1 00:00:30,948 --> 00:00:32,573 సరే, భవిష్యత్తు జీవితం. 2 00:00:32,658 --> 00:00:35,410 ఈ మొత్తం ప్రదేశంలో నాకు నచ్చిన చోటు ఇది మాత్రమే. 3 00:00:36,578 --> 00:00:41,667 మీరు నిజంగా అబ్జర్వేటరీకి వెళ్తే, అక్కడ పెద్ద గోడపై ఈ ఫొటో 4 00:00:41,750 --> 00:00:45,546 ప్రింట్ చేసి ఉంటుంది, అది మన ఆడిటోరియం కంటే పెద్దగా ఉంటుంది. 5 00:00:45,629 --> 00:00:47,840 -మ్యాండీ. -అయితే మొత్తం విశ్వమంతా ఇదేనా? 6 00:00:48,715 --> 00:00:52,261 మంచి ప్రశ్న. చూడు, కాదు. ఇది ఒక వింతైన విషయం. 7 00:00:52,344 --> 00:00:54,805 ఇది విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. 8 00:00:54,888 --> 00:00:56,974 మీరు మీ వేలిని పైకెత్తితే... 9 00:00:57,057 --> 00:00:58,976 అందరూ వేలిని పైకెత్తండి. 10 00:00:59,685 --> 00:01:05,022 రాత్రి వేళ బయటకు వచ్చి, ఆకాశంవైపు వేలిని ఇలా పైకెత్తితే, 11 00:01:05,107 --> 00:01:09,570 మీరు కేవలం ఒకటో రెండో నక్షత్రాలను మాత్రమే కవర్ చేయగలుగుతారు, కదా? 12 00:01:09,653 --> 00:01:13,866 కానీ, మీ వద్ద టెలిస్కోప్ ఉంటే, అన్నింటినీ చూడవచ్చు. 13 00:01:13,949 --> 00:01:17,327 మొత్తం నక్షత్రాలను, పాలపుంతలను, ఈ ఫోటోలో ఉన్న అన్నింటినీ చూడగలుగుతారు. 14 00:01:17,411 --> 00:01:20,706 కేవలం మీ చేతి వేలి ప్రమాణంలో కనిపించే విశ్వాన్ని మాత్రమే చూస్తున్నారు. 15 00:01:22,165 --> 00:01:24,751 అదీ విషయం. 16 00:01:24,835 --> 00:01:27,045 క్షమించాలి. ముగించే ముందు మరొక విషయం. 17 00:01:27,129 --> 00:01:29,840 నేను చేస్తున్న ఏడాది చివరి సర్వే కోసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. 18 00:01:29,923 --> 00:01:33,427 ఖగోళ శాస్త్రం అంటే ఇష్టం ఉన్నవారు చేతులు పైకెత్తండి? 19 00:01:34,595 --> 00:01:37,264 ఒకటి, రెండు, మూడు, నాలుగు. బాగుంది. 20 00:01:37,347 --> 00:01:39,099 ఇష్టం లేని వాళ్లు చేతులు ఎత్తండి. 21 00:01:40,350 --> 00:01:41,518 రెమోన్. నిజంగానా? ఎందుకని? 22 00:01:42,227 --> 00:01:43,228 ఏమో మరి. 23 00:01:44,104 --> 00:01:46,106 దానికి అంత ప్రాముఖ్యం లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. 24 00:01:49,276 --> 00:01:51,028 అర్థమైంది. 25 00:01:53,405 --> 00:01:58,869 అందరూ ఇళ్లకే పరిమితమై ఉండిపోయిన ప్రస్తుత పరిస్థితిలో వారి వారి మనోభావాలు 26 00:01:58,952 --> 00:02:01,413 ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఇదొక అవకాశమని అనుకుంటున్నాను. 27 00:02:02,789 --> 00:02:04,958 ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి? 28 00:02:08,503 --> 00:02:10,172 సరే, మంచిది. 29 00:02:17,304 --> 00:02:18,931 అయితే, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినట్టు? 30 00:02:19,473 --> 00:02:22,059 టిండర్, లేకపోతే... ఇంకొకటి ఏంటది? బంబుల్ కదా? 31 00:02:23,060 --> 00:02:24,728 ఛీ. జెడేట్ నుంచా? 32 00:02:24,811 --> 00:02:26,355 -నిజంగా జేడేట్ నుంచేనా? -లేదు. 33 00:02:27,856 --> 00:02:29,316 ఆమె తల్లి మా అమ్మతో కలిసి పనిచేస్తుంది. 34 00:02:29,858 --> 00:02:32,110 -దేవుడా, అద్భుతం. -ఇది నిజంగా భయపెట్టే విషయమే. 35 00:02:32,194 --> 00:02:34,404 నిజానికి నాకిష్టం లేదు. కానీ మా అమ్మే ప్రోత్సహించింది. 36 00:02:34,488 --> 00:02:35,697 ఇక నేను "సరే" అనక తప్పలేదు. 37 00:02:35,781 --> 00:02:38,742 కానీ ఆ వెంటనే లాక్ డౌన్ వచ్చింది, దాంతో బతికిపోయాననే అనుకున్నా, 38 00:02:38,825 --> 00:02:41,912 కానీ మళ్లీ తనే ఈ విషయం ప్రస్తావించింది, దాంతో జూమ్ లో మాట్లాడక తప్పేటట్లు లేదు. 39 00:02:44,331 --> 00:02:45,958 -నీకు బోర్ కొడుతోందా? -లేదు. 40 00:02:46,041 --> 00:02:48,168 దీని గురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నా. 41 00:02:48,252 --> 00:02:50,838 ఓరి దేవుడా. క్షమించు. నేను కాస్త అలసిపోయానంతే. 42 00:02:50,921 --> 00:02:53,131 -అలాగే కనిపిస్తోంది. -పోవోయ్. నేనేం అలసిపోలేదు. 43 00:02:53,215 --> 00:02:56,760 -లేదు. అంటే, ఇప్పుడు బాగానే ఉన్నావా? -లేదు. నాకు పీడ కలలు వస్తున్నాయి. 44 00:02:57,427 --> 00:02:58,595 అహా. 45 00:03:00,222 --> 00:03:01,598 కలల్లో ఏం జరుగుతోంది? 46 00:03:03,934 --> 00:03:05,894 చాలామంది మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నట్టు కలలు వస్తున్నాయి. 47 00:03:05,978 --> 00:03:07,145 -నిజంగానా? -నిజమే. 48 00:03:07,229 --> 00:03:09,773 -భలే వింతగా ఉందే. -అది వింత ఎలా అవుతుంది? అది... 49 00:03:09,857 --> 00:03:11,692 మామూలుగా నా కలలకు ఒక అర్థం అంటూ ఏమీ ఉండదు. 50 00:03:11,775 --> 00:03:13,068 నాకు వస్తాయి. కానీ ఇవి... 51 00:03:13,151 --> 00:03:15,153 -భయంకరంగా ఉంటున్నాయి. -ఆహా. 52 00:03:16,238 --> 00:03:18,448 వాటిని తప్పించుకునేందుకు పరుగెత్తుతూనే ఉన్నాను. 53 00:03:18,532 --> 00:03:21,910 "దూరంగా పో, మాస్క్ ఎందుకు పెట్టుకోవు" అని అరచి పారిపోతున్నా. సరేనా? 54 00:03:21,994 --> 00:03:25,622 కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు మాస్కు లేకుండా ఎదురవుతున్నారు. 55 00:03:25,706 --> 00:03:26,540 అలాగా. 56 00:03:26,623 --> 00:03:29,168 దాంతో, నాకు నిద్ర పోవాలనిపించట్లేదు, 57 00:03:29,251 --> 00:03:30,711 ఎందుకంటే, మళ్లీ వాళ్లే కనబడతారని. 58 00:03:35,549 --> 00:03:36,550 ఆహా. 59 00:03:38,051 --> 00:03:39,595 వీడు ఆఫీసులో కరోనా అంటించుకున్నాడు. 60 00:03:43,473 --> 00:03:44,766 ఆఫీసులోనా? 61 00:03:44,850 --> 00:03:47,269 లేదు. ఒక పార్టీలో అనుకుంటా. 62 00:03:47,352 --> 00:03:50,606 -వాడు ఒప్పుకోవట్లేదు, కానీ అది నిజమే. -దేవుడా. 63 00:03:52,566 --> 00:03:53,650 ఇప్పుడు బాగానే ఉన్నాడా? 64 00:03:55,110 --> 00:03:56,195 నాకు తెలియదు, గురూ. 65 00:03:56,904 --> 00:03:58,238 తనేం నాకు చెప్పలేదు. 66 00:04:01,533 --> 00:04:02,534 నువ్వయితే బాగానే ఉన్నావు కదా? 67 00:04:04,203 --> 00:04:06,205 బాగానే ఉన్నా. 68 00:04:06,914 --> 00:04:07,956 బాగున్నాను. 69 00:04:31,480 --> 00:04:33,065 మీకు సంగీతం వచ్చా? 70 00:04:36,276 --> 00:04:38,070 గిటార్ చూశావు కదా, అందుకే... 71 00:04:38,153 --> 00:04:39,738 -అలా అడుగుతున్నావు, అవునా. -అవును. 72 00:04:39,821 --> 00:04:40,864 సారీ. 73 00:04:43,575 --> 00:04:46,078 అది చాలా ఇబ్బందికరమైన విషయం. నిజానికి దాన్ని తీసేయాలనే అనుకున్నా. 74 00:04:46,161 --> 00:04:48,121 జూమ్ ఓపెన్ చేశాక చూస్తే, 75 00:04:48,205 --> 00:04:50,457 గిటార్ నా వెనకే ఉంది, దాన్ని చూసి నేను... 76 00:04:52,167 --> 00:04:54,795 "నాకు సంగీతం తెలుసు, కావాలంటే చూడు, నా వెనకే గిటార్ ఉంది," 77 00:04:54,878 --> 00:04:56,922 అని చెప్పుకున్నట్టుగా ఉంటుంది, అది నాకు ఇష్టం ఉండదు. 78 00:04:57,005 --> 00:04:58,215 అది... అందుకే. 79 00:04:58,298 --> 00:05:00,342 ఇప్పుడు మారిస్తే, మరీ అసహ్యంగా ఉంటుందని ఊరుకున్నాను. 80 00:05:00,425 --> 00:05:02,553 అలా చేస్తే, దానిపై మీ దృష్టి పడే అవకాశం ఉంటుంది... 81 00:05:03,178 --> 00:05:05,597 అవును. దాన్ని నువ్వు చూస్తావని నేను అనుకోలేదు, సారీ. 82 00:05:05,681 --> 00:05:07,432 మరేం పరవాలేదు. గిటార్ గురించి మనం మాట్లాడుకోవద్దు. 83 00:05:07,516 --> 00:05:10,435 -వదిలెయ్యండి. -లేదు, పరవాలేదు. అదీ... సరే. 84 00:05:10,519 --> 00:05:12,896 నేను సంగీతకారుణ్ని. అలాంటివాణ్నే అనుకోండి. 85 00:05:14,565 --> 00:05:16,108 "అలాంటి వాణ్నే" అంటే? 86 00:05:17,693 --> 00:05:19,027 మంచి ప్రశ్న. ఏంటి నా ఉద్దేశం? 87 00:05:19,111 --> 00:05:21,363 నేను వృత్తిపరంగా సంగీతం చేయట్లేదా? 88 00:05:22,573 --> 00:05:24,700 సరే. నాకు అర్థమైందిలే. 89 00:05:24,783 --> 00:05:26,618 అది మంచి విషయం. మరేం పరవాలేదు. 90 00:05:26,702 --> 00:05:28,120 ఆగు, అది మీకెలా తెలుసు? 91 00:05:28,203 --> 00:05:30,205 -మీరొక టీచర్ కదా? -అవును. 92 00:05:30,289 --> 00:05:34,793 నిజమైన సంగీతకారుడితో నేను డేటింగ్ కు ఒప్పుకునేదాన్నే కాదు, కనుక... 93 00:05:34,877 --> 00:05:35,919 నిజమైన సంగీతకారుడా? 94 00:05:38,672 --> 00:05:41,758 క్షమించండి. నా ఉద్దేశం వృత్తిరీత్యా 95 00:05:41,842 --> 00:05:44,887 లేకపోతే, వ్యాపారంలో ఉన్నవారని. 96 00:05:44,970 --> 00:05:47,890 సరే. బాగుంది. అయితే మీకు కావలసినవాణ్ని నేనే. 97 00:05:50,267 --> 00:05:52,477 మీరు నిజమైన సంగీతకారుడు కాదనేది నా ఉద్దేశం కాదు. 98 00:05:52,561 --> 00:05:54,813 -పరవాలేదు. ఏం బాధపడకండి. -క్షమించండి. 99 00:05:57,900 --> 00:06:00,277 -మీరు ఏదైనా బ్యాండ్లో ఉన్నారా లేక... -దానిగురించి నువ్వు అడగకూడదు. 100 00:06:00,360 --> 00:06:02,779 -దానిగురించి మనం మాట్లాడుకోవద్దు. -లేదు. నాకు నిజంగానే తెలుసుకోవాలనుంది. 101 00:06:03,614 --> 00:06:04,615 చెప్పండి. 102 00:06:05,949 --> 00:06:09,161 సరే. నేను బ్యాండ్ లో లేను. 103 00:06:10,787 --> 00:06:15,083 కానీ, మనం అంతట మనం చాలా చేసుకోవచ్చు, తెలుసా. 104 00:06:15,167 --> 00:06:17,503 ఓవర్ డబ్బింగ్ అని, అలా ఎన్నో. 105 00:06:17,586 --> 00:06:19,588 సరే. ఓవర్ డబ్బింగ్ అంటే ఏంటి? 106 00:06:20,631 --> 00:06:22,341 మీరు ఏదైనా రికార్డ్ చేస్తున్నారనుకోండి, 107 00:06:22,424 --> 00:06:25,385 వేర్వేరు వాయిద్యాలు పలికించినప్పుడు వాటన్నింటినీ ఒక చోటకు చేర్చడం. 108 00:06:26,637 --> 00:06:29,723 అర్థమైంది. అయితే, మీరు ఆల్బమ్ ఏదైనా చేస్తున్నారా? 109 00:06:29,806 --> 00:06:30,849 లేదు. 110 00:06:32,684 --> 00:06:36,104 అయినా ఆల్బమ్ అంటే ఏంటి అసలు? 111 00:06:36,188 --> 00:06:37,231 నాకు తెలియదు. 112 00:06:37,314 --> 00:06:39,691 అవును. నేను ఏం చేస్తున్నానంటే... 113 00:06:40,859 --> 00:06:43,654 నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. ఏదో చేస్తున్నాను. అది చాలా గొప్పగా ఉంటుంది. 114 00:06:43,737 --> 00:06:47,741 దాదాపు పూర్తయిపోయింది కూడా. డ్రమ్స్ మాత్రమే మిగిలింది. 115 00:06:47,824 --> 00:06:49,409 -భలే బాగుంది. -ధన్యవాదాలు. 116 00:06:50,410 --> 00:06:52,246 అయితే, డ్రమ్స్ ఎప్పుడు చేస్తారు? 117 00:06:52,329 --> 00:06:54,665 డ్రమ్స్ చాలా కష్టమైన పని. అది... 118 00:06:54,748 --> 00:06:58,710 నిజమైన డ్రమ్ సెట్ రికార్డ్ చేయాలంటే, అది ఇంట్లో చేసే పని కాదు, తెలుసా? 119 00:06:58,794 --> 00:07:01,171 నకిలీ డ్రమ్స్ తో చేయొచ్చు. అది అందరూ చేసే పనే, 120 00:07:01,255 --> 00:07:02,589 కానీ బాగుండదు. 121 00:07:02,673 --> 00:07:03,674 కాబట్టి... 122 00:07:05,050 --> 00:07:06,552 -అహా. -అవును. 123 00:07:07,177 --> 00:07:09,388 సరే. అయితే మీ పాటను ఎలా పూర్తి చేస్తారు మరి? 124 00:07:13,392 --> 00:07:14,393 ఎందుకు? 125 00:07:15,894 --> 00:07:16,979 నేను... 126 00:07:17,855 --> 00:07:19,273 పనులు పూర్తి చేయడమంటే నాకు ఇష్టం. 127 00:07:21,483 --> 00:07:24,278 చూడండి, నాకు మ్యూజిక్ గురించి ఏమీ తెలియదు, అందుకని... 128 00:07:25,028 --> 00:07:26,738 మ్యూజిక్ గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసి ఉంటుంది. 129 00:07:26,822 --> 00:07:28,198 నాకైతే ఏమీ తెలియదు. 130 00:07:28,282 --> 00:07:29,992 ఏంటి, మీరు ఎప్పుడూ మ్యూజిక్ వినలేదా? 131 00:07:30,075 --> 00:07:31,493 కాదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టమే. 132 00:07:31,577 --> 00:07:34,037 కానీ, మ్యూజిక్ గురించి మాత్రం ఏమీ తెలియదు. 133 00:07:34,788 --> 00:07:36,832 మీరు ఈమధ్య ఏ పాట విన్నారు? 134 00:07:36,915 --> 00:07:38,375 నాకు తెలియదు. 135 00:07:39,334 --> 00:07:41,336 సరే. మీకు ఇష్టమైన పాట ఒకటి చెప్పండి. 136 00:07:42,629 --> 00:07:43,964 నాకు అస్సలేమీ తెలియదు. 137 00:07:46,466 --> 00:07:50,846 సరే. మీ చిన్నతనంలో మీరు కొన్న ఒక సిడీ ఏంటో చెప్పండి. 138 00:07:52,681 --> 00:07:54,391 నా దగ్గర సీడీలేమీ లేవు. 139 00:07:55,517 --> 00:07:57,019 అహా. 140 00:07:57,102 --> 00:07:59,646 వాటి ఖరీదు చాలా ఎక్కువ ఉండేది. ఆ విషయం నాకు గుర్తే. 141 00:07:59,730 --> 00:08:00,731 చాలా ఖరీదు. ఖచ్చితంగా. 142 00:08:00,814 --> 00:08:04,610 నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి సీడీలు కొనేవాణ్ని. 143 00:08:04,693 --> 00:08:06,445 ఎందుకంటే, అప్పట్లో, 144 00:08:06,528 --> 00:08:09,907 మ్యూజిక్ వినాలంటే అదొక్కటే దారి మరి. 145 00:08:09,990 --> 00:08:12,367 ఏదైనా ప్రత్యేకంగా వినాలంటే అదే దారి. 146 00:08:12,451 --> 00:08:14,745 లేదంటే రేడియోలో వినాలి. 147 00:08:15,787 --> 00:08:17,915 -నేను రేడియో వినేదాన్ని. -ఊఫ్. 148 00:08:19,041 --> 00:08:20,542 ఊఫ్? రేడియో వింటే ఏం? 149 00:08:23,712 --> 00:08:25,964 మీకో సంగతి తెలుసా? ఏం లేదులే. 150 00:08:28,550 --> 00:08:29,551 సరే. 151 00:08:31,845 --> 00:08:33,096 ఏంటి? 152 00:08:34,347 --> 00:08:36,140 లేదు. నేను కేవలం... 153 00:08:38,477 --> 00:08:40,145 మీరేదో కనుక్కున్నారని అనుకుంటున్నాను. 154 00:08:41,980 --> 00:08:43,565 మీ బాల్యం ఎక్కడ గడిచింది? 155 00:08:43,649 --> 00:08:45,108 నేను పెరిగింది ఇక్కడే. 156 00:08:45,192 --> 00:08:46,610 -అలాగా? ఎక్కడ? -లాస్ ఏంజెలస్ లో. 157 00:08:47,319 --> 00:08:48,904 అదే, ఎక్కడ అని? 158 00:08:49,613 --> 00:08:50,697 వ్యాలీలో. 159 00:08:50,781 --> 00:08:51,782 నేనూ అక్కడే. 160 00:08:51,865 --> 00:08:53,325 -నిజంగా? ఎక్కడ? -వాన్ నయ్స్. 161 00:08:54,576 --> 00:08:57,287 భలే. మా అమ్మా నాన్నా ఇప్పటికీ రాంచిటోలోనే ఉంటున్నారు. 162 00:08:57,913 --> 00:08:58,914 వావ్. 163 00:09:00,207 --> 00:09:03,126 అయితే మనిద్దరం ఏదో పార్కులో కలిసి ఆడుకునే ఉంటాం. 164 00:09:03,919 --> 00:09:06,046 మేం ఎప్పుడూ పార్కులకు వెళ్లలేదు. మా అమ్మకి పార్కులంటే చిరాకు. 165 00:09:06,588 --> 00:09:08,090 పార్కులంటే ఎందుకు చిరాకు? 166 00:09:08,590 --> 00:09:10,342 అవి ఎక్కువగా ఆటస్థలాలుగానే ఉంటాయని. 167 00:09:10,425 --> 00:09:14,429 ఇసుక, గట్రా ఉంటాయని ఆమెకి చిరాకు. 168 00:09:14,513 --> 00:09:17,099 -ఆమె అందంగా ఉంటుందనుకుంటా. -హేయ్, మంచిగా ఉండండి. 169 00:09:17,182 --> 00:09:19,309 సరే. సారీ, సారీ. 170 00:09:20,185 --> 00:09:21,311 ఆమెను చూస్తారా? 171 00:09:21,895 --> 00:09:22,980 అలాగే. 172 00:09:23,063 --> 00:09:25,148 తనేకదా మనల్ని పరిచయం చేసింది. ఆవిడకు థాంక్స్ చెప్పాలి. 173 00:09:28,193 --> 00:09:29,403 ఇదిగో తను. 174 00:09:30,320 --> 00:09:31,697 -మీ అమ్మా నాన్నానా? -అవును. 175 00:09:33,407 --> 00:09:34,700 -చాలా బాగుంది. -ధన్యవాదాలు. 176 00:09:34,783 --> 00:09:38,161 ఫోటోల్లో నవ్వని వాళ్లంటే నాకిష్టం. 177 00:09:38,245 --> 00:09:39,663 నిజంగానా? ఎందుకని? 178 00:09:41,248 --> 00:09:42,583 అందులో నిజాయితీ ఉందని అనిపిస్తుంది. 179 00:09:42,666 --> 00:09:46,295 ఎవరైనా కెమెరా నావైపు తిప్పితే నాకు నవ్వాలని అనిపించదు. 180 00:09:47,462 --> 00:09:49,715 అవును. వాళ్లు ఎప్పుడూ నవ్వరు. 181 00:09:50,757 --> 00:09:52,759 -ఫోటోల్లో మాత్రమే కాదు. -అది నిజం కాదేమో. 182 00:09:52,843 --> 00:09:54,136 అవును, అలాంటిదే. 183 00:09:56,013 --> 00:09:57,264 "అలాంటిదే" అంటే? 184 00:09:59,641 --> 00:10:02,436 వాళ్లు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మనకంటే వాళ్లు భిన్నమైన వాళ్లు. 185 00:10:02,519 --> 00:10:05,606 అప్పట్లో వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో, అక్కడ పరిస్థితి దారుణంగా ఉండేది. 186 00:10:05,689 --> 00:10:08,817 చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చారు. ఇక్కడ ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చారు. 187 00:10:09,401 --> 00:10:11,445 మా ముత్తాత వాళ్లూ కూడా ఇలాగే కష్టాలు పడ్డారు. 188 00:10:11,528 --> 00:10:12,654 మా అమ్మ తరఫువాళ్లన్నమాట. 189 00:10:12,738 --> 00:10:14,907 నా దగ్గర మా ముత్తాత ఫోటో ఒకటే ఒక్కటి ఉంది, 190 00:10:14,990 --> 00:10:17,451 అందులో ఆయన నవ్వుతూ ఉండడు. 191 00:10:18,452 --> 00:10:20,454 -ఆయన ఎక్కడ నుంచి వచ్చారు? -రష్యా. 192 00:10:20,954 --> 00:10:21,955 రష్యా. 193 00:10:22,039 --> 00:10:24,124 -అవును, మరి మీ తల్లిదండ్రులు? -కొరియా నుంచి. 194 00:10:25,459 --> 00:10:27,377 నా స్టూడెంట్లలో చాలామంది వలసవచ్చిన వారికి పుట్టిన అమెరికన్లే. 195 00:10:27,461 --> 00:10:31,381 వాళ్ల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి, స్థిరపడ్డారు. మీలాగే. 196 00:10:31,465 --> 00:10:34,009 అలాగన్నమాట. 197 00:10:35,052 --> 00:10:36,220 ఏంటి మీ ఉద్దేశం? 198 00:10:36,303 --> 00:10:40,390 ఏం లేదు, వాళ్లందరూ ఎవరికివారు ఎంతో విభిన్నమైనవారు, కానీ... 199 00:10:40,474 --> 00:10:43,810 వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది, తను... 200 00:10:43,894 --> 00:10:46,480 తను ఇక్కడే పుట్టింది, కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఇరాన్ దేశస్థులు. 201 00:10:47,064 --> 00:10:49,733 ఆమె మాట్లాడేదీ, ఆమె రాసేదీ చూస్తుంటే నాకు పదేళ్ల వయసప్పుడు 202 00:10:49,816 --> 00:10:53,487 నా ఆలోచనలకంటే తనవి ఎంతో భిన్నంగా ఉన్నాయనిపిస్తుంది. 203 00:10:54,363 --> 00:10:55,989 నీకో సంగతి తెలుసా, తను... 204 00:10:56,698 --> 00:10:59,618 తను ప్రతి ఏటా వేసవికి ఇరాన్ వెళ్లి వస్తూ ఉండేది. 205 00:10:59,701 --> 00:11:02,037 కానీ కొన్నేళ్ల నుంచీ ఆమె అక్కడికి వెళ్లట్లేదు, 206 00:11:02,120 --> 00:11:05,791 ఎందుకంటే, బహుశా మన ప్రభుత్వ విధానాల పట్ల భయపడినట్లుంది. 207 00:11:06,458 --> 00:11:08,961 ఇది చాలా బాధాకరమైన విషయం. 208 00:11:09,044 --> 00:11:11,213 ఆమెను చూస్తే చాలా బాధగా ఉంటుంది, 209 00:11:11,296 --> 00:11:15,384 కానీ ఒకలా అదే ఆమెను మరింత బలం పుంజుకునేలా చేసిందని అనిపిస్తుంది. 210 00:11:15,467 --> 00:11:21,974 ఆమె చాలా చైతన్యవంతమైనది. తెలివిగలది, కార్యసాధకురాలు కూడా. 211 00:11:22,057 --> 00:11:24,393 ఆమె పెద్దయ్యాక ఏదో సాధించి తీరుతుంది. 212 00:11:24,476 --> 00:11:27,688 నేను పందెం కాయగలను. 213 00:11:30,399 --> 00:11:32,359 -ఆమె పేరేంటి? -నిక్కీ. 214 00:11:34,152 --> 00:11:35,153 నిక్కీ. 215 00:11:39,116 --> 00:11:40,409 మీకు ఆకలేస్తోందా? 216 00:11:42,286 --> 00:11:43,287 అవును. 217 00:11:44,913 --> 00:11:46,248 -తప్పకుండా. -నాకు కూడా. 218 00:11:47,249 --> 00:11:50,043 "ఇది నేను చిన్నగా ఉన్నట్టు చేస్తుంది" అంటాడు అతను. 219 00:11:50,878 --> 00:11:53,297 -ఓరి, దేవుడా. -తనంటే నాకు ఇష్టం. 220 00:11:53,380 --> 00:11:57,050 అతను ఎంతో తెలివైన మనసున్న మనిషి. 221 00:11:58,802 --> 00:12:00,679 ఈ విశ్వం మిమ్మల్ని చిన్నగా చేస్తోందా? 222 00:12:01,180 --> 00:12:02,806 అవును. నీకు అలా అనిపించదా? 223 00:12:04,474 --> 00:12:08,187 ఆ ఫోటోను చూస్తే నాకు అనిపించే అసలు విషయం అది కాదు. 224 00:12:09,396 --> 00:12:10,647 నీకు భవిష్యత్తు జీవితం గురించి తెలుసా? 225 00:12:11,565 --> 00:12:12,983 తెలుసు నేస్తం, నేను పెరిగింది ఇక్కడే. 226 00:12:13,066 --> 00:12:15,777 -తరచూ గ్రిఫిత్ అబ్జర్వేటరీకి వెెళ్లేదాన్ని. -అవునవును. 227 00:12:15,861 --> 00:12:18,071 -నాకు భవిష్యత్తు జీవితం అంటే ఇష్టం. -నాకూ అంతే. 228 00:12:18,780 --> 00:12:20,616 కానీ అది మిమ్మల్ని చిన్నగా అనిపించేలా చేస్తుందని అన్నారు కదా. 229 00:12:20,699 --> 00:12:21,700 నిజమే మరి. 230 00:12:22,492 --> 00:12:23,785 సరే. 231 00:12:23,869 --> 00:12:27,372 కానీ నాకైతే, దాన్ని చూస్తే, "నేను మనిషిగా పుట్టానంటే నమ్మలేను" అనిపిస్తుంది. 232 00:12:28,081 --> 00:12:32,586 శరీరం, ఒక మెదడు, చేతులు, కాళ్లతో. 233 00:12:32,669 --> 00:12:34,796 నేను అన్నింటినీ చూడగలను. అన్నీ చేయగలను. 234 00:12:34,880 --> 00:12:38,091 ఇలా ఒక వింతయిన యంత్రంలా రూపొందాను 235 00:12:38,175 --> 00:12:42,846 ఎందుకంటే శూన్యమైన, దుమ్మూ ధూళితో నిండిన ఈ విశ్వంలో, 236 00:12:42,930 --> 00:12:46,058 అంతా సవ్యంగా ఉన్న ఈ చిన్నపాటి భూగ్రహం ఉండటం ఆశ్చర్యం కాదూ? 237 00:12:46,141 --> 00:12:47,601 పైగా ఈ గ్రహంపై వెచ్చటి నీరు, 238 00:12:47,684 --> 00:12:50,103 ఆ సముద్రపు నీటిలో అనేక రేణువులు ఒకదానితో ఒకటి కలుస్తూ 239 00:12:50,187 --> 00:12:53,357 కలుస్తూ కలుస్తూ కొన్ని వేల ఏళ్ల తర్వాత 240 00:12:53,440 --> 00:12:55,692 అవి అతుక్కుని పునర్జీవం పొందుతున్నాయి. 241 00:12:55,776 --> 00:12:59,029 నేను అలాగే తయారయ్యానుగా? 242 00:12:59,112 --> 00:13:03,951 ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇంత రుచికరమైన ఆహారం 243 00:13:04,034 --> 00:13:05,410 తింటూ మీతో జూమ్ లో మాట్లాడగలుగుతున్నాను. 244 00:13:06,036 --> 00:13:07,329 నా ఉద్దేశం, ఏంటిదంతా అని? 245 00:13:08,205 --> 00:13:10,457 ఇది చిన్నగా కనిపించడానికి పూర్తిగా విరుద్ధమైనది. 246 00:13:10,541 --> 00:13:13,460 మిగతావన్నీ చిన్నవే. మరి నేను ఇంత పెద్దదాన్ని ఎలా అయ్యాను? 247 00:13:14,628 --> 00:13:16,046 అద్భుతం. 248 00:13:16,129 --> 00:13:18,924 పెద్దదనేది నేను ఎప్పుడూ అనుభూతి చెందనిది. 249 00:13:19,716 --> 00:13:23,470 -నేను చెప్పింది మీకు అర్ధమైంది కదా. -తప్పకుండా. అది అద్భుతం. 250 00:13:25,097 --> 00:13:27,766 కాదు. అది అద్భుతం కాదు. 251 00:13:27,850 --> 00:13:30,310 అందులోని గొప్పదనమే అది. అది నిజంగా జరిగిందే కదా. 252 00:13:30,394 --> 00:13:31,979 తెలుసా? అద్భుతాలనేవి ఉత్తివే. 253 00:13:33,105 --> 00:13:34,106 అలా కానక్కర్లేదు. 254 00:13:36,149 --> 00:13:38,777 -అద్భుతానికి అదే నిర్వచనమా. -కాదు. అది కాదు. 255 00:13:39,778 --> 00:13:42,114 అయితే "అద్భుతం" అంటే నిర్వచనమేంటి? 256 00:13:45,784 --> 00:13:46,994 సరే. 257 00:13:47,077 --> 00:13:50,706 అద్భుతం అంటే నువ్వు వివరించి చెప్పలేనిది. 258 00:13:51,665 --> 00:13:54,001 సరే. కానీ మనం వివరించగలం కదా? 259 00:13:54,084 --> 00:13:57,296 ఎవరో అల్లిన కథ కాదు అది. అది ఒక సైన్స్. 260 00:13:57,379 --> 00:13:59,548 -కథలతో కూడినదే సైన్స్. -జాగ్రత్త. 261 00:14:00,048 --> 00:14:01,049 ఏంటి? 262 00:14:01,758 --> 00:14:03,886 -సైన్స్ కు వ్యతిరేకంగా మారకండి. -నేను మారను. 263 00:14:04,928 --> 00:14:06,430 కానీ మీరలా మారారని అనిపిస్తోంది. 264 00:14:07,014 --> 00:14:09,725 సైన్స్ అంటే కథలేనని ఇప్పుడే కదా మీరన్నారు. 265 00:14:09,808 --> 00:14:13,770 కానీ కథలనేవి సైన్సుకి వ్యతిరేకం. 266 00:14:13,854 --> 00:14:15,814 కథలు మనల్ని అనేక కష్టాల్లోకి నెడతాయి. 267 00:14:15,898 --> 00:14:19,651 సరే, ఆగు. నాకు తెలిసినంతవరకూ, సైన్స్ అంటే, 268 00:14:19,735 --> 00:14:24,031 వాస్తవికంగా ఏం జరుగుతోందో జనం తెలుసుకునే ప్రయత్నం చేయడం, అవునా? 269 00:14:24,114 --> 00:14:28,285 కానీ ఒక మంచి విషయం ఏంటంటే, సైంటిస్టులు తాము ఖచ్చితంగా 270 00:14:28,368 --> 00:14:35,167 నూటికి నూరు శాతం దేని గురించీ తెలుసుకోలేమని నిజాయితిగా ఒప్పుకోవడం. 271 00:14:35,250 --> 00:14:37,294 వాళ్లు తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. 272 00:14:37,377 --> 00:14:39,880 అన్నింటినీ స్థూలంగా పరిశీలిస్తారు. సాక్ష్యాధారాలు సేకరిస్తారు. 273 00:14:39,963 --> 00:14:43,550 వాటితో ఒక అర్థవంతమైన కథను చెబుతారు. 274 00:14:43,634 --> 00:14:45,469 ఆ కథనే వాళ్లు సిద్ధాంతం అంటారు. 275 00:14:46,053 --> 00:14:50,182 ఆ తర్వాత వాళ్లు మరిన్ని సాక్ష్యాలను సేకరించి తమ సిద్ధాంతాన్ని పరీక్షిస్తారు. 276 00:14:50,265 --> 00:14:54,019 కొన్నిసార్లు వాళ్లు విఫలం కావచ్చు, అప్పుడు తమ కథను మార్చుకుంటారు. 277 00:14:54,102 --> 00:14:56,563 కొన్నిసార్లు వాళ్లదే నిజం కావచ్చు. అప్పుడు అదే కథను కొనసాగిస్తారు, ఆ కథ 278 00:14:56,647 --> 00:15:00,817 తప్పు అని తేల్చే మరో కొత్త సాక్ష్యం దొరికేదాకా. 279 00:15:00,901 --> 00:15:02,903 ఆ తర్వాత వాళ్లు మరో కథతో ముందుకు వస్తారు. 280 00:15:06,448 --> 00:15:08,200 మీ విద్యార్థులకు మీరు ఇలాగే చెబుతారా? 281 00:15:09,993 --> 00:15:11,245 అవును. 282 00:15:11,328 --> 00:15:14,289 అవును. నా మాట తీరు అలాగే ఉంటుంది. 283 00:15:15,624 --> 00:15:16,667 నాకు నచ్చింది. 284 00:15:16,750 --> 00:15:17,751 నచ్చిందా? 285 00:15:19,253 --> 00:15:20,337 అయితే, ధన్యవాదాలు. 286 00:15:20,420 --> 00:15:24,132 అయినా కూడా, సైన్స్ అంటే కథలేనని మీరు పిల్లలకు చెప్పకూడదు. 287 00:15:24,216 --> 00:15:26,343 సైన్స్ అంటే కట్టు కథలేనని వారు అనుకోవచ్చు. 288 00:15:27,135 --> 00:15:28,804 సరే. మరి ఏం చెప్పను? 289 00:15:33,267 --> 00:15:35,394 వాస్తవికమైన కథలతో కూడినదని చెప్పవచ్చు. 290 00:15:36,061 --> 00:15:37,062 సరే. 291 00:15:37,813 --> 00:15:39,857 పూర్తి వాస్తవికమైన కథలని. 292 00:15:40,566 --> 00:15:41,567 బాగుంది. 293 00:15:43,026 --> 00:15:44,194 మంచిది. 294 00:15:44,278 --> 00:15:45,988 ఇక నుంచి వాళ్లకు ఇలాగే చెబుతాను. 295 00:15:46,071 --> 00:15:48,782 -మంచిది. నాకూ నచ్చింది. -నీకు నచ్చితే సరే. 296 00:15:48,866 --> 00:15:51,159 నచ్చింది. నచ్చింది. 297 00:15:51,243 --> 00:15:52,452 సరే. 298 00:15:52,536 --> 00:15:53,537 నిజంగానా? 299 00:15:54,204 --> 00:15:55,205 అవును. 300 00:15:56,623 --> 00:15:58,041 నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు. 301 00:15:59,001 --> 00:16:01,628 అనిపించకపోవచ్చు. కానీ నిజంగానే నచ్చింది. 302 00:16:01,712 --> 00:16:03,338 తీవ్రమైన కుంగుబాటా? 303 00:16:05,299 --> 00:16:06,425 "తీవ్రమైన" అంటే అర్థమేంటి? 304 00:16:08,302 --> 00:16:11,013 అంటే తీవ్రమైనదని అర్థం. 305 00:16:13,473 --> 00:16:15,309 నాలో ఆందోళన తీవ్రంగా ఉందేమోనని నా అనుమానం. 306 00:16:16,351 --> 00:16:17,352 మీకు ఆందోళన ఉందా? 307 00:16:17,978 --> 00:16:19,229 అవును. ఉందనే అనుకుంటున్నా. 308 00:16:20,981 --> 00:16:24,276 అది తీవ్రంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. 309 00:16:26,236 --> 00:16:27,613 అది అస్సలు నచ్చని విషయం. 310 00:16:28,780 --> 00:16:30,365 అది అంత తీవ్రమైనదికాదు. 311 00:16:30,449 --> 00:16:32,326 లేదు. నేను ఒక రోజు ఆఫీసుకి వెళ్లలేకపోయాను. 312 00:16:34,328 --> 00:16:35,954 అలా అయితే, నేను ఏడు వారాలు వెళ్లనే లేదు. 313 00:16:39,666 --> 00:16:40,792 ఏంటి? 314 00:16:40,876 --> 00:16:42,836 లేదు, లేదు. అది... అది కేవలం... 315 00:16:45,172 --> 00:16:47,257 నాలో ఆందోళన తీవ్రంగానే ఉందని అనుకున్నాను. 316 00:16:53,889 --> 00:16:55,557 లైట్లు తీసేద్దామా? 317 00:16:57,100 --> 00:16:58,101 తప్పకుండా. 318 00:17:06,693 --> 00:17:07,694 ఇప్పుడు మీరు కనిపించట్లేదు. 319 00:17:09,154 --> 00:17:10,696 మరేం పర్వాలేదు. 320 00:17:10,781 --> 00:17:12,991 వెనకటి రోజుల్లో వీడియోలో చూసుకోకుండా ఒకరితో ఒకరు 321 00:17:13,075 --> 00:17:14,785 ఫోన్లో మాట్లాడుకునే రోజులు గుర్తుకు తెచ్చుకో. 322 00:17:15,285 --> 00:17:18,622 అవును. గడచిన ఫిబ్రవరి నెలలాగ. 323 00:17:24,586 --> 00:17:25,963 నువ్వు ఊపిరి తీసుకోవడం నాకు వినబడుతోంది. 324 00:17:29,341 --> 00:17:31,009 ఇది 14 ఏళ్ల వయసులో ఉన్నట్టుగా ఉంది. 325 00:17:31,969 --> 00:17:33,178 అంటే ఏంటి? 326 00:17:34,513 --> 00:17:36,557 ఆ వయసులో అబ్బాయిలతో మాట్లాడటం గుర్తుకొస్తోంది. 327 00:17:36,640 --> 00:17:40,394 మేం ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. 328 00:17:40,978 --> 00:17:43,272 అవును. మరి, ఎందుకంటే ఎవరూ డ్రైవ్ చేసేవారు కాదుగా. 329 00:17:43,355 --> 00:17:45,190 వ్యక్తిగతంగా కలవడం కూడా ఉండేది కాదు కాబట్టి. 330 00:17:45,274 --> 00:17:48,068 అవును. ఇలాగే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. 331 00:17:48,902 --> 00:17:50,696 అతన్ని అలా పిలవవచ్చు కూడా. 332 00:17:50,779 --> 00:17:53,115 అందుకే అతన్ని అప్పట్లో "నా బాయ్ ఫ్రెండ్" అని పిలిచేదాన్ని. 333 00:17:53,198 --> 00:17:55,826 కానీ మేం, ఒకరినొకరం ముఖాముఖీ ఎప్పుడూ కలుసుకోలేదు. 334 00:17:56,952 --> 00:17:58,662 అంతా ఫోన్లోనే జరిగింది. 335 00:17:59,788 --> 00:18:01,164 అంతా జరిగిందంటే? 336 00:18:02,791 --> 00:18:07,004 -ఓహ్, అంతా జరిగిందా. -ఏంటి? 337 00:18:08,672 --> 00:18:12,551 అతనితో నేను ఏం చేస్తానో అతనికి చెప్పేదాన్ని. 338 00:18:13,343 --> 00:18:15,762 అహా. ఏం చెప్పేదానివి? 339 00:18:16,430 --> 00:18:17,514 మీకు చెప్పను. 340 00:18:17,598 --> 00:18:19,808 -ఎందుకని? -ఎందుకంటే. 341 00:18:19,892 --> 00:18:20,893 సరే. 342 00:18:22,728 --> 00:18:25,564 అతనితో ఏం చేయబోయావో అలాంటి పనులు ఎప్పుడైనా చేశావా? 343 00:18:26,398 --> 00:18:27,941 -లేదు. -లేదా? 344 00:18:28,942 --> 00:18:31,195 అవును, చేయలేదు. వ్యక్తిగతంగా కలిస్తే అలాగే ఉండదు. 345 00:18:32,362 --> 00:18:35,282 ఫోన్లో మాట్లాడితేనే అలా ఉంటుంది, తెలుసా? 346 00:18:36,783 --> 00:18:39,536 అయితే మన మొదటి డేటింగ్ కంప్యూటర్లో కావడం మంచిదే అయింది. 347 00:18:41,246 --> 00:18:42,331 కావచ్చు. 348 00:18:45,959 --> 00:18:49,671 మనం నిజంగానే డేటింగ్ కి వెళ్తే ఏం జరిగేదని అనుకుంటున్నావు? 349 00:18:50,797 --> 00:18:52,883 తెలియదు. నాకు డేటింగ్ అంటే చిరాకు. 350 00:18:52,966 --> 00:18:54,885 -నాకూ అంతే. -నాకు భలే చిరాకు. 351 00:18:54,968 --> 00:18:56,762 లేదు, నాకూ చిరాకే. 352 00:18:57,930 --> 00:19:01,683 నేను అక్కడికి వెళ్లిన వెంటనే, త్వరగా ముగిస్తే బాగుండునని అనుకుంటా. 353 00:19:01,767 --> 00:19:02,768 అవును. 354 00:19:02,851 --> 00:19:07,022 ఎందుకంటే, సాధారణంగా, మొదట 60 సెకన్లలోనే 355 00:19:07,105 --> 00:19:08,524 ఈ తతంగం ఇక ముందుకు సాగదని నాకు తెలిసిపోతుంది. 356 00:19:08,607 --> 00:19:10,317 అవును, నిజంగానే. 357 00:19:11,777 --> 00:19:13,403 రెస్టారెంట్లకు వెళ్లడాన్ని మిస్ అవుతున్నాను. 358 00:19:14,071 --> 00:19:15,072 నాకు అలా లేదు. 359 00:19:15,155 --> 00:19:18,116 మొదటి డేటింగ్ ఎప్పుడూ పబ్లిక్ గా జరగకూడదు. 360 00:19:18,200 --> 00:19:21,787 -అది మరీ ప్రదర్శనగా ఉంటుంది. -ఏం మాట్లాడుతున్నారు మీరు? 361 00:19:21,870 --> 00:19:25,666 అతను రేపిస్ట్ అయితే. అందుకనే మొదటి డేటింగ్ తప్పకుండా పబ్లిక్ గానే జరగాలి. 362 00:19:26,500 --> 00:19:27,751 సరే. 363 00:19:28,377 --> 00:19:31,505 నన్ను ఇతరులెవరూ ఇబ్బంది పెట్టరు. 364 00:19:31,588 --> 00:19:33,090 నన్ను ఇబ్బంది పెట్టేది ఆ మొత్తం పరిస్థితే. 365 00:19:34,049 --> 00:19:35,467 అదంతా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినట్టుగా ఉంటుంది నాకు. 366 00:19:36,134 --> 00:19:38,136 ఇద్దరూ టేబుల్ వద్ద ఎదురెదురుగా కూర్చుని 367 00:19:38,220 --> 00:19:40,764 ఒకరినొకరు అంచనా వేసుకుంటూ, 368 00:19:40,848 --> 00:19:43,725 అదంతా ఒక వ్యాపార లావాదేవీలా అనిపిస్తుంది. 369 00:19:45,519 --> 00:19:48,897 ఇక చివరగా, ముద్దు పెట్టుకోవలసి రావచ్చు. 370 00:19:48,981 --> 00:19:51,400 అసలు అప్పుడే కలిసిన వ్యక్తిని ఎవరు మాత్రం ముద్దు పెట్టుకుంటారు? 371 00:19:52,150 --> 00:19:54,152 మనం ఇప్పుడే కలిశాం. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది. 372 00:19:58,657 --> 00:20:00,075 నాకూ ముద్దు పెట్టుకోవాలనే ఉంది. 373 00:20:01,410 --> 00:20:02,411 నీకూ అనిపిస్తోందా? 374 00:20:03,078 --> 00:20:04,496 అవుననుకుంటా. 375 00:20:05,581 --> 00:20:08,250 కానీ నిజంగా డేటింగ్ కి వెళ్తే నువ్వు ముద్దు పెట్టుకోవేమో? 376 00:20:11,795 --> 00:20:13,088 బహుశా, పెట్టుకోవు కదా? 377 00:20:15,340 --> 00:20:16,341 శుభరాత్రి. 378 00:20:17,968 --> 00:20:18,969 శుభరాత్రి. 379 00:20:20,220 --> 00:20:22,806 అయితే నేను నీకు ఇష్టం లేదనుకోవాలి. 380 00:20:22,890 --> 00:20:28,020 అలాంటప్పుడు నిన్ను ఒత్తిడి చేయకూడదు. అందుకని నీకు ఫోన్ కూడా చేయను. 381 00:20:29,813 --> 00:20:34,193 నేను ఫోన్ చేయలేదు కాబట్టి, నేను అంతగా సీరియస్ గా 382 00:20:34,276 --> 00:20:35,402 లేనని నువ్వు అనుకుంటావు. 383 00:20:35,485 --> 00:20:41,325 దాంతో నువ్వూ నాకు ఫోన్ చేయవు. ఆ తర్వాత మనవి ఎవరి జీవితాలు వాళ్లవి. 384 00:20:48,790 --> 00:20:50,167 నిద్రపోతున్నావా? 385 00:21:19,363 --> 00:21:20,197 ఎమిలీ 386 00:21:20,280 --> 00:21:22,658 సారీ, నాకు నిద్ర వచ్చేసింది! బ్రేక్ ఫాస్ట్ కి ఏం చేస్తున్నారు? 387 00:21:51,019 --> 00:21:52,229 ఏది ఏమైనా, చాలా పని ఉంది. 388 00:21:52,312 --> 00:21:53,772 అందుకనే నేను బయల్దేరాలి 389 00:21:53,856 --> 00:21:57,067 ఈ రోజు గడిచేలోగా పనులన్నింటినీ ఒక కొలిక్కి తీసుకురావాలి. 390 00:21:58,068 --> 00:21:59,528 అమ్మో, అయితే చాలా పని ఉంది. 391 00:22:00,279 --> 00:22:01,613 అది... 392 00:22:03,115 --> 00:22:04,408 ఇది చాలా ఉత్కంఠగా ఉంది. 393 00:22:05,868 --> 00:22:07,119 అవును. నాకూ అలానే ఉంది. 394 00:22:07,744 --> 00:22:08,745 అవును. 395 00:22:11,290 --> 00:22:13,166 ఇలా బతికున్నందుకు నాకైతే చాలా ఉత్తేజకరంగా ఉంది. 396 00:22:14,543 --> 00:22:15,961 -ఏంటి? ఇప్పుడా? -అవును. 397 00:22:17,546 --> 00:22:19,673 నేనైతే ఉత్తేజకరంగా ఉందని చెప్పను. 398 00:22:20,215 --> 00:22:21,466 ఎందుకని, కోవిడ్ మహమ్మారి ఉందనా? 399 00:22:22,301 --> 00:22:23,927 అవును. అలాగే ఎన్నో ఇతర అంశాలు కూడా ఉన్నాయి. 400 00:22:24,803 --> 00:22:27,097 సరే. కానీ నేను స్థూలంగా చెబుతున్నాను. 401 00:22:30,684 --> 00:22:33,312 ప్రపంచమంతటా వ్యాపించిన ఈ మహమ్మారిని మించిన స్థూలత ఇంకేదో ఉంటుందనుకోను. 402 00:22:33,395 --> 00:22:34,396 తప్పకుండా ఉంది. 403 00:22:34,980 --> 00:22:36,982 ఈ మహమ్మారి మరి కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. 404 00:22:37,065 --> 00:22:40,110 ఇది చాలా కాలంపాటు కొనసాగుతూనే ఉంటుంది. 405 00:22:40,194 --> 00:22:42,196 సరే. ఇది మరి కొన్నేళ్లపాటు ఉన్నా, 406 00:22:42,279 --> 00:22:43,989 నేను మాట్లాడుతున్నది మాత్రం మనం జీవించి ఉన్న ఇప్పటి కాలం గురించే. 407 00:22:44,948 --> 00:22:47,701 ఏమో మరి. మనం జీవిస్తున్న ఈ కాలంలోనూ ఆ ప్రభావం ఉంది. 408 00:22:52,080 --> 00:22:54,249 ఇకపై ఈ మహమ్మారి మరింత ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? 409 00:22:54,833 --> 00:22:56,376 చాలామంది విషయంలో అదే జరుగుతోంది కదా. 410 00:22:57,211 --> 00:22:58,795 లేదు. ఎక్కువమందిపై ప్రభావం ఏమీ లేదు. 411 00:22:58,879 --> 00:23:01,131 ఎంతో దూరం పోనక్కర్లేదు. సంఖ్యాపరంగా చూస్తే తెలుస్తుంది. 412 00:23:01,715 --> 00:23:02,716 అబ్బా, అర్ధం చేసుకో. 413 00:23:02,799 --> 00:23:05,093 ప్రజల జీవితాలను బట్టి చూడాలే తప్ప, సంఖ్యలను బట్టి చూస్తే ఎలా? 414 00:23:11,975 --> 00:23:15,270 నేనూ, నా స్నేహితులూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. 415 00:23:16,355 --> 00:23:17,981 -దేని గురించి? -అలాగే... 416 00:23:18,065 --> 00:23:21,235 నాకు తెలిసిన వారిలో, 417 00:23:21,318 --> 00:23:26,031 ఈ మహమ్మారి గురించి శ్వేతజాతి మగవాళ్లే ఎక్కువగా భయపడుతున్నారు. 418 00:23:30,369 --> 00:23:31,954 -అలాగే నేను... -సరే. 419 00:23:32,037 --> 00:23:37,417 అలా దేనికంటే, అన్నీ సవ్యంగా ఉండాలని, అన్నీ చక్కగా జరిగిపోవాలని 420 00:23:37,501 --> 00:23:40,128 కోరుకునే ఒక విశేషాధికారాన్ని మీరు కలిగి ఉంటారు. 421 00:23:40,212 --> 00:23:45,008 ఇప్పుడు, ఒక ప్రతికూలత ఎదురుకాగానే, 422 00:23:45,092 --> 00:23:47,344 ఈ ప్రపంచమే అంతమైపోతోందన్నట్టుగా మీరంతా కంగారు పడిపోతున్నారు. 423 00:23:53,100 --> 00:23:54,434 నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. 424 00:23:59,565 --> 00:24:01,817 సరే. నేను శ్వేతజాతీయుణ్నే, నేను మగవాణ్నే... 425 00:24:03,402 --> 00:24:04,778 అది ఒక విశేషాధికారమని తెలుసు. 426 00:24:06,613 --> 00:24:11,368 కానీ నువ్వు చెబుతున్నది నాకు వర్తిస్తుందని నేను అనుకోవడం లేదు. 427 00:24:13,203 --> 00:24:14,204 నాకు తెలుసు. 428 00:24:15,956 --> 00:24:18,834 అంతా సవ్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నట్టు నువ్వు భావిస్తే, 429 00:24:19,626 --> 00:24:21,336 నీకు నాగురించి ఏమీ తెలియదని అర్థం. 430 00:24:21,420 --> 00:24:24,798 అంతా సాఫీగా జరిగిపోతుందని నేను ఎప్పుడూ అనుకోను. 431 00:24:30,929 --> 00:24:33,015 బహుశా అందుకేనేమో మీరు ఏ పనీ పూర్తి చేయరు. 432 00:24:44,610 --> 00:24:46,028 నేను ఆఫీసుకి బయల్దేరాలి. 433 00:24:46,987 --> 00:24:47,988 సరే. 434 00:24:50,616 --> 00:24:52,117 -బై. -బై. 435 00:25:01,877 --> 00:25:02,878 ఛీ. 436 00:25:59,560 --> 00:26:01,270 హాయ్. మీరు ఎమిలీ సాంగ్ కు ఫోన్ చేశారు. 437 00:26:01,353 --> 00:26:03,313 మెస్సేజ్ ఇవ్వండి. నేను మళ్లీ మిమ్మల్ని సంప్రదిస్తాను. ధన్యవాదాలు. 438 00:26:03,981 --> 00:26:05,440 హాయ్, ఎమిలీ, నేను జోష్ ని. 439 00:26:05,524 --> 00:26:07,484 నీకు వాయిస్ మెయిల్ పంపాలని అనుకుంటున్నా. 440 00:26:07,568 --> 00:26:10,237 నువ్వు వాయిస్ మెయిల్స్ వింటావో లేదో నాకు తెలియదు. 441 00:26:10,320 --> 00:26:14,032 కానీ నీకు సారీ చెప్పాలనుకుంటున్నా. మామూలు మెసేజ్ పంపాలనుకోలేదు. అందుకనే... 442 00:26:15,784 --> 00:26:17,661 నిజంగా నన్ను క్షమించు. 443 00:26:18,412 --> 00:26:21,999 నేను కొన్నిసార్లు ప్రతికూల వైఖరితో ఉంటాను, నా స్వభావం అది కాదు. 444 00:26:23,625 --> 00:26:25,335 మ్యూజిక్ గురించి ఏమీ తెలియదని 445 00:26:25,419 --> 00:26:28,130 నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగన్నమాట. 446 00:26:28,213 --> 00:26:31,300 క్షమించు, ఇది కాస్త పెద్ద వాయిస్ మెయిలే. నేను ఇంతకుముందే ఏదో విన్నాను. 447 00:26:31,383 --> 00:26:33,427 అది కింక్స్ బృందం పాడిన "వాటర్లూ సన్సెట్" పాట. 448 00:26:33,510 --> 00:26:36,180 కానీ, అది ఏ పాట అన్నది ప్రధానం కాదు, 449 00:26:36,263 --> 00:26:38,098 విషయం ఏమిటంటే, నేను... 450 00:26:38,182 --> 00:26:41,226 నేను ఆ పాట వింటూ అది ఏ ఆల్బమ్ లోనిది 451 00:26:41,310 --> 00:26:45,480 అని ఆలోచించా, ఆ తర్వాత ఆ ఆల్బమ్ ఏ ఏడాది విడుదలైంది, అదే ఏడాది ఇంకా ఏం విడుదలయ్యాయి 452 00:26:45,564 --> 00:26:48,400 అని ఆలోచించా, అప్పుడు తెలిసింది నేను పాటను ఆస్వాదించడం లేదని. 453 00:26:48,483 --> 00:26:50,736 పనికిమాలిన, ఇతర చిన్నచిన్న విషయాల గురించి 454 00:26:50,819 --> 00:26:53,780 ఆలోచిస్తూ బిజాగా ఉండిపోయాను. 455 00:26:53,864 --> 00:26:56,658 వాటి గురించి నేను పట్టించుకోకపోతే, 456 00:26:56,742 --> 00:27:01,663 మ్యూజిక్ ను అస్వాదించి ఉండేవాణ్ని. 457 00:27:01,747 --> 00:27:03,665 అప్పుడు నాకు అనిపించింది... 458 00:27:04,750 --> 00:27:08,170 ఎప్పుడైనా, నీతో కలసి మ్యూజిక్ వింటే ఎంతో బాగుంటుందని. 459 00:27:09,129 --> 00:27:10,964 ఎందుకంటే నువ్వెలా ఆస్వాదిస్తావో నాకు చూడాలని ఉంది. 460 00:27:14,301 --> 00:27:17,179 నాకు... నాకు నువ్వంటే చాలా ఇష్టం. 461 00:27:20,474 --> 00:27:23,018 సరే. బై. 462 00:27:42,538 --> 00:27:44,915 -హేయ్. లోపలకు రా, గురూ. -హాయ్. ధన్యవాదాలు. 463 00:27:44,998 --> 00:27:47,960 రా. ఇదే స్టూడియో. 464 00:27:48,043 --> 00:27:49,586 -చాలా బాగుంది. -ధన్యవాదాలు. 465 00:27:50,838 --> 00:27:51,922 సరే. 466 00:27:52,005 --> 00:27:55,467 మిగతా డబ్బు ఇవ్వు. 467 00:27:55,551 --> 00:27:58,262 -క్రెడిట్ కార్డా? -నేను ఫోన్ లోంచి చెల్లించా కదా? 468 00:27:58,345 --> 00:28:01,640 సగం ఫోన్లోంచి చెల్లించి, మిగతా సగం చేతి నుంచి ఇస్తావా? 469 00:28:02,641 --> 00:28:03,851 అర్థమైంది, సరే. 470 00:28:06,103 --> 00:28:07,104 సరే. 471 00:28:14,903 --> 00:28:16,405 ఇవాళ ఇది ఎందుకనో స్లోగా ఉంది. 472 00:28:16,488 --> 00:28:17,489 మరేం పర్వాలేదు. 473 00:28:19,241 --> 00:28:20,659 లేదు. ఇది పనిచేయట్లేదు. 474 00:28:21,410 --> 00:28:22,411 కానీ నేను, 475 00:28:22,494 --> 00:28:25,873 నేను ఇదే కార్డుతో మిగతా సగం సెషన్ కి డబ్బు చెల్లించానే. కాబట్టి... 476 00:28:26,373 --> 00:28:27,916 -మళ్లీ ప్రయత్నిస్తా. -అవును, ఎందుకంటే... 477 00:28:28,000 --> 00:28:29,668 ఇది ఎందుకనో కాస్త స్లోగా ఉంది. 478 00:28:37,676 --> 00:28:40,179 -లేదు. కార్డును పూర్తిగా వాడేసినట్టున్నావు. -నేనేం పూర్తిగా వాడలేదు. 479 00:28:43,599 --> 00:28:45,851 -నేను వాడేశానులే. -నీ దగ్గర మరో కార్డు ఉందా? 480 00:28:45,934 --> 00:28:49,229 ఉంది, కానీ దాన్ని ఎప్పుడూ వాడలేదు. 481 00:28:50,522 --> 00:28:52,107 ఎందుకంటే, ఒకటి పూర్తిగా వాడేశాను, 482 00:28:52,191 --> 00:28:54,401 కాబట్టి దీన్ని మొదలు పెట్టా, దీనిపై వడ్డీ రేటు తక్కువని. 483 00:28:54,484 --> 00:28:56,320 పాత కార్డుపై చేసిన రుణాన్ని నెమ్మదిగా తీరుస్తున్నా. 484 00:28:56,403 --> 00:28:59,740 అయితే మిగతా సెషన్ కి అయ్యే మొత్తానికి డబ్బు అందులో ఉంటుందిగా. 485 00:28:59,823 --> 00:29:03,577 నిజమే. ఆ కార్డును వాడకూడదని అనుకున్నాను. 486 00:29:11,126 --> 00:29:12,878 అది సరైన నిర్ణయమే, గురూ. 487 00:29:15,088 --> 00:29:16,507 -ఇది బాధాకరం. -ఏం కాదులే. 488 00:29:19,176 --> 00:29:20,302 క్షమించు. 489 00:29:21,261 --> 00:29:23,764 -దయచేసి, మళ్లీ చేద్దామా? -అలాగే, మళ్లీ చేద్దాం. 490 00:29:50,332 --> 00:29:52,209 ఇప్పుడు ఇది వినండి. 491 00:30:07,349 --> 00:30:11,228 ఇప్పుడు, ఇక్కడ, ఇది 492 00:30:11,311 --> 00:30:14,982 ఇప్పుడు, ఇక్కడ, ఇది 493 00:30:15,065 --> 00:30:17,025 ఇంకెక్కడా లేదు 494 00:30:18,652 --> 00:30:22,114 ఇప్పుడు, ఇక్కడ, ఇది 495 00:30:22,197 --> 00:30:25,784 ఇప్పుడు, ఇక్కడ, ఇది 496 00:30:25,868 --> 00:30:28,495 ఇంకెక్కడా లేదు 497 00:30:35,627 --> 00:30:38,213 -సమయం -సమయం 498 00:30:39,256 --> 00:30:40,591 సమయం 499 00:30:42,593 --> 00:30:43,886 సరే, సరే... 500 00:30:43,969 --> 00:30:46,847 ఇప్పుడు, ఇక్కడ, ఇది 501 00:31:09,786 --> 00:31:11,622 ఇప్పుడు ఇది వినండి. 502 00:31:12,456 --> 00:31:15,292 ఇప్పుడు, ఇక్కడ, ఇది 503 00:31:15,876 --> 00:31:19,796 మనం ఎన్నటికీ విరమించుకోబోమన్న విషయం వాళ్లు గ్రహించకపోవడం సాధ్యమైనా? 504 00:31:19,880 --> 00:31:21,632 ఇప్పుడు వినండి దీన్ని 505 00:31:21,715 --> 00:31:23,383 మనం విరమించుకోం... మనం విరమించుకోం... 506 00:31:23,467 --> 00:31:25,344 ఇప్పుడు, ఇక్కడ 507 00:31:27,012 --> 00:31:29,681 ఇప్పుడు, ఇక్కడ, ఇది 508 00:31:30,265 --> 00:31:34,019 మనకు నిర్దేశించిన లక్ష్యం మన శక్తికి మించినదేం కాదు. 509 00:31:34,102 --> 00:31:35,938 మరెక్కడా లేదు 510 00:31:36,021 --> 00:31:37,731 మనం ఇక్కడ కలసికట్టుగా ఉన్నాం. 511 00:31:37,814 --> 00:31:39,483 ఇప్పుడు, ఇక్కడ 512 00:31:41,693 --> 00:31:44,947 ఇప్పుడు, ఇక్కడ, ఇది 513 00:31:45,030 --> 00:31:48,158 ఇప్పుడు, ఇక్కడ, ఇది 514 00:31:48,242 --> 00:31:50,536 మరెక్కడా లేదు 515 00:31:52,204 --> 00:31:54,873 ఇప్పుడు, ఇక్కడ, ఇది 516 00:31:55,874 --> 00:31:58,377 ఇప్పుడు, ఇక్కడ, ఇది 517 00:31:58,919 --> 00:32:01,255 -ఇప్పుడు చూడండి. -ఇప్పుడు వినండి దీన్ని 518 00:32:08,136 --> 00:32:10,180 ఇప్పుడు ఇది వినండి. 519 00:32:10,264 --> 00:32:12,808 ఇప్పుడు ఇది వినండి. ఇప్పుడు... 520 00:32:32,119 --> 00:32:33,370 అది వింటావా? 521 00:32:33,996 --> 00:32:35,372 అవును, ఒక్క నిమిషం టైమ్ ఇవ్వు. 522 00:33:00,397 --> 00:33:02,524 -పైనుంచా? -ధన్యవాదాలు. 523 00:33:51,782 --> 00:33:53,784 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య