1 00:00:37,412 --> 00:00:41,291 మన ముగ్గురం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? 2 00:00:41,375 --> 00:00:45,838 ఉరిమినప్పుడా, మెరిసినప్పుడా లేక వర్షం కురిసినప్పుడా? 3 00:00:45,921 --> 00:00:49,258 మారణకాండ ముగిసినప్పుడు. 4 00:00:49,341 --> 00:00:53,303 యుద్ధంలో గెలుపోటములు నిర్ణయం అయినపుడు. 5 00:00:53,387 --> 00:00:54,805 ఎక్కడ కలుసుకుందాం? 6 00:00:54,888 --> 00:00:56,390 యుద్ధభూమిలో. 7 00:00:56,974 --> 00:01:00,644 అక్కడే మనం మేక్బెత్ ని కలుసుకుందాం. అక్కడే మనం మేక్బెత్ ని కలుసుకుందాం. 8 00:01:01,144 --> 00:01:05,691 మంచి అనుకున్నది చెడు. చెడు అనుకున్నది మంచి. 9 00:01:06,400 --> 00:01:11,196 పొగమంచులోంచి, దుర్గంధంతో నిండిన గాలిలోంచి ఎగిరిపోదాం. 10 00:02:26,146 --> 00:02:27,940 స్వాగతం, మిత్రమా! 11 00:02:28,857 --> 00:02:32,444 నువ్వు యుద్ధభూమి వదిలే నాటికి అక్కడి పరిస్థితిని మహారాజుకు వివరించు. 12 00:02:33,278 --> 00:02:34,655 గెలిచేదెవరో చెప్పలేనంత సందిగ్ధత. 13 00:02:35,697 --> 00:02:39,535 ఇద్దరు అలసిన ఈతగాళ్ళు ఇక ఈత కొట్టలేక ఒకరినొకరు పట్టుకుని వేలాడుతున్నట్లుగా ఉంది రెండు సైన్యాల పరిస్థితి. 14 00:02:40,369 --> 00:02:41,787 కనికరమే లేని మెక్ డాన్వాల్డ్, 15 00:02:42,371 --> 00:02:44,498 అదృష్ట దేవత తన వెంటే ఉండటంతో 16 00:02:44,581 --> 00:02:46,625 శత్రువుల్ని చూసి వికటాట్టహాసం చేశాడు. 17 00:02:47,417 --> 00:02:48,961 కానీ అదృష్టం ఉన్నంత మాత్రాన సరిపోదు. 18 00:02:49,044 --> 00:02:51,922 ధీశాలి మేక్బెత్ కి… అలా పిలిపించుకునే అర్హత ఉంది… 19 00:02:52,005 --> 00:02:56,343 మెక్ డాన్వాల్డ్ అదృష్టాన్ని చూసి పగలబడి నవ్వి, కత్తితో ఒక్క ఉదుటన దాడి చేశాడు, 20 00:02:56,426 --> 00:03:00,055 ఏమి జరుగుతోందో గ్రహించేలోగా అతని ఊపిరి ఆగిపోయింది. ఏమి జరుగుతోందో గ్రహించేలోగా అతని ఊపిరి ఆగిపోయింది. 21 00:03:01,473 --> 00:03:04,309 తన ఆత్మీయులకి వీడ్కోలు చెప్పే సమయం కూడా లేకుండా, 22 00:03:04,393 --> 00:03:07,729 అతని శరీరాన్ని బొడ్డు నుండి దవడ వరకూ చీల్చి వేసి, 23 00:03:07,813 --> 00:03:09,648 తల తెగనరికి కోట గుమ్మానికి వేలాడదీశాడు. 24 00:03:10,232 --> 00:03:12,985 నా బంధువుకి ధైర్యం ఎక్కువ. సమర్ధుడు. 25 00:03:13,068 --> 00:03:14,862 మన ధైర్యసాహసాలకు ఈ శత్రు సైన్యం 26 00:03:14,945 --> 00:03:17,948 అలా తోక ముడిచిందో లేదో… 27 00:03:19,283 --> 00:03:23,078 నార్వే రాజు ఇదే అదనుగా కొత్తగా తెచ్చుకున్న సైన్యంతో, ఆయుధాలతో 28 00:03:23,161 --> 00:03:25,414 మాపై దాడికి సిద్ధం అయ్యాడు. 29 00:03:25,497 --> 00:03:28,292 దాంతో మన సైన్యాధిపతులు మేక్బెత్, బాంకోలు భయపడ్డారా? 30 00:03:28,917 --> 00:03:29,918 అవును. 31 00:03:31,712 --> 00:03:36,258 పిచ్చుకల్ని చూసి గద్దలు భయపడినట్లు, కుందేలును చూసి సింహం భయపడినట్లు. 32 00:03:36,341 --> 00:03:39,011 వాళ్ళు రెట్టింపు శక్తితో ఆ దాడిని తిప్పి కొట్టారు. 33 00:03:39,845 --> 00:03:41,138 ఇంతకు మించి చెప్పలేను. 34 00:03:43,515 --> 00:03:45,017 నా గాయాలకు చికిత్స అవసరం. 35 00:03:49,771 --> 00:03:50,939 దేవుడు మహారాజును కాపాడాలి. 36 00:03:51,857 --> 00:03:53,984 థేన్ మహాశయా, ఎక్కడి నుండి వస్తున్నావు? 37 00:03:54,067 --> 00:03:56,236 ఫైఫ్ నుండి వస్తున్నాను మహారాజా, 38 00:03:56,320 --> 00:04:00,199 అక్కడ నార్వే సైన్యం మన రాజ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అక్కడ నార్వే సైన్యం మన రాజ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. 39 00:04:00,282 --> 00:04:07,122 విధేయతలేని ద్రోహి కాడర్ థేన్ తో కలిసి అసంఖ్యాకమైన సైన్యంతో, 40 00:04:07,206 --> 00:04:10,667 నార్వే రాజు బయలుదేరి ఒక రక్తసిక్తమైన పోరును ప్రారంభించాడు. 41 00:04:11,335 --> 00:04:14,963 యుద్ధానికి అనువైన కవచాలు ధరించిన మేక్బెత్, బాంకోలు 42 00:04:15,047 --> 00:04:17,673 నార్వే సైనికుల దెబ్బకు ధీటుగా ఎదురుదెబ్బ తీశారు. 43 00:04:18,257 --> 00:04:23,347 యుద్ధ రంగాన్ని ఏలే వీరుడై, శత్రువుల ఆత్మవిశ్వాసాన్ని మేక్బెత్ దెబ్బతీశాడు. 44 00:04:23,430 --> 00:04:25,057 ఎట్టకేలకు… 45 00:04:26,266 --> 00:04:27,476 విజయం మన వశం అయింది. 46 00:04:27,559 --> 00:04:28,852 అద్భుతమైన వార్త. 47 00:04:29,853 --> 00:04:33,148 ఇకపై కాడర్ థేన్ మనపై వేలెత్తడానికి కూడా సాహసించలేడు. 48 00:04:33,232 --> 00:04:35,192 - అవును. - అతనికి మరణశిక్ష విధించబడుతుందని చెప్పు. 49 00:04:35,275 --> 00:04:36,360 ఆ సంగతి నేను చూసుకుంటాను. 50 00:04:36,443 --> 00:04:37,819 అతని మాజీ బిరుదుతో… 51 00:04:39,071 --> 00:04:40,322 మేక్బెత్ ను అభినందించు. 52 00:05:14,231 --> 00:05:16,692 ఎక్కడికి వెళ్ళావు, పెద్దక్కా? 53 00:05:18,235 --> 00:05:19,862 పందుల్ని చంపుతున్నాను. 54 00:05:22,072 --> 00:05:25,200 మరి నువ్వో, చెల్లీ? 55 00:05:27,536 --> 00:05:28,996 నా దగ్గర ఏముందో చూడు. 56 00:05:29,496 --> 00:05:31,623 చూపించు. చూపించు! 57 00:05:32,624 --> 00:05:39,089 ఇంటికి వెళుతూ దారిలో మునిగిపోయిన ఒక నావికుడి బొటనవేలు నా దగ్గరుంది, 58 00:05:41,175 --> 00:05:43,802 ఢంకా. ఢంకా! 59 00:05:45,053 --> 00:05:46,638 మేక్బెత్ వచ్చేశాడు. 60 00:05:47,556 --> 00:05:48,932 అవును. 61 00:05:49,766 --> 00:05:52,019 మరో నావికుడి ఓడలోకి, వంటగది నీళ్ళ గొట్టంలోంచి 62 00:05:52,102 --> 00:05:55,981 ఎలుకలాగా ప్రవేశించి, చేయాల్సింది చేస్తాను. 63 00:05:57,065 --> 00:06:00,652 అతని ఒంట్లో జీవం లేకుండా చేస్తాను. అతని ఒంట్లో జీవం లేకుండా చేస్తాను. 64 00:06:01,778 --> 00:06:05,365 అతనికి రాత్రైనా పగలైనా కంటిమీద… 65 00:06:05,449 --> 00:06:08,118 ...కునుకే లేకుండా చేస్తాను. 66 00:06:08,202 --> 00:06:11,413 అతని జీవితం నరకప్రాయం చేస్తాను. 67 00:06:12,206 --> 00:06:16,293 అతనికి ఎనభై ఒక్క వారాల పాటు 68 00:06:16,376 --> 00:06:20,380 నరకం చూపించి చావే మేలనుకునేలా చేస్తాను. 69 00:06:20,464 --> 00:06:24,051 వింత సోదరీమణులు, ఒకరికొకరు తోడు. 70 00:06:24,134 --> 00:06:27,346 సముద్రం నుండి భూమి మీదికి చురుగ్గా ప్రయాణిస్తాం. 71 00:06:27,429 --> 00:06:30,057 చుట్టూ తిరుగుతూ నాట్యం చేద్దాం. 72 00:06:30,140 --> 00:06:33,393 మూడుసార్లు నీ వంతు, మూడుసార్లు నా వంతు. 73 00:06:33,477 --> 00:06:35,521 ఇంకో మూడుసార్లు తిరిగితే... 74 00:06:37,606 --> 00:06:38,690 తొమ్మిది. 75 00:07:00,462 --> 00:07:01,463 నిశ్శబ్దం. 76 00:07:02,714 --> 00:07:04,591 వేదిక సిద్ధంగా ఉంది. 77 00:07:09,721 --> 00:07:13,809 మంచీ చెడూ ఒకే రోజు ఇంతలా జరగడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. 78 00:07:15,352 --> 00:07:16,979 ఫోరెస్ ఇక్కడికి ఎంతదూరం? 79 00:07:22,484 --> 00:07:25,529 ఏమిటీ వింత ఆకారాలు? పిచ్చి చూపులు చూస్తూ, వింత దుస్తులు ధరించాయి, 80 00:07:25,612 --> 00:07:28,824 ఈ భూమికి చెందని జీవులుగా కనిపిస్తున్నాయి, కానీ ఈ భూమ్మీదే ఉన్నాయి. 81 00:07:28,907 --> 00:07:31,118 నువ్వు బతికే ఉన్నావా? మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవా? 82 00:07:33,078 --> 00:07:36,915 మాట్లాడగలిగితే మాట్లాడు. ఎవరు మీరు? 83 00:07:39,209 --> 00:07:40,794 మేక్బెత్ కు వందనాలు. 84 00:07:41,420 --> 00:07:43,505 గ్లామిస్ థేన్, నీకు వందనం. 85 00:07:43,589 --> 00:07:48,135 మేక్బెత్ కు వందనాలు. కాడర్ థేన్, నీకు వందనం! 86 00:07:50,012 --> 00:07:51,722 మేక్బెత్ కు వందనాలు. 87 00:07:52,681 --> 00:07:55,934 భావి మహారాజుకు వందనం. 88 00:07:57,686 --> 00:08:00,772 మీరు ఊహాతీత శక్తులా? లేక వాస్తవ ప్రతిరూపాలా? మీరు ఊహాతీత శక్తులా? లేక వాస్తవ ప్రతిరూపాలా? 89 00:08:01,523 --> 00:08:03,275 మీరు నిజంగా భవిష్యత్తుని చూడగలిగితే 90 00:08:03,358 --> 00:08:06,195 ఏయే సంఘటనలు జరుగుతాయో చెప్పగలిగితే, 91 00:08:06,278 --> 00:08:09,698 నా గురించి చెప్పండి, నేను మీ మేలు ఆశించను, మీ ద్వేషానికి భయపడను. 92 00:08:09,781 --> 00:08:12,492 మేక్బెత్ కంటే తక్కువే, కానీ గొప్పవాడివి అవుతావు. 93 00:08:13,243 --> 00:08:17,039 అతనంత సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ ఎంతో సంతోషంగా ఉంటావు. 94 00:08:18,248 --> 00:08:23,003 నువ్వు రాజువి కాకపోయినప్పటికీ, నీ వారసులు రాజులవుతారు. 95 00:08:24,630 --> 00:08:27,049 కాబట్టి మేక్బెత్, బాంకోలకి అందరూ వందనాలు పలకండి. 96 00:08:27,132 --> 00:08:29,885 మేక్బెత్… బాంకో. 97 00:08:31,803 --> 00:08:33,429 అందరూ వందనాలు పలకండి. 98 00:08:37,768 --> 00:08:40,020 ఆగండి, మీరు మొత్తం పూర్తి చేయలేదు. ఇంకా చెప్పండి. 99 00:08:41,855 --> 00:08:44,942 నేను గ్లామిస్ కి థేన్ అని తెలుసు, కానీ కాడర్ కి థేన్ ఎలా కాగలను? 100 00:08:45,025 --> 00:08:47,778 కాడర్ థేన్ బతికే ఉన్నాడు, అతనికి డబ్బు, పలుకుబడి ఉంది. 101 00:08:47,861 --> 00:08:50,656 ఇక నేను మహారాజుని కావడం పూర్తిగా అసాధ్యమైన విషయం. 102 00:08:50,739 --> 00:08:52,991 మీరు ఈ వింత విషయాలు ఎక్కడ తెలుసుకున్నారు? 103 00:08:53,075 --> 00:08:57,496 మమ్మల్ని ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో కలిసి, మాకు జోస్యం ఎందుకు చెబుతున్నారు? 104 00:09:12,427 --> 00:09:14,888 నీళ్ళలో బుడగల మాదిరిగా, ఈ భూమిలో కూడా బుడగలున్నాయి. 105 00:09:14,972 --> 00:09:18,517 ఈ వింత మనుషులు ఆ బుడగల నుండి వచ్చి ఉంటారు. ఎక్కడికి మాయమైపోయారు? 106 00:09:19,226 --> 00:09:22,437 గాలిలో ఊపిరిలా వాళ్ళు కరిగిపోయారు. 107 00:09:23,480 --> 00:09:24,857 వాళ్ళు ఆగి ఉంటే బాగుండేది. 108 00:09:41,164 --> 00:09:43,500 మనం మాట్లాడుకుంటున్నది నిజంగానే జరిగిందా? 109 00:09:44,418 --> 00:09:48,881 లేక మనం ఏదైనా మత్తు ప్రభావం కలిగించే వేరును తిన్నామా? 110 00:09:49,631 --> 00:09:51,175 నీ పిల్లలు మహారాజులవుతారు. 111 00:09:51,258 --> 00:09:52,968 నువ్వు మహారాజువి అవుతావు. 112 00:09:53,051 --> 00:09:56,722 అలాగే కాడర్ థేన్ ని కూడా. వాళ్ళు చెప్పింది అదే కదూ? 113 00:09:58,724 --> 00:10:00,684 వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు అదే చెప్పారు. 114 00:10:19,453 --> 00:10:20,579 ఎవరక్కడ? 115 00:10:28,378 --> 00:10:32,883 మహారాజు నీ విజయ వార్త విని ఎంతో సంతోషించారు, మేక్బెత్. 116 00:10:32,966 --> 00:10:37,471 శత్రువులను నువ్వు మట్టికరిపించిన తీరు తెలుసుకుని, 117 00:10:37,554 --> 00:10:42,184 మహారాజు ఆశ్చర్యంతో నోటమాట రాక నిశ్చేష్టులయ్యారు. 118 00:10:42,267 --> 00:10:45,187 ఆయన తరపున మమ్మల్ని కృతజ్ఞతలు తెలియజేయమని పంపారు. 119 00:10:45,270 --> 00:10:48,232 నిన్ను తీసుకు రమ్మన్నారు, అసలు విషయం ఆయనే చెబుతారట. 120 00:10:48,315 --> 00:10:53,028 నిన్ను మరింతగా గౌరవించాలన్న ఉద్దేశంతో, 121 00:10:53,111 --> 00:10:56,532 నిన్ను కాడర్ థేన్ అని పిలవమన్నారు. 122 00:10:57,741 --> 00:11:03,247 కాబట్టి, వందనాలు అత్యంత విలువైన థేన్! కాబట్టి, వందనాలు అత్యంత విలువైన థేన్! 123 00:11:04,122 --> 00:11:05,290 ఇకపై ఆ బిరుదు నీదే. 124 00:11:06,708 --> 00:11:08,335 ఏమిటి, దెయ్యం నిజం మాట్లాడగలదా? 125 00:11:08,418 --> 00:11:12,256 కాడర్ థేన్ బతికే ఉన్నాడు. అతని బిరుదును నాకెందుకు ఇస్తున్నావు? 126 00:11:12,339 --> 00:11:15,509 ఇప్పటివరకూ కాడర్ థేన్ గా ఉన్న వ్యక్తి బతికే ఉన్నాడు, 127 00:11:16,343 --> 00:11:21,932 కానీ అతనికి మరణశిక్ష విధించబడింది, అతనికి ఆ శాస్తి జరగాల్సిందే. 128 00:11:22,516 --> 00:11:25,769 అతను నార్వే సైన్యంతో కలిసి పోరాడాడా, 129 00:11:25,853 --> 00:11:28,814 లేక రహస్యంగా తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చాడా, 130 00:11:28,897 --> 00:11:33,151 లేక మన శత్రువులిద్దరితో కలిసి పోరాడాడో నాకు తెలీదు. 131 00:11:33,235 --> 00:11:38,115 కానీ అతను చేసిన ద్రోహం నిరూపించబడింది, తన నేరాన్ని అంగీకరించాడు, 132 00:11:40,492 --> 00:11:41,827 అంటే అతని కథ ముగిసినట్లే. 133 00:11:51,211 --> 00:11:52,671 ఈ వార్త మోసుకొచ్చినందుకు సంతోషం. 134 00:11:56,258 --> 00:11:58,093 నేను గ్లామిస్ కు, కాడర్ కు థేన్ ని. 135 00:11:59,303 --> 00:12:01,722 అంతకు మించిన గొప్ప విషయం ముందుంది. అంతకు మించిన గొప్ప విషయం ముందుంది. 136 00:12:01,805 --> 00:12:03,807 నీ పిల్లలు మహారాజులు కావాలని నువ్వు ఆశించడం లేదా? 137 00:12:03,891 --> 00:12:07,144 నేను కాడర్ థేన్ ని అవుతానని చెప్పిన వారు నీ పిల్లలు అంతకంటే గొప్పవారవుతారనలేదూ? 138 00:12:07,227 --> 00:12:11,398 వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మేట్లయితే, నువ్వు కాడర్ థేన్ కావడంతో పాటు 139 00:12:11,481 --> 00:12:13,358 మహారాజువి కూడా అవుతావన్నారు కదా. 140 00:12:13,442 --> 00:12:15,027 కానీ ఇదంతా చాలా వింతగా ఉంది. 141 00:12:15,819 --> 00:12:18,447 దుష్ట శక్తులు మనల్ని వినాశనం దిశగా నడిపించడం కోసం 142 00:12:19,364 --> 00:12:21,825 వాస్తవంలో కొంత భాగాన్ని మనకు చెబుతాయి, 143 00:12:21,909 --> 00:12:27,039 కొద్దిపాటి నిజాలు చెప్పడం ద్వారా మన నమ్మకాన్ని గెల్చుకుని, ఆ తర్వాత మనం దారుణంగా దెబ్బ తినేలా మోసం చేస్తాయి. 144 00:12:34,004 --> 00:12:37,508 ఈ వాస్తవాతీత శక్తి కలిగించిన ప్రలోభం చూడడానికి చెడుగా కనిపించకపోవచ్చు, అలాగని మంచిదీ కాకపోవచ్చు. 145 00:12:39,009 --> 00:12:42,304 అది చెడుది అయ్యుంటే, నా గురించి చెప్పిన శుభవార్త నిజమెలా అయ్యింది? 146 00:12:42,387 --> 00:12:44,556 నేను కాడర్ థేన్ ని. 147 00:12:48,268 --> 00:12:52,731 కానీ అది మంచిది అయ్యుంటే, రాజుని చంపాలన్న ఆలోచన నాకెందుకు వచ్చింది? అదెంత దారుణంగా ఉందంటే, 148 00:12:52,814 --> 00:12:56,610 ఆ ఊహకే నా రోమాలు నిక్కబొడుచుకుని, నా గుండె దడదడా కొట్టుకుంటోంది. 149 00:13:03,325 --> 00:13:06,078 ప్రస్తుతం నాకున్న భయాలకంటే నా ఘోరమైన ఊహలే ఎక్కువగా భయపెడుతున్నాయి. 150 00:13:06,828 --> 00:13:09,039 ఊహే అయినప్పటికీ, హత్య చేయాలనే ఆలోచన నన్ను ఎంతగా వణికిస్తోందంటే, 151 00:13:09,122 --> 00:13:13,377 నేను ఎవరిని అన్న సందిగ్ధం కలుగుతోంది. నా ఆలోచనలు నన్ను కదలనివ్వకుండా చేస్తున్నాయి. 152 00:13:14,169 --> 00:13:16,296 నా ఊహలే నాకు ముఖ్యం అనిపిస్తున్నాయి. 153 00:13:17,798 --> 00:13:22,553 నేను మహారాజుని కావాలని నిజంగా రాసుంటే, నా ప్రమేయం లేకుండానే విధి నన్ను రాజును చేస్తుంది. 154 00:13:26,890 --> 00:13:28,308 ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. 155 00:13:29,893 --> 00:13:32,354 చెడ్డ రోజులకు కూడా ముగింపు ఉంటుంది. 156 00:13:35,399 --> 00:13:37,693 "నాకు విజయం దక్కిన రోజు వాళ్ళు నన్ను కలిశారు. 157 00:13:37,776 --> 00:13:39,736 వాళ్ళు మామూలు వ్యక్తులు కాదనీ, 158 00:13:39,820 --> 00:13:42,281 వాళ్లకు అతీంద్రియ జ్ఞానం ఉందని నాకు తెలిసి వచ్చింది. 159 00:13:42,823 --> 00:13:45,409 వాళ్ళను మరిన్ని ప్రశ్నలు అడగాలని 160 00:13:45,492 --> 00:13:48,579 నేను ఎంతో తపించాను, కానీ వాళ్ళు గాలిలోకి అదృశ్యమైపోయారు. 161 00:13:49,079 --> 00:13:51,248 ఆ ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే, 162 00:13:51,331 --> 00:13:56,003 మహారాజు పంపిన వేగులు అక్కడికి వచ్చి, నన్ను 'కాడర్ థేన్' అనే బిరుదుతో పిలిచారు, 163 00:13:56,086 --> 00:13:58,922 అదే బిరుదుతో ఆ వింత సోదరీమణులు కాసేపటి క్రితం నన్ను పిలిచారు 164 00:13:59,006 --> 00:14:04,136 అంతేకాదు, భవిష్యత్తులో పొందబోయే మరో బిరుదుతో కూడా పిలిచారు, 'వందనం, కాబోయే మహారాజా' అన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో పొందబోయే మరో బిరుదుతో కూడా పిలిచారు, 'వందనం, కాబోయే మహారాజా' అన్నారు. 165 00:14:06,930 --> 00:14:10,809 నా గొప్ప ప్రయాణంలో భాగస్వామివైన నీకు 166 00:14:10,893 --> 00:14:13,312 ఈ వార్త అందించాలని అనుకున్నాను. 167 00:14:13,395 --> 00:14:16,815 అప్పుడే మనకు దక్కబోయే సంతోషాలను నాతో కలిసి ఆనందించగలవు. 168 00:14:18,233 --> 00:14:20,444 దీన్ని ఎవరికంటా పడనివ్వకు, వీడ్కోలు." 169 00:14:26,074 --> 00:14:29,244 నువ్వు గ్లామిస్, ఇంకా కాడర్ లకు థేన్ వి అయ్యావు. 170 00:14:29,912 --> 00:14:32,539 వాళ్ళు మాటిచ్చినట్లుగానే మహారాజువి కూడా అవుతావు. 171 00:14:33,874 --> 00:14:35,584 అందుకు తగ్గ ధైర్యం నీకుందా అని భయంగా ఉంది. 172 00:14:36,084 --> 00:14:40,714 అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి కావాల్సిన కాఠిన్యం నీలో లేదు. 173 00:14:42,424 --> 00:14:43,634 నువ్వు గొప్ప వాడివి కావాలనుకుంటావు. 174 00:14:43,717 --> 00:14:48,138 నీకు ఆశయం లేకపోలేదు, కానీ ఇలాంటి పనులకు కావాల్సిన క్రూరత్వం నీలో లేదు. 175 00:14:50,015 --> 00:14:53,727 నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉంటూనే కోరుకున్నది సాధించాలనుకుంటావు. 176 00:14:53,810 --> 00:14:58,023 ఎవరినీ మోసం చేయాలని అనుకోవు, అయినప్పటికీ నీది కానిది నీ సొంతం కావాలనుకుంటావు. 177 00:15:03,111 --> 00:15:05,113 త్వరగా ఇంటికి రా, 178 00:15:06,406 --> 00:15:09,451 నేను నీతో మాట్లాడి నిన్ను ఒప్పిస్తాను. 179 00:15:09,535 --> 00:15:12,120 మనం బంగారు బాతును చేరుకోవడానికి 180 00:15:12,204 --> 00:15:15,624 అడ్డుకుంటున్నదేదో కనిపెట్టి అందుకు నిన్ను నా మాటలతో సన్నద్ధం చేస్తాను. 181 00:15:36,311 --> 00:15:38,480 మాజీ కాడర్ థేన్ మరణశిక్ష అమలు అయిందా? 182 00:15:38,564 --> 00:15:39,606 మహారాజా! 183 00:15:40,691 --> 00:15:43,277 కాడర్ చనిపోవడం చూసిన ఒక వ్యక్తితో మాట్లాడాను, 184 00:15:43,360 --> 00:15:46,989 అతనేమన్నాడంటే… అతను చాలా నిజాయితీగా తన నేరాల్ని అంగీకరించాడు, 185 00:15:47,072 --> 00:15:51,410 తనను మీరు క్షమించాల్సిందిగా వేడుకున్నాడు, తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. 186 00:15:51,493 --> 00:15:55,289 అతని జీవితం మొత్తంలో చనిపోయేటప్పుడు ఉన్నంత మంచివాడిగా ఎప్పుడూ లేడు. 187 00:15:55,372 --> 00:15:59,293 చావు ముంగిట ఉన్నప్పుడు కూడా 188 00:15:59,376 --> 00:16:03,338 ప్రాణానికి విలువ ఇవ్వకూడదన్నట్లు మరణించాడు. ప్రాణానికి విలువ ఇవ్వకూడదన్నట్లు మరణించాడు. 189 00:16:04,173 --> 00:16:08,010 ఒక వ్యక్తి ముఖాన్ని చూసి అతని అంతరార్థం చెప్పడం అసాధ్యం. 190 00:16:09,761 --> 00:16:14,683 నేనతన్ని గొప్ప వ్యక్తిగా ఊహించి అతనిపై పూర్తి విశ్వాసం ఉంచాను. 191 00:16:17,227 --> 00:16:18,937 నా ప్రియమైన బంధువా. 192 00:16:20,189 --> 00:16:23,317 నీకు సరిగా కృతజ్ఞతలు తెలియజేయనందుకు అపరాధభావంతో కుంగిపోతున్నాను. 193 00:16:24,651 --> 00:16:29,031 నేను చెప్పగలిగినదల్లా నీ రుణం తీర్చుకోలేనంతగా నీకు రుణపడి ఉన్నాను. 194 00:16:29,114 --> 00:16:32,576 మీకు సేవ చేస్తూ, విధేయుడిగా ఉండే అవకాశం ఇవ్వడమే గొప్ప వరం. 195 00:16:32,659 --> 00:16:34,161 నీకు స్వాగతం. 196 00:16:36,622 --> 00:16:41,210 కాడర్ థేన్ బిరుదుతో నీ అద్భుతమైన భవిష్యత్తుకు పునాది వేశాను. అది తప్పక పెరిగేలా చూసుకుంటాను. 197 00:16:44,379 --> 00:16:47,466 గౌరవనీయ బాంకో, నువ్వు మేక్బెత్ కు ఎంతమాత్రం తీసిపోవు, 198 00:16:47,549 --> 00:16:49,468 నీ ప్రతాపం అందరికీ తెలియాలి. 199 00:16:49,551 --> 00:16:52,638 నిన్ను నా అక్కున చేర్చుకుని అభినందనలు తెలియజేయనివ్వు. 200 00:16:52,721 --> 00:16:55,516 నేను ఏమి సాధించినా, ఆ ఘనత మీకే దక్కుతుంది. 201 00:16:55,599 --> 00:16:57,893 నేను సంతోషం పట్టలేకపోతున్నాను, 202 00:16:57,976 --> 00:17:00,604 కన్నీళ్ళ మాటున నా సంతోషం దాక్కోవాలని చూస్తోంది. కన్నీళ్ళ మాటున నా సంతోషం దాక్కోవాలని చూస్తోంది. 203 00:17:05,108 --> 00:17:09,112 పుత్రులారా, ఆప్తులారా, సామంతులారా, 204 00:17:09,820 --> 00:17:11,698 ఇంకా నా హృదయానికి చేరువైన ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమంటే 205 00:17:11,781 --> 00:17:17,621 ఇకపై మన రాజ్యం బరువు బాధ్యతలు నా పెద్ద కొడుకు మాల్కం భుజాలపై మోపుతున్నాను… 206 00:17:18,454 --> 00:17:20,457 …ఇకపై అతన్ని కంబర్ ల్యాండ్ 207 00:17:20,540 --> 00:17:21,791 యువరాజుగా ప్రకటిస్తున్నాను. 208 00:17:22,542 --> 00:17:26,088 గౌరవం దక్కేది కేవలం మాల్కంకి మాత్రమేకాదు, 209 00:17:27,798 --> 00:17:32,970 అర్హత ఉన్న ప్రతి ఒక్కరిపై గౌరవ బిరుదులు వర్షంలా కురుస్తాయి. 210 00:17:34,054 --> 00:17:36,974 ఇక ఇన్వర్నెస్ లో నీ కోటకు వెళ్లి, నీ ఆతిథ్యంలో తరించాలని ఉంది. 211 00:17:38,767 --> 00:17:41,812 నేను స్వయంగా వెళ్లి మీరు వస్తున్నారనే శుభవార్త 212 00:17:41,895 --> 00:17:46,525 నా భార్యకు చేరవేస్తాను, కాబట్టి నేనిక సెలవు తీసుకుంటాను. 213 00:17:46,608 --> 00:17:47,985 నా ఉత్తమమైన కాడర్. 214 00:17:48,068 --> 00:17:51,989 అతని వెంటే వెళదాం పదండి, మనకు స్వాగతం పలకడానికి అతను మనకంటే ముందే బయలుదేరి వెళ్ళాడు. 215 00:17:52,072 --> 00:17:53,323 ఈ వీరుడికి సాటి మరెవరూ లేరు. 216 00:17:54,533 --> 00:17:56,034 కంబర్ ల్యాండ్ యువరాజట. 217 00:17:57,411 --> 00:18:00,205 నేను రాజును కావాలంటే, అతన్ని కూడా హతమర్చాలి, లేదా వెనకడుగు వేయాలి, నేను రాజును కావాలంటే, అతన్ని కూడా హతమర్చాలి, లేదా వెనకడుగు వేయాలి, 218 00:18:00,289 --> 00:18:02,165 ఎందుకంటే అతను నా దారికి అడ్డుగా ఉన్నాడు. 219 00:18:02,708 --> 00:18:04,793 నక్షత్రాల్లారా, మీ వెలుగును దాచేయండి. 220 00:18:05,460 --> 00:18:09,173 నాలోని ఈ భయంకరమైన కోరికలు ఎవరికంటా పడకుండా చూడండి. 221 00:18:10,048 --> 00:18:12,551 మహారాజు ఈ రాత్రికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. 222 00:18:12,634 --> 00:18:15,971 నీకు పిచ్చి పట్టిందా. మేక్బెత్ రాజుగారితోనే ఉన్నాడు కదా? 223 00:18:16,054 --> 00:18:19,183 అవునమ్మా, కానీ నేను చెప్పింది నిజం. మన థేన్ వస్తున్నారు. 224 00:18:19,266 --> 00:18:21,059 ఆయన ఒక వేగును ముందుగా పంపించారు. 225 00:18:21,643 --> 00:18:25,314 శుభవార్త తీసుకొచ్చినందుకు అతనికి సపర్యలు చేయి. 226 00:18:30,068 --> 00:18:32,279 మహారాజు నా కోటకు చావడానికే వస్తున్నాడని 227 00:18:32,362 --> 00:18:37,117 కూస్తున్న ఆ కాకికి కూడా గొంతు బొంగురుపోయింది. 228 00:18:42,664 --> 00:18:45,918 హంతక భావాల్ని ప్రేరేపించే ఆత్మలారా, రండి. 229 00:18:46,710 --> 00:18:49,087 నాలో ఆడతనాన్ని తగ్గించి మగతనాన్ని పెంచండి, 230 00:18:50,380 --> 00:18:55,302 తల నుండి పాదం వరకూ నాలో క్రూరత్వాన్ని నింపండి. 231 00:18:56,512 --> 00:18:58,013 నా రక్తాన్ని చిక్కగా మార్చండి. 232 00:18:59,014 --> 00:19:02,184 నాలో పశ్చాత్తాప భావన కలగకుండా నా రక్త ప్రవాహాన్ని అడ్డుకోండి, నాలో పశ్చాత్తాప భావన కలగకుండా నా రక్త ప్రవాహాన్ని అడ్డుకోండి, 233 00:19:02,267 --> 00:19:06,396 అప్పుడే నా దుష్ట ప్రణాళికను నెరవేర్చకుండా ఎటువంటి మానవ కారుణ్యం 234 00:19:06,480 --> 00:19:09,316 నన్ను అడ్డుకోకుండా ఉంటుంది. 235 00:19:10,901 --> 00:19:13,445 నా ఎదలోకి వచ్చి, నా తల్లిపాలను 236 00:19:13,529 --> 00:19:18,075 విషంగా మార్చివేయండి, ఓ హంతక శక్తులారా, 237 00:19:19,201 --> 00:19:23,205 చెడు చేయాలని కాపు కాసిన మీరు, అదృశ్య రూపంలో దాక్కున్న చోటునుండి బయటికి రండి. 238 00:19:24,289 --> 00:19:29,044 కాళరాత్రీ, రా. ఈ ప్రపంచాన్ని అంధకారమనే పొగతో నింపివేయి, 239 00:19:30,003 --> 00:19:33,090 అప్పుడే నా పదునైన కత్తి అది చేయబోయే గాయాన్ని చూడకుండా ఉంటుంది, 240 00:19:33,173 --> 00:19:38,095 అప్పుడే ఆకాశం ఆ అంధకారంలోంచి తొంగిచూసి, "ఆపు, ఆపు!" అని అరవకుండా ఉంటుంది. 241 00:19:50,440 --> 00:19:52,568 గొప్ప గ్లామిస్ థేన్! 242 00:19:59,199 --> 00:20:00,826 యోగ్యుడైన కాడర్ థేన్! యోగ్యుడైన కాడర్ థేన్! 243 00:20:02,995 --> 00:20:05,622 నువ్వు మహారాజువైతే, అప్పుడు ఈ రెండు బిరుదులను మించిపోతావు. 244 00:20:09,042 --> 00:20:12,421 నీ ఉత్తరం నన్ను వర్తమానం నుండి దూరం చేసింది, 245 00:20:12,504 --> 00:20:15,799 భవిష్యత్తే వర్తమానంలాగా అనిపించడం మొదలైంది. 246 00:20:15,883 --> 00:20:17,801 నా ప్రియతమా! 247 00:20:25,434 --> 00:20:27,060 ఈ రాత్రికి డంకన్ ఇక్కడికి వస్తున్నాడు. 248 00:20:27,769 --> 00:20:29,229 తిరుగు ప్రయాణం ఎప్పుడు? 249 00:20:29,313 --> 00:20:31,106 రేపు తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నాడు. 250 00:20:31,773 --> 00:20:34,067 అవునా, ఆ రోజు ఎప్పటికీ రాదు. 251 00:20:38,906 --> 00:20:43,952 నీ మొహంలోని వింత భావాలు తెరచిన పుస్తకంలా, అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి, ప్రభూ. 252 00:20:44,912 --> 00:20:47,414 వాళ్ళని మభ్యపెట్టాలంటే, వాళ్ళు కోరుకున్నట్లు నువ్వు కనిపించాలి. 253 00:20:48,165 --> 00:20:51,001 నీ కళ్ళలో, నీ చేతిలో, నీ మాటలో స్వాగత భావం కనిపించాలి. 254 00:20:51,543 --> 00:20:54,796 అమాయక పుష్పంలా కనిపించు, కానీ దాని కింద సర్పంలా దాగి ఉండు. 255 00:20:56,465 --> 00:20:58,383 రాజుగారికి విందు ఏర్పాట్లు చేయాలి. 256 00:20:58,467 --> 00:21:01,929 ఈ రాత్రికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ నన్ను చూసుకోనివ్వు. ఈ రాత్రికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ నన్ను చూసుకోనివ్వు. 257 00:21:02,638 --> 00:21:05,182 ఎందుకంటే ఈ రాత్రి మన భావి జీవితంలో 258 00:21:05,265 --> 00:21:08,769 ప్రతి రోజునీ మార్చి గొప్ప అధికారం ఇవ్వబోతోంది. 259 00:21:17,236 --> 00:21:18,737 కాబట్టి నువ్వు ప్రశాంతంగా కనిపించాలి. 260 00:21:19,821 --> 00:21:21,990 నీలో ఆందోళన కనిపిస్తే, అది అనుమానాలకు తావిస్తుంది. 261 00:21:24,368 --> 00:21:25,744 మిగిలినదంతా నాకు వదిలేయ్. 262 00:21:32,084 --> 00:21:34,044 ఈ కోట ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. 263 00:21:34,711 --> 00:21:38,507 ఇక్కడ వీస్తున్న మధురమైన గాలి, నా శరీరంలో అణువణువునూ పలకరిస్తోంది. 264 00:21:40,509 --> 00:21:44,346 ఈ వేసవిలో స్వాలో పక్షి ఇక్కడ తన గూటిని 265 00:21:44,429 --> 00:21:46,682 కట్టుకోవాలని అనుకుంటున్నదంటే, 266 00:21:46,765 --> 00:21:49,518 ఈ చోటు ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అర్థం. 267 00:21:50,018 --> 00:21:52,688 ఈ పక్షులు నిద్రించడానికి, గుడ్లు పెట్టడానికి 268 00:21:52,771 --> 00:21:56,358 అనువుగా గూడు కట్టని చోటు ఈ కోట గోడలలో ఒక్కటికూడా లేదు. 269 00:21:57,317 --> 00:22:01,154 గాలి ధారాళంగా వీచే చోటే, అవి ఎక్కువగా గూళ్ళు కట్టుకోవడానికి ఇష్టపడతాయని నేను గమనించాను. గాలి ధారాళంగా వీచే చోటే, అవి ఎక్కువగా గూళ్ళు కట్టుకోవడానికి ఇష్టపడతాయని నేను గమనించాను. 270 00:22:01,238 --> 00:22:04,575 చూడండి, మన గౌరవనీయ ఇంటి యజమానురాలు వస్తోంది. 271 00:22:04,658 --> 00:22:09,037 మీరు మా కుటుంబానికి అందించిన గౌరవాలతో పోల్చితే, మేము మీకు చేసే సేవల్ని 272 00:22:09,121 --> 00:22:13,375 ఎన్నిసార్లు రెట్టింపు చేసినా కూడా తక్కువ కిందే లెక్క. 273 00:22:13,458 --> 00:22:16,044 మిమ్మల్ని మా ఇంటికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం మహారాజా. 274 00:22:16,128 --> 00:22:17,462 కాడర్ థేన్ ఎక్కడున్నాడు? 275 00:22:17,546 --> 00:22:20,507 మేము అతని వెనకే బయలుదేరాం. అతనికంటే ముందే ఇక్కడికి 276 00:22:20,591 --> 00:22:23,969 చేరుకోవాలని అనుకున్నప్పటికీ, అతను వేగంగా వచ్చాడు. మాపట్ల అతని విధేయత, 277 00:22:24,052 --> 00:22:26,138 ప్రేమ, మాకంటే ముందు అతన్ని ఇక్కడికి వచ్చేలా చేశాయి. 278 00:22:27,222 --> 00:22:30,017 నిజాయితీ కల యజమానురాలా, ఈ రాత్రికి మేము మీ అతిథులం. 279 00:22:30,100 --> 00:22:31,560 నీ చేతిని అందించు. 280 00:22:33,979 --> 00:22:35,439 నన్ను మేక్బెత్ దగ్గరికి తీసుకెళ్ళు. 281 00:22:41,820 --> 00:22:47,159 రాజు హత్యతో ఈ సందిగ్ధత ముగుస్తుందంటే, ఆపనిని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. 282 00:22:48,410 --> 00:22:50,829 దీని కారణంగా వరుసగా జరగబోయే పరిణామాలను 283 00:22:50,913 --> 00:22:53,207 ఈ హత్యే అడ్డుకునే పక్షంలో, 284 00:22:53,290 --> 00:22:56,793 ఇదే అన్నిటికీ ఒక ముగింపు పలుకుతుంది. 285 00:22:58,629 --> 00:23:00,214 కానీ ఇక్కడ… కానీ ఇక్కడ… 286 00:23:01,840 --> 00:23:05,010 ఈ సమయంలో నేను నా మరణానంతర జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడను. 287 00:23:08,514 --> 00:23:10,933 కానీ ఇలాంటి నేరాలకు ఈ లోకంలోనే శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 288 00:23:11,016 --> 00:23:13,143 హింసాపూరిత చర్యలు ఇతరులకు కూడా వాటినే నేర్పిస్తాయి, 289 00:23:13,227 --> 00:23:16,647 అవి నేర్చుకున్న మన శిష్యులు చేసే హింస తిరిగి ఉపాధ్యాయులనే పట్టి పీడిస్తుంది. 290 00:23:17,564 --> 00:23:19,358 చట్టం అందరినీ సమంగా చూస్తుంది, 291 00:23:19,441 --> 00:23:23,195 మనం ఇతరులతో తాగించిన విషపు గిన్నెతోనే మనం విషం తాగాల్సి వస్తుంది. 292 00:23:25,697 --> 00:23:27,282 మహారాజు రెండు విధాలుగా నన్ను నమ్ముతున్నారు. 293 00:23:28,784 --> 00:23:30,869 ఒకటి, నేను ఆయన బంధువును ఇంకా సేవకుడిని, 294 00:23:30,953 --> 00:23:32,871 ఆయన రక్షణ నా బాధ్యత. 295 00:23:34,206 --> 00:23:35,749 రెండు, ఆయనకు ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తిగా, 296 00:23:36,583 --> 00:23:40,379 ఆయనపై దాడి జరిగితే అడ్డుకోవాలి, అంతేగానీ నేనే కత్తి దూయకూడదు. 297 00:23:40,879 --> 00:23:43,924 అన్నిటినీ మించి, ఈ డంకన్ ఒక గొప్ప నాయకుడు, 298 00:23:44,007 --> 00:23:46,343 అవినీతి ఎరగడు, నిజాయితీ పరుడు, 299 00:23:47,469 --> 00:23:50,055 మరణానంతరం ఆయన ధర్మ పాలనని చూసి దేవతలు కీర్తిస్తారు, 300 00:23:50,138 --> 00:23:52,266 ఆయన్ని ఘోరంగా హత్య చేయడం చూసి ఘోషిస్తారు. 301 00:23:52,349 --> 00:23:55,561 బాధ, అప్పుడే పుట్టిన అమాయకపు బిడ్డలా, అదృశ్య గుర్రాన్ని ఎక్కిన చిన్న దేవదూతలతో కలిసి, 302 00:23:55,644 --> 00:23:59,523 గాలి ద్వారా విషాదకరమైన ఆయన మరణ వార్తను అందరికీ తెలియజేస్తుంది. 303 00:23:59,606 --> 00:24:04,111 ప్రతి ఒక్కరి హృదయం జాలితో నిండిపోతుంది, ఈ దేశం మొత్తం ఆయనకోసం దుఃఖిస్తుంది. ప్రతి ఒక్కరి హృదయం జాలితో నిండిపోతుంది, ఈ దేశం మొత్తం ఆయనకోసం దుఃఖిస్తుంది. 304 00:24:06,113 --> 00:24:09,074 ఈ చర్యకు నన్ను నేను పురికొల్పుకోలేకపోతున్నాను, 305 00:24:10,993 --> 00:24:14,997 నా ఆశే నన్ను ప్రేరేపిస్తోంది, అదే మనుషుల్ని రెచ్చగొట్టి వారి వినాశనానికి దారి తీయిస్తుంది. 306 00:24:20,836 --> 00:24:22,546 ఏమి జరుగుతోంది? సమాచారమేమిటి? 307 00:24:24,882 --> 00:24:26,216 ఆయన భోజనం పూర్తవుతోంది. 308 00:24:26,300 --> 00:24:28,010 నా కోసం అడిగారా? 309 00:24:28,093 --> 00:24:29,469 అడగకుండా ఉంటారని ఎలా అనుకున్నావు? 310 00:24:31,221 --> 00:24:32,973 మన ప్రణాళికని ఇక్కడితో ఆపేయడం మంచిది. 311 00:24:33,056 --> 00:24:34,141 మహారాజు నన్ను సత్కరించారు. 312 00:24:34,224 --> 00:24:36,977 నేను అందరి దృష్టిలో మంచి అభిప్రాయం సంపాదించాను. 313 00:24:37,060 --> 00:24:39,730 నేను ఆ గౌరవాల్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాను, 314 00:24:40,814 --> 00:24:43,567 వాటిని వెంటనే పక్కన పడేయాలని అనుకోవడం లేదు. 315 00:24:44,401 --> 00:24:46,904 నువ్వు ఎంతో నమ్మకంతో మాట్లాడిన సమయంలో మత్తులో ఉన్నావా? 316 00:24:46,987 --> 00:24:48,113 అప్పటినుండీ నిద్రలోనే ఉన్నావా? 317 00:24:48,197 --> 00:24:51,408 ఇప్పుడు నిద్ర లేచి, ఆ ఆలోచన కలిగించిన భయంతో నీ మొహం పాలిపోయిందా? 318 00:24:51,491 --> 00:24:53,827 ఇకపై నీ ప్రేమకి నేను ఇలాగే విలువిస్తాను. 319 00:24:56,622 --> 00:25:01,335 నీ కోరిక ఉన్నంత ధృడంగా నీ మనసు ప్రవర్తించడానికి భయపడుతోందా? నీ కోరిక ఉన్నంత ధృడంగా నీ మనసు ప్రవర్తించడానికి భయపడుతోందా? 320 00:25:01,418 --> 00:25:05,172 నువ్వు ఎంతగానో కోరుకుంటున్న సింహాసనం దక్కించుకోవడానికి వెనుకంజ వేసి, 321 00:25:05,255 --> 00:25:07,382 నీ జీవితాంతం ఒక పిరికిపందలాగా జీవిస్తావా, 322 00:25:07,466 --> 00:25:10,928 పిల్లి లాగా ఒకప్పుడు "కావాలి" అనుకుని, ఇప్పుడు "నా వల్ల కాదు" అనుకుంటావా? 323 00:25:11,011 --> 00:25:13,430 ఇక చాలు! 324 00:25:14,389 --> 00:25:19,269 మనిషిగా ఏమి చేయడానికైనా నాకు ధైర్యం ఉంది. అంతకుమించి చేయాలనుకునే వాడు మనిషే కాదు. 325 00:25:19,353 --> 00:25:22,356 నువ్వు ఈ పని చేస్తానని చెప్పినపుడు మనిషిలా కాక జంతువులా ఉన్నావా? 326 00:25:23,190 --> 00:25:25,984 నువ్వు ఈ పనికి సిద్ధమైనపుడే, మనిషిలా ఉన్నావు. 327 00:25:26,068 --> 00:25:29,530 నువ్వు ఎంత ఎక్కువ ధైర్యం ప్రదర్శిస్తే, నా దృష్టిలో అంత గొప్ప మనిషిలా ఉంటావు. 328 00:25:31,031 --> 00:25:32,616 నేనొక బిడ్డకు పాలిచ్చాను, 329 00:25:32,699 --> 00:25:36,203 పాలు తాగే బిడ్డ ఎంత ముద్దుగా ఉంటుందో నాకు తెలుసు. 330 00:25:36,286 --> 00:25:39,081 నువ్వు ఈ పని చేస్తానని మాటిచ్చినట్లు 331 00:25:39,164 --> 00:25:42,793 నేను మాట ఇచ్చి ఉంటే, నవ్వుతూ పాలు తాగుతున్న ఆ బిడ్డని అడ్డుకుని, 332 00:25:42,876 --> 00:25:45,754 వాడి మెదడుని చిదిమి వేయడానికి కూడా వెనుకాడను. 333 00:25:46,880 --> 00:25:48,215 ఒకవేళ మనం ఓడిపోతే? 334 00:25:48,298 --> 00:25:49,675 ఓడిపోవడమా! 335 00:25:50,509 --> 00:25:54,096 నువ్వు తిరిగి ధైర్యాన్ని తెచ్చుకుంటే, మనం ఓడిపోయే ప్రసక్తే ఉండదు. 336 00:25:55,180 --> 00:25:57,099 డంకన్ నిద్రపోయినపుడు, 337 00:25:57,182 --> 00:26:00,769 రోజంతా ప్రయాణం చేసి అలసిపోయిన ఆయన తప్పక గాఢనిద్రపోతూ ఉంటాడు, రోజంతా ప్రయాణం చేసి అలసిపోయిన ఆయన తప్పక గాఢనిద్రపోతూ ఉంటాడు, 338 00:26:00,853 --> 00:26:05,065 నేను ఆయన గది కాపలా భటులిద్దరితో బాగా మద్యం తాగించి 339 00:26:05,148 --> 00:26:08,902 వాళ్ళని అచేతనంగా చేసి, 340 00:26:08,986 --> 00:26:11,738 వాళ్ళు వివేకం కోల్పోయేలా చేస్తాను. 341 00:26:11,822 --> 00:26:16,076 పందుల్లా నిద్రపోతున్న వాళ్ళు ఈ ప్రపంచానికి శవాలతో సమానం. 342 00:26:17,244 --> 00:26:20,956 రక్షణ లేని డంకన్ ని మనిద్దరం కలిసి చేయలేనిది ఏముంటుంది? 343 00:26:21,623 --> 00:26:23,584 మనం ఏమి చేసినా కూడా, 344 00:26:23,667 --> 00:26:26,461 మత్తులో ఉన్న సైనికులపై నేరాన్ని తోసేయొచ్చు, అవునా? 345 00:26:29,840 --> 00:26:31,383 నీకు మగ సంతానమే కలగాలి. 346 00:26:32,509 --> 00:26:36,388 ఎందుకంటే నీలాంటి ధైర్యశాలి మగతనంలేని బిడ్డకి జన్మనివ్వకూడదు. 347 00:26:39,516 --> 00:26:41,977 మనం ఆ సైనికుల కత్తులతోనే హత్యచేసి, 348 00:26:42,060 --> 00:26:45,022 నిద్రలో ఉన్న వాళ్ళ ఒంటినిండా రక్తం పూస్తే, వాళ్ళే నేరస్తులని 349 00:26:45,105 --> 00:26:46,356 ప్రజలు నమ్మకుండా ఉంటారా? 350 00:26:46,440 --> 00:26:47,774 అలాకాక మరోలా ఎవరనుకుంటారు? 351 00:26:47,858 --> 00:26:51,361 ఎందుకంటే రాజు మరణ వార్త విని మనం శోకాలు పెడుతూ ఉంటాం కదా? 352 00:26:53,447 --> 00:26:54,865 నేను నిర్ణయం తీసుకున్నాను… 353 00:26:56,074 --> 00:26:58,660 ఈ నేరం చేసేందుకు నాలోని అణువణువునూ సిద్ధం చేస్తాను. 354 00:26:58,744 --> 00:27:01,580 వెళ్దాం పద, అందరితో స్నేహంగా నటిద్దాం. వెళ్దాం పద, అందరితో స్నేహంగా నటిద్దాం. 355 00:27:01,663 --> 00:27:04,333 మన మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడదాం. 356 00:27:27,356 --> 00:27:29,942 చంద్రుడు అస్తమించాడు. నాకింకా గడియారం చప్పుడు వినబడలేదు. 357 00:27:30,025 --> 00:27:31,944 చంద్రుడు అస్తమించేది పన్నెండింటికి కదూ. 358 00:27:32,027 --> 00:27:33,654 అంతకంటే ఆలస్యం అవుతుందనుకుంటా, నాన్నా. 359 00:27:35,197 --> 00:27:37,783 ఇదిగో. నా కత్తి తీసుకో. 360 00:27:42,496 --> 00:27:44,164 స్వర్గంలో కొవ్వొత్తులకు కరువు వచ్చినట్లుంది. 361 00:27:44,748 --> 00:27:46,208 అక్కడి వెలుగులన్నీ ఆరిపోయాయి. 362 00:27:47,209 --> 00:27:51,046 నేను బాగా అలసిపోయాను, భారంగా ఉంది, కానీ నిద్రపోలేకపోతున్నాను. 363 00:27:52,798 --> 00:27:55,133 దయగల శక్తులారా, నాకు పీడకలలు, చెడు ఆలోచనలు 364 00:27:55,217 --> 00:27:57,052 కలగకుండా అడ్డుకోండి. 365 00:28:01,473 --> 00:28:03,433 - కత్తి ఇటివ్వు. ఎవరక్కడ? - నీ స్నేహితుడు. 366 00:28:05,227 --> 00:28:08,063 ప్రభూ, ఇంకా నిద్రపోలేదా? మహారాజు నిద్రపోయారు. 367 00:28:08,939 --> 00:28:10,774 ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు, 368 00:28:10,858 --> 00:28:13,944 మీ ఇంటికి, మీ సేవకులకు ఎన్నో బహుమతులు అందజేశారు. 369 00:28:14,862 --> 00:28:17,614 రాజుగారి రాకకు మేము సిద్ధం కాకపోవడం వల్ల, ఇవ్వాల్సినంతగా 370 00:28:17,698 --> 00:28:19,366 ఆయనకు ఆతిథ్యం ఇవ్వలేదనిపిస్తోంది. 371 00:28:19,449 --> 00:28:20,450 అంతా బాగానే ఉంది. 372 00:28:21,034 --> 00:28:24,288 నేను ఆ ముగ్గురు వింత అక్కా చెల్లెళ్ళ గురించి నిన్న రాత్రి కలగన్నాను. 373 00:28:25,873 --> 00:28:27,624 నీ విషయంలో వాళ్ళు చెప్పినదాన్లో కొంత నిజమైంది. 374 00:28:29,710 --> 00:28:31,420 నేనిప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. 375 00:28:31,503 --> 00:28:34,298 అయినప్పటికీ, నీకు సమయముంటే, 376 00:28:34,381 --> 00:28:37,176 మనిద్దరం ఆ విషయం గురించి 377 00:28:37,259 --> 00:28:38,719 ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. 378 00:28:39,887 --> 00:28:41,388 మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు! 379 00:28:43,348 --> 00:28:44,683 ఈలోగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. 380 00:28:45,559 --> 00:28:47,311 అలాగే ప్రభూ. మీరు కూడా! 381 00:28:50,564 --> 00:28:52,024 నా పానీయం సిద్ధం కాగానే, 382 00:28:52,107 --> 00:28:54,943 గంట మోగించమని మీ యజమానురాలికి చెప్పు. 383 00:29:11,418 --> 00:29:14,171 నాకు ఎదురుగా కనిపిస్తున్నది కత్తేనా? 384 00:29:15,714 --> 00:29:17,508 పిడి నా చేతివైపే ఉన్నది ఎందుకు? 385 00:29:21,678 --> 00:29:22,763 దగ్గరకు రా… 386 00:29:24,556 --> 00:29:26,016 నన్ను పట్టుకోనివ్వు. 387 00:29:30,479 --> 00:29:32,898 నేను నిన్ను చూడగలుగుతున్నాను, కానీ పట్టుకోలేకపోతున్నాను. 388 00:29:35,359 --> 00:29:40,030 ఏమిటీ వింత! నిన్ను చూడగలిగినట్లే పట్టుకోవడం సాధ్యం కాదా? 389 00:29:41,406 --> 00:29:45,702 లేక మనసుకు కత్తిలా కనిపిస్తున్న నువ్వు ఆలోచనలతో వేడెక్కిపోయిన నా మనసు 390 00:29:45,786 --> 00:29:47,746 సృష్టించిన భ్రమవు మాత్రమేనా? 391 00:29:49,831 --> 00:29:51,458 ఇప్పటికీ నిన్ను చూడగలుగుతున్నాను… 392 00:29:53,168 --> 00:29:57,047 నేనిప్పుడు బయటికి తీస్తున్న ఈ కత్తి ఎలా ఉందో, అచ్చం అలాగే ఉన్నావు. 393 00:30:00,259 --> 00:30:02,052 నేను బయలుదేరిన గమ్యానికే దారి చూపిస్తున్నావు. 394 00:30:02,135 --> 00:30:04,847 నీలాంటి ఆయుధాన్నే నేను వాడాలని అనుకుంటున్నాను. 395 00:30:05,764 --> 00:30:08,267 నా ఇంద్రియాల్లో కళ్ళు సరిగా పనిచేయకుండా ఉండుండాలి, 396 00:30:08,350 --> 00:30:10,269 లేదా అదొక్కటే సరిగ్గా పనిచేస్తూ ఉండుండాలి. 397 00:30:12,354 --> 00:30:13,689 నేను ఇప్పటికీ నిన్ను చూడగలుగుతున్నాను, 398 00:30:14,648 --> 00:30:19,236 నీ అంచుమీద, పిడిమీద ఇంతకుముందులేని రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. 399 00:30:20,737 --> 00:30:22,948 ఇక్కడసలు కత్తే లేదు. 400 00:30:23,031 --> 00:30:26,243 నేను చేయబోయే హత్య గురించిన ఆలోచనల రూపమే కత్తిలా కనిపించింది. 401 00:30:27,244 --> 00:30:30,914 ఓ భూమీ! నా అడుగుల చప్పుడు ఎటు వెళుతుందో వినకు, 402 00:30:30,998 --> 00:30:34,376 నేను ఎక్కడున్నానో తెలిసేలా ప్రతిధ్వనించకు! 403 00:30:34,877 --> 00:30:37,546 నేను వెళుతున్నాను, ఇక పని పూర్తయినట్లే. 404 00:30:38,297 --> 00:30:39,756 ఆ గంట నన్ను ఆహ్వానిస్తోంది. 405 00:30:40,632 --> 00:30:45,596 ఆ గంట చప్పుడు వినకు డంకన్, అది నిన్ను స్వర్గానికి పంపొచ్చు… 406 00:30:48,223 --> 00:30:49,600 లేదా నరకానికి పంపొచ్చు. 407 00:31:56,792 --> 00:31:57,793 విను! 408 00:31:59,962 --> 00:32:01,171 నిశ్శబ్దం. నిశ్శబ్దం. 409 00:32:03,715 --> 00:32:06,051 అది గుడ్లగూబ అరుపులా ఉంది, 410 00:32:06,134 --> 00:32:09,346 ప్రజల్ని చంపబోయే ముందు వీడ్కోలుపలికే గంట మోతలా ఉంది. 411 00:32:11,014 --> 00:32:12,850 మేక్బెత్ పని పూర్తి చేస్తూ ఉండుంటాడు. 412 00:32:14,810 --> 00:32:17,896 సేవకులను స్పృహ తప్పేలా చేసిన మద్యం నాలో ధైర్యాన్ని నింపింది. 413 00:32:19,106 --> 00:32:21,859 వాళ్ళ దాహం తీర్చిన మద్యం నాలో అగ్నిని రగిలించింది. 414 00:32:22,734 --> 00:32:24,444 తలుపులు తెరుచుకున్నాయి, 415 00:32:25,195 --> 00:32:29,199 రాజును రక్షించాల్సిన సైనికులు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. 416 00:32:29,283 --> 00:32:30,617 ఆమెన్. 417 00:32:32,119 --> 00:32:33,912 నేను వాళ్ళకి మద్యంలో కలిపిన 418 00:32:33,996 --> 00:32:36,248 మత్తు పదార్థాల వల్ల, వాళ్ళు బతికున్నారో 419 00:32:36,331 --> 00:32:38,542 లేక చనిపోయారో కూడా చెప్పడం కష్టమే. 420 00:32:49,219 --> 00:32:50,387 అయ్యో! 421 00:32:52,347 --> 00:32:54,516 ఒకవేళ వాళ్ళు మేలుకుని, అనుకున్నదేదీ జరగకపొతే! 422 00:32:54,600 --> 00:32:57,269 హత్యా ప్రయత్నం విఫలమైతే ఇక మా కథ ముగిసినట్లే! 423 00:32:57,895 --> 00:32:58,979 ఆ శబ్దం ఏమిటి? 424 00:32:59,062 --> 00:33:01,773 నేను కత్తులు సిద్ధంగా ఉంచాను. అతనికి దొరక్కుండా ఉండే అవకాశం లేదు! నేను కత్తులు సిద్ధంగా ఉంచాను. అతనికి దొరక్కుండా ఉండే అవకాశం లేదు! 425 00:33:04,902 --> 00:33:06,278 వచ్చావా ప్రియా! 426 00:33:08,488 --> 00:33:09,907 నేను పని పూర్తి చేశాను. 427 00:33:10,657 --> 00:33:12,326 నీకు ఏదైనా శబ్దం వినబడిందా? 428 00:33:12,409 --> 00:33:14,369 - ఎప్పుడు? - ఇప్పుడే! 429 00:33:14,453 --> 00:33:15,704 - నేను దిగి వచ్చేటప్పుడా? - అవును. 430 00:33:15,787 --> 00:33:16,788 విను! 431 00:33:20,334 --> 00:33:22,419 ఇది విచారకరమైన దృశ్యం. 432 00:33:23,045 --> 00:33:25,672 విచారకరం అని అనడం పిచ్చితనం. 433 00:33:27,966 --> 00:33:29,426 సైనికుల్లో ఒకడు నిద్రలో నవ్వాడు, 434 00:33:29,510 --> 00:33:31,553 మరొకడు "హత్య!" అనేసరికి ఇద్దరూ నిద్ర లేచారు. 435 00:33:31,637 --> 00:33:33,555 నేను నిలబడి వాళ్ళ మాటలు విన్నాను. 436 00:33:33,639 --> 00:33:36,600 కానీ వాళ్ళు ప్రార్థనలు చదివి తిరిగి నిద్రలోకి జారుకున్నారు. 437 00:33:36,683 --> 00:33:37,809 ఇద్దరూ ఒకే గదిలో నిద్రపోతూ ఉన్నారు. 438 00:33:37,893 --> 00:33:40,729 రక్తంతో తడిచిన నా చేతులని చూస్తూ, "దేవుడు దీవించాలి" 439 00:33:41,730 --> 00:33:42,814 అని ఒకడు అరిచాడు. 440 00:33:42,898 --> 00:33:44,691 మరొకడు "ఆమెన్" అన్నాడు. 441 00:33:44,775 --> 00:33:48,028 "దేవుడు దీవించుగాక!" అన్నప్పటికీ, వాళ్ళ భయం చూసి "ఆమెన్" అనలేకపోయాను. 442 00:33:48,111 --> 00:33:49,404 దాని గురించి అంతగా బాధపడాల్సిన పనిలేదు. 443 00:33:49,488 --> 00:33:50,906 కానీ "ఆమెన్" అని ఎందుకు చెప్పలేకపోయాను? 444 00:33:50,989 --> 00:33:54,660 వాస్తవానికి దీవెనలు కావలసింది నాకే, కానీ "ఆమెన్" అన్న పదం నా గొంతులో ఆగిపోయింది. 445 00:33:54,743 --> 00:33:56,954 మనం చేసిన పని గురించి ఈ విధంగా ఆలోచించకూడదు. 446 00:33:57,037 --> 00:34:00,040 లేదంటే, మనకి పిచ్చెక్కుతుంది. లేదంటే, మనకి పిచ్చెక్కుతుంది. 447 00:34:00,123 --> 00:34:02,501 ఒక గొంతు ఏడుస్తూ, "ఇక నీకు నిద్ర లేదు, 448 00:34:04,086 --> 00:34:05,754 మేక్బెత్ నిద్రని హత్య చేశాడు" అన్నట్లు అనిపించింది. 449 00:34:05,838 --> 00:34:07,381 అమాయకమైన నిద్ర! 450 00:34:07,464 --> 00:34:10,467 మన బాధలన్నిటినీ దూరం చేసే నిద్ర, 451 00:34:10,551 --> 00:34:15,264 ప్రతిరోజుకీ ముగింపునిచ్చే నిద్ర, రోజంతా కష్టపడ్డ పనివాడికి శక్తినిచ్చే నిద్ర, 452 00:34:15,347 --> 00:34:19,016 గాయపడ్డ హృదయాలకు ఊరటనిచ్చే నిద్ర, జీవితమనే విందులో ప్రధాన వంటకం, 453 00:34:19,101 --> 00:34:21,436 - అత్యవసర పోషణ అందించే వంటకం. - ఏమిటి నీ ఉద్దేశం? 454 00:34:21,520 --> 00:34:24,022 ఆ గొంతు ఏడుస్తూ ఇంట్లో అందరితో "ఇక నీకు నిద్రలేదు" అని అంటూనే ఉంది. 455 00:34:24,106 --> 00:34:28,025 "గ్లామిస్ నిద్రను హత్య చేశాడు, కాబట్టి ఇకపై కాడర్ కు నిద్రనేదే ఉండదు." 456 00:34:30,987 --> 00:34:33,072 "మేక్బెత్ కి ఇకపై నిద్ర ఉండదు." 457 00:34:33,156 --> 00:34:35,074 అలా ఏడుస్తూ చెప్పింది ఎవరు? 458 00:34:35,158 --> 00:34:38,661 ఎందుకు ప్రభూ, నువ్వు చేసిన పని గురించి ఇలా పిరికిపందలా ఆలోచించి 459 00:34:38,745 --> 00:34:40,330 నిన్ను నువ్వే బలహీనుడిని చేసుకుంటున్నావు? 460 00:34:40,414 --> 00:34:43,917 వెళ్ళు. వెళ్లి, నీ చేతుల మీదున్న ఆ అసహ్యమైన సాక్ష్యాన్ని కడిగేయి. 461 00:34:47,045 --> 00:34:49,172 నువ్వు ఈ కత్తుల్ని అక్కడినుండి ఎందుకు తీసుకొచ్చావు? 462 00:34:49,255 --> 00:34:52,801 అవి అక్కడే ఉండాలి. వెళ్ళు. వాటిని తీసుకెళ్ళు. ఆ సైనికుల ఒంటినిండా రక్తాన్ని పులుము. 463 00:34:52,885 --> 00:34:55,429 నేనిక వెళ్ళేది లేదు. నేను చేసిన పనిని తలుచుకుంటేనే భయమేస్తోంది. 464 00:34:55,512 --> 00:34:56,847 నేను మళ్ళీ దానిని చూడలేను. 465 00:34:56,929 --> 00:34:58,891 ఇంతటి పిరికితనం పనికిరాదు. 466 00:34:58,974 --> 00:35:00,601 ఆ కత్తుల్ని నాకివ్వు! ఆ కత్తుల్ని నాకివ్వు! 467 00:35:01,476 --> 00:35:03,937 చనిపోయిన వాడిని, నిద్రపోయే వాడిని చూసి భయపడడమంటే, 468 00:35:04,021 --> 00:35:06,481 దెయ్యపు బొమ్మని చూసి పసి పిల్లలు భయపడినట్లే. 469 00:35:07,482 --> 00:35:10,777 నేను ఆ సైనికుల మొహాలనిండా రక్తాన్ని పూస్తాను, అప్పుడే హత్య చేసింది వారే అన్నట్లు కనిపిస్తుంది. 470 00:35:11,653 --> 00:35:14,990 నా చేతులు కూడా నీ చేతుల రంగులోనే ఉన్నాయి, కానీ నేనేమీ నీలా భయపడడం లేదే! 471 00:35:24,249 --> 00:35:25,584 ఆ బాదే శబ్దం ఎక్కడినుండి వస్తోంది? 472 00:35:28,170 --> 00:35:30,964 నాకేం జరుగుతోంది, ప్రతి శబ్దానికీ ఎందుకు భయపడుతున్నాను? 473 00:35:32,508 --> 00:35:36,678 ఈ చేతులు ఎవరివి? అవి నా కళ్ళను పీకేస్తున్నాయి. 474 00:35:38,639 --> 00:35:43,018 నా చేతులకున్న రక్తం పోవాలంటే, సముద్రంలో నీళ్ళు మొత్తం తెచ్చినా సరిపోతాయా? 475 00:35:43,101 --> 00:35:48,232 లేదు, బదులుగా నా చేతులకున్న రక్తం సముద్రపు నీళ్ళని కలుషితం చేసి, 476 00:35:48,315 --> 00:35:50,526 ఆకుపచ్చ నీళ్ళు ఎర్రగా మారిపోతాయి. 477 00:35:55,822 --> 00:35:57,950 చేసిన నేరం గురించి ఆలోచించేకంటే, పూర్తిగా స్పృహ తప్పితే బాగుండు. 478 00:35:59,159 --> 00:36:00,953 ఈ శబ్దాలతో డంకన్ ని నిద్ర లేపండి! ఈ శబ్దాలతో డంకన్ ని నిద్ర లేపండి! 479 00:36:02,496 --> 00:36:03,830 అలా అయితే బాగుండేది. 480 00:36:18,428 --> 00:36:20,556 అబ్బా, ఏమిటీ బాదుడు! 481 00:36:29,273 --> 00:36:31,733 నరక ద్వారానికి ఎవడైనా కాపలా ఉంటే, 482 00:36:31,817 --> 00:36:34,027 తాళం వేసీ తీసీ ముసలోడు అయిపోయి ఉంటాడు. 483 00:36:36,238 --> 00:36:37,239 తలుపు తడుతున్నారు! 484 00:36:37,322 --> 00:36:40,284 ఎవరక్కడ, దెయ్యమా? 485 00:36:41,034 --> 00:36:45,330 ఇదిగో ఈ ఆశబోతు రైతు అన్నీ కోల్పోయి ఆత్మహత్య చేసుకుని దెయ్యమయ్యాడు. 486 00:36:45,414 --> 00:36:48,625 సమయనికొచ్చావు. ఇక్కడ బోలెడంత చెమట పడుతుంది చూసుకో. 487 00:36:50,377 --> 00:36:51,962 తలుపు తడుతున్నారు! 488 00:36:52,045 --> 00:36:56,466 ఇక్కడో మాటకారి ఉన్నాడు, ఏ పక్షం ఉన్నాడో తెలీకుండా రెండువైపులా మాటిచ్చాడు, 489 00:36:56,550 --> 00:36:58,677 అతనిప్పుడు నరకానికి వచ్చాడు. 490 00:37:00,304 --> 00:37:01,638 ఇటురా, మాటకారి! 491 00:37:02,389 --> 00:37:04,516 తలుపు తడుతున్నారు! ఎవరక్కడ! 492 00:37:05,267 --> 00:37:09,271 బహుశా ప్రజలకు చాలీ చాలకుండా బట్టలు కుట్టే ఇంగ్లీష్ దర్జీ అయ్యుంటాడు. 493 00:37:09,354 --> 00:37:12,900 లోపలికిరా దర్జీ! ఇక్కడ నువ్వు బాతుని కాల్చుకుని తినవచ్చు. 494 00:37:15,360 --> 00:37:17,237 తలుపు తడుతున్నారు! ప్రశాంతంగా ఉండనివ్వరు కదా! 495 00:37:19,364 --> 00:37:21,992 అయినా నరకం ఇంత చల్లగా ఎక్కడుంటుందిలే. 496 00:37:22,075 --> 00:37:25,871 ఇకపై నేను నరక ద్వారానికి కాపలావాడిలా నటించలేను. వస్తున్నా! 497 00:37:27,664 --> 00:37:29,333 దయచేసి ఈ కాపలావాడిని మర్చిపోకండి. 498 00:37:29,416 --> 00:37:32,544 రాత్రి ఆలస్యంగా పడుకున్నావా? రావడానికి ఇంత సమయం పట్టింది. 499 00:37:32,628 --> 00:37:34,713 సరిగ్గా చెప్పారు ప్రభూ, తెల్లవారి మూడు వరకూ తాగుతూనే ఉన్నాం. 500 00:37:34,796 --> 00:37:37,216 అయినా మద్యం మనిషి చేత మూడు పనులు చేయిస్తుంది ప్రభూ. 501 00:37:37,299 --> 00:37:41,720 - మూడు పనులేంటి? - ముక్కు ఎరుపెక్కడం, నిద్రరావడం, ఒంటికెళ్ళాల్సి రావడం. 502 00:37:42,346 --> 00:37:44,806 అవును ప్రభూ, అది కామాన్ని ప్రేరేపించి, తిరిగి చల్లారుస్తుంది. 503 00:37:44,890 --> 00:37:48,435 కోరికని రేకెత్తిస్తుంది, కానీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. 504 00:37:48,519 --> 00:37:52,064 కాబట్టి శృంగారం విషయానికొస్తే, మితిమీరిన తాగుడు ద్రోహం చేస్తుంది. 505 00:37:52,147 --> 00:37:55,234 ఉద్రేకపరుస్తుంది, కానీ నీరు కారుస్తుంది. పురికొల్పుతుంది, కానీ కూలదోస్తుంది. 506 00:37:55,317 --> 00:38:00,864 ఉత్సాహపరుస్తుంది, కానీ నిరుత్సాహపరుస్తుంది, నిలబెడుతుంది, కానీ పడేస్తుంది. ఉత్సాహపరుస్తుంది, కానీ నిరుత్సాహపరుస్తుంది, నిలబెడుతుంది, కానీ పడేస్తుంది. 507 00:38:04,701 --> 00:38:11,166 మొత్తంగా, శృంగార కలలు కనేలా చేస్తుంది, కానీ చివరికి నిద్రపుచ్చి, ఒంటికి వెళ్ళేలా చేస్తుంది. 508 00:38:11,250 --> 00:38:13,836 చూడబోతే ఇప్పుడు చెప్పినవన్నీ నీకు రాత్రి జరిగినట్లుగా ఉన్నాయి. 509 00:38:19,716 --> 00:38:21,009 మీ ఇద్దరికీ శుభోదయం! 510 00:38:25,347 --> 00:38:27,015 థేన్ మహాశయా, మహారాజు నిద్ర లేచారా? 511 00:38:28,725 --> 00:38:29,726 ఇంకా లేదు. 512 00:38:30,853 --> 00:38:34,815 ఉదయాన్నే వచ్చి లేపమని నాతో చెప్పారు. నేను ఇప్పటికే ఆలస్యం చేశాను. 513 00:38:38,402 --> 00:38:39,736 నేను వెళ్లి ఆయన్ని లేపుతాను. 514 00:38:41,029 --> 00:38:43,115 మహారాజు ఈరోజు బయలుదేరుతున్నారా? 515 00:38:43,991 --> 00:38:45,784 అవును. ఏర్పాట్లు చేయమని చెప్పారు. 516 00:38:47,119 --> 00:38:49,037 రాత్రి చాలా ఘోరంగా గడిచింది. 517 00:38:52,416 --> 00:38:54,710 మేము పడుకున్నచోట పొగ గొట్టాలలోంచి గాలి చొచ్చుకు వచ్చింది. 518 00:38:56,336 --> 00:39:00,424 తాము ఏడుపులు విన్నామని ప్రజలు అన్నారు. తాము ఏడుపులు విన్నామని ప్రజలు అన్నారు. 519 00:39:00,507 --> 00:39:06,680 వింతైన చావు కేకలు వినిపించాయనీ, ప్రళయం సంభవించి ఏవేవో దుర్ఘటనలు జరుగుతాయని 520 00:39:06,763 --> 00:39:10,225 భయంకరమైన గొంతులు భవిష్యవాణి చెప్పాయనీ అంటున్నారు. 521 00:39:11,059 --> 00:39:12,269 గుడ్లగూబ… 522 00:39:12,352 --> 00:39:14,855 - మహారాజా? - …రాత్రంతా అరుస్తూనే ఉందట. 523 00:39:15,731 --> 00:39:20,611 కొందరైతే, భూమి రగిలి కంపించిపోయిందని అన్నారు. 524 00:39:22,738 --> 00:39:24,406 చాలా దారుణంగా గడిచిందన్నమాట. 525 00:39:24,489 --> 00:39:28,285 దారుణం! దారుణం! దారుణం! 526 00:39:29,244 --> 00:39:32,039 నేను నమ్మలేకపోతున్నాను, ఏమి చెప్పాలో కూడా తెలియడం లేదు. 527 00:39:32,122 --> 00:39:35,334 - ఏమి జరిగింది? - ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. 528 00:39:35,417 --> 00:39:38,962 దేవుడి గుడిలాంటి మహారాజు శరీరంలోకి మృత్యువు ప్రవేశించి, 529 00:39:39,046 --> 00:39:40,672 అందులోంచి జీవాన్ని తీసుకుపోయింది. 530 00:39:40,756 --> 00:39:41,882 నువ్వు మహారాజు గురించి అంటున్నావా? 531 00:39:41,965 --> 00:39:44,051 గదిలోకి వెళ్లి స్వయంగా చూడండి. భయంతో బిగుసుకుపోతారు. 532 00:39:44,134 --> 00:39:47,304 మాట్లాడమని అడగకండి. చూసి, మీరే స్వయంగా మాట్లాడండి. 533 00:39:47,387 --> 00:39:51,183 లేవండి! లేవండి! హెచ్చరిక గంట మోగించండి! 534 00:39:52,768 --> 00:39:54,019 హత్య! ద్రోహం! 535 00:39:54,603 --> 00:40:00,067 మీ సమాధులలోంచి నిద్రలేవండి, ఈ దారుణాన్ని చూడడానికి ఆత్మలలాగా నడిచిరండి! మీ సమాధులలోంచి నిద్రలేవండి, ఈ దారుణాన్ని చూడడానికి ఆత్మలలాగా నడిచిరండి! 536 00:40:03,070 --> 00:40:07,324 బాంకో, డోనాల్బైన్! మాల్కం! నిద్రలేవండి! 537 00:40:07,407 --> 00:40:10,619 లేవండి! లేవండి! ఈ ప్రళయాన్ని కళ్ళారా చూడండి! 538 00:40:11,912 --> 00:40:13,997 మాల్కం! బాంకో! 539 00:40:16,625 --> 00:40:18,961 ఈ సంఘటనకు ఒక గంట ముందు నేను చనిపోయినా… 540 00:40:20,504 --> 00:40:22,047 …నా జీవితం సంతోషంగా గడిచిందని చెప్పేవాడిని. 541 00:40:24,591 --> 00:40:25,884 ఎందుకంటే, ఈ క్షణంనుండీ, 542 00:40:25,968 --> 00:40:28,804 నా జీవితానికి ఇక అర్థంలేదు. అంతా బూటకం. 543 00:40:28,887 --> 00:40:30,222 ఏమి జరిగింది, 544 00:40:30,305 --> 00:40:32,975 ఇంట్లో నిద్రపోతున్న అందరినీ లేపాల్సిన అవసరం ఏమి వచ్చింది? 545 00:40:33,058 --> 00:40:35,894 - మన ఉత్తమ మహారాజు చనిపోయారు. - చెప్పండి! చెప్పండి! 546 00:40:35,978 --> 00:40:38,397 ద్రాక్షారసం లాంటి జీవితంలోని సారం మొత్తం పిండివేసినట్లుంది, 547 00:40:38,480 --> 00:40:41,817 కేవలం పిప్పి మాత్రమే మిగిలింది. 548 00:40:41,900 --> 00:40:44,111 బాంకో! బాంకో! 549 00:40:44,695 --> 00:40:46,154 మన మహారాజు హత్య చేయబడ్డారు. 550 00:40:46,238 --> 00:40:48,782 అయ్యో! ఏమిటీ ఘోరం! 551 00:40:48,866 --> 00:40:51,660 - ఏమిటీ! మన ఇంట్లోనా? - ఎక్కడ జరిగినా దారుణమే. 552 00:40:52,536 --> 00:40:55,581 - ఏమి జరిగింది? - మీకే, ఇప్పటివరకూ తెలియంది మీకే! 553 00:40:56,290 --> 00:41:00,878 మీకు ప్రాణమిచ్చిన గొప్ప రక్తం ప్రవహించడం ఆగిపోయింది. మీకు ప్రాణమిచ్చిన గొప్ప రక్తం ప్రవహించడం ఆగిపోయింది. 554 00:41:00,961 --> 00:41:03,088 అసలుసిసలు మూలం ఆగిపోయింది. 555 00:41:04,006 --> 00:41:05,340 మీ నాన్నగారు… 556 00:41:06,258 --> 00:41:07,718 హత్య చేయబడ్డారు. 557 00:41:11,722 --> 00:41:12,723 ఎవరు చేశారు? 558 00:41:12,806 --> 00:41:15,517 అతని గదిలో ఉన్న అంగరక్షకులే ఆ పని చేసినట్లు తెలుస్తోంది. 559 00:41:16,018 --> 00:41:19,229 వారి చేతులు, మొహాలు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. 560 00:41:19,313 --> 00:41:22,357 నేను కోపంలో వారిని చంపేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. 561 00:41:24,151 --> 00:41:25,944 - ఎందుకు? - ఎందుకలా చేశావు? 562 00:41:29,031 --> 00:41:31,909 ఒకే సమయంలో తెలివిగా, అయోమయంగా, 563 00:41:32,993 --> 00:41:37,331 అసహనంగా, కోపంగా, తటస్థంగా, విధేయుడిగా ఉండడం ఎవరికైనా సాధ్యమేనా? 564 00:41:38,123 --> 00:41:39,249 అలా ఎవరూ ఉండలేరు. 565 00:41:41,001 --> 00:41:45,672 మహారాజుపట్ల నాకున్న ప్రేమ నన్ను హేతుబద్ధంగా ఆలోచించకుండా అడ్డుకుంది. 566 00:41:45,756 --> 00:41:48,550 ఇక్కడ పడి ఉన్న డంకన్, 567 00:41:49,801 --> 00:41:52,930 తెల్లని చర్మం నిండా ఆయన విలువైన రక్తం చిమ్మింది. 568 00:41:53,639 --> 00:41:59,144 ఆయన ఒంటిపై ఉన్న కత్తిగాట్లు ప్రకృతికి అయిన గాయాల్లాగా అనిపించాయి. 569 00:41:59,228 --> 00:42:04,107 ఆయన పక్కనే పడిఉన్న హంతకులు నెత్తుటిలో తడిచిపోయి ఉన్నారు, ఆయన పక్కనే పడిఉన్న హంతకులు నెత్తుటిలో తడిచిపోయి ఉన్నారు, 570 00:42:04,816 --> 00:42:08,820 వారి కత్తులపై ఎండిపోయిన రక్తం ఉంది. 571 00:42:09,321 --> 00:42:12,491 రాజుగారి పట్ల ప్రేమ ఉన్న వారెవరైనా, ఆయనపై జరిగిన దారుణాన్ని 572 00:42:14,201 --> 00:42:19,289 ఎదిరించగల ధైర్యంగల వారెవరైనా, తమని తాము నియంత్రించుకోగలరా? 573 00:42:21,250 --> 00:42:23,126 ఆమెను జాగ్రత్తగా చూసుకోండి! 574 00:42:23,210 --> 00:42:26,213 మనందరం సరైన చలి దుస్తులు ధరించాక, ఈ నెత్తుటి ఘోరం గురించి 575 00:42:26,296 --> 00:42:27,297 చర్చించేందుకు కలుసుకుందాం, 576 00:42:27,965 --> 00:42:30,843 హత్యకు సంబంధించి మరింత సమాచారం కనిపెట్టగలమేమో చూద్దాం. 577 00:42:41,645 --> 00:42:43,480 మనిద్దరం నిశ్శబ్దంగా ఎందుకున్నట్లు? 578 00:42:43,564 --> 00:42:45,858 ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా మాట్లాడాల్సింది మనమే కదా? 579 00:42:45,941 --> 00:42:46,984 ఇక్కడి నుండి వెళ్ళిపోదాం! 580 00:42:47,651 --> 00:42:50,404 - మన దుఃఖాన్ని ఇంతవరకూ బయటపెట్టనే లేదు. - మనం వీళ్ళతో ఇక్కడ ఉండొద్దు. 581 00:42:50,487 --> 00:42:53,824 మనసులో బాధేమీ లేకపోయినా, బాధపడుతున్నట్లు నటించడం మోసగాడికి ఎంతో తేలిక. 582 00:42:54,408 --> 00:42:56,577 - నేను ఇంగ్లాండ్ వెళతాను. - నేను ఐర్లాండ్ వెళతాను. 583 00:42:57,536 --> 00:43:00,080 చెరో దారిలో వెళితేనే మనిద్దరం సురక్షితంగా ఉండగలం. చెరో దారిలో వెళితేనే మనిద్దరం సురక్షితంగా ఉండగలం. 584 00:43:00,664 --> 00:43:01,874 మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషులు… 585 00:43:03,250 --> 00:43:05,002 మనుసులో విషం దాచుకుని బయటికి నవ్వుతూ ఉంటారు. 586 00:43:05,085 --> 00:43:07,004 మనకు అత్యంత సన్నిహితంగా ఉండే బంధువులే మనల్ని చంపే అవకాశముంది. 587 00:43:07,087 --> 00:43:09,965 మనమింకా అలాంటి ప్రమాదంలో పడలేదు. 588 00:43:10,048 --> 00:43:12,050 దాన్ని పూర్తిగా నివారించడమే మనకున్న సురక్షితమైన మార్గం. 589 00:43:12,134 --> 00:43:15,971 కాబట్టి గుర్రాల దగ్గరికి వెళదాం. ఎవరికీ వీడ్కోలు చెప్పాల్సిన పనిలేదు. 590 00:43:54,843 --> 00:43:56,512 మంచివాడైన మేక్డఫ్ వస్తున్నాడు. 591 00:44:05,187 --> 00:44:06,855 ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభూ? 592 00:44:08,315 --> 00:44:11,026 ఈ ఘోరమైన హత్య చేసిందెవరో ఎవరికైనా తెలుసా? 593 00:44:11,109 --> 00:44:13,195 మేక్బెత్ చంపేసిన భటులే. 594 00:44:13,278 --> 00:44:16,740 అయ్యో! వాళ్ళని చంపకుండా ఉండాల్సింది. రాజుని చంపితే వాళ్ళకు ఒరిగేదేమిటి? 595 00:44:16,823 --> 00:44:18,242 చంపినందుకు వాళ్ళకు డబ్బు ముట్టజెప్పారు. 596 00:44:19,076 --> 00:44:20,077 మహారాజు ఇద్దరు కొడుకులు 597 00:44:20,160 --> 00:44:22,538 మాల్కం, డోనాల్బైన్ లు రాజ్యం నుండి పారిపోయారు. 598 00:44:22,621 --> 00:44:25,290 దాంతో వాళ్ళే ప్రధాన అనుమానితులు అయ్యారు. 599 00:44:25,374 --> 00:44:30,420 అలా అయితే రాజ్యం పూర్తిగా మేక్బెత్ చేతుల్లోకి వెళ్ళినట్లేనా? 600 00:44:30,504 --> 00:44:34,132 అతన్ని ఇప్పటికే రాజుగా ప్రకటించారు, పట్టాభిషేకం కోసం డన్సినేన్ బయలుదేరాడు. 601 00:44:34,216 --> 00:44:35,217 నువ్వు కూడా డన్సినేన్ వెళుతున్నావా? 602 00:44:36,510 --> 00:44:38,846 లేదు సోదరా! ఫైఫ్ లో నా ఇంటికి వెళుతున్నాను. 603 00:44:40,055 --> 00:44:41,056 సరే… 604 00:44:43,433 --> 00:44:44,434 అయితే నేను డన్సినేన్ వెళతాను. 605 00:44:45,269 --> 00:44:48,021 అక్కడ పరిస్థితి బాగుండాలని కోరుకుంటున్నా. వెళ్లొస్తాను. 606 00:44:49,648 --> 00:44:52,484 పరిస్థితులు ఇంతకంటే దిగజారకుండా ఉంటే బాగుంటుంది. 607 00:44:57,447 --> 00:45:00,576 బుద్ధి తక్కువ వాడెవడైనా బుద్ధి తక్కువ వాడెవడైనా 608 00:45:01,118 --> 00:45:04,246 హే-హో అంటూ జోరున గాలి, హోరున వాన వచ్చినా 609 00:45:05,080 --> 00:45:09,668 దక్కించుకుని తీరాలి తనకు దక్కాల్సిన వాటిని 610 00:45:10,961 --> 00:45:15,591 ఎందుకంటే ప్రతిరోజూ వస్తుంది కనుక వర్షం 611 00:45:30,981 --> 00:45:33,692 గడిచిన డెబ్భై ఏళ్ళు నాకు బాగా గుర్తున్నాయి, 612 00:45:34,902 --> 00:45:36,445 ఆ కాలంలో నేను 613 00:45:36,528 --> 00:45:41,867 ఎన్నో ఘోరమైన సంఘటనలనూ, వింత విషయాలనూ చూశాను. 614 00:45:43,035 --> 00:45:48,790 కానీ గతరాత్రి జరిగిన సంఘటనకు సాటి రాగలది ఒక్కటికూడా లేదు. 615 00:45:50,083 --> 00:45:51,251 అవును, తండ్రీ! 616 00:45:53,045 --> 00:45:54,922 నువ్వు ఆకాశం వంక చూస్తే, 617 00:45:55,005 --> 00:46:00,052 మానవాళి తీరుపై కలతతో అది ఈ నేలను తుఫానులతో ముంచెత్తుతానని భయపెడుతోంది. మానవాళి తీరుపై కలతతో అది ఈ నేలను తుఫానులతో ముంచెత్తుతానని భయపెడుతోంది. 618 00:46:00,135 --> 00:46:01,845 ఇది పగటి సమయమని గడియారం చెబుతోంది, 619 00:46:02,971 --> 00:46:06,183 కానీ కాళరాత్రిలాంటి మేఘాలు సూర్యుడిని కప్పేస్తున్నాయి. 620 00:46:07,768 --> 00:46:13,148 రాత్రి శక్తివంతంగా ఉందా? లేక పగలు బలహీనంగా ఉందా? 621 00:46:13,732 --> 00:46:16,360 ఎందుకంటే వెలుతురుతో ప్రకాశించాల్సిన భూమిని 622 00:46:16,443 --> 00:46:18,028 చీకటి కమ్మేస్తోంది, ఎందుకని? 623 00:46:18,111 --> 00:46:21,323 గతరాత్రి జరిగిన హత్యలాగా, ఇది పూర్తి అసహజంగా ఉంది. 624 00:46:24,284 --> 00:46:29,414 సాధారణంగా ఎలుకల్ని తినే గుడ్లగూబ, గత మంగళవారం ఆకాశంలో ఎత్తులో ఎగురుతున్న 625 00:46:29,498 --> 00:46:32,668 ఒక ఫాల్కన్ పక్షిని చంపేసింది. 626 00:46:33,335 --> 00:46:38,590 ఎంతో అందమైనవీ, ధృడమైనవీ, వాటి జాతిలో ఉత్తమమైనవీ అయిన 627 00:46:39,466 --> 00:46:41,468 డంకన్ గుర్రాలు, ఒక్కసారిగా క్రూరంగా మారిపోయి, 628 00:46:41,552 --> 00:46:45,222 తమ కొట్టాలలోంచి బయటపడి పారిపోయాయి. 629 00:46:45,305 --> 00:46:49,351 ఎప్పటిలా అణుకువగా ఉండం అని మొరాయించాయి, 630 00:46:49,434 --> 00:46:52,688 మానవాళితో యుద్ధం ప్రకటించినట్లు ప్రవర్తించాయి. 631 00:46:58,193 --> 00:47:00,362 అవి ఒకదాన్ని ఒకటి చంపుకున్నాయని అంటున్నారు. అవి ఒకదాన్ని ఒకటి చంపుకున్నాయని అంటున్నారు. 632 00:47:39,443 --> 00:47:40,736 ఇప్పుడు నీకు అన్నీ దక్కాయి. 633 00:47:42,487 --> 00:47:45,365 మహారాజువి, కాడర్ థేన్ వి, 634 00:47:46,533 --> 00:47:47,784 గ్లామిస్ థేన్ వి… 635 00:47:49,912 --> 00:47:52,414 ఆ వింత మహిళలు మాటిచ్చినట్లుగానే అన్నీ జరిగాయి. 636 00:47:55,209 --> 00:47:57,920 వీటిని గెల్చుకోవడానికి నువ్వు కుట్ర చేశావని నా ఉద్దేశం. 637 00:48:00,923 --> 00:48:03,759 అయినప్పటికీ సింహాసనం నీ బిడ్డలకు చెందదని కూడా వాళ్ళు చెప్పారు, 638 00:48:03,842 --> 00:48:08,639 బదులుగా నా పిల్లలు, నా మనవళ్ళు రాజులు అవుతారని చెప్పారు. 639 00:48:09,389 --> 00:48:11,308 మంత్రగత్తెలు చెప్పింది నిజమైతే... 640 00:48:12,518 --> 00:48:15,562 నీ విషయంలో వాళ్ళు చెప్పింది అక్షరాలా నిజమైంది మేక్బెత్! 641 00:48:18,023 --> 00:48:21,527 అందులో ఎటువంటి సందేహం లేదు, 642 00:48:21,610 --> 00:48:27,449 బహుశా నా గురించి వాళ్ళు చెప్పిన విషయాలు కూడా నిజం కావొచ్చు కదా? 643 00:48:30,536 --> 00:48:31,912 కానీ నిశ్శబ్దం! మాట్లాడకూడదు! 644 00:48:48,136 --> 00:48:50,472 మన ముఖ్య అతిథి విచ్చేశాడు. 645 00:48:51,598 --> 00:48:55,227 అతన్ని మనం మరచిపోతే ఈ వేడుకల్లో గొప్ప లోటు జరిగినట్లే. 646 00:48:55,310 --> 00:48:57,187 అది ఎంతమాత్రం మంచిది కాదు. 647 00:48:57,271 --> 00:49:00,566 ఈ రాత్రికి వేడుక విందు జరుపుకోబోతున్నాం, అందులో నువ్వూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రికి వేడుక విందు జరుపుకోబోతున్నాం, అందులో నువ్వూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. 648 00:49:01,900 --> 00:49:03,360 ఈరోజు మధ్యాహ్నం ప్రయాణించబోతున్నావా? 649 00:49:04,111 --> 00:49:05,112 అవును, మహారాజా! 650 00:49:05,195 --> 00:49:07,197 నీనుండి కొన్ని ముఖ్యమైన సలహాలు తీసుకోవాలని అనుకున్నాం, 651 00:49:07,281 --> 00:49:10,492 ఇవాళ జరిగిన సభ్యుల సమావేశంలో అది ఎంతో ఉపయోగపడి ఉండేది. 652 00:49:10,576 --> 00:49:12,828 కానీ మనం రేపు మాట్లాడుకుందాం. 653 00:49:13,620 --> 00:49:14,663 ఎక్కువ దూరం వెళుతున్నావా? 654 00:49:14,746 --> 00:49:18,417 నేను రాత్రి భోజనం సమయానికి తిరిగి రాగలిగే దూరానికే వెళుతున్నాను, మహారాజా! 655 00:49:19,042 --> 00:49:20,377 నా గుర్రం ఊహించిన దానికంటే వేగంగా వెళితే, 656 00:49:20,460 --> 00:49:24,381 నేను సూర్యాస్తమయం తర్వాత గంట, రెండు గంటల్లో వచ్చేస్తాను. 657 00:49:26,341 --> 00:49:27,467 విందుకు ఆలస్యం కాకుండా చూసుకో! 658 00:49:28,135 --> 00:49:29,386 తప్పకుండా, మహారాజా! 659 00:49:29,469 --> 00:49:32,556 యువరాజులు, అదే ఆ హంతకులు ఇంగ్లాండ్, ఐర్లాండ్ లో దాక్కున్నారని తెలిసింది. 660 00:49:32,639 --> 00:49:34,975 వాళ్ళ తండ్రి హత్యా నేరాన్ని అంగీకరించలేదు. 661 00:49:35,475 --> 00:49:36,560 ఈ విషయం రేపు మాట్లాడుకుందాం, 662 00:49:36,643 --> 00:49:39,563 పాలనా వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా చర్చించుకోవచ్చు. 663 00:49:39,646 --> 00:49:42,441 త్వరగా నీ గుర్రం దగ్గరికి చేరుకో. రాత్రికి తిరిగి వచ్చేవరకూ నీకు వీడ్కోలు. 664 00:49:47,070 --> 00:49:48,280 ఫ్లియాన్స్ కూడా నీతో వస్తున్నాడా? 665 00:49:53,118 --> 00:49:54,119 అవును, మహారాజా! 666 00:49:54,203 --> 00:49:56,830 నీ గుర్రాలు వేగంగా వెళ్లి వస్తాయని అనుకుంటున్నాను. 667 00:49:57,497 --> 00:49:59,833 కాబట్టి, త్వరగా వెళ్లిరా. 668 00:50:02,544 --> 00:50:03,545 నీకు వీడ్కోలు. 669 00:50:09,426 --> 00:50:11,220 వాళ్ళు నాకోసం ఎదురు చూస్తున్నారా? 670 00:50:12,429 --> 00:50:14,848 అవును, మహారాజా! 671 00:50:21,438 --> 00:50:23,273 మనం ఈ విషయం గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా? 672 00:50:24,024 --> 00:50:25,859 - నిన్నే. - అవును, మహారాజా! 673 00:50:25,943 --> 00:50:28,612 అయితే, నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా? 674 00:50:31,156 --> 00:50:35,369 ఎన్నో ఏళ్ళపాటు మీ జీవితాల్ని నరకప్రాయం చేసిన వాడు బాంకో, 675 00:50:35,869 --> 00:50:38,121 మీకు ఎలాంటి అదృష్టం దక్కకుండా చేశాడు, 676 00:50:38,205 --> 00:50:40,666 కానీ మీరు మాత్రం అదంతా నా తప్పనుకున్నారు, నేను అమాయకుడిని. 677 00:50:40,749 --> 00:50:44,211 గత సమావేశంలో నేను మీకు నిరూపించాను, 678 00:50:44,294 --> 00:50:47,673 మీరు ఎలా మోసం చేయబడ్డారో, ఎలాంటి ఆటంకాలు కలిగించబడ్డాయో, 679 00:50:47,756 --> 00:50:50,050 మీకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, మీకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, 680 00:50:50,133 --> 00:50:54,388 అవన్నీ వింటే తెలివితక్కువ వాడైనా, పిచ్చివాడైనా ఏమంటాడంటే, 681 00:50:54,471 --> 00:50:55,848 "అంతా బాంకోనే చేశాడు." 682 00:50:55,931 --> 00:50:57,599 మీరు అన్ని విషయాలూ వివరించారు. 683 00:50:57,683 --> 00:51:01,895 నేను అన్నీ వివరించాను, ఇప్పుడు మనం రెండోసారి సమావేశం అవడానికి కారణం చెబుతాను. నేను అన్నీ వివరించాను, ఇప్పుడు మనం రెండోసారి సమావేశం అవడానికి కారణం చెబుతాను. 684 00:51:03,522 --> 00:51:07,526 మీపట్ల అతను ప్రవర్తించిన తీరును క్షమించి వదిలేసేంత ఓర్పు మీకు ఉందా? 685 00:51:10,195 --> 00:51:12,197 మీరు, మీ కుటుంబం ఎప్పటికీ దరిద్రం అనుభవించేలా… 686 00:51:12,281 --> 00:51:16,660 మీ జీవితాల్ని దుర్భరం చేసిన వ్యక్తిని శిక్షించడానికి బదులుగా 687 00:51:16,743 --> 00:51:20,539 అతను, అతని పిల్లలు సురక్షితంగా ఉండాలని కోరుకునేంత సహనపరులా? 688 00:51:20,622 --> 00:51:22,749 మేము మగవాళ్ళం, మహారాజా! 689 00:51:22,833 --> 00:51:25,335 అవును, జాతిపరంగా మీరు మగవారే. 690 00:51:25,419 --> 00:51:30,424 కానీ, మగతనపు జాబితాలో మీరు అట్టడుగున లేకపోతే, నాకు చెప్పండి. 691 00:51:30,507 --> 00:51:32,467 ఎందుకంటే అప్పుడు మీరు నాకు దగ్గరయ్యేలా, 692 00:51:32,551 --> 00:51:34,803 మీ శత్రువు అంతమయ్యే ఉపాయం ఒకటి చెబుతాను. 693 00:51:34,887 --> 00:51:37,014 నేను సిద్ధం, మహారాజా! 694 00:51:37,097 --> 00:51:40,559 ఈ ప్రపంచం నా జీవితంతో ఆడుకుంది, నాలో ఎంత కోపం ఉందంటే 695 00:51:40,642 --> 00:51:42,853 ఇకపై ఏమి చేయలన్నా నేను ఆలోచించేది లేదు. 696 00:51:42,936 --> 00:51:44,104 నేను కూడా సిద్ధం! 697 00:51:44,188 --> 00:51:47,149 నా జీవితంలో దురదృష్టం, సమస్యలు నా వెంటే ఉన్నాయి, 698 00:51:47,232 --> 00:51:51,904 నా సమస్యలన్నీ ఒక్కసారిగా పోనైనా పోవాలి, లేదా నా జీవితం ఇంతటితో ముగిసిపోవాలి. 699 00:51:53,780 --> 00:51:56,325 బాంకో మీ శత్రువని మీ ఇద్దరికీ తెలుసు. 700 00:51:59,119 --> 00:52:00,120 అవును, మహారాజా! అవును, మహారాజా! 701 00:52:01,330 --> 00:52:02,789 అతను నాక్కూడా శత్రువే. 702 00:52:03,373 --> 00:52:04,875 అతన్ని నేను ఎంతగా ద్వేషిస్తున్నానంటే, 703 00:52:04,958 --> 00:52:09,338 అతను బతికున్న ప్రతి నిమిషం నా హృదయాన్ని తొలిచేస్తూ ఉంటుంది! 704 00:52:09,838 --> 00:52:13,091 మహారాజుగా నా అధికారాన్ని ఉపయోగించి అతని బెడద వదిలించుకోవడం చాలా సులభం, 705 00:52:13,175 --> 00:52:15,719 కానీ నేను అలా చేయలేను. 706 00:52:15,802 --> 00:52:19,431 కాబట్టే నేను మీ సహాయం కోరుకుంటున్నాను, 707 00:52:19,515 --> 00:52:23,769 ఎన్నో ముఖ్యమైన కారణాల రీత్యా, నా మనసులో భావాల్ని యథాతథంగా ప్రజలకు తెలియనివ్వలేను. 708 00:52:23,852 --> 00:52:26,647 మీరు ఎలా చెబితే అలా చేస్తాం, మహారాజా! 709 00:52:26,730 --> 00:52:27,814 మా జీవితాలు ఎలా ఉన్నప్పటికీ… 710 00:52:27,898 --> 00:52:29,942 మీ కళ్ళలో మీ ధృడ నిశ్చయం తెలుస్తోంది. 711 00:52:30,025 --> 00:52:32,861 ఆ పని ఈరాత్రికే, అది కూడా ఈ కోటకు దూరంగా జరగాలి. 712 00:52:32,945 --> 00:52:35,405 నాపై ఎలాంటి అనుమానం కలగకూడదనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. 713 00:52:35,489 --> 00:52:39,493 మన ప్రణాళిక విజయవంతంగా అమలవ్వాలంటే, బాంకోతో పాటు అతని కొడుకుని కూడా హతమార్చాలి, 714 00:52:40,702 --> 00:52:45,207 బాంకోని చంపడం ఎంత ముఖ్యమో, అతని కొడుకు ఫ్లియాన్స్ ని చంపడం కూడా అంతే ముఖ్యం. 715 00:52:47,626 --> 00:52:49,169 మేము నిర్ణయించుకున్నాం, మహారాజా! 716 00:52:53,215 --> 00:52:54,716 ఇక ఇక్కడినుండి బయలుదేరండి. 717 00:53:12,109 --> 00:53:13,610 బాంకో సభనుండి వెళ్లిపోయాడా? 718 00:53:13,694 --> 00:53:16,321 అవును మహారాణీ, రాత్రికి తిరిగి వచ్చేస్తాడు. 719 00:53:23,078 --> 00:53:24,371 ఏమి జరిగింది, మహారాజా! 720 00:53:26,456 --> 00:53:28,417 ఒక్కడివే కూర్చుని, 721 00:53:28,500 --> 00:53:31,295 విచారకరమైన ఆలోచనలతో కాలక్షేపం చేస్తున్నావెందుకు? 722 00:53:32,129 --> 00:53:35,757 నువ్వు చంపిన వారితోనే ఆ ఆలోచనలు కూడా సమాధి అయ్యుండాల్సింది. 723 00:53:36,258 --> 00:53:38,552 నీ చేయి దాటిన విషయాల గురించి నువ్వు ఆలోచించకూడదు. 724 00:53:38,635 --> 00:53:40,345 జరిగిందేదో జరిగిపోయింది. 725 00:53:41,763 --> 00:53:44,850 మనం పాముని కర్రతో కొట్టాం, కానీ చంపలేదు. 726 00:53:46,268 --> 00:53:47,978 దాని గాయం మాని తిరిగి శక్తి పుంజుకుంటే, 727 00:53:48,061 --> 00:53:52,024 దాని కోరల్ని చూసి మనం తిరిగి భయపడాల్సి ఉంటుంది. 728 00:53:53,567 --> 00:53:56,069 మనం ప్రశాంతంగా బతకడం కోసం వాళ్ళను చంపి శాశ్వతంగా నిద్రపుచ్చాం. 729 00:53:56,153 --> 00:54:00,824 కానీ ఈ అంతులేని మానసిక క్షోభని, నిద్రలేమిని అనుభవించే కంటే, చనిపోవడం ఉత్తమం. కానీ ఈ అంతులేని మానసిక క్షోభని, నిద్రలేమిని అనుభవించే కంటే, చనిపోవడం ఉత్తమం. 730 00:54:02,743 --> 00:54:04,411 డంకన్ తన సమాధిలో ఉన్నాడు. 731 00:54:04,494 --> 00:54:07,164 జీవితపు సమస్యల నుండి బయటపడి, హాయిగా నిద్రపోతున్నాడు. 732 00:54:08,373 --> 00:54:11,376 మనం ఆయనకు ద్రోహం చేసి అన్నిటికన్నా పెద్ద నష్టం చేసేశాం. ఇకపై ఆయుధాలు గానీ, 733 00:54:11,460 --> 00:54:16,840 విషం గానీ, తిరుగుబాటు గానీ, దాడి గానీ… ఏదీ ఆయనపై ప్రభావం చూపించలేదు. 734 00:54:16,924 --> 00:54:22,012 శాంతించండి మహారాజా, నవ్వుతూ ఉండండి. 735 00:54:22,554 --> 00:54:25,599 రాత్రికి అతిథులతో సరదాగా, సంతోషంగా గడపండి. 736 00:54:28,268 --> 00:54:31,104 నా ప్రియా, నా మెదడు నిండా తేళ్ళు పాకుతున్నట్లుగా ఉంది. 737 00:54:32,231 --> 00:54:36,068 బాంకో, అతని కొడుకు ఫ్లియాన్స్ బతికే ఉన్నారని నీకు తెలుసు. 738 00:54:36,151 --> 00:54:39,321 అతన్ని చూసి భయపడే గొప్ప విషయమేదో అతనిలో ఉంది. 739 00:54:39,404 --> 00:54:41,406 అతను ఎలాంటి పనికైనా సాహసిస్తాడు, 740 00:54:43,033 --> 00:54:44,952 అతని మనసు దేనికైనా సిద్ధమే, 741 00:54:45,035 --> 00:54:47,871 అతను ఏ పనినైనా ధైర్యంతో పాటు జాగ్రత్తగా కూడా చేస్తాడు. 742 00:54:47,955 --> 00:54:50,999 అతనికి తప్ప ఈ ప్రపంచంలో నేను ఎవరికీ భయపడను. 743 00:54:51,083 --> 00:54:53,752 ఇక నువ్వు ఆపితే మంచిది. 744 00:54:55,671 --> 00:54:59,216 నన్ను మహారాజని పిలిచినపుడు బాంకో ఆ మంత్రగత్తెలని కోప్పడ్డాడు, 745 00:54:59,299 --> 00:55:01,176 తన భవిష్యత్తు గురించి చెప్పమని అడిగాడు. తన భవిష్యత్తు గురించి చెప్పమని అడిగాడు. 746 00:55:01,760 --> 00:55:07,558 అప్పుడు అతని కొడుకులు మహారాజులవుతారని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాడు. 747 00:55:07,641 --> 00:55:10,269 వాళ్ళు నాకు కిరీటం, రాజదండం ఇచ్చారు, కానీ నేను వాటిని 748 00:55:10,352 --> 00:55:12,104 నా భవిష్యత్ తరాలకి అందించలేనని చెప్పారు, 749 00:55:12,187 --> 00:55:14,690 నా కుటుంబానికి చెందని వాళ్ళు వాటిని ఎగరేసుకుపోతారని చెప్పారు, 750 00:55:14,773 --> 00:55:16,692 ఎందుకంటే నా కొడుకులెవరూ రాజులు కాలేరు. 751 00:55:16,775 --> 00:55:21,363 ఒకవేళ అదే నిజమైతే, నన్ను నేను ఇంత కష్టపెట్టుకుని, 752 00:55:21,864 --> 00:55:23,866 మహారాజు డంకన్ ను హత్య చేసింది బాంకో కొడుకుల కోసమా! 753 00:55:23,949 --> 00:55:27,077 వాళ్ళ ప్రయోజనం కోసం నేను నా మనశ్శాంతిని కోల్పోయాను. 754 00:55:27,160 --> 00:55:30,497 వాళ్ళను మహారాజులను చేయడం కోసం, 755 00:55:30,581 --> 00:55:32,332 నా ఆత్మను దెయ్యాలకు అప్పగించాను. 756 00:55:33,959 --> 00:55:37,254 బాంకో కొడుకులు మహారాజులా! 757 00:55:37,880 --> 00:55:40,299 కానీ వాళ్ళు ఎల్లకాలం బతకరు కదా! 758 00:55:40,382 --> 00:55:41,800 నువ్వు చెప్పింది ఒదార్పునిస్తోంది. 759 00:55:43,218 --> 00:55:46,430 వాళ్ళని చంపే అవకాశం ఉంది. అందుకు సంతోషించాలి. 760 00:55:48,432 --> 00:55:51,685 కోటలోకి గబ్బిలం ఎగురుతూ వచ్చేలోగా, 761 00:55:52,477 --> 00:55:55,063 రాత్రి సమయం అయిందని 762 00:55:55,147 --> 00:55:58,483 పేడ పురుగు మెల్లగా చప్పుడు చేస్తూ మనకి తెలియజేసేలోగా, 763 00:55:58,567 --> 00:56:00,777 ఒక భయంకరమైన పని పూర్తయిపోతుంది. ఒక భయంకరమైన పని పూర్తయిపోతుంది. 764 00:56:02,487 --> 00:56:03,947 ఏమి చేయబోతున్నావు? 765 00:56:04,531 --> 00:56:06,575 అది పూర్తయ్యే వరకూ నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది, 766 00:56:07,701 --> 00:56:09,494 తెలిశాక సంతోషించుదువు గాని! 767 00:56:11,747 --> 00:56:13,290 రాత్రీ, ఇక రా, 768 00:56:14,333 --> 00:56:18,712 దయనీయమైన ఈరోజును కళ్ళగంతలతో మూసేయ్. 769 00:56:19,588 --> 00:56:22,174 నీ రక్తసిక్తమైన, అదృశ్యమైన చేతితో 770 00:56:23,050 --> 00:56:27,304 నన్ను భయపెడుతున్న బాంకో గొంతును నులిమేయి. 771 00:56:28,263 --> 00:56:29,431 చీకటిపడే వేళయింది. 772 00:56:30,390 --> 00:56:32,893 అడవిలో ఉన్న గూటికి కాకి తిరిగి వెళుతోంది. 773 00:56:34,311 --> 00:56:36,605 పగలు సంచరించే జంతువులు నిద్రకు ఉపక్రమిస్తున్నాయి, 774 00:56:36,688 --> 00:56:39,525 నిశాచరులు తమ ఆహారం కోసం బయలుదేరాయి. 775 00:56:40,776 --> 00:56:43,612 నా మాటలు నీకు ఆశ్చర్యం కలిగించాయని తెలుస్తోంది. కానీ నన్నేమీ అడగకు. 776 00:56:47,032 --> 00:56:50,619 ఒక తప్పు మరిన్ని తప్పుల్ని చేయిస్తుందని తెలుసు కదా! 777 00:57:28,073 --> 00:57:29,992 నిన్ను ఇక్కడికి వచ్చి మాతో కలవమని ఎవరు చెప్పారు? 778 00:57:30,951 --> 00:57:32,202 మేక్బెత్. 779 00:57:33,412 --> 00:57:36,123 మనం ఇతన్ని నమ్మొచ్చు, ఎందుకంటే మనకు ఇచ్చిన ఆదేశాలే 780 00:57:36,206 --> 00:57:38,542 మహారాజు ఇతనికి కూడా ఇచ్చారు. 781 00:57:39,168 --> 00:57:40,502 అయితే మాతో కలిసి ఎదురు చూస్తూ ఉండు. 782 00:57:44,298 --> 00:57:47,050 వెలుగు. అదిగో వెలుగు! 783 00:57:51,138 --> 00:57:52,514 ఆ కాగడా ఇటివ్వు, బాబూ. 784 00:58:12,409 --> 00:58:13,785 ఈ రాత్రికి వర్షం కురుస్తుంది. 785 00:58:13,869 --> 00:58:15,495 కురవనివ్వు. 786 00:58:28,133 --> 00:58:29,593 ఫ్లియాన్స్! 787 00:58:42,022 --> 00:58:45,359 పారిపో, ఫ్లియాన్స్, పారిపో! 788 00:58:58,121 --> 00:59:01,083 ఒకరి ప్రాణమే తీయగలిగాం. కొడుకు పారిపోయాడు. ఒకరి ప్రాణమే తీయగలిగాం. కొడుకు పారిపోయాడు. 789 00:59:02,167 --> 00:59:04,545 మన పథకంలో సగం విఫలమయ్యాం. 790 00:59:04,628 --> 00:59:07,464 సరే, ఇక్కడినుండి వెళ్లి, మనం సాధించిన పని గురించి మేక్బెత్ కి చెబుదాం. 791 01:00:34,301 --> 01:00:38,263 నా ఆదేశానికి విరుద్ధంగా మేక్డఫ్ ఇక్కడికి రాకపోవడం గురించి నువ్వేమంటావు? 792 01:00:38,347 --> 01:00:40,474 - అతనికి సందేశం పంపించారా, ప్రభూ? - మహారాజా! 793 01:00:42,476 --> 01:00:44,811 మీమీ స్థానాలేమిటో మీకు తెలుసు. కూర్చోండి. 794 01:00:45,687 --> 01:00:48,774 అత్యుత్తమ తరగతి నుండి ఆఖరి తరగతి వరకూ, ప్రతి ఒక్కరికీ స్వాగతం. 795 01:00:52,653 --> 01:00:54,988 కాసేపట్లో మనం పానీయాలు సేవిద్దాం. 796 01:01:07,167 --> 01:01:09,837 - నీ మొహం మీద రక్తం ఉంది. - అయితే అది బాంకోది. 797 01:01:10,462 --> 01:01:12,673 అతని శరీరంలో కంటే అతని రక్తాన్ని నీ మొహం మీద చూడడమే బాగుంది. 798 01:01:13,423 --> 01:01:14,591 అతని పని ముగిసినట్లేనా? 799 01:01:14,675 --> 01:01:17,803 ప్రభూ, అతని గొంతు కోశాను. ఆ పని నేనే చేశాను. 800 01:01:18,387 --> 01:01:20,722 గొంతు కోయడంలో నిన్ను మించిన వారు లేరు. 801 01:01:21,306 --> 01:01:23,267 ఫ్లియాన్స్ కి కూడా అదే గతి పట్టించిన వారూ గొప్పవారే. 802 01:01:23,350 --> 01:01:25,352 ఒకవేళ ఇద్దరి గొంతులూ ఒకరే కోసి ఉంటే, వారికిక తిరుగులేదు. 803 01:01:26,812 --> 01:01:28,146 మహాప్రభో… 804 01:01:32,192 --> 01:01:33,735 ఫ్లియాన్స్ తప్పించుకున్నాడు. 805 01:01:36,405 --> 01:01:39,116 నాలో భయం తిరిగి జీవం పోసుకుంది. లేదంటే నేను సంతోషంగా ఉండే వాడిని. 806 01:01:40,367 --> 01:01:41,702 బాంకో సంగతి సరిగా పూర్తి చేశారా? 807 01:01:42,286 --> 01:01:44,288 చేశాం, మహారాజా! 808 01:01:44,371 --> 01:01:48,417 అతనొక గుంటలో పడున్నాడు, తలపై ఇరవైకి పైగా లోతైన గాయాలున్నాయి. 809 01:01:48,500 --> 01:01:50,127 అతను చావడానికి వాటిలో ఒక్కటైనా చాలు. 810 01:01:51,295 --> 01:01:53,046 పెద్ద పాము అక్కడ పడి ఉందన్నమాట. 811 01:01:53,130 --> 01:01:55,883 పారిపోయిన పిల్ల పాము త్వరలోనే విషపూరితంగా, ప్రమాదకరంగా మారొచ్చు, 812 01:01:55,966 --> 01:01:57,551 అయితే ప్రస్తుతానికి దానికి కోరలు లేవు. 813 01:01:58,468 --> 01:01:59,720 ఇక్కడి నుండి వెళ్ళిపోండి! 814 01:01:59,803 --> 01:02:02,848 మహారాజా! మీరు అతిథులను పట్టించుకోవడం లేదు. మహారాజా! మీరు అతిథులను పట్టించుకోవడం లేదు. 815 01:02:03,932 --> 01:02:05,392 బాగా గుర్తు చేశావు. 816 01:02:06,268 --> 01:02:09,271 మంచి జీర్ణక్రియకు ఆకలి బాగా వేయాలి, మంచి ఆరోగ్యానికి ఆ రెండూ కావాలి, కాబట్టి… 817 01:02:09,354 --> 01:02:10,397 ఆ రెండింటి కోసం తాగండి. 818 01:02:11,148 --> 01:02:12,399 మహారాజా! దయచేసి కూర్చోండి. 819 01:02:12,482 --> 01:02:15,277 మన బాంకో కూడా వచ్చి ఉండుంటే, స్కాట్లాండ్ లోని 820 01:02:15,360 --> 01:02:17,362 ఉత్తములందరూ ఒకే చోటికి చేరినట్లు అయి ఉండేది, 821 01:02:17,446 --> 01:02:20,782 ఆలస్యానికి కారణం అతనికేదైనా ప్రమాదం జరగడం కాకుండా, అతని తలపొగరు అయి ఉంటే బాగుండు. 822 01:02:20,866 --> 01:02:23,535 అతను రాలేదంటే, తను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే. 823 01:02:23,619 --> 01:02:26,788 మీకు ఇష్టమైతే మాతో కలిసి కూర్చుని మమ్మల్ని అనుగ్రహించవచ్చు కదా. 824 01:02:28,749 --> 01:02:30,542 మీకోసం ఈ చోటు సిద్ధంగా ఉంది. 825 01:02:39,968 --> 01:02:42,179 ఏమి జరిగింది, మహారాజా? 826 01:02:44,473 --> 01:02:46,058 మీలో ఎవరు ఇలా చేసింది? 827 01:02:47,309 --> 01:02:48,810 ఏమన్నారు, మహారాజా? 828 01:02:48,894 --> 01:02:50,395 నేనే చేశానని మీరు చెప్పలేరు. 829 01:02:54,858 --> 01:02:57,778 నా వంక చూస్తూ ఎప్పుడూ తల ఆడించకు! 830 01:02:57,861 --> 01:03:01,240 పెద్ద మనుషులారా, నిలబడండి! మహారాజు గారికి ఒంట్లో బాగోలేదు. పెద్ద మనుషులారా, నిలబడండి! మహారాజు గారికి ఒంట్లో బాగోలేదు. 831 01:03:01,323 --> 01:03:02,491 కూర్చోండి, మిత్రులారా! 832 01:03:02,574 --> 01:03:04,910 ప్రభువు అప్పుడప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు, తన చిన్నప్పటి నుండీ ఇంతే. 833 01:03:04,993 --> 01:03:05,994 కూర్చోమని అర్థిస్తున్నాను. 834 01:03:06,078 --> 01:03:09,831 ఇది తాత్కాలికమే. కాసేపటిలో ఆయన మామూలు అయిపోతారు. 835 01:03:10,999 --> 01:03:12,000 నువ్వసలు మగవాడివేనా? 836 01:03:12,084 --> 01:03:14,628 అవును! చాలా ధైర్యం కల వాడిని, 837 01:03:14,711 --> 01:03:17,130 దెయ్యాన్ని భయపెట్టే విషయాన్ని కూడా ఎదుర్కోగల ధైర్యం ఉంది. 838 01:03:17,214 --> 01:03:19,091 ఇది నీలోని భయం కలిగిస్తున్న భ్రమ. 839 01:03:19,174 --> 01:03:21,718 డంకన్ దగ్గరికి నిన్ను నడిపించిన కత్తిలాగే, ఇది కూడా! 840 01:03:21,802 --> 01:03:25,514 నేను నిలబడిన చోటు నుండి అతన్ని చూడగలుగుతున్నాను. 841 01:03:25,597 --> 01:03:26,932 చాల్లే ఆపండి! 842 01:03:27,516 --> 01:03:30,060 ఇదివరకు నువ్వు ఎవరి తలైనా బద్దలు కొట్టి ఉంటే, 843 01:03:30,143 --> 01:03:32,020 అతను చనిపోయేవాడు, కథ అక్కడితో ముగిసిపోయేది! 844 01:03:32,104 --> 01:03:35,691 కానీ ఇప్పుడు తలనిండా ఇరవై లోతైన గాయాలతో వాళ్ళు లేచి కూర్చుని 845 01:03:35,774 --> 01:03:37,651 మనల్ని సింహాసనం నుండి లాగి పడేస్తున్నారు! 846 01:03:37,734 --> 01:03:40,320 ఇది హత్యకంటే ఎంతో వింతగా ఉందే! 847 01:03:43,031 --> 01:03:45,492 పో! నా కళ్ళముందు నుండి వెళ్ళిపో! 848 01:03:45,576 --> 01:03:47,202 నీ వెన్నెముకలో మూలగ లేదు! 849 01:03:47,286 --> 01:03:49,079 నీ రక్తం చల్లగా ఉంది! 850 01:03:49,162 --> 01:03:51,582 నీ కళ్ళలో ఎటువంటి కాంతి లేదు. 851 01:03:57,337 --> 01:03:59,631 ఇక్కడినుండి పో, దెయ్యమా! 852 01:03:59,715 --> 01:04:01,800 నా ఊహాల్లో జనించిన భూతమా, పో ఇక్కడినుండి! నా ఊహాల్లో జనించిన భూతమా, పో ఇక్కడినుండి! 853 01:04:20,861 --> 01:04:22,154 చూడండి, అది… 854 01:04:23,405 --> 01:04:24,531 …వెళ్ళిపోయింది. 855 01:04:26,742 --> 01:04:28,035 నేను తిరిగి మామూలు వాడినయ్యాను. 856 01:04:29,161 --> 01:04:31,163 నన్ను చూసి నవ్వకండి, నా మిత్రులారా! 857 01:04:31,246 --> 01:04:35,584 నాకో వింత జబ్బుంది, నా సన్నిహితులకు అదేమీ కొత్త కాదు. 858 01:04:36,084 --> 01:04:37,711 నువ్వు అందరి సంతోషాన్నీ పాడు చేశావు, 859 01:04:37,794 --> 01:04:40,422 నిన్ను నువ్వొక తమాషా చేసుకుని ఈ సాయంత్రాన్ని నాశనం చేశావు. 860 01:04:41,590 --> 01:04:45,219 అందర్నీ ఆశ్చర్యంతో బిగుసుకుపోయేలా చేసే ఇలాంటి విషయాలు, 861 01:04:45,302 --> 01:04:46,720 ఉన్నట్లుండి జరగకుండా ఉంటాయా? 862 01:04:46,803 --> 01:04:50,807 నా గురించి నాకే తెలియదన్నట్లు నేను భావించేలా చేస్తున్నావు, 863 01:04:50,891 --> 01:04:52,851 ఇలాంటి దారుణమైన దృశ్యాలు చూసి కూడా, 864 01:04:52,935 --> 01:04:56,813 నా మొహం పాలిపోతూ ఉంటే, నువ్వు రాయిలా ఉండగలుగుతున్నావు. 865 01:04:56,897 --> 01:04:59,733 - ఎలాంటి దృశ్యాలు, మహారాజా? - దయచేసి మీరు మాట్లాడకండి! 866 01:05:00,484 --> 01:05:02,694 అతన్ని ప్రశ్నిస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది. 867 01:05:02,778 --> 01:05:04,238 దయచేసి అందరూ ఇక్కడినుండి వెళ్ళిపోండి! 868 01:05:04,321 --> 01:05:06,782 వరుస క్రమంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడినుండి వెళ్ళండి చాలు. 869 01:05:06,865 --> 01:05:09,326 ఇక సెలవు! మహారాజు గారు త్వరగా కోలుకోవాలి… 870 01:05:09,409 --> 01:05:11,370 అందరికీ శుభరాత్రి! 871 01:05:17,167 --> 01:05:18,544 ఖచ్చితంగా రక్తం ఉంటుంది. 872 01:05:19,962 --> 01:05:20,963 రక్తానికి రక్తమే బదులు… 873 01:05:23,340 --> 01:05:24,842 అని అంటారు కదా! 874 01:05:27,678 --> 01:05:30,639 సమాధి రాళ్లు కదిలాయంటారు, చెట్లు మాట్లాడాయంటారు. 875 01:05:32,599 --> 01:05:35,727 ఎంతో చాకచక్యంగా చేసిన హత్యలు కూడా 876 01:05:35,811 --> 01:05:39,189 కాకులు, ఇతర పక్షులు ఇచ్చే అంతుచిక్కని సంకేతాల కారణంగా బయటపడ్డాయి. 877 01:05:42,192 --> 01:05:43,443 రాత్రి ఎంత గడిచింది? 878 01:05:44,653 --> 01:05:47,281 దాదాపు తెల్లవార వస్తోంది, ఇది పగలో రాత్రో చెప్పడం కష్టం. 879 01:05:48,824 --> 01:05:53,120 నా ఆదేశాన్ని ధిక్కరించి, మేక్డఫ్ ఇక్కడికి రాకపోవడం గురించి నువ్వేమంటావు? 880 01:05:54,663 --> 01:05:56,790 అతని దగ్గరికి ఎవరినైనా పంపించారా, ప్రభూ? 881 01:05:58,292 --> 01:06:00,711 ఎవరో చెప్పగా విన్నాను. కానీ మనిషిని పంపిస్తాను. ఎవరో చెప్పగా విన్నాను. కానీ మనిషిని పంపిస్తాను. 882 01:06:00,794 --> 01:06:04,173 ప్రతి ఇంట్లో నాకోసం నిఘా పనిచేసే సేవకుడు ఒకడున్నాడు. 883 01:06:06,466 --> 01:06:09,845 రేపు తెల్లవారగానే నేను వింత సోదరీమణులను కలుస్తాను. వాళ్ళను ఎన్నో అడగాలి. 884 01:06:11,180 --> 01:06:14,474 నేను ఈ రక్తపు నదిలో ఎంతదూరం వచ్చానంటే, 885 01:06:14,558 --> 01:06:18,896 హత్యలు కొనసాగించడం కంటే, ఇప్పుడు తిరిగి వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. 886 01:06:21,732 --> 01:06:24,568 నేను అమలు చేయాలనుకుంటున్న కొన్ని ప్రణాళికలు నా మెదడులో ఉన్నాయి. 887 01:06:24,651 --> 01:06:26,028 వాటి గురించి ఆలోచించే అవకాశం రాకముందే… 888 01:06:27,696 --> 01:06:28,989 వాటిని పూర్తి చేసేయాలి. 889 01:06:31,658 --> 01:06:35,537 నువ్వు నిద్రపోయి ఎంతో కాలమైంది. 890 01:06:36,747 --> 01:06:38,415 అవును, నిద్రపోవాలి. 891 01:06:41,168 --> 01:06:47,591 నా అసమర్థత వల్లే ఇలాంటి వింత భ్రమలు కలుగుతున్నాయి. 892 01:06:50,010 --> 01:06:51,845 దుర్మార్గాలు చేసే విషయానికొస్తే మనమింకా విద్యార్థులమే. 893 01:07:05,234 --> 01:07:06,485 సమయం అయింది. 894 01:07:07,444 --> 01:07:08,779 సమయం అయింది. 895 01:07:09,821 --> 01:07:13,158 తర్వాతి రోజు 896 01:07:38,934 --> 01:07:41,228 నా బొటన వేళ్ళలో చక్కిలిగింత వల్ల, 897 01:07:42,187 --> 01:07:45,065 ఏదో వింతైనది జరగబోతోందని తెలుస్తోంది. 898 01:07:47,901 --> 01:07:51,655 ఏమి జరుగుతోందిక్కడ, కన్నుగప్పి వచ్చిన మంత్రగత్తెలారా. 899 01:07:52,656 --> 01:07:54,032 ఏమి చేస్తున్నారు? 900 01:07:54,533 --> 01:07:57,369 దీనికి ఏ పేరూ లేదు. 901 01:07:58,120 --> 01:07:59,413 మీరు చెప్పే విషయాలు మీకెలా తెలుసో నాకు తెలీదు, 902 01:08:00,289 --> 01:08:03,250 కానీ నేను అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని నేను పట్టుబడుతున్నాను. 903 01:08:03,333 --> 01:08:07,337 ఎంతటి విధ్వంసం జరిగినా సరే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. 904 01:08:07,421 --> 01:08:08,422 ఏమిటో చెప్పు. 905 01:08:08,505 --> 01:08:10,716 - అడుగు. - మేము సమాధానం ఇస్తాం. 906 01:08:10,799 --> 01:08:15,345 నువ్వు మా నోటి ద్వారా వినాలనుకుంటున్నావా లేక మా గురువుల నోటి ద్వారా వినాలనుకుంటున్నావా? 907 01:08:15,429 --> 01:08:18,807 పిలవండి. వాళ్ళను చూడనివ్వండి. 908 01:08:26,356 --> 01:08:29,109 కాచుకో, రెట్టింపు అందుకో. 909 01:08:29,609 --> 01:08:32,613 చేసిన పాపం ఊరికే పోదు. 910 01:08:32,696 --> 01:08:36,533 కాచుకో, రెట్టింపు అందుకో. చేసిన పాపం ఊరికే పోదు. 911 01:08:36,617 --> 01:08:39,828 కాచుకో, రెట్టింపు అందుకో. చేసిన పాపం ఊరికే పోదు… 912 01:08:46,835 --> 01:08:49,587 గుంటలో ప్రసవిస్తున్న ఒక వేశ్య గర్భంలోంచి 913 01:08:50,255 --> 01:08:53,550 బయటికి రాలేక ఇరుక్కుపోయిన ఒక బిడ్డ వేలు. 914 01:08:56,178 --> 01:08:58,764 దైవ దూషణకు పాల్పడ్డ ఒక యూదుడి కాలేయం, 915 01:08:59,848 --> 01:09:02,725 మేక పిత్తం, యూ చెట్టు కొమ్మలు. మేక పిత్తం, యూ చెట్టు కొమ్మలు. 916 01:09:03,227 --> 01:09:09,024 చంద్ర గ్రహణం సమయంలో విరిగాయి, ఒక టర్కు ముక్కు, ఒక టార్టర్ పెదవులు. 917 01:09:09,608 --> 01:09:11,693 ఇదిగో గబ్బిలం రక్తం. 918 01:09:11,777 --> 01:09:14,029 - అందులో పడేయి. - పడేయి. 919 01:09:14,112 --> 01:09:16,448 కాగు చుట్టూ నాట్యం చేద్దాం. 920 01:09:16,532 --> 01:09:19,201 విషపూరిత పేగుల్ని అందులో పడేద్దాం. 921 01:09:19,283 --> 01:09:21,495 నరకంలో నురగలు కక్కుతూ, 922 01:09:22,371 --> 01:09:26,792 మరిగే చారు లాగా, శక్తివంతమైన విధ్వంసాన్ని సృష్టించాలి. 923 01:09:29,837 --> 01:09:32,214 ఓ అదృశ్య శక్తీ, చెప్పు… 924 01:09:32,296 --> 01:09:36,635 నీ ఆలోచనలు అతనికి తెలుసు. చెప్పేది విను, తిరిగి మాట్లాడకు. 925 01:09:36,718 --> 01:09:40,138 మేక్బెత్. మేక్బెత్. మేక్బెత్. 926 01:09:41,014 --> 01:09:42,975 మేక్డఫ్ తో జాగ్రత్త. 927 01:09:43,684 --> 01:09:45,894 ఫైఫ్ థేన్ తో జాగ్రత్త. 928 01:09:45,978 --> 01:09:48,397 మీరెవరైనా, మీ సలహాకు ధన్యవాదాలు. 929 01:09:48,479 --> 01:09:50,858 నా భయాన్ని చక్కగా పసిగట్టారు. కానీ ఒక్క విషయం… 930 01:09:50,941 --> 01:09:52,818 నువ్వు ఆయన్ని ఆదేశించకూడదు. 931 01:09:53,569 --> 01:09:56,989 మొదటి దానికంటే ముఖ్యమైన విషయం విను. 932 01:09:57,072 --> 01:10:00,325 మేక్బెత్. మేక్బెత్. మేక్బెత్. మేక్బెత్. మేక్బెత్. మేక్బెత్. 933 01:10:00,409 --> 01:10:02,202 నాకు మూడు చెవులు ఉండుంటే, మూడింటితోనూ వినే వాడిని. 934 01:10:02,286 --> 01:10:05,247 హింసాత్మకంగా, ధైర్యంగా, దృఢంగా ఉండు. 935 01:10:05,330 --> 01:10:07,875 ఇతరుల శక్తి సామర్థ్యాలని చూసి నవ్వుకో, 936 01:10:07,958 --> 01:10:11,962 ఎందుకంటే ఆడదానికి పుట్టిన వాడెవడూ మేక్బెత్ కి కీడు చేయలేడు. 937 01:10:12,713 --> 01:10:16,133 అయితే మేక్డఫ్ ని చంపాల్సిన పనిలేదు. అతనికి భయపడాల్సినది ఏముంది? 938 01:10:16,967 --> 01:10:20,804 అయినప్పటికీ నాకు రెట్టింపు నిర్థారణ కావాలి, అతన్ని చంపడం ద్వారా 939 01:10:20,888 --> 01:10:22,306 నా అదృష్టానికి నేనే హామీ ఇచ్చుకుంటాను. 940 01:10:22,389 --> 01:10:25,309 తద్వారా నేను నా భయాల్ని అదుపులో పెట్టుకోగలను, 941 01:10:25,392 --> 01:10:27,019 రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలను. 942 01:10:28,604 --> 01:10:32,608 కానీ ఏమిటిది, చూడడానికి అచ్చం యువరాజులా ఉండి, 943 01:10:32,691 --> 01:10:35,903 తలపై కిరీటం ధరించిన ఈ ఆత్మ ఎవరిది? 944 01:10:35,986 --> 01:10:38,530 మాట్లాడేది విను, తిరిగి మాట్లాడకు. 945 01:10:38,614 --> 01:10:42,451 మేక్బెత్, డన్సినేన్ కొండపైకి 946 01:10:42,534 --> 01:10:48,999 బిర్నాం అడవి నడుచుకుంటూ వస్తే తప్ప, నిన్ను ఎవరూ ఓడించలేరు. 947 01:10:49,082 --> 01:10:50,501 అది అసాధ్యం! 948 01:10:51,251 --> 01:10:55,422 అడవిని, అందులోని చెట్లు తమ వేళ్ళను భూమిలోంచి పెకిలించుకుని రమ్మని ఎవరు ఆదేశించగలరు? 949 01:10:55,506 --> 01:10:58,634 కానీ నా మనసు మరో విషయం గురించి తెలుసుకోవాలని కోరుకుంటోంది. 950 01:10:58,717 --> 01:11:01,053 మీ శక్తులు దాన్ని చూడగలిగితే చెప్పండి. మీ శక్తులు దాన్ని చూడగలిగితే చెప్పండి. 951 01:11:02,221 --> 01:11:05,557 బాంకో కొడుకులు ఈ రాజ్యాన్ని ఎప్పటికైనా పరిపాలిస్తారా? 952 01:11:07,684 --> 01:11:09,269 తెలుసుకుంది చాలు! 953 01:11:10,771 --> 01:11:14,066 ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నించకు. 954 01:11:41,218 --> 01:11:42,719 వింత సోదరీమణులను చూశారా? 955 01:11:42,803 --> 01:11:45,138 - లేదు, ప్రభూ! - వాళ్ళు మీకు ఎదురవలేదా? 956 01:11:46,265 --> 01:11:47,266 లేదు, ప్రభూ! 957 01:11:47,349 --> 01:11:50,477 వాళ్ళు ప్రయాణించిన గాలి కలుషితం అవుతుంది. 958 01:11:50,561 --> 01:11:53,105 వాళ్ళను నమ్మేవాళ్ళు అంతం అవ్వాల్సిందే. 959 01:11:54,064 --> 01:11:56,483 నాకు గుర్రం డెక్కల చప్పుడు వినిపించింది. వచ్చినదెవరు? 960 01:11:57,317 --> 01:11:59,486 ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సందేశం తీసుకొచ్చారు ప్రభూ. 961 01:11:59,987 --> 01:12:01,488 మేక్డఫ్ ఇంగ్లాండ్ పారిపోయాడట. మేక్డఫ్ ఇంగ్లాండ్ పారిపోయాడట. 962 01:12:02,573 --> 01:12:04,867 - ఇంగ్లాండ్ పారిపోయాడా? - అవును, మహారాజా! 963 01:12:06,827 --> 01:12:10,330 కాలమా! నువ్వు నా పథకాలను పాడు చేశావు. 964 01:12:10,414 --> 01:12:11,999 ఈ క్షణం నుండీ, 965 01:12:12,082 --> 01:12:15,419 నేను తీసుకునే నిర్ణయాలను వెంటనే అమలు చేస్తాను. 966 01:12:15,502 --> 01:12:21,008 చెప్పాలంటే, ఇప్పుడే నా ఆలోచనలని నా చర్యలతో అనుసరించి పూర్తి చేస్తాను. 967 01:12:21,091 --> 01:12:24,219 మేక్డఫ్ కోటపై దాడి చేస్తాను. ఫైఫ్ నగరాన్ని దిగ్భంధిస్తాను. 968 01:12:24,303 --> 01:12:26,930 అతని భార్యని, పిల్లలని కత్తికి బలిస్తాను, 969 01:12:27,014 --> 01:12:30,726 అతని వారసత్వాన్ని కొనసాగించడానికి వరుసలో ఉన్న దురదృష్టవంతులందరి కథా ముగిస్తాను. 970 01:12:30,809 --> 01:12:32,394 పిచ్చి వాగుడు కట్టిపెట్టాలి. 971 01:12:32,477 --> 01:12:35,022 ఆవేశం చల్లారేలోగా, పనులన్నీ ముగిస్తాను! 972 01:12:35,105 --> 01:12:37,232 ఇకపై పిచ్చి భ్రమలు రావు! 973 01:13:03,717 --> 01:13:06,595 నేను చెప్పేదేమంటే, ఇక్కడ వింత విషయాలు జరుగుతున్నాయి. 974 01:13:08,472 --> 01:13:11,225 డంకన్ చనిపోయిన అనంతరం 975 01:13:12,059 --> 01:13:13,519 మేక్బెత్ అతనిపై జాలి పడ్డాడు. 976 01:13:14,019 --> 01:13:16,355 బాంకో రాత్రి సమయంలో ప్రయాణం చేయకుండా ఉండాల్సింది. 977 01:13:16,438 --> 01:13:21,818 కావాలంటే, ఫ్లియాన్స్ పారిపోయాడు కాబట్టి, ఆ హత్య అతనే చేసాడని చెప్పొచ్చు. 978 01:13:21,902 --> 01:13:27,574 అలాంటి సమయాల్లో మగవాళ్ళు ప్రయాణాలు చేయకూడదు. మేక్డఫ్ కి పరిస్థితులు అనుకూలంగా లేవని విన్నాను. 979 01:13:27,658 --> 01:13:29,576 అతను ఎక్కడ దాక్కున్నాడో మీకేమైనా తెలుసా, ప్రభూ? 980 01:13:29,660 --> 01:13:31,787 సింహాసనానికి అసలైన వారసుడు డంకన్ కొడుకు మాల్కం… 981 01:13:32,538 --> 01:13:34,957 కానీ అతని జన్మహక్కుని ఈ క్రూరుడు దొంగిలించాడు, 982 01:13:35,582 --> 01:13:37,543 అతను ఇంగ్లాండ్ రాజ్యంలో ఉంటున్నాడు. 983 01:13:37,626 --> 01:13:40,170 మేక్డఫ్ ఎడ్వర్డ్ మహారాజుని సాయం అడగడానికి వెళ్ళాడు. 984 01:13:40,671 --> 01:13:45,592 మేక్బెత్ ఈ వార్త విని, కోపం కట్టలు తెంచుకుని, యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. 985 01:13:46,426 --> 01:13:49,346 ఎవరైనా పవిత్ర దేవత ఇంగ్లాండ్ రాజ్యానికి వెళ్లి 986 01:13:49,429 --> 01:13:52,015 అతనికి ఈ సందేశం అందజేయాలి. 987 01:13:53,016 --> 01:13:56,645 మన దేశాన్ని ఒక నిరంకుశుడి పాలన నుండి విడిపించడానికి… 988 01:13:58,272 --> 01:14:01,316 ఎవరో ఒకరు రావాలి. ఎవరో ఒకరు రావాలి. 989 01:14:11,326 --> 01:14:13,787 రాజ్యం వదిలి వెళ్ళాల్సినంతగా అతను ఏమి చేశాడు? 990 01:14:13,871 --> 01:14:16,623 - మీరు ఓపిక పట్టాలి, తల్లీ. - అతనికి ఏమాత్రం ఓపిక లేదు. 991 01:14:16,707 --> 01:14:18,709 అతను పారిపోయి పిచ్చిపని చేశాడు. 992 01:14:18,792 --> 01:14:22,421 నువ్వు నిజంగా తప్పు చేయకపోయినా, పారిపోతే అందరి దృష్టిలో ద్రోహివే అవుతావు. 993 01:14:22,504 --> 01:14:26,216 అతను పారిపోయేలా చేసింది వివేకమో, లేక భయమో నాకు తెలియడం లేదు. 994 01:14:26,300 --> 01:14:27,342 వివేకమా! 995 01:14:27,926 --> 01:14:32,931 తన భార్యని, పిల్లల్ని, కోటని, అతని బిరుదుల్ని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో వదిలేసి, 996 01:14:33,015 --> 01:14:35,976 ఆ ప్రమాదం నుండి తప్పించుకు వెళ్ళడం వివేకమా? 997 01:14:36,852 --> 01:14:38,103 అతనికి మా మీద ప్రేమ లేదు. 998 01:14:39,146 --> 01:14:41,523 తన కుటుంబాన్ని రక్షించుకోవాలనే సహజ స్వభావం అతనికి లేదు. 999 01:14:42,107 --> 01:14:45,527 పక్షుల్లో అతిచిన్న రెన్ పక్షి కూడా, గూటిలో ఉన్న తన బిడ్డలకు 1000 01:14:45,611 --> 01:14:49,323 ప్రమాదం ఉందంటే, గుడ్లగూబతో కూడా తలపడుతుంది కదా. 1001 01:14:49,406 --> 01:14:52,993 నా ప్రియమైన బంధువా! నిన్ను శాంతించమని ప్రార్థిస్తున్నాను. 1002 01:14:53,076 --> 01:14:57,789 నీ భర్త మంచివాడు, తెలివైనవాడు, వివేకవంతుడు, 1003 01:14:57,873 --> 01:15:02,878 ఎప్పుడేం చేయాలో అతనికి బాగా తెలుసు. ఎప్పుడేం చేయాలో అతనికి బాగా తెలుసు. 1004 01:15:04,046 --> 01:15:06,298 ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు మంచిది కాదు. 1005 01:15:07,216 --> 01:15:09,218 పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, 1006 01:15:09,301 --> 01:15:12,471 కారణం కూడా చెప్పకుండా మనపై ద్రోహులుగా ముద్ర వేసే స్థితి, 1007 01:15:12,554 --> 01:15:17,434 ఇలాంటి పరిస్థితుల్లో మనం పుకార్లని నమ్మేస్తాం, దేనికి భయపడుతున్నామో కూడా తెలుసుకోలేం, 1008 01:15:18,352 --> 01:15:24,816 సముద్రం మధ్యలో తుఫానులో చిక్కుకుపోయి, ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. 1009 01:15:24,900 --> 01:15:26,068 నా అందమైన సోదరా! 1010 01:15:29,321 --> 01:15:32,950 వీడికి తండ్రి ఉండి కూడా, లేనట్లే లెక్క. 1011 01:15:35,452 --> 01:15:39,164 సిర్రా, మీ నాన్న చనిపోయాడు. 1012 01:15:39,998 --> 01:15:42,459 ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావు? ఎలా బతుకుతావు? 1013 01:15:42,543 --> 01:15:45,003 నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్న చనిపోలేదు. 1014 01:15:45,087 --> 01:15:46,463 అవును, అతను చనిపోయాడు. 1015 01:15:46,547 --> 01:15:48,549 తండ్రి కోసం నువ్వు ఏమి చేస్తావు? 1016 01:15:48,632 --> 01:15:51,385 అది కాదు, భర్త కోసం ఏమి చేస్తావు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. 1017 01:15:52,010 --> 01:15:54,638 నేను బజారులో 20 మంది భర్తల్ని కొనగలను. 1018 01:15:54,721 --> 01:15:57,975 అయితే వాళ్ళని తిరిగి అమ్మడానికే కొంటావన్నమాట. 1019 01:15:58,058 --> 01:16:02,771 చిన్న పిల్లాడిలా మాట్లాడతావు, కానీ నీకు చాలా తెలివి ఉందిరా. చిన్న పిల్లాడిలా మాట్లాడతావు, కానీ నీకు చాలా తెలివి ఉందిరా. 1020 01:16:03,897 --> 01:16:05,774 అమ్మా, నాన్న ద్రోహం చేశాడా? 1021 01:16:07,067 --> 01:16:08,485 అవును, చేశాడు. 1022 01:16:08,986 --> 01:16:10,320 ద్రోహి అంటే ఎవరు? 1023 01:16:12,114 --> 01:16:16,118 మాటిచ్చి, దాన్ని తప్పేవాడే ద్రోహి. 1024 01:16:16,618 --> 01:16:19,121 మాటిచ్చి తప్పే ప్రతి ఒక్కరూ ద్రోహేనా? 1025 01:16:19,621 --> 01:16:23,250 అలా చేసిన ప్రతి ఒక్కరూ ద్రోహే, అలాంటి వారిని ఉరి తీయాలి. 1026 01:16:23,959 --> 01:16:25,127 వాళ్ళని ఎవరు ఉరి తీయాలి? 1027 01:16:25,878 --> 01:16:27,713 ఎవరంటే, నిజాయితీపరులు. 1028 01:16:28,213 --> 01:16:32,176 అయితే అబద్ధాలు చెప్పేవారు, మాట నిలుపుకోని వాళ్ళందరూ తెలివి తక్కువవాళ్ళు, 1029 01:16:32,759 --> 01:16:37,097 ఎందుకంటే ప్రపంచంలో మంచివారికంటే చెడ్డవారే ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి మంచివారిని తన్ని, ఉరి తీసేయొచ్చు. 1030 01:16:38,765 --> 01:16:40,559 - దొరసానీ! - ఎలా మాట్లాడుతున్నావో చూడు. 1031 01:16:40,642 --> 01:16:41,727 మీకు మంచి జరగాలి, దొరసానీ! 1032 01:16:41,810 --> 01:16:46,398 నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు ముఖ్యమైన వ్యక్తని నాకు తెలుసు. 1033 01:16:46,481 --> 01:16:49,359 మీకు త్వరలో ప్రమాదం పొంచి ఉందని నా అనుమానం. 1034 01:16:49,443 --> 01:16:52,154 పనివారి సలహా తీసుకోవడం నామోషీ అనుకోకపోతే, 1035 01:16:52,237 --> 01:16:53,864 మీరు వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపోవడం మంచిది. 1036 01:16:53,947 --> 01:16:55,324 మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి. 1037 01:16:55,407 --> 01:16:57,743 నేను ఎక్కడికి పోవాలి? నేను ఎలాంటి తప్పూ చేయలేదే! 1038 01:17:00,078 --> 01:17:01,163 కానీ నేను ఉన్నది… 1039 01:17:03,081 --> 01:17:07,127 భూమి మీద అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చెడ్డవారిని పొగుడుతారు, 1040 01:17:07,211 --> 01:17:10,172 మంచి వారిని పనికిమాలిన వాళ్ళుగా, ఘోరం చేసినట్లుగా భావిస్తారు. 1041 01:17:11,048 --> 01:17:13,634 అలాంటప్పుడు నేను అబలనని, 1042 01:17:13,717 --> 01:17:15,886 అమాయకురాలినని ఎందుకు చెప్పుకోవాలి? 1043 01:17:30,901 --> 01:17:32,027 నీ భర్త ఎక్కడ? 1044 01:17:32,110 --> 01:17:36,532 నీలాంటి పనికిమాలిన వాళ్ళు కనిపెట్టగలిగే చోట ఉండడని అనుకుంటున్నాను. 1045 01:17:36,615 --> 01:17:38,200 - వాడొక ద్రోహి. - అబద్ధం చెబుతున్నావ్! 1046 01:17:38,283 --> 01:17:40,118 - లేదు! - ఏమిట్రా, వెధవా! 1047 01:17:40,202 --> 01:17:43,455 వద్దు, వద్దు, వద్దు! వద్దు! 1048 01:17:43,539 --> 01:17:47,000 వద్దు! వద్దు! వద్దు! 1049 01:17:55,092 --> 01:17:57,594 ఎవరికీ కనపడని చోటేదైనా వెతుక్కుని, 1050 01:17:58,095 --> 01:18:00,472 మన గుండెల్లో భారం దించుకుందాం. మన గుండెల్లో భారం దించుకుందాం. 1051 01:18:00,556 --> 01:18:03,141 ఏడవడానికి బదులు, కత్తులు చేత పుచ్చుకుని 1052 01:18:03,225 --> 01:18:06,812 మన సొంత ఇంటిని మగాళ్ళలా తిరిగి చేజిక్కించుకోవాలి. 1053 01:18:07,312 --> 01:18:09,314 ప్రతిరోజూ కొత్త విధవలు గగ్గోలు పెడుతున్నారు, 1054 01:18:09,398 --> 01:18:13,026 కొత్త అనాథలు ఏడుస్తున్నారు, కొత్త బాధలు స్వర్గాన్ని చాచి లెంపకాయ కొడుతున్నాయి, 1055 01:18:13,110 --> 01:18:15,237 స్వర్గమే స్కాట్లాండ్ అనుభవిస్తున్న వేదనని 1056 01:18:15,320 --> 01:18:17,406 స్వయంగా అనుభవించి, బాధతో కేకలు వేస్తోంది. 1057 01:18:17,906 --> 01:18:20,450 నువ్వు చెప్పింది బహుశా నిజమే కావొచ్చు. 1058 01:18:20,534 --> 01:18:23,745 ఎవడి పేరు పలకడానికి కూడా మన నాలుకలు నొప్పితో విలవిలలాడుతున్నాయో, 1059 01:18:23,829 --> 01:18:25,581 ఆ క్రూరుడు నిజాయితీ కలవాడని ఒకప్పుడు భావించేవాళ్ళం. 1060 01:18:26,832 --> 01:18:28,625 ఎవరొస్తున్నారో చూడు? 1061 01:18:29,751 --> 01:18:31,128 నా ప్రియమైన గొప్ప బంధువు. 1062 01:18:31,211 --> 01:18:32,337 నీకు స్వాగతం. 1063 01:18:32,421 --> 01:18:33,589 ఇప్పుడే నేను పోల్చుకున్నాను. 1064 01:18:33,672 --> 01:18:36,800 మనల్ని దూరంగా ఉంచుతున్న పరిణామాల్ని దేవుడు మార్చితే బాగుండు. 1065 01:18:36,884 --> 01:18:38,635 ప్రభూ, వందనం. 1066 01:18:39,469 --> 01:18:40,888 స్కాట్లాండ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 1067 01:18:41,471 --> 01:18:42,973 అయ్యో! పాపం మన దేశం. 1068 01:18:43,932 --> 01:18:45,559 దాన్ని చూడాలంటేనే భయం వేస్తోంది. 1069 01:18:45,642 --> 01:18:48,228 ఇకపై స్కాట్లాండ్ ను మన జన్మభూమి అని కాకుండా, 1070 01:18:48,312 --> 01:18:54,818 మన సమాధుల నేల అనాలేమో, పిచ్చివాడు తప్ప, వేరెవరూ చిరునవ్వు కూడా చిందించట్లేదు. 1071 01:18:56,195 --> 01:19:01,825 నిట్టూర్పులు, మూలుగులు, కేకలు గాల్లో కలిసిపోతున్నా, ఎవరూ పట్టించుకోవట్లేదు. నిట్టూర్పులు, మూలుగులు, కేకలు గాల్లో కలిసిపోతున్నా, ఎవరూ పట్టించుకోవట్లేదు. 1072 01:19:01,909 --> 01:19:05,871 దారుణమైన వేదన మామూలు విషయంలా మారిపోయింది. 1073 01:19:06,371 --> 01:19:07,956 తాజా సమాచారం ఏమిటి? 1074 01:19:08,040 --> 01:19:10,125 గంటక్రితం వార్త కూడా పాతబడినట్లే. 1075 01:19:10,209 --> 01:19:12,127 ప్రతి నిమిషం మరో చెడు సంఘటన జరుగుతోంది. 1076 01:19:12,211 --> 01:19:13,837 నా భార్య ఎలా ఉంది? 1077 01:19:16,423 --> 01:19:17,424 ఆవిడ బాగానే ఉంది. 1078 01:19:18,550 --> 01:19:19,551 నా పిల్లలు ఎలా ఉన్నారు? 1079 01:19:20,594 --> 01:19:21,595 వాళ్ళు కూడా బాగున్నారు. 1080 01:19:23,555 --> 01:19:25,474 ఆ క్రూరుడు వారి ప్రశాంతతను చెడగొట్టలేదా? 1081 01:19:27,476 --> 01:19:30,771 లేదు. నేను బయలుదేరి వచ్చే నాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. 1082 01:19:32,898 --> 01:19:35,651 మాటల గారడీ చేయాలని ప్రయత్నిస్తున్నావు. ఏమి జరిగిందో చెప్పు? 1083 01:19:35,734 --> 01:19:38,111 నేను ఒక విషాద వార్త మోసుకుని మిమ్మల్ని 1084 01:19:38,195 --> 01:19:39,446 కలవడానికి బయలుదేరి వస్తున్నపుడు, 1085 01:19:39,530 --> 01:19:43,158 కొందరు మంచి వారు మేక్బెత్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని పథకం వేస్తున్నట్లు తెలిసింది. 1086 01:19:43,242 --> 01:19:44,535 మీరు సాయం చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. 1087 01:19:44,618 --> 01:19:48,372 మీరు స్కాట్లాండ్ లో అడుగుపెడితే, ప్రజలకు పోరాడేందుకు స్పూర్తి లభిస్తుంది, 1088 01:19:48,455 --> 01:19:50,165 మహిళలు కూడా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడతారు. 1089 01:19:50,249 --> 01:19:51,625 వాళ్ళకు సాయం చేసి తీరాలి. 1090 01:19:52,543 --> 01:19:53,877 నేను స్కాట్లాండ్ తిరిగి వస్తున్నాను. 1091 01:19:54,419 --> 01:19:58,131 దయగల ఇంగ్లాండ్ మహారాజు మనకు సివార్డ్ తో పాటు, పదివేలమంది సైనికులను ఇచ్చారు. 1092 01:19:58,215 --> 01:20:01,343 ఈ క్రైస్తవ ప్రపంచంలో సివార్డ్ ని మించిన బలవంతుడు, అనుభవం ఉన్న సైనికుడు మరొకడు లేడు. ఈ క్రైస్తవ ప్రపంచంలో సివార్డ్ ని మించిన బలవంతుడు, అనుభవం ఉన్న సైనికుడు మరొకడు లేడు. 1093 01:20:02,594 --> 01:20:05,097 ఈ సంతోష వార్తకు బదులుగా నేను కూడా సంతోషకరమైన వార్త తెచ్చి ఉంటే బాగుండేది. 1094 01:20:05,180 --> 01:20:10,853 కానీ నేను మోసుకొచ్చిన వార్త ఎవరికీ వినబడకుండా, ఎడారిలో అరిచి చెప్పాల్సినంత 1095 01:20:10,936 --> 01:20:12,646 దారుణమైనది. 1096 01:20:12,729 --> 01:20:14,273 ఇంతకీ ఏమిటా వార్త? 1097 01:20:14,356 --> 01:20:15,649 ఇది అందరికీ సంబంధించినదా? 1098 01:20:16,233 --> 01:20:18,360 లేక మాలో ఒక్కరికే సంబంధించిన విషయమా? 1099 01:20:18,443 --> 01:20:21,321 మంచివాడు తప్పకుండా ఇతరుల బాధని పంచుకుంటాడు. 1100 01:20:21,405 --> 01:20:22,906 కానీ ఈ విషయం… 1101 01:20:24,241 --> 01:20:25,617 నీకు ఎంతో దుఃఖం కలిగిస్తుంది. 1102 01:20:27,077 --> 01:20:31,248 నాకోసమే అయితే, నానుండి దాచాల్సిన పనిలేదు. వెంటనే చెప్పు. 1103 01:20:33,166 --> 01:20:35,669 ఈ విషయం చెప్పాక నువ్వు నన్ను ద్వేషించవనే అనుకుంటున్నాను, 1104 01:20:36,879 --> 01:20:41,884 ఎందుకంటే ఎప్పుడూ విననటువంటి దారుణమైన విషయాన్ని ఇప్పుడు నేను నీకు వినిపించబోతున్నాను. 1105 01:20:44,636 --> 01:20:45,721 నువ్వు చెప్పబోయేది ఊహించగలను. 1106 01:20:48,265 --> 01:20:53,020 నీ కోటపై ఆకస్మికంగా దాడి జరిగింది, నీ భార్యా బిడ్డల్ని దారుణాతి దారుణంగా నరికి వేశారు. 1107 01:20:53,103 --> 01:20:54,438 ఆ మారణకాండ ఎలా జరిగిందో వివరిస్తే… 1108 01:20:56,648 --> 01:21:00,485 అది నిన్ను కూడా దహించివేస్తుంది, నువ్వు కూడా మృతుల్లో ఒకడివి అవుతావు. అది నిన్ను కూడా దహించివేస్తుంది, నువ్వు కూడా మృతుల్లో ఒకడివి అవుతావు. 1109 01:21:01,904 --> 01:21:03,071 దేవుడా! 1110 01:21:04,239 --> 01:21:06,325 కానివ్వు మిత్రమా, 1111 01:21:07,242 --> 01:21:08,869 నీ బాధని వెళ్లగక్కు. 1112 01:21:09,369 --> 01:21:14,291 నీ ఆవేదనకు అక్షర రూపం ఇవ్వు, నీలో దుఃఖం బయటికి రానీయకుండా, లోలోపలే దాచి ఉంచితే నీ మనసు విరిగిపోతుంది, 1113 01:21:18,462 --> 01:21:20,088 నా పిల్లల్ని కూడానా? 1114 01:21:21,715 --> 01:21:25,969 భార్య, పిల్లలు, సేవకులు, ఎవరు కనబడితే వారు. 1115 01:21:26,053 --> 01:21:29,431 - నా భార్యని కూడా చంపేశారా? - అవుననే చెప్పాను. 1116 01:21:30,265 --> 01:21:31,308 కాస్తంత ఊరట పొందు. 1117 01:21:32,476 --> 01:21:35,020 మేక్బెత్ పై కక్ష్య సాధించడం ద్వారా 1118 01:21:35,103 --> 01:21:36,313 నీ ఆవేదనను నయం చేసుకో. 1119 01:21:36,396 --> 01:21:38,106 అతనికి పిల్లలు లేరు! 1120 01:21:41,652 --> 01:21:43,904 నా ముద్దు బిడ్డలందరూనా? 1121 01:21:44,404 --> 01:21:45,697 అందరూ అని చెప్పావా? 1122 01:21:48,075 --> 01:21:50,244 ఎంత దారుణం. అందరూనా? 1123 01:21:51,578 --> 01:21:54,623 నా పిల్లలందరినీ, వాళ్ళ తల్లినీ, అందరినీ ఒకే వేటులో నరికేశారా? 1124 01:21:54,706 --> 01:21:57,000 - ఒక మగాడిలా దీనికోసం పోరాడు. - ఖచ్చితంగా! 1125 01:21:57,960 --> 01:22:00,587 కానీ నేను కూడా మామూలు మనిషినే కదా. కానీ నేను కూడా మామూలు మనిషినే కదా. 1126 01:22:02,005 --> 01:22:05,884 నాకు ఎంతో అపురూపమైన విషయాల గురించి బాధపడకుండా ఎలా ఉండగలను? 1127 01:22:06,760 --> 01:22:09,054 స్వర్గం పైనుండి చూస్తూ ఉందా, ఎటువంటి సాయం పంపలేదా? 1128 01:22:11,265 --> 01:22:12,850 పాపాత్ముడా మేక్డఫ్. 1129 01:22:13,934 --> 01:22:15,435 నీ వల్లనే వాళ్ళు చనిపోయారు. 1130 01:22:15,519 --> 01:22:18,230 వాళ్ళు చేసిన పనికి కాదు, దుర్మార్గుడినైన నావల్లే 1131 01:22:18,313 --> 01:22:20,065 వాళ్ళు చంపబడ్డారు. 1132 01:22:20,148 --> 01:22:23,944 - దేవుడు వారి ఆత్మలకు విశ్రాంతినివ్వాలి. - నీ కోపాన్ని నీ కత్తికి పదునుగా మార్చు. 1133 01:22:24,570 --> 01:22:28,031 నీ వేదనని కోపంగా మారనివ్వు. నీ బాధని మనసులో దాచుకోకుండా దాన్ని రగలనివ్వు. 1134 01:22:28,115 --> 01:22:31,285 నేనొక మహిళలాగా ఏడుస్తూ, వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో గొప్పలు చెప్పుకుంటూ ఉండగలను. 1135 01:22:31,368 --> 01:22:34,204 కానీ దేవతలారా, నేను వేచి చూసేలా చేయకండి. 1136 01:22:34,288 --> 01:22:39,042 ఆ స్కాట్లాండ్ రాక్షసుడు మేక్బెత్ ని నా ఎదుట నిలబెట్టండి. 1137 01:22:39,126 --> 01:22:41,670 నా కత్తి వేటు దూరంలోకి అతన్ని తీసుకురండి. 1138 01:22:43,213 --> 01:22:44,256 ఒకవేళ అతను తప్పించుకుంటే… 1139 01:22:47,551 --> 01:22:48,927 అప్పుడు దేవుడు కూడా అతన్ని క్షమిస్తాడు. 1140 01:23:12,534 --> 01:23:14,119 ఆవిడ గతంలో నిద్రలో ఎప్పుడు నడిచింది? 1141 01:23:14,703 --> 01:23:16,955 మహారాజు యుద్ధానికి వెళ్ళినపుడు, 1142 01:23:17,039 --> 01:23:21,877 ఆవిడ తన మంచం మీదినుండి లేచి, రాత్రి వేసుకునే గౌను వేసుకుని, 1143 01:23:21,960 --> 01:23:25,464 బీరువా తెరిచి, ఒక కాగితం బయటికి తీసి, 1144 01:23:25,547 --> 01:23:28,550 మడతపెట్టి, దానిమీద ఏదో రాసి, దాన్ని చదివి, 1145 01:23:28,634 --> 01:23:31,762 తర్వాత దానికి సీలు వేసి, తిరిగి మంచం మీదికి చేరి పడుకుంది. 1146 01:23:31,845 --> 01:23:35,933 ఇదంతా కూడా ఆమె గాఢనిద్రలోనే చేసింది. 1147 01:23:36,016 --> 01:23:37,392 ఇలా చేసే సమయంలో, 1148 01:23:37,476 --> 01:23:40,145 నడవడం, ఏవైనా పనులు చేయడం మినహాయించి 1149 01:23:40,229 --> 01:23:42,773 ఎప్పుడైనా, ఆవిడ ఏదైనా మాట్లాడడం నువ్వు విన్నావా? 1150 01:23:42,856 --> 01:23:46,360 మాట్లాడింది ప్రభూ, కానీ అవన్నీ నేను మీకు చెప్పను. 1151 01:23:46,860 --> 01:23:49,071 మీకే కాదు ఎవరికీ చెప్పను, 1152 01:23:49,154 --> 01:23:51,823 ఎందుకంటే ఆవిడ మాట్లాడే సమయంలో వేరెవరూ వినలేదు. 1153 01:23:52,491 --> 01:23:54,952 అదిగో, ఆమె వస్తోంది. 1154 01:24:01,416 --> 01:24:05,754 ఇలాంటప్పుడు ఆమె ఇలాగే ఉంటుంది, ఒట్టేసి చెబుతున్నా, ఆమె నిద్రలోనే ఉంది. 1155 01:24:05,838 --> 01:24:09,633 - ఆమెని గమనించండి. కంటపడకుండా దాక్కోండి. - చూశారా, ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి. 1156 01:24:09,716 --> 01:24:12,261 అవును, కానీ వాటి ఇంద్రియ జ్ఞానం నశించింది. 1157 01:24:12,344 --> 01:24:13,595 ఆమెకు కొవ్వొత్తి ఎలా దొరికింది? 1158 01:24:13,679 --> 01:24:16,682 ఆమె పక్కన ఎప్పుడూ కొవ్వొత్తి ఉండాలని ఆదేశించింది. 1159 01:24:19,309 --> 01:24:20,602 ఇప్పుడామె ఏమి చేస్తోంది? 1160 01:24:21,645 --> 01:24:23,397 తన చేతుల్ని ఎలా రుద్దుతోందో చూడు. 1161 01:24:23,480 --> 01:24:26,483 ఆవిడ గతంలో అలా పావుగంటసేపు చేయడం నేను చూశాను. 1162 01:24:32,114 --> 01:24:33,240 ఇప్పటికీ ఇక్కడొక మరక ఉంది. 1163 01:24:33,824 --> 01:24:35,325 విను! ఆమె మాట్లాడుతోంది. 1164 01:24:35,409 --> 01:24:39,162 పో! నన్నొదిలి పో! పిచ్చి మరక. పొమ్మన్నానా! 1165 01:24:39,663 --> 01:24:43,458 ఒకటి… రెండు. 1166 01:24:44,626 --> 01:24:48,213 సరే, చేయాల్సిన సమయం అయింది. 1167 01:24:49,548 --> 01:24:51,758 నరకం మురికిగా ఉంది. 1168 01:24:51,842 --> 01:24:55,345 ఏమిటిది ప్రభూ! సైనికుడివి అయ్యుండీ ఇంత భయపడుతున్నావా? 1169 01:24:55,846 --> 01:24:59,892 మనపై ఎవరూ నేరం మోపలేనంత వరకూ, మనం భయపడాల్సిన అవసరం ఏమిటి? 1170 01:24:59,975 --> 01:25:04,062 అయినప్పటికీ, ఆ ముసలోడి ఒంట్లో అంత రక్తం ఉంటుందని ఎవరు ఊహించారు? అయినప్పటికీ, ఆ ముసలోడి ఒంట్లో అంత రక్తం ఉంటుందని ఎవరు ఊహించారు? 1171 01:25:05,856 --> 01:25:08,734 ఫైఫ్ థేన్ కి భార్య ఉండేది. ఇప్పుడామె ఎక్కడుంది? 1172 01:25:11,236 --> 01:25:12,279 ఏమిటి? 1173 01:25:13,614 --> 01:25:16,575 ఇక చాలు, ప్రభూ, ఇక చాలు. 1174 01:25:16,658 --> 01:25:20,412 అయ్యో! నువ్వు వినకూడని విషయం విన్నావు. 1175 01:25:20,495 --> 01:25:23,957 ఆమె మాట్లాడకూడని విషయం మాట్లాడింది. ఖచ్చితంగా చెప్పగలను. 1176 01:25:25,125 --> 01:25:27,503 ఇప్పటికీ నా చేతులు రక్తం వాసన వస్తూనే ఉన్నాయి. 1177 01:25:28,962 --> 01:25:33,300 అరేబియా సుగంధ ద్రవ్యాలన్నీ కలిసినా, నా చిట్టి చేతులనుండి ఆ వాసనను పోగొట్టలేవు. 1178 01:25:52,569 --> 01:25:54,404 ఏమిటీ హృదయవిదారక దృశ్యం. 1179 01:25:55,280 --> 01:25:57,824 ఆమె హృదయం వేదనతో బరువెక్కింది. 1180 01:25:59,493 --> 01:26:01,703 ఈ జబ్బుని నయం చేయడం నా వల్ల కాని పని. ఈ జబ్బుని నయం చేయడం నా వల్ల కాని పని. 1181 01:26:02,454 --> 01:26:04,581 నిద్రలో నడిచే ఎంతో మందికి నేను వైద్యం చేశాను 1182 01:26:04,665 --> 01:26:06,667 వాళ్ళెవరూ ఆమెలా అపరాధభావంతో లేరు. 1183 01:26:07,543 --> 01:26:10,754 దేవుడా, దేవుడు మనందరినీ క్షమించాలి. 1184 01:26:10,838 --> 01:26:13,257 నీ చేతులు కడుక్కో, రాత్రి గౌను వేసుకో. 1185 01:26:13,340 --> 01:26:15,092 భయపడినట్లు కనిపించకు. 1186 01:26:16,176 --> 01:26:20,764 నేను మళ్ళీ చెబుతున్నాను, బాంకో సమాధయ్యాడు. అతను అందులోంచి తిరిగి బయటికి రాలేడు. 1187 01:26:21,431 --> 01:26:23,141 చెడు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 1188 01:26:23,767 --> 01:26:27,229 అసహజ కార్యకలాపాలు చేస్తే, అసహజ పరిణామాలే జరుగుతాయి. 1189 01:26:27,729 --> 01:26:32,442 చెడిపోయిన మనసున్న వారు తమ నేరాల్ని నిద్రపోయే సమయంలో దిండుతో వెల్లడిస్తారు. 1190 01:26:32,526 --> 01:26:34,903 ఆమెకు వైద్యుడి కంటే కూడా ఒక పూజారి అవసరం ఉంది. 1191 01:26:36,321 --> 01:26:38,407 - ఆమె ఇప్పుడు నిద్రపోవడానికి వెళుతుందా? - అక్కడికే వెళుతుంది. 1192 01:26:38,490 --> 01:26:41,869 ద్వారం దగ్గర ఏదో చప్పుడవుతోంది. రా! రా! 1193 01:26:43,287 --> 01:26:45,914 రా! రా! నీ చేయి ఇలా ఇవ్వు. 1194 01:26:47,666 --> 01:26:49,835 జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకోలేం. 1195 01:26:52,045 --> 01:26:53,046 నిద్రపోదాం! 1196 01:26:54,423 --> 01:26:55,424 నిద్రపోదాం! 1197 01:26:56,550 --> 01:26:57,551 నిద్రపోదాం! 1198 01:26:59,678 --> 01:27:00,679 నిద్రపోదాం! నిద్రపోదాం! 1199 01:27:11,023 --> 01:27:12,983 మన ముందున్నది ఏ అడవి? 1200 01:27:13,066 --> 01:27:14,318 బిర్నాం చెట్ల అడవి. 1201 01:27:15,235 --> 01:27:17,237 ఇంగ్లీష్ సైన్యం వచ్చేస్తోంది, 1202 01:27:17,321 --> 01:27:19,364 మాల్కం, అతని బంధువు సివార్డ్, ఇంకా మేక్డఫ్ వారిని నడిపిస్తున్నారు. 1203 01:27:19,448 --> 01:27:21,617 వాళ్ళు ప్రతీకారంతో రగిలి పోతున్నారు. 1204 01:27:21,700 --> 01:27:23,076 క్రూరుడు మేక్బెత్ ఏమి చేస్తున్నాడు? 1205 01:27:23,160 --> 01:27:25,579 డన్సినేన్ వద్ద తన కోటకు రక్షణ వలయాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. 1206 01:27:26,288 --> 01:27:27,372 అతనికి పిచ్చెక్కిందని అంటున్నారు. 1207 01:27:27,456 --> 01:27:31,251 అతన్ని ఇష్టపడే వాళ్ళు అతనిది ధైర్యవంతుడికి ఉండాల్సిన కోపం అంటారు. 1208 01:27:31,752 --> 01:27:35,756 కానీ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం, అతను పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. 1209 01:27:35,839 --> 01:27:39,593 తను రహస్యంగా హత్య చేసిన శత్రువుల రక్తం తన చేతులకు అంటుకుందని అతను అనుకుంటున్నాడు. 1210 01:27:39,676 --> 01:27:43,096 అతని కోసం పోరాడే సైనికులు ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నారు, ప్రేమతో పోరాడడం లేదు. 1211 01:27:43,764 --> 01:27:46,850 గొప్ప మహారాజు కాగల అర్హత తనకు లేదని అతనికి అర్థమయింది, 1212 01:27:46,934 --> 01:27:49,478 అతనికి ఆ పదవి ఒక మరగుజ్జు భారీ మనిషి దుస్తులు వేసుకున్నట్లు ఉంది. 1213 01:27:50,062 --> 01:27:54,733 దెయ్యం నిన్ను నల్లగా మార్చితే బాగుండు, పాలిపోయిన మొహం వాడా! 1214 01:27:55,317 --> 01:27:56,902 బాతులాగా ఎందుకలా భయపడి చస్తున్నావు? 1215 01:27:57,694 --> 01:27:59,696 - అక్కడ పదివేల… - బాతులున్నాయా, వెధవా? 1216 01:27:59,780 --> 01:28:01,114 సైనికులు, ప్రభూ. సైనికులు, ప్రభూ. 1217 01:28:01,198 --> 01:28:05,452 నీ బుగ్గల్ని పిసికి, నీ మోహంలో కొంచెమైనా రంగు తెప్పించు, పనికిమాలిన వెధవా. 1218 01:28:05,536 --> 01:28:07,579 ఎవరా సైనికులు, వెర్రివాడా? 1219 01:28:08,497 --> 01:28:09,540 నీ అంతు తేలుస్తాను! 1220 01:28:09,623 --> 01:28:12,292 ఆ పాలిపోయిన మొహంతో అందరినీ భయపెడుతున్నావు. 1221 01:28:12,376 --> 01:28:14,711 ఎవరా సైనికులు, పాల మొహం వాడా! 1222 01:28:14,795 --> 01:28:16,588 ఇంగ్లీష్ సైన్యం, మహారాజా. 1223 01:28:16,672 --> 01:28:17,714 నా కళ్ళముందు నుండి పో! 1224 01:28:18,674 --> 01:28:19,758 సేటన్! 1225 01:28:21,218 --> 01:28:24,930 వీడిని చూడగానే నా మనసు… సేటన్, రమ్మంటున్నానా! 1226 01:28:25,013 --> 01:28:28,684 ఈ యుద్ధం నా పాలన శాశ్వతం అయ్యేలా చేస్తుంది, లేదా కూలదోస్తుంది. 1227 01:28:29,268 --> 01:28:30,811 నేను ఎంతోకాలం జీవించాను. 1228 01:28:30,894 --> 01:28:34,690 శిశిరంలో రాలే ఆకులా, నా జీవిత గమనం వాడిపోతూ, కూలిపోవడం మొదలైంది. 1229 01:28:34,773 --> 01:28:36,775 గౌరవం, ప్రేమ, విధేయత, 1230 01:28:36,859 --> 01:28:39,945 నమ్మకమైన స్నేహం వంటి వృద్ధాప్యంతో పాటు దొరికే విషయాలు 1231 01:28:40,028 --> 01:28:41,697 నాకు దొరకబోవడం లేదు. 1232 01:28:42,197 --> 01:28:44,741 సేటన్, ఇంకేమైనా వార్త మోసుకొచ్చావా? 1233 01:28:44,825 --> 01:28:46,869 మీకు నివేదించిన విషయాలన్నీ నిజమే, ప్రభూ! 1234 01:28:46,952 --> 01:28:50,414 నా ఎముకల నుండి మాంసాన్ని వేరు చేసేవరకూ నేను పోరాడతాను. 1235 01:28:50,497 --> 01:28:52,207 - నా కవచాన్ని తీసుకురా. - అది ఇప్పుడే అవసరం లేదు. 1236 01:28:52,291 --> 01:28:54,042 నేను వేసుకుంటాను. ఇంకొందరు అశ్వవీరుల్ని పంపించండి. 1237 01:28:54,126 --> 01:28:57,004 దేశం మొత్తం తిరిగి, భయాన్ని వ్యాప్తి చేసే వారిని కనిపెట్టి ఉరి తీయండి. 1238 01:28:58,380 --> 01:28:59,464 నా కవచాన్ని తీసుకురా! 1239 01:29:01,633 --> 01:29:03,010 వైద్యుడా, నా భార్య ఎలా ఉంది? 1240 01:29:03,093 --> 01:29:04,636 ఆమె బాగానే ఉంది ప్రభూ, 1241 01:29:04,720 --> 01:29:08,599 కానీ ఆమెను నిద్ర పోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఊహలతో సతమతమవుతోంది. 1242 01:29:10,392 --> 01:29:11,602 దాని నుండి ఆమెను నయం చేయండి. 1243 01:29:11,685 --> 01:29:15,063 చెడిపోయిన ఆమె మనసును బాగుచేయలేరా, 1244 01:29:15,147 --> 01:29:17,733 వేదనభరిత జ్ఞాపకాలను తుంచేయలేరా, 1245 01:29:17,816 --> 01:29:19,735 ఆమె మెదడులో చెలరేగుతున్న 1246 01:29:19,818 --> 01:29:23,197 ఇబ్బందికర ఆలోచనలను తొలగించడానికి ఏదైనా మందు ఉపయోగించి, 1247 01:29:23,280 --> 01:29:25,490 ఆమెకు ఉపశమనం కలిగించలేరా? 1248 01:29:26,283 --> 01:29:29,036 అటువంటి ఉపశమనం కలగాలంటే, రోగి తనని తాను నయం చేసుకోవాలి. 1249 01:29:30,913 --> 01:29:34,666 నీ మందుల్ని కుక్కలకు పడేయి! నాకు వాటితో ఏ ఉపయోగం లేదు! 1250 01:29:34,750 --> 01:29:37,586 సేటన్! సైనికులని పంపించు! 1251 01:29:38,462 --> 01:29:41,173 బిర్నాం అడవి పెకిలించుకుని, డన్సినేన్ దిశగా 1252 01:29:41,256 --> 01:29:44,134 నడిచి వస్తే తప్ప నేను చావుకీ, వినాశనానికీ భయపడను! 1253 01:29:46,094 --> 01:29:50,682 ప్రతి సైనికుడూ ఒక కొమ్మని విరిచి తన ముందు అడ్డుగా పట్టుకోమని చెప్పండి. 1254 01:29:50,766 --> 01:29:52,601 అలాగే చేస్తాం. 1255 01:29:52,684 --> 01:29:56,605 మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మేక్బెత్ డన్సినేన్ కోటలోనే ఉన్నాడనీ, 1256 01:29:56,688 --> 01:29:58,607 మన ముట్టడిని ఏమీ అడ్డుకోడనీ సమాచారం అందింది. 1257 01:29:58,690 --> 01:30:00,025 అదే అతనికి కూడా కావాల్సింది. అదే అతనికి కూడా కావాల్సింది. 1258 01:30:00,108 --> 01:30:03,820 గతి లేని వారు తప్ప అతని తరఫున ఎవరూ పోరాడరు, ఒకవేళ పోరాడినా 1259 01:30:03,904 --> 01:30:05,531 ఎవరూ ఇష్టపూర్వకంగా చేయరు. 1260 01:30:05,614 --> 01:30:08,575 బయటి గోడలపై మన జెండాలను వేలాడదీయండి! 1261 01:30:08,659 --> 01:30:10,911 "వాళ్ళు వస్తున్నారు!" అని అందరూ అరుస్తూనే ఉండండి. 1262 01:30:10,994 --> 01:30:14,289 వాళ్ళ ముట్టడిని మన కోట సమర్థవంతంగా అడ్డుకోగలదు. 1263 01:30:14,373 --> 01:30:18,627 ఆకలితో, రోగాలతో చనిపోయేవరకూ వాళ్ళు అక్కడే పడి ఉండొచ్చు. 1264 01:30:52,744 --> 01:30:54,496 మన మొదటి దాడికి సిద్ధం కండి. 1265 01:30:54,997 --> 01:30:58,584 ధీశాలి మేక్డఫ్, నేను మిగిలిన పనులు పూర్తి చేస్తాం. 1266 01:30:58,667 --> 01:31:01,587 ఈ రాత్రికి మేక్బెత్ సైన్యం మనకి ఎదురైతే, ఈ రాత్రికి మేక్బెత్ సైన్యం మనకి ఎదురైతే, 1267 01:31:01,670 --> 01:31:04,173 వారిని మనం చిత్తు చేయలేకపోతే, ఓడిపోవడానికి అర్హులమే. 1268 01:31:04,673 --> 01:31:07,050 మన సైన్యాన్ని ముందుకు నడిపించండి! 1269 01:31:35,078 --> 01:31:37,122 ఇటువైపు! ఇటువైపు! 1270 01:31:37,664 --> 01:31:39,708 మన సైన్యంలో అధికభాగం వారితో కలవకపోయుంటే, 1271 01:31:39,791 --> 01:31:42,753 వాళ్ళతో మన కోట ముందే ముఖాముఖి తలపడి ఉండే వాళ్ళం, 1272 01:31:42,836 --> 01:31:44,713 వాళ్ళని తిరిగి ఇంగ్లాండ్ తరిమేసే వాళ్ళం. 1273 01:31:45,214 --> 01:31:46,715 దగ్గరికి వచ్చేసినట్లే. 1274 01:31:47,758 --> 01:31:52,346 ఆ కొమ్మల్ని పక్కన పడేసి, మీ వాస్తవ రూపం వాళ్ళకు చూపించండి! 1275 01:31:52,429 --> 01:31:54,473 మన బాకాలు మోగించండి. 1276 01:31:54,556 --> 01:31:56,225 గట్టిగా ఊదండి, 1277 01:31:56,308 --> 01:31:59,436 రక్తం, చావులను అవి బిగ్గరగా ప్రకటిస్తాయి. 1278 01:32:02,731 --> 01:32:03,732 ఏమిటా శబ్దం? 1279 01:32:06,818 --> 01:32:08,612 ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, మహారాజా. 1280 01:32:11,323 --> 01:32:13,450 నేను భయమంటే ఎలా ఉంటుందో దాదాపు మర్చిపోయాను. 1281 01:32:13,951 --> 01:32:14,952 ఒకానొక సమయంలో, 1282 01:32:15,035 --> 01:32:18,038 రాత్రిపూట ఏదైనా కేక వినిపిస్తే భయపడే వాడిని. 1283 01:32:18,121 --> 01:32:20,958 దెయ్యం కథ విన్నప్పుడు 1284 01:32:21,041 --> 01:32:23,627 నా రోమాలు భయంతో నిక్కబొడుచుకునేవి. 1285 01:32:24,211 --> 01:32:25,587 ఆ ఏడుపు దేనికోసం? 1286 01:32:27,506 --> 01:32:30,259 ప్రభూ, మహారాణి చనిపోయారు. 1287 01:32:39,309 --> 01:32:41,562 తరవాతైనా ఆమె చనిపోయి ఉండేదే. 1288 01:32:46,149 --> 01:32:48,151 ఏదో ఒకరోజు ఆ వార్త వినాల్సిందే. 1289 01:32:49,653 --> 01:32:54,783 రేపు, రేపు, రేపు అంటూ 1290 01:32:56,326 --> 01:32:59,746 ఈ భూమ్మీద మన సమయం ముగిసే వరకూ 1291 01:32:59,830 --> 01:33:03,417 మన జీవితంలో ఒక్కో రోజు పెరుగుతూనే ఉంటుంది. మన జీవితంలో ఒక్కో రోజు పెరుగుతూనే ఉంటుంది. 1292 01:33:05,711 --> 01:33:09,548 ఇక గడిచిపోయిన ప్రతిరోజూ, వెర్రి వాళ్ళను తమ చావుకు దగ్గర చేస్తూ వచ్చింది. 1293 01:33:12,509 --> 01:33:16,305 ఆరిపో, ఆరిపో, కరిగిపోతున్న కొవ్వొత్తీ. 1294 01:33:17,890 --> 01:33:19,766 జీవితమే ఒక భ్రమ… 1295 01:33:20,809 --> 01:33:23,896 వేదికపై తన పాత్ర ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన పేద నటుడు, తన చిన్న పాత్ర ముగిశాక 1296 01:33:23,979 --> 01:33:25,189 ఇక శాశ్వతంగా కనుమరుగైపోయినట్లు. 1297 01:33:25,272 --> 01:33:28,817 జీవితం అనేది ఒక వెర్రివాడు చెప్పిన కథ… 1298 01:33:31,111 --> 01:33:34,239 ఆనందాలు, భావోద్వేగాలు ఎన్నో ఉన్నప్పటికీ, అర్థమంటూ లేనిదిది. 1299 01:33:37,659 --> 01:33:40,495 మహాప్రభూ, నేను చూసిన దృశ్యం గురించి మీకు చెప్పి తీరాలి, 1300 01:33:40,579 --> 01:33:42,122 కానీ ఎలా చెప్పాలో తెలీడం లేదు. 1301 01:33:42,998 --> 01:33:44,875 ఎలాగోలా చెప్పండి చాలు. 1302 01:33:44,958 --> 01:33:47,836 నేను బిర్నాం అడవి వంక చూశాను, 1303 01:33:48,795 --> 01:33:50,964 అడవి కదిలి ముందుకు వస్తున్నట్లుగా అనిపించింది. 1304 01:33:53,675 --> 01:33:56,094 నేను చెప్పింది అబద్ధమైతే, ఏ శిక్షకైనా సిద్ధం. 1305 01:33:57,387 --> 01:34:01,058 ఇక్కడికి మూడు మైళ్ళ దూరంలో నడిచొస్తున్న అడవిని మీరు చూడొచ్చు. ఇక్కడికి మూడు మైళ్ళ దూరంలో నడిచొస్తున్న అడవిని మీరు చూడొచ్చు. 1306 01:34:02,726 --> 01:34:04,686 నువ్వు చెప్పేది అబద్ధమైతే, 1307 01:34:05,229 --> 01:34:09,566 నువ్వు ఆకలితో చనిపోయే వరకూ, నిన్ను పక్కనున్న చెట్టుకి కట్టేస్తాను. 1308 01:34:11,944 --> 01:34:15,447 "బిర్నాం అడవి డన్సినేన్ చేరే వరకూ నువ్వు భయపడాల్సిన పనిలేదు." 1309 01:34:16,782 --> 01:34:18,700 ఇప్పుడు డన్సినేన్ దిశగా అడవి నడుచుకుంటూ వస్తోంది. 1310 01:34:21,912 --> 01:34:25,290 యుద్ధానికి సిద్ధం కండి, వెళ్ళండి! 1311 01:34:27,793 --> 01:34:30,128 వేగు చెప్పిన విషయం నిజమైతే, 1312 01:34:30,712 --> 01:34:34,633 పారిపోయినా, ఇక్కడే ఉన్నా ఇక ఫలితం ఉండదు! 1313 01:34:34,716 --> 01:34:37,094 హెచ్చరిక గంటలు మోగించండి! 1314 01:34:37,177 --> 01:34:39,930 గాలీ, వీచు! అంతా నాశనం చేయి! 1315 01:34:41,098 --> 01:34:43,934 కనీసం కవచం ధరించి చనిపోవచ్చు. 1316 01:35:26,810 --> 01:35:27,811 నీ పేరేంటి? 1317 01:35:29,521 --> 01:35:31,315 దాన్ని వింటే భయపడతావు. 1318 01:35:31,398 --> 01:35:32,399 లేదు. 1319 01:35:33,066 --> 01:35:36,278 నువ్వు నరకంలో ఉండే భయంకరమైన దెయ్యం అయినా కూడా, నేను భయపడను. 1320 01:35:38,363 --> 01:35:39,948 నా పేరు మేక్బెత్. 1321 01:35:42,284 --> 01:35:46,580 దీనిని మించి నేను ద్వేషించే పేరును దెయ్యం కూడా చెప్పలేదు. 1322 01:35:47,080 --> 01:35:48,832 లేదు, దెయ్యం పేరు కూడా ఇంతకుమించి భయపెట్టదు. 1323 01:35:48,916 --> 01:35:51,335 నువ్వు అబద్ధాలకోరువి, అసహ్యం కలిగించే నిరంకుశుడివి. 1324 01:35:52,044 --> 01:35:55,547 నిన్ను చూసి నేను భయపడనని నా కత్తితో నిరూపిస్తాను! 1325 01:35:58,050 --> 01:35:59,635 నువ్వొక మహిళకు పుట్టిన వాడివి. 1326 01:37:37,441 --> 01:37:39,776 తిరుగు, నరకపు కుక్కా, ఇటు తిరుగు! 1327 01:37:47,618 --> 01:37:51,163 మగవాళ్ళందరిలో నీకొక్కడికే నేను దూరంగా ఉండాలనుకున్నాను. ఇక్కడినుండి వెళ్ళిపో! 1328 01:37:51,663 --> 01:37:54,583 ఇప్పటికే నీ భార్యాబిడ్డల్ని చంపిన దోషం నాకు అంటుకుంది. 1329 01:37:54,666 --> 01:37:56,043 నేను నీతో మాట్లాడేది ఏమీ లేదు. 1330 01:37:57,377 --> 01:37:59,004 నా బదులు నా కత్తే మాట్లాడుతుంది. 1331 01:37:59,087 --> 01:38:02,007 ఎవరికైతే హాని చేయగలవో, వెళ్లి వాళ్ళతో తలపడు. ఎవరికైతే హాని చేయగలవో, వెళ్లి వాళ్ళతో తలపడు. 1332 01:38:02,090 --> 01:38:03,383 నేను మనోహరమైన జీవితాన్ని గడిపాను, 1333 01:38:03,467 --> 01:38:05,761 ఆడదాని కడుపున పుట్టిన వాడెవడూ ఆ జీవితాన్ని అంతం చేయలేడు. 1334 01:38:05,844 --> 01:38:07,429 నీ మనోహరమైన జీవితం ఇక ముగిసినట్లే. 1335 01:38:08,555 --> 01:38:11,350 నువ్వు సేవ చేసే దుష్టశక్తిని అడిగితే, నేను గర్భంలోంచి పుట్టలేదని చెప్పి ఉండేది, 1336 01:38:11,433 --> 01:38:14,478 మేక్డఫ్ ని నెలలు నిండకముందే తల్లి గర్భాన్ని కోసి బయటికి తీశారని చెప్పి ఉండేది. 1337 01:38:16,897 --> 01:38:19,274 ఈ విషయం నాకు చెప్పినందుకు నీకు కీడు జరగాలి. 1338 01:38:22,110 --> 01:38:25,030 - నేను నీతో పోరాడను. - అయితే లొంగిపో, పిరికిపందా! 1339 01:38:25,614 --> 01:38:29,326 నేను లొంగిపోయి, మాల్కం పాదాల ముందు మోకరిల్లడం, 1340 01:38:29,409 --> 01:38:31,620 సామాన్య ప్రజల చేతిలో వెక్కిరించబడడం జరగని పని. 1341 01:38:32,496 --> 01:38:35,707 బిర్నాం అడవి నిజంగానే డన్సినేన్ దగ్గరికి వచ్చినా కూడా, 1342 01:38:35,791 --> 01:38:38,794 నాతో తలపడే వ్యక్తి తల్లి గర్భంలోంచి రాకపోయినా కూడా, నేను తుదివరకూ పోరాడతాను. 1343 01:38:40,629 --> 01:38:41,880 కానివ్వు, మేక్డఫ్. 1344 01:38:43,924 --> 01:38:47,135 "చాలు, ఇక ఆపు!" అని ముందుగా ఎవరంటారో చూద్దాం. 1345 01:40:20,729 --> 01:40:24,274 స్కాట్లాండ్ మహారాజుకి అందరూ వందనాలు పలకండి! 1346 01:40:25,150 --> 01:40:29,321 వందనం, స్కాట్లాండ్ మహారాజా! 1347 01:40:29,404 --> 01:40:33,909 వందనం, స్కాట్లాండ్ మహారాజా! వందనం, స్కాట్లాండ్ మహారాజా! 1348 01:41:57,951 --> 01:42:00,913 విలియం షేక్స్పియర్ రచించిన నాటకంపై ఆధారపడింది విలియం షేక్స్పియర్ రచించిన నాటకంపై ఆధారపడింది 1349 01:44:55,671 --> 01:44:57,673 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ 1350 01:44:57,756 --> 01:44:59,758 షేక్స్పియర్ కింగ్ లియర్ నుండి కొన్ని పంక్తులు