1 00:00:13,055 --> 00:00:16,099 ఈ సిరీసులోని పాత్రలు, సంఘటనలు అన్నీ కల్పితాలే. 2 00:00:16,183 --> 00:00:18,769 నిజ ఘటనలను/వ్యక్తులను పోలి ఉంటే, 3 00:00:18,852 --> 00:00:19,937 అది యాధృచికమే. 4 00:00:25,776 --> 00:00:28,070 నా మనుషుల చేత షపరక్ ని ఫాలో చేయించాను. 5 00:00:28,570 --> 00:00:30,030 నువ్వు మొసాద్ ఏజెంటువి కదా? 6 00:00:32,323 --> 00:00:34,034 కమాలికి నీ చావు కావాలట. 7 00:00:36,537 --> 00:00:37,996 ఇప్పుడు మనిద్దరి సమస్య ఒకటే. 8 00:00:40,290 --> 00:00:41,583 ఏంటి ఆ సమస్య? 9 00:00:41,667 --> 00:00:42,960 పీటర్సన్. 10 00:00:44,127 --> 00:00:45,587 నేను సరఫరా చేసిన విడిభాగాలను 11 00:00:45,671 --> 00:00:48,090 నా భాగస్వాములు పనికి రాకుండా చేశారు, కానీ వాళ్లు అతడిని లెక్కలోకి తీసుకోలేదు. 12 00:00:49,216 --> 00:00:50,342 నీ భాగస్వాములా? 13 00:00:52,094 --> 00:00:53,136 సీఐఏ. 14 00:00:57,683 --> 00:00:59,268 ఈ విషయంలో మనిద్దరిదీ ఒకే పక్షం. 15 00:01:05,147 --> 00:01:07,693 ఐ.ఆర్.జీ.సీ నిఘా శాఖ ప్రధాన కార్యాలయం, టెహ్రాన్ 16 00:01:11,488 --> 00:01:12,739 కుట్రనా? 17 00:01:15,325 --> 00:01:16,952 పీటర్సన్ కి మనం యాక్సెస్ ఇస్తే తప్ప, 18 00:01:17,035 --> 00:01:19,162 అతను సమస్య ఏంటో వివరించలేడా? 19 00:01:21,123 --> 00:01:22,457 మనం యాక్సెస్ ఇవ్వాలట, లేకపోతే ఏమీ చేయలేడట. 20 00:01:23,166 --> 00:01:24,293 నీకేం అనిపిస్తోంది? 21 00:01:24,793 --> 00:01:26,795 పీటర్సన్ ని మనం నమ్మవచ్చా? 22 00:01:27,713 --> 00:01:30,507 అబద్ధమాడితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. 23 00:01:36,680 --> 00:01:38,849 అతనికి కావాల్సింది ఇచ్చేయండి, 24 00:01:39,850 --> 00:01:42,352 ఎప్పుడూ తన పక్కనే ఉండమని ముసావీకి చెప్పు. 25 00:01:42,436 --> 00:01:44,188 ఇద్దరి మీదా ఓ కన్నేసి ఉంచు. 26 00:01:47,774 --> 00:01:49,526 మనం కలలు కన్న రోజు దగ్గర్లోనే ఉంది, ఫరాజ్. 27 00:01:50,194 --> 00:01:52,446 దానికి ఎవరు అడ్డు వచ్చినా నేను సహించను. 28 00:01:54,031 --> 00:01:55,324 పరీక్ష జరగాల్సిందే. 29 00:01:59,870 --> 00:02:02,331 ఒకే ఒక్క బాణం ముగ్గురిని చంపగలదని 30 00:02:03,165 --> 00:02:05,959 మనకి ప్రవక్త చెప్పారు. 31 00:02:08,127 --> 00:02:13,091 ఆ బాణాన్ని చేసిన వాడిని, దాన్ని యుద్ధభూమిలోకి తెచ్చిన వాడిని… 32 00:02:16,428 --> 00:02:18,472 దాన్ని సంధించిన వాడిని. 33 00:03:39,052 --> 00:03:41,180 నిన్ను ఇంతకుముందు చూశాను. 34 00:03:42,181 --> 00:03:43,640 లేదు. 35 00:03:43,724 --> 00:03:45,684 మా ఇంటికి వచ్చింది నువ్వే. 36 00:03:46,810 --> 00:03:49,104 నా భర్తని నా కళ్ల ముందు చంపింది నువ్వే! 37 00:03:49,188 --> 00:03:50,230 నోర్మూసుకో! 38 00:03:57,863 --> 00:03:59,740 నన్ను చంపి ఉండవచ్చు కదా? 39 00:03:59,823 --> 00:04:01,491 ఆయన్ని ఎందుకు చంపావు? 40 00:04:08,874 --> 00:04:11,668 అరవకు. అరవకు, తల్లీ. 41 00:04:14,922 --> 00:04:16,798 అతను చెప్పిన దాన్ని లాంగ్లీ వాళ్లు నిర్ధారించారు. 42 00:04:17,382 --> 00:04:19,718 అతను దొంగచాటుగా రవాణా చేసిన ఫైరింగ్ సెట్ లోని సర్క్యూట్ బోర్డుపై, 43 00:04:19,801 --> 00:04:22,638 గుర్తించడానికి వీలుపడని ఒక సరికొత్త వైరస్ ని వాళ్లు పెట్టారు. 44 00:04:24,264 --> 00:04:27,518 ఆయుధం సిద్ధంగా ఉండి, దానిలోకి ఫైరింగ్ సెట్ ని అమర్చినప్పుడు, ఆ వైరస్ ఆయుధాన్ని నాశనం చేస్తుంది. 45 00:04:27,976 --> 00:04:30,103 కానీ ఇందులో పీటర్సన్ కూడా భాగమని వారు ఊహించలేదు. 46 00:04:35,442 --> 00:04:37,069 దాన్ని నౌరీ ఇప్పటికే తెరిచి చూసింది. 47 00:04:37,945 --> 00:04:39,696 దాన్ని తను పీటర్సన్ కి చూపి ఉంటుందా? 48 00:04:39,780 --> 00:04:41,949 - కనుక, ఎక్కడో ఏదో తేడాగా ఉందని అతనికి తెలుసా? - తెలిసి ఉండవచ్చు. 49 00:04:42,032 --> 00:04:43,867 ఇరాన్ వాళ్లకి ఆ విడిభాగం మామూలుగానే కనిపిస్తుంది, 50 00:04:43,951 --> 00:04:46,954 కానీ ప్రావీణ్యం, అనుభవం రెండూ ఉన్న బయటి వ్యక్తికి, పైగా హెచ్చరించబడిన వ్యక్తికి… 51 00:04:47,371 --> 00:04:49,122 అతను దాన్ని ఇంకా కనుక్కోకుండా ఉండే అవకాశమేమైనా ఉందా? 52 00:04:49,206 --> 00:04:50,832 అవకాశం అయితే ఉంది. కోడ్ బాగా దాగి ఉంటుంది. 53 00:04:50,916 --> 00:04:52,709 దాన్ని కనిపెట్టాలంటే, అతనికి సిస్టమ్ కి యాక్సెస్ కావాలి, 54 00:04:52,793 --> 00:04:54,002 దక్కినా, కనిపెట్టడానికి సమయం పడుతుంది. 55 00:04:54,503 --> 00:04:57,381 జాగ్రత్తగా వినండి, నౌరీ, అండిషేహ్ ఇన్స్టిట్యూట్ లోని ఒక రహస్య పరిశోధనా విభాగంలో పని చేస్తుంది, 56 00:04:57,464 --> 00:04:59,299 నేరుగా ల్యాబ్ నుండి డౌన్ లోడ్ చేయబడిన బాంబు విడిభాగాలని 57 00:04:59,383 --> 00:05:00,968 ఆ విభాగం విశ్లేషిస్తుంది. 58 00:05:01,051 --> 00:05:04,721 లాంగ్లీ వాళ్లతో మాట్లాడి, ఘసేమీతో నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్లేలా ఏర్పాటు చేశాం. 59 00:05:04,805 --> 00:05:06,348 బయట ఎవరూ లేరు కదా? 60 00:05:07,599 --> 00:05:10,435 సరే, నౌరీ యాక్సెస్ ని ఉపయోగించి, ఫైరింగ్ సెట్ లో ఒక మాల్వేర్ ని ప్లాంట్ చేస్తాను. 61 00:05:11,061 --> 00:05:13,146 పీటర్సన్ కి మాల్వేర్ కనబడకుండా చేయడానికి, నాకు సప్రెషన్ కోడ్ ని పంపండి. 62 00:05:13,230 --> 00:05:14,147 అలాగే. 63 00:05:14,523 --> 00:05:15,858 మీరు త్వరగా కానివ్వాలి. 64 00:05:16,358 --> 00:05:17,818 ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే దక్కుతుంది. 65 00:05:18,402 --> 00:05:20,153 సరే. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. 66 00:05:20,904 --> 00:05:23,031 నన్ను నిజంగా అండిషేహ్ ఇన్స్టిట్యూట్ లోపలికి తీసుకెళ్లగలవా? 67 00:05:25,117 --> 00:05:26,702 అది సులభం కాదు కానీ, అసాధ్యమైతే కాదులే. 68 00:05:28,745 --> 00:05:30,205 నాకు ఇది నచ్చట్లేదు. 69 00:05:30,706 --> 00:05:31,957 ఆఫీసు నుండి ఆదేశం వచ్చింది మరి. 70 00:05:33,750 --> 00:05:35,002 నువ్వు ఇక్కడ తనతో ఉంటావా? 71 00:05:38,839 --> 00:05:40,174 నువ్వు బట్టలు మార్చుకోవాలి… 72 00:05:42,009 --> 00:05:43,177 తల కూడా దువ్వుకో. 73 00:06:57,668 --> 00:06:58,919 అంతా ఓకేనా? 74 00:06:59,586 --> 00:07:01,380 ఈ మనుషులని ఎప్పుడు పంపించేస్తావు? 75 00:07:02,798 --> 00:07:06,218 బంగారం, వాళ్లు అక్కడ ఉండేది, నీ రక్షణకే. 76 00:07:08,136 --> 00:07:09,137 అయితే, ఎప్పుడూ వాళ్లిక్కడే ఉంటారా? 77 00:07:10,639 --> 00:07:16,436 త్వరలోనే ఇదంతా ముగిసిపోతుంది. మళ్లీ స్వేచ్ఛగా మనం బయటకు వెళ్లగలం. 78 00:07:18,105 --> 00:07:23,861 నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలం. రెస్టారెంట్లకు, షాపింగ్ కి, అన్ని చోట్లకూ అన్నమాట. 79 00:07:25,487 --> 00:07:26,822 అప్పటి దాకా? 80 00:07:27,406 --> 00:07:30,242 అప్పటి దాకా మనం జాగ్రత్తగా ఉండాలి. 81 00:07:35,581 --> 00:07:38,500 - అర్థమైంది. - నిజంగా? 82 00:07:40,586 --> 00:07:41,795 హా, అర్థమైంది. 83 00:07:43,213 --> 00:07:44,214 సరే. 84 00:07:46,091 --> 00:07:49,094 సరే, నేను ఉంటా మరి. నాకు పని ఉంది. సరేనా? 85 00:07:49,720 --> 00:07:50,554 ఉండు. 86 00:07:58,437 --> 00:08:00,689 బెహ్రూజ్ జనాతీ, లెఫ్టినెంట్ కల్నల్ 87 00:08:15,412 --> 00:08:16,413 సారా. 88 00:08:17,664 --> 00:08:19,124 అసలు ఎవరు నువ్వు? 89 00:08:21,627 --> 00:08:23,629 సరే. 90 00:08:24,671 --> 00:08:26,340 కనీసం నీ అసలు పేరైనా చెప్పు. 91 00:08:29,343 --> 00:08:30,594 నువ్వు సీఐఏ దగ్గర పని చేస్తావా? 92 00:08:32,304 --> 00:08:34,056 లేదు, నేను ఎవరి దగ్గరా పని చేయను. 93 00:08:34,556 --> 00:08:36,099 కానీ నేను వాళ్లతో పని చేస్తాను. 94 00:08:37,267 --> 00:08:39,019 అంటే, నేను ఏమైనా చేస్తా అన్నమాట… 95 00:08:40,102 --> 00:08:42,940 ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి. 96 00:08:43,607 --> 00:08:45,901 ఆ విషయంలో నాకు ఎక్కడి నుండి సాయం అందినా, ఆ… 97 00:08:49,947 --> 00:08:53,659 ఇప్పుడు చూడు, మనిద్దరమే ఉన్నాం. 98 00:09:06,505 --> 00:09:08,715 అండిషేహ్ పరిశోధన కేంద్రం 99 00:09:16,932 --> 00:09:18,100 నీ మనిషి సంగతేంటి? 100 00:09:18,183 --> 00:09:19,560 అతను త్వరలోనే ఇక్కడికి వస్తాడు. 101 00:10:08,317 --> 00:10:09,276 చెప్పు. 102 00:10:09,359 --> 00:10:11,195 మిషన్ అయిపోయాక, నౌరీని ఏం చేయాలి? 103 00:10:17,159 --> 00:10:18,660 దానికి సమాధానం ఏంటో నీకు తెలుసు. 104 00:10:20,662 --> 00:10:21,747 తను చాలా చూసేసింది. 105 00:10:24,374 --> 00:10:27,336 ఏడేళ్ల క్రిందటే, తన భర్తను చంపినప్పుడే, తనని కూడా నువ్వు చంపి ఉండాల్సింది. 106 00:10:33,300 --> 00:10:35,636 తనని చంపకుండా నువ్వు ఆదేశాలను ధిక్కరించావు. 107 00:10:39,932 --> 00:10:42,935 ఒక విషయం. ఈ మిషన్ తర్వాత, నేను మానేస్తున్నాను. 108 00:11:02,246 --> 00:11:03,413 చెప్పండి. 109 00:11:03,872 --> 00:11:04,998 నేనే. 110 00:11:05,374 --> 00:11:07,543 ఎలా ఉన్నారు, మిసెస్ కమాలి? 111 00:11:07,626 --> 00:11:09,503 మీరు బాగానే ఉన్నారా? ఇప్పుడు పర్వాలేదా? 112 00:11:10,629 --> 00:11:12,422 మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. 113 00:11:13,674 --> 00:11:15,175 కానీ మీరే వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. 114 00:11:17,135 --> 00:11:19,221 సరే. అలాగే. 115 00:11:19,304 --> 00:11:20,764 నేను వస్తాను. 116 00:11:22,015 --> 00:11:23,392 సరే. 117 00:11:52,045 --> 00:11:54,631 మీరు నా పర్యవేక్షణలో ఉంటారు. 118 00:11:55,883 --> 00:11:57,509 నాకేం పర్వాలేదు. 119 00:12:09,730 --> 00:12:10,731 ఇక్కడే ఉండండి, డాక్టర్. 120 00:12:51,939 --> 00:12:53,815 మిమ్మల్ని కన్సోల్ దగ్గరికి తీసుకెళ్తాను, డాక్టర్. 121 00:13:16,755 --> 00:13:18,549 థ్యాంక్యూ. అలాగే. 122 00:13:18,632 --> 00:13:19,883 పర్వాలేదు. 123 00:13:21,677 --> 00:13:22,678 థ్యాంక్యూ. 124 00:13:24,888 --> 00:13:28,225 ఇంతకీ మీరు దేని కోసం వెతుకుతున్నారు? 125 00:13:30,227 --> 00:13:31,228 నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. 126 00:13:31,728 --> 00:13:32,729 ప్రస్తుతానికి. 127 00:13:38,402 --> 00:13:39,570 డేటా బదిలీ పోర్టల్ 128 00:13:39,653 --> 00:13:41,280 ఈ కంప్యూటరును అనుమతి ఉన్న యూజర్లే ఉపయోగించగలరు 129 00:13:51,039 --> 00:13:52,833 అండిషేహ్ పరిశోధన కేంద్రం టెహ్రాన్ 130 00:13:56,003 --> 00:13:57,004 వెళ్దాం పద. 131 00:14:05,220 --> 00:14:06,847 దీనితో తలుపులన్నింటినీ తెరవవచ్చు. 132 00:14:06,930 --> 00:14:08,473 - అటు వెళ్లండి. - థ్యాంక్స్. 133 00:14:30,412 --> 00:14:33,123 మనం మూడవ అంతస్థుకు వెళ్లాలి. కానీ గార్డులు చాలా మంది ఉన్నారు. 134 00:14:33,207 --> 00:14:34,041 మేము వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం 135 00:14:34,124 --> 00:14:35,459 తెలుసు. 136 00:14:59,233 --> 00:15:00,359 త్వరపడండి. 137 00:15:09,952 --> 00:15:11,620 గార్డ్, భవనంలో మంటలు చెలరేగుతున్నాయి. 138 00:15:11,703 --> 00:15:13,121 భవనం నుండి అందరూ బయటకు వచ్చేలా చూసుకో. 139 00:15:13,205 --> 00:15:15,123 బేస్మెంటుకు, గ్రౌండ్ ఫ్లోరుకు వెళ్లి చూడు. 140 00:15:15,207 --> 00:15:17,334 అక్కడ చాలా మంది ఉన్నారు. ల్యాబ్ కి కూడా వెళ్లి చూడు. 141 00:15:53,871 --> 00:15:56,081 త్వరగా వెళ్లండి. భవనానికి మంటలు అంటుకున్నాయి. 142 00:15:56,164 --> 00:15:57,708 దయచేసి నాతో రండి. భవనానికి మంటలు అంటుకున్నాయి. 143 00:15:57,791 --> 00:16:00,002 దయచేసి, భవనం నుండి వీలైనంత త్వరగా బయటకు వెళ్లండి! 144 00:16:00,085 --> 00:16:01,670 త్వరపడండి. త్వరగా కానివ్వండి! 145 00:16:07,259 --> 00:16:09,052 ఇప్పుడైనా నీ పేరు చెప్తావా? 146 00:16:11,263 --> 00:16:12,973 చెప్పకపోయినా నీకు పర్లేదనుకుంటా. 147 00:16:13,473 --> 00:16:15,392 - నాకు పర్లేదని అనుకుంటున్నావా? - వెళ్దాం రా. 148 00:16:34,703 --> 00:16:36,038 మనకి ఎక్కువ సమయం లేదు. 149 00:16:44,213 --> 00:16:46,089 అండిషేహ్ కేంద్రంలో అగ్నిప్రమాదం 150 00:16:48,050 --> 00:16:49,134 తను లోపలికి వెళ్లింది. 151 00:16:49,676 --> 00:16:51,178 వాళ్లు తొందరగానే మంటలను ఆర్పేస్తారు. 152 00:16:51,261 --> 00:16:52,179 సప్రెషన్ కోడ్ సిద్ధంగా ఉందా? 153 00:16:52,262 --> 00:16:54,139 తను డౌన్ లోడ్ మొదలుపెట్టగానే, పంపించేస్తాం. 154 00:16:54,973 --> 00:16:56,642 పీటర్సన్ కూతురి ఫోన్ నుండి మనకి సమాచారం దొరికింది. 155 00:17:00,270 --> 00:17:02,940 అతను ఇన్ని వాయిస్ మెయిళ్లను పంపాడా? 156 00:17:03,023 --> 00:17:05,192 మొత్తం 38 ఉన్నాయి. ఆమె ఒక్కదాన్ని కూడా వినలేదు. 157 00:17:05,733 --> 00:17:06,984 ఆమె అతనితో మాట్లాడట్లేదా? 158 00:17:07,069 --> 00:17:09,238 తన మాజీ భార్య క్యాన్సరుతో చనిపోయినప్పుడు, అతను టెహ్రాన్ లో పని చేస్తున్నాడు. 159 00:17:09,695 --> 00:17:11,448 మరణ ధృవీకరణ పత్రంపై తన కూతురు సంతకం చేయాల్సి వచ్చింది. 160 00:17:13,909 --> 00:17:15,702 ఆమె ఫోన్ ని ట్యాప్ చేసే ఉంచు. 161 00:17:22,376 --> 00:17:24,795 దిగుబడిలో ఉన్న సమస్యకి కారణం 162 00:17:24,877 --> 00:17:28,841 సాఫ్ట్ వేరులోని సమస్యే అయితే, అది మనకి ఇక్కడ తెలుస్తుంది. 163 00:17:28,924 --> 00:17:30,801 ఇక్కడ ఫైల్స్ వేల సంఖ్యలో ఉన్నాయి. 164 00:17:31,301 --> 00:17:32,511 అవును. 165 00:17:33,470 --> 00:17:35,597 నేను ప్రతి దాన్ని చెక్ చేయాలి. 166 00:17:38,976 --> 00:17:41,812 ఇది రా డేటా. పరికరాన్నంతటినీ ఇదే నియంత్రిస్తుంది. 167 00:17:41,895 --> 00:17:43,188 మీరు ఒక్క తప్పు చేసినా… 168 00:17:43,272 --> 00:17:44,648 పేలుడు సంభవించే అవకాశం ఉంది. 169 00:17:44,731 --> 00:17:47,234 లేదా విడిభాగం అంతా పనికి రాకుండా పోవచ్చు. 170 00:17:48,527 --> 00:17:53,031 అప్పుడు, ఈ ఫరాజ్ కమాలి నన్ను ఆనందంగా ఉరి తీసుకోవచ్చు. 171 00:17:57,452 --> 00:18:01,164 మీకు ఒకటి గుర్తు చేస్తాను, నేను కోరాను కాబట్టి షపరక్ నౌరీ ఈ పరీక్షలను జరిపింది. జరపకుండా ఉంటే, 172 00:18:01,248 --> 00:18:03,959 అసలు సమస్య ఉందనే విషయమే మనకి తెలిసి ఉండేది కాదు. 173 00:18:09,173 --> 00:18:10,340 కొనసాగించండి. 174 00:18:31,695 --> 00:18:34,740 సయ్యద్, ఎలా ఉన్నావు? ఇక్కడ చాలా బాగా పని చేస్తున్నావు. 175 00:18:35,782 --> 00:18:37,951 మిసెస్ కమాలిని పికప్ చేసుకోవడానికి వచ్చాను. 176 00:18:38,452 --> 00:18:40,204 దాని గురించి మాకు ఏ సమాచారమూ అందలేదు. 177 00:18:40,287 --> 00:18:42,789 నన్ను నేరుగా జనరల్ కమాలి గారే ఆదేశించారు. 178 00:18:44,041 --> 00:18:49,129 తన భార్య మానసిక పరిస్థితి గురించి ఆయనకి ఆందోళనగా ఉంది. 179 00:18:49,213 --> 00:18:53,258 ఆమెని ఒక అత్యవసర పని మీద కొన్ని గంటలు బయటకు తీసుకెళ్లి, మళ్లీ దింపేస్తాను. అంతే. 180 00:18:57,221 --> 00:19:00,849 ఒకటి చెప్పనా, నువ్వే ఆయనకి నీ రేడియా ద్వారా కాల్ చేసి, కనుక్కో. 181 00:19:02,017 --> 00:19:03,393 కానీ ఒక విషయం తెలుసుకో, 182 00:19:03,477 --> 00:19:08,524 ఇది ఎంత సున్నితమైన అంశం అంటే, నేనే ఆయనకి కాల్ చేసే ధైర్యం చేయలేను. 183 00:19:09,191 --> 00:19:11,360 కానీ నీకు బాగా తెలుసు కదా. 184 00:19:16,240 --> 00:19:17,533 సరే, వెళ్లండి. 185 00:19:20,077 --> 00:19:22,996 మంచి పని చేశావు. జనరల్ కి నీ గురించి మంచి మాటలు చెప్తాలే. 186 00:19:37,553 --> 00:19:40,347 మిసెస్ కమాలి. మీ కోసం జనరల్ ఎదురు చూస్తున్నారు. 187 00:19:43,058 --> 00:19:46,520 థ్యాంక్యూ, మిస్టర్ జనాతీ. ఒక నిమిషం ఆగండి. 188 00:20:18,051 --> 00:20:20,179 మీరు సరైన పనే చేస్తున్నారు. 189 00:20:20,888 --> 00:20:22,806 మీ ఇంటి దగ్గర నేను ఒకడిని కాల్చాను కదా, 190 00:20:22,890 --> 00:20:24,641 అతను మొసాద్ ఏజెంట్ అని నాకనిపిస్తోంది. 191 00:20:30,397 --> 00:20:31,899 పార్క్ వైపు నుండి వెళ్లండి. 192 00:20:33,567 --> 00:20:36,403 ఆ దారిలో వేగంగా వెళ్లవచ్చని ఫరాజ్ అంటుంటాడు. 193 00:20:36,486 --> 00:20:38,155 ఆయన ఎప్పుడూ ఆ దారిలోనే వెళ్తాడు. 194 00:20:55,923 --> 00:20:56,840 త్వరగా కానివ్వు. 195 00:21:01,803 --> 00:21:03,305 కనెక్ట్ అయింది. 196 00:21:09,394 --> 00:21:10,395 నేను యాక్సెస్ సంపాదించా. 197 00:21:12,022 --> 00:21:14,024 ఇప్పుడు డౌన్ లోడ్ కోసం అభ్యర్థిస్తా, ఆ తర్వాత మనం మొదలుపెట్టవచ్చు. 198 00:21:21,073 --> 00:21:22,282 అనుమతించమని అభ్యర్థన పంపడమైంది… 199 00:21:22,533 --> 00:21:24,034 డేటాను యాక్సెస్ చేయడానికి అభ్యర్థన యూజర్ ఐడీ 3974 200 00:21:25,577 --> 00:21:27,996 అడ్మిన్ అనుమతి అవసరం 201 00:21:28,080 --> 00:21:29,164 ఏంటది? 202 00:21:29,998 --> 00:21:32,876 అండిషేహ్ ఇన్స్టిట్యూట్ నుండి యాక్సెస్ కి అభర్థన వచ్చింది. 203 00:21:32,960 --> 00:21:34,211 ఎవరి నుండి? 204 00:21:34,294 --> 00:21:35,629 యూజర్ ఐడీ 3974 205 00:21:37,005 --> 00:21:38,298 షపరక్. 206 00:21:46,098 --> 00:21:48,267 నాకు అండిషేహ్ చిరునామా పంపించండి. 207 00:21:49,434 --> 00:21:50,477 వెంటనే. 208 00:21:58,193 --> 00:22:00,779 రాజ్మండేగన్ పార్క్. మసూద్ అబ్బాసీ. మీరు విదేశాలకు వెళ్లడానికి దారి. 209 00:22:10,038 --> 00:22:11,707 మనం వేరే దారిలో వెళ్లి ఉండాల్సింది. 210 00:22:14,334 --> 00:22:19,673 మీ భర్త, తనకి అన్నీ బాగా తెలుసు అనుకుంటున్నట్టున్నాడు, కదా? 211 00:22:24,595 --> 00:22:25,721 ఏమైనా సమస్య ఉందా? 212 00:22:26,513 --> 00:22:27,431 లేదు. 213 00:22:36,440 --> 00:22:38,567 పదండి. పదండి బాబూ! 214 00:22:39,151 --> 00:22:40,652 త్వరగా పదండి! కదలండి! 215 00:22:43,822 --> 00:22:45,490 పదమంటున్నా కదా! 216 00:22:49,578 --> 00:22:51,163 ఆగండి. మిస్! 217 00:22:52,372 --> 00:22:53,624 మిస్. 218 00:22:53,707 --> 00:22:55,918 జరుగు! జరగరా సన్నాసి! 219 00:22:56,001 --> 00:22:57,836 జరగమంటే జరగవేంటిరా! జరుగు! 220 00:23:04,843 --> 00:23:06,261 ట్రాఫిక్ కి అడ్డుగా ఏం చేస్తున్నారు మీరు? 221 00:23:06,345 --> 00:23:07,554 కదలండి అక్కడి నుండి. మేము వెళ్లాలి. 222 00:23:07,638 --> 00:23:09,473 - మూసుకొని కూర్చో. - కదలండి అంటున్నా కదా! 223 00:23:09,556 --> 00:23:11,683 కారు కిటికీ గుండా నీ తల కనిపిస్తే, దాన్ని నరికిపారేస్తా! 224 00:23:56,144 --> 00:23:57,563 ఇది నా ఆఫీస్ నంబర్. 225 00:23:58,522 --> 00:24:00,566 నేను ఎత్తి తీరాలి. 226 00:24:00,649 --> 00:24:03,610 ఈమెకి ఏదో కాల్ వస్తోంది. చూస్తుంటే, ప్రభుత్వ నంబరులా కనిపిస్తోంది. 227 00:24:03,694 --> 00:24:05,279 వాళ్లు, ఆమె గుర్తింపును ధృవీకరించాలనుకుంటున్నారు. 228 00:24:05,362 --> 00:24:06,780 తన గుర్తింపును ధృవీకరించే దాకా తమార్ ని ఆగమను. 229 00:24:14,121 --> 00:24:15,706 ఎత్తు. 230 00:24:15,789 --> 00:24:19,793 కానీ ఒకటి గుర్తుంచుకో, నీ కూతురు ఏ బస్సులో అయితే వెళ్తోందో, ఆ బస్సును మా వాళ్లు ఫాలో అవుతున్నారు. 231 00:24:24,298 --> 00:24:25,299 హలో. 232 00:24:26,091 --> 00:24:27,342 నేను ముసావీని. 233 00:24:27,968 --> 00:24:29,261 డేటాతో పనేంటి మీకు? 234 00:24:33,599 --> 00:24:35,809 విశ్లేషణలను పరిశీలించమని పీటర్సన్ చెప్పాడు. 235 00:24:37,186 --> 00:24:38,437 అంతా ఓకేనా? 236 00:24:40,856 --> 00:24:42,191 హా, అంతా ఓకే. 237 00:25:00,417 --> 00:25:04,171 మిస్ నౌరీ, నేను మీ గుర్తింపును ధృవీకరించాలి. 238 00:25:05,881 --> 00:25:07,716 హా, అర్థం చేసుకుంటున్నాను. 239 00:25:11,845 --> 00:25:14,640 కోడ్. వహీదీయే. 240 00:25:36,703 --> 00:25:38,038 సమాధానం: దాబెస్తాన్. 241 00:25:43,377 --> 00:25:47,172 అదే నేను కూడా ఊహించా. చూద్దాం, దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందో. 242 00:25:51,093 --> 00:25:52,845 దయచేసి, కానివ్వండి. 243 00:25:53,512 --> 00:25:54,555 తప్పకుండా. 244 00:26:09,236 --> 00:26:10,529 అనుమతి మంజూరు చేయబడింది 245 00:26:10,612 --> 00:26:12,948 డేటా బదిలీ పోర్టల్ 246 00:26:28,338 --> 00:26:29,548 నేను కొనసాగవచ్చా? 247 00:26:30,132 --> 00:26:31,884 కొనసాగవచ్చు. వాళ్లు నమ్మేసినట్టున్నారు. 248 00:26:32,467 --> 00:26:34,178 సరే, తనకి సప్రెషన్ కోడ్ పంపు. 249 00:26:35,137 --> 00:26:37,055 ఈ వైరస్ ని కనిపించకుండా చేసేద్దాం. 250 00:26:39,808 --> 00:26:41,018 దయచేసి ప్రామాణీకరణ కోడ్ ని ఎంటర్ చేయండి 251 00:26:43,020 --> 00:26:44,021 కోడ్ వచ్చింది. 252 00:26:44,730 --> 00:26:45,939 డౌన్ లోడ్ ని ప్రారంభిస్తున్నా. 253 00:26:49,776 --> 00:26:51,361 మంటలు ఆగిపోయాయి. 254 00:26:51,904 --> 00:26:53,322 వాళ్లు మళ్లీ లోపలికి వచ్చేస్తున్నారు. 255 00:26:54,406 --> 00:26:57,117 అయిపోవచ్చింది. 256 00:28:06,228 --> 00:28:07,855 మసూద్ అబ్బాసీ 257 00:28:57,863 --> 00:28:59,990 నా మాటని నేను నిలబెట్టుకుంటున్నాను… 258 00:29:13,045 --> 00:29:14,546 మనం బయలుదేరాలి, లేకపోతే కష్టం. 259 00:29:17,883 --> 00:29:18,884 సరే. 260 00:29:22,971 --> 00:29:24,264 నౌరీ నుండి యాక్సెస్ చేసే ప్రయత్నం జరిగింది 261 00:29:33,190 --> 00:29:36,026 నేను రిటర్న్ బటన్ ని నొక్కగానే, ఆ మాల్వేర్ ఇక వాళ్లకి కనిపించదు. 262 00:29:36,109 --> 00:29:38,695 పీటర్సన్ కి కానీ, అతని బృందానికి కానీ అది ఎప్పటికీ కనిపించదు. 263 00:29:41,073 --> 00:29:43,075 ఎర్రర్ 264 00:29:44,952 --> 00:29:45,953 ఏమైంది? 265 00:29:48,789 --> 00:29:49,831 అర్థం కావట్లేదు. 266 00:29:51,124 --> 00:29:53,126 ఎర్రర్ 267 00:29:56,672 --> 00:29:57,673 ఆ ఫైల్ కనిపించట్లేదు. 268 00:29:57,756 --> 00:29:59,299 కనిపించట్లేదు అంటే? 269 00:29:59,383 --> 00:30:00,676 వైరస్ పోయింది. 270 00:30:00,759 --> 00:30:02,511 ఫైల్ లేదు 271 00:30:06,682 --> 00:30:09,101 ఒరిజినల్ ఫైల్ కానీ, మాల్వేర్ కానీ నాకు కనిపించట్లేదు. 272 00:30:10,227 --> 00:30:12,354 అవతలి వైపు నుండి ఎవరో దాన్ని తొలగించేశారు. 273 00:30:12,437 --> 00:30:13,897 అంత వేగంగా వాళ్ళెలా కనుగొన్నారు? 274 00:30:22,364 --> 00:30:24,491 ఫైల్ లేదు 275 00:30:27,411 --> 00:30:28,954 - అయ్య బాబోయ్. - ఏంటి? 276 00:30:29,037 --> 00:30:30,289 అయ్య బాబోయ్. 277 00:30:31,957 --> 00:30:34,501 ఈ వైరస్ ని కనిపెట్టి వాళ్లకి అందిస్తామని, కావాలని వాళ్లే సెక్యూరిటీని పంపించేశారేమో. 278 00:30:39,923 --> 00:30:41,300 అంతా ఓకే. 279 00:30:43,051 --> 00:30:43,886 1 ఫైల్(ల)ను తీసేయడం జరిగింది 280 00:30:43,969 --> 00:30:45,304 వాళ్లు మాల్వేర్ ని కనిపెట్టి మనకి అప్పగించారు. 281 00:30:55,939 --> 00:30:57,774 మనం సమస్యల్లో చిక్కుకున్నాం. వినిపిస్తోందా? 282 00:31:01,904 --> 00:31:03,989 సెపా వాళ్లు వచ్చేశారు. త్వరగా కానివ్వు. మనం వెళ్లిపోవాలి. 283 00:31:04,072 --> 00:31:07,576 నేను పని ఆపివేస్తున్నా. నువ్వు కూడా అక్కడి నుండి వెళ్లిపో. నా మాటలు వినిపిస్తున్నాయా? 284 00:31:07,659 --> 00:31:11,538 వెంటనే అక్కడి నుండి వెళ్లిపో. పని ముగించేసి వెళ్లిపో. 285 00:31:11,622 --> 00:31:14,208 ఏం చేశావు నువ్వు? హా? 286 00:31:14,541 --> 00:31:16,752 - అది ఎప్పుడూ జరిగే తనిఖీయే. - వాళ్లు వస్తున్నారా? 287 00:31:16,835 --> 00:31:18,170 ఎవరు? 288 00:31:19,087 --> 00:31:20,172 ఏం జరిగింది? 289 00:31:20,255 --> 00:31:21,673 దయచేసి వినండి, ఏం… 290 00:31:22,174 --> 00:31:23,550 - వద్దు, ప్లీజ్! - లే! 291 00:31:23,634 --> 00:31:24,718 వద్దు, వద్దు. దయచేసి వినండి! 292 00:31:28,347 --> 00:31:30,057 క్యాంపస్ సెక్యూరిటీ వాళ్లు వస్తున్నారు. 293 00:31:39,983 --> 00:31:41,360 ఏం చేశావు నువ్వు? 294 00:31:41,443 --> 00:31:43,529 - అది ఎప్పుడూ జరిగే తనిఖీయే. - నోర్మూసుకో. 295 00:31:44,613 --> 00:31:46,365 - నా కుతురిని దృష్టిలో ఉంచుకొని… - నోర్మూసుకో. 296 00:31:46,448 --> 00:31:47,658 నా కుతురి కోసమైనా నన్ను వదిలేయండి. 297 00:31:48,534 --> 00:31:50,369 నాకొక చిన్న కూతురు ఉంది. మిమ్మల్ని బతిమాలుతున్నా. 298 00:31:51,453 --> 00:31:53,455 - నేను ఒట్టేసి చెప్తున్నా. ఒట్టేసి చెప్తున్నాను! - పద. 299 00:31:53,539 --> 00:31:56,917 నా కూతురికి తండ్రి లేకుండా చేశారు, ఇప్పుడు తనకి తల్లిని కూడా దూరం చేయాలనుకుంటున్నారు. 300 00:32:34,037 --> 00:32:36,081 తుపాకీ కాల్చిన శబ్దం పై నుండి వినిపించింది. సిద్ధం కండి. పదండి! 301 00:32:38,876 --> 00:32:40,294 మనం బయలుదేరాలి. 302 00:33:16,830 --> 00:33:18,624 వాళ్లకి నేను చెప్పింది అంతా ఓకే అని కాదు. 303 00:33:21,210 --> 00:33:23,212 అంతా గడబిడ అయిందని చెప్పాను. 304 00:33:24,671 --> 00:33:27,174 ఇప్పుడు నీకు చావు తప్పదురా, ముసలి సన్నాసి. 305 00:33:41,396 --> 00:33:44,149 సర్, ఇంకో మూడు బృందాలు అండిషేహ్ ఇన్స్టిట్యూట్ కి బయలుదేరాయి. 306 00:33:44,816 --> 00:33:46,193 మరి ఇంటి దగ్గర? 307 00:33:46,735 --> 00:33:48,570 ఒక బృందం ఉంది. 308 00:33:51,114 --> 00:33:52,157 సరే. 309 00:34:04,962 --> 00:34:05,963 అబ్బా. 310 00:34:06,797 --> 00:34:08,465 ఈ సర్వీస్ డోర్లు ఎప్పుడూ లాక్ చేసే ఉంటాయి. 311 00:34:32,656 --> 00:34:33,824 రమీన్. 312 00:34:34,283 --> 00:34:35,951 త్వరగా రండి. 313 00:34:42,165 --> 00:34:43,333 మెల్లగా వెళ్లండి. 314 00:35:36,345 --> 00:35:37,554 అక్కడే ఉన్నావా? 315 00:35:38,764 --> 00:35:40,432 పని అయిందా? 316 00:35:41,683 --> 00:35:43,894 బాంబును నాశనం చేయలేకపోయాం. అది పని చేసే స్థితిలోనే ఉంది. 317 00:35:46,146 --> 00:35:47,523 నువ్వు బాగానే ఉన్నావా? 318 00:35:48,774 --> 00:35:50,442 నన్ను కాల్చారు. పెద్ద గాయమే అయింది. 319 00:35:52,611 --> 00:35:55,447 ఇంకా ఎంతో సేపు బతకను. 320 00:35:56,740 --> 00:36:02,287 కానీ నువ్వు ఉన్నావు, మిషన్ ని నువ్వు పూర్తి చేయగలవు, అర్థం అవుతోందా? 321 00:36:03,330 --> 00:36:05,290 ఇద్దరం కలిసి మిషన్ ని పూర్తి చేద్దాం. 322 00:36:07,835 --> 00:36:09,086 ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 323 00:36:09,169 --> 00:36:11,171 నిస్సాన్, మేము ఎవరినైనా పంపుతాం. నేను వాళ్లతో మాట్లాడతాను. మనం… 324 00:36:11,255 --> 00:36:13,549 అంత సమయం నాకు లేదులే. 325 00:36:13,632 --> 00:36:15,133 నీకు ఇంకా సమయం ఉంది, ఆలస్యమేమీ కాలేదు! 326 00:36:33,902 --> 00:36:35,153 నన్ను క్షమించు. 327 00:36:44,705 --> 00:36:46,915 నాకు ఇది జరగాల్సిందే ఏమో. 328 00:36:50,043 --> 00:36:51,378 అలా అనకు. 329 00:36:51,461 --> 00:36:53,839 నీకు కూడా నేను ఒకరిని దూరం చేశాను. 330 00:36:55,215 --> 00:37:00,137 నీ లవర్ చావుకు కారణమైన బాంబును చేసింది నేనే. 331 00:37:03,682 --> 00:37:05,559 కానీ అప్పుడు అది ఎవరికో నాకు తెలీదు. 332 00:37:07,352 --> 00:37:08,437 నాకు తెలుసు. 333 00:37:29,499 --> 00:37:30,876 తమార్. 334 00:37:36,507 --> 00:37:40,385 ఇకపై నీకు ఏం కాకుండా నేను చూసుకోలేను. 335 00:38:35,774 --> 00:38:37,401 - హలో. - హలో, జనరల్. 336 00:38:37,484 --> 00:38:38,777 హలో. 337 00:39:04,052 --> 00:39:05,220 చెప్పు. 338 00:39:05,304 --> 00:39:07,139 సర్, అంతా ఓకేనా? 339 00:39:07,222 --> 00:39:08,640 ఎందుకు అలా అడుగుతున్నావు? ఏమైనా అయిందా? 340 00:39:09,099 --> 00:39:12,978 ఏమీ కాలేదు, సర్. మీ భార్య ఇంకా ఇంటికి రాలేదు, అదే మీకు చెప్దామని ఫోన్ చేశాను. 341 00:39:13,562 --> 00:39:14,813 ఏమంటున్నావు నువ్వు? 342 00:39:14,897 --> 00:39:16,273 ఆమెని బయటకు వెళ్లనిచ్చావా? 343 00:39:16,565 --> 00:39:19,735 బెహ్రూజ్ తీసుకెళ్లాడు, మీరే తీసుకెళ్లమని చెప్పారట. 344 00:39:35,542 --> 00:39:38,295 మాల్వేర్ పూర్తిగా నశించిపోయింది. 345 00:39:39,755 --> 00:39:42,090 ప్రారంభ క్యాలిబ్రేషన్ ని ప్రారంభించాను. 346 00:39:44,134 --> 00:39:45,677 మిమ్మల్ని అనుమానించి పొరపాటు చేశాను. 347 00:39:47,054 --> 00:39:48,222 ఏమైంది? 348 00:39:48,305 --> 00:39:50,349 అండిషేహ్ ఇన్స్టిట్యూట్ కి ఎవరు వెళ్లారో కానీ, వాళ్లు తప్పించుకోగలిగారు. 349 00:39:50,849 --> 00:39:52,684 వాళ్లని ఎవరో హెచ్చరించి ఉండాలి. 350 00:39:53,977 --> 00:39:55,062 మరి షపరక్? 351 00:39:56,563 --> 00:39:57,981 ఆమె వీరమరణం పొందింది. 352 00:40:05,197 --> 00:40:08,450 తన కూతురి బాగోగులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నా. 353 00:40:12,913 --> 00:40:17,084 నా కూతురితో కనీసం ఒక్కసారైనా మాట్లాడాలని నాకు ఎంత ఆరాటంగా ఉందో తెలుసా? 354 00:40:17,960 --> 00:40:21,880 దాడి జరిగాక, ఇక్కడ సంప్రదింపు వ్యవస్థలని నిలిపేశారు. 355 00:40:21,964 --> 00:40:23,257 అవునులే. 356 00:40:23,340 --> 00:40:24,842 వాళ్లు అన్నింటినీ వింటారు. 357 00:40:25,342 --> 00:40:26,635 అవును. 358 00:40:28,387 --> 00:40:30,764 నాకు తెలిసి, రేపే మనం భాగాలన్నింటినీ బిగించేయవచ్చు. 359 00:40:30,848 --> 00:40:31,890 పూర్తిగా సిమ్యులేట్ చేయవచ్చు. 360 00:40:32,558 --> 00:40:35,477 నేను ఇంకోసారి తనిఖీ చేస్తే సరిపోతుంది. 361 00:41:03,589 --> 00:41:04,548 ఎవరు మీరు? 362 00:41:06,675 --> 00:41:08,260 నన్ను సారా పంపించింది. 363 00:41:16,810 --> 00:41:18,478 మా దగ్గరికి సారా మొదటిసారి వచ్చినప్పుడు, 364 00:41:20,022 --> 00:41:24,234 పాపం ఆ అమ్మాయికి, మా సాయం అవసరం ఉంది, మేము తనకి సాయం చేశాము కూడా. 365 00:41:25,444 --> 00:41:27,946 కానీ, ఇప్పుడు తను వేరే వాళ్లకి కూడా సాయపడుతోంది, అందుకు నాకు ఆనందంగా ఉంది. 366 00:41:40,667 --> 00:41:41,627 దయచేసి, కూర్చోండి. 367 00:41:44,129 --> 00:41:45,589 ఈ మహిళలందరూ… 368 00:41:46,381 --> 00:41:47,633 ఆదరణకు నోచుకోని వాళ్లు. 369 00:41:48,967 --> 00:41:52,221 ఈ నగరంలో, అదే స్వేచ్ఛ. 370 00:42:09,571 --> 00:42:10,822 ఇదుగోండి. 371 00:42:10,906 --> 00:42:12,658 సారా మీకు ఇది ఇమ్మంది. 372 00:42:13,659 --> 00:42:14,660 నాకా? 373 00:42:21,291 --> 00:42:22,459 ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పాస్ పోర్ట్ 374 00:42:30,050 --> 00:42:32,261 ఇంటి పేరు: కవాకేబియన్ పేరు: సూసన్ 375 00:42:35,556 --> 00:42:37,057 మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? 376 00:42:40,018 --> 00:42:41,311 ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? 377 00:43:01,206 --> 00:43:03,125 మీకు కూడా హలో, జనరల్. 378 00:43:04,042 --> 00:43:05,294 నాహీద్ ఎక్కడ ఉంది? 379 00:43:06,503 --> 00:43:12,426 ఆమె తప్పించుకుంది. పారిపోయింది. ప్లాన్ చేసి పారిపోయినట్టుగా అనిపిస్తోంది. 380 00:43:14,344 --> 00:43:15,429 నాకేం అనిపిస్తోందో చెప్పమంటారా? 381 00:43:16,263 --> 00:43:17,347 ఏమనిపిస్తోంది? 382 00:43:19,641 --> 00:43:24,980 మీకు దూరంగా వెళ్లిపోవడానికి నన్ను వెధవని చేసింది అనుకుంటా. 383 00:43:49,922 --> 00:43:51,423 ఏం చోటు ఇది? 384 00:43:54,051 --> 00:43:55,344 ఇది సురక్షితమైన చోటు. 385 00:44:10,067 --> 00:44:11,401 తమార్. 386 00:44:13,946 --> 00:44:14,988 నా పేరు. 387 00:44:18,867 --> 00:44:19,868 తమార్. 388 00:45:46,330 --> 00:45:49,499 పరమ గొప్పవాడగు ప్రభువు నామము శ్రేష్టము, పరిశుద్ధము అవును గాక. 389 00:45:51,793 --> 00:45:54,630 ఆయన అభీష్టానుసారం సృష్టించుకున్న లోకంలో. ఆయన రాజ్యాన్ని ఉత్తముడగు రాజుకు ఇచ్చును గాక. 390 00:45:55,214 --> 00:45:58,133 విముక్తి ప్రసాదించాలనే ఉద్దేశంతో అతని మెస్సయ్యను త్వరగా పంపించెదరు, 391 00:45:59,426 --> 00:46:00,677 నీ జీవితకాలంలో, నీ రోజుల్లో, 392 00:46:00,761 --> 00:46:02,596 ఇజ్రాయెల్ అను పెద్ద గృహం యొక్క జీవితకాలంలో. 393 00:46:05,265 --> 00:46:07,434 ఇది త్వరగా, వేగవంతంగా జరుగుతుంది. ఆమెన్. 394 00:46:10,312 --> 00:46:13,607 ఆయన పేరు ఎప్పటికీ, కలకాలం అలాగే దీవెనలతో నిలిచిపోవును గాక. 395 00:46:14,191 --> 00:46:16,026 ఆశీస్సులకు, దీవెనలకు, కీర్తికి, పవిత్రతకి, 396 00:46:16,109 --> 00:46:18,111 పేరుకు, గౌరవానికి, అభిమానానికి, ప్రశంసలకు 397 00:46:19,738 --> 00:46:22,157 ప్రతిరూపమగు ఆ ప్రభువు చెంతకు చేరి అదృష్టవంతుడై… 398 00:46:28,830 --> 00:46:30,249 స్వర్గలోక ప్రాప్తిని పొంది… 399 00:46:33,627 --> 00:46:35,879 ఆయన దయతో, శాంతిని పొంది, 400 00:46:37,089 --> 00:46:39,299 మాకు, ఇజ్రాయెల్ వాసులందరికీ అది ప్రసాదించును గాక. ఆమెన్. 401 00:46:50,477 --> 00:46:56,400 లయర్ వెయిజ్మన్ జ్ఞాపకార్థం 402 00:47:59,796 --> 00:48:01,798 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్