1 00:00:07,799 --> 00:00:11,011 మనమిది ఎందుకు కొంటున్నామో నాకర్థం కావడం లేదు. ఆఫీసుకి వేసుకోడానికి షర్టు ఉంది. 2 00:00:11,094 --> 00:00:14,515 నీకు ఇంకొక షర్ట్ కావాలి, జేస్. నువ్వొక కార్టూన్ లో పాత్రవి కాదు. 3 00:00:15,766 --> 00:00:16,725 నువ్వు ఇపుడు మేనేజర్ వి. 4 00:00:16,808 --> 00:00:20,145 నువ్వు మీ మామయ్య అంత్యక్రియలకి వేసుకున్న షర్టుని ఆఫీసుకి వేసుకు వెళ్ళలేవు. 5 00:00:20,229 --> 00:00:23,357 ఇంకా మనం ఇంట్లో కూర్చుని జేమ్స్ గురించి సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉండలేము. 6 00:00:23,440 --> 00:00:26,109 మనం కోరుకునే దాని గురించి మర్చిపోయిన వెంటనే, అది జరుగుతుంది. 7 00:00:26,193 --> 00:00:27,194 అది అందరికీ తెలుసు. 8 00:00:27,277 --> 00:00:30,113 సఫలత వచ్చిన వెంటనే తన విలువలను మర్చిపోయే వాళ్ళలో ఒకడిని కావడం నాకిష్టం లేదు. 9 00:00:30,197 --> 00:00:33,951 నేను మేనేజర్ అయిన వెంటనే ఒక 34 పౌండ్ల షర్ట్ వేసుకుని, 10 00:00:34,034 --> 00:00:35,494 నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది మర్చిపోలేను కదా. 11 00:00:35,577 --> 00:00:37,538 జేస్, ఇదేమీ పెద్ద విషయం కాదు. 12 00:00:37,621 --> 00:00:40,999 ఇది ప్రమోషన్ వచ్చిన తరువాతి రోజు నువ్వు చక్కగా కనిపించడం గురించి మాత్రమే. 13 00:00:43,168 --> 00:00:44,461 ఓ, కాదు, ఇది కెరెన్. 14 00:00:45,462 --> 00:00:47,172 ఆమె తన పెళ్లి డ్రెస్ కొనడానికి తోడు రమ్మని అడిగింది. 15 00:00:47,256 --> 00:00:49,383 ఆమె నన్ను అలా ఎప్పుడూ చేయమని అడగదు. 16 00:00:50,008 --> 00:00:51,468 సరే, నేనిది బాగా చెయ్యాలి. 17 00:00:51,552 --> 00:00:55,013 బహుశా రేపు ఉదయం నేను సెలవ పెట్టి డ్రెస్ కోసం ఒక పుస్తకంలాంటిది తయారు చేస్తాను. 18 00:00:56,014 --> 00:00:59,226 లేదు, అది అనవసరం. నేను ఇంటికి వెళ్లిన తరువాత రాత్రికి చేసేస్తాను. 19 00:00:59,309 --> 00:01:01,687 -ఓ, చూడు! ఇది బాగుంది. -అవును. 20 00:01:01,770 --> 00:01:04,230 -ఇది బాగుంది. -నీకది నచ్చిందా? దీన్ని చూద్దాము. 21 00:01:04,730 --> 00:01:06,275 అవును. ఇది నిజానికి బానే ఉంది కదా? 22 00:01:06,358 --> 00:01:07,901 -అవును? -అవును, నాకు... 23 00:01:07,985 --> 00:01:09,570 -కాదు, ఒక్క నిమిషం ఆగు. -ఏంటి? 24 00:01:09,653 --> 00:01:11,321 -ఇవి చిన్న బాతులు. -అవును. 25 00:01:11,405 --> 00:01:14,157 -కాదు, కాదు. నేనివి చుక్కలనుకున్నాను. -కాదు, ఇవి బాతులు. 26 00:01:14,241 --> 00:01:16,827 నిక్కి, మా నాన్న ఊరు డాగెన్హామ్. ఆయన పదహారేళ్ళ వయసులో స్కూల్ మానేశారు. 27 00:01:16,910 --> 00:01:19,705 -నేను బాతులున్న షర్ట్ వేసుకోలేను. -కాదు, ఈ బాతు బొమ్మలు బాగున్నాయి. 28 00:01:19,788 --> 00:01:21,790 ఇది వేసుకుంటే రోజంతా అవి చుక్కలు కాదు బాతులు అని జనాలకు 29 00:01:21,874 --> 00:01:24,001 తెలియకుండా తప్పించుకోవడంతో సరిపోతుంది నాకు. 30 00:01:24,084 --> 00:01:26,879 -అది నాకు అవసరంలేని వత్తిడి. -నన్ను క్షమించు. మనం ఇది కొంటున్నాము. 31 00:01:26,962 --> 00:01:30,257 ఇది నిన్ను పెద్దవాడిలా చూపిస్తుంది. నువ్వు మేనేజర్ లాగా, ఒక నాన్నలా కనిపిస్తావు. 32 00:01:30,340 --> 00:01:32,968 -అవును, కానీ నాకు కూల్ నాన్నలా ఉండాలనుంది. -కాదు. కాదు, కాదు, కాదు. 33 00:01:33,051 --> 00:01:35,929 అలా ఉంటే పిల్లలకు నచ్చదు. నా ఫ్రెండ్ సెసిల్ తల్లిదండ్రులు అలాగే ఉండేవారు, 34 00:01:36,013 --> 00:01:38,348 ఆమె తన హోమ్వర్క్ ఒక ట్రాంపోలిన్ మీద చేసుకునేది, 35 00:01:38,432 --> 00:01:41,518 ఎందుకంటే వాళ్ళ అమ్మ వంటింట్లో టేబుల్ ని క్లౌనింగ్ వర్క్ షాప్ కోసం అమ్మేసింది. 36 00:01:41,602 --> 00:01:43,645 మనం... మనం బోర్ కొట్టించే అమ్మా నాన్నలుగానే ఉంటాము, సరేనా? 37 00:01:43,729 --> 00:01:45,105 -జేమ్స్ కోసం -హే. 38 00:01:46,523 --> 00:01:48,859 ఆ అబ్బాయిని మనమే దత్తత తీసుకుంటాం అనేది ఖచ్చితం కాదని నీకు తెలుసు కదా? 39 00:01:48,942 --> 00:01:50,569 -తెలుసు, తెలుసు. -అవునా? 40 00:01:50,652 --> 00:01:54,198 లేదు, నాకు తెలుసు. ఎందుకో... గాని... అంతా అనుకూలంగా జరుగుతుందని అనిపిస్తోంది. 41 00:01:54,281 --> 00:01:55,407 ఒకసారి చూద్దాము. 42 00:01:57,492 --> 00:01:58,785 -అవును. సరే, అయితే. -సరేనా? 43 00:01:58,869 --> 00:02:01,371 అది...అవును, సరైన సైజే. మనం కొందాము. సరే. 44 00:02:01,455 --> 00:02:03,040 -ఇది బాగుందనుకుంటాను. -సరే. 45 00:02:03,123 --> 00:02:05,792 మిత్రమా, నీకు తెలియడం కోసం చెప్తున్నాను, ఇవి చిన్న బాతులు. 46 00:02:05,876 --> 00:02:09,420 వాళ్ళు వీటిని చుక్కల్లా కనిపించేంత చిన్నగా చేసారు, కానీ ఇవి చుక్కలు కాదు, ఇవి బాతులు. 47 00:02:10,088 --> 00:02:11,089 నీకు తెలియడం కోసం. 48 00:02:16,512 --> 00:02:17,513 కామ్డెన్ లాక్ 49 00:02:39,993 --> 00:02:41,995 జేమ్స్ - వయసు 7 ఆసక్తి సమర్పించబడింది 50 00:02:43,914 --> 00:02:45,832 ద హావర్స్టాక్ 51 00:02:45,916 --> 00:02:47,042 -హలో. -సరే. 52 00:02:47,125 --> 00:02:48,126 హాయ్. 53 00:02:48,210 --> 00:02:49,545 జేమ్స్ గురించి ఏమైనా తెలిసిందా? 54 00:02:49,628 --> 00:02:52,130 లేదు, ఇంకా తెలియలేదు, కానీ ఇవాళ తెలుస్తుందని అనుకుంటున్నాం. 55 00:02:52,214 --> 00:02:53,590 -సరే. -సరే, అయితే... 56 00:02:53,674 --> 00:02:55,342 నాకు కొంత మందిలా... 57 00:02:55,425 --> 00:02:56,343 కెరెన్ పెళ్లి ఫోల్డర్ 58 00:02:56,426 --> 00:02:57,511 ...దీనికి మరీ ప్రాముఖ్యత ఇవ్వాలని లేదు. 59 00:02:58,095 --> 00:03:00,264 అవును. ఆ, అవును. లేదు, కానే కాదు. 60 00:03:00,931 --> 00:03:04,017 నా చిన్నప్పటి నుంచి నేనేమీ దీని గురించి కలలు కనలేదు కదా. 61 00:03:04,101 --> 00:03:05,519 నేనలాంటి అమ్మాయిని కాదు. 62 00:03:05,602 --> 00:03:07,229 నేను సెంట్ కూడా రాసుకోను. 63 00:03:07,312 --> 00:03:09,940 నేను కొన్న చారిటీ షాపులో ఈ షర్టుని అమ్మిన వాళ్ళ వాసన నా దగ్గర వస్తుంది. 64 00:03:10,023 --> 00:03:11,900 ఏం పర్లేదు. ఇది కేవలం ఒక డ్రెస్. కేవలం ఒక డ్రెస్. 65 00:03:12,609 --> 00:03:13,610 సరే. 66 00:03:15,779 --> 00:03:16,780 -దేవుడా. -దేవుడా. 67 00:03:16,864 --> 00:03:17,990 ఇదేం వేషం? 68 00:03:18,740 --> 00:03:19,950 -హలో. -హలో. 69 00:03:21,159 --> 00:03:25,831 -హలో, తల్లీ. స్మార్ట్ గా కనిపిస్తున్నానా? -ఏంటి, ఒక షాప్ కి వెళ్ళడానికా? ఉందమ్మా. 70 00:03:25,914 --> 00:03:27,916 అవును, కానీ ఇది స్టైలుగా ఉంది కదా? 71 00:03:28,000 --> 00:03:30,878 ఇది అంత స్మార్ట్ గా లేకపోతే, నేను బయట నుంచుంటాను. 72 00:03:30,961 --> 00:03:33,755 -ఓహ్, మరీ అలా మాట్లాడకు. -నువ్వు బయట నుంచోవడం లేదు. 73 00:03:34,923 --> 00:03:36,967 -నువ్వుపెయింటింగ్ చేస్తున్నావా? -ఏంటి? 74 00:03:37,968 --> 00:03:39,261 కాదు, ఇది నా షర్ట్. 75 00:03:39,344 --> 00:03:40,971 -మనం వెళ్దామా? -దేవుడా. 76 00:03:41,054 --> 00:03:42,556 పద. పద వెళ్దాం. 77 00:03:42,639 --> 00:03:44,224 -అది ఎక్కడుంది? -సరే. ఇక్కడే ఉంది. 78 00:03:44,308 --> 00:03:45,350 ఓహ్, అద్భుతం. 79 00:03:45,434 --> 00:03:47,269 నార్త్ లండన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ 80 00:03:58,197 --> 00:03:59,823 హాయ్. 81 00:04:03,368 --> 00:04:05,495 ఇందులో చాక్లెట్లు ఉన్నాయి. అందుకని, అందరూ... సరే. 82 00:04:06,205 --> 00:04:08,624 అందరూ. ఏంటి... అందరూ. 83 00:04:09,833 --> 00:04:11,627 అబ్బా. అందరూ ఒక్క క్షణం వినండి, ప్లీజ్. 84 00:04:13,879 --> 00:04:15,005 అబ్బాయిలు! 85 00:04:21,928 --> 00:04:23,263 పాత బాస్ ఇక లేడు. 86 00:04:25,182 --> 00:04:27,518 ఇక మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. 87 00:04:29,144 --> 00:04:30,687 లేదు, లేదు, నిజంగా. 88 00:04:31,522 --> 00:04:34,191 నేను చెప్పాల్సిన విషయాలు, కొన్ని ఉన్నాయి. 89 00:04:34,274 --> 00:04:35,859 కొన్ని బోరింగ్ విషయాలు. వాటిని పూర్తి చేద్దాం. 90 00:04:35,943 --> 00:04:38,111 అందుకని నేను మేనేజర్ పాత్ర పోషించబోతున్నాను. 91 00:04:43,492 --> 00:04:45,661 కొన్ని విషయాలు రాసుకున్నాను. ఓ, ఒక్క క్షణం. 92 00:04:45,744 --> 00:04:49,206 ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చెయ్యి. ఎన్ ఎక్స్ 93 00:04:51,917 --> 00:04:53,669 చేస్తాను 94 00:04:53,752 --> 00:04:54,795 సరే 95 00:04:54,878 --> 00:04:58,215 ఆ, సరే. అవును. సరే, ఇక ప్రారంభిస్తాను. 96 00:04:59,132 --> 00:05:03,971 మీ అందరి, షెడ్యూల్స్, ఆన్లైన్ డైరీతో సింక్ అవ్వాలి, అందుకని దయచేసి చదవండి. 97 00:05:04,054 --> 00:05:07,140 మిత్రమా, నేను నా జిసిఎస్ఇలకి ఆన్ ఫ్రాంక్ డైరీనే చదవలేదు, 98 00:05:07,224 --> 00:05:09,852 అలాంటిది ఇదెందుకు చదువుతాను? నేనంటోంది అర్ధమవుతుందా? 99 00:05:09,935 --> 00:05:12,271 బాగా చెప్పావు. బాగా చెప్పావు. 100 00:05:12,771 --> 00:05:16,608 లేదు, లేదు... నిజంగా. నిజంగా, మీరు చదవాలి. 101 00:05:17,401 --> 00:05:19,778 సరే, నేను లెసన్ ప్లానింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 102 00:05:20,571 --> 00:05:23,198 క్షమించండి, నేను... నేను తీసుకోవాలి. 103 00:05:23,991 --> 00:05:26,535 -హలో. -ఏమైనా తెలిసిందా? 104 00:05:26,618 --> 00:05:29,496 -నేను మీటింగ్ లో ఉన్నాను. -సరే, నీకు సిగ్నల్ ఉంది కదా? 105 00:05:29,580 --> 00:05:31,832 నేను లండన్ లో ఉన్నాను, నీతో ఫోన్ లో మాట్లాడుతున్నాను, అందుకని... 106 00:05:32,916 --> 00:05:34,585 కాయా, అవి అందరికీ. సరేనా? 107 00:05:34,668 --> 00:05:37,504 -నీ ఫోన్ లో చార్జ్ నిండుగా ఉందా? -ఉంది, కానీ నువ్వు ఫోన్ చేస్తూ ఉన్నావు. 108 00:05:39,548 --> 00:05:41,842 -మిత్రమా, జాక్. -అబ్బా. 109 00:05:44,636 --> 00:05:45,596 విను, నేను వెళ్ళాలి. 110 00:05:46,805 --> 00:05:47,848 రా. 111 00:05:47,931 --> 00:05:49,474 సరే. క్షమించు, క్షమించు. క్షమించు. 112 00:05:50,684 --> 00:05:52,311 వినండి, నేను ఏమంటున్నానంటే... 113 00:05:52,394 --> 00:05:54,771 సరే, అలాగే, మనం ఇదొక్కటి చేసి, ఆ తరువాత... 114 00:05:56,773 --> 00:05:59,526 హే! సరే, మనం... కూర్చోండి. 115 00:05:59,610 --> 00:06:00,903 అందరూ ఆపండి... 116 00:06:12,831 --> 00:06:15,667 ఆస్ట్రా, సియెన్నా, లవినియా. 117 00:06:16,960 --> 00:06:18,337 ఈ డ్రెస్సుల పేర్లన్ని 118 00:06:18,420 --> 00:06:20,506 పొగరుబోతు అమ్మాయిల పేర్లలా ఉన్నాయి. 119 00:06:21,715 --> 00:06:24,009 ఇదంతా చాలా బాగుంది. నేను వెళ్ళాలి. 120 00:06:24,092 --> 00:06:26,762 -మీరు డ్రింక్ ఏమైనా తాగుతారా? -షాంపేన్? 121 00:06:28,388 --> 00:06:30,390 -ధన్యవాదాలు. -పరవాలేదు. 122 00:06:30,474 --> 00:06:31,767 -చాలా బాగుంది. -నేనిలా ఉంటుందని ఊహించలేదు. 123 00:06:31,850 --> 00:06:33,977 -నీకు చీర్స్. -చీర్స్. 124 00:06:34,061 --> 00:06:35,729 వద్దు. ఎక్కువ చెయ్యద్దు. 125 00:06:35,812 --> 00:06:37,397 సరే, అమ్మాయిలూ. ఎలా ఉన్నారు? 126 00:06:37,481 --> 00:06:38,524 -హాయ్. -డారిల్. 127 00:06:38,607 --> 00:06:39,608 -హాయ్. -బాగున్నారా? 128 00:06:40,567 --> 00:06:43,487 నా భార్య ఆరోగ్యం బాలేదు. క్షమించండి, నేను సాధారణంగా ఇక్కడ ఉండను, అందుకని... 129 00:06:43,570 --> 00:06:46,907 నాకు డ్రెస్సుల గురించి అంత బాగా తెలియదు, కానీ నేను ప్రయత్నిస్తాను. 130 00:06:47,366 --> 00:06:49,326 నేను ఎగ్జాస్టులు రిపేర్లు చేస్తుంటాను. 131 00:06:49,952 --> 00:06:52,079 అవును, నిజం చెప్పాలంటే ఆమె ఈ షాప్ మూసేస్తానంది, 132 00:06:52,162 --> 00:06:54,748 ఈ ఒక్కో డ్రెస్ పది ఎగ్జాస్టులకు సమానం, 133 00:06:55,332 --> 00:06:58,168 అందుకని నేను దీనికి బదులు గ్యారేజ్ మూసేశాను. నేననేది మీకు అర్థమైంది కదా? 134 00:06:58,252 --> 00:07:00,128 సరే, చెప్పండి. పెళ్లి ఎవరిది? 135 00:07:00,212 --> 00:07:01,213 -కెరెన్. -మా అమ్మాయి. 136 00:07:01,296 --> 00:07:03,382 బాగుంది. ఆ, బాగుంది. అభినందనలు. 137 00:07:03,465 --> 00:07:05,050 -మీ కాబోయే భర్త పేరేంటి? -స్కాట్. 138 00:07:05,133 --> 00:07:06,802 స్కాట్? నా పేరులో కూడా స్కాట్ ఉంది. 139 00:07:09,471 --> 00:07:10,722 -ఎంత సరదా విషయం. -సరదా విషయం. 140 00:07:10,806 --> 00:07:13,267 అందుకు అవకాశం ఎంత? అది మాజిక్. అద్భుతం. 141 00:07:14,184 --> 00:07:15,269 అవును. 142 00:07:15,352 --> 00:07:18,146 అయితే... ఆ, స్టైల్ పరంగా, మీరు... 143 00:07:18,230 --> 00:07:19,898 అయితే, మీరేం ఎంచుకుంటారు? 144 00:07:19,982 --> 00:07:23,026 మాకు చెత్తలా కనిపించాలని లేదు. 145 00:07:24,194 --> 00:07:26,196 సరే, అవును. కాదు, మంచి మాట, మంచి మాట. 146 00:07:26,280 --> 00:07:27,447 మెలిండా. 147 00:07:28,657 --> 00:07:30,617 ముఖ్యమైన విషయం, "చెత్తలా కనిపించకూడదు." 148 00:07:30,701 --> 00:07:32,494 -అది సాధ్యమే. -ధన్యవాదాలు. 149 00:07:32,578 --> 00:07:34,329 -మీరు నాతో వస్తారా? -వెళ్ళు, కెరెన్. 150 00:07:34,413 --> 00:07:35,873 వెళ్ళండి. ఆనందించండి. 151 00:07:37,541 --> 00:07:38,667 ఆమెకు నచ్చుతుంది చూడండి. 152 00:07:52,181 --> 00:07:56,185 -"అద్భుతమైన ఎంబ్రాయిడరీ పని"... -నాకిది నచ్చలేదు. 153 00:07:56,268 --> 00:07:57,561 సరే. 154 00:07:58,228 --> 00:08:02,774 ఆ, నాకు ఆ... నాకు పొడుగ్గా ఉన్నవి నచ్చుతాయి. 155 00:08:02,858 --> 00:08:05,402 -చేతులు? -అవును, చేతులు. అవే, అవును. 156 00:08:05,485 --> 00:08:06,904 అవును, చేతులు. 157 00:08:10,908 --> 00:08:14,995 "చాలా బాగా అమరిపోయే క్లాసిక్ ఏ లైన్ పొరలు ఉన్న షిఫాన్"... 158 00:08:15,078 --> 00:08:16,371 -వద్దు! -అది... 159 00:08:20,542 --> 00:08:22,544 -ఆమె మళ్ళీ వెళ్ళింది. -అవును. 160 00:08:28,926 --> 00:08:31,303 -అయితే మీ భార్య ఆరోగ్యం బాలేదా? -అవును, అవును. 161 00:08:31,386 --> 00:08:33,263 అవును. వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. పాపం. 162 00:08:36,558 --> 00:08:39,394 ఇదుగో. అది చూడండి. ఇది చాలా బాగుంది. 163 00:08:39,477 --> 00:08:41,313 -కెరెన్. -నాకిది నచ్చింది 164 00:08:41,395 --> 00:08:43,732 -అవును. ఇది చాలా బాగుంది. -అవును. 165 00:08:43,815 --> 00:08:48,070 "మీ మనసు యొక్క కొరికే కల" అని సిండ్రెల్లా ఒకసారి అంది. 166 00:08:48,862 --> 00:08:50,030 మీకు తెలుసు కదా. 167 00:08:50,113 --> 00:08:54,076 నాకు తెలియదు. ఇది బానే ఉంది. నాకు ఎలా అనిపించాలి? 168 00:08:54,159 --> 00:08:56,745 సరైనది డ్రెస్ దొరికితే ఏడుపు వస్తుంది అని కారల్ చెప్తుంది. అప్పుడే తెలుస్తుంది. 169 00:08:56,828 --> 00:08:58,622 నేను 2012 తరువాత ఏడవలేదు. 170 00:08:59,248 --> 00:09:02,334 నేను సాధారణంగా ఏడవను, కానీ నేను ఏడిస్తే మాత్రం... 171 00:09:02,417 --> 00:09:04,253 -నన్నెవరూ ఆపలేరు, అర్ధమవుతుందా? -అవునా? 172 00:09:04,336 --> 00:09:05,337 అవునా? 173 00:09:05,879 --> 00:09:08,340 -నీ వాచ్ తీసెయ్. -ఎందుకు? 174 00:09:08,423 --> 00:09:11,552 రెండు వేల పౌండ్ల పెళ్లి డ్రెస్ వేసుకున్నప్పడు కేసియో వాచ్ పెట్టుకోకూడదు. 175 00:09:11,635 --> 00:09:13,387 నాకు టైమెంతో ఎలా తెలుస్తుంది? 176 00:09:13,470 --> 00:09:17,015 అది నీ పెళ్లి రోజు. అందరూ నీకు టైం చెప్తారు. 177 00:09:18,559 --> 00:09:20,811 అందుకనే పెళ్లి కూతుర్లు చర్చ్ కి సమయానికి రారు. 178 00:09:20,894 --> 00:09:23,438 అందరూ వారి వద్ద నుంచి వాచీలు తీసేసుకోవడం వలన. 179 00:09:23,522 --> 00:09:24,815 నన్ను ముట్టుకోవద్దు. 180 00:09:26,567 --> 00:09:27,693 ఇది ఆమె మొదటి పెళ్ళా? 181 00:09:27,776 --> 00:09:29,194 -అవును. -అవును. 182 00:09:29,278 --> 00:09:31,572 ఓ, అలాగా. సరే. అవును, ఈ అనుభవం ఎప్పటికి గుర్తుండిపోతుంది, కదా? 183 00:09:33,323 --> 00:09:35,242 వెయ్యండి, వెయ్యండి, వెయ్యండి. 184 00:09:35,325 --> 00:09:37,244 అవును! 185 00:09:43,292 --> 00:09:44,293 అవును! 186 00:09:45,502 --> 00:09:47,171 సరే. అలాగే, ప్లీజ్. 187 00:09:47,254 --> 00:09:53,218 -నలభై. మేము నలభై చేయబోతున్నాము. -నలభై, నలభై, నలభై, నలభై, నలభై, నలభై. 188 00:09:56,638 --> 00:09:59,933 సరే. అలాగే. అయితే... 189 00:10:00,017 --> 00:10:02,895 అయ్యో. ఆగండి, వెళ్ళకండి. మనం మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. 190 00:10:02,978 --> 00:10:06,648 వినండి. వినండి, మనం ఇంకా మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి... మీరు... 191 00:10:06,732 --> 00:10:08,066 అదేంటో నీకు తెలుసా? 192 00:10:08,150 --> 00:10:10,444 చెప్పడానికి ఏమీ లేకపోతే మీటింగ్ కి పిలవడం ఎందుకు? 193 00:10:24,666 --> 00:10:25,709 ఛ. 194 00:10:27,836 --> 00:10:30,172 నాకు చాలా సరదాగా ఉంది. 195 00:10:31,965 --> 00:10:35,761 నీకు తెలుసా, నాకు మహిళల జైలుకి వెళ్లాలని అనుకునేదాన్ని. 196 00:10:36,762 --> 00:10:39,848 అక్కడ ఒకరికి ఒకరు సన్నిహితంగా మెలుగుతారు. 197 00:10:43,143 --> 00:10:44,144 ఇదెలా ఉంది? 198 00:10:44,728 --> 00:10:46,063 -వద్దు. బాలేదు. -ఒద్దు. 199 00:10:54,738 --> 00:10:56,615 ఆమె సంతోషంగా ఉందంటావా? 200 00:10:57,157 --> 00:10:59,368 ఆ. ఆ, ఉందనుకుంటాను. 201 00:11:01,495 --> 00:11:02,829 నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేదానివి. 202 00:11:04,164 --> 00:11:05,290 నీ పద్ధతిలో. 203 00:11:06,792 --> 00:11:09,503 నాకు ఆమె నవ్వితే చూడాలని ఉంది. 204 00:11:13,590 --> 00:11:14,800 ఏమైనా తెలిసిందా? 205 00:11:15,384 --> 00:11:16,635 లేదు, ఇంకా తెలీలేదు. 206 00:11:17,636 --> 00:11:19,137 అంతా అనుకూలంగానే జరుగుతుంది అనిపిస్తుంది నాకు. 207 00:11:23,934 --> 00:11:25,561 అది ఎలా ఉంటుంది? 208 00:11:25,644 --> 00:11:26,687 ఏది? 209 00:11:27,229 --> 00:11:29,147 పిల్లలని కనడం. వాళ్ళ కోసం ఇదంతా చేయడం. 210 00:11:31,525 --> 00:11:33,485 అది నీ వీపు మీద ఎండలా ఉంటుంది. 211 00:11:41,034 --> 00:11:45,080 -ఒకసారి అమ్మాయిని ముద్దు పెట్టుకున్నా. -సరే. అలాగే. 212 00:11:46,540 --> 00:11:49,126 -ఇది బానే ఉంది. -పదండి. 213 00:11:49,835 --> 00:11:51,879 మేము వస్తున్నాం. మేము వస్తున్నాం. 214 00:11:51,962 --> 00:11:53,380 ఆ. 215 00:11:53,463 --> 00:11:55,215 -మేము వస్తున్నాం. -మేము వస్తున్నాం. 216 00:12:01,597 --> 00:12:02,806 కెరెన్. 217 00:12:04,057 --> 00:12:05,309 -ఇది బాగుంది. -అవును. 218 00:12:05,392 --> 00:12:07,769 -చాలా బాగుంది. -అవునా? 219 00:12:07,853 --> 00:12:10,689 అవును. అవును, చాలా బాగుంది, అవును. ఇది చాలా బాగుంది. 220 00:12:10,772 --> 00:12:13,442 -కదా? అవును. ఇది అధ్భు... -అవును. 221 00:12:13,525 --> 00:12:14,985 ఇది అద్భుతంగా ఉంది. 222 00:12:16,528 --> 00:12:18,739 -నేను ఏడుస్తున్నానా? -అవును. 223 00:12:20,741 --> 00:12:21,950 ఇలారా. 224 00:12:32,753 --> 00:12:34,963 ఇంకా నయం! మూడు వేలా? 225 00:12:38,467 --> 00:12:40,802 నేను నిన్ను మేనేజ్మెంట్ సలహాలు ఆడిగితే, 226 00:12:41,428 --> 00:12:43,805 నువ్వు పొగరుగా, విసుగు తెప్పించేలా మాట్లాడే అవకాశం ఉందా? 227 00:12:43,889 --> 00:12:46,391 -తప్పకుండా ఉంది. -ఫ్రెడ్డీ. 228 00:12:50,521 --> 00:12:51,980 -అవునా? -అవును. 229 00:12:52,064 --> 00:12:55,108 సరే. అలాగే. అయితే నేనేం చెయ్యను? 230 00:12:55,859 --> 00:12:58,487 ఆహ్. సమస్య ఏంటంటే, మ్యానేజ్ చేయడం పుట్టుకతోనే వచ్చే కళ. 231 00:12:58,570 --> 00:13:00,489 మేనేజర్ ఎలా ఉండాలి అన్నది నేర్చుకోలేవు. 232 00:13:01,156 --> 00:13:03,742 -అది మేనేజ్మెంట్ స్కూల్ లో నేర్చుకున్నాను. -పొగరుగా, విసుగు తెప్పించేలా ఉంది. 233 00:13:04,368 --> 00:13:06,703 -హే, జేస్. -హాయ్. చిన్న హగ్. సరే. 234 00:13:06,787 --> 00:13:07,955 ఇదుగో. 235 00:13:08,038 --> 00:13:09,581 బ్రిటిష్ వాడిలాగే ఉన్నావ్. 236 00:13:10,415 --> 00:13:12,709 -జేమ్స్ ఏమైనా తెలిసిందా? -లేదు, బహుశా ఇవాళో, రేపో తెలుస్తుంది. 237 00:13:12,793 --> 00:13:13,836 సోంపు బ్రెడ్ తింటావా? 238 00:13:13,919 --> 00:13:16,380 -వద్దు. నేనది మానేయాలనుకుంటున్నాను -లేదు, తిని చూడు. 239 00:13:16,463 --> 00:13:17,464 అవునా? 240 00:13:17,548 --> 00:13:20,759 సరే. ఇలాగే తినేయనా? సరే. 241 00:13:22,553 --> 00:13:23,679 -దేవుడా. -కదా. 242 00:13:23,762 --> 00:13:25,347 ఒక మాట చెప్పనా... అవును. 243 00:13:25,430 --> 00:13:28,392 నాకిది చాలా నచ్చింది. నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేకపోవడానికి కారణం ఇదే. 244 00:13:28,475 --> 00:13:31,103 -ఏంటి సంగతులు? -జేసన్ తన సిబ్బందిని భరించలేకపోతున్నాడు. 245 00:13:31,186 --> 00:13:32,729 లేదు, అది కాదు. అది కొంచెం క్లిష్టంగా ఉంది. 246 00:13:32,813 --> 00:13:35,482 ఎందుకంటే, అది... వాళ్ళు నా స్నేహితులు కూడా. 247 00:13:35,566 --> 00:13:37,276 అలా అనుకుంటే ఏం చేయలేవు. 248 00:13:37,943 --> 00:13:39,611 నువ్వు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా బాస్ రెండూ అవ్వలేవు. 249 00:13:39,695 --> 00:13:40,529 ఎందుకు కాదు? 250 00:13:40,612 --> 00:13:42,447 ఆ, ఎందుకంటే, అందరికీ వాళ్ళ బాసులని ద్వేషించడం నచ్చుతుంది. 251 00:13:42,531 --> 00:13:43,532 అన్ని సమయాల్లో కాదు. 252 00:13:43,615 --> 00:13:45,993 -నువ్వు నీ పాత బాస్ ని ద్వేషించావా? -అవును, కానీ అది వేరు, ఎందుకంటే... 253 00:13:46,076 --> 00:13:47,995 చూడు, మేము పబ్ కి వెళ్ళడం అలాంటివి చేస్తాము. 254 00:13:48,078 --> 00:13:51,248 నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళక్కడికి నీ గురించి మాట్లాడుకోడానికి వెళ్తారు. 255 00:13:51,331 --> 00:13:53,584 చూడు, నువ్వు పైలట్ వి, వాళ్ళు ప్రయాణీకులు. 256 00:13:53,667 --> 00:13:56,003 పైలట్ విమానం నడపడం ఆపి, 257 00:13:56,086 --> 00:13:59,339 నీ పక్కన కూర్చుని వేరుసెనగలు తింటే నీకెలా అనిపిస్తుంది? 258 00:13:59,423 --> 00:14:03,635 నీకు భయం వేస్తుంది. "ఈ విమానాన్ని ఎవరు నడుపుతున్నారు?" అని ప్రశ్నించుకుంటావు. 259 00:14:05,429 --> 00:14:08,265 నువ్వు పెద్దవాడివి. అందరూ నిన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు. 260 00:14:08,348 --> 00:14:09,433 ఆ, సరే. 261 00:14:09,516 --> 00:14:10,976 సరే, 20 నిమిషాలలో సిద్దంగా ఉంటావా? 262 00:14:11,602 --> 00:14:13,729 -ఉంటాను. -అది చాలా పెద్దది. 263 00:14:13,812 --> 00:14:16,315 -బోలీవియన్లు వస్తున్నారు. -అందరూనా? 264 00:14:16,398 --> 00:14:17,900 ఓ, అవును. 265 00:14:17,983 --> 00:14:19,443 -ధన్యవాదాలు. -పరవాలేదు. 266 00:14:19,526 --> 00:14:21,278 బాగుంది. తెలివింది. 267 00:14:21,361 --> 00:14:23,655 -ఎలా ఉంది, మిత్రమా? -ఆ, ఇది బాగుంది. బాగుంది. 268 00:14:23,739 --> 00:14:24,907 -నేను అలిసిపోయాను. -అవునా? 269 00:14:24,990 --> 00:14:26,533 ఇవాళ ఉదయం 4:00 కి వచ్చాము, 270 00:14:26,617 --> 00:14:29,786 7:00 కల్లా లేచి వాలతాంస్టోలో ఆమె స్నేహితురాలు ఇల్లు మారడానికి సహాయం చేసాము. 271 00:14:29,870 --> 00:14:30,871 అబ్బా. 272 00:14:31,580 --> 00:14:34,082 ఆమె చాలా ఉత్సాహంగా, అలసటే లేనట్టు ఉంటుంది. 273 00:14:34,958 --> 00:14:37,419 ఆమెకి ఇంకా జీవితంలో ఉత్సాహం తగ్గలేదు. అది ఎప్పుడు జరుగుతుందో? 274 00:14:37,503 --> 00:14:40,088 చిన్న ఊర్లలో ఉండే వారు పట్టణ ప్రజలకంటే ఉత్సాహంగా ఉంటారు. 275 00:14:40,172 --> 00:14:41,507 అవును. మంచిది. 276 00:14:47,763 --> 00:14:48,764 హలో. 277 00:14:50,307 --> 00:14:52,267 -ఏంటి? ఎప్పుడు? -వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. 278 00:14:52,351 --> 00:14:53,477 సరే, నేను వస్తున్నాను. 279 00:14:54,144 --> 00:14:56,063 -నేను వస్తున్నాను. మళ్ళీ కలుస్తా, మిత్రమా. -గుడ్ లక్. 280 00:15:05,030 --> 00:15:06,907 వాళ్ళు కారణం ఏమైనా చెప్పారా? 281 00:15:08,784 --> 00:15:10,369 మీరు చెప్పచ్చు. 282 00:15:10,452 --> 00:15:12,913 జేసన్ వాళ్ళని ఒప్పించలేకపోయినా, 283 00:15:12,996 --> 00:15:14,623 లేదా ఆ ఫోటోలో మరీ కరుకుగా అనిపించినా మీరు చెప్పచ్చు. 284 00:15:14,706 --> 00:15:16,792 -అయితే అంతా నా వల్లనేనా, ఆ? -లేదు, సరే, క్షమించండి, లేదు, అది... 285 00:15:16,875 --> 00:15:18,669 లేదు, అది నా వలన కూడా అవ్వచ్చు. 286 00:15:18,752 --> 00:15:20,546 నేను తల్లిని కావడానికి చిన్నదానిలా అనిపించానేమో. 287 00:15:20,629 --> 00:15:21,630 సరే. 288 00:15:21,713 --> 00:15:26,426 వాళ్ళు జేమ్స్ వయసు ఉన్న మరో బిడ్డ ఉన్న కుటుంబాన్ని ఎంచుకున్నారు. 289 00:15:26,510 --> 00:15:27,553 సరే. 290 00:15:29,429 --> 00:15:31,557 అంటే, అది అంత న్యాయంగా అనిపించడం లేదు కదా, 291 00:15:31,640 --> 00:15:33,433 వాళ్లకి ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నా కూడా వాళ్లకే ఇవ్వడం. 292 00:15:35,936 --> 00:15:38,146 లేదు, దానికి, ఆ... దానికి అర్థం ఉంది. 293 00:15:38,689 --> 00:15:41,900 అతను ఆడుకోవడానికి ఒక అక్కో, అన్నో ఉంటాడు, అందుకని... 294 00:15:42,442 --> 00:15:44,528 అది మంచి నిర్ణయం, కదా? 295 00:15:45,195 --> 00:15:49,616 చూడండి, మీరు దీని మీద ఆశలు పెట్టుకున్నారు, కానీ ఇదే ఆఖరి అవకాశం కాదు కదా. 296 00:15:49,700 --> 00:15:51,159 అయితే తరువాత ఏంటి? 297 00:15:51,243 --> 00:15:53,328 అన్నీ కావాలనుకున్నట్లు జరగనప్పుడు, 298 00:15:53,412 --> 00:15:56,582 మనం వేరే మార్గాలను అన్వేషించాలి, అవునా? 299 00:15:56,665 --> 00:16:01,086 అయితే, మీరు కొంత మంది పిల్లల్ని కలవడానికి ఇష్టపడతారా? 300 00:16:01,587 --> 00:16:03,714 అవునా? అవును, అద్భుతం. అవును, అవును, అవును. కలుస్తాం. 301 00:16:03,797 --> 00:16:05,632 అవును, కాదు, వ్యక్తిగతంగా కలవడం బాగుంటుంది. 302 00:16:05,716 --> 00:16:08,010 -రేపు. -రేపా? 303 00:16:09,845 --> 00:16:11,763 "అడాప్షన్ యాక్టివిటీ డే." హా. 304 00:16:11,847 --> 00:16:15,142 ప్రతి ఆరు నెలలకి ఒకసారి, ఇంకా దత్తత తీసుకోబడని పిల్లలను, 305 00:16:15,225 --> 00:16:18,270 అలాగే పిల్లల కోసం వెతుకుతున్న వారందరిని కలిపి ఒక పార్టీ ఇస్తాము, 306 00:16:18,353 --> 00:16:19,605 ఆ తరువాత ఏం జరుగుతుందో చూస్తాము. 307 00:16:19,688 --> 00:16:21,648 దత్తతు వ్యవస్థ సరిగా లేనందున ఇలా చేయక తప్పడం లేదు, 308 00:16:21,732 --> 00:16:23,650 కానీ కేక్ ఉంటుంది కాబట్టి మేము సరే అంటాము. 309 00:16:23,734 --> 00:16:25,402 అక్కడ ఎంత మంది పిల్లలు ఉండవచ్చు? 310 00:16:25,485 --> 00:16:27,529 25 మంది ఉంటారేమో. మైగ్రేన్ వస్తుందని అనుకోండి. 311 00:16:28,155 --> 00:16:30,282 నిజానికి, డేటింగ్ పట్ల నా విధానం కూడా అదే. 312 00:16:30,365 --> 00:16:32,201 ఇళ్లను చూసినట్లు చూసి నచ్చిన వారిని ఎంచుకోవడం మేలు. 313 00:16:32,284 --> 00:16:35,287 సమయం కలిసొస్తుంది, ఎందుకంటే నా వయసు మగాళ్ల అందం వేగంగా తగ్గిపోతోంది. 314 00:16:35,370 --> 00:16:38,624 అదృష్టవశాత్తు నా అందం నెమ్మదిగా తగ్గుతోంది. 315 00:16:39,291 --> 00:16:42,586 సరే, అయితే పిల్లలను కలిసి వాళ్లకి మేము నచ్చేలా చేయడానికి 316 00:16:42,669 --> 00:16:45,047 మాకు రెండు గంటలు ఉంటుంది అన్నమాట... 317 00:16:45,714 --> 00:16:47,341 అది కూడా ఒక ఫాన్సీ డ్రెస్ లో. వావ్. 318 00:16:47,424 --> 00:16:50,719 ఓ, అవును. "నేను పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నాను" అన్నది థీమ్. 319 00:16:52,054 --> 00:16:53,680 -అయితే, ఆలోచించు, సరేనా? -సరే. 320 00:16:53,764 --> 00:16:56,892 లేదు. కంగారు పడకండి. అది పిల్లలతో కలిసి కాసేపు పార్క్ లో ఫుట్ బాల్ ఆడడం. 321 00:16:56,975 --> 00:16:58,810 ఫుట్ బాలా? పార్క్ లో ఫుట్ బాలా... 322 00:16:58,894 --> 00:17:00,103 -అది బాగుంది. అవును, మంచి ఆలోచన. -అవును. 323 00:17:00,187 --> 00:17:03,482 అవును, మరీ ఎక్కువగా అలోచించి ఆశలు పెంచుకోకండి, సరేనా. 324 00:17:03,565 --> 00:17:05,651 దేవుడా, లేదు. మేమలా చేయం. అవును కదా? 325 00:17:05,733 --> 00:17:07,236 -లేదు. దేవుడా, లేదు. లేదు, లేదు, లేదు. -లేదు. 326 00:17:07,319 --> 00:17:08,694 జేమ్స్ 327 00:17:14,367 --> 00:17:16,578 జేమ్స్ 328 00:17:18,163 --> 00:17:19,915 కొన్నిసార్లు నువ్వు సమయం గడిచే కొద్దీ కొంత మందిని మిస్ అవుతాం. 329 00:17:22,709 --> 00:17:23,710 అవును. 330 00:17:23,794 --> 00:17:25,628 అది ఎవరితోనైనా విడిపోవడంలా ఉంటుంది. 331 00:17:25,712 --> 00:17:28,382 నువ్వు దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. 332 00:17:28,464 --> 00:17:31,677 అవును, కాని, నేనలా చేయను. 333 00:17:32,427 --> 00:17:35,305 నేను సెక్స్ చేసిన ప్రతివారితో ఇంకా స్నేహంగా ఉన్నాను, అందుకని... 334 00:17:35,389 --> 00:17:36,849 సరే, అది వినడానికి బాలేదు. 335 00:17:49,862 --> 00:17:51,363 మనం కాస్ట్యూమ్స్ కోసం ఏం చేద్దాము? 336 00:17:51,446 --> 00:17:53,699 ఓ, అవును. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకున్నావు? 337 00:17:53,782 --> 00:17:58,287 కార్ అద్దెకి ఇచ్చే సంస్థలో రిసెప్షనిస్టుగా పని చేద్దామనుకున్నాను. అందుకని... 338 00:17:58,370 --> 00:18:00,038 -అంతే. -అది బాగా చేసావు. 339 00:18:00,122 --> 00:18:02,332 -బూమ్. -చాలా ధన్యవాదాలు. నీ సంగతి ఏంటి? 340 00:18:02,416 --> 00:18:04,001 -మా నాన్న స్నేహితుడు, మైఖెల్. -ఓ, అవునా? 341 00:18:04,084 --> 00:18:07,421 అవును. నా చిన్నప్పుడు ఆయన చాలా సరదాగా ఉండేవారు. 342 00:18:07,504 --> 00:18:12,134 కానీ నేను పెద్దయ్యాక అయన ఒక తాగుబోతని తెలుసుకున్నాను. అవును. 343 00:18:12,217 --> 00:18:13,385 సరే. 344 00:18:13,468 --> 00:18:15,596 అవును, ఆయన ఇక లేడు. దేవుడు ఆయనని దీవించు గాక. 345 00:18:16,430 --> 00:18:18,265 బాగా తాగి చచ్చిపోయారు, అవును. 346 00:18:23,562 --> 00:18:24,688 మనం బానే ఉన్నామా? 347 00:18:27,441 --> 00:18:28,650 ఉన్నాము. 348 00:18:31,778 --> 00:18:33,780 పిల్లలకు మనం నచ్చుతాము, కాదా? 349 00:18:33,864 --> 00:18:35,115 నచ్చుతాము. 350 00:18:36,950 --> 00:18:39,077 పెన్నీ సరిగ్గా చెప్పింది. మనం... మనం దీని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. 351 00:18:39,161 --> 00:18:40,829 -అవును. -మనం కొంత మంది పిల్లలతో 352 00:18:40,913 --> 00:18:41,914 ఫుట్బాల్ ఆడతాము అంతే. 353 00:18:41,997 --> 00:18:43,165 అవును. 354 00:19:11,151 --> 00:19:12,611 అబ్బా. 355 00:19:26,083 --> 00:19:28,794 కామ్డెన్ హై స్ట్రీట్ 356 00:19:31,004 --> 00:19:33,882 సరే, మనకి 20 నిమిషాలు ఉన్నాయి, అలా వెళ్లి ఇలా రావాలి. 357 00:19:33,966 --> 00:19:35,342 ఆ, కంగారు పడకు. నాకేం కావాలో నాకు తెలుసు. 358 00:19:35,425 --> 00:19:36,635 ఫాన్సీ డ్రెస్ మరియు వింటేజ్ 359 00:19:37,302 --> 00:19:39,638 -ఇదుగో, ఇదెలా ఉంది? -వద్దు. 360 00:19:41,265 --> 00:19:43,517 ఇక్కడ సరైనది ఒక్కటీ లేదు. 361 00:19:44,726 --> 00:19:47,145 వారు సెక్స్ పరంగా చూపలేని జంతువూ ఏదీ లేదా? 362 00:19:47,229 --> 00:19:49,398 ఆర్మడిల్లో ఉంది కదా? దానిని సెక్సీగా చూపలేం 363 00:19:50,566 --> 00:19:52,401 హలొ అండి. హాయ్. 364 00:19:53,277 --> 00:19:57,573 మీ దగ్గర మంచి రోల్ మోడల్స్ అయిన మహిళల బట్టలు ఏమైనా ఉన్నాయా? 365 00:19:58,824 --> 00:20:00,701 అక్కడ ఎడమ వైపు, రోల్ ప్లే బట్టలు ఉన్నాయి. 366 00:20:00,784 --> 00:20:05,163 లేదు. నా ఉద్దేశం, పెద్దయ్యాక ఏం కావాలనుకున్నాం అనేది చూపించడానికి కావాలి. 367 00:20:05,247 --> 00:20:09,334 ఒక బిజినెస్ పర్సన్ లేదా డాక్టర్ లేదా లాయర్ లా. 368 00:20:09,418 --> 00:20:11,336 అవును, అలాంటిదే. 369 00:20:11,420 --> 00:20:12,421 మా దగ్గర జడ్జ్ దుస్తులు ఉన్నాయి. 370 00:20:13,255 --> 00:20:14,965 సరే. అద్భుతం. 371 00:20:18,927 --> 00:20:20,345 ఇది అస్సలు బాలేదు. 372 00:20:22,598 --> 00:20:23,640 అవును. 373 00:20:25,350 --> 00:20:27,394 లేదు, నన్ను క్షమించు. నేను ఇలాంటి డ్రెస్ లో వెళ్ళలేను. 374 00:20:28,187 --> 00:20:29,354 చూడు, నువ్వు... 375 00:20:30,522 --> 00:20:33,650 లేదు, సరే. సరే. ఒక ప్రిన్సెస్ డ్రెస్ ఎలా ఉంటుంది? 376 00:20:33,734 --> 00:20:35,194 రాకుమార్తెలు గొప్ప వారే కదా. 377 00:20:35,277 --> 00:20:37,154 నిజ జీవితంలో రాకుమార్తెని చూసావా, జేస్? వాళ్ళ జీవితం బాధాకరం. 378 00:20:37,237 --> 00:20:39,114 అమ్మాయిలందరికీ ప్రిన్సెస్ లు అవ్వాలని ఉండదు. 379 00:20:39,198 --> 00:20:41,909 నా కూతురు ఒక రాకుమార్తె అవ్వడం నాకు ఇష్టం లేదు. 380 00:20:42,993 --> 00:20:46,079 ఈ షాపులో మహిళలను తక్కువ చేయని డ్రెస్ ఏదైనా ఉందా? 381 00:20:50,792 --> 00:20:52,920 -నాకు కొంచెం భయంగా ఉంది. -ఏమన్నావు? 382 00:20:53,921 --> 00:20:56,173 నాకు కొంచెం భయంగా ఉందన్నాను. 383 00:20:56,256 --> 00:20:58,300 -అవును. నాకు తెలుసు. -ఇంకా వేడిగా. 384 00:20:58,383 --> 00:21:00,260 కెన్యాలో ఈ డ్రెస్ వేసుకోవడం ఊహించుకో. 385 00:21:02,596 --> 00:21:03,597 ఓహ్, నేను నాకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్ 386 00:21:03,680 --> 00:21:06,391 చూపించి పిల్లల్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నాను. 387 00:21:06,475 --> 00:21:08,936 -టీనేజర్ గా ఉన్నప్పుడు నేర్చుకున్నావా? -అవును. నువ్వేమంటావు? 388 00:21:09,019 --> 00:21:10,020 నాకు చూపించు. 389 00:21:10,103 --> 00:21:12,189 -సరే. ఇది ఒక్క నిమిషం పట్టుకో. -సరే. 390 00:21:12,272 --> 00:21:14,191 అయితే, నువ్వు... 391 00:21:37,506 --> 00:21:38,715 ఇవి నిజమైన కదలికలు కాదు కదా? 392 00:21:38,799 --> 00:21:41,009 లేదు, ఇది... చాలా వరకు నేను మర్చిపోయాను. 393 00:21:41,093 --> 00:21:43,220 కానీ అది ఒక విధంగా అది బాగుంది, 394 00:21:43,303 --> 00:21:45,722 ఎందుకంటే నాకు తరువాత ఏం చేయాలో తెలియకపోతే, నా ఎదుటి వాళ్లకి కూడా తెలియదు. 395 00:21:45,806 --> 00:21:46,807 -అవును. -అందుకని... 396 00:21:47,808 --> 00:21:48,809 నేనైతే చేయను. ఆ. 397 00:21:51,311 --> 00:21:53,355 -నా టోపీ ఇస్తావా? -అవును, నీ టోపీ. 398 00:21:55,232 --> 00:21:57,067 ఫైర్ ఫైటర్ 399 00:22:04,575 --> 00:22:07,244 చూడు, మనం ఒక్కళ్ళమే ఫాన్సీ డ్రెస్ లో వస్తామని నాకు తెలుసు. 400 00:22:07,327 --> 00:22:08,161 -మంచిది. -అవును, కానీ... 401 00:22:08,245 --> 00:22:09,955 -మనం గుర్తుంటాము. -అవును. 402 00:22:13,041 --> 00:22:15,502 -మనం వెళ్లి ఒక పిల్లాడితో మాట్లాడాలి. -అవును. 403 00:22:16,670 --> 00:22:18,130 చూడు, వాడు ఒంటరిగా ఉన్నాడు. 404 00:22:18,213 --> 00:22:20,340 అవును. త్వరగా, వేరే ఎవరైనా వాడి దగ్గరకి వచ్చే లోపు వెళ్దాం. 405 00:22:23,802 --> 00:22:24,803 హలో. 406 00:22:24,887 --> 00:22:26,680 -హలో, మిత్రమా. ఎలా ఉన్నావు? -హాయ్. 407 00:22:26,763 --> 00:22:29,016 -హాయ్. -నేను నిక్కి. ఇతను జేసన్. 408 00:22:29,099 --> 00:22:30,100 హాయ్. 409 00:22:30,184 --> 00:22:31,894 -నీ పేరేంటి? -ఈథన్. 410 00:22:31,977 --> 00:22:36,398 -హాయ్, ఈథన్. ఇది ఎవరు? -ఇది నా స్నేహితుడు. 411 00:22:39,109 --> 00:22:40,277 మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? 412 00:22:41,695 --> 00:22:45,032 మేమిక్కడికి నీతో ఆడుకుని, నీకు నచ్చుతామో లేదో చూడడానికి వచ్చాము. 413 00:22:45,699 --> 00:22:46,533 ఎందుకు? 414 00:22:47,576 --> 00:22:51,413 అప్పుడు నువ్వు మాతో వచ్చి మా ఇంట్లో ఉండవచ్చు. 415 00:22:51,496 --> 00:22:52,915 లేదు. 416 00:22:52,998 --> 00:22:55,000 ఓ, లేదు. లేదు, అంతా బానే ఉంది. వెంటనే కాదు. 417 00:22:55,083 --> 00:22:57,794 -లేదు, లేదు, లేదు. -ఈథన్? 418 00:22:57,878 --> 00:23:00,464 అంతా బానే ఉంది. లేదు, మేము ఏమీ చెయ్యలేదు. 419 00:23:01,840 --> 00:23:04,551 హ్యాపీ బర్త్ డే టు యు 420 00:23:04,635 --> 00:23:09,056 హ్యాపీ బర్త్ డే టు యు 421 00:23:09,139 --> 00:23:10,599 హ్యాపీ బర్త్ డే... 422 00:23:10,682 --> 00:23:12,017 -అయ్యయ్యో. -సరే. 423 00:23:12,100 --> 00:23:14,770 -నేను వెళ్ళను. -మేము... క్షమించండి. అందుకు క్షమించండి. 424 00:23:14,853 --> 00:23:16,813 -క్షమించండి, క్షమించండి. -అవును, అందుకు క్షమించండి. 425 00:23:17,856 --> 00:23:20,400 -నువ్వు ఇది సరైన చోటు అన్నావు. -అవును, నేను అనుకున్నాను. 426 00:23:20,484 --> 00:23:23,195 -కంబర్లాండ్ గేట్. -కాదు, ఇది కంబర్లాండ్ గ్రీన్. 427 00:23:23,987 --> 00:23:25,155 మనం దగ్గరలోనే ఉన్నామేమో. 428 00:23:25,239 --> 00:23:27,574 కాదు, కాదు. కాదు, కంబర్లాండ్ గేట్ హైడ్ పార్క్ లో ఉంది, నిక్కి. 429 00:23:27,658 --> 00:23:30,494 -ఇది రీజెంట్స్ పార్క్. -అబ్బా. 430 00:23:30,577 --> 00:23:32,996 -సరే. నువ్విందులో పరిగెత్తగలవా? -పరిగెత్తగలను. 431 00:23:33,080 --> 00:23:34,540 సరే, పద. పద వెళదాం. 432 00:23:38,585 --> 00:23:40,504 బస్సు. జేస్. 433 00:23:47,261 --> 00:23:49,263 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 434 00:23:52,808 --> 00:23:53,809 పరవాలేదు. చూడు. 435 00:23:53,892 --> 00:23:56,019 -మనం చేరుకుంటాము, సరేనా? సరిగ్గా సమయానికి. -సరే. 436 00:23:58,897 --> 00:24:00,274 -ఏం పర్వాలేదు. భయపడకు. -దేవుడా. 437 00:24:00,357 --> 00:24:01,608 మనం చేరుకుంటాం. 438 00:24:04,486 --> 00:24:06,238 గుడ్ మార్నింగ్. మార్బుల్ ఆర్చ్. 439 00:24:06,947 --> 00:24:08,991 ఏ మార్బుల్ ఆర్చ్, మిత్రమా? సబ్వేనా లేక వేరేదా? 440 00:24:13,161 --> 00:24:15,706 మీరు మార్బుల్ ఆర్చ్ సబ్వేకి వెళ్ళాలా? 441 00:24:17,416 --> 00:24:19,668 సబ్వేనా? స్టేషనా? 442 00:24:19,751 --> 00:24:21,920 -అబ్బా. ఇంకా నయం. -దేవుడా. 443 00:24:22,004 --> 00:24:27,676 కాదు, మార్బుల్ ఆర్చ్. మార్బుల్ లోపల ఉన్న ఆ భవనం. 444 00:24:28,969 --> 00:24:29,803 సరే, అలాగే. 445 00:24:29,887 --> 00:24:31,722 -హాయ్. -హలో, మీరు ఎక్కడికి వెళ్ళాలి? 446 00:24:31,805 --> 00:24:32,931 -మార్బుల్ ఆర్చ్. -మార్బుల్ ఆర్చ్. 447 00:24:33,015 --> 00:24:36,643 మార్బుల్ ఆర్చ్? మీకు మార్బుల్ ఎందుకు... మార్బుల్ ఆర్చ్ చెత్త. అది చిన్నది. 448 00:24:36,727 --> 00:24:38,270 అందరికీ అది తెలుసు. మీరెక్కడి నుంచి వచ్చారు? 449 00:24:39,021 --> 00:24:40,022 పారిస్. 450 00:24:40,105 --> 00:24:43,400 పారిస్? మీరు పారిస్ నుంచి మార్బుల్ ఆర్చ్ చూడడానికి వచ్చారా? మీకు పిచ్చా? 451 00:24:43,483 --> 00:24:46,737 ఆర్క్ డి ట్రాయింఫ్ నుంచి దూరంగా నుంచోండి. అది మార్బుల్ ఆర్చ్ లాగా కనిపిస్తుంది. 452 00:24:46,820 --> 00:24:48,655 మార్బుల్ ఆర్చ్. 453 00:24:48,739 --> 00:24:50,073 -దేవుడా. -పద. వెళదాం. 454 00:24:51,325 --> 00:24:52,784 మార్బుల్ ఆర్చ్. 455 00:24:53,577 --> 00:24:55,120 కంబర్లాండ్ గేట్, సరేనా. 456 00:24:56,622 --> 00:24:57,623 ఎటు వైపు? 457 00:24:57,706 --> 00:24:58,916 -అక్కడ. -అవును? 458 00:25:03,712 --> 00:25:06,507 -వాళ్ళు చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? -స్పాన్సర్ పరుగులో పరిగెడుతున్నాం అని. 459 00:25:09,551 --> 00:25:10,969 -హలో, మిత్రమా. హాయ్. -హే. హాయ్. 460 00:25:11,053 --> 00:25:12,721 దయచేసి మమ్మల్ని పార్క్ అవతల వైపుకి తీసుకువెళతావా? 461 00:25:12,804 --> 00:25:15,933 లేదు, మిత్రమా. చూడు. ఇది ఆపకండి. మీరు దాదాపు వచ్చేసారు. 462 00:25:16,016 --> 00:25:18,352 -వెళ్ళండి. మీరు సాధించగలరు. -మేము ఈ పరుగులో భాగం కాదు. 463 00:25:18,435 --> 00:25:21,939 చూడండి, నేను మోసం చేయడనికి సహాయం చెయ్యలేను. అది వేరే వాళ్లకి న్యాయం కాదు. 464 00:25:22,022 --> 00:25:23,440 -అవును, కానీ మేము ఈ పరుగులో భాగం... -లేదు, లేదు, లేదు. 465 00:25:23,524 --> 00:25:25,692 -నేను మోసగాళ్ళకు సహాయం చెయ్యను. -పద. 466 00:25:28,737 --> 00:25:30,697 -క్షమించండి. -క్షమించండి. 467 00:25:30,781 --> 00:25:33,450 -క్షమించండి. క్షమించండి. -చీర్స్, మిత్రమా. 468 00:25:44,044 --> 00:25:46,672 -హలో. -హాయ్. ఇంత ఆలస్యం అయిందేంటి? 469 00:25:46,755 --> 00:25:48,423 -ఎవరైనా పిల్లలు మిగిలారా? -ఏంటి? 470 00:25:48,507 --> 00:25:50,801 -పిల్లలు. -లేరనుకుంటాను. 471 00:25:55,305 --> 00:25:57,975 అబ్బా... పరవాలేదులే. 472 00:25:58,559 --> 00:26:00,185 మేమొక అద్భుతమైన చిన్న అమ్మాయిని కలిశాము. 473 00:26:00,269 --> 00:26:04,731 మేము మధ్యాహ్నమంతా కలిసి సమయం గడిపాము. ఆమెకి మేము నిజంగా నచ్చామనుకుంటాను. ఇంకా... 474 00:26:04,815 --> 00:26:07,818 -నిక్కి. -ఆమె... నిజంగా బాగుంది. 475 00:26:08,610 --> 00:26:09,987 నిక్కి. 476 00:26:11,738 --> 00:26:13,198 క్షమించండి. ఆమె... 477 00:26:43,270 --> 00:26:46,231 ఇక్కడున్నావా. నేను నిజంగా కంగారు పడిపోయాను. 478 00:26:49,234 --> 00:26:51,820 -మనం బస్సు దగ్గరకి వెళ్దామా? -నేను నా బ్యాగ్ తెచ్చుకోవాలి. 479 00:26:51,904 --> 00:26:53,864 ఓ, సరే. పద, అయితే. వెళ్లి తెచ్చుకుందాం. 480 00:26:59,077 --> 00:27:00,579 -సరే. ఇప్పుడు, నీ బాడ్జ్ తీసుకోనివ్వు. -సరే. 481 00:27:00,662 --> 00:27:02,581 నేను ఇప్పుడే వస్తాను. ఒక్క క్షణం కూడా పట్టదు. 482 00:27:11,006 --> 00:27:12,633 కొంత మంది సిద్దంగా లేరు. 483 00:27:15,886 --> 00:27:18,430 -సరే, తల్లీ. పద, వెళ్దాం. -సరే. 484 00:27:36,365 --> 00:27:38,909 ప్రిన్సెస్ 485 00:27:41,036 --> 00:27:42,246 హే. 486 00:27:44,498 --> 00:27:45,749 ఎందుకు ఏడుస్తున్నావు? 487 00:27:51,213 --> 00:27:52,506 మనం కావాలనుకున్న దానిని చూసినప్పుడు... 488 00:27:52,589 --> 00:27:53,924 ప్రిన్సెస్ 489 00:27:54,508 --> 00:27:55,676 ...ఏడుపు వస్తుంది. 490 00:28:36,800 --> 00:28:38,302 ఆసక్తి చూపించే ఫారంలు 491 00:28:41,388 --> 00:28:43,724 పేరు(లు): నిక్కి న్యూమన్ జేసన్ రోస్ 492 00:28:43,807 --> 00:28:46,018 మీరు ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్న పిల్లలు: ప్రిన్సెస్ 493 00:29:12,044 --> 00:29:13,253 సంతోషంగా ఉన్నావా? 494 00:29:13,754 --> 00:29:14,880 ఉన్నాను. 495 00:29:17,090 --> 00:29:19,801 అయితే నీ తల నీ చేతుల్లో ఎందుకుంది? 496 00:29:21,887 --> 00:29:23,597 నోరు మూసుకో. 497 00:30:25,993 --> 00:30:27,995 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి