1 00:00:11,595 --> 00:00:14,845 పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కొత్త పాత్రలు విడుదలయ్యాయి అంటారా? 2 00:00:14,932 --> 00:00:17,892 కానీ ఆ మంత్రించిన పెయింట్ బ్రష్, అది దాని పుస్తకంలోకి వెళ్లిపోయింది కదా. 3 00:00:17,976 --> 00:00:20,476 ఒక్క రాత్రి అయినా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా, ఘోస్ట్ రైటర్? 4 00:00:21,021 --> 00:00:22,441 పస్తకం కవర్ చాలా బాగుంది. 5 00:00:22,856 --> 00:00:24,316 కోబాల్ట్ మాస్క్ 6 00:00:25,526 --> 00:00:27,946 చూస్తుంటే పాతది లాగా ఉంది. కొత్తది మాత్రం కాదు. 7 00:00:28,320 --> 00:00:29,400 దాన్ని రాసింది ఎవరు? 8 00:00:31,949 --> 00:00:33,529 రచయిత పేరు ఇక్కడ లేదు. 9 00:00:33,992 --> 00:00:35,332 ఇలా జరగడం ఇదే తొలిసారి. 10 00:00:35,869 --> 00:00:38,539 అసలు మనకి పుస్తకమే దొరక్కపోతే, ఆ పుస్తకంలో ఎవరున్నారో 11 00:00:38,622 --> 00:00:40,332 మనకి ఎలా తెలుస్తుంది? 12 00:00:41,083 --> 00:00:43,593 ఇది ఆసక్తిదాయకంగా ఉంటుంది. 13 00:00:55,556 --> 00:01:00,636 ఘోస్ట్ రైటర్ 14 00:01:02,646 --> 00:01:04,266 చాక్లెట్ ని ఎవరు కొంటారు? 15 00:01:04,690 --> 00:01:06,780 క్లాస్ అధ్యక్షురాలివి అవ్వడంలో ఇది నీకు ఎలా సాయపడుతుంది? 16 00:01:06,859 --> 00:01:10,279 దానికి కాదు. న్యూ యార్క్ నగరానికి మోడల్ యూఎన్ తరగతి యాత్రకి ఖర్చులు కలిసి వస్తాయి. 17 00:01:10,362 --> 00:01:12,032 నువ్వు ఎన్నికల మీద దృష్టి పెట్టాలేమో? 18 00:01:12,114 --> 00:01:14,994 అవును. కాబట్టి ఒక చాక్లెట్ కొనుక్కో, నేను ఆ పనికి ఇంకాస్త సమయం కేటాయించగలను. 19 00:01:19,246 --> 00:01:20,866 హేయ్. ఇక్కడ ఉన్నారన్నమాట. 20 00:01:20,956 --> 00:01:22,116 అందరికీ హాయ్. 21 00:01:22,207 --> 00:01:24,457 నీ కోసమే దీన్ని ఆఫీస్ లో పెడదామని వెళ్తున్నాను. 22 00:01:24,543 --> 00:01:27,133 నేను ఇంటికి వెళ్ళకముందే నీ సందేశం అందింది, అందుకు నువ్వు అదృష్టవంతుడివి. 23 00:01:27,713 --> 00:01:29,383 ధన్యవాదాలు, అమ్మా. నువ్వు నన్ను కాపాడావు. 24 00:01:31,508 --> 00:01:32,508 ఏమీ రేనా? 25 00:01:33,385 --> 00:01:35,135 దేవుడా. 26 00:01:35,220 --> 00:01:36,430 అది నువ్వే కదా? 27 00:01:36,513 --> 00:01:39,313 వావ్. నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను చూడటం చాలా బాగుంది. 28 00:01:39,391 --> 00:01:40,851 మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసా? 29 00:01:40,934 --> 00:01:42,444 తెలుసు, మేమిద్దరం ఒకే ఉన్నత పాఠశాలలో, ఒకే మాధ్యమిక పాఠశాలలో, 30 00:01:42,519 --> 00:01:45,309 -ఒకే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాం. -అవును. 31 00:01:45,397 --> 00:01:47,607 ఆ రోజుల్లో బడికి నువ్వు బస్సులో కాకుండా ఒక డొక్కు కారులో వచ్చేవాడివి. 32 00:01:47,691 --> 00:01:50,571 సరే. నవ్వొచ్చే విషయం. ఇప్పటికి కూడా. 33 00:01:50,652 --> 00:01:52,992 నేను నమ్మలేకపోతున్నాను. నీలో అస్సలు ఏ మార్పూ లేదు. 34 00:01:53,488 --> 00:01:55,118 కాకపోతే నీ జుట్టు ఇప్పుడు నీలి రంగులో లేదు. 35 00:01:55,199 --> 00:01:57,279 మీరు జుట్టుకు నీలి రంగు వేసుకొనేవారా, మిస్ రేనా? 36 00:01:57,784 --> 00:01:59,204 -వింతగా ఉంది. -చాలా బాగుంది. 37 00:01:59,286 --> 00:02:00,326 నాకు తెలుసు, కదా? 38 00:02:01,580 --> 00:02:03,120 మనం ఇక తరగతికి వెళ్ళాలనుకుంటా. 39 00:02:03,207 --> 00:02:05,377 అవును. నేను కూడా వెళ్ళాలి, బోధించేది నేనే కదా. 40 00:02:05,459 --> 00:02:06,789 వావ్. ఇది చిత్రంగా ఉంది. 41 00:02:06,877 --> 00:02:08,627 రూబెన్ కి మిస్టర్ సాండర్స్ అనే టీచర్ ఉన్నాడని గమనించి, 42 00:02:08,711 --> 00:02:10,381 అది నువ్వే అని గ్రహించలేకపోయానంటే నమ్మశక్యంగా లేదు. 43 00:02:10,464 --> 00:02:12,594 నేను కూడా. ఈ ప్రపంచం చాలా చిన్నది. 44 00:02:13,050 --> 00:02:14,260 నిన్ను చూడటం చాలా బాగుంది, గ్రెగ్. 45 00:02:14,343 --> 00:02:15,973 -గ్రెగ్? -నిన్ను కూడా, ఏమీ. 46 00:02:16,595 --> 00:02:17,595 ఉంటాను. 47 00:02:18,096 --> 00:02:19,096 నీలి జుట్టు లేకపోయినప్పటికీ. 48 00:02:23,227 --> 00:02:24,437 మీ అందరినీ క్లాస్ లో కలుస్తాను. 49 00:02:27,272 --> 00:02:29,902 మిస్టర్ సాండర్స్ మొదటి పేరును కనుగొన్నామంటే నమ్మలేకపోతున్నాను. 50 00:02:29,983 --> 00:02:32,113 అతని మొదటి పేరు గ్రెగ్ అని మీకు తెలీదా? 51 00:02:32,194 --> 00:02:33,904 మన టీచర్లందరి మొదటి పేర్లు నాకు తెలుసు. 52 00:02:33,987 --> 00:02:38,407 మర్చిపోయా, నేను డెబ్రా క్లాస్ కి వెళ్ళాలి. ఆలస్యమైతే తను అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. 53 00:02:42,955 --> 00:02:44,495 హేయ్, బంగారం. ఏం చేస్తున్నావు? 54 00:02:44,581 --> 00:02:46,331 నా జాకెట్ కి కొత్త స్లీవ్స్ ను కుడుతున్నాను. 55 00:02:46,416 --> 00:02:48,126 పాత స్లీవ్స్ కి ఏమైంది? 56 00:02:48,210 --> 00:02:51,550 నాకు అవి బోర్ కొట్టేశాయి. ఈ కొత్తవి భలే ఆకట్టుకుంటాయి. 57 00:02:51,630 --> 00:02:55,050 మరి ఆ పని చేయడంలో నీకు బోర్ కొట్టినప్పుడు, బనానా బ్రెడ్ ని చేయడంలో నాకు సాయపడతావా? 58 00:02:56,426 --> 00:02:59,716 అప్పుడు కాదు కానీ, బ్రెడ్ పూర్తయ్యాక అది తింటూ సాయపడతానులే. 59 00:02:59,805 --> 00:03:01,385 అంతా అయ్యాక గిన్నెని నాకనిస్తానులే. 60 00:03:01,473 --> 00:03:02,813 సైన్స్ క్లాస్ లో పచ్చి గుడ్లు 61 00:03:02,891 --> 00:03:05,351 ప్రమాదకరమని తెలుసుకున్నాక, గిన్నెని నాకడం మానేశాను. 62 00:03:05,435 --> 00:03:09,015 సరే, బేకింగ్ వద్దులే. కమాన్, ఇంకేదైనా చేద్దాం. 63 00:03:09,106 --> 00:03:12,026 ఇప్పుడు, వారంలో కేవలం సగం రోజులు మాత్రమే నీతో గడపగలను. 64 00:03:12,109 --> 00:03:13,649 ఏదైనా ఆట ఆడదాం. 65 00:03:13,735 --> 00:03:15,235 లేదా అలా బయటకు నడకకు వెళ్లొద్దాం. 66 00:03:15,320 --> 00:03:18,530 బనానా బ్రెడ్ కాకుండా ఫ్రోయో తెచ్చుకుందాం. ఇది ఆరోగ్యకరమైనది కూడా. 67 00:03:18,615 --> 00:03:20,525 మన్నించు, అమ్మా. దీన్ని పూర్తి చేసేయాలని అనుకుంటున్నా. 68 00:03:20,617 --> 00:03:21,827 నీతో పాటు "ప్యారిస్ రన్వే" చూస్తా. 69 00:03:23,036 --> 00:03:24,496 నీకు ఆ సీరియల్ నచ్చదని అనుకున్నానే. 70 00:03:25,038 --> 00:03:26,118 పర్వాలేదులే. 71 00:03:26,206 --> 00:03:28,376 పోటీదారులు వేసుకొన్న బట్టల మీద 72 00:03:28,458 --> 00:03:31,628 విమర్శలు చేస్తూ వాళ్ళని ఏడిపించే ఆ చెత్త జడ్జిలంటే నాకు పడదు, అంతే. 73 00:03:31,712 --> 00:03:33,382 అది ప్రతీ ఎపిసోడ్ లో జరిగేదే. 74 00:03:35,257 --> 00:03:36,377 ఒక్క నిమిషంలో వచ్చేస్తా. 75 00:03:54,651 --> 00:03:55,941 బాగా ఊడుస్తున్నావు, రూబెన్. 76 00:03:56,445 --> 00:03:57,985 తాతయ్యా, ఆ ట్యాక్సీని చూడు. 77 00:03:59,781 --> 00:04:00,871 ఏ ట్యాక్సీ? 78 00:04:04,453 --> 00:04:06,873 వెళ్లిపోయి ఉంటుందిలే. వదిలేయిలే. 79 00:04:07,706 --> 00:04:11,536 సరేమరి, నాకు పనుంది. క్లాసిక్ పుస్తకాల విభాగాన్ని వేరే విధంగా సర్దాలి. 80 00:04:25,891 --> 00:04:26,981 హాయ్. 81 00:04:27,601 --> 00:04:28,851 హేయ్, పిల్లాడా. 82 00:04:28,936 --> 00:04:31,186 నాకేమైనా సాయపడగలవా? నేను బయలుదేరాలి. 83 00:04:31,271 --> 00:04:34,151 నేను సంతోషంగా సాయపడతాను. అన్నట్టు, నా పేరు రూబెన్. 84 00:04:34,525 --> 00:04:35,685 నా పేరు ఫ్రాంక్. 85 00:04:36,443 --> 00:04:38,453 ఫ్రాంక్, అన్నింటికన్నా ముందు. 86 00:04:38,529 --> 00:04:40,909 ఈ ట్యాక్సీని మనం వీధికి అడ్డంగా లేకుండా చేయాలి. 87 00:04:41,698 --> 00:04:43,408 సాయపడటానికి నా స్నేహితులని కొందరిని పిలుస్తాను. 88 00:04:53,377 --> 00:04:55,877 మరి ఫ్రాంక్... నేను మిమ్మల్ని ఫ్రాంక్ అని పిలవవచ్చా? 89 00:04:55,963 --> 00:04:58,223 నా పేరు అదే కదా. ఇంకేమని పిలుస్తారు మరి? 90 00:04:58,298 --> 00:05:00,508 ఏమో. పూర్తి పేరు, ముద్దు పేరు, 91 00:05:00,592 --> 00:05:03,102 ఇతర ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడేటప్పుడు ఉపయోగించే సీబీ రేడియో పేరు. 92 00:05:03,178 --> 00:05:04,468 నాకు అవన్నీ తెలుసుకోవాలనుంది. 93 00:05:04,555 --> 00:05:05,555 ఉత్త ఫ్రాంక్, అంతే. 94 00:05:05,639 --> 00:05:06,639 మంచిది. 95 00:05:06,723 --> 00:05:09,603 మీ ట్యాక్సీ ఆగిపోయినప్పుడు, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? 96 00:05:09,685 --> 00:05:10,885 అదీ ఇదీ అని ఏమీ లేదు. 97 00:05:10,978 --> 00:05:14,478 ఎక్కిన వాళ్ళు ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతూ, ఊరంతా తిరుగుతున్నాను. 98 00:05:14,565 --> 00:05:15,765 అది మనకి పనికి వచ్చేదేలే. 99 00:05:15,858 --> 00:05:20,108 ఇటీవల మీరు ఏమైనా ఒక కోబాల్ట్ మాస్క్ ని చూశారా? 100 00:05:20,195 --> 00:05:23,275 ఏంటి? అది ఈ రోజుల్లో కుర్రాళ్ళు మాట్లాడే పిచ్చికూతనా ఏంటి? 101 00:05:23,824 --> 00:05:28,164 చూడండి, నాకు కూడా కూర్చొని ముచ్చట్లు ఆడాలనే ఉంది, కానీ నా కారు బాగు అవ్వాలి. 102 00:05:28,245 --> 00:05:32,115 సమయం డబ్బుతో సమానం, నా ట్యాక్సీ లేకుండా నేను ఎలా పని చేయాలి. 103 00:05:32,457 --> 00:05:35,247 మేము మీకు సాయపడగలమేమో. మీ ట్యాక్సీ మోడల్ ఏ సంవత్సరంలోనిది? 104 00:05:35,335 --> 00:05:39,755 1953 చెకర్ స్టాండర్డ్ మోడల్. కొత్తది, కొన్నేళ్ళ క్రితమే కొన్నాను. 105 00:05:39,840 --> 00:05:41,130 కొత్తదా? 106 00:05:41,216 --> 00:05:42,426 అవును. 107 00:05:42,509 --> 00:05:45,759 అందుకే, ఇది ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదో నాకు అస్సలు అంతు చిక్కడం లేదు. 108 00:05:45,846 --> 00:05:47,506 భాగాలన్నీ సక్రమంగానే ఉండాలి. 109 00:05:47,598 --> 00:05:50,558 మీ ట్యాక్సీ బాగు అయ్యేవరకు దీన్ని మీరు ఇక్కడే వదిలి వెళ్ళవచ్చు. 110 00:05:52,102 --> 00:05:54,612 దీన్ని ఎవ్వరూ తాకను కూడా తాకరు. నా మాట నమ్మండి. 111 00:05:58,358 --> 00:05:59,438 నాకు అర్థంకావడం లేదు. 112 00:05:59,526 --> 00:06:01,776 "ది కోబాల్ట్ మాస్క్" జాడ అస్సలు మనకి ఎక్కడా తెలియడం లేదు. 113 00:06:01,862 --> 00:06:03,662 ఆ విషయం గురించి మనం ఫ్రాంక్ ని అడిగితే, 114 00:06:03,739 --> 00:06:04,989 అతనికి మనం మాట్లాడేది అస్సలు అర్థం కాలేదు. 115 00:06:05,073 --> 00:06:07,663 అతను "ది కోబాల్ట్ మాస్క్" నుండి వచ్చినవాడు కాకపోతే, అది ఎందుకు ఖాళీగా ఉంటుంది? 116 00:06:08,035 --> 00:06:09,325 మంచి ప్రశ్న. 117 00:06:09,411 --> 00:06:10,411 సరేమరి. 118 00:06:10,495 --> 00:06:14,825 ఫ్రాంక్, తన ట్యాక్సీ కొత్తది అన్నాడు కనుక అతను 1950ల కాలం నాటి వాడని మనకి అర్థమైంది. 119 00:06:14,917 --> 00:06:16,747 ఇంకా అతను నన్ను పిల్లకాయ అని పిలిచాడు. 120 00:06:17,169 --> 00:06:18,339 కాబట్టి ఇతను, ఆ కాలం నుండి 121 00:06:18,420 --> 00:06:21,220 నేటి వరకు రాయబడిన పుస్తకంలోని ఒక పాత్ర అయ్యుండాలి. 122 00:06:21,298 --> 00:06:22,838 దాని వలన మనకి ప్రయోజనం ఏమీ లేదు. 123 00:06:22,925 --> 00:06:24,675 మనం అతని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలి. 124 00:06:24,760 --> 00:06:27,430 అతని వేలికి వివాహ ఉంగరం ఉంది, కాబట్టి అతనికి పెళ్ళయింది. 125 00:06:27,513 --> 00:06:29,813 కానీ దీని వలన కూడా మనకి ప్రయోజనం లేదు. 126 00:06:30,140 --> 00:06:32,770 డోనా, నేనూ అతని ట్యాక్సీని బాగు చేయడంలో సాయం చేస్తామని చెప్తాము. 127 00:06:32,851 --> 00:06:34,561 నీకు కార్లను బాగు చేయడం ఎలాగో తెలుసా? 128 00:06:34,645 --> 00:06:38,225 మా నాన్న దగ్గర తన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఒక పాత కన్వర్టిబుల్ కారు ఉంది. 129 00:06:38,315 --> 00:06:41,525 -అది బాగుంటుంది కానీ అస్సలు పని చేయదు. -దాన్ని బాగుచేయడంలో వీడి సాయం తీసుకుంటాడు. 130 00:06:41,610 --> 00:06:44,200 బాగుంది. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనే అవకాశం ఇది నీకు ఇస్తుంది. 131 00:06:44,571 --> 00:06:45,911 -నీ ఆలోచన బాగుంది. -నాకు తెలుసు. 132 00:06:47,574 --> 00:06:48,914 అదే, ధన్యవాదాలు. 133 00:06:48,992 --> 00:06:50,372 మరి, నేనేం చేయాలి? 134 00:06:50,452 --> 00:06:53,542 బడి అయిపోయాక నా ప్రచార ప్రసంగాన్ని నువ్వు చిత్రీకరించి నాకు సాయపడవచ్చు. 135 00:06:54,581 --> 00:06:57,581 రూబెన్. పాంథియోన్ మీద నువ్వు రాసిన వ్యాసాన్ని చదివాను. 136 00:06:58,210 --> 00:06:59,960 తర్వాత ఎప్పుడైనా దాని గురించి నీతో మాట్లాడాలి. 137 00:07:00,045 --> 00:07:01,455 మంచిది. ఎప్పుడైనా పర్వాలేదు. 138 00:07:02,381 --> 00:07:04,341 "నీతో మాట్లాడాలి" అని అనడంలో అతని ఉద్దేశమేమిటి? 139 00:07:04,424 --> 00:07:07,014 అతను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? అతనికి నచ్చిందా? నచ్చలేదా? 140 00:07:07,094 --> 00:07:08,644 అది తర్వాత తెలుస్తుందనుకుంటా. 141 00:07:09,179 --> 00:07:11,059 పనికొచ్చే మాటే చెప్పావులే, డోనా. ధన్యవాదాలు. 142 00:07:17,813 --> 00:07:19,273 బడి వేళలు అయిపోయాక కదా మీ ఆట ఉండేది? 143 00:07:19,356 --> 00:07:21,816 మాకు కొత్త యూనిఫామ్ వచ్చింది, వేసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. 144 00:07:21,900 --> 00:07:23,110 బాగుంది కదా? 145 00:07:23,193 --> 00:07:25,903 బయట ఊరికెళ్ళే ఒక చిన్న పర్యటన కోసం మోడల్ యూఎన్ చాక్లెట్లు అమ్మడానికి 146 00:07:25,988 --> 00:07:29,158 నానా తంటాలు పడుతుంటే, బాస్కెట్ బాల్ జట్టు యూనిఫాములకి డబ్బులెలా సేకరించగలిగింది? 147 00:07:29,241 --> 00:07:30,241 నాకు తెలీదు. 148 00:07:30,576 --> 00:07:32,616 మాకు కొత్తవి కావాలని కోచ్ అన్నాడు, మాకు వచ్చేశాయి. 149 00:07:33,829 --> 00:07:36,959 అయితే వాటికి బడి డబ్బులు ఇచ్చిందా? నిజంగానా? ఇది చాలా అన్యాయం. 150 00:07:37,040 --> 00:07:38,290 మీరు సరిగ్గా ఆడను కూడా ఆడరు. 151 00:07:38,709 --> 00:07:40,709 ఆ మాట నొప్పించింది. 152 00:07:41,211 --> 00:07:42,591 అలా అనాల్సిన అవసరం కూడా లేదు. 153 00:07:53,807 --> 00:07:55,887 అయితే, ఫ్రాంక్, మీరు ఎక్కడ పెరిగారు? 154 00:07:56,894 --> 00:07:58,064 నిజానికి, ఒక చోటు అని కాదు. 155 00:07:58,145 --> 00:08:00,645 ఏయే ఊర్లల్లో పెరగలేదు అని అడుగు, అది సరిగ్గా సరిపోతుంది. 156 00:08:01,148 --> 00:08:03,568 మీ మిత్రులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళేనా, 157 00:08:03,650 --> 00:08:05,940 లేక మీకు విచిత్రమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? 158 00:08:06,028 --> 00:08:08,238 అంటే, మాట్లాడే ఎలుగుబంటి లాగా అన్నమాట. 159 00:08:08,322 --> 00:08:10,452 నీ ఊహాశక్తి అమోఘం, డోనా. 160 00:08:14,661 --> 00:08:17,461 డోనా, కర్టిస్. మీరు ఏం చేస్తున్నారు? 161 00:08:18,248 --> 00:08:19,248 అభినయం చేస్తున్నాం. 162 00:08:19,333 --> 00:08:22,043 అవును. మా అభినయాన్ని సాధన చేస్తున్నాం. 163 00:08:22,878 --> 00:08:25,378 రాజమౌళి ఎప్పుడు పిలుస్తాడో తెలీదు కదా. 164 00:08:26,798 --> 00:08:29,928 సరే అయితే. అభినయం... బాగా చేయండి. 165 00:08:30,010 --> 00:08:33,300 చక్కని ఊహాశక్తి అనేది ఎల్లప్పుడూ మంచిదే. అని నా ఉద్దేశం. 166 00:08:34,431 --> 00:08:36,061 రూబెన్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? 167 00:08:36,517 --> 00:08:38,847 పై అంతస్థులో షెవాన్ కి తన ప్రచార వీడియోలో ఏదో సాయపడుతున్నాడు. 168 00:08:38,936 --> 00:08:40,146 లేకపోతే నేను ఇలా అనాలి అంటారా... 169 00:08:43,941 --> 00:08:45,031 సరే. 170 00:08:54,409 --> 00:08:56,079 నేను ఇక్కడే ఉండాలా లేకపోతే నిలబడాలా? 171 00:08:56,495 --> 00:08:57,695 కూర్చొనే ఉండు. 172 00:08:58,830 --> 00:09:01,210 సరేమరి. ఇక... 173 00:09:02,125 --> 00:09:03,125 మొదలుపెట్టు. 174 00:09:04,795 --> 00:09:08,415 -హలో, నా పేరు షెవాన్ రెడ్మాండ్, నేను... -హేయ్, మీ ఇద్దరూ ఏం చేస్తున్నారు? 175 00:09:09,967 --> 00:09:13,847 విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలకి షెవాన్ ప్రసంగాన్ని చిత్రీకరించే పనిలో ఉన్నాం. 176 00:09:13,929 --> 00:09:15,139 సరే. మన్నించండి. 177 00:09:15,222 --> 00:09:19,182 కొలిమికి పక్కన నిలబడి చెప్పవచ్చు కదా? బాగా రాజసంగా ఉంటుంది. 178 00:09:20,936 --> 00:09:22,686 కూర్చొనే ఉండు. నా మాట నమ్ము. 179 00:09:23,480 --> 00:09:26,860 కొలిమి దగ్గర ఆనుకొని ఉంటే, నువ్వు బాగా మొహం వాచి ఉన్నావని అనుకుంటారు. 180 00:09:27,317 --> 00:09:30,107 సరేనా? సిద్ధంగా ఉండు, ఇక... 181 00:09:31,989 --> 00:09:32,989 మొదలుపెట్టు. 182 00:09:33,073 --> 00:09:36,623 నా పేరు షెవాన్ రెడ్మాండ్, నేను విద్యార్థి కౌన్సిల్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. 183 00:09:37,160 --> 00:09:40,290 క్రీడా జట్టులకు దక్కే ప్రత్యేక శ్రద్దని తీసివేస్తానని నేను మాట ఇస్తున్నాను. 184 00:09:40,372 --> 00:09:43,502 నిజంగా పనికొచ్చే మోడల్ యూఎన్ లాంటి విద్యాసంబంధ క్లబ్బుల, 185 00:09:43,584 --> 00:09:47,094 తరగతి పర్యటనల కోసం స్వంతంగా నిధులు సమీకరించుకోవాలి, కానీ వాటికి 186 00:09:47,171 --> 00:09:49,211 బడి యాజమాన్యం యూనిఫాములకు డబ్బులు ఇచ్చింది, అది అన్యాయం. 187 00:09:49,298 --> 00:09:53,138 చదువు ముఖ్యమా, ఆటలు ముఖ్యమా? 188 00:09:54,511 --> 00:09:57,931 దానికి సమాధానం మనందరికీ తెలుసు, దానికి మీ ఓటుతోనే సమాధానం చెప్పండి. 189 00:09:58,015 --> 00:10:00,175 విద్యార్థి కౌన్సిల్ అధ్యక్ష పదవికి షెవాన్ కి ఓటు వేయండి. 190 00:10:02,269 --> 00:10:03,269 సరే. 191 00:10:04,271 --> 00:10:05,481 నేనెలా చెప్పాను? 192 00:10:05,898 --> 00:10:08,438 నీ ఆలోచనా విధానం బాగా శక్తివంతంగా మాత్రం ఉంది. 193 00:10:09,276 --> 00:10:10,276 ధన్యవాదాలు. 194 00:10:10,360 --> 00:10:11,360 కానీ... 195 00:10:11,904 --> 00:10:13,914 కర్టిస్, బాస్కెట్ బాల్ జట్టులో ఉన్నాడు. 196 00:10:14,323 --> 00:10:16,333 వాడు బాధపడతాడని నీకు అనిపించలేదా? 197 00:10:16,408 --> 00:10:17,578 ఇది వ్యక్తిగతం కాదు. 198 00:10:18,827 --> 00:10:21,287 కమాన్. బాస్కెట్ బాల్ జట్టును 199 00:10:21,371 --> 00:10:23,501 ప్రత్యేకంగా చూడటం నీకు న్యాయంగా అనిపిస్తోందా? 200 00:10:23,582 --> 00:10:27,252 మీరిద్దరూ కూడా నాకు మిత్రులే, షెవాన్. నాకు ఫలానా వారి పక్షాన ఉండాలని లేదు. 201 00:10:29,588 --> 00:10:31,218 చక్కగా పని చేశారు, డోనా, కర్టిస్. 202 00:10:31,298 --> 00:10:32,298 ధన్యవాదాలు. 203 00:10:32,382 --> 00:10:35,722 మీ వయస్సులోని పిల్లలకు చాలా వరకు అసలు రెంచ్ ని ఎలా పట్టుకోవాలో కూడా రాదు. 204 00:10:35,802 --> 00:10:39,932 మీ నాన్న మంచి వాడులా ఉన్నాడు, మీకు చక్కగా నేర్పాడు. 205 00:10:40,015 --> 00:10:42,475 నిజానికి, టైరును ఎలా మార్చాలో అని మా అమ్మ మాకు నేర్పింది. 206 00:10:42,893 --> 00:10:44,143 అది అద్భుతమైన విషయం. 207 00:10:44,228 --> 00:10:46,558 మేము పని చేయడం చూస్తూనే, అది మా తల్లిదండ్రులు నేర్పారని 208 00:10:46,647 --> 00:10:47,647 మీరు చాలా బాగా చెప్పారు. 209 00:10:47,731 --> 00:10:50,111 చూస్తూనే మీరు అనేక విషయాలను నేర్చుకోవచ్చు. 210 00:10:50,192 --> 00:10:51,862 మీ చుట్టూ ఉన్న వాటిని శ్రద్ధగా 211 00:10:51,944 --> 00:10:55,284 దృష్టి పెట్టి చూస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. 212 00:10:56,949 --> 00:10:57,949 హేయ్. 213 00:10:58,617 --> 00:11:00,737 ఇక్కడ ఎలా సాగుతోంది? ఏమైనా పురోగతి ఉందా? 214 00:11:00,827 --> 00:11:03,957 నిదానంగానే అయినా పురోగతి ఉందిలే. ఇప్పుడు సమయం ఎంతో కాస్త చెప్పగలవా? 215 00:11:04,665 --> 00:11:06,745 మూడు దాటింది. ఎందుకు? 216 00:11:06,834 --> 00:11:09,464 ఇప్పుడు నాకు మిల్క్ షేక్ తాగాలనుంది. 217 00:11:09,545 --> 00:11:11,505 కొన్ని వీధుల అవతల ఒక హోటల్ ని చూసినట్టు గుర్తు. 218 00:11:11,588 --> 00:11:15,588 మేము కూడా మీతో వస్తాం. నాకు కూడా మిల్క్ షేక్ తాగాలనుంది. 219 00:11:15,676 --> 00:11:18,296 సరే. మంచిది. శుభ్రం చేసుకొని వస్తాను. 220 00:11:21,098 --> 00:11:23,388 అతను ఏ హోటల్ గురించి మాట్లాడుతున్నాడో నీకు తెలుసా? 221 00:11:23,475 --> 00:11:27,095 అది 1950ల కాలం నాటి హోటల్. అతను తన కాలానికి పోదామనుకుంటున్నట్టుగా ఉంది. 222 00:11:27,187 --> 00:11:28,647 బహుశా దీని ద్వారా మనకేమైనా సమాచారం దొరకవచ్చేమో. 223 00:11:28,730 --> 00:11:31,570 అతనికి తీపి పదార్థాలంటే ఇష్టమని తెలుస్తుంది. 224 00:11:36,697 --> 00:11:39,737 రెండు వెన్నిలా మిల్క్ షేకులు, ఒక చాక్లెట్, రెండు స్ట్రాబెర్రీ తీసుకురండి. 225 00:11:40,993 --> 00:11:43,953 మీరు నలుగురే ఉన్నారు కదా. మరి అయిదు మిల్క్ షేకులు ఎందుకు? 226 00:11:45,914 --> 00:11:47,334 మంచి ప్రశ్న వేశారు. 227 00:11:47,416 --> 00:11:48,456 షెవాన్? 228 00:11:49,835 --> 00:11:52,835 ఎందుకంటే అవి చాలా బాగుంటాయి, ఒక్కటితో సరిపెట్టుకోవడం కష్టం. 229 00:11:53,672 --> 00:11:54,882 చిటికెలో తెచ్చిస్తాను. 230 00:11:58,343 --> 00:12:00,973 ఫ్రాంక్, మీ గురించి ఏదైనా చెప్పండి. 231 00:12:01,763 --> 00:12:02,893 మీకు ఏం తెలుసుకోవాలనుంది? 232 00:12:02,973 --> 00:12:05,063 ఏదైనా పర్వాలేదు. మీకు పెళ్ళయిందా? 233 00:12:05,517 --> 00:12:09,147 అయింది. పని చేస్తున్న క్రమంలో నేను నా భార్యను కలిశాను. భలే గమ్మత్తైన కథలే. 234 00:12:09,605 --> 00:12:12,225 -అప్పుడే నేను ఒక పాల రసం తాగాను అన్నమాట. -పాల రసం అంటే ఏంటి? 235 00:12:13,192 --> 00:12:16,242 పాల రసం అంటే ఏంటో తెలీదా? ఏ కాలంలో జీవిస్తున్నారు? 236 00:12:16,320 --> 00:12:18,860 ఆ ప్రశ్నలో ఏదో ఒక నిగూఢార్థం దాగుంది అనుకుంటా. మీరు చెప్పండి. 237 00:12:18,947 --> 00:12:21,157 మిల్క్ షేక్ నే పాల రసం అని కూడా అంటారు. 238 00:12:23,076 --> 00:12:25,656 సరేలే, నేను జనాలని ఎక్కించుకుంటూ ఊరంతా తిరుగుతున్నాను, 239 00:12:25,746 --> 00:12:28,036 ఇంతలో ఒక యువతి నా ట్యాక్సీని ఆపుతుంది అన్నమాట. 240 00:12:28,123 --> 00:12:29,503 నేను తన కోసం తలుపును తెరిచాను, 241 00:12:29,583 --> 00:12:32,173 సాధారణంగా ఆ పని నేను చేయను, ఎందుకంటే నేనెవ్వరికీ పని వాడిని కాదు కదా, 242 00:12:32,252 --> 00:12:36,592 కానీ తనలో ఏదో ఉంది. తన నవ్వు నన్ను కట్టిపడేసింది. 243 00:12:37,466 --> 00:12:38,676 అది చాలా బాగుంది. 244 00:12:39,426 --> 00:12:43,136 ఒక్కసారిగా, నాకు మైకం కమ్మింది, 245 00:12:43,222 --> 00:12:45,932 పాలరసం నా చేతి నుండి జారి తన ఎర్రని బూట్ల మీద పడిపోయింది. 246 00:12:48,018 --> 00:12:50,018 మిత్రులారా. షేకులు వచ్చేశాయి. 247 00:12:51,897 --> 00:12:54,357 మీ కోసం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, ఫ్రాంక్. 248 00:12:54,441 --> 00:12:59,321 మిల్క్ షేకులు తీసుకురావడం మీ మంచితనానికి నిదర్శనం, కానీ డబ్బులు మాత్రం నేనే కడతాను. 249 00:12:59,404 --> 00:13:02,124 ఎంతైనా, మీరు నా ట్యాక్సీని బాగుచేయడంలో సహాయపడ్డారు కదా. 250 00:13:03,992 --> 00:13:05,332 చిల్లర ఉంచుకోండి. నా పార్టీ. 251 00:13:05,827 --> 00:13:08,867 ధన్యవాదాలు, ఫ్రాంక్. మీ ఉదారతకి జయహో. 252 00:13:12,084 --> 00:13:13,504 ఏం ఆలోచిస్తున్నావు, షెవాన్? 253 00:13:15,879 --> 00:13:17,089 ఏమీ లేదు. 254 00:13:18,382 --> 00:13:19,382 నిజంగానా? 255 00:13:19,466 --> 00:13:21,216 గోళ్లతో గోళ్ళని తీస్తున్నావు. 256 00:13:21,301 --> 00:13:24,301 కంగారుగా ఉన్నప్పుడు అలా చేస్తావనే విషయాన్ని ఇందాక నేను గమనించాను. 257 00:13:24,888 --> 00:13:25,888 అవునా? 258 00:13:25,973 --> 00:13:27,523 దాన్నే "గుర్తు" అని మేము అంటాం. 259 00:13:28,183 --> 00:13:30,813 అది నీ ప్రవర్తన లాంటిది అన్నమాట, నువ్వేం ఆలోచిస్తున్నావో అది చెప్పేస్తుంది. 260 00:13:31,687 --> 00:13:33,517 నువ్వేం ఆలోచిస్తున్నావో పంచుకోవాలనుకుంటున్నావా? 261 00:13:36,358 --> 00:13:37,568 అంటే... 262 00:13:38,652 --> 00:13:41,452 విద్యకు సంబంధించిన పర్యటన కోసం నిధులు సమీకరించుకోవడానికి చాక్లెట్లు అమ్ముతున్నా, 263 00:13:41,530 --> 00:13:44,870 కానీ బాస్కెట్ బాల్ జట్టుకు యూనిఫాములు దక్కేశాయి, అందుకని కాస్త చికాకుగా ఉంది. 264 00:13:44,950 --> 00:13:46,490 నా గుర్తు గురించి కూడా నేను చెప్తున్నా, 265 00:13:46,577 --> 00:13:48,617 నువ్వు నా మీద చికాకు చూపించడం, నాకు కూడా చికాకు తెప్పిస్తోంది. 266 00:13:48,704 --> 00:13:51,254 బడి మాకు యూనిఫాములు కొని ఇచ్చింది, ఇందులో నా తప్పేముంది? 267 00:13:51,331 --> 00:13:53,961 సరే, కానీ నువ్వు దాన్ని ప్రతీచోటికి వేసుకురావాల్సిన పని లేదు. 268 00:13:54,042 --> 00:13:57,052 పుండు మీద కారం చల్లుతున్నావు. అదీగాక, దాన్ని ఎప్పుడోకప్పుడు ఉతకాలి కదా? 269 00:13:57,129 --> 00:14:00,509 సరేమరి. ఈ మిల్క్ షేకులను మనం బయటకు తీసుకెళ్లి, వెనక్కి వెళ్లిపోదామా? 270 00:14:00,966 --> 00:14:02,176 నా కారును నేను బాగు చేసుకోవాలి. 271 00:14:02,968 --> 00:14:04,548 హేయ్, ఫ్రాంక్, నేను ఆలోచిస్తూ ఉన్నాను. 272 00:14:04,636 --> 00:14:07,006 బహుశా మనం క్లచ్ వైరును మరొక్కసారి చూడాలేమో. 273 00:14:09,808 --> 00:14:11,098 మీరు ఇది పడేసుకున్నారు. 274 00:14:12,144 --> 00:14:13,274 పర్వాలేదులే. వదిలేయి. 275 00:14:13,353 --> 00:14:15,813 స్పేడ్స్ లో ఆసు. ఇది ఎవరికి దొరికితే వారికి అదృష్టం. 276 00:14:16,940 --> 00:14:21,490 అన్నట్టు, ఇందాక ట్యాక్సీలో చమురు నింపి మంచి పని చేశావు. 277 00:14:21,862 --> 00:14:23,202 మా అమ్మ బాగా నేర్పింది. 278 00:14:23,280 --> 00:14:24,410 అందులో సందేహమే లేదులే. 279 00:14:25,741 --> 00:14:28,701 పుస్తక దుకాణం విలేజ్ బుక్స్ 280 00:14:29,244 --> 00:14:32,294 సరేమరి. ఇప్పటిదాకా, అతనొక 1950ల నాటి ట్యాక్సీ డ్రైవర్ అని, 281 00:14:32,372 --> 00:14:34,632 మిల్క్ షేకులంటే ఇష్టమని, బాగా గమనిస్తాడని మనకి తెలిసింది. 282 00:14:34,708 --> 00:14:37,208 మరి బల్ల మీద కార్డును ఎందుకు వదిలిపెట్టాడు? 283 00:14:37,294 --> 00:14:38,464 అది అదృష్టం ఇస్తుందని చెప్పాడు. 284 00:14:38,545 --> 00:14:41,545 కానీ దాన్ని అతను కావాలనే వదిలేయడం మీకు కాస్త వింతగా అనిపించడం లేదా? 285 00:14:41,632 --> 00:14:43,222 అతను అలా కావాలనే చేసినట్టుగా ఉంది. 286 00:14:43,300 --> 00:14:45,640 అయితే, ఫ్రాంక్ 1950ల కాలానికి చెందినవాడు, 287 00:14:46,094 --> 00:14:49,684 "ది కోబాల్ట్ మాస్క్" యొక్క కవర్ పేజీ కూడా 1950ల కాలం నాటిది లాగానే ఉంది. 288 00:14:49,765 --> 00:14:51,305 ఫ్రాంక్, ఆ పుస్తకంలోని వాడు అయ్యుంటాడు. 289 00:14:51,391 --> 00:14:53,641 అందుకే దానికి జి.డబ్ల్యు. పెయింట్ వేసి, విడుదల చేసుంటుంది. 290 00:14:53,727 --> 00:14:55,897 కానీ మనకి దాని గురించి ఎందుకు అస్సలు ఏ విషయం తెలియడం లేదు? 291 00:14:55,979 --> 00:14:57,859 డోనా చెప్పింది నిజమే. నేను ఆన్లైన్ లో బాగా వెతికాను, 292 00:14:57,940 --> 00:14:59,820 కానీ "ది కోబాల్ట్ మాస్క్" అనే పుస్తకం గురించి నాకు ఏమీ కనబడలేదు. 293 00:14:59,900 --> 00:15:01,610 -హేయ్. -హేయ్. 294 00:15:03,111 --> 00:15:07,121 తాతయ్య, మేమొక పుస్తకం కోసం వెతుకుతున్నాం. దాన్ని పేరు "ది కోబాల్ట్ మాస్క్." 295 00:15:08,033 --> 00:15:09,493 ఆ పేరు ఎక్కడా విన్నట్టు లేదు. 296 00:15:09,576 --> 00:15:11,786 కొత్త పుస్తకమా? దుకాణం నుండి తెప్పించగలను. 297 00:15:12,538 --> 00:15:14,618 కాదు. అది పాత పుస్తకం అనుకుంటా. 298 00:15:14,706 --> 00:15:18,586 ఆ పుస్తకం గురించి నేను వినలేదంటే, అదంత మంచి పుస్తకం అయ్యుండదు. 299 00:15:22,297 --> 00:15:24,417 చూశారా? తాతయ్య కూడా దాని గురించి వినలేదు. 300 00:15:24,508 --> 00:15:26,088 ఆయనకి ప్రతి పుస్తకం గురించి తెలుసు. 301 00:15:26,176 --> 00:15:27,636 ఇది చాలా వింతగా ఉంది. 302 00:15:29,429 --> 00:15:30,509 అక్కడ చూడండి. 303 00:15:30,597 --> 00:15:32,677 జి.డబ్ల్యు. మనకు సాయం చేయాలనుకుంటుంది. 304 00:15:33,642 --> 00:15:36,602 ప్రాస = కారణం 305 00:15:36,687 --> 00:15:39,817 మర్యాదపూర్వకంగా అడుగుతున్నా, జి.డబ్ల్యు., ఏదైనా అర్థవంతమైన ఆధారం ఇస్తే బాగుంటుంది. 306 00:15:40,315 --> 00:15:42,315 "ప్రాస, కారణం ఒకటే." 307 00:15:44,027 --> 00:15:45,897 ఏ ప్రాసలు? పాట లిరిక్స్ ఆ? 308 00:15:46,446 --> 00:15:47,696 లేకపోతే చిన్న పిల్లల రైమ్స్ అయ్యుండవచ్చు. 309 00:15:48,824 --> 00:15:51,994 అయినా, ఫ్రాంక్ చూస్తుంటే చిన్న పిల్లల రైమ్స్ లాంటి వ్యక్తి అనిపించడం లేదు. 310 00:15:52,077 --> 00:15:55,957 ఒక్క నిమిషం! కవితల్లో కూడా ప్రాసలుంటాయి. జి.డబ్ల్యు. ఉద్దేశం కవితలేమో? 311 00:15:56,582 --> 00:15:59,422 బహుశా ఫ్రాంక్ అసలు "ది కోబాల్ట్ మాస్క్" నుండి వచ్చిన వాడు కాదేమో. 312 00:15:59,877 --> 00:16:01,297 అతను కవిత నుండి వచ్చాడేమో. 313 00:16:06,091 --> 00:16:08,221 -ఇక్కడ కవిత పుస్తకాలు చాలా ఉన్నాయి. -అవును. 314 00:16:08,302 --> 00:16:10,642 ఇంకా ప్రతీ పుస్తకంలో చాలా కవితలు ఉన్నాయి. మనం ఎలా కనుగొనగలం? 315 00:16:10,721 --> 00:16:13,181 ఇది గడ్డి మోపులో సూదిని వెతికినట్టు అవుతుంది. 316 00:16:14,808 --> 00:16:16,518 హేయ్! ధన్యవాదాలు, ఘోస్ట్ రైటెర్. 317 00:16:16,602 --> 00:16:19,232 ఇప్పుడు, ఆ గడ్డి మోపు చిన్నది అయిపోయింది. 318 00:16:23,358 --> 00:16:24,688 సౌండ్స్ ఆఫ్ ద సిటీ 319 00:16:26,403 --> 00:16:27,823 మన సూది నాకు దొరికిందనుకుంటా. 320 00:16:30,574 --> 00:16:34,834 ఇది క్వామే అలెగ్జాండర్ రాసిన "ట్యాక్సీ డ్రైవర్ మీద కవిత". 321 00:16:34,912 --> 00:16:36,122 హేయ్, నాకు అతను తెలుసు. 322 00:16:36,580 --> 00:16:38,750 అతను బాస్కెట్ బాల్ గురించి ఒక కవితల పుస్తకాన్ని రాశాడు. 323 00:16:38,832 --> 00:16:40,712 అది మాకు కోచ్ టిల్మాన్ ఇచ్చాడు. 324 00:16:40,792 --> 00:16:44,462 "యుద్ధం ముగిశాక ఎక్కడ చూసిన సంబరాలే. 325 00:16:44,546 --> 00:16:46,716 అప్పుడే నీ కడుపు నిండా ఆహారం తిన్నావు. 326 00:16:46,798 --> 00:16:50,838 మీ నాన్న శనివారం రాత్రి నవ్వుతున్నట్టూగా, మీ అమ్మ ఆదివారం ఉదయం పాడుతున్నట్టుగా. 327 00:16:50,928 --> 00:16:53,308 ఇవాళ, ఆహారం పర్వాలేదు." 328 00:16:53,388 --> 00:16:56,228 వావ్. నేను ఇలాంటిది ఊహించలేదు. 329 00:16:56,642 --> 00:16:59,232 కవిత ఇంత బాగుంటుందని ఎవరికి తెలుసు? 330 00:16:59,937 --> 00:17:01,767 -నాకు తెలుసు. -నీకు తెలుసులే. 331 00:17:02,481 --> 00:17:04,611 కానీ ఒక్క విషయం. ఇందులో ప్రాస లేదు. 332 00:17:04,691 --> 00:17:08,111 ఆసక్తికరంగా అనిపించే, గొప్ప లయ గల కవితలు చాలా ఉన్నాయి. ఇలాంటిది అన్నమాట. 333 00:17:08,194 --> 00:17:09,864 కానీ ఈ కవిత అసలు దేని గురించి? 334 00:17:10,446 --> 00:17:14,236 చూస్తుంటే, ఇది ఒక ట్యాక్సీ డ్రైవర్ దృష్టి కోణం నుండి రాసినట్టుగా ఉంది, 335 00:17:14,326 --> 00:17:18,116 అతను నగరంలో జనాలను తిప్పుతూ ఉన్నప్పుడు గమనించిన విషయాలు లాగా ఉన్నాయి. 336 00:17:18,204 --> 00:17:20,214 అయితే, ఈ కవితలో ట్యాక్సీ డ్రైవర్, ఫ్రాంక్ అన్నమాట. 337 00:17:20,290 --> 00:17:24,290 కానీ "ది కోబాల్ట్ మాస్క్"లోని ప్రాతలని, దీన్ని ఘోస్ట్ రైటెర్ ఎందుకు విడుదల చేయడం? 338 00:17:24,377 --> 00:17:27,167 -ఏదోక కారణం ఉండుండాలి. -మనం దీన్ని మళ్లీ వినాలి. 339 00:17:30,384 --> 00:17:34,894 "కాబట్టి, నేను తొందరపడకుండా, నిదానంగా నడుపుతూ వాళ్ళకి అన్నీ చూపేవాడిని. 340 00:17:34,972 --> 00:17:39,392 ఆకాశంలోని హరివిల్లులాగా ఈ లయ ఈ రోజును మరింత అందంగా చేస్తుంది." 341 00:17:39,476 --> 00:17:40,476 ఒక్క నిమిషం. 342 00:17:41,186 --> 00:17:42,266 అంటే దీనర్థం... 343 00:17:46,525 --> 00:17:47,725 త్వరగా! ఒంగో! 344 00:17:47,818 --> 00:17:48,818 ఏమైంది నీకు? 345 00:17:48,902 --> 00:17:50,242 మిస్టర్ సాండర్స్ వచ్చారు. 346 00:17:50,320 --> 00:17:52,490 అయితే? అతను టీచర్. వాళ్ళకి పుస్తకాలంటే ఇష్టం. 347 00:17:52,573 --> 00:17:54,743 టీచర్లకు వాటి కన్నా బాగా ఇంకేమి నచ్చుతాయి. 348 00:17:54,825 --> 00:17:58,405 అతను నా వ్యాసం గురించి ఇక్కడికి వస్తే? నేను మరీ అంత చండాలంగా ఏమీ రాయలేదు కదా? 349 00:17:58,495 --> 00:18:00,955 అది నిజమే, అధ్యయనం చేయడానికి ఇంకాస్త ఎక్కువ సమయం వెచ్చించి ఉండాల్సింది. 350 00:18:01,039 --> 00:18:03,829 రూబెన్. నువ్వు కంగారు పడుతుంటే మనం ఏమీ కనిపెట్టలేము. 351 00:18:07,254 --> 00:18:09,264 -లేదు. -నాకు తెలుసు. వాళ్ళు దాన్ని తవ్వలేరు. 352 00:18:09,339 --> 00:18:12,339 అతను నీ వ్యాసం గురించి మాట్లాడుతూ ఉంటే, ఆమె అంత కోపంగా ఉన్నట్టు లేదు. 353 00:18:13,093 --> 00:18:14,803 వాళ్ళు నా వ్యాసం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు? 354 00:18:14,887 --> 00:18:16,597 -నాకు తెలుసు. -మరి... 355 00:18:16,680 --> 00:18:20,100 అవును, అతను వ్యాసం గురించి రాలేదు. అతనికి మీ అమ్మ అంటే ఇష్టం అనుకుంటా. 356 00:18:23,061 --> 00:18:24,351 హేయ్, బంగారం. ఏం చేస్తున్నావు? 357 00:18:24,438 --> 00:18:26,358 పాఠశాలకు సంబంధించిన పని చేసుకుంటున్నా. 358 00:18:30,277 --> 00:18:32,647 నీకు క్వామే అలెగ్జాండర్ పుస్తకాలు నచ్చుతాయని నాకు తెలీదే. 359 00:18:33,071 --> 00:18:34,741 నీకు కూడా నచ్చుతాయని నాకూ తెలీదు. 360 00:18:38,493 --> 00:18:39,833 కాబట్టి, నా ఆలోచన ఏంటంటే... 361 00:18:41,079 --> 00:18:43,959 రేపు రాత్రి కర్టిస్ కి బాస్కెట్ బాల్ సాధన ఉంది కాబట్టి, 362 00:18:44,041 --> 00:18:46,631 మనిద్దరం ఆడవాళ్ళం సరదాగా గడుపుదాం. కేవలం మనం ఇద్దరమే. 363 00:18:46,710 --> 00:18:49,920 మనం బౌలింగ్ కి వెళ్ళవచ్చు, లేదా సినిమాకి వెళ్లవచ్చు. సూషీ కొనుక్కోవచ్చు. 364 00:18:50,339 --> 00:18:52,089 అలాగే. మంచి ఆలోచన. 365 00:18:52,174 --> 00:18:55,264 కానీ మనం తర్వాత నిర్ణయించుకుందామా? ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను. 366 00:18:56,178 --> 00:18:57,638 అలాగే. తప్పకుండా. 367 00:18:58,347 --> 00:19:00,927 నీ అత్యధిక స్కోరును కాపాడుకోవడానికి తెగ ఆరాటం చూపిస్తావనుకున్నా, 368 00:19:01,016 --> 00:19:02,556 వరుసగా మూడు స్ట్రైకులు సాధించిన పిల్లా. 369 00:19:02,643 --> 00:19:04,773 అమ్మా, నిజంగా దాని గురించి నేను ఇప్పుడు ఆలోచించలేను. 370 00:19:04,853 --> 00:19:06,103 ఒకసారి దాని గురించి ఆలోచించు. 371 00:19:07,064 --> 00:19:09,484 -నేను మాత్రం సర్వసిద్ధంగా ఉన్నాను. -సరే. మంచిది. 372 00:19:24,623 --> 00:19:25,923 ప్రసంగం బాగుంది, షెవాన్. 373 00:19:26,291 --> 00:19:28,171 -ధన్యవాదాలు. -తప్పుగా అనుకోకు. 374 00:19:29,837 --> 00:19:33,757 అది అస్సలు సముచితమైన పోలిక కూడా కాదు. బాస్కెట్ బాల్ కి యూనిఫాములు తప్పనిసరి. 375 00:19:33,841 --> 00:19:36,341 నువ్వు న్యూ యార్క్ కి వెళ్ళకుండా కూడా మోడల్ యూఎన్ చేసుకోవచ్చు. 376 00:19:36,426 --> 00:19:39,176 జనాలు తమ మద్ధతు ఎవరికో తెలిపేశారు. వాళ్ళు నా పక్షానే ఉన్నారన్నది సుస్పష్టం. 377 00:19:40,639 --> 00:19:42,019 కానీ అందరూ కాదు. 378 00:19:49,648 --> 00:19:50,978 నాకు అర్థమవ్వడం లేదు. 379 00:19:51,316 --> 00:19:53,566 నేను దీన్ని పది సార్లు చదివాను, అయినా జి.డబ్ల్యు. ఈ కవితనే 380 00:19:53,652 --> 00:19:55,742 ఎందుకు ఎంపిక చేసిందో నాకు తెలియడం లేదు. 381 00:19:55,821 --> 00:19:57,321 హమ్మయ్య, నాకు తోడుగా ఇంకొకరు ఉన్నారు. 382 00:19:57,406 --> 00:19:59,866 మనం ఫ్రాంక్ తో మాట్లాడుతూనే ఉండాలి. మనం కనిపెట్టడానికి అదే ఏకైక మార్గం. 383 00:19:59,950 --> 00:20:03,080 అతను ఇక్కడ లేకపోతే అప్పుడు ఎలా అతనితో మాట్లాడటం. 384 00:20:03,662 --> 00:20:05,872 ఇంకో మిల్క్ షేక్ తెచ్చుకోవడానికి డైనర్ కి మళ్లీ వెళ్ళాడేమో. 385 00:20:05,956 --> 00:20:07,076 దాని వల్ల లాభం ఉండదులే. 386 00:20:07,165 --> 00:20:10,915 ట్యాక్సీ చుట్టుపక్కల చూద్దాం, లోపల ఆధారాలు ఏవైనా దొరుకుతాయేమో. 387 00:20:11,003 --> 00:20:12,463 డోనా, ఫ్రాంక్ కోసం కనిపెట్టుకొని ఉండు. 388 00:20:12,546 --> 00:20:14,876 సరే. అతను వస్తే నేను "పైనాపిల్" అంటాను. 389 00:20:14,965 --> 00:20:17,425 "హేయ్, ఫ్రాంక్" అంటే సరిపోతుంది కదా. 390 00:20:17,885 --> 00:20:19,295 నా ప్లానే నాకు బాగా నచ్చింది. 391 00:20:39,489 --> 00:20:40,739 చూడండి. 392 00:20:40,824 --> 00:20:42,704 ఆ బబుల్ గమ్ 1950ల నాటిదా? 393 00:20:42,784 --> 00:20:43,914 యాక్. 394 00:20:44,328 --> 00:20:45,868 వావ్. నాకొకటి కావాలి. 395 00:20:48,749 --> 00:20:53,499 బాబోయ్. ఇది బబుల్ గమ్ కాదు. ఒక చిన్న టేప్ రికార్డర్ లా ఉంది. 396 00:21:01,887 --> 00:21:03,597 ఇది కనబడని ఇంక్ ఉందనుకుంటా. 397 00:21:06,099 --> 00:21:07,809 ఈ చిన్ని కెమెరాని చూడండి. 398 00:21:08,769 --> 00:21:10,399 బాబోయ్. నిఘా రేడియో. 399 00:21:12,397 --> 00:21:15,027 ఒక ట్యాక్సీ డ్రైవర్ దగ్గర ఈ నిఘా పరికరాలన్నీ ఎందుకు ఉన్నాయి? 400 00:21:16,944 --> 00:21:18,284 పైనాపిల్! పైనాపిల్! 401 00:21:18,779 --> 00:21:19,989 త్వరగా! వాటిని పెట్టేయండి! 402 00:21:33,502 --> 00:21:34,712 హేయ్, పిల్లలూ. 403 00:21:35,671 --> 00:21:36,881 ఏం చేస్తున్నారు? 404 00:21:36,964 --> 00:21:38,094 ఏమీ లేదు. 405 00:22:47,868 --> 00:22:49,868 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య