1 00:00:13,805 --> 00:00:17,555 గందరగోళం. మిస్టరీని ఛేదించేందుకు మేసన్ బ్రిగ్స్ మనల్నెందుకు ఎంచుకున్నాడు? 2 00:00:17,643 --> 00:00:19,693 దాంతో పనేముంది? అదొక గొప్ప గౌరవం. 3 00:00:19,770 --> 00:00:20,650 డిటెక్టివ్ 4 00:00:20,729 --> 00:00:23,109 ఎందుకా? తన పబ్లిష్ కాని రాతప్రతిని కనిపెట్టి, 5 00:00:23,190 --> 00:00:26,150 ఎవరైనా పబ్లిషర్ కి ఇచ్చి, "హే, దీన్ని పబ్లిష్ చెయ్" అనేందుకా? 6 00:00:26,568 --> 00:00:29,528 రూబెన్ సరిగ్గా చెప్పాడు. తర్వాత ఏం చేయాలో, ఎందుకు చేయాలో నాకు 7 00:00:29,613 --> 00:00:30,613 అస్సలు తెలియట్లేదు. 8 00:00:30,697 --> 00:00:33,737 నేనిలా అనడం నాకే ఆశ్చర్యంగా ఉంది, కానీ ఈ మిస్టరీ ఇక నా వల్ల కాదు. 9 00:00:34,284 --> 00:00:37,334 అలా ఎలా వదిలేస్తాం. మనం సాయం చేయాలని ఘోస్ట్ కోరుకుంటున్నాడు. 10 00:00:37,412 --> 00:00:39,292 చేయకపోతే జీవితాంతం మనల్ని వెంటాడతాడా ఏంటి? 11 00:00:39,373 --> 00:00:42,333 చాక్ బోర్డుని దాటి వెళ్ళే ప్రతిసారీ అందులో ఏం రాసుందా అని నేను చూడాలనుకోవట్లేదు. 12 00:00:43,001 --> 00:00:46,341 కమాన్. ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు వదిలేయలేం కదా. 13 00:00:55,514 --> 00:00:57,224 ఫ్యాన్సీ డ్రెస్ పోటీ ఏదైనా జరుగుతోందా? 14 00:01:00,811 --> 00:01:02,901 మళ్ళీ పాతకాలం నాటి బుక్ క్యారెక్టరా. 15 00:01:04,397 --> 00:01:06,857 ఏదైనా కామిక్ బుక్ లేదా ఇంకేదైనా అయ్యుండొచ్చు కదా? 16 00:01:08,068 --> 00:01:08,898 మేడం? 17 00:01:08,986 --> 00:01:10,856 మూన్ ట్రవెలర్ 18 00:01:10,946 --> 00:01:13,066 సైన్స్ 19 00:01:14,074 --> 00:01:15,494 హలో, పిల్లలూ. 20 00:01:16,034 --> 00:01:19,664 క్షమించండి, నేను ఈ బుక్ లో పూర్తిగా మునిగిపోయాను. 21 00:01:19,746 --> 00:01:23,576 అత్యద్భుతమైన ఫిక్షన్. ఈ రచయిత ఊహ అమోఘం. 22 00:01:23,667 --> 00:01:24,747 ఫిక్షన్? 23 00:01:24,835 --> 00:01:26,455 రాకెట్ల ముందుకాలం నుండి వచ్చారనుకుంటా. 24 00:01:27,045 --> 00:01:29,295 అవును, అది ఫిక్షన్ అని నేను అనుకోవట్లేదు. 25 00:01:30,048 --> 00:01:31,218 మీ పేరు అడిగితే ఏమీ అనుకోరుగా? 26 00:01:32,134 --> 00:01:34,974 జోన్ వాట్సన్, ఎం.డి. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. 27 00:01:36,638 --> 00:01:40,308 ఆమె 19వ శతాబ్దం నాటి డాక్టర్. అద్భుతంగా ఉంది. 28 00:01:40,392 --> 00:01:43,272 ఆ కాలంలో లేడీ డాక్టర్లు ఉన్నారని నాకు తెలీదు. 29 00:01:43,353 --> 00:01:46,063 ఆగండి. మీరు డాక్టర్ వాట్సన్? 30 00:01:46,857 --> 00:01:49,357 అవును. ఎక్కువమంది నన్ను అలాగే అంటారు. 31 00:01:49,443 --> 00:01:52,403 ఏమీ అనుకోకపోతే, నేను చాలా ఉత్సాహం కలిగించే భాగం చదువుతున్నాను. 32 00:01:52,487 --> 00:01:54,907 వాళ్ళు చంద్రుడి మీదికి వెళ్లబోతున్నారు. మాయలాగా ఉంది. 33 00:02:00,204 --> 00:02:02,294 డాక్టర్ వాట్సన్ మగవారని అనుకున్నాను. 34 00:02:03,081 --> 00:02:04,171 ఆమె ఎవరో నీకు తెలుసా? 35 00:02:04,249 --> 00:02:08,539 ఆమె ఎవరో తెలీదు గానీ, డాక్టర్ వాట్సన్ అంటే షెర్లాక్ హోమ్స్ ఫ్రెండ్ అని మాత్రం తెలుసు. 36 00:02:08,628 --> 00:02:11,008 డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్? 37 00:02:11,089 --> 00:02:14,469 అవును. ఆర్థర్ కోనన్ డోయల్ బుక్స్ లో ఉండే ఫేమస్ డిటెక్టివ్. 38 00:02:14,551 --> 00:02:16,261 ప్రాథమికమైన విషయం, మై డియర్ వాట్సన్. 39 00:02:16,720 --> 00:02:19,970 కానీ వాట్సన్ మగవారు. ఆమె వాట్సన్ కాదేమో. 40 00:02:20,474 --> 00:02:22,314 అది తెలుసుకోవాలంటే ఒకే మార్గం ఉంది. 41 00:02:24,895 --> 00:02:28,515 ఆపినందుకు సారీ, డాక్టర్, మీకు షెర్లాక్ హోమ్స్ తెలుసా? 42 00:02:30,901 --> 00:02:33,611 నా ఫ్రెండ్ గడించిన పేరు నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. 43 00:02:33,695 --> 00:02:37,485 ఇప్పటికీ కూడా, షిర్ల్ జీవితం గురించిన గొప్ప కథలు ఖండాలు దాటి ప్రయాణిస్తూ ఉంటాయి. 44 00:02:37,574 --> 00:02:38,584 షిర్ల్? 45 00:02:39,034 --> 00:02:41,044 ఆమెని "షెర్లాక్" అని పిలిస్తే నచ్చేదికాదు. 46 00:02:41,119 --> 00:02:42,159 ఆమె? 47 00:02:42,871 --> 00:02:47,041 ఆవిడ చనిపోయిన విషయం మీకు తెలిసినట్లు లేదని నాకు అనిపిస్తోంది. 48 00:02:47,584 --> 00:02:49,214 షెర్లాక్ హోమ్స్ చనిపోయారా? 49 00:02:51,421 --> 00:02:54,421 ఇప్పటికి మూడు ఏళ్ళు అయింది. 50 00:02:54,508 --> 00:02:55,968 అదొక ఘోరమైన విషాదం. 51 00:02:57,678 --> 00:02:59,388 నేను నా ఫ్రెండ్ ని రోజూ మిస్ అవుతున్నాను. 52 00:03:02,057 --> 00:03:03,307 ఏం జరుగుతోంది? 53 00:03:05,227 --> 00:03:11,067 అంటే, మన మిస్టరీని ఛేదించగల ఫేమస్ డిటెక్టివ్ చనిపోయారా? 54 00:03:23,453 --> 00:03:28,173 ఘోస్ట్ రైటర్ 55 00:03:31,545 --> 00:03:32,795 మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. 56 00:03:36,717 --> 00:03:38,717 నేను ఇంతకు ముందెప్పుడూ టీ చేయలేదు. 57 00:03:44,308 --> 00:03:47,938 ఎర్ల్ గ్రే టీ నిమ్మరసంతో పాటు. పర్ఫెక్ట్. 58 00:03:49,730 --> 00:03:51,650 కాబట్టి, నేను చెబుతున్నట్లుగా, 59 00:03:51,732 --> 00:03:55,652 షిర్ల్ కి ఎంతమంది అభిమానులున్నారో, అంతమంది శత్రువులున్నారు. 60 00:03:55,736 --> 00:03:57,606 వాళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి మోరియార్టీ. 61 00:03:58,322 --> 00:04:02,742 షిర్ల్ ఆమెని ఎన్నిసార్లు జైల్లో వేయించినా, మోరియార్టీ తప్పించుకునేది. 62 00:04:03,493 --> 00:04:06,873 చివరికి, ఇప్పుడు ఇద్దరూ చనిపోయారు. 63 00:04:07,623 --> 00:04:09,253 వావ్. అది దురదృష్టం. 64 00:04:09,333 --> 00:04:11,463 మరైతే, మీరు ఏం చేశారు? 65 00:04:11,543 --> 00:04:14,343 ఇన్నాళ్ళూ నా ప్రియమైన స్నేహితురాలి కోసం బాధపడుతూ గడిపాను. 66 00:04:15,047 --> 00:04:19,127 అందుకే ప్రయాణాలు చేసి, కొత్త ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకున్నాను. 67 00:04:20,886 --> 00:04:25,346 కానీ మూడేళ్ళలో ప్రపంచం ఎంత మారిపోయిందో. 68 00:04:25,766 --> 00:04:27,096 బుక్స్ లో-- 69 00:04:28,477 --> 00:04:32,307 నా ఉద్దేశ్యం, మీరు కేసులు పరిష్కరించడంలో షెర్లాక్ కి సాయం చేశారా? 70 00:04:32,981 --> 00:04:37,321 ఒక్కోసారి ఇద్దరం కలిసి క్లూస్ ఛేదించేవాళ్ళం, కానీ తనే చాలా తెలివికలది. 71 00:04:37,945 --> 00:04:40,695 ఎందుకంటే ఒక కేసు పరిష్కరించడానికి మాకు సాయం కావాలి. 72 00:04:41,490 --> 00:04:46,200 నేను షిర్ల్ హోమ్స్ ని కాదుగానీ, తనతో ఉండగా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. 73 00:04:46,745 --> 00:04:50,705 అవును, లేట్ అవుతోంది. మీరు ఉండడానికి కింద ఏర్పాటు చేస్తాం. 74 00:04:50,791 --> 00:04:52,331 మిమ్మల్ని మెచ్చుకుని తీరాలి. 75 00:04:54,962 --> 00:04:58,092 మా నాన్న బీమా క్లెయిమ్ చేశారు, ఇంతవరకూ మీ నుండి ఎటువంటి స్పందనా లేదు. 76 00:04:58,173 --> 00:05:01,513 మా స్టోర్ ని దోచుకుని నాశనం చేశారు, దాని భారీ మరమ్మత్తుల పని మధ్యలో ఉన్నాం. 77 00:05:01,593 --> 00:05:04,013 మాకు దక్కాల్సిన బీమా మొత్తం మీ కంపెనీ 78 00:05:04,096 --> 00:05:06,306 అందించే వరకూ పనంతా ఆగిపోయింది. 79 00:05:07,140 --> 00:05:10,770 లేదు. మీరు తీరిగ్గా చూసి తిరిగి కాల్ చేసే వరకూ నేను ఆగలేను. 80 00:05:12,062 --> 00:05:13,902 సరే. నేను వెయిట్ చేస్తాను. 81 00:05:14,314 --> 00:05:17,034 -ఎవరిమీద అంత కోపంగా ఉన్నావు? -ఇన్స్యూరెన్స్ కంపెనీ. 82 00:05:17,109 --> 00:05:20,199 వాళ్ళు మళ్ళీ నన్ను హోల్డ్ లో ఉంచారు. మనకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. 83 00:05:20,279 --> 00:05:22,989 మేము చూస్తున్నామని చెప్పారు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, 84 00:05:23,073 --> 00:05:25,373 అక్కడ ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టే వాళ్ళకి-- 85 00:05:25,450 --> 00:05:26,870 ఇప్పటికి ఫోన్ పెట్టేయ్యి. 86 00:05:26,952 --> 00:05:30,212 ఏంటి? లేదు. గంట నుండీ కష్టపడితే, ఇప్పటికి మేనేజర్ దొరికాడు. 87 00:05:30,289 --> 00:05:32,499 వాళ్ళు క్లెయిమ్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలుసు. 88 00:05:33,333 --> 00:05:35,173 ఎందుకంటే మనం కట్టాల్సిన మొత్తం కట్టలేదు. 89 00:05:40,507 --> 00:05:41,507 ఏం జరిగింది? 90 00:05:42,801 --> 00:05:45,641 నేను కొన్ని వాయిదాలు కట్టలేదనుకుంటా. నీకు చెప్పాలనుకున్నాను. 91 00:05:47,222 --> 00:05:48,222 నాన్నా. 92 00:05:49,349 --> 00:05:51,349 మీ అమ్మే ఈ విషయాలన్నీ చూసుకునేది. 93 00:05:53,103 --> 00:05:54,523 ఏం జరుగుతోంది? 94 00:05:54,605 --> 00:05:58,105 రిపేర్లకి మన దగ్గర డబ్బు లేకపోవడం తప్ప, వేరే ఏం లేదు. 95 00:05:59,985 --> 00:06:01,195 నన్ను క్షమించు, ఏమీ. 96 00:06:01,612 --> 00:06:02,702 పరవాలేదు. 97 00:06:03,322 --> 00:06:04,742 ఏదో ఒకటి చేద్దాం. 98 00:06:05,741 --> 00:06:07,781 నేను మళ్ళీ ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఫోన్ చేస్తాను. 99 00:06:08,577 --> 00:06:10,407 ఇందాక కఠినంగా మాట్లాడిన వ్యక్తికా? 100 00:06:10,996 --> 00:06:13,206 అవును. క్షమాపణతో మొదలుపెడతాను. 101 00:06:22,049 --> 00:06:25,339 లోగన్ కి థాంక్స్ చెప్పాలి, ఈ ఏడు ఇయర్ బుక్ కమిటీలో మనకి ఎక్కువమంది సభ్యులు ఉంటారు. 102 00:06:25,427 --> 00:06:26,427 వినడానికి బాగుంది. 103 00:06:26,512 --> 00:06:29,312 అయితే స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారో నీకు మంచి అవగాహనే ఉన్నట్లుంది? 104 00:06:29,389 --> 00:06:30,389 అవును. 105 00:06:30,849 --> 00:06:33,889 అయితే స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్ లో నేను గెలిచే ఛాన్స్ ఎంత ఉందంటావ్? 106 00:06:33,977 --> 00:06:35,597 నిజంగా తెలుసుకోవాలనుందా? 107 00:06:35,687 --> 00:06:36,937 అంత బాగా ఏం లేదు. 108 00:06:37,022 --> 00:06:38,152 మరీ సూటిగా చెబుతున్నావ్. 109 00:06:38,232 --> 00:06:43,112 నువ్వు స్మార్ట్ అని అందరికీ తెలుసుగానీ, ఆటల వ్యతిరేకిగా నీ పద్ధతి ఎవరికీ నచ్చలేదు. 110 00:06:43,195 --> 00:06:44,395 "ఆటల వ్యతిరేకా"? 111 00:06:45,197 --> 00:06:48,577 నువ్వు అన్నిటికీ దూరంగా ఉంటున్నావు. బాస్కెట్ బాల్ టీం, బేస్ బాల్ టీం, 112 00:06:48,659 --> 00:06:51,749 ఫుట్ బాల్ టీం, ఇంకా గర్ల్స్ వాలీ బాల్ టీంకి కూడా. 113 00:06:52,496 --> 00:06:53,906 మరీ ఎక్కువ చేసి చెబుతున్నావు. 114 00:06:55,707 --> 00:06:56,877 సరే, ఇప్పుడు ఏం చేయాలంటావ్? 115 00:06:56,959 --> 00:06:58,459 నాకు తెలీదు, కానీ నీకు ఎక్కువ టైం లేదు. 116 00:06:58,544 --> 00:06:59,844 ఎలక్షన్ కొద్ది రోజుల్లోనే ఉంది. 117 00:06:59,920 --> 00:07:01,670 నువ్వు ఉన్నదున్నట్లుగా చెప్పట్లేదనిపిస్తోంది. 118 00:07:01,755 --> 00:07:05,255 ఏది నిజమో అదే చెబుతున్నాను, నువ్వు ఓడిపోతావని అనిపిస్తోంది. సారీ. 119 00:07:09,388 --> 00:07:11,968 డాక్టర్ వాట్సన్ విషయంలో నాకొకటి అనిపిస్తోంది. 120 00:07:12,057 --> 00:07:13,927 ఆమె ఎడాప్టేషన్ నుండి వచ్చిందనుకుంటా. 121 00:07:14,017 --> 00:07:17,187 అంటే, ఎవరో రచయిత అసలు షెర్లాక్ హోమ్స్ కథని మార్చివేసి, 122 00:07:17,271 --> 00:07:19,231 -వాట్సన్ ని లేడీగా మార్చారా? -నిజమే అనిపిస్తోంది. 123 00:07:19,314 --> 00:07:22,904 అవును, మిస్టరీని ఛేదించడంలో సాయం చేసేందుకు జి. డబ్ల్యు అసలైన డిటెక్టివ్ ని 124 00:07:22,985 --> 00:07:25,025 పంపించకపోవడం యాదృశ్చికం అయ్యుంటుంది. 125 00:07:25,112 --> 00:07:26,452 ఏదో కారణం ఉండే ఉంటుంది. 126 00:07:31,952 --> 00:07:34,452 తను కొత్తగా వచ్చింది. మా ఇంగ్లీష్ క్లాసులో ఉంది. 127 00:07:34,538 --> 00:07:36,668 తను ఇంతకు ముందు చదివిన స్కూల్లో ఏదో చెడ్డ పని చేయడం వల్ల 128 00:07:36,748 --> 00:07:38,578 బయటికి పంపించేశారని ఎల్లీ చెప్పింది. 129 00:07:38,667 --> 00:07:41,037 అవన్నీ పుకార్లు. తను మంచిదే అయ్యుంటుంది. 130 00:07:41,128 --> 00:07:42,128 హేయ్. 131 00:07:44,256 --> 00:07:45,336 కాకపోయి ఉండొచ్చు. 132 00:07:50,804 --> 00:07:54,064 అందరూ దయచేసి మీ బుక్ లో 124వ పేజీ తెరవండి. 133 00:07:58,312 --> 00:07:59,692 ఇంకా టెక్స్ట్ బుక్ తేలేదా, స్లోన్? 134 00:08:02,941 --> 00:08:05,491 డోనా, కొంచెం తనతో షేర్ చేసుకుంటావా? 135 00:08:14,453 --> 00:08:15,753 హేయ్. నేను డోనా. 136 00:08:20,250 --> 00:08:24,380 డోనా, స్లోన్ కొత్తగా వచ్చింది కాబట్టి, తను అలవాటు పడేవరకూ సాయం చేసే బాధ్యత నీదే. 137 00:08:38,227 --> 00:08:39,597 నీ ఫ్రెండ్స్ మేడ మీద ఉన్నారు. 138 00:08:39,686 --> 00:08:44,266 నాకు తెలుసు. పెద్ద అసైన్మెంట్ ఉంది ...తిమింగలాల బయాలజీ. 139 00:08:44,942 --> 00:08:46,942 తిమింగలాల బయాలజీ? ఈ క్లాస్ లోనా? 140 00:08:50,239 --> 00:08:51,409 ఎందుకంత నవ్వుతున్నావు? 141 00:08:51,490 --> 00:08:53,620 -ఇది చూడు. -అది నువ్వేనా? 142 00:08:53,700 --> 00:08:56,040 అవును. నేను, గ్రెగ్. 143 00:08:56,119 --> 00:08:58,369 హోం కమింగ్ ఆట పూర్తయిన వెంటనే దిగాం. 144 00:08:58,455 --> 00:09:00,415 మిస్టర్ సాండర్స్ జుట్టు బాగుంది. 145 00:09:00,499 --> 00:09:02,379 అవును. నాకు చాలా ఇష్టం. 146 00:09:05,295 --> 00:09:09,715 నేనొక బెట్ గెలిచాను. హాట్ డాగ్ వేషంలో హాలోవీన్ కి వెళ్ళిన విషయమతను మర్చిపోయాడు. 147 00:09:09,800 --> 00:09:11,640 మీరిద్దరూ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారా? 148 00:09:12,052 --> 00:09:13,722 ఎప్పుడైనా ఒకసారి. 149 00:09:14,096 --> 00:09:15,716 నీకు అతనంటే ఇష్టమని అర్థమవుతోంది. 150 00:09:17,266 --> 00:09:19,516 మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అతను నీ టీచర్. 151 00:09:19,601 --> 00:09:22,061 నేను అతనికి దగ్గరవ్వాలని అనుకోవట్లేదు. చూడ్డానికి బాగోదు. 152 00:09:23,105 --> 00:09:24,935 అదేం లేదు. అతను బాగుంటాడు. 153 00:09:25,482 --> 00:09:26,982 అయితే నీకు ఎలాంటి ఇబ్బంది లేదా? 154 00:09:27,067 --> 00:09:29,437 నేను అతనితో టైం గడపాల్సిన అవసరం లేనంతవరకూ! 155 00:09:33,615 --> 00:09:34,615 హేయ్. 156 00:09:35,742 --> 00:09:38,162 మా అమ్మ మిస్టర్ సాండర్స్ కి దగ్గరవబోతోంది. 157 00:09:38,245 --> 00:09:40,115 నిజమా? చాలా బాగుంది. 158 00:09:40,205 --> 00:09:41,415 అవును, అతనంటే నాకిష్టం. 159 00:09:41,498 --> 00:09:43,498 మనం మిస్టర్ సాండర్స్ గురించి మాట్లాడుకోకుండా ఉందామా? 160 00:09:43,584 --> 00:09:46,594 మనం చర్చించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మిస్టరీ లాంటివి. 161 00:09:46,670 --> 00:09:49,130 అవును. మరైతే, ఏదైనా దొరికిందా? 162 00:09:49,214 --> 00:09:51,514 సరే. షిర్ల్, ఇంకా జోన్ అసలైన షెర్లాక్ హోమ్స్ కథకి 163 00:09:51,592 --> 00:09:54,512 ఎడాప్టేషన్ లోని వారని తెలుసుకున్నాం. 164 00:09:54,595 --> 00:09:55,925 వాళ్ళ కథల కలెక్షన్ ఇక్కడుంది. 165 00:09:56,013 --> 00:09:57,893 దాని పేరు ది గ్రేట్ మిస్టరీస్ ఆఫ్ షెర్లాక్: 166 00:09:57,973 --> 00:10:00,143 అడ్వెంచర్స్ ఆఫ్ షిర్ల్ మరియు వాట్సన్. 167 00:10:00,225 --> 00:10:02,765 వాళ్ళు వచ్చిన కథ పేరు "అడ్వెంచర్స్ ఆఫ్ ది ఎంప్టీ హౌస్". 168 00:10:02,853 --> 00:10:04,153 ది గ్రేట్ మిస్టరీస్ ఆఫ్ షెర్లాక్ అడ్వెంచర్స్ ఆఫ్ షిర్ల్ మరియు వాట్సన్ 169 00:10:07,482 --> 00:10:08,482 ఖాళీ. 170 00:10:11,570 --> 00:10:14,320 -అది నీకు ఎక్కడ దొరికింది? -దెయ్యాలు లేని ఒక బుక్ స్టోర్ లో. 171 00:10:14,406 --> 00:10:15,816 నేనేం కనిపెట్టానో వినండి. 172 00:10:15,908 --> 00:10:19,118 చివరికి షెర్లాక్, మోరియార్టీ ఒక వాటర్ ఫాల్ మీదినుండి పడిపోతారు. 173 00:10:19,203 --> 00:10:20,703 వాళ్ళు చనిపోయారనే అందరూ అనుకుంటారు. 174 00:10:20,787 --> 00:10:23,617 కానీ తర్వాత, షిర్ల్ తన చావుని దాచిపెట్టినట్లు తెలుస్తుంది. 175 00:10:23,707 --> 00:10:26,747 ఆగు, షెర్లాక్ బతికే ఉన్నారా? 176 00:10:26,835 --> 00:10:29,915 ఆమె మోరియార్టీ మనిషి మొరాన్ కోసం వెతుకుతోంది. 177 00:10:30,005 --> 00:10:32,125 బుక్ లో, ఆమె ఒక కూరగాయలు అమ్మే వ్యక్తిగా దాక్కుంది. 178 00:10:32,216 --> 00:10:34,046 ఆమె బతికున్న విషయం వాట్సన్ కి కూడా తెలీదు. 179 00:10:34,134 --> 00:10:37,014 మనం షెర్లాక్-- సారీ, షిర్ల్ ని ఎలా కనిపెట్టొచ్చో కథలో ఉందా? 180 00:10:37,095 --> 00:10:39,425 ఆమె కావాలని కుళ్ళిపోయిన పండ్లని వాట్సన్ కి అమ్ముతుంది. 181 00:10:39,515 --> 00:10:42,385 వాట్సన్ వాటిని తిరిగి ఇవ్వడానికి వచ్చినపుడు, షిర్ల్ నిజం చెబుతుంది. 182 00:10:42,476 --> 00:10:43,476 ఆసక్తిగా ఉంది. 183 00:10:43,560 --> 00:10:45,810 మరైతే మనం మార్కెట్ కి వెళ్దామా? 184 00:10:45,896 --> 00:10:47,056 రేపు స్కూలు పూర్తయ్యాక? 185 00:10:47,147 --> 00:10:49,727 పర్ఫెక్ట్. ఎలాగూ మా ఇంట్లో ప్లమ్స్ అయిపోయాయి కూడా. 186 00:10:49,816 --> 00:10:51,436 నువ్వు, నీ ప్లమ్స్ గొడవేంటి? 187 00:10:53,153 --> 00:10:54,863 జి.డబ్ల్యు. మనల్ని నిరాశపరచరని నాకు తెలుసు. 188 00:10:58,033 --> 00:11:00,743 స్లోన్ కి అన్నీ చూపించే బాధ్యత మిస్టర్ మెండోజా నాకు అప్పగిస్తారని ఊహించలేదు. 189 00:11:00,827 --> 00:11:04,247 ఈరోజు నేను తనతో కలిసి లంచ్ చేయాలి, కానీ తనలా ఎందుకు ప్రవర్తిస్తోందో తెలియట్లేదు. 190 00:11:04,748 --> 00:11:06,918 జాగ్రత్త. నిన్ను బతికుండగానే తినేస్తుందేమో. 191 00:11:07,000 --> 00:11:09,380 స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్షన్ గురించి ఆమె అభిప్రాయం ఏంటి? 192 00:11:09,461 --> 00:11:11,461 -తన ఓటు నాకు దక్కుతుందా? -దక్కదు. 193 00:11:12,339 --> 00:11:14,419 సరే, నిన్న రాత్రి నేను కథ చదివాను. 194 00:11:14,508 --> 00:11:17,968 మిస్టరీ గొప్పగా ఉంది, వాళ్ళు ఆడవాళ్ళవడం నాకు నచ్చింది. 195 00:11:18,053 --> 00:11:21,893 చారిత్రక పాత్రల్ని స్త్రీలతో రూపొందించడం బాగుంటుందని ఫెమినిస్ట్ గా భావిస్తున్నాను. 196 00:11:21,974 --> 00:11:25,394 బాగుంది డోనా, కానీ అసలు ప్రశ్న ఏంటంటే షెర్లాక్ ఎక్కడ అని? 197 00:11:32,442 --> 00:11:34,072 ఇప్పుడేం జరిగిందో నాకు అర్థం కాలేదు. 198 00:11:34,152 --> 00:11:37,242 నాకు అర్థమయింది. ఘోస్ట్ రైటర్ జ్యూస్ లో ఎలా రాశారో గుర్తు చేసుకో. 199 00:11:44,788 --> 00:11:46,788 ఆగండి. దాన్ని శుభ్రం చేయొద్దు. 200 00:11:47,833 --> 00:11:49,043 మేము కేవలం... 201 00:11:51,837 --> 00:11:53,207 సరే, ఏమీ దొరకలేదు. 202 00:11:55,090 --> 00:11:56,220 థాంక్స్. 203 00:11:56,717 --> 00:12:00,097 ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది. పిల్లలు పారబోయడం అనేది మామూలే. 204 00:12:03,015 --> 00:12:04,095 మీకు కొత్తగా వచ్చారా? 205 00:12:04,808 --> 00:12:07,018 అవును, మిమ్మల్ని ఎప్పుడూ మేము చూడలేదే. 206 00:12:08,187 --> 00:12:09,227 కానీ... 207 00:12:10,731 --> 00:12:12,481 మీరెవరో మాకు తెలుసనుకుంటున్నాను. 208 00:12:15,485 --> 00:12:18,695 మీరు షెర్లాక్ హోమ్స్, అందరూ షిర్ల్ అని పిలుస్తారు. 209 00:12:18,780 --> 00:12:20,240 మీరు చనిపోయినట్లు నటిస్తున్నారు. 210 00:12:20,324 --> 00:12:21,954 ఆ విషయం మీకు ఎలా తెలుసు? 211 00:12:23,911 --> 00:12:24,911 మేము... 212 00:12:25,996 --> 00:12:27,206 -ఫ్రెండ్స్. -ఉ-హుమ్. 213 00:12:27,289 --> 00:12:29,709 మీ ఫ్రెండ్ వాట్సన్ మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. 214 00:12:30,209 --> 00:12:31,789 మై డియర్ వాట్సన్. 215 00:12:32,252 --> 00:12:33,922 తనని మళ్ళీ చూస్తే నేను చాలా సంతోషిస్తాను, 216 00:12:34,004 --> 00:12:37,014 కాకపోతే ఇన్నాళ్ళూ కనపడకుండా పోయినందుకు తను నామీద కోపగించుకుంటుంది. 217 00:12:37,090 --> 00:12:38,720 ఆమె అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. 218 00:12:39,426 --> 00:12:41,046 నాకు అర్థం కావట్లేదు. 219 00:12:41,803 --> 00:12:42,933 నువ్వు బతికే ఉన్నావా? 220 00:12:45,599 --> 00:12:46,679 వాట్సన్! 221 00:12:47,434 --> 00:12:50,694 పరవాలేదు. ఆమె కోలుకుంటుంది. కొంచెం కంగారుపడింది, అంతే. 222 00:12:51,063 --> 00:12:53,523 ఏం చెప్తున్నాను? ఆ, అవును. 223 00:12:53,607 --> 00:12:56,737 నాకు ఎంత మాత్రం అర్థం కాని విషయం ఏంటంటే, నేనిక్కడికి ఎలా వచ్చానా అని. 224 00:12:56,818 --> 00:12:59,398 ఒక్క నిమిషం, నేను లండన్ లో ఒక కూరగాయలమ్మే వ్యక్తిగా దాక్కున్నాను. 225 00:12:59,488 --> 00:13:01,818 మరో నిమిషంలో, మీ వింత ప్రపంచంలోకి వచ్చాను. 226 00:13:01,907 --> 00:13:04,027 మేము చెబుతాం కానీ మీరు విని తట్టుకోలేరేమో. 227 00:13:04,117 --> 00:13:05,827 వద్దు, చెప్పొద్దు. అందులో సరదా ఏముంటుంది? 228 00:13:05,911 --> 00:13:07,581 ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. 229 00:13:09,373 --> 00:13:11,293 అంటే, ఇది కల కాదన్నమాట. 230 00:13:12,084 --> 00:13:13,464 నువ్వు నిజంగానే బతికి ఉన్నావు. 231 00:13:13,544 --> 00:13:17,094 అవును, మై డియర్ వాట్సన్. నేను కనిపించకుండా పోయినందుకు క్షమించు. 232 00:13:17,172 --> 00:13:19,632 కానీ నేను బతికి ఉన్నానన్న విషయం నా శత్రువులకు తెలియకూడదు. 233 00:13:19,716 --> 00:13:21,796 కానీ నువ్వు నన్ను నమ్మి ఉండాల్సింది. 234 00:13:21,885 --> 00:13:23,425 అవును ఖచ్చితంగా ఉండాల్సింది, 235 00:13:23,512 --> 00:13:26,392 కానీ ఏదో ఒక పథకం వేసే వరకూ ఎటువంటి గుర్తూ వదలాలని అనుకోలేదు. 236 00:13:29,852 --> 00:13:33,692 నిన్ను మళ్ళీ చూడడం నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. 237 00:13:35,524 --> 00:13:37,284 సరే, సరే. ఇంక చాలు. 238 00:13:37,609 --> 00:13:40,529 వచ్చి ఈ అబ్బాయి దగ్గరున్న బుక్ లో ఉన్న క్లూస్ చూడు. 239 00:13:40,612 --> 00:13:42,492 వాళ్ళొక క్లిష్టమైన కేసును పరిష్కరించే దిశలో ఉన్నారు. 240 00:13:43,365 --> 00:13:45,825 విషయమేంటంటే, ఒక ఘోస్ట్ మాకు సందేశాలు పంపిస్తోంది. 241 00:13:45,909 --> 00:13:47,409 మా అమ్మమ్మ అయ్యుండొచ్చని మొదట అనుకున్నాం. 242 00:13:47,494 --> 00:13:50,374 కానీ ఇప్పుడు అది మేసన్ బ్రిగ్స్ పేరున్న ఒక మిస్టరీ రైటర్ అని తెలిసింది. 243 00:13:50,455 --> 00:13:52,365 అతను రాసిన రాతప్రతి ఒకటి పబ్లిష్ కాకుండా ఉంది. 244 00:13:52,457 --> 00:13:54,207 మాతో పబ్లిష్ చేయించాలని అనుకుంటున్నారని అనిపిస్తోంది. 245 00:13:54,293 --> 00:13:57,383 కానీ ఎక్కడ మొదలుపెట్టాలో మాకు తెలియట్లేదు, అతను క్లూ ఇచ్చి కూడా కొంతకాలం అయింది. 246 00:13:57,462 --> 00:14:00,012 పెద్ద కుట్రలా ఉంది. మాకు అన్నీ చూపించండి. 247 00:14:02,968 --> 00:14:07,758 ఒక అపరిచితుడు మీ అమ్మమ్మకి లోపల చెక్ తో పాటు ఈ బుక్ ఇచ్చాడా? 248 00:14:07,848 --> 00:14:09,058 అవును, ఏదో విధంగా మా అమ్మమ్మకి కూడా 249 00:14:09,141 --> 00:14:11,481 దీంతో ఏదో సంబంధం ఉందని మాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. 250 00:14:12,019 --> 00:14:13,729 కానీ ఎలాగో మాకు తెలీదు. 251 00:14:13,812 --> 00:14:15,482 లెటర్ గురించి మర్చిపోకు. 252 00:14:16,148 --> 00:14:17,518 ఘోస్ట్ మాకు ఈ లెటర్ అందేలా చేసింది. 253 00:14:17,608 --> 00:14:20,438 ఎవరో "ఎస్" నుండి వచ్చింది, అది ఎవరో మాకు తెలీదు. 254 00:14:21,486 --> 00:14:24,276 ఈ మేసన్ బ్రిగ్స్ గురించి తెలుసుకోవడమే మీ తరువాత చేయాల్సింది. 255 00:14:24,364 --> 00:14:25,204 మీ "ఎస్" 256 00:14:25,282 --> 00:14:28,792 నేను వెంటనే కోర్ట్ హౌస్ కి వెళ్లి ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటాను. 257 00:14:28,869 --> 00:14:30,079 మీరు వెళ్ళకూడదు. 258 00:14:30,996 --> 00:14:32,246 కానీ మేము వెళ్ళాలి. కమాన్. 259 00:14:32,331 --> 00:14:34,831 మీకు మేసన్ బ్రిగ్స్ గురించి ఏ వివరాలూ తెలియవు. 260 00:14:34,917 --> 00:14:35,957 ఎందుకు? 261 00:14:36,043 --> 00:14:39,003 అది చాలా సింపుల్, మై డియర్ కర్టిస్. కానీ నేను దాన్ని చెప్పేస్తే, 262 00:14:39,087 --> 00:14:42,007 మిమ్మల్ని మంచి డిటెక్టివ్స్ గా చేయనట్లే, అవునా? 263 00:14:42,090 --> 00:14:45,140 డిటెక్టివ్స్ గా ఎలా అవ్వాలో మీరు మాకు నేర్పుతారా? చాలా బాగుంది. 264 00:14:45,594 --> 00:14:47,514 మీ నైపుణ్యం నాకు నచ్చింది. 265 00:14:47,596 --> 00:14:51,056 మరికొంచెం ట్రైనింగ్ తీసుకుంటే, మీరు ఛేదించలేని మిస్టరీ అనేదే ఉండదు. 266 00:14:51,141 --> 00:14:54,311 ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూసి, ఏం కనిపిస్తోందో చెప్పండి. 267 00:14:55,270 --> 00:14:56,900 అది ప్లాజా. 268 00:14:56,980 --> 00:14:58,400 అదేమో హోటల్. 269 00:14:59,942 --> 00:15:00,982 దీని సంగతేంటి? 270 00:15:03,195 --> 00:15:04,565 అది బ్రిడ్జి. 271 00:15:04,655 --> 00:15:05,485 ఇంకా? 272 00:15:09,952 --> 00:15:11,622 బ్రిడ్జి మీద ఏదో రాసి ఉంది. 273 00:15:16,208 --> 00:15:18,248 ఏదో "స్టీల్." 274 00:15:22,381 --> 00:15:24,051 "మేసన్ ఫ్యామిలీ స్టీల్." 275 00:15:25,092 --> 00:15:27,642 మేసన్ లాగా? నాకు అర్థం కాలేదు. 276 00:15:27,719 --> 00:15:28,929 దీని సంగతేంటి? 277 00:15:32,766 --> 00:15:34,056 అది సింహం విగ్రహం. 278 00:15:34,768 --> 00:15:36,138 దానిమీద కూడా ఏదో రాసి ఉంది. 279 00:15:39,565 --> 00:15:43,395 "జనరల్ జేమ్స్ బ్రిగ్స్ జ్ఞాపకార్థం." 280 00:15:43,485 --> 00:15:44,735 జేమ్స్ బ్రిగ్స్? 281 00:15:45,195 --> 00:15:48,525 అతను మేసన్ బ్రిగ్స్ కి సంబంధించినవాడా? ఎంత యాదృశ్చికం! 282 00:15:49,241 --> 00:15:51,951 ప్రియమైన షిర్ల్ దగ్గరినుండి నేను నేర్చుకున్నది ఏంటంటే, 283 00:15:52,035 --> 00:15:55,905 జీవితంలో యాదృశ్చికం అనేది ఉండదు, క్లూలు మాత్రమే ఉంటాయి. 284 00:15:55,998 --> 00:16:00,378 అంటే, బ్రిడ్జి మీద "మేసన్ ఫ్యామిలీ స్టీల్" అని రాసి ఉండడం, విగ్రహం 285 00:16:00,460 --> 00:16:03,170 జేమ్స్ బ్రిగ్స్ జ్ఞాపకార్థంగా ఉండడం యాదృశ్చికం కాదు. 286 00:16:04,548 --> 00:16:07,218 ఆగండి. నాకు అర్థమయింది. 287 00:16:08,802 --> 00:16:10,852 మేసన్ బ్రిగ్స్ అనేది నకిలీ పేరు. 288 00:16:11,471 --> 00:16:14,521 సరిగ్గా చెప్పావు. మేసన్ బ్రిగ్స్ ఒక మారుపేరు. 289 00:16:19,146 --> 00:16:20,976 మనం అతని మొహాన్ని చూడగలిగితే బాగుండేది. 290 00:16:21,064 --> 00:16:23,154 అతని మొహాన్ని కావాలని దాచినట్లనిపిస్తోంది. 291 00:16:23,233 --> 00:16:25,113 అంటే మేసన్ బ్రిగ్స్ నిజంగా లేడా? 292 00:16:25,194 --> 00:16:27,204 అతని రాతప్రతిని కనుక్కునేదేలా? 293 00:16:27,613 --> 00:16:29,493 నిరుత్సాహపడకండి. 294 00:16:29,573 --> 00:16:33,333 మిస్టరీలో ఇలాంటి అవరోధాలే చాలా ఉత్సాహకరంగా ఉంటాయి. 295 00:16:36,955 --> 00:16:39,365 ఏ మ్యాన్ వితౌట్ బోన్స్ 296 00:16:39,458 --> 00:16:41,918 ఇతని మొహాన్ని దగ్గరగా చూడడం ఎలాగో నాకు తెలుసు. 297 00:16:42,586 --> 00:16:44,626 స్కూల్లో ఆర్ట్ క్లాసులో ఫోటో సాఫ్ట్ వేర్ ఉంది. 298 00:16:45,047 --> 00:16:47,467 సరిగ్గా చెప్పావు. మనం పోస్టర్ల లాంటి వాటికి దాన్ని వాడతాం కదా. 299 00:16:47,549 --> 00:16:49,969 దాంతో నీడని తొలగించొచ్చు అనుకుంటున్నాను. 300 00:16:52,638 --> 00:16:54,428 ఇది పనిచేస్తుందనే అనుకుంటా. 301 00:16:54,515 --> 00:16:57,135 చెప్పి తీరాలి, ఇలాంటి ఆవిష్కరణలు మా కాలంలో ఉండి ఉంటే, 302 00:16:57,226 --> 00:17:00,096 -నీకు ఉద్యోగం ఉండేది కాదు, షిర్ల్. -అసాధ్యం, జోన్. 303 00:17:00,187 --> 00:17:01,977 అందులో ఉండే సరదా మొత్తం పోతుంది. 304 00:17:02,064 --> 00:17:05,324 వర్షంలో చల్లని దారుల్లో క్లూస్ కోసం వెతుకుతూ ఉంటే! 305 00:17:05,817 --> 00:17:06,977 ఆ రోజులే వేరు. 306 00:17:07,069 --> 00:17:10,279 నీకు వర్షం నచ్చదుగా. క్లూస్ అన్నింటినీ అది చెరిపి వేస్తుందని అంటావు. 307 00:17:11,823 --> 00:17:14,283 నాకు తెలీదు. ఇప్పటికీ కనిపించడం లేదు. 308 00:17:14,367 --> 00:17:17,197 మేఘాల్లో ఆకారాల్ని వెతికి, వాటితో ఆడుకుంటున్నట్లు ఉంది. 309 00:17:17,538 --> 00:17:19,078 ఆ ఆటంటే నాకిష్టం. 310 00:17:22,459 --> 00:17:23,669 ఇది అర్థం లేనిది. 311 00:17:24,086 --> 00:17:26,296 -అది పనిచేయలేదు. -సరదా కాదు, షెర్లాక్. 312 00:17:29,466 --> 00:17:30,926 హేయ్, జేక్. ఆగమన్నానా. 313 00:17:31,385 --> 00:17:32,795 హాయ్, షెవాన్. ఏంటి సంగతి? 314 00:17:33,220 --> 00:17:36,350 నేరుగా విషయానికొస్తాను. నేను నీకు ఆటల వ్యతిరేకిలాగా కనిపిస్తున్నానా? 315 00:17:37,307 --> 00:17:41,057 నీ ప్రశ్న వింతగా ఉంది. కానీ, అవును. మాలో ఎక్కువమంది ఏషర్ కే ఓటు వేస్తున్నాం. 316 00:17:41,603 --> 00:17:44,573 నేను నీ మనసు మార్చే అవకాశం ఏమైనా ఉందా? అలాగే నీ ఓటు కూడా? 317 00:17:44,648 --> 00:17:46,688 నిజం చెప్పాలంటే, నువ్వు గెలిస్తే బాస్కెట్ బాల్ టీంకి 318 00:17:46,775 --> 00:17:49,355 ఫండింగ్ రాకుండా చేస్తావని అందరూ అనుకుంటున్నారు. 319 00:17:49,444 --> 00:17:52,364 నేనెందుకలా చేస్తాను? నాకు ఆటలంటే ఇష్టం. 320 00:17:52,447 --> 00:17:55,527 చెప్పాలంటే, నేను వాలీ బాల్ లో చేరాలని అనుకుంటున్నాను. 321 00:17:55,617 --> 00:17:58,907 మంచి ప్రయత్నం. నేను, ఇంకా మిగతా అథ్లెట్లందరూ దీన్ని గుర్తించేలా చూస్తాను. 322 00:18:00,956 --> 00:18:01,956 షెవాన్. 323 00:18:03,667 --> 00:18:05,247 నేను ఈ ఎలక్షన్ ఎప్పటికీ గెలవలేను. 324 00:18:05,335 --> 00:18:07,625 రాత్రికి రాత్రే అథ్లెట్ అయిపోవాల్సి వచ్చేలా ఉంది. 325 00:18:07,713 --> 00:18:09,923 నువ్వు కాని వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించడం మానేయి. 326 00:18:11,091 --> 00:18:14,551 సరిగ్గా చెప్పావు. నేను మరోకరిలా ఉండలేను. 327 00:18:15,262 --> 00:18:18,222 -కానీ నేను మరొకరితో పాటు నిలబడొచ్చు కదా. -అది పనిచేయొచ్చు. 328 00:18:20,017 --> 00:18:21,597 నువ్వు ఉంటావా? నువ్వు నాతో పాటు నిలబడతావా? 329 00:18:21,685 --> 00:18:23,475 స్టూడెంట్ కౌన్సిల్ కోసమా? జోక్ చేస్తున్నావా? 330 00:18:23,562 --> 00:18:24,902 నేను జోక్ చేస్తున్నట్లు అనిపిస్తోందా? 331 00:18:24,980 --> 00:18:26,020 నేను చెప్పలేను. 332 00:18:26,106 --> 00:18:27,646 కర్టిస్, ప్లీజ్. 333 00:18:27,733 --> 00:18:28,983 అందరూ నిన్ను ఇష్టపడతారు. 334 00:18:29,067 --> 00:18:31,897 మనిద్దరం కలిసి నిలబడితే, ఖచ్చితంగా గెలిచి తీరతాం. 335 00:18:31,987 --> 00:18:34,277 సారీ, షెవాన్, పాలిటిక్స్ నాకు ఇష్టం లేదు. 336 00:18:34,364 --> 00:18:37,704 ఎవరో ఒకరిని ఎంచుకోవాలి, నాకది ఇష్టంలేదు. మళ్ళీ కలుద్దాం. 337 00:18:46,919 --> 00:18:49,959 నేను మిస్టరీని ఛేదించే దిశగా ఒకడుగు వేశాను. 338 00:18:50,839 --> 00:18:52,799 మంచిది, ఎందుకంటే నాకు ఎలాంటి క్లూ దొరకలేదు. 339 00:18:52,883 --> 00:18:56,973 నీకు, నీ ముగ్గురు ఫ్రెండ్స్ కి మాత్రమే వాట్సన్, నేను కనిపిస్తాం కదా. 340 00:18:57,888 --> 00:19:00,718 అది మిస్టరీ. దాన్ని నేను వివరించగలను. 341 00:19:00,807 --> 00:19:03,517 వద్దు, నేను ఒప్పుకోను. నేను పరిష్కరించని కేసు అంటూ లేదు. 342 00:19:03,602 --> 00:19:05,732 నాకు అర్థం కాని విషయం ఒకటుంది. 343 00:19:05,812 --> 00:19:08,152 నువ్వు అర్థం చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి, జోన్. 344 00:19:08,232 --> 00:19:09,862 నీకు జర్మన్, ఫ్రెంచ్ అర్థం కావు. 345 00:19:10,901 --> 00:19:15,361 నీ మారువేషాన్ని నువ్వు ఎలా కాపాడుకున్నావో నాకు అర్థం కావట్లేదు. 346 00:19:15,447 --> 00:19:17,157 ఎవరో ఒకరు నీకు సాయం చేసి ఉండాలి. 347 00:19:30,462 --> 00:19:31,462 హాయ్, రూబెన్. 348 00:19:32,005 --> 00:19:35,215 హాయ్. అమ్మ రెడీ అవుతోంది. లోపలికి రండి. 349 00:19:35,300 --> 00:19:36,340 ఓకే, థాంక్స్. 350 00:19:39,471 --> 00:19:41,971 గుర్తుంచుకోండి, మీరు నాకు, నా ఫ్రెండ్స్ కి మాత్రమే కనిపిస్తారు. 351 00:19:42,057 --> 00:19:43,887 డిటెక్టివ్ అదృశ్యంగా ఉండడం కంటే ఇంకేం కావాలి. 352 00:19:43,976 --> 00:19:45,346 ఎవరూ మనల్ని గమనించకుండా మనమే గమనించొచ్చు. 353 00:19:45,435 --> 00:19:48,105 టాపిక్ మార్చకు. ఈ విషయంలో నేను చాలా అప్ సెట్ అయ్యాను. 354 00:19:49,356 --> 00:19:52,856 -షిర్ల్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. -ఇప్పుడు కాదు జోన్. ఎక్కడో తేడాగా ఉంది. 355 00:19:57,573 --> 00:19:59,833 నేను ఇప్పుడే నా హోం వర్క్ పూర్తి చేశాను. 356 00:20:01,034 --> 00:20:04,004 నేను నీ టీచర్ గా ఇక్కడికి రాలేదు, రూబెన్. కానీ మంచిది. 357 00:20:08,834 --> 00:20:10,634 గ్రెగ్. వెళ్దామా? 358 00:20:11,211 --> 00:20:12,211 పద. 359 00:20:12,921 --> 00:20:13,921 బై, రూబెన్. 360 00:20:14,423 --> 00:20:15,843 బై, మిస్టర్ సాండర్స్. 361 00:20:15,924 --> 00:20:17,474 బై, హనీ. మళ్ళీ కలుస్తాను. 362 00:20:17,551 --> 00:20:19,761 -బై, అమ్మా. లవ్ యు. -లవ్ యు టూ. 363 00:20:22,764 --> 00:20:24,184 తను చాలా ఆనందంగా కనిపిస్తోంది. 364 00:20:24,558 --> 00:20:26,978 నేను అప్రమత్తంగా ఉండాలి. అతన్ని నేను నమ్మను. 365 00:20:27,561 --> 00:20:29,191 ఏం? ఎందుకు? 366 00:20:29,563 --> 00:20:31,153 ఆమె మాటలు వినకు, రూబెన్. 367 00:20:31,231 --> 00:20:33,481 నాతో మాట్లాడకుండా ఉండడానికి ఇదంతా చేస్తోంది. 368 00:20:33,567 --> 00:20:35,317 ఒక వ్యక్తి మీద ఉండేవన్నీ ఒక కథ చెబుతాయి. 369 00:20:35,402 --> 00:20:38,662 షూ లేసుల దగ్గరినుండి గోళ్ళ అంచుల వరకూ. 370 00:20:38,739 --> 00:20:41,779 మీ టీచర్ విషయానికొస్తే, అతని వేళ్ళపై కాలిన మచ్చలున్నాయి. 371 00:20:41,867 --> 00:20:45,247 అతను కూర్చున్నప్పుడు, నడుం నొప్పితో బాధపడుతున్నట్లు అనిపించింది. 372 00:20:46,079 --> 00:20:47,409 నేను అవేమీ గమనించలేదు. 373 00:20:47,497 --> 00:20:49,287 ఇలాంటివన్నీ గమనించడం మొదలుపెట్టాలి. 374 00:20:49,374 --> 00:20:51,294 ఒక చిన్న వివరం మొత్తం కథని చెప్పగలదు. 375 00:20:52,002 --> 00:20:54,342 అంటే, అతనికి నడుం నొప్పి ఉందన్నమాట. అయితే ఏంటి? 376 00:20:54,421 --> 00:20:57,341 అతను ఏదో రహస్యాన్ని దాస్తున్నాడని చెబుతున్నాను. 377 00:20:57,758 --> 00:20:59,968 దాస్తోంది అతను ఒక్కడే కాదు. 378 00:21:16,026 --> 00:21:18,856 హే, స్లోన్. నీ టెక్స్ట్ బుక్స్ అన్నీ తెచ్చుకున్నావా? 379 00:21:19,821 --> 00:21:20,991 ఆ-హా. 380 00:21:22,324 --> 00:21:25,794 ఈ రోజు క్యాంటీన్లో ఫ్రీగా పెరుగు ఇస్తున్నారు. 381 00:21:25,869 --> 00:21:27,119 నాకు డైరీ పడదు. 382 00:21:28,580 --> 00:21:29,580 పడదేమోలే. 383 00:21:34,336 --> 00:21:35,706 సరే అయితే. బై. 384 00:21:38,340 --> 00:21:40,680 నాకు అర్థం కావట్లేదు. నేను తనతో మంచిగా ఉండాలనే ప్రయత్నిస్తున్నా. 385 00:21:40,759 --> 00:21:42,259 మరీ ఎక్కువగా ప్రయత్నించకు. 386 00:21:42,344 --> 00:21:44,474 మిస్టర్ మెండోజా అంతా తిప్పి చూపించమన్నారు, 387 00:21:44,555 --> 00:21:46,595 కానీ నాతో మాట్లాడకపోతే ఏం చేయాలి? 388 00:21:46,682 --> 00:21:48,232 నేను కనిపెట్టాను. 389 00:21:48,308 --> 00:21:51,348 ఫేమస్ కాని ఒక రచయిత రాసిన బుక్ లో నేనొక ఫిక్షనల్ పాత్రని. 390 00:21:51,436 --> 00:21:53,646 మీ ఘోస్ట్ ఫ్రెండ్ వల్ల ఇక్కడికి వచ్చాను. 391 00:21:54,481 --> 00:21:55,481 సరిగ్గా చెప్పారు. 392 00:21:55,566 --> 00:21:58,936 కానీ నేను ఫిక్షనల్ అవడం నన్ను కొంచెం నిరుత్సాహపరుస్తోంది. 393 00:21:59,027 --> 00:22:00,817 మీరు మాకెప్పుడూ అసలైన వారే. 394 00:22:00,904 --> 00:22:03,534 -థాంక్యూ. -కానీ మీరు ఎలా కనిపెట్టారు? 395 00:22:03,615 --> 00:22:06,365 అదీ, ముందుగా నేను సర్ ఆర్థర్ కోనన్ డోయల్ రాసిన 396 00:22:06,451 --> 00:22:08,001 షెర్లాక్ హోమ్స్ బుక్స్ కలెక్షన్ ని కనిపెట్టాను. 397 00:22:08,078 --> 00:22:11,208 ఆ పాత్రదీ నా పేరే అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. 398 00:22:11,290 --> 00:22:14,040 అప్పుడు నాకు అర్థమయింది, మీ ఘోస్ట్ ఫ్రెండ్ నన్ను ఇక్కడికి పంపించారని. 399 00:22:14,126 --> 00:22:17,836 కాబట్టి, నేను కూడా ఒక పాత్రని. అప్పుడు షెవాన్ బ్యాగులో పుస్తకం దొరికింది. 400 00:22:18,547 --> 00:22:19,797 అది అద్భుతం. 401 00:22:20,215 --> 00:22:21,925 కర్టిస్ మనల్ని ఆర్ట్ రూమ్ కి రమ్మన్నాడు. 402 00:22:22,009 --> 00:22:24,429 -ఎందుకు? -తెలీదు, కానీ వెళ్దాం పద. 403 00:22:27,097 --> 00:22:28,557 ఆర్ట్ రూమ్ 404 00:22:31,685 --> 00:22:34,645 నీ ఫ్రెండ్ కి అద్భుతమైన ఐడియా వచ్చింది. 405 00:22:34,730 --> 00:22:35,770 ఏంటది? 406 00:22:35,856 --> 00:22:37,816 అతని సగం మొహం నీడలో ఉంది కదా? 407 00:22:37,900 --> 00:22:38,820 అహ్-హా. 408 00:22:38,901 --> 00:22:41,821 వెలుగులో ఉన్న మొహాన్ని కాపీ చేసి ఇటు తిప్పితే? 409 00:22:42,613 --> 00:22:45,033 అంటే అతని మొహాన్ని తయారు చేయాలంటావా! 410 00:22:45,115 --> 00:22:45,985 నువ్వు జీనియస్. 411 00:22:53,165 --> 00:22:55,375 ఈ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. 412 00:22:56,126 --> 00:22:58,706 లండన్ లో వర్షపు రాత్రి క్లూల కోసం వెతకడం 413 00:22:58,795 --> 00:23:01,335 అద్భుతంగా ఉంటుందని నువ్వు చెప్పలేదూ? 414 00:23:09,640 --> 00:23:11,060 ఇప్పుడు మొహం స్పష్టంగా ఉంది. 415 00:23:12,059 --> 00:23:13,769 ఈ మొహాన్ని మనం చూశాం. 416 00:23:17,773 --> 00:23:21,693 ఈ బుక్ స్టోర్ కి మంచి అవకాశాలు కల్పించు. 417 00:23:22,236 --> 00:23:23,946 స్పార్కిల్ లో ఉన్నది గుర్తుందా? 418 00:23:24,029 --> 00:23:26,659 అతనే అమ్మమ్మకి బుక్ స్టోర్ కోసం చెక్ ఇచ్చాడు. 419 00:23:29,868 --> 00:23:31,118 నేను నమ్మలేకపోతున్నాను. 420 00:23:31,954 --> 00:23:34,874 అంటే బుక్ స్టోర్ కోసం మీ అమ్మమ్మకి డబ్బు ఇచ్చిన వ్యక్తి... 421 00:23:35,582 --> 00:23:36,792 మేసన్ బ్రిగ్స్. 422 00:24:35,350 --> 00:24:37,350 సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ