1 00:00:11,845 --> 00:00:13,472 ఇక ఇది వినండి. 2 00:00:16,225 --> 00:00:17,643 ఇక ఇది వినండి. 3 00:00:18,310 --> 00:00:20,187 ఇక ఇది వినండి. 4 00:00:21,563 --> 00:00:23,106 ఇక్కడ మనమందరం ఏకమయ్యాం. 5 00:00:27,236 --> 00:00:30,280 "ఓడ మన కోసం ఎప్పుడు తిరిగి వస్తుందో మనం అస్సలు చెప్పలేం. 6 00:00:30,364 --> 00:00:33,659 అది వచ్చేదాకా, ఈ దీవిలో మనం ఏకాకులుగా బతకాల్సిందే. 7 00:00:33,742 --> 00:00:35,994 ఇప్పుడు మనం ఒంటరిగా జీవించాలి కనుక రమో త్వరగా బాధ్యతలను స్వీకరించాలి, 8 00:00:36,078 --> 00:00:40,123 ఎందుకంటే ఇప్పుడు అతని అవసరం నాకు ఎక్కువగా ఉంది కాబట్టి." 9 00:00:41,166 --> 00:00:42,584 నేను ఇంకా చదవాలంటారా? 10 00:00:44,503 --> 00:00:46,421 మన క్లాస్ సమయం అయిపోయిందనుకుంటా. 11 00:00:46,505 --> 00:00:48,674 కానీ చాలా చక్కగా చదివావు. ధన్యవాదాలు, మ్యాండీ. 12 00:00:52,094 --> 00:00:54,263 సరే మరి, అందరికీ అభినందనలు. 13 00:00:54,346 --> 00:00:57,724 మొదటి వారం ఇంటి నుండి ఆన్లైన్ తరగతులను విజయవంతంగా పూర్తి చేశారు. 14 00:00:59,726 --> 00:01:01,019 ఇది వింతగానే ఉంటుంది. 15 00:01:01,103 --> 00:01:06,942 కాబట్టి, శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. 16 00:01:07,025 --> 00:01:10,153 మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇంకా... 17 00:01:11,530 --> 00:01:12,614 మిమ్మల్ని నేను మిస్ అవుతున్నాను. 18 00:01:16,368 --> 00:01:19,246 అదీ మరి. జాగ్రత్తగా ఉండండి. వారాంతాన్ని ఎంజాయ్ చేయండి. 19 00:01:19,329 --> 00:01:22,124 ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత. 20 00:01:22,708 --> 00:01:24,334 మిమ్మల్ని మళ్లీ సోమవారం కలుస్తాను. 21 00:01:24,418 --> 00:01:25,502 బై, మిస్టర్ కోర్మన్. 22 00:01:27,629 --> 00:01:28,630 బై, రెమోన్. 23 00:02:10,631 --> 00:02:11,715 హేయ్. 24 00:02:11,798 --> 00:02:12,799 హలో. 25 00:02:16,970 --> 00:02:19,389 మన్నించు. నువ్వు... నువ్వు ఏమనుకోకుండా నీ బూట్లు తీసేస్తావా? 26 00:02:19,932 --> 00:02:21,433 నేను ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను. 27 00:02:21,517 --> 00:02:22,601 -అవును. -నా బూట్లు... 28 00:02:22,684 --> 00:02:25,187 బూట్లకు సోల్స్ ఉంటాయి కదా. అంటే... 29 00:02:25,270 --> 00:02:27,773 -వైరస్ నేల మీద పడుతుంది, కనుక... -సరే. అలాగే. 30 00:02:27,856 --> 00:02:30,192 -ఇప్పుడే నేను దాని గురించి చదివాను. -మరేం పర్వాలేదు. 31 00:02:30,275 --> 00:02:31,401 డిన్నర్ తెచ్చినందుకు ధన్యవాదాలు. 32 00:02:31,485 --> 00:02:33,153 సర్లే. ఏం పర్వాలేదులే. 33 00:03:02,224 --> 00:03:04,726 వేడి వేడి రుచికరమైన ఆహారం 34 00:04:49,498 --> 00:04:50,499 -హేయ్. -హేయ్. 35 00:04:54,044 --> 00:04:55,671 ఆహారాన్ని ప్లేట్ మీద పెట్టావా? 36 00:04:56,171 --> 00:04:58,340 అవును. నేను, 37 00:04:58,423 --> 00:05:01,176 -పార్సెల్ ఆహారం గురించి ఆర్టికల్ చదివా... -సరే. 38 00:05:01,260 --> 00:05:04,304 -దేవుడా. బాసూ, నువ్వేం... -క్షమించు, నేను... 39 00:05:04,888 --> 00:05:07,182 -ఇవి... ఇవి మైక్రోవేవ్ లో పెట్టావా? -అవును. 40 00:05:07,266 --> 00:05:10,185 వీటిలో లెట్యూస్, టొమాటోలు ఉంటాయి. వాటిని మైక్రోవేవ్ లో వేడి చేయకూడదు! 41 00:05:10,269 --> 00:05:11,562 అవును, నాకు... నాకు తెలుసు. నాకు తెలుసు. 42 00:05:11,645 --> 00:05:14,064 నువ్వు ముందు కూరగాయాలను బయటకు తీసి, ఉత్త బ్రెడ్ ని వేడి చేయాలి. 43 00:05:14,147 --> 00:05:16,984 -ఆ తర్వాత ప్యాన్ మీద మాంసం ఉంచాలి. -ఆహారంలో ఏమైనా ఉంటే, వాటిని... 44 00:05:17,067 --> 00:05:19,319 చంపడానికి, నువ్వు దాన్నంతటినీ మైక్రోవేవ్ లో వేడి చేయాలి. 45 00:05:19,903 --> 00:05:21,947 -ఓరి దేవుడా. -అవును. 46 00:05:22,030 --> 00:05:24,825 మన్నించు, ఇలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, కాబట్టి... 47 00:05:24,908 --> 00:05:27,160 అవునులే. అది... అది మంచిదే. 48 00:05:27,244 --> 00:05:29,705 వీటిని కాసేపు ఫ్రీజర్ లో పెడతాను. 49 00:05:33,500 --> 00:05:35,794 అయితే, నువ్వు రోజూ పనికి వెళ్తుంటావా? 50 00:05:37,588 --> 00:05:38,797 యూపిఎస్ కదా, గురూ. 51 00:05:39,339 --> 00:05:42,134 దేశ జీడీపీలో ఆరు శాతం మా చేతుల్లోనే ఉంటుంది. 52 00:05:42,217 --> 00:05:45,262 అంటే, ఆర్థిక పరిస్థితిని నాశనం చేయాలనే ఆలోచన ఉంటేనే, యూపిఎస్ ని మూసేయాలి. 53 00:05:45,846 --> 00:05:48,056 అవును, విషయమేమిటంటే... 54 00:05:48,140 --> 00:05:50,934 బడులను మూసేశారు, ఎన్.బీ.ఏ.ని మూసేశారు... 55 00:05:51,018 --> 00:05:54,938 అవును, కానీ యూపిఎస్ ని మూయరు. అది వారం క్రితమే నీకు చెప్పా. 56 00:05:56,982 --> 00:05:57,983 ఇక చాలనుకుంటా. 57 00:05:59,234 --> 00:06:01,987 ఆ విషయం వారం క్రిందటే నీకెలా తెలిసింది? 58 00:06:02,070 --> 00:06:03,238 ఎలా తెలిసింది? 59 00:06:04,448 --> 00:06:06,575 జనాలకు తమ వస్తువులు కావాలి. వాటిని ఎవరు డెలివరీ చేస్తారు? 60 00:06:10,120 --> 00:06:11,330 -ధన్యవాదాలు. -సరే. 61 00:06:20,506 --> 00:06:21,507 వావ్. 62 00:06:22,508 --> 00:06:23,717 అది అస్సలు బాగాలేదు. 63 00:06:24,426 --> 00:06:25,427 మన్నించు. 64 00:06:29,598 --> 00:06:34,811 అయితే, వాళ్లు ఏవైనా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా... 65 00:06:34,895 --> 00:06:35,896 అంటే? 66 00:06:37,189 --> 00:06:38,482 మీకు మాస్కులు ఇవ్వడం లేదా... 67 00:06:39,233 --> 00:06:41,485 మాస్కుల వల్ల పెద్ద లాభం ఉండదట. 68 00:06:41,568 --> 00:06:43,445 అది కేవలం జనాలకు ఒక భద్రతా భావనని ఇస్తుందట అంతే, 69 00:06:43,529 --> 00:06:45,781 -అంతకు మించి దాని వల్ల లాభం లేదంట. -అలా అని ఎవరన్నారు? 70 00:06:45,864 --> 00:06:48,158 ప్రభుత్వమే అంది. నువ్వు వినలేదా? 71 00:06:48,742 --> 00:06:50,536 -నేను కూడా విన్నాను. -సరే. 72 00:06:54,122 --> 00:06:55,832 కానీ జనాలు సామాజిక దూరం పాటిస్తారా లేక... 73 00:06:55,916 --> 00:06:58,043 -నేను భయంతో బతకలేను, బాసూ, సరేనా? -నువ్వు భయంతో బతకాలని 74 00:06:58,126 --> 00:07:00,003 -నేను అనడం లేదు. -నేను భయంతో బతకలేను. 75 00:07:00,087 --> 00:07:02,923 కానీ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. 76 00:07:03,590 --> 00:07:05,592 వాస్తవమా. అయితే, వాస్తవమేంటో చెప్పు మరి. 77 00:07:06,969 --> 00:07:09,346 ఏంటది? పర్లేదు, చెప్పు. వాస్తవం ఏంటి? 78 00:07:10,722 --> 00:07:14,977 ఈ సమయంలో... రోజూ నువ్వు ఉద్యోగానికి వెళ్లడం 79 00:07:15,060 --> 00:07:17,771 అంత మంచి పని కాదేమో అని మాత్రమే నేనంటున్నాను. 80 00:07:18,689 --> 00:07:20,190 నాకు మంచిది కాదా, నీకా? 81 00:07:22,317 --> 00:07:23,318 ఇద్దరికీ. 82 00:07:23,402 --> 00:07:25,028 సరే. అర్థమైంది. 83 00:07:25,112 --> 00:07:26,989 అయితే, నన్నేం చేయమంటావు? 84 00:07:27,739 --> 00:07:29,741 -నేనేం చేయాలి అంటావు? -ఏమో మరి. 85 00:07:30,951 --> 00:07:33,871 నేను చేసే పనికి, ఇంట్లో కూర్చుంటే నాకు జీతం రాదు. 86 00:07:34,413 --> 00:07:36,623 నీ విషయంలో అలా జరగగలదు, కానీ నా విషయంలో అలా జరగదు, గురూ. 87 00:07:36,707 --> 00:07:37,708 గురూ, నేను కేవలం... 88 00:07:37,791 --> 00:07:40,335 నేను పనికి వెళ్లడం మానేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలుసా? 89 00:07:40,878 --> 00:07:41,879 నేను గాబీని... 90 00:07:41,962 --> 00:07:44,298 కానీ నీకు వైరస్ సోకితే ఏమవుతుందో తెలుసా? 91 00:07:44,381 --> 00:07:45,424 -నాకు తెలుసు. -నీకు తెలీదు. 92 00:07:45,507 --> 00:07:46,508 -నాకు తెలుసు. -నీకు తెలీదు! 93 00:07:46,592 --> 00:07:48,427 నాకు రోగం వస్తుంది, ఆ తర్వాత అది నయమవుతుంది. 94 00:07:48,510 --> 00:07:49,678 -అది నీకు ఖచ్చితంగా తెలీదు. -నాకు తెలుసు. 95 00:07:49,761 --> 00:07:52,514 -లేదు, నీకు... నీకేమీ తెలీదు. -నాకేమీ తెలీదా? 96 00:07:53,432 --> 00:07:55,475 -నా ఉద్దేశం అది కాదు, గురూ. నేను... -అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? 97 00:07:55,559 --> 00:07:56,560 ఇది కొత్త రకమైనదని నేనంటున్నాను. 98 00:07:56,643 --> 00:07:58,687 ఇక్కడ ఏమీ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది నువ్వే, నేను కాదు. 99 00:07:58,770 --> 00:08:00,480 ప్రస్తుతానికి, ఎవరికీ ఏమీ తెలీదు, నేను చెప్పేదదే. 100 00:08:00,564 --> 00:08:04,318 అవును. ఈ లోకం తీరుతెన్నుల గురించి నీకు తెలీదు. అస్సలు తెలీదు. 101 00:08:05,152 --> 00:08:08,113 హేయ్, హేయ్, కొన్ని నెలలు పనికి వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలా. 102 00:08:08,197 --> 00:08:10,157 కానీ నాకొక ఉపకారం చేయ్, తలుపు దగ్గరే బూట్లు విడిచేసి, 103 00:08:10,240 --> 00:08:12,242 చీస్ బర్గర్ లో మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేసేయ్, 104 00:08:12,326 --> 00:08:14,161 ఎందుకంటే, అలా చేస్తేనే మనం బతుకుతాం, కదా? 105 00:08:18,081 --> 00:08:19,416 నేను దీన్ని తినను. 106 00:08:27,007 --> 00:08:28,759 -హలో? -హాయ్, అమ్మా. 107 00:08:29,927 --> 00:08:31,011 ఏమైంది? 108 00:08:31,094 --> 00:08:33,263 అంటే, చాలా విషయాలు ఉన్నాయి, కదా? 109 00:08:34,515 --> 00:08:38,183 అవును, అంటే, వాటిని పక్కన పెడ్తే, నువ్వు బాగానే ఉన్నావా? 110 00:08:38,268 --> 00:08:39,895 అంత స్పష్టంగా తెలిసిపోతోందా? 111 00:08:40,520 --> 00:08:42,813 -జోష్, నువ్వు బాగానే ఉన్నావా? -లేదు. నేను బాగానే ఉన్నా. పర్వాలేదు. 112 00:08:42,898 --> 00:08:44,441 కాకపోతే, నాకు విక్టర్ గురించి ఆందోళనగా ఉందంతే. 113 00:08:45,359 --> 00:08:46,818 ఏమైంది? అతనికి ఏమీ కాలేదు కదా? 114 00:08:47,402 --> 00:08:49,863 లేదు, అతనికి ఆరోగ్యమంతా బాగానే ఉంది. అతను... అంటే... నాకు తెలియట్లేదు. 115 00:08:49,947 --> 00:08:51,907 అతనిలో లక్షణాలేవీ లేవు. నా ఉద్దేశం, అతను... 116 00:08:52,908 --> 00:08:56,870 అతను పనికి వెళ్తూ ఉండాలి... ఇంట్లో ఉండి పని చేయలేడు. 117 00:08:57,579 --> 00:09:01,291 -అవును, ఎందుకంటే, అతను... -అవును, అతను... అవును. 118 00:09:01,708 --> 00:09:05,003 కాబట్టి, అవును, అతను... అతని గురించి నాకు ఆందోళనగా ఉంది. 119 00:09:06,839 --> 00:09:09,800 నీకు అతని గురించి ఆందోళనగా ఉందా, లేదా నీ గురించే ఆందోళనగా ఉందా? 120 00:09:11,927 --> 00:09:14,721 అంటే, మా ఇద్దరి గురించి. మా ఇద్దరి గురించి అన్నమాట. 121 00:09:14,805 --> 00:09:16,557 అవును. అంతేలే. 122 00:09:18,851 --> 00:09:20,561 ఏదేమైనా, నేనేమనుకుంటున్నానంటే, 123 00:09:20,644 --> 00:09:24,314 కొంతకాలంపాటు మన ఇంట్లో ఉంటే బాగుంటుందేమో అని. 124 00:09:26,525 --> 00:09:27,943 అంటే, నీకు అభ్యంతరం లేకపోతే. 125 00:09:28,902 --> 00:09:31,154 భలేవాడివే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉండవచ్చు. 126 00:09:31,238 --> 00:09:33,949 అంటే... అలా చేయటమే... మంచి పని అని నాకనిపిస్తోంది... 127 00:09:34,032 --> 00:09:36,034 బంగారం, నువ్వు వివరణ ఇవ్వాల్సిన పని లేదు. 128 00:09:36,118 --> 00:09:37,870 నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు. 129 00:09:37,953 --> 00:09:39,246 సరే. ధన్యవాదాలు. 130 00:09:39,913 --> 00:09:41,039 భలేవాడివే. 131 00:09:42,374 --> 00:09:45,085 నిజానికి, నేను... నేను... 132 00:09:46,461 --> 00:09:48,338 మన్నించాలి, ఇది కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ 133 00:09:48,422 --> 00:09:51,300 నేను 14 రోజులు నా గదిలోనే ఉంటే మంచిది అనుకుంటా. 134 00:09:52,384 --> 00:09:53,594 ఎందుకలా అంటున్నావు? 135 00:09:54,178 --> 00:09:55,971 అంటే, నేను కొంతకాలంగా విక్టర్ తో ఉన్నాను, 136 00:09:56,054 --> 00:09:58,182 ఇంకా విక్టర్ రోజూ పనిలో భాగంగా చాలా మందిని కలుసుకుంటూ ఉంటాడు, 137 00:09:58,265 --> 00:10:00,517 అందుకని నీకు ఈ వ్యాధి అంటుకోకూడదనే నా తపన. 138 00:10:00,601 --> 00:10:03,312 కాబట్టి, 14 రోజులపాటు నేను వేరుగా ఉంటే మంచిది. 139 00:10:05,314 --> 00:10:07,691 సరే, అది నీ ఇష్టం మరి. 140 00:10:07,774 --> 00:10:10,152 అది నాకేమీ ఇష్టం కాదు. నాకు... నాకు... 141 00:10:10,235 --> 00:10:12,279 -అదే మంచి పనిలా అనిపిస్తోంది... -నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు కదా. 142 00:10:12,362 --> 00:10:13,363 సరే. 143 00:10:15,157 --> 00:10:16,533 ఇంకో విషయం... 144 00:10:16,617 --> 00:10:20,245 ఇది నీకు మరీ భారమైతే చెప్పు, కానీ, నాకు... 145 00:10:20,329 --> 00:10:22,206 జోష్, నేనేం చేయాలో చెప్పు చాలు. 146 00:10:22,289 --> 00:10:23,290 సరే... 147 00:10:24,416 --> 00:10:29,963 నువ్వు ఆహారాన్ని నా గది బయట తలుపు దగ్గరే పెట్టేయాలనుకుంటా. 148 00:10:34,760 --> 00:10:35,761 హలో? 149 00:10:45,979 --> 00:10:47,981 తెరిచి ఉంది 150 00:11:56,341 --> 00:11:57,718 జోష్, అది నువ్వేనా? 151 00:11:57,801 --> 00:11:59,094 అవును. లోపలికి రావద్దు! 152 00:11:59,178 --> 00:12:00,679 సరే, రానులే. 153 00:12:02,639 --> 00:12:03,974 హాయ్! 154 00:12:04,057 --> 00:12:05,058 హాయ్. 155 00:12:07,019 --> 00:12:09,021 నేను... పడుకోవడానికి వెళ్తున్నాను. 156 00:12:10,272 --> 00:12:11,732 సరే. శుభరాత్రి. 157 00:12:32,127 --> 00:12:33,170 నువ్వు లేచావా? 158 00:12:34,087 --> 00:12:35,088 లేచాను! 159 00:12:35,714 --> 00:12:37,382 నిన్న రాత్రి నువ్వు అన్నావు కదా... 160 00:12:37,466 --> 00:12:40,052 ఏంటి? మన్నించాలి, నీ మాట నాకు వినబడటం లేదు. 161 00:12:40,135 --> 00:12:41,470 మరి... 162 00:12:41,553 --> 00:12:42,846 లోపలికి రాకు! 163 00:12:42,930 --> 00:12:44,056 నేను రావట్లేదులే. 164 00:12:44,139 --> 00:12:48,685 నిన్న రాత్రి ఆహారాన్ని గది బయటే పెట్టమన్నావు కదా, అది నిజంగానే అన్నావా? 165 00:12:51,355 --> 00:12:52,356 అవును. 166 00:12:55,943 --> 00:12:56,944 దానికేమీ ఇబ్బంది లేదు కదా? 167 00:13:46,368 --> 00:13:48,495 "తుఫాను రెండు రోజుల పాటు ప్రతాపం చూపింది, 168 00:13:48,579 --> 00:13:52,165 మూడవ రోజు, మేము చనిపోయినవారిని దక్షిణ తీరప్రాంతంలో పూడ్చిపెట్టాము." 169 00:13:55,627 --> 00:13:58,422 "బీచ్ లో చనిపోయిన స్థానికులను దహనం చేశారు." 170 00:14:04,428 --> 00:14:07,097 "అది జరిగి చాలా రోజుల తర్వాత, ఊరు ప్రశాంతంగా ఉండింది." 171 00:14:09,099 --> 00:14:11,310 "ప్రజలు కేవలం ఆహార అవసరాల కోసమే బయట అడుగు పెట్టేవారు. 172 00:14:12,019 --> 00:14:13,937 పని అయ్యాక, నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వచ్చేసేవారు." 173 00:14:26,366 --> 00:14:29,244 -హాయ్! హాయ్. -హాయ్, బంగారం. హాయ్. 174 00:14:29,328 --> 00:14:30,954 నువ్వు చాలా తెచ్చావే! 175 00:14:31,038 --> 00:14:33,081 నేను... అంత ఎక్కువేమీ తెలేదే. 176 00:14:33,165 --> 00:14:34,541 -ఏంటది? -ఏంటి? 177 00:14:34,625 --> 00:14:36,585 -అదేంటి? -అది నిన్ను ఆశ్చర్యపరుద్దామని తెచ్క్ష్చా. 178 00:14:36,668 --> 00:14:37,836 సరే. 179 00:14:38,962 --> 00:14:41,798 -హాయ్. -హాయ్. 180 00:14:43,383 --> 00:14:44,968 ఒక్క నిమిషం. నేను ఎత్తుతాను. 181 00:14:45,969 --> 00:14:47,179 -హలో? -హాయ్, అమ్మా. 182 00:14:48,013 --> 00:14:51,808 హాయ్! కాల్ ఎందుకు చేస్తున్నావు? ఇంకా ఇక్కడే ఉన్నావా? 183 00:14:51,892 --> 00:14:54,728 అవును. ఒకరి గొంతు మరొకరికి వినిపించాలని కాల్ చేశాను. 184 00:14:54,811 --> 00:14:58,190 -సరే. ఇప్పుడు నేను... -అది... ఎవరది? 185 00:15:00,651 --> 00:15:03,403 అమ్మా, ఎవరో మన ఇంటికి వచ్చారు. ఎవరది? 186 00:15:04,238 --> 00:15:06,281 -నేను నీకు తర్వాత కాల్ చేయనా? -లేదు, ఇది చాలా సిరియస్ విషయం. 187 00:15:06,365 --> 00:15:07,491 నువ్వు తర్వాత కాల్ చేయకూడదు. 188 00:15:07,574 --> 00:15:08,909 -సరే. ధన్యవాదాలు. -అమ్మా. అమ్మా... 189 00:15:12,955 --> 00:15:15,582 మేము, కొన్ని వస్తువులను రీకాల్ చేస్తున్నాం... కొన్నింటిని... 190 00:15:20,546 --> 00:15:22,089 -హలో. -హాయ్, అమ్మా. 191 00:15:22,172 --> 00:15:24,508 -పనుంది. మన్నించాలి. తర్వాత కాల్ చేస్తా. -లేదు, వద్దు... వద్దు... 192 00:15:24,591 --> 00:15:26,718 -నేనిప్పుడు మాట్లాడలేను. ఉంటాను. -ఫోన్ పెట్టకు! అమ్మా! అమ్మా! 193 00:15:28,303 --> 00:15:30,806 -నీకేమైనా పనుందా? -లేదు, లేదు. అదేమీ... 194 00:15:34,309 --> 00:15:37,604 అదేం లేదు. కాస్త ఫ్రీగా ఉండు, సరేనా? 195 00:15:46,446 --> 00:15:49,116 హలో. నా పేరు రూత్. ఏం చేయాలో మీకు తెలుసు కదా. 196 00:15:50,284 --> 00:15:54,621 హాయ్, అమ్మా. నేను. అది నీకూ తెలుసు. నేను ఇంట్లో ఉన్నా. అది కూడా నీకు తెలుసు. 197 00:15:54,705 --> 00:15:56,790 ఇంట్లోకి ఎవరు వచ్చారో, వాళ్లకి కూడా నేను ఇంట్లో ఉన్నానని తెలుసు. 198 00:15:56,874 --> 00:15:59,042 వాళ్లకి తెలియకపోతే, వాళ్లకి తెలియాలి. ఎందుకంటే... 199 00:15:59,126 --> 00:16:01,378 -అసలు నీ సమస్య ఏంటి? -నువ్వు చేసేది సురక్షితమైన పని కాదు! 200 00:16:01,461 --> 00:16:02,963 -అది సురక్షితమైన పనే. -కాదు, కానే కాదు! 201 00:16:03,046 --> 00:16:05,048 గత వారం నుండి నేను ఈ గదిలోనే ఎందుకు ఉన్నాననుకుంటున్నావు? 202 00:16:05,132 --> 00:16:07,718 ఇంట్లోకి కొత్తవారు ఎవరు వచ్చినా, వారు విడిగా ఉండాలి. 203 00:16:07,801 --> 00:16:10,012 -రెండు వారాలుండాలి. అది... -నువ్వు విక్టర్ తో ఉన్నావు కనుక, 204 00:16:10,095 --> 00:16:13,724 అతను ఆఫీసుకు వెళ్తున్నాడు కనుక, నువ్వు విడిగా ఉంటున్నావు. 205 00:16:13,807 --> 00:16:15,893 -ల్యారీ ఇంట్లో... -అయితే వచ్చింది ల్యారీయా? 206 00:16:16,894 --> 00:16:17,895 అవును. 207 00:16:18,729 --> 00:16:21,899 అతను మూడు వారాలుగా ఇంట్లోనే ఉన్నాడు 208 00:16:21,982 --> 00:16:24,026 నాకు తెలిసి అంతకాలం ఎవరూ లేరు. 209 00:16:24,109 --> 00:16:25,360 ఈ పరిస్థితిని అతను ముందే ఊహించాడు. 210 00:16:25,444 --> 00:16:27,738 ఇలాంటి వాటి విషయంలో అతను భలే చురుకుగా ఉంటాడు. 211 00:16:27,821 --> 00:16:30,699 ఇంకా ఆయన మనతో ఉండటానికి రావడం నిజంగా మన అదృష్టం. 212 00:16:30,782 --> 00:16:31,783 మనం అదృష్టవంతులమా? 213 00:16:32,326 --> 00:16:34,161 -జోష్... -ఆయన ఇంట్లోనే ఉన్నట్టు నీకెలా తెలుసు? 214 00:16:34,244 --> 00:16:35,579 అతనే ఆ మాట నీకు చెప్పాడు కాబట్టా? 215 00:16:35,662 --> 00:16:36,663 అవును. 216 00:16:37,539 --> 00:16:39,333 -అలా చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా? -అవును. 217 00:16:42,503 --> 00:16:43,504 సరే. 218 00:16:44,421 --> 00:16:48,342 అయితే, నేను ఆరు రోజుల తర్వాత 219 00:16:49,218 --> 00:16:51,929 వచ్చి అతడిని కలుస్తాను. 220 00:16:52,679 --> 00:16:53,680 మంచిది. 221 00:16:55,140 --> 00:16:56,934 ఇక ఫోన్ చేయడం ఆపుతావా? 222 00:16:57,017 --> 00:16:59,061 అవును. నీతో మళ్లీ మాట్లాడతా... 223 00:17:17,788 --> 00:17:19,998 ఇవి పాటలు కాదు 2003 224 00:17:55,868 --> 00:17:59,288 ఈ లోకం అలాగే ఉంటుంది 225 00:17:59,997 --> 00:18:03,375 జనాలు మారరు 226 00:18:03,458 --> 00:18:07,087 ఈ పాటనే వింటూ ఉంటారు 227 00:18:14,761 --> 00:18:18,307 ప్లేయర్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది 228 00:18:18,390 --> 00:18:21,393 అవే పాటలు ప్లే అవుతూ ఉంటాయి 229 00:18:22,186 --> 00:18:25,355 వాటిని మనం మార్చలేం 230 00:18:25,439 --> 00:18:26,648 స్టార్కిస్ట్ నీట్లో 231 00:18:33,280 --> 00:18:36,366 నువ్వు చేసేది నీకు తెలిస్తే 232 00:18:37,534 --> 00:18:44,082 ఎందుకు అదే పనిని మళ్లీ మళ్లీ చేస్తున్నావు? 233 00:18:44,166 --> 00:18:45,167 కామాలు. 234 00:18:46,126 --> 00:18:48,754 కామాలను, మామూలుగా విరామ చిహ్నంగా వాడతారు. 235 00:18:49,505 --> 00:18:52,549 కానీ దానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి, చాలా మంది అంటుంటారు, 236 00:18:52,633 --> 00:18:54,092 "కామా అక్కడే పెట్టాలి. 237 00:18:54,176 --> 00:18:55,636 అక్కడ పెట్టకూడదు," అని అంటుంటారు. 238 00:18:55,719 --> 00:18:58,222 కానీ వాళ్ళెవరూ "బ్లైండ్నెస్"ని చదివి ఉండరు. 239 00:19:00,015 --> 00:19:03,393 అందులో ఫుల్ స్టాప్లు ఉండవు, మొత్తం కామాలే ఉంటాయి. 240 00:19:03,477 --> 00:19:05,771 ఓ విషయం చెప్పనా? అది సరైనది కాదు, కానీ అది చాలా బాగుంటుంది. 241 00:19:06,480 --> 00:19:08,357 కామాలను అలా కూడా ఉపయోగించవచ్చు. 242 00:19:08,440 --> 00:19:12,319 దురదృష్టవశాత్తూ, కామాలు ఎలా వాడాలని 243 00:19:12,402 --> 00:19:14,613 మిమ్మల్ని పాత నియమాల ప్రకారం పరీక్షిస్తారు. 244 00:19:14,696 --> 00:19:16,365 కాబట్టి నేను మీకు ఆ నియమాలని నేర్పబోతున్నాను. 245 00:19:16,448 --> 00:19:18,450 కానీ ఓ విషయం, మీరు నిజమైన జీవితంలో రాస్తున్నప్పుడు, 246 00:19:18,534 --> 00:19:20,744 ఆ నియమాల వల్ల పెద్ద ఉపయోగం లేదు. 247 00:19:22,204 --> 00:19:25,874 ఏదీ మారదు 248 00:19:25,958 --> 00:19:29,628 ఈ పాటనే వింటూ ఉంటారు 249 00:19:29,711 --> 00:19:32,464 మళ్లీ మళ్లీ ప్లే అవుతూనే ఉంటుంది 250 00:19:32,548 --> 00:19:35,050 ఫలానా పని సరైనది, ఫలానా పని సరైనది కాదు. 251 00:19:35,133 --> 00:19:38,554 అదంతా వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడుంటుంది అనుకుంటా. 252 00:19:38,637 --> 00:19:41,974 మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. నేనే మాట్లాడుతూ ఉన్నాను. 253 00:19:42,057 --> 00:19:44,017 ఎవరైనా తమ అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారా? 254 00:19:44,101 --> 00:19:46,061 అది తప్పు లేదా ఒప్పు అని ఎవరైనా అనుకుంటున్నారా? 255 00:19:46,144 --> 00:19:48,188 లేదా ఆ రెండూ కావచ్చని? 256 00:19:48,272 --> 00:19:51,650 -నువ్వు చేసేది నీకు తెలిస్తే -హేయ్. 257 00:19:52,484 --> 00:19:55,946 -ఎందుకు అదే పనిని -లేచావా? 258 00:19:56,029 --> 00:19:59,074 -మళ్లీ మళ్లీ చేస్తున్నావు? -హేయ్! లేయ్! 259 00:19:59,825 --> 00:20:02,536 నువ్వు చేసేది నీకు తెలిస్తే 260 00:20:03,412 --> 00:20:07,332 బాసూ, నా గదిలో నువ్వేం చేస్తున్నావు? చస్తావా ఏంటి? 261 00:20:07,416 --> 00:20:09,126 ఎప్పటికైనా చావాల్సిందే కదా. 262 00:20:09,209 --> 00:20:11,920 మంచిది. మరి, నేను చిన్నప్పుడే చస్తాను కానీ మరీ అంత చిన్నప్పుడు చావనా? 263 00:20:13,630 --> 00:20:14,631 నాకు తెలీదు. 264 00:20:16,508 --> 00:20:17,926 నువ్వేం వింటున్నావు? 265 00:20:18,468 --> 00:20:19,720 -నీ పాటలని. -నిజంగానా? 266 00:20:20,220 --> 00:20:21,388 ఏ పాటని? 267 00:20:21,930 --> 00:20:23,849 అవి పాటలు కావని అన్నావు కదా. 268 00:20:24,433 --> 00:20:25,601 నా ఉద్దేశమేంటో నీకు తెలుసు కదా. 269 00:20:25,684 --> 00:20:26,685 పన్నెండవ ట్రాక్. 270 00:20:27,728 --> 00:20:28,937 అది బాగుండదు. 271 00:20:29,897 --> 00:20:31,315 అది నాకు బాగా అనిపించిందే. 272 00:20:31,398 --> 00:20:34,651 లేదు, అది నువ్వు చాలా కాలం తర్వాత విన్నావు కాబట్టి నీకలా అనిపించింది. 273 00:20:36,236 --> 00:20:38,530 అంటే, ఇతరులకు కూడా నచ్చింది. కాబట్టి... 274 00:20:38,989 --> 00:20:41,200 -ఏంటి. దాన్ని ఇతరులు కూడా విన్నారా? -అవును. 275 00:20:42,868 --> 00:20:46,538 నువ్వు విడుదల చేశావా? అంటే... ఇంట్లో రికార్డ్ చేసినవని చెప్పి? 276 00:20:46,622 --> 00:20:48,040 కాదు. నా ఉద్దేశమేంటంటే, 277 00:20:49,416 --> 00:20:52,085 నేను ఇతరులకు పాడి వినిపించాను కదా, వారి గురించి చెప్తున్నాను. 278 00:20:52,753 --> 00:20:53,754 సరే. 279 00:20:55,088 --> 00:20:56,256 ఎవరికి వినిపించావేంటి? 280 00:20:57,716 --> 00:20:59,009 నా ప్రేయసికి. 281 00:20:59,551 --> 00:21:00,552 సరే. 282 00:21:01,512 --> 00:21:03,889 తను నా ప్రేయసి మాత్రమే కాదు. మేమిద్దరమూ కలిసి పని చేశాం. 283 00:21:03,972 --> 00:21:05,682 కాబట్టి, అది... 284 00:21:08,393 --> 00:21:09,394 అహా. 285 00:21:09,978 --> 00:21:12,189 -అదీ మరి. -మీరిద్దరూ ఏమైనా విడుదల చేశారా? 286 00:21:12,272 --> 00:21:13,607 అవును. విడుదల చేశాం. 287 00:21:14,274 --> 00:21:15,400 దాన్ని నేను వినవచ్చా? 288 00:21:16,443 --> 00:21:18,445 -ఏంటి, ఇప్పుడా? -అవును మరి. 289 00:21:20,781 --> 00:21:23,450 అవును, కానీ నువ్వేమనుకోవంటే, నాకు ఇప్పుడు వినిపించాలని లేదు. 290 00:21:24,284 --> 00:21:25,285 సరే. 291 00:21:26,828 --> 00:21:28,747 -నేను నిన్ను ఓ ప్రశ్న అడగవచ్చా? -ఏంటి? 292 00:21:29,248 --> 00:21:31,667 నువ్వు దాన్ని రికార్డ్ చేసేటప్పుడు నీ మనస్సులో ఏం ఉండింది? 293 00:21:31,750 --> 00:21:32,835 నీకు గుర్తు లేదా? 294 00:21:34,419 --> 00:21:35,420 నిజంగా? 295 00:21:36,046 --> 00:21:37,089 అవును, గుర్తు లేదు. 296 00:21:37,172 --> 00:21:39,049 అది దారుణం. అది నీకు గుర్తుండాల్సిన విషయం. 297 00:21:40,467 --> 00:21:41,468 క్షమించు. 298 00:21:42,219 --> 00:21:43,470 ఇప్పుడు నిన్ను నేను ఓ ప్రశ్న అడగవచ్చా? 299 00:21:44,596 --> 00:21:45,597 అడుగు. 300 00:21:45,681 --> 00:21:46,849 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 301 00:21:49,852 --> 00:21:53,564 కేవలం... సురక్షితంగా ఉంటున్నానంతే. 302 00:23:14,520 --> 00:23:15,521 అదీ లెక్క! 303 00:23:31,537 --> 00:23:32,538 లేదు. 304 00:23:35,249 --> 00:23:36,250 అవును. 305 00:23:38,627 --> 00:23:40,671 అదుగో, ఎట్టకేలకు బయటకు వచ్చేశాడు. 306 00:23:41,880 --> 00:23:43,966 అభినందనలు. మొత్తానికి బయట పడ్డావు. 307 00:23:44,049 --> 00:23:45,384 ధన్యవాదాలు. 308 00:23:45,467 --> 00:23:46,718 ఎలా ఉన్నావు? 309 00:23:46,802 --> 00:23:48,512 వాసన అయితే తెలుస్తోంది మరి. 310 00:23:48,595 --> 00:23:51,890 అది చాలా మంచి విషయం. నా దృష్టిలో నువ్వు చేసింది చాలా మంచి పని. 311 00:23:51,974 --> 00:23:55,686 అందరికీ అంతటి అకుంఠిత దీక్ష ఉండదు. 312 00:23:55,769 --> 00:23:57,312 -ధన్యవాదాలు. -కూర్చో. 313 00:23:58,230 --> 00:23:59,231 ధన్యవాదాలు. 314 00:24:05,654 --> 00:24:06,780 అది... 315 00:24:07,573 --> 00:24:11,660 ఏదో చేశానులే. ఎలాగూ నేను ఖాళీయే కదా? 316 00:24:11,743 --> 00:24:13,287 అవును. 317 00:24:13,370 --> 00:24:14,413 అది... 318 00:24:16,456 --> 00:24:17,916 నిజంగా చాలా గొప్ప విషయం. 319 00:24:18,625 --> 00:24:20,586 ధన్యవాదాలు. నీకు గుడ్లు కావాలా? 320 00:24:20,669 --> 00:24:21,837 తప్పకుండా. ధన్యవాదాలు. 321 00:24:30,679 --> 00:24:31,680 అవి చాలా బాగున్నాయి కదా? 322 00:24:32,598 --> 00:24:33,724 అవును. 323 00:24:34,349 --> 00:24:36,143 మీ అమ్మ చాలా విషయాల్లో గ్రేట్ అనే చెప్పాలి. 324 00:24:37,019 --> 00:24:38,228 అందులో సందేహమే లేదు. 325 00:24:40,522 --> 00:24:41,523 చాలా బాగుంది. 326 00:24:44,276 --> 00:24:45,277 హాయ్, అమ్మా. 327 00:24:45,819 --> 00:24:46,820 హాయ్. 328 00:24:50,115 --> 00:24:53,327 చాలా విచిత్రమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం కదా? 329 00:24:55,787 --> 00:24:57,039 అవుననుకుంటా. 330 00:24:58,165 --> 00:24:59,833 నువ్వు వార్తలను బాగా చూస్తావా, జోష్? 331 00:24:59,917 --> 00:25:01,585 మరీ అంతగా చూడననుకుంటా. 332 00:25:03,003 --> 00:25:04,713 నువ్వు అసలైన విషయాన్ని గమనిస్తావా 333 00:25:04,796 --> 00:25:07,633 లేదా మీడియా వాళ్ళు కూసే కారుకూతలను నమ్ముతావా? 334 00:25:08,467 --> 00:25:10,511 -ఆపు ఇక. -లేదు. లేదు. 335 00:25:11,220 --> 00:25:13,764 నాకు ఇది భలే నచ్చింది, బంగారం. అది నీకు చెప్పా కూడా. 336 00:25:14,515 --> 00:25:16,934 ఈ సమయంలో నీతో ఉండటం నాకు చాలా హాయిగా ఉంది, 337 00:25:17,017 --> 00:25:18,769 ఎందుకంటే, నువ్వు పెద్దపెద్ద విషయాల గురించి ఆలోచించవు. 338 00:25:18,852 --> 00:25:21,396 నీ చిన్న ప్రపంచంలో నువ్వు హాయిగా, సంతృప్తిగా జీవిస్తావు. 339 00:25:21,480 --> 00:25:24,233 చివరికి, అదే కదా మోక్ష మార్గం. 340 00:25:25,359 --> 00:25:26,527 ఒకేదానిపై దృష్టి కేంద్రీకరించడం. 341 00:25:31,490 --> 00:25:36,537 జోష్, నేనూ, ల్యారీ రోజూ అలా నడకకు వెళ్తూ ఉంటాం. 342 00:25:37,704 --> 00:25:38,956 నువ్వు కూడా మాతో పాటు వస్తావా? 343 00:25:39,039 --> 00:25:44,044 నేను మా విద్యార్థులతో కాసేపట్లో ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలి. కనుక... 344 00:25:45,963 --> 00:25:46,964 సరే. 345 00:25:47,673 --> 00:25:49,508 స్కూల్స్ మూతపడిపోయినా, మేము బోధించడం ఆపడంలేదు. 346 00:25:49,591 --> 00:25:53,136 ఏ సమయంలో ఉంటుంది? నీ క్లాస్ సమయంలో కాక వేరే సమయంలో వెళ్ళగలంలే. 347 00:25:53,220 --> 00:25:54,555 దాన్ని నేను ఒకసారి సరిచూసుకోవాలి. 348 00:25:55,764 --> 00:25:57,891 నువ్వు ఏ వయస్సు పిల్లలకు పాఠాలు చెప్తున్నావు? 349 00:25:57,975 --> 00:25:59,101 పది, పదకొండేళ్ళ పిల్లలకి. 350 00:25:59,601 --> 00:26:01,603 వాళ్ళు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? 351 00:26:03,313 --> 00:26:05,148 అంటే, వాళ్లు... ఎక్కువగా వాళ్ళు... 352 00:26:06,817 --> 00:26:10,571 నాకు తెలిసిన కొందరిలా, తమ చిన్ని ప్రపంచంలోనే హాయిగా గడుపుతున్నారు. 353 00:26:10,654 --> 00:26:12,155 జోష్, ఆపు ఇక. 354 00:26:15,951 --> 00:26:18,287 అది పర్వాలేదు. అది నిజంగానే... పర్వాలేదు. 355 00:26:18,871 --> 00:26:20,122 అది పర్వాలేదు. 356 00:26:20,205 --> 00:26:21,248 -అది నిజంగా... -లేత బూడిద రంగు స్క్వేర్లు. 357 00:26:21,331 --> 00:26:22,332 అది పర్వాలేదు. 358 00:26:22,416 --> 00:26:23,834 -విషయాలను అప్పటికప్పుడు... -అది పర్వాలేదు. 359 00:26:23,917 --> 00:26:26,253 -అది నిజంగా... పర్వాలేదు. -...పసిగట్టేయడం మామూలు విషయం కాదు. 360 00:26:26,336 --> 00:26:27,713 అది పర్వాలేదు. 361 00:26:27,796 --> 00:26:29,256 అది నిజంగానే... పర్వాలేదు. 362 00:26:29,339 --> 00:26:30,340 విక్టర్ 363 00:26:30,424 --> 00:26:32,301 అది పర్వాలేదు. నిజంగానే... 364 00:26:32,384 --> 00:26:35,470 అది పర్వాలేదు. నిజంగానే... అది పర్వాలేదు. 365 00:26:35,554 --> 00:26:36,555 హేయ్, గురూ. ఎలా ఉన్నావు? 366 00:26:36,638 --> 00:26:38,473 -కమాన్. -నీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. 367 00:26:38,557 --> 00:26:40,642 -ఇంకాస్త తీసుకో. -సరే. అలాగే. 368 00:26:41,268 --> 00:26:43,103 అబ్బా, మరీ చేదుగా ఉంది. 369 00:26:43,187 --> 00:26:46,440 -నాకు నచ్చలేదు. బాగా చేదుగా ఉంది. -అసలైన చాక్లెట్ అలాగే ఉంటుంది. 370 00:26:46,523 --> 00:26:48,483 నేను రుచిగా ఉండే మంచి చాక్లెట్లనే తింటాలే అయితే. 371 00:26:48,567 --> 00:26:51,111 బాగా తీయగా ఉంటాయి కనుకే అవి మంచివి అనుకుంటున్నావు. 372 00:26:51,195 --> 00:26:53,030 లేదు, నాకు అవంటే ఇష్టం కాబట్టి అవి మంచివి అనుకుంటున్నా. 373 00:26:53,113 --> 00:26:59,036 మిల్క్ చాక్లెట్లలో అసలైన చాక్లెట్ లో ఉన్నన్ని పోషకాలు అస్సలు ఉండనే ఉండవు. 374 00:26:59,620 --> 00:27:02,122 -నా దృష్టిలో కాదులే. -నీకు 'ఉండనే ఉండవు" అనేదానికి 375 00:27:02,206 --> 00:27:04,791 అర్థం తెలీదనుకుంటా. 376 00:27:04,875 --> 00:27:07,836 -నాకేది ఇష్టమో నాకు తెలుసు... -అయినా ఓ విషయం చెప్పనా? 377 00:27:07,920 --> 00:27:11,340 నీలో నాకు నచ్చేది అదే. అది భలే గమ్మత్తుగా ఉంటుంది. 378 00:27:12,049 --> 00:27:15,761 నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకుంటావులే. తెలుసుకుంటావులే. 379 00:27:33,362 --> 00:27:34,488 -హేయ్. -హాయ్. 380 00:27:35,030 --> 00:27:36,031 ల్యారీ ఎక్కడ? 381 00:27:36,907 --> 00:27:37,908 ఫోన్లో మాట్లాడుతున్నాడు. 382 00:27:37,991 --> 00:27:39,660 అది మంచి విషయం. 383 00:27:39,743 --> 00:27:41,578 -నువ్వు అలా... -నేను అలా చేయాలనుకోలేదు. 384 00:27:41,662 --> 00:27:43,872 -అతను కేవలం... -మన్నించు. నా ఉద్దేశం ఏంటంటే 385 00:27:43,956 --> 00:27:47,918 మనిద్దరం ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని. కేవలం మనిద్దరమే. 386 00:27:48,001 --> 00:27:50,546 అంటే, నేను ఇన్ని రోజులున్నా నాకు ఆ అవకాశమే రాలేదు. 387 00:27:55,217 --> 00:27:58,136 నువ్వేదో చెప్తుంటే నేను అడ్డు తగిలాను. అతను కేవలం ఏంటి? 388 00:27:58,220 --> 00:28:00,639 అతను నీతో కేవలం మంచిగా, మర్యాదగా ఉంటున్నాడంతే. 389 00:28:01,932 --> 00:28:02,933 అవును. 390 00:28:03,851 --> 00:28:04,852 నాతో ఉంటున్నాడు, నీతో కాదు. 391 00:28:05,352 --> 00:28:07,020 -ఆ విషయాన్ని వదిలేద్దామా? -సరే, మన్నించు. 392 00:28:07,104 --> 00:28:08,939 -ఇక దేని గురించైనా మాట్లాడుకుందాం. -మంచిది. 393 00:28:12,276 --> 00:28:13,986 -అతను నవ్వుతూనే తిట్టే రకమైన మనిషి. -అబ్బా. 394 00:28:14,069 --> 00:28:16,530 అతను నిన్ను తక్కువ చేస్తాడు, మళ్లీ అదేం లేదనట్టుగా ప్రవర్తిస్తాడు. 395 00:28:16,613 --> 00:28:18,824 -ప్రేమున్నట్టు నటిస్తాడు, కానీ నిజానికి... -అతనికి ప్రేమ ఉంది. 396 00:28:18,907 --> 00:28:20,200 దాన్ని ప్రేమ అని అనరు. 397 00:28:20,284 --> 00:28:22,077 నీకు ప్రేమ గురించి బాగా తెలుసా ఏంటి? 398 00:28:22,160 --> 00:28:24,663 నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు. అందులో నువ్వేమైనా తోపువా? 399 00:28:25,330 --> 00:28:27,374 నన్ను క్షమించు, కానీ నాన్న విషయంలో కూడా 400 00:28:27,457 --> 00:28:29,459 ఎప్పుడో నీకు సరిగ్గా ఇదే చెప్పుండేవాడిని... 401 00:28:29,543 --> 00:28:31,670 -అతను అసలు మీ నాన్నలాంటి వాడే కాదు. -...అప్పుడు కూడా నువ్వు ఇలాగే... 402 00:28:31,753 --> 00:28:33,172 -ఇతను కూడా నాన్నలాంటి వాడే. -కాదు. 403 00:28:33,255 --> 00:28:36,133 ఇతను నీకు ఏదో మాయామాటలు చెప్పి, నీలో అభద్రతాభావాన్ని కలిగిస్తాడు. 404 00:28:36,216 --> 00:28:38,135 ఆ తర్వాత, అతను నిన్ను మరింతగా ప్రేమించాలని నువ్వు కోరుకుంటావు, 405 00:28:38,218 --> 00:28:40,637 ఎందుకంటే, కారణం తెలీదు కానీ, నీకు అదంటేనే ఇష్టం. 406 00:28:40,721 --> 00:28:43,682 సరే. ఒక్క నిమిషం నేను చెప్పబోయేది వింటావా? 407 00:28:44,183 --> 00:28:45,309 అలాగే. 408 00:28:48,228 --> 00:28:50,397 ల్యారీ అన్నిట్లో పిస్తా అని నేను చెప్పడం లేదు. 409 00:28:50,480 --> 00:28:52,274 నేను... ఇక్కడ నా లక్ష్యం అది కాదు. 410 00:28:53,108 --> 00:28:55,444 అంటే, ఇదంతా... ఇదంతా ఏంటని నువ్వనుకుంటున్నావు? 411 00:28:55,527 --> 00:28:56,820 ఏ విషయం గురించి అడుగుతున్నావు? 412 00:28:56,904 --> 00:28:59,072 ఈ విషయం గురించి. అన్నీ లోపాలేవీ లేకుండా ఉండవు. 413 00:28:59,156 --> 00:29:01,408 అది నీకు ఎందుకు అర్థమవ్వడం లేదో నాకు తెలియడం లేదు. 414 00:29:01,491 --> 00:29:04,995 నీకు లోపాల్లేని మనిషి లేదా కష్టాల్లేని జీవితం దక్కుతుందనుకుంటే అది పొరపాటే. 415 00:29:05,078 --> 00:29:06,455 నీకు దక్కేది నువ్వు స్వీకరించాలంతే. 416 00:29:06,997 --> 00:29:08,999 నువ్వు బతికి ఉండటమే మహా ప్రసాదంగా భావించాలి. 417 00:29:09,082 --> 00:29:11,293 చాలా మంది కంటే నీ స్థితి చాలా మెరుగ్గా ఉంది. 418 00:29:11,376 --> 00:29:13,170 ఇప్పుడు మనం మాట్లాడుకొనేది నా గురించి కాదు. 419 00:29:13,253 --> 00:29:14,546 అవును, మనం నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 420 00:29:15,130 --> 00:29:16,465 అయితే నువ్వు ప్లేటు మారుస్తున్నావు. 421 00:29:16,548 --> 00:29:19,259 మనం నీ గురించి, ల్యారీ గురించి మాట్లాడుకుంటున్నాం, నా గురించి కాదు. 422 00:29:19,343 --> 00:29:20,761 నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 423 00:29:20,844 --> 00:29:23,222 నీ పనే ఇది. నువ్వు... తప్పులను ఎత్తి చూపుతావు. 424 00:29:23,931 --> 00:29:26,767 నువ్వు ఫలానా విషయం అతి దారుణంగా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తావు, 425 00:29:26,850 --> 00:29:29,186 అలా ఆలోచించి, అంతా అంతేలే అనుకుంటావు. 426 00:29:31,480 --> 00:29:34,149 -నేను చేసేది అదే అంటావా? -అవును, అదే. 427 00:29:39,321 --> 00:29:41,657 అంటే, మొత్తం దారుణంగానే ఉంది, కదా? 428 00:29:41,740 --> 00:29:42,741 అవునా? 429 00:29:43,242 --> 00:29:44,368 అవును. ఓసారి చుట్టూ చూడు. 430 00:29:44,451 --> 00:29:46,912 సరే. ఏం చూడాలంటావు? 431 00:29:47,704 --> 00:29:48,747 నీ ఆరోగ్యం ఏమైనా దెబ్బ తిందా? 432 00:29:50,332 --> 00:29:52,292 ఏంటి? వాళ్ళు డిస్నీల్యాండ్ ని మూసేయాల్సి వచ్చింది. 433 00:29:52,376 --> 00:29:53,502 అంతేనా? 434 00:29:53,585 --> 00:29:55,003 నువ్వు రాక్ స్టార్ వి అవ్వలేకపోయావా? 435 00:29:55,087 --> 00:29:56,088 నేనేమీ అలా అనలేదు... 436 00:29:56,171 --> 00:29:59,258 అవును. రాక్ స్టార్ కావాలని ఎవరు కలలు కన్నారో నీకు తెలుసు, కదా? 437 00:30:02,135 --> 00:30:03,136 అవును. 438 00:30:04,263 --> 00:30:05,264 సరే. 439 00:30:06,932 --> 00:30:08,058 మనకి ఇంతే ప్రాప్తం అనుకుందాం. 440 00:30:11,019 --> 00:30:13,564 మనం ఇప్పుడు ఏం చేయాలన్నదే ప్రశ్న. 441 00:30:27,286 --> 00:30:29,746 "నేను ఊపిరి బిగపట్టుకొని, ఎదురు చూడసాగాను." 442 00:30:29,830 --> 00:30:31,039 స్కాట్ ఓడెల్ "ఐల్యాండ్ ఆఫ్ ద బ్లూ డాల్ఫిన్స్" 443 00:30:31,123 --> 00:30:32,332 "ఆ తర్వాత డెక్ మీదకి వచ్చాను, 444 00:30:32,416 --> 00:30:35,794 ఎన్నో చేతులు నన్ను ఆపాలని చూసినా, 445 00:30:35,878 --> 00:30:37,421 సముద్రంలోకి దూకేశాను." 446 00:30:42,801 --> 00:30:44,928 ఏమీ అనను, పరీక్ష చేయించుకున్నాను ఏదేమైనా నెగెటివ్ వచ్చింది 447 00:30:45,012 --> 00:30:46,638 ఇంకా... 448 00:30:51,727 --> 00:30:55,731 "నా తల మీద నుండి ఒక అల వెళ్లింది, నేను మళ్లీ ఇక వెలుతురును 449 00:30:56,315 --> 00:30:58,984 చూడలేనేమో అన్నంతగా లోలోతుల్లోకి మునగసాగాను. 450 00:31:02,696 --> 00:31:06,867 నేను పైకి తేలేసరికి ఓడ చాలా దూరంలో ఉంది. దాని తెరచాపలు మాత్రమే కనబడుతున్నాయి. 451 00:31:11,872 --> 00:31:16,668 నా సామాన్లన్నీ ఉన్న గంపని ఇంకా అలానే పట్టుకొని ఉన్నాను, 452 00:31:16,752 --> 00:31:21,507 కానీ అది చాలా బరువుగా ఉంది, దాన్ని పట్టుకొని నేను ఈదలేనని గ్రహించాను. 453 00:31:28,889 --> 00:31:32,351 దాన్ని వదిలేసి, తీరం వైపు ఈదడం మొదలుపెట్టాను." 454 00:32:58,103 --> 00:33:00,105 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య