1 00:00:14,640 --> 00:00:18,310 మసాచుసెట్స్ లా సొసైటీ మీ ఉపన్యాసం కోసం ఎదురుచూస్తోంది. 2 00:00:18,393 --> 00:00:20,187 మీ రాకను మూడుసార్లు అడిగి మరీ నిర్థారించుకున్నారు. 3 00:00:20,270 --> 00:00:24,358 క్షమించండి, నేను కుటుంబం గురించి ఆలోచనల్లో మునిగిపోయాను. 4 00:00:24,441 --> 00:00:28,237 చిన్నారి స్టెర్న్స్ సంతాప సభకు మీ కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడానికీ, 5 00:00:28,320 --> 00:00:30,572 దీనికీ ఏమీ సంబంధం లేదు కదా? 6 00:00:30,656 --> 00:00:33,784 నిజమే. కానీ మా అబ్బాయి ఎందుకో చిరాగ్గా ప్రవర్తిస్తున్నాడు. 7 00:00:33,867 --> 00:00:39,248 నా భార్యేమో మంచానికే పరిమితమైపోయింది, ఇక ఎమిలీకి నాకూ పడటం లేదు. 8 00:00:39,957 --> 00:00:43,460 ఓహో, ఎమిలీ... ఆమెను కట్టడి చేయడం కష్టమే. 9 00:00:43,961 --> 00:00:46,588 ఆమెకు కొద్దిగా తలబిరుసు కూడా. 10 00:00:46,672 --> 00:00:47,673 అవును. 11 00:00:47,756 --> 00:00:51,760 మనం బోస్టన్ చేరుకునే వరకూ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాను. 12 00:00:51,844 --> 00:00:54,888 అంతేకాదు, మీరొక శుభవార్త కూడా వినబోతున్నారు. 13 00:00:54,972 --> 00:00:56,014 ఏంటది? 14 00:00:56,098 --> 00:00:57,224 ఎడ్వర్డ్ డికిన్సన్, 15 00:00:57,307 --> 00:01:01,812 ఈ రాత్రి మీరు లా సొసైటీలో కేవలం ఉపన్యాసం మాత్రమే ఇవ్వడం లేదు. 16 00:01:01,895 --> 00:01:03,814 వాస్తవానికి, మిమ్మల్ని 17 00:01:03,897 --> 00:01:07,317 మసాచుసెట్స్ రిపబ్లికన్ పార్టీ నాయకులు అభినందించబోతున్నారు, 18 00:01:07,401 --> 00:01:12,322 వారు మీకు లెఫ్టినెంట్ గవర్నర్ గా నామినేషన్ వేసే అవకాశం ఇవ్వబోతున్నారు. 19 00:01:12,406 --> 00:01:13,407 లెఫ్టినెంట్ గవర్నర్ గానా? 20 00:01:14,491 --> 00:01:16,535 -అది ఎంతో గౌరవంతో కూడుకున్నది. -నిజమే కదా మరి. 21 00:01:16,618 --> 00:01:19,037 మీరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నందుకు, 22 00:01:19,121 --> 00:01:22,541 సంకుచితమైన, విగ్ పార్టీ రోజుల నుంచి బయట పడబోతున్నందుకు సంతోషంగా ఉంది. 23 00:01:22,624 --> 00:01:25,919 ఎడ్వర్డ్, ఆలోచించండి. మీరు రిపబ్లికన్ కాబోతున్నారు. 24 00:01:26,003 --> 00:01:28,797 ఏమైతేనేం, మీరు ప్రపంచానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. 25 00:01:28,881 --> 00:01:30,632 నేను దీనికి సమ్మతి తెలపలేను. 26 00:01:31,216 --> 00:01:34,219 ఎడ్వర్డ్, మీరు ఈ పదవికి ఖచ్చితంగా అర్హులే. 27 00:01:34,303 --> 00:01:36,013 మీరు అమ్హెర్స్ట్ కి మూలస్తంభం వంటివారు, 28 00:01:36,096 --> 00:01:40,058 ఇప్పుడు ఈ పట్టణం యావత్తు రాష్ట్రంలోనే బానిసత్వ నిర్మూలనలో ముందుంది. 29 00:01:40,142 --> 00:01:43,395 పైగా మీకు చట్టమంటే ఎంతో గౌరవం కూడాను. 30 00:01:43,478 --> 00:01:47,691 నాకు అర్హతలు ఉండి ఉండవచ్చు, కానీ ఆ పదవి చేపట్టాలని లేదు. 31 00:01:48,567 --> 00:01:53,155 నేను నా కుటుంబంతో కలసి అమ్హెర్స్ట్ లోనే ఉండాలి, బోస్టన్ లో రిపబ్లికన్లతో కలసి కాదు. 32 00:01:54,406 --> 00:01:56,158 కాస్త ఆలోచించమని నా సలహా... 33 00:01:56,241 --> 00:01:58,952 నా నిర్ణయంలో మార్పు లేదు. 34 00:02:02,789 --> 00:02:04,791 -అబ్బా. -బండి ఆపు! 35 00:02:06,502 --> 00:02:08,669 -ఏంటిది? -దిగిపో. 36 00:02:09,295 --> 00:02:11,590 ఇక్కడా? మనం ఇంకా బోస్టన్ కు మధ్యదారిలో ఉన్నాం. 37 00:02:11,673 --> 00:02:13,509 లా సొసైటీ సమావేశం సంగతేంటి? 38 00:02:13,592 --> 00:02:16,512 -ఎడ్వర్డ్, ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉంటావు. -ఓరి దేవుడా. 39 00:02:16,595 --> 00:02:21,683 నీవన్నీ బూజుపట్టిన ఆలోచనలు, ఎప్పుడూ మార్పును స్వాగతించవు. 40 00:02:21,767 --> 00:02:25,229 ఈ దేశం పురోగతి చెందుతోందన్న విషయాన్ని నువ్వెప్పుడూ అంగీకరించవు. 41 00:02:25,312 --> 00:02:30,067 కాబట్టి నువ్వు లేకుండానే దేశం ముందుకు సాగుతుంది. 42 00:02:30,150 --> 00:02:34,279 ఇక, తక్షణం దిగిపో! 43 00:02:38,617 --> 00:02:42,788 -ఎడ్వర్డ్ డికిన్సన్, నువ్వొక పిరికిపందవి. -ఏంటీ? 44 00:02:42,871 --> 00:02:45,290 నువ్వు చేతగానివాడివి. 45 00:02:45,374 --> 00:02:47,626 నువ్వు అన్నింటికీ భయపడే చిట్టెలుకవి! 46 00:02:47,709 --> 00:02:49,837 -ఎలా? -డ్రైవర్, పోనీయ్! 47 00:02:51,296 --> 00:02:52,297 కాంకీ. 48 00:02:56,093 --> 00:02:57,094 అవును. 49 00:02:58,011 --> 00:02:59,805 నేను చిట్టెలుకనే. 50 00:03:01,682 --> 00:03:04,309 కానీ నా చిట్టెలుక కుటుంబం కోసం నేను ఇంటికి వెళ్లాలి. 51 00:03:08,397 --> 00:03:10,315 డికిన్సన్ 52 00:03:10,399 --> 00:03:12,359 బాధ అంటే కంటికి కనిపించీ కనిపించకుండా ఉండే చిట్టెలుక లాంటిది 53 00:03:27,916 --> 00:03:30,586 జరగబోయే దారుణానికి భయపడి ప్రయోజనం లేదు - 54 00:03:31,628 --> 00:03:33,630 తను మనతో ఏం మాట్లాడాలని అనుకుంటోందో ఏమో. 55 00:03:33,714 --> 00:03:35,841 నాకూ తెలియదు కానీ ఏదో అర్జెంటు విషయమే అయి ఉంటుంది. 56 00:03:35,924 --> 00:03:38,135 నాకు ఒక కేక్ బాక్సు పంపింది, అందులో 57 00:03:38,218 --> 00:03:40,470 "ఇది చాలా అర్జెంటు" అని ఒక కార్డుపై రాసి పెట్టింది. 58 00:03:40,554 --> 00:03:42,472 అవును, నాకూ అలాంటిదే వచ్చింది. 59 00:03:45,142 --> 00:03:46,143 అదిగో తను. 60 00:03:46,810 --> 00:03:49,771 ఎమిలీ, మమ్మల్ని రమ్మన్నావట? 61 00:03:50,772 --> 00:03:52,482 అవును సోదరా, సోదరీ. 62 00:03:53,317 --> 00:03:57,196 నేనే మిమ్మల్ని పిలిచాను. నా మాట మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. 63 00:03:57,279 --> 00:03:58,822 తను ఎందుకు అదోలా మాట్లాడుతోంది? 64 00:03:58,906 --> 00:04:02,576 ఒక ముఖ్యమైన విషయంపై అర్జెంటుగా మనం మాట్లాడుకోవాలని పిలిచాను, 65 00:04:02,659 --> 00:04:07,247 అది తోబుట్టువులమైన మన ముగ్గురి భవిష్యత్తుకూ సంబంధించిన విషయం. 66 00:04:07,331 --> 00:04:09,541 కాబట్టి, దీన్ని తోబుట్టువుల సమావేశం అని పిలుచుకుందాం. 67 00:04:09,625 --> 00:04:11,877 -అలాగే. -అసలేం జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదు. 68 00:04:11,960 --> 00:04:14,922 విలియం ఆస్టిన్ డికిన్సన్, నీకూ ఈ కుటుంబానికీ మధ్య 69 00:04:15,005 --> 00:04:17,798 దూరం పెంచేందుకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, 70 00:04:17,882 --> 00:04:22,721 అలాంటి వేర్పాటు అధికారికంగా గానీ, చట్టపరంగా గానీ సాధ్యం కాలేదన్నది నిజం. 71 00:04:22,804 --> 00:04:26,975 అందువల్ల, ఈ కుటుంబం, ఇకపై కూడా కలిసే ఉంటుంది. 72 00:04:27,518 --> 00:04:30,479 -అందువల్ల, దరిమిలా, కాబట్టి... -కాబట్టి? 73 00:04:30,562 --> 00:04:35,108 కాబట్టి, నువ్వు ఇప్పటికీ మాకు అన్నవే. మన తండ్రికి గల ఒకే ఒక్క కొడుకువి కూడా నువ్వే. 74 00:04:35,192 --> 00:04:36,193 అసలు ఏంటిదింతా? 75 00:04:36,276 --> 00:04:39,154 ఎమిలీ, మేము ఏదో నేరం చేసినట్టూ, నువ్వు మమ్మల్ని విచారిస్తున్నట్టూ కాకుండా, 76 00:04:39,238 --> 00:04:42,157 నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది కాస్త అర్థమయ్యేలా చెబుతావా? 77 00:04:42,241 --> 00:04:45,118 సరే, నాన్న తన వీలునామా గురించి నీకు వివరించి చెప్పమని నన్ను ఆదేశించారు, 78 00:04:45,202 --> 00:04:49,081 అందులో, మా ఇద్దరితో సహా తన యావదాస్తినీ ఆయన నీ పేరిట రాశారు. 79 00:04:49,164 --> 00:04:50,415 "మన ఇద్దరితో సహా" అంటే? 80 00:04:50,499 --> 00:04:53,418 నాన్న చనిపోతే, మన సంరక్షకుడు ఆస్టినే అవుతాడు. 81 00:04:53,502 --> 00:04:57,673 ఈ ఇల్లు, ఆస్తులూ, మనమూ తనకే చెందుతాం. మనం కూడా ఆస్థిలో భాగమే. 82 00:05:01,593 --> 00:05:04,429 ఓహో, సరే, నాకు అర్థమైంది. 83 00:05:04,513 --> 00:05:07,182 నాన్న చనిపోతే, అప్పటికీ నీకు మొగుడనేవాడు లేకపోతే, 84 00:05:07,266 --> 00:05:09,226 నువ్వు నీ అన్నయ్యకే చెందుతావు. 85 00:05:09,309 --> 00:05:11,186 ఇది పితృస్వామ్యం కదా మరి. 86 00:05:11,687 --> 00:05:13,856 సరే. నా జీవితంపై నా సోదరుడు అధికారం 87 00:05:13,939 --> 00:05:15,983 చెలాయిస్తే నేను చూస్తూ కూర్చోలేను. 88 00:05:16,066 --> 00:05:17,526 నీ జీవితంపై నేను అధికారం చెలాయించబోను. 89 00:05:17,609 --> 00:05:19,570 అసలు ఈ కుటుంబంలో సభ్యుడిగా ఉండేందుకు కూడా నాకు ఇష్టం లేదు. 90 00:05:19,653 --> 00:05:21,238 ఇదంతా నాన్న చేసిన నిర్వాకం. 91 00:05:21,321 --> 00:05:24,366 నాకు ఉన్న కష్టాలతోనే నాకు సరిపోతుంది. 92 00:05:25,909 --> 00:05:28,245 -దాని గురించే. -సరే. 93 00:05:28,871 --> 00:05:33,292 ఆస్టిన్, గత కొన్ని నెలలుగా నువ్వు మా అందరి దృష్టినీ 94 00:05:33,375 --> 00:05:37,838 ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశావు, అందులో నాన్న విఫలమయ్యారు. 95 00:05:37,921 --> 00:05:41,258 ఇప్పుడు, నీ పద్దతే సరైనదని ఒప్పుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 96 00:05:41,341 --> 00:05:42,551 దేని గురించి? 97 00:05:42,634 --> 00:05:46,013 నాన్న విపరీతమైన నిస్పృహకు గురయ్యారు. 98 00:05:46,096 --> 00:05:49,224 -అవును. -ఆయన ఎప్పుడూ సమాజాన్ని 99 00:05:49,308 --> 00:05:52,394 దృష్టిలో ఉంచుకుని, దానికి అనుగుణంగా నడిచేందుకు ప్రయత్నించారు, 100 00:05:52,477 --> 00:05:54,438 ఆ విధంగా చూస్తే, ఆయనొక మూర్ఖుడనే అనాలి. 101 00:05:54,521 --> 00:05:57,608 అవును, ఆ సంగతి ఇప్పటికైనా నీకు అర్థమైనందుకు ధన్యవాదాలు. 102 00:05:57,691 --> 00:05:58,775 నాకు అర్థమైంది. 103 00:05:59,985 --> 00:06:03,697 నువ్వు చెప్పిందే నిజం. నా వాదన తప్పు. నిన్ను కాదని, ఆయనే కరెక్టనడం సబబు కాదు. 104 00:06:05,240 --> 00:06:06,241 వావ్. 105 00:06:06,992 --> 00:06:09,494 సరే, ధన్యవాదాలు. 106 00:06:10,913 --> 00:06:12,206 ఇదిగో, ఇప్పుడు మేం ఇలా 107 00:06:13,081 --> 00:06:16,627 ఆయన వారసత్వ సింహాసనం కోసం నీ వెనుక నిలబడి ఉన్నాం. 108 00:06:16,710 --> 00:06:18,754 మా ఇద్దరికీ, ఇక ఏ అధికారమూ ఉండదు. 109 00:06:18,837 --> 00:06:21,173 -నీ అధీనంలోకి వచ్చాం. -నేను నిజంగా అలా అనుకోవడం లేదు. 110 00:06:21,256 --> 00:06:22,925 అందుకనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. 111 00:06:23,008 --> 00:06:26,386 -నువ్వు మాకొక మాట ఇవ్వాలి. -ఏం మాట? 112 00:06:26,470 --> 00:06:29,431 చరిత్రను మళ్లీ పునరావృతం చేయనని మాట ఇవ్వాలి. 113 00:06:29,515 --> 00:06:31,725 నువ్వేమంటున్నావో అర్థమయ్యేలా చెబుతావా? 114 00:06:31,808 --> 00:06:35,354 గతం గతః. జరిగిందేదో జరిగిపోయింది. 115 00:06:35,437 --> 00:06:37,439 దాన్ని మనం ఎలాగూ మార్చలేం. 116 00:06:38,148 --> 00:06:40,859 నువ్వు గతాన్ని ఎదుర్కోవాలని అనుకుంటే, 117 00:06:40,943 --> 00:06:45,572 మనం భవిష్యత్తులో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. 118 00:06:45,656 --> 00:06:49,409 కాబట్టి, ఆస్టిన్, నాన్నలాగ ఉండనని, 119 00:06:50,202 --> 00:06:52,663 సమాజం ఎలా చెప్పిందనేది కాకుండా, మనం కలిసి బతికినంతకాలం... 120 00:06:54,164 --> 00:06:56,625 మమ్మల్ని గౌరవంగా చూస్తానని, 121 00:06:56,708 --> 00:06:59,294 మాకు స్వేచ్ఛనిస్తాననీ, మేం కోరుకున్నట్లు మమ్మల్ని ఉండనిస్తాననీ 122 00:06:59,378 --> 00:07:03,423 మాకు మాట ఇవ్వగలవా? 123 00:07:03,507 --> 00:07:05,050 చెల్లెళ్లూ... 124 00:07:07,094 --> 00:07:08,303 నన్ను నమ్మండి. 125 00:07:09,721 --> 00:07:10,931 సరే. 126 00:07:12,349 --> 00:07:13,350 కానీ ఒక్క షరతు. 127 00:07:13,433 --> 00:07:14,434 ఏంటి? 128 00:07:14,518 --> 00:07:15,853 విన్నీ తన పిల్లుల్ని వదిలిపెట్టేయాలి. 129 00:07:15,936 --> 00:07:17,771 -అవును. నాకూ ఆ పిల్లులంటే అసహ్యమే. -వద్దు! 130 00:07:17,855 --> 00:07:19,606 -నాకు పిల్లులంటే ఇష్టం లేదు. -నాకూ లేదు. 131 00:07:19,690 --> 00:07:21,525 నా పిల్లుల్ని నేను వదిలిపెట్టను. 132 00:07:21,608 --> 00:07:25,362 విన్నీ, వాటి పాలకి, క్రీమ్ కి వారానికి 36 డాలర్లు ఖర్చుచేస్తున్నాం. అది చాలా ఎక్కువ. 133 00:07:25,445 --> 00:07:27,781 ప్రశ్న: నక్కల మీద నీ అభిప్రాయమేంటి? 134 00:07:27,865 --> 00:07:30,117 -ఏంటి? -సర్లే. ఇది నీకు సంబంధించినది కాదు. 135 00:07:30,200 --> 00:07:32,661 మేం స్వతంత్ర భాావాలు కలిగిన మహిళలం. దాన్ని గౌరవిస్తానని ఇందాకే చెప్పావుగా. 136 00:07:32,744 --> 00:07:35,539 ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందామా? ఇప్పుడైతే చేతులు కలుపుదామా? 137 00:07:38,625 --> 00:07:39,626 సరే, నేను కూడా. 138 00:07:39,710 --> 00:07:40,711 నువ్వంటే ఇష్టం అన్నయ్యా. 139 00:07:40,794 --> 00:07:41,795 మీరన్నా నాకు ఇష్టమే. 140 00:07:43,672 --> 00:07:46,675 ఇప్పుడు బాధపడకపోతే బాగుండదు మరి. 141 00:07:49,553 --> 00:07:52,848 ఒక్కో డికిన్సన్ ని మారుస్తూ ప్రపంచాన్నే తీర్చిదిద్దుతున్నా. 142 00:07:59,980 --> 00:08:02,733 సరే, అమ్మా, లే, లేచి పనులు చూసుకో. 143 00:08:02,816 --> 00:08:04,902 ఇది మరొక తాజా రోజు. ఓహో! ఎంతో బాగుంది. 144 00:08:04,985 --> 00:08:06,528 ఇక నువ్వు మంచం దిగాలి. 145 00:08:06,612 --> 00:08:08,071 నన్ను ఒంటరిగా వదిలెయ్. 146 00:08:08,155 --> 00:08:11,283 కుదరదు. నీకు నచ్చినా నచ్చకపోయినా, 147 00:08:11,366 --> 00:08:13,285 నేను నిన్ను నవ్విస్తాను, కవ్విస్తాను. 148 00:08:13,368 --> 00:08:15,162 అబ్బా, నాపైన పడకు. 149 00:08:15,245 --> 00:08:16,955 అమ్మా, నీపై పడాల్సిందే. 150 00:08:17,039 --> 00:08:19,541 నువ్వు వారానికి పైగా పడుకునే ఉన్నావు. 151 00:08:20,125 --> 00:08:22,461 చూస్తూ చూస్తూ నిన్ను ఇలా విచారంలో మునిగిపోనివ్వను. 152 00:08:22,544 --> 00:08:24,755 పైగా, ఇల్లంతా మట్టిగొట్టుకుపోయింది. 153 00:08:24,838 --> 00:08:27,758 ఇవాళ చీపుర్లు పట్టుకుని శుభ్రం చేద్దాం. నువ్వు చీపుళ్లకు మహా రాణివి కదా. 154 00:08:27,841 --> 00:08:29,635 పొగడ్తలు నాదగ్గర పనిచేయవు. 155 00:08:30,385 --> 00:08:32,596 నా మనసంతా బాధతో నిండిపోయి ఉంది. 156 00:08:32,679 --> 00:08:34,932 నా హృదయానికి పడిన రంధ్రాన్ని ఎవరూ పూడ్చలేరు. 157 00:08:35,015 --> 00:08:36,015 దాని గురించి మాట్లాడుకుందామా? 158 00:08:36,099 --> 00:08:39,852 నేను మాట్లాడాలని అనుకుంటున్నది నా చెల్లి లవీనియాతోనే. కానీ అది చనిపోయింది. 159 00:08:39,937 --> 00:08:43,398 నీకు తెలుసా, మనుషులు చనిపోయినా, వారి ఆత్మలు మనతోనే ఉంటాయట. 160 00:08:43,482 --> 00:08:46,818 నీకొక సంగతి చెప్పనా, లవీనియా పిన్ని అంత్యక్రియల్లో నేను తన ఆత్మను చూశాను, 161 00:08:46,902 --> 00:08:48,153 అది ఒక పక్షి రూపంలో ఉంది. 162 00:08:48,237 --> 00:08:51,114 అబ్బా. అది అసాధ్యం. దానికి పక్షులంటే అసహ్యం. 163 00:08:51,198 --> 00:08:55,452 -అలాగా? నాకు ఆ సంగతి తెలియదు. -నా చెల్లి గురించి నాకే బాగా తెలుసు. 164 00:08:55,536 --> 00:08:58,372 నేను ప్రేమించినంత తనని ఎవరూ ప్రేమించలేదు. తనని నేను చాలా మిస్ అవుతున్నా. 165 00:08:58,455 --> 00:08:59,873 నువ్వేం మిస్ అవుతున్నావో చెప్పు. 166 00:09:00,582 --> 00:09:02,042 అన్నీ కోల్పోయా. 167 00:09:02,125 --> 00:09:03,961 ఇవాళ తన గురించి నేనేం తలచుకున్నానో చెప్పనా? 168 00:09:04,044 --> 00:09:07,840 మేం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకునేది. 169 00:09:07,923 --> 00:09:11,510 మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పటినుంచీ తను అలాగే చేసేది. 170 00:09:11,593 --> 00:09:14,680 మేం ఇద్దరం కలిసి పుట్టామా అన్నట్టుగా ఉండేవారం. 171 00:09:14,763 --> 00:09:16,139 ఇంకా చెప్పు? 172 00:09:16,223 --> 00:09:18,809 తన గొంతు, మేం చెప్పుకున్న జోకులు, 173 00:09:18,892 --> 00:09:20,686 నన్ను నవ్వించే విధానం. 174 00:09:20,769 --> 00:09:24,398 మా ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉండేవి. ఇద్దరం ఒకే రకమైన దుస్తులు ధరించేవాళ్లం. 175 00:09:24,481 --> 00:09:27,734 ఆమె నాలో ఒక భాగమైపోయింది. తనంటే నాకెంతో ఇష్టం. 176 00:09:28,652 --> 00:09:30,237 చెల్లెలంటే అలా ఉండాలి. 177 00:09:30,320 --> 00:09:33,532 అవును. నాకూ ఒక సోదరి ఉన్నందుకు సంతోషంగా ఉంది. 178 00:09:34,116 --> 00:09:38,287 నువ్వు, లవీనియా ఒకే ఇంట్లో కలిసి పెరుగుతున్నందుకు మీరెంతో అదృష్టవంతులు. 179 00:09:38,370 --> 00:09:40,372 నేను చిన్న వయసులోనే ఇల్లు వదిలి 180 00:09:40,455 --> 00:09:42,791 రాకుండా, నేను తనూ కలిసి ఉంటే ఎంతో బాగుండేది. 181 00:09:42,875 --> 00:09:45,502 నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొన్నిసార్లు అసూయ కలుగుతుంది. 182 00:09:46,128 --> 00:09:48,172 అబ్బా, అమ్మా, నువ్వలా అనుకుంటున్నట్టు నాకు తెలియదు. 183 00:09:50,591 --> 00:09:54,386 నీ చెల్లితో నీకున్న అనుబంధం ఎంతో విలువైనది. 184 00:09:54,970 --> 00:09:58,140 మీరిద్దరూ కలిసి ఆస్వాదించిన ప్రతి క్షణానికి రుణపడి ఉండండి, 185 00:09:58,223 --> 00:10:00,809 ఎందుకంటే, ఏదో ఒక రోజు, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 186 00:10:02,769 --> 00:10:04,730 అమ్మా, ఈ ప్రదేశాన్ని నువ్వు చివరిసారి ఎప్పుడు శుభ్రం చేశావు? 187 00:10:04,813 --> 00:10:08,150 ఏమో నాకు తెలియదు. ఎప్పుడూ శుభ్రం చేసినట్టే లేదు. ఎందుకు? 188 00:10:10,194 --> 00:10:11,528 ఎందుకంటే, నేను... 189 00:10:12,529 --> 00:10:14,198 నేనిప్పుడే ఒక ఎలుకను చూశాను! 190 00:10:14,281 --> 00:10:16,575 -ఎలుకా? నా పడకగదిలో ఎలుక ఉందా? -అవును. అవును. 191 00:10:17,951 --> 00:10:19,077 ఎక్కడుంది? ఎటు పోయింది? 192 00:10:19,995 --> 00:10:22,080 ఇప్పుడే చూశా. ఇక్కడే ఉండి ఉంటుంది. ఆ మూలకి పారిపోయింది. 193 00:10:22,164 --> 00:10:25,375 విన్నీ దగ్గర 500 పిల్లులున్నాయిగా, అయినా ఎలుక ఎలా వచ్చింది? 194 00:10:25,459 --> 00:10:27,961 మీరు ఇంటిని శుభ్రం చేయట్లేదా? ఇల్లంతా కంపు కొడుతోంది. 195 00:10:28,045 --> 00:10:29,546 నేను చీపురు తెస్తాను. దాన్ని వేటాడతా. 196 00:10:29,630 --> 00:10:31,673 -వద్దు. నాకొక ఆలోచన వచ్చింది. -ఏంటది? 197 00:10:31,757 --> 00:10:34,593 నా చెల్లి లవీనియాకి పక్షులంటే అసహ్యమే కానీ... 198 00:10:34,676 --> 00:10:37,387 -అవును, ఆ మాట నువ్వు చెప్పావుగా. -...తనకు ఎలుకలంటే ఇష్టమే. 199 00:10:37,471 --> 00:10:38,847 వాటిని పెంపుడు జంతువుల్లా చూసుకునేది. 200 00:10:38,931 --> 00:10:42,893 వాటికి వెన్న పెట్టేది. జానపద కథల్లో తనకు నచ్చిన పాత్రల పేర్లతో వాటిని పిలుచుకునేది. 201 00:10:42,976 --> 00:10:45,479 -రపన్జెల్, రంపెల్స్టిల్స్కిన్, స్నో వైట్. -బాగున్నాయి. 202 00:10:45,562 --> 00:10:48,482 కొన్నిసార్లు, వాటిని నాపైకి వదిలి భయపెట్టేది, ఎందుకంటే నాకు ఎలుకలంటే భయం. 203 00:10:48,565 --> 00:10:50,692 -ఒకసారి ఒక ఎలుకను నా మంచంపై పెట్టింది. -ఓహో, అది మంచి విషయం కాదు. 204 00:10:50,776 --> 00:10:52,027 ఎమిలీ, నీకు అర్థమవ్వడం లేదా? 205 00:10:52,110 --> 00:10:54,613 ఆ ఎలుక నీ లవీనియా పిన్ని ఆత్మేనని నాకు అనిపిస్తోంది. 206 00:10:57,199 --> 00:10:58,200 దేవుడా. 207 00:10:59,243 --> 00:11:00,244 అమ్మా, అది నిజమేనని అనిపిస్తోంది. 208 00:11:00,327 --> 00:11:02,120 ఆ చెల్లి ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉంటుందని నాకు తెలుసు. 209 00:11:02,746 --> 00:11:04,498 ఆ ఎలుకలో ఖచ్చితంగా ఆమె ఆత్మ ఉంది. 210 00:11:06,917 --> 00:11:08,210 నేను పట్టుకున్నాను. 211 00:11:08,293 --> 00:11:10,462 విన్నీ పిన్నీ, ఇది నువ్వేనా? 212 00:11:10,546 --> 00:11:12,589 -ఆమెను బాధపెట్టకు. -నేనేం బాధపెట్టట్లేదు. 213 00:11:12,673 --> 00:11:14,132 అమ్మా, ఇదిగో విన్నీ పిన్ని మనతోనే ఉంది. 214 00:11:15,092 --> 00:11:18,220 నువ్వేం చెబుతావో అదంతా వింటుంది. 215 00:11:19,555 --> 00:11:20,556 చెప్పు మరి. 216 00:11:23,934 --> 00:11:25,310 చెల్లీ? 217 00:11:27,020 --> 00:11:28,814 బుజ్జి విన్నీ, ఇది నువ్వేనా? 218 00:11:31,483 --> 00:11:34,069 తనతో మాట్లాడమ్మా. నీ మనసులో ఉన్నది పంచుకో. 219 00:11:36,905 --> 00:11:39,324 నన్ను క్షమించు, చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయాను. 220 00:11:40,868 --> 00:11:43,954 కలిసి పెరిగే అవకాశాన్ని మనం కోల్పోయినందుకు కూడా నన్ను మన్నించు. 221 00:11:46,415 --> 00:11:49,459 భర్తలూ, పిల్లలూ మనిద్దరినీ వేరు చేశారు. 222 00:11:49,543 --> 00:11:51,461 మాట్లాడుతూనే ఉండు. అమ్మా, అది ఎంతో బాగుంటుంది. నాకు తెలుసు. 223 00:11:55,215 --> 00:11:57,342 నాకున్నవారిలో గొప్ప స్నేహితురాలివి నువ్వే. 224 00:11:58,927 --> 00:12:02,139 జీవితాంతం ప్రతిరోజూ నిన్ను మిస్సవుతూనే ఉంటాను. 225 00:12:09,229 --> 00:12:10,814 ఇక నిన్ను వదిలి పెడతాను. 226 00:12:17,654 --> 00:12:19,239 అదిగో, తను వెళ్ళిపోతోంది. 227 00:12:22,492 --> 00:12:24,620 ఇవన్నీ నేను తన అంత్యక్రియల సమయంలో చెప్పాలనుకున్నవి, 228 00:12:24,703 --> 00:12:26,330 కానీ నాకు అందుకు అవకాశం రాలేదు. 229 00:12:26,413 --> 00:12:28,248 ఇప్పుడు చెప్పావుగా, తను విందిలే. 230 00:12:28,332 --> 00:12:30,459 నా హృదయంలో ఇప్పటికీ ఓ రంధ్రం ఉంది. 231 00:12:31,293 --> 00:12:33,754 కానీ ఇప్పుడు ఆ రంధ్రంలో ఓ చిట్టెలుక నివాసం ఏర్పరచుకుంది. 232 00:12:33,837 --> 00:12:35,214 అమ్మా, ఈ మాట ఎంతో బాగుంది. 233 00:12:36,590 --> 00:12:38,217 నేను దీనిపై ఒక కవిత రాస్తాను. 234 00:12:38,300 --> 00:12:41,261 నిజంగా? నువ్వు అలా చేస్తే ఎంతో సంతోషిస్తాను. 235 00:12:43,639 --> 00:12:47,559 సరే. ఇక డ్రెస్ చేసుకుని, ఇంట్లో ప్రతి అంగుళమూ ఊడ్చాల్సిన సమయం ఇది. 236 00:12:47,643 --> 00:12:50,729 గౌరవనీయ పెద్ద మనుషులారా, మిసెస్ డికిన్సన్ పనిలోకి దిగారు! 237 00:13:01,198 --> 00:13:04,910 ఆస్టిన్. వచ్చావా, సంతోషం. ఇప్పుడే టీ చేసి తెచ్చాను. 238 00:13:04,993 --> 00:13:06,161 ఇంటికి ఎవరైనా వచ్చారా? 239 00:13:06,245 --> 00:13:09,581 అవును. నీకోసం జార్జ్ గౌల్డ్ వచ్చాడు. 240 00:13:10,290 --> 00:13:14,127 జార్జ్. అతనికోసం టీ చేయడం దేనికి? 241 00:13:15,003 --> 00:13:16,171 హేయ్, నేస్తం. 242 00:13:17,005 --> 00:13:18,674 వీడ్కోలు చెప్పి వెళ్దామని వచ్చాను. 243 00:13:18,757 --> 00:13:19,758 జార్జ్. 244 00:13:20,384 --> 00:13:21,677 యూనిఫామ్ వేసుకున్నావే. 245 00:13:22,719 --> 00:13:24,555 ఇప్పుడే టైలర్ నుంచి తీసుకున్నాను. 246 00:13:25,305 --> 00:13:26,306 సరిగ్గా సరిపోయింది. 247 00:13:26,890 --> 00:13:27,850 అయితే నువ్వు... 248 00:13:28,809 --> 00:13:30,018 నువ్వు కూడా యుద్ధానికి వెళ్తున్నావా? 249 00:13:30,102 --> 00:13:31,645 అవును, వెళ్తున్నా. 250 00:13:31,728 --> 00:13:33,772 ఈమధ్యే నాకు డ్రాఫ్ట్ కార్డు కూడా వచ్చింది. 251 00:13:34,523 --> 00:13:37,067 మసాచుసెట్స్ 21వ దళంలో చేరుతున్నాను. 252 00:13:37,776 --> 00:13:39,486 ఫ్రేజర్ కూడా అదే దళంలో ఉండేవాడు. 253 00:13:39,570 --> 00:13:41,154 అతని ఆత్మకు శాంతి కలుగుగాక. 254 00:13:41,822 --> 00:13:42,906 మిత్రమా, 255 00:13:43,907 --> 00:13:45,617 ఇది నమ్మలేకపోతున్నాను. 256 00:13:45,701 --> 00:13:47,911 వీలైనంతమంది యువకులు యుద్ధంలో పాల్గొనాలని యూనియన్ ఆశిస్తోంది. 257 00:13:47,995 --> 00:13:52,332 అమ్హెర్స్ట్ లో ఉన్న ప్రతి మగాడూ సైన్యంలో చేరుతున్నారు. రోజూ కార్డులు అందుతున్నాయి. 258 00:13:52,416 --> 00:13:54,126 నీకు ఇంకా కార్డు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. 259 00:13:54,209 --> 00:13:57,212 అవును. నా కార్డు కూడా త్వరలో వస్తుంది. 260 00:13:58,172 --> 00:13:59,256 ఏరోజైనా వచ్చేయవచ్చు. 261 00:14:00,340 --> 00:14:03,010 జార్జ్ గౌల్డ్, నువ్వు ధైర్యవంతుడివి. 262 00:14:03,093 --> 00:14:04,469 నా డ్యూటీ నేను చేస్తున్నానంతే. 263 00:14:06,054 --> 00:14:08,765 యుద్ధానికి రమ్మన్నారు, వెళ్ళి, పోరాడతా. 264 00:14:08,849 --> 00:14:10,392 ఎందుకంటే, జాన్ బ్రౌన్ లాగే నేను కూడా 265 00:14:11,560 --> 00:14:12,978 ఒక మంచి దేశం రూపొందాలని ఆశిస్తున్నాను, 266 00:14:13,896 --> 00:14:14,897 ఫ్రేజర్ మాదిరిగానే. 267 00:14:16,815 --> 00:14:18,317 మీకు ఒక విషయం చెప్పాలి. 268 00:14:19,359 --> 00:14:22,154 -మీ ఇద్దరికీ. -ఆస్టిన్, ఏంటది? 269 00:14:23,071 --> 00:14:28,035 నేను ఏం చేశానో చెబితే, మీరు నన్ను ఎప్పటికీ క్షమించరు. 270 00:14:29,161 --> 00:14:30,579 అంత చెడ్డ పని ఏం చేశావు? 271 00:14:32,831 --> 00:14:35,125 నా బదులు యుద్ధానికి వెళ్లమని మరొకరికి డబ్బు ఇచ్చాను. 272 00:14:36,585 --> 00:14:40,380 కొన్ని రోజుల క్రితమే నాకు డ్రాఫ్ట్ కార్డ్ వచ్చింది, 273 00:14:40,464 --> 00:14:44,510 అప్పుడు నేనొక బార్ కి వెళ్లాను, బాగా తాగాను, 274 00:14:44,593 --> 00:14:48,847 అక్కడున్న ఐరిష్ బార్ టెండర్ కి డబ్బులు ఇచ్చి, నా బదులు యుద్ధానికి వెళ్ళమన్నాను. 275 00:14:51,308 --> 00:14:55,354 ఆ మర్నాడే ఫ్రేజర్ యుద్ధంలో మరణించినట్లు తెలిసింది. 276 00:14:56,396 --> 00:14:57,397 నేను... 277 00:14:59,191 --> 00:15:00,776 నేను వాణ్ని వదిలి ఉండలేను. 278 00:15:00,859 --> 00:15:02,110 ఎవరిని? 279 00:15:02,194 --> 00:15:04,655 మన కొడుకుని. 280 00:15:07,741 --> 00:15:09,952 నేనొక మంచి తండ్రిని కావాలనుకుంటున్నాను. 281 00:15:10,452 --> 00:15:12,371 నేను నా తండ్రిలా ఉండకూడదనుకుంటున్నాను. 282 00:15:12,454 --> 00:15:14,498 అలాంటి వ్యక్తిలాగా ఉండకూడదనుకుంటున్నాను. 283 00:15:14,581 --> 00:15:16,124 నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను. 284 00:15:16,208 --> 00:15:18,168 మన అబ్బాయి కూడా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నాను. 285 00:15:19,336 --> 00:15:24,508 వాణ్ని వదిలి, నేను యుద్ధానికి వెళ్లిపోతే, మళ్లీ తిరిగి రాలేకపోతే, 286 00:15:25,509 --> 00:15:26,844 వాడికి మంచీ చెడూ ఎలా నేర్పగలను? 287 00:15:28,053 --> 00:15:29,763 డికిన్సన్ల భవిష్యత్తు 288 00:15:29,847 --> 00:15:32,808 గతంలో మాదిరి కాకుండా, ప్రత్యేకమైనదని ఎలా నిరూపించగలను? 289 00:15:34,643 --> 00:15:39,356 నా స్థానంలో వెళ్లిన ఆ ఐరిష్ వ్యక్తి, యుద్ధభూమిలో చనిపోతాడు, 290 00:15:39,439 --> 00:15:42,484 నేనేమో ఇక్కడున్నాను. 291 00:15:43,151 --> 00:15:44,194 నేనొక దేశద్రోహిని. 292 00:15:44,903 --> 00:15:45,946 ఒక పిరికిపందను. 293 00:15:46,738 --> 00:15:47,990 ఆస్టిన్. 294 00:15:49,741 --> 00:15:50,868 నీ బాధ నాకు అర్థమైంది. 295 00:15:50,951 --> 00:15:53,704 నా కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయకు, జార్జ్. 296 00:15:53,787 --> 00:15:55,038 నేను నిజంగానే చెబుతున్నాను. 297 00:15:57,165 --> 00:15:58,625 చేసిందేదో చేశావు. 298 00:15:59,293 --> 00:16:03,172 ఇక దాన్ని మార్చలేవు, కానీ దాంతోనే అంతా అయిపోయిందని అనుకోనక్కర్లేదు. 299 00:16:03,255 --> 00:16:05,048 ఇప్పటికీ నీ వంతు కృషి నువ్వు చేయవచ్చు. 300 00:16:05,632 --> 00:16:08,677 సమాజానికి కావలసింది చేయవచ్చు. 301 00:16:09,386 --> 00:16:11,972 అందుకు యుద్ధానికే వెళ్లనక్కర్లేదు. 302 00:16:12,639 --> 00:16:16,435 ఇక్కడే, ఇంట్లోనే ఉండి, ఈ దేశాన్ని తీర్చి దిద్దేందుకు 303 00:16:17,477 --> 00:16:18,604 ఎంత చేయాలో అంత చేయవచ్చు... 304 00:16:20,063 --> 00:16:21,857 నీ కుటుంబాన్ని చూసుకుంటూనే ఆ పని చేయవచ్చు. 305 00:16:26,862 --> 00:16:28,614 గెలిచేందుకు మనం ఏం చేయాలో అది చేశాం. 306 00:16:28,697 --> 00:16:30,199 అవును, సాధించాం. 307 00:16:30,282 --> 00:16:32,242 కొంతమంది గెలుపును ఆశిస్తారు. 308 00:16:32,951 --> 00:16:34,620 -మరికొందరు గెలిస్తే బాగుండు అనుకుంటారు. -అవును. 309 00:16:34,703 --> 00:16:37,122 -కొందరు మాత్రమే గెలుపు సాధిస్తారు. -భలే చెప్పావు! 310 00:16:37,206 --> 00:16:39,082 -మనం గెలుపు సాధించాం. -అవును! 311 00:16:39,166 --> 00:16:42,753 ప్రతికూల పరిస్థితుల్ని సైతం మనకు అనుకూలంగా మార్చుకున్నాం. 312 00:16:42,836 --> 00:16:44,880 -గెలుపు సాధించాం! -అవును! 313 00:16:44,963 --> 00:16:46,840 గొప్పతనం అనేది ఒక పరిణామ ప్రక్రియ. 314 00:16:48,008 --> 00:16:49,551 -నేను ఎగరగలనని నాకు నమ్మకం. -చెప్పు, మైకేల్ జోర్డాన్. 315 00:16:49,635 --> 00:16:51,845 నువ్వు కూడా ఎగరగలవని నమ్ముతున్నాను, మైకేల్ జోర్డాన్. 316 00:16:51,929 --> 00:16:53,055 నేనూ ఎగరగలను. 317 00:16:53,138 --> 00:16:55,557 నిజానికి, మనం ఎగిరాం. 318 00:16:55,641 --> 00:16:57,643 ఆ దక్షిణాది కుర్రాళ్ల మీదుగా ఎగిరాం. 319 00:16:58,143 --> 00:17:02,356 మనం వాళ్లని ఊహించని దెబ్బ కొట్టాం. వాళ్లకు మన రెక్కల చప్పుడు మాత్రమే వినిపించింది. 320 00:17:02,439 --> 00:17:04,566 -హెన్రీ, భలే చెప్పావు. -మనం పక్షుల్లాంటివాళ్ళం. 321 00:17:04,650 --> 00:17:08,237 భలే చెప్పావు, మిత్రమా. మనం కలిసి కదిలాం, కలిసి ఎగిరాం. 322 00:17:08,319 --> 00:17:10,614 అదరగొట్టేశాం! అర్థమైందా? 323 00:17:10,696 --> 00:17:12,366 -యుద్ధభూమిలో కుర్రాళ్లం. -వింటున్నారా? 324 00:17:12,449 --> 00:17:14,576 -ఆకాశంలో పక్షుల బారు. -బారా, ఏంటది? 325 00:17:14,660 --> 00:17:15,827 పక్షుల బారు. 326 00:17:15,911 --> 00:17:19,665 ఒక వరుస క్రమమంలో ఎగిరే పక్షుల గుంపును అలా అంటారు. 327 00:17:20,290 --> 00:17:23,752 అందుకు చక్కటి ఉదాహరణ పక్షులే. బాతులు కూడా అలా ఎగురుతాయి. 328 00:17:23,836 --> 00:17:27,089 -హెన్రీ, నువ్వు కూడా తాగు. -ఏయ్! మీరు అక్కడున్నారా! 329 00:17:27,172 --> 00:17:28,382 మేం ఇక క్లాసులకు హాజరుకాము. 330 00:17:29,508 --> 00:17:31,385 అందరూ ఇక్కడున్నారా! 331 00:17:32,010 --> 00:17:34,346 -అబ్బా! అంతా చెత్త. -ఓరి నాయనోయ్! 332 00:17:34,429 --> 00:17:35,973 -ఎవరొచ్చారో చూడండి. -బాగున్నారా, కల్నల్? 333 00:17:36,056 --> 00:17:37,266 నేను... 334 00:17:39,309 --> 00:17:41,353 ఇరవై నాలుగు గంటలసేపు ఉత్కంఠలో గడిపాను. 335 00:17:43,814 --> 00:17:46,525 మీరు ఏం చేశారో తెలిశాక, మీరంతా చనిపోయారేమోనని భయపడ్డాను. 336 00:17:47,693 --> 00:17:50,070 లేదు. మేం చావలేదు. వాళ్లే చచ్చారు. 337 00:17:52,406 --> 00:17:54,032 క్షమించండి, సర్, 338 00:17:54,741 --> 00:17:58,120 చివరకు, ముందుకే వెళ్లాలని, మా భవితకు బాట వేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 339 00:17:58,203 --> 00:18:01,290 అవును, అందుకే ఘన విజయం సాధించారు. 340 00:18:01,373 --> 00:18:03,208 నమ్మశక్యంగాని విజయం అది. 341 00:18:03,292 --> 00:18:05,502 కానీ మీ వల్ల బేస్ వద్ద నానా హంగామా అయింది. 342 00:18:05,586 --> 00:18:07,421 నాపై అరవడం తప్ప శాక్స్టన్ ఇంకేం చేయలేకపోయాడు. 343 00:18:07,504 --> 00:18:08,839 మీకు ఇబ్బంది కలిగించాలని మేం అనుకోలేదు. 344 00:18:08,922 --> 00:18:11,508 ఇబ్బందులు పెట్టే వ్యక్తిగా నేను ఎంత మిస్సయ్యానో మీరు గుర్తు చేశారు. 345 00:18:12,467 --> 00:18:14,428 నేనొక సంస్కర్తనే తప్ప యథాతథవాదిని కాను. 346 00:18:15,429 --> 00:18:21,268 నిజం చెప్పాలంటే, మీ ఆలోచనలను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, 347 00:18:21,351 --> 00:18:24,688 అందుకనే నేను కొంతకాలం విశ్రాంతి సెలవులు తీసుకోవాలనుకుంటున్నాను. 348 00:18:24,771 --> 00:18:25,689 ఏంటది, "విశ్రాం"? 349 00:18:26,398 --> 00:18:27,649 విశ్రాంతి సెలవులా? 350 00:18:27,733 --> 00:18:30,861 అవును, నేను ఆలోచించాల్సింది చాలా ఉంది, చాలావాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. 351 00:18:30,944 --> 00:18:34,114 ఆ పనులన్నీ చేసేందుకు కొంతకాలం సెలవు పెడుతున్నాను. 352 00:18:34,198 --> 00:18:35,199 నేను ఇక్కడ లేనప్పుడు, 353 00:18:36,200 --> 00:18:37,451 నువ్వే ఇంచార్జిగా వ్యవహరించాలి. 354 00:18:37,534 --> 00:18:39,203 నిన్ను సార్జంట్ ని చేయాలని నిర్ణయించాను. 355 00:18:39,286 --> 00:18:40,329 ఏమన్నారు? 356 00:18:40,412 --> 00:18:43,874 -నేనా? ఇంచార్జినా? -అవును నువ్వే. 357 00:18:43,957 --> 00:18:46,043 నువ్వేమిటో నిరూపించుకున్నావు, కాదంటారా, మిత్రులారా? 358 00:18:46,126 --> 00:18:47,794 -హేయ్! -నీకంటే ఎవరు సరిపోతారు? 359 00:18:48,545 --> 00:18:49,630 -అవును. -హెన్రీ. 360 00:18:49,713 --> 00:18:53,926 హెన్రీ, హెన్రీ, హెన్రీ, హెన్రీ, హెన్రీ! 361 00:18:54,009 --> 00:18:55,427 కానీయ్, ఆల్ఫాబెట్! 362 00:18:55,511 --> 00:18:57,262 -హేయ్! -నిర్ణయం అయిపోయిందంతే. 363 00:19:02,476 --> 00:19:03,769 మీరెక్కడికి వెళ్తున్నారు? 364 00:19:03,852 --> 00:19:07,689 బోస్టన్ పట్టణంలో మా ఇంటికి. కానీ దానికంటే ముందు అమ్హెర్స్ట్ కు. 365 00:19:07,773 --> 00:19:08,774 అమ్హెర్స్ట్ కా? 366 00:19:08,857 --> 00:19:13,111 అవును. అక్కడ ఒకరిని కలవాలి. 367 00:19:13,195 --> 00:19:15,030 ఓ కవయిత్రిని కలవాలి, ఈ కష్టకాలంలో 368 00:19:15,113 --> 00:19:17,199 ఆమె రాసిన కవితలు నాకెంతో ఊరటనూ, స్పష్టతనూ ఇచ్చాయి. 369 00:19:17,282 --> 00:19:18,283 ఆమె పేరు ఎమిలీ డికిన్సన్. 370 00:19:19,993 --> 00:19:22,162 హెన్రీ, ఏంటిది? ఏదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావే. 371 00:19:22,246 --> 00:19:23,789 నాకు ఎమిలీ డికిన్సన్ తెలుసు. 372 00:19:25,249 --> 00:19:27,835 -ఏంటీ? -వాళ్ళ కుటుంబం కోసం పని చేశాను. 373 00:19:27,918 --> 00:19:30,295 ఒక్క నిమిషం. అంటే ఇంతకాలం ఆమెతో 374 00:19:30,379 --> 00:19:32,631 పరిచయం ఉన్న వ్యక్తితోనే నేను ఉన్నానా? 375 00:19:32,714 --> 00:19:34,675 ఆమె సమక్షంలో కొంతకాలం పని చేసిన వ్యక్తితోనే నేను ఇంతకాలం ఉన్నానా? 376 00:19:34,758 --> 00:19:39,096 భావోద్వేగాలను తనలో దాచుకున్న వ్యక్తితోనే నేను ఉన్నానని నాకు తెలియలేదా? 377 00:19:39,680 --> 00:19:41,598 ఆమె రాసిన కవితలు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. 378 00:19:42,224 --> 00:19:43,475 ఇది చూడు. 379 00:19:44,184 --> 00:19:46,061 నా జీవితం - బద్దలవ్వపోతున్న అగ్నిపర్వతం లాంటిది - 380 00:19:46,144 --> 00:19:47,646 క్లిష్ట పరిస్థితిలో - ఇప్పటివరకూ 381 00:19:48,272 --> 00:19:50,566 యాజమాన్యం గుర్తించబడింది - తర్వాతి తరానికి సంక్రమించింది - 382 00:19:50,649 --> 00:19:51,817 నన్ను బాధపెట్టింది - 383 00:19:51,900 --> 00:19:54,945 -సరే. అద్భుతం. -ఇది ఒక శ్వేతజాతి అమ్మాయి రాసిందా? 384 00:19:55,028 --> 00:19:56,071 బ్రహ్మాండంగా రాసింది. 385 00:19:56,154 --> 00:19:57,948 హెన్రీ, ఒక విషయం నిజాయితీగా చెప్పు. 386 00:19:58,031 --> 00:19:59,199 ఆమె దేన్ని ఇష్టపడుతుంది? 387 00:20:00,492 --> 00:20:04,454 అది మీకు మీరే తెలుసుకోవలసిన విషయం. 388 00:20:05,205 --> 00:20:07,040 -బాగా చెప్పావు. -అవును. 389 00:20:07,124 --> 00:20:08,792 ఇక నేను తక్షణమే బయల్దేరాలి. 390 00:20:09,835 --> 00:20:11,128 హిగ్గిన్సన్, ఒక్క క్షణం. 391 00:20:11,211 --> 00:20:12,421 ఏంటి? 392 00:20:12,504 --> 00:20:14,089 మీరు అమ్హెర్స్ట్ వెళ్తుంటే, 393 00:20:15,090 --> 00:20:17,217 నాకొక సాయం చేసి పెట్టాలి. 394 00:20:22,806 --> 00:20:24,725 ఆకాశంలో చూశావా? 395 00:20:27,436 --> 00:20:28,604 చాలా అందంగా ఉంది. 396 00:20:28,687 --> 00:20:29,688 వావ్. 397 00:20:32,566 --> 00:20:35,152 మీ అందరికి చెబుతున్నా, నేను ఎగరడం ఎలాగో నేర్చుకున్నా... 398 00:20:35,235 --> 00:20:38,113 అలాగా? మాకు చెప్పు ఎలాగో. 399 00:20:39,531 --> 00:20:41,033 ఇకపై నేను నడవను. 400 00:21:05,390 --> 00:21:06,391 ఎమిలీ. 401 00:21:06,475 --> 00:21:07,976 నీకోసమే వచ్చాను. 402 00:21:09,144 --> 00:21:10,145 లోపలకి రా. 403 00:21:11,063 --> 00:21:12,105 అతిథులు ఉన్నట్టున్నారే. 404 00:21:12,814 --> 00:21:16,818 వీడ్కోలు పలికేందుకు ఆస్టిన్ కొందరిని పిలిచాడు. 405 00:21:17,486 --> 00:21:18,820 ఎవరికి వీడ్కోలు చెప్పేందుకు? 406 00:21:20,656 --> 00:21:23,116 జార్జ్ కి. అతను యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తున్నాడు. 407 00:21:23,825 --> 00:21:25,494 జార్డి కూడానా. 408 00:21:31,124 --> 00:21:33,043 అయితే, అతనికి నేనూ వీడ్కోలు చెప్పాలి, 409 00:21:34,127 --> 00:21:36,171 కానీ, ఈ రాత్రి నీతో ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నాను. 410 00:21:37,005 --> 00:21:38,131 సరే. 411 00:21:38,215 --> 00:21:42,636 నాతో దేని గురించయినా ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నావా, లేక... 412 00:21:42,719 --> 00:21:43,720 ఒక విషయం ఉంది. 413 00:21:44,346 --> 00:21:45,931 కానీ దాన్ని మాటల్లో చెప్పలేను. 414 00:21:46,014 --> 00:21:48,308 ఎమిలీ, ఎమిలీ. అతిథులు. 415 00:21:49,726 --> 00:21:51,228 మనం ఇద్దరమే. 416 00:21:51,854 --> 00:21:53,605 సరేనా? ఈ రాత్రికి. 417 00:21:59,111 --> 00:22:02,614 "రండి, మరొక సొగసైన రాత్రిని ఆస్వాదిద్దాం. 418 00:22:02,698 --> 00:22:04,741 నా విచారకరమైన కెప్టెన్లందరూ, నాకు కాల్ చేయండి. 419 00:22:04,825 --> 00:22:06,410 మన పాత్రలన్నీ మళ్లీ నింపుకుందాం. 420 00:22:06,952 --> 00:22:08,579 అర్ధరాత్రి గంటను అపహాస్యం చేద్దాం." 421 00:22:08,662 --> 00:22:10,414 ఇది షేక్స్పియర్ క్లబ్ నుంచి. 422 00:22:11,957 --> 00:22:13,917 ఆప్త మిత్రుడా, పండగ చేసుకుందాం. 423 00:22:57,336 --> 00:22:59,046 ఇటు చూడు. 424 00:23:47,219 --> 00:23:48,220 హెలెన్! 425 00:23:49,096 --> 00:23:50,472 లోపలికి రా, బంగారం. 426 00:23:51,390 --> 00:23:52,516 భోజనం వేడిగా ఉంది. 427 00:24:00,399 --> 00:24:02,276 ఇది కలా? నిజమా? 428 00:24:02,359 --> 00:24:03,527 బెట్టీ. 429 00:24:04,194 --> 00:24:05,279 గుడ్ ఈవినింగ్. 430 00:24:05,863 --> 00:24:07,990 మిస్టర్ డికిన్సన్, ఏమైంది మీకు? 431 00:24:08,073 --> 00:24:09,908 మిమ్మల్ని చూస్తే ఏదో కూలినాలీ చేసి వస్తున్నట్టున్నారు. 432 00:24:09,992 --> 00:24:11,535 నేను బాగానే ఉన్నాలే, బాగానే ఉన్నాను. 433 00:24:12,452 --> 00:24:15,706 బోస్టన్ కు వెళ్తుంటే దారి మధ్యలో బలవంతంగా దింపేశారు. 434 00:24:15,789 --> 00:24:17,666 దాంతో కాలినడకనే ఇంటికి బయల్దేరాను. అయినా నేను బాగానే ఉన్నాను. 435 00:24:17,749 --> 00:24:19,168 మీ కోటు పీలికలైపోయింది. 436 00:24:19,251 --> 00:24:20,794 మీకు ఆకలిగా ఉన్నట్టుంది. 437 00:24:20,878 --> 00:24:23,755 కాస్త... కాస్త సూప్ తాగుతారా? 438 00:24:23,839 --> 00:24:25,591 వద్దు, వద్దు. మీ దయకు కృతజ్ఞుణ్ని. 439 00:24:25,674 --> 00:24:27,718 అది మీట్ బాల్ సూప్. మీ ఆకలి తీరుతుంది. 440 00:24:28,302 --> 00:24:29,678 మీట్ బాల్ సూపా? 441 00:24:29,761 --> 00:24:31,263 లోపలకు రావచ్చుగా? 442 00:24:31,346 --> 00:24:33,724 మీకు కావలసినంత తినండి. ఈలోగా మీ కోటును బాగు చేసి పెడతాను. 443 00:24:33,807 --> 00:24:36,226 మీరిలా ఇంటికి వెళ్లి, మిసెస్ డికిన్సన్ కు కనిపిస్తే బాగుండదు. 444 00:24:36,727 --> 00:24:39,104 హాయ్, అమ్మా. నేను తోటలో దైవదూతలతో ఆడుకున్నాను. 445 00:24:39,646 --> 00:24:42,774 -తనకి ఊహాశక్తి ఎక్కువ. -మా ఎమిలీలాగే అన్నమాట. 446 00:24:42,858 --> 00:24:45,027 ఇవాళ మనతో కలసి డికిన్సన్ కూడా సూప్ తాగుతారు. 447 00:24:45,110 --> 00:24:47,154 -వద్దు, నేను... -లేదు, మీరేం మాట్లాడకండి. 448 00:24:47,237 --> 00:24:49,281 మిమ్మల్ని ఇలా ఆకలితో పంపించలేను. 449 00:24:49,364 --> 00:24:51,074 ఆయన నాన్న కుర్చీలో కూర్చుంటారు. 450 00:24:52,159 --> 00:24:53,493 ఈమె తన తండ్రిని ఎంతో మిస్సవుతోంది. 451 00:24:53,577 --> 00:24:55,120 అవును, ఆయన కూడా మిమ్మల్ని మిస్సవుతూ ఉండొచ్చు. 452 00:24:56,371 --> 00:25:00,375 తండ్రిగా ఉండటం అనేది ఈ ప్రపంచంలో ఒక గొప్ప విషయం. 453 00:25:02,878 --> 00:25:04,338 అవును. 454 00:25:04,421 --> 00:25:07,674 బాధ గురించి ఒక ప్రదర్శన ఇచ్చేందుకు నేను సిద్ధమవుతున్నాను. 455 00:25:08,759 --> 00:25:11,637 బాధ మన అందరికీ అనుభవైకవేద్యమే కదా? 456 00:25:12,262 --> 00:25:15,140 మనకు ఇష్టమైనవారిని కోల్పోతాం. అంతకుమించి దేన్నో కోల్పోతాం. 457 00:25:17,017 --> 00:25:18,560 పాత ప్రపంచాన్ని మనం కోల్పోయాం. 458 00:25:19,228 --> 00:25:21,063 ఎన్నో వస్తువులు ఎలా ఉండేవో వాటిని కోల్పోయాం. 459 00:25:22,397 --> 00:25:24,983 కొత్త ప్రదర్శన గురించి చెప్పు మరి? 460 00:25:25,067 --> 00:25:26,318 అవును, అది చాలా బాగుంటుంది. 461 00:25:26,401 --> 00:25:28,779 అది ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించినది. 462 00:25:28,862 --> 00:25:31,657 చనిపోతున్న ఒక గొర్రె కోసం నేను దాన్ని చేశాను. 463 00:25:31,740 --> 00:25:32,950 నువ్వు చెబుతున్నది పెద్ద బెస్సీ గురించేనా? 464 00:25:33,033 --> 00:25:33,867 అవును. 465 00:25:34,618 --> 00:25:37,412 -వద్దు. -నేను మా బెస్సీకి ఎదురుగా కూర్చున్నాను, 466 00:25:38,580 --> 00:25:42,084 దాని కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాను, దాని మరణం గురించే ఆలోచిస్తున్నాను. 467 00:25:42,960 --> 00:25:46,421 గొర్రె నెమ్మదిగా చావబోతున్నట్టు ఊహించుకుంటున్నాను. 468 00:25:47,381 --> 00:25:50,217 దాని శరీరం నెమ్మదిగా కుళ్లిపోతోంది, 469 00:25:50,926 --> 00:25:52,970 దాని కనుగుడ్లు బయటకు వస్తున్నాయి 470 00:25:53,053 --> 00:25:55,597 జోసెఫ్ కనుగుడ్లు బయట పడినట్టుగా, 471 00:25:56,139 --> 00:25:57,391 ఒకదాని తర్వాత ఒకటిగా. 472 00:25:57,474 --> 00:25:59,476 అకస్మాత్తుగా బయటపడ్డాయి! 473 00:26:00,727 --> 00:26:05,315 మనం కూడా ఏదో ఒక రోజు చావాల్సిందే అనే వాస్తవికతతో నేను ధ్యానం చేస్తున్నా. 474 00:26:07,442 --> 00:26:08,944 దాన్ని చనిపోయిన గొర్రె అంటారు. 475 00:26:09,653 --> 00:26:12,239 దీన్ని చనిపోయిన నా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంకితం చేస్తున్నాను. 476 00:26:12,823 --> 00:26:14,867 ఇది చూసేందుకు నేను బతికి ఉంటాననే ఆశిస్తున్నాను. 477 00:26:16,159 --> 00:26:17,494 ఇక్కడ ప్రేక్షకులెవరూ లేరు. 478 00:26:17,578 --> 00:26:18,871 నాకు గొర్రెలంటే ఇష్టం. 479 00:26:19,538 --> 00:26:22,499 యుద్ధం జరుగుతున్న ఈ కాలం మనందరిలో ఎంతో మార్పు తెచ్చింది, కదా? 480 00:26:22,583 --> 00:26:26,420 అవును. అప్పుడప్పుడు మన తల్లిదండ్రులకు తెలిసిన ప్రపంచం కాకుండా, మనం మరో 481 00:26:26,503 --> 00:26:27,713 ప్రపంచంలోకి వెళ్లినట్లనిపిస్తుంది. 482 00:26:27,796 --> 00:26:29,173 ఒక విధంగా అది మంచిదేనేమో. 483 00:26:29,256 --> 00:26:30,757 ప్రపంచం ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది, కానీ... 484 00:26:32,176 --> 00:26:34,928 దాన్ని మంచిగా తీర్చిదిద్దేందుకు మనమంతా దారి వెతకాలి, 485 00:26:35,012 --> 00:26:36,597 అది చిన్నదయినా సరే. 486 00:26:36,680 --> 00:26:38,348 నేను దాన్ని విశ్వసిస్తాను, జార్జ్. 487 00:26:39,016 --> 00:26:42,436 నా దారేమిటో నాకు ఇంకా తెలియదు, కానీ దాన్ని త్వరలోనే కనుక్కుంటాను. 488 00:26:42,519 --> 00:26:44,688 నువ్వు ఇంటికి తిరిగి వచ్చాక... 489 00:26:44,771 --> 00:26:47,149 నేను చేసిన పనికి గర్విస్తావు. 490 00:26:47,232 --> 00:26:50,819 నేను తిరిగి వస్తాననే అనుకుంటున్నాను. 491 00:26:52,529 --> 00:26:54,364 హోప్ తన ఇంటిని 492 00:26:55,532 --> 00:26:57,367 గుమ్మాలతోనూ - 493 00:26:57,451 --> 00:26:59,995 ఇంటి వాసాలతోనూ కట్టలేదు - ఆ భవనానికి 494 00:27:00,078 --> 00:27:01,371 ఒక్క శిఖరం మాత్రమే ఉంది - 495 00:27:02,122 --> 00:27:03,707 కష్టాలున్నా ఆశావాదాన్ని వీడకు, జార్జ్. 496 00:27:03,790 --> 00:27:08,086 ఇప్పుడు నువ్వు కూడా చేరారు కాబట్టి, డ్రమ్ బీట్ పత్రిక కాపీని ఉచితంగా పంపిస్తా, 497 00:27:08,170 --> 00:27:11,006 ఇది యూనియన్ సమాచార పత్రిక, దీన్ని నేనూ, నా భర్త కలసి ప్రచురిస్తున్నాం 498 00:27:11,089 --> 00:27:13,800 అబ్రహాం లింకన్ సహాయంతో. 499 00:27:13,884 --> 00:27:14,885 ఆయన అధ్యక్షుడు. 500 00:27:14,968 --> 00:27:19,348 ఇదిగో, నా దగ్గర ఒక పత్రిక ఉంది. 501 00:27:19,431 --> 00:27:21,892 ఇందులో ఎమిలీ రాసిన కవిత కూడా ప్రచురింపబడింది. 502 00:27:22,976 --> 00:27:24,019 కవితా? 503 00:27:24,102 --> 00:27:27,189 అయ్యో, నా ఉద్దేశం ఎవరో అజ్ఞాత వ్యక్తి రాసినదని. 504 00:27:28,190 --> 00:27:29,525 నాకు అర్థం కాలేదు. 505 00:27:29,608 --> 00:27:33,529 ఎమిలీ, నువ్వు రాసినవాటిలో ఒక కవితను నేనే ఇచ్చాను. 506 00:27:34,196 --> 00:27:36,448 నువ్వు... ఇచ్చావా? 507 00:27:36,532 --> 00:27:39,785 అది పేరు లేకుండా ప్రచురించాలని చెప్పాను. నీకు అలాగే ఇష్టం కదా. 508 00:27:40,744 --> 00:27:44,289 నువ్వు రాసిన కవితలు ఎంతో గొప్పవి. 509 00:27:44,373 --> 00:27:47,251 అవి ఈ దేశానికి కూడా అవసరమేనని నాకు అనిపించింది. 510 00:27:50,712 --> 00:27:52,172 నన్ను మన్నించగలవా? 511 00:27:54,925 --> 00:27:58,720 హేయ్, దాన్ని మాకోసం చదివి వినిపించు. 512 00:27:59,471 --> 00:28:00,681 అవును, బాగుంటుంది. 513 00:28:00,764 --> 00:28:04,101 -ఎమిలీ రాసిన కవిత. -తను చదవదు. 514 00:28:04,184 --> 00:28:07,145 -ఆమె ఎప్పుడూ గట్టిగా చదవదు. -ఎమిలీ, చదువు, ఒక్కసారి. 515 00:28:07,229 --> 00:28:08,564 చదువుతావా, ఎమ్? 516 00:28:08,647 --> 00:28:10,440 చదివితే, అదే నాకు గొప్ప వీడ్కోలు అవుతుంది, 517 00:28:11,066 --> 00:28:12,901 నీ గొంతు నా మనసులో నిలిచిపోతుంది... 518 00:28:13,902 --> 00:28:14,903 నేను ఎక్కడ ఉన్నా. 519 00:28:18,949 --> 00:28:19,950 చదువుతాను. 520 00:28:21,368 --> 00:28:22,661 మీ అందరికోసం చదువుతాను. 521 00:28:26,707 --> 00:28:28,083 మరీ ముఖ్యంగా సూ కోసం. 522 00:28:35,799 --> 00:28:38,010 చాలా కొన్ని పక్షులు మాత్రమే - 523 00:28:41,221 --> 00:28:42,347 ఒకటో, రెండో - 524 00:28:43,390 --> 00:28:45,184 తిరిగి వచ్చే రోజులు ఇవి - 525 00:28:46,351 --> 00:28:48,020 రుతువులు మారలేదనే భ్రమతో వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాయవి. 526 00:28:51,064 --> 00:28:52,733 ఆకాశాలు మళ్లీ 527 00:28:53,358 --> 00:28:54,610 జూన్ కాలపు పాత 528 00:28:55,569 --> 00:28:57,613 మోసాలకు తెరతీసే రోజులు ఇవి - 529 00:28:59,448 --> 00:29:01,825 నీలం, బంగారు రంగుల్లో మెరుస్తూ భ్రమ కల్పిస్తాయి. 530 00:29:03,368 --> 00:29:06,038 ఏవి ఎన్ని మోసాలు చేసినా, తేనెటీగల్ని ఏవీ మోసం చేయలేవు. 531 00:29:06,121 --> 00:29:07,831 వాటి ఆమోదయోగ్యత 532 00:29:07,915 --> 00:29:09,875 నా నమ్మకాన్ని బలోపేతం చేస్తోంది. 533 00:29:10,876 --> 00:29:13,545 మారే రుతువులకు విత్తనాలే సాక్షి - 534 00:29:14,505 --> 00:29:17,883 గాలివాటులో వచ్చే మార్పు 535 00:29:17,966 --> 00:29:20,219 దుర్బలమైన ఆకును విసిరికొడుతుంది. 536 00:29:24,389 --> 00:29:26,517 మత సంస్కారం తెలిసిన వేసవి రోజులూ, 537 00:29:26,600 --> 00:29:29,102 పొగమంచులో జరిగే చివరి సమావేశమా - 538 00:29:29,186 --> 00:29:30,812 మరొక బిడ్డను చేరనీయండి - 539 00:29:36,944 --> 00:29:38,987 పవిత్రమైన చిహ్నాలను ఆస్వాదించనీయండి - 540 00:29:40,781 --> 00:29:42,824 రొట్టెనూ, మధురమైన వైన్ పానీయాన్నీ 541 00:29:46,078 --> 00:29:48,038 శుద్ధి చేయనీయండి! 542 00:29:54,086 --> 00:29:56,255 నా కవితను ప్రచురించినందుకు ధన్యవాదాలు. 543 00:29:57,840 --> 00:29:59,383 దాన్ని రాసినందుకు నీకే ధన్యవాదాలు చెప్పాలి. 544 00:30:04,221 --> 00:30:06,056 నీకు తెలుసుగా, ఇది... 545 00:30:07,724 --> 00:30:09,017 ఈ ఆనందం... 546 00:30:11,019 --> 00:30:13,021 ఏ కవితకూ సాటి రాదు. 547 00:30:36,211 --> 00:30:37,963 నేను రాసిన అన్ని అక్షరాల్లో 548 00:30:41,425 --> 00:30:43,468 దీనికంటే బాగా రాయగలిగింది ఏదీ లేదు - 549 00:30:49,600 --> 00:30:51,518 మృదువైన అక్షరాలు - 550 00:30:57,441 --> 00:30:59,693 మెత్తటి వాక్యాలు, 551 00:31:32,601 --> 00:31:35,562 ఎర్రటి కెంపులోని లోతులు, ఖాళీ కాని కాల్వలు, 552 00:31:37,231 --> 00:31:39,816 నీ చర్మం, పెదవి - 553 00:31:42,069 --> 00:31:44,321 నీది ఒక పిట్టలాంటి సొగసు - 554 00:31:46,532 --> 00:31:49,159 నన్ను గ్రోలనీ - 555 00:32:37,207 --> 00:32:39,209 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య