1 00:00:13,055 --> 00:00:16,099 ఈ సిరీసులోని పాత్రలు, సంఘటనలు అన్నీ కల్పితాలే. 2 00:00:16,183 --> 00:00:18,769 యధార్థ సంఘటనలను, లేదా బతికి ఉన్న వారినైనా, లేదా మరణించిన వారినైనా పోలి ఉంటే, 3 00:00:18,852 --> 00:00:19,937 అది పూర్తిగా యాదృచ్ఛికమే. 4 00:00:29,154 --> 00:00:32,741 కోర్ మధ్యలో రేడియోయాక్టివ్ ఇనీషియేటర్ ఉన్నా కూడా, 5 00:00:33,575 --> 00:00:35,786 ఆ కోర్ ని సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు. 6 00:00:36,495 --> 00:00:38,247 బేస్ బాల్ మాదిరిగానే అన్నమాట. 7 00:00:38,747 --> 00:00:41,208 తగినంత ఒత్తిడి పెడితే, 8 00:00:41,792 --> 00:00:43,877 అంటే దాని మీదే కేంద్రీకరించి బాంబులను పేల్చినప్పుడు, 9 00:00:45,045 --> 00:00:48,090 అది ఊహలకందని వినాశనాన్ని సృష్టించగలదు. 10 00:01:14,241 --> 00:01:16,034 రేపు మనం పరీక్ష జరిపేశాక, 11 00:01:16,118 --> 00:01:18,287 ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వానికి మీ శక్తి ఏంటో తెలిసి వస్తుంది. 12 00:01:23,125 --> 00:01:25,961 ఇరాన్ వాసులు మీకు సదా రుణపడి ఉంటారు, డాక్టర్ పీటర్సన్. 13 00:01:35,679 --> 00:01:39,892 పరీక్ష జరపాల్సిన ప్రదేశానికి రేపు దీన్ని తరలించే ముందు, నేను ఒకసారి తుది పరీక్షలను జరుపుతాను. 14 00:01:41,268 --> 00:01:44,980 ఈ చోటుపై శత్రువుల కన్ను పడిందని కమాలి భాయ్ భావిస్తున్నాడు. 15 00:01:45,063 --> 00:01:48,358 కాబట్టి, తరలించే పని ముందే చేసేస్తున్నాం. 16 00:01:49,610 --> 00:01:51,028 ఏంటి? వద్దు, వద్దు. 17 00:01:52,070 --> 00:01:53,238 మేము ఇంకా సిద్ధంగా లేము. 18 00:01:53,322 --> 00:01:54,823 మేము సిద్ధంగానే ఉన్నాం, అయతుల్లా. 19 00:01:54,907 --> 00:01:56,992 లేదు, లేదు. మీకు అర్థం కావడం లేదు. 20 00:01:57,075 --> 00:01:58,285 ఇవాళే. 21 00:02:00,370 --> 00:02:01,914 మీరు బాంబును ఇవాళే తరలిస్తున్నారన్నమాట. 22 00:02:03,332 --> 00:02:06,168 మీకు ఇంకో చోట మరింత ముఖ్యమైన పని ఉంది, డాక్టర్ పీటర్సన్. 23 00:02:17,012 --> 00:02:18,430 అర్థమైంది. 24 00:02:18,514 --> 00:02:19,598 సరే మరి. 25 00:02:23,852 --> 00:02:24,853 దాన్ని ఇలా ఇవ్వండి. 26 00:02:51,713 --> 00:02:53,841 మనం అనుకున్నట్టుగా ఏర్పాట్లన్నీ చేసేశావా? 27 00:02:57,928 --> 00:02:58,804 చేసేశాను. 28 00:03:59,907 --> 00:04:03,911 లవసాన్, టెహ్రాన్ శివారులో 29 00:04:15,547 --> 00:04:16,923 బాంబు అక్కడ ఉందా? 30 00:04:17,007 --> 00:04:20,844 ఘసేమీ స్మగుల్ చేసిన భాగాలు ఈ టన్నెల్స్ లో ఉన్నాయని అమెరికన్లు ట్రాక్ చేసి చెప్పారు. 31 00:04:20,928 --> 00:04:23,931 ఇవి టెహ్రాన్ మెట్రో వ్యవస్థకు పొడిగింపులు అన్నమాట. 32 00:04:24,014 --> 00:04:25,349 కానీ అవి, ఇంకా పూర్తి కాలేదు. 33 00:04:25,933 --> 00:04:28,143 ఇవి మామూలు మెట్రో టన్నెల్స్ కిందే ఉన్నాయి, 34 00:04:28,227 --> 00:04:29,144 కాబట్టి అవి చాలా లోతుగా ఉంటాయి. 35 00:04:29,228 --> 00:04:30,312 వాటిలోకి చొరబడటం సాధ్యం కాదు. 36 00:04:30,395 --> 00:04:32,523 సీఐఏ వాళ్లు చెప్తున్న దాని ప్రకారం, వాళ్లు అణు పరీక్ష కోసం, 37 00:04:32,606 --> 00:04:34,900 ఏడారిలో వేరే ఏదో ప్రాంతానికి బాంబును తరలిస్తున్నారు. 38 00:04:34,983 --> 00:04:38,237 ఏదైనా కదలిక కనిపించే దాకా ప్రతి ప్రవేశ మార్గం మీద కన్నేసి ఉంచాం. 39 00:04:38,987 --> 00:04:39,988 ఆ తర్వాత? 40 00:04:40,072 --> 00:04:41,615 వారు నేల మీదకి వచ్చాక, 41 00:04:41,698 --> 00:04:43,992 పరీక్ష జరిపే ప్రదేశానికి వెళ్లేటప్పుడు, మార్గం మధ్యలో డ్రోనుతో బాంబును పేలుస్తాం. 42 00:04:45,202 --> 00:04:46,828 అయితే, ఆ దాడి నగరం బయట జరుగుతుందా? 43 00:04:47,496 --> 00:04:50,624 వేలాది మంది పౌరుల మధ్యలో బాంబు దాడి చేయలేం కదా. 44 00:04:51,834 --> 00:04:53,293 అది కుదిరితే, అలాగే చేస్తాంలే. 45 00:05:00,634 --> 00:05:03,637 ఆ డ్రెస్ వేసుకోండి. మిమ్మల్ని మళ్లీ జైలుకు పంపుతున్నాం. 46 00:05:42,050 --> 00:05:44,094 పీటర్సన్ కూతురుకి ఇరాన్ నుండి ఫోన్ వస్తోంది. 47 00:05:44,595 --> 00:05:45,762 దాన్ని ట్రేస్ చేయ్. 48 00:05:47,347 --> 00:05:48,932 పీటర్సన్, తన కూతురుకి కాల్ చేస్తున్నాడు. 49 00:05:55,022 --> 00:05:58,317 హాయ్, నేను జెన్ ని. వీలైనంత త్వరగా మీకు తిరిగి కాల్ చేస్తాను. 50 00:06:01,570 --> 00:06:04,406 ఈ సందేశాలను నువ్వు వింటున్నావో లేదో నాకు తెలీదు. 51 00:06:07,326 --> 00:06:09,161 ఈ సందేశం నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. 52 00:06:11,997 --> 00:06:13,665 నాకు ఎక్కువ సమయం కూడా లేదు. 53 00:06:15,042 --> 00:06:18,587 నా మనస్సంతా ఎప్పటికీ ఇరాన్ లోనే ఉంటుందని నీకు ఒకసారి చెప్పాను. 54 00:06:20,881 --> 00:06:23,383 అప్పుడు నువ్వు నీ హృదయం ఎప్పటికీ ఇక్కడే ఉంటుందని అన్నావు. 55 00:06:24,760 --> 00:06:26,887 పీటర్సన్ కూతురు ఎప్పుడైనా ఇరాన్ కి వెళ్లిందా? 56 00:06:30,432 --> 00:06:32,267 నీకు ఈ మాటలు గుర్తున్నాయా? 57 00:06:34,686 --> 00:06:39,107 "తలరాతను ఎవరైనా ఎలా తప్పించుకోగలరు?" 58 00:06:42,736 --> 00:06:45,155 "విధికి ఎవరైనా తలవంచాల్సిందే కదా?" 59 00:06:50,077 --> 00:06:51,620 ఇదంతా ఆమెకి ఎందుకు చెప్తున్నాడు? 60 00:06:52,496 --> 00:06:54,206 అతను చెప్తోంది అతని కూతురికి కాదు. 61 00:06:56,875 --> 00:06:57,960 నాకు చెప్తున్నాడు. 62 00:07:01,547 --> 00:07:03,841 నిన్ను త్వరలోనే మళ్లీ కలుసుకుంటానని ఆశిస్తున్నా. 63 00:07:05,175 --> 00:07:06,635 మనందరి మంచి కోసం. 64 00:07:18,814 --> 00:07:20,065 సిగ్నల్ ఇంకా యాక్టివ్ గానే ఉంది. 65 00:07:20,482 --> 00:07:21,650 పీటర్సన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశా. 66 00:07:21,733 --> 00:07:22,860 లవసాన్ లోని ఒక విల్లాలో… 67 00:07:22,943 --> 00:07:25,445 మన లక్ష్యం బాంబు, శాస్త్రవేత్త కాదు. 68 00:07:26,780 --> 00:07:27,823 తమార్. 69 00:07:31,410 --> 00:07:33,078 మనం బయలుదేరాలి. 70 00:07:37,624 --> 00:07:39,251 ఐ.ఆర్.జీ.సీ నిఘా కార్యకలాపాల ప్రధాన కార్యాలయం, టెహ్రాన్ 71 00:07:40,669 --> 00:07:42,462 తరలింపుకు అంతా సిద్ధమేనా? 72 00:07:42,546 --> 00:07:43,672 - సిద్ధమే, సర్. - సిద్ధమే, సర్. 73 00:07:55,142 --> 00:07:56,310 తను ఫోన్ ఎత్తట్లేదు. 74 00:07:58,145 --> 00:08:00,105 తను శాస్త్రవేత్త ఫోన్ ని ట్రాక్ చేస్తోంది. 75 00:08:00,606 --> 00:08:02,357 తను లవసాన్ లోని విల్లాకి వెళ్తూ ఉందేమో. 76 00:08:07,362 --> 00:08:08,864 డాక్టర్. దయచేసి రండి. 77 00:08:40,437 --> 00:08:41,980 అతను బయలుదేరాడు. 78 00:08:42,063 --> 00:08:45,317 అతను లవసాన్ నుండి నగరానికి బయలుదేరుతుంటే, కుపాయే గుండానే వెళ్లాలి. 79 00:08:46,485 --> 00:08:47,694 వాళ్ల కన్నా ముందే మనం అక్కడికి పోవాలి. 80 00:08:55,577 --> 00:08:57,287 చూడండి, ఆ కేంద్రంలో ఏదో జరుగుతోంది. 81 00:08:57,371 --> 00:08:58,956 డానియేలా, నాకు శాటిలైట్స్ ఫీడ్ చూపించు. 82 00:09:01,208 --> 00:09:02,709 ట్రక్ లోపల ఏముందో చూడగలమా? 83 00:09:03,043 --> 00:09:04,670 ఇన్ఫ్రారెడ్ మోడ్ 84 00:09:04,753 --> 00:09:06,630 అదేదైనా కానీ, దానికి లెడ్ పూత ఉందని ఇన్ఫ్రారెడ్ చూపుతోంది. 85 00:09:06,713 --> 00:09:08,507 అది రేడియోయాక్టివ్ వ్యర్థ పదార్థం కావచ్చు. 86 00:09:08,590 --> 00:09:10,926 అది సివిలియన్ ఎస్కార్ట్ తో పాటు వెళ్తోంది. అంతా మామూలుగానే కనిపిస్తోంది. 87 00:09:11,009 --> 00:09:13,637 దాని మీద ఓ కన్నేసి ఉంచు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకు. 88 00:09:16,515 --> 00:09:18,767 నాకు ట్రక్, ఇంకా దాని ఎస్కార్ట్ కారు కనిపిస్తున్నాయి. 89 00:09:29,736 --> 00:09:30,821 మెసేజ్ పంపు. 90 00:09:54,887 --> 00:09:56,513 ఆ కారుకు ఏమైంది? 91 00:09:57,097 --> 00:09:58,098 తెరువు. 92 00:09:58,724 --> 00:09:59,683 ఒంగో 93 00:10:07,357 --> 00:10:08,483 పద. 94 00:10:20,204 --> 00:10:23,457 - అబ్బా. ఆ అవసరం లేదులే. - నీ మీద నమ్మకం లేనందుకు మమ్మల్ని మన్నించాలి. 95 00:10:35,427 --> 00:10:39,056 నా మాట వినండి. వాళ్లు ఆయుధాన్ని తరలిస్తున్నారు. 96 00:10:39,139 --> 00:10:40,224 మనం దాన్ని కనుగొనాలి. 97 00:10:40,307 --> 00:10:42,809 దాన్ని నువ్వే వాళ్లకి తయారు చేసిచ్చావు, ఇప్పుడేమో దాన్ని కనుగొనాలి అంటున్నావు… 98 00:10:42,893 --> 00:10:44,269 అది పేలనుంది. 99 00:10:48,690 --> 00:10:51,276 - ఆ విషయం నీకెలా తెలుసు? - అది పేలేలా ప్రోగ్రామ్ నేనే చేశాను. 100 00:10:52,361 --> 00:10:56,073 ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పేలేలా బాంబును ప్రోగ్రామ్ చేసి, సిద్ధపరచాను. 101 00:11:03,247 --> 00:11:04,998 దానికి రెండు గంటలు కూడా లేవు. 102 00:11:06,124 --> 00:11:07,125 ఎందుకు ఇలా చేశావు? 103 00:11:07,209 --> 00:11:09,044 ఒక బాంబును చేసి ఇస్తున్నానని 104 00:11:09,795 --> 00:11:12,214 వాళ్లని నమ్మిస్తూ రెండున్నరేళ్లు గడిపాను. 105 00:11:12,798 --> 00:11:14,383 చివరికి ఆ బాంబును నాశనం చేయాలన్నదే నా లక్ష్యం. 106 00:11:14,466 --> 00:11:17,177 వాళ్ల అణు కార్యక్రమాన్ని అంతటినీ శాశ్వతంగా భూస్థాపితం చేయాలనుకున్నా. 107 00:11:17,761 --> 00:11:20,472 - అది ల్యాబ్ లో ఉన్నప్పుడే పేలేలా ప్లాన్ వేశాను. - నీ ప్లాన్ పిచ్చిగా ఉంది. 108 00:11:20,556 --> 00:11:22,224 అది పని చేసి ఉండేది. 109 00:11:22,307 --> 00:11:24,268 టన్నెల్స్ చాలా లోతుగా ఉన్నాయి కాబట్టి, పేలుడు తీవ్రత పైకి తెలియదు. 110 00:11:24,351 --> 00:11:25,853 సరే, మరి రేడియేషన్ సంగతేంటి? 111 00:11:25,936 --> 00:11:29,189 రేడియేషన్ బయటకు వస్తే… వాళ్లు చేసే పనిని ఇకపై వాళ్లు దాచలేరు కదా. 112 00:11:30,440 --> 00:11:33,485 ప్రోటోకాల్స్ ని ఫాలో అయి, నగరాన్ని ఖాళీ చేయించడం తప్ప వాళ్లకి మరో దారి ఉండదు. 113 00:11:33,569 --> 00:11:36,405 - వాళ్లు అలా చేస్తారని నీకెలా తెలుసు? - ఆ ప్రోటోకాల్స్ ని రాసింది నేనే. 114 00:11:37,155 --> 00:11:40,075 వాళ్లు ఎన్ని అబద్ధాలు ఆడారో, ప్రపంచమంతటికీ తెలిసిపోతుంది. 115 00:11:40,742 --> 00:11:42,661 వాళ్ల దేశ ప్రజలకే తెలిసిపోతుంది. 116 00:11:42,744 --> 00:11:44,621 మరి నీ వల్ల చనిపోయే వారి సంగతేంటి? 117 00:11:46,957 --> 00:11:48,876 నేను అన్నీ లెక్కేసుకునే ఈ పని చేశాను. 118 00:11:49,835 --> 00:11:51,837 కొందరు బలి అవ్వడం… 119 00:11:53,005 --> 00:11:53,922 నీకు ఆమోదయోగ్యమేనా? 120 00:11:54,840 --> 00:11:56,842 నన్ను తప్పు పట్టకు. 121 00:11:56,925 --> 00:11:58,802 ఏదైనా మారాలి కదా, లేకపోతే తమ సొంత ప్రభుత్వం కారణంగా 122 00:11:58,886 --> 00:12:01,805 ఎంత మంది ఇరాన్ వాసుల ప్రాణాలు పోతాయో తెలుసా? 123 00:12:04,892 --> 00:12:07,352 కాబట్టి, అరెస్ట్ కావడం, మేము నిన్ను కాపాడాక మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లడం, 124 00:12:07,436 --> 00:12:10,272 ఇప్పటి దాకా నువ్వు చేసినదంతా, నీ ప్లాన్ లో భాగమేనా? 125 00:12:10,355 --> 00:12:12,608 ఒకసారి ప్లాన్ ప్రారంభించాక, అది పూర్తయ్యేలా చూసుకోవాలి కదా. 126 00:12:13,734 --> 00:12:15,110 ఇప్పుడు దాన్ని ఆపగలవా? 127 00:12:18,197 --> 00:12:20,240 హా, ఆపగలను. 128 00:12:21,909 --> 00:12:23,493 కానీ అందుకు నీ సాయం కావాలి. 129 00:12:29,291 --> 00:12:30,375 తమార్ లైన్లో ఉంది. 130 00:12:31,585 --> 00:12:33,754 ఆయుధం ఎక్కడ ఉందో తెలుసా? అది ప్రస్తుతం తరలించబడుతోంది. 131 00:12:33,837 --> 00:12:35,422 కాస్త నేను చెప్పేది విను, నువ్వు… 132 00:12:35,506 --> 00:12:38,342 యులియా, రెండు గంటల్లో బాంబు పేలనుంది. 133 00:12:40,010 --> 00:12:40,844 అది నీకెలా తెలుసు? 134 00:12:40,928 --> 00:12:42,095 పీటర్సన్ నా దగ్గరే ఉన్నాడు. 135 00:12:42,179 --> 00:12:44,348 అతను టెహ్రాన్ స్థానిక సమయం ప్రకారం పన్నెండు గంటలకు పేలేలా దాన్ని సెట్ చేశాడు. 136 00:12:45,766 --> 00:12:48,310 టెహ్రాన్ 137 00:12:48,393 --> 00:12:50,437 ఏంటి? అతను బాంబును యాక్టివేట్ చేశాడా? 138 00:12:50,521 --> 00:12:51,647 ఒక్క నిమిషం. 139 00:12:52,689 --> 00:12:53,649 ఇంకో ట్రక్ బయటకు వచ్చింది. 140 00:12:54,983 --> 00:12:56,360 ఏం జరుగుతోంది? 141 00:13:03,992 --> 00:13:06,119 ఒక నిమిషం… ఒక ట్రక్కే కాదు. 142 00:13:06,203 --> 00:13:07,412 నాకు ఇప్పుడు ఆరు కనిపిస్తున్నాయి. 143 00:13:07,496 --> 00:13:09,289 ప్రతీ దానికీ లెడ్ పూత ఉంది, అన్నిటికీ ఎస్కార్ట్ ఉంది. 144 00:13:10,999 --> 00:13:12,501 వాళ్లు నకిలీవి కూడా ఉపయోగిస్తున్నారు. 145 00:13:12,584 --> 00:13:15,420 ఈ వాహనాలను ట్రాఫిక్ లో గుర్తించడం కష్టం. 146 00:13:16,046 --> 00:13:17,965 నగరంలోని ట్రాఫిక్ వ్యవస్థను హ్యాక్ చేయండి. 147 00:13:18,048 --> 00:13:19,925 తక్షణమే మనం వాళ్లని అడ్డుకోవాలి. 148 00:13:20,008 --> 00:13:23,136 బాంబు గురించి నీకు ఏం తెలుసో అంతా నాకు చెప్తూ, 149 00:13:23,220 --> 00:13:25,013 నగరం బయటకు వెళ్లిపో. ఇప్పుడే! 150 00:13:25,514 --> 00:13:26,515 పెలికన్, వినిపించిందా? 151 00:13:26,598 --> 00:13:29,101 ట్రాఫిక్ లైట్లు, చౌరాస్తాలు, ప్రభుత్వ పనులు, నువ్వు యాక్సెస్ చేయగల వాటన్నింటినీ. 152 00:13:35,357 --> 00:13:36,400 సర్? 153 00:13:37,526 --> 00:13:39,903 ట్రాఫిక్ వ్యవస్థలో ఏదో గడబిడ చోటుచేసుకుంటోంది. 154 00:13:46,785 --> 00:13:48,704 చూడండి. ట్రాఫిక్ జామ్. 155 00:14:03,844 --> 00:14:06,013 బాంబు ఎక్కడ ఉందో ఏమైనా తెలిసిందా? 156 00:14:06,847 --> 00:14:08,891 వాటన్నింటినీ బాంబుతో పేల్చేయడం కుదురుతుందా? 157 00:14:08,974 --> 00:14:10,726 మన ఉప్రగ్రాల్లో కొన్ని, ఇంకాసేపట్లో ఆఫ్ లైన్లోకి వెళ్లిపోతాయి. 158 00:14:10,809 --> 00:14:14,062 అదీగాక, ఒకేసారి ఆరు ట్రక్కులను ట్రాక్ చేయడం ఎలాగూ సాధ్యపడదు. 159 00:14:14,146 --> 00:14:16,273 మనం రిస్కులు తీసుకొనే స్థితిలో లేము. మనం అన్నిటినీ ట్రాక్ చేయాల్సిందే. 160 00:14:16,356 --> 00:14:18,525 అసలైన ట్రక్కును కనుగొన్నాక, దాన్ని మనం పేల్చేయాలి. 161 00:14:19,610 --> 00:14:21,486 ఏంటి? నగరంలో ఎలా పేల్చగలం? 162 00:14:21,570 --> 00:14:23,822 అలా పేలిస్తే, అది డర్టీ బాంబు అయిపోతుంది. వేలాది మంది చనిపోతారు. 163 00:14:25,073 --> 00:14:27,492 చెప్పేది జాగ్రత్తగా విను. ఎన్నో ఏళ్లుగా అబద్ధాలు ఆడుతూ, ప్రపంచం మొత్తాన్ని 164 00:14:27,576 --> 00:14:30,370 వెర్రి పప్పని చేయగల సత్తా ఉన్న ఓ వ్యక్తి మాటలను నమ్మి, 165 00:14:30,454 --> 00:14:32,539 ఇజ్రాయెల్ భద్రతను నేను ప్రమాదంలో పడేయలేను. 166 00:14:32,623 --> 00:14:35,751 మనం ట్రక్కును కనిపెట్టలేకపోతే, నగరాన్ని ఖాళీ చేయించాల్సి ఉంటుంది. 167 00:14:36,418 --> 00:14:40,005 ఇరాన్ చేతికి ఒక అణ్వాయుధం చిక్కితే, దాన్ని అది మనపై ప్రయోగించే అవకాశం ఉంటే, 168 00:14:40,088 --> 00:14:42,925 అప్పుడు నేను మాత్రం ఆ ట్రక్కులను టెహ్రాన్ బయటకు రానివ్వను. 169 00:14:43,008 --> 00:14:46,011 - ఈ బాంబు పేలితే… - ఆ పేలేదేదో అది టెహ్రాన్ లోనే పేలాలి. 170 00:14:46,094 --> 00:14:49,640 నువ్వెవరో, నువ్వెవరి తరఫున పోరాడుతున్నానని చెప్పుకుంటున్నావో గుర్తుంచుకో. 171 00:14:52,309 --> 00:14:53,644 దొబ్బేయ్. 172 00:15:25,008 --> 00:15:26,593 మనం ట్రక్కును కనిపెట్టకపోతే, 173 00:15:26,677 --> 00:15:29,012 నగరం మధ్యలో అణు బాంబు పేలుతుంది. 174 00:15:31,557 --> 00:15:32,808 మనం ట్రక్కును తప్పక కనిపెడతాం. 175 00:15:32,891 --> 00:15:35,352 కానీ మనం కనిపెట్టి, నేను దాని గురించి రిపోర్ట్ చేస్తే, 176 00:15:36,937 --> 00:15:38,230 మొసాద్ వాళ్లు దానిపై దాడి చేస్తారు. 177 00:15:39,857 --> 00:15:43,694 కాబట్టి, టెహ్రాన్ నడిబొడ్డులో అణు బాంబు అయినా పేలుతుంది, లేదా డర్టీ బాంబు అయినా పేలుతుంది. 178 00:15:47,865 --> 00:15:49,241 లేదు, లేదు. 179 00:15:49,324 --> 00:15:50,784 దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 180 00:15:52,327 --> 00:15:53,912 బాంబు ఏ ట్రక్కులో ఉందో కూడా మనకి తెలీదు. 181 00:15:53,996 --> 00:15:56,331 ప్రభుత్వంలో ఉన్న వాళ్లకి కూడా, మహా అయితే ఎంత మందికి తెలుస్తుంది? 182 00:15:56,415 --> 00:15:57,541 అతి కొద్ది మందికే ఏమో. 183 00:16:01,962 --> 00:16:03,213 వాళ్లలో ఒకరు నాకు తెలుసు అనుకుంటా. 184 00:16:17,436 --> 00:16:18,270 చెప్పండి, సర్. 185 00:16:18,729 --> 00:16:20,022 స్టేటస్ చెప్పు. 186 00:16:20,981 --> 00:16:23,150 మేము ట్రక్ వెనుక నిదానంగా వెళ్తున్నాం. 187 00:16:23,233 --> 00:16:25,402 తదుపరి ఆదేశాల కోసం వేచి ఉండండి. 188 00:16:25,819 --> 00:16:27,321 వేగంగా పదండి. 189 00:16:27,404 --> 00:16:28,405 అలాగే, సర్. 190 00:16:51,094 --> 00:16:52,679 నీకు నాహీద్ ని చూడాలనుంటే, 191 00:16:52,763 --> 00:16:55,599 ఎవరి దృష్టీ ఆకర్షించకుండా, సరిగ్గా మూడు నిమిషాల్లో 192 00:16:55,682 --> 00:16:57,643 భవనం బయటకు రా. 193 00:17:14,409 --> 00:17:16,703 అహా… నమస్కారం, మిస్టర్ కమాలి. 194 00:17:17,204 --> 00:17:19,580 మీ భార్య గురించి మాట్లాడటానికి 195 00:17:19,665 --> 00:17:21,666 మీతో మాట్లాడాలని వస్తున్నాను. 196 00:17:21,750 --> 00:17:24,795 దానికి ఇదా సమయం? పక్కకు జరుగు! 197 00:18:07,671 --> 00:18:11,008 నిశ్శబ్దంగా ఉండు. ఏమీ మాట్లాడకు. నాతో రా. రా. 198 00:18:12,885 --> 00:18:14,553 కారెక్కు. పద. 199 00:18:20,392 --> 00:18:21,310 ఎక్కు. 200 00:18:22,603 --> 00:18:24,229 నాహీద్ ఇక్కడ ఉంది అన్నావే. 201 00:18:24,813 --> 00:18:26,982 తను చెప్పింది చేయ్. అది మనందరికీ మంచిది. 202 00:18:33,864 --> 00:18:34,990 దగ్గర్లోనే ఉండు. 203 00:18:41,747 --> 00:18:46,043 డిశ్పాచ్, నేను చెప్పబోయే కారు కోసం గాలించండి. అవును. 204 00:18:50,339 --> 00:18:51,924 నువ్వు చెప్పేది నేనెందుకు నమ్మాలి? 205 00:18:52,007 --> 00:18:53,258 తనకి అబద్ధమాడాల్సిన పనేంటి? 206 00:18:53,342 --> 00:18:54,843 ఎందుకంటే, తనకి అబద్ధాలాడటం ఒక హాబీ. 207 00:18:54,927 --> 00:18:56,094 ఈ విషయంలో తను అబద్ధం చెప్పట్లేదు! 208 00:18:56,178 --> 00:18:58,555 నిన్ను సంప్రదించి, మొసాద్ ఆదేశాలను తను ఉల్లంఘిస్తోంది. 209 00:18:58,639 --> 00:19:01,225 మనం ట్రక్కును కనిపెట్టకపోతే, బాంబు పేలుడును వాళ్లు అడ్డుకోరు. 210 00:19:02,392 --> 00:19:04,186 ఒకవేళ నువ్వు ట్రక్కును కనిపెడితే? 211 00:19:04,937 --> 00:19:06,313 వాళ్లకి చెప్పను. 212 00:19:08,273 --> 00:19:12,986 నువ్వు చెప్పేది నిజమే అయితే, ఆ ప్రోగ్రాములోని ఇరాన్ శాస్త్రవేత్త ఎవరైనా దాన్ని ఆపేయగలరు. 213 00:19:13,070 --> 00:19:16,865 లేదు, నేను ఆ బాంబును యాక్సెస్ చేయాలి. దాన్ని మాన్యువల్ గా నిర్వీర్యం చేయాలి. 214 00:19:16,949 --> 00:19:18,408 అది నేనే చేయాలి. 215 00:19:19,409 --> 00:19:21,036 అది కూడా మనం ఒక గంట లోపే చేయాలి. 216 00:19:22,788 --> 00:19:23,789 చూడు. 217 00:19:24,289 --> 00:19:27,251 నీకు టెహ్రాన్ అంటే ప్రాణమని నాకు తెలుసు, అలాగే నాకు కూడా ఈ నగరమంటే ప్రాణమని తెలుసుకో. 218 00:19:28,418 --> 00:19:30,462 ఈ నగరం కోసం, అందులో ఉండే ప్రజల కోసం. 219 00:19:33,549 --> 00:19:34,883 నాహీద్ కోసం. 220 00:19:38,095 --> 00:19:39,471 తను ఇంకా నగరంలోనే ఉందా? 221 00:19:40,889 --> 00:19:42,432 నువ్వు మమ్మల్ని ఆయుధం దగ్గరికి చేర్చితే, 222 00:19:43,350 --> 00:19:45,435 నేను తనకి కాల్ చేసి, ఫోన్ నీకు ఇస్తాను. 223 00:19:50,732 --> 00:19:52,109 కానీ ముందు, దయచేసి ఈ పని చేసి పెట్టు. 224 00:20:02,911 --> 00:20:04,162 హలో, సర్. 225 00:20:04,246 --> 00:20:06,790 నేను కమాలిని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? 226 00:20:06,874 --> 00:20:10,043 మేము లాలె బులెవార్డ్ లో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని ఉన్నాం. 227 00:20:12,671 --> 00:20:14,631 మనం మూడో కంటికి కనిపించకుండా దాన్ని చేరుకోవాలి. 228 00:20:14,715 --> 00:20:19,261 ఉత్తరం వైపుకు, షాహ్రాన్ మీదుగా సులుఘున్ రోడ్డుకు చేరుకోమని వాళ్లకి చెప్పు. 229 00:20:24,683 --> 00:20:25,684 కానివ్వు, చెప్పు. 230 00:20:27,311 --> 00:20:30,063 సులుఘున్ రోడ్డులో వెళ్లమని డ్రైవరుకు చెప్పు. 231 00:20:30,147 --> 00:20:32,024 ఇప్పటి నుండి, నా ఫోన్ తప్ప ఎవరివీ ఎత్తవద్దు. 232 00:20:32,107 --> 00:20:34,735 భద్రతాపరమైన ఉల్లంఘన చోటుచేసుకుంది. మన ఆచూకీ తెలిసిపోయింది. 233 00:20:35,903 --> 00:20:36,778 అలాగే, సర్. 234 00:20:38,989 --> 00:20:40,908 మనం దగ్గర్లోనే ఉన్నాం. 235 00:20:44,244 --> 00:20:45,245 చెప్పండి. 236 00:20:45,746 --> 00:20:50,167 మీరు అడిగిన వాహనం ట్రాఫిక్ కెమెరాకి చిక్కింది. 237 00:20:50,250 --> 00:20:53,170 షాహ్రాన్ వీధిలో ఉంది అది. ఉత్తరం వైపు వెళ్తోంది. 238 00:20:53,921 --> 00:20:54,838 థ్యాంక్యూ. 239 00:20:59,927 --> 00:21:02,846 అయితే, ఇరాన్ అంటే నీకు ప్రాణమని నువ్వు చెప్పినదంతా, 240 00:21:04,389 --> 00:21:06,433 అలాగే లారిజానికి నువ్వు చెప్పినదంతా, 241 00:21:08,185 --> 00:21:09,520 అబద్ధమేనా? 242 00:21:12,231 --> 00:21:16,401 గత 20 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వంతో నేను వేగుతూ వచ్చాను, కానీ… 243 00:21:18,487 --> 00:21:20,948 దేని కోసమైతే అన్నింటినీ వదులుకున్నానో, 244 00:21:21,031 --> 00:21:24,076 దేనికి అయితే నా వివాహం, కూతురు, ఆనందం కన్నా 245 00:21:25,827 --> 00:21:28,664 ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానో, అది సరైనది కాదని తెలుసుకున్నాక, 246 00:21:28,747 --> 00:21:30,666 మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు… 247 00:21:33,001 --> 00:21:34,628 ఎలా ఉంటుందో తెలుసా? 248 00:21:38,048 --> 00:21:39,800 అందుకే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. 249 00:21:45,389 --> 00:21:46,557 తమార్ ఎక్కడ ఉంది? 250 00:21:46,640 --> 00:21:48,183 ఫోన్ ని ఆఫ్ చేసేసింది. 251 00:21:51,520 --> 00:21:54,022 అలీ, ట్రక్కు వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తోంది. 252 00:21:54,106 --> 00:21:56,275 మనం దీన్ని వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయాలి. కమాలి ఎక్కడ? 253 00:21:56,358 --> 00:21:58,360 అతనికి కాల్ చేయ్. త్వరగా కాల్ చేయ్. 254 00:21:59,319 --> 00:22:01,488 ఈలోపు, అటు వైపు బలగాలను పంపండి. 255 00:22:05,492 --> 00:22:07,578 ట్రక్, నగరం బయటకు వెళ్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. 256 00:22:07,661 --> 00:22:08,704 వెంటనే దాడి చేయవలసిందిగా ఆదేశిస్తున్నా. 257 00:22:09,538 --> 00:22:11,248 ఇతమార్, ఈ పని నువ్వు చేయగలవా? 258 00:22:11,915 --> 00:22:12,791 చేయగలను. 259 00:22:14,126 --> 00:22:16,587 స్వార్డ్, దాడి చేయాల్సిన లక్ష్యాలకు సంబంధించిన కో-ఆర్డినేట్లను పంపిస్తున్నాను. 260 00:22:16,670 --> 00:22:19,381 544582, 230247. 261 00:22:19,965 --> 00:22:21,300 లక్ష్యం కనిపించాక మాకు రిపోర్ట్ చేయి. 262 00:22:23,260 --> 00:22:25,762 బలగాలన్నీ వీలైనంత త్వరగా టన్నెల్ వైపు వెళ్లాలి. 263 00:22:26,889 --> 00:22:28,724 సెపా వాళ్ల కమ్యూనికేషన్ నెట్వర్క్ లో కాల్స్ పెరిగాయి. 264 00:22:28,807 --> 00:22:29,933 వాళ్లు కమాలి కోసం వెతుకుతున్నారు. 265 00:22:30,559 --> 00:22:32,060 తమార్ అతనితో ఏదైనా ఒప్పందం కుదుర్చుకుని ఉంటే… 266 00:22:32,561 --> 00:22:34,229 - మీకు ఖచ్చితంగా తెలీదు, తను… - నాకు తను తెలుసు. 267 00:22:34,938 --> 00:22:36,565 ఇరాన్ పై తనకి ఉన్న ప్రేమ పెరిగిపోయి, తను ఇలా చేస్తోంది. 268 00:22:36,648 --> 00:22:37,649 ఇప్పుడు తన వల్ల మనకి ప్రమాదం. 269 00:22:43,989 --> 00:22:45,616 మీ భద్రతకు ప్రమాదం ఉంది. 270 00:22:45,991 --> 00:22:48,243 శత్రువులు దాడి చేసే అవకాశం ఉంది. 271 00:22:49,036 --> 00:22:51,163 ముందు రాబోయే టన్నెల్ లోకి వెళ్లండి. 272 00:22:52,539 --> 00:22:54,541 - సర్? - ఆ ఆదేశాన్ని పాటించండి. 273 00:22:55,959 --> 00:22:57,085 అలాగే, సర్. 274 00:23:01,048 --> 00:23:01,965 నాకు చూపించండి. 275 00:23:03,634 --> 00:23:06,345 సర్, ట్రక్కులోని వాళ్లు మా కాల్స్ కి స్పందించట్లేదు. 276 00:23:06,428 --> 00:23:07,930 ట్రక్ దగ్గరికి ప్రత్యేక బలగాలు వెళ్తున్నాయి. 277 00:23:08,013 --> 00:23:09,723 సన్నాసులారా. 278 00:23:20,734 --> 00:23:21,735 ఇంకా వేగంగా పోనివ్వు. 279 00:23:38,961 --> 00:23:40,796 ట్రక్ టన్నెల్ లోకి వెళ్లింది. మాకు కనిపించట్లేదు. 280 00:23:41,755 --> 00:23:43,549 టన్నెల్ నుండి బయటకు వచ్చే దారి కనిపించట్లేదు. 281 00:23:44,049 --> 00:23:46,844 చూస్తుంటే, ఇది మధ్యలో ఆపేసిన రోడ్డు ప్రాజెక్టులా ఉంది. 282 00:23:46,927 --> 00:23:48,554 ట్రక్ ని ఓ కారు ఫాలో అవుతోంది. 283 00:24:06,029 --> 00:24:09,533 ఏంటి ఈ చెత్త? ఈ చోటు ఏదో తేడాగా ఉంది. 284 00:24:11,952 --> 00:24:13,328 కమాలికి కాల్ చేయ్. 285 00:24:14,496 --> 00:24:16,039 సిగ్నల్ లేదు. 286 00:24:29,845 --> 00:24:31,638 ఒక కారు వస్తోంది. దిగు! 287 00:24:45,068 --> 00:24:46,403 అక్కడ. 288 00:25:33,534 --> 00:25:35,285 హమ్మయ్య. 289 00:26:44,146 --> 00:26:45,522 తనకి కాల్ చేయి. 290 00:26:45,606 --> 00:26:47,941 నువ్వు మాటిచ్చినట్టుగా, నాహీద్ కి కాల్ చేయ్. 291 00:26:56,158 --> 00:26:57,367 ఇక్కడ సిగ్నల్ లేదు. 292 00:27:00,996 --> 00:27:04,249 - అది నాకు ఇవ్వు. - నేను ఓ కన్నేసి ఉంచుతాలే. 293 00:27:15,052 --> 00:27:17,513 అబ్బా, 12 నిమిషాల సమయం కూడా లేదు. 294 00:27:19,056 --> 00:27:20,557 త్వరగా నీ బ్యాగ్ తీసుకురా. 295 00:27:24,394 --> 00:27:25,771 మనం బాంబును కోల్పోకూడదు. 296 00:27:27,105 --> 00:27:29,191 ఆలీ, త్వరపడు. వైమానిక దళానికి కాల్ చేయ్. 297 00:27:38,283 --> 00:27:41,119 డ్రోన్లు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. లక్ష్యాన్ని పది నిమిషాల్లో చేరుకుంటాయి. 298 00:27:42,746 --> 00:27:44,665 సెపా, ఇప్పటికే బలగాలను ఆ ప్రదేశానికి పంపించేసింది. 299 00:27:44,748 --> 00:27:46,458 ఏదేమైనా, వాళ్లు ముందు అక్కడికి చేరుకోకూడదు. 300 00:27:46,542 --> 00:27:48,919 మనం డ్రోన్లను ఆ టన్నెల్ లోనికి పంపించాలి. 301 00:27:49,002 --> 00:27:50,546 ఇరాన్ వైమానిక దళం ఇప్పుడు హెలికాప్టర్లను పంపింది. 302 00:27:50,629 --> 00:27:52,339 మన డ్రోన్లు దొరికిపోతాయేమో అని ఆందోళనగా ఉంది. 303 00:27:52,422 --> 00:27:53,465 అబ్బా. 304 00:27:58,512 --> 00:28:00,556 సర్, హెలికాప్టర్ పయనమైంది. 305 00:28:03,559 --> 00:28:05,394 నేను టన్నెల్ ఎక్కి చూస్తా, నువ్వు అతని మీద ఓ కన్నేసి ఉంచుతావా? 306 00:28:05,477 --> 00:28:07,062 నా మీద నమ్మకం లేదా? 307 00:28:13,443 --> 00:28:16,321 సరే మరి. మనకి ఇప్పుడు తొమ్మిది నిమిషాలు ఉన్నాయి. నువ్వు చేయగలవు. 308 00:28:16,405 --> 00:28:19,575 ఫైరింగ్ సెట్ ని ట్రిప్ చేయకుండా సిస్టమ్ ని యాక్సెస్ చేయాలి, అది గుర్తుంచుకో. 309 00:28:19,658 --> 00:28:22,578 ప్రధాన యాక్సెస్ దక్కించుకున్నా. సెక్యూరిటీ ప్రోటోకాల్ ని చూస్తున్నా. 310 00:28:23,579 --> 00:28:26,707 అయ్యయ్యో. ఒక్క నిమిషం. సిస్టమ్, తనని తాను కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది. 311 00:28:26,790 --> 00:28:30,627 అంతర్గతంగా దాగి ఉన్న ఒక ప్రామాణీకరణ ప్రోటోకాల్, ఎనిమిది సెకన్లకు ఒకసారి ర్యాండమ్ గా రీసెట్ అయిపోతోంది. 312 00:28:32,045 --> 00:28:33,297 ఈ పని నువ్వు చేయగలవు. 313 00:28:36,091 --> 00:28:37,551 నువ్వు బైపాస్ ని కనుగొనగలవా? 314 00:28:38,343 --> 00:28:39,428 అంటే, నీకు తెలీదా? 315 00:28:40,012 --> 00:28:41,430 నాకు నీ అవసరం ఉంటుందని చెప్పా కదా. 316 00:28:50,480 --> 00:28:52,482 లక్ష్యాన్ని డ్రోన్స్ ఆరు నిమిషాల 15 సెకన్లలో చేరుకుంటాయి. 317 00:28:56,403 --> 00:28:58,906 డయాగ్నాస్టిక్ అప్ డేట్ కోసం నేనొక రిక్వెస్టును పంపగలను. 318 00:28:59,531 --> 00:29:01,491 కానీ దాన్ని నేను మాన్యువల్ గా పునరుద్ధరిస్తూ ఉండాలి, 319 00:29:01,575 --> 00:29:03,035 అంటే ఒక తప్పు జరిగినా… 320 00:29:03,118 --> 00:29:04,703 ఒక్క తప్పు కూడా చేయకు, తమార్. 321 00:29:05,287 --> 00:29:07,122 నా పని నేను చేయడానికి నాకు కాస్త సమయం ఉండేలా చేయ్, చాలు. 322 00:29:11,710 --> 00:29:13,462 మనం నగరాన్ని కాపాడాలంటే… 323 00:29:50,123 --> 00:29:51,250 నాహీద్. 324 00:29:51,792 --> 00:29:52,876 ఎక్కడ ఉన్నావు నువ్వు? 325 00:29:54,211 --> 00:29:56,004 ఫరాజ్… 326 00:29:56,088 --> 00:29:58,465 నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవాలనుకుంటున్నా నేను, అంతే. 327 00:30:01,802 --> 00:30:04,137 ఈ ఫోను ద్వారా నాకు కాల్ చేయనిచ్చిందా తను? 328 00:30:06,557 --> 00:30:08,225 ఇంకా నగరంలోనే ఉన్నావా? 329 00:30:08,934 --> 00:30:10,602 నేనెక్కడుంటే ఏంటి! 330 00:30:11,562 --> 00:30:12,855 నేను ఒక సురక్షితమైన చోట ఉన్నా. 331 00:30:13,689 --> 00:30:16,066 లేదు. నీకు ప్రమాదం ఉంది. 332 00:30:16,525 --> 00:30:18,569 ఫరాజ్, నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చే పని చేయకు. 333 00:30:19,695 --> 00:30:20,696 చూడు… 334 00:30:22,155 --> 00:30:24,449 నీ కోసం రాకుండా ఎలా ఉండగలను? 335 00:30:27,411 --> 00:30:28,871 నాహీద్, బంగారం. 336 00:30:28,954 --> 00:30:31,707 ఫరాజ్, చెప్పేది విను. 337 00:30:32,875 --> 00:30:34,501 నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. 338 00:30:35,878 --> 00:30:37,963 నాకొక దారి ఉండేది, 339 00:30:39,006 --> 00:30:41,258 ఇరాన్ లో ఉండటం, లేదా వెళ్లిపోవడం. 340 00:30:42,176 --> 00:30:44,136 నీకు కూడా ఒక దారి ఉండేది. 341 00:30:46,513 --> 00:30:48,473 ఇరానా, నేనా అని. 342 00:30:48,557 --> 00:30:51,560 నిన్ను, అలాగే ఇరాన్ ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నా నేను. 343 00:30:57,316 --> 00:31:01,278 నువ్వు నాకు ఇవ్వలేని విషయాన్ని నిన్ను అడిగి ఉండాల్సింది కాదు. 344 00:31:02,237 --> 00:31:03,739 కాబట్టి, 345 00:31:04,656 --> 00:31:06,033 ఇక నుండి, నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో. 346 00:31:06,116 --> 00:31:07,034 నాహీద్. 347 00:31:11,205 --> 00:31:12,539 ఫరాజ్. 348 00:31:17,961 --> 00:31:20,005 ఆ శబ్దం వినిపిస్తోందా, ఫరాజ్? 349 00:31:20,088 --> 00:31:21,089 వాళ్లు వస్తున్నారు. 350 00:31:21,673 --> 00:31:24,676 ఈ తతంగంలో నీ పాత్ర ఏదైనా కానీ, అది ఇక ముగిసినట్టే. 351 00:31:24,760 --> 00:31:26,428 వీళ్లు ఉగ్రవాదులు. 352 00:31:28,764 --> 00:31:30,432 ఈ నగరాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. 353 00:31:31,183 --> 00:31:32,684 నీ సోది ఇక కట్టిపెట్టు, జనరల్. 354 00:31:32,768 --> 00:31:34,102 నాతో వాదులాడకు! 355 00:31:34,478 --> 00:31:35,979 ఉన్న చోట నుండి కదలకు. 356 00:31:36,063 --> 00:31:37,189 మనం వాళ్లని ఆపాలి. 357 00:31:37,272 --> 00:31:38,482 నన్ను కాల్చు… 358 00:31:39,983 --> 00:31:41,193 లేదా నాకు సాయం చేయ్. 359 00:31:43,237 --> 00:31:44,363 కదలవద్దు అని అన్నానా! 360 00:31:51,578 --> 00:31:55,249 సరే మరి, నువ్వు త్వరగా వెళ్లిపో. మనకి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది. 361 00:31:58,669 --> 00:31:59,670 ఫరాజ్! 362 00:32:02,130 --> 00:32:03,215 ఫరాజ్! 363 00:32:04,174 --> 00:32:05,676 ఫరాజ్, ఏమైనా జరగరానిది జరిగిందా? 364 00:32:06,844 --> 00:32:08,595 ఫరాజ్, నా మాటలు వినిపిస్తున్నాయా? 365 00:32:09,388 --> 00:32:10,681 ఐ లవ్ యూ. 366 00:32:33,912 --> 00:32:36,498 నేను స్వార్డ్ నుండి మాట్లాడుతున్నా. లక్ష్యం వైపు వెళ్తున్నా. 367 00:32:36,582 --> 00:32:38,208 డ్రోన్లు అయిదు నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంటాయి. 368 00:32:38,792 --> 00:32:40,127 సెపా వాళ్లు సమీపిస్తున్నారు… 369 00:33:16,288 --> 00:33:18,498 బలగాలన్నీ ఇంకొన్ని నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటాయి. 370 00:33:22,252 --> 00:33:23,378 పని అయిందా? 371 00:33:24,129 --> 00:33:26,882 మీరు చేసిన ఈ పనికి మిమ్మల్ని వదిలేస్తానని అనుకున్నారా? 372 00:33:28,091 --> 00:33:29,343 పని అయిందా? 373 00:33:32,596 --> 00:33:35,974 అయిపోవచ్చింది. పేలుడును ఆపడానికి మాకు ఇంకాస్త ఎక్కువ సమయం కావాలి. 374 00:33:36,558 --> 00:33:38,143 నన్ను మోసగించాలని చూస్తున్నారా? 375 00:33:39,061 --> 00:33:40,729 ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? 376 00:33:42,564 --> 00:33:43,565 లేదు. 377 00:33:44,316 --> 00:33:47,027 చూడు, ఇంకా ఒక ప్రోటోకాల్ ని బైపాస్ చేస్తే సరిపోతుంది. 378 00:33:47,611 --> 00:33:48,695 సరేనా? ఒక్కటే ఉంది. 379 00:33:48,779 --> 00:33:50,781 ఆ తర్వాత నీ బాంబును నువ్వే తీసుకెళ్లు. 380 00:33:53,450 --> 00:33:54,618 అయితే ఆ పని చేయండి. 381 00:33:55,369 --> 00:33:57,663 మీకు జనాలంటే ప్రాణం కదా, వాళ్ల కోసం చేసి చావండి. 382 00:34:00,707 --> 00:34:01,959 మధ్యాహ్నం కావస్తోంది. 383 00:34:18,976 --> 00:34:20,811 కానీ ముందు, నువ్వు తనని వదిలేయాలి. 384 00:34:22,728 --> 00:34:26,315 తనని వదిలేయ్, లేదంటే నేను పేలుడును ఆపను, మనందరం చస్తాం. 385 00:34:26,942 --> 00:34:28,277 ఈ పనిని నేను ఒక్కడినే చేయగలను. 386 00:34:29,610 --> 00:34:32,906 తనని వదిలేయ్, నీ విలువైన బాంబు నీకే ఇచ్చేస్తా. 387 00:34:36,952 --> 00:34:37,995 వెళ్లు. 388 00:34:43,667 --> 00:34:46,420 నా కూతురి ఆచూకీ కనిపెడతావు, కదా? 389 00:34:48,130 --> 00:34:50,007 ఇక్కడేం జరిగిందో తనకి చెప్పు. 390 00:34:51,300 --> 00:34:52,885 నిజంగా జరిగిందేంటో చెప్పు. 391 00:35:08,275 --> 00:35:09,943 నువ్వు చేసిన ఈ పనికి తప్పించుకోలేవు. 392 00:35:10,027 --> 00:35:10,861 అర్థమైందా? 393 00:35:11,361 --> 00:35:13,071 నువ్వు ప్రాణాలతో బయటపడలేవు. 394 00:35:15,741 --> 00:35:16,575 ఇక వెళ్లిపో! 395 00:35:30,756 --> 00:35:31,798 కానివ్వు. 396 00:35:32,299 --> 00:35:34,551 త్వరగా కానివ్వు. సమయం మించిపోతోంది. 397 00:35:59,910 --> 00:36:01,995 - ఏం జరిగింది? - సెపా వాళ్లు వచ్చేశారు. 398 00:36:03,789 --> 00:36:05,040 నాకు బయటకు వెళ్లే దారి తెలుసు. 399 00:36:17,010 --> 00:36:18,220 మరి, తర్వాత ఏం జరుగుతుంది? 400 00:36:19,638 --> 00:36:23,225 నువ్వు ఆయుధాన్ని కాపాడి, మీ హీరో పేరును కాపాడుతావన్నమాట. 401 00:36:24,726 --> 00:36:26,311 అది పని చేస్తుందంటావా? 402 00:36:26,854 --> 00:36:30,148 టీమ్ ఏ, టీమ్ ఏ, టన్నెల్ ప్రవేశ మార్గం వద్దకు జాగ్రత్తగా వెళ్లండి. 403 00:36:30,232 --> 00:36:31,775 నీకు అర్థం కాదులే. 404 00:36:32,776 --> 00:36:34,111 నేను చేసేది నా కోసం కాదు. 405 00:36:34,987 --> 00:36:36,655 నా దేశం కోసం చేస్తున్నాను. 406 00:36:37,197 --> 00:36:38,740 టీమ్ బీ, ఓ కన్నేసి ఉంచండి. 407 00:36:39,241 --> 00:36:40,325 అర్థమైందా? 408 00:36:41,285 --> 00:36:44,621 నేను అన్నింటి కన్నా ఇరాన్ కే తొలి ప్రాధాన్యత ఇస్తాను. 409 00:36:46,832 --> 00:36:47,875 నిజంగానా? 410 00:36:53,130 --> 00:36:54,673 లక్ష్యాన్ని డ్రోన్లు 90 సెకన్లలో చేరుకుంటాయి. 411 00:36:56,258 --> 00:36:58,594 నీ భార్య నాహీద్ కన్నానా? 412 00:37:05,017 --> 00:37:06,435 విషయం ఏంటంటే, తమార్ కి తెలుసు. 413 00:37:07,519 --> 00:37:10,606 ఆమెతో మాట్లాడాలంటే, నువ్వు టన్నెల్ నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుందని తమార్ కి తెలుసు. 414 00:37:10,689 --> 00:37:12,024 ఏమంటున్నావు నువ్వు? 415 00:37:14,067 --> 00:37:15,444 పని అయిపోయింది. 416 00:37:17,070 --> 00:37:18,030 ఏం చేస్తున్నావు నువ్వు? 417 00:37:23,202 --> 00:37:25,579 ఆ అవకాశం మాకు మళ్లీ రాదని తనకి తెలుసు. 418 00:37:28,040 --> 00:37:29,625 నీ చేతిని ఇలా ఇవ్వు. 419 00:37:29,708 --> 00:37:30,834 ఎక్కు. 420 00:37:34,796 --> 00:37:36,131 బాగానే ఉన్నావా? 421 00:37:43,680 --> 00:37:46,183 పద. 30 సెకన్లలో మనం బయటపడాలి. 422 00:37:59,780 --> 00:38:01,573 లక్ష్యాన్ని 20 సెకన్లలో చేరుకుంటాను. 423 00:38:03,951 --> 00:38:05,369 మొదటి బృందం లోపలికి వెళ్తోంది. 424 00:38:10,624 --> 00:38:13,293 "విధికి ఎవరైనా తలవంచాల్సిందే కదా?" 425 00:38:20,217 --> 00:38:21,260 ఏం చేశావు నువ్వు? 426 00:38:21,885 --> 00:38:23,387 మనిద్దరికీ ఏది మంచిదో, అదే చేశా. 427 00:38:41,113 --> 00:38:42,281 అది… 428 00:38:43,115 --> 00:38:45,409 మామూలు బాంబే. అణు బాంబు కాదు. 429 00:39:17,024 --> 00:39:18,692 అది కోరా? 430 00:39:20,027 --> 00:39:21,612 మేము దీన్ని బయటకు తీసేశాం. 431 00:39:41,215 --> 00:39:42,424 యులియా, 432 00:39:43,175 --> 00:39:44,593 నా దగ్గర కోర్ ఉంది. 433 00:39:48,305 --> 00:39:49,598 తను సాధించింది. 434 00:40:03,445 --> 00:40:04,613 ఇప్పుడు మనమేం చేయాలి? 435 00:40:11,036 --> 00:40:12,329 ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 436 00:42:03,815 --> 00:42:05,817 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్