1 00:00:27,069 --> 00:00:29,863 అవును. కాబట్టి, అది చాలా మంచి విషయం, అంతకంటే ఇంక చెప్పడానికేమీ లేదు. 2 00:00:30,197 --> 00:00:33,742 తనకి మంచి మార్కులు వస్తున్నాయి, క్లాసులో కూడా చాలా బాగుంటుంది. 3 00:00:33,825 --> 00:00:37,579 చాలా చక్కని సందేహాలు అడుగుతుంది, తనకంటూ కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 4 00:00:37,663 --> 00:00:40,457 పెద్దయ్యాక, తను అనుకొన్న లక్ష్యాన్ని 5 00:00:40,541 --> 00:00:43,210 చేరుకోగలదని నాకు విశ్వాసం ఉంది. 6 00:00:43,710 --> 00:00:44,711 అవును. 7 00:00:45,796 --> 00:00:46,797 ఏమన్నారు? 8 00:00:47,631 --> 00:00:51,552 ఏం లేదు. ధన్యవాదాలు. మీరు చాలా మంచి మాట చెప్పారు. 9 00:00:52,344 --> 00:00:53,554 నేను నిజంగానే అంటున్నా. 10 00:00:53,637 --> 00:00:55,055 లేదు, నాకు తెలుసు మీరు నిజంగానే అంటున్నారని. 11 00:00:57,474 --> 00:01:00,602 -సరే. ఏమైనా అడగాలనుకుంటున్నారా... -నేను... 12 00:01:00,686 --> 00:01:02,312 నేను కూడా తనలాగానే ఉండేదాన్ని. 13 00:01:03,856 --> 00:01:06,149 -అంతేలెండి. -అవును. 14 00:01:06,233 --> 00:01:09,695 ఓరి దేవుడా. నాకు 11 ఏళ్ళప్పుడు నాకు కూడా అన్నీ ఏ గ్రేడ్లే వచ్చేవి. 15 00:01:09,778 --> 00:01:11,280 -మంచిది. -ఓరి దేవుడా. 16 00:01:11,363 --> 00:01:13,574 ఇక అయిదవ తరగతిలో? మ్యాథ్స్ లో నేనే పిస్తాని. 17 00:01:13,657 --> 00:01:16,869 -మ్యాథ్స్ లో నూటికి నూరు, అంతే. -అది చాలా గొప్ప విషయం. 18 00:01:16,952 --> 00:01:20,247 అంటే, దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ అప్పుడు బాగా అనిపించేది. 19 00:01:21,915 --> 00:01:24,418 అందరూ మీరు ఇప్పుడు చెప్పిందే చెప్పేవారు. 20 00:01:24,501 --> 00:01:28,338 "తను చాలా తెలివైనది. బుర్ర పెట్టిందంటే తను ఏదైనా చేయగలదు," లాంటివి అనేవారు. 21 00:01:29,256 --> 00:01:30,883 దాని వల్ల నాకు ఒరిగిందేంటి? 22 00:01:33,427 --> 00:01:34,636 మీరు ఫోన్ మాట్లాడాలా? 23 00:01:34,720 --> 00:01:37,181 -లేదు, అదేం లేదు. -అయ్యో, పర్వాలేదు. మరేం పర్వాలేదు. 24 00:01:37,681 --> 00:01:40,100 నాకు కూడా వేరే పని ఉంది. కాబట్టి మీరు ఆ ఫోన్ సంగతి చూసుకోండి. 25 00:01:40,184 --> 00:01:42,311 -మీకు ధన్యవాదాలు. ఏం పర్వాలేదు. -నాకేం పర్వాలేదండి. మనం... 26 00:01:42,394 --> 00:01:44,563 పర్వాలేదులెండి. మీరు సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. 27 00:01:45,063 --> 00:01:46,440 సరే. ధన్యవాదాలు. 28 00:01:46,523 --> 00:01:48,317 -బై. -బై బై. 29 00:02:13,258 --> 00:02:15,719 ఓయ్. నువ్వు కాస్త మీ నాన్నతో మాట్లాడతావా? 30 00:02:15,802 --> 00:02:17,846 -నీకు కాల్ చేశాడా? -నాకు కాల్స్ చేస్తూనే ఉన్నాడు, బాసూ. 31 00:02:17,930 --> 00:02:20,641 -ఆయనకి నీ నంబర్ ఇవ్వవద్దని చెప్పా కదా. -ఏంటి పదేళ్ల క్రితమా? 32 00:02:20,724 --> 00:02:22,601 -ఇప్పుడు నన్నేం చేయమంటావు? -ఫోన్ ఎత్తకు. 33 00:02:22,684 --> 00:02:25,437 -బాసూ, ఆయన కాల్ చేయడం ఆపడు. -ఫోన్ ను ఆఫ్ చేసేయ్. 34 00:02:26,396 --> 00:02:28,690 నాకో కూతురు ఉంది, బాసూ. నేను ఫోన్ ని ఆఫ్ చేయలేను. 35 00:02:28,774 --> 00:02:31,568 -నువ్వు... ఆయనే చేసీ చేసీ ఆపేస్తాడులే. -దయచేసి ఫోన్ మాట్లాడు. 36 00:02:31,652 --> 00:02:35,072 -నేను మాట్లాడలేను. ఫోన్ ఎత్తవద్దు. -నేను ఫోన్ ఎత్తుతాను. ఎత్తుతున్నాను. 37 00:02:35,155 --> 00:02:36,698 హాయ్, ఆర్టీ. హేయ్. ఎలా ఉన్నారు? 38 00:02:38,408 --> 00:02:40,118 హలో? విక్టర్? 39 00:02:40,202 --> 00:02:41,203 హాయ్, నాన్నా. 40 00:02:41,912 --> 00:02:44,373 జోష్, దేవుడా. హమ్మయ్యా. 41 00:02:44,456 --> 00:02:47,000 నువ్వు అర్థరాత్రి విక్టర్ కి కాల్ చేస్తే ఎలా? 42 00:02:47,084 --> 00:02:50,462 నాకు గుండె పోటు వస్తోంది. నా మాట వినబడుతోందా? 43 00:02:51,880 --> 00:02:53,298 అబ్బా, దయచేసి విను. నాకు భయంగా ఉంది. 44 00:02:53,382 --> 00:02:54,508 నీకు బాగానే ఉన్నట్టుందే. 45 00:02:55,259 --> 00:02:57,803 -నేను ఆసుపత్రికి వెళ్లాలి. -అయితే వెళ్లు. 46 00:02:58,762 --> 00:03:02,015 -నా దగ్గర కారు లేదు. -ఇంతకు ముందు నీ దగ్గర ఉండిందే. 47 00:03:02,891 --> 00:03:05,394 అవును. కానీ, అదెప్పుడో కదా? 48 00:03:05,894 --> 00:03:09,606 చూడు. నీకు నిజంగా గుండెపోటు వస్తే, నువ్వు 911కి కాల్ చేయాలి. 49 00:03:10,107 --> 00:03:11,692 లేదు, వాళ్లు ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. 50 00:03:11,775 --> 00:03:14,486 దేవుడా, నేను ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నావా? కాదు. 51 00:03:14,570 --> 00:03:17,239 రాత్రి 7:30 నుండి నా ఎడమ చేయి పని చేయడం లేదు. 52 00:03:17,322 --> 00:03:20,033 అప్పుడే నేను నీకు మొదటిసారిగా కాల్ చేశాను, కానీ నువ్వు ఎత్తలేదు. 53 00:03:20,117 --> 00:03:21,660 ఇంకా అది పెరుగుతూనే ఉంది, తెలుసా? 54 00:03:21,743 --> 00:03:24,288 నాకు ఛాతీ నొప్పిగా ఉంది. నాకు ఊపిరాడటం లేదు. 55 00:03:24,371 --> 00:03:27,541 నాకు కళ్లు తిరుగుతున్నాయి. దేవుడా. నాకు ఇప్పుడు కళ్లు తిరుగుతున్నాయి. 56 00:03:27,624 --> 00:03:29,835 నేను తూలుతున్నాను. తూలుతున్నాను. తూలుతున్నాను. 57 00:03:29,918 --> 00:03:34,214 ఓరి దేవుడా. తూలుతున్నాను. తూలుతున్నాను. నేను తూలుతున్నాను. 58 00:03:46,894 --> 00:03:47,978 దేవుడా. 59 00:03:49,021 --> 00:03:51,315 -వెనక ఎక్కు. -ఏంటి? 60 00:03:51,398 --> 00:03:53,233 కరోనా ఉంది. నీకు కనీసం మాస్క్ కూడా లేదు. 61 00:03:53,317 --> 00:03:54,693 -వెనక ఎక్కు. -సరే. 62 00:04:00,782 --> 00:04:04,161 -ఇల్లు బాగుంది. -నువ్వు కాస్త కారు నడుపుతావా? 63 00:04:10,083 --> 00:04:12,336 నువ్వు నా పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నావే. 64 00:04:12,419 --> 00:04:13,420 ఏంటి? 65 00:04:13,504 --> 00:04:15,714 నా పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నావు నువ్వు అని అన్నాను. 66 00:04:17,257 --> 00:04:21,512 -నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవ్వడంలేదు. -నాకు కలెక్షన్ ఏజెంట్ కాల్ చేశాడు. 67 00:04:21,595 --> 00:04:23,222 అవన్నీ ఉత్త స్కామ్లు అంతే. 68 00:04:23,305 --> 00:04:25,807 శాంటా మోనికాలోని చేజ్ జేయ్స్ లో ఆ కార్డు వాడారని చెప్పారు. 69 00:04:25,891 --> 00:04:28,685 -జేయ్స్ కి చాలా మంది పోతుంటారు. -అక్కడికి నేను వెళ్లను, నువ్వు వెళ్తావు. 70 00:04:28,769 --> 00:04:31,104 అయితే ఏంటి? మీ నాన్న ఎక్కడ తింటాడో వాళ్లు తెలుసుకొని ఉంటారు. 71 00:04:31,188 --> 00:04:32,773 అది కనుక్కోవడం పెద్ద కష్టం కాదులే. 72 00:04:33,482 --> 00:04:35,776 కావాలంటే వాళ్ళ నాన్న ఎక్కడ తింటాడో కూడా నేను నీకు చెప్పగలను. 73 00:04:35,859 --> 00:04:38,695 రేపటి ఉదయం దాకా ఆగు. నీకు ఆ విషయం చెప్తాను. 74 00:04:40,614 --> 00:04:42,741 కొంపదీసి నువ్వు వాళ్లకి నీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇచ్చావా ఏంటి? 75 00:04:47,120 --> 00:04:48,622 ఈస్ట్ హాలీవుడ్ హాస్పిటల్ ఆంబులెన్స్ 76 00:04:51,458 --> 00:04:52,960 సరే మరి, శుభరాత్రి. 77 00:04:53,043 --> 00:04:56,547 ఏంటి? ఒక ట్యాక్సీ డ్రైవర్ లాగా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోతావా? 78 00:04:56,630 --> 00:04:58,131 అవును, నువ్వు దింపమని అడిగావు కదా. 79 00:04:58,215 --> 00:05:00,634 -అవును. -కాబట్టి వెళ్లు. 80 00:05:00,717 --> 00:05:02,302 నువ్వు నాతో రావా? 81 00:05:02,386 --> 00:05:04,680 లేదు. ఈ పరిస్థితుల్లో నేను నీతో ఒక ఆసుపత్రిలోకి రాలేను. 82 00:05:04,763 --> 00:05:06,723 అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుస్తోందా? 83 00:05:06,807 --> 00:05:09,434 సరే. నువ్వు రాకపోతే, నేను కూడా వెళ్లను. 84 00:05:09,518 --> 00:05:12,479 -నువ్వు ఖచ్చితంగా వెళ్లాలి. -ఎందుకు? దాని వల్ల ఏ లాభమూ ఉండదు. 85 00:05:12,563 --> 00:05:15,190 -గుండెపోటు ఉంటే ఎందుకు లాభముండదు? -ఖచ్చితంగా ఉండాల్సిన పని లేదు. 86 00:05:15,274 --> 00:05:17,568 సరే. అయితే, నీకు గుండె పోటు రాలేదని అంటున్నావన్నమాట. 87 00:05:17,651 --> 00:05:21,071 కాదు. గుండెపోటు వచ్చింది. కానీ ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటా. 88 00:05:22,030 --> 00:05:25,450 ఏంటి, అదేమైనా చెడు విషయమా? నేను ఇప్పుడు చచ్చిపోయినా నీకు పర్వాలేదా? 89 00:05:25,534 --> 00:05:28,829 ఇంతకుముందు భయంకరమైన లక్షణాలు వచ్చాయి. కానీ దేవుని దయ వల్ల అవి తగ్గుతున్నాయి. 90 00:05:28,912 --> 00:05:30,289 కాబట్టి వెళ్లి ఒక డ్రింక్ తాగుదాం పద. 91 00:05:30,998 --> 00:05:31,999 -దిగు. -రావయ్యా. 92 00:05:32,082 --> 00:05:33,625 -నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? -ఇంటికి వెళ్తున్నా. 93 00:05:33,709 --> 00:05:36,545 -ఇంటికి వెళ్లి ఏం చేస్తావు? -పడుకుంటా. అర్థరాత్రి రెండు అయింది. 94 00:05:36,628 --> 00:05:39,423 నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్లినా, ఈ సమయంలో నీకు నిద్ర పట్టదు. 95 00:05:39,506 --> 00:05:40,674 రా. ఒక డ్రింక్ తాగి వెళ్లిపోదాం. 96 00:05:40,757 --> 00:05:44,011 -ఇప్పుడు బార్లు మూసేసుంటాయి. -నాకు ఒక బార్ తెలుసు. అది... 97 00:05:44,094 --> 00:05:47,181 నేను తాగుడు మానేశానని నీకు తెలుసు కదా? చివరిసారిగా 13 ఏళ్ళ వయస్సులో తాగానంతే. 98 00:05:47,264 --> 00:05:48,640 అది నీకు గుర్తు లేదా? 99 00:05:50,475 --> 00:05:52,811 సరే, అలాగే. కనీసం కాఫీ అయినా తాగుదాం పద. 100 00:05:52,895 --> 00:05:56,231 -ఇప్పుడన్నీ మూసేసుంటాయి, నాన్నా. -అయితే మెక్ డొనాల్డ్స్ కి వెళ్దాం. 101 00:05:56,315 --> 00:05:58,358 నేను మెక్ డొనాల్డ్స్ లోపలికి వెళ్లే ప్రసక్తే లేదు. 102 00:06:00,736 --> 00:06:01,945 మెక్ కఫే 103 00:06:02,988 --> 00:06:05,699 ఒక్కటి తీసుకోరాదూ? నీకోసమే తెచ్చాను. 104 00:06:05,782 --> 00:06:06,825 నాకు వద్దు. 105 00:06:06,909 --> 00:06:09,661 సరే. నువ్వు మనస్సు మార్చుకొనే అవకాశముందేమో, 106 00:06:09,745 --> 00:06:11,288 నేను ఒకటి తాగుతానులే. 107 00:06:11,788 --> 00:06:13,874 -నా మనస్సు మారదు. -సరే. 108 00:06:16,543 --> 00:06:19,671 వావ్. ఇప్పుడు ఈ రెండూ నేనే తాగేస్తానులే. 109 00:06:19,755 --> 00:06:22,007 -నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. -సరే. 110 00:06:24,051 --> 00:06:27,012 మరి... ఎలా ఉన్నావు నువ్వు? 111 00:06:27,513 --> 00:06:29,431 బాగున్నా. నువ్వేలా ఉన్నావు? 112 00:06:29,515 --> 00:06:31,892 దానికి ఏమని సమాధానం చెప్పమంటావు? 113 00:06:31,975 --> 00:06:35,812 నిజంగానే తెలుసుకోవాలని అడుగుతున్నావా, లేక ఊరికే అడగాలని అడుగుతున్నావా? 114 00:06:36,730 --> 00:06:39,399 -ఈ మధ్య ఏం చేస్తున్నావేంటి? -నీకెందుకు? 115 00:06:39,900 --> 00:06:43,612 నువ్వెలా ఉన్నావో నాకు నిజంగా తెలుసుకోవాలనుంది కనుక అడుగుతున్నా. 116 00:06:43,695 --> 00:06:47,324 నా గురించి తెలుసుకోవాలని నీకు ఉండకపోవచ్చు, కానీ నేను చాదస్తపు ముసలివాడిని కదా. 117 00:06:47,407 --> 00:06:50,118 నువ్వు కుర్రోడివి. నీ జీవితంలో చాలా విషయాలు జరుగుతూ ఉండాలి. 118 00:06:50,202 --> 00:06:52,538 నిన్ను నిరాశపరుస్తున్నందుకు మన్నించు. 119 00:06:53,038 --> 00:06:55,249 -ఏమంటున్నావు. నువ్వు ఎప్పుడూ... -అసలు నీకేం కావాలి? 120 00:06:55,916 --> 00:06:58,460 నాకేమీ వద్దు. నాకు నీ గురించి తెలుసుకోవాలనుందంతే. 121 00:06:58,544 --> 00:07:01,421 నాకు నీ జీవితం ఎలా సాగుతుందో, నీ మనస్సులో ఏముందో తెలుసుకోవాలనుంది. 122 00:07:01,505 --> 00:07:03,841 నువ్వు నా కొడుకువి కదా. నాకు అన్ని విషయాలూ తెలుసుకోవాలనుంది. 123 00:07:05,300 --> 00:07:09,137 కానివ్వు. దేని గురించి ఆయినా మాట్లాడుకుందాం. ఇవాళ ఏం చేశావు? 124 00:07:09,221 --> 00:07:10,931 అందరిలాగానే ఇంట్లో బ్రెడ్ చేసుకుంటున్నావా? 125 00:07:11,014 --> 00:07:13,642 ఈ సమయంలో ఎవరిని అడిగినా, ఇంట్లో బ్రెడ్ చేసుకుంటున్నామన్నారు. 126 00:07:13,725 --> 00:07:16,562 అందరికీ ఈస్ట్ కావాలి, కానీ అది తెచ్చుకొనే సదుపాయం లేదు. 127 00:07:16,645 --> 00:07:18,230 నీకు ఈస్ట్ దొరుకుతోందా? 128 00:07:18,313 --> 00:07:20,566 లేదు. ఉద్యోగం చేసుకుంటున్నానంతే. 129 00:07:20,649 --> 00:07:23,777 -పనులు దొరుకుతున్నాయా? స్కైప్లోనా... -పనులు కాదు. నేను ఉద్యోగం చేస్తున్నా. 130 00:07:23,861 --> 00:07:26,738 అవునులే, బతుకునీడ్చటం కోసం పనిచేసేటప్పుడు కష్టపడాల్సి వస్తుందిలే. 131 00:07:27,239 --> 00:07:28,323 నేను టీచర్ గా పనిచేస్తున్నా. 132 00:07:28,407 --> 00:07:30,742 సరే. అలాగే. అంటే ఎలా? ప్రవైట్ గా ట్యూషన్లు చెప్తున్నావా? 133 00:07:30,826 --> 00:07:33,787 నేను అయిదవ తరగతికి పాఠాలు చెప్తున్నా. వాన్ నయ్స్ వెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ లో. 134 00:07:39,668 --> 00:07:42,880 ఒక్క నిమిషం, నువ్వు... నువ్వు స్కూల్ లో పాఠాలు చెప్తున్నావా? 135 00:07:42,963 --> 00:07:45,841 అవును. ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు అనుకో, కానీ అవును. 136 00:07:46,425 --> 00:07:49,386 -నీకు అర్హత కావాలి కదా? -నాకు టీచింగ్ డిగ్రీ ఉంది. 137 00:07:49,469 --> 00:07:50,637 దేవుడా. 138 00:07:53,223 --> 00:07:57,019 మరి, ఎలా ఉంది నీ టిచింగ్ పని? 139 00:08:00,272 --> 00:08:01,273 నాకు చాలా నచ్చింది. 140 00:08:01,356 --> 00:08:04,568 అది చాలా గొప్ప విషయం. నాకు నిజంగా నీ మీద చాలా గర్వంగా ఉంది. 141 00:08:04,651 --> 00:08:07,571 అంటే, నువ్వు నాకు ఇవాళ ఆనందం కలిగించావు. చాలా ఆనందం కలిగించావు. 142 00:08:07,654 --> 00:08:10,407 నీకు... నీకు ఏ పనంటే ఇష్టమో, దాన్నే చేస్తున్నావు కదా. 143 00:08:10,490 --> 00:08:13,827 ఇంకేం కావాలి? నువ్వు పాఠాలు చెప్తున్నావు. పిల్లలను తీర్చిదిద్దుతున్నావు. 144 00:08:13,911 --> 00:08:16,246 నీ పక్కన ఉన్నందుకే నేను గొప్పవాడిగా ఫీల్ అయిపోతున్నాను. 145 00:08:16,330 --> 00:08:19,541 అందరికీ కాల్ చేసి, నా కొడుకు టీచర్ అని గొప్పగా చెప్పుకోవాలనుంది. 146 00:08:19,625 --> 00:08:20,626 సరే. 147 00:08:22,628 --> 00:08:24,671 ఏదేమైనా, నువ్వు చేసే ఉద్యోగం చాలా గొప్పదని నా అభిప్రాయం. 148 00:08:24,755 --> 00:08:26,340 -నిజంగానే అంటున్నా. -ధన్యవాదాలు మరి. 149 00:08:29,551 --> 00:08:30,969 మరి నువ్వేం చేస్తున్నావు? 150 00:08:31,720 --> 00:08:32,971 నేనా? నీకు తెలిసిందే కదా. 151 00:08:33,639 --> 00:08:36,850 నేను... నిజానికి చదవడం ఎక్కువగా చేస్తున్నాను. 152 00:08:36,933 --> 00:08:39,561 టీవీని ఆఫ్ చేసి, ఏదైనా పుస్తకాన్ని తెరుస్తున్నాను. 153 00:08:39,645 --> 00:08:41,980 -"క్రైమ్ అండ్ పనిష్మెంట్" చదివావా? -లేదు. 154 00:08:42,063 --> 00:08:44,441 చాలా మంచి పుస్తకం. అంతా రష్యానే తలపిస్తుంది. 155 00:08:44,525 --> 00:08:47,361 అందులోని కథాంశం ఏంటంటే, ఒకడు ఒక పెద్దావిడని హత్య చేస్తాడు, 156 00:08:47,444 --> 00:08:48,862 కానీ అది డబ్బు కోసం చేయడు. 157 00:08:48,946 --> 00:08:51,323 ఆమెని చంపడానికి అతనికి కారణమేమీ ఉండదు. 158 00:08:51,406 --> 00:08:53,909 కానీ, ఎందుకు చంపాడో మనకి అర్థమవుతుంది. 159 00:08:53,992 --> 00:08:57,329 అతని మానసిక స్థితి దిగజారుతోంది, మన పరిస్థితిలానే అనిపిస్తుందన్నమాట, 160 00:08:57,412 --> 00:09:00,040 -ఎందుకంటే అతనికి మాట్లాడటానికి ఎవరూ... -అసలు మనమేం చేస్తున్నాం? 161 00:09:00,541 --> 00:09:03,418 ఏంటి... నేను మాట్లాడుతున్నా. మనం మళ్లీ మాట్లాడుకుంటున్నాం. 162 00:09:03,502 --> 00:09:07,256 -కానీ మనం ఏదో సోది మాట్లాడుకుంటున్నాం. -సరే. నీకు దేని గురించి మాట్లాడాలనుంది? 163 00:09:07,339 --> 00:09:08,757 ఓ విషయం చెప్పనా? మనం... 164 00:09:08,841 --> 00:09:10,884 -నేను ఇక వెనక్కి వెళ్తాను. -బెత్ ఎలా ఉంది? 165 00:09:12,803 --> 00:09:15,013 -పిల్లలు ఎలా ఉన్నారు? -వాళ్లు బాగున్నారు. 166 00:09:15,097 --> 00:09:18,433 -నేను వాళ్లని ఎప్పుడో కలుస్తుంటాను. -నా కంటే మేలే కదా. 167 00:09:18,517 --> 00:09:22,980 నేనింకా చిన్నదాన్ని చూడను కూడా లేదు. సారా, అదే కదా తన పేరు? 168 00:09:23,063 --> 00:09:26,024 -అవును. -ఇది నీకు చెప్పాల్సిన పని లేదు, 169 00:09:26,108 --> 00:09:27,818 కానీ నాకు మనవరాలు ఉండి కూడా 170 00:09:27,901 --> 00:09:30,320 తనని చూడనివ్వకపోవడం వలన నాకు చాలా బాధ కలుగుతోంది. 171 00:09:30,404 --> 00:09:33,574 ఎందుకో నీకేమైనా తెలుసా? ఎందుకంటే, నాకేమీ అర్థమవ్వడం లేదు. 172 00:09:33,657 --> 00:09:36,159 అంటే, నీ సోదరి మరీ అతిగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది, 173 00:09:36,243 --> 00:09:38,203 కానీ ఇది అంతకు మించిన విషయం. 174 00:09:38,287 --> 00:09:41,623 నేను క్రీడామైదానంగా అప్పుడప్పుడూ ఆలస్యంగా వచ్చేవాడినే, కానీ హఠాత్తుగా... 175 00:09:41,707 --> 00:09:45,377 ఆలస్యంగా రావడం సమస్య కాదు. నువ్వు మత్తులో ఉన్నావు. డేవిడ్ ని జారవిడిచేశావు. 176 00:09:45,460 --> 00:09:48,130 -ఏంటి? నేనేమీ ఆరోజు మత్తులో లేను. -నేను కూడా అక్కడే ఉన్నాను. 177 00:09:48,213 --> 00:09:50,966 -నీకు నేను మత్తులో ఉన్నానని అనిపించిందంతే. -నువ్వు బాగా మత్తులో ఉన్నావు. 178 00:09:51,049 --> 00:09:53,093 -నేను చెప్పేది నువ్వు వినడం లేదు. -ఏం వినడం లేదంటావు? 179 00:09:53,177 --> 00:09:56,013 నేను ఇంకో పిల్లాడిని కింద పడకుండా కాపాడే ప్రయత్నంలో ఉన్నాను. 180 00:09:56,096 --> 00:09:58,599 నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే, నేను పనికిమాలిన వాడిని 181 00:09:58,682 --> 00:10:00,976 కావడానికి ఈ కథ బాగా సరిపోతుంది కాబట్టి. 182 00:10:01,059 --> 00:10:04,521 కానీ అదేంటో కానీ, దానిపైకి ఇంకో పిల్లాడు కూడా ఎక్కుతూ ఉన్నాడు, 183 00:10:04,605 --> 00:10:08,317 వాడి తల్లిదండ్రులు ఎక్కడా కనబడలేదు. బహుశా ఫోన్లకు అతుక్కుపోయున్నారేమో. 184 00:10:08,400 --> 00:10:11,403 నేను తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేదు. ఆ పిల్లాడు జారిపడే దశలో ఉన్నాడు, సరేనా? 185 00:10:11,486 --> 00:10:13,614 ఎలాగో కష్టపడి అతను పడకుండా నేను ఒక చేత్తో ఆపగలిగాను. 186 00:10:13,697 --> 00:10:16,658 నేను ఆ పనే చేసి ఉండకపోతే, ఆ పిల్లాడి మెడ విరిగి ఉండేది. 187 00:10:16,742 --> 00:10:19,494 డేవిడ్ నుండి నేను ఒక చేయి తీసేసిన మాట వాస్తవమే. 188 00:10:19,578 --> 00:10:23,081 అతను జారి తన వీపు మీద నేలపై పడిన మాట కూడా వాస్తవమే. 189 00:10:23,165 --> 00:10:24,917 కానీ అతనికి గాయాలేమీ కాలేదు, అతను భయపడ్డాడు అంతే. 190 00:10:25,000 --> 00:10:28,170 కానీ దీని ద్వారా అందరూ నన్నో సన్నాసి అని తేల్చేశారు. 191 00:10:30,714 --> 00:10:32,466 ఆ నిర్ణయం చేతుల్లో ఉండేది కాదు. 192 00:10:34,718 --> 00:10:37,471 నీ సపోర్ట్ కి ధన్యవాదాలు. 193 00:10:38,931 --> 00:10:42,476 ఏదేమైనా, డేవిడ్ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాడు చిన్నప్పట్నుండీ అతే. 194 00:10:43,936 --> 00:10:45,229 సారా ఎలా ఉంటుంది? 195 00:10:48,440 --> 00:10:51,818 తను అస్సలు డేవిడ్ లా కాదు. చాలా బాగుంటుంది. 196 00:10:53,028 --> 00:10:54,738 హమ్మయ్య. 197 00:10:54,821 --> 00:10:56,615 అయితే తన గురించి చెప్పు. 198 00:10:56,698 --> 00:10:58,867 -ఇప్పుడు తన వయస్సెంత? -అయిదేళ్లు. 199 00:11:00,744 --> 00:11:01,745 ఓరి దేవుడా. 200 00:11:14,967 --> 00:11:15,968 తను... 201 00:11:18,262 --> 00:11:21,056 తనకి సన్నని శబ్దాలంటే ఇష్టం. 202 00:11:22,307 --> 00:11:25,102 మాకు ఎప్పుడైనా ఏకాంతం దొరికినప్పుడు, మేము ఇద్దరమూ 203 00:11:25,185 --> 00:11:26,520 ఊరికే అలా పెరట్లో కూర్చొన్నప్పుడు, 204 00:11:26,603 --> 00:11:31,233 మేము ఊరికే అలా గాలి శబ్దాన్ని, గుడ్లగూబల అరుపులను వింటుంటాం. 205 00:11:31,316 --> 00:11:33,819 ఏం విన్నామో ఒకరికొకరం చెప్పుకుంటాం. 206 00:11:33,902 --> 00:11:39,491 మేం చాలా మెల్లగా మాట్లాడుకుంటాం. మాలో ఎవరు మెల్లగా మాట్లాడతారో పోటీలాగా. 207 00:11:39,575 --> 00:11:41,869 -అలా చేస్తుంటాం అన్నమాట. -అవును. అదేలే. 208 00:11:41,952 --> 00:11:45,038 -మనిద్దరం అదే చేసేవాళ్ళం. -మనం ఏం చేసేవాళ్లం? 209 00:11:45,539 --> 00:11:49,042 ఎవరు మెల్లగా మాట్లాడతారో పోటీ పడేవాళ్ళం. మనం ఆడిన ఆటల్లో అది కూడా ఒకటి. 210 00:11:50,002 --> 00:11:52,963 -లేదు, ఆ ఆట మనం ఎప్పుడూ ఆడలేదు. -మనం ఆడాం. 211 00:11:53,046 --> 00:11:55,716 -జోకులేస్తున్నావా? నీకు గుర్తు లేదా? -లేదు. 212 00:11:57,926 --> 00:12:00,012 నువ్వు అప్పుడు చాలా చిన్నవాడివి. నీకూ సారా అంత వయస్సే ఉంటుంది. 213 00:12:00,095 --> 00:12:02,389 తను పెద్దయ్యాక నీతో ఆ ఆట ఆడినట్టు 214 00:12:02,472 --> 00:12:04,933 -తనకి కూడా గుర్తుండకపోవచ్చు. -తనకి గుర్తుంటుంది. 215 00:12:07,060 --> 00:12:09,646 ఇది న్యాయమైంది కాదు. ఇది కామెడీగా ఉంది. 216 00:12:09,730 --> 00:12:12,441 అంటే, మనిద్దరం, నీ చిన్నప్పుడు, నిజంగానే 217 00:12:12,524 --> 00:12:14,401 గుసగుసలాడుకొనేవాళ్లం. 218 00:12:14,484 --> 00:12:18,238 -ఎవరు మెల్లగా మాట్లాడితే వారు గెలిచినట్లు. -మన్నించాలి, నాకు అది గుర్తులేదు. 219 00:12:22,534 --> 00:12:24,119 నాకు ఏం చెప్పాలో అర్థమవ్వడం లేదు. 220 00:12:25,370 --> 00:12:26,705 నా మనస్సు విరిగిపోయింది. 221 00:12:33,629 --> 00:12:37,049 మనం కలిసి చేసిన చాలా విషయాలు కూడా నీకు గుర్తుండకపోవచ్చు. 222 00:12:38,967 --> 00:12:42,012 నేను ఒకరోజు రాత్రి ట్రూబడూర్ ఆడాను, అది నీకు గుర్తుందా? 223 00:12:42,095 --> 00:12:43,388 దాని గురించి నువ్వు చాలాసార్లు చెప్పేవాడివి. 224 00:12:43,472 --> 00:12:46,725 లేదు, వినడం ద్వారా కాదు. అప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు. 225 00:12:46,808 --> 00:12:50,771 -అవును, నాకు తెలుసు. ఫోటో చూశాను. -ఫోటో చూసి కాదు. నీకు అది గుర్తులేదా? 226 00:12:52,898 --> 00:12:54,983 గుర్తలేదనుకుంటా. అది చెప్పడం కష్టం. నేను చిన్నవాడిని. 227 00:12:55,067 --> 00:12:57,986 నీకు కూడా రావాలని చాలా ఉండింది. అదయినా గుర్తుందా? 228 00:12:58,904 --> 00:13:03,033 నేను బయలుదేరుతున్నాను, నువ్వు కూడా వస్తావని బాగా మారాం చేశావు. 229 00:13:03,116 --> 00:13:06,453 "నా కొడుకు కూడా ట్రూబడూర్ ఆడాలి," అని రూత్ తో ఉన్నాను. 230 00:13:06,537 --> 00:13:09,957 నువ్వు చాలా చిన్నవాడివని తను అంది. అప్పటికి నువ్వు పడుకొని ఉన్నావు... 231 00:13:10,958 --> 00:13:12,709 "సరే, నేను ఈ విషయంలో వాదులాడాలనుకోవడం లేదు. 232 00:13:12,793 --> 00:13:14,920 ఇది నా కళాత్మక జీవితంలో చాలా మంచి ముహూర్తం. 233 00:13:15,003 --> 00:13:16,880 ఇక్కడ కూర్చొని నేను వాదులాడలేను," అని నేను అన్నాను. 234 00:13:16,964 --> 00:13:20,467 అందుకని నేను బయటకు వచ్చి, కారులో కూర్చున్నాను. 235 00:13:20,551 --> 00:13:24,221 తనకు నేను వెళ్లడం వినబడాలని సందు చివరి దాకా వెళ్లాను. 236 00:13:24,304 --> 00:13:28,183 నేను కారు దిగేసి, మళ్లీ ఇంటికి వచ్చాను. 237 00:13:28,267 --> 00:13:31,103 నీ పడక గది కిటికీ గుండా వచ్చి, నిన్ను ఎత్తుకెళ్ళాను. 238 00:13:31,186 --> 00:13:35,107 నిన్ను అలా ఎత్తుకెళ్లాను కాబట్టే ఆ ఫోటోలో నువ్వు నైట్ డ్రెస్ లో ఉన్నావు. 239 00:13:36,358 --> 00:13:38,735 కదా? మనిద్దరం కారు ఎక్కి, 240 00:13:38,819 --> 00:13:43,240 కోల్డ్ వాటర్ కాన్యన్ మీదుగా ఇద్దరమే హాలీవుడ్ కి వెళ్లాం. 241 00:13:46,034 --> 00:13:47,536 నీకు అది గుర్తుందా? 242 00:13:48,996 --> 00:13:51,999 -గుర్తుండవచ్చు. -కానివ్వు, ప్రయత్నించు. 243 00:13:54,209 --> 00:13:57,504 చెప్పడం కష్టం. నాకు గుర్తు రావచ్చేమో. 244 00:13:58,547 --> 00:14:02,759 అది నా జీవితంలోని అత్యంత మధురమైన జ్ఞాపకం. నేనేం అతిగా చెప్పడం లేదు. నిజమే. 245 00:14:03,552 --> 00:14:07,389 కార్లో ముందు సీట్లో నిన్ను కూర్చోబెట్టుకొని ట్రూబడూర్ కి వెళ్లడం. 246 00:14:07,472 --> 00:14:10,726 ఈరోజు దాకా కూడా నేను ఆ క్షణాన్ని తలుచుకొనే ఆనందపడతాను, ఎందుకంటే, 247 00:14:10,809 --> 00:14:15,230 ఆ షో... అదేమంత నిరాశాజనకమైన షో కాదు. 248 00:14:15,314 --> 00:14:17,941 అలా అని పెద్ద గొప్ప షో కూడా కాదు. 249 00:14:18,025 --> 00:14:21,195 హౌస్ ఫుల్ ఏమీ కాలేదు. అది మంగళవారం రాత్రి. 250 00:14:21,278 --> 00:14:23,655 జనాలందరూ ట్రెండ్ ని ఫాలో అవుతామనే చెత్త ఆలోచనతో ఉన్నారు, 251 00:14:23,739 --> 00:14:25,949 ఒక మంచి సాహిత్యాన్ని కూడా అభినందించలేని 252 00:14:26,033 --> 00:14:27,951 రాక్ అండ్ రోల్ పిస్తాలమని భావించారు. 253 00:14:28,035 --> 00:14:32,331 మనం తళుకుబెళుకుల డ్రెస్ వేసుకొని పెద్దపెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టుకొని, 254 00:14:32,414 --> 00:14:35,459 రాకింగ్ బాయ్, షేకింగ్ శ్యామ్ లాంటి పేర్లతో ఉండి, 255 00:14:35,542 --> 00:14:39,796 పొడవాడి జుట్టుతో హెయిర్ బ్యాండ్ ఉంటే తప్ప ఎవరూ కనీసం చూసేవాళ్ళు కూడా కాదు. 256 00:14:39,880 --> 00:14:44,218 అదన్నమాట నా చెత్త కెరీర్ యొక్క గాథ. 257 00:14:44,301 --> 00:14:45,302 కానీ నువ్వు... 258 00:14:46,553 --> 00:14:48,013 నువ్వు చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నావు. 259 00:14:48,096 --> 00:14:50,182 నువ్వు వేదిక పక్కనే నిలబడి ఉన్నావు, 260 00:14:50,265 --> 00:14:52,309 ఎందుకంటే ట్రూబడూర్ లో బ్యాక్ స్టేజీ లేదు. 261 00:14:52,392 --> 00:14:53,810 కనుక నువ్వు నాకు కనబడేవాడివి. 262 00:14:54,520 --> 00:14:58,649 నేను పాడేటప్పుడు, ఆ లెధర్ ప్యాంట్లు వేసుకొని వచ్చిన సన్నాసులందరూ 263 00:14:58,732 --> 00:15:01,818 తమ పాటికి తాము మాట్లాడుకుంటున్నప్పుడు నాకు చిర్రెత్తుకొచ్చిన ప్రతిసారీ, 264 00:15:02,653 --> 00:15:06,740 నేను నీవైపు చూసేవాడిని, నువ్వు నా వైపే చూస్తూ ఉండేవాడివి. 265 00:15:06,823 --> 00:15:09,910 నీ ముఖం చూస్తే చాలా స్పష్టంగా తెలిసింది అన్నమాట... 266 00:15:11,620 --> 00:15:14,623 నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావని, ఇంకా... 267 00:15:17,835 --> 00:15:22,130 కనీసం నీకు అదైనా గుర్తుందా? నేను పాడటం గుర్తుందా? 268 00:15:26,802 --> 00:15:27,803 గుర్తుంది. 269 00:15:28,345 --> 00:15:30,013 అవును, నీకు గుర్తుంది కదా? 270 00:15:32,516 --> 00:15:35,978 అంటే, నేనేమీ గొప్పగా చెప్పుకోవడం లేదు, కానీ నువ్వు పుట్టిన నాటి నుండి, 271 00:15:36,061 --> 00:15:39,147 నేను ఎప్పుడు నీకు పాడినా, నువ్వు భలే ఆలకించేవాడివి. 272 00:15:39,231 --> 00:15:43,110 నువ్వు దోగాడక ముందు నుండే గొప్ప సంగీతకారుడివి అవుతావని నాకు తెలుసు. 273 00:15:43,193 --> 00:15:45,487 నా ఉద్దేశం సంగీతరంగంలో రాణిస్తావని కాదు. నా ఉద్దేశం... 274 00:15:45,571 --> 00:15:50,534 ఒక అసలైన సంగీకారుడివి, కళాకారుడివి అవుతావని. నీలో ఆ కళ ఉంది. 275 00:15:51,493 --> 00:15:55,414 నేను నిన్ను పట్టుకొని ఇల్లంతా తిప్పుతూ నడిపించేవాడిని. 276 00:15:55,497 --> 00:15:57,583 నువ్వు చంటిపిల్లాడిగా ఉన్నప్పుడు నా పని అదే అన్నమాట. 277 00:15:57,666 --> 00:16:01,128 నువ్వేమైనా మారాం చేస్తూ, ఏడుస్తూ ఉంటే, "బుడ్డోడిని నాకు ఇవ్వు," అంటాను, 278 00:16:01,211 --> 00:16:04,840 రెండు పాటలు పాడాక, నువ్వు ఏడుపు ఆపేసేవాడివి. 279 00:16:06,175 --> 00:16:10,762 పడుకొనేటప్పుడు, రోజూ నేను నీకు పాడి వినిపించేవాడిని. ఏళ్ల తరబడి ఒకే పాటని. 280 00:16:12,097 --> 00:16:14,391 అది నీకు గుర్తుంది కదా? 281 00:16:16,894 --> 00:16:18,478 నీకు ఆ పాట గుర్తుందా? 282 00:16:20,355 --> 00:16:22,774 -వెన్నెల నది -నాన్నా. 283 00:16:22,858 --> 00:16:24,651 నాన్నా, పాడటం ఆపుతావా? 284 00:16:24,735 --> 00:16:27,529 చాలా విశాలమైనది 285 00:16:28,238 --> 00:16:33,869 ఏదోకరోజు స్టయిల్ గా నిన్ను దాటుతాను 286 00:16:34,536 --> 00:16:41,293 కలల నిర్మాత, విషాదాల ప్రదాత 287 00:16:41,376 --> 00:16:48,175 నీ దారిలోనే నేను వెళ్తున్నా 288 00:16:48,884 --> 00:16:52,930 ఇద్దరు దేశదిమ్మరులు 289 00:16:53,013 --> 00:16:56,099 ప్రపంచాన్ని చూడటానికి బయలుదేరారు 290 00:16:56,183 --> 00:17:01,021 చూడాల్సిన లోకం చాలా ఉంది 291 00:17:01,522 --> 00:17:08,153 మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే 292 00:17:09,195 --> 00:17:12,074 దాన్ని త్వరలోనే సాకారం చేసుకోబోతున్నాం 293 00:17:12,156 --> 00:17:15,702 నా ప్రాణ నేస్తమా 294 00:17:15,786 --> 00:17:20,832 వెన్నెల నది మరియు నేను 295 00:17:24,627 --> 00:17:28,464 ఆ పాట పాడేశాక "శుభరాత్రి. నువ్వంటే నాకు ప్రాణం," అని అనేవాడిని. 296 00:17:31,760 --> 00:17:33,220 అప్పుడు నువ్వు ఏమనేవాడివి? 297 00:17:40,811 --> 00:17:43,480 నేను ఇక ఇంటికి వెళ్ళాలి. ఉదయం పని ఉంది. 298 00:17:44,439 --> 00:17:47,067 అవును. నాకు కూడా పని ఉంది. 299 00:17:47,150 --> 00:17:48,151 నీకు కూడానా? 300 00:17:48,235 --> 00:17:51,071 -అవును. ఆశ్చర్యంగా ఉందా? -అవును. 301 00:17:51,154 --> 00:17:54,992 ఒకటి రెండేళ్ళలో చాలా విషయాలు జరగవచ్చు. రెండేళ్లయింది కదా? 302 00:17:55,659 --> 00:17:57,744 -సుమారుగా మూడేళ్లయింది. -అవును, కాబట్టి... 303 00:18:02,833 --> 00:18:05,419 -ఏం పని చేస్తున్నావేంటి? -ఏం చేస్తున్నావంటే? 304 00:18:05,502 --> 00:18:07,296 పని ఉందన్నావు కదా. ఏం పని? 305 00:18:07,379 --> 00:18:11,675 అవును. నేను... సేల్స్ పని చేస్తున్నాను, అదే పాత పనిలే. 306 00:18:11,758 --> 00:18:14,303 ఫోన్లు మీద ఫోన్లు చేయడం, చెక్స్ ని అందుకోవడం. 307 00:18:14,386 --> 00:18:15,971 అది దారుణమైన పనిలే. 308 00:18:16,054 --> 00:18:19,600 -కరోనా సమయంలో కూడా జనాలు కొంటున్నారా? -కొందరు కొంటున్నారులే. 309 00:18:19,683 --> 00:18:22,186 కానీ ఈ పరిస్థితికి ముందే, ఆ పనిలో చాలా మార్పులు జరిగాయి. 310 00:18:22,269 --> 00:18:23,896 అందులో గౌరవమే లేదు. 311 00:18:23,979 --> 00:18:26,899 కస్టమర్ ఫోన్ ఎత్తక ముందే వాళ్ల స్వరంలో విసుగు కనిపిస్తుంది. 312 00:18:26,982 --> 00:18:30,861 అంటే... దాన్ని నేను భరించలేను. త్వరలోనే దాన్ని వదిలేస్తాను. 313 00:18:31,486 --> 00:18:32,487 -అహా. -అవును. 314 00:18:32,571 --> 00:18:33,906 నేను డబ్బులు దాచుకుంటున్నాను. 315 00:18:33,989 --> 00:18:38,160 అనుకున్న సమయానికి దాచుకున్న డబ్బు ఇరవై వేలకు చేరుకుంటే, నాకొక ప్లాన్ ఉంది. 316 00:18:39,620 --> 00:18:40,621 ఏంటి? 317 00:18:41,330 --> 00:18:44,249 నువ్వు దాచుకొన్న డబ్బు దాదాపుగా ఇరవై వేల డాలర్లకు చేరుకుంటోంది, 318 00:18:44,333 --> 00:18:46,752 అది నాకు చెప్పడానికి గుండెపోటు అని అబద్ధం చెప్పి నాకు కాల్ చేశావు కదా? 319 00:18:46,835 --> 00:18:50,088 నేనేం చేస్తున్నానని నువ్వే అడిగావు. నేనేమీ ఆ టాపిక్ తేలేదు. నువ్వే తెచ్చావు. 320 00:18:50,172 --> 00:18:51,590 నేనొక లక్ష్యం కోసం పని చేస్తున్నాను, 321 00:18:51,673 --> 00:18:54,384 అది కూడా నువ్వు అడిగావు కాబట్టి, ఆ సంభాషణలో భాగంగానే 322 00:18:54,468 --> 00:18:56,595 -నీకు చెప్పాను. అంతే. -సరే. 323 00:18:56,678 --> 00:19:00,015 నిజమే. చక్ ఫెర్గ్యూసన్ విషయంలే. నీకు చక్ తెలుసు కదా. 324 00:19:00,516 --> 00:19:03,644 మనం మరీనాలో అతని పడవ ఇంట్లో ఒక రోజు గడిపాం. 325 00:19:03,727 --> 00:19:07,189 -నీకు ఆ పడవ గుర్తుంది. -నాకు బాగానే గుర్తుందనుకుంటా. 326 00:19:07,272 --> 00:19:12,236 అవును. గత 20 ఏళ్లుగా మినీ స్టోరేజ్ వ్యాపారంలో చక్ బాగానే సంపాదించాడు. 327 00:19:12,319 --> 00:19:14,238 జనాల దగ్గర తమకి అవసరం లేని చెత్త చాలా ఉంటుంది. 328 00:19:14,321 --> 00:19:17,032 వాళ్లకి ఆ చెత్తని పడేయడం ఇష్టం లేదు. ఎక్కడో చోట భద్రపరచాలనుకుంటారు. 329 00:19:17,533 --> 00:19:19,660 చక్ కి అలాంటివి రెండు డజన్లకు పైగా ఉన్నాయి. 330 00:19:19,743 --> 00:19:21,036 ఎక్కువగా సెంట్రల్ కాలిఫోర్నియాలో ఉన్నాయి, 331 00:19:21,119 --> 00:19:24,623 కానీ లాంకాస్టర్ లో ఒక కొత్త దాని కోసం వెతుకుతున్నాడు. అది నాకు చెప్పాడు. 332 00:19:24,706 --> 00:19:27,459 మేనేజ్మెంట్ అంత బాగాలేదట, అందుకని దాన్ని అతను కొని, ఆదాయాన్ని పెంచుకుంటాడు. 333 00:19:27,543 --> 00:19:30,045 మంచి లాభాలు వస్తాయి. దానిపై ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా ఉండదు. 334 00:19:30,128 --> 00:19:32,965 ఈ సమయంలో వాళ్ళ వ్యాపారం మరింత బాగా సాగుతుంది తెలుసా, ఎందుకంటే, 335 00:19:33,048 --> 00:19:34,925 జనాలు తమ ఇళ్ళను కోల్పోతున్నప్పుడు, 336 00:19:35,008 --> 00:19:37,010 తమ వస్తువులను పెట్టుకోవడానికి ఏదోక చోటు వాళ్ళకి కావాలి కదా. 337 00:19:37,094 --> 00:19:39,054 రెండేళ్ళలో పెట్టిన పెట్టుబడంతా తిరిగి వచ్చేస్తుంది. 338 00:19:39,137 --> 00:19:42,099 నేను చక్ ని అడగాల్సి ఉంటుంది, కానీ నీకు కావాలంటే, నిన్ను కూడా 339 00:19:42,182 --> 00:19:43,684 -ఇందులో భాగం ఇప్పించగలను. -అదన్నమాట సంగతి. 340 00:19:43,767 --> 00:19:46,770 -లేదు, చూడూ, నేనేమీ బలవంతపెట్టడం... -నాన్నా, నా దగ్గర 20,000 డాలర్లు లేవు. 341 00:19:46,854 --> 00:19:49,231 -నా దగ్గర నయాపైసా కూడా లేదు. -నేను డబ్బు కోసం నీ దగ్గరికి లేదు. 342 00:19:49,314 --> 00:19:51,316 నా బ్యాంక్ ఖాతాలో చిల్లి గవ్వ కూడా లేదు, ఒకవేళ ఉన్నా కూడా 343 00:19:51,400 --> 00:19:54,319 నేను నీకు ఇవ్వను, ఎందుకంటే, ఇస్తే ఏం చేస్తావో మనిద్దరికీ తెలుసు. 344 00:19:54,403 --> 00:19:56,071 -అది నిజం కాదు. -నేను ఇక ఇంటికి వెళ్తున్నాను. 345 00:19:56,572 --> 00:20:00,409 హేయ్, నా ఉద్దేశం అది కాదని... నా జీవితమేంటో నీకు అస్సలు తెలీనే తెలీదు! 346 00:20:00,492 --> 00:20:01,493 హేయ్! 347 00:20:02,077 --> 00:20:04,079 హేయ్, మాట్లాడుతుంటే అలా వెళ్లిపోకు. 348 00:20:06,665 --> 00:20:11,712 చూడు... నేను ఒకప్పటి మనిషి కాను. నిజంగానే కాను. 349 00:20:13,380 --> 00:20:16,008 మొదట్నుంచీ నువ్వు ఇంతే, ఏ మార్పూ లేదు. 350 00:20:16,091 --> 00:20:17,718 ఇంకా నేను నీకు సాయపడలేను కూడా. 351 00:20:20,470 --> 00:20:21,847 నువ్వు కూడా నాలాంటి వాడివే తెలుసా. 352 00:20:21,930 --> 00:20:24,683 లేదు. నీలా కాకూడదని నేను గడుపుతున్నాను! 353 00:20:24,766 --> 00:20:26,977 నాలాగే, నువ్వు కూడా నిన్ను అసహ్యించుకుంటూ ఉన్నావు! 354 00:20:28,520 --> 00:20:31,356 నువ్వు చేసి ఉండాల్సిన పనుల గురించి, వాటిని ఎందుకు చేయలేకపోయానా 355 00:20:31,440 --> 00:20:32,858 అనేదాని గురించి నువ్వు ఆలోచించకుండా ఉండలేవు. 356 00:20:33,692 --> 00:20:35,319 కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. 357 00:20:35,402 --> 00:20:38,238 నా మెడదులాగానే, నీ మెదడులో కూడా ఎప్పుడూ అవే ఆలోచనలు తిరుగుతుంటాయి. 358 00:20:38,322 --> 00:20:41,742 కానీ తేడా ఏంటంటే, నేను దానికి నన్నే నిందించుకుంటాను. 359 00:20:42,993 --> 00:20:45,120 కానీ నువ్వు నన్ను నిందిస్తావు. 360 00:20:45,996 --> 00:20:47,748 అది చాలా బాగుంటుంది కదా? 361 00:20:48,665 --> 00:20:51,543 నీ తప్పు అయినా పక్కవారి మీదికి తోసేయడం. 362 00:20:53,003 --> 00:20:54,630 అవును. చాలా బాగుంటుంది. 363 00:20:56,131 --> 00:20:57,716 డ్రగ్ లాగా ఉంటుంది. 364 00:21:06,767 --> 00:21:09,019 హేయ్. నిన్ను ఎక్కడైనా దించాలా? 365 00:21:11,563 --> 00:21:13,398 నా విషయం వదిలేయిలే. 366 00:21:50,853 --> 00:21:53,689 జోష్! హేయ్, లేయ్. నువ్వు దీన్ని మిస్ కాకూడదు. 367 00:21:53,772 --> 00:21:55,983 దాన్ని నువ్వు చూడవచ్చు. రా. వెళ్దాం పద. 368 00:21:56,066 --> 00:21:58,277 ఇది కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు, కానీ మనం చూడవచ్చు. 369 00:21:58,360 --> 00:22:01,864 చూశాక నీకు చాలా ఆనందంగా ఉంటుంది. తోకచుక్క పడుతుందని నీకు చెప్పా కదా? 370 00:22:01,947 --> 00:22:04,074 అది అన్నింటినీ అంతం చేసేస్తుందని చెప్పా కదా. 371 00:22:07,661 --> 00:22:12,332 అదుగో. కనబడిందా? భయపడకండి, ఏమీ కాదు. 372 00:22:12,416 --> 00:22:14,877 అది మనల్ని ఏమీ చేయదు. అది చాలా వేగంగా జరిగిపోతుంది. 373 00:22:14,960 --> 00:22:18,922 అంత కాంతిని మీరెప్పుడూ చూసి ఉండరు, కానీ ఆ తంతు చిటికెలో ముగిసిపోతుంది. 374 00:22:19,006 --> 00:22:22,801 కానీ పర్వాలేదు, మనం చూడగలం కదా. మీరంటే నాకు ప్రాణం. 375 00:22:22,885 --> 00:22:27,139 మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. 376 00:22:28,849 --> 00:22:30,058 మీరంటే నాకు చాలా ఇష్టం. 377 00:24:22,129 --> 00:24:24,131 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య