1 00:00:24,775 --> 00:00:28,195 వంచన 2 00:01:00,019 --> 00:01:04,105 ప్రియమైన ఆగ్నెస్, ఆమె ఎప్పుడూ కోరుకునే కూతురువు నీవే - ప్రేమతో, క్లెమ్ ఎక్స్ 3 00:01:24,001 --> 00:01:24,960 ఆలిస్. 4 00:01:30,174 --> 00:01:31,383 ఆమె పైన లేదు. 5 00:01:35,930 --> 00:01:36,931 ఆలిస్! 6 00:01:46,857 --> 00:01:48,692 నువ్వు అబద్ధం చెప్పావు! 7 00:01:48,776 --> 00:01:50,360 ఆలిస్! నీకు ఆలస్యం అవుతుంది. 8 00:01:58,202 --> 00:01:59,203 ఆలిస్! 9 00:02:10,881 --> 00:02:11,882 ఆలిస్! 10 00:02:37,366 --> 00:02:40,327 ఆలిస్. ఇక్కడ ఏమి చేస్తున్నావు? 11 00:02:44,874 --> 00:02:46,792 వద్దు, ఆలిస్. వద్దు. 12 00:03:00,097 --> 00:03:04,643 ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఆలిస్ హార్ట్ 13 00:03:04,727 --> 00:03:07,897 మూడవ భాగం ల్యాంటర్న్ బుష్ 14 00:03:07,980 --> 00:03:13,110 అర్థం: ఆశ గుడ్డిది కావచ్చు 15 00:03:16,989 --> 00:03:17,907 ఎప్పుడు తెలిసింది? 16 00:03:18,532 --> 00:03:23,162 అతనికి పెళ్ళయిందని తెలిసేదాకా, క్లెమ్‌తో నాకు శారీరక సంబంధం ఉండేదని నీకు తెలుసు. 17 00:03:24,329 --> 00:03:28,250 -ఆ తర్వాత మన మధ్య సంబంధం ఏర్పడింది. -మనం ఎప్పుడు కలిశామో నీకు తెలుసా? 18 00:03:29,209 --> 00:03:31,295 లేదు. రెండింటి మధ్య సందిగ్ధత ఉంది. 19 00:03:32,254 --> 00:03:35,299 -అయితే, జెమ్మా పుట్టిన తర్వాత? -కాదు. 20 00:03:37,509 --> 00:03:41,680 ఆమె జబ్బుపడి, అవయవ మార్పిడి అవసరమయ్యేదాకా లేదు. 21 00:03:44,808 --> 00:03:46,810 మా ఇద్దరికీ జన్యుపరమైన పోలిక లేకపోవటంతో, 22 00:03:47,353 --> 00:03:50,856 నన్ను డాక్టర్ పక్కకు పిలిచి అడిగాడు. 23 00:03:53,067 --> 00:03:54,317 అతన్ని ఎలా సంప్రదించావు? 24 00:03:56,946 --> 00:04:01,325 అతనికి ఓ ఉత్తరం రాసి, జెమ్మావి కొన్ని వెంట్రుకలు పంపాను. 25 00:04:04,536 --> 00:04:06,246 ఆమె చదువుతున్న ఫోటో ఒకటి పంపాను. 26 00:04:07,706 --> 00:04:08,540 తర్వాత ఏమయింది? 27 00:04:08,999 --> 00:04:12,670 ఏ సమాధానమూ రాలేదు. నాకు బాగా కోపం వచ్చి, అతని ఇంటికి వెళ్ళాను. 28 00:04:13,170 --> 00:04:15,923 డీఎన్ఏ పరీక్ష చేయించుమని అడిగాను, అతను చేయించుకోలేదు. 29 00:04:21,345 --> 00:04:24,640 ఆ రోజు ఆమెను చూశాను. ఆలిస్. 30 00:04:27,226 --> 00:04:28,477 వాళ్ళు ఒకేలాగా ఉన్నారు. 31 00:04:30,437 --> 00:04:31,563 అప్పుడే నీకు తెలుసు. 32 00:04:34,525 --> 00:04:38,070 -మరి ఆగ్నెస్, ఆమెకు తెలుసా? -ఆమె ఆ రోజు నా మాటలు వినింది. 33 00:04:38,570 --> 00:04:41,824 ఆమె తర్వాత చెప్పింది, క్లెమ్‌ను ఒప్పించటానికి ప్రయత్నించానని, 34 00:04:41,907 --> 00:04:43,492 అతను కొట్టాడని. 35 00:04:49,540 --> 00:04:54,878 -మరి ఆగ్నెస్, ఆమె నీకు ఆ బొమ్మను ఇచ్చిందా? -లేదు. జెమ్మా పోయిన తర్వాత క్లెమ్ పంపాడు. 36 00:04:55,421 --> 00:05:00,342 అతను ఎప్పుడూ దీన్ని చెక్కుతుండేవాడు, ఆమెను కాపాడటానికి ఏమీ చేయలేదు. 37 00:05:00,968 --> 00:05:02,094 అతన్ని ద్వేషించాను. 38 00:05:03,595 --> 00:05:04,930 దీన్ని ద్వేషించాను. 39 00:05:05,764 --> 00:05:09,143 దీన్ని ధ్వంసం చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను. 40 00:05:10,686 --> 00:05:12,521 ఎందుకంటే అది జెమ్మా, 41 00:05:14,440 --> 00:05:15,649 మా చిన్న పిల్ల. 42 00:05:30,789 --> 00:05:34,543 -ఆమె కుటుంబ సభ్యురాలు, జాన్. -ఆమె నీ కుటుంబ సభ్యురాలు. 43 00:05:45,429 --> 00:05:49,266 -ఎక్కడకు వెళుతున్నావు? -నాకు ఎప్పుడైనా చెబుతావా? 44 00:05:55,105 --> 00:05:56,148 ఎలా చెప్పగలను? 45 00:06:02,071 --> 00:06:05,074 నేను జెమ్మా గదిలో ఉంటాను, పట్టణంలో ఎక్కడైనా దొరికేదాకా. 46 00:06:16,418 --> 00:06:18,837 దయచేసి ఆ పత్రాలను ఈరోజు కోర్టుకు సమర్పించు. 47 00:06:19,338 --> 00:06:23,634 నేను ఒక్కదానినే. జాన్‌తో కాదు. 48 00:06:27,221 --> 00:06:30,057 ఒక్కరి సంరక్షణే కానక్కర లేదు. నేను కేవలం... 49 00:06:32,518 --> 00:06:34,645 నేను ఆలిస్ జీవితంలో ఒక భాగం కావాలి. 50 00:06:41,527 --> 00:06:45,322 ఆగ్నెస్ వస్తువులు మళ్ళీ పెట్టేస్తున్నాము. డెస్క్ కోసం నాకు సాయం కావాలి. 51 00:06:45,405 --> 00:06:47,866 నువ్వు ఆ వస్తువులను అలా వదిలేయాల్సింది. 52 00:06:47,950 --> 00:06:50,077 ఇప్పడు ఆమెకు ప్రశ్నలు ఎక్కువవుతాయి. 53 00:06:50,159 --> 00:06:51,036 చూద్దాం. 54 00:06:58,627 --> 00:07:00,295 ఇది నమ్మలేకపోతున్నాను. 55 00:07:00,587 --> 00:07:03,549 సంరక్షణ దరఖాస్తు - ఆలిస్ హార్ట్ 56 00:07:04,299 --> 00:07:05,217 తొలగించు 57 00:07:05,926 --> 00:07:09,012 ఏం చేస్తున్నావు? దాన్ని అలా వదిలేయలేవు. 58 00:07:09,263 --> 00:07:12,266 ఆమె కోర్ట్‌కు దరఖాస్తు చేసింది. తనతో మాట్లాడాలని కోరుతోంది. 59 00:07:12,349 --> 00:07:16,019 ఆమె ఏదైనా కోరుకోవచ్చు. మనం దానికి అంగీకరించాల్సిన అవసరంలేదు. 60 00:07:17,729 --> 00:07:20,107 ఈ విషయాలు ఊరికే పోవు జూన్. 61 00:07:21,358 --> 00:07:24,194 అవి ఇక్కడకు వస్తాయి, నీకు ఇష్టమున్నా, లేకపోయినా. 62 00:07:24,611 --> 00:07:26,029 అయితే ఏం జరుగుతుంది? 63 00:07:26,238 --> 00:07:29,992 వారు నీ ముఖాన్ని అలా చూస్తారు, ఆలిస్ మాట్లాడకపోవటం, మనను ద్వేషించటం. 64 00:07:30,075 --> 00:07:31,702 ఈ పరిణామాలు ఎటు పోతాయో తెలుసు. 65 00:07:33,245 --> 00:07:39,042 ఆలిస్ విషయంలో మనం కొంత వేచిచూడాలి, ఆమెను బాగు చేయించాలి. 66 00:07:41,628 --> 00:07:42,588 తప్పకుండా. 67 00:08:55,327 --> 00:09:01,291 ఇది చూడగానే, నన్ను గుర్తుచేసుకో ఆగ్నెస్ ఎక్స్ 68 00:09:34,324 --> 00:09:35,492 ప్రియమైన ఆలిస్, 69 00:09:35,867 --> 00:09:40,747 ఆగ్నెస్ గురించి నీకు నిజం చెప్పనందుకు నాపై నీకు కోపం ఉండటంలో పూర్తి న్యాయం ఉంది. 70 00:09:41,957 --> 00:09:46,878 నువ్వు, మనం, అందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాను. 71 00:09:49,756 --> 00:09:54,052 ఆగ్నెస్ తన తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో చనిపోవటంతో థోర్న్‌ఫీల్డ్ వచ్చింది. 72 00:09:58,932 --> 00:10:04,563 ఆమె నీ లాగా ఒక అనాథ, తను నీలాగే బెల్ టవర్‌లో నివసించింది, 73 00:10:05,480 --> 00:10:07,274 నేను ఆమెను చాలా ప్రేమించాను. 74 00:10:17,284 --> 00:10:21,580 థోర్న్‌ఫీల్డ్ ఆమె ఇల్లుగా మారింది. పువ్వులంటే ప్రేమ ఆమెకు ఇక్కడే పెరిగింది. 75 00:10:22,456 --> 00:10:24,583 ఆమె నిఘంటువును బట్టీ పట్టేసింది. 76 00:10:25,250 --> 00:10:29,004 ఇక్కడే ఆమె మీ నాన్నను కలుసుకుంది. వాళ్ళు ప్రేమలో పడ్డారు. 77 00:10:40,766 --> 00:10:43,935 ఈ పతకంలోని పువ్వు స్టర్ట్స్ ఎడారి బఠాణి. 78 00:10:44,519 --> 00:10:48,398 దాని అర్థం "ధైర్యంగా ఉండు, నమ్మకం పెంచుకో." 79 00:10:55,697 --> 00:10:58,116 అదే మన ఇద్దరికీ కావలసింది, చేయవలసింది, ఆలిస్. 80 00:10:59,242 --> 00:11:02,746 నువ్వు గొంతును పోగొట్టుకున్నట్లు, నేను నాది పోగొట్టుకున్నాను. 81 00:11:04,122 --> 00:11:08,085 వాళ్ళు ఇద్దరికోసం నేను ఇంకా రోదిస్తూనే ఉన్నాను, నీలాగే. 82 00:11:09,753 --> 00:11:13,924 నువ్వు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత జవాబులన్నీ చెబుతానని మాట ఇస్తున్నాను. 83 00:11:14,758 --> 00:11:18,512 నువ్వు నీ గొంతును తెచ్చుకోవాలి, అప్పుడే నాకు నా గొంతు వస్తుంది. 84 00:11:20,097 --> 00:11:21,640 నాకోసం అది చేయగలవా? 85 00:11:39,157 --> 00:11:39,991 ఇటు రా. 86 00:11:42,744 --> 00:11:46,623 ధన్యవాదాలు, ఆలిస్. ఆసక్తికరమైన అభిమానాలు. 87 00:11:50,627 --> 00:11:53,255 వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? 88 00:11:53,588 --> 00:11:57,509 నువ్వు మాట్లాడినప్పుడు జవాబు దొరుకుతుంది. సరేనా? 89 00:12:05,892 --> 00:12:11,022 -"నీ బ్రహ్మచర్యంపై నాకు నమ్మకం ఉంది." -"నీ ధైర్యం నాకు ఇష్టంలేదు" కంటే మెరుగు. 90 00:12:24,744 --> 00:12:27,289 నీవు నీ గొంతు తెచ్చుకోవాలి, ఆలిస్, అప్పుడే నాకు గొంతు వస్తుంది. ఇది నాకు చేయగలవా? 91 00:12:30,584 --> 00:12:33,336 పళ్ళు తోమావా? బాగుంది. 92 00:12:34,754 --> 00:12:35,672 ఇటు రా. 93 00:12:41,136 --> 00:12:43,930 ఇది అందంగా ఉంది. నువ్వు అదృష్టవంతురాలివి. 94 00:12:47,058 --> 00:12:48,727 మీరు ఇద్దరూ స్నేహితులా? 95 00:12:48,810 --> 00:12:51,229 అవును. ఇక్కడ అందరం స్నేహితులమే. 96 00:12:53,565 --> 00:12:57,027 నీ పుట్టినరోజు రాబోతోంది. నీకు ఏ కేక్ కావాలో నువ్వు ఆలోచించాలి. సరేనా? 97 00:12:57,819 --> 00:12:59,696 అవునా? సరే. 98 00:15:01,067 --> 00:15:03,612 వీలర్ గారూ, ఇది పాడవటం నాకు ఇష్టంలేదు. 99 00:15:04,321 --> 00:15:08,116 నేను కేవలం ఆలిస్‌తో గానీ, జూన్‌తో గానీ మాట్లాడాలి. 100 00:15:11,536 --> 00:15:16,041 ఆలిస్‌కు తన తల్లిదండ్రుల గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి, 101 00:15:16,124 --> 00:15:18,293 అవి ఆమెకు సాయపడతాయని అనుకుంటున్నాను. 102 00:15:27,510 --> 00:15:28,970 సెల్కీ స్టోరీ 103 00:15:46,988 --> 00:15:48,073 అద్భుతంగా ఉన్నావు. 104 00:16:09,427 --> 00:16:14,224 సారీ. నేను అడిగి ఉండాల్సింది. నేను దీన్ని ఎప్పుడూ చదవలేదు. 105 00:16:30,865 --> 00:16:32,992 నాన్నకు ఇదే మచ్చ ఉందా? 106 00:16:33,159 --> 00:16:35,578 చిన్న వయసులో అది మాకు ఒక పిచ్చి సవాలు. 107 00:16:46,381 --> 00:16:48,675 మా నాన్నకు నాన్న ఎవరు? 108 00:16:58,226 --> 00:17:01,104 చిన్నగా ఉన్నపుడు జూన్ నాకు, క్లెమ్‌కు చెప్పినదే తెలుసు. 109 00:17:01,563 --> 00:17:03,732 ఆమె అతన్ని "దొంగ జమీందారు" అని పిలిచేది. 110 00:17:06,276 --> 00:17:11,281 వాళ్ళు నది దగ్గర కలుసుకున్నారు. ఆమె ఈదుతోంది. ఆమె పొగను చూసింది. 111 00:17:11,781 --> 00:17:13,950 అక్కడ అతను ఒక గుడారంలో మకాం వేసి ఉన్నాడు. 112 00:17:14,576 --> 00:17:18,913 వాళ్ళు ఆ రోజు అక్కడ సరదాగా గడిపారు, తర్వాత అతను మాయమైపోయాడు. 113 00:17:19,455 --> 00:17:23,292 కానీ తర్వాతి నెలలో, ఆమె పొగను చూసింది, అతను మళ్ళీ వచ్చాడు. 114 00:17:24,127 --> 00:17:27,714 ఇక ప్రతి నెలా, అదే రోజు వాళ్ళు కలుసుకునేవారు. 115 00:17:28,631 --> 00:17:31,384 కానీ ఒక రోజు, అతను రాలేదు. 116 00:17:32,051 --> 00:17:34,804 ధనవంతుల దగ్గరనుంచి దోచుకుని స్థానిక పేదవారికి ఇచ్చే 117 00:17:34,929 --> 00:17:38,057 దొంగలను పోలీసులు పట్టుకున్నారని జూన్‌కు తెలిసింది. 118 00:17:45,273 --> 00:17:46,900 రాబిన్ హుడ్ 119 00:17:46,983 --> 00:17:50,820 జూన్ గర్భంలో క్లెమ్ ఉంది, కానీ ఆమె మళ్ళీ దొంగ జమీందారును చూడలేదు. 120 00:18:07,420 --> 00:18:10,465 జూన్ (హృదయ) దొంగ 121 00:18:10,548 --> 00:18:12,175 అది నమ్మశక్యంగా లేదా? 122 00:18:32,028 --> 00:18:34,656 మన తేనెటీగలు లేకుండా పొలానికి మనుగడ లేదు. 123 00:18:35,824 --> 00:18:38,660 అవి ఈ మొత్తం ప్రదేశానికి గుండెకాయలాంటివి, 124 00:18:39,077 --> 00:18:43,331 నువ్వు వాటి తేనెను రుచి చూసేటప్పుడు, మన పువ్వుల రుచి చూస్తుంటావు. 125 00:18:45,416 --> 00:18:49,379 ఈ తేనె దేనినైనా నయం చేస్తుందని నేను నమ్ముతాను. 126 00:19:12,944 --> 00:19:16,823 రోజ్‌మేరీ, మరుపును. మేరిగోల్డ్, విచారాన్ని. 127 00:19:17,448 --> 00:19:22,120 తులసి, ద్వేషాన్ని. ఇటాలియన్‌లు దానికి ఏం చెబుతారో తెలియదు. 128 00:19:25,832 --> 00:19:29,711 కంగారూ పా, బాల్యపు క్రీడలు, ఆటలు. 129 00:19:29,794 --> 00:19:31,796 క్లెమ్ హార్ట్ ఒక విలువైన మనిషి 130 00:19:48,521 --> 00:19:49,522 ఫ్లానెల్ పువ్వు. 131 00:19:50,899 --> 00:19:51,774 దాన్ని చూడు. 132 00:20:05,455 --> 00:20:10,084 ఫ్లానెల్ పువ్వులు (పోయినది దొరికి తీరాలి) 133 00:20:18,760 --> 00:20:21,220 "నేను నీ బందీని. నేను నీ శత్రువును." 134 00:20:21,304 --> 00:20:22,263 ఊదా పగడపు బఠాణీ 135 00:20:25,767 --> 00:20:27,018 "వ్యంగ్యం." 136 00:20:28,937 --> 00:20:32,440 "బద్ధకం. మూర్ఖత్వం." 137 00:20:34,233 --> 00:20:35,526 "నా లొంగుబాటు." 138 00:20:37,737 --> 00:20:39,072 "నా కృతజ్ఞత." 139 00:20:44,911 --> 00:20:47,121 "ప్రేమ రాయబారి." 140 00:20:47,205 --> 00:20:48,081 జూన్. 141 00:20:50,792 --> 00:20:53,378 ఆమె పాపతో మార్కెట్ దగ్గర కనబడింది. 142 00:20:53,962 --> 00:20:55,129 అతను ఆమెను అనుసరించాడా? 143 00:20:56,089 --> 00:20:59,592 -లేదు. చెప్పలేం. వాళ్ళకు తెలియదు. -సరే. అతన్ని లోపలకు తీసుకెళదాం. 144 00:20:59,676 --> 00:21:00,718 కొత్త పువ్వు. 145 00:21:01,344 --> 00:21:04,347 రా బుజ్జాయి. మంచి పిల్లవాడు. 146 00:21:04,430 --> 00:21:06,975 అతనికి నా దగ్గర ఏమీ లేదు. అతను ఆకలిగా ఉన్నాడు. 147 00:21:07,141 --> 00:21:09,852 అది నేను చూసుకుంటాను. మీరు ఇద్దరూ బాగానే ఉన్నారా? 148 00:21:10,103 --> 00:21:12,981 మనకు ఒక వైద్యురాలు ఉంది, నీకు అవసరమైతే మనం పిలవొచ్చు. 149 00:21:13,398 --> 00:21:14,649 నీ ఆచూకీ ఎవరికైనా తెలుసా? 150 00:21:15,984 --> 00:21:18,569 మంచిది. నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉంటావు. 151 00:21:20,029 --> 00:21:20,989 అతను కూడా. 152 00:21:22,824 --> 00:21:23,950 నువ్వు ఒంటరివి కాదు. 153 00:21:26,619 --> 00:21:27,620 నేను ఉన్నాను. 154 00:21:29,247 --> 00:21:33,501 అవును, జాషీ. మీ నాన్నకు నేను ఇలా చేయించేదాన్ని. 155 00:21:34,585 --> 00:21:36,879 అతను ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. 156 00:21:37,714 --> 00:21:39,924 హలో. అవును. 157 00:21:40,008 --> 00:21:41,509 నువ్వు మంచి పిల్లవాడివి. 158 00:21:53,563 --> 00:21:56,190 కొత్త మనిషికి స్వాగతం 159 00:22:42,278 --> 00:22:43,362 నీ పేరు ఏమిటి? 160 00:23:14,644 --> 00:23:15,561 ఆలిస్. 161 00:23:33,579 --> 00:23:36,749 పంపినవారికి తిప్పిపంపండి 162 00:24:09,699 --> 00:24:10,825 దొబ్బెయ్. 163 00:24:43,858 --> 00:24:46,777 -అదిగో వచ్చింది. ఎలా ఉన్నావు? -అవును, బాగున్నాను. 164 00:24:47,278 --> 00:24:50,573 అతనికి ఇల్లు గుర్తు వస్తున్నట్లుంది. ఎప్పుడూ బయటకు రాలేదు. 165 00:24:51,115 --> 00:24:54,243 అవును, చాలా మంది మనుషులను కలుస్తాడు. కానీ అలవాటవుతుంది. 166 00:24:54,327 --> 00:24:57,580 -కూర్చుంటావా? -లేదు. నాకు నా ఫోన్ కావాలి. 167 00:24:58,122 --> 00:25:00,958 కొన్ని ఫోన్ కాల్‌లు చేయాలి. అతను నాకోసం చూస్తాడు. 168 00:25:01,083 --> 00:25:03,586 సమాచారం నా ద్వారా లేదా ట్విగ్ ద్వారా జరుగుతుంది. 169 00:25:03,753 --> 00:25:07,548 ఎందుకంటే ఈ ప్రదేశం సురక్షితంగా, రహస్యంగా ఉండటానికి, 170 00:25:08,841 --> 00:25:10,760 కనుక నువ్వు దీన్ని మర్చిపోగూడదు. 171 00:25:11,302 --> 00:25:13,763 నీకు చేయాలనిపించినప్పుడు పొలంపనిలో దిగవచ్చు. 172 00:25:13,888 --> 00:25:15,348 సూర్యరశ్మి, శ్రమ. 173 00:25:15,556 --> 00:25:18,643 -నీ జేబులో కొంత డబ్బు పెట్టుకో. -అందరికీ డబ్బు అందిందా? 174 00:25:18,726 --> 00:25:22,271 -అవును. పనిచేస్తే, నీకు డబ్బు ఇస్తాం. -ప్రతి మహిళకూ తన పైకం అవసరం. 175 00:25:22,521 --> 00:25:24,649 -పారిపోవటానికి కావలసిన డబ్బు. -అవును. 176 00:25:25,566 --> 00:25:28,236 రా, కూర్చో, తిను. వాడిని నేను తీసుకుంటాను. 177 00:25:29,487 --> 00:25:30,321 రా. 178 00:25:39,789 --> 00:25:43,292 దీన్ని చూస్తుంటే నా బుల్లి కొడుకు జానీ గుర్తువస్తాడు. 179 00:25:44,877 --> 00:25:48,798 వాడికి నీలాగే పెద్ద కళ్ళు ఉంటాయి. పెద్ద మనసు. 180 00:25:51,300 --> 00:25:55,680 ఇంకా, అది నా కూతురు నీనా లాంటిది. అందంగా, బలంగా ఉంటుంది. 181 00:25:56,097 --> 00:26:00,268 దిగులుగా ఉన్నప్పుడు, వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు, ఇక్కడకొచ్చి వీటిని చూస్తాను. 182 00:26:01,060 --> 00:26:02,186 అవి అందంగా ఉన్నాయి కదా. 183 00:26:13,281 --> 00:26:16,284 తెలియదు. వాళ్ళను నా నుంచి తీసుకెళ్ళారు. 184 00:26:18,452 --> 00:26:21,455 ఎందుకంటే నేను నల్ల మహిళను, చిన్నగా ఉన్నాను, పేదదాన్ని. 185 00:26:22,873 --> 00:26:25,001 వాళ్ళు ఈ దేశంలో అలాగే చేస్తారు. 186 00:26:28,921 --> 00:26:29,755 ధన్యవాదాలు. 187 00:26:34,135 --> 00:26:37,555 ఈ చిన్న మొక్కలు చూశావా? అవి నీ కుటుంబంకోసం. 188 00:26:38,639 --> 00:26:41,767 అది మీ నాన్న కోసం. అది మీ అమ్మకోసం. 189 00:26:42,518 --> 00:26:46,522 అది నీ తమ్ముడికోసం. 190 00:27:22,224 --> 00:27:23,893 నాకు చాలా బాధగా ఉంది, పాపా. 191 00:27:37,365 --> 00:27:39,033 అది నీ తప్పు కాదు, బుజ్జీ. 192 00:28:47,435 --> 00:28:49,061 -బాగుంది, దీనా! -అవును. 193 00:28:49,311 --> 00:28:50,396 ఓహ్, భగవాన్. 194 00:28:52,273 --> 00:28:54,984 -మంచి అమ్మాయి. -నేను తోలానని నాకు నమ్మకం కలగటంలేదు. 195 00:28:57,820 --> 00:28:58,737 మంచి అమ్మాయి. 196 00:28:58,821 --> 00:29:01,449 ఆడవాళ్ళు అందరూ డ్రైవ్ చేయటం నేర్చుకోవాలి. 197 00:29:01,657 --> 00:29:02,908 -ఆమెన్. -అవును. 198 00:29:05,077 --> 00:29:07,621 ఆలిస్, తర్వాత నువ్వే. 199 00:29:09,540 --> 00:29:11,333 రా. లేచి ఇక్కడకు రా. 200 00:29:13,043 --> 00:29:15,296 -ఇంతకంటే మంచి సమయం లేదు. -అంతే. 201 00:29:17,965 --> 00:29:19,758 నువ్వు నాకంటే దారుణంగా ఏమీ నడపవు. 202 00:29:20,259 --> 00:29:23,429 -ఓహ్, దేవుడా. చూడలేను. -తోలగలవు, ఆలిస్. నువ్వు చేయగలవు. 203 00:29:27,933 --> 00:29:28,976 వెళ్లు, ఆలిస్! 204 00:29:32,938 --> 00:29:33,856 వెళ్లు, ఆలిస్. 205 00:29:34,565 --> 00:29:36,025 మెల్లగా. 206 00:29:37,943 --> 00:29:41,238 మార్చు... బాగుంది. బాగుంది. అంతే. 207 00:29:41,322 --> 00:29:43,324 క్లచ్‌ను బాగా నొక్కు. 208 00:29:44,158 --> 00:29:47,995 దాన్ని రెండులోకి మార్చు. చాలా బాగుంది. అబ్బా. 209 00:29:48,245 --> 00:29:52,333 క్లచ్ పైనుంచి కాలు మెల్లగా తీసి యాక్సిలరేటర్ తొక్కు. 210 00:29:52,416 --> 00:29:54,335 మెల్లగా. మెల్లగా. 211 00:29:57,463 --> 00:29:59,465 బాగుంది. క్లచ్‌ను తొక్కుతూ ఉండకు. 212 00:30:01,175 --> 00:30:03,802 చాలా బాగుంది. వాళ్ళు మనల్ని చూడటం బాగుంది. 213 00:30:09,850 --> 00:30:10,684 వచ్చెయ్. 214 00:30:17,066 --> 00:30:19,026 అవును. ఆమెను చూడండి. 215 00:30:19,485 --> 00:30:20,945 మంచి అమ్మాయి, ఆలిస్. 216 00:30:26,825 --> 00:30:28,202 బాగున్నావా, ఆలిస్? 217 00:30:29,495 --> 00:30:31,372 మమ్మల్ని పట్టణానికి తీసుకెళ్ళగలవు. 218 00:30:48,973 --> 00:30:49,848 అంతా బాగుందా? 219 00:30:50,516 --> 00:30:51,350 బాగుంది. 220 00:30:52,560 --> 00:30:55,396 వద్దు, ధన్యవాదాలు. నేను వెళ్ళి పడుకోవాలి. 221 00:30:57,064 --> 00:30:57,898 సరే. 222 00:31:00,109 --> 00:31:04,738 హేయ్, ఈ చుట్టుపక్కల థోర్న్‌ఫీల్డ్ అనే ఊరు ఉందా? 223 00:31:05,614 --> 00:31:07,533 అది ఒక పువ్వుల తోట. 224 00:31:12,371 --> 00:31:13,414 మీరు బాగున్నారా? 225 00:31:14,748 --> 00:31:17,251 బాగున్నాను. ఎందుకు ఉండను? 226 00:31:21,547 --> 00:31:23,215 అక్కడకు జనాన్ని వెళ్ళనీయరు. 227 00:31:26,135 --> 00:31:28,470 నాకు జూన్ హార్ట్ కొద్దిగా పరిచయం ఉంది. 228 00:31:30,222 --> 00:31:34,184 కొంతకాలం క్రితం ఆమె మనుమరాలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మేము కలుసుకున్నాము. 229 00:31:36,729 --> 00:31:40,774 -ఆలిస్? -ఆలిస్, అవును. నీకు ఆమె తెలుసా? 230 00:31:46,488 --> 00:31:48,198 బహుశా ముందు కాల్ చేయటం మంచిది. 231 00:31:50,534 --> 00:31:51,493 ఓగీ. 232 00:32:08,510 --> 00:32:09,637 రాయల్ జార్జ్ ఆసుపత్రి 233 00:32:09,720 --> 00:32:14,016 పరవాలేదు. రేపు పూలను బయటకు తీసుకెళతాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. 234 00:32:17,895 --> 00:32:22,107 హేయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు, నా వ్యాపార ఖాతానుంచి కొంత డబ్బు పోయింది. 235 00:32:23,567 --> 00:32:25,402 -పదివేలు. -అవును, నేను తీసుకున్నాను. 236 00:32:26,070 --> 00:32:30,115 ఆలిస్ కోసం అవసరం పడితే ఉంటాడని ఒక న్యాయవాదిని పెట్టుకున్నాను. 237 00:32:32,117 --> 00:32:33,035 ధన్యవాదాలు. 238 00:32:38,415 --> 00:32:39,541 ఎక్కువగా మేలుకోవద్దు. 239 00:33:45,816 --> 00:33:47,484 ఎవరో వచ్చినట్లున్నారు. 240 00:34:21,226 --> 00:34:22,186 భగవాన్. 241 00:34:22,895 --> 00:34:24,353 నీకు ఏం కావాలి, శాలీ? 242 00:34:25,022 --> 00:34:29,943 మిమ్మల్ని సంప్రదించటానికి ఏ మార్గమూ లేకపోవటంతో నేను ఇక్కడకు... 243 00:34:30,027 --> 00:34:32,362 -ఊరికే ప్రయత్నిస్తున్నాను... నేను... -హ్యారీ. 244 00:34:37,034 --> 00:34:38,202 నీకు ఇక్కడ ఏమి కావాలి? 245 00:34:41,371 --> 00:34:44,248 -ఆలిస్‌ను చూడాలి. -అది జరగని పని. 246 00:34:45,626 --> 00:34:48,795 ఎందుకు? కేవలం ఆమె బాగుందో, లేదో చూడాలి. 247 00:34:49,505 --> 00:34:52,132 ఆమె పుట్టినరోజు రాబోతోంది. ఆమెకు ఒక కానుక తెచ్చాను. 248 00:34:52,507 --> 00:34:53,634 నువ్వు వెళ్ళిపోవాలి. 249 00:34:55,969 --> 00:34:57,721 ఆమె ఏమైనా మాట్లాడుతోందా? 250 00:34:59,973 --> 00:35:00,974 అది ఒక విషాదం. 251 00:35:01,975 --> 00:35:05,145 -ఆమె తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. -లేదు, కోల్పోలేదు. 252 00:35:15,781 --> 00:35:17,991 ఇక్కడనుంచి వెళ్ళిపోవటానికి నీకు ఏమి కావాలి? 253 00:35:18,450 --> 00:35:20,661 నాకు ఏమీ అక్కరలేదు. 254 00:35:22,037 --> 00:35:26,750 ఆమె మంచిగా ఉండటమే నాకు కావలసింది, తనతో మాట్లాడేదాకా ఇక్కడనుంచి వెళ్ళను. 255 00:35:55,320 --> 00:35:56,321 నీకు ఏం కనబడుతోంది? 256 00:35:58,866 --> 00:35:59,700 పువ్వులు. 257 00:36:02,744 --> 00:36:05,664 ఆడవాళ్ళు. కేవలం ఆడవాళ్ళు. 258 00:36:08,917 --> 00:36:10,669 థోర్న్‌ఫీల్డ్ ఒక పూలతోట, 259 00:36:11,587 --> 00:36:15,424 ఆడవాళ్ళు ఇక్కడకు వచ్చి కోలుకోవటానికి కూడా ఇది ఒక సురక్షిత ప్రదేశం. 260 00:36:18,176 --> 00:36:19,386 ఇది ఒక ఆశ్రయం. 261 00:36:21,054 --> 00:36:26,184 పోలీసులు, న్యాయవాదులతో నువ్వు చేస్తున్న గొడవతో ఇదంతా ప్రమాదంలో పడింది. 262 00:36:27,936 --> 00:36:29,229 ఇక్కడి ప్రతి మహిళకు కూడా. 263 00:36:30,939 --> 00:36:33,275 అడవి పూలు వికసించే చోటు 264 00:36:35,652 --> 00:36:39,406 మాకు ఆలిస్ అంటే ఇష్టం. మేము ఆమెను చూసుకుంటున్నాము. 265 00:36:40,699 --> 00:36:41,992 ఇక్కడ మేము చేసేది అదే. 266 00:36:44,202 --> 00:36:50,167 ఇప్పుడు నువ్వు దీన్ని, ఆలిస్‌ను నీ అవసరాల కోసం చెడగొట్టాలని చూస్తున్నావా? 267 00:36:53,253 --> 00:36:57,424 ఆ వీలునామాలో మనం ఇద్దరం ఉన్నాం. ఆగ్నెస్ నన్ను నమ్మింది. 268 00:36:59,509 --> 00:37:03,180 నువ్వు చేస్తున్నదాన్ని గౌరవిస్తాను, కానీ దెబ్బతిన్న, బాధపడుతున్న 269 00:37:03,263 --> 00:37:08,435 ఆడవాళ్ళతో నిండిన ఈ చోటు ఆమెకు సరైన ప్రదేశమని అనుకుంటున్నావా? 270 00:37:13,982 --> 00:37:16,360 బహుశా ఆమెకు ఏమి కావాలో ఆలిస్‌నే మనం అడగాలి. 271 00:37:16,818 --> 00:37:20,072 నిన్ను కాదు, నన్ను కాదు, ఆలిస్‌ను అడగాలి. 272 00:37:37,673 --> 00:37:38,548 ఆలిస్. 273 00:37:41,176 --> 00:37:42,010 హాయ్. 274 00:37:43,261 --> 00:37:45,013 నిన్ను చూడటం సంతోషంగా ఉంది. 275 00:37:46,348 --> 00:37:49,559 పరవాలేదు. మీ నానమ్మ, నేను ఊరికే నీతో మాట్లాడటానికి వచ్చాం. 276 00:37:51,061 --> 00:37:54,982 అంతా బాగానే ఉంది. నువ్వు ఇక్కడ బాగున్నావా లేదా అనేది చూడాలని అనుకున్నాం. 277 00:38:00,946 --> 00:38:01,989 పరవాలేదు. 278 00:38:02,364 --> 00:38:03,782 నిన్ను భయపెట్టటానికి రాలేదు. 279 00:39:41,963 --> 00:39:44,841 నిజం కానిదాని వెంట నేను పరిగెడుతున్నాను. 280 00:39:47,719 --> 00:39:50,472 జెమ్మా. ఆలిస్. 281 00:39:55,310 --> 00:39:56,937 నేను మొత్తం చెడగొట్టాను. 282 00:40:00,440 --> 00:40:01,274 జాన్. 283 00:40:04,653 --> 00:40:08,949 నేను నిన్ను పొగొట్టుకోలేను. నేను నిన్ను పొగొట్టుకోలేను. 284 00:40:30,846 --> 00:40:31,763 ఆలిస్. 285 00:40:42,232 --> 00:40:43,358 జన్మదిన శుభాకాంక్షలు. 286 00:40:51,908 --> 00:40:54,911 జాషీ, అతని తండ్రి గురించి ఏదో చెప్పింది... ఇదిగో వచ్చింది. 287 00:40:56,037 --> 00:40:57,956 జన్మదిన శుభాకాంక్షలు, ఆలిస్. 288 00:40:58,999 --> 00:41:00,542 జన్మదిన శుభాకాంక్షలు, బంగారం. 289 00:41:03,670 --> 00:41:04,504 ఇదిగో. 290 00:41:07,841 --> 00:41:09,342 జన్మదిన శుభాకాంక్షలు, ఆలిస్. 291 00:41:18,935 --> 00:41:21,730 ఏమయింది? 292 00:41:49,925 --> 00:41:53,011 జాషీని తీసుకుని ఇంటికి వెళ్ళాలని దీనా నిర్ణయించుకుంది. 293 00:41:54,179 --> 00:41:58,475 మనం ఆమెను నిందించకూడదు. జాషీకి తండ్రి అవసరం ఉందని ఆమె అనుకుంటోంది. 294 00:42:03,813 --> 00:42:04,689 ఆలిస్. 295 00:42:26,503 --> 00:42:27,379 ఆలిస్. 296 00:42:53,947 --> 00:42:54,781 అమ్మా. 297 00:42:55,824 --> 00:42:56,992 అమ్మా. 298 00:42:58,827 --> 00:43:01,079 నన్ను మన్నించు, ఆలిస్. 299 00:43:12,215 --> 00:43:13,383 ఇప్పుడు నేను వచ్చాను. 300 00:43:33,320 --> 00:43:34,362 హలో? 301 00:43:37,991 --> 00:43:38,950 ఒక్క సెకను. 302 00:43:40,118 --> 00:43:43,955 జూన్, ఆసుపత్రినుంచి ఎవరో ఫోన్ చేశారు. అత్యవసరమని చెప్పారు. 303 00:43:45,582 --> 00:43:47,000 అబ్బ. దీనా. 304 00:43:53,298 --> 00:43:54,299 జూన్ హార్ట్. 305 00:44:00,930 --> 00:44:02,098 ఒక్క సెకను ఉండండి. 306 00:44:04,100 --> 00:44:07,395 అది దీనా గురించి కాదు. ఆలిస్ వైద్యుడు. 307 00:44:07,937 --> 00:44:08,772 సరే. 308 00:44:14,527 --> 00:44:16,738 -మన్నించండి. -పరవాలేదు. 309 00:44:16,821 --> 00:44:20,784 మీకు మాట ఇచ్చినట్లు, మీ మనుమడి ఆపరేషన్ గురించి చెప్పాలని ఫోన్ చేశాను. 310 00:44:20,909 --> 00:44:24,037 అది బాగా జరిగింది. అతను ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. 311 00:44:24,120 --> 00:44:25,830 ప్రధాన అవయవాలన్నీ బలంగా ఉన్నాయి. 312 00:44:26,122 --> 00:44:28,416 అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు, 313 00:44:28,500 --> 00:44:30,752 కానీ అతన్ని ఇంటికి తీసుకెళ్ళవచ్చు. 314 00:44:31,419 --> 00:44:32,337 అలాగా. 315 00:44:32,629 --> 00:44:35,006 అతనికి ఇప్పుడు కావలసింది కుటుంబంతో ఉండటం. 316 00:44:35,673 --> 00:44:39,677 ఏదైనా తదుపరి చికిత్స అవసరమైతే, మీ స్థానిక ఆసుపత్రికి మేము సహకరిస్తాము. 317 00:44:42,972 --> 00:44:46,101 నేను ఏర్పాట్లు చేస్తాను. ధన్యవాదాలు. 318 00:45:46,161 --> 00:45:47,162 బాగుంది. 319 00:45:58,673 --> 00:46:02,969 సరే, అది అంత బాగాలేదు, కానీ పెద్దవాళ్ళు ఇష్టపడతారు. 320 00:46:13,980 --> 00:46:15,190 ద లిటిల్ మెర్మెయిడ్ 321 00:46:16,024 --> 00:46:19,194 ఇది సముద్రం నుంచి వచ్చే ఒక అమ్మాయి గొంతు కోల్పోవటం గురించి. 322 00:46:25,408 --> 00:46:26,284 ధన్యవాదాలు. 323 00:46:30,830 --> 00:46:32,499 నీ నోట్లోంచి ఇప్పుడు మాటలొచ్చాయి. 324 00:46:35,043 --> 00:46:36,211 ఇంకా ఏదైనా చెప్పు. 325 00:46:39,672 --> 00:46:40,715 ఇంకా ఏదైనా. 326 00:46:57,148 --> 00:46:58,525 ఒక కోరిక కోరుకో, బంగారం. 327 00:47:05,240 --> 00:47:07,575 -హిప్-హిప్... -...హుర్రే! 328 00:47:07,659 --> 00:47:09,494 -హిప్-హిప్... -...హుర్రే! 329 00:47:09,577 --> 00:47:11,829 -హిప్-హిప్... -...హుర్రే! 330 00:47:16,251 --> 00:47:19,671 -ధన్యవాదాలు. -ఆలిస్, నువ్వు మాట్లాడావు. 331 00:47:20,505 --> 00:47:24,842 -అవును, మాట్లాడాను. -నీకు గొంతు ఉంది. ఎలాంటి గొంతు. 332 00:47:24,926 --> 00:47:26,511 -నా పేరు చెప్పు. -బూ. 333 00:47:27,136 --> 00:47:28,096 అవును. 334 00:47:30,807 --> 00:47:33,101 -మంచి అమ్మాయి. -నా పేరు చెప్పు. స్టెల్లా. 335 00:47:33,184 --> 00:47:35,687 -స్టెల్లా. -అవును. నువ్వు సాధించావు. 336 00:47:36,437 --> 00:47:39,107 -ఓహ్, భగవాన్. అద్భుతం. -హలో. 337 00:47:40,608 --> 00:47:43,528 -మనం కేక్ తిందామా? -అలాగే. 338 00:48:09,971 --> 00:48:11,055 నన్ను మన్నించు. 339 00:48:14,017 --> 00:48:15,101 అన్నింటికీ. 340 00:48:16,978 --> 00:48:17,937 నాకు తెలుసు. 341 00:48:21,441 --> 00:48:22,567 బాధపడుతున్నావు అని. 342 00:48:33,411 --> 00:48:34,662 నేను ఆలోచిస్తున్నాను. 343 00:48:39,000 --> 00:48:40,168 జెమ్ గుర్తుకొస్తోంది. 344 00:48:42,712 --> 00:48:45,298 కానీ, నాన్నను కాలేకపోయానని అనిపిస్తుంది. 345 00:48:48,092 --> 00:48:49,302 ఒక కుటుంబంగా ఉండటం. 346 00:48:54,557 --> 00:48:56,059 మనకు మించిపోయిందేమీ లేదు. 347 00:49:00,647 --> 00:49:01,898 ఇక అబద్ధాలు వద్దు. 348 00:49:04,901 --> 00:49:06,527 అలా అయితేనే ఇది నడుస్తుంది. 349 00:49:13,076 --> 00:49:14,202 ఇక అబద్ధాలు వద్దు. 350 00:49:17,914 --> 00:49:21,626 వాళ్ళు ప్రేమించుకుంటున్నారని చెప్పావు. ఇక్కడ సంతోషంగా ఉండేవారు అని. 351 00:49:23,086 --> 00:49:23,920 ఉండేవారు. 352 00:49:24,962 --> 00:49:28,758 థోర్న్‌ఫీల్డ్‌లో భవిష్యత్తు గురించి మీ నాన్న ప్రణాళికలు వేసేవాడు. 353 00:49:30,051 --> 00:49:35,139 పొలం మన కుటుంబంలో ఆడవారికి మాత్రమే చెందుతుందని నేను అతనికి గుర్తుచేశాను. 354 00:49:37,308 --> 00:49:40,853 దాన్ని అతను ఇష్టపడలేదు. మేము వాదించుకున్నాము. 355 00:49:42,397 --> 00:49:44,357 అప్పుడు మీ అమ్మను తీసుకుని వెళ్ళాడు. 356 00:49:45,733 --> 00:49:46,818 ఎందుకు అలా ఉండేవాడు? 357 00:49:48,778 --> 00:49:53,157 నాకు తెలియదు. చిన్నప్పుడు, అతను సున్నితంగా, దయగా ఉండేవాడు, 358 00:49:53,658 --> 00:49:56,828 తన చేతులతో అద్భుతమైన వస్తువులు సృష్టించేవాడు, 359 00:49:59,288 --> 00:50:03,626 కానీ తర్వాత అతనిలో ఒక రకమైన చెడు మార్పును నేను గమనించాను. 360 00:50:04,127 --> 00:50:09,257 -అది అతని తండ్రినుంచి వచ్చి ఉండొచ్చేమో. -దొంగ జమీందారా? నువ్వు అతన్ని ప్రేమించావు. 361 00:50:12,301 --> 00:50:16,723 అతనిలో ఆ చెడు మార్పు గమనించినప్పుడు, మమ్మల్ని వెతకటానికి ఎందుకు ప్రయత్నించలేదు? 362 00:50:16,806 --> 00:50:18,975 నేను ప్రయత్నించాను, ఎన్నో సార్లు. 363 00:50:19,892 --> 00:50:21,853 కానీ, వాళ్ళు ఆ రోజు మాయమైపోయారు. 364 00:50:23,187 --> 00:50:28,401 ఆ తర్వాత ఒక్కసారి మాత్రం వాళ్ళనుంచి కబురు వచ్చింది. నువ్వు పుట్టినప్పుడు. 365 00:50:30,653 --> 00:50:35,575 అతను మాకు నువ్వు చిన్నగా ఉన్న శిల్పాన్ని పంపాడు, 366 00:50:36,826 --> 00:50:38,119 దానిపై నీ పేరు ఉంది. 367 00:50:41,831 --> 00:50:43,374 మమ్మల్ని కొడుతున్నాడని తెలుసా? 368 00:50:44,667 --> 00:50:47,086 లేదు. మిమ్మల్ని రక్షించలేకపోవటం అనేది 369 00:50:48,838 --> 00:50:51,716 నా జీవితమంతా నేను పశ్చాత్తాపపడే విషయం. 370 00:50:54,260 --> 00:50:56,471 ఓగీ ఇంకా అక్కడే ఉన్నట్లున్నాడు. 371 00:50:57,472 --> 00:50:59,098 రా. అతన్ని వెతుకుదాం. 372 00:51:01,934 --> 00:51:02,769 పద. 373 00:51:10,568 --> 00:51:13,070 ఆమెకు మిగతాది చెప్పటానికి చాలా సమయం ఉంది. 374 00:51:14,697 --> 00:51:15,698 తర్వాత. 375 00:52:18,803 --> 00:52:22,473 ఎవరూ మనను అర్థం చేసుకోరు. అది నీకు తెలుసు, కదా? 376 00:52:25,726 --> 00:52:29,021 నువ్వు, నేను, మనల్ని ఎవరూ విడదీయలేరు. 377 00:53:11,105 --> 00:53:15,026 తర్వాత నా పేరు. దాన్ని చెట్టుపై చెక్కుతావా, నా కోసం, ఓగీ? 378 00:54:05,910 --> 00:54:07,870 సార్జంట్ జాన్ మోర్గన్‌తో మాట్లాడాలి. 379 00:54:09,580 --> 00:54:12,166 అవును, ఇది అత్యవసరమైన పని. 380 00:56:15,164 --> 00:56:17,166 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 381 00:56:17,249 --> 00:56:19,251 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి