1 00:00:13,263 --> 00:00:16,143 ఆ ఇంక్ పెన్ ఇంకాస్త ఎడమ వైపుకు ఉండాలనుకుంటాను. 2 00:00:16,225 --> 00:00:18,475 బల్ల మీద ఒక కాఫీ మగ్గు ఉన్నట్టు గుర్తు. 3 00:00:18,560 --> 00:00:20,850 -నీకు ఖచ్చితంగా తెలుసా? -అవును, అది నాకు కూడా గుర్తుంది. 4 00:00:20,938 --> 00:00:22,858 నువ్వన్నది నిజమే. ఇదే. 5 00:00:25,943 --> 00:00:27,613 స్పార్కిల్ జ్ఞాపకంలో ఆఫీసుకు సంబంధించి 6 00:00:27,694 --> 00:00:31,574 ప్రతీ చిన్న వివరం గుర్తుండేలా మీరు చాలా జాగ్రత్త పడాలి. 7 00:00:31,657 --> 00:00:33,407 అవును, ప్రతీ వివరం కూడా ముఖ్యమైనదే. 8 00:00:33,492 --> 00:00:36,832 రూబెన్ చాలా చక్కగా గీస్తాడు, నాకు గుర్తున్నదాన్ని సరిగ్గా గీశాడు. 9 00:00:37,663 --> 00:00:41,123 మహిళా సంఘం చేసే కవాతులకి సైన్ బోర్డుల కోసం మనం ఇతని కళానైపుణ్యాన్ని వాడుకోవచ్చు. 10 00:00:41,500 --> 00:00:43,710 మహిళలకి ఓటు హక్కు దక్కాలని మీరు కవాతు చేశారు కదా? 11 00:00:43,794 --> 00:00:46,174 మా ఉద్యమం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 12 00:00:46,588 --> 00:00:49,508 ఇక చూస్తుంటే, మా శ్రమ ఫలించినట్టుగానే అనిపిస్తోంది. 13 00:00:49,591 --> 00:00:50,591 అవును. 14 00:00:50,676 --> 00:00:53,716 ఈకాలంలో మహిళలు పదవులకి పోటీ కూడా చేయవచ్చు. నేను విద్యార్థి సంఘానికి చేస్తున్నట్టుగా. 15 00:00:53,804 --> 00:00:56,934 ఈ విద్యార్థి సంఘం గురించి నువ్వు నాకు వివరించాలి. ఏదో గొప్పదిలా ఉంది. 16 00:00:58,100 --> 00:01:01,350 ఆ, మనం మేసన్ బ్రిగ్స్ తాలూకు కనబడకుండా పోయిన రాతపత్రిని వెతికే పనికి వచ్చేద్దామా? 17 00:01:01,436 --> 00:01:02,896 సరే. ఇప్పుడు మీ అమ్మమ్మకి ఎస్ నుండి 18 00:01:02,980 --> 00:01:05,690 వచ్చిన ఉత్తరం ఆల్బర్ట్ టైప్ రైటర్ నుంచి వచ్చిందని మనకి తెలుసు కనుక, 19 00:01:05,774 --> 00:01:09,904 ఆల్బర్ట్ / ఎస్ / మేసన్, తన పుస్తకాలను రాసింది ఈ గదిలోనే అయ్యుండొచ్చు. 20 00:01:10,237 --> 00:01:12,607 ఇదే ప్రదేశాన్ని మనం వాస్తవ ప్రపంచంలో కనిపెట్టగలిగితే, 21 00:01:12,698 --> 00:01:14,488 బహుశా ఆ ముద్రింపబడని రాతపత్రి అక్కడే ఉండవచ్చు. 22 00:01:14,575 --> 00:01:17,535 ఇక ఆ రాతపత్రిని మనం కనుక్కుంటే, మన దెయ్యానికి ఎట్టకేలకు శాంతి చేకూరుతుంది. 23 00:01:17,619 --> 00:01:19,999 ఇది నిజంగా ఒక అద్భుతమైన అంతుచిక్కని విషయం. 24 00:01:20,455 --> 00:01:22,705 మమ్మల్ని కూడా మీ దెయ్యం బాగస్థులని చేసినందుకు నాకు గర్వంగా ఉంది. 25 00:01:25,085 --> 00:01:26,295 అదీలెక్క. 26 00:01:28,213 --> 00:01:29,883 ఈ ప్రదేశాన్ని మనం కనుక్కోగలిగితే... 27 00:01:32,092 --> 00:01:33,592 మనకి రాతపత్రి దొరుకుతుంది. 28 00:01:46,648 --> 00:01:51,238 ఘోస్ట్ రైటర్ 29 00:01:54,615 --> 00:01:57,365 మనం 20 నిమిషాల నుండి ఈ చిత్రాన్నే తదేకంగా చూస్తున్నాం. 30 00:01:57,451 --> 00:01:58,661 అయిదు నిమిషాలే కదా అయింది. 31 00:01:58,744 --> 00:02:00,204 ఇరవై నిమిషాలు అయినట్టు అనిపిస్తోంది. 32 00:02:00,287 --> 00:02:02,077 అవును, ఇంకా ఏమీ దొరకలేదు. 33 00:02:02,164 --> 00:02:04,124 నేనే కనుక నా ఆఫీస్ లో ఉండుంటేనా. 34 00:02:04,208 --> 00:02:06,538 నా విశ్వాసబద్ధమైన కుర్చీలో కూర్చున్నప్పుడు నాకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. 35 00:02:08,211 --> 00:02:09,671 ఓ. నేను నీకు ఓ విషయం చెప్పాలి. 36 00:02:09,755 --> 00:02:12,585 నువ్వు లేనప్పుడు, నీ వస్తువులను కొన్నింటిని నేను అమ్మేశాను. 37 00:02:13,133 --> 00:02:14,343 కుర్చీ అమ్మలేదు కదా? 38 00:02:15,427 --> 00:02:18,137 -మన్నించు. -నాకు అలా జరగాలిలే. 39 00:02:18,222 --> 00:02:21,562 బల్ల మీద కాఫీ మగ్ ఉందని మనకి తెలుసు. అయితే అది ఉదయం పూట అయ్యుంటుందా? 40 00:02:21,642 --> 00:02:25,652 అవును, బాగా చెప్పావు. సూర్యుడు ఉదయించేది తూర్పు కనుక... 41 00:02:25,729 --> 00:02:30,229 -కిటికీ తూర్పు వైపు ఉండుండాలి. -ఇదంతా కాఫీ మగ్ ను చూసి చెప్తున్నారా? 42 00:02:30,692 --> 00:02:32,442 ఒక్క నిమిషం, బ్యాక్ గ్రౌండ్ ని చూడండి. 43 00:02:32,861 --> 00:02:34,401 అది సరస్సు అనుకుంటా. 44 00:02:34,488 --> 00:02:36,868 అది ఉయ్యాల బల్ల కదా? 45 00:02:36,949 --> 00:02:38,619 పురోగతి మొదలైంది. 46 00:02:38,700 --> 00:02:42,120 సరస్సును ఆనుకొని ఉన్న ప్రాంతాలు ఏమున్నాయో మనం చూడాలి. 47 00:02:42,204 --> 00:02:44,294 మంచి ఆలోచన. పాఠశాల అయ్యాక మేము సాయపడగలం. 48 00:02:48,460 --> 00:02:50,130 ఇంకా నా ఏయే వస్తువులను అమ్మావు? 49 00:02:50,587 --> 00:02:52,207 దాని గురించి ఆలోచించకపోవడమే మంచిది. 50 00:02:57,678 --> 00:02:59,678 లేదు, నిజంగానే. కర్టిస్, నేనూ, మేమిద్దరమూ కలిసి నిలబడుతున్నాం. 51 00:02:59,763 --> 00:03:01,013 నీ ఓటు మాకే అనుకోవచ్చా? 52 00:03:01,098 --> 00:03:04,388 పాఠశాలని తాజా సాంకేతికతో అప్ టు డేట్ గా ఉంచాలని మా అభిప్రాయం. 53 00:03:04,476 --> 00:03:05,686 తను చెప్పింది సత్యం. 54 00:03:08,939 --> 00:03:10,439 షెవాన్ అధ్యక్ష పదివి కోసం 55 00:03:12,317 --> 00:03:13,987 నాకు వాళ్ళతో మాట్లాడాలని లేదు. 56 00:03:14,069 --> 00:03:15,149 నువ్వు మాట్లాడాలి. 57 00:03:15,529 --> 00:03:17,989 -వాళ్లకి నేనంటే అసహ్యం. -అయితే ఆ భావాన్ని మార్చు. 58 00:03:26,331 --> 00:03:28,131 నేను నీకు ముందే చెప్పా కదా. నీకు నేను ఓటు వేయలేను. 59 00:03:28,208 --> 00:03:29,418 అది నాకర్థమైంది కూడా. 60 00:03:29,501 --> 00:03:32,711 -నీ మనస్సును మార్చగలనేమో అని వచ్చాను. -మన్నించు, నిన్ను నేను నమ్మలేను. 61 00:03:32,796 --> 00:03:34,206 -తను నాతో పాటుగా నిలబడితే? -నిజంగానా? 62 00:03:34,298 --> 00:03:36,678 షెవాన్ కి అవకాశం వస్తే, అసలు యూనిఫామ్ అనేదే లేకుండా చేస్తుంది. 63 00:03:36,758 --> 00:03:38,388 -అది నిజం కాదు. -అది నిజమే అనుకుంటా. 64 00:03:38,468 --> 00:03:40,888 ఆగు. నువ్వు తనని నమ్మవని నాకు తెలుసు, కానీ తన మీద నాకు నమ్మకుంది. 65 00:03:40,971 --> 00:03:44,851 నువ్వు మాకు ఓటేస్తే, క్రీడాకారులకి మేము మద్ధతు ఇస్తామని నేను మాటిస్తున్నాను. 66 00:03:46,143 --> 00:03:47,853 సరే. అలాగే. 67 00:03:48,854 --> 00:03:50,064 అయితే... 68 00:03:50,981 --> 00:03:52,521 నీ ఓటు మాకే అనుకోవచ్చా? 69 00:03:54,735 --> 00:03:56,355 అలాగే, అనుకుంటా. 70 00:03:56,904 --> 00:03:59,744 తన తరఫున నువ్వు హామీ ఇస్తే, కర్టిస్, నాకు అది చాలు. 71 00:04:10,667 --> 00:04:11,787 మిస్టర్ మెండోజా? 72 00:04:12,377 --> 00:04:14,837 -స్లోన్ వచ్చిందా? -తనకి బాగాలేదని ఇంటికి వెళ్లింది. 73 00:04:17,089 --> 00:04:19,799 దుకాణంలో మేము ఇవాళ చాలా మంచి మంచి పుస్తకాలను చూశాం. 74 00:04:19,885 --> 00:04:21,965 స్థానిక చరిత్రతో, నగరంలోని ప్రాంతాల మ్యాపులతో అవి నిండి ఉన్నాయి. 75 00:04:22,053 --> 00:04:25,143 స్పార్కిల్ నివాసం ఉండే ప్రదేశాన్ని మీరు కనుగొన్నారని మీకనిపిస్తుందా? 76 00:04:25,224 --> 00:04:27,564 మనం అదే తెలుసుకోపోతున్నాం మరి. 77 00:04:31,021 --> 00:04:32,731 ఇక్కడేదో కాలువ ఉన్నట్టుంది. 78 00:04:32,814 --> 00:04:35,154 కానీ స్పార్కిల్ వ్యూ లో కాలువ లేదే. 79 00:04:35,234 --> 00:04:36,574 బహుశా ఇది కొత్తగా కట్టారేమో? 80 00:04:36,652 --> 00:04:38,452 అలా అనిపించడం లేదు. చూడండి. 81 00:04:39,780 --> 00:04:42,570 "ఇది 1930లలో మానవులచే నిర్మితమైన ఒక కాలువ." 82 00:04:43,367 --> 00:04:44,907 ఇక్కడి ఇళ్ళు కొత్తవిలా ఉన్నాయి. 83 00:04:47,788 --> 00:04:51,788 ఇక్కడ సరస్సు కనబడుతుంది కానీ, ఊయలలు కానీ బల్లలు కానీ కనబడటం లేదు. 84 00:04:52,167 --> 00:04:54,667 -మనం వెతకాలేమో. -ఇదే అది అని నాకు అనిపించడం లేదు. 85 00:04:54,753 --> 00:04:56,673 -మనకి కావలసినవి ఇక్కడ ఏమేమి లేవు? -దిగాలు పడిపోకు, షిర్ల్, 86 00:04:56,755 --> 00:04:58,335 మనం కనిపెట్టగలములే. 87 00:04:58,841 --> 00:05:02,091 ఆ. నీకు ఎప్పుడు ఏం చెప్పాలో బాగా తెలుసు. నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో? 88 00:05:02,177 --> 00:05:04,257 వాళ్లు ఇద్దరూ కొట్టుకుంటున్నప్పుడే బాగుంది. 89 00:05:04,346 --> 00:05:05,556 రండి. 90 00:05:08,392 --> 00:05:09,892 ఇది నాకు చికాకు తెప్పిస్తోంది. 91 00:05:09,977 --> 00:05:12,477 ఏదో మనకి తెలియడం లేదు. ఏదో పెద్ద విషయం. 92 00:05:12,563 --> 00:05:14,313 బహుశా మనం వేరేదేదైనా ఆలోచించాలేమో? 93 00:05:14,398 --> 00:05:16,688 మనం అస్సలు ఊహించనప్పుడే మంచి పురోగతి లభిస్తుంది. 94 00:05:18,193 --> 00:05:20,703 పొద్దుపోయింది కదా? మీ అమ్మ ఈపాటికి ఇంటికి వచ్చేసుండాలి కదా? 95 00:05:21,572 --> 00:05:22,662 అవును అనుకుంటా. 96 00:05:22,739 --> 00:05:25,159 బహూశా, వచ్చేటప్పుడు ఏమైనా పక్కదారి పట్టుంటుందేమో. 97 00:05:25,701 --> 00:05:28,161 ఏమో, మా అమ్మ అంతగా పక్కదారి పట్టే రకం కాదు. 98 00:05:28,245 --> 00:05:29,705 మనం పోలీసులకి ఏమైనా కాల్ చేయాలా? 99 00:05:29,788 --> 00:05:31,708 లేదు, పోలీసులకి కాల్ చేయాల్సిన పని లేదు. 100 00:05:31,790 --> 00:05:33,670 -హేయ్. -నువ్వు వచ్చేశావు. 101 00:05:33,750 --> 00:05:36,800 ఆలస్యమైనందుకు మన్నించు. మా డేట్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంది. 102 00:05:36,879 --> 00:05:39,299 తను ఎక్కడికి వెళ్లిందో కనుక్కో. 103 00:05:39,381 --> 00:05:41,011 మరి, ఎక్కడికి వెళ్ళావు? 104 00:05:41,425 --> 00:05:45,545 డిన్నర్ కి నాకు నచ్చే సీఫుడ్ హోటల్ కి, సినిమాకి, తర్వాత డెసర్ట్ తినడానికెళ్ళాం. 105 00:05:46,180 --> 00:05:48,890 ఇంత పొద్దుపోయాక కాఫీ తాగుతున్నావే? 106 00:05:49,391 --> 00:05:50,681 ఇక్కడ తల్లి ఎవరు? 107 00:05:51,685 --> 00:05:53,935 -నువ్వే. -నేనూ అదే అనుకున్నాలే. 108 00:05:54,021 --> 00:05:55,401 నాకు కాఫీ అంటే ప్రాణం. 109 00:05:55,480 --> 00:05:58,190 నువ్వు పడుకోవడానికి వెళ్ళాక, మనం మన పుస్తక దుకాణాన్ని 110 00:05:58,275 --> 00:06:00,315 ఎలా సర్దాలా అని ఆలోచించే పని నాకు ఉంది. 111 00:06:00,402 --> 00:06:03,612 నువ్వు ఉదయం పూటే కాఫీ తాగేదానివి కదా. 112 00:06:05,699 --> 00:06:06,909 కానీ ఇది ఉదయం పూట కాదు. 113 00:06:07,367 --> 00:06:09,907 కాదు, కానీ ఇది పడుకొనే సమయం. 114 00:06:09,995 --> 00:06:11,495 పద, బాబూ. వెళ్లి పడుకో. 115 00:06:15,918 --> 00:06:18,168 ఇదంతా నువ్వు కాఫీ షాప్ నుండి తెచ్చిన కాఫీ కప్పు ద్వారా తెలుసుకున్నావా? 116 00:06:18,253 --> 00:06:19,763 ఆ కాఫీ ఉదయం పూట కాఫీ కాదు. 117 00:06:19,838 --> 00:06:22,878 ఉదయమంతా న్యాయవాదిగా పనిచేసి, రాత్రి పూట మేసన్ బ్రిగ్స్ నవలలను రాసే 118 00:06:22,966 --> 00:06:25,046 ఆల్బర్ట్ కోసం అది ఉద్దేశించబడింది అయ్యుంటుంది. 119 00:06:25,135 --> 00:06:27,255 రెండు జీవితాలు జీవించడమంటే మామూలు విషయం కాదు. 120 00:06:27,346 --> 00:06:29,846 -అయితే అది సూర్యాస్తమయమా, సూర్యోదయం కాదా? -అవును. 121 00:06:29,932 --> 00:06:33,522 ఇక నేను షెర్లాక్, వాట్సన్ కనుగొన్న పార్క్ సమాచారాన్ని మళ్లీ పరిశీలించాక, 122 00:06:33,602 --> 00:06:35,352 అది నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. 123 00:06:45,322 --> 00:06:46,742 ఊయల! 124 00:06:46,823 --> 00:06:50,413 నేను నమ్మలేకపోతున్నాను. మనం కనిపెట్టేశాం. ఇది స్పార్కిల్ నివాసం నుండి కనబడే దృశ్యం. 125 00:06:50,494 --> 00:06:53,714 ఇది అదరగొట్టే గూఢచర్య పని అని చెప్పవచ్చు. 126 00:06:54,373 --> 00:06:56,793 అదుగో అక్కడ. ఈ చిత్రానికి అత్యంత దగ్గరగా సరిపోయే వీక్షణ 127 00:06:56,875 --> 00:06:58,085 అ ఇంటి నుండి అయ్యుండవచ్చు. 128 00:06:58,168 --> 00:07:01,458 -అదే. మేసన్ అక్కడే నివాసముండి ఉంటాదు. -ఆ ఇంటి ఆకృతి కూడా సరిపోయింది. 129 00:07:01,547 --> 00:07:04,547 మనం లోపలికి వెళ్ళాలి. బహుశా అది ఎక్కడో దాచబడో లేదా పూడ్చబడో ఉంటుందేమో. 130 00:07:04,633 --> 00:07:05,683 అయితే ఇప్పుడు మనమేం చేయాలి? 131 00:07:05,759 --> 00:07:08,009 తలుపు దగ్గరికి వెళ్లి, ఒక దెయ్యం మనల్ని ఒక పాత రాతపత్రిని 132 00:07:08,095 --> 00:07:09,805 కనుక్కోమంది అని చెప్పి, ఇంటిని వెతకాలి అని అడగదామా? 133 00:07:10,180 --> 00:07:12,310 ఖచ్చితంగా అలాగే అడగాల్సిన పని లేదు. 134 00:07:12,391 --> 00:07:13,891 అక్కడ ఇప్పుడు ఎవరు ఉంటున్నారో. 135 00:07:23,777 --> 00:07:25,607 తనే కదా కోటు దొంగ? 136 00:07:25,696 --> 00:07:27,106 ఇది అస్సలు మంచి విషయం కాదు. 137 00:07:29,449 --> 00:07:31,329 తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది. 138 00:07:32,578 --> 00:07:34,198 తనే ఎందుకు అయ్యుండాలి? 139 00:07:39,918 --> 00:07:42,628 -తను నాతో మాట్లాడదు. -నువ్వు ప్రయత్నం చేయాలి. 140 00:07:42,713 --> 00:07:45,593 మనం చాలా చెమటోడ్చాం కదా? దానితో పోలిస్తే ఇది తేలికేలే. 141 00:07:45,674 --> 00:07:47,094 అయితే, నువ్వు వెళ్తావా? 142 00:07:48,135 --> 00:07:49,135 ఇప్పుడు కాదులే. 143 00:07:49,970 --> 00:07:50,970 మేము కూడా మీతో వస్తాం. 144 00:07:51,054 --> 00:07:53,064 మిస్టర్ సాండర్స్ క్లాస్, కదా? 145 00:07:53,140 --> 00:07:55,980 మీరు రావచ్చు, కానీ వెనక కూర్చొని వినండి, అంతే. 146 00:07:57,644 --> 00:07:59,064 ఓ, కర్టిస్... 147 00:08:00,439 --> 00:08:01,859 నీ ప్రసంగాన్ని నేను తయారు చేసేశాను. 148 00:08:05,194 --> 00:08:07,204 ఇది నేను చెప్పినట్టుగా అనిపించదు. 149 00:08:07,279 --> 00:08:08,359 ఏ భాగం? 150 00:08:08,447 --> 00:08:10,817 స్పోర్ట్శ్-ఇండస్ట్రియల్ సముదాయమా? 151 00:08:12,534 --> 00:08:13,744 దాన్ని మార్చగలనులే. 152 00:08:15,120 --> 00:08:17,710 "లాకర్ గదికి వెళ్దాం పదండి" అని మేము అనము. 153 00:08:17,789 --> 00:08:20,749 సరే. నాకు బాస్కెట్ బాల్ జ్ఞానమంతా సినిమాల నుండి వచ్చింది. 154 00:08:21,502 --> 00:08:23,632 నువ్వు ఒకసారి వచ్చి ఒక ఆటను చూడవచ్చు. 155 00:08:24,630 --> 00:08:26,840 నువ్వు దాన్ని నీ సొంతంగా రాయిలే. 156 00:08:27,883 --> 00:08:30,843 ప్రసంగంలో యూనిఫాం వేసుకుంటే మరీ అతిగా ఉండదా? 157 00:08:36,433 --> 00:08:37,983 నాకేదో పువ్వుల వాసన వస్తోంది. 158 00:08:38,059 --> 00:08:39,059 చరిత్ర క్విజ్ 159 00:08:39,144 --> 00:08:42,064 -ఏదైనా సెంట్ అయ్యుంటుంది. -అహా. షేవ్ అయ్యాక వేసుకొనేది. 160 00:08:42,606 --> 00:08:46,526 ఆ, అవును. అది ఇతని మెడ నుండి వస్తోంది. 161 00:08:47,319 --> 00:08:49,319 నేను టీచర్ల చోటును పరిశీలించినప్పుడు, 162 00:08:49,404 --> 00:08:53,584 మిస్టర్ సాండర్స్, లంచ్ లో టిఫిన్ బాక్స్ లో తెచ్చుకొన్న లెగ్ పీస్ తింటూ ఉన్నాడు. 163 00:08:55,327 --> 00:08:58,577 అది మెలిసా దగ్గరిది అని అతను అనడం నేను విన్నాను. 164 00:08:58,664 --> 00:08:59,794 మెలిసా ఎవరు? 165 00:08:59,873 --> 00:09:03,593 అదే కదా. వీళ్ళు డిన్నర్ కి సీ ఫుడ్ తిన్నారని రూబెన్ అమ్మ చెప్పింది. 166 00:09:03,669 --> 00:09:05,419 ఏమంటున్నావు, షిర్ల్? 167 00:09:05,504 --> 00:09:07,214 ఇతను రెండు సార్లు డిన్నర్ చేశాడా? 168 00:09:07,297 --> 00:09:09,547 అప్పుడే ఖచ్చితంగా చెప్పలేము కానీ ఇది ఆసక్తికరంగా ఉంది. 169 00:09:10,884 --> 00:09:13,054 జాగ్రత్త, వాట్సన్. ఇతడికి తనని దెయ్యం వెంటాడుతోందని అనిపించకూడదు. 170 00:09:13,136 --> 00:09:14,756 సరేమరి, సమయం అయిపోయింది. పెన్సిళ్లు పక్కకు పెట్టేయండి. 171 00:09:16,265 --> 00:09:18,475 ఇక మీ మధ్యాహ్నమంతా ఆనందంగా గడపండి. 172 00:09:24,523 --> 00:09:26,533 -నేను నీతో తర్వాత మాట్లాడతాను. -సరే. ఉంటాను. 173 00:09:28,861 --> 00:09:31,241 హేయ్, మ్యాడిసన్, నేనే. 174 00:09:31,822 --> 00:09:33,032 అవును, నాకు ఆలస్యమయింది. 175 00:09:34,283 --> 00:09:36,453 నాకు తెలుసు, తెలుసు. త్వరలోనే కలుస్తానులే. 176 00:09:37,411 --> 00:09:38,621 సరే. 177 00:09:40,581 --> 00:09:43,131 మెలిసా? మ్యాడిసన్? ఎవరు వీళ్ళంతా? 178 00:09:43,208 --> 00:09:45,628 రూబెన్, మీ అమ్మ పేరు ఏమీ కదా? 179 00:09:45,711 --> 00:09:47,671 -అవును. -ఆసక్తికరంగా ఉంది. 180 00:09:47,754 --> 00:09:52,384 ఆ మ్యాడిసన్ ఎవరో కానీ ఇతను నవ్వుతున్నాడు, ఆమె అంటే మనవాడికి ఇష్టంలా ఉంది. 181 00:09:52,467 --> 00:09:54,887 పేపర్లను కరెక్ట్ చేయడం గురించి ఇతను మా అమ్మకు అబద్ధం చెప్పాడు. 182 00:09:55,220 --> 00:09:57,810 సెంటు పూసుకున్నాడు, మంచి జాకెట్ వేసుకున్నాడు... 183 00:09:57,890 --> 00:09:59,980 ఇతను ఇంకెవ్వరితోనైనా డేటింగ్ చేస్తున్నాడని మీకు అనిపించడం లేదా? 184 00:10:00,058 --> 00:10:04,308 మనం ఈ విషయాన్ని తేల్చాలి. కానీ ఏదో తేడా కొడుతుంది. 185 00:10:13,989 --> 00:10:16,029 మీరెందుకు దాక్కుంటున్నారు? అతనికి మీరు కనబడరు కదా? 186 00:10:16,116 --> 00:10:17,236 నీకు తోడు ఇద్దామని. 187 00:10:17,993 --> 00:10:19,203 అవి ఎవ్వరికి అయ్యుంటాయి? 188 00:10:19,286 --> 00:10:21,576 ఆ పేరు "ఎం"తో మొదలవుతుందని నా అంచనా. 189 00:10:30,631 --> 00:10:31,841 మెలిసాస్ 190 00:10:31,924 --> 00:10:34,594 మెలిసాస్. అదొక హోటల్ పేరు. 191 00:10:34,676 --> 00:10:37,506 ఇక్కడే అతను మ్యాడిసన్ ని కలుస్తున్నాడు. 192 00:10:41,266 --> 00:10:42,346 బహుశా అది ఆమెనే ఏమో. 193 00:10:43,060 --> 00:10:44,770 నాకు ఇక్కడి నుండి కనబడటం లేదు. 194 00:10:52,027 --> 00:10:56,407 ఈ రోజు ఇక్కడ నాటుకోడి చికెన్, మష్రూమ్ కైమా స్పెషల్. 195 00:10:57,449 --> 00:10:59,119 ఇక్కడ మిస్టర్ సాండర్స్ పని చేస్తున్నాడా? 196 00:11:02,287 --> 00:11:03,287 రూబెన్? 197 00:11:07,084 --> 00:11:09,594 మన్నించాలి, మీరు ఏం కావాలో ఇంకాసేపు ఆలోచించుకోండి. 198 00:11:12,631 --> 00:11:14,051 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 199 00:11:14,591 --> 00:11:16,391 ఏదైనా తినడానికని వచ్చాను. 200 00:11:18,637 --> 00:11:20,177 మంచి నీళ్ళు సరిపోతాయనుకుంటాలే. 201 00:11:20,264 --> 00:11:22,104 -ఇక్కడికి నన్ను అనుసరిస్తూ వచ్చావా? -దానికి... 202 00:11:23,183 --> 00:11:24,983 నా దగ్గర మీకు నచ్చే సమాధానం లేదు. 203 00:11:25,060 --> 00:11:28,020 చూడు, నేను మీ అమ్మకి కాల్ చేయాలి. ఇక్కడే కూర్చో. 204 00:11:38,991 --> 00:11:41,291 మీ టీచర్ మనల్ని మళ్లీ బోల్తా కొట్టించాడు. 205 00:11:42,119 --> 00:11:45,659 -నాకు తెలీదు అసలేం... -ఓ, మీ అమ్మ వచ్చేసింది. 206 00:11:46,081 --> 00:11:47,541 అవును, ధన్యవాదాలు, వాట్సన్. 207 00:11:48,000 --> 00:11:51,750 ఈ మ్యాడిసన్ ఎవరో నేను కనిపెట్టేశాను అనుకుంటా. 208 00:11:51,837 --> 00:11:54,417 తను ఈ హోటల్ కి మేనేజర్. 209 00:11:54,506 --> 00:11:55,626 తను కోపంగా ఉందా? 210 00:11:57,426 --> 00:11:59,676 ఆ విషయం నీకు ఇప్పుడు తెలుస్తుందిలే. 211 00:12:03,265 --> 00:12:05,635 రూబెన్, ఏంటి సంగతి? 212 00:12:07,978 --> 00:12:10,808 మిస్టర్ సాండర్స్, మ్యాడిసన్ అనే వేరే మహిళతో తిరుగుతున్నాడని అనుకున్నాను. 213 00:12:11,982 --> 00:12:13,282 అతను ఇక్కడ పని చేస్తున్నాడని నాకు తెలీదు. 214 00:12:16,361 --> 00:12:21,031 విద్యార్థి రుణాన్ని, ఇంటి రుణాన్ని కట్టేందుకు ఇక్కడ పార్ట్ టైమ్ చేస్తున్నాడు. 215 00:12:21,700 --> 00:12:23,080 కానీ పూల సంగతి ఏంటి? 216 00:12:23,160 --> 00:12:25,750 మీ అమ్మ కోసమే ఇవి కొన్నాను. మేము తర్వాత కలుసుకోబోతున్నాము. 217 00:12:28,081 --> 00:12:30,711 -ధన్యవాదాలు. అవి చాలా బాగున్నాయి. -పర్వాలేదులే. 218 00:12:31,460 --> 00:12:33,460 -మాకు ఒక నిమిషం ఏకాంతం ఇస్తావా? -తప్పకుండా. 219 00:12:37,090 --> 00:12:38,180 క్షమించు, అమ్మ. 220 00:12:40,177 --> 00:12:42,347 నువ్వు పట్టించుకోవడం బాగుంది. 221 00:12:43,138 --> 00:12:46,388 కానీ నేను డేటింగ్ చేయడం నీకు ఇష్టం లేదని 222 00:12:46,475 --> 00:12:48,555 ఈ వ్యవహారం చెప్తోందని నాకనిపిస్తోంది. 223 00:12:48,644 --> 00:12:52,234 నిజానికి, మిస్టర్ సాండర్స్ మంచివాడిలా ఉన్నాడు. 224 00:12:52,314 --> 00:12:54,324 నేను మళ్లీ కలుగజేసుకోనని మాటిస్తున్నాను. 225 00:12:54,775 --> 00:12:55,895 నేను కలుగజేసుకోవాలని నీకనిపిస్తే తప్ప. 226 00:12:57,069 --> 00:12:58,489 అవసరం వస్తే చెప్తాలే. 227 00:13:01,865 --> 00:13:03,905 వెళ్లేముందు ఈ ఎక్లేర్ తిని వెళ్ళండి. 228 00:13:04,535 --> 00:13:06,655 -నేనే చెల్లిస్తాను. -ధన్యవాదాలు. 229 00:13:06,745 --> 00:13:07,745 ధన్యవాదాలు. 230 00:13:07,829 --> 00:13:09,959 ఇంకో ఎక్లేర్ ఏమైనా తేగలడేమో చూడు. 231 00:13:10,040 --> 00:13:11,250 రెండైతే ఇంకా మంచిది. 232 00:13:16,880 --> 00:13:18,670 -తలుపులను ఖచ్చితంగా మార్చాలి. -అలాగే. 233 00:13:18,757 --> 00:13:21,927 -వెనుక వైపు ఎలా అని మేము... -నాన్నా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 234 00:13:23,053 --> 00:13:24,813 మీరు ఈ విషయం విని అవాక్కవుతారు. 235 00:13:24,888 --> 00:13:28,348 పుస్తకాల దుకాణం మరమత్తు చేయడంలో మీ నాన్న సాయపడతాను అన్నాడు. 236 00:13:28,433 --> 00:13:29,433 ఏం జరిగిందో డోనా చెప్పినప్పుడు, 237 00:13:29,518 --> 00:13:31,648 ఈ మరమత్తు పనులలో నేను కూడా సాయమందించగలనేమో అనిపించింది. 238 00:13:32,896 --> 00:13:34,896 ఈ ప్రాంతానికి నా చిన్నతనంలో వచ్చినట్టు నాకు గుర్తు. 239 00:13:34,982 --> 00:13:36,152 అది చాలా మంచి విషయం, నాన్న. 240 00:13:36,233 --> 00:13:39,653 అదీగాక, మీరెప్పుడూ ఇక్కడే ఉంటారు కనుక మిమ్మల్ని కూడా ఎక్కువగా చూడవచ్చు. 241 00:13:40,028 --> 00:13:42,278 మేము కూడా సాయపడగలం. రంగులని నేను ఎంపిక చేయలను. 242 00:13:42,364 --> 00:13:43,454 నేను రంగులని వేయగలను. 243 00:13:43,866 --> 00:13:44,866 చూద్దాములే. 244 00:13:45,492 --> 00:13:46,702 మాకు హోం వర్క్ ఉంది. 245 00:13:46,785 --> 00:13:48,575 మాకు కూడా చర్చించుకోవలసింది చాలా ఉంది. 246 00:13:53,917 --> 00:13:57,207 ఇప్పుడు మనం రెండు జీవితాలు జీవించే టీచర్ కేసును పరిష్కరించేశాము... 247 00:13:57,296 --> 00:13:59,296 ఆ పనిలో భాగంగా నేను ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోన్నాను. 248 00:13:59,381 --> 00:14:02,341 ...ఇక మీరు స్పార్కిల్ ఇల్లు, కనబడని రాతపత్రి యొక్క మర్మమైన దానికి వచ్చేయాలి. 249 00:14:02,718 --> 00:14:04,508 నేను ఒప్పుకుంటున్నాను, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. 250 00:14:04,970 --> 00:14:06,390 స్లోన్ ఇవాళ కూడా బాగాలేకపోవడం వల్ల రాలేదు. 251 00:14:06,471 --> 00:14:09,061 కనుక తన అసైన్మెంట్లను తనకి నేను ఇవ్వవచ్చా అని టీచర్ ని అడిగా. 252 00:14:09,141 --> 00:14:11,061 నీ తెలివికి జోహార్లు. 253 00:14:11,560 --> 00:14:13,690 ధన్యవాదాలు. అవి ఇచ్చేటప్పుడు ఏమైనా చూడటానికి ప్రయత్నిస్తాను. 254 00:14:14,062 --> 00:14:16,482 బహూశా నీతో షెర్లాక్, వాట్సన్ కూడా వచ్చి పరిశీలించగలరేమో. 255 00:14:16,899 --> 00:14:19,229 నిజానికి, మేము ఆ పని చేయలేము. 256 00:14:19,776 --> 00:14:20,776 ఎందుకని? 257 00:14:20,861 --> 00:14:23,111 ఈ పనిని మీరే సొంతంగా చేసుకోవాలి. 258 00:14:23,197 --> 00:14:25,317 అవును. మీకు కావలసినవన్నీ మేము మీకు నేర్పించాము. 259 00:14:25,407 --> 00:14:26,737 మాకు పనిచేసే భాగ్యం కలిగిన 260 00:14:26,825 --> 00:14:30,785 గొప్ప గూఢాచారులలో మీరు కూడా ఒకరని మీరు నిరూపించారు. 261 00:14:30,871 --> 00:14:33,791 -మేము కాకుండా, అనుకోండి. -అందులో సందేహం ఏముంది, ప్రియమైన షెర్లాక్. 262 00:14:34,541 --> 00:14:37,381 మీరు నా అసోసియేట్ యొక్క విలువను నాకు తెలిసేలా చేశారు. 263 00:14:38,962 --> 00:14:42,882 నాకు కూడా సొంతంగా కేసులని పరిష్కరించేలా స్ఫూర్తిని ఇచ్చారు. 264 00:14:43,300 --> 00:14:45,220 నా అంచనాలు సరైనవే అయితే, 265 00:14:45,594 --> 00:14:48,264 పుస్తకంలోని పాత్రలకు మీరు సాయపడగానే, అవి కూడా మీకు సాయపడగానే, 266 00:14:48,347 --> 00:14:50,427 మీ దెయ్యం మిత్రుడు వాటిని మళ్లీ పుస్తకంలోకి పంపించేస్తాడు. 267 00:14:51,099 --> 00:14:52,519 మామూలుగా జరిగేది అదే. 268 00:14:52,893 --> 00:14:59,153 అయితే, మేము మా పుస్తకంలోకి మూడు లెక్క పెట్టేలోపు వెళ్లిపోతాం, ఒకటి, రెండు, మూడు. 269 00:15:06,198 --> 00:15:09,118 ది గ్రేట్ మిస్టరీస్ ఆఫ్ షెర్లాక్ అడ్వెంచర్స్ ఆఫ్ షిర్ల్ మరియు వాట్సన్ 270 00:15:09,201 --> 00:15:10,871 పదాలు పుస్తకంలోకి వచ్చేశాయి. 271 00:15:12,120 --> 00:15:14,830 పుస్తకంలోకి ఎప్పుడు వెళ్లిపోతారు అని వాళ్లు ఇప్పుడు భవిష్యం చెప్పారా? 272 00:15:14,915 --> 00:15:15,955 ఇలా ఇదివరకు ఎన్నడూ జరగలేదు. 273 00:15:16,667 --> 00:15:20,627 -వాళ్లు నిజంగానే భలే గూఢాచారులు. -ఇక ఇప్పుడు మనమే పరిష్కరించుకోవాలి. 274 00:15:34,726 --> 00:15:37,686 హేయ్. నీకు బాగాలేదు కాబట్టి, నీ హోంవర్క్ ని నేను తెచ్చాను. 275 00:15:38,063 --> 00:15:39,153 నువ్వు అలా చేయాల్సిన పని లేదు. 276 00:15:39,231 --> 00:15:41,821 నువ్వు "ధన్యవాదాలు" అని చెప్పాలేమో. 277 00:15:42,818 --> 00:15:43,818 ధన్యవాదాలు. 278 00:15:45,988 --> 00:15:47,108 ఓహ్, ఆగు. 279 00:15:47,197 --> 00:15:48,947 వెళ్ళే ముందు ఒకసారి టాయిలెట్ వాడుకోవచ్చా? 280 00:15:49,032 --> 00:15:50,582 సబ్ వే లో చాలా దూరం వెళ్ళాలి. 281 00:15:58,083 --> 00:15:59,293 ఇటు వైపు. 282 00:16:01,753 --> 00:16:04,213 హాలు చివరన ఉంది. 283 00:16:04,298 --> 00:16:05,508 ధన్యవాదాలు. 284 00:16:12,181 --> 00:16:14,021 హేయ్! ఏం చేస్తున్నావు? 285 00:16:14,975 --> 00:16:16,555 బాత్రూమ్ అక్కడ ఉంది. 286 00:16:16,977 --> 00:16:18,187 పొరబడ్డాను. 287 00:16:24,610 --> 00:16:26,240 అసైన్మెంట్లను తెచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు. 288 00:16:31,241 --> 00:16:34,081 కంగారుపడిపోకు, నా ప్రసంగంలో నేను కొన్ని మార్పులను చేశాను. 289 00:16:34,161 --> 00:16:35,951 అది ఇప్పుడు చెప్తున్నావా నాకు? 290 00:16:36,038 --> 00:16:38,038 పాఠశాలలోని అందరి ముందుకూ వెళ్లే ముందు చెప్తున్నావా? 291 00:16:38,123 --> 00:16:39,543 దీన్ని ఒకసారి చదువు. 292 00:16:43,962 --> 00:16:46,132 -బాగా ఆలోచించి రాశావా? -నీకు పర్వాలేదు అనిపిస్తే నాక్కూడా. 293 00:16:47,257 --> 00:16:48,677 బాగుంది. నీకు నా మద్దతు ఉంటుంది. 294 00:16:53,680 --> 00:16:55,640 మనందరికీ ఒక గర్వకారణమైన పాఠశాల కావాలి. 295 00:16:55,724 --> 00:16:57,894 అందుకే మీరు మాకు ఓటేయాలి, 296 00:16:57,976 --> 00:17:01,606 ఎందుకంటే ఈ పాఠశాల ఇంకా మెరుగవ్వాలి. మీరు కూడా. 297 00:17:08,487 --> 00:17:11,067 ఇక ఇప్పుడు నేను నా ప్రచార భాగస్వామిని పరిచయం చేయాలనుకుంటున్నాను. 298 00:17:11,156 --> 00:17:12,656 మీకు అతను ఒక అద్భుతమైన ఆటగాడిగా తెలుసు, 299 00:17:12,741 --> 00:17:16,161 కానీ విద్యార్థి సంఘానికి ఉపాధ్యక్షుడు కూడా కాగలడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 300 00:17:16,244 --> 00:17:17,794 అతనే కర్టిస్ పామర్-మోరీనో. 301 00:17:20,749 --> 00:17:21,959 అదీ, కర్టిస్! 302 00:17:27,047 --> 00:17:29,627 ధన్యవాదాలు. షేవాన్ తో పాటు బరిలో ఉన్నందుకు నాకు ఉత్సాహంగా ఉంది. 303 00:17:29,716 --> 00:17:32,636 ఈ పాఠశాలని తను పట్టించుకుంటున్నట్టుగా ఇంకెవ్వరూ పట్టించుకోరు. ఇది నిజం. 304 00:17:36,765 --> 00:17:38,095 ఈ పాఠశాలలో నిధులన్నీ క్రీడాకారులకే 305 00:17:38,183 --> 00:17:40,233 అని షెవాన్ అన్నందుకు తన మీద విమర్శల దాడి మొదలైందని తెలుసు, 306 00:17:40,310 --> 00:17:41,400 కానీ అది నిజం. 307 00:17:41,812 --> 00:17:42,942 అది న్యాయం కాదు. 308 00:17:44,857 --> 00:17:47,987 నేను కూడా ఆటగాడిని, ఎప్పట్నుండో నేను బాస్కెట్ బాల్ ఆడుతున్నాను. 309 00:17:48,068 --> 00:17:51,358 కానీ నాకు డిస్లెక్సియా ఉందని తెలిశాక నా ప్రపంచమంతా తలకిందులైపోయింది. 310 00:17:55,826 --> 00:17:56,826 అదేమంత పెద్ద విషయం కాదు. 311 00:17:56,910 --> 00:17:58,290 నా మెదడు భిన్నంగా పని చేస్తుందని తెలుసుకున్నా, 312 00:17:58,370 --> 00:17:59,790 నాకు చదవడంలో కాస్త సాయం దొరికితే చాలు. 313 00:17:59,872 --> 00:18:03,332 సమస్య ఏంటంటే, నా లాంటి పిల్లలకి నిధులు ఇవ్వడానికి పాఠశాల వద్ద నిధులు లేవు. 314 00:18:03,417 --> 00:18:06,797 ఆటగాళ్ళకి, అలాగే అధ్యయన ల్యాబ్ లో ఉన్న వనరులకి కూడా నిధులు అందాలి, 315 00:18:06,879 --> 00:18:08,879 తద్వారా అందరికీ తమకి కావలసింది దక్కుతుంది. 316 00:18:08,964 --> 00:18:11,224 మీరందరూ మాకు ఓటేస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. 317 00:18:26,815 --> 00:18:29,645 హేయ్, కర్టిస్. వేదిక మీద నువ్వు అదరగొట్టేశావు. 318 00:18:30,152 --> 00:18:31,362 నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది. 319 00:18:31,987 --> 00:18:33,857 కానీ అది తలకి ఎక్కించుకోకు. 320 00:18:33,947 --> 00:18:35,617 సరే, డోనా. పాఠశాలలో వద్దు. 321 00:18:36,408 --> 00:18:39,078 ఎన్నికలను గెలవడంలో మనకున్న అవకాశాలను నేను చెడగొట్టడం లేదనే ఆశిస్తున్నా. 322 00:18:39,161 --> 00:18:40,831 లేదు, ఆ విషయంలో నాకు ఆనందంగా ఉంది. 323 00:18:42,748 --> 00:18:44,078 హేయ్, జేక్. 324 00:18:44,166 --> 00:18:47,286 హేయ్, నీకు ఆ సమస్య ఉందని నాకు అస్సలు తెలీనే తెలీదు. 325 00:18:47,377 --> 00:18:49,087 నేను దాని గురించి పెద్దగా ఎవ్వరికీ చెప్పలేదు. 326 00:18:49,171 --> 00:18:51,171 నేను అర్థం చేసుకోగలనులే. నీకు నా అండ ఉంటుందని నీకు తెలుసు కదా. 327 00:18:51,256 --> 00:18:52,466 ధన్యవాదాలు. 328 00:19:10,901 --> 00:19:11,991 నేను మళ్లీ వచ్చాను. 329 00:19:13,195 --> 00:19:15,405 -నువ్వు ఇలా ప్రతిరోజు చేస్తావా? -ఏమో. 330 00:19:15,489 --> 00:19:18,489 ప్రతిరోజు నీకు ఆరోగ్యం బాగాలేదని నటిస్తూనే ఉంటావా? నీకు బాగానే ఉంది కదా. 331 00:19:18,575 --> 00:19:21,695 -నీకేం కావాలి, డోనా? -నా కోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. 332 00:19:25,999 --> 00:19:28,379 సాంకేతికపరంగా చూస్తే, నేనేమీ నీ కోటును దొంగలించలేదు. 333 00:19:28,794 --> 00:19:30,594 పోయి దొరికిన వస్తువుల ఆఫీసులో నాకు అది కనబడింది. 334 00:19:30,671 --> 00:19:32,761 అయితే, నేను దాన్ని ఎక్కడో వదిలేసుంటాను. 335 00:19:32,840 --> 00:19:34,590 నాకు ఆ ప్యాచ్ కోటులను కొనే స్తోమత లేదు, 336 00:19:34,675 --> 00:19:36,965 ఇంకా ఆ వ్యక్తికి అది పెద్దగా అవసరం లేదేమోనని నాకనిపించింది. 337 00:19:37,052 --> 00:19:39,722 విషయమేమిటంటే, ఆ బ్రాండ్ ని కొనే స్తోమత నాకు కూడా లేదు. 338 00:19:39,805 --> 00:19:41,925 అందుకే సరిగ్గా అలా కనబడే కోటునే నేను చేసుకున్నాను. 339 00:19:42,015 --> 00:19:44,345 వావ్, అది అచ్చం అసలైనదిలాగానే ఉంది. 340 00:19:44,434 --> 00:19:47,024 -ధన్యవాదాలు. -దాన్ని తీసుకున్నందుకు నన్ను మన్నించు. 341 00:19:47,104 --> 00:19:49,064 పుకార్లతో పాఠశాలలో కష్టంగా అనిపించింది, 342 00:19:49,147 --> 00:19:50,977 అందరితో కలిసిపోవాలని అలా చేశాననుకుంటా. 343 00:19:51,066 --> 00:19:53,526 అవును, నీ చివరి పాఠశాల నుండి నువ్వు సస్పెండ్ అయ్యావని విన్నాను. 344 00:19:53,610 --> 00:19:56,200 ఏంటి? లేదు. నిజం అంతకన్నా బోరింగ్ గా ఉంటుందిలే. 345 00:19:56,280 --> 00:19:57,990 మా నాన్నకి బదిలీ అయింది. 346 00:19:58,073 --> 00:20:00,993 మేము తరచుగా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది, కాబట్టి నాకు నేనుగా ఉంటే తేలిగ్గా ఉంటుంది. 347 00:20:01,618 --> 00:20:03,868 -అది కష్టమైన విషయం. -నాకు అలవాటు అయిపోయింది. 348 00:20:03,954 --> 00:20:06,084 నీకోసం నేనొక కోటు చేసివ్వగలను. 349 00:20:06,415 --> 00:20:08,535 -నిజంగానా? -అవును, భలే సరదాగా ఉంటుంది. 350 00:20:09,877 --> 00:20:12,797 నీకు వెళ్లిపోవాలనుందా లేక ఇంకాసేపు ఉంటావా? 351 00:20:16,258 --> 00:20:18,138 ఇది నీ పడక గదా? 352 00:20:23,473 --> 00:20:24,933 ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. 353 00:20:25,017 --> 00:20:26,477 అవును. నాకు చాలా బాగా నచ్చింది. 354 00:20:29,813 --> 00:20:31,323 నాకు ఈ హుడీ చాలా బాగా నచ్చింది. 355 00:20:31,398 --> 00:20:33,478 ధన్యవాదాలు, ఇది సెకండ్ హ్యాండ్ అంగడి నుండి కొన్నాను. 356 00:20:33,567 --> 00:20:36,397 నేను వెళ్ళే సెకండ్ హ్యాండ్ అంగళ్లను నీకు చూపాలని చాలా ఆతృతగా ఉంది. 357 00:20:38,155 --> 00:20:40,525 హేయ్, నీకు ఒక అద్భుతమైనది చూపనా? 358 00:20:42,951 --> 00:20:46,081 దీన్ని చూడు. దీని గురించి మా తల్లిదండ్రులకి కూడా తెలీదు. 359 00:20:54,546 --> 00:20:56,166 బాబోయ్, మీ ఇంట్లో రహస్య అర ఉందా? 360 00:20:56,256 --> 00:20:57,256 అవును. 361 00:20:57,716 --> 00:20:59,376 లోపల ఏమైనా ఉందా? 362 00:20:59,468 --> 00:21:02,138 పాత నిధులు, లేదా కొన్ని పత్రాల్లాంటివి ఏమైనా? 363 00:21:02,221 --> 00:21:03,641 లేదు, ఖాళీగా ఉంది. 364 00:21:03,722 --> 00:21:06,182 దీని అసలు యజమానులు, ఎందుకు దీన్ని కట్టారో నాకు అర్థంకావడం లేదు. 365 00:21:06,266 --> 00:21:08,346 వాళ్ళ దగ్గర ఏదో దాచాల్సింది ఉండుంటుంది. 366 00:21:09,269 --> 00:21:11,309 రాతపత్రి లేని రహాస్య అర? 367 00:21:11,396 --> 00:21:13,396 మళ్లీ నిరాశే ఎదురైందంటే నమ్మలేకపోతున్నాను. 368 00:21:13,482 --> 00:21:15,442 ఎప్పుడోకప్పుడు అక్కడ ఉండుంటుంది. 369 00:21:16,443 --> 00:21:18,283 ఇది మనం ఎక్కాల్సిన రైలు. పదండి. 370 00:21:29,831 --> 00:21:31,831 అబ్బా. సబ్వేలోని ఏ వస్తువులను బడితే వాటిని పట్టుకోకు. 371 00:21:41,468 --> 00:21:43,848 -అది వింతగా ఉందే. -ఆ కాంతి నీకు కూడా కనబడిందా? 372 00:21:44,555 --> 00:21:45,755 అవును. 373 00:21:50,018 --> 00:21:51,438 మనం దిగాల్సింది ఇక్కడే. 374 00:21:51,895 --> 00:21:54,515 మనమేమైనా ఎక్స్ ప్రెస్ ఎక్కామా? చాలా వేగంగా వచ్చేశాం. 375 00:22:08,579 --> 00:22:10,789 ఏం జరుగుతోంది? మనం ఇందాకే కదా ఇక్కడ ఉన్నది. 376 00:22:12,583 --> 00:22:15,003 చూస్తుంటే ఇక్కడ చాలా రోజుల నుండి ఎవ్వరూ ఉన్నట్టు లేదు. 377 00:22:18,005 --> 00:22:20,465 మన్నించండి మేము మూసివేశాము. 378 00:22:20,549 --> 00:22:21,759 అమ్మా. 379 00:22:23,010 --> 00:22:24,510 తాతయ్యా! 380 00:22:24,595 --> 00:22:25,675 అసలేం... 381 00:22:25,762 --> 00:22:27,062 దీన్ని చూడండి. 382 00:22:27,764 --> 00:22:29,814 ఈ వార్తాపత్రిక భవిష్యత్తు లోనిది. 383 00:22:29,892 --> 00:22:32,142 అంతరిక్ష యాత్రికుల వ్యోమనౌక ప్రయోగించబడింది 384 00:22:32,603 --> 00:22:34,563 అదెలా సాధ్యం? 385 00:22:38,901 --> 00:22:40,741 మనం కాలప్రయాణం చేశామనుకుంటా. 386 00:23:39,962 --> 00:23:41,962 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య