1 00:00:07,549 --> 00:00:09,176 స్నికర్ స్నాక్ 2 00:00:09,259 --> 00:00:12,471 ఎలా ఉన్నారు, స్నాక్ బాబులూ? మీ స్నికర్ స్నాక్ వచ్చేశాడు, 3 00:00:12,554 --> 00:00:15,891 ఈ గెమెరాన్ వాల్ట్ లోకి దాడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదీలెక్క! 4 00:00:15,974 --> 00:00:18,477 ఇవాళ మీరేం చేయబోతున్నారు? నేనైతే తర్వాత మా బామ్మ ఇంటికి వెళ్తున్నా. 5 00:00:18,560 --> 00:00:21,605 మా బామ్మ దగ్గర భలే కుక్క ఉంది. అదంటే నాకు చాలా ఇష్టం. దాని పేరు కార్ల్. 6 00:00:22,356 --> 00:00:25,234 -చూశావా, జో? ఈ పిల్లాడు కొత్త పూటీ. -పిచ్చోడులా ఉన్నాడే. 7 00:00:25,317 --> 00:00:26,610 లేదు. వీడికి చాలా మంది అభిమానులున్నారు. 8 00:00:26,693 --> 00:00:28,820 స్నికర్ స్నాక్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు, 9 00:00:28,904 --> 00:00:30,072 నాకు అది కావాలి. 10 00:00:30,155 --> 00:00:32,115 నేను సుసు పోయి వస్తాను. 11 00:00:32,198 --> 00:00:33,909 నాతో రా. 12 00:00:33,992 --> 00:00:37,120 జో, భారీ మల్టీ ప్లేయర్ ఆన్లైన్ గేములు గేమింగ్ రంగంలో డైనోసార్లు లాంటివి. 13 00:00:37,204 --> 00:00:39,122 మనం గతంలోనే ఉండిపోకూడదు. మనం మొబైల్ మార్కెట్లోకి విస్తరించాలి. 14 00:00:39,206 --> 00:00:41,708 -ఎందుకంటే భవిష్యత్తు మొబైల్ రంగానిది. -కాదు, మొబైల్ వర్తమాన కాలానికి చెందినది. 15 00:00:41,792 --> 00:00:44,753 భవిష్యత్తు వర్చువల్ రియాలిటీది, సెక్స్ చెత్తా చెదారం ఏదేదో ఉంటుందిలే, 16 00:00:44,837 --> 00:00:46,505 కానీ మనం మరీ అంత దూరం వెళ్లిపోకూడదు. 17 00:00:46,588 --> 00:00:47,923 నాకు ఒక మొబైల్ గేమ్ ని ప్రారంభించాలనుంది. 18 00:00:49,007 --> 00:00:51,385 -ఆ విషయంలో నేను సాయపడగలను. -దురదృష్టవశాత్తూ, జో, నువ్వు సాయపడలేవు. 19 00:00:51,468 --> 00:00:53,804 మొబైల్ ఆటల్లో, కుర్రకారుకు సంబంధించినది ఏదోకటి ఉండాలి కనుక వారి సాయం కావాలి, 20 00:00:53,887 --> 00:00:56,890 అందుకు నీ వయస్సు సరిపోదులే. 21 00:00:59,560 --> 00:01:01,019 ఆ సృజనాత్మక వ్యక్తిని నేను నీ వద్దకు తీసుకురాగలను. 22 00:01:11,864 --> 00:01:13,365 మనం ఇలా చేతులు పట్టుకొని ఉండాలంటావా? 23 00:01:14,283 --> 00:01:15,492 ఏమో. 24 00:01:16,076 --> 00:01:18,579 కానీ మనం తప్పు చేయలేదని మాత్రం నాకు తెలుసు. అంతే కదా? 25 00:01:18,662 --> 00:01:19,872 అవును. 26 00:01:19,955 --> 00:01:23,208 మనం జనాలకి ఎలా చెప్పాలనే దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. 27 00:01:23,292 --> 00:01:25,377 అవును. సరే... 28 00:01:25,460 --> 00:01:27,796 మనం అందరికీ పార్టీ ఇచ్చి చెప్పాలంటావా? 29 00:01:27,880 --> 00:01:28,881 లేదా... వద్దు. 30 00:01:28,964 --> 00:01:31,425 బహుశా మనం, ఒక్కొక్కరికీ విడివిడిగా చెప్పాలేమో. 31 00:01:31,508 --> 00:01:33,302 -అలా వాళ్లు దాన్ని ఇతరులకు చెప్తారు. -అవును. 32 00:01:33,385 --> 00:01:35,721 -అలా అయితే ఎవ్వరికీ చెప్పలేదే అనిపించదు. -అవును. 33 00:01:35,804 --> 00:01:38,182 మనం ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించాలన్నదే నా ఆలోచన. 34 00:01:38,891 --> 00:01:40,225 దొరికిపోయారు. 35 00:01:40,309 --> 00:01:41,602 బాబోయ్. సరేమరి. 36 00:01:41,685 --> 00:01:44,855 -జో. జో! ఆగు. -మేమందరికీ చెప్పాలనుకున్నాం. 37 00:01:44,938 --> 00:01:47,649 చూడు, తోటి ఉద్యోగులతో పడక పంచుకోవడం అనేది చాలా సున్నితమైన విషయం. 38 00:01:48,609 --> 00:01:50,402 నేను మీరిద్దరూ ఆలస్యంగా వచ్చారని అలా అన్నాను. 39 00:01:54,072 --> 00:01:57,075 మరి, అలా అయితే, 40 00:01:57,159 --> 00:01:59,494 నీకు ఈ విషయం చెప్పేయొచ్చు అనుకుంటా, నిజానికి... 41 00:01:59,578 --> 00:02:01,330 రేచల్, నేనూ డేటింగ్ చేస్తున్నాం. 42 00:02:01,914 --> 00:02:03,540 అయితే? 43 00:02:03,624 --> 00:02:06,502 -అయితే, నీకు చెప్పాలి అనుకున్నాం. -ఎందుకు? 44 00:02:07,836 --> 00:02:11,507 ఎందుకంటే, ఇది ఉద్యోగులందరికీ చెప్పాల్సిన ముఖ్యమైన విషయంలా అనిపించింది. 45 00:02:13,467 --> 00:02:14,468 టెస్టర్లు సెక్స్ చేసుకున్నారు. 46 00:02:14,551 --> 00:02:15,844 -జో! -జో! 47 00:02:15,928 --> 00:02:18,972 ముఖ్యాంశాలు, పాపలు. మీరేదైతే పెద్ద విషయమని అనుకుంటున్నారో అది అందరికీ తెలిసిపోయింది, 48 00:02:19,056 --> 00:02:20,140 ఎవ్వరూ పట్టించుకోవట్లేదు కూడా. 49 00:02:20,224 --> 00:02:21,892 ఇక పని కానివ్వండి. 50 00:02:37,324 --> 00:02:39,493 వచ్చినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. 51 00:02:40,369 --> 00:02:44,706 -మొబైల్ గేమ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? -అవి బాగుండవు. 52 00:02:44,790 --> 00:02:46,458 అవును. వాటిన గేమ్స్ అనరు. 53 00:02:46,542 --> 00:02:49,002 పనీపాటా లేని వాళ్ల కోసం రూపొందించిన యాప్స్ అవి. 54 00:02:49,086 --> 00:02:52,339 మధ్య వయస్సు మహిళలను చిన్న లావాదేవీలతో మభ్యపెట్టడానికి మీకు వీలు దొరుకుతుంది కనుక 55 00:02:52,422 --> 00:02:53,590 మీకు అవి అంటే ఇష్టం అనుకుంటా. 56 00:02:53,674 --> 00:02:55,926 హేయ్, కాస్త మర్యాదగా మాట్లాడు, టెస్టర్. 57 00:02:56,009 --> 00:02:59,471 జో, తను అన్నది నిజమే. నాకు కూడా ఆ కారణం వల్లనే అవంటే ఇష్టం. 58 00:02:59,555 --> 00:03:04,518 అందుకే, నాకు ఒక తేలికైన మొబైల్ గేమ్ కావాలి, అది కూడా మీరిద్దరు డిజైన్ చేయాలి. 59 00:03:04,601 --> 00:03:07,604 -మమ్మల్ని మా సొంత ఆట రూపొందించమంటున్నావా? -మీ నైతిక విలువలకు, మీ అభిరుచులకు 60 00:03:07,688 --> 00:03:10,148 మధ్య సమన్వయపరుచుకోవడానికి మీకు మూడు సెకన్లు ఇస్తాను. మూడు, రెండు... 61 00:03:10,232 --> 00:03:11,400 -మేము చేస్తాం. -మేము చేస్తాం. 62 00:03:11,483 --> 00:03:12,818 మంచిది! జో, నువ్వే ప్రొడ్యూసర్ వి. 63 00:03:12,901 --> 00:03:16,113 నాకు ఈ వారానికల్లా, కాన్సెప్ట్ ఇంకా ప్రాథమిక గేమ్ ప్లే డిజైన్ కావాలి. 64 00:03:17,155 --> 00:03:19,241 ఏంటి? లేదు. నాకు ఈ దద్దమ్మలతో పనిచేయాలని లేదు. 65 00:03:19,324 --> 00:03:20,826 నేను నీ నుండి నేర్చుకోవాలనుకుంటున్నా. 66 00:03:20,909 --> 00:03:23,954 నేర్చుకుంటావు. ఈ దద్దమ్మలతో పనిచేయడం నీ శిక్షణలో భాగమైనదే. 67 00:03:25,455 --> 00:03:26,915 -సరే. -అలాగే. 68 00:03:26,999 --> 00:03:29,793 ఇది చాలా బాగుంది, బ్రాడ్, 69 00:03:29,877 --> 00:03:31,879 కానీ నీకు దాపరికాలేవీ లేకుండా నిజం చెప్పాలి కనుక, 70 00:03:31,962 --> 00:03:35,048 నీకు డానా, నేనూ డేటింగ్ చేస్తున్నామని తెలియాలి. 71 00:03:36,049 --> 00:03:37,176 -అయితే? -నేను కూడా అదే అన్నా. 72 00:03:37,259 --> 00:03:40,929 అది నీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయమని మేము భావించాం. 73 00:03:41,013 --> 00:03:43,015 మీరేం చేసినా అది నాకు అనవసరం. 74 00:03:43,098 --> 00:03:44,975 ఈ స్టూడియో కార్యకలాపాల మీద మీ వ్యక్తిగత బంధాలు 75 00:03:45,058 --> 00:03:46,768 ఏ ప్రభావమూ చూపలేవు. 76 00:03:46,852 --> 00:03:49,313 మీరలా అనుకోవడం హాస్యాస్పదంగా, అలాగే బాధాకరంగా కూడా ఉంది. 77 00:03:49,396 --> 00:03:51,190 కానీ, నాకు నవ్వు రావడంలేదు, బాధ కలుగుతోంది, 78 00:03:51,273 --> 00:03:53,775 ఆ విషయాన్ని నేను ఎంతమాత్రం పట్టించుకుంటానో అది తెలుపుతుంది. 79 00:03:57,112 --> 00:04:00,532 సరే. అది మంచిదే అనుకుంటా? 80 00:04:00,616 --> 00:04:02,701 -మీరింకా ఇక్కడే ఎందుకు ఉన్నారు? -అవును. ఇక పదండి. 81 00:04:02,784 --> 00:04:04,244 మనం ఒక ఆటను రూపొందించాలి. 82 00:04:04,328 --> 00:04:06,788 ఇక బయలుదేరండి. వెళ్లిపోండి! 83 00:04:08,790 --> 00:04:10,501 నేను నిన్ను నిరాశపరచను, బాస్. 84 00:04:12,252 --> 00:04:15,506 ఇది నా మదిలో మెదిలే భావన అని చెప్పవచ్చు. 85 00:04:15,589 --> 00:04:19,091 నాకు మొక్కలతో నిండిన కోటలు కనిపిస్తున్నాయి. 86 00:04:19,718 --> 00:04:22,971 వెండితో, బంగారంతో నిండిపోయిన్న నగరాలు కనిపిస్తున్నాయి. 87 00:04:24,806 --> 00:04:27,559 నాకు పురాతనత్వం ఉట్టిపడే కోటలు కనిపిస్తున్నాయి. 88 00:04:27,643 --> 00:04:29,353 అసలు దాని అర్థం ఏమిటి? 89 00:04:29,436 --> 00:04:31,230 పురాతనత్వాన్ని ఏదైనా ఎలా ఉట్టిపడేలా చేస్తుంది? 90 00:04:31,313 --> 00:04:33,315 కోటలు పాతవైనా అయ్యుండాలి లేదా కాకపోయుండాలి. 91 00:04:33,398 --> 00:04:35,943 -ఇలానా? -అవును! అంతే! 92 00:04:36,026 --> 00:04:37,861 -నా మనస్సులో సరిగ్గా అదే ఉంది. -ఎలా మీరు... 93 00:04:37,945 --> 00:04:40,364 మీరు మామూలోళ్లు కాదు. 94 00:04:40,447 --> 00:04:43,158 నాకేవో భలే ఆలోచనలు వస్తుంటాయి, వాటికి మీరు టక్కున రూపం ఇచ్చేస్తారు. 95 00:04:43,242 --> 00:04:46,328 అధిక నాణ్యత గల డిజైన్ చేయడానికి 96 00:04:46,411 --> 00:04:48,497 చాలా సమయం అవసరం అవుతుంది. 97 00:04:48,580 --> 00:04:50,165 అలాగే, తప్పకుండా. ఇక, పని మొదలుపెట్టండి. 98 00:04:50,249 --> 00:04:53,377 నిజంగా అంటున్నావా? మొదలుపెట్టడానికి నోట్స్ ఏమీ ఇవ్వడం లేదా? 99 00:04:53,460 --> 00:04:56,171 పర్వాలేదు. అది చాలా బాగుంది, ఒకవేళ బాగాలేకపోతే, తర్వాతా మారుద్దాంలే. 100 00:04:56,255 --> 00:04:59,091 సరే. కానీ, ఒకవేళ నువ్వు ఇప్పుడే నోట్స్ ఇచ్చేస్తే, 101 00:04:59,174 --> 00:05:02,970 మనకి తర్వాత మార్చాల్సిన పని ఉండదు, అదీగాక తొలి ప్రయత్నంలోనే అన్నీ చక్కగా చేసేయలేము. 102 00:05:03,053 --> 00:05:05,305 మీ పనితనం గురించి నాకు తెలుసు. మీ దగ్గర మంచి ప్రతిభ ఉంది. 103 00:05:05,389 --> 00:05:07,099 నేను ఇక పాపీకి అవకాశం ఇస్తాను. 104 00:05:07,182 --> 00:05:09,476 ఇప్పుడు మీకు పాపీ చెప్తుంది. 105 00:05:11,687 --> 00:05:15,691 హేయ్, మిత్రులారా. కొత్త విస్తరణ విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, 106 00:05:15,774 --> 00:05:21,446 ఇందులో ఆటగాళ్ళ వాతావరణం వారి ఆటకు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. 107 00:05:26,451 --> 00:05:28,871 అంటే, ఒకరకంగా చెప్పాలంటే, 108 00:05:29,872 --> 00:05:32,207 ఇందులో ఆటగాళ్లే ఆర్టిస్టులు అన్నమాట. 109 00:05:32,291 --> 00:05:35,627 ఆ విషయం ఆర్ట్ టీముకే చెప్పడం వింతగా ఉంటుంది, కదా? 110 00:05:37,629 --> 00:05:41,008 అవును. కానీ కాదు, ఎందుకంటే మనకి ఆర్ట్ వర్క్ అయితే కావాలి కదా. 111 00:05:41,091 --> 00:05:42,676 మనకి ఆ ఆర్ట్ వర్క్ చాలా కావాలి. 112 00:05:43,552 --> 00:05:47,139 మరీ ముఖ్యంగా, మీరు నిర్మాణానికి కావలసిన వస్తువులను డిజైన్ చేయాలి. 113 00:05:48,182 --> 00:05:50,017 కాబట్టి ఇటుకలను డిజైన్ చేయాలి. 114 00:05:50,100 --> 00:05:52,394 సిమెంటును డీజైన్ చేయాలి. 115 00:05:52,477 --> 00:05:55,480 ఇంకా... అప్పం కూడా. 116 00:05:56,190 --> 00:05:57,858 అప్పం కూడా గీయమంటున్నారా? 117 00:05:57,941 --> 00:05:59,818 అవును. అప్పాన్ని గీయండి. 118 00:05:59,902 --> 00:06:01,612 నేను చెప్పింది చెప్పినట్టు గీయండి, బాబూ. 119 00:06:01,695 --> 00:06:03,280 -మీ పేరేంటి? -అతని పేరు, ఫిల్. 120 00:06:03,363 --> 00:06:06,450 ఈ ఆఫీసుకు వచ్చిపోయే ప్రతీ మధ్యవయస్కుడైన మగాడిని నేను గుర్తుపెట్టుకోలేను కదా. 121 00:06:06,533 --> 00:06:07,826 నేను ఇక్కడ పదేళ్ల నుండి పనిచేస్తున్నాను. 122 00:06:07,910 --> 00:06:10,913 -మహబాగా మాట్లాడుతున్నావు, పాప్. -నేను చెప్పింది గీయండి, సరేనా? 123 00:06:10,996 --> 00:06:13,874 నేను చెప్పిన నిర్మాణ సామగ్రిని, ఇంకా వాటినీ వీటినీ గీయండి. 124 00:06:13,957 --> 00:06:15,542 నాకు అది రేపటికి కావాలి, ఫిల్. 125 00:06:17,920 --> 00:06:20,339 -మేము దేని మీద దృష్టి పెట్టాలి? -రెండూ చేయండి. 126 00:06:20,422 --> 00:06:22,174 సరిపడనంత కన్నా ఎక్కువ చేయడం మంచిదే కదా. 127 00:06:22,257 --> 00:06:24,760 మాకు ఏది నచ్చకపోయినా, దాన్ని తర్వాత పక్కన పెట్టేయవచ్చు. 128 00:06:24,843 --> 00:06:28,555 హేయ్, మిత్రులారా, బాగా చేస్తున్నారు. నిజంగానే అదరగొట్టేస్తున్నారు. 129 00:06:36,146 --> 00:06:38,398 మనం ఇక్కడ ఉన్నామంటే నేను నమ్మలేకపోతున్నాను. 130 00:06:38,482 --> 00:06:43,195 ఈ గదిలో ఐయాన్ ఎన్ని గొప్పగొప్ప పాత్రలకు రూపం పోసుంటాడో ఏమో. 131 00:06:43,278 --> 00:06:44,571 నాకు తెలుసు. 132 00:06:45,781 --> 00:06:48,992 ఇంకా, మనం డేటింగ్ చేస్తున్నామని తెలిసి ఎవ్వరూ పట్టించుకోకపోవడం నాకు నచ్చింది. 133 00:06:49,076 --> 00:06:51,453 నాకు కూడా అదే అనిపించింది. మనం మన జీవితాన్ని నిర్భయంగా జీవించాలి. 134 00:06:51,537 --> 00:06:54,873 నేనొక విషయం చెప్పనా, నువ్వు ఈ వేషంలో భలేగా ఉన్నావు. 135 00:06:54,957 --> 00:06:56,959 -ఈ వేషంలోనా? -ఆ వేషంలోనే. 136 00:06:57,042 --> 00:06:58,293 -ఈ పసుపు చుక్కలతో? -అవును. 137 00:06:58,377 --> 00:07:00,587 -ఇది ఎలా ఉంది? -బాగుంది. 138 00:07:01,296 --> 00:07:04,341 సరే. ఇంకాస్త హొయలు పోతాను ఆగు. 139 00:07:04,424 --> 00:07:06,718 హేయ్! మీరిద్దరూ సరసాలు ఆడటానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. 140 00:07:06,802 --> 00:07:09,513 మనం పనిచేయడానికి వచ్చాం. ఏదోక పాత్రను ఎంచుకొని పని కానివ్వండి. 141 00:07:09,596 --> 00:07:10,681 సరే. 142 00:07:13,976 --> 00:07:16,186 ఈ ఆట ఒక యోధునికి సంబంధించినది అయితే ఎలా ఉంటుంది? 143 00:07:16,270 --> 00:07:18,272 ఒక యోధురాలు. ఏమంటావు? ఒక వీరాదివీర యోధురాలిగా ఆడటం 144 00:07:18,355 --> 00:07:20,107 చాలా బాగుంటుంది కదా. 145 00:07:20,190 --> 00:07:24,152 ఏమో. మొబైల్ గేమ్ అంటే సింపుల్ గా ఉండాలి, ఏమంటావు? 146 00:07:24,236 --> 00:07:27,155 అంటే, ఒక జంతువు గురించి అయితే ఎలా ఉంటుంది? 147 00:07:27,239 --> 00:07:28,991 -జంతువా? -అవును. 148 00:07:29,074 --> 00:07:30,868 హేయ్, మీ దగ్గర ఏమైనా జంతువుల నమూనాలు ఉన్నాయా? 149 00:07:32,119 --> 00:07:35,581 పంది, కోడి, నక్క, గుర్రం, మేక, కంగారూ, నత్త... 150 00:07:35,664 --> 00:07:39,626 మేక. నాకు మేకగా ఉండాలనుంది. 151 00:07:40,210 --> 00:07:44,381 అవును. క్రాంప్టన్ లో ఉన్న మా కజిన్ల దగ్గర 152 00:07:45,048 --> 00:07:48,051 ఒక మేక ఉంది, అది భలే గమ్మత్తైన పని చేసింది. 153 00:07:48,719 --> 00:07:50,179 అది ఇలా నడిచింది. 154 00:07:51,763 --> 00:07:53,348 దానికి మేము రూపాల్ అని పేరు పెట్టాం. 155 00:07:53,974 --> 00:07:56,393 -నువ్వు భలే ముద్దొస్తున్నావు. -నువ్వు వెధవలా ఉన్నావు. 156 00:07:57,269 --> 00:08:00,647 బహుశా నేను ముద్దొచ్చేలా ఉండకూడదేమో. బహుశా నేను జోలా ఉండాలేమో. 157 00:08:00,731 --> 00:08:04,067 అవును. నువ్వు మొరటుగా ఉంటావు. 158 00:08:04,943 --> 00:08:08,697 హాయ్, నా పేరు జో, నేను ఒక మహా మొరటు మేకని. 159 00:08:08,780 --> 00:08:10,824 ఓయ్, మొరటు మేక. 160 00:08:11,783 --> 00:08:14,119 -ఆ పేరు చాలా బాగుంది. -ఆ పేరు చాలా బాగుంది! 161 00:08:14,203 --> 00:08:15,913 మొరటు మేక! 162 00:08:15,996 --> 00:08:19,041 మొరటు మేక, మొరటు మేక, మొరటు మేక. 163 00:08:19,124 --> 00:08:21,376 మొరటు మేక, మొరటు మేక, మొరటు మేక. 164 00:08:21,460 --> 00:08:24,046 నేను ఎక్కడైనా దూకి చచ్చిపోతాను. 165 00:08:25,172 --> 00:08:27,341 డేవిడ్, నాకు ఒక్క కొత్త ప్రోగ్రామర్ల టీమ్ కావాలి. 166 00:08:27,424 --> 00:08:28,800 -తనకి అక్కర్లేదు. -నాకు కావాలి. 167 00:08:28,884 --> 00:08:31,261 కొత్త విస్తరణ మీద పనిచేసేవాళ్ళు ఐయాన్ మాటే వింటున్నారు, నాది కాదు. 168 00:08:31,345 --> 00:08:32,846 ఎందుకంటే, వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. 169 00:08:32,929 --> 00:08:34,890 లేదు, వాళ్లకు నువ్వు బాస్ గా అలవాటు అయిపోయావు, అదే కారణం. 170 00:08:34,972 --> 00:08:37,558 నాకు ఒక కొత్త టీమ్ కావాలి, వాళ్లు నన్ను ఆరాధించి, 171 00:08:37,643 --> 00:08:39,811 ఓ స్ఫూర్తిదాతగా చూడాలి, నేనంటే వారికి భయభక్తులు ఉండాలి. 172 00:08:39,895 --> 00:08:42,481 డేవిడ్, తనకు మూడు టీమ్లు ఇచ్చినా పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు. 173 00:08:42,563 --> 00:08:46,235 నేను మీకు ఏమీ ఇచ్చేదిలేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని పిలిచింది అందుకు కాదు. 174 00:08:46,318 --> 00:08:48,820 -మమ్మల్ని పిలిచావా? నాకు అది గుర్తులేదే. -నాకు కూడా గుర్తులేదు. 175 00:08:48,904 --> 00:08:51,406 ఎందుకంటే, డేవిడ్ జనాలను ఆకట్టుకోలేడు, అతను నాయకుడిగా పనికిరాడు. 176 00:08:51,490 --> 00:08:53,408 -నువ్వు అదే చెప్పాలనుకుంటున్నావా, పాపీ? -లేదు. 177 00:08:53,492 --> 00:08:55,202 సరే, నేను మాట్లాడవచ్చా? నేనే మాట్లాడతాను. 178 00:08:55,285 --> 00:08:57,746 నేను మాట్లాడి తీరతాను! నేను శుక్రవారం గురించి పిలిచాను. 179 00:08:57,829 --> 00:08:58,997 శుక్రవారం రోజు ఏం జరగబోతోంది? 180 00:08:59,081 --> 00:09:01,208 శుక్రవారం నువ్వు "గేమింగ్ రంగంలో మహిళలు" వేదికలో ప్రసంగించబోతున్నావు. 181 00:09:01,291 --> 00:09:02,918 అవునా. నేను ప్రసంగించను. 182 00:09:03,001 --> 00:09:04,753 ఏంటి? నువ్వు మాట్లాడాలి. 183 00:09:04,837 --> 00:09:07,089 చూడు, గేమింగ్ రంగంలోని మహిళలను... 184 00:09:07,172 --> 00:09:10,759 గుర్తించి, వారిని గౌరవించడానికి ఇది ఒక అవకాశం లాంటిది, ఇది ముఖ్యమైనది... 185 00:09:10,843 --> 00:09:14,680 దయచేసి అలా చేయకు... మోంట్రియల్ కి, నాకూ, నా ఉద్యోగానికి కూడా సమస్యే. 186 00:09:14,763 --> 00:09:17,766 కాబట్టి నువ్వు ప్రసంగిస్తావు, మహిళా లేదా పాపీ. 187 00:09:17,850 --> 00:09:20,561 నువ్వు మహిళలకు తాము ఎలా చైతన్యవంతులు కావచ్చో అని ప్రసంగిస్తావు, 188 00:09:20,644 --> 00:09:23,105 నేను నీకు ప్రసంగించమని చెప్తున్నా. కనుక ఆ పని చేయ్. 189 00:09:23,188 --> 00:09:27,067 ఓ విషయం చెప్పనా, పాప్? ఈ సందర్భంలో, డేవిడ్ చేప్పేది నిజమే. 190 00:09:27,860 --> 00:09:30,821 నీ కొత్త నైపుణ్యాన్ని చూపడానికి ఇదొక సదావకాశం కూడా కావచ్చు. 191 00:09:30,904 --> 00:09:33,949 పాపీ, సభలోని వారిలో ఎలా స్ఫూర్తి నింపాలో నేను నీకు చూపుతాను. 192 00:09:34,533 --> 00:09:37,077 అక్కర్లేదులే. నువ్వు నడిపించే తీరు వేరు, నేను నడిపించే తీరు వేరు. 193 00:09:37,160 --> 00:09:38,370 అవును, కానీ నిజానికి నాదే పని చేస్తుంది. 194 00:09:38,453 --> 00:09:41,331 విషయం ఏమిటంటే, నువ్వు ఉత్తేజపరిచేలా వివరిస్తావు. 195 00:09:41,415 --> 00:09:42,708 నేను సాంకేతికపరంగా వివరిస్తాను. 196 00:09:42,791 --> 00:09:46,003 నిర్మాణ సామగ్రిని వివరిస్తూ నువ్వు జనాలలో స్ఫూర్తి నింపలేవు. 197 00:09:46,753 --> 00:09:47,754 నిజంగానా? 198 00:09:50,048 --> 00:09:53,177 జీవితంలాగ, అది కూడా మారుతూ ఉంటుంది. 199 00:09:54,469 --> 00:09:56,847 అది గట్టిగా అవుతుంది, 200 00:09:56,930 --> 00:10:01,852 కానీ అన్ని పరిస్థితిల్లోనూ పట్టి ఉంచే శక్తి దానిలో ఉంటుంది. 201 00:10:02,519 --> 00:10:06,315 మంచు, గాలి, అగ్ని, నీళ్లు ఏదైనా. 202 00:10:08,775 --> 00:10:12,112 అది పట్టి ఉంచేది ఒక ఇంటిని మాత్రమే కాదు. 203 00:10:14,448 --> 00:10:16,700 మనల్నందరినీ కూడా. 204 00:10:19,661 --> 00:10:21,121 అదే. 205 00:10:22,789 --> 00:10:24,041 అప్పం. 206 00:10:24,833 --> 00:10:27,711 -బాబోయ్! -ఇలానా? 207 00:10:28,378 --> 00:10:30,464 అంతే! అంతే! కెవిన్, నువ్వు పిచ్చెక్కించావు. 208 00:10:30,547 --> 00:10:32,799 దేవుడా, నువ్వు ఎప్పుడైనా కానీ... అద్భుతాలను సృష్టించగలవు. 209 00:10:32,883 --> 00:10:34,885 -పాప్, నువ్వేమంటావు? -అది చండాలంగా ఉంది. 210 00:10:34,968 --> 00:10:37,137 నిజంగానా? మరి నీ రోమాలు ఎందుకు నిక్కబొడుచుకున్నాయి? 211 00:10:37,221 --> 00:10:38,847 నా రోమాలేమీ... 212 00:10:38,931 --> 00:10:41,350 ఇది అనుకోని ప్రతిచర్య అన్నమాట... 213 00:10:41,433 --> 00:10:42,726 -స్ఫూర్తి పొందడానికేగా? -కాదు. 214 00:10:42,809 --> 00:10:45,604 నేనేమీ స్ఫూర్తిపొందలేదు. భావావేశపరంగా నువ్వు నన్ను మభ్యపెట్టావు. 215 00:10:46,396 --> 00:10:47,397 రెండిటికీ తేడా ఏంటి? 216 00:10:47,481 --> 00:10:50,567 ఐయాన్, స్పష్టపరుచుకోవడానికి అడుగుతున్నాను, 217 00:10:50,651 --> 00:10:52,694 మేము ఇప్పటికే పని చేసే వాటి మీద కాక, 218 00:10:52,778 --> 00:10:55,697 వీటి మీద కూడా పని చేయాలని అంటున్నావా? 219 00:10:55,781 --> 00:10:57,991 అవును, బాసూ. మీ మాయ మీరు చేయండి. మీరు ఎలా చేస్తారో అలా. 220 00:10:58,075 --> 00:10:59,451 ఇదేమీ మాయ కాదు. 221 00:10:59,535 --> 00:11:01,954 మేమందరూ ప్రతిభగల కళాకారులం, 222 00:11:02,037 --> 00:11:04,748 ఈ సంక్లిష్టమైన డిజైన్ల కోసం ఖాళీ అనేదే లేకుండా శ్రమిస్తున్నాం. 223 00:11:04,831 --> 00:11:07,376 అవును, చికెన్ ని చేయాలంటే ఏమేం చేయాలో నాకు తెలియాల్సిన పని లేదు. 224 00:11:08,460 --> 00:11:10,712 ఇది చికెన్ కాదు. నేనేమీ కసాయివాడిని కాదు. 225 00:11:10,796 --> 00:11:12,422 ఫైన్ ఆర్ట్స్ లో నాకు మాస్టర్ డిగ్రీ ఉంది. 226 00:11:12,506 --> 00:11:15,217 వావ్. అతనికి అన్ని వివరాలు అక్కర్లేదు. ఇక పని కానివ్వు, ఫిల్. 227 00:11:15,300 --> 00:11:16,718 నేను కూడా అదే చెప్పబోతున్నా. 228 00:11:16,802 --> 00:11:18,679 -"నాకు వివరాలన్నీ అక్కర్లేదు." -అంత సమాచారం ఎవరికి కావాలి. 229 00:11:18,762 --> 00:11:20,889 -మనిద్దరం సమశృతిలో ఉన్నట్టున్నాం. -అలాగే అనుకో. 230 00:11:20,973 --> 00:11:22,099 నీకు నేనేమైనా... 231 00:11:22,182 --> 00:11:23,934 సరే. జనాలలో ఎలా స్ఫూర్తి నింపాలో నాకు నేర్పు. 232 00:11:24,017 --> 00:11:25,060 సరే. ఇక ఆ పనిలో ఉందాం పద. 233 00:11:25,811 --> 00:11:27,062 నేను కూడా టూత్ పిక్ తెచ్చుకోవాలా? 234 00:11:27,145 --> 00:11:29,439 వద్దు, టూత్ పిక్ నా స్టయిల్ లే. నీకు అది... 235 00:11:29,523 --> 00:11:31,733 హేయ్, నేను నా పిల్లలతో వీడియో కాల్ మాట్లాడి వస్తాను. 236 00:11:32,651 --> 00:11:35,279 సరేమరి. నేనొక రైతుని. నేనొక మేకని పట్టుకొని, 237 00:11:35,362 --> 00:11:38,866 నా ఫారమ్ వద్దకి తీసుకెళ్లి మాంసం కోసం దాన్ని ముక్కలుముక్కలు చేస్తాను. 238 00:11:38,949 --> 00:11:40,492 ఇది పెట్టుబడిదారీ విధానానికి సూచిక అన్నమాట. 239 00:11:40,576 --> 00:11:42,202 -సరే, అది బాగుంది. -మంచిది. సరే. 240 00:11:42,286 --> 00:11:44,872 బహుశా మనం కథను అక్కడి నుండి మొదలుపెట్టి, ముందుకు సాగాలేమో? 241 00:11:44,955 --> 00:11:45,956 సరే. 242 00:11:46,039 --> 00:11:48,500 -అక్కడి నుండి మొదలుపెడితే బాగుంటుంది కదా? -అవును, బాగుంటుంది. 243 00:11:48,584 --> 00:11:50,127 -హేయ్. -హేయ్, ఇక్కడున్నావా. 244 00:11:50,210 --> 00:11:53,213 నేను నీకోసం అన్నిచోట్లా వెతుకుతున్నాను. నేను నీకు ఒకటి చూపించనా? 245 00:11:53,297 --> 00:11:55,215 -సరే. -అయితే, 246 00:11:55,299 --> 00:11:58,385 నేను రాత్రంతా కష్టపడి, దీన్ని చేశాను. 247 00:12:00,220 --> 00:12:01,680 ఎలా ఉంది? 248 00:12:03,348 --> 00:12:05,601 ఇది చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. 249 00:12:07,644 --> 00:12:09,980 -అది కుక్కనా? -అది మేక. 250 00:12:11,064 --> 00:12:12,065 ఇది చండాలంగా ఉంది. 251 00:12:12,149 --> 00:12:14,151 అదేం లేదు. నువ్వు రాత్రంతా కష్టపడి చేశావు. 252 00:12:14,234 --> 00:12:15,736 అది చాలా బాగుంది. 253 00:12:15,819 --> 00:12:17,070 ఇప్పుడే నాకు అర్థమైంది. 254 00:12:17,654 --> 00:12:19,740 ఇది అసలు అర్థవంతంగా ఏమైనా ఉందా? ఇదెలా ఉండాలో నాకు తెలుసు. 255 00:12:19,823 --> 00:12:22,534 కానీ ఎలా చేయాలో నాకు అర్థమవ్వడంలేదు. 256 00:12:22,618 --> 00:12:25,579 అవును. అందుకే మనం దీని మీద కలిసి ఆలోచించి పనిచేయాలనుకుంటా. 257 00:12:25,662 --> 00:12:28,999 ఇందులో సామాజిక సంబంధిత అంశాలు ఉంటే బాగుంటుందని నాకనిపిస్తుంది. 258 00:12:29,082 --> 00:12:30,709 ఇది మొబైల్ గేమ్. ఇది సింపుల్ గా ఉంటే బాగుంటుందేమో? 259 00:12:30,792 --> 00:12:34,463 అంటే, సంక్లిష్టతలో సింపుల్ గా ఉండటం. 260 00:12:34,546 --> 00:12:35,756 అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. 261 00:12:35,839 --> 00:12:37,633 దేవుడా. మీరు మొదటిసారి కొట్టుకుంటున్నారా? 262 00:12:37,716 --> 00:12:39,927 మేమేమీ కొట్టుకోవడంలేదు. కలిసి చర్చిస్తున్నాము. 263 00:12:40,010 --> 00:12:41,011 అవును. 264 00:12:41,094 --> 00:12:43,347 ఏదో మిస్ అయిన్నట్టుగా అనిపిస్తోంది, అంతే. 265 00:12:43,430 --> 00:12:44,515 మిస్ అయిందా? 266 00:12:44,598 --> 00:12:47,643 ఇదే సందర్భంలో ఐయాన్, పాపీలు ఉండుంటే, ఖచ్చితంగా ఏదోకటి మిస్ అయ్యేదే. 267 00:12:47,726 --> 00:12:49,228 మనం ఇంకా ఆలోచించాలనుకుంటా. 268 00:12:49,311 --> 00:12:52,356 ఇది పిచ్చిపిచ్చి పనులు చేసే మేక. ఇంక అక్కడ ఆలోచించడానికి ఏముంది? 269 00:12:52,439 --> 00:12:54,399 దేవుడా! పని కానివ్వండమ్మా! 270 00:12:54,483 --> 00:12:55,943 నువ్వు పని కానివ్వు, పనికిమాలినదానా! 271 00:12:58,779 --> 00:13:02,407 -అది మరీ కటువుగా ఉంది. -మరీ ఎక్కువ కోప్పడాను. క్షమించు. 272 00:13:02,491 --> 00:13:05,536 నన్ను మన్నించు. అది మంచి విషయం కాదు. 273 00:13:06,411 --> 00:13:10,707 నీ ప్రతికూల ప్రవర్తనని నేను తట్టుకోలేకపోయాను, జో. అర్థమైందా? 274 00:13:10,791 --> 00:13:12,876 ఎందుకంటే ఇది మాకు ఒక పెద్ద అవకాశం, 275 00:13:12,960 --> 00:13:15,254 నువ్వు మాకు సహకరిస్తే, నీకు కూడా ఇది ఓ మంచి అవకాశం కావచ్చు. 276 00:13:18,590 --> 00:13:20,092 నన్ను మన్నించండి. 277 00:13:20,175 --> 00:13:21,969 ఆటను నిర్మించడంలో సహాయపడాలన్నదే నా ఉద్దేశం. 278 00:13:22,052 --> 00:13:24,763 అయితే, ఊరికే దొబ్బకుండా మేము చేసే పనికి మద్దతుగా ఉండు. 279 00:13:24,847 --> 00:13:27,683 అవును. మీరన్నది నిజమే. 280 00:13:34,022 --> 00:13:37,401 పనికిమాలినదానా! చెత్తదానా! వెర్రిదానా! 281 00:13:37,484 --> 00:13:42,155 ఏదోక పరిష్కారాన్ని ఆలోచించు, మతిలేని పింజారీ మొహందానా! 282 00:13:42,656 --> 00:13:44,533 నువ్వు ప్రొడ్యూసర్ వి కాదు, చెత్తకుప్పవి. 283 00:13:44,616 --> 00:13:47,077 నువ్వు ముళ్లపందివి! వాళ్లందరూ అన్నట్టు నువ్వు అదే! 284 00:13:47,160 --> 00:13:48,745 హేయ్, జో! 285 00:13:48,829 --> 00:13:49,830 నువ్వు బాగానే ఉన్నావా? 286 00:13:51,290 --> 00:13:53,250 అవును, నేను మామూలుగానే ఉన్నాను. మీరే లెస్బియన్లు. 287 00:13:53,333 --> 00:13:55,878 నేనొక మంచి ప్రొడ్యూసర్ ని, నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. 288 00:13:58,797 --> 00:14:02,050 రేచల్ చెప్పినదానిలో నిజం ఉంది. ఏదో మిస్ అవుతోంది. 289 00:14:04,136 --> 00:14:05,721 అదేంటో నాకు తెలుసు. 290 00:14:06,513 --> 00:14:08,765 -ఏంటి? -నేపథ్యం. 291 00:14:09,933 --> 00:14:13,061 తనలో ఆశ అనేదే చనిపోయి, ఒంటరి అయిపోయింది. 292 00:14:13,729 --> 00:14:18,108 దేవుళ్లందరూ తనని వదిలేసి, తన పరిస్థితిని దయనీయంగా, భయంకరంగా చేసేశారు. 293 00:14:18,192 --> 00:14:21,570 అయినా ఏమాత్రం బెదరని తను ఎంతో దూరం తిరగసాగింది, 294 00:14:21,653 --> 00:14:25,616 ఈ క్రమంలో కుంభాలు కుంభాలు తినసాగింది, కానీ అవి తన కడుపును నింపలేకపోయేవి, 295 00:14:26,325 --> 00:14:31,455 ఇక అలా జన్మించినదే మొరటు పిశాచి! 296 00:14:32,289 --> 00:14:35,375 -పిశాచా? -మొరటు మేక, సీ.డబ్ల్యూ. 297 00:14:35,459 --> 00:14:39,463 అవునా? నాకు "పిశాచి"లా వినిపించింది! 298 00:14:39,546 --> 00:14:40,923 అయితే మొత్తం మార్చాలి! 299 00:14:41,965 --> 00:14:43,300 మేక చనిపోయి ఉంటుందా? 300 00:14:43,383 --> 00:14:46,261 లేదు. జనాలు చచ్చిన మేకలా ఆడటానికి ఇష్టపడరు కదా. 301 00:14:46,345 --> 00:14:48,847 మన్నించండి, మిత్రులారా. నేను చెడగొట్టాను. 302 00:14:49,932 --> 00:14:52,976 ఇది మన సమయాన్ని వృథా చేసేసింది. నా వల్ల ఏ లాభమూ లేదు. 303 00:14:53,060 --> 00:14:55,062 నేనొక పనికిమాలినదాన్ని! 304 00:14:55,145 --> 00:14:57,481 పర్వాలేదు, జో, మరేం పర్వాలేదు. 305 00:14:57,564 --> 00:14:59,525 నువ్వేమీ పనికిమాలినదానివి కాదు. కేవలం... 306 00:14:59,608 --> 00:15:01,610 ఇదంతా సృజనాత్మక ప్రక్రియలో భాగమే, కదా? 307 00:15:01,693 --> 00:15:02,694 -అవును. -అవునా? 308 00:15:02,778 --> 00:15:06,365 అవును. ఇంటర్నెట్ లో ఉన్న ఈ 80 ఏళ్ల ముసలాడి విషయమే కాస్త విచిత్రంగా ఉంది. 309 00:15:06,448 --> 00:15:08,325 -అది విచిత్రంగా ఉంది. -అవును, విచిత్రంగా ఉంది. 310 00:15:08,408 --> 00:15:10,827 మనకి నేపథ్యం కూడా అక్కర్లేదు. మేక మొరటుది. 311 00:15:10,911 --> 00:15:12,746 అది చెత్తాచెదారం తింటుంది, మేకలు చేసే పని అదే కదా. 312 00:15:12,829 --> 00:15:15,123 అందులో ఒక తేలికైన ఆట విధానం ఉండాలి. 313 00:15:15,207 --> 00:15:16,416 కేవలం ఒక విధానం. 314 00:15:16,500 --> 00:15:20,045 అవును, కానీ ఆ మేక ఏదైనా చెప్పాలి. ఏదైనా ముఖ్యమైనది. 315 00:15:20,128 --> 00:15:22,714 -అవును. -అదేమీ చెప్పలేదు. అది మేక. 316 00:15:22,798 --> 00:15:24,424 -ఒక్క నిమిషం, మీరు వాదులాడుకుంటున్నారా? -లేదు. 317 00:15:25,133 --> 00:15:26,844 సరే, మంచిది! ఇది బాగుంది. 318 00:15:26,927 --> 00:15:31,056 ఇది ముందుకూ వెనక్కి, అలాగే ముందుకూ వెనక్కి. 319 00:15:31,139 --> 00:15:33,100 ఇదంతా సృజనాత్మక ప్రక్రియలో భాగమే. 320 00:15:33,183 --> 00:15:35,602 నువ్వు నీ ఐడియాలను చెప్తున్నావు, ఇక నువ్వు నీ ఐడియాలు చెప్తున్నావు. 321 00:15:35,686 --> 00:15:37,354 నువ్వు వాటిని అందుకొని, మళ్లీ వెనక్కి పంపుతున్నావు. 322 00:15:37,437 --> 00:15:40,357 సృజనాత్మక వ్యక్తులు అవలంబించే ప్రక్రియని తెలుసుకోవడం చాలా బాగుంది. 323 00:15:40,440 --> 00:15:42,192 మీకేం కావాలంటే అది నేను అందిస్తాను. 324 00:15:42,276 --> 00:15:44,444 మీకు నేను చూపుతాను. అన్నింటినీ చూపుతాను. 325 00:15:45,153 --> 00:15:47,990 జో, దీని అవసరం మా కన్నా నీకే ఎక్కువగా ఉన్నట్టు నాకనిపిస్తోంది. 326 00:15:48,073 --> 00:15:53,412 డానా, ఒక్క నిమిషం. చూడు, ఈ ఆటను మనం ఒక గొప్ప ఆటగా చేయగలమని నాకు తెలుసు. 327 00:15:53,495 --> 00:15:56,164 మనం అప్పుడే సరిపెట్టుకోకూడదు. కొత్త కొత్త ఐడియాలను ఆలోచిస్తూ ఉండాలి. 328 00:15:57,833 --> 00:16:01,295 -నీకు నా మీద నమ్మకం ఉందా? -ఉంది. 329 00:16:01,378 --> 00:16:02,713 సరే. 330 00:16:02,796 --> 00:16:03,797 నమ్మకం. 331 00:16:05,799 --> 00:16:09,386 ఏంటి? ఇది ఓకే, కదా? 332 00:16:09,469 --> 00:16:10,470 అవును. 333 00:16:10,554 --> 00:16:14,266 నాకు కూడా మీతో చేతులు కలపాలని ఉంది. 334 00:16:15,017 --> 00:16:17,394 మీరు ల్యాప్ టాప్ ని కాస్తంత కిందికి దించుతారా? 335 00:16:17,477 --> 00:16:18,604 -బాబోయ్. -వద్దు. 336 00:16:18,687 --> 00:16:21,440 అతను ఇంటి నుండి పనిచేయడమే మంచిదైంది. నేను మూసేస్తాను. 337 00:16:23,567 --> 00:16:25,944 హేయ్, లిండా. నిన్ను చూడటం బాగుంది. నువ్వు చాలా బాగున్నావు. 338 00:16:26,028 --> 00:16:27,279 ధన్యవాదాలు. 339 00:16:28,864 --> 00:16:29,948 ఓయ్. 340 00:16:30,032 --> 00:16:31,658 పాపీ ఎక్కడ? ఇది ప్రారంభమవ్వబోతోంది. 341 00:16:31,742 --> 00:16:34,244 తన ఆహార్యం గురించి తను తెగ ఇబ్బంది పడుతోంది. 342 00:16:34,328 --> 00:16:36,330 -మంచి మాటలు మాట్లాడు. -నాకు ఇది చేయాలని లేదు. 343 00:16:36,413 --> 00:16:38,207 రా, పాపీ. నువ్వు చాలా బాగున్నావు. బయటకు రా. 344 00:16:40,876 --> 00:16:42,503 నువ్వు చాలా బాగున్నావు, పాపీ. 345 00:16:42,586 --> 00:16:43,712 నేనో దద్దమ్మలా ఉన్నాననుకుంటా. 346 00:16:43,795 --> 00:16:45,547 నీ ఆహార్యాన్ని బాగా కనబడేలా చేయడంలో ఏ తప్పూ లేదు. 347 00:16:45,631 --> 00:16:47,132 బాగా కనబడే నాయకులను జనాలు అనుసరిస్తారు. 348 00:16:47,216 --> 00:16:49,718 అది బాధాకరమైనదే కావచ్చు, కానీ అది మానవ నైజం. దాన్ని అంగీకరించు. 349 00:16:49,801 --> 00:16:53,263 అవును, కానీ నేను దేనికైనా ఆనుకుంటే, నా డ్రెస్ పైకి వచ్చేస్తుంది, కింద ఏమీ ఉండదు. 350 00:16:55,849 --> 00:16:57,559 ఒక్క నిమిషం. ఏంటది? తనేం చేస్తోంది? 351 00:16:57,643 --> 00:16:59,353 తను జోకులు వేస్తోంది. జోకులు అస్సలు వేయకు. 352 00:16:59,436 --> 00:17:01,480 నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోకులు వేయకు. 353 00:17:01,563 --> 00:17:03,774 -నువ్వు జోకర్ కాదు. -ఏదైతే ఏంటి. ఇది ఓ చెత్త కార్యక్రమం. 354 00:17:03,857 --> 00:17:07,027 "గేమింగ్ రంగంలో మహిళలు"? ఈ కార్యక్రమంలో నిజం లేదు, ఏంలేదు. 355 00:17:07,109 --> 00:17:10,071 ఒక భయంకరమైన నిజాన్ని దాచడానికి పరిశ్రమ వేసే బూటకపు ఎత్తుగడ ఇది. 356 00:17:10,155 --> 00:17:12,281 హేయ్, హేయ్, నువ్వు దీన్ని కాస్త సీరియస్ గా తీసుకుంటావా? 357 00:17:12,366 --> 00:17:15,661 అందరికీ గౌరవం దక్కదు. ఎప్పటికైనా నాకు గౌరవం దక్కే అవకాశం ఉందనుకుంటున్నావా? లేదు. 358 00:17:15,743 --> 00:17:17,621 నా సమయం దాటిపోయింది. అది పర్వాలేదు. చూడు, ఇది మంచిది. 359 00:17:17,704 --> 00:17:20,457 మనం మహిళలను గుర్తిస్తున్నాము. అది మంచి విషయమే. కానీ... 360 00:17:20,540 --> 00:17:22,626 కానీ మగాళ్లకి గుర్తింపు దక్కే అవకాశమే లేదా? 361 00:17:22,709 --> 00:17:24,377 దేవుడా. డేవిడ్, ఇక ఆపు. 362 00:17:24,461 --> 00:17:27,005 -ఇది పాపీకి చాలా ముఖ్యమైన రోజు, కాబట్టి... -అవును, నాకు తెలుసు. 363 00:17:27,089 --> 00:17:28,799 -పాపీ, ఏం చేస్తున్నావు? -పానీపూరీ తింటున్నా. 364 00:17:28,882 --> 00:17:31,426 పానీపూరీ తినవద్దు. నువ్వు గ్యాస్ వదిలే ప్రమాదముంది. 365 00:17:32,052 --> 00:17:34,555 -దేవుడా, నువ్వు చిన్నపిల్లలా తింటున్నావు, -కాదు. 366 00:17:38,100 --> 00:17:40,185 -ఇది హాలోవీన్ బ్యాగ్ లా ఉంది. -ఇది అస్సలు బాగాలేదు! 367 00:17:40,269 --> 00:17:42,437 చూడండి, నేను బాస్ ని. నాకు నచ్చింది నేను తింటాను. 368 00:17:42,521 --> 00:17:45,732 లేదు, నువ్వు తినలేవు. నీ మనస్సును, అలాగే దేహాన్ని రెండింటినీ చురుకుగా ఉంచుకోవాలి. 369 00:17:45,816 --> 00:17:48,235 ఇలా కనబడటానికి నేను కష్టపడటం నాకు ఇష్టం అనుకుంటున్నావా? లేదు. 370 00:17:48,318 --> 00:17:50,737 కానీ నేను నాయకుడిని, ఒక బాస్ జీవితంలో అది కూడా ఒక భాగమే. 371 00:17:50,821 --> 00:17:52,239 ఎప్పుడూ కూడా అది అలాగే జరుగుతుంది. 372 00:17:52,322 --> 00:17:54,324 కానీ అది ఎప్పుడూ ఎలా అయితే జరుగుతుందో, అలా చేయడం నాకు ఇష్టం లేదేమో. 373 00:17:54,408 --> 00:17:57,411 మంచిది. నేను "ఆదిత్య 369"లో ప్రొఫెసర్ కి కాల్ చేసి, టైం మెషిన్ తెమ్మని చెప్తాను. 374 00:17:57,494 --> 00:17:59,246 మనం కాలంలో వెనక్కి ప్రయాణించి, మానవ స్వభావాన్ని మారుద్దాం. 375 00:17:59,329 --> 00:18:00,455 "ఆదిత్య 369" అంటే ఏంటి? 376 00:18:03,208 --> 00:18:05,502 అది జోక్! జోక్ చేశాను. నేను జోకులు భలే వేస్తాను. 377 00:18:05,586 --> 00:18:07,254 అదే నేను చెప్పేది. జోకుల వల్ల లాభం ఉండదు. 378 00:18:07,337 --> 00:18:08,547 -పాపీ. -నాకు అర్థంకాలేదు. 379 00:18:08,630 --> 00:18:10,632 నిన్ను పిలుస్తున్నారు. వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. 380 00:18:10,716 --> 00:18:13,468 సరే, గుర్తుంచుకో, ఇది నీకు మంచి అవకాశం. మామూలుగా ప్రవర్తించు. 381 00:18:14,303 --> 00:18:16,555 కానీ గుర్తుంచుకో, నీ సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించు. 382 00:18:16,638 --> 00:18:19,224 టెలిప్రాంప్టర్ లో కనిపించేదే చదువు, సరేనా? అది చేయడానికి నేను రాత్రంతా కష్టపడ్డాను. 383 00:18:19,308 --> 00:18:21,226 సరే. ఒక్క నిమిషం, నువ్వు... 384 00:18:21,310 --> 00:18:23,437 -తన ప్రసంగాన్ని నువ్వు రాశావా? -అవును, అతను ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. 385 00:18:23,520 --> 00:18:25,647 నేను వేరే విషయాలలో దిట్టని. మాట్లాడే విషయంలో కాదు. 386 00:18:25,731 --> 00:18:29,067 పనికి సంబంధించి పదాలతో సంబంధంలేని విషయాలలో అన్నమాట. 387 00:18:29,610 --> 00:18:31,862 దేవుడా, ఆ టెలీప్రాంప్టర్ నుండి కాకుండా వేరేది చెప్పకు. 388 00:18:31,945 --> 00:18:34,740 ఇక నవ్వడం మాత్రం మర్చిపోకు. అందరికీ నువ్వు స్నేహపూర్వకంగా కనబడాలి. 389 00:18:34,823 --> 00:18:36,283 -డేవిడ్, ఆపు. తను చూసుకోగలదు. -సరే. 390 00:18:36,366 --> 00:18:38,118 -నేను చూసుకుంటాలే. -కానీ తప్పకుండా నవ్వు. 391 00:18:39,161 --> 00:18:40,287 అవును. కానీ అలా కాదు. 392 00:18:41,747 --> 00:18:44,791 ఇంకాస్త. సరే, అది బాగుంది. అలా నవ్వు. 393 00:18:45,626 --> 00:18:46,752 -బాగుంది. -చాలా బాగున్నావు. 394 00:18:46,835 --> 00:18:47,878 -కమాన్. ఇక పద. -గుడ్ లక్. 395 00:18:47,961 --> 00:18:50,005 బయలుదేరు. ఆత్మవిశ్వాసంతో నడువు. 396 00:18:50,088 --> 00:18:51,423 -అవును, మహిళ. -మహిళ. 397 00:18:53,800 --> 00:18:55,719 సరే, పెద్ద పెద్ద చిత్రాల గురించి అతనికి నేను వివరిస్తాను. 398 00:18:55,802 --> 00:18:57,387 -నీ వద్ద అప్ డేట్ చేసిన పవర్ పాయింట్ ఉందా? -ఉంది. 399 00:18:57,471 --> 00:18:58,472 మంచిది. సీ.డబ్ల్యూ, 400 00:18:58,555 --> 00:19:01,350 కొత్త నేపథ్యం గురించి వివరించే పనిని నేను చేయకూడదు అని ఖచ్చితంగా అంటావా? 401 00:19:01,433 --> 00:19:02,809 అది మరీ అంత విచిత్రంగా అనిపించకపోవచ్చు. 402 00:19:02,893 --> 00:19:06,647 ఏమీకాదు. చేయి అందించాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. 403 00:19:06,730 --> 00:19:09,358 నేను దాన్ని నా పూర్తి నిబద్ధతతో చెప్తాను. 404 00:19:09,441 --> 00:19:12,402 దేవుడా! జో, ఇది చాలా బాగుంది. 405 00:19:12,486 --> 00:19:14,905 ఆర్ట్ డిపార్టుమెంట్ చేత ఒక్క చిటికెలో దాన్ని చేయించాను. అది చాలా తేలిక. 406 00:19:14,988 --> 00:19:18,825 నిజానికి, అది తేలికైనది కాదు. ఇంకా మేము దాన్ని ఒక్క చిటికెలో కూడా చేయలేదు. 407 00:19:18,909 --> 00:19:22,454 అందరి ప్రాజెక్ట్ లను గడువులోగా చేయడానికి మేము రాత్రంతా కష్టపడి పని చేశాం. 408 00:19:23,038 --> 00:19:25,916 నువ్వు చాలా కష్టపడి, పని అయ్యేలా చేశావు. 409 00:19:25,999 --> 00:19:27,000 ధన్యవాదాలు. 410 00:19:28,418 --> 00:19:29,920 మన్నించాలి. నేను ఇందాక జోతో మాట్లాడాను. 411 00:19:32,130 --> 00:19:34,758 నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే... 412 00:19:34,842 --> 00:19:36,009 పక్కకు జరగండి. 413 00:19:36,718 --> 00:19:39,888 ధన్యవాదాలు, 414 00:19:40,639 --> 00:19:42,558 లేదా, అలాంటిదేదో, 415 00:19:43,600 --> 00:19:46,728 నాలోని ప్రతిభను వెలికితీసినందుకు. 416 00:19:46,812 --> 00:19:49,189 ఏం జరుగుతోంది? నువ్వు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తున్నావా? 417 00:19:49,273 --> 00:19:50,607 అవును. 418 00:19:52,526 --> 00:19:53,652 లేదు, ఇక ఆపండి. 419 00:19:56,113 --> 00:19:58,073 మనలో మన మాట, అమ్మాయిలూ, 420 00:19:58,156 --> 00:20:00,075 మీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని విన్నాను. 421 00:20:00,158 --> 00:20:01,743 -చాలా మంచి విషయం. -వావ్. 422 00:20:01,827 --> 00:20:02,911 ఇతడిని మనం మ్యూట్ చేద్దామా? 423 00:20:02,995 --> 00:20:04,079 అయ్యో. తను వచ్చేస్తున్నాడు. 424 00:20:05,664 --> 00:20:06,915 నేను వచ్ఛేశా. 425 00:20:08,333 --> 00:20:11,670 -మొదలుపెట్టండి. -ఇది మొరటు మేక. 426 00:20:14,464 --> 00:20:16,049 ఊచకోత. 427 00:20:16,133 --> 00:20:18,093 గ్రీన్ హౌజ్ వాయువులు. 428 00:20:18,177 --> 00:20:21,346 పంజరంలో జీవితం, తాజా గాలి కోసం ఆరాటం. 429 00:20:21,430 --> 00:20:22,598 ఈ ఫారమ్ పరిశ్రమ... 430 00:20:22,681 --> 00:20:24,641 ఇక చాలు. ఆపేయండి. 431 00:20:25,184 --> 00:20:26,602 -ఏంటి? -మొరటు మేక చచ్చింది. 432 00:20:26,685 --> 00:20:29,897 -ఒక్క నిమిషం. నువ్వు మా ఆటకు ప్రాణం పోయవా? -కాదు. దానికి ప్రాణం మీరే లేకుండా చేశారు, 433 00:20:29,980 --> 00:20:32,858 తేలిగ్గా డబ్బులు తెచ్చిపెట్టే ఒక సింపుల్ ఆటను మరీ సంక్లిష్టంగా చేశారు. 434 00:20:33,442 --> 00:20:35,360 దాన్ని సింపుల్ గా ఉంచమనే చెప్పా. 435 00:20:35,444 --> 00:20:38,947 కానీ వారు కమ్యూనిస్ట్ భావాలతో, మగజాతికి వ్యతిరేక అజెండాతో మొత్తం పాడు చేశారు. 436 00:20:39,031 --> 00:20:40,991 ఏం మాట్లాడుతున్నావు, జో? మనం ఒక జట్టే అని అనుకున్నానే. 437 00:20:41,074 --> 00:20:43,452 దీన్ని మేమంతా కలిసి చేశాం. తను ఇప్పుడు పూర్తిగా మాట మార్చేస్తోంది. 438 00:20:43,535 --> 00:20:44,828 అది నిజమేనా, జో? 439 00:20:46,413 --> 00:20:47,497 అవును. 440 00:20:47,581 --> 00:20:49,541 ఓడ మునిగిపోతుందని తెలిసిన వెంటనే నువ్వు ఆ ఓడ నుండి దూకేశావా? 441 00:20:49,625 --> 00:20:51,418 పొగడ్త తీసుకొని, నిందని తోసేసావా? 442 00:20:51,502 --> 00:20:52,669 బాగా చేశావు, జో. 443 00:20:52,753 --> 00:20:55,255 అది చాలా విలువైన పాఠం. సరే. మళ్లీ కలుద్దాం. 444 00:20:56,548 --> 00:20:57,966 మళ్లీ కలుద్దాం, దద్దమ్మలూ. 445 00:21:02,638 --> 00:21:03,680 క్షమించు. 446 00:21:03,764 --> 00:21:06,892 రేచ్, పర్వాలేదులే. దానిదేముంది. 447 00:21:06,975 --> 00:21:08,477 మనం దీన్ని అధిగమించగలం. 448 00:21:09,019 --> 00:21:12,856 అవును. దీన్ని మనం అధిగమించగలం. ఇదేమంత పెద్ద విషయం కాదు. 449 00:21:12,940 --> 00:21:16,276 అవును. మనల్ని విడదీయాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. 450 00:21:16,985 --> 00:21:19,404 మన ముగ్గురిదీ ఒక జట్టు, కదా? 451 00:21:19,488 --> 00:21:20,739 సరే. 452 00:21:20,822 --> 00:21:22,115 మిథిక్ క్వెస్ట్ కో డైరెక్టర్, 453 00:21:22,199 --> 00:21:25,619 పాపీ లీని వేదిక మీదకి ఆహ్వానించండి. 454 00:21:29,289 --> 00:21:30,374 ధన్యవాదాలు, ట్రేసీ. 455 00:21:32,709 --> 00:21:34,419 మన రంగాన్ని ఏలే మహిళల మధ్య 456 00:21:34,503 --> 00:21:37,506 నేను ఉండటం అంటే అది నా భాగ్యం అని చెప్పవచ్చు. 457 00:21:37,589 --> 00:21:42,177 కానీ గొప్ప లీడర్ కి ఉండాల్సిన లక్షణాలేంటి? నాయకత్వం అంటే... 458 00:21:42,261 --> 00:21:45,264 వావ్, టెలీప్రాంప్టర్ చాలా దూరంలో ఉంది. 459 00:21:47,140 --> 00:21:48,225 మన్నించండి. 460 00:21:50,352 --> 00:21:52,938 నాకు ఇది కావాలి... క్షమించండి. 461 00:21:55,107 --> 00:21:56,149 అది నా క్యాండీ. 462 00:21:59,903 --> 00:22:01,697 సరే, మీరందరూ నన్నే చూస్తున్నారని... 463 00:22:03,031 --> 00:22:05,242 ...నాకు ఇప్పుడు కనబడుతోంది. 464 00:22:08,620 --> 00:22:09,663 సరేమరి. 465 00:22:11,790 --> 00:22:13,292 నాయకత్వం అంటే... 466 00:22:15,502 --> 00:22:16,628 వావ్. 467 00:22:16,712 --> 00:22:18,338 ఈ డ్రెస్ చాలా బిగుతుగా ఉంది. 468 00:22:20,299 --> 00:22:22,176 మన్నించండి. నేను... 469 00:22:24,178 --> 00:22:26,221 హమ్మయ్య! ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. 470 00:22:26,305 --> 00:22:28,182 అయ్యో. నేను గ్యాస్ వదిలాను. 471 00:22:28,265 --> 00:22:30,517 మీకు వినబడిందా? వినబడి ఉండకపోవచ్చు. పానీపూరీ వల్ల వచ్చింది. 472 00:22:31,185 --> 00:22:32,186 అబ్బా. 473 00:22:32,269 --> 00:22:34,688 మన్నించాలి, నేను ఇది సరిగ్గా చేయలేను. 474 00:22:38,984 --> 00:22:40,611 నేను నాయకురాలిని కాదు. 475 00:22:41,695 --> 00:22:46,867 నేను జనాల రోమాలు నిక్కబొడుచుకొనేలా చేయలేను, ఎప్పుడూ నవ్వుతూ కూడా ఉండను. 476 00:22:46,950 --> 00:22:50,370 ఇంకా అప్పుడప్పుడూ ఆఫీసులో అకారణంగా ఏడుస్తాను కుడా, 477 00:22:50,454 --> 00:22:53,707 ఆ ఏడుపు రావడానికి కారణం... నేను ఏడుపు గురించి ఆలోచించడమే. 478 00:22:54,583 --> 00:22:56,001 అలా ఆలోచించిన వెంటనే ఏడుపు వచ్చేస్తుంది, 479 00:22:56,084 --> 00:22:58,754 నాకు అది ఇప్పుడు రావడం కూడా తెలుస్తోంది. 480 00:22:58,837 --> 00:23:01,465 కాబట్టి, ఇప్పుడు నేను దీన్ని వేగంగా ముగించేస్తాను. 481 00:23:02,716 --> 00:23:05,969 నేను పొడుగు అమ్మాయిని కాదు, పెద్ద మోడల్ ని కూడా కాదు. 482 00:23:06,887 --> 00:23:09,431 ఇదిగో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి, ఎందుకో కూడా నాకు తెలీదు. 483 00:23:09,515 --> 00:23:12,684 ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల కావచ్చు. ఏమో. 484 00:23:13,268 --> 00:23:14,603 చూడండి. 485 00:23:14,686 --> 00:23:18,065 ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా నేను ఎల్లకాలం జీవించగలను అనే 486 00:23:18,148 --> 00:23:20,317 హామీని నేను ఇవ్వలేను. 487 00:23:20,859 --> 00:23:25,572 కానీ స్వభావరీత్యా నాకున్న అన్ని గుణాలను వాడి ముందుకు నడిపిస్తానని మాటిస్తున్నాను, 488 00:23:25,656 --> 00:23:28,325 అంటే అప్పుడప్పుడూ నేను ఇలా కుడా ఉంటూ ఉంటాను అన్నమాట. 489 00:23:29,826 --> 00:23:32,454 కానీ నేను క్షమాపణలేమీ చెప్పను, 490 00:23:32,538 --> 00:23:35,415 ఎందుకంటే నేను వాటిని చెప్పి చెప్పి విసిగిపోయాను. 491 00:23:35,499 --> 00:23:36,750 ఎల్లప్పుడూ. 492 00:23:37,251 --> 00:23:42,381 ఒక మంచి బాస్ అంటే ఎలా ఉండాలో, అలా ఉండటానికి నేను నా శక్తినంతా ధారపోస్తాను. 493 00:23:42,464 --> 00:23:43,632 ఎందుకో తెలుసా? 494 00:23:45,008 --> 00:23:48,178 ఎందుకంటే నాకు తెలీదు... ఎవడు ఏమైతే నాకెంటి. 495 00:23:48,262 --> 00:23:50,180 ఈ ప్రసంగం ఇవ్వమని నన్ను ఎందుకు అడిగారు? 496 00:23:50,264 --> 00:23:52,808 నాకు ఏ వేదికా ఉండకూడదు. నేనేం మాట్లాడుతున్నానో నాకర్థమవ్వడం లేదు. 497 00:23:52,891 --> 00:23:55,269 మహిళకు ఏం కావాలో నాకు తెలీదు. నాకేం కావాలో కూడా నాకు తెలీదు. 498 00:23:55,352 --> 00:23:57,312 నాకు కేవలం బాస్ కావాలని మాత్రమే ఉందనుకుంటా. నాకు... 499 00:23:57,396 --> 00:24:00,482 నేను ఇక్కడ ఏదేదో వాగుతూ, గ్యాస్ మాత్రమే వదులుతున్నట్టు అనిపిస్తోంది. 500 00:24:00,566 --> 00:24:02,609 మళ్లీ ఇప్పుడే గ్యాస్ వదిలాను. 501 00:24:02,693 --> 00:24:05,237 నాకు పానీపూరీలంటే పడదు అనుకుంటా. 502 00:24:07,823 --> 00:24:08,949 ధన్యవాదాలు. 503 00:24:27,176 --> 00:24:29,928 దేవుడా. తను అదరగొట్టేసింది. 504 00:24:31,555 --> 00:24:34,600 తను స్ఫూర్తి నింపగలదు అనుకుంటా. హేయ్, నీ సాయం లేకుండానే తను అలా చేసేసింది. 505 00:24:35,475 --> 00:24:37,644 ఏమంటున్నావు? ఆ ప్రసంగాన్ని నేనే రాశాను. నీకు చెప్పా కదా. 506 00:24:37,728 --> 00:24:39,104 కానీ తను టెలీప్రాంప్టర్ ని చదవలేకపోయింది కదా. 507 00:24:39,188 --> 00:24:43,025 అవును. అదంతా ఇందులో భాగమే. అవును, ఇక్కడ చూడు. 508 00:24:43,108 --> 00:24:45,819 "కనబడనట్టు నటించు. కళ్లద్దాలు పెట్టుకో. 509 00:24:45,903 --> 00:24:47,446 నేను నాయకురాలిని కాదు అని మొదలుపెట్టు." 510 00:24:47,529 --> 00:24:48,572 కానీ తను ఏడ్చింది. 511 00:24:48,655 --> 00:24:50,449 అవును. "నేను పెద్ద మోడల్ కాదు. 512 00:24:50,532 --> 00:24:52,951 ఇక్కడ ఏడవడం మొదలుపెట్టు. ఈస్ట్రోజెన్ వల్ల అని చెప్పేయ్." 513 00:24:53,035 --> 00:24:55,287 -తను గ్యాస్ వదులుతుందని నీకెలా తెలుసు? -పానీ పూరీ? 514 00:24:55,370 --> 00:24:56,872 లేదు, నేనే అవి అక్కడ పెట్టాను. 515 00:24:56,955 --> 00:24:59,374 తనకి అవి పడవు అని తెలిసినా, తనొక తిక్కది కనుక 516 00:24:59,458 --> 00:25:00,959 వాటిని తింటుందని నాకు తెలుసు. 517 00:25:01,752 --> 00:25:02,753 -అయ్యయ్యో. -అవును. 518 00:25:02,836 --> 00:25:05,797 తను బాగా చేసింది. ఇప్పుడు తనకి నేనొక కొత్త ప్రోగ్రామింగ్ టీమ్ ని కూడా ఇవ్వాలి. 519 00:25:05,881 --> 00:25:06,882 అవును. 520 00:25:08,175 --> 00:25:10,469 -ఒక్క నిమిషం, ఏంటి? -అవును. నాకు నిన్న రాత్రి ఫోన్ చేసింది. 521 00:25:10,552 --> 00:25:12,346 ప్రసంగం విషయంలో బాగా కంగారుగా ఉందని, 522 00:25:12,429 --> 00:25:14,681 తనకి కొత్త జట్టు ఇస్తే కానీ ప్రసంగం ఇవ్వనని చెప్పింది. 523 00:25:15,224 --> 00:25:16,225 ఆ తర్వాత నాకు కాల్ చేసి, 524 00:25:16,308 --> 00:25:19,353 ప్రసంగం ఇవ్వడానికి తనకి చాలా ఆరాటంగా ఉందని, కానీ దాన్ని నేను రాసివ్వాలని 525 00:25:19,436 --> 00:25:21,021 లేకపోతే ప్రసంగం ఇవ్వనని నాకు చెప్పింది. 526 00:25:21,939 --> 00:25:23,482 తనకి కావలసింది దక్కించుకోవడం కోసం మనల్ని వాడుకుంది. 527 00:25:23,565 --> 00:25:28,403 దేవుడా. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తను మనలో స్ఫూర్తి నింపింది. 528 00:25:29,446 --> 00:25:31,949 లేదు, తను మనల్ని భావావేశపరంగా మభ్యపెట్టింది. 529 00:25:33,033 --> 00:25:34,660 రెండిటికీ తేడా ఏంటి? 530 00:25:35,994 --> 00:25:40,499 ఆ బుడంకాయ మనల్ని ఆడుకుంది. 531 00:26:52,279 --> 00:26:54,239 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య