1 00:00:21,605 --> 00:00:25,401 టేల్స్ ఫ్రం ద లూప్ 2 00:01:05,941 --> 00:01:07,359 ఆ క్షణం. 3 00:01:15,451 --> 00:01:18,412 ఆ ఉత్కంఠత నిండిన అద్భుతమైన భావన. 4 00:01:25,002 --> 00:01:26,003 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 5 00:01:31,258 --> 00:01:33,219 అది ఎప్పుడూ ఎందుకు గడిచిపోతుంది? 6 00:01:43,896 --> 00:01:44,939 జేకబ్ ఎలా ఉన్నాడు? 7 00:01:47,608 --> 00:01:48,609 బాగున్నాడు. 8 00:01:50,903 --> 00:01:51,904 బాగున్నాడు. 9 00:01:54,114 --> 00:01:57,409 అది ప్రత్యేకమని మనకు అక్కడే, అప్పుడే తెలిసినప్పటికీ, 10 00:01:58,327 --> 00:01:59,829 అది ముగిసిపోతుంది. 11 00:02:04,375 --> 00:02:07,169 మనం ఆ క్షణంలోనె ఎందుకు ఉండిపోలేము? 12 00:02:07,503 --> 00:02:08,796 ఆ భావనలోనే? 13 00:02:19,515 --> 00:02:22,893 మనం కోరుకున్నట్టు అది శాశ్వతంగా ఎందుకు నిలిచిపోదు? 14 00:05:36,128 --> 00:05:37,588 నువ్వు ఇంకా తయారు కాలేదు. 15 00:06:32,017 --> 00:06:34,019 అబ్బా. అయ్యో, క్షమించాలి. 16 00:06:39,274 --> 00:06:40,400 ఫర్వాలేదు. 17 00:06:49,243 --> 00:06:50,244 ధన్యవాదాలు. 18 00:06:54,581 --> 00:06:55,833 అది నిలుస్తుందంటావా? 19 00:07:05,384 --> 00:07:06,510 నిలుస్తుందనే ఆశిస్తున్నాను. 20 00:07:22,651 --> 00:07:24,194 ఇందాక నిన్ను చెరువు దగ్గర చూసానా? 21 00:07:27,364 --> 00:07:28,615 నువ్వు ఎవరితోనైనా వచ్చావా? 22 00:07:30,492 --> 00:07:31,743 లేదు. 23 00:07:32,494 --> 00:07:33,537 ఎందుకు? 24 00:07:35,914 --> 00:07:37,416 నీకు ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని అనిపించదా? 25 00:07:48,969 --> 00:07:49,970 ఎప్పుడూ అనిపించదు. 26 00:07:59,646 --> 00:08:01,273 అలా నడకకి వెళ్దామా? 27 00:08:02,649 --> 00:08:03,692 ఎక్కడికి? 28 00:08:05,027 --> 00:08:06,195 వేరే ఎక్కడికైనా. 29 00:08:59,957 --> 00:09:00,958 నీ పాదం. 30 00:09:01,583 --> 00:09:02,960 అది ముందు నుండి అలాగే ఉందా? 31 00:09:06,588 --> 00:09:07,589 అవును. 32 00:09:09,341 --> 00:09:10,342 నొప్పి వేస్తుందా? 33 00:09:12,636 --> 00:09:14,137 కొన్నిసార్లు. 34 00:09:19,893 --> 00:09:21,270 అంటే, 35 00:09:24,606 --> 00:09:26,483 ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందేమో. 36 00:10:07,482 --> 00:10:09,651 అడవిలో సమయం నెమ్మదిగా నడుస్తుందని విన్నాను. 37 00:10:10,902 --> 00:10:12,029 అది నిజం కాదు. 38 00:10:12,529 --> 00:10:13,572 కాదా? 39 00:10:14,156 --> 00:10:15,657 అది నిజమైతే బాగుండేది. 40 00:10:18,160 --> 00:10:20,078 అందుకే నాకు ఇక్కడ ఇష్టం. 41 00:10:22,164 --> 00:10:23,373 ఈ క్షణం. 42 00:10:24,041 --> 00:10:25,334 ఎలా అనిపిస్తుందంటే, అది ఇలాగే... 43 00:10:25,917 --> 00:10:26,960 - నిలిచిపోతుందని. - నిలిచిపోతుందని. 44 00:10:37,721 --> 00:10:38,722 నేను దాన్ని చూడవచ్చా? 45 00:10:41,183 --> 00:10:42,267 నీ పాదాన్ని? 46 00:10:46,104 --> 00:10:47,189 నీకు ఇష్టం లేకుంటే వద్దు. 47 00:10:49,316 --> 00:10:50,400 లేదు, అది... 48 00:10:51,860 --> 00:10:52,944 ఫర్వాలేదు. 49 00:11:28,105 --> 00:11:29,314 నువ్వు ఏం చేస్తావు? 50 00:11:31,191 --> 00:11:32,442 అది మామూలుగా ఉంటే? 51 00:11:33,402 --> 00:11:34,569 నేను పరిగెడతాను. 52 00:11:36,113 --> 00:11:37,656 నువ్వు తప్పకుండా వేగంగా పరిగెడతావు. 53 00:11:39,533 --> 00:11:40,784 ధన్యవాదాలు. 54 00:11:51,711 --> 00:11:52,879 మే! 55 00:11:53,797 --> 00:11:55,048 నువ్వు ఉన్నావా? 56 00:11:58,385 --> 00:12:00,387 - కనిపించలేదు. - సరే. 57 00:12:01,138 --> 00:12:02,139 మే! 58 00:12:09,771 --> 00:12:10,939 నిన్ను మళ్ళీ కలుస్తాను. 59 00:12:12,357 --> 00:12:13,483 మే! 60 00:13:18,715 --> 00:13:20,050 నువ్వు గది సర్దుకోవాలి. 61 00:13:32,312 --> 00:13:34,022 నా జుట్టు నీ జుట్టులాగే ఉండేది. 62 00:13:37,817 --> 00:13:39,986 నీకు పెళ్ళయినప్పుడు నీ వయసెంత? 63 00:13:43,657 --> 00:13:44,658 నీ వయసే. 64 00:13:45,283 --> 00:13:46,284 నిజంగానా? 65 00:13:48,245 --> 00:13:50,956 చాలా ఉత్కంఠంగా అనిపించింది. ఆ సమయంలో. 66 00:13:57,879 --> 00:13:59,548 మరి అతని సంగతి? 67 00:14:04,177 --> 00:14:05,679 సైతాను శృంగార మతారాధన సమూహాలు. 68 00:14:06,221 --> 00:14:10,183 అతన్ని ఒక అసూయపడే భర్త కాల్చాడు, కానీ అతను బతికి బయటపడ్డాడు/ 69 00:14:10,725 --> 00:14:14,854 కానీ తరువాత ఒక ఘోరమైన వేడి గాలి బెలూన్ ప్రమాదంలో చనిపోయాడు. 70 00:14:24,864 --> 00:14:26,449 నువ్వు కాలేజీలో అస్సలు ఇలా ఉండవు. 71 00:14:28,243 --> 00:14:30,078 మామూలుగా, నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావు. 72 00:14:34,082 --> 00:14:35,083 అవును. 73 00:14:35,166 --> 00:14:38,712 అంటే, నాకు జనం మధ్యలో ఉండడం ఇష్టం ఉండదు. 74 00:14:40,422 --> 00:14:41,673 వాళ్ళు నీచంగా ఉండవచ్చు. 75 00:14:48,054 --> 00:14:49,514 నేను మరీ ఎక్కువగా మాట్లాడుతున్నానా? 76 00:14:49,889 --> 00:14:50,890 లేదు. 77 00:14:51,891 --> 00:14:52,892 నాకు అలా ఇష్టం. 78 00:15:01,943 --> 00:15:03,153 నువ్వు ఇంకా జేకబ్‌తో ఉన్నావా? 79 00:15:10,785 --> 00:15:11,786 నాతో రా. 80 00:15:19,294 --> 00:15:20,545 అతను ఏం చేస్తున్నాడో అడుగు. 81 00:15:21,004 --> 00:15:22,005 ఎందుకు? 82 00:15:27,510 --> 00:15:29,012 - హే... - హే. 83 00:15:29,137 --> 00:15:30,138 అది ఏంటి? 84 00:15:30,555 --> 00:15:33,933 సరే. అవి ప్రధాన వేడి-శోషణ భాగాంశాలు. 85 00:15:34,017 --> 00:15:36,102 అవి చాలా వేడెక్కుతాయి. 86 00:15:36,186 --> 00:15:38,897 అందుకే వాటికి సైడ్ ఆర్మ్ అవసరం. 87 00:15:39,314 --> 00:15:40,398 ఆసక్తికరంగా ఉంది. 88 00:15:40,982 --> 00:15:44,110 ఇంకా కూలెంట్‌ని కూడా మార్చాలి. 89 00:15:44,319 --> 00:15:48,031 ఇంకా వాతావరణం కూడా వాటిని నాశనం చేయగలదు. 90 00:15:48,198 --> 00:15:49,491 ఇంకా తరువాత... 91 00:15:52,827 --> 00:15:55,205 టైమర్‌ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. 92 00:15:57,499 --> 00:15:59,668 - అదంతా వివరించినందుకు ధన్యవాదాలు. - సరే. 93 00:16:00,126 --> 00:16:01,252 నీ రోజు బాగుండాలి. 94 00:16:01,878 --> 00:16:03,755 - నీది కూడా. - బై. 95 00:16:04,506 --> 00:16:05,590 సరే. 96 00:16:07,759 --> 00:16:08,927 నువ్వు ఏదైనా తీసుకున్నావా? 97 00:16:10,220 --> 00:16:11,304 అది దేనికి? 98 00:16:19,104 --> 00:16:20,522 ఇది అలా చెరువులో ఉందా? 99 00:16:22,315 --> 00:16:23,400 అవును. 100 00:16:24,943 --> 00:16:27,612 - ఇది ప్రమాదకరమా? - కావచ్చు. 101 00:16:31,116 --> 00:16:32,242 ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? 102 00:16:32,325 --> 00:16:34,744 నాకు ఎప్పుడూ వస్తువులు ఎలా పని చేస్తాయని కుతూహలంగా ఉంటుంది. 103 00:16:34,828 --> 00:16:37,497 అందుకని నేను వస్తువులను విడదీసి, మళ్ళీ బాగు చేస్తాను. 104 00:16:39,207 --> 00:16:40,500 ఇది కాస్త వింతగా ఉంటుంది. 105 00:16:41,376 --> 00:16:42,877 లేదు. ఇది అద్భుతంగా ఉంది. 106 00:16:57,142 --> 00:16:58,268 నేను నీ గది చూడవచ్చా? 107 00:17:12,282 --> 00:17:13,283 బాగుంది. 108 00:17:28,131 --> 00:17:29,841 - ఇది... - చెప్పు. 109 00:17:30,592 --> 00:17:31,760 అది ఏమీలేదు. 110 00:17:32,260 --> 00:17:33,303 ఏంటి? 111 00:17:33,386 --> 00:17:35,930 అంటే, అది... నేను గీయలేను, 112 00:17:36,014 --> 00:17:38,433 కానీ నువ్వు అంతకంటే అందంగా ఉంటావు. 113 00:17:44,272 --> 00:17:45,690 ఒక పాట వింటావా? 114 00:17:47,859 --> 00:17:48,902 తప్పకుండా. 115 00:19:43,308 --> 00:19:44,976 - మే! - అమ్మా! 116 00:19:45,268 --> 00:19:46,269 బయటికి వెళ్ళు! 117 00:21:15,191 --> 00:21:16,192 అమ్మా? 118 00:21:17,610 --> 00:21:18,653 నాన్నా? 119 00:22:12,832 --> 00:22:13,875 హే. 120 00:22:17,003 --> 00:22:18,004 నన్ను క్షమించు. 121 00:22:18,087 --> 00:22:20,381 నేను నీకు ఒకటి చూపించనా? 122 00:22:30,183 --> 00:22:32,060 మనం కలిసి ఉండడానికి ఒక మార్గం కనిపెట్టాను. 123 00:22:34,312 --> 00:22:35,396 ఇది పెట్టుకో. 124 00:22:36,564 --> 00:22:37,565 దీన్ని బాగు చేసావా? 125 00:22:44,989 --> 00:22:46,032 పెట్టుకో. 126 00:22:53,623 --> 00:22:54,624 చల్లగా ఉంది. 127 00:22:56,084 --> 00:22:57,085 సిద్ధంగా ఉన్నావా? 128 00:23:56,477 --> 00:23:57,895 అద్భుతంగా ఉంది, కదా? 129 00:24:27,717 --> 00:24:29,010 మనం ఎందుకు నిలిచిపోలేదు? 130 00:24:39,437 --> 00:24:41,022 మొత్తం పట్టణం ఇలాగే ఉందా? 131 00:24:42,773 --> 00:24:43,774 మనం తప్ప. 132 00:25:41,249 --> 00:25:43,459 అయితే, నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? 133 00:25:57,974 --> 00:25:59,100 అతని సంగతి ఏంటి? 134 00:26:04,230 --> 00:26:07,900 మన ప్రవర్తనకు కారణం కనుక్కోడానికి మరొక డైమెన్షన్ నుండి పంపించబడ్డాడు. 135 00:26:12,738 --> 00:26:14,031 అలాగే అనిపిస్తుంది. 136 00:26:28,337 --> 00:26:29,922 నాకు నీతో ఒంటరిగా ఉండడం ఇష్టం. 137 00:27:19,180 --> 00:27:20,222 ఇక్కడా? 138 00:27:22,391 --> 00:27:23,392 రా. 139 00:27:24,393 --> 00:27:27,313 ఇలాంటిది చేయడానికి మనకు ఇంకో అవకాశం అసలు మళ్ళీ ఎప్పుడు లభిస్తుంది? 140 00:27:47,917 --> 00:27:49,251 - ఇది... - ఫర్లేదు. 141 00:28:49,979 --> 00:28:50,980 నువ్వు బాగానే ఉన్నావా? 142 00:28:52,606 --> 00:28:53,983 ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాను. 143 00:29:42,198 --> 00:29:43,657 ఇది కలలా ఉంది. 144 00:29:51,832 --> 00:29:54,960 భవిష్యత్తులో, నువ్వు ఈ వీధిలో నడిచినప్పుడల్లా, 145 00:29:55,044 --> 00:29:56,879 ఇక్కడ మనం చేసిన దాని గురించి ఆలోచిస్తావు. 146 00:30:02,843 --> 00:30:04,345 ఇది ఎంత వరకు నిలిచి ఉంటుంది? 147 00:30:06,430 --> 00:30:07,681 మనం కావాలని అనుకున్నంత వరకు. 148 00:30:14,980 --> 00:30:16,190 ఈ క్షణం, 149 00:30:18,359 --> 00:30:19,652 ఇది శాశ్వతంగా మిగిలిపోగలదు. 150 00:30:39,421 --> 00:30:40,422 ఇది ఎలా ఉంది? 151 00:30:40,839 --> 00:30:41,882 బాగుంది. 152 00:30:43,384 --> 00:30:44,385 ఉత్త బాగుందా? 153 00:30:46,053 --> 00:30:47,054 అద్భుతంగా ఉంది. 154 00:30:53,018 --> 00:30:55,020 ఇది చాలా మంచి మోడల్. 155 00:30:55,771 --> 00:30:57,523 సెకనుకు మూడు వందల ముఫై మూడు అడుగుల దూరం షూట్ చేయవచ్చు. 156 00:30:58,941 --> 00:30:59,942 బాగుంది. 157 00:31:03,487 --> 00:31:05,030 కానీ మనం ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం? 158 00:31:17,585 --> 00:31:19,587 నాకు ఎప్పుడూ ఇక్కడ నివసించాలని ఉండేది. 159 00:31:21,630 --> 00:31:22,840 ఇప్పుడు నీకు అవకాశం దక్కింది. 160 00:32:20,147 --> 00:32:21,815 "టైం ఎంత అయ్యింది" అంటే ఏమనాలి? 161 00:32:37,831 --> 00:32:39,249 మరి, "నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే ఏమనాలి? 162 00:32:40,042 --> 00:32:41,251 అది అంత సులభం కాదు. 163 00:32:43,295 --> 00:32:44,505 ఎందుకు? 164 00:32:46,924 --> 00:32:47,966 నన్ను ఆలోచించనివ్వు. 165 00:32:58,644 --> 00:32:59,687 ఇంకొక్కసారి చెప్పు. 166 00:33:59,496 --> 00:34:00,622 చూసావా? 167 00:34:01,707 --> 00:34:02,708 చాలా సులభం. 168 00:34:03,834 --> 00:34:05,252 నీకు భయం అనిపించదా? 169 00:34:05,794 --> 00:34:07,045 జింకలను చంపడం? 170 00:34:07,504 --> 00:34:08,672 లేదు. 171 00:34:09,757 --> 00:34:10,758 మరి ఏదంటే భయం? 172 00:34:14,261 --> 00:34:15,262 పాములు. 173 00:34:18,640 --> 00:34:19,683 నీకు? 174 00:34:24,062 --> 00:34:25,063 ఒంటరిగా ఉండడం. 175 00:34:28,275 --> 00:34:29,651 నాకు అది ఇష్టం ఉండదని నీకు చెప్పాను. 176 00:34:31,987 --> 00:34:33,071 ఎందుకు? 177 00:34:36,700 --> 00:34:38,869 ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను, 178 00:34:39,411 --> 00:34:41,330 ఇంకా, నాకు నేను అత్యంత ఇష్టమైన వక్తిని కాను. 179 00:34:48,629 --> 00:34:51,089 కానీ, నీలో చాలా ఆత్మ విశ్వాసం ఉంది. 180 00:34:57,012 --> 00:34:59,306 హే, బాధ పడకు. 181 00:35:00,766 --> 00:35:01,809 నేను ఉన్నాను. 182 00:35:02,851 --> 00:35:04,144 నేను నిన్ను ఎప్పుడూ వదలను. 183 00:35:06,605 --> 00:35:07,689 ఒట్టు? 184 00:35:09,942 --> 00:35:11,109 ఒట్టు. 185 00:35:34,383 --> 00:35:35,425 వేగంగా. 186 00:35:35,509 --> 00:35:36,510 ఏంటి? 187 00:35:36,593 --> 00:35:38,053 వేగంగా! 188 00:36:55,172 --> 00:36:56,423 నువ్వు మెలకువగా ఉన్నావా? 189 00:37:03,639 --> 00:37:04,848 ఎంత కాలం అయ్యింది? 190 00:37:06,600 --> 00:37:07,684 ఇలానా? 191 00:37:08,560 --> 00:37:09,561 అవును. 192 00:37:12,856 --> 00:37:13,941 ఒక నెలా? 193 00:37:15,359 --> 00:37:16,485 ఇంకా ఎక్కువ. 194 00:37:21,782 --> 00:37:23,033 మనం దాన్ని ఆఫ్ చేసాక, 195 00:37:23,867 --> 00:37:25,243 నువ్వు జేకబ్‌తో విడిపోతావా? 196 00:37:28,997 --> 00:37:29,998 అనుకుంటా. 197 00:37:36,046 --> 00:37:37,047 అంటే, అవును. 198 00:37:38,590 --> 00:37:39,758 అవునా, కాదా? 199 00:37:41,510 --> 00:37:42,636 నేను అవును అన్నాను. 200 00:37:48,475 --> 00:37:49,685 వింతగా ఉంటుంది కదా, 201 00:37:50,936 --> 00:37:52,437 అంతా మళ్ళీ మామూలుగా అయితే. 202 00:37:57,442 --> 00:38:01,196 కానీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ చేయవచ్చు, కదా? 203 00:38:02,322 --> 00:38:03,323 ఇలా? 204 00:38:07,953 --> 00:38:09,496 బహుశా ఈ సారి రాత్రి చేద్దాం. 205 00:38:15,460 --> 00:38:16,461 అవును. 206 00:38:17,504 --> 00:38:18,547 సరే. 207 00:38:51,413 --> 00:38:52,456 ఏమైంది? 208 00:38:58,962 --> 00:39:00,130 అది పాడయ్యిందా? 209 00:39:05,510 --> 00:39:06,887 అంటే, నువ్వు దాన్ని బాగు చేయగలవా? 210 00:39:06,970 --> 00:39:07,971 నన్ను ఆలోచించనివ్వు. 211 00:39:11,683 --> 00:39:12,684 నేను ఇక్కడ ఇరుక్కుపోయానా? 212 00:39:12,768 --> 00:39:13,769 నేను కూడా ఇక్కడ ఉన్నాను. 213 00:39:15,103 --> 00:39:16,271 అయ్యో, లేదు. నాకు తెలుసు. 214 00:39:31,953 --> 00:39:33,330 మనకి కొత్తది కావాలి. 215 00:39:33,997 --> 00:39:35,415 దాని వల్ల బాగవుతుందా? 216 00:39:37,125 --> 00:39:38,126 బాగు అవ్వాలి. 217 00:39:41,880 --> 00:39:43,173 అరే, మనకి ఎక్కడ దొరుకుతుంది? 218 00:40:02,567 --> 00:40:03,652 ఇక్కడ లేదు. 219 00:41:58,141 --> 00:41:59,142 దొరికింది. 220 00:42:01,728 --> 00:42:02,729 బాగుంది. 221 00:42:02,938 --> 00:42:04,189 నిషిద్ధ ప్రేమ. 222 00:42:06,441 --> 00:42:09,986 వాళ్ళు లైట్ హౌస్ దగ్గర ఒక రాయి కింద రహస్య సమాచారాల ద్వారా 223 00:42:10,070 --> 00:42:12,697 ఎప్పుడు కలుసుకోవచ్చో తెలియజేసుకుంటారు. 224 00:42:12,781 --> 00:42:13,782 నోరు మూసుకో. 225 00:42:14,241 --> 00:42:15,242 ఏంటి? 226 00:42:22,582 --> 00:42:24,209 - అయ్యో, నేను... - నువ్వు నోరు మూసుకో. 227 00:42:24,668 --> 00:42:25,669 చూడు, నన్ను క్షమించు. 228 00:42:25,752 --> 00:42:26,920 నోరు మూసుకో! 229 00:42:54,114 --> 00:42:55,115 ఏం చేస్తున్నావు? 230 00:42:55,198 --> 00:42:57,367 వాళ్ళకి కప్పుకోవడానికి ఏమీ మిగలకుండా చేస్తాను. 231 00:42:57,450 --> 00:42:59,286 - ఇది పిచ్చితనం. - నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. 232 00:42:59,369 --> 00:43:00,453 హే, హే. నువ్వు అసలు... 233 00:43:00,620 --> 00:43:02,289 వాళ్ళని ఎవరూ చూడరు కదా. 234 00:43:02,372 --> 00:43:03,498 అయితే, ఏంటి? నేను పిచ్చిదాన్నా? 235 00:43:03,581 --> 00:43:04,708 లేదు, నేను అన్నది అది కాదు. 236 00:43:04,791 --> 00:43:06,084 నువ్వు అదే అన్నావు. 237 00:43:11,089 --> 00:43:12,841 తను నీ తల్లి అని నాకు తెలియదు. 238 00:43:15,343 --> 00:43:17,137 నేను ఏమీ చేయలేదు. 239 00:43:19,306 --> 00:43:20,432 మే? 240 00:43:23,143 --> 00:43:24,477 - మనం కేవలం... - కేవలం ఏంటి? 241 00:43:24,561 --> 00:43:25,937 - నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? - ఎలా? 242 00:43:26,104 --> 00:43:27,105 మూర్ఖురాలిలాగా. 243 00:43:27,188 --> 00:43:28,982 నన్ను మూర్ఖురాలిని అనకు, కుంటి వెధవ. 244 00:45:21,428 --> 00:45:22,554 ఈథన్? 245 00:45:26,766 --> 00:45:27,767 ఈథన్? 246 00:45:34,232 --> 00:45:35,567 ఈథన్? 247 00:45:38,653 --> 00:45:39,737 ఈథన్? 248 00:45:47,328 --> 00:45:48,496 ఈథన్? 249 00:45:54,419 --> 00:45:55,753 నాకు జవాబు ఇవ్వు. 250 00:46:34,417 --> 00:46:35,585 నన్ను చూడవా? 251 00:46:37,795 --> 00:46:39,088 నేను అలా అనాలని అనుకోలేదు... 252 00:46:44,594 --> 00:46:46,638 నీకు ఇక్కడ ఇరుక్కుపోయినట్టు ఉంది అని నువ్వు అన్నప్పుడు, 253 00:46:49,140 --> 00:46:50,391 నాకు చాలా బాధ అనిపించింది. 254 00:46:55,772 --> 00:46:56,856 ఇంకా... 255 00:46:59,400 --> 00:47:01,778 నువ్వు నన్ను వదిలేస్తావేమో అని భయపడ్డాను. 256 00:47:04,531 --> 00:47:06,157 ఇంకా మా అమ్మను అలా చూడగానే... 257 00:47:14,582 --> 00:47:16,376 ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది, 258 00:47:17,544 --> 00:47:18,920 నేను ఒంటరిగా ఉండలేను. 259 00:47:24,551 --> 00:47:25,885 నాకు నువ్వు కావాలి. 260 00:47:33,476 --> 00:47:34,644 నాతో మాట్లాడవా? 261 00:47:39,274 --> 00:47:40,275 ప్లీజ్. 262 00:49:38,101 --> 00:49:39,519 ఆ క్షణం, 263 00:49:42,021 --> 00:49:44,774 ఆ ఉత్కంఠత నిండిన అద్భుతమైన భావన, 264 00:49:48,111 --> 00:49:50,029 అది ఎప్పుడూ ఎందుకు గడిచిపోతుంది? 265 00:49:51,572 --> 00:49:54,701 అది ప్రత్యేకమని మనకు అక్కడే, అప్పుడే తెలిసినప్పటికీ, 266 00:49:54,951 --> 00:49:56,285 అది ముగిసిపోతుంది. 267 00:49:59,497 --> 00:50:00,498 ఎందుకు? 268 00:50:01,624 --> 00:50:04,794 మనం కోరుకున్నట్టు అది శాశ్వతంగా ఎందుకు నిలిచిపోదు? 269 00:50:50,965 --> 00:50:52,216 ఏమైనా ఆలోచిస్తున్నావా? 270 00:51:00,600 --> 00:51:01,601 బాయ్ ఫ్రెండ్ గురించా? 271 00:51:04,812 --> 00:51:06,898 మేము ఎక్కువ కాలం కలిసి ఉండం అనుకుంటా. 272 00:51:07,774 --> 00:51:08,775 అలాగా. 273 00:51:13,696 --> 00:51:16,073 కొన్నిసార్లు కొన్ని శాశ్వతంగా ఉండవు కాబట్టే అవి ప్రత్యేకం అవుతాయి. 274 00:51:39,263 --> 00:51:40,306 ఏంటి? 275 00:53:05,933 --> 00:53:06,976 హే. 276 00:53:15,735 --> 00:53:16,861 ఎలా ఉన్నావు? 277 00:53:21,824 --> 00:53:23,034 నువ్వెలా ఉన్నావు? 278 00:53:24,827 --> 00:53:26,245 నేను... 279 00:53:28,998 --> 00:53:29,999 ఏమయ్యింది? 280 00:53:32,001 --> 00:53:33,461 నువ్వు మాట తప్పావు. 281 00:53:39,091 --> 00:53:40,509 నువ్వు అన్న మాట అనేసావు. 282 00:53:48,434 --> 00:53:49,435 హే.