1 00:00:11,845 --> 00:00:14,306 టెనొరీ-ఆన్ 2 00:00:22,022 --> 00:00:23,232 ఎల్ కాపిస్టన్ స్ట్రైమన్ 3 00:00:23,315 --> 00:00:24,525 బ్లూపర్ 4 00:01:28,130 --> 00:01:29,590 హాయ్, నా పేరు జోషువా కోర్మన్. 5 00:01:31,341 --> 00:01:33,510 అవును, నా స్థానంలో ఇవాళ ఒక సబ్స్టిట్యూట్ టీచర్ కావాలి. 6 00:03:16,113 --> 00:03:18,156 హలో, మీ ఐడీ నంబర్ ఏంటో చెప్పగలరా? 7 00:03:18,240 --> 00:03:20,742 -మాట్లాడేది మనిషేనా? -అవును. 8 00:03:20,826 --> 00:03:23,579 నిజంగానా? మీ గొంతు ఒక మనిషి గొంతుగా అనిపించడం లేదు. 9 00:03:24,162 --> 00:03:25,163 నేను మనిషినే. 10 00:03:25,706 --> 00:03:28,750 సరే. ఈ మాట మనిషి గొంతులానే ఉందిలెండి. 11 00:03:28,834 --> 00:03:33,755 -మీ ఐడీ నంబర్ చెప్పగలరా? -సరే. మన్నించండి, అది ఏ.ఆర్.ఎక్స్875... 12 00:03:33,839 --> 00:03:35,382 కాదు, అది గ్రూప్ నంబర్. 13 00:03:35,465 --> 00:03:37,342 దీని మీద ఉండే నంబరే నేను మీకు చెప్తున్నాను. 14 00:03:37,426 --> 00:03:39,344 ఎందుకు ఇన్ని నంబర్లు పెట్టారు? 15 00:03:39,428 --> 00:03:40,762 ఆ విషయం నాకు తెలీదు. 16 00:03:40,846 --> 00:03:44,474 క్షమించండి. సరే, నంబర్, 4438... 17 00:03:44,558 --> 00:03:48,645 మన్నించండి, అది 438-779ఏహెచ్. 18 00:03:49,605 --> 00:03:52,065 ధన్యవాదాలు. మీ పేరేంటో చెప్పగలరా? 19 00:03:52,149 --> 00:03:54,484 నేను మీకు నా ఐడీ నంబర్ చెప్పాను. దాని బట్టీ నేనెవరో మీకు తెలీదా? 20 00:03:54,568 --> 00:03:56,445 -నేను సమాచారాన్ని ధ్రువీకరించాలి. -మన్నించండి. 21 00:03:56,528 --> 00:04:00,073 -నా పేరు జోషువా కోర్మన్. -పుట్టిన తేదీ? 22 00:04:00,157 --> 00:04:02,743 చూడండి, నాకు ఇప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంది, 23 00:04:02,826 --> 00:04:06,246 నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది, ఊపిరి సరిగ్గా ఆడటం లేదు, 24 00:04:06,330 --> 00:04:08,832 కనుక వీలైనంత త్వరగా నేను ఒక డాక్టర్ ని కలవాలనుకుంటున్నాను, 25 00:04:08,916 --> 00:04:10,459 ఎందుకంటే, నాకు గుండెపోటు వస్తుందేమోనని భయంగా ఉంది, 26 00:04:10,542 --> 00:04:12,586 -కనుక ఇది మరీ ఆలస్యమైతే... -మిస్టర్ కోర్మన్. 27 00:04:12,669 --> 00:04:14,713 -...నాకు ఇంకా సీరియస్ కావచ్చేమో. -మిస్టర్ కోర్మన్! 28 00:04:14,796 --> 00:04:16,048 మీ పుట్టిన తేదీ ఏంటో చెప్పండి. 29 00:04:20,302 --> 00:04:22,971 -డాక్టర్ ఆఫీస్. -అవును. 30 00:04:23,055 --> 00:04:26,183 హలో, నేను డాక్టర్ గ్రోసీతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. 31 00:04:27,226 --> 00:04:29,478 మీరు ప్రస్తుతం డాక్టర్ గ్రోసీ యొక్కపేషంట్ ఆ? 32 00:04:29,561 --> 00:04:32,898 కాదు. నాకు, ఈ పేరును మా మెడికల్ నెట్వర్క్ వాళ్లు ఇచ్చారు, 33 00:04:32,981 --> 00:04:37,319 లేదా, వాళ్లది గ్రూపో లేక సంస్థో ఖచ్చితంగా తెలీదు. 34 00:04:37,402 --> 00:04:41,657 డాక్టర్ గ్రోసీ నవంబర్ ఒకటవ తారీఖు ఉదయం 10:30కి ఖాళీగా ఉంటారు. 35 00:04:41,740 --> 00:04:42,908 -మీరిక్కడికి 15 నిమిషాలు... -మన్నించండి... 36 00:04:42,991 --> 00:04:44,701 -...ముందు వచ్చి ఒక ఫారాన్ని... -నవంబర్? 37 00:04:44,785 --> 00:04:46,787 అవును. అప్పటిదాకా ఆవిడకి ఖాళీ లేదు. 38 00:04:47,412 --> 00:04:48,956 ఇప్పట్నుంచీ రెండు నెలల తర్వాతనా? 39 00:04:52,751 --> 00:04:55,629 ఆమె నన్ను ఇవాళ తర్వాత ఎప్పుడైనా కలవగలరా? 40 00:04:56,630 --> 00:04:58,507 ఇది అత్యవసర పరిస్థితియా? 41 00:05:00,092 --> 00:05:01,385 అత్యవసర పరిస్థితిలానే అనిపిస్తోంది. 42 00:05:02,094 --> 00:05:03,637 అసలు మీ సమస్య ఏంటో చెప్పగలరా? 43 00:05:04,471 --> 00:05:09,726 సరే... నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. 44 00:05:09,810 --> 00:05:11,103 అంటే, ఇంతకుముందు కూడా 45 00:05:11,186 --> 00:05:13,605 నాకు కంగారుగా అనిపించింది, కానీ ఇంతలా నాకెప్పుడూ అనిపించలేదు. 46 00:05:13,689 --> 00:05:16,358 ఒక క్షణం పాటు నాకు గుండెపోటు వస్తుందేమో అనిపించింది, 47 00:05:16,441 --> 00:05:18,110 నా వయస్సుకు గుండెపోటు రావడమంటే విచిత్రమైన విషయమే, 48 00:05:18,193 --> 00:05:21,405 కానీ అలా జరగవచ్చు, నేను నెట్ లో వెతికా, అలా జరగవచ్చట, కానీ... 49 00:05:21,488 --> 00:05:25,701 అంటే, నాకు తెలియడం లేదు. నాకు ఈపాటికి నాకు మెరుగ్గా అనిపించాలి. 50 00:05:25,784 --> 00:05:28,620 అంటే, ఎప్పుడు మెరుగవుతుందా అని వేచి చూస్తున్నా, కానీ అలా జరగడం లేదు. 51 00:05:29,413 --> 00:05:32,875 నిజానికి అది ఇంతకముందు కన్నా మరింత దిగజారినట్టుగా అనిపిస్తోంది లేదా... 52 00:05:33,417 --> 00:05:36,503 ఇది అత్యవసర పరిస్థితి అయితే, మీరు ఫోన్ పెట్టేసి, 911కి కాల్ చేయాలి. 53 00:05:36,587 --> 00:05:39,840 సరే. లేదు, నాకు తెలుసు. వాళ్లు నా మీద కోప్పడతారేమో అనిపించింది. 54 00:05:39,923 --> 00:05:41,884 ఎందుకంటే, అది... 55 00:05:41,967 --> 00:05:44,428 ఎందుకంటే, నా కన్నా దారుణమైన పరిస్తితిలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. 56 00:05:44,511 --> 00:05:46,763 అది నాకు సరైన పనని అనిపించలేదు. కనుక... 57 00:05:47,264 --> 00:05:50,017 మీరు కారు నడపగలిగే స్థితిలో ఉంటే, ఎమర్జెన్సీ కేర్ కి వెళ్లవచ్చు. 58 00:05:50,100 --> 00:05:52,227 అవును, కానీ దానికి చాలా ఖర్చవుతుంది. అంత స్తోమత నాకు లేదు. 59 00:05:52,311 --> 00:05:54,354 నా దగ్గర అంత డబ్బు లేదు. 60 00:05:54,897 --> 00:05:56,481 మీకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. 61 00:05:59,776 --> 00:06:02,446 -మీరు లైన్లోనే ఉన్నారా? -ఉన్నాను. 62 00:06:05,741 --> 00:06:07,034 నాకు కాస్తంత సాయం కావాలి. 63 00:06:09,620 --> 00:06:11,830 మీరు శ్వాస ఆడించడం మీద దృష్టి పెట్టి చూశారా? 64 00:06:11,914 --> 00:06:13,123 ఓరి దేవుడా! 65 00:06:13,207 --> 00:06:15,918 -నాతో అలా మాట్లాడకండి. -ఒకటి చెప్పనా? నా శ్వాసలో ఏ సమస్యా లేదు. 66 00:06:16,001 --> 00:06:18,670 నేను ఆఫీసుకు వెళ్ళలేకపోయాను, కుదురుగా కూర్చోలేకపోతున్నా, బుర్ర పనిచేయడం లేదు, 67 00:06:18,754 --> 00:06:21,924 కానీ శ్వాస మాత్రం బాగానే ఉంది, కనుక మీ సహాయానికి చాలా చాలా ధన్యవాదాలు! 68 00:06:47,699 --> 00:06:48,700 హేయ్. 69 00:06:48,784 --> 00:06:51,537 నీకు అప్పుడప్పుడూ బాగా కంగారు వచ్చేస్తోంది, కదా? 70 00:06:52,037 --> 00:06:53,038 అవును. 71 00:06:53,121 --> 00:06:54,790 దాని కోసం ఎప్పుడైనా మందులు వాడావా? 72 00:06:55,582 --> 00:06:57,334 నేను ఉన్న మందులన్నీ వాడాను. 73 00:06:57,417 --> 00:07:01,964 జొలోఫ్ట్, సెలెక్సా, లెక్సాప్రో. దాని వల్ల నేను లావయ్యాను. 74 00:07:02,923 --> 00:07:08,303 పాక్సిల్, క్సానాక్స్, మళ్లీ పాక్సిల్. క్లోనొపిన్. ఆటివాన్... 75 00:07:08,387 --> 00:07:11,890 నీ దగ్గర అవేమైనా ఉన్నాయా? 76 00:07:14,768 --> 00:07:16,436 నీకు కంగారు మరీ తీవ్రంగా అనిపిస్తోందా? 77 00:07:19,189 --> 00:07:22,276 ఏమో. నాకు తెలియడం లేదు. నాకు అదేంటో స్పష్టంగా తెలియడం లేదు. 78 00:07:22,359 --> 00:07:25,821 నేను దాని గురించి చదివే ప్రయత్నం చేస్తున్నా, కానీ, ఇంటర్నెట్... 79 00:07:27,614 --> 00:07:31,869 నాకు ఇలా ఎప్పుడూ అస్సలు అనిపించలేదు. కనీసం ఈ మధ్య అయితే అస్సలు అనిపించలేదు. 80 00:07:33,370 --> 00:07:34,538 నీకెలా అనిపిస్తోంది? 81 00:07:37,207 --> 00:07:40,335 ఎక్కువగా భయంగా ఉందనుకుంటా. 82 00:07:41,753 --> 00:07:43,046 దేని గురించి భయం? 83 00:07:46,550 --> 00:07:47,801 పిచ్చి విషయాలకి. 84 00:07:50,095 --> 00:07:53,765 కానీ నువ్వు అది అనుభవిస్తున్నపుడు అది పిచ్చిది అని ఎలా అంటావు? 85 00:07:57,269 --> 00:07:59,271 -నీకు ఇప్పుడు ఏం కావాలో తెలుసా? -ఏంటి? 86 00:08:00,606 --> 00:08:01,648 వచ్చి కూర్చో. 87 00:08:04,109 --> 00:08:05,110 ఏంటి? 88 00:08:09,531 --> 00:08:11,783 నువ్వు ఇక్కడికి వచ్చే ముందే దీన్ని ప్యాక్ చేశాను. 89 00:08:11,867 --> 00:08:13,785 ఇందులో తాజా గంజాయి ఇంకా సగం ఉంది. 90 00:08:13,869 --> 00:08:16,455 -బాసూ, నేను వాటిని మానేశాను. -ఇప్పుడే కదా మాత్రల కోసం అడిగావు. 91 00:08:16,538 --> 00:08:18,332 -అది వేరు. -మందు అంటే ఏదైనా మందే. 92 00:08:18,415 --> 00:08:20,459 నేను నిన్ను ఏదైనా ఔషధముంటే ఇమ్మన్నాను. 93 00:08:20,542 --> 00:08:23,253 చెప్తున్నా కదా, ఇది ఔషధమే. దీన్ని చికిత్స కోసం వాడవచ్చు. 94 00:08:23,337 --> 00:08:25,047 నాకు ఆటివాన్ ఇస్తావా? 95 00:08:26,965 --> 00:08:27,966 సూపర్. 96 00:08:29,009 --> 00:08:30,177 సరే, గురూ. 97 00:08:37,308 --> 00:08:39,227 హేయ్, నిన్ను ఓ విషయం అడగవచ్చా? 98 00:08:39,770 --> 00:08:43,607 నీకు కంగారు వస్తే కానీ ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను పలకరించలేదు, ఎందుకు? 99 00:08:43,690 --> 00:08:45,817 గత అయిదేళ్లలో మనం పెద్దగా కలిసింది కూడా లేదు. 100 00:08:45,901 --> 00:08:47,945 -నిన్ను రెండు వారాల క్రితమే చూశా కదా. -అది గాక. 101 00:08:48,028 --> 00:08:50,322 నాకు తెలీదు, గురూ. నన్ను ఏం చెప్పమంటావు? 102 00:08:53,242 --> 00:08:54,576 మేగన్ కి నేను నచ్చలేదా? 103 00:08:55,410 --> 00:08:57,162 తనకి నువ్వు బ్రహ్మాండంగా నచ్చావు. ఎందుకలా అడిగావు? 104 00:08:57,246 --> 00:08:59,248 తను నేను వేసిన జోకులకి అస్సలు నవ్వనేలేదు. ఒక్కసారి కూడా నవ్వలేదు. 105 00:08:59,331 --> 00:09:01,542 దానర్థం, తనకి నువ్వు నచ్చలేదని కాదు కదా. 106 00:09:05,462 --> 00:09:07,840 తనకి నేను నచ్చలేదని నువ్వు ఒప్పుకుంటే నీకు తప్పకుండా మాత్ర ఇస్తాను. 107 00:09:07,923 --> 00:09:09,508 బాసూ, తనకి నువ్వు నచ్చావు. 108 00:09:09,591 --> 00:09:12,094 తనకి నువ్వు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నువ్వు ఎవరికైనా నచ్చాలా ఏంటి? 109 00:09:12,177 --> 00:09:13,971 ఒకరికి నచ్చావు, లేదా నచ్చలేదు అని పట్టించుకోవడం వెర్రితనం. 110 00:09:14,054 --> 00:09:16,557 కాదు. ఒక రకంగా, అది ముఖ్యమైన విషయమే. 111 00:09:18,934 --> 00:09:21,395 -సరే. నిజంగా చెప్పాలా? -చెప్పు. 112 00:09:22,229 --> 00:09:24,898 -తన పాడటం గురించి ఆ మాట అన్నావు కదా. -అదే అని నాకు తెలుసు. 113 00:09:24,982 --> 00:09:26,984 నాకు తెలుసు, అదే అని నాకు బాగా తెలుసు, బాసూ. 114 00:09:27,067 --> 00:09:28,819 అది తనని పొగడ్తగానే చెప్పానని నీకు తెలుసు కదా? 115 00:09:28,902 --> 00:09:30,404 -నాకు తెలుసు. -తనకి జువెల్ అంటే ఇష్టం లేదని 116 00:09:30,487 --> 00:09:32,948 -నాకు ఎలా తెలుస్తుంది? -తనకి ఇష్టం లేదు మరి. 117 00:09:33,907 --> 00:09:36,410 ఆ ఒక్క మాట అన్నాను అని, తను నా మీద జీవితాంతం పగ పట్టేసిందా? 118 00:09:36,493 --> 00:09:39,329 అంటే, దాని గురించి ఇప్పుడు తను పట్టించుకోవడం లేదనుకుంటా. 119 00:09:39,413 --> 00:09:41,665 -ఆఖరిగా ఆ ప్రస్తావన తనెప్పుడు తెచ్చింది. -నాకు గుర్తు లేదు. 120 00:09:41,748 --> 00:09:44,585 -ఆలోచించి చెప్పరాదు. -కనీసం ఒక ఏడాది అయ్యుంటుంది. 121 00:09:46,295 --> 00:09:48,589 -కానీ మీరు విడిపోయే ఏడాది అయింది కదా. -అవును. 122 00:09:48,672 --> 00:09:51,967 -అయితే తను దాని గురించి మాట్లాడిందా? -నాకు దయచేసి మాత్ర ఇస్తావా? 123 00:09:53,093 --> 00:09:54,344 సర్లే, ఏదైతే ఏంటి. 124 00:09:56,346 --> 00:10:00,267 అయ్యో. ఇది ఏడరల్. ఇది నువ్వు వేసుకోకూడదు. 125 00:10:02,561 --> 00:10:04,980 చూడు, బాసూ, నేను ఆఫీసుకు రెడీ అవ్వాలి, 126 00:10:05,063 --> 00:10:07,608 కానీ నిన్ను మళ్లీ చూడటం చాలా బాగుంది. 127 00:10:10,485 --> 00:10:13,113 మనం మళ్లీ వీలైనంత త్వరగా ఓసారి కలిసి సరదాగా గడపాలి. 128 00:10:13,197 --> 00:10:14,531 సరే. తప్పకుండా. 129 00:10:46,230 --> 00:10:48,357 అవును, నేను జోష్ కోర్మన్ ని. 130 00:10:48,440 --> 00:10:51,235 దయచేసి మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ లోని ఆఖరి 4 అంకెలను చెప్పగలరా? 131 00:10:51,318 --> 00:10:52,319 లేదు. 132 00:10:52,945 --> 00:10:54,696 అయితే నేను మీకు సాయపడలేను. 133 00:10:54,780 --> 00:10:57,449 చూడండి, అసలు మీరెవరో నాకు తెలీదు, ఇది స్కామ్ అయ్యుండవచ్చు... 134 00:10:57,533 --> 00:10:59,660 మీకు మా నుండి ఇమెయిల్ వచ్చుంటే, 135 00:10:59,743 --> 00:11:03,080 దానర్థం, మీరు మీ వీసా క్రెడిట్ కార్డు బిల్లును చాలా కాలంగా కట్టలేదని అర్థం, 136 00:11:03,163 --> 00:11:05,457 అందుకని ఆ బాకీని కట్టడానికి మా సర్వీసులను కోరడం జరిగింది. 137 00:11:05,541 --> 00:11:07,584 అవును, కానీ మీరు చెప్పేది అబద్ధమేమో. 138 00:11:07,668 --> 00:11:09,461 -జోష్, అలాంటిదేమీ లేదని హామీ ఇవ్వగలను. -మన్నించాలి, 139 00:11:09,545 --> 00:11:11,672 దయచేసి మీరు నన్ను పేరుతో పిలవకుండా మాట్లాడగలరా? 140 00:11:11,755 --> 00:11:12,965 మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ కాకుండా, 141 00:11:13,048 --> 00:11:16,301 మీ తొలి పెంపుడు జంతువు పేరు చెప్పి కూడా మీ గుర్తింపును మీరు ధ్రువీకరించవచ్చు. 142 00:11:18,595 --> 00:11:19,847 మీరు ఆ పని చేయగలరా? 143 00:11:19,930 --> 00:11:20,973 ఆలోచిస్తున్నాను. 144 00:11:22,808 --> 00:11:24,184 తప్పకుండా. మిస్టీ. 145 00:11:24,268 --> 00:11:28,438 -సరైనదే. ఇప్పుడు, జోష్... -మన్నించాలి, అలా పిలవద్దని మీకు చెప్పాను. 146 00:11:28,522 --> 00:11:30,190 క్షమించాలి, మాకో స్క్రిప్ట్ ఉంటుంది. 147 00:11:31,400 --> 00:11:33,318 సరే. చెప్పండి. 148 00:11:34,486 --> 00:11:38,615 జోష్, మా రికార్డుల ప్రకారం, మీరు గ్లోబల్ కార్డ్ వీసాకి 3,000 డాలర్లకు పైగా... 149 00:11:38,699 --> 00:11:41,201 సరే, చూడండి, నాకు గ్లోబల్ కార్డ్ వీసా లేదు. 150 00:11:41,285 --> 00:11:42,411 ఆ కార్డ్ నాది కాదు. 151 00:11:42,494 --> 00:11:45,372 మనందరికీ కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి, నాకు కూడా. 152 00:11:45,455 --> 00:11:46,874 -లేదు, మీకు అర్థమవ్వడం లేదు. -బహుశా... 153 00:11:46,957 --> 00:11:49,209 మీరు ఎవరికో కాల్ చేయబోయి నాకు కాల్ చేశారు. ఆ కార్డ్ నాది కాదు. 154 00:11:49,293 --> 00:11:52,212 జోష్, అది మీరే. మరి మిస్టీ సంగతేంటి? 155 00:11:55,048 --> 00:11:59,970 కార్డు ఉపయోగించి జరిగిన చివరి మూడు లావాదేవీలను చెప్పగలరా? 156 00:12:01,221 --> 00:12:02,556 గెల్సన్స్. 157 00:12:02,639 --> 00:12:03,724 నేను అక్కడికి వెళ్లను. 158 00:12:03,807 --> 00:12:05,684 కార్లీటోస్ వే కాక్టేయిల్స్. 159 00:12:05,767 --> 00:12:06,894 నేను తాగను. 160 00:12:08,437 --> 00:12:09,938 చేజ్ జేయ్ రెస్టారెంట్. 161 00:12:13,317 --> 00:12:15,694 -జోష్? -చెప్పండి. 162 00:12:15,777 --> 00:12:17,988 -మీకు చేజ్ జేయ్ రెస్టారెంట్ తెలుసా... -తెలుసు. 163 00:12:18,572 --> 00:12:21,950 -ఇటీవల మీరు అక్కడికి వెళ్లారా? -నేనక్కడికి వెళ్లను. మా నాన్న వెళ్తాడు. 164 00:12:22,034 --> 00:12:23,076 నాకు అర్థం కాలేదు. 165 00:12:24,995 --> 00:12:28,665 బహుశా ఆయన నా పేరు మీద ఒక కార్డ్ తీసుకొనుంటాడేమో అని అనుకుంటున్నా. 166 00:12:28,749 --> 00:12:32,127 అలా ఆయన ఓసారి చేశాడు, కానీ అది చాలా కాలం క్రిందటి మాట. 167 00:12:32,211 --> 00:12:34,004 జోష్, దాన్ని నన్ను నిజంగా నమ్మమంటారా? 168 00:12:34,087 --> 00:12:37,257 ఓ విషయం చెప్పనా? ఇది నాకు కంగారు తెప్పిస్తోంది, నేను ఫోన్ పెట్టేస్తున్నా. 169 00:12:37,341 --> 00:12:40,093 -దయచేసి ఫోన్ పెట్టేయకండి, జోష్. -రోజంతా కులాసాగా గడపండి. ధన్యవాదాలు. 170 00:12:54,107 --> 00:12:55,108 వార్తలు ముఖ్యాంశాలు 171 00:12:55,192 --> 00:12:57,277 వాతావరణ సంక్షోభం మునుపు అనుకున్న దాని కన్నా మరింత దారుణంగా ఉంది 172 00:13:00,948 --> 00:13:03,992 జెన్నిఫర్ గార్నర్, సోషల్ మీడియాలో తను చేసే చిలిపి చేష్టలను పంచుకున్నారు 173 00:13:06,828 --> 00:13:07,829 బంబుల్ 174 00:13:07,913 --> 00:13:09,456 కోర్ట్నీ, 30 175 00:13:09,540 --> 00:13:11,333 లెక్సీ, 26 176 00:13:11,416 --> 00:13:14,127 మోనికా, 36 177 00:13:23,846 --> 00:13:25,430 గూగుల్ సెర్చ్ 178 00:13:25,514 --> 00:13:28,475 మేగన్ మన్రో 179 00:13:34,773 --> 00:13:36,024 మేగన్_మన్రో86 180 00:14:07,890 --> 00:14:09,391 "ఆడ వ్యాంపైర్ గబ్బిలం 181 00:14:09,474 --> 00:14:11,685 మగ వ్యాంపైర్ గబ్బిలం కన్నా సామాజికపరంగా మెరుగ్గా ఉంటుంది" 182 00:14:11,768 --> 00:14:15,731 "ఆడ వ్యాంపైర్ గబ్బిలాలు, మగవాటిలా కాకుండా సమూహాలుగా ఏర్పడి జీవిస్తాయి." 183 00:14:15,814 --> 00:14:18,025 "అవి ఎక్కువ సమయం గ్రూమింగ్ చేసుకుంటూ గడుపుతాయి. 184 00:14:18,108 --> 00:14:20,068 దీని వల్ల వాటి మధ్య బంధాలు బలపడతాయి." 185 00:14:20,152 --> 00:14:23,488 "ఎన్ని ఎక్కువ గబ్బిలాలకు గ్రూమ్ చేస్తే అన్ని బంధాలు ఏర్పడతాయి, 186 00:14:23,572 --> 00:14:26,825 తద్వారా ఎవరూ పట్టించుకోని ప్రాంతమైన అడవిలో, మనుగడ సాగించగల 187 00:14:26,909 --> 00:14:29,453 మీ అవకాశాలు మెరుగవుతాయి. సమాప్తం." 188 00:14:32,289 --> 00:14:33,415 చాలా బాగా చెప్పారు, పిల్లలూ. 189 00:14:33,498 --> 00:14:38,253 మీరు విన్నదాన్ని బట్టి, వ్యాంపైర్ గబ్బిలాల గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? 190 00:14:38,337 --> 00:14:39,338 మ్యాండీ. 191 00:14:39,421 --> 00:14:41,590 మరి మగ వ్యాంపైర్ గబ్బిలాల సంగతి ఏంటి? 192 00:14:41,673 --> 00:14:42,841 అవి చనిపోతాయి. 193 00:14:42,925 --> 00:14:45,802 అవి గ్రూమింగ్ చేయవు, కనుక వాటికి నేస్తాలు ఉండవు. 194 00:14:45,886 --> 00:14:47,971 ఆడ వ్యాంపైర్ గబ్బిలాలు లాగ. 195 00:14:48,055 --> 00:14:50,891 అయితే అవి ఒంటరిగానే జీవిస్తాయా? ఊరికే అటూఇటూ తిరుగుతూ? 196 00:14:50,974 --> 00:14:51,975 అవును. 197 00:15:04,029 --> 00:15:05,197 హేయ్, కెన్. 198 00:15:05,280 --> 00:15:06,490 -హేయ్, జోష్. -హేయ్, గురూ. 199 00:15:07,074 --> 00:15:09,117 -నీకు ఏమైనా, అంటే... -వినపడ లేదు, ఏంటి? 200 00:15:09,201 --> 00:15:11,286 నేనేమంటున్నానంటే, నీకేమైనా కాఫీ తాగాలనుంటే... 201 00:15:11,370 --> 00:15:13,580 -మన్నించు, గురూ. నాకు వేరే పనుంది. -అలాగే. 202 00:15:13,664 --> 00:15:14,998 -సరే, బై. -మళ్లీ కలుద్దాం. 203 00:15:23,632 --> 00:15:25,676 -అయితే నీకు నొప్పిగా అనిపిస్తోందా? -నాకు తెలీదు. 204 00:15:26,677 --> 00:15:28,303 ఛాతి నొప్పిగా ఉంటోందని ఇప్పుడే అన్నావు కదా. 205 00:15:28,387 --> 00:15:31,139 అవును, నిన్న నాకు అలాగే అనిపించింది, కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. 206 00:15:32,182 --> 00:15:34,685 ఛాతి నొప్పులను తక్కుగా చూడవద్దు. నువ్వు అదేంటో తనిఖీ చేయిస్తే మంచిది... 207 00:15:34,768 --> 00:15:38,397 కానీ నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా. ఏది నిజమో చెప్పడం కష్టంగా ఉంది. 208 00:15:40,148 --> 00:15:41,817 నువ్వు వ్యాయామం ఎక్కువగా చేయాలి. 209 00:15:42,901 --> 00:15:45,863 -మంచి సలహా ఇచ్చావులే. ధన్యవాదాలు. -చెప్తున్నా అంతే. అందరూ చేయాలి, కదా? 210 00:15:45,946 --> 00:15:46,947 అవును. 211 00:15:49,992 --> 00:15:51,869 -నీకు చెమటలు పడుతున్నాయా, గురూ? -ఇక్కడ బాగా వేడిగా ఉంది. 212 00:15:51,952 --> 00:15:53,036 -వేడిగా ఏం లేదే. -వేడిగానే ఉంది. 213 00:15:53,120 --> 00:15:54,913 -నీకేదో అయింది. -నాకేమీ కాలేదు. 214 00:15:54,997 --> 00:15:56,665 -నిన్ను చూస్తే నీకేదో అయినట్టు ఉంది. -అలా ఏం లేదే! 215 00:15:56,748 --> 00:15:58,208 -నిజంగానే నీకేదో అయినట్టుంది. -మరీ అతిగా చెప్పకు. 216 00:15:58,292 --> 00:16:00,252 నేను చెప్తున్నా కదా... వెళ్లి ఒకసారి నీ ముఖం చూసుకో. 217 00:16:00,335 --> 00:16:03,213 -సరే. అలాగే. నేను వెళ్లి చూసుకుంటా. -అవును, వెళ్లు. 218 00:16:05,924 --> 00:16:07,467 దేవుడా, నా ముఖం అంతా కందిపోయుంది. 219 00:16:07,551 --> 00:16:09,761 అదే కదా నేను కూడా చెప్పేది. బాసూ, నువ్వు దీన్ని తనిఖీ చేయించుకోవాలి. 220 00:16:09,845 --> 00:16:11,430 నేనేమీ చేయాల్సిన పని లేదు. 221 00:16:11,513 --> 00:16:13,765 -ఇది నీ ఆరోగ్యం. చిన్న విషయం కాదు. -ఇది నా ఆరోగ్యానికి సంబంధించినది కాదు. 222 00:16:13,849 --> 00:16:15,601 -దానికి నా పిచ్చి ఆలోచనలు కారణం. -ఏంటి? ఏంటి? 223 00:16:15,684 --> 00:16:18,979 నాకు ఆదుర్దానో లేదా కంగారో ఏదో కలుగుతోంది. రెండూ కావచ్చు. నాకు అర్థమవ్వడం లేదు. 224 00:16:19,813 --> 00:16:21,023 రెంటికీ తేడా ఏంటి? 225 00:16:21,648 --> 00:16:22,858 అయ్యో. క్షమించు. 226 00:16:24,026 --> 00:16:25,194 ఎంత దారుణంగా ఉంది? 227 00:16:28,405 --> 00:16:29,698 దారుణంగానే ఉంది. 228 00:16:29,781 --> 00:16:34,745 సరే. అది ఏమయ్యుంటుంది? హేయ్! దానికి కారణం ఏంటి? 229 00:16:35,871 --> 00:16:37,664 నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను కదా. మనం అదేంటో కనిపెట్టవచ్చు. 230 00:16:37,748 --> 00:16:39,958 -మనం చర్చిస్తున్నాం. ఎందుకు వచ్చింది? -తెలీదు. 231 00:16:40,042 --> 00:16:41,668 సరే. నీకు కంగారుగా అనిపించిందని నువ్వు అంటున్నావు. 232 00:16:41,752 --> 00:16:43,420 -ఆ కంగారు దేని గురించి? -నాకు తెలీదు! 233 00:16:43,504 --> 00:16:45,672 -ఛ. -ఆలోచించు. దేని గురించి చింతిస్తున్నావు? 234 00:16:46,924 --> 00:16:48,592 -అన్నింటి గురించి. -సరే. 235 00:16:48,675 --> 00:16:51,637 -ఫలానా అని చెప్పగలవా? -లేదు, నా ఆలోచనలన్నీ అలానే ఉన్నాయి. 236 00:16:51,720 --> 00:16:54,598 "నేను నా కారును లాక్ చేశానా? వెళ్లి చూసి రానా? 237 00:16:54,681 --> 00:16:56,475 కానీ వెళ్లేటప్పుడు కాలు జారి కిండ పడితే? 238 00:16:56,558 --> 00:16:58,435 అయితే కారును అలాగే లాక్ చేయకుండా ఉంచేయాలా?" అని ఏవేవో ఆలోచనలు. 239 00:16:58,519 --> 00:17:01,021 వావ్. నువ్వు మరీ నిర్దిష్టంగా చెప్పేశావు. 240 00:17:02,064 --> 00:17:04,066 ఏ ముఖ్యమైన విషయాల గురించి నువ్వు ఆందోళన పడుతున్నావు? 241 00:17:04,148 --> 00:17:07,069 ముఖ్యమైనవా? ఏమో మరి. ప్రపంచమంతా అస్తవ్యస్తంగా ఉంది, ఏమంటావు? 242 00:17:07,152 --> 00:17:09,195 అవును. అది నిజమే, బాసూ. 243 00:17:10,030 --> 00:17:12,074 లేదు, నిజంగానే వ్యవస్థ సరిగ్గా లేదు, దాన్ని ఎవరూ సరిచేయలేరు. 244 00:17:12,156 --> 00:17:14,785 -మనం ప్రయత్నించినా కూడా, అది... -సరే, దీని వల్ల లాభం ఉండటం లేదు. 245 00:17:14,867 --> 00:17:16,453 అవును. నాకు అర్థమైందిలే. 246 00:17:16,537 --> 00:17:19,164 ప్రపంచం ఈ స్థితిలో ఉందన్నది అందరికీ అనిపించే విషయమే. 247 00:17:19,248 --> 00:17:21,625 కాబట్టి అది కాదు. అంతే కదా? మరి ఇంకేంటి? 248 00:17:22,376 --> 00:17:23,585 నాకు తెలీదు. డబ్బు? 249 00:17:24,336 --> 00:17:27,839 -కానీ ఆర్థికపరంగా బాగానే ఉన్నావు కదా? -అస్సలు బాగాలేను. నిజంగానే. 250 00:17:27,923 --> 00:17:28,924 -సరే, నాకు తెలుసు. -అవును, కానీ... 251 00:17:29,007 --> 00:17:30,801 నా కంటే డబ్బు తక్కువ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు... 252 00:17:30,884 --> 00:17:34,137 -ధన్యవాదాలు. -...కానీ నేను ఎక్కువగా సంపాదించనేలేను. 253 00:17:34,221 --> 00:17:35,973 -అవును. -ప్రతీ నెలా నా జీతం అంతా 254 00:17:36,056 --> 00:17:39,852 అద్దెకి, ఆహారానికి, పెట్రోల్ కి, విద్యార్థి ఋణానికి సరిపోతుంది. 255 00:17:39,935 --> 00:17:41,812 అంటే, నాకు ఆరోగ్య భీమా ఉంది, అది మంచి విషయమే, 256 00:17:41,895 --> 00:17:43,397 కానీ అది అన్నింటినీ కవర్ చేయదు. 257 00:17:43,480 --> 00:17:45,566 నాకు ఏదైనా పెద్ద రోగం వస్తే, నా పని ఇక అంతే. 258 00:17:45,649 --> 00:17:47,192 ఏమంటున్నావు, నీకు ఆన్ లైన్ ద్వారా నిధులు సేకరిస్తాంలే గురూ. 259 00:17:48,610 --> 00:17:51,989 లేదు. నా గురించి నేను అలా ఆన్ లైన్ లో అడగడం అనేది... లేదులే. 260 00:17:52,072 --> 00:17:54,366 దాని కన్నా, ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను. 261 00:17:54,449 --> 00:17:56,869 హేయ్, హేయ్, హేయ్, ఆ విషయంలో జోకులేయకు, బాసూ. 262 00:17:56,952 --> 00:17:58,370 -ఏంటి? -లేదు, అది తమాషా విషయం కాదు. 263 00:17:58,453 --> 00:18:01,290 -అబ్బా, నా ఉద్దేశం అది కాదులే. -వద్దు, గురూ. నాకు తెలుసు, కానీ... 264 00:18:01,373 --> 00:18:04,042 నీకు డబ్బులు లేవని చచ్చిపోవాలనుందని చెప్పావు. 265 00:18:04,126 --> 00:18:05,669 -నేను అలా అనలేదు. -నువ్వు అన్నది అదే. 266 00:18:05,752 --> 00:18:08,005 నువ్వేం చెప్పినా కానీ, డబ్బు విషయంలో మనకి సమస్యలేవీ లేవు. 267 00:18:08,088 --> 00:18:12,551 అంటే, అంత పెద్ద సమస్యలేవీ లేవు. కదా? మరి ఇంకేంటి? 268 00:18:13,969 --> 00:18:15,971 -ఇంకేంటి? -నాకు తెలీదు. 269 00:18:17,556 --> 00:18:18,724 నాకు ప్రేమ అనేది... 270 00:18:20,184 --> 00:18:21,185 అందని ద్రాక్ష అయిపోయింది. 271 00:18:21,268 --> 00:18:23,729 నన్ను ఒకరు ప్రేమించి ఏడాది పైనే ఆయింది. 272 00:18:23,812 --> 00:18:26,648 -నాలో ఏదో లోపముందని అనుకుంటున్నా. -నీలో ఏ లోపమూ లేదు. 273 00:18:26,732 --> 00:18:29,568 నువ్వు కేవలం... మనం ఆచితూచీ వ్యవహరిస్తామంతే. సరే, ఇంకేంటి? 274 00:18:30,986 --> 00:18:32,154 నాకు తేలీదు. 275 00:18:35,157 --> 00:18:38,911 నేను అంతా చెడగొట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఒక వ్యక్తిలా పనికిరాను అన్నట్లుగా. 276 00:18:39,578 --> 00:18:41,830 -అది నిజం కాదు, బాసూ. -సరే, అది నిజం కాదు. 277 00:18:41,914 --> 00:18:42,956 ఇక నన్నేం చేయమంటావు? 278 00:18:43,040 --> 00:18:45,334 నీ చెత్త ప్రశ్నలన్నింటికీ సమాధానాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, 279 00:18:46,877 --> 00:18:47,878 సరే. 280 00:18:50,380 --> 00:18:52,758 -గూగుల్ లో వెతికి చూశావా? -అవును. ఆ పని కూడా చేశా. 281 00:18:52,841 --> 00:18:54,801 గత నాలుగు గంటల నుండి నేను చేస్తూ ఉండింది అదే. 282 00:18:54,885 --> 00:18:56,637 ఆ సోది అంతా చదివాను. 283 00:18:56,720 --> 00:18:58,347 అది చదువుతున్నప్పుడు అది సోది అని తెలిసిపోతోంది. 284 00:18:58,430 --> 00:19:00,724 "బహూశా ఈ సోది తర్వాత నాకు పనికొచ్చేది ఏమైనా దొరికుతుందేమో" 285 00:19:00,807 --> 00:19:02,184 అనుకుంటూ చదివాను. 286 00:19:02,851 --> 00:19:05,020 సరే. మరి ఈ బరువు గల దుప్పటి విషయమైతే ఎలా ఉంటుంది? 287 00:19:05,103 --> 00:19:06,688 అది కూడా చూశాను. ధర 250 డాలర్లు ఉంది. 288 00:19:06,772 --> 00:19:09,233 లేదు. దాన్ని వదిలేయ్. మనమే మన దుప్పటి చేసుకోవచ్చు. 289 00:19:09,316 --> 00:19:12,444 -మనం బరువు గల దుప్పటిని ఎలా చేస్తాం... -బరువు గల దుప్పటేగా? 290 00:19:12,528 --> 00:19:13,654 నేను బ్రహ్మాండంగా చేయగలను. చూస్తూ ఉండు. 291 00:19:14,279 --> 00:19:15,322 వద్దు! అక్కడే ఉండు. 292 00:19:15,405 --> 00:19:16,865 అక్కడే ఉండు. నేను వెంటనే వచ్చేస్తాను. 293 00:19:22,037 --> 00:19:23,205 నేల మీద పడుకో, 294 00:19:23,789 --> 00:19:24,915 నువ్వేం మాట్లాడుతున్నావు? 295 00:19:24,998 --> 00:19:27,459 నీకు ఏదైతే అనిపిస్తోందో, అది ఆగిపోవాలంటే, మనమేదోకటి చేయాలి. 296 00:19:27,543 --> 00:19:29,837 -నేను నేల మీద పడుకోవాలా? -పని చేయకపోతే, వదిలేద్దాం, అంతే. 297 00:19:29,920 --> 00:19:31,964 -నేల మీద పడుకో. ప్రయత్నించి చూద్దాం. -నీ దుంప దెగ. 298 00:19:32,047 --> 00:19:33,340 కాస్త అలా అనకుండా ఉంటావా? బాబోయ్. 299 00:19:33,423 --> 00:19:34,508 -క్షమించు. -సరే. 300 00:19:35,759 --> 00:19:37,928 -కానివ్వు, పడుకో. -పడుకుంటున్నా బాబూ. 301 00:19:38,011 --> 00:19:39,221 పడుకున్నా. 302 00:19:39,805 --> 00:19:41,640 -కామెడీ చేస్తున్నావా? -మరి ఎలా పని చేస్తుందనుకున్నావు? 303 00:19:41,723 --> 00:19:43,392 -నాకు వద్దు... -ఇది ఉత్త దుప్పట్టే. 304 00:19:44,560 --> 00:19:46,228 -నా భుజం. భుజం. -క్షమించు. 305 00:19:47,437 --> 00:19:48,522 సూపర్ గా ఉందిలే. 306 00:19:48,605 --> 00:19:51,859 నాకు సూపర్ గా ఏమీ లేదు, కానీ నాకు ఎలా ఉంటే ఏముందిలే. 307 00:19:59,533 --> 00:20:00,659 మనం మాట్లాడుకుంటేనే మంచిదేమో. 308 00:20:04,830 --> 00:20:07,249 -నీకు ఇప్పుడు కంగారు తగ్గిందా? -అస్సలు తగ్గలేదు. 309 00:20:10,586 --> 00:20:11,587 ఒక్క నిమిషం. 310 00:20:12,087 --> 00:20:13,755 -ఏం చేస్తున్నావు? -ఒక్క నిమిషం ఆగు. 311 00:20:13,839 --> 00:20:14,840 ఏంటి? 312 00:20:14,923 --> 00:20:16,091 టీవీలో క్రికెట్ పెడ్తాను. 313 00:20:21,722 --> 00:20:24,224 -బాబోయ్, నీకు చెమట చాలా పడుతోంది. -అవును, ఎందుకంటే ఇది పనిచేయడం లేదు. 314 00:20:24,308 --> 00:20:26,101 నువ్వు ఇంకా పూర్తిగా ప్రయత్నించి చూస్తే కదా. 315 00:20:29,855 --> 00:20:31,273 -నేను లేస్తున్నాను. -ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? 316 00:20:31,356 --> 00:20:33,358 -నేను పైకి లేస్తున్నాను... -లేదు, నువ్వు లేయకూడదు! లేయకు! 317 00:20:33,442 --> 00:20:35,944 -నాకు ఆలోచించడానికి సమయం కావాలి. సరేనా? -నువ్వు దీని సంగతేంటో చూడాలి. 318 00:20:36,028 --> 00:20:38,447 నువ్వు ఇప్పటిదాకా చెప్పింది విన్నాక నిన్ను నేను ఒంటరిగా వదిలేయలేను. 319 00:20:38,530 --> 00:20:40,157 హేయ్! హేయ్, హేయ్! 320 00:20:40,240 --> 00:20:41,408 చూడు, నన్ను క్షమించు. 321 00:20:41,491 --> 00:20:44,661 క్షమించు, కానీ ఇంతకన్నా మరో దారి లేదు, సరేనా? కనుక, దుప్పటి అయినా పెట్టుకో, 322 00:20:44,745 --> 00:20:47,039 లేదా దీని నుండి బయటపడటానికి నువ్వు ఇంకేం చేయబోతున్నావో చెప్పు. 323 00:21:10,270 --> 00:21:13,524 హాయ్, నేను ఇక్కడికి శ్వాస క్రియకి సంబంధించిన వర్క్ షాప్ కోసం వచ్చాను. 324 00:21:13,607 --> 00:21:15,609 హాలులో, కుడి వైపున ఉండే మొదటి గది. 325 00:21:15,692 --> 00:21:18,946 సరే. ఇంకా, మీకు తోచినంత చెల్లించమని ఆన్ లైన్లో ఉంది. 326 00:21:19,029 --> 00:21:20,822 -అది నిజమే కదా? -అవును. 327 00:21:20,906 --> 00:21:25,661 మంచిది, అయితే అయిదు డాలర్లా లేక 20 డాలర్లా లేదా... 328 00:21:25,744 --> 00:21:26,745 తప్పకుండా. 329 00:21:27,371 --> 00:21:29,581 అంటే, ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా? 330 00:21:29,665 --> 00:21:31,500 అవును. తోచినంత చెల్లించండి. 331 00:21:32,292 --> 00:21:33,502 సరే. 332 00:21:33,585 --> 00:21:37,297 అంటే, శ్వాస కి సంబంధించిన వర్క్ షాప్ కి ఎంత కట్టాలో కూడా నాకు అస్సలు తెలీదు. 333 00:21:37,965 --> 00:21:38,966 నాకు కూడా తెలీదు. 334 00:21:41,802 --> 00:21:44,555 సరే. అంటే, నేను న్యాయబద్దంగా ఎంత అవుతుందో అంతే కట్టాలనుకుంటున్నా. 335 00:21:45,681 --> 00:21:48,976 నాకు ఎక్కువ కట్టాలని లేదు. నేనేమంటున్నానో అర్థమవుతోంది కదా? 336 00:21:52,688 --> 00:21:56,567 ఇతరులు ఎక్కువగా ఎంత చెల్లింస్తుంటారో అదైనా నాకు చెప్పగలరా? 337 00:21:56,650 --> 00:21:58,485 మన్నించాలి. అది నేను చెప్పలేను. 338 00:21:59,361 --> 00:22:01,864 ఎందుకు? నేనేమీ మిమ్మల్ని నేరం చేయమని అడగడం లేదు... 339 00:22:01,947 --> 00:22:04,241 నా ఉద్దేశం, అది నైతికంగా అంత మంచి పని కాదు. 340 00:22:07,661 --> 00:22:10,163 అయితే, నేను కాసేపు ఇక్కడే ఉండి, 341 00:22:10,247 --> 00:22:12,291 ఆ వచ్చే వ్యక్తి ఎంత కడుతున్నారో చూస్తే, ఎలా ఉంటుందంటారు? 342 00:22:12,374 --> 00:22:14,751 నేను అలా చేయవద్దనే అంటాను. 343 00:22:15,961 --> 00:22:16,962 సరే. 344 00:22:19,506 --> 00:22:24,636 సరే. అయితే... తీసుకోండి. 345 00:22:25,137 --> 00:22:26,763 -మీకు చిల్లర ఏమైనా కావాలా? -నాకు తెలీదు. 346 00:22:53,874 --> 00:22:54,875 హాయ్. 347 00:23:00,005 --> 00:23:01,006 మన్నించండి. 348 00:23:25,948 --> 00:23:28,617 అందరికీ హాయ్. నా పేరు క్రిస్. 349 00:23:38,210 --> 00:23:41,755 ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 350 00:23:42,339 --> 00:23:45,801 ఈ బృందం ఇంతకుముందు లేదు. మళ్లీ ఉండదు కూడా. 351 00:23:48,136 --> 00:23:51,598 ఇప్పుడు, ఎవరైనా వాళ్లు ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నారో చెప్తారా? 352 00:23:51,682 --> 00:23:53,141 హాయ్, ఆలిస్. ఏంటి సంగతి? 353 00:23:53,851 --> 00:23:56,478 ఈ వారమంతా నాకు చాలా విషాదంగా గడిచింది. 354 00:23:56,562 --> 00:23:58,105 మీ కోడలి వల్లనా? 355 00:23:58,188 --> 00:24:02,150 తను కూడా ఒక కారణం. నా కుక్క చనిపోయే దశలో ఉంది. 356 00:24:03,193 --> 00:24:04,403 అది బాధాకరమైన విషయం. 357 00:24:05,320 --> 00:24:07,656 పోయిన వారం కూడా మీరు అదే చెప్పారు. 358 00:24:09,283 --> 00:24:10,576 అయినా కానీ అది బాధాకరమైన విషయమే. 359 00:24:12,452 --> 00:24:13,453 ఇంకెవరైనా చెప్తారా? 360 00:24:14,830 --> 00:24:15,831 హేయ్, చెప్పండి. 361 00:24:17,374 --> 00:24:20,085 నా బాల్యం అస్తవ్యస్తంగా గడవడం వలన 362 00:24:20,169 --> 00:24:22,504 నేను ఇతరులతో సరిగ్గా కలవలేకపోతున్నాను. 363 00:24:22,588 --> 00:24:23,881 అది విని చింతిస్తున్నాను. 364 00:24:23,964 --> 00:24:27,551 నా బాల్యం కూడా అస్తవ్యస్తంగానే గడిచింది, ఈ పని నాకు చాలా ప్రయోజనకరంగా అనిపిస్తోంది. 365 00:24:35,642 --> 00:24:38,103 మన్నించాలి, నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయా అనుకుంటా. 366 00:24:39,980 --> 00:24:43,692 నేను... దీనికి ఇరవై డాలర్లు చెల్లించాను, 367 00:24:43,775 --> 00:24:46,320 మరీ ఎక్కువ కట్టానేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. 368 00:24:48,697 --> 00:24:51,074 ఆ ఆలోచనలు రాకుండా ఉండటానికి ఈ పని సహాయపడుతుంది. 369 00:24:53,410 --> 00:24:54,578 ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? 370 00:24:55,454 --> 00:24:58,165 నాకు ఇవాళ చాలా ఒంటరిగా అనిపించింది. 371 00:25:02,794 --> 00:25:04,004 ఇప్పుడు మీరు ఒంటరివారు కాదు. 372 00:25:07,257 --> 00:25:10,302 సరే ఇక మొదలుపెడదాం. 373 00:25:10,385 --> 00:25:14,348 మొదటి 20 నిమిషాల పాటు, మనం మన కడుపులోకి, 374 00:25:15,432 --> 00:25:16,600 ఆ తర్వాత ఛాతీలోకి గాలి పీల్చుకొని, 375 00:25:17,142 --> 00:25:18,894 నోటి ద్వారా దాన్ని వదిలేస్తాం అన్నమాట. 376 00:25:26,026 --> 00:25:29,571 మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, వెనక్కి పడుకోండి. 377 00:25:31,740 --> 00:25:33,659 చాప మీద సౌకర్యంగా పడుకోండి. 378 00:25:35,619 --> 00:25:36,828 మీ కళ్ళు మూసుకోండి. 379 00:25:38,664 --> 00:25:39,831 ఇక మొదలుపెడదాం. 380 00:29:23,639 --> 00:29:25,641 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య