1 00:00:24,816 --> 00:00:26,485 మరొక రోజు గడిచిపోయింది 2 00:00:26,568 --> 00:00:30,280 -నీకు కూడా వయసైపోతోంది -మాకు దూరమైపోతున్నావు 3 00:00:31,156 --> 00:00:35,577 నీకు ఇష్టమైన చోటే నువ్వు ఉండే రకమైన మనిషివి కావు 4 00:00:35,661 --> 00:00:38,038 ప్రేమకి సమయం పడుతుంటారు 5 00:00:38,121 --> 00:00:41,333 మరి నా సమయం ఎందుకు వృథా చేస్తావు? 6 00:00:41,416 --> 00:00:43,293 నాతో నిజాయితీగా ఉండు 7 00:00:43,377 --> 00:00:46,839 నువ్వు దూరమై చాలా కాలమైంది 8 00:00:47,589 --> 00:00:51,468 -చాలా చాలా కాలమైపోయింది -చాలా కాలమైపోయింది 9 00:01:01,270 --> 00:01:02,479 ధన్యవాదాలు. 10 00:01:25,836 --> 00:01:27,045 -ఎట్టకేలకు మనం వేదిక ఎక్కాం. -అవును. 11 00:01:28,213 --> 00:01:29,715 -మనం విజయం సాధిస్తున్నాం. -అవును. 12 00:01:35,345 --> 00:01:36,847 హేయ్, మిత్రులారా. మీరు చాలా బాగా పాడారు. 13 00:01:36,930 --> 00:01:39,141 -నేను మీతో కొన్ని విషయాలు చర్చించాలని... -ధన్యవాదాలు. 14 00:01:39,224 --> 00:01:41,226 షో అయ్యాక మాట్లాడుకుందామా? 15 00:01:41,310 --> 00:01:43,228 -దేవుడా. తప్పకుండా. -ధన్యవాదాలు. 16 00:01:44,897 --> 00:01:46,231 వావ్. 17 00:01:49,401 --> 00:01:51,028 మనం ఆఖరి పాటను మారుద్దాం. 18 00:01:51,945 --> 00:01:53,572 నిజంగా. మనం మార్చితే బాగుంటుందనుకుంటా. 19 00:01:54,573 --> 00:01:56,575 అవును. మనం అలా చేయలేం. 20 00:01:57,993 --> 00:02:01,205 -నీకు వేరేది పాడాలని లేదా? -అలాగే... 21 00:02:01,288 --> 00:02:03,999 -నీకు కూడా వేరేది పాడాలనే ఉంది. లేదు. -...కానీ మనం ఏం పాడాలో నీకు తెలుసు. 22 00:02:05,334 --> 00:02:06,335 లేదు. 23 00:02:08,419 --> 00:02:10,923 నువ్వు వేరే పాటను పాడాల్సి వస్తే, ఏ పాటని పాడతావు? 24 00:02:11,006 --> 00:02:12,424 ఏం పాడతావు? 25 00:02:14,676 --> 00:02:15,677 "హై లో." 26 00:02:17,012 --> 00:02:19,681 అది బాగుంటుంది. బాగానే ఉంటుంది. 27 00:02:19,765 --> 00:02:22,059 ఓరి దేవుడా. ఒక్క నిమిషం, నాకు భలే ఐడియా తట్టింది. 28 00:02:22,559 --> 00:02:23,644 "కోట్ మీ" పాడదాం. 29 00:02:24,728 --> 00:02:26,396 అదయితే ఇప్పుడు సరిగ్గా ఉంటుంది. 30 00:02:27,689 --> 00:02:29,107 అవును కదా? 31 00:02:29,191 --> 00:02:31,026 -గ్రెగ్ కి, లియాకి నువ్వు చెబుతావా? -సరే. 32 00:02:32,361 --> 00:02:33,362 ఐ లవ్ యూ. 33 00:02:49,086 --> 00:02:50,796 లాస్ ఏంజలెస్. 34 00:02:54,341 --> 00:02:56,093 నాకు ఈ నగరమంటే చచ్చేంత పిచ్చి. 35 00:02:57,636 --> 00:03:00,597 జోష్ కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు. 36 00:03:00,681 --> 00:03:02,683 -818 ప్రాంతపు మిత్రులారా, ఎలా ఉన్నారు? -యా! 37 00:03:02,766 --> 00:03:03,976 విన్నాను. 38 00:03:05,727 --> 00:03:10,607 సరే మరి. మీ కోసం ఆఖరి పాట పాడే ముందు, 39 00:03:10,691 --> 00:03:12,651 నేను మీరందరూ ఇక్కడికి 40 00:03:12,734 --> 00:03:15,195 వచ్చినందుకు మేము కృతజులం అని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 41 00:03:15,904 --> 00:03:17,155 మేము ఇక్కడ ఉన్నామంటే, 42 00:03:17,239 --> 00:03:20,492 ఈ గదిలో ఉన్నామంటే, అదొక అద్భుతమనే చెప్పాలి. 43 00:03:21,827 --> 00:03:24,913 మీరు ఈ భూమి మీద పుట్టిననాటి నుండి మీరు ఈ దశకు చేరుకోవడానికి 44 00:03:26,290 --> 00:03:30,043 దోహదపడిన చిన్న చిన్న విషయాలన్నింటి గురించి ఓ సారి ఆలోచించుకోండి. 45 00:03:30,961 --> 00:03:32,838 కానీ, చివరకు మీరు లాస్ ఏంజలెస్ కి రావాల్సి వచ్చింది. 46 00:03:33,380 --> 00:03:37,384 నాలాగా మీరు ఇక్కడికి రావాలనుకున్నారేమో, లేదా జోష్ లా మీరు పుట్టింది ఇక్కడేనేమో. 47 00:03:39,428 --> 00:03:42,598 ఆ తర్వాత ఇటీవలే, మీరు ఈ షో గురించి విన్నారు. 48 00:03:42,681 --> 00:03:45,893 మీరు ఇక్కడికి వద్దామనుకున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. 49 00:03:46,977 --> 00:03:49,313 ఈ దారిలో, అనేక పరిస్థితుల వలన 50 00:03:49,396 --> 00:03:51,440 మీరు వేరే మార్గాలను కూడా ఎంచుకొని ఉండవచ్చు. 51 00:03:51,523 --> 00:03:54,526 మీరు వేరే ఎంపికను ఎంచుకొని ఉండవచ్చు 52 00:03:54,610 --> 00:03:57,654 లేదా మీ నియంత్రణలో లేని ఒక విషయం జరిగి ఉండవచ్చు. 53 00:04:00,365 --> 00:04:02,534 మీరు ఇప్పుడు వేరే చోట ఉండుండవచ్చు. 54 00:04:04,077 --> 00:04:05,871 మీరు వేరే మనిషి అయ్యుండవచ్చు. 55 00:04:07,581 --> 00:04:08,415 మీరు సిద్ధంగా ఉన్నారా? 56 00:04:12,294 --> 00:04:13,504 కానీ మీరు వేరే మనిషి కాదు. 57 00:04:14,338 --> 00:04:15,631 మీరు మీరే. 58 00:04:16,173 --> 00:04:20,677 మీరు ఇప్పుడు ఇక్కడే మాతో పాటు ఉన్నారు. 59 00:04:22,971 --> 00:04:24,181 కాబట్టి మీరంటే మాకు ఎనలేని అభిమానం. 60 00:04:24,264 --> 00:04:26,141 మాకు కూడా! 61 00:04:28,936 --> 00:04:30,437 ఈ పాట పేరు "కోట్ మీ." 62 00:04:31,480 --> 00:04:33,565 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 63 00:05:22,072 --> 00:05:23,407 "జూడిత్." 64 00:05:24,700 --> 00:05:26,285 -హలో? -హాయ్. మీరు జూడిత్ 65 00:05:26,368 --> 00:05:27,828 -అవును. -హాయ్, జూడిత్. నా పేరు జోష్. 66 00:05:27,911 --> 00:05:29,246 -మీరు ఎలా ఉన్నారు? -బాగున్నాను. 67 00:05:29,329 --> 00:05:32,499 జూడిత్, మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? డబ్బును ఆదా చేయాలని మీకనిపించిందా? 68 00:05:33,375 --> 00:05:36,587 దీనికి మంచి రివ్యూలు వస్తున్నాయి. 69 00:05:37,212 --> 00:05:40,048 ఆన్లైన్లో డబ్బులు ఇచ్చి కూడా రివ్యూలు తెచ్చుకోవచ్చు. 70 00:05:40,132 --> 00:05:43,051 అది నిజమే, కానీ నేను వీటి రివ్యూలను చదివాను. అవి నిజమైనవిగానే అనిపించాయి. 71 00:05:43,760 --> 00:05:47,014 -అవి నిజమని నీకెలా తెలుస్తుంది. -ఎందుకంటే నేను వాటిని చదివా కాబట్టి. 72 00:05:47,097 --> 00:05:49,016 నాకు తెలుసు. నువ్వు వాటిని చదవడాన్ని నేను చూశాను. 73 00:05:49,725 --> 00:05:51,101 సరే, నువ్వు దేని ఆధారంగా తీసుకోవాలనుకుంటున్నావు? 74 00:05:51,894 --> 00:05:53,437 ఇప్పుడు, అది కూడా నా మీదే వేస్తున్నావా? 75 00:05:53,937 --> 00:05:55,856 నువ్వు నన్నేం చేయమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 76 00:05:55,939 --> 00:05:58,567 ఒక ఎదిగినవాడిలా ప్రవర్తించి, నిర్ణయం తీసుకో. 77 00:05:58,650 --> 00:06:00,485 సరే. ఇదెలా ఉందంటావు? 78 00:06:01,028 --> 00:06:03,071 -అది ఇందాక చూపించిందే కదా. -అవును. 79 00:06:03,155 --> 00:06:05,032 బాబోయ్. జోష్. నువ్వు నాకు చిర్రెత్తిస్తున్నావు. 80 00:06:05,115 --> 00:06:07,075 వెళ్లి సోఫీని తీసుకురా చాలు. అదొక జిరాఫ్ బొమ్మ. 81 00:06:20,923 --> 00:06:22,925 మాకు మరో దారి లేదు. 82 00:06:23,550 --> 00:06:25,719 మాకు తినడానికి ఏమీ లేదు. 83 00:06:25,802 --> 00:06:28,305 మీ ప్రాణానికి ముప్పు ఉందని మీకు అనిపించిందా? 84 00:06:29,014 --> 00:06:34,144 మేము చాన్నాళ్ళు ఏమీ తినలేదు. అక్కడే ఉంటే తప్పకుండా చనిపోయేవారం. 85 00:06:34,228 --> 00:06:37,272 -మేము చనిపోయేవాళ్ళం. -నాకు తెలుసు, మీరు అదంతా 86 00:06:37,356 --> 00:06:39,399 అనుభవించాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. 87 00:06:39,483 --> 00:06:43,654 కానీ మీకు అమెరికాలో ఆశ్రయం కల్పించడానికి, 88 00:06:43,737 --> 00:06:46,740 మీరు దారుణ హింసకు బలయ్యారని నేను నిరూపించాల్సి ఉంటుంది. 89 00:06:47,991 --> 00:06:52,079 లేకపోతే, మీకు ఇక్కడ కొలంబియాలో పనికి కావలసిన అనుమతులను సంపాదించగలను. 90 00:06:55,249 --> 00:06:56,917 సరేనా? 91 00:06:59,753 --> 00:07:03,841 అయితే, మీ ప్రాణానికి ముప్పు ఉందని మీకు అనిపించిందా? 92 00:07:05,300 --> 00:07:06,885 -అవును. -సరే. మంచిది. 93 00:07:06,969 --> 00:07:08,303 మోయెట్ 94 00:07:11,056 --> 00:07:12,099 చాలా చాలా ధన్యవాదాలు. 95 00:07:12,182 --> 00:07:13,433 -మన్నించాలి, మీ పేరేంటి? -ఆస్ట్రిడ్. 96 00:07:13,517 --> 00:07:17,855 ఆస్ట్రిడ్. మా సంస్థకు ఈ అత్యంత ప్రతిభావంతమైన బృందం ఎంత 97 00:07:17,938 --> 00:07:19,147 తెచ్చిపెట్టిందో మీకు తెలుసుకోవాలనుందా, ఆస్ట్రిడ్? 98 00:07:19,231 --> 00:07:20,440 అది చిన్నాచితకా మొత్తం కాదు. 99 00:07:20,524 --> 00:07:22,109 -ఎంతో మీకు తెలుసుకోవాలనుందా? -పర్వాలేదు. వద్దులే. 100 00:07:22,192 --> 00:07:23,569 ఏమైంది. అది అందరికీ తెలిసేలా చెప్పడంలో ఉండే మజాయే వేరు. 101 00:07:23,652 --> 00:07:25,404 చివరి లెక్క ఎంత తేలింది? డెబ్బై ఆరు ఎంత? 102 00:07:25,487 --> 00:07:26,738 డెబ్బై ఆరు, నాలుగు అయిదు. 103 00:07:26,822 --> 00:07:31,660 76,450,000 డాలర్లు. కమాన్. అది కళ్ళు బైర్లు కమ్మేంత మొత్తం. 104 00:07:31,743 --> 00:07:33,078 ఆస్ట్రిడ్, ఈ కష్టపడి పని చేసిన 105 00:07:33,161 --> 00:07:35,914 విజయవంతమైన వ్యక్తుల విషయంలో మీకు సంతోషంగా అనిపించడం లేదా? 106 00:07:35,998 --> 00:07:38,333 మీ అందరి విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అభినందనలు. 107 00:07:38,417 --> 00:07:40,711 అది మీ మంచితనం. ధన్యవాదాలు, ఆస్ట్రిడ్. 108 00:07:40,794 --> 00:07:42,754 -అందరికీ చీర్స్. -చీర్స్! 109 00:07:43,589 --> 00:07:44,590 అదీ. 110 00:07:47,676 --> 00:07:50,304 పీటర్, ఈ విజయంలో మీకు బాగా నచ్చిన అంశమేంటి? చెప్పండి. 111 00:07:50,804 --> 00:07:54,266 నేను అయితే, ఆగస్ట్ లో జరిగినదాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. 112 00:07:54,349 --> 00:07:56,185 నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసే ఉంటుంది. 113 00:07:56,268 --> 00:07:57,436 -తెలుసు. -ఓరి దేవుడా. 114 00:07:57,519 --> 00:07:59,188 ఈ ఒప్పందమంతా రద్దు కాబోయే దశలో ఉండింది. 115 00:07:59,271 --> 00:08:02,024 ఆఖరి నిమిషంలో విల్సన్ వచ్చి మనల్ని కాపాడకపోయుంటే 116 00:08:02,107 --> 00:08:04,067 నేను కూడా తీవ్ర నిరాశకి గురయ్యుండేవాడిని. 117 00:08:05,694 --> 00:08:07,946 -ఒక్కోసారి అదృష్టం కలసివస్తుందనుకుంటా. -అంతే, అంతే. 118 00:08:09,072 --> 00:08:13,285 -కానీ, ఎన్ని మలుపులు తిరిగిందో. -మన్నించు, ఒక్క నిమిషం. 119 00:08:13,368 --> 00:08:16,246 -నీ ప్రతిభని నువ్వు తక్కువ చేసుకోకూడదు. -ఎమన్నావు? 120 00:08:16,330 --> 00:08:18,081 ఇంత పెద్ద విజయాన్ని నువ్వు అదృష్టమని చెప్తున్నావు. 121 00:08:18,165 --> 00:08:21,168 మన అదృష్టం వల్లనే ఇలా జరిగింది అంటున్నావు. అది న్యాయం కాదు. 122 00:08:21,251 --> 00:08:22,503 నేను ఏమంటున్నానంటే... 123 00:08:22,586 --> 00:08:25,839 నీ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ మాటలనేవి చాలా ముఖ్యమైనవి, 124 00:08:25,923 --> 00:08:29,301 కేవలం అదృష్టం వల్లనే మనం ఇవాళ పార్టీ చేసుకోవడం లేదు, కదా? 125 00:08:29,384 --> 00:08:32,971 ఈ ఒప్పందం కోసమే మనం రెండేళ్ళుగా రాత్రనకా పగలనకా కష్టపడి పని చేశాం. 126 00:08:33,054 --> 00:08:35,640 పీటర్, నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. అంటే... 127 00:08:35,724 --> 00:08:39,227 ఈ ఒప్పందం రద్దయ్యేదే కాదు, ఎందుకంటే మనం రద్దవ్వనివ్వం కనుక. 128 00:08:39,311 --> 00:08:41,480 ఆగస్టులో మనం కష్టాలు ఎదురైన మాట వాస్తవమే. 129 00:08:41,563 --> 00:08:43,899 అందుకు విల్సన్ పరిష్కారం అందించిన మాట కూడా వాస్తవమే. 130 00:08:43,982 --> 00:08:46,818 కానీ వాళ్ల ప్రమేయం లేకపోయినా కానీ మనం ఏదోక మార్గం కనిపెట్టుండేవాళ్ళం, 131 00:08:46,902 --> 00:08:48,278 ఎందుకంటే మనం గెలవాలనే కసితో పని చేస్తున్నాం. 132 00:08:48,362 --> 00:08:49,446 ధన్యవాదాలు, ఆస్ట్రిడ్. 133 00:08:49,530 --> 00:08:53,575 అదృష్టం గురించి ఎవరు మాట్లాడతారో తెలుసా? జూదరులూ, ఓడిపోయేవాళ్లు. 134 00:08:53,659 --> 00:08:56,703 మన్నించాలి, అది కాస్త కటువుగానే ఉంటుంది, కానీ అదే నిజం. 135 00:08:56,787 --> 00:09:00,082 ఎవరైనా "నా పని సఫలం కాలేదు. నా అదృష్టం బాగాలేదు," అని అంటే, 136 00:09:00,165 --> 00:09:01,458 వాళ్ళు పని చేతగాని వాళ్ళే అని అర్థం. 137 00:09:01,542 --> 00:09:04,545 కానీ మన నలుగురం పని చేతగానివాళ్ళం కాదు. 138 00:09:04,628 --> 00:09:08,048 అది నిరూపించడానికి, మన బ్యాంక్ ఖాతాలో కొత్తగా ఏడు కోట్ల డెబ్బై లక్షలు చేరింది. 139 00:09:08,131 --> 00:09:10,008 మీరు గర్వంతో ఉప్పొంగిపోవాలి. 140 00:09:10,092 --> 00:09:13,220 "మనం నక్క తోకని తొక్కాం," అని అనుకుంటూ ఇంటికి వెళ్లకూడదు. 141 00:09:13,303 --> 00:09:16,181 గెలిస్తే నిజంగా ఎంత సంతృప్తి దక్కుతుందో, ఆ సంతృప్తితో 142 00:09:16,265 --> 00:09:18,392 మీరు ఇంటికి వెళ్లాలి. 143 00:09:18,475 --> 00:09:20,352 ఇంకా, పూర్తి నమ్మకంతో, ఏ సందేహమూ లేకుండా 144 00:09:20,435 --> 00:09:22,187 మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, 145 00:09:22,271 --> 00:09:24,815 మనం కష్టపడ్డాం కాబట్టే నేడు మనం గెలిచాం. 146 00:09:32,739 --> 00:09:33,740 దానికి నేను ఆనందంగా తాగుతాను. 147 00:09:50,340 --> 00:09:52,467 -హాయ్, ఆస్ట్రిడ్. -ఎలా ఉన్నారు? 148 00:09:53,218 --> 00:09:54,386 ఈ రోజు చాలా మంచి రోజు. 149 00:09:54,887 --> 00:09:56,305 మీరు చాలా ఎక్కువ తాగారు. 150 00:09:58,182 --> 00:10:01,727 అవును, అంటే, అది వ్యక్తిగత సామర్థ్యం మీద ఆధారపడుంటుంది. 151 00:10:01,810 --> 00:10:02,811 నా సామర్థ్యం చాలా ఎక్కువ. 152 00:10:02,895 --> 00:10:07,316 కానీ, ఇక్కడున్న వాళ్లందరికీ నేను ఒక డ్రింక్ ఇవ్వాలనుకుంటున్నాను. 153 00:10:09,026 --> 00:10:12,613 కాదు, ఇది నా జీవితంలో చాలా ప్రత్యేకమైన క్షణం, అందుకే. 154 00:10:12,696 --> 00:10:17,659 నా జీవితమే పూర్తిగా మారిపోయింది, ఇప్పుడు నేను కుబేరుడిని. 155 00:10:17,743 --> 00:10:19,077 ఈరోజు నుండే అన్నమాట. 156 00:10:19,161 --> 00:10:21,747 నేను పుట్టుకతో ధనవంతుడిని కాదు, కానీ ఇప్పుడు అపర కుబేరుడిని అయ్యాను. 157 00:10:21,830 --> 00:10:24,499 ఇప్పుడు ఇక్కడున్నవాళ్ళందరూ నాకు సన్నిహితులతో సమానం, 158 00:10:24,583 --> 00:10:27,252 ఎందుకంటే, నేను ధనవుంతుడిని అయినప్పుడు, నాతో వీళ్ళే ఉన్నారు. 159 00:10:27,336 --> 00:10:30,088 కాబట్టి నేను వాళ్లకి ఒక డ్రింక్ ఇవ్వాలనుకుంటున్నా. 160 00:10:31,882 --> 00:10:34,843 అది చాలా గొప్ప విషయం, కానీ, ఇక్కడ చాలా మంది ఉన్నారు. 161 00:10:34,927 --> 00:10:36,053 మీకు ఇక్కడున్న అందరూ కనబడకపోవచ్చు. 162 00:10:36,136 --> 00:10:39,014 పర్వాలేదు. విషయం అది కాదు. నా బిల్ ఆకాశాన్ని అంటాలి. 163 00:10:39,097 --> 00:10:43,352 నాకు ఆ దిమ్మదిరిగే బిల్ ని కట్టేసి, ఇక దాని గురించి పట్టించుకోకూడదని ఉంది. 164 00:10:44,520 --> 00:10:48,565 నేను ఇప్పుడు ఆ అనుభూతి కోసం ఎదురు చూస్తున్నాను. 165 00:10:48,649 --> 00:10:51,193 ఆ విషయంలో మీరు... మీరు నాకు సాయపడగలరా? 166 00:10:52,694 --> 00:10:54,404 వాళ్లకి ఏం ఇవ్వాలనుకుంటున్నారు? 167 00:10:55,906 --> 00:10:57,241 డాన్ హూలియో. 168 00:10:59,076 --> 00:11:02,579 సరే, నేను అందరినీ లెక్కపెడతాను, ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలనుకుంటున్నారా? 169 00:11:02,663 --> 00:11:04,998 ఈ చోట ఉన్న అదృష్టవంతులందరికీ ఒక్కటి ఇవ్వాలనుకుంటున్నాను. 170 00:11:05,707 --> 00:11:06,542 మీరు భలే సరదగా మాట్లాడుతున్నారు. 171 00:11:06,625 --> 00:11:08,836 హేయ్, ఒక్క నిమిషం. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. 172 00:11:08,919 --> 00:11:10,796 -చెప్పండి. -మీకు రేపు ఏమైనా పని ఉందా? 173 00:11:11,505 --> 00:11:14,258 ఎందుకంటే, నేను వేరే ప్రాంతంలో ఉన్న బీచ్ కి వెళ్తున్నాను, 174 00:11:14,341 --> 00:11:16,343 మిమ్మల్ని కూడా నాతో రమ్మని అడుగుతున్నాను. 175 00:11:16,927 --> 00:11:20,138 -అందరికీ డాన్ హూలియో ఇస్తానులెండి. -అరెరే. నేను నిజంగా అడుగుతున్నాను. 176 00:11:20,222 --> 00:11:21,223 నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. 177 00:11:22,516 --> 00:11:24,935 అతని ఏడాది సంపాదన ఎంత? 178 00:11:25,561 --> 00:11:27,187 -సర్... -లేదు. ఎంత సంపాదిస్తాడో చెప్పండి. 179 00:11:28,355 --> 00:11:31,567 మీరు మరీ ఎక్కువ తాగినట్టున్నారు. మీరు ఇక ఇంటికెళ్తే మంచిది. 180 00:11:31,650 --> 00:11:33,443 అడుగుతుంటే అలా వెళ్లిపోతారేంటి! 181 00:11:33,527 --> 00:11:35,654 -హేయ్! ఎంత సంపాదిస్తాడని అడిగానా? -సర్. 182 00:11:35,737 --> 00:11:36,947 ఎంత సంపాదిస్తాడు? 183 00:11:37,030 --> 00:11:38,323 -ఎంత సంపాదిస్తాడు? -సర్! 184 00:11:38,407 --> 00:11:41,118 నన్ను వదలండి! వదలమన్నానా! 185 00:11:41,201 --> 00:11:43,245 ఎంత సంపాదిస్తాడే, బలిసిన దానా? 186 00:13:19,967 --> 00:13:22,261 లాస్ ఏం జలెస్ 187 00:13:22,344 --> 00:13:23,512 జోష్, నిదానంగా నడుపు. 188 00:13:24,805 --> 00:13:26,014 నాకు ఆలస్యంగా వెళ్లాలని లేదు. 189 00:13:26,098 --> 00:13:27,432 మనమేమీ ఆలస్యంగా వెళ్లడం లేదులే. 190 00:13:30,561 --> 00:13:32,104 నువ్వు ఎక్కడికైనా ముందుగానే వెళ్లాలనుకుంటావు, 191 00:13:32,187 --> 00:13:35,148 అక్కడికి చేరుకోగానే, ఇక బయలుదేరుదామంటావు. 192 00:13:36,525 --> 00:13:39,027 సరే, అలా నేనొక్కడినే కాదు కదా ఉండేది. అందరూ అంతే. 193 00:13:39,111 --> 00:13:40,571 కానీ నువ్వు ఇంకాస్త ఎక్కువ. 194 00:13:44,283 --> 00:13:47,244 -ఇవాళ అంతా హడావిడిగా ఉంది, అందుకే... -నాకు తెలుసు, నాకు తెలుసు. 195 00:13:51,373 --> 00:13:52,666 ఆమెకి సిద్ధంగా ఉండమని చెప్పావా? 196 00:13:53,250 --> 00:13:57,129 తను మనల్ని ముందు కలుసుకుంటుంది, కానీ తన ఉదయం సరిగ్గా గడవలేదనుకుంటా. 197 00:13:57,212 --> 00:13:58,422 అందులో వింత లేదులే. 198 00:13:59,006 --> 00:14:01,383 సర్లే. తను... 199 00:14:01,466 --> 00:14:04,636 తను చాలా అనుభవించింది. 200 00:14:05,137 --> 00:14:06,805 -కావచ్చు. -కావచ్చు... 201 00:14:08,849 --> 00:14:10,184 "కావచ్చు" అంటే? 202 00:14:11,393 --> 00:14:14,897 ఏమో. అంటే, తను కష్టాలు అనుభవిస్తోందని తెలుసు. 203 00:14:14,980 --> 00:14:17,608 అంటే... తను ప్రతీదానికి అదే సాకుగా వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. 204 00:14:19,109 --> 00:14:22,279 నువ్వు బాగున్నావని, తను బాగా లేదని. 205 00:14:22,362 --> 00:14:25,199 అవును. కానీ నిజంగానే నాకంతా బాగానే ఉంది కదా. 206 00:14:26,617 --> 00:14:27,618 నాకు నువ్వు దక్కావు. 207 00:14:30,120 --> 00:14:31,455 వెనుకనున్న బుడ్డోడు దక్కాడు. 208 00:14:33,165 --> 00:14:35,417 వాడి కాళ్ళను చూడు. 209 00:14:36,376 --> 00:14:38,295 వాటిని చూడు. ఎంత లడ్డుగా ఉన్నాయో. 210 00:14:38,378 --> 00:14:40,047 వాడు భలే ముద్దుగా, లడ్డుగా ఉన్నాడు. 211 00:14:42,674 --> 00:14:44,384 ఇంకా క్షేమంగా కూడా ఉన్నాడు. 212 00:14:44,468 --> 00:14:46,094 అందుకే కాస్త నెమ్మదిగా నడపమని అడుగుతున్నాను. 213 00:14:46,720 --> 00:14:48,597 సరే. ఆపుతున్నాను. 214 00:14:49,932 --> 00:14:52,893 నువ్వు చెప్పావని కాదు, మనం వచ్చేసినందుకు ఆపాను. 215 00:14:54,436 --> 00:14:57,272 -ఇంటి ముందే ఉంటుందనుకున్నానే. -అవును. 216 00:15:00,943 --> 00:15:02,486 -నాకు తెలుసు. మన్నించు. -హాయ్. 217 00:15:02,569 --> 00:15:05,197 హాయ్. నా దగ్గర మంచి బట్టలేమీ లేవు. 218 00:15:05,280 --> 00:15:09,910 అంటే, వాషింగ్ మెషీన్ లో ఎప్పుడు చూసినా ఎదురుగా 44వ ఇంట్లో ఉండే 219 00:15:09,993 --> 00:15:11,745 ఒకావిడ బట్టలే ఉంటాయి. 220 00:15:11,828 --> 00:15:14,081 నాకు వాషింగ్ మెషీన్ కావాలని రెండు గంటల క్రితం తనకి చెప్పాను, 221 00:15:14,164 --> 00:15:16,834 అప్పుడు తను "నా బట్టలు తీసేసి, వాషింగ్ మెషీన్ మీద పెట్టు," అంది. 222 00:15:16,917 --> 00:15:18,752 "ఒసేయ్, నీ బట్టలతో నాకేం పనే," అని అన్నాను. 223 00:15:18,836 --> 00:15:21,839 -అదన్నమాట సంగతి. -అవును. అది భలే వింతగా ఉంది. 224 00:15:21,922 --> 00:15:23,757 -అవును. -ఈ బట్టలతోనే వచ్చేస్తావా? 225 00:15:23,841 --> 00:15:26,176 -ఈ బట్టలతోనే రాలేను. -రావచ్చు అనుకుంటా. 226 00:15:26,260 --> 00:15:27,719 ఎందుకు నేనేం చెప్పినా విభేదిస్తావు? 227 00:15:27,803 --> 00:15:31,306 నీతో విభేదించినందుకు మన్నించు. సమయం మించిపోతుంది కదా, అందుకనే. 228 00:15:31,390 --> 00:15:34,226 సరే, బాసూ. నాతో అలా ఎంతో పద్ధతిగల మనిషిగా మాట్లాడకు. 229 00:15:34,309 --> 00:15:35,769 నువ్వేదో వివేకవంతుడివి అయినట్టు, 230 00:15:35,853 --> 00:15:37,145 -నేనేదో అతిగా చేస్తున్నట్టు. -బెత్... 231 00:15:37,229 --> 00:15:39,106 -నువ్వు ఇప్పుడు తండ్రి అయ్యావేమో... -హేయ్! 232 00:15:40,399 --> 00:15:43,193 నువ్వు వస్తావా, లేకపోతే నేనొక్కడినే వెళ్లనా? నువ్వే చెప్పు. 233 00:15:44,945 --> 00:15:45,988 బాగానే అన్నావే. 234 00:15:47,990 --> 00:15:49,867 సరే. పద. 235 00:15:50,909 --> 00:15:52,327 అది నీ పెళ్ళాం మీద కూడా పని చేస్తుందా? 236 00:16:06,216 --> 00:16:08,760 నాకు ఎందుకో కంగారుగా ఉంది. నాకు రావాలని లేదు. 237 00:16:08,844 --> 00:16:10,053 మనం వెళ్తున్నాం. 238 00:16:11,346 --> 00:16:12,347 సరే. 239 00:16:14,308 --> 00:16:16,894 ఓరి దేవుడా. తను ఎప్పుడూ ప్రతికూలంగానే ప్రవర్తిస్తుంది. 240 00:16:16,977 --> 00:16:19,479 -అదేం లేదు. -అవును. తను ప్రతికూలంగానే ఉంటుంది. 241 00:16:19,563 --> 00:16:21,398 జోష్, తను ప్రతికూలంగానే ఉంటుంది. 242 00:16:22,774 --> 00:16:23,775 హాయ్, అమ్మా. 243 00:16:26,111 --> 00:16:30,073 -ఏంటి? ఎందుకు... అందరూ వచ్చారు? -మేం వస్తున్నామని చెప్పా కదా. 244 00:16:30,157 --> 00:16:32,576 నాకు తెలుసు. కానీ అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? 245 00:16:32,659 --> 00:16:33,785 జేకబ్ బాగానే ఉన్నాడా? 246 00:16:33,869 --> 00:16:36,538 జేకబ్ బాగానే ఉన్నాడు. చూశావా? 247 00:16:37,664 --> 00:16:38,874 మేము లోపలికి రావచ్చా? 248 00:16:39,541 --> 00:16:42,294 -ఎందుకు? -అమ్మా, మమ్మల్ని లోపలికి రానివ్వు. 249 00:16:43,921 --> 00:16:45,631 మేము నీతో మాట్లాడాలనుకుంటున్నాం... 250 00:16:46,548 --> 00:16:49,051 ఎందుకంటే నీ విషయంలో మాకు చాలా ఆందోళనగా ఉంది. 251 00:16:50,260 --> 00:16:52,262 ఆ ఆందోళన మాకు చాలా కాలం నుండి ఉంది. 252 00:16:54,097 --> 00:16:57,726 నువ్వు నాన్నని వదిలేయాలని మాకు అనిపిస్తోంది. 253 00:17:02,147 --> 00:17:05,526 -ఏంటిది? మధ్యవర్తిత్వమా? -అలా అనకు... అంటే... 254 00:17:05,608 --> 00:17:08,403 మీరు ఒక బిడ్డ ముందు మధ్యవర్తిత్వం చేస్తున్నారా? 255 00:17:08,487 --> 00:17:10,821 -అమ్మా, వాడికేం తెలుస్తుంది? -నాకు అది నచ్చదు! 256 00:17:10,906 --> 00:17:12,699 నా మనవడు ఈ సంభాషణను వినడం నాకు ఇష్టం లేదు. 257 00:17:12,782 --> 00:17:14,201 సరే. సరే. 258 00:17:14,284 --> 00:17:18,579 మధ్యలో ఆటంకం కలిగించినందుకు మన్నించండి, నా పాలు కారుతున్నాయి. 259 00:17:18,664 --> 00:17:20,624 -సరే. అది చాలా మంచి విషయం. -దేవుడా, అది భలే వింతగా ఉంది! 260 00:17:20,707 --> 00:17:23,877 అబ్బా... ఇక ఆపుతావా? అందులో వింతేమీ లేదు. అది చాలా గొప్ప విషయం. 261 00:17:23,961 --> 00:17:25,170 తనకి పాలు కారుతున్నాయి. 262 00:17:25,253 --> 00:17:27,673 చాలా బాగా చెప్పావు, బంగారం, కానీ నాకు ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే ఇస్తావా? 263 00:17:27,756 --> 00:17:29,216 -అలాగే. -ఇంట్లో అవి అయిపోయాయి. 264 00:17:29,299 --> 00:17:30,467 నిజంగా? 265 00:17:30,551 --> 00:17:31,760 అవును. ఏంటి... 266 00:17:35,305 --> 00:17:37,057 ఇదిగో, న్యాప్కిన్ ఒకటుంది. 267 00:17:37,933 --> 00:17:39,184 ఇది పర్లేదా? 268 00:17:39,268 --> 00:17:40,894 -పర్లేదు. ధన్యవాదాలు. -మంచిది. 269 00:17:42,938 --> 00:17:45,232 సరే, ఇంట్లో టిష్యూ పేపర్లు లేవు కాబట్టి, 270 00:17:45,315 --> 00:17:47,442 ఇప్పుడు నేను మీ నాన్నని వదిలేయాలంటారు కదా. 271 00:17:47,526 --> 00:17:48,527 అలాగే అనుకో. 272 00:17:48,610 --> 00:17:51,488 ఇక చాలు. ఇక నేనేమీ వినలేను. మీరు చెప్పాల్సింది చెప్పేశారు. 273 00:17:51,572 --> 00:17:53,991 లేదు, మేమింకా చాలా చెప్పాలి. 274 00:17:54,074 --> 00:17:56,952 నేను మీ నాన్నను వదిలే ప్రసక్తే లేదు, సరేనా? 275 00:17:57,035 --> 00:17:59,037 కాబట్టి జేకబ్ పాలు తాగేశాక మీరు వెళ్లిపోవాలి, 276 00:17:59,121 --> 00:18:01,164 ఎందుకంటే ఆయన ఏ సమయంలోనైనా ఇంటికి రావచ్చు. 277 00:18:01,248 --> 00:18:03,208 లేదు, అతను ఇప్పుడు రాడు. మేము సమయం చూసుకొనే వచ్చాం. 278 00:18:03,292 --> 00:18:05,627 అతను హాల్ మరియు డాట్ తో బరోనీ రెస్టారెంట్ లో ఉన్నాడు. 279 00:18:05,711 --> 00:18:07,212 అక్కడ "జెపర్డీ" చూస్తున్నాడు! 280 00:18:07,963 --> 00:18:10,090 అది ఫైనల్ రౌండ్ కు చేరుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. 281 00:18:15,596 --> 00:18:16,805 సరే, అది నిజమే. 282 00:18:23,395 --> 00:18:25,564 ఇప్పుడు ఆర్టీని వదిలేస్తే, అతను చనిపోవడం ఖాయం. 283 00:18:25,647 --> 00:18:27,608 అమ్మా, ఆ విషయం నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. 284 00:18:27,691 --> 00:18:28,734 అవును, నేను చెప్పగలను. 285 00:18:28,817 --> 00:18:31,236 కానీ ఇది అతని కోసం కాదు, నీ కోసమని చెప్తున్నాం. 286 00:18:31,320 --> 00:18:33,614 అతని వల్లే నీకు స్నేహితులెవరూ లేరు. 287 00:18:33,697 --> 00:18:36,658 అతని వల్లే నీ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. 288 00:18:36,742 --> 00:18:37,951 నీకు అతను తప్ప మరేదీ లేదు. 289 00:18:38,619 --> 00:18:41,914 -అతనికీ ఉన్నది నేనే. అతనికి నేను కావాలి. -మరి నీకు కావలసిన వాటి మాటేమిటి? 290 00:18:41,997 --> 00:18:44,374 ఎంత ధైర్యం ఉంటే మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతారు. 291 00:18:44,958 --> 00:18:48,921 మీ ఇద్దరికీ మంచిదనే ఉద్దేశంతోనే నేను ఈ చెత్త జీవితం గడిపాను. 292 00:18:49,963 --> 00:18:51,924 నువ్వు... నువ్వు చూడు. ఎంత విజయవంతమయ్యావో చూడు. 293 00:18:52,007 --> 00:18:54,301 నువ్వు చాలా గొప్ప ప్రొఫెసర్ వి. నువ్వు పర్మినెంట్ కాబోతున్నావు కూడా. 294 00:18:54,384 --> 00:18:57,679 ఒక మంచి అమ్మాయితో పెళ్లయింది. పండంటి బిడ్డ పుట్టాడు. 295 00:18:57,763 --> 00:19:00,557 తల్లిదండ్రులు విడిపోయుంటే అలా జరిగి ఉండేది అనుకుంటున్నావా? 296 00:19:00,641 --> 00:19:01,725 మరి నా సంగతేంటి, అమ్మా? 297 00:19:03,727 --> 00:19:05,103 నాకు అవేమీ లేవు కదా. 298 00:19:05,187 --> 00:19:06,980 నీది వేరే కథ. 299 00:19:08,023 --> 00:19:09,483 ఇది బాగుందే. 300 00:19:09,566 --> 00:19:13,654 అంటే, ఎదిగే క్రమంలో నాకు కూడా అంత సౌకర్యవంతంగా అనిపించలేదు. 301 00:19:14,488 --> 00:19:15,864 నాన్నతో ఉన్నప్పుడు భయపడుతూ బతికాం. 302 00:19:15,948 --> 00:19:19,493 నేను ఒక్కదాన్నే ఉంటే, పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. 303 00:19:20,035 --> 00:19:24,414 నా ఉద్దేశం, మీ ఇద్దరి జీవితాలూ భయంకరంగా తయారయ్యుండేవి. 304 00:19:25,249 --> 00:19:27,292 అది... 305 00:19:27,376 --> 00:19:30,045 అది... మరింత దారుణంగా ఉండేది. 306 00:19:30,128 --> 00:19:31,129 నేను పాస్ పోసి వస్తాను. 307 00:19:31,964 --> 00:19:32,965 లేదు, కాస్త... 308 00:19:35,175 --> 00:19:37,678 తనకి నచ్చనప్పుడల్లా పాస్ కి వెళ్తుంది. 309 00:19:37,761 --> 00:19:38,887 నాకు తెలుసు. 310 00:19:39,805 --> 00:19:43,308 అమ్మా, నువ్వు బయటకు వస్తావా రావా? 311 00:19:43,392 --> 00:19:45,018 నేను టాయులెట్లో ఉన్నాను. 312 00:19:45,102 --> 00:19:47,855 అవును, కానీ ఇప్పటికే చాలా సేపయింది, 313 00:19:49,106 --> 00:19:51,650 ఇంకా వస్తోంది మరి. 314 00:19:51,733 --> 00:19:54,444 తను బాత్రూమ్ లో గడియ వేసుకొని ఉండిపోయుంది. 315 00:19:54,528 --> 00:19:57,489 అవును గడియ వేసుకొనే ఉన్నాను. టాయిలెట్లో ఉన్నా మరి. 316 00:19:57,573 --> 00:20:00,200 కానీ బాత్రూమ్ లో కావాలని గడియ ఏమీ వేసుకోలేదు. 317 00:20:00,284 --> 00:20:01,285 సమయం ఎంత అయింది? 318 00:20:01,869 --> 00:20:03,704 -ఆలస్యమవుతుంది. -అబ్బా. 319 00:20:03,787 --> 00:20:07,624 మీరిద్దరూ అలా తలుపు బయటే ఉంటే, అంత త్వరగా అయిపోదు. 320 00:20:08,917 --> 00:20:10,544 తను లోపలకి వెళ్లి ఎంత సేపయింది? 321 00:20:11,587 --> 00:20:13,213 ఇరవై ఒక్క నిమిషాలు. 322 00:20:13,297 --> 00:20:15,507 -జెపర్డీ ఫైనల్ రౌండ్ కి ఎంత సేపు ఉంది? -అది అయిపోయింది కూడా. 323 00:20:15,591 --> 00:20:17,092 మనం వెళ్లేదాకా అక్కడే ఉంటుంది. 324 00:20:18,010 --> 00:20:19,011 వచ్చేశాను. 325 00:20:23,265 --> 00:20:27,269 మీరిద్దరూ ఏం చేయాలని చూస్తున్నారో, దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. 326 00:20:27,352 --> 00:20:29,688 -ఎందుకంటే నువ్వంటే మాకు ప్రాణం, అమ్మా. -నాకు తెలుసు. 327 00:20:34,818 --> 00:20:36,069 ఆయనకి ఏం చెప్తావు? 328 00:20:36,820 --> 00:20:38,697 లేదు, మీరేం చెప్తారో ఆలోచించుకోండి. 329 00:20:40,532 --> 00:20:43,202 బంగారం, చెప్పేది విను. నేను బాగానే ఉన్నాను, సరేనా? 330 00:20:43,285 --> 00:20:46,914 ఇక్కడ ఆహారం ఉంది. జనరేటర్ ఉంది. ఇక్కడ ఎంతకాలమైనా ఉండవచ్చు. 331 00:20:48,916 --> 00:20:49,917 సరే. 332 00:20:51,585 --> 00:20:54,463 అవును, నాకు తెలీదు, కానీ నాకు మరింత సమాచారం అందాక, నీకు చెప్తాను. 333 00:20:55,506 --> 00:20:58,091 అవును, నేను చెప్తున్నా కదా. నేను క్షేమంగానే ఉన్నాను. 334 00:21:01,011 --> 00:21:02,221 అవును, నాకు తెలుసు. 335 00:21:04,223 --> 00:21:06,016 ఈ ఊరిలోని చాలా మందికి అంత అదృష్టం లేదు. 336 00:21:09,603 --> 00:21:10,604 నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. 337 00:21:15,859 --> 00:21:21,573 ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 338 00:21:22,574 --> 00:21:23,575 హవ్ ఐ... 339 00:21:24,952 --> 00:21:26,370 నా బిడ్డను వదిలేయ్! 340 00:21:51,645 --> 00:21:53,188 ట్యాకో ట్యూస్డే. 341 00:22:12,749 --> 00:22:15,377 నువ్వు వచ్చేశావు. 342 00:22:16,044 --> 00:22:18,338 -హేయ్. -నిన్ను చూడటం సంతోషంగా ఉంది. 343 00:22:18,422 --> 00:22:20,632 -నిన్ను కూడా. -డాన్స్ చేయాలనుందా? 344 00:22:21,633 --> 00:22:23,177 నువ్వు అడగవేమో అనుకున్నాను. 345 00:23:49,763 --> 00:23:51,390 హేయ్. హాయ్. 346 00:23:54,351 --> 00:23:55,352 నేను... 347 00:23:55,435 --> 00:23:57,813 అతని తలకి గాయమైందని నాకు తెలుసు, కానీ నేను... 348 00:23:57,896 --> 00:23:59,648 అతను బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నట్టుగా అనిపించాడు. 349 00:23:59,731 --> 00:24:02,568 అతను... అతను మమ్మల్ని ఇంటి వద్ద దింపాడు, అంతా బాగానే ఉన్నాడు. 350 00:24:05,195 --> 00:24:06,822 నేను గ్రహించి ఉండాలి. 351 00:24:08,240 --> 00:24:11,326 నేను... నన్ను మన్నించండి. నేను గ్రహించి ఉండాలి. వాడు నా మిత్రుడు. 352 00:24:11,410 --> 00:24:14,162 అది నీ తప్పు కాదు. నిన్ను నువ్వు నిందించుకోకు. 353 00:24:14,246 --> 00:24:16,915 అవును. అది కేవలం... అది విధిరాత వల్ల అలా జరిగింది. 354 00:24:16,999 --> 00:24:21,128 నేను గ్రహించి ఉండాలి. మన్నించండి. మన్నించండి. 355 00:24:41,315 --> 00:24:46,153 తన జ్ఞాపకార్థం మనం తాగుతున్నామని అతనికి కోపం వస్తుందా? 356 00:24:46,945 --> 00:24:48,197 లేదు. 357 00:24:48,280 --> 00:24:49,990 లేదు, అతనికి కోపం వస్తుందని నాకనిపించడం లేదు. 358 00:24:50,073 --> 00:24:53,243 -తాగుతున్నందుకు నన్నేప్పుడూ ఏమనలేదు. -నిజంగా? భలే వింతగా ఉంది, 359 00:24:53,327 --> 00:24:56,663 తప్పొప్పులు అతను లెక్కించినట్టు నాకు తెలిసి ఇంకెవరూ లెక్కించరు. 360 00:24:57,289 --> 00:24:59,166 నువ్వు కాక, అమ్మ. మన్నించు. 361 00:25:00,792 --> 00:25:04,004 నేను చెప్తున్నా కదా, నాకదంతా తెలుసు. వాడికి ఏదీ నచ్చేది కాదు. 362 00:25:07,382 --> 00:25:11,512 అతను... అతను మా బ్యాండ్ ని వదిలేసి, టీచర్ వృత్తిని చేపట్టినప్పుడు, 363 00:25:11,595 --> 00:25:13,931 నేను సంగీతంలోనే కొనసాగినప్పుడు... 364 00:25:15,015 --> 00:25:17,392 నేను అలా చేసినందుకు, నా గురించి తప్పుగా అనుకుంటున్నాడేమో అనిపించేది. 365 00:25:19,686 --> 00:25:20,896 కానీ ఒకసారి నేను అంతా ఆలోచిస్తే, 366 00:25:20,979 --> 00:25:25,609 తనకి చేతనైన విధానంలో అతను నా గురించి పట్టించుకున్నాడేమో అనిపిస్తోంది. 367 00:25:27,277 --> 00:25:28,529 అతను అలా చాలా చేశాడు. 368 00:25:29,821 --> 00:25:31,323 నేను ఏమైపోతానా అని ఆందోళన పడ్డాడు. 369 00:25:35,577 --> 00:25:39,414 బహుశా నేను తప్పు దారిని ఎంచుకోకూడదు అనుకున్నాడేమో, 370 00:25:39,498 --> 00:25:42,292 ఏదోకరోజున నేను ఇలా జీవించకూడదు, అసలు ఇలా ఎలా జరిగిందని 371 00:25:42,376 --> 00:25:44,586 అనుకొనే పరిస్థితి నాకు రాకూడదని భావించాడేమో. 372 00:25:45,420 --> 00:25:48,924 ఎక్కువ సందర్భాలలో, మనకు ఎంపిక అనేదే ఉండదు. ఉందని మనం అనుకుంటామంతే. 373 00:25:49,508 --> 00:25:52,886 అవును. అందుకేనేమో నేను ఇంకా పాడుతున్నాను. 374 00:25:54,012 --> 00:25:56,431 దానికి చీర్స్ మరి. 375 00:25:56,515 --> 00:25:57,516 తప్పకుండా. 376 00:25:58,100 --> 00:26:00,060 నీ గొంతు చాలా బాగుంటుంది. 377 00:26:00,978 --> 00:26:02,563 -నిజంగా? -నిజంగా. 378 00:26:05,107 --> 00:26:06,316 ధన్యవాదాలు, రూతీ. 379 00:26:06,400 --> 00:26:09,528 బంగారం. నువ్వు నాకెందుకు ధన్యవాదాలు చెప్పడం. అది నిజమే. 380 00:26:11,780 --> 00:26:15,784 జోషువా తన పాటల్లో చేసే బ్లీప్-బ్లూప్-బ్లాపీ శబ్దాల కన్నా 381 00:26:15,868 --> 00:26:18,579 -అది చాలా రెట్లు మెరుగేలే, కదా? -ఏంటి? 382 00:26:18,662 --> 00:26:20,747 బ్లూపీ... బ్లూపీ శబ్దాలు. 383 00:26:20,831 --> 00:26:23,876 -బ్లీపీ... ఏంటవి? -నాకు తెలీదు. 384 00:26:40,559 --> 00:26:41,560 సరే. 385 00:26:47,649 --> 00:26:49,651 కిడ్ ఏ 386 00:26:56,158 --> 00:26:58,076 ఓకే కంప్యూటర్ ఎక్స్ట్రా ఫెర్రో 387 00:27:20,265 --> 00:27:21,266 ద్గైర్యం కూడతీసుకో. 388 00:27:21,350 --> 00:27:22,768 సోమవారం మార్చి 2, 2020 389 00:27:22,851 --> 00:27:25,687 సమయం 8:10 అయింది. అందరూ టిఫిన్ చేసేశారా? 390 00:27:26,396 --> 00:27:28,941 నువ్వింకా తింటున్నావు. మెల్లగానే తిను. మేము క్లాస్ మొదలుపెట్టేయమా? 391 00:27:29,024 --> 00:27:30,192 -పర్వాలేదులెండి. -మంచిది. 392 00:27:30,275 --> 00:27:33,153 ఇక అందరూ సిద్దంగానే ఉన్నారా? మీకూ అనిపిస్తోందా? నాకు ఇవాళ అనిపిస్తోంది. 393 00:27:33,237 --> 00:27:36,698 ఇది చాలా మంచి రోజు కాబోతోంది. మనం చాలా చేయబోతున్నాం. మరి సిద్ధమేనా? 394 00:28:02,224 --> 00:28:05,185 మరొక రోజు గడిచిపోయింది నీకు కూడా వయసైపోతోంది 395 00:28:05,269 --> 00:28:08,480 -దూరమైపోతున్నావు -మాకు దూరమైపోతున్నావు 396 00:28:08,564 --> 00:28:12,943 నీకు ఇష్టమైన చోటే నువ్వు ఉండే రకమైన మనిషివి కావు 397 00:28:13,026 --> 00:28:15,445 ప్రేమకి సమయం పడుతుంటారు 398 00:28:15,529 --> 00:28:17,990 మరి నా సమయం ఎందుకు వృథా చేస్తావు? 399 00:28:18,073 --> 00:28:20,784 నాతో నిజాయితీగా ఉండు 400 00:28:20,868 --> 00:28:24,997 నువ్వు దూరమై చాలా కాలమైంది 401 00:28:25,080 --> 00:28:29,793 -చాలా చాలా కాలమైపోయింది -చాలా కాలమైపోయింది 402 00:28:29,877 --> 00:28:34,047 -నీకు కూడా వయసైపోతోంది -మాకు దూరమైపోతున్నావు 403 00:28:34,131 --> 00:28:38,552 నీకు ఇష్టమైన చోటే నువ్వు ఉండే రకమైన మనిషివి కావు 404 00:28:38,635 --> 00:28:41,054 ప్రేమకి సమయం పడుతుంటారు 405 00:28:41,138 --> 00:28:43,473 మరి నా సమయం ఎందుకు వృథా చేస్తావు? 406 00:28:43,557 --> 00:28:46,393 -నిజాయితీగా, నిజాయితీగా ఉండు -నాతో నిజాయితీగా ఉండు 407 00:28:46,476 --> 00:28:50,480 నువ్వు దూరమై చాలా కాలమైంది 408 00:28:50,564 --> 00:28:55,110 -చాలా చాలా కాలమైపోయింది -చాలా కాలమైపోయింది 409 00:28:58,614 --> 00:29:00,616 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య