1 00:00:20,687 --> 00:00:23,357 శుభ వార్త, చామంతి పువ్వా. 2 00:00:23,440 --> 00:00:25,025 నీకోసం నెనొక అందమైన వస్త్రాన్ని తెచ్చా. 3 00:00:26,109 --> 00:00:27,361 సేనాధిపతి బంతి పువ్వా. 4 00:00:27,444 --> 00:00:31,740 నువ్వు పాతాళలోకం నుండి దిగ్విజయంగా బయటకు వచ్చావు. 5 00:00:32,533 --> 00:00:36,703 అందాల తామరపువ్వు, నీ వేషధారణ చాలా బాగుంది. 6 00:00:38,956 --> 00:00:44,503 నా తుమ్మెదలు ఇక్కడ బాగా బిజీగా ఉన్నాయే. 7 00:00:48,966 --> 00:00:52,052 నిజానికి, తోట ఉంటే చాలు కదా, పార్టీలు గట్రా ఎందుకు? 8 00:00:52,135 --> 00:00:54,888 ఈ కాలపు పెద్ద విశేషం ఇక్కడే ఉంది కదా. 9 00:01:03,605 --> 00:01:05,524 పని చేస్తున్నావా లేక కాలక్షేపం చేస్తున్నావా? 10 00:01:06,525 --> 00:01:09,987 మరణ సోదరా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 11 00:01:10,070 --> 00:01:12,573 నిన్ను ఊరికే చూసిపోదామని, నా కొత్త డ్రెస్ చూపిద్దామని వచ్చా. 12 00:01:14,616 --> 00:01:16,910 బాబోయ్. దసరా బుల్లోడిలా తయారయ్యావే. 13 00:01:16,994 --> 00:01:20,455 అవును, ఇప్పుడు అంతా కుదురుకున్నాలే. పోయిన సారి నా మానసిక స్థితి బాగా లేదు. 14 00:01:20,539 --> 00:01:21,790 ఇప్పుడు బాగున్నాలే. 15 00:01:21,874 --> 00:01:24,168 ఏమైంది? ఏమైనా విశ్రాంతి తీసుకున్నావా, లేకపోతే... 16 00:01:24,251 --> 00:01:26,086 ఎప్పుడూ పని చేసే వాడికి విశ్రాంతి ఉండదు. 17 00:01:27,504 --> 00:01:29,631 కానీ విషయాల గురించి నేను కాస్త భిన్నంగా ఆలోచిస్తాను. 18 00:01:29,715 --> 00:01:31,508 నా దృష్టికోణాన్ని మార్చుకుంటే సరిపోతుంది. అంతే. 19 00:01:31,592 --> 00:01:34,720 వావ్. సరే. నాకు అంతా చెప్పు మరి. 20 00:01:35,554 --> 00:01:38,765 అంటే, నేను మరీ నా పట్లే చాలా కఠినంగా ఉంటున్నాను అనిపించింది. 21 00:01:39,933 --> 00:01:43,020 అంటే, ఇన్నాళ్ళూ నన్ను అందరూ పరమ అసహ్యంగా చూసేవాళ్లు. 22 00:01:44,104 --> 00:01:46,607 జనాలకు తాము చనిపోయినప్పుడు మట్టి కింద కూరుకుపోయి తమ నోటి లోంచి 23 00:01:46,690 --> 00:01:48,317 పురుగులు రావడం అనేది అస్సలు నచ్చదు. 24 00:01:48,400 --> 00:01:49,902 అవును, అది ఎవరికీ నచ్చదు. 25 00:01:51,528 --> 00:01:53,697 అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. 26 00:01:54,364 --> 00:01:57,659 చావే లేకపోతే, జీవితానికి అర్థం ఏముంది? 27 00:01:57,743 --> 00:02:00,204 అదంతా ఒకే ప్రక్రియ. 28 00:02:00,287 --> 00:02:01,955 ఈ పూలలాగా. 29 00:02:02,039 --> 00:02:05,334 అవి ఎందుకూ పనికి రాని మట్టి నుండి పూస్తాయి. 30 00:02:05,417 --> 00:02:09,545 ఆ తర్వాత అవి వికసించి, వాడిపోయి మట్టిలో ఏకమైపోతాయి. 31 00:02:10,047 --> 00:02:12,591 ఇక అదే నిత్యం జరుగుతూ ఉంటుంది. 32 00:02:12,674 --> 00:02:15,552 అదే జీవన చక్రం, బంగారం. జనాలు దాన్ని అర్థం చేసుకోవాలి మరి. 33 00:02:15,636 --> 00:02:19,306 సరే. నీకు ఇప్పుడు బాగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 34 00:02:19,389 --> 00:02:21,767 ఈ డ్రెస్ మాత్రం అదిరింది. 35 00:02:21,850 --> 00:02:27,022 అవును. నువ్వు కూడా కొత్తగా కనిపిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది. 36 00:02:27,105 --> 00:02:28,315 నాకు ఏమైంది? 37 00:02:28,398 --> 00:02:30,859 నువ్వు ఎలా కనిపిస్తావని కాదు, నీ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నా. 38 00:02:31,443 --> 00:02:34,363 నీ మనస్సుకు తగిన డ్రెస్సును నువ్వు వేసుకోవాలి. 39 00:02:34,446 --> 00:02:37,574 నీ బట్టలు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి, వేరే వాటిని కాదు. 40 00:02:37,658 --> 00:02:41,828 ఇతరులకు నీపై ఉన్న అంచనాలను, బాధ్యతలను ప్రతిబింబించే డ్రెస్ ని వేసుకుంటే ఎలా? 41 00:02:41,912 --> 00:02:43,956 నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, మిస్ డికిన్సన్. 42 00:02:44,039 --> 00:02:48,377 నువ్వు ప్రచురించని కవితలు నీ దగ్గర వందలకొద్దీ ఉన్నాయి, అవి అద్భుతమైనవి. 43 00:02:48,460 --> 00:02:50,671 అదీగాక నీకు సమయం కూడా మించిపోతున్నట్టుంది. 44 00:02:51,171 --> 00:02:54,091 ఈ డ్రెస్ వేసుకుంటే, అంత వేగంగా పని చేయలేవేమో మరి. 45 00:02:55,133 --> 00:02:56,677 మరి, నీ దృష్టిలో... 46 00:02:56,760 --> 00:02:59,137 నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటావు? నువ్వు వేసుకొన్న సూట్ లాంటిదా? 47 00:02:59,221 --> 00:03:00,806 ఆ విషయం నేను చెప్పలేను. 48 00:03:00,889 --> 00:03:04,643 "నాకేది నప్పుతుంది? ఏ డ్రెస్ వేసుకుంటే నేను ఇదివరకు వెళ్ళనంత 49 00:03:04,726 --> 00:03:08,063 లోతులకు వెళ్లగలను? నేను వెళ్లనంత దూరం ఏ డ్రెస్ వేసుకుంటే వెళ్లగలను?" 50 00:03:08,146 --> 00:03:11,108 అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. 51 00:03:14,945 --> 00:03:17,948 నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, మిస్ డికిన్సన్. నీకొక యూనిఫాం అవసరం. 52 00:03:24,204 --> 00:03:27,332 నాకు కూడా ఈ డ్రెస్ బాగా బిగుతుగా ఉన్నట్టు అనిపిస్తోంది. 53 00:03:27,416 --> 00:03:30,002 నాకు ఇంకాస్త లూజుగా ఉండేది అయితే బాగుంటుంది. 54 00:03:30,627 --> 00:03:32,212 నీకు కావలసినదాన్ని వేసుకో, ఎమిలీ. 55 00:03:32,296 --> 00:03:34,965 నువ్వు నీలా ఉండు, ఎందుకంటే సమయం దూసుకొని వెళ్లిపోతోంది. 56 00:03:35,632 --> 00:03:36,758 నువ్వు రాయాల్సిన కవితలు చాలా ఉన్నాయి. 57 00:04:18,550 --> 00:04:20,469 డికిన్సన్ 58 00:04:20,552 --> 00:04:22,471 కవి అంటే అర్థం - 59 00:04:42,074 --> 00:04:46,453 బాబోయ్... ఈ బటన్లు ఎంట్రా నాయనా, అస్సలు రావట్లేదు. 60 00:04:47,246 --> 00:04:48,580 అందు తల్లీ. 61 00:04:49,873 --> 00:04:50,999 విన్నీ! 62 00:04:52,584 --> 00:04:55,587 -ఏంటి? -ఈ డ్రెస్ ని విప్పలేకపోతున్నా. 63 00:04:55,671 --> 00:04:56,922 వచ్చి బటన్లు తీస్తావా? 64 00:04:57,005 --> 00:04:59,258 డ్రెస్ ఎందుకు విప్పేస్తున్నావు? ఇంకా రాత్రి కాలేదు కదా. 65 00:04:59,341 --> 00:05:01,301 ఎందుకంటే నేను కొన్ని కవితలు రాద్దామనుకుంటున్నాను, 66 00:05:01,385 --> 00:05:03,595 ఈ డ్రెస్ చాలా బిగుతుగా ఉంది, నాకు అస్సలు ఊపిరాడట్లేదు. 67 00:05:03,679 --> 00:05:05,764 నిన్ను కలవడానికి ఎవరూ రాకూడదని ఆశిస్తున్నా మరి. 68 00:05:05,848 --> 00:05:07,349 నన్ను కలవడానికి ఎవరు వస్తారు? 69 00:05:07,432 --> 00:05:08,600 బటన్లు తీసేశా. 70 00:05:09,101 --> 00:05:11,812 ఈ రోజుల్లో మహిళల డ్రెస్సులు చాలా చెత్తగా ఉన్నాయి. 71 00:05:11,895 --> 00:05:14,565 బట్టలు అన్నాక వేసుకోవడానికి, విప్పడానికి చాలా తేలిగ్గా ఉండాలి. 72 00:05:14,648 --> 00:05:17,025 పెద్ద మనిషి అయ్యాక అది చాలా ప్రాథనిక అవసరం కదా. 73 00:05:17,109 --> 00:05:20,863 ఎమిలీ డికిన్సన్, మహిళల వస్త్రాల గురించి మాట్లాడేంత సాహసం చేయకు? 74 00:05:21,780 --> 00:05:25,701 ప్రేరణ కోసం ఊపిరి సరిగ్గా ఆడాలి. నీకు అర్థమవుతోందా? 75 00:05:25,784 --> 00:05:28,370 ప్రేరణ కలగాలంటే, నీకు ఊపిరి ఆడాలి కదా. 76 00:05:28,453 --> 00:05:32,499 నేను నా బల్ల వద్ద కూర్చోని, నా ఊపిరితిత్తులని గాలితో నింపేయగలగాలి. 77 00:05:32,583 --> 00:05:34,376 సరే, బాగా రాసేద్దామని అనుకుంటున్నావన్నమాట. 78 00:05:34,459 --> 00:05:37,379 -నాకు ఈ డ్రెస్ వేసుకోవాలని లేదు. -అందరికీ కలలు ఉంటాయి. 79 00:05:40,340 --> 00:05:44,511 రక్తం ప్రవహించడం, కవిత్వం చిగురించడం నాకు తెలుస్తోంది. 80 00:05:44,595 --> 00:05:46,972 నిన్ను రాయకుండా ఏదీ అడ్డుకోలేదు కదా? 81 00:05:47,723 --> 00:05:49,099 ఇప్పటిదాకా ఏదీ ఆపలేదు. 82 00:05:49,183 --> 00:05:50,642 జనాలు ఆపాలని చూశారు కూడా. 83 00:05:51,518 --> 00:05:53,937 రాయకుండా వాళ్ళు నన్ను ఆపలేరు, విన్నీ. 84 00:05:54,021 --> 00:05:56,398 ఎందుకంటే, రాయడంలోనే నా ప్రాణం ఉంది. 85 00:05:56,481 --> 00:05:59,693 ఆ విషయంలో నీకు నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. 86 00:06:00,277 --> 00:06:01,278 వెనక్కి తిరుగు. 87 00:06:13,832 --> 00:06:16,335 మనది ఎంత సంతోషకరమైన కుటుంబమో చూడు. 88 00:06:17,461 --> 00:06:19,213 సంతోషంగా ఉండే కుటుంబాలన్నీ ఒకేలా ఉండవు. 89 00:06:30,974 --> 00:06:32,351 సరే మరి. 90 00:06:35,354 --> 00:06:36,980 వావ్... 91 00:06:39,399 --> 00:06:40,984 మీరు వచ్చారే. 92 00:06:41,068 --> 00:06:42,569 మీరు వస్తారని మేము ఊహించలేదే. 93 00:06:43,070 --> 00:06:45,239 అమ్మా, నాన్నా... 94 00:06:47,282 --> 00:06:48,784 మేము ఇక్కడికి ద్వేషాలను పక్కన పెట్టేయాలని వచ్చాం. 95 00:06:48,867 --> 00:06:51,245 అసలు నాకు నీ మీద ద్వేషం అనేది ఎప్పుడూ లేదు. 96 00:06:52,538 --> 00:06:54,581 అక్కడ ఉండేది నా మనవడేనా? 97 00:06:54,665 --> 00:06:56,041 అవును. 98 00:06:56,124 --> 00:06:57,626 అయితే, ఇంకా అక్కడే ఉన్నారే. లోపలికి వచ్చేయండి. 99 00:06:57,709 --> 00:07:00,921 ఈ పేరులేని బుల్లోడికి, వాడి నానమ్మ తెలియాల్సిన సమయం వచ్చింది. 100 00:07:06,051 --> 00:07:07,970 మరి, మీరేమైనా పేరు అనుకున్నారా? 101 00:07:08,637 --> 00:07:10,889 -ఒక పేరు అయితే మనస్సులో ఉంది. -దేవుడా, మరి ఇంకేంటి ఆలస్యం? 102 00:07:10,973 --> 00:07:13,976 -మేము కుటుంబ పేరే పెట్టాలనుకుంటున్నాం. -అది మంచిది, సరైనదీ కూడా. 103 00:07:14,059 --> 00:07:16,770 కానీ అంతకన్నా ముందు, ఇది మంచి కుటుంబమే అని మాకు తెలియాలి. 104 00:07:17,855 --> 00:07:19,523 అంటే నీ ఉద్దేశం ఏంటి? 105 00:07:19,606 --> 00:07:23,402 నాన్నా, నేను నీతో ఒక విషయం గురించి చర్చించాలి. 106 00:07:23,485 --> 00:07:27,531 నా దృష్టికి ఒక కొత్త చట్టపరమైన కేసు వచ్చింది, అది నీకు ఆసక్తికరంగా అనిపిస్తే, 107 00:07:27,614 --> 00:07:30,325 మనిద్దరమూ దాని మీద పని చేయవచ్చు. 108 00:07:30,409 --> 00:07:32,703 నువ్వు సొంతంగా ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నావు అనుకున్నానే. 109 00:07:32,786 --> 00:07:35,664 ఈ కేసు ఎలాంటిది అంటే, దాని మీదనే నా పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది, 110 00:07:35,747 --> 00:07:38,959 అంతే కాకుండా, నాకు నీ నైపుణ్యం కూడా అవసరం అవుతుంది. 111 00:07:41,086 --> 00:07:42,212 అలాగా. 112 00:07:43,005 --> 00:07:44,798 చెప్పు. 113 00:07:44,882 --> 00:07:46,300 కేసు వివరాలు చెప్పు. 114 00:07:46,383 --> 00:07:50,012 ఏంజలిన్ పామర్ అనే ఒక బానిస కాని నల్లజాతి యువతి ఉంది. 115 00:07:50,095 --> 00:07:52,931 తను ఈ ఊరిలోనే షా కుటుంబంలో పని మనిషిగా చేసింది. 116 00:07:53,015 --> 00:07:54,183 మనకి షా పరివారం తెలుసు. 117 00:07:54,266 --> 00:07:56,768 -అవును, అవును. మర్యాదస్థులే. -కానీ అది నిజం కాదు. 118 00:07:57,853 --> 00:08:00,898 విషయమేమిటంటే, షా వాళ్లు ఒక కుట్ర పన్నారు, 119 00:08:00,981 --> 00:08:05,444 దాని ప్రకారం 600 డాలర్లకు ఏంజలిన్ ని బానిసగా జార్జియాలో అమ్మాలనుకున్నారు. 120 00:08:06,695 --> 00:08:08,363 ఏంజలిన్ సోదరులు తనని కాపాడారు, 121 00:08:08,447 --> 00:08:11,366 షా వాళ్లు ఊరిని విడిచి వెళ్లకముందే వాళ్ళు ఆమెని దొంగచాటుగా ఇంటి నుండి 122 00:08:11,450 --> 00:08:15,537 బయటపడేశారు, కానీ వారు పట్టుబడ్డారు, వాళ్ల మీద అపహరణ, దాడి కేసులు పెట్టారు. 123 00:08:16,121 --> 00:08:19,082 వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు, 124 00:08:19,166 --> 00:08:21,668 వాళ్ల తరఫున మనం మాట్లాడితే వాళ్ళు మనల్ని దేవులుగా కొలుస్తారు. 125 00:08:21,752 --> 00:08:25,339 ఇది చాలా తలనొప్పితో కూడుకున్నది. షాలకి చాలా పలుకుబడి ఉంది. 126 00:08:26,131 --> 00:08:28,884 అంటే, డికిన్సన్ కుటుంబం పేరుకు 127 00:08:28,967 --> 00:08:30,135 ఈ విధంగా హైలైట్ చేయడం ఎందుకు? 128 00:08:30,219 --> 00:08:32,804 అందుకే మనం ఈ కేసును తీసుకోవాలి. 129 00:08:33,388 --> 00:08:37,808 ఓ విషయం ఒప్పుకుందాం, నాన్నా. ఇప్పుడు డికిన్సన్ కుటుంబ ప్రతిష్ట మసకబారింది. 130 00:08:38,477 --> 00:08:41,897 మీ పాతబడిపోయిన విగ్ పార్టీ కారణంగా, అలాగే, నా... 131 00:08:42,940 --> 00:08:44,191 బలహీనతల కారణంగా, 132 00:08:44,942 --> 00:08:47,110 గతేడాది మనిద్దరికీ అంతగా కలిసిరాలేదు. 133 00:08:47,194 --> 00:08:50,822 ఈ కేసును తీసుకుంటే, "డికిన్సన్" అనే పేరుకు ఒక కొత్త అర్థం వస్తుంది. 134 00:08:50,906 --> 00:08:53,825 మనం సరైన విషయానికే అండగా ఉన్నామని అందరికీ తెలుస్తుంది. 135 00:08:56,537 --> 00:09:00,499 ఒక అల్లిక ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. 136 00:09:00,582 --> 00:09:01,792 అలా కుడుతున్నావేంటి? 137 00:09:01,875 --> 00:09:06,088 -నువ్వే చూస్తావులే. అందరూ చూస్తారులే. -ఏం చూస్తాం? 138 00:09:06,171 --> 00:09:09,424 అదిరిపోయే కుట్టు పని చేస్తున్నాను. 139 00:09:10,968 --> 00:09:13,637 శుభోదయం. ఇవాళ వాతావరణం చాలా బాగుంది కదా? 140 00:09:13,720 --> 00:09:14,721 అవును కదా? 141 00:09:14,805 --> 00:09:17,307 ఈ వాతావరణం నాలో ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తోంది. 142 00:09:17,391 --> 00:09:21,019 ఎక్కడ చూసినా పక్షులు, తుమ్మెదలే. పుప్పొడి, తేనె. 143 00:09:21,103 --> 00:09:22,688 అవి నాలో ఏవేవో కోరికలు రగిలిస్తున్నాయి. 144 00:09:22,771 --> 00:09:26,191 ఎవడైనా ఒక సోగ్గాడు వచ్చి నన్ను ఆటపాటలతో ముంచెత్తితే బాగుంటుంది. 145 00:09:26,275 --> 00:09:28,026 వావ్, మ్యాగీ రగిలిపోతున్నట్టుంది. 146 00:09:28,861 --> 00:09:30,863 నేను ఎమిలీ కోసం వచ్చాను. తను ఇంట్లోనే ఉందా? 147 00:09:30,946 --> 00:09:34,324 -తను పైనే ఉంది, కవితలు రాసుకుంటోంది. -తన కోసం ఏమైనా తెచ్చావా? 148 00:09:34,408 --> 00:09:36,952 తను రాస్తూ ఉంటే కనుక, తనకి నేను అంతరాయం కలిగించనులే. 149 00:09:37,035 --> 00:09:41,707 తను ఎప్పుడూ రాస్తూనో, ఆలోచిస్తూనో ఉంటుంది. తను బాగా ఆలోచించాలి కదా. 150 00:09:42,291 --> 00:09:44,501 మాలో ఆలోచనా గుణం ఉండే ఏకైక మనిషి తనే. 151 00:09:45,169 --> 00:09:46,920 పైకి వెళ్ళు. నిన్ను చూసి సంతోషపడుతుంది. 152 00:09:48,964 --> 00:09:53,844 ఒక అల్లిక ఇక్కడ... ఇంకోటి ఇక్కడ. 153 00:09:58,640 --> 00:10:01,018 నా అంతర్యుద్ధాలన్నీ పుస్తకాల్లోనే మగ్గిపోతున్నాయి - 154 00:10:02,811 --> 00:10:04,104 ఎవరు? 155 00:10:06,231 --> 00:10:08,025 బెట్టీ. రా. 156 00:10:08,609 --> 00:10:10,027 నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు. 157 00:10:10,110 --> 00:10:14,781 అంతా బాగానే ఉందా? ఏమైనా అయిందా? నీకు హెన్రీ నుండి ఇంకా లేఖ రాలేదు కదా? 158 00:10:14,865 --> 00:10:18,035 లేదు, హెన్రీ నుండి ఏమీ రాలేదు. నేను ఇక దాన్ని పట్టించుకోదలచుకోలేదు... 159 00:10:18,118 --> 00:10:22,497 బెట్టీ, అయ్యయ్యో. నేను ఏమైనా ఊరట కలిగించగలనేమో అని అడిగాను. 160 00:10:22,581 --> 00:10:25,125 లేదు, చెప్పేది విను. నేను అందుకే వచ్చాను. 161 00:10:25,209 --> 00:10:29,588 ఎందుకంటే, నువ్వు నాకు సాయపడాలనే చూశావు, కానీ నేనే కోపంగా ప్రవర్తించాను. 162 00:10:29,671 --> 00:10:31,924 నువ్వు నాకు ఆశ ఇవ్వాలని చూశావు. 163 00:10:32,007 --> 00:10:34,843 అందులో అసలు ఏ తప్పూ లేదు. 164 00:10:34,927 --> 00:10:38,263 లోకంలో అలా ఆశ నింపాలని చూసే వారే ఉండాలి. 165 00:10:40,974 --> 00:10:42,518 నేను సందిగ్ధంలో ఉన్నా, ఆస్టిన్. 166 00:10:42,601 --> 00:10:46,813 నా పేరు తలుచుకున్నప్పుడు రాజకీయాలు గుర్తురాకూడదని నిర్ణయించుకున్నాను. 167 00:10:47,856 --> 00:10:53,445 నన్ను తలచుకున్నప్పుడు నా కుటుంబం, నా పిల్లలే గుర్తురావాలి. 168 00:10:54,071 --> 00:10:57,741 అయితే, నీ పిల్లల గురించే ఆలోచించు. ఏంజలిన్ వయస్సు 11 ఏళ్లు. 169 00:10:57,824 --> 00:10:59,409 అదే వయస్సులో ఎమిలీని ఊహించుకోండి. 170 00:10:59,493 --> 00:11:03,872 ఎవరో ఒక అనామకుడిని ఆమెని ఆరు వందల డాలర్లకు అమ్మబోయారు. 171 00:11:04,873 --> 00:11:06,875 ఈ కేసు విషయంలో నువ్వు చాలా శ్రద్ధ చూపెడుతున్నట్టున్నావే? 172 00:11:06,959 --> 00:11:10,921 అవును. పరిస్థితులు మారవలసిన సమయం ఆసన్నమైంది. 173 00:11:11,004 --> 00:11:13,966 రుతువులు మారతాయి, అలాగే సమాజం కూడా మారుతుంది. 174 00:11:14,049 --> 00:11:16,593 మనం కొత్త లోకంలో భాగమైనా కావాలి, 175 00:11:17,177 --> 00:11:18,762 లేకపోతే మనం ఆటవికుల్లా మిగిలిపోతాం. 176 00:11:20,681 --> 00:11:21,723 ఈ కేసును మనం వాదిద్దాం. 177 00:11:28,856 --> 00:11:30,440 చాలా మంచి విషయం. 178 00:11:30,524 --> 00:11:33,235 నువ్వు నెబ్రాస్కాకి వెళ్లిపోతున్నావని చెప్పడానికి వచ్చావేమో అని భయపడిపోయా. 179 00:11:33,318 --> 00:11:37,990 లేదు. ఆయన అమ్హెర్స్ట్ లోనే ఉండి, దీన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు. 180 00:11:38,490 --> 00:11:40,033 -బుడ్డోడిని నాకు ఇస్తారా? -లేదు, లేదు. 181 00:11:40,117 --> 00:11:43,579 ఓ విషయంలో నాకు నీ సాయం కావాలి. 182 00:11:43,662 --> 00:11:45,122 ఏ విషయంలో? 183 00:11:45,205 --> 00:11:47,082 నాకు ఒక కొత్త డ్రెస్ కావాలి. 184 00:11:48,750 --> 00:11:51,670 షాప్ లో ఇప్పటికే నాకు చాలా ఆర్డర్లు ఉన్నాయి, కాబట్టి... 185 00:11:51,753 --> 00:11:54,214 అయ్యో, అది నువ్వు చేయాలని నేను అనడం లేదు. 186 00:11:54,298 --> 00:11:55,465 నేనే దాన్ని చేసుకోవాలనుకుంటున్నా. 187 00:11:55,549 --> 00:11:57,009 -నువ్వా? -అవును. 188 00:11:57,092 --> 00:11:59,094 నాకు కుట్టడం రాదని నాకు తెలుసు, 189 00:11:59,803 --> 00:12:02,556 కానీ ఈ డ్రెస్సును నేనే కుట్టాలి, అది నాకు చాలా ముఖ్యం. 190 00:12:02,639 --> 00:12:05,392 రాయడానికి నాకు వీలు కల్పించే డ్రెస్ అన్నమాట. 191 00:12:05,475 --> 00:12:07,686 నాకు సౌకర్యంగా అనిపించే డ్రెస్, 192 00:12:08,979 --> 00:12:13,400 కాబట్టి, నీ విలువైన సలహాలు నాకు చాలా ఉపయోగపడతాయి, 193 00:12:14,401 --> 00:12:17,821 ఎందుకంటే, అలాంటి డ్రెస్ ఇప్పటి దాకా ఉందో లేదో కూడా నాకు తెలీదు. 194 00:12:18,822 --> 00:12:21,283 నేను ఆనందంగా సాయపడతాను. 195 00:12:21,366 --> 00:12:24,953 కొత్త డిజైన్ కి సంబంధించిన సవాలు నాకు బాగా నచ్చింది. 196 00:12:25,037 --> 00:12:26,246 మంచిది. 197 00:12:27,664 --> 00:12:28,790 అయితే ఓ కుర్చీ తెచ్చి ఇక్కడ కూర్చో. 198 00:12:29,708 --> 00:12:32,878 బుడ్డోడిని ఈ అమ్మాయిలు తీసుకువెళ్లక ముందే, వాడి పేరు ఏంటో చెప్పరా? 199 00:12:33,462 --> 00:12:36,173 తప్పకుండా చెప్తాం. 200 00:12:36,924 --> 00:12:38,550 సూ, నువ్వు చెప్తావా? 201 00:12:38,634 --> 00:12:40,469 -బుడ్డి మడ్డోడు అని పేరు ఎలా ఉంటుంది? -సూపర్ గా ఉంటుంది. 202 00:12:40,552 --> 00:12:42,763 మేము ఆత్రంగా వింటున్నాం. ఈ బుడ్డోడి పేరేంటో చెప్పండి. 203 00:12:43,347 --> 00:12:48,310 నేనూ, ఆస్టిన్ ఏమనుకున్నామంటే... 204 00:12:51,688 --> 00:12:53,607 -ఎవరబ్బా... -మీరు చెప్పండిలే. 205 00:12:53,690 --> 00:12:55,526 -ఎవరు అయ్యుంటారు? -ఎవరో వచ్చారు. 206 00:12:57,194 --> 00:12:58,570 వస్తున్నాను! 207 00:13:05,285 --> 00:13:06,495 ఓరి నాయనోయ్, 208 00:13:06,578 --> 00:13:09,915 నా ముందున్న ఈ ఏడేడు లోకాల అందగాడు ఎవడబ్బా? 209 00:13:09,998 --> 00:13:12,417 నా పేరు కల్నల్ థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్. 210 00:13:12,501 --> 00:13:14,753 గొప్ప కవయిత్రి అయిన, ఎమిలీ డికిన్సన్ ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. 211 00:13:23,136 --> 00:13:24,680 -పేరు చెప్పండి. -...తర్వాత ఎప్పుడైనా చెప్తాములే. 212 00:13:24,763 --> 00:13:26,807 ఎమిలీ కోసం ఒకరు వచ్చారు. 213 00:13:26,890 --> 00:13:28,016 ఎమిలీ కోసమా? ఎవరు? 214 00:13:28,100 --> 00:13:31,770 ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్, చాలా అందంగా ఉన్నాడు. 215 00:13:31,854 --> 00:13:36,900 ఆయన పేరు వింట్విగ్ హాన్సవర్త్ టాంప్టన్ పాప్కార్న్. 216 00:13:36,984 --> 00:13:40,070 -మ్యాగీ, నీ మెదడు ఏమైనా చిట్లిందా? -నిదానంగా చెప్పు, మ్యాగీ. 217 00:13:40,153 --> 00:13:42,739 హెమ్స్వర్య్ జాన్సన్ అండ్ జాన్సన్. 218 00:13:42,823 --> 00:13:43,824 ఏంటి? 219 00:13:46,326 --> 00:13:48,328 నా పేరు థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్. 220 00:13:49,329 --> 00:13:52,165 మీ కూతురు, ఎమిలీ డికిన్సన్, నాకు... 221 00:13:55,252 --> 00:13:56,670 కలం స్నేహితురాలు. 222 00:13:56,753 --> 00:13:59,631 కలం స్నేహితురాలా? అంటే... 223 00:13:59,715 --> 00:14:01,842 -తను మీకు లేఖలు రాస్తోందా? -అవును. 224 00:14:02,426 --> 00:14:04,887 చాలా లేఖలు, కవితలు రాసింది. 225 00:14:05,721 --> 00:14:07,264 చాలా గొప్ప కవితలు. 226 00:14:07,764 --> 00:14:13,228 ఆమె కవితల్లో ఉన్న తేనెలొలికే ముఖ్యమైన పదాలు, 227 00:14:13,812 --> 00:14:17,608 ఈ యుద్ధం నడుమ నాకు స్వాంతన చేకూరుస్తూ వచ్చాయి. 228 00:14:18,483 --> 00:14:22,779 రణరంగంలో ఉన్నవాడిని నేను, 229 00:14:22,863 --> 00:14:26,116 అయినా కానీ తను ఆ అనుభూతిని అంతటినీ చక్కగా పొందుపరచగలిగింది. 230 00:14:28,076 --> 00:14:32,789 రణరంగానికి అంత దూరంలో ఉన్న ఆమె 231 00:14:32,873 --> 00:14:35,667 అంతటి గాఢమైన, భయంకరమైన నిజాలను ఎలా వ్యక్తపరచగలిగింది? 232 00:14:38,462 --> 00:14:40,214 ఇక నేను నేరుగా ఆమెని కలుద్దామని వచ్చాను, 233 00:14:40,297 --> 00:14:42,591 అలాగే ఆమె ఇంటిని, ఇంకా కుటుంబాన్ని కూడా కలుద్దామని వచ్చాను. 234 00:14:44,009 --> 00:14:46,637 ఆమె మేధావి అని మీకు మొదటిసారిగా ఎప్పుడు అనిపించిందో చెప్పగలరా? 235 00:14:49,765 --> 00:14:53,560 ఈ డ్రెస్ లో సమస్త జీవకోటి ఉనికి కనపడాలి. 236 00:14:53,644 --> 00:14:56,396 వివేకం తాలూకు అన్ని అంచులూ ఇందులో ప్రతిబింబించాలి. 237 00:14:56,480 --> 00:14:59,233 అయితే నీకు లాగడానికి కాడలు లాంటివి ఉండకూడదు అన్నమాట. 238 00:14:59,316 --> 00:15:01,568 వివేకం అనేది గందరగోళానికి గురి చేసే అంశం. 239 00:15:01,652 --> 00:15:03,445 అవును. అవును... అదే. 240 00:15:03,529 --> 00:15:06,782 ఇంకా నేను రకరకాల కోణాలను స్పృశించాల్సి వస్తుంది కనుక రోజూ వేసుకోవడానికి వీలుగా 241 00:15:06,865 --> 00:15:08,867 అది సులభంగా ఉతకగలిగేది అయ్యుండాలి. 242 00:15:08,951 --> 00:15:12,079 అయితే, అది తెల్లది అయ్యుండాలి. తెల్ల దుస్తులను సులభంగా ఉతకవచ్చు. 243 00:15:12,162 --> 00:15:13,622 తెల్ల డ్రెస్? 244 00:15:13,705 --> 00:15:17,584 అవును. అది వసంత కాలానికి మాత్రమే ప్రత్యేకమైన కాంతిని సూచించే రంగు. 245 00:15:18,168 --> 00:15:22,005 మంచిది. మరి డిజైన్ ఎలా ఉండాలి? 246 00:15:22,089 --> 00:15:24,758 తాళ్లా, హుక్కులా, బటన్లా? 247 00:15:24,842 --> 00:15:26,927 ఎక్కువ బటన్లు ఉంటే, దాన్ని నేను వేరే వాళ్ళ సాయంతో వేసుకోవలసి వస్తుంది. 248 00:15:27,010 --> 00:15:29,012 ఒకవేళ బటన్లు ముందు పక్కే ఉంటే? 249 00:15:29,096 --> 00:15:31,348 అప్పుడు బటన్లను నువ్వే వేసుకోవచ్చు. 250 00:15:31,431 --> 00:15:33,267 -ముందు బటన్లు ఉండే డ్రెస్ -అది భిన్నంగా ఉంటుంది. 251 00:15:33,350 --> 00:15:34,476 అది వినూత్నంగా ఉంటుంది! 252 00:15:34,560 --> 00:15:37,896 -ముందు బటన్లు ఉండే డ్రెస్. -అదిరిపోతుంది. 253 00:15:37,980 --> 00:15:40,482 ఇప్పుడు ఆకృతి విషయానికి వద్దాం. 254 00:15:41,149 --> 00:15:44,862 ఇదే చాలా ముఖ్యమైనది. 255 00:15:44,945 --> 00:15:47,281 బస్సుల్స్, పెట్టీ కోట్స్, హూప్స్? 256 00:15:47,364 --> 00:15:50,158 నాకు అవేమీ వద్దు. నాకు స్ట్రీమ్ లైన్ డ్రెస్ కావాలి. 257 00:15:50,242 --> 00:15:51,785 నాకు అవసరం లేని ఇంకో విషయం చెప్తాను. 258 00:15:52,786 --> 00:15:54,329 -ఇది. -కోర్సెట్ వద్దా? 259 00:15:54,413 --> 00:15:58,417 ఈ డ్రెస్స్ నాకు అన్ని వేళలా సౌకర్యంగా ఉండాలి. 260 00:15:58,500 --> 00:16:01,044 కోర్సెట్ల వల్ల చాలా పనులు చేయడం కష్టం అవుతుంది. 261 00:16:01,128 --> 00:16:04,882 నేను నీకు ఒక రహస్యం చెప్తాను. నేను అసలు కోర్సెట్లను వేసుకోను. 262 00:16:04,965 --> 00:16:07,509 అవునా, నిన్ను చూస్తే అవి వేసుకున్నట్టే అనిపిస్తోంది. 263 00:16:07,593 --> 00:16:11,305 అంటే అవి కాదనుకో. డ్రెస్ ఆకృతి కోసం నేను ఎలాస్టిక్ ని వాడతాను. 264 00:16:11,388 --> 00:16:13,223 -అయినా కూడా స్టయిలిష్ గానే ఉంటాను... -అవును. 265 00:16:13,307 --> 00:16:17,853 ...కానీ ఎలాస్టిక్ వల్ల ఒంగినప్పుడు నాకు కాస్త ఊపిరి ఆడుతుంది. 266 00:16:17,936 --> 00:16:19,104 నీకు అది నప్పుతుందా? 267 00:16:19,188 --> 00:16:23,233 నాకు తెలీదు. అసలు ఆకృతే ఉండకూడదు అనుకుంటున్నా. ఎలా ఉన్నా సరిగ్గా నప్పాలి. 268 00:16:23,317 --> 00:16:26,737 ఊపిరి చాలా బాగా ఆడుతుంది, ఎమిలీ డికిన్సన్, కానీ నువ్వేదంటే అదే. 269 00:16:26,820 --> 00:16:30,782 కోర్సెట్ వద్దు, ఎలాస్టిక్ వద్దు, కానీ యూనిఫామ్ ఉండాలి. 270 00:16:30,866 --> 00:16:33,952 మరి పనిముట్లు ఏం ఉండాలో చెప్పు. 271 00:16:34,036 --> 00:16:37,331 -చెప్పు. -నీ డ్రెస్ కి ఎలాంటి పనిముట్లు కావాలి? 272 00:16:37,414 --> 00:16:40,250 ఉదాహరణకు, నా వద్ద కత్తెర ఉంది, ఇంకా ధారాలు గట్రా... 273 00:16:40,334 --> 00:16:42,669 నాకొక పెన్సిల్, కొన్ని కాగితాలు ఉంటే చాలు. 274 00:16:42,753 --> 00:16:43,754 సరే. 275 00:16:44,338 --> 00:16:46,924 వాటిని నీతో పాటు తీసుకువెళ్లాలని నీకు ఉంది కదా, 276 00:16:47,007 --> 00:16:48,967 ఎప్పుడు ప్రేరణ దొరికితే అప్పుడు రాయడానికి వీలుగా, అంతే కదా? 277 00:16:49,551 --> 00:16:50,719 అవును. 278 00:16:50,802 --> 00:16:53,931 అయితే, నీకు తప్పకుండా కొన్ని... 279 00:16:54,014 --> 00:16:56,391 -జేబులు. -...జేబులు కావాలి. జేబులు. 280 00:16:58,477 --> 00:17:00,437 ఎమిలీ, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. 281 00:17:00,521 --> 00:17:02,105 -ఇక్కడ కూర్చోండి... -ఒక వ్యక్తి వచ్చాడు. 282 00:17:02,189 --> 00:17:03,565 వ్యక్తా? ఎవరు? 283 00:17:04,566 --> 00:17:06,359 కల్నన్ వాట్స్వర్త్ జాన్సన్ అండ్ జాన్సన్. 284 00:17:06,944 --> 00:17:09,488 కల్నల్ థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్ 285 00:17:09,570 --> 00:17:10,948 అవును. నేను కూడా అదే అన్నాను. 286 00:17:11,531 --> 00:17:13,325 ఆయన ఇక్కడికి వచ్చాడా? మన ఇంటికి వచ్చాడా? 287 00:17:13,407 --> 00:17:15,618 కింద మీ కుటుంబ సభ్యులతో ఉన్నాడు, నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. 288 00:17:15,702 --> 00:17:16,703 ఓరి దేవుడా. 289 00:17:16,787 --> 00:17:19,330 ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన్ని నేను నిజంగా కలుసుకుంటానని నేను అనలేదే. 290 00:17:19,414 --> 00:17:20,832 మా మధ్య కేవలం లేఖల బంధం మాత్రమే ఉంది. 291 00:17:20,915 --> 00:17:23,292 నిన్ను చూశాక ఆయనకి నువ్వు నచ్చవేమో అని కంగారు పడుతున్నావా? 292 00:17:23,377 --> 00:17:27,714 ఆయన ఏం అనుకుంటాడో నాకు తెలీదు. నన్ను నేను చాలా తక్కువగా వర్ణించుకున్నా. 293 00:17:27,798 --> 00:17:29,800 నేను చాలా పొట్టిగా ఉంటానని, 294 00:17:29,883 --> 00:17:32,177 నా జుట్టు టెంకాయ పీచులా ఉంటుందని ఆయనకి చెప్పాను. 295 00:17:32,261 --> 00:17:35,138 అలాగా. అయితే నువ్వు నీ గుర్తింపును వేరేగా చెప్పవా? 296 00:17:35,639 --> 00:17:37,808 నేను కిందకు వెళ్లలేను. మనం... 297 00:17:37,891 --> 00:17:40,394 మనం ఆయనకు ఒక సాకు చెప్పాలి. ఆయనకి... 298 00:17:40,477 --> 00:17:43,105 ఆయనకి నేను నగ్నంగా ఉన్నానని చెప్పు. 299 00:17:43,188 --> 00:17:45,274 ఇక్కడ బెట్టీ ఉండి నా కొలతలు తీసుకుంటోందని చెప్పు. 300 00:17:45,357 --> 00:17:47,025 ఆయన్ని తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్పు. 301 00:17:48,068 --> 00:17:50,153 సరే. అలా చెప్పి చూస్తాను. 302 00:17:50,237 --> 00:17:52,823 కానీ దానికన్నా ముందు, నేను నీకు ఒక విషయం చెప్పాలి, 303 00:17:52,906 --> 00:17:55,617 నా కంట పడిన అతికొద్ది మంది అందగాళ్లలో ఆయన కూడా ఒకడు. 304 00:17:56,368 --> 00:18:00,664 అది నాకు అనవసరం. అతని మీద నాకు ప్రేమ లేదు. నా కవితల మీద ఆయన అభిప్రాయమే నాకు కావాలి. 305 00:18:00,747 --> 00:18:03,625 ఆయన్ని నేను అప్పుడే కలుసుకోలేను. అస్సలు కలుసుకోలేను. 306 00:18:03,709 --> 00:18:05,711 నేను ఎక్కువ లేఖలు కూడా పంపలేదు. ఇప్పుడిప్పుడే పంపడం మొదలుపెట్టా. 307 00:18:05,794 --> 00:18:07,254 నేను ఆయన్ని కలవాలంటే ఇంకా చాలా ఏళ్లు పడుతుంది. 308 00:18:07,337 --> 00:18:10,257 అయితే, నేను అతడిని వలలో పడేయాలని ప్రయత్నిస్తే, నువ్వేమీ ఫీల్ అవ్వవు కదా? 309 00:18:10,340 --> 00:18:12,843 మ్యాగీ, నువ్వేం కావాలంటే అది చేసుకో. ఆయన్ని ఇక్కడి నుండి పంపేయ్ చాలు. 310 00:18:12,926 --> 00:18:14,428 అతను వచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. 311 00:18:14,511 --> 00:18:16,847 అయ్య బాబోయ్, సూ. సూ పరిస్థితి ఏంటి? తనకి కోపం వస్తుందా? 312 00:18:16,930 --> 00:18:18,765 మీకు ఏ టీ తెమ్మంటారు, కల్నల్? 313 00:18:18,849 --> 00:18:21,727 అంతే కాకుండా, ఇంత ప్రయాణం చేశారు కాబట్టి, మీకు ఆకలిగా కూడా ఉండుంటుంది. 314 00:18:21,810 --> 00:18:24,021 మీకేమైనా లెగ్ పీస్ తెమ్మంటారా? 315 00:18:24,104 --> 00:18:25,439 పర్వాలేదులెండి. 316 00:18:25,522 --> 00:18:26,773 నిజానికి నేను శాకాహారిని. 317 00:18:26,857 --> 00:18:28,108 ఎంతటి గొప్పవారు మీరు! 318 00:18:28,692 --> 00:18:32,279 అయితే, మీకు ఏదైనా వెజిటేరియన్ ఆహారం తెస్తాను. ఒక్క క్షణంలో వచ్చేస్తాను. 319 00:18:33,113 --> 00:18:35,490 మీరు కాస్త మీ జాకెట్ తీయగలరా, కల్నల్? 320 00:18:35,574 --> 00:18:38,202 మీ జాకెట్ నుండి ఇల్లంతా అంతర్యుద్ధం తాలూకు దుమ్ము పడుతోంది. 321 00:18:38,744 --> 00:18:41,580 అమ్మా మహాతాల్లీ, నీతో ఒక్క ముక్క చెప్పవచ్చా? 322 00:18:47,336 --> 00:18:49,588 నేను చెప్పేది జాగ్రత్తగా విను. 323 00:18:49,671 --> 00:18:52,382 ఆ మనిషి మనకి చాలా ముఖ్యమైన మనిషి. 324 00:18:52,466 --> 00:18:55,260 అతను ఒక రచయిత, ఒక తత్వవేత్త ఇంకా ఒక క్రాంతికారుడు, 325 00:18:55,344 --> 00:18:58,555 ఎమిలీ కవితలు నచ్చి ఇంత దూరం వచ్చాడు. 326 00:18:58,639 --> 00:19:02,976 నీకు అర్థమవ్వట్లేదా? ఏదోకరోజు ఎమిలీకి ఆయన భర్త కావచ్చేమో. 327 00:19:03,560 --> 00:19:05,896 కాబట్టి మనం ఆయనకి మంచి టీ ఇవ్వాలి, 328 00:19:05,979 --> 00:19:09,858 అది కూడా మన వద్ద ఉన్న మంచి కప్పులలో పోసి ఇవ్వాలి. 329 00:19:09,942 --> 00:19:11,401 ఒకవేళ ఆయన కాఫీ అడిగితే, 330 00:19:11,485 --> 00:19:14,780 "ద ఫ్రూగల్ హౌజ్ వైఫ్"లో సూచించిన విధంగా కాఫీతో పాటు స్వీట్ బటర్, ఇంకా 331 00:19:14,863 --> 00:19:17,533 కొన్ని గుడ్లు ఇద్దాం. అర్థమైందా? 332 00:19:18,367 --> 00:19:22,287 సూసన్ గిల్బర్ట్, నీలో చాలా విషయం ఉంది. 333 00:19:22,371 --> 00:19:23,747 అంతా బాగానే ఉందా? 334 00:19:23,830 --> 00:19:27,793 అవును, ఇప్పుడే కల్నల్ హిగ్గిన్సన్ కి టీ ఇవ్వబోతున్నాం. 335 00:19:28,836 --> 00:19:30,045 అవును. మరి ఎమిలీ ఏది? 336 00:19:30,128 --> 00:19:32,297 ఒక చిన్న సమస్య. 337 00:19:33,048 --> 00:19:34,174 తను కిందికి రావట్లేదు. 338 00:19:35,843 --> 00:19:37,928 -తను త్వరలోనే వచ్చేస్తుంది. -ఇది చాలా అవమానకరమైన ప్రవర్తన. 339 00:19:38,011 --> 00:19:41,139 మేం తనకి సత్ప్రవర్తన నేర్పామని అనుకున్నాం, కానీ ఒక తండ్రి పని ఎప్పటికీ ముగిసేది కాదు. 340 00:19:41,223 --> 00:19:43,267 అదేం లేదులెండి. ఆమె ఏదో రాస్తూ ఉండి ఉంటుంది. 341 00:19:43,350 --> 00:19:47,604 ఆమె ఆ రచనా లోకంలో ఉన్నప్పుడు సమయమే తెలియదు అనుకుంటా. 342 00:19:47,688 --> 00:19:50,691 క్రీమ్, ఇంకా చక్కెర తీసుకుంటారా, కల్నల్? 343 00:19:50,774 --> 00:19:52,317 మీకు ఏం కావాలో చెప్పండి చాలు. 344 00:19:52,401 --> 00:19:53,819 పర్వాలేదు అండి. నేను ఉత్తది తాగేస్తాను. 345 00:19:55,404 --> 00:19:57,614 అంత గొప్ప కవయిత్రి కుటుంబాన్ని కలుసుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. 346 00:19:58,991 --> 00:20:01,034 మీరు ఎమిలీ గురించి అన్ని విషయాలూ నాకు చెప్పాలి. తను ఎలాంటి మనిషి? 347 00:20:01,118 --> 00:20:02,536 చెప్పండి, అదెంత చిన్నదైనా పర్వాలేదు. 348 00:20:02,619 --> 00:20:07,207 ఎంతైనా, ఒక్కోసారి, చిన్న చిన్న జీవితాలు గడిపేవారే పెను మార్పులు తీసుకురాగలరు. 349 00:20:08,876 --> 00:20:10,085 అంటే... 350 00:20:10,836 --> 00:20:13,839 ఎమిలీ చాలా ప్రత్యేకమైనది. 351 00:20:13,922 --> 00:20:18,510 -తను చాలా భిన్నమైన వ్యక్తి. -తనకి కుట్లు, వంట, తోమడం, ఇవేమీ రావు. 352 00:20:18,594 --> 00:20:21,597 -కానీ తను కేకులను మాత్రం బాగా చేస్తుంది. -తనకి పువ్వులంటే చాలా ఇష్టం. 353 00:20:21,680 --> 00:20:23,473 తను తుమ్మెదలతో మాట్లాడుతుండగా మేము చాలా సార్లు చూశాం. 354 00:20:23,557 --> 00:20:25,058 అవును, పాపం ఆ తుమ్మెదకి ఏమైందో? 355 00:20:25,142 --> 00:20:27,978 ఒక్కమాటలో చెప్పాలంటే తను చాలా విభిన్నమైన వ్యక్తి. 356 00:20:28,061 --> 00:20:30,647 అవును. ఈ ఇంట్లో ఉన్నవాళ్లలో తను చాలా విచిత్రమైన మనిషని చెప్పవచ్చు. 357 00:20:31,440 --> 00:20:32,941 అది నిజం కాదులెండి. 358 00:20:33,817 --> 00:20:35,903 -విచిత్రమైన మనిషా? -అవును. 359 00:20:35,986 --> 00:20:39,531 నా ఉద్దేశం, మిగతావాళ్లందరమూ మామూలుగానే ఉంటాం. 360 00:20:39,615 --> 00:20:42,451 దేశం యుద్ధంతో కకావికలమైపోతోంది. 361 00:20:42,534 --> 00:20:45,579 దేశం రెండు ముక్కలైంది, సైనికులు పిట్టల్లా రాలిపోతున్నారు. 362 00:20:45,662 --> 00:20:49,082 ఇది ఒంటరితనానికి, భద్రతకు సంబంధించిన విషయం. 363 00:20:49,708 --> 00:20:52,211 నేను ఒక మహిళని. 364 00:20:52,294 --> 00:20:53,587 పురుషులు చనిపోతున్నారు! 365 00:20:55,088 --> 00:20:57,549 అందరిలాగానే, 366 00:20:58,217 --> 00:21:01,803 నా జీవితంలోని చిక్కుముళ్ళ నుండి బయటపడలేక 367 00:21:02,471 --> 00:21:04,723 నేను కూడా చనిపోతున్నాను. 368 00:21:06,558 --> 00:21:07,851 మరి నీ సంగతి ఏంటి, నాన్నా? 369 00:21:07,935 --> 00:21:09,978 నేను నీ... నేను తన తండ్రినే. 370 00:21:10,062 --> 00:21:13,023 ఒక డికిన్సన్ అనే ఊబిలో ఇరుక్కుపోవడం. 371 00:21:13,106 --> 00:21:15,025 తను ఎమిలీ కాదులెండి. 372 00:21:15,108 --> 00:21:16,485 అవును, తను... 373 00:21:16,568 --> 00:21:18,445 నా దృష్టిలో... 374 00:21:20,822 --> 00:21:22,991 అవును. నా దృష్టిలో ఇది మనం చేసేయవచ్చు. 375 00:21:23,784 --> 00:21:24,785 అదీలెక్క. 376 00:21:26,453 --> 00:21:28,830 ఒక కొత్త రకమైన కవిత్వం కోసం... 377 00:21:29,957 --> 00:21:31,583 ఒక కొత్త రకమైన డ్రెస్. 378 00:21:34,294 --> 00:21:36,463 ఇది నిజంగా నువ్వే చేస్తావా, నన్ను చేయవద్దు అంటావా? 379 00:21:36,547 --> 00:21:39,550 -కొన్ని వారాల్లోనే చేసి ఇచ్చేయగలను. -లేదు. ఆ డ్రెస్సును నేనే చేసుకోవాలి. 380 00:21:41,885 --> 00:21:44,638 నా కలను సాకారం చేసుకోవడంలో భాగంగా నాకు సాయపడినందుకు థ్యాంక్స్, బెట్టీ. 381 00:21:49,852 --> 00:21:51,311 నీ కుటుంబానికి నేనేం చెప్పాలి? 382 00:21:52,479 --> 00:21:54,064 నేను కిందికి రాలేనని చెప్పు. 383 00:21:56,733 --> 00:21:58,151 నేను... 384 00:21:59,319 --> 00:22:00,320 రాసే పనిలో ఉన్నానని చెప్పు. 385 00:22:12,749 --> 00:22:14,042 ఓ విషయం చెప్పనా? 386 00:22:16,211 --> 00:22:19,923 నేను ప్రపంచాన్ని మార్చకపోయినా పర్వాలేదు... 387 00:22:22,050 --> 00:22:23,594 రాయడాన్ని మాత్రం ఆపను. 388 00:22:26,180 --> 00:22:28,265 ఎవరు పట్టించుకోకపోయినా కూడా నేను రాయడాన్ని ఆపను. 389 00:22:30,726 --> 00:22:33,604 ఎమిలీ డికిన్సన్ అనే పేరు గల వ్యక్తి 390 00:22:35,647 --> 00:22:40,152 ఈ చిన్ని గదిలో కూర్చొని రోజు తర్వాత రోజు, తనకి అనిపించినవవి... 391 00:22:42,196 --> 00:22:43,488 రాయడం కొనసాగించడం వలన... 392 00:22:47,159 --> 00:22:48,702 పెద్దగా ప్రభావమేదీ లేకపోయినా కూడా... 393 00:22:50,996 --> 00:22:53,665 నేను నా పనిని ఆపను. 394 00:22:58,504 --> 00:22:59,755 టీ చాలా బాగుంది. 395 00:22:59,838 --> 00:23:01,715 హాయ్, నా పేరు విన్నీ. 396 00:23:02,216 --> 00:23:03,884 నా పేరు థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్. 397 00:23:04,927 --> 00:23:06,386 మీరు నన్ను వెంట్వర్త్ అని పిలవవచ్చు. 398 00:23:07,179 --> 00:23:08,430 తప్పకుండా. 399 00:23:08,514 --> 00:23:09,973 ఇక చేతులు తీయ్. వాడు నా వాడు. 400 00:23:10,682 --> 00:23:13,018 -ఇప్పుడు లవీనియా కూడా ఇక్కడ ఉంది కనుక... -అప్పుడే ప్రేమనా? 401 00:23:13,101 --> 00:23:15,187 ...మనం చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పేయవచ్చేమో? 402 00:23:15,812 --> 00:23:19,066 మీరు ఇక్కడికి రాక ముందు, మేము మా బిడ్డ పేరును వెల్లడించే పనిలో ఉన్నాం. 403 00:23:19,149 --> 00:23:20,567 ఎట్టకేలకు ఒక పేరు ఎంచుకున్నారన్నమాట. 404 00:23:20,651 --> 00:23:22,945 చాలా సమయం తీసుకున్నారులే. వాడు పుట్టి నాలుగు నెలలు అయింది. 405 00:23:23,028 --> 00:23:24,821 కానివ్వండి. త్వరగా చెప్పండి. 406 00:23:24,905 --> 00:23:28,283 -సూపర్! ఇంతకీ అది ఎవరు చెప్తున్నారు? -నిజానికి, ఆ బుడ్డోడే చెప్తాడు. 407 00:23:28,367 --> 00:23:30,035 -అంతే కదా, సూ? -అవును. 408 00:23:31,495 --> 00:23:33,580 వాడు ఒక ఉత్తరం రాశాడు. 409 00:23:33,664 --> 00:23:36,834 వావ్, అప్పుడే ఉత్తరం రాసేశాడే. అన్నీ వాడి అత్త పోలికలు వచ్చాయేమో. 410 00:23:36,917 --> 00:23:39,628 ఇది... మిస్టర్ డికిన్సన్, మీ పేరు మీద రాశాడు. 411 00:23:40,212 --> 00:23:42,339 -నేను చదవనా? -తప్పకుండా. 412 00:23:42,422 --> 00:23:44,049 గొంతు కూడా పిల్లాడిలాగే ఉండాలి. 413 00:23:45,092 --> 00:23:46,218 గొంతు కూడానా? 414 00:23:49,096 --> 00:23:51,431 "ప్రియమైన తాతగారికి... 415 00:23:53,058 --> 00:23:57,229 నేను ఈ భూమ్మీద పుట్టి, చాలా రోజులు అయింది, 416 00:23:57,312 --> 00:23:59,773 కానీ నాకు ఇంకా పేరు లేదు." 417 00:23:59,857 --> 00:24:01,567 అవును. ఎమిలీకి మాత్రమే విచిత్రమైనది అనుకోవద్దు. 418 00:24:01,650 --> 00:24:05,028 "మీ పేరు చాలా బాగుంటుందని అమ్మ చెప్పింది, 419 00:24:05,112 --> 00:24:09,241 కనుక అలాంటి పేరే నేనూ పెట్టుకోవచ్చా అని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. 420 00:24:09,825 --> 00:24:13,370 అప్పుడే పుట్టిన వేలెడంత లేని నాకు 421 00:24:14,079 --> 00:24:19,042 మీ అంత పెద్ద పేరు ఉండటం మీకు సమ్మతమైతే, నాకు అనుజ్ఞ ఇవ్వండి." 422 00:24:21,670 --> 00:24:24,381 మేము బుడ్డోడికి మీ పేరే పెడ్తున్నాం. 423 00:24:24,464 --> 00:24:26,925 అది మీకు ఇష్టమైతేనే. 424 00:24:27,009 --> 00:24:29,887 నా ఈ సుదీర్ఘ జీవితానికి ఇంత కన్నా భాగ్యం ఇంకేముంటుంది. 425 00:24:29,970 --> 00:24:32,890 ఎడ్వర్డ్. బుల్లి ఎడ్వర్డ్. 426 00:24:32,973 --> 00:24:35,767 -మేము నెడ్ అని పిలుస్తాం. -బుల్లి నెడ్. 427 00:24:35,851 --> 00:24:37,311 చాలా బాగుంది. 428 00:24:40,439 --> 00:24:43,734 -బిడ్డకు పేరు పెట్టేశారే. -బెట్టీ, నువ్వింకా ఇక్కడే ఉన్నావా. 429 00:24:43,817 --> 00:24:45,861 కొత్త డ్రెస్ విషయంలో ఎమిలీకి సహాయపడ్డాను. 430 00:24:45,944 --> 00:24:47,112 ఇక నేను బయలుదేరుతాను. 431 00:24:47,696 --> 00:24:48,906 మీకు అభినందనలు. 432 00:24:48,989 --> 00:24:50,157 థ్యాంక్ యూ. 433 00:24:50,240 --> 00:24:51,533 ఇక సిద్ధంగా ఉండు, 434 00:24:51,617 --> 00:24:54,453 ఇప్పుడు వాడికి నామకరణం అయిపోయింది కనుక, 435 00:24:54,536 --> 00:24:56,496 వాడి కోసం నేను చాలా చర్చ్ సూట్లను ఆర్డర్ చేస్తాను. 436 00:24:56,580 --> 00:24:59,541 నెడ్ ని చర్చికి తీసుకెళ్లి, మిగతా బామ్మల కళ్లలో 437 00:24:59,625 --> 00:25:01,710 ఎప్పుడెప్పుడు నిప్పులు పోద్దామా అని నాకు చాలా ఆత్రంగా ఉంది. 438 00:25:01,793 --> 00:25:03,795 మతం అంటే అంతేగా మరి. 439 00:25:05,506 --> 00:25:06,548 బై. 440 00:25:06,632 --> 00:25:08,800 ఆవిడ బెట్టీ. కుట్టు పని చేస్తూ ఉంటుంది. 441 00:25:08,884 --> 00:25:12,221 అవును. అమ్హెర్స్ట్ లో తన కన్నా బాగా కుట్టు పని చేసేవారు ఇంకెవరూ లేరు. 442 00:25:12,930 --> 00:25:14,223 ఒక్క నిమిషం అండి. 443 00:25:17,100 --> 00:25:18,310 యూనిఫామ్ చాలా బాగుంది. 444 00:25:20,646 --> 00:25:22,147 అతనికి మన కుటుంబం నచ్చింది అనుకుంటా. 445 00:25:22,231 --> 00:25:24,149 అసలు కిందికి వచ్చే ఆలోచన ఎమిలీకి ఏమైనా ఉందా? 446 00:25:24,233 --> 00:25:25,526 ఒక్క నిమిషం, బెట్టీ. 447 00:25:26,235 --> 00:25:27,236 మీ పేరు బెట్టీయే, కదా? 448 00:25:27,819 --> 00:25:30,531 ఎవరండి మీరు? 449 00:25:31,406 --> 00:25:32,741 మన్నించండి, మేడమ్. 450 00:25:34,117 --> 00:25:36,161 నా పేరు కల్నల్ థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్. 451 00:25:36,745 --> 00:25:38,747 తొలి నల్ల జాతి యూనియన్ సైనికులు అయిన, 452 00:25:38,830 --> 00:25:40,916 మొట్టమొదటి దక్షిణ కరొలినా సైనిక దళంతో 453 00:25:41,500 --> 00:25:43,460 కలిసి పని చేసేంత అదృష్టం నాకు దక్కింది. 454 00:25:43,544 --> 00:25:44,753 మీకు అది తెలిసి ఉండవచ్చు. 455 00:25:45,712 --> 00:25:46,880 మీరు హెన్రీతో కలిసి యుద్ధంలోపాల్గొన్నారు. 456 00:25:46,964 --> 00:25:48,340 లేదు. 457 00:25:48,423 --> 00:25:51,510 ఆయన, అతని మనుషులతో కలిసి సొంతంగా యుద్ధం చేశాడు. 458 00:25:52,094 --> 00:25:56,265 వాళ్ళు సాయుధులై శత్రు సైనికులపై మెరుపుదాడి చేశారు. 459 00:25:56,348 --> 00:25:57,808 అది చాలా సాహసంతో కూడుకున్న పని. 460 00:25:58,600 --> 00:26:03,647 ఒక యుద్ధం జరిగింది... చిన్నదనే చెప్పవచు, కానీ భీకరంగా జరిగింది. 461 00:26:03,730 --> 00:26:07,234 శత్రు సైన్యం బ్యూఫోర్ట్ వైపుకు వస్తుండగా, 462 00:26:07,317 --> 00:26:10,779 దక్షిణ కరొలినా దళం వాళ్లని అడ్డగించి, మెరుపు దాడి చేసింది. 463 00:26:11,989 --> 00:26:15,284 వాళ్లలో హెన్రీ కూడా ఉన్నాడు. 464 00:26:15,868 --> 00:26:17,494 అతను... అతను... 465 00:26:18,078 --> 00:26:19,872 హెన్రీకి యుద్దంలో ఏమీ కాలేదు. అతను... 466 00:26:21,039 --> 00:26:22,124 అతను బతికే ఉన్నాడు. 467 00:26:25,586 --> 00:26:28,922 ఆ హోరు గాలిలో - ఒక సువార్త - వినపడింది - 468 00:26:29,006 --> 00:26:30,716 జీవికి స్వాంతన చేకూర్చే ఆశను - 469 00:26:30,799 --> 00:26:32,926 దూరం చేసే పెను తుఫాను 470 00:26:33,010 --> 00:26:34,636 జీవితంలో ఒక్కసారైనా వస్తుంది - 471 00:26:34,720 --> 00:26:36,096 ఆశ పెట్టుకోవడానికి కూడా నేను ధైర్యం చేయలేకపోయాను. 472 00:26:38,223 --> 00:26:39,308 ఇంకో విషయం... 473 00:26:42,603 --> 00:26:43,812 నేను మీ కోసం ఒకటి తెచ్చాను. 474 00:26:55,032 --> 00:26:56,283 హెన్రీ రాసిన లేఖలు. 475 00:26:57,743 --> 00:26:59,161 ఎట్టకేలకు అందాల్సినవారికి అందాయి. 476 00:26:59,244 --> 00:27:03,624 మంచి రచనలు, దక్కాల్సిన వారికి ఎలాగైనా దక్కుతాయని నేను అంటూ ఉంటాను. 477 00:27:09,922 --> 00:27:11,215 మేడమ్. 478 00:27:28,148 --> 00:27:30,442 ఎమిలీ ఇంకా కిందికి రానందుకు మన్నించండి, కల్నల్. 479 00:27:31,151 --> 00:27:32,528 పర్వాలేదులెండి. 480 00:27:34,279 --> 00:27:35,864 నేను ఎంత సేపైనా వేచి చూస్తాను. 481 00:27:38,033 --> 00:27:40,494 ఎమిలీ లాంటి కవుల కోసం ఒకట్రెండు గంటలు వేచి ఉండలేమా? 482 00:27:42,329 --> 00:27:44,998 ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి జనాలకు ఎన్నో శతాబ్దాలు పడుతుంది. 483 00:27:46,542 --> 00:27:50,796 పాత కాలంలో, ఐరిష్ జాతి యుద్ధాలు చేసుకొనే సమయంలో, 484 00:27:50,879 --> 00:27:52,548 వారి మధ్య ఓ అంగీకారం ఉండేదట. 485 00:27:53,924 --> 00:27:56,468 యుద్ధం ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నా కానీ, 486 00:27:57,511 --> 00:27:59,471 ఎంత మంది చనిపోయినా కానీ, 487 00:28:01,974 --> 00:28:04,268 కవుల జోలికి మాత్రం వెళ్లకూడదని వాళ్లు మాట అనుకున్నారట. 488 00:28:05,769 --> 00:28:07,729 "కవులను చంపకూడదు," అని అంటారు, 489 00:28:08,480 --> 00:28:11,859 ఎందుకంటే, కథలు చెప్పడానికి వాళ్లు కావాలి కాబట్టి. 490 00:28:16,738 --> 00:28:21,034 కవి అంటే అర్థం - ఏంటంటే - 491 00:28:23,120 --> 00:28:25,247 మామూలు పదాల నుండి కూడా 492 00:28:26,206 --> 00:28:27,958 అద్భుతమైన భావాలు పలికించగలగాలి - 493 00:28:30,502 --> 00:28:32,880 మనస్సులను కదిలించగలగాలి 494 00:28:40,345 --> 00:28:42,806 వసంత కాలంలో ఎప్పుడూ నన్ను ఓ పిట్ట వచ్చి పలకరించేది 495 00:28:50,689 --> 00:28:53,275 సూర్యుడు - ఇప్పుడే ఉదయించాడు - 496 00:29:00,407 --> 00:29:02,910 వేసవి ఆఖరి రోజు ఆ తేజస్సే తేజస్సు - 497 00:29:10,417 --> 00:29:13,462 నేను టోపీ పెట్టుకున్నాను - షాల్ ముడి వేసుకున్నాను - 498 00:29:22,763 --> 00:29:24,932 శరత్కాలం - నా కుట్టు పనిని మరుగున పడేసింది - 499 00:29:35,859 --> 00:29:38,153 పుస్తకం వంటి నేస్తం మరొకటి ఉండదు 500 00:29:44,910 --> 00:29:46,870 నా గదిలో చలి కాలం 501 00:30:19,361 --> 00:30:20,696 నేను ఉదయాన్నే బయలుదేరాను - 502 00:30:24,575 --> 00:30:25,617 నా కుక్కను కూడా తీసుకెళ్లాను - 503 00:30:28,787 --> 00:30:30,247 సముద్ర తీరానికి వెళ్లాను - 504 00:31:19,963 --> 00:31:24,384 ఎమిలీ. ఎమిలీ ఇటు రా! ఎమిలీ... 505 00:31:27,888 --> 00:31:31,767 బేస్మెంట్ లోని జలకన్యలు నన్ను చూడటానికి వచ్చాయి - 506 00:31:33,018 --> 00:31:34,394 ఇటు రా, ఎమిలీ. రా. 507 00:32:21,191 --> 00:32:22,526 నా కోసం ఆగండి. 508 00:32:24,069 --> 00:32:25,529 నేను వస్తున్నాను. 509 00:33:33,722 --> 00:33:35,724 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య