1 00:00:07,799 --> 00:00:10,010 (జపనీస్ లో) చరిత్ర చక్రం అంటే అదే. 2 00:00:10,886 --> 00:00:13,555 కారణానికి, ఫలితానికి అనాదికాలంగా ఉన్న బంధం. 3 00:00:15,224 --> 00:00:17,935 దాని గురించి ఆలోచిస్తేనే తలనొప్పి వస్తుంది. 4 00:00:19,978 --> 00:00:22,022 టాల్స్టాయ్ కూడా ఆ విషయాన్ని అలాగే చూసాడు. 5 00:00:22,606 --> 00:00:24,983 ఆ కాల చక్రం సామాన్య వ్యక్తి కష్టం కారణంగానే తిరుగుతోందని 6 00:00:24,983 --> 00:00:26,944 ఆయన అర్థం చేసుకున్నాడు. 7 00:00:27,611 --> 00:00:29,613 అందుకే ఈ నవల అంత విప్లవాత్మకం అయింది. 8 00:00:29,613 --> 00:00:31,823 అతను నిజమే చెప్పాడు. 9 00:00:34,618 --> 00:00:36,578 బందో బాబు, ఈ పుస్తకంపై నీ అభిప్రాయం ఏంటి? 10 00:00:37,454 --> 00:00:38,539 నువ్వు ఆమెతో ఏకిభవిస్తావా? 11 00:00:43,043 --> 00:00:47,464 టాల్స్టాయ్ రచన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యాన్ని వ్యక్తపరచడమే అని ఒప్పుకుంటాను. 12 00:00:48,131 --> 00:00:54,179 కాకపోతే, రచనలో దానికి న్యాయం చేయలేకపోయాడు. 13 00:00:54,763 --> 00:00:57,933 నకజోనో-సాన్ అది గ్రహించలేకపోతుంది. 14 00:01:00,143 --> 00:01:01,603 నవల చదివితే, 15 00:01:01,603 --> 00:01:05,524 అందులో ఉన్న పాత్రలన్నీ ధనికులను, వారి ప్రపంచానికి దగ్గరగా ఉన్న వారినే సూచిస్తాయి. 16 00:01:06,233 --> 00:01:08,110 కానీ నిజమైన మానవ అనుభవం ఎలాంటిది 17 00:01:08,819 --> 00:01:12,114 అనే విషయాన్ని చూపగల పాత్రలే లేవు. 18 00:01:12,114 --> 00:01:14,950 ఈ రూమ్ లో ఉన్న వారిలా కేవలం ప్రత్యేక స్థాయి ఉన్న వారి దృక్కోణంలో కాకుండా 19 00:01:14,950 --> 00:01:16,910 నిజమైన ప్రపంచంలో ఉన్న వారు 20 00:01:16,910 --> 00:01:21,498 ఎదుర్కొనే కష్టాలను మనకు చూపించగల 21 00:01:21,498 --> 00:01:24,585 పాత్రలు ఏమీ అందులో లేవు. 22 00:01:26,837 --> 00:01:29,631 నిజమే, ఇది మంచి నేపథ్యమే, 23 00:01:29,631 --> 00:01:33,051 కానీ దురదృష్టవశాత్తు దానికి న్యాయం చేయలేకపోయాడు. 24 00:01:33,635 --> 00:01:36,930 నా దృష్టిలో అయితే, 25 00:01:36,930 --> 00:01:40,976 ఈ పుస్తకం విఫలమైంది. 26 00:01:43,896 --> 00:01:45,856 బాగా చెప్పావు, బందో బాబు. 27 00:01:45,856 --> 00:01:49,234 నువ్వు మరొకసారి ఆ వ్రాత వెనుకున్న అసలు విషయాన్ని కనిపెట్టావు. 28 00:01:49,860 --> 00:01:51,987 మీ మిగతావారు వీడిని చూసి నేర్చుకుంటే మంచిది. 29 00:01:52,696 --> 00:01:56,491 సరే, ఇక తొమ్మిదవ పుస్తకాన్ని చూద్దాం. 30 00:02:03,165 --> 00:02:05,167 ఒక ఏడాది తర్వాత 31 00:02:08,836 --> 00:02:11,131 టోక్యో 1951 32 00:02:17,095 --> 00:02:18,639 మనం ఇక్కడ ఇలా చేయకూడదు. 33 00:02:18,639 --> 00:02:19,890 ఎవరొకరు చూస్తారు. 34 00:02:19,890 --> 00:02:22,768 నేను లెక్క చేయను. చూస్తే చూడనివ్వు. 35 00:02:29,983 --> 00:02:31,610 కానీ నేను క్లాసుకు వెళ్ళాలి. 36 00:04:05,120 --> 00:04:07,372 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 37 00:04:39,029 --> 00:04:40,322 త్వరగా, మోజసు. 38 00:04:41,907 --> 00:04:43,909 ఇది చూడు. 39 00:04:43,909 --> 00:04:45,994 చూడు, ఇది పని చేస్తోంది! నువ్వు సాధించావు! 40 00:04:52,334 --> 00:04:54,670 - అస్సలు కష్టం కాదు. - ఇది చాలా ఈజీ. 41 00:04:57,631 --> 00:05:00,551 ఇంకొన్ని వస్తే చాలు. కానివ్వు. 42 00:05:19,444 --> 00:05:20,445 అది ఇవ్వండి. 43 00:05:24,867 --> 00:05:28,036 నువ్వు నిజంగానే దొరకను అనుకున్నావా? 44 00:05:29,705 --> 00:05:30,706 గోటో గారు... 45 00:05:32,332 --> 00:05:34,084 మీరు ఇక్కడ ఉంటారని నేను అనుకోలేదు. 46 00:05:34,084 --> 00:05:36,295 - నేను గురువారాలు మీరు... - నోరు ముయ్! 47 00:05:36,879 --> 00:05:38,046 చెప్పేది జాగ్రత్తగా విను. 48 00:05:39,173 --> 00:05:41,884 నాకు మీ అమ్మ నూడిల్స్ అంటే చాలా ఇష్టం అన్న ఒకే ఒక్క కారణంగా, 49 00:05:43,218 --> 00:05:45,304 నేను నిన్ను వదులుతున్నాను. 50 00:05:47,598 --> 00:05:48,640 నాతో రా. 51 00:05:51,727 --> 00:05:53,395 (కొరియన్ లో) నువ్వు నిజంగానే అంత పని చేసావా? 52 00:05:53,395 --> 00:05:54,771 నన్ను చూడు. 53 00:05:56,190 --> 00:05:57,357 నన్ను క్షమించు. 54 00:06:01,361 --> 00:06:02,863 వీడిని దండిస్తాను. 55 00:06:02,863 --> 00:06:04,489 మీకు నా మాట ఇస్తున్నాను. 56 00:06:04,489 --> 00:06:06,074 మీ నష్టాలకు నేను చెల్లిస్తాను. 57 00:06:06,074 --> 00:06:07,534 వీడికి శిక్ష వేయడం... 58 00:06:07,534 --> 00:06:09,161 అది చేసి ఏం లాభం ఉంటుంది? 59 00:06:10,162 --> 00:06:11,330 తర్వాత ఏం జరుగుతుంది? 60 00:06:12,289 --> 00:06:14,291 మేము వీడిని ఇంకా జాగ్రత్తగా గమనిస్తూ, 61 00:06:14,791 --> 00:06:16,168 ఖచ్చితంగా స్కూల్ కి వెళ్లేలా చూసుకుంటాం... 62 00:06:16,168 --> 00:06:18,879 ఆ స్కూల్ పుస్తకాలు వీడికి పనికిరావు. 63 00:06:22,508 --> 00:06:26,094 కానీ వీడు స్కూల్ కి వెళ్ళాలి కదా. 64 00:06:27,346 --> 00:06:29,890 అంతకు మించి ఇంకేం చేయగలడు? 65 00:06:36,980 --> 00:06:38,941 వీడిని నాకు పని చేయనివ్వండి. 66 00:06:38,941 --> 00:06:40,317 పార్లర్ లో. 67 00:06:41,485 --> 00:06:43,111 అది నిజాయితీగా చేసే పని. 68 00:06:44,780 --> 00:06:46,990 అలాగే అక్కడ వీడు ఎలాంటి సమస్యల్లో పడడు. 69 00:06:46,990 --> 00:06:48,659 అలా చూసుకునే బాధ్యత నాది. 70 00:06:50,285 --> 00:06:52,246 వీడు చాలా చిన్నోడు. 71 00:06:52,246 --> 00:06:55,207 నువ్వు నేను చెప్పేది వినడం లేదు, బందో-సాన్. 72 00:06:56,166 --> 00:06:57,751 వీడు వీడి అన్న లాంటి వాడు కాదు. 73 00:07:32,369 --> 00:07:35,706 లోన్ చెల్లింపు పూర్తి నోటీసు 74 00:07:35,706 --> 00:07:41,003 నాకు నా లోన్ ని పూర్తిగా చెల్లించినట్టు చెప్తున్న ఒక లెటర్ వచ్చింది. 75 00:07:41,545 --> 00:07:43,297 ఏదో పొరపాటు జరిగినట్టు ఉంది. 76 00:07:43,297 --> 00:07:46,508 ఇక్కడ ఆ పేమెంట్ చేసినట్టు కనిపిస్తోంది. 77 00:07:47,301 --> 00:07:49,928 బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు, పూర్తి మొత్తం మూడు రోజుల క్రితమే జమ చేయబడింది. 78 00:07:51,305 --> 00:07:52,431 కానీ... 79 00:07:53,307 --> 00:07:55,267 ఆ పేమెంట్ ఎవరు చేసారో చూడగలరా? 80 00:07:55,267 --> 00:08:00,147 చూస్తుంటే ఇది టోక్యో నుండి చేసినట్టు తెలుస్తోంది. 81 00:08:00,689 --> 00:08:03,358 సోలొమన్ బెయిక్. ఆ అకౌంట్ హోల్డర్ పేరు. 82 00:08:06,153 --> 00:08:08,238 నిజంగానా? 83 00:08:08,780 --> 00:08:10,782 అవును. 84 00:08:13,285 --> 00:08:14,453 అర్థమైంది. 85 00:08:15,370 --> 00:08:16,413 థాంక్స్. 86 00:08:16,413 --> 00:08:18,373 మీ రోజును ఎంజాయ్ చేయండి. 87 00:08:24,505 --> 00:08:27,925 ఆ పచింకో పార్లర్ లో ఎలాంటి పనులు జరుగుతాయో ఎవరికి తెలుసు? 88 00:08:30,636 --> 00:08:33,138 నాకు కూడా నీలాగే భయంగా ఉంది. 89 00:08:33,972 --> 00:08:38,434 కానీ గోటో గారు నాకు మాట ఇచ్చారు. 90 00:08:44,942 --> 00:08:46,568 ఆయన మన కుటుంబస్తుడు కాదు. 91 00:08:47,861 --> 00:08:50,405 అతను మోజసుని సొంత బిడ్డలా చూసుకోడు. 92 00:08:53,242 --> 00:08:54,743 మరి మనం ఇంకేం చేయాలి? 93 00:08:55,536 --> 00:08:59,540 వాడు కూడా నోవాలాగ చదువుతాడు అని నమ్ముతూ మనల్ని మనమే మోసగించుకోవాలా? 94 00:09:10,968 --> 00:09:12,845 యుద్ధం జరిగినన్నాళ్లు మన పరిస్థితి వేరు. 95 00:09:13,762 --> 00:09:16,139 మనం బ్రతకడానికి ఏది వీలయితే అది చేయాల్సి వచ్చింది. 96 00:09:16,139 --> 00:09:17,599 అందరూ అలాగే చేశారు. 97 00:09:18,725 --> 00:09:20,143 కానీ ఇప్పుడు అలా లేదు. 98 00:09:20,143 --> 00:09:23,939 నువ్వు మనం సమస్యల్లో నుండి బయటపడ్డాం అని నిజంగా అనుకుంటున్నావా? 99 00:09:23,939 --> 00:09:26,650 కానీ పచింకోలో తప్ప వేరే చోటే పనిచేయలేడా? 100 00:09:27,526 --> 00:09:30,112 అంతకంటే గౌరవంగా పనిచేయగల ప్రదేశాలు ఇంకా ఉండి ఉంటాయి కదా. 101 00:09:33,448 --> 00:09:36,201 ఇలాంటి మాటలు బావగారు అంటే నేను అర్థం చేసుకోగలను. 102 00:09:36,869 --> 00:09:38,120 నువ్వు ఇలా అంటావని అనుకోలేదు. 103 00:10:00,058 --> 00:10:04,146 {\an8}మిస్టర్ యోసెబ్ బందో గారికి ఒసాకా, జపాన్ 104 00:10:06,023 --> 00:10:10,736 {\an8}మిస్టర్ చాంగో కిమ్ నుండి ప్యోంగ్యాంగ్, కొరియా 105 00:10:38,764 --> 00:10:40,641 నీకు ఆ పుస్తకం నచ్చలేదా? 106 00:10:41,266 --> 00:10:43,894 నాకు నచ్చింది. నా సమస్య అది కాదు. 107 00:10:43,894 --> 00:10:45,312 మరి ఇంకేంటి? 108 00:10:46,146 --> 00:10:49,233 ఆ వేదన గురించి 109 00:10:49,816 --> 00:10:52,152 అలాగే ఆ దిక్కులేని జనం గురించి చదివిన తర్వాత... 110 00:10:54,071 --> 00:10:55,405 నాకు ఆకలి వేస్తుంది. 111 00:10:56,782 --> 00:10:58,116 వినడానికి వింతగా ఉందని నాకు తెలుసు. 112 00:10:58,784 --> 00:11:02,746 కానీ ఇలా ఎందుకు జరుగుతోంది? చాలా ఆకలి వేస్తోంది. 113 00:11:03,997 --> 00:11:05,290 నీకు ఏమనిపిస్తోంది? 114 00:11:08,377 --> 00:11:12,214 నువ్వు ఆ పుస్తకంలో ఉన్న పాత్రల లాంటిదానివి కాదు. 115 00:11:13,507 --> 00:11:15,342 ఆకలితో పడుకోవాలి అని చింతించాల్సిన అవసరం లేదా అలాంటి దయనీయ 116 00:11:15,342 --> 00:11:18,220 స్థితిలో ఉండాలేమో అని ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. 117 00:11:18,929 --> 00:11:22,099 కానీ నీకు అలాంటి స్థితి రాదు అని నిరూపించుకోవడానికి 118 00:11:22,099 --> 00:11:28,021 నీ శరీరం తన కడుపు నింపుకోవాలి అని చూస్తోంది. 119 00:11:30,023 --> 00:11:35,028 కానీ అంత చేసినా, నీ కడుపు పీకల వరకు నిండినా కూడా 120 00:11:35,737 --> 00:11:40,659 ఆ తిండిని నువ్వు ఏమాత్రం రుచి చూడలేదు అని నీకు అనిపిస్తోంది. 121 00:11:41,785 --> 00:11:46,456 ఆ తిండి అంతా, పేపర్ లా ఉంది నీకు. 122 00:11:52,713 --> 00:11:54,089 నన్ను నీ రూమ్ కి తీసుకెళ్ళు. 123 00:11:56,383 --> 00:11:57,384 నాకు నువ్వు ఈ క్షణమే కావాలి. 124 00:12:00,345 --> 00:12:01,346 నన్ను క్షమించు. 125 00:12:03,557 --> 00:12:07,186 నాకు నా వారపు అపాయింట్మెంట్ ఉంది. 126 00:12:09,521 --> 00:12:11,481 ఆహ్, నీ గుర్తుతెలియని శ్రేయోభిలాషి. 127 00:12:12,774 --> 00:12:15,027 ఆయన్ని అలా పిలవకు. 128 00:12:15,027 --> 00:12:17,029 కానీ అది నిజమే, అవునా? 129 00:12:17,029 --> 00:12:19,156 ఆయన నువ్వు ఉండటానికి ఫీజు కడతాడు... 130 00:12:20,115 --> 00:12:24,203 నేను ఇలా మన కోసం చేస్తున్నా. 131 00:12:24,203 --> 00:12:25,746 అందుకే నాకు ఆయన్ని కలవాలని ఉంది. 132 00:12:25,746 --> 00:12:29,666 చెప్పాను కదా, అలా ఎన్నటికీ జరగదు. 133 00:12:29,666 --> 00:12:31,585 కానీ ఆయన్ని కలిస్తే ఏమైపోతుంది? 134 00:12:32,169 --> 00:12:34,213 అతను ఏమైనా ఒక రాక్షసుడా? 135 00:12:38,842 --> 00:12:42,262 మనం కలిసి ఉన్న ఈ కొన్ని నెలలు, 136 00:12:42,262 --> 00:12:45,307 నేను నీకు ఏదైనా కాదు అని చెప్పానా? 137 00:12:46,767 --> 00:12:49,686 - లేదు, కానీ... - అయితే ఈ ఒక్క విషయాన్ని వదిలేయ్. 138 00:12:50,312 --> 00:12:52,523 నేను నిన్ను అడిగే ఒకే ఒక్క విషయం ఇదొక్కటే. 139 00:12:53,148 --> 00:12:56,693 నువ్వు ఆయన్ని కలవడం ఎప్పటికీ కుదరదు. అర్థమవుతుందా? 140 00:13:09,289 --> 00:13:10,624 అయితే నాకు ఒక విషయం మాట ఇవ్వు. 141 00:13:12,417 --> 00:13:16,213 ఇవాళ రాత్రి, నువ్వు ఆ మిస్టరీ వ్యక్తితో ఉండి 142 00:13:16,213 --> 00:13:18,340 ఆ ఖరీదైన భోజనాన్ని తింటున్నప్పుడు, 143 00:13:19,383 --> 00:13:22,219 నువ్వు ప్రతీ ముద్దను పూర్తిగా ఆస్వాదిస్తాను అని మాట ఇవ్వు, 144 00:13:23,095 --> 00:13:25,264 నీ పీకల వరకు నిండేవరకు. 145 00:13:28,016 --> 00:13:29,017 నోవా, 146 00:13:29,893 --> 00:13:34,022 మనిద్దరం, జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం. 147 00:13:45,284 --> 00:13:48,328 నిజమే, మేము ఒక కలను నిర్మిస్తున్నాం. 148 00:13:49,121 --> 00:13:54,710 కానీ మేము ఈ కలను నిజం చేస్తున్నాం. 149 00:13:54,710 --> 00:13:58,547 మెంబెర్షిప్ 500 మందికి మాత్రమే ఇస్తున్నాం, 150 00:13:58,547 --> 00:14:01,133 {\an8}అలాగే 20 నిమిషాల క్రితం చూస్తే, 151 00:14:01,884 --> 00:14:05,637 {\an8}మరొక 47 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. 152 00:14:10,100 --> 00:14:14,980 ఇంకొక 90 రోజులలో పనిని మొదలెట్టబోతున్నాం. 153 00:14:15,606 --> 00:14:19,818 అలాగే వచ్చే ఏడాదికి, మేము గోల్ఫ్ కోర్స్ ని తెరవాలని చూస్తున్నాం. 154 00:14:20,986 --> 00:14:25,240 ఏమండీ. ఇటీవల ఎదురైన లేబర్ కొరతతో మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? 155 00:14:25,240 --> 00:14:26,909 సిటీలో ఎంతో నిర్మాణం జరుగుతుండటంతో, 156 00:14:26,909 --> 00:14:29,745 పనిచేసేవారిని కనిపెట్టడం కష్టం అవుతోంది అని నేను విన్నాను. 157 00:14:30,412 --> 00:14:31,622 మీకు నా హామీ ఇస్తున్నా, 158 00:14:32,581 --> 00:14:36,168 అంతా మా పార్టనర్స్ కంట్రోల్ లోనే ఉంది. 159 00:14:36,168 --> 00:14:40,964 మాకు ఎలాంటి లేబర్ కొరతా ఉండదు. 160 00:14:42,758 --> 00:14:44,343 ప్లీజ్, అడగండి. 161 00:14:45,302 --> 00:14:47,804 రియల్ ఎస్టేట్ రంగం కూలిపోవచ్చు అని కొన్ని పుకార్లు పుడుతున్నాయి. 162 00:14:47,804 --> 00:14:50,682 ఆ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? 163 00:14:59,650 --> 00:15:01,068 {\an8}నా అభిప్రాయమా? 164 00:15:10,577 --> 00:15:12,621 అది భలే తమాషా పుకారు అంటాను. 165 00:15:14,373 --> 00:15:18,335 ఎందుకంటే చరిత్రను తిరగేస్తే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, 166 00:15:20,003 --> 00:15:23,590 ఈ దేశంలో భూమి ధర తగ్గింది లేదు. 167 00:15:24,758 --> 00:15:29,137 టోక్యోలో, రియల్ ఎస్టేటే రారాజు. 168 00:15:30,681 --> 00:15:31,890 అలాగే ఇంకొంత కాలంలో, 169 00:15:31,890 --> 00:15:34,434 జపాన్ ఈ ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను మించి 170 00:15:34,434 --> 00:15:37,479 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 171 00:15:39,189 --> 00:15:40,399 ఒకసారి ఆలోచించి చూడండి. 172 00:15:40,983 --> 00:15:42,943 అమెరికా రెండవ స్థానంలో ఉంటుంది. 173 00:15:43,819 --> 00:15:48,031 కాబట్టి, మనం చింతించాల్సిన అవసరం అసలు ఏమైనా ఉందా? 174 00:15:51,827 --> 00:15:56,456 సరే, ఇక స్పా గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉంది? 175 00:15:58,458 --> 00:16:03,255 దాన్ని అత్యంత నాణ్యమైన ఇటాలియన్ మార్బుల్ తో... 176 00:16:04,006 --> 00:16:07,467 అయితే, ఇక ఎలాంటి సమస్యలు రావు కదా? 177 00:16:07,467 --> 00:16:09,678 మీరు అందించిన ధారాళమైన సహకారం వల్ల, 178 00:16:10,179 --> 00:16:12,181 డైట్ లో మిగిలి ఉన్న సభ్యులు అందరూ ఒప్పుకున్నారు. 179 00:16:12,806 --> 00:16:14,683 ఇక ఎలాంటి సమస్యలు ఉండవు. 180 00:16:15,684 --> 00:16:17,352 చాలా మంచిది. 181 00:16:17,978 --> 00:16:19,146 మరి ధర సంగతి ఏంటి? 182 00:16:19,730 --> 00:16:21,231 నాలుగు కోట్ల యెన్. 183 00:16:21,231 --> 00:16:24,651 ఇది మీరు ఆశించిన ధర కాదని నాకు తెలుసు, 184 00:16:25,444 --> 00:16:26,904 అయినా కూడా అది మంచి బేరమే... 185 00:16:26,904 --> 00:16:27,988 మూడు కోట్ల యెన్. 186 00:16:29,698 --> 00:16:31,074 అంతకంటే వద్దు. 187 00:16:33,410 --> 00:16:34,828 కానీ, కోహ్ గారు... 188 00:16:35,495 --> 00:16:37,289 మీరు చెప్పినంత మాత్రానా, 189 00:16:37,789 --> 00:16:40,375 ఇతర డైట్ సభ్యులను ఒప్పించడం అంత సులభం కాదు. 190 00:16:43,587 --> 00:16:45,214 ఎవరైనా వచ్చేది ఉందా? 191 00:16:45,214 --> 00:16:48,550 అవును. చాలా ముఖ్యమైన అతిథి. 192 00:16:48,550 --> 00:16:49,927 మధ్యలో రావడం నా ఉద్దేశం కాదు. 193 00:16:50,802 --> 00:16:52,304 నేను కింద లాబీలో ఎదురుచూస్తాను. 194 00:16:52,304 --> 00:16:53,597 అదేం పర్లేదు. 195 00:16:54,473 --> 00:16:56,225 నేను మీ ఇద్దరూ కలుసుకోవాలి అనుకున్నా. 196 00:16:56,225 --> 00:16:58,393 వచ్చి మాతో కూర్చో. 197 00:17:00,479 --> 00:17:02,147 ఈయన కురోగానే గారు. 198 00:17:05,025 --> 00:17:07,903 మీరు ఎవరో నాకు తెలుసు. మీ గురించి తరచుగా పేపర్లలో చదువుతుంటా. 199 00:17:08,612 --> 00:17:10,071 నువ్వు చదివే పేపర్ ని బట్టి, 200 00:17:10,656 --> 00:17:13,116 నేను త్వరలో ఈ దేశానికి గొప్ప మేలు చేసేవాడినో 201 00:17:13,742 --> 00:17:16,703 లేదా చెడ్డవాడినో అయ్యుంటాను. 202 00:17:16,703 --> 00:17:18,579 అన్నిచోట్లా మంచిగానే ఉంటుంది, నిజం. 203 00:17:19,455 --> 00:17:21,750 ఇంతకీ ఈ కుర్రవాడు ఎవరు? 204 00:17:22,835 --> 00:17:25,878 ఇతను ఈ తరపు అతిగొప్ప మేధావులలో ఒకడు. 205 00:17:27,422 --> 00:17:31,176 కానీ దురదృష్టవశాత్తు, తగ్గింపు గుణం ఎక్కువ. 206 00:17:32,553 --> 00:17:34,388 త్వరలోనే అది పోయేలా చేస్తాం. 207 00:17:34,888 --> 00:17:36,056 ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు? 208 00:17:37,099 --> 00:17:38,517 నేను రెండవ ఏడాది విద్యార్థిని. 209 00:17:39,268 --> 00:17:40,519 వాసెడలో. 210 00:17:40,519 --> 00:17:43,021 - నువ్వు ఏం చదువుదాం అనుకుంటున్నావు? - రాజకీయాలు. 211 00:17:43,772 --> 00:17:45,899 అది చాలా గొప్ప ఎంపిక. 212 00:17:46,650 --> 00:17:49,236 నీకు నిజంగానే కోహ్ గారు చెప్పేంత టాలెంట్ ఉంటే, 213 00:17:50,362 --> 00:17:54,575 నీ పేరు కూడా అతిత్వరలోనే పేపర్లలో రావడం మొదలవుతుంది. 214 00:17:54,575 --> 00:17:58,078 అయితే, నీ పేరు ఏంటి? 215 00:17:58,996 --> 00:18:00,080 బెయిక్. 216 00:18:01,582 --> 00:18:02,624 నోవా బెయిక్. 217 00:18:10,757 --> 00:18:12,676 మనం అతిత్వరలోనే మళ్ళీ కలుస్తాం. 218 00:18:15,512 --> 00:18:18,432 ఇక నేను వెళతాను. 219 00:18:20,184 --> 00:18:21,351 వెళ్ళడానికి ముందు ఒక మాట. 220 00:18:35,365 --> 00:18:38,911 ఈసారి మనం కలిసినప్పుడు, నువ్వు చెప్పబోయే మొత్తం 30 కంటే తక్కువే ఉండాలి. 221 00:18:41,830 --> 00:18:45,792 అప్పుడు ఇవాళ ఉన్నదానికన్నా నీకు ఎక్కువ ఇస్తా. 222 00:18:47,336 --> 00:18:49,671 నీకు పెళ్లి అయి కొత్త ఇల్లు తీసుకున్నావు అని విన్నాను. 223 00:18:52,090 --> 00:18:54,510 ఇది నా అభినందనలు అనుకో. 224 00:19:10,484 --> 00:19:11,944 మళ్ళీ బయటకు వెళ్తున్నారా? 225 00:19:16,114 --> 00:19:18,200 కాస్త అలా వెళ్తే బాగుంటుంది అనుకున్నా. 226 00:19:29,211 --> 00:19:30,671 ఇంకేమైనా ఉందా? 227 00:19:44,893 --> 00:19:46,103 ఇవి ఏంటి? 228 00:19:49,940 --> 00:19:51,525 ఇవి అతను పంపినవి. 229 00:20:01,869 --> 00:20:02,870 నన్ను క్షమించు. 230 00:20:05,080 --> 00:20:06,582 వీటిని నీ నుండి దాచాను. 231 00:21:39,216 --> 00:21:41,385 ఇవాళ, మనం స్ట్రాబెర్రీ ట్రై చేయబోతున్నాం. 232 00:21:42,177 --> 00:21:44,513 కొత్తవాటిని ట్రై చేయడం మంచిది. 233 00:21:53,897 --> 00:21:55,148 ఏమైనా జరిగిందా? 234 00:22:00,529 --> 00:22:02,030 నా కొడుకు... 235 00:22:03,407 --> 00:22:06,243 మీరు మా డబ్బు దొంగిలించడానికి నాకు దగ్గరవుతున్నారు 236 00:22:07,661 --> 00:22:11,665 అని అనుమానపడ్డాడు. 237 00:22:12,666 --> 00:22:14,835 అందుకని మీ గురించి విచారించడానికి ఒక ఇన్వెస్టిగేటర్ ని పెట్టాడు. 238 00:22:22,467 --> 00:22:23,594 అతను ఏం చేసాడు? 239 00:22:24,303 --> 00:22:26,430 వాడు అలాంటి పని చేసి ఉండకూడదు, 240 00:22:28,432 --> 00:22:31,935 కానీ వాడు మంచి ఉద్దేశంతోనే అలా చేసాడు. 241 00:22:32,728 --> 00:22:35,939 నా గురించి కంగారు పడ్డాడు అంతే. 242 00:22:35,939 --> 00:22:40,527 అలా చేసినప్పుడు, వాడు ఒక విషయాన్ని కనిపెట్టాడు. 243 00:22:48,076 --> 00:22:49,244 ఆ యుద్ధం గురించి. 244 00:22:52,539 --> 00:22:55,209 అది చాలా కాలం క్రితం జరిగిన విషయం. 245 00:22:59,713 --> 00:23:02,716 మీరు కుర్రోళ్ళు, అయినా కూడా... 246 00:23:02,716 --> 00:23:04,092 నేను... 247 00:23:05,135 --> 00:23:06,512 నేను ఒక హంతకుడిని. 248 00:23:15,521 --> 00:23:17,105 ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? 249 00:23:22,653 --> 00:23:24,530 ఇంకా ఇక్కడే ఉన్నావు అన్నమాట. 250 00:23:25,155 --> 00:23:27,115 ఇప్పటికీ వాడి తప్పులను సరిచేస్తున్నావు. 251 00:23:29,034 --> 00:23:31,036 యోషి గారు నిన్ను ఒక ప్రశ్న అడిగారు. 252 00:23:32,204 --> 00:23:33,413 కాసేపు బయటకు వెళ్ళు. 253 00:23:34,122 --> 00:23:36,166 ఏం చింతించకు, సుగీహర. 254 00:23:36,166 --> 00:23:38,585 ఇంతకు ముందు నేను ఇతనితో డీల్ చేశా కాదు, అవునా? 255 00:23:44,091 --> 00:23:46,385 నేను ఒక విషయం స్పష్టం చేద్దాం అని వచ్చాను. 256 00:23:48,011 --> 00:23:51,473 నా కొడుకు నుండి దూరంగా ఉండు. వాడితో సంబంధం పెట్టుకోకు. 257 00:23:51,473 --> 00:23:52,891 అలా చేయడం అసాధ్యం. 258 00:23:53,809 --> 00:23:57,938 నీ కొడుకు నాకు చాలా డబ్బు చేసి పెట్టబోతున్నాడు. 259 00:23:59,314 --> 00:24:01,525 నువ్వు ఇప్పటికే నా నుండి తీసుకున్నది చాలదా? 260 00:24:02,192 --> 00:24:04,236 నీకు అలా అనిపిస్తుందా? 261 00:24:04,236 --> 00:24:05,696 ఆసక్తిగా ఉంది. 262 00:24:05,696 --> 00:24:08,657 నేను ఏనాడూ మీ తాతయ్య ప్రేమను కోరుకోలేదు. 263 00:24:09,283 --> 00:24:10,826 ఎప్పడూ దాని కోసం అడగలేదు. 264 00:24:10,826 --> 00:24:12,327 అది వాడి ఇష్టం... 265 00:24:12,327 --> 00:24:15,205 నువ్వు సోలొమన్ గురించి మాట్లాడటానికి వచ్చావు. 266 00:24:15,205 --> 00:24:16,999 అలాగే ఇది వాడి నిర్ణయం 267 00:24:18,000 --> 00:24:19,835 అని నేను చెప్తున్నాను కదా. 268 00:24:20,460 --> 00:24:21,962 అన్నేళ్ల క్రితం నువ్వు ఎలా చేసావో అలా. 269 00:24:22,713 --> 00:24:26,049 నీకు అది ఇష్టం లేకపోతే, వాడితో మాట్లాడి ఒప్పించుకో. 270 00:24:26,717 --> 00:24:30,596 ఎందుకంటే మీ మధ్య ఉన్న ఆ విబేధం ఏదైతే ఉందో 271 00:24:31,930 --> 00:24:33,599 నాకు దానితో సంబంధం లేదు. 272 00:24:43,942 --> 00:24:45,194 మనిద్దరికీ తెలుసు 273 00:24:46,278 --> 00:24:48,739 అప్పట్లో నేను నిన్ను తొక్కేసి ఉండగలిగేవాడిని. 274 00:24:50,407 --> 00:24:51,700 బదులుగా, నేను నిన్ను కరుణించాను. 275 00:24:53,118 --> 00:24:54,286 కాబట్టి ఇప్పుడు నా మాట విను. 276 00:24:55,454 --> 00:24:58,582 నా కొడుకుకి గనుక నువ్వు ఎలాంటి హాని తలపెట్టినా, ఇక నేను నిన్ను కనికరించను. 277 00:24:59,458 --> 00:25:01,084 నేను ఏం చేయగలనో నీకు బాగా తెలుసు. 278 00:25:02,211 --> 00:25:03,253 అర్థమైందా? 279 00:25:33,158 --> 00:25:34,243 హేయ్! 280 00:25:37,454 --> 00:25:38,497 నాకు రెండు బాక్సులు తీసుకురా. 281 00:25:38,497 --> 00:25:39,665 అలాగే సిగరెట్లు. 282 00:25:40,707 --> 00:25:41,917 చిల్లర నువ్వే ఉంచుకో. 283 00:25:47,589 --> 00:25:48,882 ఆయనకు రెండు బాక్సులు కావాలంట. 284 00:25:54,263 --> 00:25:55,264 హేయ్. 285 00:25:56,181 --> 00:25:57,349 ఇది నేను చూసుకుంటా. 286 00:25:57,975 --> 00:25:59,226 నువ్వు శుభ్రం చేయడం కొనసాగించు. 287 00:26:08,861 --> 00:26:10,654 యోషి గారు, స్వాగతం. 288 00:26:10,654 --> 00:26:13,031 ఇవాళ మామోరుని తీసుకొచ్చారు... 289 00:26:25,085 --> 00:26:28,505 నువ్వు ఇక్కడ పని చేస్తావా? 290 00:26:29,882 --> 00:26:32,467 నీ వయసు ఎంత? 291 00:26:33,969 --> 00:26:34,970 పదిహేను. 292 00:26:36,054 --> 00:26:37,055 నీకు? 293 00:26:37,806 --> 00:26:38,974 ఏడు. 294 00:26:40,767 --> 00:26:43,770 ఆయన మీ తాతయ్యా? 295 00:26:46,565 --> 00:26:49,526 నీకు ఆయన ఎవరో తెలీదా? 296 00:26:51,320 --> 00:26:52,446 లేదు, తెలీదు. 297 00:26:54,198 --> 00:26:55,616 మామోరు. 298 00:27:13,550 --> 00:27:16,345 నువ్వు ది బ్రదర్స్ కారమజోవ్ చదవడం పూర్తి చేసావా? 299 00:27:17,679 --> 00:27:19,014 అవును. 300 00:27:19,014 --> 00:27:20,390 నీకు ఏమనిపించింది? 301 00:27:20,891 --> 00:27:22,559 మీరు అది చదివారా? 302 00:27:23,310 --> 00:27:25,187 నువ్వు చదివేది ప్రతీది నేను చదువుతా, నోవా. 303 00:27:25,687 --> 00:27:27,272 మీ క్లాసులకు అవసరమైన ప్రతీది చదువుతా. 304 00:27:27,856 --> 00:27:31,193 ఎందుకు? మీరు బిజీగా ఉండే వ్యక్తి కదా, కోహ్ గారు. 305 00:27:33,195 --> 00:27:35,072 ఎందుకంటే నాకు చిన్నప్పుడు చదివే ఛాన్స్ దొరకలేదు. 306 00:27:36,573 --> 00:27:40,661 నోవా, పుస్తకాలపై నీకున్న ప్రేమను చూస్తే నాకు ముచ్చటిగా ఉంది. 307 00:27:40,661 --> 00:27:44,248 కానీ ఆ పుస్తకాలు నీ భవిష్యత్ కాదు. 308 00:27:50,003 --> 00:27:51,880 నేను రాజకీయాల్లోకి వెళ్ళను. 309 00:27:53,006 --> 00:27:54,550 నేను టీచర్ కావాలి అనుకుంటున్నా. 310 00:27:57,052 --> 00:27:59,847 నువ్వు ఇంతదూరం వాసెడకి వచ్చి టీచర్ వి అవుతావా? 311 00:28:01,306 --> 00:28:02,724 అది మతిలేని మాట. 312 00:28:03,308 --> 00:28:06,061 ఇక్కడ నీకు ఎన్నో అవకాశాలు తెరుచుకుంటున్నాయి. 313 00:28:06,061 --> 00:28:07,437 నీకు ఆ విషయం తెలీడం లేదు అంతే. 314 00:28:08,063 --> 00:28:09,231 నాకు తెలుసు, 315 00:28:11,233 --> 00:28:13,402 కానీ నేను నా భవిష్యత్తు పై నిర్ణయం తీసుకున్నాను. 316 00:28:35,883 --> 00:28:36,884 నువ్వు ఎవరు? 317 00:28:36,884 --> 00:28:40,512 మధ్యలో వచ్చినందుకు క్షమించండి, కానీ నేను నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను. 318 00:28:43,599 --> 00:28:44,892 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 319 00:28:45,559 --> 00:28:46,685 ఇది ఎవరు? 320 00:28:48,770 --> 00:28:50,230 నా పేరు అకికో నకజోనోని. 321 00:28:50,856 --> 00:28:53,275 నోవా స్నేహితులలో ఒకదాన్ని. 322 00:28:53,275 --> 00:28:55,194 తనే నన్ను ఆహ్వానించాడు. 323 00:28:55,194 --> 00:29:00,032 నేను అతిథులు వస్తారనుకోలేదు, కానీ లోనికి రా, ఇక్కడ తినడానికి బోలెడంత ఉంది. 324 00:29:09,917 --> 00:29:11,335 నకజోనో... 325 00:29:12,002 --> 00:29:16,215 మీ నాన్న నకజోనో హితోషిగారా? 326 00:29:16,715 --> 00:29:18,217 ఫారిన్ అండర్ సెక్రటరీ? 327 00:29:18,217 --> 00:29:20,844 అవును, ఆయన మా నాన్నే. 328 00:29:37,361 --> 00:29:39,071 నోవా, కూర్చో. 329 00:29:51,708 --> 00:29:54,211 నేను ఎవరినో నీకు తెలుసా? 330 00:29:54,211 --> 00:29:57,798 తెలుసు. నోవా మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. 331 00:29:59,925 --> 00:30:03,887 మేము ప్రస్తుతం వీడి భవిష్యత్ గురించి మాట్లాడుకుంటున్నాం. 332 00:30:03,887 --> 00:30:05,430 వీడి భవిష్యత్? 333 00:30:06,098 --> 00:30:07,766 చాలా సీరియస్ సంభాషణే. 334 00:30:07,766 --> 00:30:12,187 వీడికి గొప్ప భవిష్యత్ ఉందని నేను నమ్ముతున్నాను. 335 00:30:12,187 --> 00:30:14,106 తనను మొదటిసారి కలిసినప్పుడే నాకు అలా అనిపించింది. 336 00:30:14,898 --> 00:30:18,402 కానీ ముందు, వీడికి కూడా ఆ కోరిక ఉండాలి కదా. 337 00:30:19,486 --> 00:30:22,739 బహుశా ఆ విషయంలో నువ్వు వీడికి సాయం చేయగలవేమో. 338 00:30:30,330 --> 00:30:31,707 గొప్ప భవిషత్ కోసం. 339 00:30:37,087 --> 00:30:38,881 ఇక వీడుకోలు, షిప్లీస్. 340 00:30:40,507 --> 00:30:41,508 హేయ్, మిత్రమా. 341 00:30:42,676 --> 00:30:43,886 నువ్వు వెనక్కి ఎప్పుడు వెళ్తున్నావు? 342 00:30:43,886 --> 00:30:45,512 నేను స్టేట్స్ కి వెళ్లడం లేదు. 343 00:30:46,805 --> 00:30:47,806 మకావ్ కి వెళ్తున్నాను. 344 00:30:49,141 --> 00:30:51,810 - యోషి గారు ఉద్యోగం ఇస్తా అన్నాడు. - ఏం పని? 345 00:30:53,228 --> 00:30:55,939 అతని కొత్త గేమింగ్ కంపెనీని నడిపించాలి అంట. మొత్తం నాకే. 346 00:30:55,939 --> 00:30:57,357 మరి నీ పిల్లల సంగతి? 347 00:30:58,025 --> 00:30:59,318 నిజం మాట్లాడుకుందామా, మిత్రమా? 348 00:31:00,777 --> 00:31:04,573 నేను లేకుండానే వాళ్ళు ఇన్నాళ్లు ఉన్నారు, అది కూడా బాగానే బ్రతికారు. 349 00:31:05,449 --> 00:31:07,534 అవును, చిన్నతనంలో అలా అయ్యుండొచ్చు. 350 00:31:07,534 --> 00:31:10,287 కానీ నువ్వు నిజంగానే వెళ్తున్నావా? 351 00:31:10,287 --> 00:31:11,455 అవును. 352 00:31:12,873 --> 00:31:14,374 కానీ మకావ్? 353 00:31:14,374 --> 00:31:15,584 వెళితే ఏమవుతుంది? 354 00:31:16,210 --> 00:31:18,712 టోక్యోలోనే బ్రతికి బట్టగట్టాను. నా జీవితంలో అది మరొక మైలురాయి అంతే. 355 00:31:18,712 --> 00:31:22,925 అంతేకాక, ఇక్కడ మార్కెట్ పడిపోతుంది అని మనిద్దరికీ తెలుసు. నువ్వు కూడా ఆలోచించు. 356 00:31:28,180 --> 00:31:30,516 నువ్వు నాకు చెప్పిన మొదటి అబద్ధం నాకు ఇంకా గుర్తుంది. 357 00:31:31,808 --> 00:31:32,893 ఏం అబద్ధం? 358 00:31:33,936 --> 00:31:35,437 "నేను ఇక్కడ ఉండటానికి రాలేదు." 359 00:31:42,611 --> 00:31:44,112 మనం మన సొంత అబద్ధాలను 360 00:31:44,112 --> 00:31:46,865 నమ్మడం మొదలెడితే ఇక సమస్యల్లో చిక్కుకున్నట్టే. 361 00:31:47,366 --> 00:31:48,367 థాంక్స్. 362 00:31:49,868 --> 00:31:51,495 అతనికి ఇంకొకటి ఇవ్వు. 363 00:31:53,288 --> 00:31:55,207 నేను అది అబద్ధంగా చెప్పలేదు. 364 00:31:56,208 --> 00:31:58,293 కానీ అబే పుణ్యమా, నేను ఇక్కడే ఇరుక్కున్న. 365 00:31:59,670 --> 00:32:02,089 ప్రస్తుతం వాడు ఏం చేయాలో తోచక పిచ్చెక్కిపోతూ ఉంటాడు. 366 00:32:04,800 --> 00:32:05,884 పోతే పోనివ్వు. 367 00:32:06,677 --> 00:32:08,220 వాడు నా పేరు చెప్పుకుని ఏడిస్తే చాలు. 368 00:32:09,721 --> 00:32:13,392 వాడిని చూసి నీకు కొంచెం కూడా బాధగా లేదా? 369 00:32:13,392 --> 00:32:16,436 ఏమాత్రం లేదు. బాధపడేంత సీన్ కూడా లేదు. 370 00:32:21,358 --> 00:32:22,568 థాంక్స్. 371 00:32:31,034 --> 00:32:32,286 ఏదైతే అది అయింది. 372 00:32:38,208 --> 00:32:41,628 ఆయన నువ్వు చెప్పినంత దారుణమైన మనిషి ఏం కాదు. 373 00:32:42,212 --> 00:32:43,755 నేను వద్దు అన్నది అందుకు కాదు. 374 00:32:44,923 --> 00:32:45,924 మరి నా గురించా? 375 00:32:46,842 --> 00:32:51,013 నేను నీ పరువు తీస్తానని నీకు భయం వేసిందా? 376 00:32:51,680 --> 00:32:54,349 నేను నిన్ను ఈ విషయానికి దూరంగా ఉండమన్నా! 377 00:32:57,019 --> 00:32:58,979 నాకు ఇందులో భాగం కావాలని ఉంది. 378 00:32:58,979 --> 00:33:00,689 కాబట్టి నేను క్షమాపణలు అడగను. 379 00:33:03,358 --> 00:33:06,195 నన్ను చూస్తుంటే ఆటపట్టించడానికి ఒక వెర్రోడిలా ఉన్నానా? 380 00:33:07,529 --> 00:33:10,490 నువ్వు ఒక అమాయకమైన, ధనిక పిల్లవి కాబట్టి 381 00:33:11,116 --> 00:33:12,826 నీ సరదాలకు, సంతోషాలకు నాతో ఆటలు... 382 00:33:12,826 --> 00:33:14,995 నాతో ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? 383 00:33:17,039 --> 00:33:19,291 నాకు తెలీడం లేదు అనుకుంటున్నావా? 384 00:33:20,751 --> 00:33:24,171 జనంలో భావోద్వేగాలను రేకెత్తించడం నీకు చాలా సరదాగా ఉంటుంది. 385 00:33:24,922 --> 00:33:27,007 నువ్వు, అలాగే నీ కొరియన్ లవర్. 386 00:33:27,007 --> 00:33:28,884 భలే గొప్ప ట్రాజడీ. 387 00:33:29,510 --> 00:33:31,470 ఇతరుల దృష్టి నీపై పడేలా చేయడానికి తపించిపోతావు, 388 00:33:32,513 --> 00:33:35,015 ఎంత దారుణమైన విషయమో. 389 00:33:36,475 --> 00:33:38,894 జనం నన్ను ఎలా చూస్తారనే విషయం నేను పట్టించుకోను. 390 00:33:38,894 --> 00:33:41,063 మనిద్దరి మధ్య ఉన్న తేడా అదే. 391 00:33:41,563 --> 00:33:43,982 నువ్వు ఇతరులు నిన్ను నిర్వచించనిస్తావు. 392 00:33:44,691 --> 00:33:46,276 ఒకసారి ఆలోచించు. 393 00:33:46,860 --> 00:33:49,154 - మనలో నిజంగా దయనీయమైన స్థితిలో ఉన్నది ఎవరు? - వెళ్లిపో. 394 00:33:51,281 --> 00:33:52,407 నేను వెళ్ళను. 395 00:33:53,659 --> 00:33:55,285 నేను నిన్ను వదలను. 396 00:33:59,790 --> 00:34:01,792 నాకు ఇక నువ్వు వద్దు. 397 00:34:07,756 --> 00:34:09,591 నాకు నిజం తెలుసనా? 398 00:34:10,467 --> 00:34:11,802 అందుకేనా? 399 00:34:17,683 --> 00:34:19,685 నీకు ఏం తెలుసు అనుకుంటున్నావు? 400 00:34:20,476 --> 00:34:22,103 నీకు ఏమీ తెలీదు. 401 00:34:30,862 --> 00:34:32,864 ఓహ్, కానీ నీకు తెలుసు, అవునా? 402 00:34:41,665 --> 00:34:44,042 అతను నీ తండ్రి. 403 00:34:44,042 --> 00:34:45,918 - కోహ్ హన్సు నీ... - నోరు మూయమని చెప్పాను కదా! 404 00:35:08,859 --> 00:35:10,694 సూట్ రూమ్ 405 00:35:12,988 --> 00:35:16,033 నేను వెంటనే కోహ్ హన్సుతో మాట్లాడాలి. 406 00:35:16,992 --> 00:35:19,369 - ప్రస్తుతం లేట్... - వాడిని పంపు. 407 00:35:30,214 --> 00:35:32,007 అవసరమైతే నిన్ను పిలుస్తాను. 408 00:35:37,596 --> 00:35:39,014 కొంచెం కూర్చుందాం. 409 00:35:39,014 --> 00:35:40,933 ఆమె అలా వస్తుందని నేను అనుకోలేదు. 410 00:35:42,392 --> 00:35:45,562 అకికో. ఆమె నాకు మాట ఇచ్చి తప్పింది. 411 00:35:47,189 --> 00:35:48,690 అందుకని ఆమెతో విడిపోవడానికి ప్రయత్నించినప్పుడు, 412 00:35:49,233 --> 00:35:51,318 ఆమె ఒక అర్థం లేని మాట చెప్పింది. 413 00:35:52,236 --> 00:35:53,820 అది వినగానే... 414 00:35:56,073 --> 00:35:57,282 అది అర్థం లేని మాట. 415 00:35:58,492 --> 00:36:00,994 కానీ ఆమె మాటల గురించి ఆలోచించడం తెలివితక్కువగానే అనిపించినా... 416 00:36:03,413 --> 00:36:05,332 నేను మీ నోట ఆ విషయాన్ని వినాలి అనుకుంటున్నాను. 417 00:36:05,958 --> 00:36:07,501 ఆమె నీకు ఏమని చెప్పింది? 418 00:36:10,337 --> 00:36:11,421 ఆమె... 419 00:36:15,425 --> 00:36:16,552 మీరు... 420 00:36:20,639 --> 00:36:21,932 నా తండ్రి అంది. 421 00:36:32,401 --> 00:36:34,403 అది నిజం కాదు అని చెప్పండి. 422 00:36:47,541 --> 00:36:48,625 అది నిజమే. 423 00:36:59,636 --> 00:37:01,555 అప్పట్లో నేను చేపల బ్రోకర్ గా పనిచేసేవాడిని. 424 00:37:02,931 --> 00:37:04,850 నేను ఒసాకా ఇంకా బూసాన్ మధ్య అస్తమాను ప్రయాణించేవాడిని. 425 00:37:05,934 --> 00:37:10,272 నేను దాదాపు నా సొంత ఊరుకి వెళ్లి 16 ఏళ్ళు అవుతుంది. 426 00:37:12,900 --> 00:37:16,236 వెళ్ళకపోవడం నాపై ప్రభావం చూపుతుందని అనుకోలేదు, కానీ చూపింది. 427 00:37:19,156 --> 00:37:20,866 మీరు ఆమెను బలవంతం చేసారా? 428 00:37:22,534 --> 00:37:23,535 అస్సలు లేదు. 429 00:37:24,578 --> 00:37:26,455 కానీ మీరు ఆమెను మభ్యపెట్టారు. 430 00:37:27,873 --> 00:37:29,208 అదే జరిగి ఉంటుంది! 431 00:37:29,208 --> 00:37:31,084 నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా? 432 00:37:32,628 --> 00:37:35,714 ఒక బీద పిల్లకు ఆశ చూపించి నా కోరిక తీర్చుకున్నాను అనుకుంటున్నావా? 433 00:37:37,257 --> 00:37:39,426 ఆమె నన్ను ప్రేమించి ఉండొచ్చు అనే ఆలోచనకు బదులు... 434 00:37:39,426 --> 00:37:40,594 అది సాధ్యం కాదు. 435 00:37:43,222 --> 00:37:44,681 నువ్వు చెడ్డవాడివి. 436 00:37:45,390 --> 00:37:46,517 అసహ్యకరమైనవాడివి! 437 00:37:47,017 --> 00:37:48,268 అలాగే స్వార్థపరుడివి. 438 00:37:49,353 --> 00:37:52,397 అయితే, నీ సంగతి ఏంటి? 439 00:37:54,942 --> 00:37:56,777 ఎందుకంటే నా శరీరంలో ఉన్న రక్తమే... 440 00:37:58,862 --> 00:38:00,364 నీలో కూడ ప్రసరిస్తోంది. 441 00:38:02,866 --> 00:38:06,036 నువ్వు ఇన్నేళ్ళుగా నీ తండ్రి అని పిలిచిన ఆ సన్నాసి రక్తం కాదు. 442 00:38:06,995 --> 00:38:09,039 నన్ను చెడ్డవాడివి అని పిలవడానికి నువ్వు ఎవరివి? 443 00:38:09,039 --> 00:38:10,791 నేను నిన్ను చూశాను. 444 00:38:12,626 --> 00:38:13,961 ఆ రాత్రి పొలంలో! 445 00:38:13,961 --> 00:38:15,337 అయితే ఏంటి? 446 00:38:16,463 --> 00:38:17,965 నేను నీకు ఏమని చెప్పా? 447 00:38:20,175 --> 00:38:21,385 ముందుకు చూడు. 448 00:38:21,885 --> 00:38:22,886 నోవా, 449 00:38:24,930 --> 00:38:26,557 ఎప్పుడైనా ముందుకే చూడు. 450 00:38:35,983 --> 00:38:37,025 ఆ రోజు... 451 00:38:38,819 --> 00:38:40,696 నువ్వు నా మాటలు విన్నావని నాకు తెలుసు. 452 00:38:43,365 --> 00:38:44,783 నువ్వు వెనక్కి చూడలేదు. 453 00:38:48,704 --> 00:38:50,205 నువ్వు నా వాడివి. 454 00:38:54,418 --> 00:38:55,419 నోవా... 455 00:38:57,963 --> 00:39:00,132 మనం ఇక ఆఖరికి ఈ నాటకాన్ని ఆపేయొచ్చు. 456 00:39:02,551 --> 00:39:03,719 ఇంటికి వెళ్లి పడుకో. 457 00:39:04,219 --> 00:39:06,305 రేపు నిద్ర లేచిన తర్వాత నీకే తెలుస్తుంది. 458 00:39:06,889 --> 00:39:08,515 అంతా వేరుగా అనిపిస్తుంది. 459 00:39:10,434 --> 00:39:12,186 వాళ్ళు నీకు మొక్కుతారు. 460 00:39:15,856 --> 00:39:17,649 అలా జరిగేలా నేను చేస్తాను. 461 00:39:55,562 --> 00:39:57,397 వాళ్ళు శత్రువులు. 462 00:39:58,106 --> 00:39:59,650 మాకు అలాగే చెప్పారు. 463 00:40:02,486 --> 00:40:06,573 వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మహిళలను చెరిపి, మన ఇళ్లను నాశనం చేస్తారన్నారు. 464 00:40:08,951 --> 00:40:10,702 నేను వారి మాటలు నమ్మాను. 465 00:40:14,331 --> 00:40:18,252 నా భార్య గురించి ఆలోచించాను, 466 00:40:18,961 --> 00:40:21,713 ఇంకా పుట్టని నా పిల్లల గురించి ఆలోచించాను, 467 00:40:22,923 --> 00:40:24,716 నా తల్లిదండ్రుల గురించి కూడా. 468 00:40:26,260 --> 00:40:29,054 అప్పటికి వారిద్దరూ బ్రతికే ఉన్నారు. 469 00:40:33,851 --> 00:40:37,688 మేమంతా చాలా అలసిపోయాం. 470 00:40:37,688 --> 00:40:39,439 ఆకలితో మాడిపోయాం. 471 00:40:44,987 --> 00:40:49,867 అలాగే అక్కడ వేడి కుడా చాలా తీవ్రంగా ఉండేది. 472 00:40:52,911 --> 00:40:56,623 అక్కడి పురుగులు మమ్మల్ని తినేసేవి. 473 00:41:02,713 --> 00:41:06,550 అన్ని నెలల పాటు, మేము ప్రాణాలతో ఉన్నామంటే ఉన్నాం అంతే. 474 00:41:09,678 --> 00:41:14,057 ఆ పరిస్థితుల మధ్య, మేము మనుషులం అనే విషయం మాకు గుర్తులేదు. 475 00:41:18,061 --> 00:41:22,733 కాబట్టి నాకు, "మేము ఇక్కడ చచ్చిపోతాం" అనిపించింది. 476 00:41:25,485 --> 00:41:27,196 నిజంగా నాకు అలాగే అనిపించింది. 477 00:41:33,285 --> 00:41:34,494 ఆ తర్వాత... 478 00:41:35,954 --> 00:41:38,415 ఆదేశాలు వచ్చినప్పుడు... 479 00:41:42,419 --> 00:41:45,130 నాలో నుండి నా ఆత్మ బయటకు పోయినట్టు అయింది... 480 00:41:48,634 --> 00:41:50,677 అప్పుడు నాకు చెప్పినట్టు నేను చేశా అంతే. 481 00:41:57,184 --> 00:42:00,103 కానీ మా ఆఖరి ఆర్డర్ అది కాదు. 482 00:42:00,771 --> 00:42:02,397 ఇంకొక్క ఆర్డర్ వచ్చింది. 483 00:42:09,154 --> 00:42:10,489 "అన్నీ మర్చిపోవాలని." 484 00:42:12,324 --> 00:42:14,159 వాళ్ళు మాకు చెప్పింది అదే. 485 00:42:16,078 --> 00:42:18,914 నేను ఆ ఆర్డర్ ని పాటించాను. 486 00:42:26,630 --> 00:42:29,258 గతాన్ని మర్చిపోగలం 487 00:42:30,551 --> 00:42:33,387 అని మనం అనుకోవడం మన వెర్రితనం. 488 00:42:35,681 --> 00:42:37,641 కానీ మేము ఇంకేం చేయగలం చెప్పు? 489 00:42:38,892 --> 00:42:44,147 జీవితమంతా ఆ జ్ఞాపకాలతోనే గడపాలా? 490 00:43:08,589 --> 00:43:12,009 నీ బ్రతుకు నువ్వు బాగా బ్రతుకు. 491 00:43:47,628 --> 00:43:52,966 అప్పుడు అలా జరిగింది 492 00:43:52,966 --> 00:43:57,763 అందులో సందేహమే లేదు 493 00:43:58,388 --> 00:44:03,727 కానీ కేవలం అడిగినందుకు ఇంత ఆర్భాటం ఎందుకు చేయడం 494 00:44:03,727 --> 00:44:08,273 కలిసి 500 ఏళ్ళు ఉందాం అంటే తప్పా? 495 00:44:08,815 --> 00:44:11,818 ఇది 496 00:44:11,818 --> 00:44:18,700 విధి ఆడిన నాటకమా? 497 00:44:19,618 --> 00:44:22,162 ఇప్పుడు నా భవిష్యత్ 498 00:44:22,746 --> 00:44:29,670 చీకటిగా కనిపిస్తోంది 499 00:44:30,712 --> 00:44:33,090 అది అలాగే ఉండబోతోంది అందులో సందేహమే లేదు 500 00:44:50,274 --> 00:44:51,191 నోవా. 501 00:44:52,109 --> 00:44:53,569 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 502 00:44:53,569 --> 00:44:54,653 అమ్మా. 503 00:44:55,779 --> 00:44:58,448 ఏంటి? ఏమైంది? 504 00:44:59,324 --> 00:45:00,325 నేను... 505 00:45:00,868 --> 00:45:02,786 నాకు నీ మొహం చూడాలి అనిపించింది అంతే. 506 00:45:05,998 --> 00:45:08,000 స్కూల్ లో ఏమైనా జరిగిందా? 507 00:45:08,000 --> 00:45:09,626 బాగా కష్టంగా ఉందా? 508 00:45:09,626 --> 00:45:10,752 లేదు. 509 00:45:12,129 --> 00:45:13,547 నాకు అక్కడ చాలా నచ్చింది. 510 00:45:14,506 --> 00:45:16,133 మొట్టమొదటిసారి, 511 00:45:17,092 --> 00:45:19,511 నేను ఏమైనా చేయగలను అనిపిస్తోంది. 512 00:45:21,346 --> 00:45:22,890 అయితే మరి... 513 00:45:23,515 --> 00:45:24,516 చెప్పు. 514 00:45:25,184 --> 00:45:26,393 నువ్వు ఎందుకు వచ్చావు? 515 00:45:27,311 --> 00:45:28,812 చెప్పాను కదా. 516 00:45:29,479 --> 00:45:31,148 నాకు నిన్ను చూడాలని అనిపించింది. 517 00:45:38,530 --> 00:45:39,865 ఇక నేను వెనక్కి వెళతాను. 518 00:45:40,574 --> 00:45:41,575 అప్పుడేనా? 519 00:45:42,826 --> 00:45:44,620 ఇప్పుడే వచ్చావు కదా. 520 00:45:45,621 --> 00:45:47,206 రాత్రికి ఉండు. 521 00:45:47,206 --> 00:45:48,665 రేపు ఉదయమే వెళ్లొచ్చు. 522 00:45:49,666 --> 00:45:50,667 నా వల్ల కాదు. 523 00:45:50,667 --> 00:45:52,211 నేను వెళ్ళాలి. 524 00:45:52,711 --> 00:45:54,463 ఒక ఫ్రెండ్ తో బయటకు వెళ్తా అన్నాను. 525 00:45:58,217 --> 00:46:00,928 అయితే నిన్ను ట్రైన్ దగ్గర దించుతాను. 526 00:46:00,928 --> 00:46:02,012 ఏం పర్లేదు. 527 00:46:03,430 --> 00:46:05,766 అసలే ఇవాళ నువ్వు చాలా అలసిపోయి ఉంటావని నాకు తెలుసు. 528 00:46:05,766 --> 00:46:07,851 నువ్వు ఇక విశ్రాంతి తీసుకో, అమ్మా. 529 00:46:10,812 --> 00:46:12,648 జాగ్రత్తగా ఉండు. 530 00:46:14,233 --> 00:46:15,484 నోవా... 531 00:46:17,110 --> 00:46:18,695 అమ్మా, అంతా బాగానే ఉంది. 532 00:46:54,815 --> 00:46:55,816 నోవా. 533 00:46:56,483 --> 00:46:57,693 నోవా. 534 00:46:58,318 --> 00:47:00,112 నా కొడుకుని చూశారా? 535 00:47:09,746 --> 00:47:12,624 నోవా! నోవా! 536 00:47:35,355 --> 00:47:37,024 బ్రేకింగ్ న్యూస్ రిపోర్ట్. 537 00:47:37,024 --> 00:47:41,945 వాయే ఎంటర్ప్రైస్ సీఈఓ, మసారు అబే గారి షాకింగ్ ఆత్మహత్య వార్త 538 00:47:41,945 --> 00:47:45,782 ఉన్నత స్థాయి ఆర్థికవేత్తలలో కలకలం రేపింది. 539 00:47:45,782 --> 00:47:47,659 మిస్టర్ అబే ఇటీవల ఆయన లేటెస్ట్ డెవెలప్మెంట్ 540 00:47:47,659 --> 00:47:52,331 ప్రాజెక్టు వివాదాలలో కూరుకుపోవడానికి ముందు వరకు ప్రముఖుడిగా చలామణి అయ్యారు. 541 00:47:53,081 --> 00:47:57,419 ఇవాళ ఉదయం ఆయన శరీరం చుబు సంగకు జాతీయ పార్క్ వద్ద కనుగొనబడింది. 542 00:47:58,462 --> 00:48:00,923 అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు 543 00:48:00,923 --> 00:48:05,928 కొండ శిఖరం మీద నుండి ఒక వ్యక్తి శరీరం పడినట్టు కనిపించింది అంట. 544 00:48:07,012 --> 00:48:10,349 {\an8}అధికారులు ఆ ప్రదేశంలో సోదాలు జరిపినప్పుడు, 545 00:48:10,349 --> 00:48:14,686 {\an8}వారికి మిస్టర్ అబే గారి బూట్లు దొరికాయి కానీ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. 546 00:48:15,270 --> 00:48:17,773 ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. 547 00:48:18,732 --> 00:48:19,816 ఇక ఇతర వార్తల్లోకి వెళితే... 548 00:48:21,026 --> 00:48:25,489 డబ్బు అలాగే తెలిసినోళ్లు ఎవరూ లేకుండా వాడు ఎక్కడికి పోయినట్టు? 549 00:48:25,489 --> 00:48:27,533 నా మనుషులు ఇంకా వాడి కోసం వెతుకుతున్నారు, 550 00:48:28,116 --> 00:48:29,451 దేశం మొత్తం గాలిస్తున్నారు. 551 00:48:29,451 --> 00:48:31,078 ఇప్పటికే చాలా వారాలు అవుతోంది! 552 00:48:31,828 --> 00:48:33,664 మనం అంతా వెతుకుతున్నాం. 553 00:48:33,664 --> 00:48:34,998 వాడి ఆచూకీ దొరకలేదు. 554 00:48:36,917 --> 00:48:38,669 ఏది ఏమైనా నేను వాడిని కనిపెడతాను. 555 00:48:39,878 --> 00:48:41,421 నేను ప్రయత్నం మనుకోను. 556 00:48:44,633 --> 00:48:45,759 మన పరిస్థితి చూడండి. 557 00:48:47,261 --> 00:48:48,720 ఇది మన తప్పే. 558 00:48:50,472 --> 00:48:52,599 ఇలా జరుగుతుందని నేను మొదటి నుండి అనుకుంటూనే ఉన్నా. 559 00:48:53,642 --> 00:48:54,768 పిచ్చిగా మాట్లాడటం ఆపు. 560 00:48:54,768 --> 00:48:56,353 అదే నిజం! 561 00:48:57,229 --> 00:48:58,730 వాడిని నాశనం చేసింది మనమే. 562 00:48:58,730 --> 00:48:59,815 లేదు. 563 00:49:01,233 --> 00:49:04,778 సూన్జా, నువ్వు చేసిని త్యాగాలు, 564 00:49:04,778 --> 00:49:06,280 నేను చేసిన పాపాలు, 565 00:49:07,030 --> 00:49:08,949 అన్నీ వాడికోసమే కదా. 566 00:49:10,033 --> 00:49:12,202 వాడు తనకు అవేమీ వద్దు అన్నాడు. 567 00:49:13,954 --> 00:49:16,540 నేను తెలుసుకుని ఉంటే బాగుండేది. 568 00:49:31,180 --> 00:49:32,931 ఆ రాత్రి... 569 00:49:35,017 --> 00:49:37,561 వాడు వీడుకోలు చెప్పడానికి వచ్చాడు. 570 00:49:41,565 --> 00:49:44,818 నాకు చింతించవద్దు అని చెప్పడం కోసమే వచ్చాడు. 571 00:49:50,699 --> 00:49:52,451 అది వాడు నా మీద చూపిన కనికరం. 572 00:50:18,227 --> 00:50:19,561 వాడు వెళ్ళిపోయాడు. 573 00:50:22,022 --> 00:50:24,441 వాడి ఆచూకి ఏమీ దొరకలేదు. 574 00:50:30,989 --> 00:50:32,407 సూన్జా. 575 00:51:53,071 --> 00:51:54,573 కోహ్ గారు! 576 00:51:54,573 --> 00:51:59,286 మీరు ఒసాకాకి తిరిగి వచ్చినట్టు నాకు ఎందుకు చెప్పలేదు? 577 00:52:01,622 --> 00:52:02,623 చీర్స్! 578 00:52:05,167 --> 00:52:06,752 ఓహ్, లేదు! 579 00:52:08,045 --> 00:52:10,589 నాకు మత్తు బాగా ఎక్కింది. 580 00:52:15,344 --> 00:52:18,889 కోహ్ గారు, ఎంజాయ్ చేయాలని ఉందా? 581 00:52:20,224 --> 00:52:21,225 కోహ్ గారు? 582 00:52:22,893 --> 00:52:23,977 వెళ్ళిపో! 583 00:52:47,543 --> 00:52:49,211 ఇక కొనసాగించండి! 584 00:53:39,928 --> 00:53:41,597 నా చిన్నప్పుడు, 585 00:53:42,431 --> 00:53:47,728 మా నాన్న యంగ్డోలోని అడవుల్లో పరిగెత్తే గుర్రాల గురించి చెప్పేవారు. 586 00:53:49,563 --> 00:53:51,148 చొల్లిమస్. 587 00:53:52,649 --> 00:53:54,985 రాత్రి పగలు తేడా లేకుండా అవి పరిగెత్తేవి అంట. 588 00:53:55,527 --> 00:54:00,365 ఎంత వేగంగా అంటే వాటి నీడ కూడా వాటిని అందుకోలేకపోయేది, 589 00:54:00,365 --> 00:54:03,660 వాటి శరీరాలు వాటి నీడల నుండి వేరైపోయేవి అంట. 590 00:54:11,835 --> 00:54:13,212 మోజసు, 591 00:54:14,379 --> 00:54:15,380 నేను... 592 00:54:16,798 --> 00:54:18,884 కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది... 593 00:54:20,469 --> 00:54:23,597 ఈ ప్రపంచంలో కొంతమంది తట్టుకోలేకపోతున్నప్పుడు 594 00:54:23,597 --> 00:54:26,183 కొందరు ఎలా నిలద్రొక్కుకోగలుగుతున్నారు? 595 00:54:27,601 --> 00:54:30,062 అది తమ నీడలను కనుగొన్నవారు, అలాగే కనుగొనని 596 00:54:30,896 --> 00:54:32,731 వారి మధ్య ఉన్న తేడానా? 597 00:54:34,274 --> 00:54:37,778 ఎందుకంటే ఏ శరీరమైనా 598 00:54:39,238 --> 00:54:41,657 దాని నీడ లేకుండా ఉండలేదు కదా. 599 00:54:44,660 --> 00:54:46,578 ఆ నీడలే మనకు 600 00:54:47,704 --> 00:54:50,457 ఎక్కడున్నాం అనేది చెప్తాయి. 601 00:54:57,422 --> 00:54:59,216 ఏది ఏమైనా, 602 00:55:01,009 --> 00:55:04,096 మనిద్దరం మిగిలాం. 603 00:55:05,722 --> 00:55:08,475 మనం ప్రేమించిన వారు ఎందరో కనబడకుండా పోయినప్పటికీ, 604 00:55:08,475 --> 00:55:10,561 మనం ఈ టేబుల్ దగ్గర 605 00:55:11,311 --> 00:55:13,105 మిగిలి ఉన్నాం. 606 00:55:18,110 --> 00:55:20,237 అలాగే సోలొమన్ కూడా ఇక్కడే ఉన్నాడు. 607 00:56:04,364 --> 00:56:09,953 నగానో 608 00:56:27,137 --> 00:56:29,014 ఏమండీ. 609 00:56:29,014 --> 00:56:30,891 మీకు వర్కర్ ఎవరైనా కావాలా? 610 00:56:32,601 --> 00:56:35,312 నేను పని కోసం చూస్తున్నాను. 611 00:56:39,691 --> 00:56:43,403 నువ్వు ఆ కొరియన్లలో ఒకడివి కాదు, కదా? 612 00:56:44,112 --> 00:56:45,113 కాదు. 613 00:56:45,697 --> 00:56:46,990 నేను వాళ్లలో ఒకడిని కాదు. 614 00:56:48,617 --> 00:56:50,244 నేను కష్టపడి పనిచేస్తాను. 615 00:56:51,161 --> 00:56:52,496 ప్రమాణం చేస్తున్నా. 616 00:56:57,167 --> 00:56:58,627 సరే అయితే, 617 00:56:58,627 --> 00:57:00,212 నువ్వు ఏం చేయగలవో చూద్దాం. 618 00:57:09,638 --> 00:57:11,306 నేను నీ పేరు అడగడం మర్చిపోయా. 619 00:57:17,229 --> 00:57:18,730 నా పేరు ఒగావా. 620 00:57:20,774 --> 00:57:22,526 ఒగావా మినాటో. 621 00:57:53,807 --> 00:57:57,811 పచింకో 622 00:59:12,302 --> 00:59:14,304 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్