1 00:00:06,630 --> 00:00:08,960 హేయ్. హేయ్. 2 00:00:11,130 --> 00:00:12,220 నిద్రలే. 3 00:00:13,180 --> 00:00:14,800 పెళ్ళిరోజు శుభాకాంక్షలు. 4 00:00:18,640 --> 00:00:21,830 పెళ్ళిరోజు శుభాకాంక్షలు. సమయం ఎంత కావస్తోంది? 5 00:00:22,030 --> 00:00:25,150 ఉదయం. క్షమించు. పనికి వెళ్ళేముందు పరిగెత్తాలనుకున్నా. 6 00:00:26,650 --> 00:00:28,480 అవును, బాగా చెమట పట్టింది. 7 00:00:29,480 --> 00:00:31,240 ఈరోజు నాకు తలమునకలయ్యే పని ఉంది. 8 00:00:32,070 --> 00:00:37,200 నువ్వు వెళ్ళే ముందు, నీ ముఖాన్ని చూసి చెప్పాలనుకున్నా 9 00:00:38,950 --> 00:00:39,910 ఐ లవ్ యూ అని 10 00:00:41,660 --> 00:00:44,250 - ఈ రాత్రి, మనం వైన్ తాగుదాం. - అలాగా? 11 00:00:45,250 --> 00:00:49,700 మనం పెద్దవారి మాటలు మాట్లాడుకుందాం. పని లేదా పిల్లలు వద్దు. 12 00:00:49,900 --> 00:00:50,780 బతికించావు దేవుడా. 13 00:00:50,980 --> 00:00:54,090 ఆ తర్వాత, మనం సెక్స్ చేద్దాం. 14 00:00:55,340 --> 00:00:56,510 మనం ఏం చేద్దాం? 15 00:00:58,140 --> 00:01:03,980 సరే. నేను పిల్లలను పంపేసి, పురుష ప్రదేశం శుభ్రం చేసుకుంటాను. 16 00:01:05,900 --> 00:01:09,860 దేవుడా, నీ ప్రణాళిక నచ్చింది. కానీ నువ్వు నాకు ఇంకా నచ్చావు. 17 00:01:13,150 --> 00:01:13,990 - ఏంటి? - దేవుడా. 18 00:01:14,200 --> 00:01:16,760 - తమాషా చేస్తున్నావా? - అసలు ఏం జరుగుతోంది? 19 00:01:16,960 --> 00:01:18,370 - ఏం జరుగుతోంది? - అలారం! 20 00:01:32,000 --> 00:01:35,240 జాస్, ఏం జరిగింది? ఓరి దేవుడా. ఏమీ కాలేదుగా? 21 00:01:35,440 --> 00:01:36,240 నన్ను తాకొద్దు. 22 00:01:36,440 --> 00:01:39,390 నేను చూసుకుంటా. చూసుకో. వెనక్కు వెళ్ళు, బంగారం. 23 00:01:44,020 --> 00:01:46,000 మాకు అలారం వచ్చింది. మంటలు రేగాయా? 24 00:01:46,200 --> 00:01:48,520 - ఇప్పుడు లేవు. - ఏం కాలేదు. థాంక్స్, ఫ్రాంక్. 25 00:01:48,940 --> 00:01:50,920 ఎందుకు ఇల్లంతా మోగుతోంది? 26 00:01:51,120 --> 00:01:52,400 జాస్ ఇల్లు కాల్చాలనుకుంది. 27 00:01:53,320 --> 00:01:55,850 - టీనేజీ అమ్మాయిల హార్మోన్ల ఆవేశం. - నోర్ముయ్ మ్యాటీ. 28 00:01:56,040 --> 00:01:58,970 సరే. అంతా బాగుంది. మేము దాన్ని అదుపు చేశాం. 29 00:01:59,170 --> 00:02:00,390 తయారవ్వండి. ఆలస్యమవుతోంది. 30 00:02:00,590 --> 00:02:04,080 - ఏమంటున్నారు? చర్నోబిల్‌లా అంటుకుంది. - అది కాస్త ఎక్కువై౦ది. 31 00:02:07,000 --> 00:02:09,210 - జాస్, ఏం జరిగింది? - నాకు తెలియదు. 32 00:02:18,050 --> 00:02:22,330 - హాయ్. ఇంగ్లీష్‌లో మాట్లాడుదామా? - బంగారం, మనకు పెళ్ళయి ఎన్నేళ్ళయింది? 33 00:02:22,530 --> 00:02:25,580 20 ఏళ్ళయినా, ఒక మాట రాదా? భాషా సాఫ్ట్‌వేర్ కొన్నాగా? 34 00:02:25,780 --> 00:02:29,440 ఆమెకు సమయం లేదు. పిల్లల్ని ముద్దాడటంలో, శంకుస్థాపనలతో తీరిక లేదు. 35 00:02:29,690 --> 00:02:32,920 హేయ్. హేయ్. జాస్. మీ అమ్మతో అలా మాట్లాడకూడదు. 36 00:02:33,120 --> 00:02:35,780 హేయ్. నీకేం జరుగుతోంది? 37 00:02:43,450 --> 00:02:44,520 హెలెన్ కాల్. క్షమించు. 38 00:02:44,720 --> 00:02:45,480 - సరే. - క్షమించు. 39 00:02:45,680 --> 00:02:46,580 పర్లేదు, బంగారం. 40 00:02:46,950 --> 00:02:50,500 - ఇది ముఖ్యమైతే బాగుంటుంది. - ప్రపంచం మంటల్లో కాలిపోతోంది. 41 00:02:51,670 --> 00:02:54,500 నువ్వు ఇక్కడికి రావాలి. వెంటనే. 42 00:02:56,340 --> 00:03:01,220 ద పవర్ 43 00:03:02,680 --> 00:03:05,960 ఈ ఏడాదికి, ఎమర్జన్సీ సేవలు తమ ఓవర్‌టైమ్ నిధులను చేరుకుంటున్నాయి. 44 00:03:06,160 --> 00:03:08,380 భారీ నిధులు కల ఎవరినైనా మనం సంప్రదించాలి. 45 00:03:08,580 --> 00:03:12,130 - గవర్నర్‌తో కాల్ ఏర్పాటు చెయ్. ఇంకా? - ప్యూజెట్ సౌండ్ ఎనర్జీ సంస్థ. 46 00:03:12,330 --> 00:03:16,190 విద్యుత్ కోతలు, కాలిన గ్రిడ్లు, ఫ్యూజ్‌లు. ఇది సామాగ్రి వైఫ్యలం కాదట. 47 00:03:16,400 --> 00:03:19,610 దీన్ని ధృవీకరించడానికి మనం వెలుపలి సంస్థను రంగంలోకి దించాలి. 48 00:03:19,820 --> 00:03:22,890 బీకన్ హిల్‌లో మరో అగ్నిప్రమాదం. ఓ కుటుంబ రెస్టారెంట్‌లో. 49 00:03:23,090 --> 00:03:27,060 అగ్నిమాపక ప్రధానాధికారి మంటలు అదుపులో ఉన్నాయన్నారు, కానీ పక్క భవనానికి పాకాయి. 50 00:03:27,260 --> 00:03:29,310 ముగ్గురి మృతి, పలువురు కనబడటం లేదు. 51 00:03:29,510 --> 00:03:33,460 మరో టీనేజీ అమ్మాయి. అది ప్రమాదమని కుటుంబం బల్లగుద్ది చెబుతోంది. 52 00:03:33,830 --> 00:03:38,710 నిప్పు ఆమె చేతుల నుండి వచ్చిందని ఆమె తండ్రి ఆరోపణ. ఇవి స్వయానా ఆయన మాటలు. 53 00:03:39,090 --> 00:03:41,630 బీకన్ హిల్‌లో అధికశాతం చైనా వలస పౌరులున్నారు. 54 00:03:41,930 --> 00:03:44,500 అనువాదం వల్ల అపార్ధాలు చోటు చేసుకుంటున్నాయా? 55 00:03:44,700 --> 00:03:45,500 అది సాధ్యమే. 56 00:03:45,700 --> 00:03:48,120 - మాండరిన్ వచ్చా? - కాంటనీస్ కూడా. ఆ పని మీదుంటా. 57 00:03:48,320 --> 00:03:51,790 సరే, అద్భుతం. మీరంతా అద్భుతంగా పని చేస్తారు. ధన్యవాదాలు. 58 00:03:51,990 --> 00:03:54,510 అందరూ వారు వారే౦ చెయ్యాలో తెలుసుగా? 59 00:03:54,700 --> 00:03:56,650 ఇదేంటి? ఈ వారంలో 12వ అగ్నిప్రమాదమా? 60 00:03:58,820 --> 00:04:00,280 అసలు ఏం జరుగుతోంది? 61 00:04:02,110 --> 00:04:04,870 టీనేజీ అమ్మాయిలు వస్తువులను తగలబెడుతున్నారు. 62 00:04:05,120 --> 00:04:08,060 ఆశ్చర్యంగా లేదు. వాళ్ళు పెరిగే ప్రపంచం ఎలా ఉంది మరి? 63 00:04:08,260 --> 00:04:12,040 అవును. నాకు కూడా కొన్నిటిని కొన్నిసార్లు కాల్చేస్తే బాగుండనిపిస్తుంది. 64 00:04:12,620 --> 00:04:17,840 మంటలు, అమ్మాయిలు, విద్యుత్ కోతలు. అంటే, వీటన్నిటికీ ఏదో రకమైన సంబంధం ఉందా? 65 00:04:18,800 --> 00:04:20,010 ఆ విషయాన్ని శోధిస్తా. 66 00:04:36,400 --> 00:04:38,820 హేయ్, జాస్. నన్ను క్షమించు... 67 00:04:41,360 --> 00:04:44,360 మా అమ్మ. సాధారణ వ్యక్తిలా మెసేజ్ పంపలేదా? 68 00:04:44,950 --> 00:04:48,530 అమ్మాయిలు చేస్తున్న ఈ వింత విద్యుత్ పనుల గురించి విన్నావా? 69 00:04:49,330 --> 00:04:52,190 అవును. ఒక రకంగా. ఎందుకు? దాని గురించి ఏమని విన్నావు? 70 00:04:52,390 --> 00:04:55,020 - దానికి కారణం అదేనంట. - ఏంటి, మెసేజులు పంపడమా? 71 00:04:55,220 --> 00:05:00,750 కాదు, అమ్మాయిలు ఛండాలపు హస్తప్రయోగం చేసుకోవడమేనట. వైబ్రేటర్లతో. 72 00:05:03,550 --> 00:05:07,950 సరే. మరి, ఇది నేనింకా వినలేదు. కానీ ప్రపంచ పౌరశాస్త్రంపై నాకు పరీక్ష ఉంది. 73 00:05:08,150 --> 00:05:11,920 తర్వాత కలుస్తా. సరే. హేయ్, క్విన్. క్యాట్ ఎక్కడా? 74 00:05:12,120 --> 00:05:15,020 పరీక్ష వల్ల స్కూలు ఎగ్గొట్టిందేమో. నువ్వు చదివావా? 75 00:05:15,560 --> 00:05:19,980 ఆ, ఒకరకంగా. ఏమో మరి. ఫ్రెంచి విప్లవంపై పూర్తి పాఠమా? 76 00:05:20,520 --> 00:05:24,650 - నా జీవితంలో దాన్నెప్పుడు వాడుతాను? - అదే, కదా? దారుణంగా ఫెయిలవుతాను. 77 00:05:33,000 --> 00:05:36,250 - చూడు. ఇక పరీక్ష లేదు. - దేవుడా. భలే సరదాగా ఉంది. 78 00:05:36,620 --> 00:05:38,080 పద, పద, పద. 79 00:05:41,750 --> 00:05:42,530 హేయ్. 80 00:05:42,730 --> 00:05:45,920 ఈయనే రాబ్ లోపెజ్. ఈ విచారణల బాధ్యత ఈయనదే. 81 00:05:46,630 --> 00:05:47,620 నిన్ను కలవడం సంతోషం. 82 00:05:47,820 --> 00:05:52,080 నీ చేతిపై ఏర్పడ్డ గుర్తులను చూస్తారు, అది నీకు సమ్మతమైతే, సారా. 83 00:05:52,280 --> 00:05:53,060 తప్పకుండా. 84 00:05:55,390 --> 00:05:58,400 అయితే, సారా, బానే ఉన్నావా? 85 00:05:58,730 --> 00:06:01,020 - బాగున్నా. - మంచిది, మంచిది. 86 00:06:02,320 --> 00:06:05,400 నువ్వు చవిచూస్తున్న ఇబ్బందుల పట్ల నాకు బాధగా ఉంది. 87 00:06:06,450 --> 00:06:10,240 కానీ ఇది మేము పరిష్కరించలేని విషయమైతే కాదనుకుంటాను. 88 00:06:11,660 --> 00:06:12,640 చూడు. నాకు తెలుసు. 89 00:06:12,840 --> 00:06:16,460 నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దిగులుపడుతున్నారని తెలుసు. 90 00:06:16,710 --> 00:06:19,120 అన్నిటి గురించి. సరే. చూడనా? 91 00:06:21,750 --> 00:06:22,800 సరే. 92 00:06:28,590 --> 00:06:29,430 సరే. 93 00:06:39,980 --> 00:06:42,520 అంత చిన్న దేహానికి ఇవి చాలా ఎక్కువ మాత్రలు. 94 00:06:43,150 --> 00:06:45,150 భారీ భావోద్వేగాలతో సారా సతమతమవుతోంది. 95 00:06:46,190 --> 00:06:48,760 - ముఖ్యంగా తనకు కోపంగా ఉన్నప్పుడు. - సరే. 96 00:06:48,960 --> 00:06:52,160 ఆమెకు తరచూ వచ్చే అతికోపపు వ్యాధి ఉందని నిర్ధారించారా? 97 00:06:52,490 --> 00:06:56,160 అవును. కొన్నేళ్ళ క్రితం సారాకు ఈ సమస్యలు ఉండేవి కావు. 98 00:06:57,660 --> 00:07:00,790 - ఏదైనా జరిగిందా? - మాకు తెలిసి ఏమీ జరగలేదు. 99 00:07:02,630 --> 00:07:06,050 ఆమె టీనేజీ సంవత్సరాలతో హింసాత్మకంగా ఇబ్బందిపడుతోంది. 100 00:07:06,380 --> 00:07:09,930 నమ్మండి, నాకు దాని గురించి తెలుసు. ఈమె వయసు గల కూతురు నాకుంది. 101 00:07:10,180 --> 00:07:14,620 మా పాప వయసు 17. ఆమె భావోద్వేగాల గురించి మీరు మాట్లాడితే ఏమని చెబుతుంది? 102 00:07:14,820 --> 00:07:18,600 మాట్లాడటమా? సారా మాట్లాడదు. కేకలు పెడుతుందంతే. 103 00:07:19,180 --> 00:07:21,690 తనకు నేనంటే ద్వేషం. అందరినీ ద్వేషిస్తుంది. 104 00:07:22,480 --> 00:07:24,770 నాకూ బాధగా ఉంది. ఇదిగో. 105 00:07:29,990 --> 00:07:34,310 చూద్దాం. మూర్ఛ, తలనొప్పి మాత్రలు, పూనకపు మాత్రలు, కుంగుబాటు మాత్రలు, 106 00:07:34,510 --> 00:07:37,230 భ్రమ తగ్గింపు మాత్రలు, మూర్ఛ ఉపశమన మాత్రలు... 107 00:07:37,430 --> 00:07:39,370 అవును, మేము అన్నీ ప్రయత్నించాం. 108 00:07:41,830 --> 00:07:45,110 కానీ చర్మగాయలను అవే కలిగించాయి, కదా? ఈ మాత్రలే? 109 00:07:45,310 --> 00:07:48,240 వాటి వల్ల ఆమెకు దుష్ప్రభావాలు, రియాక్షన్‌లు కలిగాయి కదా? 110 00:07:48,440 --> 00:07:50,660 ఈ మాత్రల్లో ఏవీ, వాటిని కలిపి తీసుకున్నా సరే, 111 00:07:50,860 --> 00:07:52,300 ఇలాంటి గాయాలను కలిగించి ఉండవు. 112 00:07:53,180 --> 00:07:57,620 క్షమించండి. కానీ ఈ చర్మగాయాల సరళి చాలా ప్రత్యేకంగా ఉంది. 113 00:07:57,820 --> 00:08:02,440 దీన్ని లిక్టెన్‌బర్గ్ చిత్రం అంటారు. ఇవి విద్యుత్ తాకిడి వల్ల కలిగే గాయాలు. 114 00:08:03,730 --> 00:08:08,380 ఈమధ్య సారా విద్యుత్ షాక్‌కు గురైందా? మీకు తెలియని ప్రమాదం ఏదైనా జరిగిందా? 115 00:08:08,580 --> 00:08:12,240 లేదు. లేదు. అంటే, అలా జరిగిందనుకోను. 116 00:08:12,450 --> 00:08:15,740 అలాంటిది ఏదైనా జరిగితే నాకు చెప్పి ఉండేది, కాదంటారా? 117 00:08:17,530 --> 00:08:23,210 కెల్లీ, క్షమించండి. ఇది సున్నితమైన విషయమని తెలుసు, కానీ నేను అడిగి తీరాల్సిందే. 118 00:08:25,130 --> 00:08:27,170 ఆమెను ఎవరూ వేధించటం లేదు కదా? 119 00:08:27,670 --> 00:08:31,880 లేదు. లేదు. నాకు తెలిసినంతలో లేదు. 120 00:08:33,050 --> 00:08:35,930 పోట్లాటలు. మైదానాల్లో జరిగే మామూలు పోట్లాటలు. 121 00:08:36,890 --> 00:08:39,060 అమ్మాయిలతో. ఇతర అమ్మాయిలతో పోట్లాడుతుంది. 122 00:08:41,480 --> 00:08:42,310 సరే. 123 00:08:46,150 --> 00:08:48,050 కార్పేథియా వీధులు మండిపోతున్నాయి. 124 00:08:48,250 --> 00:08:52,220 ఈ మంటలు ప్రమాదాలు కాదు. ఈ మంటలు అల్లరిమూకల, అరాచకుల చర్యలు. 125 00:08:52,420 --> 00:08:53,820 దుండగులకు ఈ శిక్షపడుతుంది, 126 00:08:54,820 --> 00:08:56,410 మరణశిక్ష. 127 00:08:56,660 --> 00:09:00,100 వీళ్ళు యువతులు కారు. వీళ్ళు ఉగ్రవాదులు. 128 00:09:00,300 --> 00:09:05,120 చట్టాన్ని, క్రమబద్ధతను మళ్ళీ గాడిలో పెట్టే అధ్యక్షుడిగా ఉంటా. దేవుడు సాయం చేయాలి. 129 00:09:06,040 --> 00:09:06,920 తగలడండి. 130 00:09:20,100 --> 00:09:22,080 {\an8}క్రీడల ముఖ్యాంశాలు 1999 131 00:09:22,280 --> 00:09:24,040 {\an8}ఈ ఏడాది చివరన, అక్టోబర్ 1999లో, 132 00:09:24,240 --> 00:09:25,840 {\an8}జిమ్నాస్టిక్స్ అత్యుత్తమత సంస్థ 133 00:09:26,040 --> 00:09:29,010 {\an8}ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల నుండి మేటి జిమ్నాస్ట్‌లు 134 00:09:29,210 --> 00:09:31,570 చైనాలోని టియాంగ్‌జిన్‌కు చేరుకుంటారు, 135 00:09:31,940 --> 00:09:34,740 ఇది అంతిమ బహుమతికి వేదిక కానుంది. 136 00:09:35,110 --> 00:09:37,820 సిడ్నీ ఒలంపిక్స్‌లో విలువైన బంగారు పతకానికి. 137 00:09:38,990 --> 00:09:41,490 కానీ మొదట జాతీయస్థాయి పోటీలు జరుగుతాయి. 138 00:09:41,740 --> 00:09:45,620 ఇక కార్పేథియాలో, ఆశ్చర్యకరంగా ఓ మెరుగైన ప్రతిభావంతురాలు పైకి ఎదుగుతోంది. 139 00:09:46,040 --> 00:09:50,420 {\an8}ట్రయల్స్‌లో నా ప్రదర్శనే కీలకం కానుంది, వాటిని నేను సులువుగా గెలవగలను. 140 00:09:52,670 --> 00:09:55,010 రెండేళ్ళ వయసు నుండే నేను శిక్షణ పొందుతున్నా. 141 00:09:55,340 --> 00:09:58,930 మేటి జిమ్నాస్ట్ కావాలని ఉంది. నా దేశం నన్ను చూసి గర్వపడాలని ఉంది. 142 00:10:00,010 --> 00:10:02,640 అలాగే, నా చెల్లి జోయా కూడా గర్వించాలి. 143 00:10:02,850 --> 00:10:05,680 - అలాగే మీ తల్లి కూడా? - తప్పకుండా. 144 00:10:06,980 --> 00:10:09,350 కార్పేథియా పత్రికలకు ఇష్టమైన వ్యక్తిగా, 145 00:10:09,600 --> 00:10:13,360 ఆమె టియాన్‌జిన్ జట్టులో చోటు సంపాదిస్తుందా లేదా అన్నదే ప్రశ్న. 146 00:10:13,820 --> 00:10:15,860 {\an8}దయచేసి మీ పేరు మళ్ళీ చెబుతారా? 147 00:10:16,360 --> 00:10:20,030 నా పేరు తాతియానా దోనిచ్, నాకు 15 ఏళ్ళు. 148 00:10:20,240 --> 00:10:21,240 కట్. 149 00:11:25,600 --> 00:11:28,020 ఏ ధైర్యంతో ఈ ముఖం వేసుకుని వచ్చావు! 150 00:11:29,350 --> 00:11:32,060 - మా నాన్న నిన్ను చంపేస్తారు. - తను ఎలా ఉంది? 151 00:11:34,940 --> 00:11:37,150 ఆమె ఎలా ఉందనుకుంటున్నావు, టుండే? 152 00:11:37,780 --> 00:11:38,650 దయచేసి వెళ్ళనీ. 153 00:11:40,400 --> 00:11:42,200 - దేవుడా. - ధన్యవాదాలు. 154 00:11:45,200 --> 00:11:47,990 అంతా ముగిసింది. ధన్యవాదాలు, సర్. 155 00:12:02,510 --> 00:12:03,680 నన్ను చూడు. 156 00:12:05,470 --> 00:12:06,600 ఎన్‌డూడి? 157 00:12:09,810 --> 00:12:10,890 నన్ను చూడు. 158 00:12:27,740 --> 00:12:29,580 నాకున్న ఇబ్బంది నీకు తెలుసా? 159 00:12:33,750 --> 00:12:38,630 - క్షమించు. - నాన్న భూతశుద్ధి క్రతువు చేయాలంటున్నాడు. 160 00:12:41,920 --> 00:12:43,720 తల్లిదండ్రులు సందర్శకులు వద్దన్నారు. 161 00:12:51,350 --> 00:12:53,390 నీకు ఏం జరిగిందో నేను కనుగొంటాను. 162 00:12:54,520 --> 00:12:55,690 ఇదేంటో కనుగొంటాను. 163 00:13:41,360 --> 00:13:42,820 వాడికి తగిన శాస్తే జరిగింది. 164 00:13:46,910 --> 00:13:49,910 స్వర్గలోకపు తండ్రీ... 165 00:13:50,200 --> 00:13:52,660 పరలోకపు తండ్రి నీకోసం ఏం చేశాడు? 166 00:13:55,410 --> 00:13:57,290 నిన్ను రక్షించడానికి ఎవరూ రాలేదు. 167 00:13:59,080 --> 00:14:00,690 నువ్వు పుట్టిన నిమిషం నుండి, 168 00:14:00,890 --> 00:14:03,510 ఈ ప్రపంచం నిన్ను నిరాశపరచడం తప్ప మరేమీ చేయలేదు. 169 00:14:36,540 --> 00:14:38,370 మంచితనమనే నటన ఆపే సమయం వచ్చింది. 170 00:14:42,380 --> 00:14:43,750 నీకు ఏం కావాలో అది తీసుకో. 171 00:14:54,010 --> 00:14:57,060 మీరు ఈ వ్యక్తిని చూస్తే, దయచేసి 911‌కు కాల్ చేయండి. 172 00:14:57,680 --> 00:14:59,270 క్లైడ్ మంచి మనిషి. 173 00:14:59,770 --> 00:15:03,400 {\an8}సోల్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్‌కు ఎన్నో ఏళ్ళు సేవ చేశాడు. ఏళ్ళు. 174 00:15:05,320 --> 00:15:07,050 అతను ఇలాంటి చావుకు అర్హుడు కాదు. 175 00:15:07,250 --> 00:15:09,530 అనుమానాస్పద మృతి తర్వాత పరారీలో అమ్మాయి 176 00:15:11,620 --> 00:15:13,870 - పోలీసులు ధృవీకరించారు... - ఏ ప్రశ్నలు లేవు. 177 00:15:14,280 --> 00:15:18,020 ...17 ఏళ్ళు కల ఆలీసన్ మాంట్‌గోమరీ, ఈ హత్యలో కీలక నిందితురాలిగా, 178 00:15:18,220 --> 00:15:20,570 ప్రజలు ఆమె దగ్గరకు వెళ్ళకూడదని తెలిపారు 179 00:15:20,770 --> 00:15:23,080 ఎందుకంటే ఆమె చాలా ప్రమాదకరమైనది కనుక. 180 00:16:27,230 --> 00:16:28,150 జరగండి. 181 00:16:35,530 --> 00:16:36,410 మంక్ అండ్ సన్స్ 182 00:16:37,330 --> 00:16:39,910 - మేము త్వరగా మూసేస్తున్నాం. - నువ్వు కొత్తా? 183 00:16:40,290 --> 00:16:44,420 మా నాన్నను చూడటానికి వచ్చాను. బెర్నీ మంక్ కూతురును. 184 00:16:49,170 --> 00:16:51,590 - అడ్డులే. - దాన్ని లోపలికి తీసుకురాకూడదు. 185 00:16:59,350 --> 00:17:02,080 - ఓయ్, ఓయ్. - ఒక నిమిషం ఉ౦డ౦డి. 186 00:17:02,280 --> 00:17:05,920 - బయటున్న ఆ వెధవ ఎవడు? - పై అంతస్తులో కుడి వైపుకు వెళ్ళ౦డి. 187 00:17:06,120 --> 00:17:09,760 అతను అక్కడే ఉంటారు, మేడమ్, సరేనా? ఇదెలా ఉంది? 188 00:17:09,960 --> 00:17:11,890 - అమ్మ గురించి పోలీసులు ఏం అన్నారు? - ఓయ్. 189 00:17:12,080 --> 00:17:14,860 - అలా వచ్చేయకూడదు. మేము పని చేస్తున్నాం. - నేను చూసుకుంటా. 190 00:17:15,740 --> 00:17:18,730 - ఎలా ఉన్నావు? - మా అమ్మను చంపినవాడిని కనుక్కోవాలి. 191 00:17:18,930 --> 00:17:22,250 - వారి ముఖాలను చూశాను. సాయపడగలను. - విను, రాక్స్. నా మాట విను. 192 00:17:23,080 --> 00:17:28,210 జరిగినదానికి బాధపడుతున్నా. తను లేని లోటుతో బాధపడుతున్నావని తెలుసు. మాకూ బాధే. 193 00:17:28,500 --> 00:17:32,110 కానీ రిక్కీ అన్నది నిజమే. ఇది వ్యాపారం. కింద కస్టమర్లు ఉన్నారు. 194 00:17:32,310 --> 00:17:36,130 నీ వ్యాపారాల వల్లే ఆమెను చంపారా? నిన్ను చంపాలనుకున్నారా? ప్రతీకారమా? 195 00:17:36,720 --> 00:17:39,290 కాదు. ఇది దారి తప్పిన దొంగతనం అని వారంటున్నారు. 196 00:17:39,490 --> 00:17:41,720 వెధవగాళ్ళు తప్పుడు ఇంటిని ఎంచుకున్నారు. 197 00:17:43,100 --> 00:17:45,890 "ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు," అన్నారు. 198 00:17:46,310 --> 00:17:47,850 నేనెవరో తెలిసినట్టు. 199 00:17:48,480 --> 00:17:52,610 వాళ్ళు మీ ఇంటిపై నిఘూ వేసుంటారేమో. నువ్వు రావడం, పోవడం చూసుంటారు. 200 00:17:54,610 --> 00:17:58,660 ఒక మాట చెప్తా. మేము ఆ విషయాన్ని పరిశీలిస్తాం. సరేనా? మాటిస్తున్నా. 201 00:18:00,660 --> 00:18:03,270 వాళ్ళు చావాలి. నువ్వు చంపుతుండగా నేను చూడాలి. 202 00:18:03,470 --> 00:18:07,730 ఎవరూ ఎవరినీ చంపరు. ఈ విషయాన్ని పోలీసులతో కలిసి వ్యవహరిస్తున్నా. 203 00:18:07,930 --> 00:18:11,990 - ఇదొక సరైన నేరవిచారణ. - పోలీసులను ఎప్పటి నుండి నమ్ముతున్నావు? 204 00:18:12,190 --> 00:18:15,670 అది నన్ను బాధపెట్టడం లేదనుకుంటున్నావా? మీ అమ్మను ప్రేమించాను. 205 00:18:16,550 --> 00:18:19,370 అన్నిటినీ చూసుకుంటున్నా, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. 206 00:18:19,570 --> 00:18:20,790 అంతటా పోలీసులు ఉన్నారు. 207 00:18:20,990 --> 00:18:23,720 ఇక నువ్వు ఏ మూర్ఖపు పని చేయకూడదు, పిల్లా. 208 00:18:25,480 --> 00:18:26,430 నా మాట వినపడిందా? 209 00:18:28,650 --> 00:18:30,860 సరే. వెళ్ళే సమయమైంది. 210 00:18:33,980 --> 00:18:35,740 టెర్రీ, రాక్సీని బయటకు పంపు. 211 00:18:38,150 --> 00:18:39,280 అది నావాడంటే. 212 00:18:39,820 --> 00:18:45,080 నాకు తెలుసు. అతను బుధవారం అన్నాడు, కనుక అతని కాల్ కోసం చూస్తున్నా. 213 00:18:45,950 --> 00:18:49,340 తెలియదు, కెయిట్లిన్. అతను మారుతాడని నేను ఎందుకు అనుకుంటా? 214 00:18:49,540 --> 00:18:53,800 ఈ వెధవ నుండి విముక్తి పొందటానికి నేను ఏ బాల్య ఘట్టాలను తరచి చూడాలి? 215 00:18:56,300 --> 00:19:01,340 ఓహ్ దేవుడా. సరే, చూడు. నేను వెళ్ళాలి. సరే. 7‌‌‌:30కు. 216 00:19:03,430 --> 00:19:06,390 - దీన్ని తాకట్టుపెట్టాలి. - అబ్బో. 217 00:19:08,230 --> 00:19:12,150 - ఇది దేనికైనా చెందినదా? - ఒక హారం నుండి వచ్చేసింది. 218 00:19:16,110 --> 00:19:17,820 హారం అంటున్నావా? 219 00:19:22,320 --> 00:19:25,700 దీనిపై కొన్ని గీతలు పడ్డాయి. 220 00:19:32,960 --> 00:19:34,500 దీనికి 100 డాలర్లు ఇస్తా. 221 00:19:35,630 --> 00:19:38,760 - అది నిజమైన కెంపు. - నీకు 100 డాలర్లు ఇస్తానన్నా. 222 00:19:39,130 --> 00:19:40,550 ఆ పాముచేపలు గుర్తున్నాయా? 223 00:19:41,630 --> 00:19:44,430 అవి చేపలు నేరుగా తమ నోట్లోకి వచ్చేలా చేసుకున్నాయి. 224 00:19:47,180 --> 00:19:50,480 లేదు, లేదు. నా డబ్బును మత్తుపదార్థాల బానిసకు ఇవ్వను. 225 00:19:50,690 --> 00:19:52,440 - అది నన్ను... - కాదు, నువ్వు అదే. 226 00:19:52,940 --> 00:19:56,840 క్షమించండి. నాకు తల తిరుగుతోంది. రక్తదానం చేశాను. 227 00:19:57,040 --> 00:20:00,650 - ఏం చేశావు? - రక్తం. ఒక సిసాకు 50 డాలర్లు ఇస్తారు. 228 00:20:02,860 --> 00:20:06,690 - రక్తం ఇచ్చాక కుకీ తినడం మరచిపోయా. - అయ్యో. సరే. 229 00:20:06,880 --> 00:20:09,810 - సరే, కూర్చో. కూర్చో. - కచ్చితంగానా? 230 00:20:10,010 --> 00:20:12,750 కచ్చితంగా చెబుతున్నా. ఆ కుర్చీలో కూలబడు. 231 00:20:17,800 --> 00:20:22,630 - తాగడానికి ఏమైనా ఇస్తారా, దయచేసి? - తప్పకుండా. తప్పుతుందా మరి. 232 00:20:29,850 --> 00:20:30,790 క్రిస్మస్ ప్రత్యేకత! 233 00:20:30,990 --> 00:20:33,060 నీ దగ్గరున్నది ఏ తుపాకీకన్నా మెరుగైనది. 234 00:20:33,900 --> 00:20:36,770 - చూస్తావుగా. - ఇదిగో బంగారం. పళ్ళరసం తాగు. 235 00:20:42,150 --> 00:20:43,110 కుకీ కావాలా? 236 00:20:46,620 --> 00:20:47,530 ఓరి నాయనో. 237 00:20:49,410 --> 00:20:51,750 ఒక నిమిషంలో అక్కడుంటా, బిల్లీ. 238 00:20:52,000 --> 00:20:53,210 నేను చూస్తున్నానంతే. 239 00:21:06,090 --> 00:21:09,470 ఇలాంటి నిజమైన కెంపుకు, నాకు తెలిసి దీని విలువ... 240 00:21:11,810 --> 00:21:13,600 150 డాలర్లు ఉంటుంది. 241 00:21:15,310 --> 00:21:16,150 ధన్యవాదాలు. 242 00:21:19,770 --> 00:21:21,990 నన్నొక పిచ్చిదానిలా చూపిస్తున్నావు. 243 00:21:22,530 --> 00:21:24,720 చేరాల్సిన చోటుకు చేరుకోవడానికి సాయపడుతున్నా. 244 00:21:24,920 --> 00:21:27,990 - అది ఎక్కడుంది? - అది చూడగానే నీకే తెలుస్తుంది. 245 00:21:28,280 --> 00:21:29,580 సరే, అలాగే. 246 00:21:59,480 --> 00:22:00,520 నాతో మాట్లాడు. 247 00:22:01,440 --> 00:22:06,390 ఎన్‌డూడి ఎలాంటి సమస్యలో చిక్కుకుంది? జనాలు తనను మంత్రగత్తె అంటున్నారు. 248 00:22:06,590 --> 00:22:09,240 - తను అలా కాదని నీకు తెలుసు. - ఆ మాట తన తండ్రికి చెప్పు. 249 00:22:16,210 --> 00:22:19,040 నువ్వు నాకు అర్థమే కావటం లేదు. 250 00:22:21,670 --> 00:22:25,370 జుజూ ప్రమాదకరమైనదని నీకు తెలుసు. వీటితో ఎందుకు ఆటలాడుతున్నావు? 251 00:22:25,560 --> 00:22:26,760 నేను ఇది ఊహించలేదు. 252 00:22:28,380 --> 00:22:30,470 ఓ కథను అనుసరించానంతే. 253 00:22:32,390 --> 00:22:34,890 - క్షమించు. - దీన్ని నువ్వు పరిష్కరించాలి. 254 00:22:35,810 --> 00:22:38,380 ఇది మీ చెల్లితో అసలు మాట్లాడకు. 255 00:22:38,580 --> 00:22:40,770 తనకు ఈ కొత్త ఆలోచనలు రావాలనుకోను. 256 00:22:41,190 --> 00:22:42,400 నా మాట వినపడిందా? 257 00:22:49,740 --> 00:22:50,620 ఫర్వాలేదు. 258 00:23:13,220 --> 00:23:15,010 వీడియోల అప్లోడ్ 259 00:23:21,650 --> 00:23:24,360 {\an8}దయచేసి సాయం చేయండి!! ఇదేంటో ఎవరికైనా తెలుసా? 260 00:23:38,500 --> 00:23:43,500 ఇంటర్న్స్‌లో ఒకరు దీన్ని కనుగొన్నారు. నైజీరియాలోని ఓ కుర్రాడు పోస్ట్ చేశాడు. 261 00:23:44,000 --> 00:23:47,420 టుండే ఓజో. 12 అనుచరులు కల వ్లాగర్. 262 00:23:48,340 --> 00:23:51,550 స్నాప్‌చాట్ ఉన్న ఎవరైనా ఇలా చేయగలరు, కదా? 263 00:23:52,260 --> 00:23:56,220 - అంటే ఫిల్టర్లు అలాంటిది ఏదైనానా? - దేవుడా, చాలా నిజంగా అనిపిస్తోంది. 264 00:23:56,510 --> 00:23:58,250 ఇక నువ్వు వ్యాఖ్యలు చదవాలి. 265 00:23:58,450 --> 00:24:01,800 ఇలా తమకూ జరుగుతోందని చెబుతోన్న పిల్లలతో నిండిపోయాయి. 266 00:24:01,990 --> 00:24:06,230 లేదా ఇంతకు ముందే చూసినట్టు చెప్పేవారితో. తమ చేతుల్లో నుండి విద్యుత్ వస్తోందట. 267 00:24:07,940 --> 00:24:10,400 - అంతా టీనేజీ అమ్మాయిలేనా? - చూసినంతలో, అవును. 268 00:24:12,660 --> 00:24:16,020 - గవర్నర్ డాండన్‌ నుండి కబురు అందిందా? - రోజంతా సమావేశాల్లో ఉన్నాడు. 269 00:24:16,220 --> 00:24:19,940 చెత్త. ఇది సెనేట్ ఎన్నికల ప్రచారం. నిధులు సేకరిస్తున్నాడు. 270 00:24:20,140 --> 00:24:24,540 ఇవాళ రాత్రి బంగళాలో దాతలకోసం కార్యక్రమం ఉందని అతని సహాయకుడు అన్నాడు. 271 00:24:25,750 --> 00:24:27,130 ఛత్. 272 00:24:27,800 --> 00:24:32,380 నా పెళ్ళిరోజున నేను చెత్త ఒలంపియాకు వెళుతున్నానమాట. 273 00:24:34,180 --> 00:24:36,540 రాబ్‌కు కాల్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్తావా? 274 00:24:36,740 --> 00:24:41,790 - తప్పకుండా. నాకొక సాయం చేస్తావా? - సరే, మంత్రగత్తె. ఇవేంటి? 275 00:24:41,990 --> 00:24:46,150 డాండన్‌ భవనం దగ్గర పత్రికలవారు ఉంటే. ఆ చెప్పులపై ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి. 276 00:24:46,520 --> 00:24:49,220 - చాలా ఖరీదైనవట. - ఈ చెప్పులా? 277 00:24:49,420 --> 00:24:54,060 800 డాలర్లవా? ఎందుకంటే నేను "ఆకాంక్షలున్న వ్యక్తి"గా కనపడాలని నువ్వు అన్నావుగా? 278 00:24:54,260 --> 00:24:56,870 క్షమించు. ప్రగతిశీల మద్దతుదారులకు చంచలత్వం ఎక్కువ. 279 00:24:59,410 --> 00:25:00,580 ఇవి ఫర్వాలేదు. 280 00:25:03,620 --> 00:25:04,710 సరే. 281 00:25:06,460 --> 00:25:08,920 - నొప్పి పెడుతున్నాయి. - ధరకు తగిన సరుకు. 282 00:25:09,120 --> 00:25:12,530 తెలుసా, గవర్నర్ డాండన్ 1,000 డాలర్ల ఖరీదైన చెప్పులు వేసుకుంటాడు. 283 00:25:12,730 --> 00:25:17,220 దానిపై ఎవరూ ఏమీ మాట్లాడరు. నా షూస్ గురించి మాట్లాడేవాళ్ళు పనీపాటా లేనివాళ్ళు. 284 00:25:22,850 --> 00:25:25,480 ప్రపంచ పౌరశాస్త్ర పరీక్ష ఎలా జరిగింది? ఎలా రాశావు? 285 00:25:26,600 --> 00:25:29,570 - ఫర్వాలేదు. - ఫర్వాలేదా? ఫర్వాలేదు అంతేనా? 286 00:25:30,110 --> 00:25:32,150 - అవును. - సరే. 287 00:25:36,160 --> 00:25:38,030 అంతా బాగుందా, జాస్? 288 00:25:39,280 --> 00:25:40,740 అంతా బాగుందా, జాస్? 289 00:25:41,700 --> 00:25:43,120 అంతా బాగుందా, జాస్? 290 00:25:46,580 --> 00:25:48,880 నాలో ఉంది ఎంతో మంచితనం ఇదిగో పసందైన పరిచయం 291 00:25:49,080 --> 00:25:51,610 మీ అమ్మకు, నాన్నకు చెప్పు టెలిగ్రామ్ పంపు 292 00:25:51,810 --> 00:25:54,200 బ్యాటరీని నేనిక ఎందుకంటే నాకుంది సుదీర్ఘ మన్నిక 293 00:25:54,400 --> 00:25:57,200 నా సిబ్బంది వెధవలు కారు ఎందుకంటే మా ఐక్యతే మా జోరు 294 00:25:57,400 --> 00:25:59,010 అద్దీ, అద్దీ. 295 00:26:04,640 --> 00:26:08,900 ఓరి దేవుడా. నీ వయసులో నేను అలాంటి సంగీతం వినేవాడిని. 296 00:26:09,520 --> 00:26:12,900 అప్పట్లో నాకు ఇది బాగా నచ్చేది. ఓరి దేవుడా. 297 00:26:13,230 --> 00:26:16,780 నువ్వు దీన్ని ఎప్పుడైనా వినాలి. నీకు నచ్చుతుందనుకుంటాను. 298 00:26:17,150 --> 00:26:20,600 వీళ్ళు సరదాగా పాటలు చేయరు, వీరికి సామాజిక స్పృహ కూడా ఉండేది. 299 00:26:20,800 --> 00:26:23,240 అంటే, "వోక్" రాకముందే వారికి ఆ చైతన్యం ఉండేది. 300 00:26:23,540 --> 00:26:27,770 ఇక పాత సంగీతం చొప్పించడం? దేవుడా. అన్నీ ఉండేవి. ప్రపంచ సంగీతం వాడేవారు. 301 00:26:27,970 --> 00:26:31,630 జాజ్. ఈరోజుల్లో పాత సంగీతం చొప్పిస్తారని తెలుసు, కానీ ఆ రోజుల్లో... 302 00:26:33,800 --> 00:26:37,220 అర్థమైంది. నేను పాతకాలపు నాన్నను. నోర్మూసుకుని, బండి నడుపుతా. 303 00:26:40,550 --> 00:26:41,600 ఛత్. 304 00:26:43,390 --> 00:26:44,430 ఏమై౦ది? 305 00:26:47,270 --> 00:26:50,650 - ఛత్, బంగారం. బాగున్నావా? - బాగున్నా. 306 00:26:51,060 --> 00:26:52,230 అసలు ఏంటది? 307 00:26:53,440 --> 00:26:56,820 తెలియదు. అంటే స్థిరవిద్యుత్ షాక్‌ లాంటిదో ఏదో. 308 00:26:59,320 --> 00:27:02,530 జాస్, మైక్రోవేవ్‌తో జరిగిన అగ్నిప్రమాదం కూడా ఇలాంటిదేనా? 309 00:27:05,370 --> 00:27:06,750 - జాస్? - కాదు. 310 00:27:07,250 --> 00:27:08,440 - నాకు చెప్పొచ్చు. - కాదు. 311 00:27:08,640 --> 00:27:12,670 దేవుడా. బహుశా నీ స్టీరియో కూడా పాతదేమో, నీ చెత్త సంగీతంలా. 312 00:27:13,290 --> 00:27:14,340 జాస్. 313 00:27:50,160 --> 00:27:54,710 రాబీనా, ససాటీనా. పెద్ద అబ్బాయిలు, అందమైన అమ్మాయిలు. రాబీనా, ససాటీనా. 314 00:27:54,960 --> 00:27:59,260 పెద్ద అబ్బాయిలు, అందమైన అమ్మాయిలు. రాబీనా, ససాటీనా. పెద్ద అబ్బాయిలు... 315 00:28:14,190 --> 00:28:15,150 నువ్వు బాగున్నావా? 316 00:28:17,020 --> 00:28:19,150 - సమస్య ఏంటి? - స్టార్ట్ అవ్వటం లేదు. 317 00:28:19,570 --> 00:28:21,570 - ఒకసారి చూడనా? - ఒకతను వస్తున్నాడు. 318 00:28:23,070 --> 00:28:27,280 నిన్ను తక్కువ అంచనా వేసే మరో మగాడు. ఇక్కడ చూడటానికి ఏమీ లేదు. 319 00:28:27,870 --> 00:28:29,810 - మీ గమ్యం? - ఉచిత ఆహార శిబిరం. 320 00:28:30,010 --> 00:28:32,040 నోర్ముయ్, మన విషయాలు అందరికీ చెబుతున్నావు. 321 00:28:32,240 --> 00:28:35,110 నేను కార్ల చుట్టూ పెరిగాను. మా నాన్న మెకానిక్. 322 00:28:35,310 --> 00:28:37,460 నీ వెనుక జేబులో జంపర్ వైర్లు ఉన్నాయా? 323 00:28:37,750 --> 00:28:38,750 అవును, ఉండచ్చేమో. 324 00:28:40,970 --> 00:28:45,220 - ఒంటరిగా ఎక్కడి నుండి వస్తున్నావు? - నా బస్ మిస్సయ్యాను. 325 00:28:47,350 --> 00:28:49,420 నువ్వు నాకు చేయగల సాయం ఏంటో తెలుసా? 326 00:28:49,620 --> 00:28:52,690 స్టార్ట్ చేయగానే యాక్సిలరేటర్ వైరు కదులుతోందో లేదో చెప్పు. 327 00:29:00,730 --> 00:29:01,690 సిద్ధమా? 328 00:29:05,910 --> 00:29:07,910 - ఏమీ కాలేదా? - మళ్ళీ ప్రయత్నించు. 329 00:29:12,710 --> 00:29:13,580 మళ్ళీ. 330 00:29:14,790 --> 00:29:16,610 - తను మాంత్రికురాలా? - ఏదైనా కదిలిందా? 331 00:29:16,810 --> 00:29:17,990 - దుష్టమంత్రగత్తె. - మళ్ళీ. 332 00:29:18,190 --> 00:29:20,970 - అమ్మాయిలు మాంత్రికులు కాలేరు. - అమ్మాయిలు ఏమైనా కాగలరు. 333 00:29:21,170 --> 00:29:22,210 మరోసారి. 334 00:29:34,310 --> 00:29:35,480 నువ్వేం చేశావు? 335 00:29:38,650 --> 00:29:40,630 - వద్దు, శాంతించు. - తను గాయపరిచింది. 336 00:29:40,830 --> 00:29:41,970 - నాన్నా. - ఏం జరుగుతోంది? 337 00:29:42,170 --> 00:29:44,390 - తను గాయపరిచింది. - నా పిల్లలకు దూరంగా పో. 338 00:29:44,590 --> 00:29:48,180 - ఆమె వేడి ఇంజన్‌పై చేయి పెట్టింది. - నా కూతుర్లకు దూరం జరుగు. 339 00:29:48,380 --> 00:29:50,830 - నన్ను తాకొద్దు. - నాన్నా. నాన్నా. 340 00:29:51,160 --> 00:29:52,100 ఛత్. 341 00:29:52,300 --> 00:29:55,920 - కారు ఎక్కండి. - నాన్నా. నాన్నాా. 342 00:29:56,460 --> 00:29:57,230 నీకేం కాలేదుగా? 343 00:29:57,430 --> 00:30:00,380 - నాన్నా. నాన్నా. - సరే, అమ్మాయిలు. ఏం కాలేదు. 344 00:30:05,800 --> 00:30:08,390 నా మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది. 345 00:30:17,440 --> 00:30:18,270 హేయ్. 346 00:30:32,120 --> 00:30:37,080 చెత్త సోది. ఏం చేశావు? సైకిల్ నడపడం కూడా రాదా? 347 00:30:37,370 --> 00:30:41,500 వెధవ పిల్లా. ఏంటీ దారుణం? 348 00:31:16,700 --> 00:31:20,290 - నీకేసి చూస్తూనే ఉన్నాడు. - నువ్వు తనకేసి చూస్తూ ఉండటం వల్లేమో. 349 00:31:22,590 --> 00:31:25,250 - అక్కడికి వెళ్ళు. - వెళ్ళనే వెళ్ళను. 350 00:31:25,670 --> 00:31:27,320 ఎందుకు? దేనికి భయపడుతున్నావు? 351 00:31:27,520 --> 00:31:30,550 అతను బ్రీ డియాజ్‌తో తిరుగుతున్నాడు. నేనలా డాన్స్ చేయలేను. 352 00:31:31,930 --> 00:31:35,540 జాస్, నువ్వు మరీ. ఇదేమీ మంచుపై నృత్యం కాదు. ఊరికే వెళ్ళి... 353 00:31:35,740 --> 00:31:37,680 ఆపు. దేవుడా. 354 00:31:41,400 --> 00:31:44,900 ఒక వారం క్రితం, నా జీవితం పదికి నాలుగులా ఉండేది. 355 00:31:47,440 --> 00:31:50,610 - ఇప్పుడు పదికి ఏడులా ఉంది. - ఏడేనా? 356 00:31:51,700 --> 00:31:53,820 మనం విద్యుత్‌తో వస్తువులు కాల్చగలం. 357 00:31:55,530 --> 00:32:00,750 మనం వస్తువులు పేల్చేయగలం. ఏంటి, ఏడేనా? కాదు. పదికి పది. 358 00:32:02,000 --> 00:32:03,790 అది నికార్సయిన పది. 359 00:32:29,780 --> 00:32:31,490 - మార్గోట్. - డానియల్. 360 00:32:31,860 --> 00:32:34,660 - ఆలస్యమైంది. - నా కార్యాలయం కాల్ చేసింది. చాలాసార్లు. 361 00:32:42,960 --> 00:32:45,230 - ధన్యవాదాలు. - మనం స్టడీ గదిలో మాట్లాడదాం. 362 00:32:45,430 --> 00:32:46,210 తప్పకుండా. 363 00:32:47,130 --> 00:32:50,800 అందరూ, ఈవిడ మేయర్ మార్గోట్ క్లియరీ లోపెజ్. 364 00:32:51,170 --> 00:32:54,870 - అంతరాయానికి క్షమించండి. - నీకు పంచకూడదా లేదా ఆమెకూ పంచాలా? 365 00:32:55,070 --> 00:32:56,970 5 ని.ల విరామం. ఎక్కువ సేపు పట్టదు. 366 00:33:01,480 --> 00:33:05,340 ఇప్పుడున్న అల్లకల్లోలంలో, పేకాట రాత్రికి ఆతిథ్యమిస్తున్నావంటే నమ్మలేను. 367 00:33:05,540 --> 00:33:06,340 అవును. 368 00:33:06,540 --> 00:33:11,320 నీ నివాస పథకాలకు, అక్షరాస్యతా కార్యక్రమాలకు నిధులిచ్చే వారితో పేకాట. 369 00:33:11,820 --> 00:33:12,900 రాజకీయాలంటే అదే. 370 00:33:13,570 --> 00:33:16,870 జీవితాలను మార్చే ఒప్పందాలు కొన్నిసార్లు పేకాట బల్లలపై జరుగుతాయి. 371 00:33:17,830 --> 00:33:20,040 - కంబూచా కావాలా? - తప్పకుండా. థాంక్స్. 372 00:33:25,830 --> 00:33:26,670 ధన్యవాదాలు. 373 00:33:37,390 --> 00:33:41,500 అయితే, నాకు నీ సందేశాలు వచ్చాయి, రేపు ఉదయాన్నే కాల్ చేద్దామనుకున్నా. 374 00:33:41,700 --> 00:33:44,960 - నా నుండి నీకేం కావాలి? - మొదట, నా ఫోన్ ఎత్తు. 375 00:33:45,160 --> 00:33:48,420 - మనం సంక్షోభ స్థితిలో ఉన్నాం. - ఆర్పాల్సిన మంటలు చాలా ఉన్నాయి. 376 00:33:48,620 --> 00:33:51,180 కొన్ని నిజమైన మంటలే, కానీ "సంక్షోభం" పెద్ద మాట. 377 00:33:51,370 --> 00:33:54,610 "నాన్నలాంటి డాండన్ అన్నీ అదుపులో పెట్టాడు" అన్నట్టు మాట్లాడకు. 378 00:33:55,030 --> 00:33:57,720 ప్రచారంతో ప్రజల దృష్టిని మరలుస్తున్నావని తెలుసు... 379 00:33:57,920 --> 00:33:59,270 ఇది నా ప్రచారం గురించి కాదు. 380 00:33:59,470 --> 00:34:01,980 రాత్రి నా కార్యాలయానికి వచ్చి, "కొ౦ప మునుగుతో౦ది" 381 00:34:02,180 --> 00:34:04,330 అని నువ్వు అరవటం గురించి. ఓ మాట చెప్పనా. 382 00:34:04,870 --> 00:34:07,920 కొ౦పలు ఎప్పుడూ మునుగుతూనే ఉంటాయి. దీన్నే పాలన అ౦టారు. 383 00:34:08,830 --> 00:34:11,090 పాలన మరింత సమర్థంగా చేయడానికి ఎలా సాయపడగలను? 384 00:34:11,460 --> 00:34:14,260 మా అత్యవసర సేవలకు నిధులు లేవు. అత్యవసర నిధులు కావాలి. 385 00:34:15,010 --> 00:34:16,220 ఇంకా ఏదైనా ఉందా? 386 00:34:18,510 --> 00:34:19,640 సరే. 387 00:34:21,850 --> 00:34:25,540 ఒకటి చూపెడతాను, అది విడ్డూరంగా కనపడుతుందని నాకు తెలుసు, సరేనా? 388 00:34:25,740 --> 00:34:27,940 కానీ ఊరికే చూడు. చూడు, అంతే. 389 00:34:35,740 --> 00:34:40,740 జరుగుతోన్న ప్రతీ విషయం, దీనికి సంబంధించినది అనుకుంటా. 390 00:34:42,030 --> 00:34:44,040 - మార్గోట్... - తెలుసు, నాకు తెలుసు. 391 00:34:47,790 --> 00:34:49,340 అది యూజర్‌లో ఉండే వీడియో. 392 00:34:49,540 --> 00:34:52,570 అవును. ఇప్పుడున్న నివేదికలన్నీ అర్థమయ్యేలా చేస్తోంది అదే. 393 00:34:52,770 --> 00:34:56,050 - ఒత్తిడిలో ఉన్నట్టున్నావు. - ఉన్నాను. నా నగరం కాలిపోతోంది. 394 00:34:56,260 --> 00:34:59,260 - ఇది నీ పెళ్ళి రోజు కదా? - అవును. 395 00:34:59,890 --> 00:35:01,870 - ఎన్నేళ్ళయ్యింది? - ఇరవై ఏళ్ళు. 396 00:35:02,070 --> 00:35:06,600 అది అద్భుతం. రాజకీయాల్లో ఇలాంటి సంతులనం పొందటం కష్టం. 397 00:35:07,600 --> 00:35:10,090 దీన్ని నిశ్శబ్దంగా శోధించమని బృందాన్ని నియమిస్తా. 398 00:35:10,290 --> 00:35:13,400 ఇక అది జరుగుతుండగా, నువ్వు ఓపికగా, మౌనంగా వేచి చూడాలి. 399 00:35:14,360 --> 00:35:17,450 అంతలోపు, నీకు కావాల్సిన నిధులను మళ్ళిస్తాను. 400 00:35:17,650 --> 00:35:18,450 ధన్యవాదాలు. 401 00:35:19,030 --> 00:35:24,660 కానీ మార్గోట్, నువ్వన్నా, నీ కెరియర్ అన్నా అక్కర ఉన్నవాడిగా ఇది చెబుతున్నాను. 402 00:35:25,540 --> 00:35:28,210 శాంతించు. ఇంటికెళ్లు. మీ ఆయనతో సమయం గడుపు. 403 00:35:30,870 --> 00:35:32,290 సరే. నువ్వన్నది సరైనదే. 404 00:35:35,420 --> 00:35:38,300 - ధన్యవాదాలు. - హేయ్. ఫర్వాలేదు. 405 00:35:38,500 --> 00:35:42,390 నేను౦డగా నువ్వు పెద్ద పేచీల పేరమ్మ లా కొ౦గారే౦ పడనక్కర్లేదు. 406 00:35:43,720 --> 00:35:47,390 - పేచీల పేరమ్మా? - నా ఉద్దేశ౦ అర్థమైంది కదా. 407 00:35:49,350 --> 00:35:53,230 అవును. అవును. నువ్వు కచ్చితంగా ఏమన్నావో అర్థమైంది. 408 00:36:00,280 --> 00:36:01,240 ఛత్. 409 00:36:06,700 --> 00:36:08,950 థాయ్ ఆహారంలో చివరగా మిగిలినవి అవే. 410 00:36:10,540 --> 00:36:12,690 ఆలస్యంగా కబురు అందింది. క్షమించు. 411 00:36:12,890 --> 00:36:15,740 మన ఫ్రెంచ్ హోటల్లో కూడా బల్ల రిజర్వ్ చేశాను. నిజంగా. 412 00:36:15,940 --> 00:36:20,370 నాకు పిచ్చ ఆకలిగా ఉంది, ఇది బాగుంది. చాలా థా౦క్స్. 413 00:36:20,570 --> 00:36:23,430 నన్ను క్షమించు. 414 00:36:24,340 --> 00:36:28,350 దాని గురించి దిగులుపడకు. ఫ్రెంచ్ ఆహారం ఎలాగూ నాకు కాడుపు పాడుచేస్తు౦ది. 415 00:36:30,810 --> 00:36:34,510 - ఈ పువ్వులను ఎక్కడ తెచ్చావు? - పక్కింటివారి పూలకుండీ నుండి. 416 00:36:34,700 --> 00:36:37,800 వారి పిల్లి మన ఇసుకలో పాడుచేసేది. పరవాలేదులే. 417 00:36:38,000 --> 00:36:39,740 నిజమే. లెక్క సరిపోయింది. 418 00:36:40,860 --> 00:36:44,820 - ఛత్. ఏం జరిగింది? - ఇంటర్నెట్‌కు నా షూస్‌ అంటే ద్వేషమట. 419 00:36:45,620 --> 00:36:49,700 - అలాగే నా ముఖం కూడా. - దాన్ని తాకకు. నేను చూసుకుంటా. 420 00:36:51,870 --> 00:36:55,130 నీ రోజు ఎలా గడిచింది? ఏదైనా సరదాగా, ఆసక్తికరంగా జరిగిందా? 421 00:36:56,340 --> 00:37:01,740 లేదు. లేదు. నేను నా రోజు గురించి మాట్లాడాలనుకోవడం లేదు. 422 00:37:01,940 --> 00:37:04,470 సరే. మరైతే దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నావు? 423 00:37:07,050 --> 00:37:10,750 నీ పురుష ప్రదేశ శుభ్రత. అవును, దాని గురించి మాట్లాడుదాం, డా. లోపెజ్. 424 00:37:10,950 --> 00:37:13,190 సరే. సరే, బుజ్జమ్మా. 425 00:37:14,520 --> 00:37:15,560 ఇది తీసుకో. 426 00:37:25,610 --> 00:37:28,120 వద్దు. తెలుసా? మనం నీ రోజు గురించి మాట్లాడుదాం. 427 00:37:29,160 --> 00:37:33,650 లేదు. నాకు మాట్లాడాలని లేదు. నా రోజు గురించి మనం ఎందుకు మాట్లాడాలి? 428 00:37:33,850 --> 00:37:37,150 అలా నీ గొంతుతో ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా సరే, 429 00:37:37,350 --> 00:37:39,530 ఏదో జరుగుతోందని నాకు అర్థమవుతోంది, సరేనా? 430 00:37:39,730 --> 00:37:41,030 దాన్ని తొక్కిపెడుతున్నావు. 431 00:37:41,230 --> 00:37:42,990 ఆ విషయాన్ని బయటకు చెప్పకపోతే, 432 00:37:43,190 --> 00:37:46,390 అంతటా పేలిపోయి మన రాత్రిని పాడుచేస్తుంది. సరేనా? 433 00:37:50,510 --> 00:37:53,810 క్షమించు. ఇవాళ నాకొక రోగి వచ్చింది. 434 00:37:54,520 --> 00:37:58,650 పాపం ఓ టీనేజీ పిల్ల. పూర్తి ఆవేశంతో ఉంది. వింతగా అనిపించింది. 435 00:37:59,060 --> 00:38:02,480 తనకు మతిపోయేలా మందులిచ్చినా సరే, తనకు ఆవేశం తగ్గలేదు. 436 00:38:03,530 --> 00:38:04,570 ఏంటో తెలియదు. 437 00:38:05,610 --> 00:38:08,810 ఈరోజుల్లో మొత్తం ప్రపంచమే ముగిసిపోయేలా అనిపిస్తోంది. 438 00:38:09,010 --> 00:38:12,660 అందుకే నువ్వు ఆ చెత్తను వెళ్ళగక్కాలి. సరేనా? 439 00:38:13,950 --> 00:38:18,820 నేను వెళ్ళగక్కలేను. నా ముఖం, ఒక క్షణం పాటు మరీ కోపంగా కనిపించినా, భావోద్రేకమైనదానిగా, 440 00:38:19,020 --> 00:38:24,070 హేతుబద్ధతలేనిదానిగా, కోపిష్టిగా, ఎన్నికకు అయోగ్యురాలిగా ముద్రించబడతాను. 441 00:38:24,270 --> 00:38:25,990 చెత్త. ఇది మన ఇల్లు. 442 00:38:26,190 --> 00:38:29,510 నేను నీ భర్తను. ఇక్కడ నువ్వు కోపంగా ఉండొచ్చు, సరేనా? 443 00:38:29,760 --> 00:38:32,680 కనుక, ఆ గొడవను మొదలెట్టు. కానివ్వు. ఆగ్రహాన్ని చూపించు. 444 00:38:34,850 --> 00:38:35,730 సరే. 445 00:38:40,110 --> 00:38:43,730 ఈ నగరంలో ఘోరాలు జరుగుతున్నాయి. నిజమైన ఘోరాలు అంటున్నా, సరేనా? 446 00:38:44,570 --> 00:38:47,860 కానీ మరోవైపు, సెల్‌ఫోన్‌లు, సంక్షిప్త సందేశాలు, 447 00:38:48,110 --> 00:38:50,140 ఈమెయిల్స్, పానోగ్రామ్‌లు ఉన్న ఈ కాలంలో, 448 00:38:50,340 --> 00:38:54,540 అతనితో రెండు నిమిషాలు మాట్లాడటానికి నేను ఒలంపియాకు వెళ్ళాల్సి వచ్చింది. 449 00:38:55,040 --> 00:38:57,710 - ఆపై, నాతో ఏమన్నాడో తెలుసా? - తెలియదు. ఏమన్నాడు? 450 00:38:58,120 --> 00:39:03,090 పేచీల పేరమ్మ లా మాట్లాడకన్నాడు. 451 00:39:04,590 --> 00:39:07,450 నా భార్య పెచీల గురి౦చి వాడలా మాట్లాడటం నాకు నచ్చలేదు. 452 00:39:07,650 --> 00:39:09,580 - వాడిని తంతావా? - ఆగు. నువ్వు తన్నలేదా? 453 00:39:09,780 --> 00:39:13,730 - అనుకున్నా. వాడిని ఇరగతన్నేదాన్ని. - నువ్వలా చేయగలవని తెలుసు. 454 00:39:13,930 --> 00:39:17,170 ఏమన్నావు? ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి చెప్పుంటావని తెలుసు. 455 00:39:17,370 --> 00:39:21,420 ఏం అనలేదు. రాజకీయాల్లో ఉన్న మహిళనుగా. రోజంతా నా ప్రాణాలు తీస్తాడు 456 00:39:21,620 --> 00:39:25,220 - దాన్ని నేను మర్యాదకరంగా స్వీకరించాలి. - వాడికి నువ్వంటే భయం. సరేనా? 457 00:39:25,420 --> 00:39:28,550 ఎందుకంటే నువ్వు వాడికంటే సమర్థమైనదానివి, అర్హతలు కలదానివి. 458 00:39:28,750 --> 00:39:30,970 అందుకే నిన్ను పడగొట్టి, నీ నోరు మూయించాలి. 459 00:39:31,170 --> 00:39:34,640 - కానీ నువ్వు వాడిని గెలవనివ్వవు. - అతను ఇప్పటికే గెలిచాడు. 460 00:39:34,840 --> 00:39:37,910 చక్కగా భోజనం చేసి, మా ఆయనతో శృంగారం చేయాలని కోరుకున్నానంతే. 461 00:39:38,330 --> 00:39:39,500 సరే, అక్కడే ఉండు. 462 00:39:41,250 --> 00:39:43,790 - నువ్వేం... - ఆగు. కదలకు... 463 00:39:49,050 --> 00:39:49,970 ఇదిగో. 464 00:39:52,340 --> 00:39:55,410 ఇదేంటి? అంటే... 465 00:39:55,610 --> 00:39:57,520 ఇదొక కానుకా? లేదా... 466 00:39:58,730 --> 00:40:02,900 ఇది. నీ పిచ్చి తల్లి ఇచ్చిన పెళ్ళి కానుక. 467 00:40:04,110 --> 00:40:07,070 దాన్ని పగలగొట్టు. అవును, కానివ్వు. 468 00:40:08,280 --> 00:40:10,110 పగలగొట్టు. నిజంగా అంటున్నా. 469 00:40:33,970 --> 00:40:38,680 ఓరి దేవుడా. ఛత్. అది చాలా బాగా అనిపించింది. 470 00:40:39,060 --> 00:40:40,430 అలాగా? భలే అనిపించింది కదా? 471 00:40:41,140 --> 00:40:43,980 - సరే. మళ్ళీ చేస్తున్నా. - వద్దు, వద్దు, వద్దు. 472 00:40:46,310 --> 00:40:48,530 ఐకియా పళ్ళాలు తెస్తా ఆగు, సరేనా? వద్దు. 473 00:40:50,030 --> 00:40:51,950 - త్వరగా. - పిచ్చిదానివి. నచ్చింది. 474 00:41:04,290 --> 00:41:06,440 ప్రపంచవ్యాప్తంగా మంటలు చెలరేగుతున్నాయి, 475 00:41:06,640 --> 00:41:09,380 పార్క్‌లు, వ్యాపారాలు, ఇళ్ళు, పాఠశాలలు కాలిపోతున్నాయి. 476 00:41:09,590 --> 00:41:13,010 చాలా సందర్భాల్లో, అధికారులు విస్తుపోయే కారణాలు కనుగొన్నారు. 477 00:41:13,930 --> 00:41:17,010 ఆడపిల్లలు, 12 ఏళ్ళవారు కూడా, కారకులుగా ఉన్నట్టున్నారు. 478 00:41:18,220 --> 00:41:20,350 ఇవి కావాలనే చేస్తున్న దాడులా? 479 00:41:20,970 --> 00:41:24,100 ఇది దారి తప్పిన సోషల్ మీడియాలోని నిప్పంటించే సవాలా? 480 00:41:25,190 --> 00:41:26,630 అధికపని కల అగ్నిమాపక దళాలు, 481 00:41:26,830 --> 00:41:30,610 ప్రపంచవ్యాప్తంగా మంటలను పోరాడుతున్నాయి, జవాబుల కోసం వెతుకుతున్నాయి. 482 00:41:30,940 --> 00:41:34,970 కార్పేథియాలో, అధ్యక్షుడు మోస్కలేవ్ ఈ మహిళలను ఉగ్రవాదులుగా ప్రకటించారు 483 00:41:35,170 --> 00:41:37,750 అలాగే అల్లరి మూకలకు మరణశిక్ష పడుతుందని హెచ్చరించారు. 484 00:41:37,950 --> 00:41:40,740 వాళ్ళు అమ్మాయిలే, విక్టర్. పరాచికాలు ఆడుతున్నారంతే. 485 00:41:42,330 --> 00:41:44,870 దిగులుపడటానికి ఇంకా ముఖ్య విషయాలున్నాయి కదా? 486 00:41:45,210 --> 00:41:49,190 నా సొంత దేశంలో ఏం జరుగుతోందో నాకు తెలియదని అనుకుంటున్నావా? 487 00:41:49,390 --> 00:41:52,780 ...వరుసగా రెండవ రాత్రి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించింది. 488 00:41:52,980 --> 00:41:54,530 వ్యాపార సంస్థలు మూతపడ్డాయి 489 00:41:54,730 --> 00:41:57,720 చాలా కుటుంబాలు లోపలే ఉంటున్నాయి, కొవ్వుత్తుల కాంతిలో. 490 00:41:57,930 --> 00:42:02,390 వీధి దీపాలు కూడా వెలగడం లేదు, ఏకంగా నగరాలే అంధకారంలోకి వెళ్ళిపోయాయి. 491 00:42:03,430 --> 00:42:05,230 ఇక మరోవైపు చైనాలోని జింజౌలో, 492 00:42:05,730 --> 00:42:08,960 సెల్ ఫోన్‌లు తయారు చేసే సంస్థలో మిలియన్ డాలర్ల 493 00:42:09,160 --> 00:42:11,590 విలువైన వస్తువులు విద్యుత్ మంటల వల్ల కాలిపోయాయి. 494 00:42:11,790 --> 00:42:12,650 ఏంటి? 495 00:42:13,780 --> 00:42:15,990 మీకు సందర్శకురాలు వచ్చారు, మోస్కలేవ్ గారు. 496 00:42:17,780 --> 00:42:18,910 మీ అమ్మగారు. 497 00:42:29,790 --> 00:42:31,210 ఇక్కడ పాడు కంపు కొడుతోంది. 498 00:42:31,500 --> 00:42:35,590 ఇంటర్వ్యూలలో నువ్వులా అత్యాశను చూపించకూడదు. నువ్వు వారికి నచ్చవు. 499 00:42:35,840 --> 00:42:39,660 కృతజ్ఞతాభావంతో ఉండాలి. నిన్ను గుర్తించడమే ఆశ్చర్యంగా ఉంది. 500 00:42:39,860 --> 00:42:42,350 నేను మేటి జిమ్నాస్ట్‌ను. అందుకే ఇంటర్వ్యూ చేశారు. 501 00:42:42,810 --> 00:42:45,430 దేవుడా! కనీసం నా మాటైనా నీ చెవిన పడుతోందా? 502 00:42:46,060 --> 00:42:49,600 మరీ అంత తీసుకోకు. మీ అక్క శిక్షణ పొందాలి. 503 00:42:51,560 --> 00:42:54,340 నమ్రత చూపించు. నువ్వేమీ చిన్నపిల్లవు కాదు. 504 00:42:54,540 --> 00:42:57,050 - నేను పని చేయడం లేదు... - మేము... 505 00:42:57,250 --> 00:43:00,070 ఇది నీ గురించి కాదు... 506 00:43:01,070 --> 00:43:05,980 మేము ఈ చెత్త పని గంటలతో మూడు ఉద్యోగాలను చేస్తోన్నది నీ శిక్షణకు చెల్లించడానికి, 507 00:43:06,180 --> 00:43:09,620 నీ అహంకారంతో దాన్ని పాడు చేయడానికి కాదు. 508 00:43:10,630 --> 00:43:13,420 అదంతా లోపల పెట్టుకుంటే ఫల్టీ కొట్టలేవు. 509 00:43:15,090 --> 00:43:18,010 సరే. సరే. నాకు అర్థమైంది. అత్యాశ వద్దంటావు. 510 00:43:18,380 --> 00:43:19,430 కాదు. కాదు. 511 00:43:19,630 --> 00:43:24,600 అత్యాశతో ఉండు. నిస్సందేహంగా. 512 00:43:24,970 --> 00:43:27,330 నువ్వు కచ్చితంగా అత్యాశతో ఉండాలని అంటున్నా, 513 00:43:27,530 --> 00:43:30,350 కానీ నీకు లక్ష్యం ఉన్నట్టు వారికి కనపడకూడదు. 514 00:43:30,770 --> 00:43:36,400 వారికి అది నచ్చదు. నువ్వు ముచ్చటైన చిన్నపిల్లగా ఉండాలి. 515 00:43:50,620 --> 00:43:51,670 పరుపు ఎక్కు. 516 00:44:09,430 --> 00:44:11,810 అన్నీ చక్కగా సమకూర్చుకున్నావు. 517 00:44:15,650 --> 00:44:17,150 షోకుల టక్కులాడి. 518 00:44:30,080 --> 00:44:32,120 నాకు ఏమైనా ఇస్తావా? 519 00:44:38,380 --> 00:44:41,930 - నువ్వు క్రూరమైనదానివి. - నేను మేటి క్రూరుల నుండి నేర్చుకున్నా. 520 00:44:46,180 --> 00:44:51,100 మీ నాన్న చనిపోయారు. ఆయన చనిపోయి, నాకు ఏమీ మిగల్చలేదు. 521 00:44:51,940 --> 00:44:53,650 ఇంట్లో ఒక్క గింజైనా లేదు. 522 00:44:56,400 --> 00:45:00,860 ప్రస్తుతం జీవితం కష్టంగా ఉంది. పని దొరకటం లేదు. 523 00:45:03,910 --> 00:45:05,450 నాకు ఏ ఆధారమూ లేదు. 524 00:45:08,370 --> 00:45:14,040 మూడు వారాలుగా చక్కటి ఆహారం తినలేదు. స్నానం చేసుకునే చోటు లేదు. 525 00:45:15,920 --> 00:45:17,880 ఇక నా మడమశూలలు. 526 00:45:19,170 --> 00:45:22,950 నా దరిద్రపు మడమశూలలు చూడు. 527 00:45:23,150 --> 00:45:25,590 వాటిని చూపకు. 528 00:45:27,720 --> 00:45:28,810 ఛండాలం. 529 00:45:29,720 --> 00:45:32,140 నాకు దక్కాల్సినవి రాబట్టుకోవడానికి వచ్చా. 530 00:45:38,020 --> 00:45:38,900 సరే. 531 00:45:44,280 --> 00:45:45,820 నాన్న చనిపోయాడా? 532 00:45:48,530 --> 00:45:49,580 ఆయనకు గుండెపోటా? 533 00:45:50,330 --> 00:45:51,240 తాగుడు. 534 00:45:52,870 --> 00:45:56,170 ఆయన అంత్యక్రియలకు ఒక్క కూతురు కూడా రాలేదు. 535 00:45:57,000 --> 00:45:59,000 అన్నీ నేనే చేశాను. 536 00:46:02,710 --> 00:46:04,420 జోయా నుండి కబురు అందిందా? 537 00:46:05,930 --> 00:46:08,850 ఇంకా ఏమీ లేదు. ఇన్నేళ్ళు గడిచినా. 538 00:46:11,100 --> 00:46:14,310 నువ్వు తనకు పంపిన నగలన్నీ వాపసు పంపిందని నాకు తెలుసు. 539 00:46:23,490 --> 00:46:27,370 నీ కుటుంబం పట్ల ఇంకా అభిమానం ఉంది. నాకు తెలుసు. 540 00:46:27,570 --> 00:46:30,580 - నువ్వు వెళ్ళిపో. - కానీ ఇప్పుడే వచ్చాను కదా. 541 00:46:30,830 --> 00:46:32,910 కానీ నువ్వు వెళ్ళిపోవాలి. రూస్లాన్! 542 00:46:33,160 --> 00:46:36,920 తాతియానా. నిజంగా, నిస్సహాయతలో ఉన్నా. 543 00:46:37,790 --> 00:46:41,790 నన్ను ఇక్కడ కాసేపు ఉండనివ్వు, విశ్రాంతి తీసుకోనివ్వు. 544 00:46:43,550 --> 00:46:47,200 నువ్వు నాకు అన్నేళ్ళు సాయపడినట్టుగా నేను నీకు సాయపడతాను. 545 00:46:47,400 --> 00:46:48,220 ధన్యవాదాలు. 546 00:46:49,550 --> 00:46:50,760 మొత్తం విషయం అది కాదు. 547 00:46:51,470 --> 00:46:52,390 రా. రా. 548 00:46:54,470 --> 00:46:58,600 అలా ఎలా అనగలవు? నీ దగ్గర ఏమున్నాయో చూడు! 549 00:46:58,810 --> 00:47:01,020 ఇదంతా ఏ కష్ట౦ లేకుండా వచ్చిందనుకున్నావా? 550 00:47:04,940 --> 00:47:06,070 ఆమెను బయటకు పంపు. 551 00:47:06,820 --> 00:47:08,680 నాకు వీడ్కోలు చెప్పావా, అమ్మా? 552 00:47:08,880 --> 00:47:11,740 నీ కొత్త ముక్కు ఛండాలంగా ఉంది. 553 00:47:14,870 --> 00:47:18,500 రూస్లాన్, ఆ కేక్స్ పారేయ్. 554 00:47:51,320 --> 00:47:52,410 నాకది ఉంది నాన్నా. 555 00:47:54,580 --> 00:47:55,490 నేనది చేయగలను. 556 00:47:58,450 --> 00:47:59,730 ఇతర అమ్మాయిలను చూశాను. 557 00:47:59,930 --> 00:48:03,460 చెప్తున్నాగా, వాళ్ళకు నాలా లేదు. నాకు ఆ శక్తి విపరీతంగా ఉంది. 558 00:48:55,680 --> 00:48:58,060 ఇది నాకు ఎందుకు జరుగుతోంది? 559 00:49:04,270 --> 00:49:05,310 ఎందుకు? 560 00:49:23,370 --> 00:49:26,080 ఎందుకు? ఎందుకు? 561 00:49:27,630 --> 00:49:28,540 ఎందుకు? 562 00:49:41,600 --> 00:49:44,270 ఎందుకంటే ఈ ప్రపంచంలో విప్లవం రావడం అవసరం. 563 00:49:48,150 --> 00:49:51,070 నువ్వు ఆ విప్లవానికి గొంతుక కాబోతున్నావు. 564 00:50:22,390 --> 00:50:24,680 నీ చేతుల్లో మెరుగైన భవిష్యత్తు ఉంది. 565 00:50:57,930 --> 00:51:01,100 మీరు ఇంకా చూస్తున్నారా? 566 00:51:16,570 --> 00:51:20,010 హెలెన్ కాల్. ఎంతో ముఖ్యమైతే తప్ప తను కాల్ చేయదు. 567 00:51:20,210 --> 00:51:21,070 సరే. 568 00:51:23,160 --> 00:51:24,160 హలో? 569 00:51:29,960 --> 00:51:30,960 ఏంటి? 570 00:54:09,030 --> 00:54:10,980 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ ఎమ్ 571 00:54:11,180 --> 00:54:13,120 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని