1 00:00:04,421 --> 00:00:06,840 అంతే. చాలా బాగా ఉంది. అదరగొట్టేశావు, ఫిల్. 2 00:00:06,924 --> 00:00:09,092 -తన బొమ్మ మళ్లీ పెట్టడం ఆనందంగా ఉంది. -నాకు కూడా. 3 00:00:09,176 --> 00:00:10,427 వావ్, బాగుంది. శుభోదయం. 4 00:00:10,511 --> 00:00:12,137 హేయ్, మనోడు వచ్చేశాడు. 5 00:00:12,221 --> 00:00:14,389 శుభవార్త, బాసూ. నీకు శుభవార్త. 6 00:00:14,473 --> 00:00:17,267 అమ్మానాన్నలు మళ్లీ కలిసిపోతున్నారు. 7 00:00:18,435 --> 00:00:21,146 అవును, మేం మళ్లీ భాగస్వాములం అయిపోతున్నాం. కానీ ఈసారికి నిజంగానే అన్నమాట. 8 00:00:21,230 --> 00:00:23,482 మేము కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం. 9 00:00:23,565 --> 00:00:28,904 అవును, మేం కలిసి ఒకటే అద్భుతమైన విస్తరణను అనుకున్న సమయానికి, బడ్జెట్ లోపే చేస్తాం. 10 00:00:30,030 --> 00:00:33,575 సరే. అది... చాలా మంచి విషయం. 11 00:00:33,659 --> 00:00:35,410 నువ్వు ఎగిరి గంతేస్తావు అనుకున్నామే. ఏమైంది? 12 00:00:35,494 --> 00:00:36,578 అవునులే, అలాగే అనుకొనుంటారు. 13 00:00:36,662 --> 00:00:39,706 ఎందుకంటే, ఎవరితో అయినా కమిట్ అయినప్పుడు, వారు ఆనందంగా ఉండాలని ఆశిస్తాం కదా. 14 00:00:40,541 --> 00:00:42,501 ఆ విధవతో ఎక్కడో చెడింది అన్నమాట, అంతేనా? 15 00:00:42,584 --> 00:00:44,294 నాతో వచ్చి ఉండమని తనకి చెప్పాను. 16 00:00:44,795 --> 00:00:45,921 తను కుదరదని చెప్పింది. 17 00:00:46,672 --> 00:00:48,465 -అవును. -సరే. 18 00:00:48,549 --> 00:00:50,926 నిజానికి, ముందు తను మనం డేటింగ్ మొదలుపెట్టింది ఈ మధ్యనే కదా అని అంది, 19 00:00:51,009 --> 00:00:54,221 ఇంకా, మన బంధం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అని అంది. 20 00:00:54,304 --> 00:00:58,058 కానీ నేను దాన్ని తప్పుగా అర్థంచేసుకొని, ఒక మోకాలి మీద కూర్చొని ప్రపోజ్ చేశాను. 21 00:00:58,141 --> 00:00:59,726 అయ్యో. 22 00:00:59,810 --> 00:01:01,937 అవును, ప్రపోజ్ చేశాను. 23 00:01:02,688 --> 00:01:04,857 -అయ్యో. -అవును. 24 00:01:05,399 --> 00:01:06,900 -అప్పుడు తను తిరస్కరించింది. -సరే. 25 00:01:06,984 --> 00:01:08,861 అవును, అప్పుడు ఒక పని చేద్దామనుకున్నాను, 26 00:01:08,944 --> 00:01:10,654 ఎలాగూ మోకాలి మీదనే ఉన్నాను కదా, ఇక తనని... 27 00:01:10,737 --> 00:01:12,823 -చేయకూడనిది చేసేశావా. -నేను బతిమాలాను. 28 00:01:13,407 --> 00:01:16,201 రెండు మోకాళ్ళ మీద కూర్చొని. "హేయ్, నీ బలహీనతను కూడా చూపించు పర్లేదు. 29 00:01:16,285 --> 00:01:17,911 అప్పుడప్పుడూ తోడేలు కూడా అలాగే చేస్తుంది. 30 00:01:17,995 --> 00:01:19,329 అవసరం వస్తే తప్పదు కదా," అనుకున్నా. 31 00:01:19,413 --> 00:01:20,998 -కానీ తనకి అది నచ్చలేదు. -అయ్యో. 32 00:01:21,081 --> 00:01:22,791 -అయ్యో. -వాళ్లకి ఒక మోకాలి మీద కూర్చుంటేనే ఇష్టం, 33 00:01:22,875 --> 00:01:24,543 రెండు మోకాళ్ల మీద కూర్చుంటే నచ్చదు. 34 00:01:24,626 --> 00:01:26,420 -కానీ తనకి ఆ రెంటిలో ఏదీ నచ్చలేదు. లేదు. -అయ్యో. 35 00:01:26,503 --> 00:01:27,588 కాబట్టి, అది... 36 00:01:28,672 --> 00:01:32,718 అది సరిగ్గా జరగలేదు. 37 00:01:32,801 --> 00:01:34,887 కాబట్టి, అంతటితో ఆ కథ... 38 00:01:37,097 --> 00:01:38,098 ముగిసింది. 39 00:01:38,182 --> 00:01:40,184 అవును, అది అర్థవంతంగానే ఉందిలే. 40 00:01:41,101 --> 00:01:43,312 కానీ ఏమైంది! అంతా మన మంచికే. 41 00:01:43,395 --> 00:01:46,315 అవును, తోడేలు దాని నుండి బయటపడిపోతుంది. ఎందుకంటే నేను ఏం గ్రహించానో తెలుసా? 42 00:01:46,398 --> 00:01:49,693 మీరే నా నిజమైన కుటుంబం అని గ్రహించాను. 43 00:01:49,776 --> 00:01:52,279 అవును, నా జీవితంలోకి మహిళలు వస్తుంటారు, పోతుంటారు... 44 00:01:52,362 --> 00:01:53,363 ఎక్కువగా పోతుంటారు. 45 00:01:53,447 --> 00:01:57,701 కానీ, ఎంక్యూ, ఇంకా ఇక్కడి ఉద్యోగులు, ఎప్పుడూ నాకు అండగానే ఉన్నారు. 46 00:01:57,784 --> 00:01:59,828 ఓ విషయం తెలుసా, బాసూ? మేము ఎల్లప్పుడూ అండగానే ఉంటాం. 47 00:02:00,537 --> 00:02:03,290 -హేయ్, తోడేలు మళ్లీ కదం తొక్కింది. -అవును, మళ్లీ కదం తొక్కింది. 48 00:02:03,790 --> 00:02:05,250 -మళ్లీ పనికి వచ్చేసింది. -తోడేలు మళ్లీ కదం తొక్కింది. 49 00:02:05,334 --> 00:02:06,335 -అవును. -తోడేలు మళ్లీ కదం తొక్కింది. 50 00:02:06,418 --> 00:02:07,669 కాచుకో, బంగారం. 51 00:02:07,753 --> 00:02:09,086 మీకు కాసేపు సరదాగా గడపాలనుందా? 52 00:02:09,170 --> 00:02:11,131 మాకు చాలా పని ఉంది, కానీ... 53 00:02:11,924 --> 00:02:12,925 అంతే కదా? 54 00:02:13,008 --> 00:02:14,384 అంతే. 55 00:02:26,688 --> 00:02:28,732 ఫోటో అప్ లోడ్ చేయవచ్చు 56 00:02:28,815 --> 00:02:30,275 అదీలెక్క. 57 00:02:32,194 --> 00:02:34,196 -హేయ్, డేవిడ్. -నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 58 00:02:34,279 --> 00:02:36,990 హేయ్, తప్పకుండా, లోపలికి రండి, బాబులూ. మీకోసం నేనెప్పుడూ అందుబాటులోనే ఉంటాను. 59 00:02:37,074 --> 00:02:38,617 అదే, అమ్మాయిలు. మహిళలు. 60 00:02:39,201 --> 00:02:41,161 నా ఎంక్యూ కుటుంబం కోసం నేనెప్పూడూ అందుబాటులోనే ఉంటాను. 61 00:02:41,745 --> 00:02:44,373 -సరే. -ఏదేమైనా, మేము... 62 00:02:44,456 --> 00:02:45,916 నేను ఇప్పుడే ఏం గ్రహించానో తెలుసా? 63 00:02:45,999 --> 00:02:48,794 మనం ముగ్గురం పని చేసే చోట్ల మధ్య దూరం పట్టుమని పది అడుగులు కూడా లేదు. 64 00:02:48,877 --> 00:02:51,547 కానీ, ఇన్నాళ్లూ మనం కలిసి ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అది వింతగా ఉంది కదా? 65 00:02:52,214 --> 00:02:53,465 -అవునా? -అంత వింతగా ఏం లేదే. 66 00:02:53,549 --> 00:02:55,551 -ఒక ఫోటో తీసుకుందాం. రండి. సరదాగా ఉంటుంది. -సరే. 67 00:02:55,634 --> 00:02:57,469 తీస్తున్నాను. దగ్గరికి రండి. 68 00:02:57,553 --> 00:02:59,972 -సరే. -వావ్. భలే ఉన్నాం. 69 00:03:00,055 --> 00:03:02,266 ముగ్గురు మొనగాళ్ళం. నవ్వండి. 70 00:03:03,684 --> 00:03:07,479 చాలా బాగా వచ్చింది. నాకు నచ్చింది. దీన్ని నేను నేరుగా నా డిజిటల్ ఫ్రేమ్ కి పంపుతాను, 71 00:03:07,563 --> 00:03:10,023 అందులో పూర్తిగా నా ఎంక్యూ కుటుంబ ఫోటోలనే పెట్టుకుంటూన్నా. 72 00:03:10,941 --> 00:03:12,818 డేవిడ్, మేము రాజీనామా చేస్తున్నాం. 73 00:03:15,487 --> 00:03:16,697 -ఏంటి? -అవును, 74 00:03:16,780 --> 00:03:19,658 -నేనూ, రేచల్ బర్కిలీకి వెళ్లిపోతున్నాం. -అవును. 75 00:03:19,741 --> 00:03:20,826 పెళ్లి చేసుకోవడానికా? 76 00:03:20,909 --> 00:03:22,536 -కాదు. -ఏంటి? కాదు. ఏంటి? 77 00:03:22,619 --> 00:03:23,745 -కాలేజీకి వెళ్తున్నాం. -అవును. 78 00:03:27,124 --> 00:03:28,667 నువ్వు ఆనందపడతావు అనుకున్నానే. 79 00:03:28,750 --> 00:03:31,795 నాకు ఆనందంగానే ఉంది. అది మంచి విషయమే. 80 00:03:31,879 --> 00:03:34,214 మీకు మంచిదేలే. 81 00:03:34,298 --> 00:03:35,924 అంటే, నేను... 82 00:03:36,008 --> 00:03:40,095 నేను కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాను అన్నమాట... 83 00:03:41,430 --> 00:03:43,056 దాన్ని ఏమైనా పంచుకుంటావా? 84 00:03:43,140 --> 00:03:45,350 ఆ గోల మీకు ఎందుకు లే. పర్వాలేదులే. 85 00:03:45,434 --> 00:03:46,602 చూడండి... 86 00:03:48,187 --> 00:03:50,272 మీ రాజీనామాలని నేను ఆమోదిస్తున్నాను. 87 00:03:50,355 --> 00:03:53,525 -ధన్యవాదాలు. -అవును. నీ సపోర్ట్ కి ధన్యవాదాలు, డేవిడ్. 88 00:03:53,609 --> 00:03:55,777 -అవును, నిజంగా నువ్వు చాలా గొప్ప బాస్ వి. -అవును. 89 00:03:57,946 --> 00:03:58,947 ధన్యవాదాలు. 90 00:04:00,908 --> 00:04:05,746 అంటే, సాధారణంగా ఇలాంటి సందర్భాలలో హత్తుకోవడం లాంటివి చేస్తుంటారు. 91 00:04:05,829 --> 00:04:07,414 -వద్దులే... -అలాంటివేవీ వద్దులే. 92 00:04:07,497 --> 00:04:10,292 అవునులే. అది ఇప్పుడు సముచితమైన పని కాదు. అది మంచిది కాదు. 93 00:04:10,375 --> 00:04:13,545 అయితే మనం... వీడ్కోలు చెప్పుకోవాలనుకుంటా. 94 00:04:13,629 --> 00:04:15,130 -సరే. బై. -గుడ్ బై, డేవిడ్. 95 00:04:15,214 --> 00:04:16,464 -బై, డేవిడ్. -సరే. 96 00:04:16,548 --> 00:04:17,548 -సరే. బై. -బై. 97 00:04:17,632 --> 00:04:18,675 బై. ధన్యవాదాలు. 98 00:04:29,645 --> 00:04:31,522 జాక్ 99 00:04:31,605 --> 00:04:32,689 జాక్ ని మాట్లాడుతున్నా. 100 00:04:32,773 --> 00:04:36,235 హృదయపూర్వక నమస్కారాలు, జాకరీ. 101 00:04:37,486 --> 00:04:38,487 హేయ్, నేను జోని. 102 00:04:39,112 --> 00:04:41,907 జో. మిథిక్ క్వెస్ట్ లో పని చేసే జోవి కదా. 103 00:04:41,990 --> 00:04:44,368 -ఎలా ఉన్నావు, అపరిచితురాలా? -నేను చాలా బాగున్నాను. 104 00:04:44,451 --> 00:04:46,370 ఎంక్యూ మొబైల్ గేమ్ ఎప్పుడెప్పుడూ లాంచ్ అవుతుందా అని 105 00:04:46,453 --> 00:04:49,665 ఎదురుచూస్తున్నా, ఎందుకంటే నీకు తెలుసు కదా, మనిద్దరం దీనితో ధనవంతులం అవ్వబోతున్నాం. 106 00:04:49,748 --> 00:04:51,750 మన్నించు. నాకు అర్థం కావడం లేదు. 107 00:04:51,834 --> 00:04:55,045 నాతో పరాచకాలు వద్దు. నేను నీకు ఒక రహస్య సమాచారం చెప్పినప్పుడు, నీకు ఎంక్యూ షేర్లు 108 00:04:55,128 --> 00:04:59,132 కొనమని నాకు పదివేల డాలర్లు నగదు రూపంలో పంపించావని మనిద్దరికీ తెలుసు. 109 00:04:59,216 --> 00:05:03,554 నేను నీకు ఇచ్చిన సమాచారాన్ని నువ్వు నీ విధులకు విరుద్ధంగా వాడుకున్నావు. 110 00:05:03,637 --> 00:05:04,638 మరీ మద్యాదపూర్వకంగా ఉంది 111 00:05:04,721 --> 00:05:06,098 షేర్లా? నగదా? జో. 112 00:05:06,181 --> 00:05:08,433 నువ్వేం చెప్తున్నావో, అది చాలా పెద్ద నేరం. 113 00:05:08,517 --> 00:05:10,853 నేను అలాంటి పనిని ఎప్పుడూ చేయను. 114 00:05:10,936 --> 00:05:13,814 అవును. నువ్వు మహా తెలివైనవాడివిలే. 115 00:05:14,690 --> 00:05:15,858 ధన్యవాదాలు. 116 00:05:15,941 --> 00:05:18,861 కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ నేరమని, దానికి పదేళ్ళ దాకా జైలు శిక్ష ఉంటుందని 117 00:05:18,944 --> 00:05:21,905 తెలుసుకోవడానికి పెద్ద తెలివేమీ అక్కర్లేదు. 118 00:05:21,989 --> 00:05:24,575 అంటే, ఎంత దద్దమ్మకి అయినా ఆ విషయం తెలియకుండా ఉంటుందా? 119 00:05:25,200 --> 00:05:26,326 కదా? 120 00:05:28,245 --> 00:05:31,081 నువ్వు నన్ను ఇరికించేశావు కద్రా, రెండు నాలుకల గుంట నక్కా. 121 00:05:31,748 --> 00:05:33,000 ఏమీ చేయలేం, జో. 122 00:05:33,083 --> 00:05:35,669 మా తమ్ముడిని అడిగానని చెప్పు. 123 00:05:42,634 --> 00:05:45,679 నా పని అయిపోయింది. నేను జైలుకు పోవడం ఖాయం. 124 00:05:45,762 --> 00:05:48,056 కంగారుపడకు, జోసెఫిన్. నేను సాయపడగలను. 125 00:05:48,140 --> 00:05:50,017 నేను కూడా జైలు జీవితాన్ని గడిపినవాడినే. 126 00:05:50,100 --> 00:05:51,935 -అవునా? -అవును. 127 00:05:52,436 --> 00:05:57,441 అన్నింటికన్నా భయంకరమైన జైలు జీవితం. నా మనస్సు అనే జైలులో గడిపాను. 128 00:05:58,775 --> 00:06:01,320 మంచిది. నేను నిజమైన జైలుకు వెళ్లబోతున్నాను. 129 00:06:01,403 --> 00:06:05,073 ఊచలు, జైలు గోడలు, ఖైదీలు గట్రా ఉంటాయి! 130 00:06:05,157 --> 00:06:08,827 నిజమే. అవును, నేనెప్పుడూ అక్కడికి వెళ్లలేదు. 131 00:06:08,911 --> 00:06:10,704 కానీ నేను చాలా భయంకరమైన విషయాలు విన్నాను. 132 00:06:15,542 --> 00:06:17,127 హేరా 133 00:06:17,211 --> 00:06:19,421 సరే. నాకు అర్థమైందనే అనుకుంటున్నా. 134 00:06:19,505 --> 00:06:23,967 ఆటగాళ్లందరూ మన గేమ్ ప్రపంచంలో, ఒకే సమయంలో, ఒకే గేమ్ వాతావరణాన్ని 135 00:06:24,051 --> 00:06:27,304 అనుభవించడానికి వీలుగా, నువ్వు సర్వర్ ఆర్కిటెక్చర్ ని, క్లయింట్ ఆర్కిటెక్చర్ ని 136 00:06:27,387 --> 00:06:28,597 మార్చాలనుకుంటున్నావు. 137 00:06:29,139 --> 00:06:31,850 అవును. అంతే. చూశారా, ఇతనికి అర్థమైపోయింది. 138 00:06:31,934 --> 00:06:33,560 -కానీ అది అసంభవం. -నేను చెప్పా కదా. 139 00:06:33,644 --> 00:06:35,187 నోర్మూసుకో, ఆంథోనీ. 140 00:06:35,270 --> 00:06:36,897 చూడు అది అసంభవంలాగానే అనిపిస్తుంది... 141 00:06:36,980 --> 00:06:38,732 లేదు, పాప్, అది నిజంగా అసంభవం. 142 00:06:38,815 --> 00:06:42,986 హేరా విషయంలో నీ ప్లాన్స్ సూపర్ ఉన్నాయి, కానీ ఎంక్యూ ఆర్కిటెక్చర్ దానికి సరిపోదు. 143 00:06:43,070 --> 00:06:46,114 ఈ పని ఇప్పటికే నిర్మించేసి ఉన్న ఇంద్ర భవానాన్ని కూల్చి 144 00:06:46,198 --> 00:06:47,616 మళ్లీ కట్టడం లాంటిది. 145 00:06:47,699 --> 00:06:48,700 చూశారా, ఆయనకి అర్థమైంది. 146 00:06:48,784 --> 00:06:50,369 అవును, ధన్యవాదాలు. నీ పేరు ఆంథోనీయే కదా? 147 00:06:50,452 --> 00:06:52,788 నోర్మూసుకో. నువ్వు పాపీ లీతో మాట్లాడుతున్నావు. 148 00:06:52,871 --> 00:06:55,624 -సరేనా? తను మహా మేధావి. -అవును. 149 00:06:56,333 --> 00:07:00,462 నేను తనకి ఎంత పనికిమాలిన ఐడియా చెప్పినా, తను దాన్ని చేసి చూపెడుతుంది. 150 00:07:00,546 --> 00:07:03,090 -అవును. -ప్రతీసారి, తను సాధించి చూపుతుంది. 151 00:07:03,173 --> 00:07:04,383 -అవును. -ఈసారి తప్ప. 152 00:07:04,466 --> 00:07:05,968 అవును! ఏంటి? 153 00:07:06,051 --> 00:07:08,679 పాప్, హేరాని రూపొందించడం సాధ్యం కాదని నాకు అలాగే అర్థమైంది. 154 00:07:08,762 --> 00:07:11,014 ఎందుకంటే అది సాధ్యమే అయ్యుంటే, 155 00:07:11,098 --> 00:07:12,391 ఈపాటికే నువ్వు చేసేసి ఉండేదానివి. 156 00:07:15,018 --> 00:07:16,061 నువ్వన్నది నిజమే. 157 00:07:17,729 --> 00:07:19,940 దేవుడా. నువ్వు చెప్పింది నిజమే. 158 00:07:20,023 --> 00:07:25,529 -నేను చాలా సమయాన్ని, వనరులని నా... -నీ విజన్ మీద వృథా చేశావు. 159 00:07:25,612 --> 00:07:28,407 మన పని అదే కదా. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. 160 00:07:28,490 --> 00:07:31,118 దురదృష్టవశాత్తూ, ఒక్కోసారి అంతే ఘోరంగా విఫలమవుతుంటాయి. 161 00:07:31,910 --> 00:07:35,163 కానీ, హేయ్, పాప్, నువ్వు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. 162 00:07:35,247 --> 00:07:37,082 అంటే, నువ్వేదో ఆషామాషీగా విఫలమవ్వలేదు. 163 00:07:37,624 --> 00:07:39,001 -ధన్యవాదాలు. -అవును. అవును. 164 00:07:39,084 --> 00:07:42,504 అవును, ఇదెంత గొప్ప ఆలోచన అంటే, దీని వల్ల మన స్టూడియీ అంతా దివాళా తీసుండేది. 165 00:07:43,172 --> 00:07:44,965 దాదాపు దివాళా తీయబోయింది. గొప్ప విషయమది. 166 00:07:45,048 --> 00:07:47,384 -వావ్. -అవును, అవును. 167 00:07:47,467 --> 00:07:50,095 సరే మరి. ఇక ఆపేయండి, అబ్బాయిలూ. 168 00:07:50,179 --> 00:07:53,515 -వాళ్ళు పురుషులు. -పురుషులు. ఇక ఆపేయండి, పురుషులారా. 169 00:07:53,599 --> 00:07:56,101 మనదంతా వృథా ప్రయాస. హేరాని రూపొందించడం సాధ్యపడదు. 170 00:07:56,185 --> 00:08:00,397 -నేను అదే ఎన్నో నెలల నుండి చెప్తున్నా. -నోర్మూయ్, ఆంథోనీ. నీ నోర్మూసేయ్. 171 00:08:10,073 --> 00:08:12,784 హేయ్, నా సామాను అంతా సర్దేశాను, నీకేమైనా ఆకలిగా ఉందా? 172 00:08:12,868 --> 00:08:14,286 నాకు అడ్మిషన్ దొరకలేదు. 173 00:08:15,913 --> 00:08:16,997 ఏంటి? 174 00:08:17,080 --> 00:08:21,543 నాకు బర్కిలీలో అడ్మిషన్ దొరకలేదు. వాళ్లు నన్ను తీసుకోలేమన్నారు. 175 00:08:23,629 --> 00:08:25,589 మనం మన ఉద్యోగాలను కూడా వదిలేశామే. 176 00:08:25,672 --> 00:08:28,008 మనం ఉద్యోగాలను వదిలేశాం, నీకేమో అడ్మిషన్ వచ్చిందో లేదో కూడా తెలీదా? 177 00:08:28,091 --> 00:08:31,178 ఉత్సాహంతో నా కళ్లు మూసుకోపోయాయి. అడ్మిషన్ ఖాయం అని అనుకున్నాను. 178 00:08:31,261 --> 00:08:32,679 ఓరి దేవుడా. 179 00:08:32,763 --> 00:08:35,640 కెరోల్ మన రిలీవింగ్ లెటర్లను పట్టుకొని ఇప్పుడు ఇక్కడికే వస్తోంది. 180 00:08:35,724 --> 00:08:40,062 నేనేం లోకంలో ఉన్నానో ఏమో. దేవుడా, నేను దద్దమ్మని. 181 00:08:40,145 --> 00:08:43,190 లేదు, నువ్వు దద్దమ్మవి కాదు. నువ్వు దద్దమ్మవి కాదు. 182 00:08:43,690 --> 00:08:46,944 ఆ చెత్త మేకని చంపేస్తాను. 183 00:08:47,611 --> 00:08:48,612 అయ్యో, బంగారం. 184 00:08:51,156 --> 00:08:53,617 బాబోయ్. నాకెందుకులే. 185 00:08:54,409 --> 00:08:55,410 ఇదిగోండి. 186 00:09:00,541 --> 00:09:02,084 బ్రాడ్, ఇప్పుడు మాత్రం ఆ పని చేయకు. 187 00:09:03,418 --> 00:09:05,379 జాక్ తన నోటితో నిజం ఒప్పుకొనేలా చేయడంలో నాకు నీ సాయం కావాలి. 188 00:09:05,462 --> 00:09:08,215 ఒక పెద్ద, భయంకరమైన సొరచేప, చిట్టెలుకను హాంఫట్ చేసేయాలని చూశాక కూడా 189 00:09:08,298 --> 00:09:11,343 ఆ చిట్టెలుక, ఆ సొరచేపకు ఎందుకు సాయపడుతుందమ్మా? 190 00:09:11,426 --> 00:09:14,096 -ఎందుకంటే నువ్వు మంచివాడివి కనుక? -నన్ను దెప్పిపొడవడం వల్ల లాభం ఉండదు. 191 00:09:14,179 --> 00:09:16,598 ప్లీజ్, బ్రాడ్. నాకు జైలుపాలవ్వాలని లేదు. 192 00:09:16,682 --> 00:09:20,227 జో... నీకు నేను సాయపడలేను. 193 00:09:20,853 --> 00:09:26,316 ఒక్కోసారి మనలో సమస్య ఉందని కిందపడ్డాక గానీ మనకి తెలీదు, నీకు నిజంగానే సమస్య ఉంది. 194 00:09:26,400 --> 00:09:28,652 నువ్వు అధికారానికి బానిస అయ్యావు, జైలుకెళ్తే కానీ అది తగ్గదు. 195 00:09:28,735 --> 00:09:30,362 నువ్వు అక్కడ లా డిగ్రీని కూడా సంపాదించుకోవచ్చు, 196 00:09:30,445 --> 00:09:32,573 కానీ దానితో నీకు ఇంకాస్త అధికారం వస్తుంది, మళ్లీ జైలు పాలవుతావు. 197 00:09:32,656 --> 00:09:34,283 కానీ, బానిసత్వం అనేది ఒక విషవలయం లాంటిది. 198 00:09:34,366 --> 00:09:37,035 నువ్వు నాకు సాయపడటం లేదని, నీకు నువ్వే సాయం చేసుకుంటునట్టు అవుతుందని చెప్తే? 199 00:09:40,330 --> 00:09:41,331 చెప్పు. 200 00:09:41,415 --> 00:09:44,501 మనం కలిసి పని చేస్తే, ఈ నేరాన్ని మనం అతని మీద తోసేయవచ్చు. 201 00:09:44,585 --> 00:09:47,045 నీకు ఎంతో ఇష్టమైన కేట్ ని చంపినందుకు నువ్వు పగ తీర్చుకోవచ్చు. 202 00:09:47,129 --> 00:09:49,047 నీ అన్నయ్యని జైలుకు పంపడంలో నీకు నేను సాయపడగలను. 203 00:09:51,550 --> 00:09:55,179 మహా అయితే ఆరు నెలలు అంతే. అది కూడా రాజభోగాలు దక్కుతాయి. 204 00:09:55,262 --> 00:09:57,723 మన ప్రొఫెషన్ లో ఒక్కోసారి దాని వలన ప్రయోజనం కూడా ఉంటుంది. 205 00:09:57,806 --> 00:10:00,142 భయంకరమైనవాడివి అనే పేరు నీకు వస్తుంది. నీతో పెట్టుకోకూడదని అర్థమవుతుంది. 206 00:10:00,225 --> 00:10:02,269 ఏదేమైనా, మీ అన్నయ్యని పోలీసులకు పట్టిస్తే కిరాక్ ఉంటుంది. 207 00:10:02,352 --> 00:10:04,855 మీ కుటుంబంలో నిజమైన సొరచేపవి నువ్వే అని నిరూపించుకోవడానికి నీకు ఇదే సదావకాశం. 208 00:10:04,938 --> 00:10:06,565 మా కుటుంబంలో నేనే నిజమైన సొరచేపని. 209 00:10:08,108 --> 00:10:10,402 సరే, నేను సహాయం చేస్తాను. నువ్వు ఈ కథ చెప్పాలి. 210 00:10:10,485 --> 00:10:13,697 నువ్వు నీకంటే పెద్దవాడు, అనుభవజ్ఞుడైన ఒక కేటుగాడి చేతిలో మోసపోయావు. 211 00:10:13,780 --> 00:10:15,282 ఫెడరల్ ఏజెంట్స్ కి కేటుగాళ్ళంటే ఇష్టం. 212 00:10:15,365 --> 00:10:17,743 నువ్వేమో ఒక మంచిదానివి, ఏది చెప్పినా నమ్మేసే యువతివి. 213 00:10:18,243 --> 00:10:20,078 -అమ్మాయిని. -ఇంకా మంచిది. 214 00:10:23,248 --> 00:10:25,792 -అది కుక్క అనుకుంటా. -అది ఎందుకు కుంటుతోంది? 215 00:10:25,876 --> 00:10:27,419 బహుశా గాయపడి ఉందేమో. 216 00:10:27,503 --> 00:10:30,547 అయితే ఇది ఒక విషాదకరమైన, గాయపడిన కుక్కకు సంబంధించిన ఆటనా? 217 00:10:31,048 --> 00:10:32,508 ఏమో మరి. 218 00:10:34,051 --> 00:10:36,803 -నిజానికి, ఆ ఆట... -నిన్నెవరు మాట్లాడమన్నారు. 219 00:10:36,887 --> 00:10:38,388 ఒక విషయం స్పష్టంగా చెప్పు. 220 00:10:38,472 --> 00:10:42,518 బ్రాడ్ ఈ ప్రాజెక్ట్ ని రద్దు చేసేసినా నువ్వు దీని మీద పనిచేయడం ఆపలేదు. 221 00:10:42,601 --> 00:10:46,855 ఇక నిన్న, బర్కిలీలో చదువుకోవడానికి నువ్వు నీ ఉద్యోగం మానేశావు. 222 00:10:46,939 --> 00:10:48,857 కానీ నీకు సీటు దొరకలేదు. 223 00:10:48,941 --> 00:10:52,361 కాబట్టి, నీ ఉద్యోగం, ఇంకా నీ ప్రియురాలి ఉద్యోగం వెనక్కి ఇప్పించమని అడుక్కోవడానికి 224 00:10:52,444 --> 00:10:55,405 గేమ్ యొక్క భవిష్యత్తు గురించి జరుగుతున్న ఒక అతి ముఖ్యమైన సమావేశంలో ఉన్న 225 00:10:55,489 --> 00:10:59,451 నీ బాస్ లను ఇలా లాక్కురావాలని టెస్టర్ వి అయిన నువ్వు నిర్ణయించుకున్నావన్నమాట. 226 00:11:03,539 --> 00:11:05,207 -ఇప్పుడు నేను మాట్లాడవచ్చా? -లేదు. 227 00:11:05,290 --> 00:11:07,167 మన్నించండి. చాలా సేపు నిశ్శబ్దంగా ఉంటే అడిగాను. 228 00:11:07,251 --> 00:11:08,836 -మరి ఇదంతా ఎప్పుడు జరిగింది? -నాకు తెలీదు. 229 00:11:08,919 --> 00:11:12,381 చూడబోతే, 30 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ వ్యక్తికీ, 230 00:11:12,464 --> 00:11:16,176 తమ ఊహల్లో ఏముందో, దాన్ని ఈ ప్రపంచం ముందు పరచాలని, 231 00:11:16,260 --> 00:11:18,011 దాన్ని మనం పట్టించుకోవాలని అనుకుంటున్నట్టున్నారు... 232 00:11:18,095 --> 00:11:19,721 -ఒకటి చెప్పనా? క్షమించు. -అబ్బే, అదేం... 233 00:11:19,805 --> 00:11:21,223 -ఇది నాకు పిచ్చెక్కిస్తుందని నీకు తెలుసు. -అవును. 234 00:11:21,306 --> 00:11:23,225 -నేనేమంటున్నానో అర్థమైంది కదా? -దీనికి నువ్వు బాధ్యుడివి కాదు. 235 00:11:23,308 --> 00:11:24,518 నీకెలా అనిపిస్తోందో నాకు తెలుసు. 236 00:11:25,102 --> 00:11:27,229 సరే మరి. మరి ఈ కుక్క సంగతేంటి? 237 00:11:29,356 --> 00:11:30,482 ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు. 238 00:11:31,191 --> 00:11:32,776 -నేనేనా? -అవును. ఇక ఎవరితో మాట్లాడుతున్నానేంటి? 239 00:11:32,860 --> 00:11:36,321 -నువ్వు కనీసం నా వైపు చూడటం లేదు కూడా! -మాట్లాడు! 240 00:11:37,197 --> 00:11:38,198 అది మేక. 241 00:11:39,032 --> 00:11:41,201 -అది దరిద్రంగా ఉంది. -నాకు తెలుసు. 242 00:11:41,285 --> 00:11:43,036 అయినా కానీ దాని మీద పనిచేస్తున్నావు. ఎందుకు? 243 00:11:43,120 --> 00:11:47,040 ఏమో. నాకు అందులో ఏదో కనబడుతోంది. 244 00:11:48,333 --> 00:11:51,628 మరి నేను కూడా అది దరిద్రంగా ఉందంటే, నువ్వు నేను చెప్పింది నమ్ముతావా? 245 00:11:52,379 --> 00:11:54,047 -నమ్ముతా. -కానీ దాని మీద పనిచేయడం ఆపేస్తావా? 246 00:11:54,131 --> 00:11:55,465 ఆపేస్తాను. 247 00:11:57,718 --> 00:11:58,719 లేదు. 248 00:12:01,638 --> 00:12:03,473 దాన్ని ఇంకా బాగా చేయవచ్చని నాకనిపిస్తోంది, ఎందుకంటే... 249 00:12:03,557 --> 00:12:05,559 సరే, సరే, సరే. 250 00:12:10,606 --> 00:12:12,858 సరే మరి. నీకు ఒక ప్రోగ్రామింగ్ కాలేజీలో సీటు ఇప్పిస్తాం. 251 00:12:12,941 --> 00:12:14,902 బర్కిలీలో కాదు. వేరే తగిన కాలేజీలో. 252 00:12:14,985 --> 00:12:16,445 స్థానిక కాలేజీలో. ఫీజు ఎంక్యూయే కడుతుంది. 253 00:12:16,528 --> 00:12:18,197 ఇంకా నీతో ఒక అంగీకారం కుదుర్చుకుంటాం, 254 00:12:18,280 --> 00:12:20,407 నువ్వు పట్టా పొందాక వేరే ఎక్కడో పనిచేయడానికి వెళ్లిపోతే 255 00:12:20,490 --> 00:12:21,909 మేము వెధవలు కాకూడదు కదా. 256 00:12:21,992 --> 00:12:25,787 మన్నించండి. అంతా చాలా వేగంగా, అర్థంకాకుండా జరిగిపోతోంది. 257 00:12:25,871 --> 00:12:27,414 మీకు ఆట నచ్చిందని అంటున్నారా? 258 00:12:27,497 --> 00:12:30,542 నీకు మేం చెప్పేది అర్థం కావడం లేదా? మేము ఆట చండాలంగా ఉందని అనుకుంటున్నాం. 259 00:12:30,626 --> 00:12:33,462 కానీ నువ్వు కాదు. అదొక్కటే ముఖ్యమైనది. 260 00:12:33,545 --> 00:12:36,006 ఈ ఉద్యోగానికి ప్రతిభ ఒక్కటి ఉంటే చాలు అనుకుంటున్నావా? 261 00:12:36,089 --> 00:12:37,674 -లేదు, ఇంకా... -పిచ్చి ఉండాలి. 262 00:12:38,467 --> 00:12:40,469 నేను ధైర్యం అని చెప్పబోతున్నాను. 263 00:12:40,552 --> 00:12:42,596 ధైర్యం. అవును, నీకు ధైర్యం ఉండాలి. 264 00:12:42,679 --> 00:12:45,015 అవును. ఇక్కడున్న జనాలను చూశావా, 265 00:12:45,098 --> 00:12:48,519 వాళ్ల "గొప్ప" ఆలోచనలను ఎవరైనా తిరస్కరిస్తే చాలు, మొత్తం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. 266 00:12:48,602 --> 00:12:50,229 అది ప్రతిరోజూ, అనునిత్యం జరిగేదే. 267 00:12:50,312 --> 00:12:53,106 ఇప్పుడు నువ్వేమైనా అద్భుతమైనదాన్ని సాధిస్తావా? అది నాకు తెలీదు. 268 00:12:53,190 --> 00:12:55,901 కానీ నువ్వు సాధించేదాకా నిద్రపోవన్నది మాత్రం అక్షర సత్యం. 269 00:12:55,984 --> 00:12:57,277 ఇది చూస్తే తెలిసిపోతుంది కదా. 270 00:12:57,361 --> 00:13:00,948 ఇక్కడున్న వాళ్లంతా, అప్పటికప్పుడే ఆశలు వదిలేసుకుంటారు. 271 00:13:01,031 --> 00:13:03,951 -ఎందుకంటే, ఎక్కువ శాతం మంది... -చవటలు. 272 00:13:04,034 --> 00:13:05,369 నేను ఏమనబోతున్నానంటే... 273 00:13:06,119 --> 00:13:09,456 లేదులే, నేను కూడా చవటలు అనే అనబోతున్నాను ఎందుకంటే, అంతకన్నా మంచి పదం ఉండదు. 274 00:13:09,540 --> 00:13:11,416 -మనం ఒక పదాన్ని సృష్టించాలేమో. -అవును. సరే. 275 00:13:11,500 --> 00:13:13,418 -దాని మీద పని చేద్దాం. -ఈలోపు, 276 00:13:13,502 --> 00:13:15,337 వీళ్లందరూ చవటలు, నువ్వేమో పిచ్చి ధైర్యం ఉన్నదానివి. 277 00:13:16,255 --> 00:13:19,091 మనం పేర్లు తగిలించడం ఆపాలి. అదో వివాదాస్పదమైన విషయంగా అయిపోతుంది. 278 00:13:19,174 --> 00:13:20,175 అవును. నిజమే. 279 00:13:20,259 --> 00:13:22,761 మీ ఇద్దరికీ ఏమీ కాకపోవచ్చు. కానీ, నా ఉద్యోగమే పోతుంది అనుకుంటా. 280 00:13:22,845 --> 00:13:26,265 సరే మరి, ఇక బయలుదేరు. మాకు తీరిక లేదు. గుడ్ బై. 281 00:13:28,308 --> 00:13:30,227 సరే. ధన్యవాదాలు. వావ్. 282 00:13:32,312 --> 00:13:34,022 నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. 283 00:13:36,149 --> 00:13:37,442 నేను ఎంత కృతజ్ఞతాభావంగా... 284 00:13:37,526 --> 00:13:39,278 బాబోయ్. నీ తొక్కలో ఫీలింగ్స్ ఎవరికి కావాలి! 285 00:13:39,361 --> 00:13:41,196 మేము ఇక్కడ ఒక కంపెనీని నడిపించే పనిలో ఉన్నాం! 286 00:13:41,280 --> 00:13:42,906 సరే. ధన్యవాదాలు. 287 00:13:57,254 --> 00:13:58,547 ఒక్క నిమిషం. ఎక్కడ? 288 00:14:01,175 --> 00:14:02,509 అయ్యయ్యో. 289 00:14:04,761 --> 00:14:06,096 ఎంతైనా బాగుందిలే! 290 00:14:08,557 --> 00:14:11,185 అనుకున్నదే జరుగుతోంది. ఫెడరల్ ఏజెంట్స్ వచ్చారు. ఓరి దేవుడా. 291 00:14:12,477 --> 00:14:13,854 జాక్ నన్ను పట్టించేశాడు. 292 00:14:13,937 --> 00:14:16,148 అంత ఓవర్ వద్దు. నిన్ను జాక్ ఏమీ పట్టించలేదు. 293 00:14:16,231 --> 00:14:17,399 -అది నా పనే. -ఏంటి? 294 00:14:17,482 --> 00:14:20,569 అవును. మిథిక్ క్వెస్ట్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని 295 00:14:20,652 --> 00:14:22,613 ఎస్.ఈ.సికి నేను అనామకంగా కాల్ చేసి చెప్పాను. 296 00:14:24,615 --> 00:14:26,200 ఇక ఇదే నిన్ను ఆఖరిసారి చూడటం అనుకుంటా. 297 00:14:26,283 --> 00:14:27,409 దేవుడా. 298 00:14:29,286 --> 00:14:31,955 -నువ్వు నిజంగానే సొరచేపవి. -నువ్వు సరిగ్గానే చెప్పావు. 299 00:14:34,041 --> 00:14:35,125 వచ్చి తీసుకుపోండి! 300 00:14:37,002 --> 00:14:40,130 మిస్టర్ బాక్షీ. మేము ఎస్.ఈ.సి నుండి వస్తున్నాం. 301 00:14:40,214 --> 00:14:41,507 మేము మీతో ఏకాంతంగా మాట్లాడవచ్చా? 302 00:14:41,590 --> 00:14:43,509 తప్పకుండా, మిత్రులారా. ఒక్క నిమిషం. 303 00:14:46,261 --> 00:14:47,679 వాళ్ళు నీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? 304 00:14:47,763 --> 00:14:51,683 విషయం ఏంటంటే, జో, వాళ్లు అసలైన కేటుగాడి కోసం వచ్చారు. 305 00:14:53,018 --> 00:14:55,312 ఒక్క నిమిషం. నువ్వు నీ మీదే ఫిర్యాదు చేసుకున్నావా? 306 00:14:55,938 --> 00:14:58,023 -నా కోసం నువ్వు ఇలా చేశావంటే నమ్మలేకున్నా. -లేదు. 307 00:14:58,106 --> 00:15:02,027 నేను నా కోసమే చేశాను. దీని వల్ల నా పేరు ఎక్కడికో వెళ్లిపోతుందని నీకు తెలుసా? 308 00:15:02,528 --> 00:15:03,904 ఇక నన్ను అమాయకుడిగా చూడరు. 309 00:15:06,823 --> 00:15:09,535 మిత్రులారా, మీ సమయాన్ని నేను ఎక్కువగా వృథా చేయను. 310 00:15:09,618 --> 00:15:12,037 ఆ పని నేనే చేశాను. నేనే దోషిని. 311 00:15:12,913 --> 00:15:14,289 వచ్చి నాకు సంకెళ్లు వేయండి. 312 00:15:15,207 --> 00:15:17,251 మేము కేవలం మాట్లాడటానికే వచ్చాం. 313 00:15:17,334 --> 00:15:21,046 మనం ఇక్కడే లేదా సమావేశ గదిలో మాట్లాడుకోవచ్చు. నిజానికి, ఎక్కడైనా ఓకే. 314 00:15:24,508 --> 00:15:26,093 -సరే. -ఒక్క నిమిషం! 315 00:15:26,176 --> 00:15:28,804 ఇతడిని పార్కింగ్ ప్రదేశం దాకా తీసుకెళ్లండి. దీన్ని చూస్తే నమ్మేస్తారు. 316 00:15:28,887 --> 00:15:30,806 -ఆ అవసరం లేదు. -ఉంది. 317 00:15:32,599 --> 00:15:33,767 నాకు నువ్వు నచ్చావు. 318 00:15:34,768 --> 00:15:35,769 నాకు తెలుసు. 319 00:15:43,652 --> 00:15:45,654 సరే మరి, మిత్రులారా. ఇక్కడేమీ జరగడం లేదు! 320 00:15:45,737 --> 00:15:49,366 ఒకరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంతే. కరుడుగట్టిన నేరస్థుడిని తీసుకెళ్తున్నారు. 321 00:15:52,452 --> 00:15:54,580 అంతే, ఫోటో తీసి మంచి పని చేశావు. 322 00:15:56,665 --> 00:15:59,001 ఓయ్, బ్రాడ్. అంతా బాగానే ఉందా? 323 00:15:59,835 --> 00:16:01,795 చాలా బాగుంది. మళ్లీ ఆరు నుండి ఎనిమిది నెలల్లో కలుద్దాం. 324 00:16:07,217 --> 00:16:08,635 అందరూ నాశనమైపోండి! 325 00:16:10,762 --> 00:16:12,055 నేనేమైనా మిస్ అయ్యనా? 326 00:16:18,729 --> 00:16:20,939 టెస్టింగ్ విభాగం 327 00:16:21,023 --> 00:16:24,067 అంతే. ఎప్పటిలా దరిద్రంగానే ఉంది. 328 00:16:24,151 --> 00:16:25,569 అవును, అంతా మామూలు స్థితికి వచ్చేసింది. 329 00:16:26,153 --> 00:16:30,115 ఇది చాలా గొప్ప విషయం. నువ్వు ఇక్కడ పని చేస్తావు. నేను దగ్గర్లోనే ఉంటాను. 330 00:16:30,199 --> 00:16:33,577 నిన్ను చూడటానికి తరచుగా వస్తుంటాను. అది ఎప్పటిలాగా మామూలిగానే ఉంటుంది. 331 00:16:34,161 --> 00:16:35,329 అవును. 332 00:16:37,122 --> 00:16:38,498 నేను వెళ్లాలి అనుకుంటా. 333 00:16:38,582 --> 00:16:40,751 తప్పదుగా. రెడ్ బుల్ డ్రింక్స్ ఎన్ని తాగావో లెక్కే లేదు. 334 00:16:41,793 --> 00:16:43,504 అది కాదు, డానా, నా ఉద్దేశం... 335 00:16:45,339 --> 00:16:46,715 నేను బర్కిలీకి వెళ్లాలనుకుంటున్నా. 336 00:16:48,217 --> 00:16:49,343 రచన కోర్సులో చేరడానికి. 337 00:16:51,220 --> 00:16:52,721 అవును, నేను అందులో చేరాలనుకుంటా. 338 00:16:55,390 --> 00:16:58,560 నిజం చెప్పాలంటే, ఈ మాటలు నేనే చెప్తున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు, 339 00:16:58,644 --> 00:17:00,020 కానీ... 340 00:17:01,438 --> 00:17:02,773 నాకు కావలసింది అదే. 341 00:17:03,524 --> 00:17:05,358 -నేను లేకుండా వెళ్దామనుకుంటూన్నావా? -లేదు. 342 00:17:05,442 --> 00:17:06,859 నాకు నీతోనే వెళ్లాలనుంది. 343 00:17:06,944 --> 00:17:10,280 కానీ... నువ్వు వెళ్లకపోతే... 344 00:17:15,327 --> 00:17:16,869 అయినా కానీ నాకు వెళ్లాలనుంది. 345 00:17:20,540 --> 00:17:21,750 సరే, 346 00:17:22,542 --> 00:17:24,837 నువ్వు నిశ్చయించేసుకున్నట్టున్నావు. 347 00:17:26,255 --> 00:17:28,924 అవును, కానీ... నాకు అది అవసరం. 348 00:17:30,008 --> 00:17:31,718 నువ్వు నన్ను ఛీత్కరించుకుంటున్నావా? 349 00:17:31,802 --> 00:17:34,012 నిన్నా? నీ మొహంలే. 350 00:17:34,096 --> 00:17:36,849 రేచ్, నేను ఒక్కదాన్నే వెళ్దామనుకున్నప్పుడు 351 00:17:36,932 --> 00:17:40,269 మన ఇద్దరం దూరంగా ఉండాల్సి వస్తుందని ఆలోచించాను. ఇప్పుడు పెద్ద తేడా ఏముంది? 352 00:17:41,645 --> 00:17:44,064 అంటే, ఇప్పుడు పరిస్థితి అటూఇటూ అయితే తప్ప. 353 00:17:45,899 --> 00:17:50,279 అయ్యో. మనిద్దరి మధ్య ఏదైనా మారిందా? నాకు అప్పుడు తెలీలేదు. 354 00:17:50,362 --> 00:17:55,576 కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తికమకగా ఉంది, నీకు ఆలోచించడానికి నేను అవకాశం ఇవ్వలేదు, 355 00:17:55,659 --> 00:17:58,245 నేను హడావిడి పెట్టేశాను అనుకుంటా, ఇంకా నాకు... 356 00:18:04,084 --> 00:18:06,170 మన్నించు, నువ్వు నోరు మూసేలా లేవు. 357 00:18:11,175 --> 00:18:14,595 హేయ్, కేరొల్ మనకి ఆఫీసులో సరసాలాడుకోవద్దని చెప్పిన విషయం గుర్తుంది కదా? 358 00:18:15,679 --> 00:18:17,055 అవును. 359 00:18:20,392 --> 00:18:21,935 మనం ఇప్పుడు ఇక్కడ పనిచేయడం లేదు. 360 00:18:44,208 --> 00:18:46,043 -దేవుడా, భలేగా ఉంది. -సందేహమే లేదు. 361 00:18:46,126 --> 00:18:48,337 వావ్. పాప్, వీటన్నింటినీ స్వయంగా నువ్వే ఏర్పాటు చేశావా? 362 00:18:48,420 --> 00:18:51,381 లేదు, ఆర్కైవ్ల నుండి అర్థరాత్రి ఆర్ట్ డిపార్టుమెంట్ చేత 363 00:18:51,465 --> 00:18:52,633 ఇవన్నీ తీయించి ఇక్కడ పెట్టించా. 364 00:18:52,716 --> 00:18:55,594 వావ్, ఇందులో నేను మొదట్లో గీసిన ఒరిజినల్ చిత్రాలు కూడా ఉన్నాయి. 365 00:18:55,677 --> 00:18:58,013 అవును. మనం చేసిందే చేయకుండా ఉండాలంటే, 366 00:18:58,096 --> 00:19:00,432 మనం మొదట్లో ఎలా ఉండేవాళ్లమో గుర్తుచేసుకుంటే మంచిదేమో అనిపించింది. 367 00:19:00,516 --> 00:19:03,143 ఇది గతాన్ని స్మరించుకుంటున్నట్టుంది. 368 00:19:03,227 --> 00:19:05,062 అటు చూడండి. మాగ్ యాడ్! 369 00:19:05,854 --> 00:19:07,981 అది ఎంక్యూలో చోటు సంపాదించిన నీ మొదటి ఐడియా. 370 00:19:08,065 --> 00:19:11,818 నిజానికి అది నా ఐడియా ఏమీ కాదు. మనం కాసా వేగాలో పీకల దాకా తాగున్నాం, 371 00:19:11,902 --> 00:19:14,613 ఇక నేను మార్గరీటా డ్రింక్ ని పొరపాటున "మార్గ్ యార్డ్" అని అన్నాను. 372 00:19:14,696 --> 00:19:16,782 దాన్ని గీసి, ఆటలోకి ప్రవేశపెట్టింది నువ్వే. 373 00:19:16,865 --> 00:19:18,575 మనం మళ్లీ బార్ టిష్యూ పేపర్ల మీద గీయడం ప్రారంభించాలి. 374 00:19:18,659 --> 00:19:19,660 -దాని మీద చాలా బాగా వస్తాయి. -అవును. 375 00:19:19,743 --> 00:19:22,663 ఇది ఒక చిన్నారి జీవితాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది, 376 00:19:22,746 --> 00:19:25,541 జన్మించిన నాటి నుండి బాల్యం, 377 00:19:25,624 --> 00:19:29,545 యవ్వనప్రాయం, టీనేజ్, ఇక ఆఖరికి... 378 00:19:31,380 --> 00:19:34,007 -రేవన్స్ బ్యాంక్వెట్. -మన అద్భుతమైన సృష్టి. 379 00:19:34,091 --> 00:19:35,217 మిథిక్ క్వెస్ట్: రేవన్స్ బ్యాంక్వెట్ 380 00:19:35,300 --> 00:19:37,052 హాలు చివరకు వచ్చేశాం. 381 00:19:37,135 --> 00:19:40,138 లేదా బహుశా... మనకి ఇక ముందుకు దారి లేదేమో. 382 00:19:40,222 --> 00:19:43,392 అంటే, మనం ఈ గోడను బద్దలు కొట్టేసి, 383 00:19:43,475 --> 00:19:44,768 హాలును పొడగించవచ్చు. 384 00:19:44,852 --> 00:19:46,395 లేదా మనం ఎడమ వైపుకు తిరిగి 385 00:19:46,478 --> 00:19:49,064 ఇప్పటికే ఉన్న దారిలో నడవచ్చు కూడా. 386 00:19:49,147 --> 00:19:52,401 నువ్వు మరీ కరువుగా ఆలోచిస్తున్నావు, పాపీ. ఊహించుకో, ఒక పెద్ద హాలు... 387 00:19:52,484 --> 00:19:54,236 మీకు అర్థం కావడం లేదా? 388 00:19:55,195 --> 00:19:57,823 పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోయాడు. కాలేజీకి వెళ్లిపోయాడు. 389 00:19:57,906 --> 00:19:59,533 అమ్మాయి కూడా కావచ్చు. ఆటను అమ్మాయిగా కూడా వర్ణించవచ్చు. 390 00:19:59,616 --> 00:20:02,995 మనం ఇప్పుడు స్నేహపూర్వకంగా ఉంటున్నాం. ఇప్పుడు నువ్వు ఏది పడితే అది వాగితే ఎలా? 391 00:20:03,579 --> 00:20:05,414 నేను చెప్పేది వినండి! 392 00:20:06,206 --> 00:20:10,419 మీకు ఉన్నట్టుండి సృజనాత్మక ఐడియాలు ఎందుకు రావడం లేదో మీకు అర్థమైందా? 393 00:20:10,502 --> 00:20:15,299 ఈ విస్తరణ విషయంలో మీరెంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు? 394 00:20:15,382 --> 00:20:18,135 నేను నెలల తరబడి, కలం చేతిలో పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాను. 395 00:20:18,677 --> 00:20:22,890 కానీ తదుపరి అధ్యాయం రాసే అవకాశమే నాకు రాలేదు. ఎందుకని? 396 00:20:23,682 --> 00:20:27,269 మన కథకి ఒకే ఒక ముగింపు ఉంది. అది సరైనది, అలాగే అది తప్పదు కూడా. 397 00:20:27,352 --> 00:20:29,354 అది మీకు తెలుసు, నాకూ తెలుసు. 398 00:20:31,315 --> 00:20:33,192 మీ మనస్సు చెప్పేది వినండి. 399 00:20:49,333 --> 00:20:50,709 ఇదే ఆఖరి అధ్యాయం. 400 00:20:52,294 --> 00:20:54,338 రేవన్స్ బ్యాంక్వెట్ తోనే... 401 00:20:55,631 --> 00:20:58,759 కథ ముగిసింది. 402 00:21:01,053 --> 00:21:05,349 ఇక్కడ మన పని ముగిసింది. పసికూన పెద్దది అయిపోయింది. 403 00:21:08,185 --> 00:21:09,353 తను ఇప్పుడు ఈడుకు వచ్చింది. 404 00:21:09,436 --> 00:21:11,104 -ఇక చాలులే. -ఛీ. 405 00:21:11,188 --> 00:21:12,189 కమాన్. 406 00:21:17,069 --> 00:21:18,445 ఫైల్ ని తొలగించాలా? వద్దు - సరే 407 00:21:19,488 --> 00:21:20,989 సెలవు, బ్రాడ్. 408 00:21:23,200 --> 00:21:24,326 మిత్రులారా. 409 00:21:25,369 --> 00:21:28,163 నాకు రెండు రోజుల నుండి చుక్కలు కనపడుతున్నాయి. 410 00:21:28,247 --> 00:21:29,540 -బ్రాడ్ ని అరెస్ట్ చేశారు. -అవునా? 411 00:21:29,623 --> 00:21:31,875 అవును, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో. అతను అలా చేశాడంటే నమ్మగలరా? 412 00:21:33,043 --> 00:21:34,378 -అవును. -నిస్సందేహంగా. 413 00:21:34,461 --> 00:21:35,587 అది నమ్మదగినదిగానే ఉంది. 414 00:21:35,671 --> 00:21:36,839 అవును, అది నమ్మదగినదిగానే ఉంది. 415 00:21:37,840 --> 00:21:39,925 నా బుర్ర పనిచేయడం లేదన్నమాట. 416 00:21:40,008 --> 00:21:42,594 అంటే, మన కుటుంబమంతా ఛిన్నాభిన్నమైపోతున్నట్టుంది. 417 00:21:43,387 --> 00:21:45,973 అయ్యో. కొంపదీసి మీరిద్దరూ మళ్లీ కొట్టుకోవడం లేదు కదా. 418 00:21:46,056 --> 00:21:48,517 మేమా? లేదు. మా మధ్య ఇప్పుడు మనస్పర్ధలనేవే లేవు. 419 00:21:49,893 --> 00:21:50,936 మంచిదే. 420 00:21:51,019 --> 00:21:53,605 -మరి ఏంటి సంగతి? -నిన్నూ, ఎంక్యూని వదిలేసి వెళ్లిపోతున్నాం. 421 00:21:54,439 --> 00:21:55,858 ఏంటి? 422 00:21:55,941 --> 00:21:59,903 ఐయాన్, నేనూ ఎంక్యూకి రాజినామా చేయాలని నిర్ణయించుకున్నాం. 423 00:22:02,489 --> 00:22:03,699 లేదు. 424 00:22:04,283 --> 00:22:05,659 అవును. 425 00:22:06,618 --> 00:22:07,828 లేదు, లేదు. 426 00:22:07,911 --> 00:22:09,496 -అవును. -అవును. 427 00:22:10,330 --> 00:22:14,168 లేదు! లేదు! లేదు! 428 00:22:15,377 --> 00:22:17,504 కానీ ఎందుకు? ఎందుకు? 429 00:22:17,588 --> 00:22:18,589 -అంటే... -ఎందుకు? 430 00:22:18,672 --> 00:22:21,008 మేం బిడ్డ బాగోగుల కోసం కలిసి ఉంటే బాగుంటుందని అనుకున్నాం, 431 00:22:21,091 --> 00:22:23,427 కానీ ఆ బిడ్డ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. 432 00:22:23,927 --> 00:22:27,931 అవును. నిజం చెప్పాలంటే, రెక్కలొచ్చిన అతడిని వదిలేయాల్సిన సమయం వచ్చింది. 433 00:22:28,015 --> 00:22:29,224 విషయం నీకు అర్థమైందా? 434 00:22:31,935 --> 00:22:35,189 అవును. బాగా అర్థమైంది. 435 00:22:38,984 --> 00:22:40,235 ఆ పసిబిడ్డని నేనే. 436 00:22:40,319 --> 00:22:41,653 -కాదు. -ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 437 00:22:41,737 --> 00:22:43,405 -నువ్వు ఎదిగిన మగాడివి. -మేం గేమ్ గురించి మాట్లాడుతున్నాం. 438 00:22:43,488 --> 00:22:45,199 -పసిబిడ్డ అంటే గేమ్. -నేను కాదా? 439 00:22:45,282 --> 00:22:46,617 -పసిబిడ్డని నేనేమో అనుకున్నా. -కాదు. 440 00:22:46,700 --> 00:22:49,536 -అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? -అంతా గందరగోళంగా ఉంది. 441 00:22:49,620 --> 00:22:52,039 నేను మీ బిడ్డని, మీరు నా తల్లిదండ్రులని చెప్తున్నారేమో అని అనుకున్నా. 442 00:22:52,122 --> 00:22:54,291 మన్నించు, ఇవాళ అన్నీ ఒకేసారి వచ్చి నా మీద పడ్డాయి, బాసూ. 443 00:22:54,374 --> 00:22:56,710 మా పరిస్థితి కూడా అదే, బాసూ. ఇదేమీ అంత తేలికైన నిర్ణయం కాదు, 444 00:22:56,793 --> 00:23:00,714 కానీ పాపీ, నేనూ దీన్ని వదిలి వెళ్లిపోవాలి, మా సొంతంగా మరో సాహసానికి మేము తెరదీయాలి. 445 00:23:00,797 --> 00:23:02,424 మంచిది. మీకు మంచిదే. 446 00:23:03,342 --> 00:23:04,468 మరి నా పరిస్థితి ఏంటి? 447 00:23:04,551 --> 00:23:07,763 నువ్వు ఇక్కడే ఉండి, మేము లేకుండానే ఎంక్యూను చూసుకోవాలి. 448 00:23:07,846 --> 00:23:11,183 లేదా, నువ్వు ఎదిగిన మగాడివే కదా, నీకేం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. 449 00:23:14,436 --> 00:23:15,437 అవును. 450 00:23:18,565 --> 00:23:20,484 నిస్సందేహంగా నేను మంచి బాస్ ని అవుతానులే. 451 00:23:25,280 --> 00:23:26,406 ఇక బయలుదేరదాం పదా. 452 00:23:26,490 --> 00:23:28,534 డేవిడ్. గుడ్ లక్. 453 00:23:44,925 --> 00:23:46,510 -ఆగు, దూకవద్దు! -ఏంటి? 454 00:23:46,593 --> 00:23:48,345 జో, నీకేం కష్టం వచ్చినా కానీ, 455 00:23:48,428 --> 00:23:51,849 అదెంత దారుణమైనదని అనిపించినా కానీ, నువ్వు దాని నుండి బయటపడగలవు. 456 00:23:51,932 --> 00:23:55,060 సరేనా? నిన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారు. నీకు స్నేహితులు ఉన్నారు, ఓ కుటుంబం ఉంది. 457 00:23:55,143 --> 00:23:56,186 నీకు కుటుంబం ఉందా? 458 00:23:56,270 --> 00:23:58,647 నాకు నీ గురించి అంత ఎక్కువగా తెలీదు. కానీ నేను తెలుసుకుంటాను. 459 00:23:58,730 --> 00:24:02,609 నేనేమీ దూకేయడం లేదు, డేవిడ్. ఇలా తాజా గాలి కోసం పైకి వచ్చానంతే. 460 00:24:04,111 --> 00:24:06,113 సరే. సరే. 461 00:24:06,864 --> 00:24:10,409 మంచిది. అలాగే. సూపర్. 462 00:24:14,204 --> 00:24:15,873 నువ్వు ఎందుకు పైకి వచ్చావు? 463 00:24:18,250 --> 00:24:19,668 తాజా గాలి కోసం. 464 00:24:22,504 --> 00:24:23,547 నేను... 465 00:24:25,090 --> 00:24:26,633 నన్ను అందరూ వదిలేశారు. 466 00:24:27,217 --> 00:24:28,552 చిన్నప్పట్నుంచీ అంతే. 467 00:24:29,428 --> 00:24:35,434 దేవుడా, నేను 60వ రోడ్డు ఎక్కి, ఆ తర్వాత 57వ రోడ్డెక్కి, ఆపై 90వ రోడ్డు ఎక్కి, 468 00:24:35,517 --> 00:24:37,603 యోర్బా లిండాకి వెళ్లి ఆ విధవతో ఉండటానికి ఏమైనా చేస్తాను. 469 00:24:37,686 --> 00:24:40,272 -ఆమె ఇప్పుడు విధవ కాదు కదా. -ఇప్పటికీ కూడా విధవే. 470 00:24:42,524 --> 00:24:45,485 అందరూ నన్ను వదిలేసినట్టు అనిపిస్తోంది, నేను ఏమీ 471 00:24:47,112 --> 00:24:48,113 చేయలేనివాడినని అనిపిస్తోంది. 472 00:24:50,532 --> 00:24:51,742 ఏమీ చేయలేకపోవడం. 473 00:24:54,578 --> 00:24:55,621 నీ వద్ద అధికారం లేదు. 474 00:24:55,704 --> 00:25:00,125 అవును, అలా కాదు, నాకు కాస్త అధికారం ఉంది. ఇంకా, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నే. 475 00:25:00,209 --> 00:25:02,419 మళ్లీ నీ కింద పని చేసే అవకాశం నాకు ఇవ్వు, దయచేసి ఇవ్వు. 476 00:25:02,503 --> 00:25:03,795 -నేను మళ్లీ నీకు అసిస్టెంట్ గా ఉండవచ్చా? -ఏంటి? 477 00:25:03,879 --> 00:25:06,632 అసలు నేను నీ దగ్గర మానేసి ఉండాల్సింది కాదు. 478 00:25:10,385 --> 00:25:13,764 అవును. అది నిజమే. అది నువ్వు చేసిన తప్పు. 479 00:25:16,225 --> 00:25:17,768 అయినా సరే, నేను నిన్ను మళ్లీ తీసుకుంటాను. 480 00:25:20,979 --> 00:25:24,775 అవును, కానీ ఒకే ఒక షరతు మీద. నువ్వు నాతో పనిచేసే ఉద్యోగినివి మాత్రమే. సరేనా? 481 00:25:24,858 --> 00:25:27,319 -మనం మిత్రులం కాదు, కుటుంబం అంతకన్నా కాదు. -ఇదివరకు కూడా మనం అలా లేము కదా. 482 00:25:28,070 --> 00:25:29,571 అవును. మంచిది. 483 00:25:30,239 --> 00:25:32,074 -మంచిది. -సరే. 484 00:25:33,867 --> 00:25:34,868 సరే. 485 00:25:37,079 --> 00:25:38,288 అలాగే. 486 00:25:38,830 --> 00:25:41,625 జో, ఒక నోట్ రాసుకో. 487 00:25:41,708 --> 00:25:44,753 నిజానికి, ఇప్పుడు నేను రాయలేను. బ్రాడ్ నా కంప్యూటర్ ని పారేయమని చెప్పాడు. 488 00:25:44,837 --> 00:25:47,339 ఏంటి? నిజంగానా? అది చాలా వింతగా ఉందే. 489 00:25:47,422 --> 00:25:49,258 అసలు నువ్వు అతనిలో ఏం చూశావు? 490 00:25:49,341 --> 00:25:52,094 అంటే, అతను పొడగరి, తెలివైనవాడు. తన చర్మం కూడా బాగుంటుంది. 491 00:25:52,177 --> 00:25:53,512 సరే. నువ్వేం నోట్ చేసుకోనవసరంలేదు. 492 00:25:53,595 --> 00:25:55,973 నిజానికి, మనకి చాలా పని ఉంది. 493 00:25:56,056 --> 00:25:58,350 మనం ఒక కొత్త టెస్టర్ ని, ఫైనాన్స్ ని చూసుకొనేవాడిని, 494 00:25:58,433 --> 00:26:00,811 ఇంకా ఇద్దరు క్రియేటివ్ డైరెక్టర్లని నియమించుకోవాలి. 495 00:26:00,894 --> 00:26:03,188 ఓ విషయం చెప్పనా? మనకి ఒక క్రియేటివ్ డైరెక్టర్ చాలులే. 496 00:26:03,272 --> 00:26:06,316 -మగవాడు అయితే మంచిది. -బాగా చెప్పావు. 497 00:26:06,400 --> 00:26:08,610 -కానీ ఆ మాట ఇంకెవ్వరితో కూడా అనవద్దు. -సరే. 498 00:26:08,694 --> 00:26:10,904 కాసా వేగా రెస్టారెంట్ కాక్టేయిళ్లు 499 00:26:14,825 --> 00:26:16,159 -చీర్స్. -చీర్స్. 500 00:26:17,953 --> 00:26:19,413 మన బాధలను పోగొట్టుకోవడానికి. 501 00:26:19,496 --> 00:26:21,582 ఏమంటున్నావు? మనం పార్టీ చేసుకుంటున్నాం. ఇది ఉత్సాహవంతంగా ఉంది. 502 00:26:22,499 --> 00:26:24,251 నీకు కాస్త అయినా బాధగా లేదా? 503 00:26:24,334 --> 00:26:26,295 నేను బాధపడటం లాంటివి చేయనులే. 504 00:26:26,378 --> 00:26:31,258 ఈ లోకంలో అన్నింటికన్నా ఇష్టమైన గేమ్ ని మనం వదిలేసి వచ్చాం. 505 00:26:31,341 --> 00:26:34,428 -అవును, కానీ దాన్ని నేను మర్చిపోయాను. -మర్చిపోయావా? 506 00:26:34,511 --> 00:26:37,806 అవును, నిజానికి అది చాలా వింత విషయం కదా? 507 00:26:39,183 --> 00:26:40,934 అందుకే నేను అంత మంచి తండ్రిని కాలేకపోయానేమో. 508 00:26:41,018 --> 00:26:43,187 కానీ దీని వల్ల నేను ఏ విషయంలోనైనా అంతగా బాధపడకుండా ఉండగలనులే. 509 00:26:43,270 --> 00:26:45,397 అయితే, ఇక కొత్త గేమ్ గురించి మాట్లాడుకుందాం. 510 00:26:47,065 --> 00:26:49,568 -నీకు మామూలు ఉద్యోగం సంపాదించాలనుంటే తప్ప. -లేదులే. 511 00:26:49,651 --> 00:26:52,529 సరే, నీ ఐడియా ఏంటి? మల్టీప్లేయర్ గేమ్, ఓపెన్ వరల్డ్ గేమ్, సిములేటర్ గేమ్? 512 00:26:52,613 --> 00:26:55,115 కత్తులతో నరుక్కోవడాలు, చంపుకోవడాలు అంటే నా వల్ల కాదు. 513 00:26:55,949 --> 00:26:59,286 కొత్త గేమ్ ఏంటో మనిద్దరికీ తెలుసు. నీ విస్తరణ అయిన హేరా. 514 00:27:00,329 --> 00:27:03,540 -అది చాలా బాగుందని నీకు చెప్పా కదా. -కానీ అది అసంభవమని కూడా చెప్పావు కదా. 515 00:27:03,624 --> 00:27:05,459 అవును. అది ఎంక్యూలో అయితే అసంభవం. 516 00:27:05,542 --> 00:27:07,336 కానీ మనం మొదట్నుంచీ ప్రారంభిస్తాం. 517 00:27:07,419 --> 00:27:11,006 నేను సృష్టించన ఆటలో నువ్వు ఎన్ని ఐడియాలను ప్రవేశపెట్టాలనుకున్నా, అది పని చేయదు. 518 00:27:11,089 --> 00:27:13,592 ఈ బిడ్డకి మనిద్దరం కలిసి ప్రాణం పోయాలి. 519 00:27:17,846 --> 00:27:19,473 స్పష్టంగా చెప్పాలంటే, సెక్స్ చేసుకోకుండా. 520 00:27:19,973 --> 00:27:22,559 -అది స్పష్టంగానే అర్థమైంది. -నువ్వు అదోలా నన్ను చూస్తూ ఉండిపోయావు. 521 00:27:22,643 --> 00:27:24,686 లేదు, నేను... 522 00:27:24,770 --> 00:27:28,065 నువ్వు ఒక్కసారిగా నా కల నిజమయ్యే మాట చెప్పావు కదా, 523 00:27:28,148 --> 00:27:29,858 నేను షాక్ అయ్యాను, అంతే. 524 00:27:29,942 --> 00:27:32,861 అవును. ఇది పూర్తిగా నీ ఆటే అవుతుంది. 525 00:27:36,031 --> 00:27:38,450 కానీ, ఈ "హేరా" అనేది నా సొంత ఐడియా, కాబట్టి ఓ విధంగా చూస్తే, 526 00:27:38,534 --> 00:27:40,953 ఇది నా ఆట అవుతుంది, నేనే నిన్ను నియమించుకుంటున్నాను. 527 00:27:41,036 --> 00:27:42,454 సరే, పాపీ, నీకు ఉన్నంత అభద్రతాభావం నాకు లేదు, 528 00:27:42,538 --> 00:27:45,791 కాబట్టి నేనే నాయకుడిని అని నాకు అనిపించడానికి, ఇవేమీ నాకు అక్కర్లేదు. 529 00:27:45,874 --> 00:27:47,125 సరే. 530 00:27:47,793 --> 00:27:50,796 ఇక మొదలుపెడదాం. నీ కాన్వాస్. 531 00:27:56,260 --> 00:27:57,761 ఇదిగో నీ బ్రష్. 532 00:27:58,554 --> 00:27:59,972 నేను గీయాలా? 533 00:29:23,180 --> 00:29:25,182 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య