1 00:00:51,552 --> 00:00:52,553 హాయ్. 2 00:00:53,470 --> 00:00:54,471 ఇదిగోండి. 3 00:00:55,389 --> 00:00:56,473 కాస్త సంతకం పెడతారా. 4 00:01:00,811 --> 00:01:02,020 -ధన్యవాదాలు. -తప్పకుండా. 5 00:01:02,104 --> 00:01:07,067 కాబట్టి నేను, " సరే. ఒక్క నిమిషం. నాతో అలా ప్రవర్తించకు," అన్నాను. 6 00:01:08,235 --> 00:01:12,573 అవును. అదే కదా. ఇక నేను "మనిద్దరం ఎదిగినవాళ్లమే, 7 00:01:12,656 --> 00:01:15,075 కానీ నువ్వు ఇంకా పసిపిల్లలా ప్రవర్తిస్తున్నావు," అని అన్నాను 8 00:01:15,158 --> 00:01:17,369 తను అనుకున్నట్టు తన జీవితం సాగకపోతే, అది నా తప్పు కాదు కదా. 9 00:01:17,452 --> 00:01:20,956 తను చేసినవాటికి తనే బాధ్యత వహించాలి, నా మీద పడి ఏడవకూడదు. అవును. 10 00:01:21,039 --> 00:01:23,792 నేను ఉల్లిపాయాలు లేకుండా సలాడ్ ని ఆర్డర్ చేశాను. అది ఉల్లిపాయాలు లేకుండా రావాలి. 11 00:01:23,876 --> 00:01:26,545 అది ఇప్పుడే జరగాల్సిన అవసరం ఉంది. 12 00:01:27,462 --> 00:01:28,839 -నాకు తెలుసు. -ఇదిగోండి. 13 00:01:28,922 --> 00:01:32,342 అదీగాక ఇవాళ అయితే తనతో నాకు అస్సలు మాట్లాడాలని లేదు. 14 00:01:32,426 --> 00:01:33,427 మీరు... 15 00:01:37,764 --> 00:01:39,266 అబ్బా. 16 00:01:50,319 --> 00:01:52,029 దేవుడా, విక్టర్ 17 00:01:52,863 --> 00:01:55,115 మన్నించండి. మిమ్మల్ని భయపెట్టాలనుకోలేదు. 18 00:01:55,782 --> 00:01:58,160 నా చేతులు ఖాళీ లేవు. అక్కడే ఒక చోట పెట్టేయి. 19 00:01:58,243 --> 00:02:01,246 సరే. కానివ్వండి. నేను పెడతానులెండి. ఏం పర్వాలేదు. 20 00:02:02,372 --> 00:02:04,458 ఈ వారాంతం డోడ్జర్స్ మ్యాచ్ కి వెళ్తున్నావా? 21 00:02:04,541 --> 00:02:05,834 అంటే, టిక్కెట్లు ఉంటే, 22 00:02:05,918 --> 00:02:07,794 -వేరేవాళ్లకి ఇచ్చేశాను. -ఏంటి? అవునా? 23 00:02:07,878 --> 00:02:10,172 అవును. పోయినసారి వెళ్లినప్పుడు అది నా కూతురుకు అంత నచ్చలేదు. 24 00:02:10,255 --> 00:02:13,300 ఇంతకుముందు తనకి ఇష్టముండేది, కానీ ఇప్పుడు లేదు, కనుక, ఇంకేదైనా చేస్తాంలే. 25 00:02:13,383 --> 00:02:15,969 -పర్వాలేదులెండి. అవును. -నీ కూతురి వయస్సెంత? 26 00:02:16,053 --> 00:02:18,472 -పదమూడు. -టీనేజ్ పిల్లలతో వేగడం కష్టం. 27 00:02:19,223 --> 00:02:21,975 -పరిస్థితి మెరుగవ్వదంటారా? -నాకు తెలీదు మరి. 28 00:02:22,059 --> 00:02:25,103 నా కూతురు వాళ్ళ నాన్నతో ఉంటుంది, తన అన్నయ్య నాతో ఉంటాడు, 29 00:02:25,187 --> 00:02:26,730 వాడంటే నాకు పరమ అసహ్యం. 30 00:02:28,065 --> 00:02:29,358 -సరే. -నేను... 31 00:02:29,441 --> 00:02:31,151 -బై. మళ్లీ కలుద్దాంలే, -సరే. అలాగే. 32 00:02:31,652 --> 00:02:32,986 వారాంతం కులాసాగా గడుపు, సరేనా? 33 00:02:34,696 --> 00:02:37,824 హేయ్, విక్టర్, మరీ సీరియస్ గా చెప్పనా? 34 00:02:37,908 --> 00:02:40,577 చాలా బాగా చెప్పారు. అదేం లేదు. సరిగ్గా ఎలా చెప్పాలో అలానే చెప్పారు. 35 00:02:40,661 --> 00:02:42,287 -సరే. బై. -బై. 36 00:02:43,247 --> 00:02:46,250 అర్టురో క్యాస్ట్రో నటిస్తున్నారు 37 00:02:47,835 --> 00:02:48,836 లాస్ ఏంజలెస్ 38 00:02:48,919 --> 00:02:50,546 నీకు నాతో షికారుకు వెళ్ళాలనుంటే 39 00:02:50,629 --> 00:02:52,548 మనం జామ్ జామ్ అంటూ బెంజ్ కారులో వెళ్దాం 40 00:02:52,631 --> 00:02:57,469 నేనెందుకు ఇలా ఎంజాయ్ చేస్తునాను? డబ్బులు ఎక్కువయి కావచ్చు! 41 00:02:57,553 --> 00:03:02,057 నువ్వు నాతో చిందులేయాలనుకుంటే ఆ పని నా ఆడీ కారులో చేసుకుందా 42 00:03:02,140 --> 00:03:03,600 ఉత్సాహమూర్తి 43 00:03:03,684 --> 00:03:06,770 నాకెందుకు ఇలా అనిపిస్తోంది? డబ్బులు ఎక్కువయి కావచ్చు! 44 00:03:18,699 --> 00:03:19,700 -బాసూ. -చెప్పు. 45 00:03:19,783 --> 00:03:22,244 -ఏం చేస్తున్నావు? చికెన్ చేస్తున్నావా? -లేదు బాసూ. 46 00:03:22,327 --> 00:03:24,872 -ఇది నా స్పెషల్ చేపల పులుసు. -నీ దుంపదెగ. నిజంగా? 47 00:03:24,955 --> 00:03:27,416 -దయచేసి ఆ మాట అనకుండా ఉంటావా? -మన్నించు, మన్నించు. 48 00:03:27,499 --> 00:03:29,418 -రేపు గాబీ వస్తోంది. -తను ఇప్పుడు ఇక్కడ లేదు, కదా? 49 00:03:29,501 --> 00:03:31,128 లేదు, లేదు, కానీ తన ముందు నువ్వు నోరు జారవచ్చు. 50 00:03:31,211 --> 00:03:33,672 -సరే, ఒక్క నిమిషం. అది గాబీ కోసమా? -అవును. 51 00:03:33,755 --> 00:03:35,507 కానీ తను వచ్చేది రేపు కదా. 52 00:03:35,591 --> 00:03:38,051 అవును. కానీ ఇప్పుడు తనకి నాతో కలిసి వండటం ఇష్టం లేదు, 53 00:03:38,135 --> 00:03:39,553 కాబట్టి ఆ సమయాన్ని నేను తనతో గడుపుతానులే. 54 00:03:39,636 --> 00:03:42,890 -కాబట్టి ఒకరోజు ముందే చేద్దామనుకున్నా. -అవును, కానీ ఏం చేస్తావు? 55 00:03:42,973 --> 00:03:44,933 ఇదంతా వండేసి, ఫ్రిడ్జ్ లో పెడతావా? 56 00:03:46,059 --> 00:03:47,060 ఏంటి? 57 00:03:47,144 --> 00:03:48,979 రేపు తను తినేశాక, మిగిలి ఉంటే నువ్వు కూడా తినవచ్చులే. 58 00:03:49,062 --> 00:03:51,231 కానీ నేనేమంటున్నానంటే ఆ సమయాన్ని నేను ఉపయోగించుకుంటే... 59 00:03:51,315 --> 00:03:52,983 ఈ బేరసారాలేంటి? 60 00:03:53,066 --> 00:03:54,359 -నీకేమైంది? -అది తాజాగా... 61 00:03:54,443 --> 00:03:56,236 -నా వంటగది నుండి దొబ్బేయ్. -సరే. 62 00:03:56,320 --> 00:03:57,321 అబ్బా. 63 00:03:59,114 --> 00:04:00,199 అబ్బా. 64 00:04:31,688 --> 00:04:32,689 -హాయ్. -హేయ్. 65 00:04:32,773 --> 00:04:34,733 గాబీ, నాన్న వచ్చాడు! 66 00:04:35,817 --> 00:04:38,654 వావ్, నీ డ్రెస్ రంగురంగులుగా భలేగా ఉంది. 67 00:04:39,696 --> 00:04:41,657 అంత రంగురంగులగా ఏం లేదులే. 68 00:04:41,740 --> 00:04:44,284 అది కాదు, నీకు చాలా బాగుంది అని చెప్పాలనుకున్నా... 69 00:04:50,624 --> 00:04:51,792 గబా గబా, ఏంటి సంగతి? 70 00:04:52,668 --> 00:04:54,753 నాకు హై ఫై కొట్టవా? హలో? 71 00:04:56,755 --> 00:04:57,756 ఎందుకు అంత కోపంగా ఉంది? 72 00:04:58,674 --> 00:05:01,885 నిన్న ఆడ్రియానా వాళ్ళ ఇంట్లో కొందరు అమ్మాయిలు సరదాగా గడిపారు. 73 00:05:01,969 --> 00:05:03,554 తనని రమ్మనలేదు. 74 00:05:03,637 --> 00:05:05,222 -ఎందుకు? -ఏమో మరి. 75 00:05:05,305 --> 00:05:07,474 రోజంతా ఇలానే ఉంది. 76 00:05:08,809 --> 00:05:11,603 ఓయ్, లేదు, లేదు, లేదు. నువ్వు వేరే డ్రెస్ వేసుకోవాలి. 77 00:05:11,687 --> 00:05:14,189 -ఎందుకు? -గాబీ, అమ్మ మాట విను. 78 00:05:14,273 --> 00:05:16,441 -నాకేమీ పర్వాలేదు. -ఓయ్. 79 00:05:19,945 --> 00:05:21,363 -గుడ్ లక్. -సరే. 80 00:05:21,446 --> 00:05:23,448 జాక్ 81 00:05:26,743 --> 00:05:28,453 మరి, ఏం తింటావు? 82 00:05:29,079 --> 00:05:30,330 నాకు ఆకలిగా లేదు అన్నాను కదా. 83 00:05:30,414 --> 00:05:32,916 నాకు తెలుసు, కానీ భోజన సమయమైంది. అంటే ఏదోకటి తినాలి, కదా? 84 00:05:33,000 --> 00:05:36,503 అవును, కానీ భోజన సమయం అయిందంటే దానర్థం నాకు ఆకలి వేయాలని కాదు కదా. 85 00:05:36,587 --> 00:05:38,213 నా శరీరం చెప్పినట్టు నడుచుకుంటున్నానంతే. 86 00:05:38,714 --> 00:05:41,049 సరే. నీ శరీరం... అలాగే. 87 00:05:41,550 --> 00:05:43,135 అయితే ఇప్పుడు ఏదోకటి తీసుకుంటాను, 88 00:05:43,218 --> 00:05:45,846 నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు దాన్ని తినవచ్చు, సరేనా? 89 00:05:45,929 --> 00:05:48,599 -నీకు స్పైసీ చికెన్ కావాలా? -వెజ్ ఏదీ ఉండవా? 90 00:05:49,099 --> 00:05:50,642 ఏంటి, వెజిటేరియన్ అయిపోయావా? 91 00:05:51,351 --> 00:05:53,979 వెజిటేరియన్ ఏమీ కాలేదు, కానీ వెజ్ మాత్రమే తింటున్నాను. 92 00:05:54,062 --> 00:05:57,107 కానీ నువ్వు వెజిటేరియన్ కాదు కదా. పోయినసారి లెగ్ పీసులు లాగించేశావు. 93 00:05:57,191 --> 00:06:00,360 అవును, కానీ అవి బాగాలేవు. మూడు రోజుల పాటు నా కడుపు తిప్పేసింది. 94 00:06:00,444 --> 00:06:02,487 అవును, నువ్వు సరిగ్గా తినట్లేదు కాబట్టి, నీ కడుపు తిప్పింది. 95 00:06:02,571 --> 00:06:03,947 -ఇక ఆపు. -నువ్వు ఎప్పుడూ సమయానికి తినవు. 96 00:06:04,031 --> 00:06:05,407 ఇక మాట్లాడటం ఆపు. నాకు ఆకలిగా లేదు. 97 00:06:05,490 --> 00:06:08,243 -ఇక మనం బయలుదేరవచ్చా? -మనం పార్సెల్ వద్ద ఉన్నాం. 98 00:06:08,327 --> 00:06:11,079 సరేనా? ముందు ఒక కారు ఉంది, వెనక ఇంకో కారుంది, పక్కన ఫుట్ పాత్ ఉంది, 99 00:06:11,163 --> 00:06:12,164 అక్కడేమో భారీ మెనూ ఉంది. 100 00:06:12,247 --> 00:06:14,875 -నన్ను ఇంకెక్కడికి వెళ్లమంటావు? -అయితే మనం ఇక్కడే కూర్చొనుండాలా? 101 00:06:14,958 --> 00:06:17,002 నాకోసం నేనొక స్పైసీ చికెన్ శ్యాండ్విచ్ తీసుకుంటాను, 102 00:06:17,085 --> 00:06:19,087 ఆ తర్వాత నీకేం కావాలంటే అది నువ్వు చేసుకోవచ్చు. 103 00:06:19,171 --> 00:06:20,797 ఏమంటావు? బాగానే ఉందా? 104 00:06:22,216 --> 00:06:24,801 బాగుందా? మంచిది. 105 00:06:25,427 --> 00:06:27,137 కనీసం నాకు బాత్రూమ్ అయినా సరిగ్గా వస్తుంది. 106 00:06:35,938 --> 00:06:36,939 హేయ్. 107 00:06:39,608 --> 00:06:40,609 హేయ్. 108 00:06:42,486 --> 00:06:44,071 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నాను. 109 00:06:44,154 --> 00:06:45,364 ఏం చేస్తున్నావు? 110 00:06:46,907 --> 00:06:48,325 కిటికీ నుండి బయటకు చూస్తూన్నానంతే. 111 00:06:52,120 --> 00:06:54,414 -హేయ్, గాబీ వచ్చింది. -సరే. 112 00:06:54,998 --> 00:06:57,543 -నన్నేమైనా... సరే. -పర్వాలేదులే. హేయ్, గాబీ. 113 00:06:57,626 --> 00:06:58,627 హేయ్. 114 00:06:59,169 --> 00:07:01,547 సరే మరి. నీ బ్యాగ్ పెట్టేయ్. ఇద్దరం హైకింగ్ కి వెళ్దాం. 115 00:07:01,630 --> 00:07:03,382 కుదరదు. నాకు హోమ్ వర్క్ ఉంది. 116 00:07:03,465 --> 00:07:06,343 ఎప్పుడూ అదే చెప్తుంటావు, కానీ ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు. 117 00:07:06,426 --> 00:07:07,594 ఫోన్లో హోమ్ వర్క్ చేసుకుంటున్నాను. 118 00:07:07,678 --> 00:07:10,347 నీకు తాజా గాలి కావాలి, సరేనా? మనుషులకు తాజా గాలి అవసరమవుతుంది. 119 00:07:10,430 --> 00:07:12,349 ఇక్కడ గాలి ఉంది. నాకు ఆ గాలి చాలు. 120 00:07:12,933 --> 00:07:14,935 -ఇది చాలా బాగుంది కదా? -అవుననే అనుకుంటా. 121 00:07:16,270 --> 00:07:18,564 -పోనుపోనూ మరింత అందంగా అవుతుంది. -ఎప్పుడు? 122 00:07:18,647 --> 00:07:19,648 త్వరలోనే. 123 00:07:20,232 --> 00:07:22,234 మనం డోడ్జర్ మ్యాచ్ కి ఎందుకు వెళ్లలేదు? 124 00:07:22,734 --> 00:07:23,735 నిజంగా అంటున్నావా? 125 00:07:23,819 --> 00:07:26,572 -రెండు వారాల క్రితం నీకు నచ్చలేదన్నావు. -నేను అలా అని అనలేదు. 126 00:07:26,655 --> 00:07:28,824 "నేను ఇక్కడికి ఇంకెప్పుడూ రాను," అని అన్నావు. 127 00:07:28,907 --> 00:07:31,660 ఏదోకటిలే. నీకెప్పుడైనా వెనక్కి పోవాలంటే చెప్పు, నేను రెడీగా ఉన్నాను. 128 00:07:31,743 --> 00:07:33,745 కమాన్. నువ్వు వెజిటేరియన్ కదా? 129 00:07:33,829 --> 00:07:35,622 నువ్వు ఇలాంటి వ్యాయామాల్లాంటివి చేయాలి. 130 00:07:36,415 --> 00:07:38,375 -కాదంటావా? -అది మూసధోరణి. 131 00:07:40,669 --> 00:07:41,879 అంతా బాగానే ఉందా? 132 00:07:44,715 --> 00:07:46,717 హేయ్, నువ్వు ఆ పని తర్వాత చేసుకోరాదూ? 133 00:07:46,800 --> 00:07:49,428 -లేదు, అది కుదరదు. -మనం ప్రకృతి ఒడిలో ఉన్నాం. కమాన్. 134 00:07:50,387 --> 00:07:51,513 హేయ్. అది ఏదైనా కానీ, 135 00:07:51,597 --> 00:07:53,390 -దాన్ని కాసేపు పక్కన పెట్టకూడదా... -పక్కన పెట్టడం కుదరదు. 136 00:07:53,473 --> 00:07:54,933 వీళ్ళు నీ మిత్రులు కాదు, నా మిత్రులు. 137 00:07:55,017 --> 00:07:57,269 క్షమించు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. 138 00:07:57,352 --> 00:07:59,646 సరే. నాకు కూడా స్నేహితులు ఉన్నారు. 139 00:07:59,730 --> 00:08:03,525 -అదీ ఇదీ ఒకటే కాదు. -అవును, కానీ ఎలా ఉండేదో నాకూ తెలుసు. 140 00:08:03,609 --> 00:08:04,943 అప్పుడు వేరుగా ఉండేదిలే. 141 00:08:05,027 --> 00:08:07,571 వేరుగానే ఉండేది, కానీ దాదాపు ఒకేలా ఉండేదని కూడా నేను చెప్పగలను. 142 00:08:09,781 --> 00:08:11,366 నాకు అమ్మాయిలు ఎలా ఉండగలరో నాకు తెలుసు. 143 00:08:12,492 --> 00:08:13,827 -నిజంగానా? -అవును. 144 00:08:13,911 --> 00:08:16,121 సరే. అమ్మాయిలు ఎలా ఉండగలరు? 145 00:08:17,122 --> 00:08:20,709 బాగా కటువుగా ఉండేవారు. అది కూడా సాటి అమ్మాయిలతో అయితే మరీను. 146 00:08:22,836 --> 00:08:23,837 సర్లే. 147 00:08:27,382 --> 00:08:29,843 పాపా, నీకు ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే, 148 00:08:29,927 --> 00:08:31,470 నేను ఉన్నానని మర్చిపోకు, సరేనా? 149 00:08:31,553 --> 00:08:33,347 నేను నీకోసం ఎల్లప్పుడూ ఉంటాను. 150 00:08:33,429 --> 00:08:35,933 ఎప్పుడూ. నేను ఎక్కడికీ వెళ్ళను. 151 00:08:36,517 --> 00:08:41,063 ఆడ్రియానా గురించి నీకు అమ్మ చెప్పిందా? ఎందుకు చెప్పింది? తనకి బుర్ర లేదు. 152 00:08:41,145 --> 00:08:43,815 హేయ్. అమ్మని అలా అనకూడదు. అర్థమైందా? 153 00:08:44,983 --> 00:08:46,818 సరే. ఇక చాలు. నాకు ఫోన్ ఇవ్వు. 154 00:08:46,902 --> 00:08:49,404 -లేదు. నాన్నా, నాకు దీనితో పనుంది. -అవును. నిన్ను మర్యాదగా అడిగాను. 155 00:08:49,488 --> 00:08:50,989 -లేదు, తర్వాత చేసుకో. ఫోన్ ఇవ్వు. -ఇవ్వను. 156 00:08:51,073 --> 00:08:52,324 -నీకు తర్వాత ఇచ్చేస్తాలే. -వదిలేయ్. 157 00:08:52,407 --> 00:08:53,408 ఫోన్ ఇలా ఇవ్వు. 158 00:08:53,492 --> 00:08:55,744 పాపా, ఈ ఫోన్ ని నీకు నేను కొనిచ్చాను, కాబట్టి, నాకు ఫోన్ ఇచ్చేయ్. 159 00:08:55,827 --> 00:08:57,955 నా మీద నుండి చేతులు తీయ్! 160 00:09:01,708 --> 00:09:04,962 నా మాట విను. ఇదేదీ ముఖ్యం కాదు, సరేనా? ఇదేదీ ముఖ్యం కాదు. 161 00:09:05,045 --> 00:09:07,965 పొద్దస్తమానం ఫోన్ నే చూస్తూ ఉంటావు కనుక అది ముఖ్యమనిపిస్తుంది, సరేనా? 162 00:09:08,048 --> 00:09:10,551 దాన్ని ఒకరోజు పక్కకు పెట్టి చూడు, అప్పుడు నీకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. 163 00:09:10,634 --> 00:09:11,635 నా మాట నమ్ము. 164 00:09:13,762 --> 00:09:14,972 నువ్వు మరీ పాతకాలపు మనిషివి. 165 00:09:24,606 --> 00:09:28,902 నాకు ఒక స్వప్నం ఉండేది. దాన్ని సాకారం చేసుకొనేందుకే ప్రయత్నించాను. 166 00:09:30,153 --> 00:09:32,614 అలా చేస్తూ అందరికీ ప్రేమ పంచాలని చూశాను. 167 00:09:38,287 --> 00:09:41,623 నాకు మీరంటే చాలా ఇష్టం. నిజంగానే ఇష్టం. 168 00:09:44,293 --> 00:09:45,294 సరే. 169 00:09:47,921 --> 00:09:48,922 సెలవు. 170 00:09:49,506 --> 00:09:51,341 సరే. నేనేం చెప్తున్నానో ఇప్పుడు నీకు అర్థమైందా? 171 00:09:51,425 --> 00:09:53,802 ఒక సమయంలో, తను బాగా నటించిందనుకో. 172 00:09:53,886 --> 00:09:56,221 -నీకు విషయం అర్థమవ్వడంలేదు. -కాదు, కానీ మధ్యలో తను నటించింది. 173 00:09:56,305 --> 00:09:58,307 నీకు తెలియలేదా? తను మరీ అతిగా ఎగబీల్చిందని నీకు అనిపించలేదా? 174 00:09:58,390 --> 00:09:59,600 -నాన్నా, నేను చెప్పేది విను. -ఏంటి? 175 00:09:59,683 --> 00:10:00,851 ఈ వీడియో లైవ్ లోకి వచ్చాక, 176 00:10:00,934 --> 00:10:03,228 -తను 75,000 సభ్యులను కోల్పోయింది. -అవును. 177 00:10:03,312 --> 00:10:05,772 అంటే, అంతా సురక్షితంగా ఉందని, లిప్ స్టిక్కుల్లో మెర్క్యూరీ లేదని 178 00:10:05,856 --> 00:10:08,942 నిర్ధారించుకోవడానికి, తను ఎల్లప్పుడూ చైనాలోని ఫ్యాక్టరీలో ఉండలేదు కదా. 179 00:10:09,026 --> 00:10:10,819 కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే, అది తన తప్పు కాదు. 180 00:10:10,903 --> 00:10:13,155 కానీ అందరూ తనదే తప్పు అని అంటున్నారు, 181 00:10:13,238 --> 00:10:15,199 అసలు తను ఎంత కష్టపడి పనిచేస్తుందో కూడా వాళ్లకి తెలీదు. 182 00:10:15,282 --> 00:10:17,242 -తనెంత కష్టపడుతుందో నీకు తెలుసా? -తెలుసు. 183 00:10:17,326 --> 00:10:21,747 తను ఉదయానే 6:30కి లేచి 2 గంటల పాటు కేశాలంకరణ, మేకప్ చేసుకుంటుంది. 184 00:10:21,830 --> 00:10:24,124 ఆ తర్వాత తనే చిత్రీకరణ చేసి, మొత్తం వీడియోను తనే ఎడిట్ చేసుకుంటుంది. 185 00:10:24,208 --> 00:10:27,377 కాబట్టి ఏదో చిన్న తప్పు జరిగిందని అందరూ తన మీద నిందలేయడం 186 00:10:27,461 --> 00:10:28,962 సమంజసమైన విషయం కాదు. 187 00:10:29,046 --> 00:10:32,216 అది చిన్న తప్పు కాదు. తను విషపూరితమైన మేకప్ ని అమ్మింది, సరేనా? 188 00:10:32,299 --> 00:10:36,553 అది... అది చాలా ప్రమాదకరమైనది. కనుక విమర్శలు సహజంగానే వస్తాయనుకుంటా. 189 00:10:36,637 --> 00:10:38,388 -దేవుడా. నిజంగా అంటున్నావా? -అవును. 190 00:10:38,472 --> 00:10:40,974 ఆమె ఎంత మంది కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉందో నీకు తెలుసా, 191 00:10:41,058 --> 00:10:42,935 కానీ ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా తనకి అండగా ఉండటంలేదే? 192 00:10:43,018 --> 00:10:44,937 -సరే, నువ్వు మరీ అలా అయిపోనక్కర్లేదు. -అలా అంటే ఎలా? 193 00:10:45,020 --> 00:10:47,147 మరీ ఎమోషనల్ అయిపోతున్నావు, బంగారం. అది నా అభిప్రాయం మాత్రమే. 194 00:10:48,232 --> 00:10:50,150 -నువ్వు ఎప్పుడూ ఇంతే. -ఇంతే అంటే? 195 00:10:50,651 --> 00:10:53,111 -ఇష్టపడినవాటి విషయంలో తీసిపారేస్తావు. -ఏమంటున్నావు? 196 00:10:53,195 --> 00:10:55,656 -నా ఉద్దేశం అది కాదు. -వదిలేయిలే. 197 00:10:58,951 --> 00:10:59,952 సరే మరి. 198 00:11:01,745 --> 00:11:03,372 ఇక వెళ్లి పడుకుందామా? 199 00:11:04,623 --> 00:11:06,500 -పడుకో. సరే. -అలాగే. 200 00:11:09,336 --> 00:11:10,337 రా. 201 00:11:12,089 --> 00:11:14,466 నేను టీవీ చూస్తాలే. నాకేమీ అలసటగా లేదు. 202 00:11:14,550 --> 00:11:17,052 కమాన్. ఈపాటికి నువ్వు పడుకొని ఉండాలి. పద. 203 00:11:17,135 --> 00:11:20,264 -ఈపాటికి నేను పడుకొని ఉండాలా? -పొద్దుపోయిందిలే. ఏదైతే ఏంటి. పద. 204 00:11:20,347 --> 00:11:22,266 -ఇవాళ శనివారం. -పాపా, నేను ఇప్పటికే సౌమ్యంగా ఉన్నాను. 205 00:11:22,349 --> 00:11:24,351 మీ అమ్మ అయితే, ఇంత పొద్దుపోయేదాకా నిన్ను ఉండనిచ్చేదే కాదు. 206 00:11:24,434 --> 00:11:27,312 -మధ్యలో అమ్మని లాగకు. -నేనేం లాగడంలేదు. దయచేసి లేచి వస్తావా? 207 00:11:28,146 --> 00:11:29,940 -లేదు. -నేను నీతో వాదులాడలేను. 208 00:11:30,023 --> 00:11:32,192 దయచేసి లేయి. నేను అలసిపోయాను. దయచేసి పైకి లేయి. 209 00:11:32,276 --> 00:11:35,737 నిన్ను సోఫా మీద పడుకోనివ్వలేను, సరేనా? అది సరైనది కాదు. ప్లీజ్. ధన్యవాదాలు. 210 00:11:35,821 --> 00:11:37,823 దేవుడా. ప్రతీ దానికి ఎందుకు పేచీ పెడతావు? 211 00:11:41,869 --> 00:11:43,912 అదీ... హేయ్. 212 00:11:45,205 --> 00:11:46,874 ఏం పర్వాలేదులే. అయినా ఎవరు పట్టించుకుంటారు? 213 00:11:46,957 --> 00:11:50,335 చూడు. మనం ఇలా తిప్పేద్దాం, అంతేగా. 214 00:11:54,298 --> 00:11:56,800 చూశావా? అంటే, 215 00:11:56,884 --> 00:11:59,052 -అది పిజ్జా సాస్ మరక... -అది నాకు అనవసరం. 216 00:12:00,262 --> 00:12:03,098 చూడు, నీ దేహానికి సంబంధించినవి నాతో మాట్లాడటం నీకు ఇష్టంలేదని నాకు తెలుసు. 217 00:12:03,182 --> 00:12:04,933 -నాన్నా. -కానీ పీరియడ్స్ అనేవి సర్వసాధారణమైనవే. 218 00:12:05,017 --> 00:12:06,018 ఇక ఆపు. 219 00:12:06,101 --> 00:12:08,061 హై స్కూల్ లో ఉండగా నా గర్ల్ ఫ్రెండ్ కి అవి ఎప్పుడూ వస్తూనే ఉండేవి. 220 00:12:08,145 --> 00:12:09,980 ఆపు! ఇక ఆపు, సరేనా? 221 00:12:10,063 --> 00:12:12,900 అసలు ఈ వారాంతానికి నేను ఇక్కడికి రానన్నాను. అమ్మే పంపించింది. 222 00:12:16,403 --> 00:12:17,404 సరే మరి, 223 00:12:18,071 --> 00:12:20,240 అమ్మ దగ్గర ఉంటే ఏం చేసేదానివి? 224 00:12:20,324 --> 00:12:23,327 నా మంచం మీద పడుకొని, అమ్మ హీటింగ్ ప్యాడ్ వాడేదాన్ని. 225 00:12:24,494 --> 00:12:28,457 మా దగ్గర హీటింగ్ ప్యాడ్ లేదు, కానీ మనం సొంతంగా ఒకటి చేసుకోవచ్చు. 226 00:12:28,540 --> 00:12:30,125 -ఓరి దేవుడా. -లేదు, లేదు. నేను చూసుకుంటాలే. 227 00:12:30,792 --> 00:12:31,960 ఇక్కడే ఉండు. 228 00:12:32,920 --> 00:12:33,921 ఒక్క నిమిషం. 229 00:12:47,768 --> 00:12:49,144 డోడ్జర్ స్టేడియమ్ లాస్ ఏంజలెస్ 230 00:12:51,146 --> 00:12:54,066 హేయ్. నేను ఒక టవల్ ని వేడి చేశాను. ఇది హీటింగ్ ప్యాడ్ లా పని చేస్తుంది. 231 00:12:54,149 --> 00:12:55,526 నాకు అది అక్కర్లేదు. 232 00:12:56,026 --> 00:12:57,861 ఇది హీటింగ్ ప్యాడ్ లాగానే పని చేస్తుంది. నిజంగా చెప్తున్నా. 233 00:12:57,945 --> 00:13:00,489 -అది హీటింగ్ ప్యాడ్ లా పనికి రాదు. -నువ్వు కనీసం ప్రయత్నించలేదు కూడా. 234 00:13:00,572 --> 00:13:02,407 దయచేసి వెళ్లిపోతావా? 235 00:13:05,035 --> 00:13:07,037 ఇంకేమైనా చేయాలా? 236 00:13:11,583 --> 00:13:12,584 సరే. 237 00:13:14,586 --> 00:13:15,587 గాబీ కోసం 238 00:13:43,282 --> 00:13:46,159 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నా. క్రాంప్స్, అంతే. 239 00:13:47,703 --> 00:13:51,164 -వీళ్ళ వద్ద హీటింగ్ ప్యాడ్ ఉందా? -లేదు, ఉండదు కూడా. 240 00:13:59,590 --> 00:14:03,302 నీకొకటి చెప్పనా? నేనొకటి చేస్తూ ఉంటాను, అది నీకూ ఉపయోగపడవచ్చు. 241 00:14:03,385 --> 00:14:04,845 కావాలంటే నీకు చూపెట్టగలను. 242 00:14:05,345 --> 00:14:06,346 నిజంగానా? 243 00:14:12,060 --> 00:14:13,437 ఇది నీ గదా? 244 00:14:13,520 --> 00:14:16,481 ఇది మా నాన్న గది, ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాడుకుంటానంతే. 245 00:14:16,565 --> 00:14:18,066 ఆయన సోఫాలో పడుకుంటాడు. 246 00:14:19,234 --> 00:14:21,403 గోడల మీద ఉండే పిచ్చిపిచ్చివి మాత్రం చూడకు. 247 00:14:25,908 --> 00:14:29,036 నీకే తెలుస్తుంది. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. 248 00:14:31,622 --> 00:14:33,540 దేవుడా. నాకు అప్పుడే ఒత్తిడి తగ్గడం తెలుస్తోంది. 249 00:14:34,124 --> 00:14:35,125 మంచిది. 250 00:14:43,175 --> 00:14:44,176 హాయ్. 251 00:14:44,259 --> 00:14:46,303 హలో. 252 00:14:46,386 --> 00:14:48,263 నేను అంతరాయం కలిగించాలని రాలేదు. మీరు బాగానే చేస్తున్నారు. 253 00:14:49,181 --> 00:14:52,434 -నాన్నా, ఈమె కెరోలిన్. -హాయ్, కెరోలిన్. నా పేరు విక్టర్. 254 00:14:52,935 --> 00:14:55,020 హాయ్, నేను ఎవరి స్నేహితురాలినంటే... 255 00:14:56,605 --> 00:14:57,814 ఓరి దేవుడా. 256 00:14:58,482 --> 00:14:59,775 జోష్ కా? 257 00:14:59,858 --> 00:15:01,193 అవును. 258 00:15:01,276 --> 00:15:03,862 నేను కూడా అతని పేరును మాటిమాటికీ మర్చిపోతూ ఉంటా. పర్వాలేదు. 259 00:15:03,946 --> 00:15:05,822 నేను అక్కడ ఉన్నప్పుడు తను బాత్రూమ్ లోకి వచ్చింది. 260 00:15:05,906 --> 00:15:08,617 కానీ తను డాన్స్ లో నేర్చుకొన్న ఒక వ్యాయామాన్ని నాకు చూపాలనుకుంది, 261 00:15:08,700 --> 00:15:11,119 దాని వల్ల నాకు క్రాంప్స్ చాలా బాగా తగ్గాయి. 262 00:15:11,203 --> 00:15:14,248 హీటింగ్ ప్యాడ్ లేదు కాబట్టి, తను వేడి చేసిన టవల్ ని ఉపయోగించమని చెప్పాడు. 263 00:15:16,375 --> 00:15:18,293 నేను కూడా ఒకసారి అలానే చేశాను, అది పని చేస్తుంది కూడా. 264 00:15:25,342 --> 00:15:26,885 మీరు చేసేది బాగున్నట్టుంది. 265 00:15:26,969 --> 00:15:29,888 -నేనూ వచ్చి చేస్తే... మీకు పర్లేదు కదా? -పర్వాలేదు. రండి. 266 00:15:29,972 --> 00:15:32,057 ఇది మీ దిగువ వీపు భాగానికి మంచిది. 267 00:15:32,140 --> 00:15:33,684 సరే, చూద్దాం. 268 00:15:34,351 --> 00:15:35,602 -కాస్త ముందుకు వెళ్లండి. -సరే. 269 00:15:36,979 --> 00:15:39,231 ఓరి దేవుడా. అవును, బాగుంది. 270 00:15:40,065 --> 00:15:42,401 మరి, మీకు జోష్ ఎంత కాలంగా తెలుసు? 271 00:15:44,069 --> 00:15:46,655 పోయిన వారం నుండే మాట్లాడుకోవడం మొదలుపెట్టినట్టున్నాం. 272 00:15:47,155 --> 00:15:49,283 -మాట్లాడుకోవడమా? -చాటింగ్. 273 00:15:49,366 --> 00:15:50,993 జీవితాంతం చాటింగ్ చేసుకుంటూనే ఉంటారా? 274 00:15:52,786 --> 00:15:54,872 నిజం చెప్పాలంటే, ఇక అంతే కాకపోవచ్చు. 275 00:16:02,421 --> 00:16:03,755 అయితే సెక్స్ బాగా జరగలేదా? 276 00:16:17,227 --> 00:16:18,228 హేయ్. 277 00:16:19,980 --> 00:16:22,357 కాస్త త్వరగా తయారవుతావా? నాకు ఆలస్యం కావాలని లేదు. 278 00:16:23,358 --> 00:16:24,651 గాబీ? 279 00:16:24,735 --> 00:16:27,196 -వచ్చేస్తున్నా. -సరే, ధన్యవాదాలు. 280 00:16:27,696 --> 00:16:28,822 ఒక పది నిమిషాలలో వచ్చేస్తా. 281 00:16:49,092 --> 00:16:51,220 మరి నీకు ఆ కొత్త బూట్లు ఎక్కడివి? 282 00:16:52,304 --> 00:16:53,305 ఏంటి? 283 00:16:53,388 --> 00:16:55,849 కమాన్. ఎయిర్ జోర్డాన్స్. అవి నీకు ఎక్కడివి? 284 00:16:56,433 --> 00:16:57,726 నువ్వు నా వస్తువులు చూశావా? 285 00:16:58,352 --> 00:17:00,729 నీ బ్యాగులో కొత్త బూట్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు, 286 00:17:00,812 --> 00:17:02,231 కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదే. 287 00:17:02,314 --> 00:17:04,148 ఎందుకలా? ఏంటి సంగతి? 288 00:17:04,233 --> 00:17:05,733 ఏం లేదు. అవి నావే. 289 00:17:06,609 --> 00:17:09,320 మీ అమ్మ నీకు 120 డాలర్ల బూట్లను కొనలేదని నాకు తెలుసు. 290 00:17:09,404 --> 00:17:11,448 తను కొనలేదు. కాబట్టి అవి నీకు ఎక్కడివి? 291 00:17:11,531 --> 00:17:12,699 వాటిని అరువుగా తీసుకున్నాను, సరేనా? 292 00:17:12,782 --> 00:17:15,661 సరే. అరువుగా తీసుకుంటే, ఎందుకలా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? 293 00:17:15,743 --> 00:17:16,828 -ఎందుకంటే. -ఎందుకు? 294 00:17:16,912 --> 00:17:18,121 నీకు నా మీద నమ్మకం ఉండదు. 295 00:17:18,664 --> 00:17:22,125 లేదు, అది నిజం కాదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. 296 00:17:22,709 --> 00:17:25,212 కానీ నువ్వు ఎప్పుడూ నిజం చెప్తావని నీ మీద నమ్మకం ఉంచుతాను, సరేనా? 297 00:17:28,882 --> 00:17:33,679 వాటిని ఆడ్రియానా నుండి తీసుకున్నాను. వాటిని మళ్లీ ఇచ్చేస్తాను, సరేనా? 298 00:17:33,762 --> 00:17:36,515 కేవలం ఒక ఫోటో తీసుకొని, వాటిని తనకి ఇచ్చేద్దామనుకున్నాను. 299 00:17:36,598 --> 00:17:39,393 నేను విన్సెంట్ కోసం ఒక మంచి ఫోటో తీసుకోవాలనుకున్నాను. 300 00:17:41,603 --> 00:17:42,688 సరే. 301 00:17:44,857 --> 00:17:47,484 అయ్యో. మనిద్దరి మధ్య అంత సానిహిత్యం లేదా? 302 00:17:47,568 --> 00:17:49,194 నీకు కొత్త బూట్లు కావాలంటే నేనే తీసిచ్చేవాడిని కదా? 303 00:17:49,278 --> 00:17:51,530 -దీన్ని నీ సమస్యగా ఎందుకు చేస్తున్నావు? -నేనేం చేయడంలేదు. ఇది నీ సమస్య. 304 00:17:51,613 --> 00:17:52,656 నువ్వు నీ స్నేహితురాలి నుండి దొంగలించావు. 305 00:17:52,739 --> 00:17:54,449 ఫోటో తీసుకున్నాక నేను తనకి తిరిగి ఇచ్చేస్తాను. 306 00:17:54,533 --> 00:17:57,119 అవును, కానీ అదే కదా దారుణమైన విషయం. కదా? అదే దారుణమైన విషయం. 307 00:17:57,202 --> 00:17:59,913 ఒక అబ్బాయి దృష్టిలో పడదామని నువ్వు షూలు కావాలనుకున్నావా? 308 00:17:59,997 --> 00:18:01,206 అది భలే వింతగా ఉంది. 309 00:18:01,290 --> 00:18:03,250 -నీకేమీ తెలీదు. -నాకు అంతా తెలుసు. 310 00:18:03,333 --> 00:18:05,752 -నాకు ఎలా అయితే నువ్వు... -సరే, సరే. నాకు తెలుసు. 311 00:18:05,836 --> 00:18:06,879 నువ్వు చాలా సార్లు చెప్పావు. 312 00:18:06,962 --> 00:18:10,132 నేను అసాధరణమైన అమ్మాయిని, మంచి అమ్మాయిని, ఏ అబ్బాయికైనా నచ్చుతాను. 313 00:18:10,215 --> 00:18:11,383 -తెలుసులే. -అవును, కానీ అది కాదు. 314 00:18:11,466 --> 00:18:13,218 కానీ నేను చెప్పాలనుకున్నది అది కాదు. 315 00:18:13,302 --> 00:18:15,596 వారాంతమంతా బాగా చికాకుగా ఉన్నావు, 316 00:18:15,679 --> 00:18:17,681 ఇప్పుడు నువ్వు దొంగతనం చేశావు అని కూడా నాకు తెలిసిందే? 317 00:18:17,764 --> 00:18:20,184 అవును. కనీసం సొంత ఇల్లు కూడా లేని ఒక మామూలు డ్రైవర్ ని 318 00:18:20,267 --> 00:18:22,519 నేను అవ్వనని మాత్రం నాకు తెలుసులే. 319 00:18:33,947 --> 00:18:36,074 నేను నా ఉద్యోగాన్ని సగర్వంగా చేస్తాను. 320 00:18:36,992 --> 00:18:38,202 అర్థమైందా? 321 00:18:38,869 --> 00:18:40,579 ఇంకా అది చాలా బాగా కూడా చేస్తాను. 322 00:18:42,122 --> 00:18:43,832 నీకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలనే 323 00:18:43,916 --> 00:18:46,418 ఒకే ఒక కారణంతో నేను జోష్ తో కలిసి ఉంటున్నాను. 324 00:18:49,713 --> 00:18:51,632 నా జీవితాన్ని చూసి నువ్వు జాలి చూపవచ్చు. 325 00:18:51,715 --> 00:18:53,967 లేదు, పాపా. అదేమీ లేదు. 326 00:18:56,136 --> 00:18:58,639 కేవలం ఎయిర్ జోర్డాన్స్ లాంటివి ఉంటేనే అది మంచి జీవితం అని 327 00:18:58,722 --> 00:19:00,140 నువ్వు అనుకుంటే... 328 00:19:02,726 --> 00:19:04,937 జీవితంలో చాలా నిరాశపడాల్సి వస్తుంది. 329 00:19:07,022 --> 00:19:10,108 ఆనందం, మిత్రులారా 330 00:19:10,192 --> 00:19:15,906 మన ఆరాధ్య ప్రభువు మరలా వచ్చి మనలో ఆనందాలను నింపినాడు 331 00:19:16,448 --> 00:19:19,535 మరలా వచ్చినాడు 332 00:19:19,618 --> 00:19:22,621 మరలా వచ్చినాడు 333 00:19:22,704 --> 00:19:25,874 మరలా వచ్చినాడు 334 00:19:25,958 --> 00:19:29,044 హల్లెలూయా 335 00:19:29,127 --> 00:19:32,339 హల్లెలూయా 336 00:19:32,422 --> 00:19:35,425 హల్లెలూయా 337 00:19:35,509 --> 00:19:38,637 హల్లెలూయా 338 00:19:38,720 --> 00:19:41,890 మరలా వచ్చినాడు 339 00:19:41,974 --> 00:19:45,185 మరలా వచ్చినాడు 340 00:19:45,269 --> 00:19:47,646 మరలా వచ్చినాడు 341 00:19:47,729 --> 00:19:49,189 -అన్నీ తెచ్చుకున్నావు కదా? -తెచ్చుకున్నా. 342 00:19:49,273 --> 00:19:50,858 -ఏమీ మర్చిపోలేదు కదా? -లేదు. 343 00:19:50,941 --> 00:19:51,942 సరే. 344 00:19:59,408 --> 00:20:01,618 -హేయ్, హేయ్, హేయ్. -హాయ్. 345 00:20:01,702 --> 00:20:03,120 నీ వారాంతం ఎలా గడిచింది? 346 00:20:04,496 --> 00:20:07,541 "నమస్తే" చెప్పవా? అసలు పలకరించవా? 347 00:20:09,751 --> 00:20:11,545 నేను ఆడ్రియానా ఎయిర్ జోర్డాన్స్ షూలు దొంగలించాను. 348 00:20:12,129 --> 00:20:13,881 -ఈ వారాంతమా? -లేదు, పోయిన వారాంతం. 349 00:20:14,923 --> 00:20:16,800 అదన్నమాట కారణం. 350 00:20:16,884 --> 00:20:19,052 కానీ నేను చర్చిలో ఉన్నప్పుడు, నేను ఒక ప్లాన్ ఆలోచించాను. 351 00:20:19,136 --> 00:20:22,139 నేను మీ కోసం చిన్నచిన్న పనులు చేస్తా, జెస్సికాకి ఆయాలాగా ఉంటా, 352 00:20:22,222 --> 00:20:24,600 ఆడ్రియానా షూలు తన దగ్గరి నుండి కొనేంత డబ్బులు వచ్చేదాకా ఇలా చేస్తాను. 353 00:20:24,683 --> 00:20:27,394 అవును, మంచిదే, కానీ వచ్చే నెల దాకా నీ ఆటపాటలన్నీ బంద్, అదే నీకు శిక్ష, 354 00:20:27,477 --> 00:20:29,229 శిక్షనా? ఇంకా ఏంటి ఈ శిక్షలు? 355 00:20:29,313 --> 00:20:31,231 నువ్వే కదా ఆ పిల్లలకి శిక్ష పడింది, ఈ పిల్లలకి శిక్ష పడిందని చెప్తుంటావు. 356 00:20:31,315 --> 00:20:32,816 -తొక్కలో శిక్ష. -హేయ్! 357 00:20:32,900 --> 00:20:35,360 నువ్వలా మాట్లాడటం ఆకపోతే, ఆ శిక్ష రెండు నెలలు అవుతుంది. అర్థమైందా? 358 00:20:35,444 --> 00:20:37,446 బాగుంది, మీరిద్దరూ ఇప్పుడు కలిసిపోయారా? 359 00:20:37,529 --> 00:20:39,531 మీరిద్దరూ ఇలా మీరు విడిపోక ముందు ఉండుంటే బాగుండేది. 360 00:20:39,615 --> 00:20:41,033 -రెండు నెలలు! -గాబీ. 361 00:20:41,116 --> 00:20:43,911 -ఎక్కడ నేర్చుకుంటున్నావు ఆ మాటలు? -మీ ఇద్దరి నుండే ఏమో. 362 00:20:43,994 --> 00:20:46,788 మీ ఇద్దరూ బుద్ధిమంతులు మరి. నువ్వేమో పెళ్లైనవాడితో తిరుగుతున్నావు. 363 00:20:46,872 --> 00:20:49,208 ఇక మీ ఇంట్లో ఒక వింత అమ్మాయి ఉంటోంది. 364 00:20:49,291 --> 00:20:52,211 నిజంగానే. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా? 365 00:20:54,296 --> 00:20:55,923 -ఆ మహిళకు నాకూ సంబంధం లేదు. -రిచర్డ్... 366 00:20:56,006 --> 00:20:58,217 -వాళ్లు విడాకులు తీసుకోబోతున్నారు... -ఆమె జోష్ యొక్క ప్రేయసి. 367 00:20:58,300 --> 00:21:00,260 -అంటే ఒక భార్య ఉండి కూడా... -ఎందుకో నాకు తెలీదు, నేను... 368 00:21:00,344 --> 00:21:02,513 నాకు నువ్వు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. 369 00:21:04,056 --> 00:21:05,849 తను ఎందుకు మన చేత ఇలా చేయిస్తుంది? 370 00:21:05,933 --> 00:21:07,392 -తనకి నీ పోలీకలే వచ్చాయి. -నీ పోలికలు వచ్చాయి. 371 00:21:07,476 --> 00:21:09,895 -నిజంగా? -అవును. నీ పోలికలు వచ్చాయి. 372 00:21:13,357 --> 00:21:15,067 మనం అంతా నాశనం చేస్తున్నామా? 373 00:21:15,943 --> 00:21:18,237 -అంతా కాదులే. -నీకు ఖచ్చితంగా తెలుసా? 374 00:21:18,320 --> 00:21:19,321 కాస్త నాశనం చేస్తున్నామనుకుంటా. 375 00:21:20,239 --> 00:21:23,492 -చాలావాళ్ల కంటే మనం మేలే. -మన తల్లిదండ్రుల కన్నా మనం మేలే. 376 00:21:23,575 --> 00:21:25,077 -నీ తల్లిదండ్రుల కన్నా మేలే. -హేయ్. 377 00:21:25,160 --> 00:21:27,037 ఏంటి? నువ్వేదైనా అన్నావా? 378 00:21:27,120 --> 00:21:29,248 -నాకేదో వినబడింది. -లేదు. నా యాస వల్ల అయ్యుంటుంది. 379 00:21:32,876 --> 00:21:35,212 -చూడు, నాకు పనుంది... అవును. -నీకు అడ్డుగా ఉండాలనుకోలేదు. కానివ్వు. 380 00:21:35,295 --> 00:21:37,381 పాపతో గుడ్ లక్. మళ్లీ కొన్ని వారాలలో కలుద్దాం. 381 00:21:37,464 --> 00:21:38,674 సరే. 382 00:22:57,878 --> 00:22:59,880 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య