1 00:00:36,578 --> 00:00:39,331 "నా ప్రభువు నివాసంలో అనేక గదులు ఉన్నాయి. 2 00:00:39,414 --> 00:00:41,083 ఒకవేళ లేకపోతే, 3 00:00:41,166 --> 00:00:45,170 నీకోసం ఒక ఆవాసాన్ని చూస్తానని నేను నీకు చెప్పేవాడినా? 4 00:00:47,589 --> 00:00:50,425 ఒకవేళ నేను నీకోసం ఆవాసాన్ని సిద్ధం చేస్తే, 5 00:00:50,509 --> 00:00:53,720 నేను మళ్లీ వచ్చి, నిన్ను నాతో తీసుకువెళ్లిపోతాను... 6 00:00:55,305 --> 00:00:59,017 తద్వారా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండవచ్చు." 7 00:01:03,564 --> 00:01:06,608 "ఆందోళన పడవద్దు." 8 00:01:06,692 --> 00:01:08,527 -ఎవరూ రాలేదు. -అదేం లేదులెండి. 9 00:01:08,610 --> 00:01:11,989 అంటే, నేను ఎక్కువ మంది వస్తారనుకున్నా. 10 00:01:12,072 --> 00:01:13,407 వాడంటే జనాలకు ఇష్టమే కదా? 11 00:01:13,490 --> 00:01:16,869 అవును. అందులో సందేహమే లేదు. రాను పోనూ విమాన ఛార్జీలు, అవీ ఇవీ... 12 00:01:16,952 --> 00:01:19,329 ఆహారం వంద మందికి తెప్పించాను. 13 00:01:20,455 --> 00:01:22,416 తప్పకుండా ఆ ఆహారమంతా వృథా కాదులెండి. 14 00:01:22,499 --> 00:01:23,500 అవును, ధన్యవాదాలు. 15 00:01:27,087 --> 00:01:31,258 వాడు ఇక లేడని నాకు తెలుసు, కానీ వాడు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. 16 00:01:32,134 --> 00:01:34,386 అంటే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేడు అన్నట్టుగా. 17 00:01:35,721 --> 00:01:37,598 కానీ లేడు, నేను అతడి కోసం చూస్తూనే ఉన్నాను. 18 00:01:39,433 --> 00:01:40,976 అర్థమైందిలెండి. 19 00:01:44,521 --> 00:01:49,484 నిన్న వాడు గడిపిన ఆఖరి రాత్రి... వాడు ఆనందంగానే ఉన్నాడా? 20 00:01:51,570 --> 00:01:53,030 ఆనందంగానే ఉన్నాడు. 21 00:01:57,868 --> 00:02:00,204 అర్థరాత్రి, అంటే... 22 00:02:01,496 --> 00:02:04,041 -గొడవ అయ్యాక అని అడుగుతున్నారా? -అవును, గొడవ అయ్యాక. 23 00:02:04,124 --> 00:02:07,794 కానీ గొడవ అయ్యాక, మేము ఆహారం తెచ్చుకున్నాం, 24 00:02:07,878 --> 00:02:10,380 అతను జోకులు వేస్తున్నాడు, ఇంకా, అతను... 25 00:02:11,340 --> 00:02:12,925 అతను ఆనందంగానే ఉన్నట్టు అనిపించాడు. 26 00:02:14,009 --> 00:02:17,930 కానీ, పార్టీలో ఆనందంగా ఉన్నాడా? జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నట్టు అనిపించాడా? 27 00:02:19,848 --> 00:02:20,849 అవును. 28 00:02:26,897 --> 00:02:28,899 పార్టీలో ఎవరితో మాట్లాడాడు? 29 00:02:35,572 --> 00:02:38,659 -కొన్ని గుద్దులు కూడా కురిపించాడు కదా? -అవును. 30 00:02:39,826 --> 00:02:42,579 -తర్వాత కింద పడి తల తగిలించుకున్నాడా? -అవును. 31 00:02:42,663 --> 00:02:44,915 -నేల మీద ఎంత సేపు పడి ఉన్నాడు? -బంగారం. 32 00:02:44,998 --> 00:02:47,501 అంత ఎక్కువ సేపేమీ లేడు. వెంటనే పైకి లేచేశాడు. 33 00:02:47,584 --> 00:02:50,379 -లేచాక అతనిలో తేడాగా ఏమైనా కనిపించిందా? -లేదు. 34 00:02:50,921 --> 00:02:52,714 అతని కనుపాపలు ఏమైనా తేడాగా అనిపించాయా? 35 00:02:53,715 --> 00:02:55,759 -అంత గమనించలేదు. -ఇక ఆపు. 36 00:02:55,843 --> 00:02:59,763 -ఏం జరిగిందో అర్థం చేసుకోవాలనుకుంటున్నా. -మనం అర్థం చేసుకోలేమనుకుంటా. 37 00:03:05,185 --> 00:03:08,188 విక్టర్ అంతా బాగానే ఉందా? 38 00:03:08,272 --> 00:03:11,608 ఆ పిల్లి ఇంకెంత కాలం బతికి ఉండగలదో తెలీదు. 39 00:03:12,276 --> 00:03:13,861 మేము ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందేమో. 40 00:03:13,944 --> 00:03:15,529 అమ్మా, నాన్నా కూడా ఉన్నారు. 41 00:03:15,612 --> 00:03:16,697 లేదు 42 00:03:16,780 --> 00:03:18,699 వాళ్ళతో కూర్చొని టీవీ కూడా చూశాడు 43 00:03:18,782 --> 00:03:21,910 కాలిఫోర్నియాకి వెళ్లాక టోనీ రాబిన్సన్ సెమినార్ కి 44 00:03:21,994 --> 00:03:23,328 వెళ్లాలనుకుంటున్నాడని చెప్పాడు. 45 00:03:23,412 --> 00:03:24,413 -అవునా? -అవును. 46 00:03:24,496 --> 00:03:26,665 ఇంతకీ టోనీ రాబిన్సన్ సెమినార్ కి వెళ్ళాడో లేడో. 47 00:03:26,748 --> 00:03:29,001 ఏమో. ఎప్పుడూ చెప్పలేదు మరి. 48 00:03:29,543 --> 00:03:31,962 అవును. వెళ్లుంటే చెప్పేవాడే అనుకుంటా. 49 00:03:32,045 --> 00:03:35,465 అవును అనుకుంటా. టోనీ రాబిన్స్ గురించి జనాలు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. 50 00:03:37,092 --> 00:03:41,597 టోనీ రాబిన్స్ సెమినార్ కి వెళ్లాలని అతనికి చాలా ఉండింది... అది తీరనేలేదు. 51 00:03:42,848 --> 00:03:46,560 టోనీ రాబిన్స్ చాలా పెద్ద మనిషి. 52 00:03:47,978 --> 00:03:48,979 నాకు తెలుసు. 53 00:03:53,358 --> 00:03:55,861 నిన్ను మిత్రుడిగా పొందడం అతని అదృష్టం. 54 00:03:58,780 --> 00:04:04,161 -అయితే, మీరు ఎంతకాలంగా... -నన్ను మన్నించండి. నాకు... 55 00:04:04,244 --> 00:04:05,662 తప్పకుండా. అలాగే. 56 00:04:07,414 --> 00:04:08,582 మన్నించండి. 57 00:04:10,542 --> 00:04:11,543 మన్నించండి. 58 00:04:18,425 --> 00:04:19,676 హేయ్. 59 00:04:21,970 --> 00:04:22,971 హేయ్. 60 00:04:26,308 --> 00:04:27,392 ఇది చాలా వింతగా ఉంది. 61 00:04:28,519 --> 00:04:29,937 అవును. 62 00:04:32,564 --> 00:04:34,525 నాకు మళ్లీ లోపలికి వెళ్ళాలని లేదు. 63 00:04:34,608 --> 00:04:35,609 నాకు కూడా. 64 00:04:38,695 --> 00:04:40,239 నేను అతడిని నిజంగానే మిస్ అవుతాను. 65 00:04:40,864 --> 00:04:42,115 నేను కూడా. 66 00:04:45,035 --> 00:04:46,828 నాకున్న వెరిఫైడ్ స్టేటస్ మిత్రుడు అతడే. 67 00:04:49,456 --> 00:04:51,291 లోపల నన్ను పట్టించుకోకుండా ఉండాలని చూశావా? 68 00:04:53,126 --> 00:04:55,838 నువ్వు నాతో మాట్లాడతావో లేదో నాకు తెలీదు కదా. 69 00:04:55,921 --> 00:04:59,633 అసలు మాట్లాడాలా వద్దా అని నీకు ఉండింది, కానీ నా మీద వేసేస్తున్నావు. 70 00:05:00,384 --> 00:05:01,593 సరే, క్షమించు. 71 00:05:01,677 --> 00:05:06,515 పర్వాలేదు. నిజానికి, నువ్వు నన్నే క్షమించాలి. నేను మరీ అంతగా... 72 00:05:06,598 --> 00:05:07,599 -దేవుడా. -పర్వాలేదులే. 73 00:05:07,683 --> 00:05:09,434 లేదు ఇవాళ అస్సలేం బాగాలేదు. 74 00:05:09,518 --> 00:05:10,644 అవును. 75 00:05:12,020 --> 00:05:14,898 -అసలు అతను ఎలా చనిపోయాడు? -తల తగిలి చనిపోయాడు. 76 00:05:14,982 --> 00:05:17,484 -నిజంగా కారణం అదే అనుకుంటున్నావా? -నీ ఉద్దేశం ఏంటి? 77 00:05:17,568 --> 00:05:19,570 ఆత్మహత్య చేసుకున్నాడేమో అని నీకు అనిపించడం లేదా? 78 00:05:22,030 --> 00:05:23,407 ఎందుకలా అంటున్నావు? 79 00:05:23,490 --> 00:05:27,369 ఏమో మరి. మన్నించు. అలా నోటి నుండి వచ్చేసింది. 80 00:05:27,452 --> 00:05:28,579 అలా జరగడానికి ఎంత అవకాశం ఉందంటావు? 81 00:05:28,662 --> 00:05:30,873 -తలకి బలమైన గాయం తగిలితే చనిపోవచ్చు. -అది కాదు. 82 00:05:30,956 --> 00:05:32,958 నేను మొత్తం విషయం గురించి మాట్లాడుతున్నాను. 83 00:05:33,041 --> 00:05:34,626 మేమిద్దరం హై స్కూల్ లో ఉన్నప్పుడు అసలు స్నేహితులమే కాదు, 84 00:05:34,710 --> 00:05:36,670 కానీ లాస్ ఏంజలెస్ కి ఒకే సమయంలో వెళ్లాము. 85 00:05:36,753 --> 00:05:38,297 అక్కడ అతను నిన్ను కలిశాడు. 86 00:05:38,380 --> 00:05:42,050 ఆ తర్వాత మనిద్దరినీ పరిచయం చేశాడు, ఆ పరిచయం మన మధ్య దేనికో దారి తీసింది. 87 00:05:42,134 --> 00:05:44,845 దీనికంతటికీ ఏంటి కారణం? అతనా? డాక్స్ పీటర్సన్? 88 00:05:44,928 --> 00:05:46,096 ఆల్జీబ్రా రెండవ భాగంలో పరిచయం నుండా? 89 00:05:46,180 --> 00:05:47,848 ఇప్పుడు, నేను అతని అంత్యక్రియలకు వచ్చానా? 90 00:05:50,142 --> 00:05:51,602 దేవుడా. 91 00:05:51,685 --> 00:05:54,313 అందులో ఏదో పరమార్థం ఉండాలి. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. 92 00:05:55,939 --> 00:05:56,982 లేదు, కాకతాళీయమే అనుకుంటా. 93 00:06:00,277 --> 00:06:01,278 అవును. 94 00:06:03,280 --> 00:06:05,657 -సూర్యుడు బయటకొచ్చాడు. -హమ్మయ్య. 95 00:06:17,878 --> 00:06:19,463 -ఏం చూస్తున్నావు? -ఏం లేదు. 96 00:06:20,172 --> 00:06:21,882 చెప్పు ఏం చూస్తున్నావో? 97 00:06:21,965 --> 00:06:23,675 మామూలుగా నువ్వు జుట్టును అలా పైకి వేసుకోవు. 98 00:06:24,676 --> 00:06:26,637 అవును. అలాగే బాగుండేదా? 99 00:06:27,554 --> 00:06:28,931 అది నేను గమనించిన విషయమంటే. 100 00:06:32,976 --> 00:06:33,977 నీ టీచర్ ఉద్యోగం ఎలా ఉంది? 101 00:06:34,978 --> 00:06:35,979 బాగుంది. 102 00:06:37,189 --> 00:06:39,149 -ఇంకా? -ఏంటి? 103 00:06:39,233 --> 00:06:41,068 -అంటే, నేను... -ఎందుకు అడుగుతున్నావు? 104 00:06:42,194 --> 00:06:43,862 ఊరికే ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను. 105 00:06:47,407 --> 00:06:48,408 సరే. 106 00:06:48,492 --> 00:06:50,869 నిజం చెప్పాలంటే, నాకు అది చాలా బాగా నచ్చింది. 107 00:06:50,953 --> 00:06:53,997 అప్పుడప్పుడూ చిరాగ్గా ఉంటుంది, కానీ ప్రతీరోజు ప్రశాంతంగా నిద్రలేస్తున్నాను, 108 00:06:54,081 --> 00:06:57,084 నేను ఏ పని చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకు పూర్తి అవగాహన ఉంది. 109 00:06:57,751 --> 00:06:59,294 మంచి ఫీలింగ్ ఇస్తుంది. 110 00:06:59,378 --> 00:07:03,340 వావ్, అది చాలా మంచి విషయం. ఆ మాట విని నాకు చాలా ఆనందంగా ఉంది. 111 00:07:03,423 --> 00:07:04,883 -అవునా? -అవును. 112 00:07:04,967 --> 00:07:07,761 -ఎందుకలా అంటావు? -ఎలా? 113 00:07:07,845 --> 00:07:09,471 నేనేదో చెడ్డదాన్ని అనిపిస్తుంది అలా అంటే. 114 00:07:09,555 --> 00:07:11,348 -నా ఉద్దేశం అది కాదు... -జోష్, 115 00:07:12,099 --> 00:07:14,977 నాకు నీ విషయంలో నిజంగానే ఆనందంగా ఉంది. నాకు అదే కావాలి కూడా. 116 00:07:20,315 --> 00:07:21,358 మన్నించు. 117 00:07:23,485 --> 00:07:26,446 -ఈరాత్రికే వెళ్లిపోతున్నావా? -అవును, పది గంటల ఫ్లైట్ కి. 118 00:07:27,114 --> 00:07:30,117 -ఆ విమానం ఏడ్చినట్టుంటుంది. -అవును, మరి నీ సంగతి ఏంటి? 119 00:07:30,200 --> 00:07:31,493 నేను రేపు వెళ్తున్నాను. 120 00:07:31,577 --> 00:07:34,705 ఇక్కడే ఉన్నా కదా, అమ్మానాన్నలను చూసి వద్దామనుకుంటున్నా. 121 00:07:34,788 --> 00:07:36,498 ఆ పని మీదే నేను బయలుదేరాలి. 122 00:07:36,582 --> 00:07:39,042 కొన్ని వస్తువులను తెస్తానని అమ్మకి చెప్పాను. 123 00:07:39,126 --> 00:07:41,587 సరే. నేను పలకరించానని చెప్పు. 124 00:07:42,421 --> 00:07:43,755 నీకు పెద్ద పని లేకపోతే, నువ్వు కూడా రావచ్చు. 125 00:07:43,839 --> 00:07:47,634 నేను విమానాశ్రయానికి వెళ్తానులే. అంతకన్నా ముందు విమానం ఏమైనా ఉందేమో చూస్తా. 126 00:07:48,343 --> 00:07:49,386 ఏమీ లేదు. 127 00:07:52,639 --> 00:07:53,807 అవును, నాకు తెలుసు. 128 00:07:56,018 --> 00:07:58,687 నిజం చెప్పాలంటే, గతేడాది అంతా నాకు అంత బాగా గడవలేదు. 129 00:07:58,770 --> 00:08:01,064 కాస్మో, నాలుగుసార్లు చచ్చి బతికింది, 130 00:08:01,148 --> 00:08:03,275 ప్రతీసారి శస్త్రచికిత్స దాకా వెళ్తుంది, 131 00:08:03,358 --> 00:08:04,443 అది బతికిపోతుంది. 132 00:08:04,526 --> 00:08:06,820 -అది దారుణమైన విషయం కాదా? -కాదు, ఆమెకి అది కావాలి. 133 00:08:06,904 --> 00:08:09,364 నువ్వు అలా చేయకుండా ఆ పిల్లిని సహజంగానే... 134 00:08:09,448 --> 00:08:13,535 నాకు అర్థమైంది. కానీ ఆ పిల్లే తన లోకం. 135 00:08:14,161 --> 00:08:15,704 ఆమెకి అన్నీ ఆ పిల్లే. 136 00:08:15,787 --> 00:08:16,830 మరి ఫ్రాంక్ సంగతేంటి? 137 00:08:20,083 --> 00:08:21,668 తన విషయంలో నాకు బాధగా ఉంది. 138 00:08:22,586 --> 00:08:25,464 నా ఉద్దేశం, తనకి అన్నీ కష్టాలే. నిజంగానే. 139 00:08:26,298 --> 00:08:28,842 తనకి ఆ పిల్లి అంటే చాలా ఇష్టం. 140 00:08:28,926 --> 00:08:32,596 తనకి కాస్మో లేదనే విషయం తెలిస్తే... 141 00:08:46,360 --> 00:08:48,570 -దేవుడా. -పర్వాలేదులే. 142 00:08:51,490 --> 00:08:54,076 -మన్నించు. -ఏం కాలేదు. 143 00:09:14,429 --> 00:09:16,390 వావ్, అది చాలా బాగా అనిపించింది. 144 00:09:17,057 --> 00:09:18,684 నువ్వు కూడా ఇలా చేయాలి. ఏడువు. 145 00:09:18,767 --> 00:09:20,102 నాకు పర్వాలేదు. 146 00:09:20,185 --> 00:09:21,854 చేయ్. నీకు చాలా ఉపశమనంగా అనిపిస్తుంది. 147 00:09:21,937 --> 00:09:24,189 అనుకున్నప్పుడల్లా నాకు ఏడుపు రాదు. 148 00:09:24,273 --> 00:09:26,316 ఒక్క నిమిషం. ఏం జరిగిందో ఇప్పుడే చూశాను. 149 00:09:26,400 --> 00:09:28,569 మీకు బాగానే ఉందా? ఇతను ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? 150 00:09:31,154 --> 00:09:32,489 అవును. 151 00:09:33,031 --> 00:09:34,825 ఎవరికైనా కాల్ చేయమంటారా? 152 00:09:35,409 --> 00:09:36,785 చేస్తే మంచిది. 153 00:09:45,544 --> 00:09:47,004 అది కామెడీ కాదు. 154 00:09:47,671 --> 00:09:50,841 అది కామెడీయే కదా. ఏమంటున్నారు మీరు. 155 00:10:05,772 --> 00:10:07,524 నీ ముఖం చూడాలి. 156 00:10:13,947 --> 00:10:15,991 అందుకే నేను ఇక్కడి నుండి పారిపోవాలనుకుంటాను. 157 00:10:16,074 --> 00:10:17,826 ఎవరికీ హాస్య చతురతే లేదు. 158 00:10:18,327 --> 00:10:21,580 ఆ జోక్ లాస్ ఏంజలెస్ లో అయినా అలానే పేలేదిలే. 159 00:10:22,915 --> 00:10:25,334 నీకు నచ్చింది కదా. కాబట్టి... 160 00:10:33,926 --> 00:10:36,678 -ఎవరినైనా డేటింగ్ చేస్తునావా? -డేటింగ్ గురించి నేను నీతో మాట్లాడలేను. 161 00:10:36,762 --> 00:10:38,263 అలా అంటావేంటి. మనిద్దరమూ దాని గురించే ఆలోచిస్తున్నాం కదా. 162 00:10:38,347 --> 00:10:42,267 నేను దాని గురించి ఆలోచిస్తాను కానీ చెప్పను. 163 00:10:42,351 --> 00:10:43,519 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 164 00:10:43,602 --> 00:10:46,438 ఇదే చివరి చోటు. ఇక్కడే మా అమ్మ పళ్ళను కొనుక్కుంటుంది. 165 00:10:47,105 --> 00:10:50,192 నాకు కాస్త ఆకలిగా ఉంది, ఇంకాస్త ఎక్కువ తిని ఉండాల్సింది. 166 00:10:50,275 --> 00:10:52,653 వంద మంది కోసం ఆహారం తెప్పించారు. 167 00:10:52,736 --> 00:10:53,737 తెలుసు. విన్నాను. 168 00:10:54,321 --> 00:10:55,948 -నువ్వు వాళ్ళ అమ్మతో మాట్లాడావా? -మాట్లాడాను. 169 00:10:56,031 --> 00:10:57,449 పాపం. 170 00:11:00,118 --> 00:11:03,247 వెనుక రిట్జ్ ఉంది. షెరిల్ కి రిట్జ్ అంటే ప్రాణం కదా. 171 00:11:03,330 --> 00:11:04,748 -కొద్దిగ నేను తినవచ్చా? -తిను. 172 00:11:05,624 --> 00:11:08,418 ఇవాళ చాలా మంది తల్లులు దిగాలుగా ఉన్నారు. దానర్థం ఏంటంటావు? 173 00:11:11,296 --> 00:11:12,464 దానర్థం ఏమీ లేదు. 174 00:11:15,592 --> 00:11:16,593 రూత్ ఎలా ఉంది? 175 00:11:16,677 --> 00:11:19,429 పర్వాలేదు. ఇప్పుడు, 176 00:11:20,973 --> 00:11:21,974 ఆగిపోయిందిలే. 177 00:11:23,058 --> 00:11:24,059 ఆగిపోయిందా? 178 00:11:27,688 --> 00:11:29,147 అయ్యో. 179 00:11:29,857 --> 00:11:32,442 -కాస్త తీసుకుంటావా? -కింద పడేస్తున్నావా? 180 00:11:32,526 --> 00:11:33,777 వీటిని నేను తీస్తానులే. 181 00:11:38,949 --> 00:11:40,701 నేను ఎవరినీ డేటింగ్ చేయడం లేదు. 182 00:11:42,911 --> 00:11:46,164 -ఏంటి? -నేను డేటింగ్ చేయడం లేదు. 183 00:11:47,291 --> 00:11:48,417 సరే. 184 00:11:49,334 --> 00:11:51,879 అంటే, కొందరితో దాదాపుగా డేటింగ్ చేయబోయాను. 185 00:11:54,298 --> 00:11:55,424 అవును. 186 00:11:57,676 --> 00:12:00,262 నాకు కూడా ఆ పరిస్థితి ఎదురైంది. 187 00:12:00,345 --> 00:12:02,055 అది దారుణం. నేనెవరికీ నచ్చడం లేదు. 188 00:12:03,849 --> 00:12:06,476 యాప్స్ లో నువ్వు అదరగొట్టేస్తావు అనుకున్నా. నువ్వు మృదువుగా ఉంటావు. 189 00:12:06,560 --> 00:12:07,936 -ధన్యవాదాలు. -పర్వాలేదులే. 190 00:12:08,020 --> 00:12:09,938 -నాకు చాలా మ్యాచ్లు వస్తున్నాయి. -చెప్పా కదా? 191 00:12:10,022 --> 00:12:12,733 అవును, కానీ మ్యాచ్ అయిన వారిలో చాలా మంది అసలు ప్రతిస్పందించరు. 192 00:12:12,816 --> 00:12:14,193 దానికేమైంది? 193 00:12:14,276 --> 00:12:16,695 అది బాగాలేదులే. "చాలా మంది" అంటే ఏంటి? 194 00:12:16,778 --> 00:12:18,864 -మహిళలు. -ఊరికే అడిగానులే. 195 00:12:18,947 --> 00:12:21,408 అవును. చాలా ఆప్షన్లు ఉండటం మంచిదో కాదో అర్థం కావడం లేదు. 196 00:12:21,491 --> 00:12:23,202 -దానికేమైంది? -దేనికి? 197 00:12:23,285 --> 00:12:25,996 -ఇప్పుడు నువ్వు చూశావు కదా. -లేదులే. 198 00:12:26,079 --> 00:12:27,122 తాజా కూరగాయలు & పళ్లు 199 00:12:27,206 --> 00:12:28,665 నిజంగానా? అది చాలా మంచి విషయం. 200 00:12:28,749 --> 00:12:31,585 అవును. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నాకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. 201 00:12:31,668 --> 00:12:34,171 కొవెల్ నుండి కొన్ని నెలలు దూరంగా పర్యటిస్తాను. 202 00:12:34,254 --> 00:12:36,215 -వావ్! -ఒక డొక్కు వ్యాన్ కూడా కొన్నాను. 203 00:12:36,840 --> 00:12:39,092 దానికి పనిచేసే వైపర్లు కూడా ఉన్నాయి. 204 00:12:40,052 --> 00:12:41,345 మన కారుకు కూడా అవి ఉండుంటే బాగుండు. 205 00:12:41,428 --> 00:12:44,348 అవును. ఆ సందర్భంలో, మనం ఆ వారాంతాన్ని ఆస్టిన్ లో 206 00:12:44,431 --> 00:12:45,974 గేబ్రియల్, ఎలీనాతో గడపగలిగి ఉండేవాళ్లం కాదు. 207 00:12:46,058 --> 00:12:48,560 -గేబ్రియల్ మరియు ఎలీనా. -అవును, ఆ పిచ్చోళ్ళే. 208 00:12:50,062 --> 00:12:53,023 వాళ్లకి మన సంగీతం కూడా నచ్చలేదని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది. 209 00:12:53,106 --> 00:12:54,399 వాళ్లకి నచ్చిందనే అనుకుంటా. 210 00:12:54,483 --> 00:12:56,443 వాళ్లకి మన దేహాలు కూడా నచ్చాయి. 211 00:12:57,027 --> 00:12:58,487 మనం ఆ పని చేసి ఉండాల్సిందని నీకు ఇప్పటికీ అనిపిస్తుందా? 212 00:12:58,570 --> 00:13:00,364 -అనిపిస్తోంది. అవును. -నేను చేయలేకపోయేవాడిని. 213 00:13:00,447 --> 00:13:01,448 నీకు గేలు అంటే భయం. 214 00:13:01,532 --> 00:13:04,952 ఒక మగాడితో సెక్స్ చేయడం ఇష్టం లేదంటే గేలు అంటే భయమని కాదు. 215 00:13:05,035 --> 00:13:07,996 -నువ్వు అతనితో సెక్స్ చేయబోయేవాడివి కాదు. -అతని మనస్సులో అదే ఉందనుకున్నాను. 216 00:13:08,080 --> 00:13:10,374 -లేదు, అతను చూద్దామనుకున్నాడంతే. -నిన్నూ, నన్నా? 217 00:13:10,457 --> 00:13:11,458 ఆమెని కూడా. 218 00:13:13,001 --> 00:13:14,002 నిజంగా? 219 00:13:14,086 --> 00:13:15,879 -అవును, నాకు అలాగే అనిపించింది. -అయ్యో. 220 00:13:17,047 --> 00:13:21,468 -అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. -నువ్వు పొరబడ్డావు, బాసూ. 221 00:13:28,058 --> 00:13:30,561 కానీ ఆల్బమ్ విషయంలో అభినందనలు. అది చాలా బాగా ఉంది. 222 00:13:31,270 --> 00:13:32,479 ధన్యవాదాలు. 223 00:13:32,563 --> 00:13:34,565 అవును, కాస్త సమయమైతే పట్టింది, కానీ నేను... 224 00:13:35,983 --> 00:13:41,864 నేను నా సొంత సంగీత శైలిని కనుగొన్నాను అనుకుంటా. 225 00:13:43,615 --> 00:13:46,118 నువ్వు ఊరిలో ప్రదర్శన ఇచ్చేటప్పుడు నేను వచ్చి చూస్తాను. 226 00:13:47,119 --> 00:13:48,495 తప్పకుండా. నువ్వు రావాలి. 227 00:13:50,539 --> 00:13:52,165 మరి నీ సంగతేంటి? నువ్వేమైనా వాయిస్తున్నావా? 228 00:13:54,918 --> 00:13:58,046 -వద్దంటే ఈ టాపిక్ వద్దులే. -లేదు, పర్వాలేదు. నేను వాయిస్తున్నాను. 229 00:13:58,589 --> 00:14:02,301 -అవునా? -నేను ఎప్పుడూ వాయిస్తూనే ఉంటా. 230 00:14:02,384 --> 00:14:03,385 అవును. నాకు తెలుసు. 231 00:14:04,386 --> 00:14:06,889 మన్నించు, అంటే, నువ్వు వాయించడం ఆపేశావని ఓసారి అన్నావు కదా. 232 00:14:06,972 --> 00:14:10,350 అది చాలా కాలం క్రితం మాట. అది మనం విడిపోయినప్పటి సంగతి. 233 00:14:11,018 --> 00:14:12,019 సరే. 234 00:14:12,978 --> 00:14:14,563 అవును, నేను... 235 00:14:16,648 --> 00:14:18,775 ఒక సంగీతాన్ని స్వరపరుస్తున్నాను. 236 00:14:20,652 --> 00:14:23,780 అవునా? ఎలాంటిది? 237 00:14:27,367 --> 00:14:29,077 హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 238 00:14:30,245 --> 00:14:31,496 బాగానే ఉన్నాను, మన్నించు. 239 00:14:32,623 --> 00:14:35,042 -ఈ మధ్య కాస్త ఒత్తిడిగా ఉంటోంది. -సరే. 240 00:14:41,924 --> 00:14:44,927 నన్ను మన్నించు. నేను... 241 00:14:47,429 --> 00:14:49,014 ఈమధ్య ఊరికే కంగారుపడిపోతున్నాను. 242 00:14:49,097 --> 00:14:50,140 హేయ్, అది పర్వాలేదులే. 243 00:14:59,399 --> 00:15:02,027 మన్నించు. నేను... నేను... 244 00:15:02,861 --> 00:15:04,613 -అలా నడుస్తాను, అది తగ్గిపోతుంది. -సరే. 245 00:15:23,257 --> 00:15:25,384 ఈ సామానంతా ఇంట్లో పెట్టేద్దాం, ఆ తర్వాత నేను నిన్ను విమానాశ్రయంలో దించుతాను. 246 00:15:25,467 --> 00:15:27,553 అయ్యో, పర్వాలేదులే. నీకెందుకు శ్రమ. 247 00:15:27,636 --> 00:15:28,679 నాకు నిన్ను దింపాలని ఉంది. 248 00:15:30,639 --> 00:15:32,015 నిన్ను చూడటం బాగుంది. 249 00:15:36,478 --> 00:15:39,231 అవును. నిన్ను చూడటం కూడా బాగుంది. 250 00:15:39,314 --> 00:15:40,440 జోష్? 251 00:15:41,108 --> 00:15:43,068 దేవుడా. అది నువ్వేనా? 252 00:15:43,151 --> 00:15:44,152 హాయ్, షెరిల్. 253 00:15:44,653 --> 00:15:46,196 వచ్చి నన్ను హత్తుకో! 254 00:15:46,280 --> 00:15:48,782 లేదు, అమ్మా, ఈ సామాను ఇక్కడ పెట్టేసి, నేను అతడిని 255 00:15:48,866 --> 00:15:51,451 -విమానాశ్రయంలో దింపి వస్తాను. -లేదు. 256 00:15:51,535 --> 00:15:52,953 ఫ్రాంక్! జోష్ వచ్చాడు! 257 00:15:53,537 --> 00:15:55,455 అబ్బా, ఈ యాపిల్స్ దరిద్రంగా ఉన్నాయి. 258 00:15:55,539 --> 00:15:57,207 మీరు వాటిని జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. 259 00:15:57,291 --> 00:15:58,584 -ఇక ఆపు. -తన మాట వినవద్దు. 260 00:15:58,667 --> 00:16:00,252 -నిన్ను చూడటం బాగుంది. -నిన్ను కూడా, ఫ్రాంక్. 261 00:16:00,335 --> 00:16:02,671 -చూడు, ముసలివాడివి అయిపోయావు. -అబ్బా, ఇక ఆపు. 262 00:16:02,754 --> 00:16:05,591 ఏంటి? నా ఉద్దేశమేంటో అతనికి అర్థమైంది. నువ్వు నిజంగా ముసలివాడివి కాలేదులే. 263 00:16:05,674 --> 00:16:07,718 ఇంకా నీకు చాలా జీవితం మిగిలి ఉంది. నాలాగా కాదు. 264 00:16:07,801 --> 00:16:09,636 -తాజా వార్తలు. -ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయి? 265 00:16:09,720 --> 00:16:11,513 చూశారా, నేను చెప్పేది కూడా అదే. 266 00:16:11,597 --> 00:16:14,433 ప్రపంచమంతా నాశనమైపోతోంది, మనమేమో మన పాటికి మనం బతుకుతున్నాం. 267 00:16:14,516 --> 00:16:15,642 తెలిసిందా రోజూ నేనెంత అవస్థలు పడుతున్నానో? 268 00:16:15,726 --> 00:16:18,061 నీకు వాసన వచ్చిందా? మరీ కంపు కొడుతోంది. 269 00:16:18,145 --> 00:16:19,855 ప్రతీరోజూ, ప్రతీ క్షణం. 270 00:16:19,938 --> 00:16:20,939 కాస్మో ఎలా ఉంది? 271 00:16:22,858 --> 00:16:26,445 దాని ఆరోగ్యం బాగాలేదు. కానీ అది గట్టిది కనుక చావుకు అంత తేలిగ్గా లొంగటం లేదు. 272 00:16:26,528 --> 00:16:28,488 ఆ విషయాన్ని అడిగినందుకు ధన్యవాదాలు. 273 00:16:28,989 --> 00:16:30,073 దేవుడా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 274 00:16:30,866 --> 00:16:31,909 అమ్మా. 275 00:16:31,992 --> 00:16:33,076 నేను కూడా, షెరిల్. 276 00:16:33,660 --> 00:16:36,330 -అమ్మా. -నేను నిజంగానే మిస్ అవుతున్నా. 277 00:16:36,413 --> 00:16:39,249 కానీ నా బాధ ఏంటంటే, దానికి ఇలా అయింది కనుకే నిన్ను మళ్లీ చూడగలుగుతున్నాను. 278 00:16:39,333 --> 00:16:41,585 చాలా దారుణమైన విషయం. నాకు మాటిమాటికీ దాని తల్లే గుర్తుకు వస్తోంది. 279 00:16:41,668 --> 00:16:42,711 సరే. 280 00:16:43,295 --> 00:16:45,172 -నువ్వేం తీసుకుంటావు? -లేదు, మేము బయలుదేరాలి. 281 00:16:45,255 --> 00:16:48,383 హేయ్, జోష్ ఇక్కడిదాకా వచ్చాక, ఏం పెట్టకుండా ఎలా పంపించను? 282 00:16:48,467 --> 00:16:49,801 నీకు ఏం కావాలో చెప్పు. 283 00:16:51,261 --> 00:16:52,804 -ఏదైనా ఫ్రూట్ డిప్ ఉందా? -బలైపోతావు. 284 00:16:52,888 --> 00:16:54,181 నా వద్ద అది ఉండాల్సిందేనని నీకు తెలుసు. 285 00:16:54,264 --> 00:16:55,682 -ఫ్రూట్ డిప్ తీసుకోకు. -నాకు అదే కావాలి. 286 00:16:55,766 --> 00:16:57,434 జోష్ కి నా ఫ్రూట్ డిప్ అంటే ప్రాణం. 287 00:17:06,944 --> 00:17:08,319 చాలా బాగుంది. 288 00:17:08,403 --> 00:17:09,988 ఒక్కోసారి, నేను స్పూన్ తో తినేస్తూ ఉంటాను. 289 00:17:10,070 --> 00:17:12,199 -అవును కదా, ఫ్రాంక్? -అవును. 290 00:17:12,281 --> 00:17:13,909 ఎలా చేయాలో నీకు నేర్పాను కదా, అప్పటి సంగతులు నీకు గుర్తున్నాయా? 291 00:17:13,992 --> 00:17:15,410 మళ్లీ ఆ కథ దగ్గరికే వెళ్లాలా? 292 00:17:15,492 --> 00:17:17,162 అవును, అది భలే తమాషాగా ఉంటుంది. నువ్వేమంటావు? 293 00:17:18,664 --> 00:17:21,375 పన్నీర్ మరియు బట్టర్. ఇవి కలిపి వేశాక కూడా ఇంత రుచిగా ఎలా వస్తుంది? 294 00:17:23,252 --> 00:17:24,545 నేను ఇంకాస్త వైన్ తెచ్చుకుంటాను. 295 00:17:25,337 --> 00:17:28,632 నేను పనిని మిస్ అవ్వడంలేదు. మా వాతావరణాన్ని మిస్ అవుతున్నా. 296 00:17:28,715 --> 00:17:32,094 ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏ వార్తలు చూసినా విషాద వార్తలే. 297 00:17:32,970 --> 00:17:36,598 మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి, ఎందుకంటే, మనకి ఇంకెవరు ఉంటారు. 298 00:17:36,682 --> 00:17:38,433 మన జీవితాల్లో ఎవరూ లేకపోతే, మన జీవితమే విషాదం అయిపోతుంది. 299 00:17:38,517 --> 00:17:40,769 అది మీ పాటలాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. 300 00:17:40,853 --> 00:17:43,313 -ఆ పాట ఏంటి, మెగ్? నాకు నచ్చిన పాట. -తనకు నచ్చిన "ఒకే" పాట. 301 00:17:43,397 --> 00:17:44,982 ఆ పాట విందామా? 302 00:17:45,065 --> 00:17:47,818 -వద్దు. ఇప్పుడు వద్దులే. -విందాం. ఏమైంది. చాలా బాగుంటుంది. 303 00:17:47,901 --> 00:17:49,236 ఈ పాట ద్వారా మీరు మరింత విజయం సాధించి ఉండాల్సింది. 304 00:17:49,319 --> 00:17:50,320 అమ్మా. వద్దు. 305 00:17:51,321 --> 00:17:53,031 -ఇదే. -అమ్మా. వద్దు. 306 00:17:53,115 --> 00:17:54,867 ఏ పాట, జోష్? 307 00:18:00,455 --> 00:18:02,416 ఏడవ ట్రాక్. కానీ మేగన్ చెప్పేది నిజమే. 308 00:18:02,499 --> 00:18:04,418 మనం ఆ పాటని వినకుండా ఉంటే బాగుంటుంది. 309 00:18:14,011 --> 00:18:16,430 నాకు ఈ పాటంటే ప్రాణం. అది మనస్సును కట్టిపడేస్తుంది. 310 00:18:19,558 --> 00:18:23,145 మరొక రోజు గడిచిపోయింది నీకు కూడా వయసైపోతోంది 311 00:18:23,770 --> 00:18:27,441 నీ గొంతు చాలా బాగుంటుంది, మేగీ. నీ చిన్నప్పట్నుంచీ కూడా. 312 00:18:30,444 --> 00:18:35,657 ప్రేమకి సమయం పడుతుంటారు, మరి నా సమయం ఎందుకు వృథా చేస్తావు? 313 00:18:35,741 --> 00:18:37,534 నాతో నిజాయితీగా ఉండు 314 00:18:37,618 --> 00:18:39,494 మీరిద్దరూ మీ బంధాన్ని ఎందుకు గాడిలో పెట్టుకోలేకపోయారు? 315 00:18:39,578 --> 00:18:41,038 అమ్మా, ఇక చాలు! 316 00:18:42,331 --> 00:18:45,042 నువ్వు మళ్లీ ఇదే సోది పెడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. 317 00:18:46,627 --> 00:18:48,170 నాకు తను అర్థమే కాదు. 318 00:18:49,421 --> 00:18:51,507 అవును, మన గొంతును మనమే వినడం అనేది కష్టంగానే ఉంటుంది. 319 00:18:52,049 --> 00:18:54,593 నేను తన కెరీర్ ని సరిగ్గా సపోర్ట్ చేయడం లేదని అంటుంది, 320 00:18:54,676 --> 00:18:57,429 తను చేసిన సంగీతాన్ని పెట్టినప్పుడు మాత్రం, అలా కోపగించుకుంటుంది. 321 00:18:57,513 --> 00:18:58,805 అది తన పాత ఆల్బమ్. 322 00:19:00,307 --> 00:19:01,767 తన దగ్గర అది తప్ప ఇంకొకటి లేదు కదా. 323 00:19:01,850 --> 00:19:03,143 అంటే... 324 00:19:03,227 --> 00:19:05,229 తను ఒక కొత్త ఆల్బమ్ చేస్తూ ఉందని ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. 325 00:19:05,312 --> 00:19:08,273 అంటే, తను దాని మీదనే పని చేస్తోందని, అది అయిపోయిందని చెప్తూ ఉంటుంది. 326 00:19:08,357 --> 00:19:10,817 ఆ తర్వాత, అది ఇంకా ముగియలేదు. దాన్ని త్వరలోనే వింటావులే అంటుంది. 327 00:19:10,901 --> 00:19:13,320 కానీ అది నేను ఇప్పటిదాకా విననేలేదు. ఎంతకాలం అయింది? 328 00:19:13,403 --> 00:19:15,656 నాకు తెలీను కూడా తెలీదు. 329 00:19:18,116 --> 00:19:21,119 నాకు తన విషయంలో ఆందోళనగా ఉంది. 330 00:19:21,203 --> 00:19:22,996 ఎందుకంటే, తనకి ఇప్పుడు 31 ఏళ్లు... 331 00:19:24,081 --> 00:19:25,624 అదిగాక తనది ఆడ పుటక. 332 00:19:26,583 --> 00:19:28,919 ఎల్లకాలం బారులోనే పని చేస్తుందా ఏంటి? 333 00:19:29,002 --> 00:19:30,712 నువ్వు వివేకవంతుడివి. 334 00:19:30,796 --> 00:19:33,465 నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకొని ఉండాల్సిందని తనకి చెప్పా కూడా. 335 00:19:34,049 --> 00:19:35,467 జీవితాంతం నిశ్చితార్థం దశలోనే ఉంటారా? 336 00:19:35,551 --> 00:19:38,303 అదీగాక మీరిద్దరూ చూడ ముచ్చటగా ఉంటారు. 337 00:19:40,055 --> 00:19:41,473 అయ్యయ్యో. షెరిల్, నీకేమీ కాలేదు కదా? 338 00:19:44,601 --> 00:19:46,103 దాన్ని తుడవడానికి నేనేదైనా తెస్తాను. 339 00:19:46,186 --> 00:19:47,813 దేవుడా. నీకేమైంది? 340 00:19:47,896 --> 00:19:49,898 -అది నా తప్పు కాదు. -మరెవరి తప్పు? 341 00:19:49,982 --> 00:19:51,859 -నేను తెచ్చానులే. -నువ్వు శుభ్రం చేయనక్కర్లేదు. 342 00:19:51,942 --> 00:19:53,193 నేనూ, ఫ్రాంక్ తుడుస్తాములే. 343 00:19:53,277 --> 00:19:55,153 లంచ్ ఏం తిన్నావేంటి? 344 00:19:55,237 --> 00:19:56,238 ముందు నాకు సాయపడు! 345 00:19:56,321 --> 00:19:57,698 -జోష్, నువ్వు ఆగు. -పర్వాలేదు. 346 00:19:57,781 --> 00:19:59,366 నువ్వు చేస్తే బాగుండదు. నాకో అదోలా ఉంటుంది. 347 00:19:59,449 --> 00:20:01,076 అవును. అది నాకు కూడా వాంతి తెప్పిస్తుంది. 348 00:20:01,159 --> 00:20:02,578 ఇక నోర్మూసుకో! 349 00:20:09,835 --> 00:20:11,128 ఏంటి? 350 00:20:13,005 --> 00:20:14,047 హేయ్. 351 00:20:15,257 --> 00:20:16,258 హేయ్. 352 00:20:23,473 --> 00:20:30,022 మీ అమ్మ ఇప్పుడే ఫ్రూట్ డిప్ ని వాంతి చేసుకుంది. 353 00:20:31,398 --> 00:20:34,443 -ఏంటి? -సారీ. అదేమీ జోక్ కాదు. 354 00:20:35,569 --> 00:20:36,570 అవును. 355 00:20:37,863 --> 00:20:40,699 టాయిలెట్ లో కాదు. తన మీద, 356 00:20:40,782 --> 00:20:42,993 బల్ల మీద, నేల మీదంతా వాంతి చేసుకుంది. 357 00:20:43,076 --> 00:20:44,995 -దేవుడా. -అవును. 358 00:20:45,078 --> 00:20:47,247 -అయ్యయ్యో. -మంచి విషయమేంటంటే, మీ నాన్న లేచాడు. 359 00:20:51,752 --> 00:20:53,086 అవును, అది మంచి విషయమే. 360 00:21:08,101 --> 00:21:09,102 వద్దు. 361 00:21:11,813 --> 00:21:13,524 డాక్స్ చనిపోయాడు. 362 00:21:14,107 --> 00:21:16,276 ఈ క్షణంలో మనకున్న బాధని మనం ప్రేమ అని పొరబడకూడదు. 363 00:21:16,360 --> 00:21:17,611 ఒకవేళ మనది పొరపాటు కాకుంటే? 364 00:21:19,238 --> 00:21:20,864 నేను మళ్లీ మన గతాన్ని అనుభవించలేను. 365 00:21:24,076 --> 00:21:25,118 సరే. 366 00:21:37,840 --> 00:21:38,966 అసలు నన్నెందుకు వదిలేశావు? 367 00:21:39,716 --> 00:21:41,051 ఇప్పుడు దాని గురించి చర్చ వద్దు. 368 00:21:41,134 --> 00:21:42,845 లేదు, నువ్వు నేరుగా నాకు చెప్పాలి. 369 00:21:42,928 --> 00:21:46,265 నేను నేరుగా నీకే చెప్పాను. చాలా సార్లు చెప్పాను, జోష్. 370 00:21:47,057 --> 00:21:49,560 ముందు నువ్వే నన్ను వదిలేశావు. 371 00:21:49,643 --> 00:21:52,396 నువ్వే వదిలేశావు. మనం ఆరేళ్ళుగా నిర్మించుకున్న దాన్నంతటినీ 372 00:21:52,479 --> 00:21:55,440 వదిలేయాలని ముందుగా నిర్ణయించింది నువ్వే. 373 00:21:55,524 --> 00:21:57,901 -దాని గురించి నువ్వు నాకు చెప్పలేదు. -నువ్వేమంటున్నావు? 374 00:21:57,985 --> 00:22:01,029 మనం కలిసి దేన్ని అయితే నిర్మిస్తున్నామో ఎప్పుడూ దాని గురించే మాట్లాడుకునేవాళ్లం. 375 00:22:01,113 --> 00:22:02,990 అవును, ఆ తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడటం ఆపేశావు. 376 00:22:03,073 --> 00:22:05,284 ఇక అంతే అని, మన బ్యాండ్ ఇక లేదు అని, దాని కథ ముగిసిందని 377 00:22:05,367 --> 00:22:06,869 -నువ్వు చెప్పావు. -దాని కథ నిజంగానే ముగిసింది. 378 00:22:06,952 --> 00:22:09,872 ఆ బ్యాండ్ విజయవంతమవుతోందని నీకు అనిపిస్తే, 379 00:22:09,955 --> 00:22:11,039 అది కేవలం నీ భ్రమ మాత్రమే. 380 00:22:11,957 --> 00:22:13,000 అవును. 381 00:22:13,083 --> 00:22:15,127 నన్ను మన్నించు. నిజం చెప్తున్నా కదా, నాకు కూడా అది ఇష్టం లేదు. 382 00:22:15,210 --> 00:22:17,004 కానీ ఒకానొక సమయంలో... 383 00:22:17,087 --> 00:22:19,798 మనం ఎదిగినవారిలా ప్రవర్తించాలని అనుకున్నాం. 384 00:22:20,632 --> 00:22:22,467 మనం ఒక కుటుంబం కావాలనుకున్నాం. 385 00:22:24,178 --> 00:22:27,598 అలా జరగాలంటే ఏదైతే చేయాలో నేను అదే చేశాను. 386 00:22:27,681 --> 00:22:29,057 మరి నేను అలా చేసినప్పుడు... 387 00:22:32,644 --> 00:22:34,229 నువ్వు నన్ను వద్దనుకున్నావు. 388 00:22:35,230 --> 00:22:38,400 ఒక ఉద్యోగం చేసే సాదాసీదా మనిషితో ఉండటం నీకు నచ్చలేదు. 389 00:22:39,776 --> 00:22:42,487 అలా అనకు. 390 00:22:42,571 --> 00:22:46,867 నన్ను ఒక భయంకరమైన రాక్షసిలా చిత్రీకరించకు. 391 00:22:46,950 --> 00:22:49,244 నువ్వు టీచర్ వి అయ్యావని నేను నిన్ను వదిలేయలేదు. 392 00:22:50,579 --> 00:22:54,291 నేను ప్రేమించినవాడితో నాకు నచ్చింది చేస్తున్నానేమో అని వెళ్లిపోయాను. 393 00:22:55,209 --> 00:22:56,877 ఒకప్పుడు ప్రేమించినవాడితో. 394 00:22:58,212 --> 00:23:00,255 కానీ నావన్నీ భ్రమలే అని తేలింది. 395 00:23:00,339 --> 00:23:01,840 నా ఉద్దేశం అది కాదు. 396 00:23:01,924 --> 00:23:04,051 మనకి ఏదైతే మంచిదో, నేను అదే చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. 397 00:23:04,134 --> 00:23:06,637 లేదు. నువ్వు నీకు ఏదైతా మంచిదో, అదే చేశావు. 398 00:23:06,720 --> 00:23:10,057 ఆ పనే నేను కొనసాగిస్తున్నప్పుడు, ఒంటరిగా నేనొక్కదాన్నే 399 00:23:10,140 --> 00:23:13,894 చేయడానికి ప్రయత్నించినప్పుడు, నువ్వు నన్ను చిన్నచూపు చూశావు. 400 00:23:14,394 --> 00:23:18,774 నేను ఒక దద్దమ్మలాగా 401 00:23:19,733 --> 00:23:21,735 ఒక మగవాడు గ్రహించనంతగా, నేను గ్రహించలేనన్నట్టుగా నన్ను చూశావు. 402 00:23:21,818 --> 00:23:23,654 నేను అలా అని అనలేదు. నువ్వు దద్దమ్మవి అని నేనెప్పుడూ అనలేదు. 403 00:23:23,737 --> 00:23:25,239 -నువ్వు అనలేదు. నాకు తెలుసు. -ఆ మాట నేను అననేలేదు. 404 00:23:25,322 --> 00:23:27,824 కానీ నీ ఆలోచనే సరైనదని నువ్వు చాలా నమ్మకంతో ఉన్నావు. 405 00:23:29,326 --> 00:23:30,869 జోష్, నువ్వు లోకాన్ని ఎలా చూస్తావంటే, 406 00:23:30,953 --> 00:23:33,205 నువ్వు చూసేదే సరైన పద్ధతి అన్నట్టు చూస్తావు. 407 00:23:35,165 --> 00:23:37,543 ఇప్పటికీ నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావు. నిన్ను చూస్తే తెలిసిపోతుంది. 408 00:23:38,210 --> 00:23:39,795 ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నావు. 409 00:23:46,009 --> 00:23:48,095 అదెంత బాధను కలిగిస్తుందో తెలుసా? 410 00:23:51,473 --> 00:23:55,143 మనల్ని ప్రేమించే వ్యక్తికి మన మీద నమ్మకం ఉండాలి. 411 00:23:57,020 --> 00:24:00,315 నువ్వెప్పుడూ నన్ను నమ్మలేదు. నేను సాధించగలనని నీకు అనిపించనే లేదు. 412 00:24:05,821 --> 00:24:07,698 అదెవరైనా కానీ దాన్ని సాధించగలరని నాకు అనిపించడం లేదు. 413 00:25:59,309 --> 00:26:01,311 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య