1 00:00:54,221 --> 00:00:55,222 శుక్రవారం ఆగస్ట్ 23, 2019 2 00:00:55,305 --> 00:00:58,225 సరేమరి, సమయం మించిపోతోంది, మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఇంకా ఒకటుంది. 3 00:00:58,308 --> 00:01:00,769 లూయిస్ మరియు క్లార్క్ యాత్ర విజయవంతమవ్వడానికి దోహదపడిన 4 00:01:00,853 --> 00:01:02,938 మూడు అంశాలు ఏంటి? 5 00:01:03,021 --> 00:01:04,438 మూడు అంశాలు. ఎవరైనా ఒకటి చెప్పగలరా? 6 00:01:04,522 --> 00:01:06,149 -మ్యాండీ. హుషారైన పిల్ల. -శాకజవేయ. 7 00:01:06,233 --> 00:01:10,445 శాకజవేయ, షొషోని తెగకు చెందిన ఆవిడ, వాళ్లకి మహిళా గైడ్ గా వ్యవహరించింది. వెరీ గుడ్. 8 00:01:10,529 --> 00:01:11,613 ఎవరైనా ఇంకొకటి చెప్పగలరా? 9 00:01:11,697 --> 00:01:13,323 మహిళా గైడ్ అని ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పారు? 10 00:01:13,407 --> 00:01:14,741 ఆమె వాళ్లకి గైడ్ అని చెప్తే సరిపోతుంది కదా? 11 00:01:16,785 --> 00:01:20,372 తను మహిళ అని చెప్పడం సందర్భోచితమైనదని నాకనిపిస్తోంది. 12 00:01:22,040 --> 00:01:24,543 లూయిస్ మరియు క్లార్క్ కాలంలో, అంటే 1800ల తొలినాళ్లలో, 13 00:01:24,626 --> 00:01:27,421 శాకజవేయ లాంటి ఒక మహిళకి అలాంటి నాయకత్వ పాత్ర పోషించడమంటే 14 00:01:28,922 --> 00:01:31,592 అది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. 15 00:01:32,342 --> 00:01:33,802 ఈరోజుల్లో కూడా అది చాలా అరుదైన విషయమే. 16 00:01:34,928 --> 00:01:38,307 మంచి పాయింట్ చెప్పావు. ఇప్పటికి కూడా అది చాలా అరుదైన విషయమే. 17 00:01:38,849 --> 00:01:44,605 నేను చెప్పేదేంటంటే, 200 ఏళ్ళ క్రిందట అది మరింత దారుణంగా ఉండేది. 18 00:01:45,272 --> 00:01:48,775 అది మనం తప్పక గుర్తించాలి. 19 00:01:52,821 --> 00:01:53,822 అవును. 20 00:01:55,157 --> 00:01:56,992 మంచిది. ఇంకెవరైనా ఇంకోటి చెప్పగలరా? 21 00:01:57,743 --> 00:01:58,994 నేనొకరి పేరు తీస్తాను. 22 00:01:59,912 --> 00:02:01,246 -పాల్. -హా? 23 00:02:02,039 --> 00:02:03,624 -లూయిస్ మరియు క్లార్క్. -చెప్పండి? 24 00:02:03,707 --> 00:02:06,168 వారి విజయానికి దోహదపడిన ఒక అంశం ఏమిటో అడుగుతున్నాను. 25 00:02:06,251 --> 00:02:08,169 ఏమో మరి. వాళ్లకి అలా అదృష్టం కలిసివచ్చిందేమో. 26 00:02:08,836 --> 00:02:10,547 కాదు, కానీ నీ జవాబు బాగుంది. 27 00:02:10,631 --> 00:02:13,091 -వాళ్లకి అదృష్టం కలిసొచ్చేసింది అంటావా? -అయ్యుండవచ్చు. 28 00:02:13,175 --> 00:02:15,636 విజయంలో అదృష్టం పాత్రే ప్రధానంగా ఉంటుంది అంటావా? 29 00:02:15,719 --> 00:02:16,929 తప్పకుండా. 30 00:02:17,012 --> 00:02:20,599 ఆసక్తికరంగా ఉంది. సరేమరి, ఈ విషయంలో పాల్ చెప్పినదానితో ఎవరు ఏకీభవిస్తున్నారు? 31 00:02:20,682 --> 00:02:22,684 ఎవరైనా? ఎవరైనా విభేదిస్తున్నారా? 32 00:02:23,477 --> 00:02:24,978 మంచిది. రెమోన్, నువ్వేమనుకుంటున్నావు? 33 00:02:25,062 --> 00:02:28,357 లేదు. అంటే, మీరు విజయం సాధించారంటే, దానికి మీరు కష్టపడి ఉంటారు. 34 00:02:28,440 --> 00:02:30,567 మీరు "అయ్యో, ఇది నా దురదృష్టం," అని అనుకోవచ్చు. 35 00:02:30,651 --> 00:02:34,029 కానీ ఎవరైనా వాళ్లది దురదృష్టం అని అనుకుంటే వాళ్లేదైనా చేసుంటారు. 36 00:02:34,112 --> 00:02:36,448 వాళ్ళు అబద్దమాడుంటారు. ఏదైనా దొంగలించి ఉంటారు. 37 00:02:36,532 --> 00:02:39,326 వాళ్లు చేయకూడని పనేదైనా చేసి ఉంటారు... 38 00:02:39,409 --> 00:02:40,410 -సరే. -నేను నిజంగానే చెప్తున్నాను. 39 00:02:40,494 --> 00:02:41,870 నాకు తెలుసు, మంచి పాయింటే చెప్పావు. 40 00:02:41,954 --> 00:02:44,915 కానీ, నాకు ఈ విషయంలో మిగతావాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలనుంది. 41 00:02:46,208 --> 00:02:48,126 ఇక్కడ ఎవరు, తాము అదృష్టవంతులమని అనుకుంటున్నారు? 42 00:02:48,836 --> 00:02:52,172 దీనికి అందరూ సమాధానం చెప్పాలి. ఆలోచించడానికి మీకొక నిమిషం ఇస్తాను. 43 00:02:52,256 --> 00:02:55,217 ఇప్పుడు మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తే చేతులని పైకెత్తండి. 44 00:02:57,135 --> 00:02:59,972 రెమోన్ ఒక్కడేనా? సరే, అదృష్టవంతులు కాదని మీకు అనిపిస్తే చేతులని పైకెత్తండి. 45 00:03:01,765 --> 00:03:04,142 అర్థమైంది. ఇక మీరు చేతులు దించండి. 46 00:03:04,226 --> 00:03:06,353 -మరి మీ సంగతేంటి, మిస్టర్ కోర్మన్? -ఏంటి? 47 00:03:06,436 --> 00:03:08,230 మీ చేతిని మీరు పైకెత్తలేదు. 48 00:03:08,313 --> 00:03:12,860 నేనా? లేదు. నేను... నేను అదృష్టవంతుడినని నాకనిపిస్తోంది. 49 00:03:13,485 --> 00:03:14,486 అందులో సందేహమే లేదు. 50 00:03:17,239 --> 00:03:19,575 ఓ విషయం చెప్పనా? క్లాస్ అయిపోయింది, ఇక ఇళ్ళకు బయలుదేరండి. 51 00:03:19,658 --> 00:03:23,787 అయిదవ తరగతిలో తొలి వారాన్ని పూర్తి చేసినందుకు అందరికీ అభినందనలు. 52 00:03:23,871 --> 00:03:25,455 అది చిన్న విషయం కాదు. 53 00:03:25,539 --> 00:03:27,249 అందరూ వారాంతాన్ని కులాసాగా గడపండి. 54 00:03:28,250 --> 00:03:29,626 మళ్లీ సోమవారం కలుసుకుందాం. 55 00:03:36,967 --> 00:03:38,177 గోల్డెన్ స్టేట్ లక్కీ లైఫ్ 25 ఏళ్ళ పాటు వారానికి $1000 గెలుచుకోండి! 56 00:03:38,260 --> 00:03:39,761 నిజంగానే చెప్తున్నా, నీకు నా బతుకేంటో తెలుసు. 57 00:03:39,845 --> 00:03:41,680 ఇలాంటివి నా జీవితంలో ఊరికే జరగవు. 58 00:03:41,763 --> 00:03:43,849 అవును, అతను నాకు ఉన్నట్టుండి మెసేజ్ పెట్టేశాడు. 59 00:03:43,932 --> 00:03:47,186 మేము ఈరాత్రికి ఒక చోటుకు వెళ్తున్నాం. అది నాట్స్ బెర్రీ ఫార్మ్ లో ఉంది. 60 00:03:47,269 --> 00:03:49,521 నాకు తెలుసు. నేను గాల్లో తేలిపోతున్నా. 61 00:03:49,605 --> 00:03:50,606 అంతేనా? 62 00:05:29,705 --> 00:05:33,041 అందరికన్నా ముందు ఉండటమంటే అదేదో అనుకోకుండా జరిగేది కాదు. 63 00:05:33,667 --> 00:05:37,838 అది ఇప్పటికిప్పుడు, అలాగే ఎల్లప్పుడూ సరైన దారిని ఎన్నుకోవడం మీద ఆధారపడుంటుంది. 64 00:05:37,921 --> 00:05:39,673 ఓయ్, నీకు నూడుల్స్ ఏమైనా కావాలా? 65 00:05:42,050 --> 00:05:44,887 -సాస్ ఉందా? -ఉప్పు ఉంది. ఆయిల్ ఉంది. 66 00:05:44,970 --> 00:05:46,471 అయితే, నాకేమీ అక్కర్లేదులే. 67 00:05:46,555 --> 00:05:49,308 సాస్ లేదని తినకుండా ఉంటావా? 68 00:05:49,391 --> 00:05:51,768 దానికదే సాటి అయిన కాడిలాక్ ఎస్కలేడ్. 69 00:05:51,852 --> 00:05:52,853 నువ్వన్నది నిజమే. 70 00:05:56,690 --> 00:05:59,067 -ఇది చాలా రుచికరంగా ఉంది. -అయితే ఈరాత్రి ఏం చేద్దామంటావు? 71 00:06:00,944 --> 00:06:01,945 ఏంటి? 72 00:06:02,738 --> 00:06:04,406 బాబోయ్. ఏమైనా జరిగిందా ఏంటి? 73 00:06:04,489 --> 00:06:06,992 -ఏమంటున్నావు నువ్వు? -మేగన్ ఎవరితోనైనా డేటింగ్ చేస్తోందా? 74 00:06:07,075 --> 00:06:08,702 నాకు తెలీదు. అలా ఎందుకు అడిగావు? 75 00:06:08,785 --> 00:06:11,246 ఎందుకంటే, "ఈరాత్రి ఏం చేద్దామంటావు?" అని నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు కనుక. 76 00:06:11,330 --> 00:06:12,664 -అదేమీ వింత కాదే. -అది వింతే. 77 00:06:12,748 --> 00:06:15,876 ఒక శుక్రవారం రాత్రి, ఎవరినైనా ఏం చేయాలనుందని అడగడం వింత విషయం కాదు. 78 00:06:15,959 --> 00:06:18,879 కానీ నీ విషయంలో అది వింతే. అందుకే అడుగుతున్నా. నువ్వు బాగానే ఉన్నావు కదా? 79 00:06:18,962 --> 00:06:20,672 నేను బాగానే ఉన్నాను. నేను... 80 00:06:21,548 --> 00:06:23,217 -అంటే... -ఏంటి? 81 00:06:23,300 --> 00:06:24,927 సూపర్ మార్కెట్లో ఒక మహిళ ఉండింది. 82 00:06:25,010 --> 00:06:27,971 తను నాట్స్ బెర్రీ ఫార్మ్ కి వెళ్లాలని ఫోన్లో మాట్లాడుతూ ఉండింది. 83 00:06:28,055 --> 00:06:30,724 -మరి, ఏమో. నాకు... -అయితే... ఏంటి? 84 00:06:30,807 --> 00:06:33,227 -అయితే నీకు కూడా అక్కడికి వెళ్లాలనుందా? -లేదు, నాకేమీ అక్కడికి వెళ్ళాలని లేదు. 85 00:06:33,310 --> 00:06:34,520 -నేనేమంటున్నానంటే... -అయితే ఏంటి? 86 00:06:34,603 --> 00:06:37,940 ఆమె తన జీవితం విషయంలో చాలా ఆనందంగా ఉందని అనిపించింది. అది బాగా అనిపించింది. 87 00:06:38,023 --> 00:06:39,775 -నువ్వు మంచి వాడివి. -మంచిది. 88 00:06:39,858 --> 00:06:41,610 -నేను నిన్ను నమ్ముతున్నాను. -చాలా చాలా ధన్యవాదాలు. 89 00:06:41,693 --> 00:06:44,488 నాకు... ఇవాళ రాత్రి ఏదైనా చేయాలనుంది? దయచేసి మనం ఆ పని చేయగలమా? 90 00:06:44,571 --> 00:06:46,406 ఏదైనా సంగీతం పెట్టుకొని వినవచ్చు కదా? 91 00:06:47,199 --> 00:06:48,575 -లేదు. -లేదా? సరే. 92 00:06:48,659 --> 00:06:49,910 మారియో కార్ట్ వీడియో గేమ్ ఆడదామా? 93 00:06:50,410 --> 00:06:53,288 -గురూ. లేదు. నేనేమంటున్నానంటే... -అయితే మరి నీకేం చేయాలనుంది? 94 00:06:53,372 --> 00:06:55,958 -అదే నేను నిన్ను అడుగుతున్నాను. -సరే. 95 00:07:00,170 --> 00:07:01,588 -ఇది చాలా కష్టమైన పని. -నాకు తెలుసు. 96 00:07:01,672 --> 00:07:04,132 -ఇదంత కష్టంగా అనిపించకూడదు అనిపిస్తోంది. -నాకు తెలుసు. 97 00:07:04,216 --> 00:07:07,135 సరే, మనం... మనం ఏదోకటి తేల్చగలం. 98 00:07:09,263 --> 00:07:11,306 మనం బయటకు వెళ్లి అమ్మాయిలను వేటాడదామా? ఏమంటావు? 99 00:07:12,099 --> 00:07:13,767 -"అమ్మాయిలను వేటాడదామా"? -అవును. 100 00:07:13,851 --> 00:07:16,144 -అంటే నీ తాళం చెవులను వేటాడినట్టా? -అబ్బా. మళ్లీ మొదలుపెట్టకు... 101 00:07:16,228 --> 00:07:18,522 -అంటే ఒక జంతువును వేటాడంలాగానా? -జంతువు అని ఎవరన్నారు? 102 00:07:18,605 --> 00:07:20,148 -జంతువులను చంపడమని ఎవరన్నారు? -వేటాడి తినడంలానా? 103 00:07:20,232 --> 00:07:22,317 నువ్వే కదా సూపర్ మార్కెట్ లో అమ్మాయి ఉందన్నది. 104 00:07:22,401 --> 00:07:23,402 -ఆ అమ్మాయి ఏదో... -మహిళ. 105 00:07:23,485 --> 00:07:25,404 -నేను అమ్మాయని అనలేదు, మహిళ అన్నాను. -దేవుడా. 106 00:07:25,487 --> 00:07:27,614 నేను వెధవ అని అనుకుంటున్నావా? నాకు మహిళలంటే గౌరవం ఉంది... 107 00:07:27,698 --> 00:07:29,199 నిజానికి ఇది అమ్మాయిల గురించి కాదు. 108 00:07:29,283 --> 00:07:31,660 -సరే, మనం మహిళలను పటాయించవచ్చు. -మహిళలు. 109 00:07:31,743 --> 00:07:34,037 మనం ఈరాత్రి ఏమైనా చేయవచ్చు. 110 00:07:34,121 --> 00:07:35,163 -అవును. -కదా? 111 00:07:35,247 --> 00:07:37,833 మనం ఇది వరకు కార్లో వెళ్లేటప్పుడు నీకు గుర్తుందా? మనం ఏమైనా చేయగలిగే స్థితికి 112 00:07:37,916 --> 00:07:40,836 చేరుకున్నాక మనం ఏం చేయాలో అని సోది మాట్లాడుకొనేవాళ్ళం కదా. 113 00:07:40,919 --> 00:07:43,630 మనకి ఇప్పుడు మళ్లీ 15 ఏళ్లనుకో, మనం ఏం చేసేవాళ్ళం? 114 00:07:45,799 --> 00:07:47,801 -బార్ కి వెళ్లి, అమ్మాయిలతో సరసాలాడేవాళ్ళం. -అవును. 115 00:07:47,885 --> 00:07:49,511 -ఛ. -కదా? పదా. 116 00:07:50,304 --> 00:07:51,722 నీకు బార్ కి వెళ్లాలని లేదా? 117 00:07:51,805 --> 00:07:53,765 లేదు. ఓ విషయం చెప్పనా? మనం వెళ్లాలి. పద వెళ్దాం. 118 00:07:53,849 --> 00:07:55,684 -మనం బార్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. -నేనేమంటున్నానంటే, 119 00:07:55,767 --> 00:07:58,353 మనం బార్ కి వెళ్లి, అమ్మాయిలతో మాట కలిపినా, 120 00:07:58,437 --> 00:08:00,772 వాళ్లు పెద్ద ఆసక్తికరమైనవేమీ చెప్పరు కదా. 121 00:08:00,856 --> 00:08:02,983 -ఎందుకు చెప్పరు? -ఎందుకంటే వాళ్లు బార్లోని అమ్మాయిలు. 122 00:08:03,734 --> 00:08:04,902 అలా నువ్వు అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడకూడదు. 123 00:08:04,985 --> 00:08:06,778 -నా ఉద్దేశం అది కాదు. -నువ్వు దారుణంగా మాట్లాడుతున్నావు. 124 00:08:06,862 --> 00:08:09,281 వాళ్ళు అమ్మాయిలని కాదు. వాళ్లు జనాలు అని నా ఉద్దేశం. 125 00:08:09,364 --> 00:08:12,618 నా ఉద్దేశం, జనాలు చెప్పేవాటిలో పెద్ద ఆసక్తికరమైనవి ఏమీ ఉండవు, 126 00:08:12,701 --> 00:08:13,911 అందులోనూ బార్లలో అయితే అస్సలు ఉండవు. 127 00:08:14,786 --> 00:08:16,997 -నువ్వు మేగన్ ని కలిసింది బార్లోనే కదా? -అది వేరు. 128 00:08:17,080 --> 00:08:18,874 మమ్మల్ని ఒక స్నేహితుడు పరిచయం చేశాడు. 129 00:08:18,957 --> 00:08:20,292 -అది వేరు. -సరే. 130 00:08:20,375 --> 00:08:22,085 కానీ నువ్వు ఉండింది బార్ లోనే కదా, గురూ. 131 00:08:22,169 --> 00:08:24,713 నేను చెప్పేదేంటంటే, అసలు జనాలు చెప్పేవాటిలో 132 00:08:24,796 --> 00:08:27,132 ఆసక్తికరమైనవి ఏమీ లేనప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడటం ఎందుకు? 133 00:08:27,216 --> 00:08:29,760 అసలు నేనేం చేస్తున్నాను? ఒక అమ్మాయితో కేవలం సెక్స్ చేయాలనే చూస్తున్నానా? 134 00:08:29,843 --> 00:08:33,138 నువ్వు చేయాలని చూసేది అదొక్కటే కాదు. అవునని చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నాను. 135 00:08:33,222 --> 00:08:35,682 అవును, సెక్స్ మంచి విషయమే. వాళ్లకి కావాల్సింది అదే అయితే, అందులో తప్పేముంది? 136 00:08:35,765 --> 00:08:38,434 అవును, కానీ వాళ్లు సెక్స్ చేయాలనుకున్నా, దాన్ని నేను ఎంజాయ్ చేయలేను. 137 00:08:38,519 --> 00:08:40,187 ఎందుకంటే, వాళ్లు బార్ లో చెప్పిన 138 00:08:40,270 --> 00:08:42,272 సోది అంతటి గురించే 139 00:08:42,356 --> 00:08:43,899 ఆలోచిస్తూ ఉంటాను, 140 00:08:43,982 --> 00:08:47,444 కానీ అవన్నీ ఆసక్తిగా ఉన్నట్టు నటించి, పైకి ఓ నవ్వు నవ్వానని 141 00:08:47,528 --> 00:08:49,821 అక్కడ ఉన్నంత సేపూ నన్ను నేను అసహ్యించుకుంటూనే ఉంటాను. 142 00:08:50,948 --> 00:08:53,158 సరే. మనం బార్ కి వెళ్లకూడదు. 143 00:08:53,242 --> 00:08:55,327 -అయినా మనం వెళ్ళవచ్చేమో. నువ్వు... -గురూ, ఏంటి? 144 00:08:55,410 --> 00:08:58,163 -మనం కొత్తగా ప్రయత్నించాలనుకున్నాం కదా. -నేను అలా అనలేదు. 145 00:08:58,247 --> 00:09:00,874 -నేను అలా అస్సలు అనలేదు. -మనం ఇక్కడే కూర్చొని ఉండలేం. సరేనా? 146 00:09:00,958 --> 00:09:05,462 మనం వెళ్తే బార్ కి వెళ్లాలి లేదా ఇక్కడే ఉండి వీడియో గేమ్స్ ఆడాలి, అంతేనా. 147 00:09:05,546 --> 00:09:07,464 ఈ రెండే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా. 148 00:09:09,883 --> 00:09:11,426 బాసూ, నువ్వేం అంటున్నావో నీకైనా తెలుస్తోందా. 149 00:09:11,510 --> 00:09:15,055 -నువ్వు జోకులేస్తున్నావు. అవును. -నేను నిజంగానే చెప్తున్నాను. 150 00:09:15,138 --> 00:09:17,015 -నువ్వు ఏడాదికి ఎంత సంపాదిస్తున్నావు? -నాకు అస్సలు తెలీదు. 151 00:09:17,099 --> 00:09:18,100 -ఏంటి? -సోది. 152 00:09:18,183 --> 00:09:19,935 -అది నాకెలా తెలుస్తుంది? -నువ్వు పన్నులు కట్టవా? 153 00:09:20,018 --> 00:09:21,353 -ఆ పని నువ్వు చేయవా? -నేను పన్నులు కడతాను. 154 00:09:21,436 --> 00:09:23,063 కానీ ఏడాది పొడుగునా ఎంత కట్టానో అని 155 00:09:23,146 --> 00:09:24,481 లెక్కలేస్తూ కూర్చోను, అంతే. 156 00:09:24,565 --> 00:09:27,067 -నీ పన్నులను కట్టేది మీ నాన్నే కదా? -అవును. అతనే కడతాడు. 157 00:09:27,150 --> 00:09:28,151 సరే, అలాగే. 158 00:09:28,235 --> 00:09:29,903 కాబట్టి నువ్వెంత సంపాదిస్తున్నావో నీకు తెలియనంత మాత్రాన 159 00:09:29,987 --> 00:09:31,822 నువ్వు బీదరికంలో నలిగిపోతున్నావని కాదు కదా. 160 00:09:31,905 --> 00:09:33,448 -నేను బీదరికంలోనే నలిగిపోతున్నాను. -సరే, ఒక్క నిమిషం. 161 00:09:33,532 --> 00:09:35,576 మనం ఇక్కడి నుండి రెండిషన్ రూమ్ కి వెళ్లవచ్చు. 162 00:09:35,659 --> 00:09:37,202 -నాకు ఓకే. -పదమూడు నిమిషాలలో వెళ్లిపోవచ్చు. 163 00:09:37,286 --> 00:09:38,912 నేను నడపగలను, కానీ మనం రెండు కార్లలో వెళ్లాలి. 164 00:09:38,996 --> 00:09:40,414 -సరే, నేను నడపగలను. -నువ్వు గంజాయి కొట్టున్నావు. 165 00:09:40,497 --> 00:09:43,041 -కానీ నేనేమీ తాగలేదు. -నీ దగ్గర పెట్రోల్ కి డబ్బులైనా ఉన్నాయా? 166 00:09:43,125 --> 00:09:44,459 సరే. మనమందరం మన కారులో వెళ్లవచ్చు. 167 00:09:44,543 --> 00:09:46,461 నీకు నిజంగా నీ వార్షిక సంపాదన ఎంతో తెలీదా? 168 00:09:46,545 --> 00:09:47,546 -ఒక్క నిమిషం. ఆగండి. -లేదు, విక్టర్, 169 00:09:47,629 --> 00:09:50,007 జనాలందరూ నీలాగా ఉదయాన లేవగానే కార్పొరేట్ ప్రపంచంలో 170 00:09:50,090 --> 00:09:52,593 -పైకి ఓ ఎదిగిపోవాలని చూడరు కదా. -నీకు కుళ్ళుగా ఉందని 171 00:09:52,676 --> 00:09:54,219 -యుపియస్ గురించి సోది మాట్లాడకు. -నేనేం సోది మాట్లాడటంలేదు. 172 00:09:54,303 --> 00:09:57,264 నేను అనేదేంటంటే, అదొక కార్పొరేషన్ అని, అది నువ్వు క్రమం తప్పకుండా అక్షరాలా... 173 00:09:57,347 --> 00:09:58,974 -అది చాలా మంచి సంస్థ. -...నిచ్చెన ఎక్కి పైకి ఎక్కుతున్నావు. 174 00:09:59,057 --> 00:10:01,727 -అలా అన్నందుకు నేను క్షమాపణలు చెప్పను. -క్షమాపణలు చెప్పమని నిన్ను అడగలేదు. 175 00:10:01,810 --> 00:10:03,604 అది చక్కని సంస్థ కాబట్టి అది చాలా మంచి సంస్థ. 176 00:10:03,687 --> 00:10:06,565 -గురూ. మనం కాస్త... -నా డ్రైవర్లకి నేనెప్పుడూ అదే చెప్తుంటాను. 177 00:10:06,648 --> 00:10:08,817 మీరు యుపిఎస్ ని బాగా చూసుకుంటే, అది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, అంతే కదా? 178 00:10:08,901 --> 00:10:10,694 నేను యుపిఎస్ ని బాగా చూసుకుంటా. అదీలెక్క. 179 00:10:10,777 --> 00:10:11,778 నన్ను వచ్చి పికప్ చేసుకోగలవా? 180 00:10:11,862 --> 00:10:14,489 కదా? నేను కార్పొరేషన్ లో ఈ స్థానంలో ఉన్నానంటే, అది ఒక్కరాత్రికే జరిగినది కాదు. 181 00:10:14,573 --> 00:10:16,450 -నువ్వు "కార్పొరేషన్" అని అన్నావు. -నేను లోపలకి వెళ్లగానే 182 00:10:16,533 --> 00:10:19,328 "నువ్వే మాకు కావలసిన సూపర్వైజర్," అని అనలేదు. 183 00:10:19,411 --> 00:10:23,081 -ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? -బయటకు... అసలైన ప్రపంచంలోకి వెళ్తున్నా. 184 00:10:32,716 --> 00:10:34,718 -నువ్వు బాగానే ఉన్నావా? -బాగానే ఉన్నాను. 185 00:10:34,801 --> 00:10:36,803 -పీకలదాకా తాగున్నాను. -ఏంటి? 186 00:10:36,887 --> 00:10:39,598 -ఏం లేదు. తలుపు లాక్ వేసుంది. -లేదు, లాక్ వేసి లేదు. 187 00:10:39,681 --> 00:10:41,350 దేవుడా. మరి నేనెందుకు... 188 00:10:42,976 --> 00:10:44,186 ధన్యవాదాలు. 189 00:10:50,234 --> 00:10:51,860 మరి, ఈ రాత్రి ఎలా గడిచింది? 190 00:10:51,944 --> 00:10:54,404 చాలా దరిద్రంగా గడిచింది. నా మిత్రులందరూ వింత జీవులు. 191 00:10:55,447 --> 00:10:58,992 -మరి నువ్వు ఎలా ఉన్నావు? -బాగున్నాను. 192 00:10:59,076 --> 00:11:00,953 -ఏమైంది? -ఏంటి? 193 00:11:01,036 --> 00:11:04,039 -దేని గురించో ఆలోచిస్తున్నావు నువ్వు. -అదేమీ లేదులే. 194 00:11:05,123 --> 00:11:06,291 సరే. 195 00:11:06,375 --> 00:11:10,128 అయినా నిన్ను అడగాలనుకుంటున్నాను, నీకు శాకజవేయ ఎవరో తెలుసా? 196 00:11:10,212 --> 00:11:11,255 తెలుసు. 197 00:11:11,338 --> 00:11:15,300 తనని లూయిస్ మరియు క్లార్క్ యొక్క మహిళా గైడ్ అని నేను చెప్పి ఉండకూడదంటావా? 198 00:11:15,384 --> 00:11:18,470 -నువ్వేమంటున్నావు? -తనని ఉత్త గైడ్ అని ఉంటే సరిపోయేదంటావా? 199 00:11:20,013 --> 00:11:22,558 బంగారం. అలా అనుకొని బాధపడిపోకు. 200 00:11:22,641 --> 00:11:24,393 నేనేమీ అనుకొని బాధపడిపోవడం లేదు. 201 00:11:24,476 --> 00:11:25,602 నువ్వు మంచి వాడివి. 202 00:11:25,686 --> 00:11:28,647 ధన్యవాదాలు. నీ నిష్పక్షపాత అభిప్రాయానికి అభినందిస్తున్నాను. 203 00:11:28,730 --> 00:11:29,857 బోధన అవసరమైన చిన్నపిల్లలకు 204 00:11:29,940 --> 00:11:32,985 నువ్వు పాఠాలు చెప్తూ మంచి పని చేస్తున్నావు. 205 00:11:33,944 --> 00:11:35,821 అది ఆ పిల్లల అదృష్టం. 206 00:11:35,904 --> 00:11:38,365 నేను స్కూల్ లో చదివేటప్పుడు, అది సమయం వృథా పని తప్ప ఇంకేమీ కాదు. 207 00:11:38,448 --> 00:11:41,201 నా విద్యార్థుల్లో కూడా చాలా మంది అదే అంటారు. 208 00:11:41,285 --> 00:11:43,787 సరే. నీకు దద్దమ్మగా ఉండాలనుంది. నువ్వు దద్దమ్మవేలే. 209 00:11:44,913 --> 00:11:46,582 కనీసం నీకు ఉద్యోగమైనా ఉంది. 210 00:11:46,665 --> 00:11:49,084 లీసా, తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకోవడానికి అదొక్కటి చాలు. 211 00:11:49,835 --> 00:11:53,046 నేను ఎవరిని కలిసినా, వాళ్లు నువ్వేం చేస్తున్నావని అడిగినప్పుడు. 212 00:11:53,130 --> 00:11:55,465 నువ్వేం చేస్తావో నేను చెప్పినప్పుడు వాళ్లు చాలా గర్వపడతారు తెలుసా. 213 00:11:55,549 --> 00:11:57,593 వాళ్ళందరూ చాలా గర్వపడతారు. 214 00:11:57,676 --> 00:11:59,553 నువ్వు సంగీత రంగంలో ఉన్నప్పటిలా కాదు. 215 00:11:59,636 --> 00:12:01,889 -అప్పుడు వారు ఆందోళనపడేవారు. -నేనేమీ సంగీతరంగంలో లేను. 216 00:12:01,972 --> 00:12:04,892 అవును, ఏదైనా రంగంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి. 217 00:12:04,975 --> 00:12:08,061 నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నాకు సంగీతమంటే ఇష్టమని నీకు తెలుసు. 218 00:12:09,605 --> 00:12:12,399 అదే ముఖ్యం తెలుసా? నీకు ఇష్టముండటమే ముఖ్యం. 219 00:12:13,025 --> 00:12:14,318 నువ్వు వాయిస్తావు. అదంటే నీకు ఇష్టం. 220 00:12:14,401 --> 00:12:16,904 -అదే ముఖ్యం. -అవును, కానీ నేను వాయించడం లేదు. 221 00:12:16,987 --> 00:12:19,948 కాదు, నేను షోల గురించి మాట్లాడటం లేదు. నీకు నువ్వే వాయించుకుంటుంటావు కదా. 222 00:12:20,032 --> 00:12:21,742 కానీ నేను ఆ పని చేయడం లేదు. 223 00:12:21,825 --> 00:12:24,036 నేను దాని జోలికి వెళ్లి దాదాపుగా ఒక ఏడాది కావస్తోంది. 224 00:12:26,663 --> 00:12:28,332 ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదే. 225 00:12:29,958 --> 00:12:30,959 అవును. 226 00:12:33,128 --> 00:12:35,464 వదిలేయిలే. ఆ ఒక్కటీ లేకపోతే ఏం కాదులే, అంతే కదా? 227 00:12:36,632 --> 00:12:39,092 చివరికి, ఎంతైనా కుటుంబమే కదా అన్నింటికన్నా ముఖ్యమైనది, కనుక... 228 00:12:39,176 --> 00:12:42,012 -అదేనా ముఖ్యమైనది? చాలా బాధాకరమైన విషయం. -కాదు. 229 00:12:42,095 --> 00:12:44,681 అయితే, నా జీవితంలో అత్యంత ముఖ్యమైంది, 230 00:12:44,765 --> 00:12:47,518 నువ్వూ, ఇంకా బెత్, అదేనా నువ్వు అనేది? 231 00:12:47,601 --> 00:12:50,437 కాదు, నా ఉద్దేశం అది కాదు. 232 00:12:50,521 --> 00:12:52,356 నా ఉద్దేశం ఏంటంటే, ఏదోకరోజు 233 00:12:52,439 --> 00:12:55,108 నీకూ సొంతంగా ఒక కుటుంబం ఉంటుందేమో, అప్పుడు నా ఉద్దేశం నీకే తెలుస్తుంది. 234 00:12:55,192 --> 00:12:56,610 నాకు సొంతంగా ఒక కుటుంబం ఉండకపోవచ్చు. 235 00:12:56,693 --> 00:12:58,695 -నేను ఏమో అని అన్నాను. -పోనీ నాకు సొంతంగా కుటుంబం ఉన్నా, 236 00:12:58,779 --> 00:13:00,280 నీ ఉద్దేశమేంటో నాకు తెలియకపోవచ్చు. 237 00:13:00,364 --> 00:13:01,406 నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. 238 00:13:04,660 --> 00:13:08,956 నిజానికి, అన్నింటికన్నా ముఖ్యమైనది మన వర్తమాన క్షణమే కావాలి కదా? 239 00:13:10,290 --> 00:13:11,291 కాదు. 240 00:13:15,963 --> 00:13:16,964 సరే మరి. 241 00:13:17,923 --> 00:13:19,132 సరే. 242 00:13:21,510 --> 00:13:22,719 నువ్వు చాలా మంచివాడివి. 243 00:13:23,637 --> 00:13:24,805 నిజంగానే చెప్తున్నా. 244 00:13:24,888 --> 00:13:25,973 ధన్యవాదాలు. 245 00:13:27,558 --> 00:13:28,559 సరే, అలాగే. 246 00:13:29,351 --> 00:13:30,978 -ధన్యవాదాలు. -పర్లేదులే. 247 00:13:57,087 --> 00:14:00,507 గురూ. చాలా కాలమైంది. 248 00:14:00,591 --> 00:14:07,222 ఈ రాత్రి ఏమైనా విశేషముందా? 249 00:14:51,016 --> 00:14:52,184 ఓయ్, ఇక్కడ ఉన్నావన్నమాట. 250 00:14:52,267 --> 00:14:53,268 -నమస్తే. -నమస్తే. 251 00:14:53,352 --> 00:14:55,437 -వచ్చి ఎంతసేపు అయింది? -అంత ఎక్కువ సేపేమీ కాలేదులే. 252 00:14:55,521 --> 00:14:56,563 అయ్యో. మన్నించు, బాసూ. 253 00:14:56,647 --> 00:14:58,690 -నాకు నువ్వు కనపడలేదు. ఎక్కడ ఉన్నావు? -ఇక్కడే ఉన్నా. 254 00:14:58,774 --> 00:15:00,317 -అయ్యో, చూసుకోలేదు. -పర్లేదులే. 255 00:15:00,400 --> 00:15:01,902 ఎలా ఉన్నావు? 256 00:15:01,985 --> 00:15:03,403 బాగానే ఉన్నాను, బాసు. అంతా బాగానే ఉంది. 257 00:15:03,487 --> 00:15:05,572 సూపర్. ఈ మధ్య ఎక్కడైనా సంగీత ప్రదర్శనలు ఇస్తున్నావా లేక... 258 00:15:07,658 --> 00:15:08,867 లేదు, నేను మానేశాను. 259 00:15:09,660 --> 00:15:11,912 -మానేశావా? -అవును. 260 00:15:12,454 --> 00:15:13,872 ఇప్పుడు ఊరికే నాకు నేను వాయించుకుంటున్నాను. 261 00:15:13,956 --> 00:15:16,625 -ఏంటి, గురూ. అలా వదిలేయకూడదు. -అవును. 262 00:15:18,544 --> 00:15:19,753 మరి నీ సంగతి ఏంటి? 263 00:15:20,462 --> 00:15:22,798 బాబోయ్, గురూ. నేనా? నేను పట్టుదలగా ముందుకు వెళ్తున్నాను. 264 00:15:22,881 --> 00:15:25,175 ఒక్కో అడుగు వేసుకుంటూ పురోగతి సాధిస్తున్నాను. 265 00:15:25,259 --> 00:15:27,135 ఈ మధ్య చాలా మంచి సంగీతాన్ని స్వరపరుస్తున్నాను, 266 00:15:27,219 --> 00:15:29,179 కానీ నిజం చెప్పాలంటే, ఈరోజుల్లో సంగీత రంగంలో ఉండాలంటే, 267 00:15:29,263 --> 00:15:31,390 మనకి చాలా విషయాలు తెలిసి ఉండాలి. 268 00:15:31,473 --> 00:15:33,809 అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి, ఎలాగైనా అనుకున్న చోటికి చేరుకోవాలి, 269 00:15:33,892 --> 00:15:36,186 ఎందుకంటే, ఈ రోజుల్లో సంగీతానికి మామూలు డిమాండ్ లేదు. 270 00:15:36,270 --> 00:15:38,397 అయితే, నేను యాంకర్ గా పని చేస్తున్నాను, తెలుసా? 271 00:15:38,480 --> 00:15:41,149 కాస్తంత నటన, కాస్త స్క్రిప్ట్ ప్రకారం, కాస్త స్క్రిప్ట్ లో లేనిది చెప్తుంటాను. 272 00:15:41,233 --> 00:15:43,360 ఇంకా ప్రొడక్షన్ పనులు చేయడం, కానీ... 273 00:15:43,443 --> 00:15:46,405 కొన్ని నెలల కిందటే ధ్రువీకరించబడ్డా కూడా, కాబట్టి నేను సరైన పనే చేస్తున్నానుకుంటా. 274 00:15:47,573 --> 00:15:48,866 అది చాలా మంచి విషయం. 275 00:15:48,949 --> 00:15:52,411 అవును. అవును, బాసూ. ఇప్పుడు అంతా బాగుంది. 276 00:15:53,996 --> 00:15:55,998 -అవును. -చాలా మంచి విషయం చెప్పావు. 277 00:15:56,081 --> 00:15:57,082 అవును. 278 00:16:29,281 --> 00:16:32,367 ఓయ్! అదరగొట్టేయ్, గురూ! 279 00:17:09,320 --> 00:17:10,321 పర్లేదు. 280 00:17:10,989 --> 00:17:13,825 "పర్లేదు" అంటే? కేవలం దమ్ము కొట్టడానికే బయటకి రమ్మన్నాను. 281 00:17:13,909 --> 00:17:15,493 అందుకేనా నువ్వు బయటకు రమ్మంది? 282 00:17:16,078 --> 00:17:18,038 -ఆత్మవిశ్వాసం ఎక్కువే. -అది పని చేసిందా? 283 00:17:18,121 --> 00:17:19,748 -బాగానే పని చేసింది, కానీ... -నిజంగా? 284 00:17:19,830 --> 00:17:22,041 -కానీ నువ్వు తాగడం లేదు కూడా. -అది నీకెలా తెలుసు? 285 00:17:22,125 --> 00:17:24,419 ఎందుకంటే నేను నిన్ను కలిసినప్పుడు నీ చేతిలో సోడా గ్లాస్ ఉండింది. 286 00:17:24,502 --> 00:17:26,380 అది వోడ్కా కూడా కావచ్చు. అందులో నిమ్మకాయ కూడా ఉంది. 287 00:17:26,463 --> 00:17:29,049 లేదు, నువ్వు తాగడం లేదని చెప్పగలను. కంగారు పడకు. నాకు అది నచ్చింది. 288 00:17:29,132 --> 00:17:30,300 ధన్యవాదాలు. 289 00:17:30,384 --> 00:17:31,385 కాకపోతే... 290 00:17:32,803 --> 00:17:34,805 నువ్వు మోర్మన్ లాంటి వాడివి కాదు కదా? 291 00:17:34,888 --> 00:17:36,181 నిజానికి నేను ముస్లిమ్ ని. 292 00:17:36,265 --> 00:17:38,475 నిజంగానా? అది చాలా మంచి విషయం. 293 00:17:39,142 --> 00:17:41,228 మన్నించాలి. నేను... జోక్ చేస్తున్నా. 294 00:17:42,771 --> 00:17:44,189 అది సరదా విషయం కాదు. 295 00:17:45,023 --> 00:17:47,818 నా ఉద్దేశం ఏంటంటే, ముస్లిమ్లు తాగరు అని చెప్దామని. 296 00:17:47,901 --> 00:17:49,862 నువ్వు మిస్లిమ్ కాకపోతే ఆ విషయం నీకెలా తెలుసు? 297 00:17:50,362 --> 00:17:52,281 అది వాళ్ల మతంలో భాగమైన అంశం. 298 00:17:53,615 --> 00:17:56,285 అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలు. 299 00:17:58,662 --> 00:18:00,163 బహుశా నేను ఒక సిగరెట్ తాగాలేమో. 300 00:18:00,247 --> 00:18:02,082 నిజంగా అయితే నీకు ఒక డ్రింక్ కావాలి. 301 00:18:02,165 --> 00:18:05,919 లేదు, నేను నిజంగానే తాగను. కానీ ఒక సిగరెట్ అయితే పర్వాలేదు. ఏమంటావు? 302 00:18:06,461 --> 00:18:08,005 సరే. 303 00:18:08,088 --> 00:18:09,464 నువ్వెలా అంటే అలా. 304 00:18:10,549 --> 00:18:12,342 అది "ప్రిన్సెస్ బ్రైడ్" సినిమాలోని డైలాగ్ కదా? 305 00:18:12,426 --> 00:18:14,970 అవును. దేవుడా. నువ్వు నాకు మళ్లీ నచ్చేశావు. 306 00:18:15,804 --> 00:18:16,805 మంచిదే. 307 00:18:20,684 --> 00:18:23,353 అయితే, నీది ఏ ఊరు? 308 00:18:23,437 --> 00:18:24,438 ఇదే మా ఊరు. 309 00:18:24,521 --> 00:18:25,981 అది కాదు, నువ్వు పుట్టింది ఎక్కడ? 310 00:18:26,064 --> 00:18:27,441 నేను పుట్టింది, పెరిగింది ఇక్కడే. 311 00:18:27,524 --> 00:18:29,610 ఆగు, ఏంటి? నీ సొంత ఊరు లాస్ ఏంజలెస్? 312 00:18:29,693 --> 00:18:32,779 -లాస్ ఏంజలెస్ సొంత ఊరిగా ఎవరికీ ఉండదు? -ఆ మాట నేను చాలా సార్లు విన్నాను. 313 00:18:33,572 --> 00:18:35,574 నీ కుటుంబం ఇక్కడ వ్యాపారం చేస్తోందా? 314 00:18:35,657 --> 00:18:37,618 -నీ ఉద్దేశం ప్లాస్టిక్స్? -ఏంటి? 315 00:18:38,952 --> 00:18:40,704 అవును. లేదు, అది... 316 00:18:40,787 --> 00:18:44,625 మా అమ్మ రియల్ ఎస్టేట్ చేస్తుంది, వాళ్ల నాన్న ప్లంబర్, 317 00:18:44,708 --> 00:18:46,126 వాళ్లిద్దరి ఊరు లాస్ ఏంజలెస్. 318 00:18:46,210 --> 00:18:49,796 ఒక్క నిమిషం. మీ అమ్మ, ఇంకా మీ తాత, ఇద్దరి ఊరు లాస్ ఏంజలెస్ యేనా? 319 00:18:50,380 --> 00:18:51,924 అది మామూలు విషయం కాదు. 320 00:18:52,007 --> 00:18:53,759 నా బుర్ర తిరిగిపోతోంది. 321 00:18:54,551 --> 00:18:55,719 మరి నీది ఏ ఊరు? 322 00:18:56,261 --> 00:18:57,971 మాది మాసెచూసెట్స్ లోని వాల్తామ్. 323 00:18:58,055 --> 00:19:00,557 నువ్వు ఆ పేరును వినుండవులే. అది బోస్టన్ యొక్క శివారు ప్రాంతం. 324 00:19:00,641 --> 00:19:04,102 కానీ ఇప్పుడు లాస్ ఏంజలెస్ లో వాల్తామ్ వాళ్లు ఎంత మంది ఉన్నారంటే 325 00:19:04,186 --> 00:19:06,188 అంత మంది వాల్తామ్ లో కూడా ఉండరు, అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. 326 00:19:06,271 --> 00:19:08,774 అందరూ ఇక్కడికి వలస వచ్చినట్టు అన్నమాట. అది మామూలు విషయం కాదు. 327 00:19:08,857 --> 00:19:10,609 లాస్ ఏంజలెస్ చాలా మంచి ఊరు. 328 00:19:10,692 --> 00:19:12,736 -కాదు, మంచి ఊరు కాదు. -అవును, మంచి ఊరే. 329 00:19:12,819 --> 00:19:15,364 బహుశా నువ్వు వాల్తామ్ వారిని కాకుండా ఇతరులను ఎక్కువగా కలుసుకోవాలేమో. 330 00:19:15,447 --> 00:19:16,615 అవును, కావచ్చు. 331 00:19:17,282 --> 00:19:19,493 అయితే, నువ్వు నన్ను అసలు సిసలైన లాస్ ఏంజలెస్ వాసులకు పరిచయం చేస్తావా? 332 00:19:19,576 --> 00:19:20,744 నాకు కొందరు తెలుసు. 333 00:19:23,247 --> 00:19:24,540 మరి నువ్వేం చేస్తుంటావు? 334 00:19:25,541 --> 00:19:27,417 నేను అయిదవ తరగతికి పాఠాలు చెప్తాను. 335 00:19:27,501 --> 00:19:29,503 బాబోయ్, నువ్వు నాకు బాగా నచ్చావు. 336 00:19:29,586 --> 00:19:32,548 నాకు మొత్తం చెప్పు. నాకు అంతా తెలుసుకోవాలనుంది. 337 00:19:33,924 --> 00:19:37,511 ఏమో మరి, అయిదవ తరగతి అంటే... 338 00:19:37,594 --> 00:19:42,015 అంటే, అంతా పది, 11 ఏళ్ళ పిల్లలుంటారు. కాబట్టి వాళ్లకి ఎదిగినవాళ్లని చెప్పవచ్చు. 339 00:19:42,099 --> 00:19:45,602 వాళ్ళు ఎదిగిన వాళ్లని కాదు, కానీ వాళ్లు దాదాపుగా ఎదిగారనే చెప్పవచ్చు. 340 00:19:46,728 --> 00:19:48,647 లేకపోతే బహుశా, 341 00:19:48,730 --> 00:19:51,900 అత్యధిక శాతం ఎదిగిన వాళ్ళకి, ఇంకా పది, 11 ఏళ్ళ పిల్లలకీ పెద్ద తేడా లేదేమో. 342 00:19:53,735 --> 00:19:54,820 చాలా బాగా చెప్పావు. 343 00:19:55,529 --> 00:19:56,864 అంటే, అదీ... 344 00:19:56,947 --> 00:20:00,534 అంటే, ఆ పిల్లలు, వాళ్లే కదా భవిష్యత్తు అంటే? 345 00:20:02,202 --> 00:20:03,745 వాళ్ళకి అందులో భాగం ఉంటుంది. 346 00:20:03,829 --> 00:20:04,830 అవును. 347 00:20:05,372 --> 00:20:07,666 నా ఉద్దేశంలో నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తున్నావు. 348 00:20:07,749 --> 00:20:08,834 ధన్యవాదాలు. 349 00:20:14,673 --> 00:20:16,091 చూడు, నువ్వు ఏమైనా... 350 00:20:18,719 --> 00:20:19,720 తప్పకుండా. 351 00:20:21,972 --> 00:20:23,599 -తప్పకుండానా? -అవును. 352 00:20:24,099 --> 00:20:26,685 -సరే మరి. అవునా? సరే. -అవును. 353 00:20:27,728 --> 00:20:28,729 సూపర్. 354 00:20:29,563 --> 00:20:32,566 టెన్ టెన్ విల్షైర్ 10 10 355 00:20:39,573 --> 00:20:41,867 హాయ్, బంగారం. హాయ్. 356 00:20:42,451 --> 00:20:45,787 దగ్గరికి రా, బంగారం. నిన్ను చాలా మిస్ అయ్యాను. 357 00:20:47,122 --> 00:20:48,540 దీని పేరు లియామ్. 358 00:20:49,416 --> 00:20:50,751 "హాయ్, లియామ్" అని చెప్పు. 359 00:20:51,585 --> 00:20:53,212 -హాయ్ చెప్పు. -హాయ్, లియామ్. 360 00:20:55,088 --> 00:20:58,050 సరే, నువ్వు లోపలికి వెళ్లి బజ్జుకొని నిద్రపోవాలి. 361 00:20:58,717 --> 00:21:01,136 నేను త్వరగానే వచ్చేస్తాను. 362 00:21:03,180 --> 00:21:04,723 ఈ ఇల్లు చాలా బాగుంది. 363 00:21:04,806 --> 00:21:05,807 ధన్యవాదాలు. 364 00:21:25,118 --> 00:21:26,119 సంగీతం కావాలా? 365 00:22:01,196 --> 00:22:02,197 నేను చేస్తానులే. 366 00:22:32,978 --> 00:22:35,105 నువ్వు నాకు కావాలి. 367 00:22:36,732 --> 00:22:38,650 -సరే, నేను వెళ్లి కండోమ్ తెస్తాను. -సరే. 368 00:22:40,068 --> 00:22:41,320 నీ ప్యాంట్ తీసేయ్. 369 00:22:41,820 --> 00:22:43,697 హాయ్, బంగారు. మంచి కుక్కవి. 370 00:23:12,476 --> 00:23:13,685 నువ్వు పెట్టుకున్నావా? 371 00:23:17,105 --> 00:23:18,106 పెట్టుకున్నావా? 372 00:23:19,358 --> 00:23:20,359 ఇంకా లేదు. 373 00:23:24,488 --> 00:23:26,615 -ఏమైంది? -ఏం కాలేదు. 374 00:23:28,325 --> 00:23:29,993 -నువ్వేమైనా... -ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. 375 00:23:32,996 --> 00:23:36,667 దేవుడా. ఓరి దేవుడా. 376 00:23:36,750 --> 00:23:39,253 -ఇలా నాకెప్పుడూ జరగలేదు. -క్షమించు. 377 00:23:39,920 --> 00:23:41,213 నీకేమైంది? 378 00:23:43,382 --> 00:23:45,008 -నాకు తెలీదు. -నీకు... 379 00:23:45,634 --> 00:23:47,594 ఇది, నీకు మామూలుగానే జరుగుతుందా? 380 00:23:48,303 --> 00:23:51,265 -లేదనే చెప్పాలి. -లేదనే చెప్పాలా? అయితే ఇది మామూలేనా? 381 00:23:53,183 --> 00:23:54,768 -బహుశా నేను వెళ్లిపోవాలేమో. -లేదు, లేదు, లేదు. 382 00:23:54,852 --> 00:23:57,104 నేను ఇది నీకు ఎంత తరచుగా జరుగుతుందో నేను తెలుసుకోవాలి. 383 00:23:57,187 --> 00:24:00,190 -నేను ఇలా ఎక్కువగా చేయను. -ఇలా అంటే? 384 00:24:00,691 --> 00:24:03,443 -అప్పుడే కలిసిన మహిళతో సెక్స్ చేయడం... -మనమేమీ సెక్స్ చేయడం లేదు. 385 00:24:03,527 --> 00:24:06,488 అదేలే, అప్పుడే కలిసిన మహిళతో సెక్స్ చేసే ప్రయత్నం చేయడం. 386 00:24:07,322 --> 00:24:09,700 -మరి నాతో మా ఇంటికి ఎందుకు వచ్చావు? -నాకు తెలీదు. 387 00:24:11,368 --> 00:24:12,369 నేను... 388 00:24:13,871 --> 00:24:15,873 నేనేదైనా కొత్తగా ప్రయత్నిద్దామని అనుకున్నాను. 389 00:24:16,498 --> 00:24:18,000 నేను అడిగినదానికి అది సమాధానం కాదు. 390 00:24:18,917 --> 00:24:22,254 చూడు, నన్ను మన్నించు. దీనికంతటికీ నన్ను క్షమించు. నేను వెళ్లిపోతాను. 391 00:24:23,964 --> 00:24:26,216 వెళ్లిపోనక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్తే చాలు. 392 00:24:27,217 --> 00:24:28,218 నిజాయితీగా చెప్పాలంటే, 393 00:24:28,969 --> 00:24:30,053 నాకు కూడా తెలీదు. 394 00:24:30,137 --> 00:24:32,764 నువ్వు సెక్స్ కావాలని అడిగినప్పుడు నేనెందుకు మెత్తబడిపోయానో 395 00:24:32,848 --> 00:24:35,559 నాకే సరిగ్గా తెలీదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. 396 00:24:36,852 --> 00:24:40,230 నేను నిజాయితీగా చెప్పాలంటే, దీని గురించి ఇంకెప్పుడైనా ఆలోచించి, 397 00:24:40,314 --> 00:24:42,649 ఇదే విషయం అనుకున్న విధంగా జరిగి ఉంటే, 398 00:24:42,733 --> 00:24:46,320 ఎలా జరిగి ఉండేదా అని ఊహించుకుంటానేమో, కానీ... 399 00:24:49,281 --> 00:24:51,742 నిజ జీవితంలో, అన్నీ మనం అనుకున్న విధంగా జరగవు కదా. 400 00:24:51,825 --> 00:24:54,536 నా విషయంలో మాత్రం అలా జరగవు, కాబట్టి... 401 00:24:55,287 --> 00:24:58,832 చూడు, అది పెద్ద విషయమేమీ కాదులే. 402 00:24:59,750 --> 00:25:01,877 కదా? అది చాలా మంది మగాళ్లకు సాధారణంగా జరిగేదే. 403 00:25:02,878 --> 00:25:06,423 అదీగాక, కలుసుకున్న తొలిరోజే మనం సెక్స్ చేసుకోవాల్సిన పని లేదు. 404 00:25:06,507 --> 00:25:09,510 ఇది నిజంగా... ఇది నిజంగా చాలా మంచి విషయం. 405 00:25:11,512 --> 00:25:12,513 ఏమంటావు? 406 00:25:13,347 --> 00:25:15,682 ఊరికే అలా సరదాగా గడుపుదామా? 407 00:25:16,934 --> 00:25:20,229 -లేదు, నేను వెళ్లిపోవాలనుకుంటా... -నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 408 00:25:20,312 --> 00:25:23,190 -నాకు తెలుసు. ధన్యవాదాలు, కానీ నేను... -లేదు... ఇటు రా. వచ్చి కూర్చో. 409 00:25:24,608 --> 00:25:25,734 నేను వెళ్తాను. 410 00:25:26,902 --> 00:25:29,321 అది నా తప్పే. నేను తప్పు చేశాను. 411 00:25:31,532 --> 00:25:32,991 అయితే, సెక్స్ కోసమే అన్నమాట, 412 00:25:33,075 --> 00:25:35,077 సరదాగా గడపడానికి నేను పనికిరాను, అంతే కదా? 413 00:25:35,160 --> 00:25:37,329 -నేను ఆ మాట అనలేదు. -మరి నీ ఉద్దేశం ఏంటి? 414 00:25:40,374 --> 00:25:41,375 నేను వెళ్లాలి. 415 00:25:41,458 --> 00:25:43,836 ఎందుకంటే, నీకు దద్దమ్మగా ఉండటం అంటే ఇష్టమని నీ ఉద్దేశం అనుకుంటా. 416 00:25:49,800 --> 00:25:52,636 ఇంకో మాట, నీ నోరు కంపు కొడుతోంది. 417 00:25:56,849 --> 00:25:59,017 ఎందుకంటే, నేను తాగింది నీ సిగరెట్ కదా. 418 00:25:59,518 --> 00:26:02,187 నీ శ్వాస ఎలా ఉందనుకున్నావేంటి? నేను మెత్తపడిపోవడానికి అదే కారణం. 419 00:26:02,271 --> 00:26:04,648 మనం ముద్దు పెట్టుకొన్న ప్రతీసారి, నీ నోట్లోకి వాంతి చేసుకుంటానేమో అనిపించింది. 420 00:26:04,731 --> 00:26:07,484 లేదు, ఇవాళ నువ్వెందుకు చచ్చుబడిపోయావో నాకు బాగా తెలుసు. 421 00:26:07,568 --> 00:26:09,403 -నీ కన్నా నా సంపాదనే ఎక్కువ కాబట్టి. -అవును, అంతే. 422 00:26:09,486 --> 00:26:12,406 మనం బంపర్ పాడు అయ్యున్న నీ చెత్త కారులో వచ్చాం, 423 00:26:12,489 --> 00:26:14,533 -దాన్ని బాగుచేసే స్థోమత కూడా నీకు లేదు. -అది ఇవాళే పాడయింది. 424 00:26:14,616 --> 00:26:17,369 నీ ఇల్లు చెత్తగా ఉంటుంది కాబట్టి మనం నా ఇంటికి వచ్చాం. 425 00:26:17,452 --> 00:26:19,621 -మనం ఇక్కడికి లియామ్ కోసం వచ్చాం. -నీది నీకే చాలీచాలని సంపాదన. 426 00:26:19,705 --> 00:26:21,540 నువ్వు నాకు, నా కుటుంబానికి అండగా ఉండలేవు. 427 00:26:21,623 --> 00:26:24,418 -మనం కుటుంబం ఎప్పుడు అయ్యాం? -ఇంకో విషయం తెలుసా, 428 00:26:24,501 --> 00:26:27,171 నీకు పిల్లలంటే ప్రేమ అని, నువ్వు టీచర్ అని చెప్పావు కదా? 429 00:26:27,254 --> 00:26:28,547 అదంతా సోది. 430 00:26:29,089 --> 00:26:33,177 జీవితంలో ఒకటి అవ్వాలనుకొని, అది కాలేకపోయిన వాళ్ళే 431 00:26:33,260 --> 00:26:34,428 టీచర్లు అవుతుంటారు. 432 00:26:43,395 --> 00:26:44,730 నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? 433 00:26:48,650 --> 00:26:49,651 ఏంటి? 434 00:26:53,530 --> 00:26:54,656 నువ్వు చిన్నగా ఉన్నప్పుడు... 435 00:26:55,407 --> 00:26:58,160 అంటే చిన్న పిల్లవి అని కాదు, కేవలం కుర్ర వయస్సులో ఉన్నప్పుడు, 436 00:27:00,370 --> 00:27:04,458 నువ్వు దిక్కులేని చావు చస్తావని నీకు అనిపిస్తూ ఉండేదా? 437 00:28:39,303 --> 00:28:40,470 హలో, జోష్. 438 00:28:40,971 --> 00:28:43,849 హేయ్, బీట్రిజ్. శుభోదయం. 439 00:28:43,932 --> 00:28:47,060 శుభోదయం, ఎలా ఉన్నావు? 440 00:28:47,144 --> 00:28:48,145 బాగానే ఉన్నాను. 441 00:28:49,521 --> 00:28:52,608 -నీ వారాంతం ఎలా గడిచింది? -బాగాలేదని చెప్పడానికి ఏమీ లేదు. 442 00:28:52,691 --> 00:28:54,735 ఆర్థికపరంగా పరిస్థితులు సరిగ్గా లేవు, అది పక్కన పెడితే, 443 00:28:54,818 --> 00:28:57,613 నా మనవళ్ళు తామంతట తామే తినగలుగుతున్నారు, కనుక నాకు కాస్త విశ్రాంతి దక్కింది. 444 00:28:57,696 --> 00:28:59,323 -మంచిది. -మరి నీ సంగతేంటి? 445 00:29:01,950 --> 00:29:02,951 అవును. 446 00:29:03,035 --> 00:29:04,620 -అంత బాగానా? -లేదు. బాగానే గడిచింది. 447 00:29:05,162 --> 00:29:06,371 అంతా బాగానే గడిచింది. 448 00:29:08,332 --> 00:29:10,959 -నిజంగానే. -అవును, బాగానే గడిచిందిలే. 449 00:29:12,294 --> 00:29:14,254 -రోజంతా కులాసాగా గడుపు. -సరే, నువ్వు కూడా. 450 00:29:32,481 --> 00:29:35,150 సరే మరి, శుభోదయం. ఈ రోజు కులాసాగా గడపండి. అందరికీ వారాంతం ఎలా గడిచింది? 451 00:29:42,741 --> 00:29:44,535 -హాయ్. -హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 452 00:29:45,786 --> 00:29:47,996 బాగానే ఉన్నాను. కొన్ని అర్జంట్ పనులు చేస్తున్నాను. 453 00:29:48,080 --> 00:29:51,500 -బిజీగా ఉంటే, తర్వాత చేస్తానులే. -లేదు, బిజీగానే ఉన్నా, కానీ పర్వాలేదు. 454 00:29:51,583 --> 00:29:53,877 చెప్పు. ఏం, ఏమైంది? 455 00:29:54,545 --> 00:29:56,505 ఏమీ కాలేదు. అంతా బాగానే ఉంది. 456 00:29:56,588 --> 00:29:57,589 నేను... 457 00:29:58,549 --> 00:30:00,968 నేను దాన్ని బాగా గడిపాను. నేను... నీకు తెలుసు కదా. 458 00:30:03,095 --> 00:30:05,055 నాకు ఏం తెలుసు? దాన్ని అంటే దేన్ని? 459 00:30:05,138 --> 00:30:08,433 అది... అది ఎప్పుడూ అలాగే అనిపించదనుకుంటా. 460 00:30:09,434 --> 00:30:13,397 అంటే... అదెవరి తప్పు అంటావు? 461 00:30:14,314 --> 00:30:17,401 -ధన్యవాదాలు, అమ్మ. -నేను ఊరికే అంటున్నా. 462 00:30:17,484 --> 00:30:18,819 ఓ విషయం చెప్పనా? వదిలేయిలే. 463 00:30:19,319 --> 00:30:20,362 లేదు. సరే మరి. 464 00:30:22,739 --> 00:30:24,533 నీ వారాంతం ఎలా గడిచింది? 465 00:30:24,616 --> 00:30:27,035 చాలా బాగా గడిచింది. నేను ఒక మహిళని కలిశాను. 466 00:30:27,119 --> 00:30:30,581 తనకి నేను బాగా నచ్చినట్టున్నాను, కానీ నేను మెత్తబడిపోయాను, కాబట్టి... 467 00:30:30,664 --> 00:30:32,374 -నేను ఫోన్ పెట్టేస్తున్నాను. -సరే. 468 00:33:55,160 --> 00:33:57,162 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య