1 00:00:11,220 --> 00:00:14,723 ఒకానొకప్పుడు ఒక అందమైన రాజ్యం ఉండేది. 2 00:00:15,807 --> 00:00:17,601 అంతా పరిపూర్ణంగా ఉంది అనడానికి లేదు. 3 00:00:17,684 --> 00:00:19,895 ఎంతైనా మనుషులే కదా. 4 00:00:19,978 --> 00:00:24,525 కానీ వారి రాజు మంచిగా, న్యాయబద్ధంగా పరిపాలించే వాడు. పంటలు సమృద్ధిగా ఉండేవి. 5 00:00:24,608 --> 00:00:27,861 పక్షులు రాగాలు ఆలపించేవి, పిల్లలు నవ్వుతూ ఉండేవాళ్లు, 6 00:00:27,945 --> 00:00:30,239 జనాలు ఆనందంగా ఉండేవాళ్లు. 7 00:00:31,073 --> 00:00:32,866 కానీ ఒకరోజు, 8 00:00:32,950 --> 00:00:36,870 ఒక విచిత్రమైన అంధకారం అలుముకుంది. 9 00:00:37,454 --> 00:00:41,166 ఆ అంధకారం ప్రజల హృదయ లోలోతుల్లోకి చొచ్చుకుపోయి, 10 00:00:41,250 --> 00:00:43,669 వారిలోని ఆనందాన్ని హరించివేసి, 11 00:00:44,253 --> 00:00:48,841 విషాదాన్ని మాత్రమే మిగిల్చింది. 12 00:00:51,718 --> 00:00:55,138 ఆ అంధకారాన్ని పారద్రోలీ, తన జనులను కాపాడతానని రాజు ప్రతిన పూనాడు. 13 00:00:55,222 --> 00:00:57,641 ఒక మహోన్నత శక్తిగల ఆయుధం గురించి రాజుకు తెలుస్తుంది. 14 00:00:57,724 --> 00:01:00,018 తేజోదీప్త ఖఢం. 15 00:01:00,102 --> 00:01:05,858 కేవలం ఆ ఖడ్గం మాత్రమే శాపానికి విరుగుడుగా పని చేసి, మళ్లీ ఆనందాలను తీసుకురాగలదు. 16 00:01:06,567 --> 00:01:08,360 కానీ అతను ఎంత శ్రమించినా, 17 00:01:08,443 --> 00:01:11,488 రాజు గానీ, అతని మనుషులు గానీ ఆ ఆయుధాన్ని చేజిక్కించుకోలేకపోతారు, 18 00:01:11,572 --> 00:01:15,617 ఎందుకంటే వారిలో రవ్వంత ఆశ కూడా లేదు కాబట్టి. 19 00:01:17,452 --> 00:01:19,913 ఆ ఖడ్గాన్ని హస్తగతం చేసుకొనే అర్హతగల యోధుని కోసం 20 00:01:19,997 --> 00:01:23,292 మరో దారి లేక ఒక టోర్నమెంట్ ని నిర్వహించడం జరిగింది. 21 00:01:23,375 --> 00:01:26,003 ప్రపంచ నలుమూలల నుండి ఎందరో భారీకాయులు, 22 00:01:26,086 --> 00:01:27,963 శక్తివంతులు, పరాక్రమవంతులు విచ్చేశారు, 23 00:01:28,547 --> 00:01:33,927 కానీ వారందరిలోకల్లా అత్యంత చిన్నవాడు ఆ ఖడ్గాన్ని చేజిక్కించుకోగలడని రాసి ఉంది. 24 00:01:35,179 --> 00:01:38,640 ఎన్నిసార్లు కింద పడినా గానీ అతనిలో స్థైర్యం సన్నగిల్లలేదు. 25 00:01:39,141 --> 00:01:42,769 ఓటమిని అంగీకరించక, అతను పడిన ప్రతీసారి పైకి లేవసాగాడు, 26 00:01:42,853 --> 00:01:46,982 ఎంతటి దెబ్బ అయినా ఏమీ చేయలేని నమ్మకమే అతని ఆయుధం. 27 00:01:48,275 --> 00:01:52,362 అతనిలోని చెరగని ధైర్యాన్ని చూసి, మిగతావారు కూడా అతడిని నమ్మసాగారు. 28 00:01:52,863 --> 00:01:54,781 ఎట్టకేలకు, అతని విజయానికి వారు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. 29 00:01:56,158 --> 00:02:00,537 ఆ పట్టుదల గల ధీరుడు, శాపాని పారద్రోలి, ఖడ్గానికి విముక్తి ప్రసాదించాడు. 30 00:02:00,621 --> 00:02:04,541 రాజ్యంలో చిన్నవాళ్లు, పెద్దవాళ్లనే బేధం లేకుండా అందరూ కూడా, అంధకారాన్ని తరమాలంటే, 31 00:02:04,625 --> 00:02:08,836 మనం కాంతి మీద మాత్రమే నమ్మకం ఉంచుకోవాలనే విషయాన్ని 32 00:02:09,922 --> 00:02:11,423 ఆ రోజు తెలుసుకున్నారు. 33 00:02:30,275 --> 00:02:33,028 ఇది చాలా బాగుంది. నాకు కాస్ట్యూమ్ పార్టీలంటే చాలా ఇష్టం. 34 00:02:33,111 --> 00:02:36,073 ఎవర్లైట్ అనేది కేవలం పార్టీ మాత్రమే కాదు, జో. 35 00:02:36,156 --> 00:02:39,451 అది మన ఆటలో సెలవు రోజు, దాన్నే మన ఆపీసులో మనం కూడా జరుపుకుంటున్నాం. 36 00:02:39,535 --> 00:02:42,371 అది న్యూ ఇయర్ పార్టీలానే ఉంటుంది, కానీ ఇది అంతకన్నా గొప్పది. 37 00:02:42,454 --> 00:02:44,831 అదిరిపోయే ఆహారం ఉంటుంది. లార్ప్ టోర్నమెంట్ కూడా ఉంటుంది. 38 00:02:44,915 --> 00:02:45,958 "లార్ప్"? "లార్ప్" అంటే? 39 00:02:46,041 --> 00:02:48,252 లైవ్-యాక్షన్ రోల్-ప్లే. మనం యుద్ధం చేస్తున్నట్టు ఆడతాం. 40 00:02:48,335 --> 00:02:50,295 రబ్బరు ఖడ్గాలు లాంటి వాటితో అన్నమాట. 41 00:02:50,379 --> 00:02:52,506 పోయిన సంవత్సరం ఎవరు గెలిచారో తెలుసా? 42 00:02:52,589 --> 00:02:54,299 -ఐయాన్. -గెలవాలని అతని కోరిక. 43 00:02:54,967 --> 00:02:56,260 -లూ? -ఇంకోసారి ఊహించి చెప్పు. 44 00:02:56,802 --> 00:02:58,762 -పాపీ -నేను, జో. నేను గెలిచా. 45 00:03:00,138 --> 00:03:01,682 ఆ చెత్త టోర్నమెంట్ ని నేనే గెలిచాను. 46 00:03:01,765 --> 00:03:05,477 మంచిది. పిచ్చికొట్టుడు కొట్టొచ్చా లేక చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు ఆడాలా? 47 00:03:05,561 --> 00:03:06,937 జో, కాదు. చూడు. 48 00:03:07,020 --> 00:03:10,357 మనం మళ్లీ ఆఫీసులోకి అడుగుపెట్టే తొలి అధికారిక రోజు ప్రత్యేకంగా ఉండాలని, 49 00:03:10,440 --> 00:03:12,025 గాయపరుచుకొనేలా ఉండకూడదని ఐయాన్ కోరిక. 50 00:03:12,109 --> 00:03:14,736 ఈ రోజు మ్యాజిక్ గురించి అన్నమాట. 51 00:03:29,585 --> 00:03:31,378 -వావ్. -అవును. 52 00:03:31,461 --> 00:03:33,630 అందరూ శ్రద్ధగా వినండి! 53 00:03:33,714 --> 00:03:37,259 రాజుగారు, రాణిగారు విచ్చేశారు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 54 00:03:38,302 --> 00:03:40,262 -నా రాజభక్తిగల జనులారా... -మా. 55 00:03:40,345 --> 00:03:45,517 మా రాజభక్తిగల జనులారా, మనం మరీ ఎక్కువ కాలం అంధకారంలో మగ్గిపోయాము. 56 00:03:46,143 --> 00:03:48,478 మిత్రులారా, నిజంగా ఈ ఏడాదంతా పరమ చండాలంగా గడిచింది. 57 00:03:49,938 --> 00:03:53,483 -కానీ ఈరోజు, నేను... -మేము. 58 00:03:53,567 --> 00:03:56,570 ఈరోజు, మేము ఒక వీరుడిని కనిపెడతాము, 59 00:03:57,446 --> 00:03:59,198 అతను తేజోదీప్త ఖడ్గాన్ని బయటకు తీస్తాడు. 60 00:04:00,073 --> 00:04:01,241 అలాగే, కొత్త రోజును ఉదయింపజేస్తాడు! 61 00:04:01,325 --> 00:04:04,036 నేడే ఎవర్లైట్. 62 00:04:04,119 --> 00:04:05,829 భలే భలే! 63 00:04:05,913 --> 00:04:07,956 ఎట్టకేలకు, రాత్రి ముగిసింది. 64 00:04:08,040 --> 00:04:11,126 ఇక ఒక కొత్త రోజు ఉదయించనుంది! 65 00:04:11,210 --> 00:04:13,337 మన పండుగల మంత్రి ఎక్కడ? 66 00:04:14,213 --> 00:04:17,007 అది ఆన్ అయిందా? వాల్యూమ్ ఎక్కడ? 67 00:04:18,509 --> 00:04:22,346 సీ.డబ్ల్యూ. మీ స్వరం గట్టిగా, అలాగే స్పష్టంగా వినబడుతోంది, నేస్తమా. 68 00:04:23,931 --> 00:04:26,016 సరే. 69 00:04:26,099 --> 00:04:30,395 అతి జాగ్రత్తగల మహారాణి గారి అభ్యర్థన మేరకు ఈ మహా మేధావి, 70 00:04:30,479 --> 00:04:33,232 తన గృహము నుండే కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. 71 00:04:33,315 --> 00:04:37,110 రాజ్యంలోనే అత్యంత మేధోసంపన్నుడి ప్రాణానికి ముప్పు ఏర్పడనివ్వలేము కదా? 72 00:04:37,194 --> 00:04:41,114 మన మహారాణి తెలివిమంతురాలు, వివేకవంతురాలు. 73 00:04:41,198 --> 00:04:43,992 అతని శరీర సౌష్టవం కన్నా అతని అహం చాలా గట్టిది. 74 00:04:44,076 --> 00:04:46,161 భలే భలే! 75 00:04:46,245 --> 00:04:50,040 తమ ధైర్యసాహసాలను పరీక్షింపదలచిన వారందరికీ సాదర ఆహ్వానం. 76 00:04:50,123 --> 00:04:53,836 మీ ఖడ్గం గట్టిదే అయితే, మీ స్థైర్యంలో సత్తువ ఉంటే, 77 00:04:53,919 --> 00:04:58,715 మీ పేరు ధీరాతిధీరుల రాతి మీద చెక్కింపబడుతుంది. 78 00:04:59,550 --> 00:05:01,593 అలాగే, వెయివర్ ఫారమ్ మీద సంతకం చేయండి. 79 00:05:01,677 --> 00:05:04,596 భలే భలే! అదీలెక్క, కానీ వెయివర్ ఫారమ్ మీద సంతకం మాత్రం చేయండి. 80 00:05:04,680 --> 00:05:07,683 అవును, ఏవైనా గాయలైతే, వాటికి మేము బాధ్యులం కాదు. 81 00:05:07,766 --> 00:05:11,687 వెయివర్ ఫారాలు. వచ్చి మీ వెయివర్ ఫారాలు తీసుకోండి, సన్నాసుల్లారా. 82 00:05:13,397 --> 00:05:14,481 కేరొల్ తాగుందా? 83 00:05:14,982 --> 00:05:18,443 తను కేరొల్ కాదు. ఆవిడ చిత్తడి ప్రాంతానికి సర్వాధికారిణి. 84 00:05:18,986 --> 00:05:20,612 చూడు, ప్రతిఒక్కరికీ ఏదోక పాత్ర ఉంటుంది. 85 00:05:20,696 --> 00:05:25,075 కానీ, తన పాత్ర మాత్రం సారాయిని కాస్త ఎక్కువగానే పుచ్చుకుంటోంది. 86 00:05:25,868 --> 00:05:27,119 కానీ పర్వాలేదులే. 87 00:05:27,202 --> 00:05:30,122 అదంతా వినోదంలో భాగమే, ఎందుకంటే, నేడు అందరూ తమ పాత్రల్లో జీవిస్తున్నారు. 88 00:05:30,205 --> 00:05:32,082 బ్రాడ్. నువ్వు ఏ వేషమూ వేయేలేదే? 89 00:05:32,165 --> 00:05:34,168 నేను పనికి వేషం వేసుకొనే వచ్చాను కదా. 90 00:05:34,835 --> 00:05:37,254 -నీ పాత్ర ఏంటి? -నేను పరమ పావనమైన ఆల్బ్రెక్ట్ ని. 91 00:05:37,337 --> 00:05:39,506 -అయితే, నువ్వు బ్రహ్మచారివా? -లేదు, నేనేమీ... 92 00:05:39,590 --> 00:05:41,383 నేను ఇవి కల్పిత పాత్రలు అనుకున్నానే. 93 00:05:42,176 --> 00:05:44,094 శతకోటి క్షమాపణలు, మహాప్రభు. 94 00:05:44,178 --> 00:05:45,721 దేవుడా. 95 00:05:46,388 --> 00:05:47,806 నవ్వేవాళ్ళు నవ్విపోదురుగాక నాకేంటి. 96 00:05:56,481 --> 00:05:58,567 హేయ్, పాప్, ఏం చేస్తున్నావు? వేడుక ప్రారంభమవుతోంది. 97 00:05:58,650 --> 00:06:00,652 అవును, నాకు తెలుసు. నేను నా కవచాన్ని ధరిస్తున్నాను. 98 00:06:00,736 --> 00:06:03,280 ఏంటి? నువ్వు పోరాటంలో పాల్గొనకూడదు. ఇప్పుడు నువ్వు బాస్ వి. 99 00:06:03,363 --> 00:06:04,781 బాసులు పోరాటాలలో పాల్గొనరు. 100 00:06:04,865 --> 00:06:07,409 నేనెప్పుడూ టోర్నమెంట్లలో పాల్గొనలేదనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ గమనించలేదా? 101 00:06:07,492 --> 00:06:09,870 ఎందుకంటే, నువ్వు ఓడిపోయి, ఒక దద్దమ్మలా కనబడతావని నీకు భయం. 102 00:06:10,621 --> 00:06:13,582 బాహాబాహి పోరులో ఈ ఆఫీసులో పనిచేసే వారిలో ఎవ్వరినైనా కానీ 103 00:06:13,665 --> 00:06:16,335 నేను ఒంటిచేత్తో మట్టికరిపించగలను. 104 00:06:16,418 --> 00:06:20,088 కానీ ఆ పని నేను చేయను, ఎందుకంటే ఎవర్లైట్ అనేది నా గురించి కాదు. 105 00:06:20,172 --> 00:06:23,050 కానీ దాన్ని సృష్టించింది, నిన్ను రాజుగా ప్రకటించుకుంది నువ్వే కదా. 106 00:06:23,133 --> 00:06:25,135 -అవునుమరి. కథలో పస ఉండాలి కదా. -దేవుడా. 107 00:06:25,219 --> 00:06:26,678 అసలు నేను దేవుడిగా ఉందామనుకున్నాను, 108 00:06:26,762 --> 00:06:29,473 కానీ ఈ కల్పిత అంశానికి రాజు అయితేనే బాగుంటుందని నాకు అనిపించింది. 109 00:06:29,556 --> 00:06:32,267 -నీకు దేవుడు అయితే బాగుంటుందనిపిస్తోందా? -ఏదైనా కానీ, నేను పోరులో పాల్గొంటున్నా. 110 00:06:32,351 --> 00:06:36,230 చూడు, పాపా, నువ్వు పోరులో పాల్గొనలేవు. ఈ సెలవురోజు వారికోసమని పెట్టబడింది. 111 00:06:36,313 --> 00:06:41,068 ఉద్యోగులందరికీ గతేడాదిని మర్చిపోయి కొత్తగా ప్రారంభించడానికి ఇదొక అవకాశం. 112 00:06:41,902 --> 00:06:45,822 "ఎట్టకేలకు, రాత్రి ముగిసింది, ఒక కొత్త రోజు ఉదయించనుంది." 113 00:06:46,406 --> 00:06:48,951 సరే. నువ్వు టోర్నమెంట్ లో పాల్గొనకపోవడానికి గల కారణం 114 00:06:49,034 --> 00:06:51,161 సిబ్బంది నైతిక స్థితి మీద నీకు శ్రద్ధ ఉండటమే కారణమని, 115 00:06:51,245 --> 00:06:54,206 నా అగ్నిగోళం చేత చావుదెబ్బ తింటావనే భయం వల్ల కాదు అని ఒప్పుకుంటున్నానులే. 116 00:06:57,793 --> 00:06:58,794 లొంగిపో. 117 00:06:59,378 --> 00:07:02,172 సరే, నీకు అదృష్టం కలిసొచ్చింది. నేను వార్మప్ చేయలేదు. 118 00:07:05,926 --> 00:07:09,137 రాజు గెలిచినా లాభం లేదు. దానికి ఎవ్వరూ కేరింతలు కొట్టరు. 119 00:07:09,221 --> 00:07:11,765 వాళ్లకి వాళ్ళు ఊహించనివాడు గెలవాలి. వాళ్లకి రూడీ కావాలి. 120 00:07:11,849 --> 00:07:15,519 రూడీ? అతడు ఏ శాఖలో పని చేస్తాడు? 121 00:07:16,728 --> 00:07:19,940 రూడీ ఇక్కడ పని చేయడు. నేనో సినిమా పాత్ర గురించి మాట్లాడుతున్నా, తల్లీ. 122 00:07:22,150 --> 00:07:26,321 విషయమేమిటంటే, ఎవ్వరూ ఊహించనివారు విజేతగా నిలవాలి. అటు చూడు. 123 00:07:27,948 --> 00:07:30,242 కొన్నేళ్ళ క్రితం వింత పాప మెగ్ గెలిచింది. 124 00:07:30,325 --> 00:07:32,578 2018లో బక్క పాల్ గెలిచాడు. 125 00:07:32,661 --> 00:07:35,914 నమ్మబుద్ధి కాదు కానీ, గతేడాది డేవిడ్ గెలిచాడు. 126 00:07:35,998 --> 00:07:38,834 -దాన్ని మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు. -అవును. 127 00:07:38,917 --> 00:07:40,169 ఒక్క నిమిషం. నీ ఉద్దేశం ఏంటి? 128 00:07:40,252 --> 00:07:45,048 ఫలితాన్ని నేనే నిర్ణయిస్తాను. ప్రతీ ఏడాది, విజేత అవుతాడని ఎవ్వరూ ఊహించనివారిని 129 00:07:45,132 --> 00:07:46,967 నేను ఎంచుకొని, వారే గెలిచేలా చేస్తాను, 130 00:07:47,050 --> 00:07:50,888 తద్వారా, ప్రతిఒక్కరిలో వారు కూడా విజేత కావచ్చు అనే ఆశను కలిగిస్తాను. 131 00:07:52,055 --> 00:07:54,516 కానీ వారు కాలేరా? 132 00:07:54,600 --> 00:07:58,478 ఎలా అవుతారు, కానీ అవ్వగలరనే నమ్మకం వారికి ఉంటుంది, 133 00:07:58,562 --> 00:08:00,397 అదే కదా ఎవర్లైట్ గొప్పతనం. 134 00:08:00,480 --> 00:08:02,649 సరే, నాకు అర్థమైంది. 135 00:08:02,733 --> 00:08:04,943 ఇప్పటిదాకా నేను విజేతగా నిలవలేకపోవడానికి గల కారణం, 136 00:08:05,027 --> 00:08:07,404 నేనంత దారుణంగా ఓడిపోయేదాన్ని కాదు కాబట్టే కదా. 137 00:08:08,363 --> 00:08:09,406 -అవును. -అవును. 138 00:08:09,948 --> 00:08:12,576 -నీకేం కావాలంటే అది. అంతే కదా. -నువ్వన్నది నిజమే. ఇవాళ నేను పాల్గొనకూడదు. 139 00:08:12,659 --> 00:08:15,204 నేను శారీరకంగా విజృంభిస్తాను కనుక నేను పొరపాటున గెలిచే అవకాశముంది. 140 00:08:15,287 --> 00:08:17,873 ఇప్పుడు నీలో కూడా కలుగుతోంది. ఈ గొప్పదనం గురించే నేను చెప్పేది. 141 00:08:17,956 --> 00:08:20,792 నువ్వు శారీరకంగా గెలుస్తావనే నమ్మకం నీకు కలుగుతుంది, 142 00:08:20,876 --> 00:08:23,629 కానీ నిజానికి, నువ్వు గెలవలేవు, కానీ గెలవగలవనే నమ్మకం నీకు కలుగుతుంది. 143 00:08:23,712 --> 00:08:26,048 -అవును, ఇప్పుడు నేను నీలాంటి దాన్ని. -అస్సలు కాదు. 144 00:08:26,131 --> 00:08:28,383 అవును, నేను ఆడ రాజులాంటి దాన్ని. 145 00:08:29,092 --> 00:08:30,886 అంటే రాణి కదా. 146 00:08:30,969 --> 00:08:32,638 నేను విసిరింది నీకు బాగా గట్టిగా తగిలిందా ఏంటి? 147 00:08:34,932 --> 00:08:40,102 సోదరసోదరీమణులారా, కొత్త రోజు ఉదయించడానికి సంబంధించిన టోర్నమెంట్ లో పాల్గొనడానికి 148 00:08:40,187 --> 00:08:44,191 ముందుకు వచ్చి, మీ ధీరత్వం తగ్గకుండా చూసుకోండి. 149 00:08:44,274 --> 00:08:47,569 ముందుగా, పొడగరి అరేలియస్ కి 150 00:08:48,320 --> 00:08:50,489 భీకరబలికి మధ్య పోటీ. 151 00:08:52,074 --> 00:08:54,451 -బాగానే ఉంది. -ఈ క్షణం కోసం నేను చాలా శ్రమించాను. 152 00:08:54,535 --> 00:08:56,370 ఈ పవిత్రమైన రోజుకు గౌరవం తేవాలన్నదే నా కోరిక. 153 00:08:56,453 --> 00:08:59,414 యోధులు సిద్ధమేనా? మొదలుపెట్టండి! 154 00:09:02,042 --> 00:09:04,670 -అయ్యయ్యో. -అయ్యయ్యో. 155 00:09:07,548 --> 00:09:08,632 నేను చనిపోయాను. 156 00:09:08,715 --> 00:09:11,635 ఈ వేషం కోసం నలభై డాలర్లు ఖర్చు పెట్టాను. 157 00:09:11,718 --> 00:09:15,347 విజేతగా నువ్వు ఎంచుకుంది తననేనా? టెస్టర్ అయితే ఎవ్వరూ ఊహించరులే. 158 00:09:15,430 --> 00:09:18,642 అవును, టెస్టర్ ని ఎవ్వరూ ఊహించరు, కానీ తను మాత్రం కాదు. తను బుర్ర తీనేస్తుంది. 159 00:09:18,725 --> 00:09:20,185 ఇప్పుడు మీ దృష్టి నా వైపు మళ్లింది కనుక, 160 00:09:20,269 --> 00:09:23,605 నేను ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామనుకుంటున్నాను. 161 00:09:23,689 --> 00:09:26,316 ఇది సరదాభరితమైన కల్పిత పాత్రల రోజు అని నాకు తెలుసు. 162 00:09:26,400 --> 00:09:28,527 చెత్తలో చాలా ఆహారం పారేసి ఉందని నేను గమనించాను. 163 00:09:28,610 --> 00:09:31,280 -అది వాస్తవ పరిస్థితిని విస్మరించడమే... -అవును, తను విసిగిస్తుంది. 164 00:09:31,363 --> 00:09:33,699 అవును. కానీ నువ్వు బాగానే ఊహించావు. 165 00:09:33,782 --> 00:09:36,910 గెలిచేది టెస్టర్ యే, కానీ తను కాదు. తను. 166 00:09:38,954 --> 00:09:40,455 తనతో పోలిస్తే తను పర్వాలేదు కదా? 167 00:09:40,539 --> 00:09:44,418 అవును. కానీ తను గెలిచే అవకాశం లేదు. తను యోధురాలు కాదు, వైద్యురాలు. 168 00:09:44,501 --> 00:09:46,044 -దేవుడా, అవునా? -అవును. 169 00:09:46,128 --> 00:09:48,463 కొట్లాడుకొనే టోర్నమెంట్ కి అసలు వైద్యులు ఎవరైనా వస్తారా? 170 00:09:48,547 --> 00:09:49,548 ఏమో. 171 00:09:49,631 --> 00:09:51,967 ఆగాగు. నాకో ఆలోచన తట్టింది. 172 00:09:52,676 --> 00:09:54,803 ఒక విజేత కన్నా మెరుగైన విషయం ఇంకేమయ్యుంటుందో తెలుసా? 173 00:09:55,470 --> 00:09:56,763 ఇద్దరు విజేతలు. 174 00:09:59,474 --> 00:10:04,396 శ్రద్ధగా వినండి, సోదరసోదరీమణులారా. మీ రాణిగారు ఒక ప్రకటన చేయదలచారు. 175 00:10:04,479 --> 00:10:07,482 బాగా ఆలోచించిన పిమ్మట, నేనేం నిర్ణయం... 176 00:10:07,566 --> 00:10:10,027 -మేము. -మేము ఏం నిర్ణయం తీసుకున్నామంటే, 177 00:10:10,110 --> 00:10:12,779 ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ని మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. 178 00:10:12,863 --> 00:10:14,740 -ఇకమీదట, నా ఆదేశం ఏంటంటే... -మా ఆదేశం. 179 00:10:14,823 --> 00:10:18,660 మా. వావ్, అలా చెప్పడం చాలా తేలిగ్గా ఉంది. "నేను" అని చెప్తుంటే బాగుంది. 180 00:10:18,744 --> 00:10:20,954 -అది మానవ నైజం. -ఒక్క నిమిషం, ఏం జరుగుతోంది? 181 00:10:21,038 --> 00:10:22,414 నోర్మూసుకో! నువ్వు నోర్మూసుకో! 182 00:10:22,497 --> 00:10:24,166 -నేనేమీ... -ఇకమీదట, 183 00:10:24,249 --> 00:10:29,796 టోర్నమెంట్ లో ఇద్దరిద్దరి మధ్య పోరు జరగాలి అని మేము ఆదేశిస్తున్నాము. 184 00:10:29,880 --> 00:10:31,215 ఒక్క నిమిషం. మీరు నియమాలు మారుస్తున్నారా? 185 00:10:31,298 --> 00:10:33,634 అవును. మమ్మల్ని నమ్మండి. ఇలా అయితే, మరింత మజా ఉంటుంది. 186 00:10:33,717 --> 00:10:36,845 కనుక, మీ భాగస్వామి కోసం అక్కడున్న బ్రాకెట్ ని చూడండి. 187 00:10:36,929 --> 00:10:39,890 టోర్నమెంట్ మధ్యలో మీరు ఫార్మాట్ ని మార్చలేరు. అది న్యాయం కాదు. 188 00:10:39,973 --> 00:10:41,934 -నువ్వు, ఇంకో టెస్టర్ ఒక జట్టు. -ఇద్దరిద్దరు, బాబులూ. 189 00:10:42,017 --> 00:10:44,770 -మనం ఇద్దరం కలిసి ఆడుతున్నాం. -ఒక్క నిమిషం. లేదు. ఏంటీ? 190 00:10:44,853 --> 00:10:46,813 నువ్వు టోర్నమెంట్ లో పాల్గొంటున్నావు. కమాన్. 191 00:10:46,897 --> 00:10:49,358 ఏమంటావు, సొగసరి లిలియానా? ఎముకలు విరగ్గొట్టడానికి సిద్ధమేనా? 192 00:10:49,441 --> 00:10:52,945 నేను పాల్గొనలేను. నేను వైద్యురాలిని. వైద్యులు ఎవరి ఎముకలనూ విరగొట్టరు. 193 00:10:53,028 --> 00:10:56,657 కానీ, ఎముకలను బాగు చేస్తారు కదా. పోరులో వారి వల్ల ప్రయోజనం ఉండవచ్చు. 194 00:10:56,740 --> 00:10:59,076 -ఎముకలను బాగు చేసేదానిలాగానా? -ఒక గొప్ప ఎముకల డాక్టర్ లా. 195 00:11:01,495 --> 00:11:03,789 -వెళ్లి కొన్ని ఎముకలను బాగు చేద్దాం పద. -అదీలెక్క! 196 00:11:07,000 --> 00:11:08,126 వద్దు! 197 00:11:08,794 --> 00:11:11,338 వద్దు! దయచేసి ఈ పని చేయవద్దు. నేను దారుణంగా ఓడిపోయేలా చేయవద్దు. 198 00:11:11,421 --> 00:11:13,382 ఈ పోటీలో నాకు గెలిచే అవకాశం ఉంది, అది నీకూ తెలుసు. 199 00:11:13,465 --> 00:11:17,219 జో, జో, కాస్త శాంతించు, అతనికి గెలిచిన చరిత్ర ఉంది, సరేనా? 200 00:11:17,302 --> 00:11:18,762 ఓసారి అతనికి అవకాశం ఇచ్చి చూడు. 201 00:11:18,846 --> 00:11:22,057 -కంగారుపడకు, నువ్వు కొందరిని చంపగలవు. -నేను కొందరిని చంపగలనా? 202 00:11:22,140 --> 00:11:24,852 జో పాప, నువ్వు పోటీ ముగిసేలోపు చాలా మందిని, 203 00:11:24,935 --> 00:11:27,563 లెక్కలేనంత మందిని చంపబోతున్నావు, సరేనా? కంగారుపడకు. 204 00:11:28,188 --> 00:11:29,648 నేను నా వైరుల నెత్తురులో జలకాలాడగలనా? 205 00:11:29,731 --> 00:11:31,692 బంగారం, కావాలంటే నువ్వు దాన్ని తాగవచ్చు కూడా, 206 00:11:31,775 --> 00:11:34,528 అంటే, అనేక కారణాల వల్ల నేను ఈ పనిని చేయను కానీ, 207 00:11:34,611 --> 00:11:36,780 కానీ నువ్వు దాన్ని లోషన్ గా కూడా రాసుకోవచ్చు. 208 00:11:36,864 --> 00:11:38,574 -సరేనా, నన్ను నమ్ముతున్నావా? -నమ్ముతున్నాను. 209 00:11:38,657 --> 00:11:40,826 -భలే భలే. -భలే భలే. 210 00:11:45,163 --> 00:11:46,415 ఎందుకలా చేశావు? 211 00:11:46,498 --> 00:11:49,626 మనం ఆ పిచ్చిదాన్ని గెలవనివ్వలేము, 212 00:11:49,710 --> 00:11:51,587 అందుకే తనకి ఒక గుదిబండను ఏర్పాటు చేశాను. 213 00:11:52,421 --> 00:11:54,631 నేనో తిరుగుబోతుని, ప్రేమికురాలిని 214 00:11:54,715 --> 00:11:56,884 చిన్నారిని, తల్లిని 215 00:11:56,967 --> 00:11:58,760 పాపిష్ఠి దానిని 216 00:11:58,844 --> 00:12:01,471 సన్యాసినిని, నేను... 217 00:12:02,264 --> 00:12:07,186 అబ్బా. సుసు పోసే దాకా కుదురుగా ఉండు 218 00:12:07,269 --> 00:12:10,439 ఒక విషాదపు కల్పితం, నిస్సారమైన వాస్తవికత, రెండూ ఇక్కడ ఏకమయ్యాయి. 219 00:12:11,857 --> 00:12:13,442 ఓ విషయం చెప్పనా, బ్రాడ్? 220 00:12:13,525 --> 00:12:17,696 పక్కన నిలబడి జోకులేయడం చాలా తేలిక, 221 00:12:17,779 --> 00:12:20,490 -కానీ నిజంగా కష్టమైనది ఏంటో తెలుసా? -దీని తర్వాత నిన్ను గౌరవించడమా? 222 00:12:20,574 --> 00:12:22,242 ప్రమాదాన్ని ఎదుర్కొనడం. 223 00:12:22,326 --> 00:12:26,163 బ్రెనే బ్రౌన్ అన్నట్టు "పైన పటారం లోన లొటారం"గా జీవించడానికి బదులుగా. 224 00:12:26,246 --> 00:12:27,497 తను ఎవరో నాకు తెలీదు. 225 00:12:28,123 --> 00:12:31,210 నిజంగానా? నీకు బ్రెనే బ్రౌన్ ఎవరో తెలీదా? 226 00:12:32,169 --> 00:12:34,046 ఇప్పుడు అర్థమవుతుందిలే. 227 00:12:34,129 --> 00:12:37,466 నేను నీకు కొన్ని లింక్స్ పంపుతా, బాసూ. తను నీ జీవితాన్ని మార్చేస్తుంది. 228 00:12:39,343 --> 00:12:41,094 ఏదేమైనా... 229 00:12:41,178 --> 00:12:43,222 ఎవర్లైట్ అనేది కేవలం ఒక సెలవు మాత్రమే కాదు. 230 00:12:45,307 --> 00:12:49,019 అది ఒక ఆశాకిరణం, మనకి ఎన్ని కష్టాలొచ్చినా, 231 00:12:49,102 --> 00:12:53,357 వాటిని అధిగమించి బయటపడటానికి కావలసిన ఆ ఆశాకిరణం మనలో ఉంటుంది. 232 00:12:54,775 --> 00:12:56,610 వాటిని అధిగమించి బయటపడు, బాసూ. 233 00:12:57,319 --> 00:12:58,320 సుసును డ్రెస్ మీద పోశావు. 234 00:12:58,403 --> 00:12:59,947 ఇది డ్రెస్ కాదు, బ్రాడ్. ఇది ట్యూనిక్... 235 00:13:00,030 --> 00:13:01,281 అయ్యో, నిజంగానే సుసు పోశాను. 236 00:13:01,365 --> 00:13:04,159 హేయ్, బ్రహ్మచారీ! మనకి శత్రువుల నెత్తురును చిందించే పని ఉంది, పద. 237 00:13:06,328 --> 00:13:07,329 సరే. నేను... 238 00:13:07,412 --> 00:13:09,164 -వెంటనే! -అలాగే. 239 00:13:09,248 --> 00:13:15,796 రాములమ్మ, పరమ పావనమైన ఆల్బ్రెక్ట్ జట్టుగా టోర్నమెంట్ మళ్లీ మొదలైంది. 240 00:13:15,879 --> 00:13:18,465 సరే, రాములమ్మ. పరమ పావనమైన ఆల్బ్రెక్ట్ కిందటేడాది దీన్ని గెలిచాడు, 241 00:13:18,549 --> 00:13:20,759 -కనుక అతను చెప్పేది విని... -ప్రారంభించండి! 242 00:13:21,718 --> 00:13:22,761 అబ్బా! 243 00:13:39,778 --> 00:13:41,822 హేయ్, హేయ్. 244 00:13:41,905 --> 00:13:44,116 హేయ్, సరే, ఇక చాలు. మనం గెలిచాం, గెలుపు మనదే. 245 00:13:44,199 --> 00:13:45,534 -బాబోయ్... -దేవుడా. 246 00:13:46,827 --> 00:13:49,788 రాములమ్మ, పరమ పావనమైన ఆల్బ్రెక్ట్ గెలిచారు. 247 00:13:50,664 --> 00:13:53,667 మీకు కావలసింది ఇదే కదా? 248 00:13:53,750 --> 00:13:56,670 మీకు సంతోషంగా లేదా? 249 00:13:56,753 --> 00:14:01,049 మనకి విలన్ అయితే దొరికింది. అందులో సందేహమే లేదు. 250 00:14:01,133 --> 00:14:04,803 ఇప్పుడు మనం మన హీరోల కోసం చూడాలి. అంతే కదా? 251 00:14:04,887 --> 00:14:06,763 అవును, అంతే. అంతే. 252 00:15:10,577 --> 00:15:12,079 అగ్నిగోళం! 253 00:15:15,082 --> 00:15:19,378 నాకేమీ కాలేదు! బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. 254 00:15:41,817 --> 00:15:43,527 భలే భలే! 255 00:15:43,610 --> 00:15:45,654 మన అరివీర భయంకర జంట, 256 00:15:45,737 --> 00:15:48,073 భీకరబలి మరియు సొగసరి లిలియానా జట్టుకు... 257 00:15:48,156 --> 00:15:49,700 తొక్కలే! 258 00:15:49,783 --> 00:15:53,954 ...పరమ పావనమైన ఆల్బ్రెక్ట్ మరియు నెత్తురు చూడాలని తపిస్తున్న 259 00:15:54,037 --> 00:15:56,623 రాములమ్మ జట్టుకు మధ్య పోటీ. 260 00:16:00,294 --> 00:16:01,712 -సిద్ధమేనా ఆల్బ్రెక్ట్? -ఏంటి, జోకా? 261 00:16:01,795 --> 00:16:04,423 నువ్వు ఛాంపియన్ తో మాట్లాడు... నాకు తెలుసు నువ్వు... 262 00:16:06,133 --> 00:16:08,010 ఆగండి, ఆగండి, ఆగండి. 263 00:16:08,510 --> 00:16:10,304 ఏంటి సంగతి? నువ్వు ఒక పోరు మధ్యలో ఉన్నావు. 264 00:16:10,387 --> 00:16:12,556 నన్ను కొడుతోంది. ఇది మంచి విషయం కాదు. 265 00:16:12,639 --> 00:16:15,058 నువ్వు కూడా ఎదురుతిరగాలి, డేవిడ్. వాళ్లు నీ ప్రత్యర్థులు. 266 00:16:15,142 --> 00:16:19,229 నేను జో గురించి చెప్తున్నాను. తను మరీ మొరటుగా ఆడుతోంది. 267 00:16:19,313 --> 00:16:20,314 ఓ విషయం చెప్పనా? 268 00:16:20,397 --> 00:16:21,440 ఇక చాలు. 269 00:16:22,524 --> 00:16:24,318 తనతో ఆడటం నా వల్ల కాదు. నేను తప్పుకుంటున్నాను. 270 00:16:24,818 --> 00:16:26,987 ఆగాగు, నువ్వు తప్పుకోలేవు. ఎవర్లైట్ లో తప్పుకోవడాలు ఉండకూడదు. 271 00:16:27,070 --> 00:16:29,323 లేదు, నీ బలహీనతలు నీ ఆనందానికి అడ్డుగా వచ్చే సందర్భాలలో 272 00:16:29,406 --> 00:16:32,826 "వద్దు" అని చెప్పడంలో తప్పు లేదని బ్రెనే బ్రౌన్ చెప్పింది. 273 00:16:32,910 --> 00:16:34,244 ఎవరు? 274 00:16:34,328 --> 00:16:36,538 నిజంగానా? నీకు కూడా బ్రెనే బ్రౌన్ ఎవరో తెలీదా? 275 00:16:36,622 --> 00:16:37,915 -బ్రెనే బ్రౌన్ ఎవరో నీకు తెలుసా? -తెలీదు. 276 00:16:37,998 --> 00:16:40,083 ఇది నమ్మలేకున్నాను... ఓ విషయం చెప్పనా? 277 00:16:40,167 --> 00:16:41,835 ఇప్పుడు బాగా అర్థమవుతోందని మాత్రం చెప్పగలను. 278 00:16:41,919 --> 00:16:46,465 బాగా అర్థమవుతోంది. నేను మీకు లింక్స్ పంపుతాను. ఇక్కడున్న అందరికీ పంపుతాను. 279 00:16:46,548 --> 00:16:48,133 ఇక అంతే. 280 00:16:48,217 --> 00:16:51,303 ఛాంపియన్ వైదొలగుతున్నాడు. ఇదివరకు సరదాగా ఉండేది. 281 00:16:51,386 --> 00:16:53,680 -ఇది మంచిది కాదు, పాప్. -అతడికి తేరుకోవడానికి కాస్త సమయం ఇవ్వు. 282 00:16:53,764 --> 00:16:54,932 పూర్తిచేయమని అతడిని ఒప్పించవచ్చు. 283 00:16:55,015 --> 00:16:58,143 లేదు, అప్పుడు అతను గాయంతో పోరాడతాడు. అప్పుడు అతను అందరికన్నా బలహీనుడు అవుతాడు. 284 00:16:58,227 --> 00:17:01,271 అతను ఒక కెర్రీ స్ట్రగ్ లా అందరూ అతనికి మద్దతుగా ఉంటారు. 285 00:17:04,023 --> 00:17:05,817 నీకు కెర్రీ స్ట్రగ్ ఎవరో తెలీదు కదా. 286 00:17:05,901 --> 00:17:08,904 నాకేమీ చెప్పాలని లేదు. నీకు కోపం వచ్చేస్తుంది. అతను సినిమాలో పాత్రనా? 287 00:17:08,987 --> 00:17:12,782 కెర్రీ స్ట్రగ్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి దేశ... ఏదైతే ఏంటిలే. 288 00:17:12,866 --> 00:17:14,284 ఇప్పుడది ముఖ్యం కాదు. 289 00:17:14,367 --> 00:17:15,743 మనం ఒక కొత్త విలన్ ని కనిపెట్టాలి. 290 00:17:17,954 --> 00:17:18,955 నా దగ్గర ఒక ఆలోచన ఉంది. 291 00:17:19,455 --> 00:17:21,333 బ్రాడ్, నువ్వు పోరులో పాల్గొనాలి? 292 00:17:21,415 --> 00:17:22,459 అది నీకెలా తెలుసు? 293 00:17:22,542 --> 00:17:24,044 మీరు చేయబోయే వాటిని ఊహించడం చాలా తేలిక. 294 00:17:24,127 --> 00:17:26,255 నువ్వు వచ్చి టోర్నమెంట్ ని పూర్తి చేయాలి, అంతే. 295 00:17:26,338 --> 00:17:27,756 లేదు, అది వెర్రి పని, నాకు నచ్చదు. 296 00:17:27,839 --> 00:17:30,509 ఈ రోజును ఒక కాల్పనిక చెత్త అని నువ్వనుకుంటున్నావని మాకు తెలుసు, 297 00:17:30,592 --> 00:17:31,927 కానీ వాళ్ళకి ఇది ముఖ్యమైన రోజు. 298 00:17:32,010 --> 00:17:34,054 గతేడాది చాలా కష్టంగా గడిచింది, 299 00:17:34,137 --> 00:17:37,057 కనుక సిబ్బందికి తమ తొలి రోజు సరదాగా ఉండాలని మేము అనుకున్నాం. 300 00:17:37,140 --> 00:17:40,936 వీళ్ళు చాలా కష్టాలు పడ్డారు, కానీ వాళ్లు కృంగిపోలేదు. 301 00:17:41,019 --> 00:17:44,189 ఇప్పుడు వాళ్లు ఇక్కడి దాకా అతికష్టం మీద వచ్చి, తాము చేయగలిగినంత చేస్తున్నారు. 302 00:17:44,273 --> 00:17:47,234 ఇప్పుడు వాళ్ళు విజయవంతంగా దాన్ని నిలబెట్టుకోవాలి, ఎలాగంటే... 303 00:17:47,317 --> 00:17:49,069 -రూడీలాగ. -ఛీ! 304 00:17:49,152 --> 00:17:51,780 -కాదా? -తనకి కెర్రీ స్ట్రగ్ ఎవరో తెలీదు. 305 00:17:51,864 --> 00:17:53,824 -సరే, నేను పాల్గొంటాను. -అదీలెక్క! 306 00:17:53,907 --> 00:17:55,158 -మంచిది! ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 307 00:17:55,242 --> 00:17:57,244 కానీ నాదొక షరతు ఉంది. 308 00:17:57,327 --> 00:18:02,499 నేను గెలిస్తే, మీరు ఎవర్లైట్ ని ఇంకెప్పుడూ జరపకూడదు. 309 00:18:03,876 --> 00:18:05,085 ఏమంటారు? 310 00:18:05,169 --> 00:18:07,004 -ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? -ఎందుకు? 311 00:18:07,087 --> 00:18:08,505 -చిన్నప్పుడు నిన్నెవ్వరూ హత్తుకోలేదా? -ఏం... 312 00:18:08,589 --> 00:18:12,259 అది పిచ్చిగా ఉంటుంది, నాకు నచ్చదు, అది ఉండకూడదు. అదే నా షరతు. మీకు అంగీకారమేనా? 313 00:18:14,219 --> 00:18:15,637 -సరే. -సరే. 314 00:18:19,099 --> 00:18:22,811 ఇక, ఇప్పుడు కదనరంగంలోకి ఒక కొత్త పోటీదారు ప్రవేశించాడు, 315 00:18:22,895 --> 00:18:27,399 ఒక కపటపూరిత కంత్రీగాడు, దుర్బుద్ధి గల తన సహచరిణితో కలిసి పోరు చేయబోతున్నాడు. 316 00:18:27,482 --> 00:18:28,483 అతని పేరు... 317 00:18:29,568 --> 00:18:30,569 బ్రాడ్. 318 00:18:30,652 --> 00:18:32,070 ఏ బ్రాడ్? 319 00:18:32,154 --> 00:18:33,697 ఫైనాన్స్ శాఖకు చెందిన బ్రాడ్. 320 00:18:34,364 --> 00:18:36,825 కమాన్, గురూ. మరీ విరక్తిగా ప్రవర్తించకు. 321 00:18:37,826 --> 00:18:39,119 దాన్ని సీరియస్ గా తీసుకో. 322 00:18:39,870 --> 00:18:41,747 నేను సీరియస్ గానే తీసుకుంటున్నాను. 323 00:18:41,830 --> 00:18:44,249 ఫెన్సింగ్ ద్వారా అందిన ఉపకారవేతనంతో నేను కళాశాలలో చేరాను. 324 00:18:48,879 --> 00:18:49,880 బాగుంది. 325 00:18:49,963 --> 00:18:51,590 ఇక పోరు మొదలుపెట్టండి. 326 00:19:01,517 --> 00:19:03,894 -చచ్చిపో, లెస్బియన్! -ఏంటా మాట, జో. 327 00:19:03,977 --> 00:19:06,688 అవును, నువ్వు విద్వేషపూరిత భాషని వాడుతున్నావు. 328 00:19:08,023 --> 00:19:09,983 -"చచ్చిపో, తిరుగుబోతుదానా"? -అది చులకనగా ఉంది. 329 00:19:10,067 --> 00:19:10,901 కేవలం "చచ్చిపో" అంటే? 330 00:19:10,984 --> 00:19:12,361 -అది సరైనదే. -అది పర్వాలేదు. 331 00:19:12,444 --> 00:19:14,696 సరే. చచ్చిపో! 332 00:19:14,780 --> 00:19:15,906 లిలియానా? 333 00:19:20,494 --> 00:19:21,495 ఇది బాగాలేదు! 334 00:19:23,747 --> 00:19:24,915 రాములమ్మా? 335 00:19:25,582 --> 00:19:26,917 నువ్వు చనిపోవాలి, జో. 336 00:19:29,044 --> 00:19:30,045 తప్పదా? 337 00:19:30,128 --> 00:19:31,839 -అవును, తప్పదు. -నువ్వు చనిపోవాలి, జో. 338 00:19:32,923 --> 00:19:33,924 సరే. 339 00:19:38,303 --> 00:19:42,599 నేను మిమ్మల్నందరినీ శపిస్తున్నాను! మీ ఇళ్లలో శని తాండవించును గాక, 340 00:19:42,683 --> 00:19:46,812 మీ పిల్లలు కాలిపోయాక వచ్చే బూడిద వల్ల దగ్గుతూ 341 00:19:46,895 --> 00:19:51,191 ఊపిరాడక నానా తంటాలు పడుతూ మీరు మరణించెదరుగాక! 342 00:19:52,651 --> 00:19:54,528 -చాలా బాగా చెప్పావు. -గొప్ప చావు. 343 00:19:54,611 --> 00:19:55,737 తను అప్పటికప్పుడు అలా అనేసిందా? 344 00:19:56,822 --> 00:19:58,615 ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. 345 00:19:59,324 --> 00:20:01,201 ఇది చాలా సరదాగా ఉంది. 346 00:20:03,370 --> 00:20:04,997 -చాలా బాగా చంపావు. -నాకు తెలుసు! 347 00:20:05,080 --> 00:20:07,875 మనం గెలుస్తామని నాకనిపిస్తోంది. నిజంగానే మనం... 348 00:20:07,958 --> 00:20:08,959 అయ్యో! 349 00:20:13,881 --> 00:20:17,050 బ్రాడ్. నువ్వు నన్ను చంపేశావా? 350 00:20:17,134 --> 00:20:20,137 నీ ప్రాణాన్ని హరించివేశాను. చాలా బాగా అనిపించింది. 351 00:20:20,220 --> 00:20:22,264 నువ్వు పాపాత్ముడివి. 352 00:20:24,725 --> 00:20:26,894 ఇది పర్వాలేదు. ఏం పర్వాలేదు. ఇది మంచిదే. మంచిదే. 353 00:20:26,977 --> 00:20:28,687 నా చావుకు నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి, లిలియానా. 354 00:20:28,770 --> 00:20:30,314 నువ్వు లేకుండా నేను పోరాడలేను. 355 00:20:30,397 --> 00:20:31,648 నువ్వు పోరాడగలవు. 356 00:20:36,111 --> 00:20:37,112 నువ్వు సాధించగలవు. 357 00:20:46,997 --> 00:20:49,708 ఇప్పుడే మన విజేత ప్రాణం పోసుకుంటుంది. 358 00:20:52,878 --> 00:20:53,879 సరే, బ్రాడ్. 359 00:20:57,049 --> 00:20:58,300 మొదలుపెడదాం. 360 00:20:58,800 --> 00:21:00,427 -కానివ్వండి! -అదీ! 361 00:21:11,146 --> 00:21:14,900 లేదు. కమాన్. 362 00:21:17,778 --> 00:21:19,488 -కమాన్, డానా. -నీ ఓటమి మొదలవుతోంది. 363 00:21:19,571 --> 00:21:21,406 -కమాన్, డానా. -ఇక సెలవు. 364 00:21:24,284 --> 00:21:25,702 అంతే, అంతే! 365 00:21:27,746 --> 00:21:28,956 నువ్వు సాధించావు! 366 00:21:29,039 --> 00:21:31,500 -అంతే. వెళ్లి ఖడ్గం తీసుకో. -అవును, దాన్ని తీసుకో! 367 00:21:38,590 --> 00:21:39,883 కళాశాలలో నేను విలువిద్య నేర్చుకున్నాను. 368 00:21:42,344 --> 00:21:45,472 సొగసరి లిలియానా చనిపోయింది. 369 00:21:47,266 --> 00:21:48,475 విజేత... 370 00:21:49,726 --> 00:21:51,728 ఫైనాన్స్ శాఖకు చెందిన బ్రాడ్. 371 00:21:51,812 --> 00:21:53,397 బ్రాడ్ గెలిచాడా? 372 00:21:55,858 --> 00:21:57,276 ఒక్కోసారి చెడుదే పైచేయి అవుతూ ఉంటుంది. 373 00:21:57,359 --> 00:22:00,404 సరే, ఇక ఎవర్లైట్ అనేది ఉండదు అనుకుంటా. 374 00:22:00,487 --> 00:22:03,407 -మీ రాజు, రాణి దానికి ఒప్పుకున్నారు. -ఒక్క నిమిషం. ఏంటి? 375 00:22:03,490 --> 00:22:05,784 ఇక కలకాలం పాటు మీ రాజ్యాన్ని అంధకారమే ఏలుతుంది, 376 00:22:05,868 --> 00:22:07,870 మీకు ఏ చెత్త డైలాగులు కావాలంటే అవి చెప్పుకోండి. 377 00:22:07,953 --> 00:22:09,246 అదీ సంగతి! 378 00:22:11,540 --> 00:22:13,083 అతను అబద్ధం చెప్తున్నాడు కదా? 379 00:22:15,794 --> 00:22:16,962 లేదు. 380 00:22:25,804 --> 00:22:28,307 -ఛీ. -బ్రాడ్ గెలిచాడంటే నమ్మలేకపోతున్నాను. 381 00:22:28,390 --> 00:22:30,893 నేను నమ్ముతున్నాను, ఈ ఏడాది అంతా ఇలాగే పరమ చెత్తగా జరిగింది కదా. 382 00:22:30,976 --> 00:22:32,477 చెత్తలోకల్లా పరమ చెత్త సంవత్సరం! 383 00:22:32,561 --> 00:22:34,771 ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా మనకి జరగలేదు. 384 00:22:34,855 --> 00:22:36,106 కనీసం ఒక్క మంచి విషయం కూడా! 385 00:22:36,190 --> 00:22:38,650 నువ్వు రాణిగా ఉన్న తొలి ఏడాడే ఇలా జరగడం 386 00:22:38,734 --> 00:22:41,445 -యాదృచ్ఛికం కాదేమో. -అయితే దీనికి నేను బాధ్యురాలినా? 387 00:22:41,528 --> 00:22:43,864 ఏమో. బహుశా ఈ రాజ్యానికి రాణి అవసరం లేదేమో. 388 00:22:43,947 --> 00:22:46,200 -నీ బుద్ధి చూపించావులే. -ఏమో. 389 00:22:46,283 --> 00:22:49,786 బహుశా రాణి ఉంటేనే... 390 00:22:49,870 --> 00:22:51,622 ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. 391 00:22:52,247 --> 00:22:56,710 బ్రాడ్ అందరినీ ఓడించలేదు కదా. నువ్వూ, నేనూ ఇప్పటికీ పోరాడవచ్చు. 392 00:22:56,793 --> 00:22:58,337 లేదు, పాప్. నేను నీకు చెప్పా కదా... 393 00:22:58,420 --> 00:23:01,173 అవును, నాకు తెలుసు. బాసులు గెలుస్తుంటే చూడాలని ఎవరికీ ఉండదు. 394 00:23:01,256 --> 00:23:04,510 అది మంచి కథ కాదు, కానీ మనకి ఇప్పుడు ఆ కథయే దిక్కు. 395 00:23:04,593 --> 00:23:05,594 ఇది అస్సలు అర్థవంతంగానే లేదు. 396 00:23:05,677 --> 00:23:08,013 కథలో, వృక్షం నుండి ఖడ్గాన్ని రాజు లాగలేకపోతాడు. 397 00:23:08,096 --> 00:23:09,848 ఏంటి? ఖడ్గం ముఖ్యం కాదు. 398 00:23:11,850 --> 00:23:15,103 ఒక్క నిమిషం. నీకు కథ అర్థం కాలేదా? 399 00:23:15,187 --> 00:23:17,481 నాకెందుకు అర్థం కాదు. దాన్ని రాసింది నేనే కదా. 400 00:23:17,564 --> 00:23:20,734 ఆ చిన్నవాడు గట్టివాడు కాబట్టి, అందరినీ తుక్కుతుక్కుగా ఓడిస్తాడు. 401 00:23:20,817 --> 00:23:23,612 ఆ తర్వాత అతను వృక్షం నుండి ఖడ్గాన్ని లాగి, అంధకారాన్ని పొడుస్తాడు, 402 00:23:23,695 --> 00:23:26,198 అప్పుడు అంధకారం ముక్కముక్కలై రాలిపోవడమో ఏదో జరుగుతుంది. 403 00:23:26,281 --> 00:23:30,244 లేదు. కథలో మనం గ్రహించాల్సింది ఆశ కోల్పోకూడదనే విషయాన్ని. 404 00:23:31,703 --> 00:23:35,332 అంధకారం అంటే విషాదం, ఆ విషాదాన్ని పారద్రోలగల ఏకైక మార్గం 405 00:23:35,415 --> 00:23:37,584 కాంతిని ప్రసరింపజేయడం. 406 00:23:40,003 --> 00:23:42,381 ఆ కాంతే ఆశ. 407 00:23:42,923 --> 00:23:45,801 సరే, అలాగే. మరి ఆ ఖడ్గం దేన్ని సూచిస్తుంది? 408 00:23:45,884 --> 00:23:47,344 ఇక్కడ ఖడ్గం ముఖ్యం కాదు. 409 00:23:47,427 --> 00:23:49,096 నీ గురించి నాకు తెలుసు కాబట్టి, అది మట్టి బుర్ర కావచ్చు. 410 00:23:49,179 --> 00:23:50,472 అవును. 411 00:23:50,556 --> 00:23:53,517 విషయమేమిటంటే, మనం మట్టిబుర్రతో అంధకారాన్ని ఓడించలేము. 412 00:23:53,600 --> 00:23:54,810 -నేను ఓడించగలను. -మూసుకో! 413 00:23:54,893 --> 00:23:56,645 నువ్వు మట్టిబుర్రతో అంధకారాన్ని ఓడించలేవు, 414 00:23:56,728 --> 00:23:59,731 పార్టీలు ఇచ్చి, టోర్నమెంట్ లో మాయ చేసి కూడా ఓడించలేవు. 415 00:24:00,315 --> 00:24:04,319 కాంతిని నింపగల ఏకైక దారి, దాన్ని నింపగలవని నీకు నమ్మకం ఉండటమే. 416 00:24:05,404 --> 00:24:06,405 ఇది ముగియలేదు. 417 00:24:07,239 --> 00:24:09,575 ఎవర్లైట్ మళ్లీ జరిగే అవకాశం ఇంకా ఉంది. 418 00:24:09,658 --> 00:24:12,995 నువ్వు నమ్మాలి, అంతే. 419 00:24:25,215 --> 00:24:28,010 సరేమరి. ఇక మొదలుపెడదాం. 420 00:26:12,489 --> 00:26:15,367 లొంగిపో, బ్రాడ్. నాకు నిన్ను చంపాలని లేదు. 421 00:26:18,203 --> 00:26:20,539 లేదు, లేదు, లేదు. 422 00:26:48,108 --> 00:26:49,902 ఇప్పుడు నేను బ్రాడ్ ని కాదు. 423 00:26:52,154 --> 00:26:54,907 మీరు నన్ను చంపలేరు. 424 00:26:55,365 --> 00:26:56,366 బాబోయ్. 425 00:26:57,826 --> 00:27:00,162 ఎందుకంటే ఇప్పుడు నేను యోధుడిని కాదు. 426 00:27:02,331 --> 00:27:04,041 కనీసం మనిషిని కూడా కాదు. 427 00:27:07,419 --> 00:27:08,420 వామ్మోయ్! 428 00:27:10,047 --> 00:27:12,090 ఎక్కడికీ పారిపోలేరు. 429 00:27:13,300 --> 00:27:15,469 ఎక్కడా దాక్కోలేరు. 430 00:27:15,552 --> 00:27:16,929 ఎందుకంటే... 431 00:27:18,263 --> 00:27:22,976 నేనే... అంధకారాన్ని. 432 00:27:57,928 --> 00:27:59,638 పోరాడాల్సిన అవసరమే లేదు. 433 00:28:01,557 --> 00:28:03,016 లొంగిపో. 434 00:28:04,685 --> 00:28:06,311 లొంగిపో. 435 00:28:08,021 --> 00:28:09,356 లొంగిపో. 436 00:28:10,858 --> 00:28:13,819 అంధకారానికి లొంగిపో! 437 00:28:23,871 --> 00:28:25,372 అగ్నిగోళం! 438 00:28:27,833 --> 00:28:28,959 బయటకు తీయ్! 439 00:28:31,420 --> 00:28:32,629 వద్దు! 440 00:29:17,674 --> 00:29:18,675 నువ్వు సాధించావు. 441 00:29:26,308 --> 00:29:27,434 మనం సాధించాం. 442 00:29:58,549 --> 00:29:59,758 ఏడిచారులే, సన్నాసుల్లారా. 443 00:29:59,842 --> 00:30:02,177 ఎట్టకేలకు, రాత్రి ముగిసింది! 444 00:30:02,261 --> 00:30:04,972 ఇక ఒక కొత్త రోజు ఉదయించనుంది! 445 00:30:05,055 --> 00:30:06,181 భలే భలే! 446 00:30:06,265 --> 00:30:08,934 భలే భలే! 447 00:30:09,768 --> 00:30:12,771 దానితో అంధకారం తొలగిపోయింది. 448 00:30:13,522 --> 00:30:16,191 రాజూ, రాణీ ఆనందాల్లో తేలియాడి, సంబరాలు చేసుకున్నారు. 449 00:30:18,026 --> 00:30:22,447 మళ్లీ అంధకారం తిరిగి వస్తుందని వాళ్లకి తెలుసు, 450 00:30:22,531 --> 00:30:25,784 కానీ, ఈ రోజున, ఈ ప్రత్యేకమైన రోజున... 451 00:30:27,494 --> 00:30:29,413 వెలుతురు ఉంది. 452 00:31:39,525 --> 00:31:41,527 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య