్త సాధన తప్పింది. 228 00:14:45,760 --> 00:14:48,013 ఈ మధ్యన ఎక్కువ ఇళ్లను దీవించడం లేదు. 229 00:14:48,388 --> 00:14:50,098 ధన్యవాదాలు, బంగారం. 230 00:14:50,181 --> 00:14:53,018 మా ఇంటిని సురక్షితంగా ఉంచేందుకు ఇది సరిపోతుందిలే. 231 00:14:59,024 --> 00:15:00,442 మీరు గారడీ వాళ్లా? 232 00:15:01,276 --> 00:15:04,237 కాదు, గారడీ అంతా చేతుల్లోనే ఉంటుంది, బాబూ. 233 00:15:07,282 --> 00:15:09,784 ఇప్పుడు, ఇది నీ చేతుల్లో. 234 00:15:11,369 --> 00:15:13,622 అది నిజమైన వెండి. జాగ్రత్తగా ఉంచుకో. 235 00:15:13,705 --> 00:15:15,415 ఇక్కడో రాక్షసి తిరుగుతోంది. 236 00:15:15,498 --> 00:15:17,292 -అంటే ఎగరడం. -అదేంటి? 237 00:15:17,375 --> 00:15:20,920 ఏదో మా పైనుంచి ఎగిరింది. అది కొండపై పెద్ద చెట్టును పడేసింది. 238 00:15:21,004 --> 00:15:24,257 రెక్కలు కొట్టుకోవడం విన్నాం, కానీ తుఫానులో మాకేమీ కనిపించలేదు. 239 00:15:24,341 --> 00:15:26,760 కానీ అది పెద్దది. చాలా పెద్దది. 240 00:15:26,843 --> 00:15:27,844 అవును. 241 00:15:34,934 --> 00:15:37,604 ఇటు రండి. ట్రింకెట్ ఏదో కనుగొంది! 242 00:15:40,023 --> 00:15:42,317 ఈ అడుగులు గుర్తించడానికి బురదగా ఉన్నాయి, 243 00:15:42,400 --> 00:15:46,154 కానీ అది గాలిలోకి లేచి తీరం వెంట ఎగిరినట్లుంది. 244 00:15:51,951 --> 00:15:53,328 నీకు అది అవసరం. 245 00:16:05,173 --> 00:16:07,634 ఇప్పడవి మనిషివిలా ఉన్నాయి. 246 00:16:13,181 --> 00:16:15,684 అది దగ్గరలోనే ఉంది. అందరూ, సిద్ధమవండి. 247 00:16:30,073 --> 00:16:31,700 ఈ సోది వదిలేయండి. 248 00:16:31,783 --> 00:16:34,577 ఏంటి, ఈ అల్లకల్లోలం వెనుక ఉన్నది ఓ గెర్రెనా? 249 00:16:34,661 --> 00:16:37,288 అది కరిచేలా చేయకు, వెక్స్. 250 00:16:50,009 --> 00:16:51,344 అబ్బా, ఛ! 251 00:16:53,471 --> 00:16:54,347 అబ్బో! 252 00:17:27,797 --> 00:17:29,716 మనం పరిగెట్టాలంటాను. వెంటనే! 253 00:17:29,799 --> 00:17:30,759 దాన్ని వదిలేయండి. 254 00:17:32,010 --> 00:17:33,303 మనం పోరాడదాం! 255 00:17:34,053 --> 00:17:36,514 గ్రాగ్, దరిద్రుడా, చచ్చు వెధవ. 256 00:17:44,564 --> 00:17:46,775 గ్రాగ్ అప్పుడే పడిపోయాడా? రండి! 257 00:18:02,332 --> 00:18:04,584 కీలెత్, కాస్త మాయాజాలం సహకరిస్తుంది! 258 00:18:04,667 --> 00:18:05,794 లేదు. 259 00:18:08,171 --> 00:18:10,006 మనమిప్పుడు తీవ్ర సమస్యలో ఉన్నాం. 260 00:18:11,216 --> 00:18:14,511 కీలెత్, దృష్టి మరల్చు. కీలెత్! కీలెత్! 261 00:18:14,594 --> 00:18:16,888 క్షమించండి. సరే. సరే. 262 00:18:39,953 --> 00:18:41,538 నేనింకా దారుణంగా మార్చానా? 263 00:18:50,255 --> 00:18:51,297 చూసుకోండి! 264 00:19:11,609 --> 00:19:15,697 నన్ను బయటకు తీయండి. బయటకు తీయండి! గ్రాగ్ పిర్రల కింద ఇరుక్కుపోయాను! 265 00:19:18,616 --> 00:19:22,161 అట్టడుగున ఉంటే ఇలా ఉంటుందన్న మాట. 266 00:19:24,330 --> 00:19:28,042 కనీసం మనం బతికున్నాం, కాంతిదేవతకు ధన్యవాదాలు. 267 00:19:28,126 --> 00:19:31,462 భారీ అడ్డుకు కీలెత్‌కు ధన్యవాదాలు చెప్పాలి. 268 00:19:31,546 --> 00:19:33,882 మరీ అంత దారుణం చేయాలా? 269 00:19:33,965 --> 00:19:36,968 ఆ డ్రాగన్... మనం దాదాపు చనిపోయాం. 270 00:19:38,511 --> 00:19:41,264 మనం చావలేదు అంతే. నీ కారణంగానే, కీలెత్. 271 00:19:41,347 --> 00:19:43,850 నా మాట వినబడిందా? నీ కారణంగానే బతికున్నాం. 272 00:19:46,603 --> 00:19:48,479 గ్రాగ్! నీకు గాయమైంది! 273 00:19:48,563 --> 00:19:51,649 లేదు, చీరుకుపోయింది అంతే, పెద్ద గాయం కాదు. 274 00:19:51,733 --> 00:19:53,610 ఓ ప్రశ్న, ఇది సాధారణమేనా? 275 00:19:53,693 --> 00:19:55,695 -కాదు. -నేను కక్కేలా ఉన్నాను. 276 00:19:55,778 --> 00:19:58,656 నిలకడగా ఉండు, ముసలి నేస్తం. నేనున్నాను. 277 00:20:04,329 --> 00:20:06,623 నాకప్పుడే నయంగా అనిపిస్తోంది. 278 00:20:06,706 --> 00:20:08,750 ధన్యవాదాలు, పైక్. నీవు మంచిదానివి. 279 00:20:09,542 --> 00:20:12,754 -ఆ పని నాలో శక్తి నశింపజేసింది. -నిన్ను పట్టుకున్నాను. 280 00:20:14,005 --> 00:20:15,173 ధన్యవాదాలు. 281 00:20:15,673 --> 00:20:18,217 సరే, ఇక నన్ను కిందకు దించవచ్చు. 282 00:20:18,301 --> 00:20:20,178 సరే. సరే. 283 00:20:21,220 --> 00:20:24,015 ఇక, యురియెల్‌ను ఇంకా ఇదంతా వదిలేద్దాం. 284 00:20:24,098 --> 00:20:27,143 ఇక్కడ మన పని అయిపోయింది. మనం చావు కోసం సంతకం చేయలేదు. 285 00:20:27,226 --> 00:20:30,271 మనం కౌన్సిల్‌కు మాటిచ్చామని నీకు గుర్తు చేయాలా? 286 00:20:30,355 --> 00:20:32,315 దానికి బహుశా ఏదైనా విలువ ఉండాలి. 287 00:20:32,398 --> 00:20:35,026 ఆ కౌన్సిల్ గురించి పట్టించుకునేది ఎవడు? 288 00:20:35,109 --> 00:20:38,738 నేను పట్టించుకునే ఒకే మాట స్కాన్లన్ షార్ట్‌హాల్ట్. 289 00:20:38,821 --> 00:20:42,158 ఇంకా, ఔను, రెండు పదాలని తెలుసు, కానీ ఏమంటున్నానో తెలుసుగా. 290 00:20:42,241 --> 00:20:45,495 ఔను, ఆ పనికి మాలిన కౌన్సిల్ మనకెపుడూ ఏం చేయలేదుగా? 291 00:20:45,578 --> 00:20:49,540 మనకు పని ఇచ్చి, బోలెడంత బంగారం, నిధి, మిగతావి ఇవ్వడం మినహా? 292 00:20:49,624 --> 00:20:51,960 మనం చాలావాటితో పోరాడాము. 293 00:20:52,043 --> 00:20:55,004 కానీ డ్రాగన్‌తో? నిజమైన డ్రాగన్‌తో. 294 00:20:55,088 --> 00:20:57,799 ఇది కౌన్సిల్ లేక ఒప్పందం గురించి కాదు. 295 00:20:57,882 --> 00:21:01,052 ఇది ప్రజల గురించి. వాళ్లకు మన అవసరం ఉంది. 296 00:21:01,135 --> 00:21:02,679 మనం ఊరికినే పారిపోలేము. 297 00:21:02,762 --> 00:21:05,139 పవిత్ర వ్యక్తులతో ప్రయాణం నాకు అందుకే అసహ్యం. 298 00:21:05,223 --> 00:21:06,724 వాళ్లు మరీ మంచివారు. 299 00:21:06,808 --> 00:21:10,520 పైక్, ఆ జీవి మన శక్తికి మించినది. 300 00:21:10,603 --> 00:21:14,732 వాక్స్, నేను చిన్న వయసులో ఉండగా, ఈ రాకాసులలో ఒకటి మా అమ్మను చంపింది. 301 00:21:14,816 --> 00:21:18,611 నా జీవితమంతా డ్రాగన్లపై చదివాను, ఆ పని చేసినదాన్ని కనిపెట్టాలనే ఆశతో. 302 00:21:18,695 --> 00:21:21,656 అవి దగ్గరగా ఉన్నప్పుడు నాకు తెలుస్తోంది. 303 00:21:21,739 --> 00:21:24,117 నా తలలో తీవ్రమైన నొప్పిగా ఉంటోంది. 304 00:21:24,200 --> 00:21:27,996 తర్వాత అది సర్దుకుంది. మనం రాజభవనానికి వెళ్లి, ఒప్పందం నుంచి బయటపడదాం. 305 00:21:28,079 --> 00:21:29,664 నీకు అర్థం కాలేదు, పెర్సీ. 306 00:21:29,747 --> 00:21:32,375 అక్కడా అలానే అనిపించింది. రాజభవనంలో. 307 00:21:32,458 --> 00:21:34,544 మాకా విషయం ఇప్పుడు చెబుతున్నావా? 308 00:21:34,627 --> 00:21:36,212 నన్ను క్షమించు. నేను... 309 00:21:36,963 --> 00:21:40,842 డ్రాగన్‌ని చేరేవరకు నిశ్చయంగా లేను... అమ్మ చనిపోయి చాలా కాలమైంది... 310 00:21:40,925 --> 00:21:43,803 -కచ్చితంగానా, వెక్స్ఆలియా? -నా భావన నాకు తెలుసు. 311 00:21:43,886 --> 00:21:47,598 కౌన్సిల్‌లో ఎవరో డ్రాగన్‌తో ఒప్పందంలో ఉండవచ్చు, లేదా... 312 00:21:47,682 --> 00:21:50,768 తెలియదు, కానీ అది నిజంలానే అనిపిస్తోంది. 313 00:21:51,185 --> 00:21:53,271 అయితే మనం దీనంతటి నుంచి వెళ్లిపోవాలి. 314 00:21:53,813 --> 00:21:55,064 దానివలన ఏం ఉపయోగం లేదు. 315 00:21:55,148 --> 00:21:58,443 మీరు తన మాట విన్నారు, వాళ్లలో ఒకరు రాకాసితో ఉన్నారు. 316 00:21:58,526 --> 00:22:03,197 మనం దీని నుంచి బయటపడి, ఈమాన్‌లో మళ్లీ అడుగు పెట్టవద్దు. 317 00:22:04,032 --> 00:22:05,575 మనం దీనికి ఒప్పుకున్నట్టేనా? 318 00:22:42,445 --> 00:22:44,363 షేల్స్ 319 00:22:49,494 --> 00:22:50,912 అయ్యో. 320 00:22:53,915 --> 00:22:55,500 అది వాళ్లను తుడిచిపెట్టేసింది. 321 00:22:55,583 --> 00:22:57,126 అందరినీ. 322 00:23:44,382 --> 00:23:46,300 పైక్! ఇటు వైపు రా. 323 00:23:50,304 --> 00:23:54,308 దయచేసి, కాంతిదేవతా. నీ శక్తి ఇతన్ని చేరనివ్వు. 324 00:23:54,392 --> 00:23:56,561 పైక్, దయచేసి... 325 00:23:56,644 --> 00:24:00,273 ఛ! లేదు! నేనీ పని చేయలేను. 326 00:24:00,356 --> 00:24:02,358 ఇందాక చేశాక ఇంకా నీరసంగా ఉన్నాను. 327 00:24:12,994 --> 00:24:14,620 మనం దీన్ని ఆపాల్సింది. 328 00:24:15,872 --> 00:24:17,373 ఆపి ఉండాల్సింది. 329 00:24:24,755 --> 00:24:26,966 అసలు నువ్వేం చేస్తున్నావు, స్కాన్లన్? 330 00:24:27,049 --> 00:24:29,510 "చచ్చిన డ్రాగన్" కోసం పాట ఆలోచిస్తున్నా. 331 00:24:30,136 --> 00:24:33,222 కారణం నేను... మనం దాన్ని చంపగలమని ఆశిస్తున్నాను. 332 00:24:33,306 --> 00:24:34,599 నేను వస్తాను. 333 00:24:35,892 --> 00:24:39,854 నా ఉద్దేశం, అబద్ధం చెప్పను, నాకు మనసులో భయమే, అయినా వస్తాను. 334 00:24:39,937 --> 00:24:42,440 నాకు ఓడిపోవడం నచ్చదు, 335 00:24:42,523 --> 00:24:46,319 కానీ నాకు లోపలి విషయాలు తెలుస్తున్నాయి. 336 00:24:46,903 --> 00:24:49,447 అవి సరిగా అనిపించడం లేదు. 337 00:24:49,530 --> 00:24:52,033 అందుకే, ఔను, నేనూ వస్తాను. 338 00:24:52,116 --> 00:24:55,411 గ్రాగ్, ఆ మాట బాగా చెప్పావు. 339 00:24:55,494 --> 00:24:56,787 ఏమిటది? 340 00:24:56,871 --> 00:24:59,332 పట్టించుకోకు. నేనూ వస్తాననే లెక్కించండి. 341 00:24:59,415 --> 00:25:02,752 అందరూ వినండి, మనం ఇది చేస్తున్నాం. 342 00:25:02,835 --> 00:25:06,047 మనం అందరం ఘోరమైన చావు చస్తామని మీరంతా గ్రహించాలి. 343 00:25:06,130 --> 00:25:07,215 కావచ్చు, చెల్లీ. 344 00:25:08,382 --> 00:25:10,635 కానీ మన చావుకు కీర్తి ఉంటుంది. 345 00:25:11,469 --> 00:25:13,888 ఇంకా మనం ఆ చెత్త డ్రాగన్‌ను చంపేస్తాం. 346 00:26:01,602 --> 00:26:03,604 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 347 00:26:03,688 --> 00:26:05,690 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్వరరావు వలవల