1 00:00:08,592 --> 00:00:10,511 ఇది చాలా వింతగా ఉందే. 2 00:00:11,261 --> 00:00:13,680 - ఇక్కడే ఉండాలి. - అది… అది చూడటానికి ఎలా ఉంటుంది? 3 00:00:14,473 --> 00:00:15,557 అది చూడటానికి క్యారెట్ కేక్ లా ఉంటుంది. 4 00:00:15,641 --> 00:00:17,518 - అందులో క్రీమ్ ఉందా లేక… - లేదు. 5 00:00:17,601 --> 00:00:18,977 ఐసింగ్ ఏ రంగులో ఉంటుంది? 6 00:00:19,061 --> 00:00:22,314 ఒకటి చెప్తా విను, నీకు గనుక ఏదైనా క్యారెట్ కేక్ కనిపిస్తే, దాన్ని నాకు చూపిస్తావా? 7 00:00:22,397 --> 00:00:23,774 అది ఇక్కడే ఉండాలి. 8 00:00:23,857 --> 00:00:25,692 లేదు, అసలు దానికి ఏమై ఉంటుందో… 9 00:00:31,406 --> 00:00:32,406 హాయ్. 10 00:00:34,535 --> 00:00:35,827 చూడు, తనకి కోపం తెప్పించకు. 11 00:00:35,911 --> 00:00:37,162 ఏంటి? నేనేం చేయలేదు. 12 00:00:37,704 --> 00:00:39,248 ఏంటి? అది నన్ను ఎప్పటికీ క్షమించదా? 13 00:00:39,998 --> 00:00:41,041 నేను తన 14 00:00:41,124 --> 00:00:42,626 అమ్మని కలిసి కూడా దానికి చెప్పలేదని నాకు తెలుసు, 15 00:00:42,709 --> 00:00:45,379 అలాగే అది అంత మంచి పని కాదని కూడా తెలుసు, కానీ, అది మరీ అంత దారుణమైన విషయమా? 16 00:00:45,462 --> 00:00:49,508 అంటే, హిట్లర్ ఇక్కడ ఉన్నాడు అనుకో. సరేనా? ఆమాల్ క్లూనీ ఇక్కడ ఉందనుకో. నేనెక్కడ ఉన్నట్టు? 17 00:00:49,591 --> 00:00:50,717 ఇంకా వెళ్ళు. 18 00:00:52,594 --> 00:00:54,012 నిజంగా? ఎల్లెన్ కంటేనా? 19 00:00:56,014 --> 00:00:57,724 సరే, ఇప్పుడు లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ని దాటిపోతున్నాం. 20 00:00:57,808 --> 00:00:59,142 సరే. 21 00:00:59,226 --> 00:01:01,645 ఇక్కడ ప్రిన్స్ ఆండ్రూ ఉన్నాడు. కాదు. నిజంగా? 22 00:01:03,063 --> 00:01:04,147 జాజెర్సైస్ లోని కైట్లిన్? 23 00:01:04,230 --> 00:01:05,399 - అవును. - నిజంగా అంటున్నావా? 24 00:01:05,482 --> 00:01:06,817 జాజెర్సైస్ లోని కైట్లిన్ కంటే దారుణ… 25 00:01:06,900 --> 00:01:09,194 సరే, లేదు, క్షమించు, నువ్వు నన్ను ఆటపట్టిస్తున్నావు. 26 00:01:09,278 --> 00:01:10,696 చూడు, నువ్వు తనకి కొంచెం టైమ్ ఇవ్వాలి. 27 00:01:10,779 --> 00:01:12,197 అలాగే, ఇంకొక మాట, ఇది బాగా గుర్తుంచుకో, 28 00:01:12,281 --> 00:01:13,866 ఈసారి రహస్యంగా ఎవరినైనా ఫాలో అవ్వాలి అనుకుంటే, 29 00:01:13,949 --> 00:01:15,576 వాళ్ళని నీ ఫోన్ లో సెల్ఫీలు తీసుకోనివ్వకు. 30 00:01:15,659 --> 00:01:19,079 మళ్ళీ చెప్తున్నా, జేస్, తను ఆ పని చేస్తోందని నాకు తెలీదు. 31 00:01:19,162 --> 00:01:20,664 నీకు తెలీకుండా ఎలా ఉంటుంది? మరీ చెప్తున్నావు, నిక్. 32 00:01:20,747 --> 00:01:23,083 ఎందుకంటే నేను అస్తమాను ఫోన్ లో ఫోటోలు చూస్తూ కూర్చోను. 33 00:01:23,166 --> 00:01:24,168 నేనేం 23 ఏళ్ల పిల్లని కాదు. 34 00:01:24,251 --> 00:01:26,712 ఫోటోలు తీసినా కూడా అందరిలాగే ఇంకెప్పుడూ వాటిని చూడకుండా… 35 00:01:27,254 --> 00:01:28,964 మీరు ఇవాళ ఖచ్చితంగా రావాల్సిందేనా? 36 00:01:29,047 --> 00:01:30,132 - అవును. - అవును, 37 00:01:30,215 --> 00:01:32,551 అవును, ఆమెను కలవాలంటే ఖచ్చితంగా మేము కూడా ఉంటాం అని నోవాకి హామీ ఇచ్చాము. 38 00:01:32,634 --> 00:01:36,013 మీరు అక్కడే ఉంటే థీమ్ పార్క్ లో నేను మా అమ్మతో మాట్లాడి ఆమెను ఎలా తెలుసుకోగలను? 39 00:01:36,096 --> 00:01:37,931 అలాగే అన్నీ మీ ఇష్టప్రకారమే ఎందుకు జరగాలి? 40 00:01:38,015 --> 00:01:39,516 ఎందుకంటే మేము పెద్దోళ్ళం 41 00:01:39,600 --> 00:01:41,059 - నువ్వు చిన్నదానివి కాబట్టి. - అవును. 42 00:01:41,143 --> 00:01:44,605 అలాగే జేసన్ కాలేజ్ కి వెళ్లబోయే మొదటి రోజుకు ముందు ఇది మాకు కూడా ఒక చిన్న ట్రీట్. 43 00:01:44,688 --> 00:01:46,106 అవును. 44 00:01:46,857 --> 00:01:49,610 నా మాట విను, ఇంకొన్ని నెలల్లో, అంతా సవ్యంగా జరిగితే, అమ్మో, 45 00:01:49,693 --> 00:01:52,404 నువ్వు తప్పకుండా ఆమెతో ఒంటరిగా సమయం గడపొచ్చు. ప్రమాణం చేస్తున్నా. 46 00:01:52,487 --> 00:01:53,530 - నిజంగా? - అవును. 47 00:01:53,614 --> 00:01:55,157 నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పడం లేదని గ్యారెంటీ ఏంటి? 48 00:01:55,240 --> 00:01:57,910 - మళ్ళీ చెప్తున్నా, నేను మంచి ఉద్దేశంతోనే అబద్ధం చెప్పా. - మంచి ఉద్దేశంతో. 49 00:01:57,993 --> 00:01:59,286 అలాగే నన్ను క్షమించు. 50 00:01:59,369 --> 00:02:02,122 లేదు! మా చిన్నప్పుడు మమ్మల్ని అస్తమాను ఇళ్ళు మార్చేటప్పుడు, 51 00:02:02,206 --> 00:02:06,043 నేను బాధపడకూడదు అని అందరూ, "ఇప్పుడిక ఎలాంటి సమస్య ఉండదు. 52 00:02:06,126 --> 00:02:07,711 ఇదే ఆఖరి ఇల్లు" అని అబద్ధాలు చెప్తూనే వచ్చారు. 53 00:02:08,503 --> 00:02:12,257 నన్ను బాగా బాధపెట్టిన మాటలన్నీ నన్ను బాధపెట్టకూడదు అని ట్రై చేసిన వాళ్ళ నోట నుండే వచ్చాయి. 54 00:02:12,341 --> 00:02:14,927 నన్ను క్షమించు. నిజంగా. 55 00:02:15,010 --> 00:02:16,512 సరే, చూడు, చూడు. 56 00:02:17,137 --> 00:02:22,392 ఇక నుండి, మనం అందరం నిజం ఇంకా నమ్మకంతోనే 57 00:02:23,560 --> 00:02:25,604 - ముందుకు సాగాలి. సరేనా? - సరే. సరే. 58 00:02:25,687 --> 00:02:27,189 ప్రస్తుతం నువ్వు మూడు రోజుల క్రితం 59 00:02:27,272 --> 00:02:28,982 తినేసిన క్యారెట్ కేక్ వెతకడంలో తనకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్నావు. 60 00:02:29,066 --> 00:02:30,734 - నోరు మూసుకో. - ఒకేసారి. 61 00:02:30,817 --> 00:02:32,986 ఆ బాక్స్ ని బయట వీధిలో ఉన్న చెత్త డబ్బాలో విసిరేసావు. 62 00:02:33,904 --> 00:02:35,364 దాని కోసం మనం ఇరవై నిమిషాల నుండి వెతుకుతున్నాం. 63 00:02:37,366 --> 00:02:39,201 "ఐసింగ్ ఏం రంగులో ఉంటుంది?" 64 00:02:42,704 --> 00:02:43,705 కామ్డెన్ లాక్ 65 00:03:01,890 --> 00:03:04,059 సరే, ఇది బాగుంది, కదా? 66 00:03:05,602 --> 00:03:06,937 మనిద్దరం మాత్రమే. 67 00:03:09,314 --> 00:03:10,732 మరొక తొమ్మిది వారాలు. 68 00:03:13,443 --> 00:03:15,279 నాన్న అట్లాంటిక్ మొత్తం బోటు తెడ్డు వేసేవరకు. 69 00:03:16,280 --> 00:03:19,783 అది ఆయన ఖచ్చితంగా చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని కదా, కానీ… 70 00:03:23,579 --> 00:03:26,081 మనం ఆయనకి కాల్ చేద్దామా? బోట్ మీద ఉన్నప్పుడు. 71 00:03:26,164 --> 00:03:27,249 సరే! 72 00:03:27,332 --> 00:03:29,960 సరే. చేస్తున్నాను. 73 00:03:31,420 --> 00:03:32,421 చూస్తున్నావా? 74 00:03:32,504 --> 00:03:33,505 ఓహ్, హలో. 75 00:03:33,589 --> 00:03:35,465 - హలో. - హాయ్, నాన్నా. 76 00:03:35,549 --> 00:03:37,342 - హాయ్. - ఎలా ఉన్నావు? 77 00:03:37,426 --> 00:03:38,927 అక్కడ ప్రశాంతంగా ఉందా? 78 00:03:39,011 --> 00:03:42,014 లేదు, ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే షిప్పింగ్ మార్గం. 79 00:03:42,764 --> 00:03:44,766 నేను… ఓహ్. ఇక్కడ ఒక టాంకర్ ఉంది. 80 00:03:44,850 --> 00:03:46,268 క్షమించు, నేను విజిల్ ఊదాలి. 81 00:03:47,352 --> 00:03:48,353 ఓహ్, అమ్మో… 82 00:03:52,149 --> 00:03:55,152 నా దగ్గర ఉన్న ఫ్లేర్స్ కూడా అయిపోయాయి, అదొక చిన్న సమస్య అనుకో. 83 00:03:55,235 --> 00:03:57,070 నువ్వు బయలుదేరి రెండు వారాలే అయింది కదా. 84 00:03:57,154 --> 00:03:58,238 అవును, నిజమే, అంటే… 85 00:03:59,323 --> 00:04:02,576 ఒక సీగల్ తో వేగలేక వాడేసా. అదేం పర్లేదు. అది ఇక మళ్ళీ రాకపోవచ్చు. 86 00:04:02,659 --> 00:04:05,287 ఇది ఒకటి అడగాలి అనుకుంటోంది, నీకు అక్కడి నుండి లిబర్టీ విగ్రహం కనిపిస్తుందా? 87 00:04:05,370 --> 00:04:09,333 సరేగాని, మీరు కాల్ చేయడానికి ముందే ఏం అడగాలో నిర్ణయించుకుంటే బాగుంటుంది. 88 00:04:09,416 --> 00:04:12,419 నాకు సాటిలైట్ ఫోన్ లో చాలా తక్కువ బ్యాటరీ ఉంది. 89 00:04:13,587 --> 00:04:16,548 స్టీవి, నీకు పార్టీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలని ఉందా? 90 00:04:16,632 --> 00:04:17,841 కానివ్వు. 91 00:04:18,341 --> 00:04:20,802 సరే, ఐ లవ్ యు, డార్లింగ్. నేను ఇది మీకోసమే చేస్తున్నాను, గుర్తుంది కదా! 92 00:04:23,430 --> 00:04:24,848 నువ్వు ఇది ఇంకెన్ని రోజులు చేయబోతున్నావు? 93 00:04:24,932 --> 00:04:26,683 తెలుసా, ఇక్కడ నేను చాలా ప్లేట్లు తిరగేయాల్సి వస్తోంది. 94 00:04:26,767 --> 00:04:27,851 ఏం ప్లేట్లు, బంగారం? 95 00:04:27,935 --> 00:04:29,019 స్టీవి. 96 00:04:31,313 --> 00:04:33,857 క్షమించు, నీ కాల్ కట్ అయినట్టు ఉంది. నేను "స్టీవి" పేరు మాత్రమే విన్నా. 97 00:04:35,025 --> 00:04:36,652 నువ్వు నీ ఫ్రెండ్స్ ని సాయం అడగొచ్చు కదా? 98 00:04:36,735 --> 00:04:38,153 నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. 99 00:04:38,779 --> 00:04:41,198 నా మొహం మరీ సమరూపంగా ఉంటుందని మిగతా అమ్మలు ఎవరికీ నేను నచ్చడం లేదు. 100 00:04:41,281 --> 00:04:44,952 అంటే, మనం ఇందంతా ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. నువ్వు కాస్త త్వరగా నీ పని ముగించగలవా? 101 00:04:45,035 --> 00:04:46,161 నేను నాకు చేతనైనంత వేగంగా తెడ్డు వేస్తున్నా. 102 00:04:46,245 --> 00:04:50,165 అలాగే… నువ్వు ఇదంతా నీకోసమే చేస్తున్నా అని స్టీవితో అనొద్దు. 103 00:04:50,249 --> 00:04:52,835 ఎందుకంటే నువ్వు గనుక చనిపోతే అది ఎప్పటికీ ఆ బాధతో బ్రతకాల్సి ఉంటుంది. 104 00:04:52,918 --> 00:04:54,586 సరే, అర్థమైంది. నేను… 105 00:04:54,670 --> 00:04:57,464 ఓహ్, అది తిరిగి వచ్చింది. సీగల్ తిరిగొచ్చింది. 106 00:04:57,548 --> 00:04:58,549 పో! 107 00:04:58,632 --> 00:05:01,677 - స్కాట్. స్కాట్, లైన్ కట్ అవుతోంది. నేను… - ఇది నీ ప్రాపర్టీ కాదు! 108 00:05:02,177 --> 00:05:03,762 - నీకు ఆకాశం అంతా ఉంది! - ఏంటి… 109 00:05:04,429 --> 00:05:05,639 వెళ్ళిపో! 110 00:05:06,223 --> 00:05:07,474 నువ్వు బోటు వదిలి వెళ్ళాలి! 111 00:05:13,230 --> 00:05:16,233 విక్ రాస్, హ్యాండీమ్యాన్. మొదటి రోజే లేట్ గా వచ్చినందుకు క్షమించండి. 112 00:05:16,316 --> 00:05:17,317 మీరు అయిదు నిమిషాలు ముందే వచ్చారు. 113 00:05:17,401 --> 00:05:18,402 ట్యాప్ లీక్ అవుతోంది, కదా? 114 00:05:19,027 --> 00:05:20,696 మీరు కారు ఆపకుండా వచ్చారు. 115 00:05:33,584 --> 00:05:36,587 అంతా పూర్తి అయింది. లేబర్ కి ఛార్జ్ ఏం లేదు. వాషర్ కి 25 పెన్స్. 116 00:05:36,670 --> 00:05:39,131 బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు. మీ రోజును ఎంజాయ్ చేయండి. 117 00:05:40,257 --> 00:05:41,466 థాంక్స్! 118 00:05:42,968 --> 00:05:45,262 నిక్, నిక్, నేను ఒక మార్గం కనిపెట్టా అనుకుంటున్నా, ఖచ్చితంగా కాకపోవచ్చు… 119 00:05:45,345 --> 00:05:46,346 కేస్మెంట్ రోడ్ 120 00:05:46,430 --> 00:05:48,140 …మనం ఫారోస్ ఫ్యూరీ మీద మరొకసారి వెళ్లొచ్చు అనుకుంటున్నా. 121 00:05:48,223 --> 00:05:50,100 అద్భుతం. మన జీవితాల్లో ప్రస్తుతం ఉన్న భయం సరిపోవడం లేదా? 122 00:05:50,184 --> 00:05:51,768 నీకు అది చాలా నచ్చుతుంది, నన్ను నమ్ము. 123 00:05:53,061 --> 00:05:54,855 నువ్వు బానే ఉన్నావా? అవునా? 124 00:05:56,732 --> 00:05:59,234 వీడు క్యాట్ మీద ఎలాంటి ఆసక్తి చూపించకపోవడం వింతగా అనిపించడం లేదు? 125 00:05:59,318 --> 00:06:01,737 వాడి గురించి భయపడాల్సిన పనిలేదులే. వాడికి తోచిన మార్గంలో వాడు వ్యవహరిస్తున్నాడు. 126 00:06:02,779 --> 00:06:05,407 నాలో ఒక చిన్న భాగం వాడు ఎప్పటికీ ఇలాగే వింతగా 127 00:06:05,490 --> 00:06:08,702 ఉండిపోయి ఎవరితోనూ కలవకుండా మిగిలిపోతే ఎప్పటికీ మనతోనే ఉండొచ్చని అనుకుంటోంది. 128 00:06:10,120 --> 00:06:11,371 - ఏదో కొంచెం మాత్రమే. - అవునా? 129 00:06:11,455 --> 00:06:14,583 చాలా చిన్న భాగం. అసలు నిజానికి ఇదంతా ప్రస్తావించాల్సిన విషయమే లేదు. 130 00:06:14,666 --> 00:06:15,667 సరే. 131 00:06:16,668 --> 00:06:19,421 - తను రావడం లేట్ అయింది. - ఆమె పది నిమిషాలే లేట్ అయింది, బుజ్జి. 132 00:06:19,505 --> 00:06:21,507 - ఊరుకో, ఆమెకు ఒక అవకాశం ఇవ్వు, ఎహ్? - నేను ఆమెను నమ్మను. 133 00:06:21,590 --> 00:06:25,260 నా మాట విను, ఈ విషయం ప్రిన్సెస్ తనంతట తనే తెలుసుకోవాలి. 134 00:06:25,344 --> 00:06:27,221 తనను మనం కాపాడుకోవాలి. 135 00:06:27,304 --> 00:06:29,681 జేస్, తన కంటి మేకప్ ని చూసి అదేదో పెద్ద ధైర్యవంతురాలు అనుకోవద్దు. 136 00:06:30,349 --> 00:06:32,100 చూడు, ఇవాళ నీకు ఎప్పుడు ఆందోళనగా, 137 00:06:32,184 --> 00:06:33,477 - అనిపించినా నువ్వు ఒక పని చేయాలి. - సరే. 138 00:06:33,560 --> 00:06:35,687 బాగా దీర్ఘంగా శ్వాస తీసుకుని, సముదాయించుకుని, 139 00:06:35,771 --> 00:06:39,608 తర్వాత బాగా నీళ్లు త్రాగు, సరేనా? 140 00:06:40,275 --> 00:06:42,027 అంతా చక్కగా సాగుతుంది. నేను మాట ఇస్తున్నా. 141 00:06:42,110 --> 00:06:43,487 - హాయ్. - ఓయ్, లెగు, ఆమె వచ్చింది. పద. 142 00:06:43,570 --> 00:06:44,863 హాయ్, ప్రిన్సెస్. 143 00:06:44,947 --> 00:06:46,406 పది నిమిషాలు లేట్ అయినా కాఫీ తెచ్చుకోవడం మర్చిపోలేదు. 144 00:06:46,490 --> 00:06:48,909 - ఓహ్, దేవుడా. నీ జుట్టు. - హాయ్. అవును. 145 00:06:48,992 --> 00:06:50,285 - హాయ్. లేట్ గా వచ్చినందుకు సారీ. - ఓహ్, లేదు. 146 00:06:50,369 --> 00:06:51,745 అదేం పర్లేదు. అదంతా ఆలోచించొద్దు. 147 00:06:51,828 --> 00:06:54,164 నేను కొన్ని వస్తువులు తీసుకోవాలి అనుకున్నా… ప్రయాణం చేసేటప్పుడు తినడానికి. 148 00:06:55,040 --> 00:06:57,835 మీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానిస్తున్నందుకు కృతజ్ఞతగా. 149 00:06:58,836 --> 00:07:00,379 మళ్ళీ అమ్మను కావడం చాలా సంతోషంగా ఉంది. 150 00:07:00,462 --> 00:07:02,339 - చాలా మంచి మాట అన్నావు. - భలే. 151 00:07:09,596 --> 00:07:11,598 సరే, వెళదామా? సరే, ఇక పదండి. 152 00:07:13,809 --> 00:07:15,936 పదా, తల్లి. ట్రైన్ అయిదు నిమిషాలలో వెళ్ళిపోతుంది. 153 00:07:33,287 --> 00:07:34,621 - హలో. - హాయ్. 154 00:07:35,330 --> 00:07:36,373 ఇది మా టికెట్. 155 00:07:37,499 --> 00:07:40,043 - ఇది కుటుంబ టికెట్. - అవును. 156 00:07:40,836 --> 00:07:42,004 పెద్దవారు ముగ్గురు ఉన్నారు. 157 00:07:42,087 --> 00:07:43,589 - అవును. క్షమించాలి. - సరే. 158 00:07:43,672 --> 00:07:45,424 నేను… దేవుడా, చాలా గట్టిగా వచ్చింది. 159 00:07:45,507 --> 00:07:49,595 క్షమించాలి, విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలకు మేము లీగల్ తల్లితండ్రులం. 160 00:07:49,678 --> 00:07:50,679 - హలో. - హలో. 161 00:07:50,762 --> 00:07:52,681 అలాగే ఇక్కడ ఉన్న ఈ మహిళను చూడండి. 162 00:07:52,764 --> 00:07:55,100 అవును, క్యాట్, ఈమె ఈ మధ్యనే మాతో కలిసింది, 163 00:07:55,184 --> 00:07:57,019 ఈవిడ వీళ్లకు జన్మనిచ్చిన తల్లి. 164 00:07:57,102 --> 00:08:00,564 ఇప్పుడు మేమంతా కలిసి ఉన్నాం, సరేనా? మాది ఒక కుటుంబం, అవునా? అవును, అంతే. 165 00:08:00,647 --> 00:08:03,483 ఇప్పుడు దాన్ని ఏమనాలో మాకు తెలుసా? లేదు. లేదు, మాకు తెలీదు. 166 00:08:03,567 --> 00:08:05,652 త్వరలో ఈ ఏర్పాటు వల్ల సమస్యలు తలెత్తుతాయా? 167 00:08:05,736 --> 00:08:06,737 దాదాపుగా ఖచ్చితంగా. 168 00:08:06,820 --> 00:08:08,238 కానీ మేము కలిసి ఉన్నాం కదా, ఏమంటారు? మేము… 169 00:08:08,322 --> 00:08:10,741 - సరే, చాలా థాంక్స్. - లోనికి వెళ్లిపోండి. 170 00:08:10,824 --> 00:08:13,410 - ఓయ్, ఓయ్! - థాంక్స్. మీ రోజును ఎంజాయ్ చేయండి. బై. 171 00:08:16,580 --> 00:08:20,834 నీకు ఎక్కడి నుండి మొదలెట్టాలని ఉంది? మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి నీకు అక్కడికి వెళ్లాలని ఉంటే… 172 00:08:20,918 --> 00:08:23,587 సరే, మనం ప్రిన్సెస్ ని క్యాట్ తో ఒంటరిగా వదిలేయకూడదు. 173 00:08:23,670 --> 00:08:25,672 నువ్వు కూడా వాళ్లతో రోలర్ కోస్టర్ రైడ్స్ కి వెళ్తావా? 174 00:08:25,756 --> 00:08:26,924 వెళ్లొచ్చు, కానీ నాకు కళ్ళు తిరుగుతాయని నీకు తెలుసు, 175 00:08:27,007 --> 00:08:29,885 అలాగే నేను నా దగ్గర ఉన్న మోషన్ సిక్నెస్ టాబ్లెట్స్ అన్నీ ట్రైన్ లోనే వాడేసా. 176 00:08:29,968 --> 00:08:31,887 సరే, అలాగే. సరే, అంటే, నాకూ వెళ్లాలనే ఉంది, 177 00:08:31,970 --> 00:08:34,222 కానీ టైలర్ నాతో ఏదో విషయం చెప్పాలనుకుంటున్నాడు. 178 00:08:34,306 --> 00:08:36,183 సరే, నువ్వు నీకు వీలైనంత త్వరగా నాకు సాయం చేయడానికి వస్తావు కదా? 179 00:08:36,265 --> 00:08:39,394 సరే. నువ్వు కూడా మాతోనే రావొచ్చు కదా? వాళ్ళు బానే ఉంటారు. 180 00:08:39,477 --> 00:08:42,523 జేస్, నీకు తన గురించి తెలీదు. ఆమె వల్ల చెడు ప్రభావం పడుతుంది. 181 00:08:42,606 --> 00:08:46,193 మనం వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే, వాళ్ళు బ్యాంకులు దొంగతనాలు చేస్తూ, 182 00:08:46,276 --> 00:08:49,238 స్కూబి స్నాక్స్ తింటూ ఇష్టమొచ్చినట్టు తిరుగుతారు. 183 00:08:49,321 --> 00:08:52,115 - అది ఒక పాటలోని లైన్, నిక్. - దానర్థం అలా జరగదని కాదు, జేస్. 184 00:08:52,199 --> 00:08:54,701 - హాయ్. - సరే. నేను ఇంకా అమ్మా రేజ్ ఎక్కబోతున్నాం. 185 00:08:55,536 --> 00:08:57,621 ఓహ్, సరే. అలాగే, అది నాకు కూడా ఇష్టమే. 186 00:08:57,704 --> 00:08:58,789 - అవునా? - అవును. 187 00:08:59,289 --> 00:09:03,126 - నీకు స్నానం చేస్తేనే కళ్ళు తిరుగుతాయి… - లేదు. లేదు. లేదు, అదేం పర్లేదు. 188 00:09:03,210 --> 00:09:05,546 నేను దీనికి రెడీ అవ్వడానికే అన్నిసార్లు స్నానాలు చేశా. 189 00:09:06,463 --> 00:09:08,048 సరే, అలాగే. రేజ్ ఎక్కుదాం పదా. 190 00:09:12,177 --> 00:09:13,345 - ఖచ్చితంగా వెళ్తావా? - అవును. 191 00:09:14,847 --> 00:09:17,099 అంటే, మరీ ఎంత ఊపుతుందిలే? 192 00:09:31,530 --> 00:09:34,616 - హలో. - ఓహ్, హాయ్. ఇదుగోండి. 193 00:09:34,700 --> 00:09:36,994 తిను ఈ మధ్య కొంచెం తల గోక్కుంటోంది, కాబట్టి తనకు పేలు ఉండొచ్చు. 194 00:09:37,661 --> 00:09:39,496 ఓహ్, సరే, లేదు, లోనికి వెళ్ళింది. 195 00:09:39,580 --> 00:09:41,874 ఎలా ఉన్నారు? మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? 196 00:09:43,834 --> 00:09:46,879 స్కాట్ లేకుండా ఎలా ఉంటున్నారు? మేమంతా మీ గురించి ఆలోచిస్తున్నాం. 197 00:09:47,546 --> 00:09:50,883 సరే. సరే, లేదు, లేదు, మేము బానే ఉన్నాం. థాంక్స్. 198 00:09:51,925 --> 00:09:53,927 సరే, అలాగే, అయితే నేను నిన్ను రెండింటికి కలుస్తా. 199 00:09:54,011 --> 00:09:56,013 అతను చేస్తున్న పని నిజంగా చాలా అద్భుతమైంది. 200 00:09:56,096 --> 00:09:58,390 వాతావరణ మార్పు పై అందరికీ అవగాహన తెప్పించడం చాలా ముఖ్యమైన విషయం. 201 00:09:58,473 --> 00:10:01,476 అవును, కానీ ఇంకా దాని గురించి వినని వారు ఎవరైనా ఉంటారా అని అనిపిస్తోంది, కానీ, ఉండొచ్చులే. 202 00:10:02,936 --> 00:10:04,438 లోనికి వస్తావా? 203 00:10:04,521 --> 00:10:05,939 నన్ను ఉండమంటున్నావా? 204 00:10:06,648 --> 00:10:08,650 అవును. నీకు ఇష్టమైతే. 205 00:10:10,694 --> 00:10:12,738 అంటే, తల్లిదండ్రులు ఉండొచ్చని నాకు తెలీదు. 206 00:10:13,488 --> 00:10:16,491 అవును, అవును, ఉండొచ్చు. లోనికి రా. 207 00:10:24,666 --> 00:10:26,418 ఓహ్, దేవుడా. 208 00:10:26,502 --> 00:10:27,878 ఇది భలే ఉంది. 209 00:10:28,462 --> 00:10:29,463 అవును! 210 00:10:30,297 --> 00:10:31,673 నువ్వు లేకపోయినా మేము బానే ఉంటామని నీకు తెలుసు కదా. 211 00:10:31,757 --> 00:10:33,467 నువ్వు కావాలంటే వెళ్లి టీ ఏమైనా త్రాగు. 212 00:10:33,550 --> 00:10:36,053 - ఏంటి? వెళ్లి ఇదంతా మిస్ అవ్వాలా? - ఊరుకో. 213 00:10:36,845 --> 00:10:40,516 సరే, అలాగే, క్యూ ఇంకా చిన్నగానే ఉంది, కాబట్టి మళ్ళీ ఒకసారి వెళదాం. 214 00:10:40,599 --> 00:10:41,767 - సరే. - సరేనా? 215 00:10:42,267 --> 00:10:44,436 సరే, లేదు, అలా కూడా చేయొచ్చు. 216 00:10:44,520 --> 00:10:49,691 లేదా ఇక్కడ ఒక పెట్టింగ్ జూ ఉంది, లేదా సమాచార సెంటర్ కి వెళ్లి వాళ్లతో మాట్లాడొచ్చు కదా? 217 00:10:50,734 --> 00:10:52,819 ఇక్కడ ఉన్నావా, బాబు. కాసేపు ఇక్కడ కూర్చో. 218 00:10:54,363 --> 00:10:55,489 సరే. 219 00:10:56,865 --> 00:10:58,867 ఏంటి సమస్య? మీ అమ్మ గురించా? 220 00:10:58,951 --> 00:11:01,537 ఎందుకంటే నీకు ఏమైనా అనిపిస్తే నువ్వు మాతో ఎప్పుడైనా మాట్లాడొచ్చని తెలుసు కదా. 221 00:11:01,620 --> 00:11:06,333 అదేం లేదు. నాకు ఫీలింగ్ ఉండాలని తెలుసు. కానీ నాకు తను పెద్దగా గుర్తులేదు. అలా అనిపించడం పర్లేదా? 222 00:11:06,416 --> 00:11:08,418 అందులో ఎలాంటి తప్పు లేదు, బాబు. అవును, ఏం పర్లేదు. 223 00:11:09,253 --> 00:11:11,088 - సరే, ఏంటి సంగతి? - ఒక అమ్మాయి గురించి. 224 00:11:11,171 --> 00:11:12,172 సరే, అలాగే. 225 00:11:12,256 --> 00:11:15,092 ఆమె ఫ్రెండ్ నాతో నేనంటే తనకి ఇష్టమని చెప్పింది, ఆ తర్వాత ఆమె నాకు మెసేజ్ చేసింది. 226 00:11:15,175 --> 00:11:16,885 కానీ ఇప్పుడు నాకు తిరిగి ఆమెకు ఏమని మెసేజ్ చేయాలో తెలీడం లేదు. 227 00:11:16,969 --> 00:11:18,303 సరే, నీకు తను అంటే ఇష్టమా? 228 00:11:18,387 --> 00:11:23,559 అవును, కానీ విషయం ఏంటంటే, నేను అబద్ధం చెప్పా. నాకు ఇంతకు ముందెప్పుడూ గర్ల్ ఫ్రెండ్ లేదు. 229 00:11:23,642 --> 00:11:25,686 అంటే ఏంటి నీ ఉద్దేశం? అనస్టాసియా సంగతి ఏంటి? 230 00:11:25,769 --> 00:11:28,188 - బియాన్సేకి బ్యాంకింగ్ డాన్సర్. - ఆమె నా కల్పన. 231 00:11:28,272 --> 00:11:29,273 అవునా? 232 00:11:30,440 --> 00:11:32,192 అమ్మో, ఇది పెద్ద సర్ప్రైజే. 233 00:11:33,485 --> 00:11:35,487 సరే, చూడు, ఇక్కడ ఆమెకు నువ్వంటే ఇష్టం, బాబు. 234 00:11:35,571 --> 00:11:36,822 - అవును. - అవును. 235 00:11:36,905 --> 00:11:40,325 మీ తరం వాళ్ళు చేసిన పనుల వల్ల ఇప్పుడు అమ్మాయిలకు మంచి అబ్బాయిలు నచ్చుతున్నారు. 236 00:11:40,951 --> 00:11:44,955 సరే. చాలా సంతోషం. మంచిది. 237 00:11:50,460 --> 00:11:51,879 నేను కొంచెం టీ బ్రేక్ తీసుకుంటే పర్లేదా? 238 00:11:51,962 --> 00:11:54,047 సరే, అలాగే. మీరు చాలా సేపటి నుండి పని చేస్తున్నారు. 239 00:12:02,055 --> 00:12:04,933 థాంక్స్. జాప్యానికి క్షమించు. 240 00:12:11,148 --> 00:12:13,442 ఓహ్, అది భలే అందమైన టాటూ. 241 00:12:14,193 --> 00:12:15,736 - తల వెనక్కి పెట్టండి, ప్లీజ్. - ఓహ్, థాంక్స్. 242 00:12:15,819 --> 00:12:17,821 క్షమించు. అది ఎవరి పని? 243 00:12:17,905 --> 00:12:20,949 నిజానికి నాకు గుర్తులేదు. ఓహ్, ఉండు. 244 00:12:21,033 --> 00:12:22,534 అతను అప్పుడే అతని పేరు కూడా పొడిచాడు. 245 00:12:22,618 --> 00:12:24,995 - అవునా? - లేదు, అదంతా చెప్పలేను. 246 00:12:25,078 --> 00:12:26,079 నీకు ఇష్టమైతే మనం అతన్ని కలవొచ్చు, సరేనా? 247 00:12:26,163 --> 00:12:27,623 - ఓహ్, దేవుడా. సరే. - ఓహ్, అమ్మో. 248 00:12:27,706 --> 00:12:30,792 హేయ్, అది… మనం… 249 00:12:35,047 --> 00:12:36,381 అందరూ ఎలా ఉన్నారు? సరేనా? 250 00:12:36,465 --> 00:12:37,883 బాగున్నారా? బాగున్నారా? 251 00:12:37,966 --> 00:12:39,134 - అంతా బానే ఉంది. - కూర్చోండి. 252 00:12:39,218 --> 00:12:41,386 - ప్లీజ్. - సరే, సారీ. 253 00:12:50,521 --> 00:12:53,524 ఓహ్. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 254 00:13:00,030 --> 00:13:01,031 అమ్మాయిలకు ఏం నచ్చుతుంది? 255 00:13:02,824 --> 00:13:05,202 నేను కొన్ని పాడ్ క్యాస్ట్ లు విని ఒక లిస్ట్ రాసుకున్నా. 256 00:13:05,285 --> 00:13:08,413 అవునా? సరే, ఏం రాసుకున్నావు? 257 00:13:10,040 --> 00:13:11,041 వావ్. 258 00:13:11,124 --> 00:13:12,209 "చిన్న కుక్కలు." 259 00:13:12,960 --> 00:13:14,878 - "డ్రై షాంపూ." - సరే, అవును, నిజమే. 260 00:13:14,962 --> 00:13:16,505 "గ్లూటెన్ లేని మెన్యు కోసం అడగడం." 261 00:13:16,588 --> 00:13:18,841 సరే, బాబు, నేను నిన్ను కొంచెం ఆపాలి ఎందుకంటే అమ్మాయిలకు అస్సలు నచ్చని 262 00:13:18,924 --> 00:13:22,052 విషయం ఏమైనా ఉందంటే అది నువ్వు వాళ్ళ మీద ఏదో రిపోర్ట్ రాస్తున్నట్టు వాళ్ళని చదవడమే, సరేనా? 263 00:13:22,135 --> 00:13:24,555 నువ్వు అది రాసుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? 264 00:13:25,138 --> 00:13:26,723 ఆమె ఏమని మెసేజ్ చేసింది? ఒకసారి చూద్దాం. 265 00:13:30,352 --> 00:13:31,353 "బార్బరా?" 266 00:13:32,437 --> 00:13:33,438 ఆమె పేరు బార్బరానా? 267 00:13:34,022 --> 00:13:35,440 - అవును. - తన వయసు ఎంత, బాబు? 268 00:13:35,524 --> 00:13:36,775 నా వయసే. 269 00:13:36,859 --> 00:13:39,570 సరే. అలాగే, సరే, నమ్మలేకపోతున్నా. 270 00:13:40,445 --> 00:13:41,989 తను ఏమని రాసిందో చూద్దాం. 271 00:13:42,072 --> 00:13:43,490 బార్బరా - ఐమెసేజ్ గురువారం - హేయ్ 272 00:13:43,574 --> 00:13:45,784 "హేయ్." అమ్మాయిలకు ఈ మైండ్ గేమ్స్ ఆడాల్సిన అవసరం ఏముంది, ఆహ్? 273 00:13:45,868 --> 00:13:48,161 నేను ఏమని చెప్పను? నీలా జోకులు ఎలా వేయాలో నాకు నేర్పించు. 274 00:13:48,245 --> 00:13:50,914 సిల్లీగా మాట్లాడకు, టైలర్. అది ఎవరూ నేర్పలేరు. 275 00:13:50,998 --> 00:13:53,041 నువ్వు ప్రపంచంలోనే అత్యంత సరదా మనుషులలో ఒకడివి. 276 00:13:53,125 --> 00:13:56,253 అంటే, అవును, నాకు జీవితంలో సరదాగా, చెలాకీగా సాగిపోవడం అంటే ఇష్టమే అనుకో, 277 00:13:56,336 --> 00:13:58,338 కానీ నేను ఎక్కువగా ఫన్నీ స్వరాలే చేస్తాను, 278 00:13:58,422 --> 00:14:00,632 మరి టెక్స్ట్ మెసేజ్లలో దాన్ని చూపించలేం కదా. 279 00:14:02,050 --> 00:14:03,135 నా మాట విను, బాబు. 280 00:14:03,760 --> 00:14:05,637 మగాళ్లు కామన్ గా ఒక తప్పు చేస్తుంటారు, సరేనా? 281 00:14:05,721 --> 00:14:07,139 వాళ్ళని ఎవరైనా ఇష్టపడ్డారని తెలిసిన వెంటనే 282 00:14:07,222 --> 00:14:09,391 వాళ్ళు ఇంకొకలా ఉండటానికి ట్రై చేస్తారు. 283 00:14:10,517 --> 00:14:12,936 నువ్వు నీలాగే ఉండు, బాబు. సరేనా? 284 00:14:13,687 --> 00:14:18,400 నీకు ఎప్పుడు సందేహంగా అనిపించినా, నిన్ను నువ్వు ఒక్క ప్రశ్న అడుగుకో, "టైలర్ అయితే ఏం చేస్తాడు?" 285 00:14:20,444 --> 00:14:21,445 సరే. 286 00:14:25,199 --> 00:14:27,201 చూస్తుంటే నిక్కి చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. 287 00:14:29,077 --> 00:14:32,664 ఓహ్, అతను ఒక్కడే ఎక్కడో ఒంటరిగా ఉన్నాడని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉండి ఉంటుంది. 288 00:14:32,748 --> 00:14:34,917 ఓహ్, మీరు అతన్ని కలవలేదు కదా. అతను ఇక్కడ ఉన్నప్పుడే ఇంకా బాధగా ఉండేది. 289 00:14:36,502 --> 00:14:38,879 మనం ఇంతకు ముందే ఎందుకు కలవలేదు? 290 00:14:38,962 --> 00:14:41,215 నేను సాధారణంగా నా కార్ లో ఉండి పుస్తకం చదువుతూ కూర్చుంటా కాబట్టి అది మామూలే. 291 00:14:54,353 --> 00:14:56,021 ఓహ్, ఇది భలే ఉంది. 292 00:14:56,104 --> 00:14:57,523 ఓహ్, దేవుడా. 293 00:14:58,524 --> 00:14:59,858 నేను టాయిలెట్ కి వెళ్ళాలి. 294 00:15:00,943 --> 00:15:04,196 అక్కడ ఒకటి ఉంది. మేము ఇక్కడ ఉంటాంలే. 295 00:15:06,323 --> 00:15:08,325 లేదు, మన టీమ్ ని విడదీయడం నాకు ఇష్టం లేదు. 296 00:15:09,409 --> 00:15:11,286 - అదే ఆగిపోతుంది. - సరే. 297 00:15:11,370 --> 00:15:12,538 అదే ఆగిపోతుంది. 298 00:15:16,041 --> 00:15:18,669 సరే, నీ ప్లాన్స్ ఏమై ఉంటాయని నువ్వు ఏమైనా ఆలోచించావా? 299 00:15:20,045 --> 00:15:23,340 సూర్యుడి నుండి వెలుగు భూమికి చేరుకోవడానికి ఏడు నిమిషాలు పడుతుంది అని తెలుసా? 300 00:15:25,175 --> 00:15:27,594 సూర్యుడు గనుక పేలిపోతే, మనకు ఏడు నిమిషాల వరకు తెలీదు. 301 00:15:28,095 --> 00:15:32,140 మనకు బ్రతకడానికి నిమిషాలే ఉండి ఉండొచ్చు, నిక్కి. పైగా అది ఎవరికీ తెలీదు. 302 00:15:33,809 --> 00:15:35,811 కాబట్టి నేను ఏదైనా అప్పటికప్పుడు ఆలోచించి బ్రతుకుతా. 303 00:15:38,063 --> 00:15:41,692 సరే, అది, అంటే… తనకు సెటిల్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది, 304 00:15:41,775 --> 00:15:44,027 కాబట్టి మనం కొంచెం ముందుగానే ఏమైనా అనుకుంటే… 305 00:15:44,111 --> 00:15:46,738 అంటే, తను నిజంగా సెటిల్ అయి ఉంటే నాకోసం వెతికి ఉండేది కాదు. 306 00:15:47,406 --> 00:15:50,033 టైలర్ తో కూడా మళ్ళీ కనెక్ట్ కావడానికి నేను వాడు ఇంకొంచెం ఎదిగేవరకు ఆగాలని తెలుసు, 307 00:15:50,117 --> 00:15:51,618 కానీ ప్రిన్సెస్ సొంత నిర్ణయం తీసుకునే వయసుకు వచ్చింది. 308 00:15:51,702 --> 00:15:53,912 - దానికి నేను తన జీవితంలో ఉండాలని ఉంది, కాబట్టి… - సరే. 309 00:15:55,622 --> 00:15:57,040 ఇవాళ నువ్వు చాలా దాహం మీద ఉన్నావు. 310 00:15:57,124 --> 00:15:58,667 హేయ్, రెకనింగ్ రైడ్ కి వెళదాం. 311 00:15:58,750 --> 00:15:59,877 సరే. 312 00:15:59,960 --> 00:16:01,378 నీకు ఈ రైడ్ కి రావాలని లేదా? 313 00:16:01,461 --> 00:16:04,464 లేదు! లేదు! నాకు ఇది చాలా నచ్చింది. 314 00:16:07,050 --> 00:16:09,595 మన కడుపు ఉన్నట్టుండి పడినట్టు ఉండే ఫీలింగ్ నాకు చాలా ఇష్టం. 315 00:16:09,678 --> 00:16:10,846 సరే, పదా. 316 00:16:13,724 --> 00:16:14,892 అవును, అది భలే ఉంది. 317 00:16:16,560 --> 00:16:18,270 ఇంకెవరైనా టాయిలెట్ కి వెళ్లాలా? 318 00:16:18,896 --> 00:16:20,647 లేదా? సరే. 319 00:16:27,321 --> 00:16:31,033 ఓహ్, క్షమించాలి, మీరు క్రింద ఉన్న టాయిలెట్ ని వాడితే బాగుంటుంది. 320 00:16:31,116 --> 00:16:33,327 మీ సింక్ క్రింద ఉన్న పైపుల సౌండ్ తేడాగా వచ్చింది, 321 00:16:33,410 --> 00:16:35,829 కాబట్టి మీ షవర్ లో నీటి ఒత్తిడి తగ్గుతుండవచ్చు అనిపించింది. 322 00:16:35,913 --> 00:16:37,873 అదనపు ఛార్జ్ ఏం లేదు, మీకు గ్యారెంటీ ఇస్తున్నా. 323 00:16:37,956 --> 00:16:40,709 రాబోయే 25 ఏళ్లలో ఏమాత్రం ఒత్తిడి తగ్గినా, నేను మళ్ళీ వస్తా. 324 00:16:45,464 --> 00:16:46,882 లేదా నేను బ్రతికి ఉన్నంత కాలం. 325 00:16:48,550 --> 00:16:52,054 ఎలా ఉన్నావు? 326 00:16:52,679 --> 00:16:53,889 నీ వ్యవహారం ఎలా సాగుతోంది? 327 00:17:01,813 --> 00:17:02,814 ఏంటి 328 00:17:02,898 --> 00:17:04,273 నాకు ఏమని వ్రాయాలో తెలీడం లేదు. 329 00:17:09,988 --> 00:17:10,989 - సరే. - అవునా? 330 00:17:11,073 --> 00:17:12,491 - నేను రాసాను. - ఏమన్నావు? "హేయ్." 331 00:17:12,574 --> 00:17:13,825 హేయ్ 332 00:17:14,451 --> 00:17:16,453 అది అద్భుతం, బాబు. పంపించు. కానివ్వు, నొక్కు. 333 00:17:16,537 --> 00:17:18,539 - నాకు భయంగా ఉంది. - అది నాకు తెలుసు, బాబు. ధైర్యంగా ఉండు. 334 00:17:18,622 --> 00:17:20,249 - కానివ్వు, శ్వాస పీల్చు. - సరే. 335 00:17:20,332 --> 00:17:21,750 - కానివ్వు. - పంపించా. 336 00:17:22,416 --> 00:17:23,585 - ఓహ్, దేవుడా. - సరే, అంతే. 337 00:17:23,669 --> 00:17:25,587 - నిజంగా చాలా భయం వేసింది. - సరే, తల కాళ్ళ మధ్య పెట్టుకో. 338 00:17:25,671 --> 00:17:27,673 - ఓహ్, దేవుడా. - అంతే. శ్వాస ఆడించు, మంచి కుర్రాడా. 339 00:17:28,257 --> 00:17:31,510 - చాలా భయంగా ఉంటుంది, కదా? - అవును, మిత్రమా. ఎప్పుడైనా ఇంతే. 340 00:17:32,135 --> 00:17:35,430 అంతే. సరే, ఇక రైడ్స్ కి వెళదాం. 341 00:17:37,641 --> 00:17:38,725 - ఓహ్, దేవుడా. - ఏంటి? 342 00:17:38,809 --> 00:17:41,353 - ఆమె రిప్లై ఇచ్చింది. - ఆమె రిప్లై ఇచ్చిందా? 343 00:17:41,436 --> 00:17:42,437 ఆమె రిప్లై ఇచ్చింది! 344 00:17:42,521 --> 00:17:45,691 - అద్భుతం, బాబు. అంతే! సూపర్. - అవును! 345 00:17:45,774 --> 00:17:47,901 - ఓహ్, దేవుడా. - ఇక పని పూర్తయినట్టే. కానివ్వు. 346 00:17:48,735 --> 00:17:50,153 కానీ నాకు ఇంకొక మెసేజ్ పంపాలని ఉంది. 347 00:17:50,237 --> 00:17:51,238 అవునా? 348 00:17:52,990 --> 00:17:54,575 అయితే కానివ్వు, రోమియో. ఏమంటావు? 349 00:17:55,617 --> 00:17:59,580 అవును, అవును, స్టీవి ఆయన స్వరం వినడం కోసం మేము రోజూ ఫోన్ చేస్తుంటాం. 350 00:17:59,663 --> 00:18:00,664 ఓహ్, అద్భుతం. 351 00:18:00,747 --> 00:18:03,041 నీ మొహం భలే సమరూపంగా ఉంది. 352 00:18:03,125 --> 00:18:04,751 ఓహ్, సరే, థాంక్స్. 353 00:18:04,835 --> 00:18:06,211 ఈమె మన బుక్ గ్రూప్ లో చేరితే బాగుంటుంది. 354 00:18:06,295 --> 00:18:09,298 మేము సాల్వోస్ కి వెళ్లి మేము చదవని ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నట్టు నటిస్తుంటాం, 355 00:18:09,381 --> 00:18:11,466 కానీ నిజానికి మేము ప్లేగ్రౌండ్ లో ఉన్నోళ్లను ఎగతాళి చేస్తూ మాట్లాడుకుంటుంటాం. 356 00:18:11,550 --> 00:18:12,718 ఓహ్, అలాంటివి నాకు చాలా ఇష్టం. 357 00:18:12,801 --> 00:18:15,053 - అలాగే, నిజానికి, నాకు కూడా కొన్ని ఐడియాలు ఉన్నాయి. - నీ నంబర్ ఏంటి? 358 00:18:15,137 --> 00:18:16,555 నేను నిన్ను పేరెంట్స్ గ్రూప్ లో చేర్చుతాను. 359 00:18:16,638 --> 00:18:18,140 ఓహ్, లేదు. నేను అందులో ఇప్పటికే ఉన్నా అనుకుంటా. 360 00:18:18,223 --> 00:18:21,059 కాదు, నా ఉద్దేశం అసలు దానిలో. 361 00:18:23,562 --> 00:18:25,272 అమ్మా, నాకు బోర్ కొడుతోంది. 362 00:18:25,355 --> 00:18:26,565 మనం ఇక వెళదామా? 363 00:18:26,648 --> 00:18:29,943 నాకు ఇంకొక్క పది నిమిషాలు ఇస్తావా? ప్లీజ్? వెళ్ళు. 364 00:18:33,822 --> 00:18:39,536 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా! 365 00:18:43,790 --> 00:18:44,791 చోక్-ఐసెస్. 366 00:18:44,875 --> 00:18:46,376 - థాంక్స్. - థాంక్స్. 367 00:18:46,460 --> 00:18:48,086 నేను కొన్ని నాప్కిన్స్ తెస్తా. 368 00:18:51,173 --> 00:18:52,174 నువ్వు బానే ఉన్నావా? 369 00:18:52,257 --> 00:18:53,258 అవును. 370 00:18:54,718 --> 00:18:56,929 సరే. సరే, సరే, సరే, సరే. 371 00:18:57,763 --> 00:19:00,182 లేదు, లేదు, లేదు, లేదు, అస్సలు లేదు. 372 00:19:00,682 --> 00:19:02,017 సరే, నేను నీ బాటిల్ లో నీళ్లు నింపాను. 373 00:19:02,100 --> 00:19:03,143 థాంక్స్. 374 00:19:03,227 --> 00:19:05,604 నువ్వు అవి రోజుకు నాలుగు మాత్రమే వేసుకోవాలని తెలుసు కదా? 375 00:19:05,687 --> 00:19:07,773 అవును, కానీ ఇది మామూలు రోజు కాదు కదా, జేస్? 376 00:19:07,856 --> 00:19:09,191 నేను వాళ్ళని అలా ఊరికే వదల్లేను. 377 00:19:09,274 --> 00:19:11,276 మనం ఆమెను నమ్మడం తప్ప ఇంకేం చేయలేము అనుకుంటున్నా, నిక్. 378 00:19:11,360 --> 00:19:14,071 నువ్వు ఒకరిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం అంటున్నావు, 379 00:19:14,154 --> 00:19:15,489 మనకు తెలీని వ్యక్తిని, 380 00:19:15,572 --> 00:19:19,493 పైగా తనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అసలు ఆఖరికి ఏమవుతుందో ఎవరికీ తెలీదు. 381 00:19:19,576 --> 00:19:22,955 అంటే, మనం క్రితం సారి ఇలా రిస్క్ చేసినప్పుడు అంతా బానే జరిగింది కదా? అవునా? 382 00:19:25,582 --> 00:19:27,125 క్రిందకి వెళ్లడమే అన్నిటికంటే భయం వేసింది. 383 00:19:27,209 --> 00:19:28,627 తను ట్రై చేస్తోంది, నిక్. 384 00:19:29,336 --> 00:19:33,715 అంటే, తను ట్రై చేయడం మనం ట్రై చేసినట్టు ఉండకపోవచ్చు. అంతే. 385 00:19:38,178 --> 00:19:39,137 తెలుసా, 386 00:19:39,638 --> 00:19:42,474 ఇలాంటప్పుడే నేను నిన్ను ఇలా మంచిగా మార్చి 387 00:19:42,558 --> 00:19:43,809 తప్పు చేసానేమో అనిపిస్తుంది, 388 00:19:43,892 --> 00:19:45,894 ఎందుకంటే ఇప్పుడు అందుకు నేనే అనుభవిస్తున్నా. 389 00:19:47,771 --> 00:19:48,772 భలే సరదాగా ఉంది. 390 00:19:49,982 --> 00:19:52,401 ఓహ్, సరే, పదండి కుర్రాళ్ళూ, మన ట్రైన్ త్వరలో వెళ్ళిపోతుంది. 391 00:19:52,484 --> 00:19:53,819 పదండి, ప్యాక్ చేసుకుందాం. 392 00:19:58,323 --> 00:19:59,825 పదండి, ఇక వెళదాం. 393 00:20:16,675 --> 00:20:18,010 బానే ఉన్నావా? 394 00:20:18,093 --> 00:20:19,094 అవును. 395 00:20:22,014 --> 00:20:24,766 చూడు, త్వరలోనే నువ్వు ఆమెతో ఏకాంతంగా గడపడానికి ఏర్పాటు చేస్తా, 396 00:20:24,850 --> 00:20:27,769 కానీ మరి, ప్రిన్సెస్, అందుకు సరైన టైమ్ రావాలి. 397 00:20:28,353 --> 00:20:30,480 మేము నువ్వు రెడీగా ఉన్నావు అనుకున్నపుడు. సరేనా? 398 00:20:31,273 --> 00:20:32,608 సరే. 399 00:20:32,691 --> 00:20:34,776 ఈ కాగితాన్ని చెత్తబుట్టలో పడేయమంటావా? 400 00:20:35,611 --> 00:20:36,862 లేదు, అదేం పర్లేదు. నేను పడేస్తా. 401 00:20:36,945 --> 00:20:37,946 సరే. 402 00:20:54,755 --> 00:20:56,882 ఓహ్, ఒక్క నిమిషం. ఆ ఫోటో తీసుకోకుండా వెళ్లలేం. 403 00:20:56,965 --> 00:20:58,008 రేజ్ 404 00:21:18,320 --> 00:21:20,989 - త్వరగా. పదండి, వెళ్ళాలి. - …మొదటి ప్లాట్ ఫామ్. 405 00:21:21,865 --> 00:21:23,408 మీ టికెట్లు రెడీగా పెట్టుకోండి, ప్లీజ్. 406 00:21:23,492 --> 00:21:25,202 - …మొదటి ప్లాట్ ఫామ్. - అంతే, వెళ్ళండి. 407 00:21:25,285 --> 00:21:27,037 - పదా, ప్రిన్సెస్. - సరే, వస్తున్నా. 408 00:21:28,288 --> 00:21:29,790 పదా, మిత్రమా. అంతే. 409 00:21:33,293 --> 00:21:34,670 ఇది పని చేయడం లేదు. 410 00:21:34,753 --> 00:21:36,255 - ఏంటి? - ఇది పని చేయడం లేదు. 411 00:21:36,338 --> 00:21:38,549 - సరే, పద… ట్రైన్… - లేదు, జేసన్. టైలర్. 412 00:21:38,632 --> 00:21:39,883 - నన్ను వదిలేయకండి! - ట్రైన్ వెళ్ళిపోతుంది! 413 00:21:39,967 --> 00:21:42,386 - వెళ్ళకండి! ఇది పని చేయడం లేదు! - సరే, మరి త్వరగా రా, ప్లీజ్! 414 00:21:42,469 --> 00:21:44,137 ఓహ్, అద్భుతం. సూపర్. 415 00:21:44,847 --> 00:21:46,223 అవును, అది చాలా… 416 00:21:48,684 --> 00:21:49,810 నువ్వు వెళ్లొచ్చు. 417 00:22:03,115 --> 00:22:04,116 నా వల్ల కా… 418 00:22:06,034 --> 00:22:07,244 ఒకసారి నాకు నీ టికెట్ చూపించు. 419 00:22:08,871 --> 00:22:11,206 అవును. ఇది టికెట్ కాదు, అవునా? 420 00:22:11,707 --> 00:22:13,292 ఇది నీ జూ మెంబెర్ షిప్ కార్డు. 421 00:22:14,793 --> 00:22:15,794 ఓహ్, అవును. 422 00:22:16,712 --> 00:22:18,714 నాకు ఇంకా కొంచెం తల తిరుగుతున్నట్టు ఉంది. 423 00:22:19,506 --> 00:22:21,717 - ఓహ్, అంతే. అవును. - కనిపించిందా? సరే. 424 00:22:21,800 --> 00:22:24,553 వూ. అదుగో. 425 00:22:24,636 --> 00:22:27,389 మనం ఇంకొక బోగీలోకి వెళ్లి కూర్చోవచ్చు, తెలుసు కదా? 426 00:22:27,472 --> 00:22:29,141 తర్వాతి ట్రైన్ ఇంకొక గంట వరకు రాదు. 427 00:22:36,190 --> 00:22:37,399 - టికెట్స్ ఇవ్వండి ప్లీజ్. - హేయ్, 428 00:22:37,482 --> 00:22:38,483 - వాళ్ళు… - ఏంటి? 429 00:22:38,567 --> 00:22:40,402 - …తర్వాత దానిలో వస్తాం అన్నారు. - సరే, మంచిది. 430 00:22:50,787 --> 00:22:52,080 - నీకు… - సరే, మరి… 431 00:22:52,164 --> 00:22:55,042 - క్షమించు. లేదు, లేదు, చెప్పు. నువ్వు చెప్పు. - లేదు. అదేం పర్లేదు. నువ్వు చెప్పు. 432 00:22:55,125 --> 00:22:57,419 - నిజంగా? లేదు, లేదు, పర్లేదు. - అవును. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. 433 00:22:57,503 --> 00:22:59,505 - సరే. - టికెట్స్ ఇస్తారా, ప్లీజ్? 434 00:23:06,553 --> 00:23:08,055 ఇవి ఫస్ట్ క్లాస్ టికెట్స్ గా చెల్లవు. 435 00:23:13,352 --> 00:23:15,103 ఇది ఫస్ట్ క్లాస్. 436 00:23:17,981 --> 00:23:19,775 మీరు ఇక్కడ కూర్చోకూడదు. 437 00:23:19,858 --> 00:23:21,568 మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 438 00:23:24,154 --> 00:23:25,155 తను ఏమంటోంది? 439 00:23:27,908 --> 00:23:28,909 షకీరా? 440 00:23:30,077 --> 00:23:32,120 - ఏంటి? - షకీరా, 441 00:23:32,204 --> 00:23:33,455 దువా లిప. సాంటాన. 442 00:23:34,289 --> 00:23:36,041 అగ్యులేరా కాన్ పాకో రబన్నే. 443 00:23:36,124 --> 00:23:38,126 లిన్-మాన్యుయెల్ మిరాండా, సి? 444 00:23:38,752 --> 00:23:42,214 - ఏవ లంగోరియా, ఏవ, సి, సి. - ఏవ లంగోరియా! ఏవ లంగోరియా. సి, సి, సి. 445 00:23:49,888 --> 00:23:51,181 అది భలే సరదాగా అనిపించింది. 446 00:23:54,017 --> 00:23:55,227 - ఓహ్, దేవుడా. - ఏంటి? 447 00:23:55,310 --> 00:23:56,645 - అతను మళ్ళీ వస్తున్నాడు. వెళ్ళు. - ఓహ్, లేదు. 448 00:23:56,728 --> 00:23:58,939 - వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు. - ఓయ్, కదలొద్దు! 449 00:24:00,232 --> 00:24:02,526 ఆగు, ఓయ్! పదా, ఓయ్! 450 00:24:02,609 --> 00:24:03,777 ఏమండీ. 451 00:24:04,695 --> 00:24:05,821 మీరు స్పానిష్ వారు కాదని నాకు తెలుసు. 452 00:24:17,165 --> 00:24:18,542 విక్ రాస్ హ్యాండీమ్యాన్ 453 00:24:22,629 --> 00:24:25,924 మీ బిజినెస్ కి 5 స్టార్ రివ్యూ వచ్చింది 454 00:24:31,346 --> 00:24:33,432 నేను ఇవాళ ఒక అందమైన చిన్న కుక్కని చూసా నాకు చిన్న కుక్కలు చాలా ఇష్టం! 455 00:24:33,515 --> 00:24:34,766 అలాగే డ్రై షాంపూ నాకు కూడా! 456 00:26:17,286 --> 00:26:19,288 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్