1 00:00:13,138 --> 00:00:15,057 సైనికుల కోసం మనం ఇలా కుట్టు కిట్లు 2 00:00:15,140 --> 00:00:16,517 తయారు చేయడం నాకు ఎంతో నచ్చింది. 3 00:00:17,643 --> 00:00:19,102 వీటితోపాటు చిరిగిపోయిన తమ యూనిఫారాలు 4 00:00:19,186 --> 00:00:20,979 కుట్టుకునేందుకు కావలసిన పనిముట్లను కూడా మనం ఇస్తున్నాం. 5 00:00:21,063 --> 00:00:22,064 అవును. 6 00:00:22,564 --> 00:00:25,817 అప్పుడప్పుడు, పరిస్థితులు తిరగబడవచ్చు. 7 00:00:26,401 --> 00:00:28,320 కొన్ని సందర్భాల్లో ఒక కాలు తీసేయవలసి రావచ్చు. 8 00:00:28,904 --> 00:00:32,741 మిగతా శరీరాన్ని కాపాడేందుకు దాన్ని పూర్తిగా తీసేయవలసి రావచ్చు. 9 00:00:33,617 --> 00:00:36,286 కాలు లేకపోయినా కూడా మనం ముందుకు సాగుతూనే ఉండాలి. 10 00:00:36,370 --> 00:00:38,455 అసలు మొదటినుంచీ రెండు కాళ్లు లేవనట్టుగానే మీరు నటించాలి. 11 00:00:41,041 --> 00:00:42,793 వీటిని ఇల్లాలి కిట్లు అంటారు, ఎమిలీ. 12 00:00:43,919 --> 00:00:46,338 నాకు ఒక అసలైన భర్త ఉంటే బాగుండేది. 13 00:00:46,922 --> 00:00:48,924 నేను ఎవరికైనా ఇల్లాలినైతే ఈ ఇల్లాలి కిట్లకు 14 00:00:49,007 --> 00:00:50,717 సరైన న్యాయం జరిగేది. 15 00:00:50,801 --> 00:00:52,302 నీకొక సంగతి చెప్పనా, వ్యక్తిగతంగా, 16 00:00:52,386 --> 00:00:55,722 మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని, భర్తలతో వెళ్లనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. 17 00:00:55,806 --> 00:00:57,432 నా కొడుకు నాతో తెగతెంపులు చేసుకున్నాడు, 18 00:00:57,516 --> 00:01:00,227 నా సొంత మనవడిని కూడా కలుసుకోనివ్వడు. 19 00:01:00,310 --> 00:01:04,730 ఆస్టిన్ అలా చేస్తున్నాడంటే నమ్మలేకున్నా. అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. 20 00:01:04,815 --> 00:01:07,442 చెప్పాలంటే, సూ నిస్సహాయంగా మారింది. 21 00:01:07,526 --> 00:01:10,821 తను నీతో అలా అని చెప్పిందా, ఎమిలీ? తనేమీ నిస్సహాయురాలు కాదు. 22 00:01:10,904 --> 00:01:12,406 లేదు. తను నాతో మాట్లాడటం లేదు. 23 00:01:12,489 --> 00:01:15,117 వాళ్ళని చూడకుండా ఉండటం వింతగా ఉంది. 24 00:01:15,200 --> 00:01:18,871 ఆస్టిన్, సూ పక్కనే ఉంటున్నారు, కానీ మానసికంగా దూరంగా ఉన్నారని అనిపిస్తోంది. 25 00:01:18,954 --> 00:01:20,330 అవును, అది చాలా బాధాకరం. 26 00:01:20,998 --> 00:01:24,334 కానీ ఇదంతా మన కుటుంబమేనని అంగీకరించక తప్పదమ్మా. 27 00:01:24,418 --> 00:01:27,045 మనం అవిటివాడైన సైనికుడిలాంటి వాళ్ళం. 28 00:01:28,338 --> 00:01:30,048 మనం ఈ పరిస్థితిని ఎదుర్కొని ముందుకు సాగాలి. 29 00:01:30,841 --> 00:01:31,842 అలాగే ఆశిద్దాం. 30 00:01:31,925 --> 00:01:33,343 కానీ నాకు నమ్మకం లేదు. 31 00:01:33,427 --> 00:01:34,303 అవును, నాకు తెలుసు. 32 00:01:34,928 --> 00:01:38,182 మనం ఆశను వదిలేయకూడదు. ఆశే మనకు సర్వస్వం. 33 00:01:39,183 --> 00:01:43,103 అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నా, ఆశతో జీవించడం పిచ్చిదనం కాదు. 34 00:01:43,687 --> 00:01:47,399 మహిళలూ, గుర్రపు బగ్గీ ఎక్కండి, మనం మానసిక రోగుల శరణాలయానికి వెళ్తున్నాం. 35 00:01:52,154 --> 00:01:54,072 డికిన్సన్ 36 00:01:54,156 --> 00:01:56,116 వసంత కాలం గొప్పతనం 37 00:02:02,915 --> 00:02:03,916 ఏమంటున్నారు? 38 00:02:03,999 --> 00:02:06,376 అవును, ఇవాళ డికిన్సన్లమంతా కలసి 39 00:02:06,460 --> 00:02:09,213 ఒక అద్భుతమైన సంస్థకు వెళ్తున్నాం, ఆ సంస్థవారు 40 00:02:09,295 --> 00:02:12,758 నాకు తాత్కాలికంగా ప్రతిష్ఠాత్మకమైన ట్రస్టీ హోదా ఇవ్వబోతున్నారు, 41 00:02:13,634 --> 00:02:15,928 నార్తాంప్టన్ మహిళా మానసిక రోగుల శరణాలయం. 42 00:02:16,011 --> 00:02:17,638 అవన్నీ రోత పుట్టించే ప్రదేశాలు. 43 00:02:17,721 --> 00:02:22,226 ఈ ఇంటి నుంచి బయటపడితే చాలు, ఉత్సాహం వస్తుంది, నాకు కొత్త చోటుకి వెళ్లాలని ఉంది. 44 00:02:22,309 --> 00:02:23,143 చూడు. 45 00:02:23,227 --> 00:02:25,604 నాన్నా, వాళ్లు నిన్ను ట్రస్టీని చేయబోతున్నారా? భలే బాగుంది. 46 00:02:25,687 --> 00:02:27,814 అవును. ఆ అవకాశం ఇక్కడే లభించినందుకు సంతోషంగా ఉంది, ఎమిలీ. 47 00:02:27,898 --> 00:02:29,816 మహిళల మానసిక ఆరోగ్యానికి 48 00:02:29,900 --> 00:02:33,070 ఎంతో ప్రాధాన్యం ఇస్తానని నేను తరచూ చెప్పడం నువ్వు వినే ఉంటావు. 49 00:02:33,153 --> 00:02:34,446 నువ్వు అలా అనడం నేనెప్పుడూ వినలేదే. 50 00:02:34,530 --> 00:02:37,658 నా కీర్తి ప్రతిష్ఠలు పెరగడానికి ఇదొక చక్కటి అవకాశం, 51 00:02:38,867 --> 00:02:40,619 ఈ పదవిని నేను చేపడితే, 52 00:02:40,702 --> 00:02:42,204 డికిన్సన్ పేరును ఎంతో గౌరవంగా 53 00:02:42,287 --> 00:02:45,249 ఉచ్చరించాలని ఈ పట్టణ ప్రజలంతా గుర్తుంచుకుంటారు. 54 00:02:45,332 --> 00:02:46,667 నాకు భలే నచ్చింది, నాన్నా. 55 00:02:46,750 --> 00:02:47,668 నిజంగా ఇది గొప్ప అవకాశం. 56 00:02:47,751 --> 00:02:52,005 మనమంతా మంచి ముద్ర వేసినంత కాలం, నాలాగే ఈ ట్రస్టీ హోదా కూడా ఎంతో బాగుంటుంది. 57 00:02:52,589 --> 00:02:56,093 తమ బోర్డు సభ్యులంతా నైతికంగా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినవారై ఉండాలనుకుంటారు, 58 00:02:56,176 --> 00:02:59,221 పైగా మిమ్మల్నందరినీ తప్పక తీసుకురావాలని ప్రధాన డాక్టర్ 59 00:02:59,304 --> 00:03:00,889 ప్రత్యేకంగా కోరారు. 60 00:03:00,973 --> 00:03:03,851 కాబట్టి, అమ్మాయిలూ, బగ్గీ ఎక్కండి! 61 00:03:03,934 --> 00:03:05,853 అవును! "పగలు పర్యటన." 62 00:03:06,395 --> 00:03:07,980 నేను వెళ్లి నా టోపీ తెచ్చుకుంటాను. 63 00:03:10,148 --> 00:03:11,233 ధన్యవాదాలు. 64 00:03:11,650 --> 00:03:13,652 నాన్నా, ఆ ట్రస్టీ హోదాకు మిమ్మల్ని మేమే తీసుకెళ్తాం. 65 00:03:13,735 --> 00:03:15,487 మీకేం కావాలంటే దానికోసం, నన్ను అడగండి. 66 00:03:15,571 --> 00:03:17,489 ఇప్పుడే గుర్రపు బగ్గీని తీసుకొస్తాను. పది నిమిషాల్లో సిద్ధంగా ఉండండి. 67 00:03:20,826 --> 00:03:23,787 ఎమిలీ, ఇందులో ఏదో అనుమానం ఉంది. 68 00:03:25,414 --> 00:03:26,415 ఏంటి నీ ఉద్దేశం? 69 00:03:26,498 --> 00:03:27,666 ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? 70 00:03:27,749 --> 00:03:30,002 మీ నాన్న నన్ను ఆ శరణాలయంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 71 00:03:30,085 --> 00:03:31,461 అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? 72 00:03:31,545 --> 00:03:34,298 పందొమ్మిదవ శతాబ్దంనాటి ఎత్తుగడ ఇది. 73 00:03:34,381 --> 00:03:36,091 భార్యతో విసిగిపోయారా? పెళ్లిపై మొహం మొత్తిందా? 74 00:03:36,175 --> 00:03:38,177 మీ పుట్టిన రోజున ఆమె తాగి తందనాలాడిందా, 75 00:03:38,260 --> 00:03:40,179 పెళ్లి రోజు డ్రెస్ వేసుకుని, మెట్లపై నుంచి పడిపోయిందా? 76 00:03:40,262 --> 00:03:41,889 అయితే ఆమె పిచ్చిది, పిచ్చాసుపత్రిలో పడేయండి. 77 00:03:41,972 --> 00:03:43,932 అబ్బా. నాన్న ఎప్పుడూ అలా చేయరమ్మా. 78 00:03:44,016 --> 00:03:46,310 మీ నాన్న చాలా సాంప్రదాయబద్ధమైనవాడు, ఎమిలీ. 79 00:03:46,894 --> 00:03:49,104 సరే చూద్దాం, కానీ ఇదంతా నాకు ఏమీ బాగోలేదు. 80 00:03:49,188 --> 00:03:51,231 అమ్మా, నువ్వు రావలసిందే. 81 00:03:51,315 --> 00:03:53,692 నాన్న ఎప్పటికీ నిన్ను అక్కడ చేర్పించడు, ఆయనకు మనమందరం ఎంతో ముఖ్యం. 82 00:03:54,860 --> 00:03:56,153 సరే, నేను చెబుతున్నది విను. 83 00:03:56,236 --> 00:03:59,198 నువ్వు లేకుండా నేను ఆ శరణాలయం నుంచి బయటకు రాను. 84 00:03:59,281 --> 00:04:00,824 -ఒట్టు? -అవును. 85 00:04:00,908 --> 00:04:02,451 ఇక పద, వెళ్లి బగ్గీ ఎక్కు. 86 00:04:02,534 --> 00:04:04,411 పదండి! ఈ రోజెంతో ఆహ్లాదంగా ఉంది! 87 00:04:04,494 --> 00:04:06,538 నాకు దగ్గరగా ఉండు, ఎమిలీ. దగ్గరగా ఉండు. 88 00:04:07,372 --> 00:04:08,874 అదీ సంగతి. 89 00:04:27,059 --> 00:04:28,727 తల పైకెత్తి చూడండి, అమ్మాయిలూ, ఆయన ప్రధాన డాక్టర్. 90 00:04:28,810 --> 00:04:30,103 -అందరూ, నవ్వండి. -సరే. 91 00:04:30,187 --> 00:04:32,814 ఎడ్వర్డ్ డికిన్సన్. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. 92 00:04:32,898 --> 00:04:35,025 హలో డాక్టర్, ఆ సంతోషం నాది. 93 00:04:35,108 --> 00:04:37,194 లేదు. లేదు. లేదు. నిజంగా నేను మీకు వీరాభిమానిని. 94 00:04:37,277 --> 00:04:41,865 "సముచిత స్థానంలో మహిళలు" అంటూ మీరు రాసిన వ్యాసం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. 95 00:04:41,949 --> 00:04:43,158 అది మీ అభిమానం. 96 00:04:43,242 --> 00:04:46,036 మీ కుటుంబంలోని మహిళల్ని కూడా తీసుకువచ్చారు కదా. 97 00:04:46,119 --> 00:04:49,248 అవును. ఈమె నా భార్య, ఎమిలీ. 98 00:04:49,331 --> 00:04:51,625 -ఈమె నా కూతురు, ఎమిలీ. -హలో. 99 00:04:51,708 --> 00:04:53,001 ఇక ఈమె... 100 00:04:54,962 --> 00:04:56,839 -నా మరో కూతురు. -లవీనియా. 101 00:04:56,922 --> 00:04:59,216 ఈ పర్యటన కోసం వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవునా, అమ్మాయిలూ? 102 00:04:59,299 --> 00:05:01,385 నాకూ ఎంతో ఉత్కంఠగా ఉంది. 103 00:05:01,468 --> 00:05:04,054 డాక్టర్, నాకు పూలంటే ఇష్టం. మీరెన్నో పూల మొక్కలు నాటించారు. 104 00:05:04,137 --> 00:05:06,598 ఈ వసంత కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది, కదా? 105 00:05:06,682 --> 00:05:09,810 పూలు పాత మిత్రుల్లా తిరిగి వస్తాయి. వాటిని మిస్సయ్యామన్న సంగతి కూడా మనకు తెలియదు. 106 00:05:11,270 --> 00:05:14,273 అయితే వీటన్నింటితో మీరు బిజీగా గడుపుతారన్నమాట. 107 00:05:14,356 --> 00:05:17,609 లేదు, ఎమిలీ ఎంతో విలక్షణమైనది. 108 00:05:17,693 --> 00:05:18,944 అలాగే కనిపిస్తోంది. 109 00:05:19,027 --> 00:05:20,821 నాకు పూలంటే చాలా ఇష్టం. 110 00:05:21,822 --> 00:05:24,700 నాకు కూడా పూలంటే సహజంగానే ఇష్టం. 111 00:05:26,451 --> 00:05:29,079 మంచిది, మనం పర్యటన మొదలు పెడదామా? 112 00:05:29,162 --> 00:05:30,873 అలాగే, ఇదంతా సరదాగా ఉంటుంది, అవునా? 113 00:05:30,956 --> 00:05:31,957 పదండి. 114 00:05:34,585 --> 00:05:35,919 ప్రియమైన నేస్తం... 115 00:05:36,628 --> 00:05:39,715 యుద్ధమనేది నాకు ఒక అసాధారణమైన చోటుగా అనిపిస్తోంది. 116 00:05:41,925 --> 00:05:43,093 "అసాధారణం" 117 00:05:46,388 --> 00:05:48,265 సరైన పదం. 118 00:05:49,766 --> 00:05:51,393 నన్ను రమ్మన్నారట, కల్నల్? 119 00:05:51,476 --> 00:05:54,062 అవును, అవును! సోదరా, రా. 120 00:05:59,943 --> 00:06:01,904 ఈ ఉదయం ఎలా గడిచింది, సోదరా? 121 00:06:02,696 --> 00:06:06,033 బాగుంది. నేను పాఠం చెప్పడం మొదలు పెట్టబోతుండగా, 122 00:06:06,116 --> 00:06:07,618 మీరు రమ్మన్నారని కబురొచ్చింది. 123 00:06:07,701 --> 00:06:10,245 "రమ్మనడం" కంటే "ఆహ్వానించడం" అనే పదం వాడితే బాగుంటుందేమో? 124 00:06:10,329 --> 00:06:12,039 అది నీకే వదిలేస్తున్నాను. 125 00:06:12,122 --> 00:06:13,832 -మామూలుగా ఉండు. -సరే. 126 00:06:14,833 --> 00:06:15,959 ఏంటి విషయం? 127 00:06:17,753 --> 00:06:19,421 నాకు నీతో అవసరం పడింది. 128 00:06:19,505 --> 00:06:21,548 ఇది మీ టీచింగ్ కు సంబంధించిన పని కాదు. 129 00:06:21,632 --> 00:06:23,425 మీరు ఆ పని చేయగలరా? మీకు వీలవుతుందా? 130 00:06:23,509 --> 00:06:25,844 అది మీరు చెప్పే పనిని బట్టి ఉంటుంది. 131 00:06:27,221 --> 00:06:28,222 సరే. 132 00:06:28,305 --> 00:06:30,307 సరే, విషయం చెబుతున్నాను. 133 00:06:32,142 --> 00:06:34,353 సైనికులకు యూనిఫారం తనిఖీ జరగబోతోంది. 134 00:06:34,436 --> 00:06:38,106 యూనిఫారం తనిఖీయా? వాళ్ళకు సరైన యూనిఫారాలు కూడా లేవుగా. 135 00:06:38,190 --> 00:06:40,651 నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈ తనిఖీ అంతా ఒక పనికిమాలిన విషయం. 136 00:06:41,652 --> 00:06:44,530 కానీ అనుకున్నది సాధించేందుకు మనం ఇది చేయక తప్పదు. 137 00:06:44,613 --> 00:06:45,572 అనుకున్నదా? 138 00:06:45,656 --> 00:06:49,868 యూనియన్ సైనికుల్లాగ వీళ్లకు కూడా పూర్తి అనుమతి లభించడం. 139 00:06:52,120 --> 00:06:53,622 మొట్టమొదటి దక్షిణ కరొలినా సైనిక దళాన్ని చట్టబద్ధమైన దళంగా 140 00:06:53,705 --> 00:06:56,375 జనరల్ శాక్స్టన్ ఎంత ఎక్కువగా పరిగణిస్తే, 141 00:06:56,458 --> 00:06:58,877 పైఅధికారులపై ఆయన అంత ఎక్కువగా ఒత్తిడి తీసుకురాగలుగుతాడు. 142 00:06:58,961 --> 00:07:00,170 లింకన్ వరకూ అన్నమాట. 143 00:07:00,754 --> 00:07:02,506 ఒక్కసారి తనిఖీ చేస్తే చాలు, పరిస్థితిలో మార్పు వస్తుంది. 144 00:07:02,589 --> 00:07:06,260 కాబట్టి, వాళ్లు ఈ తనిఖీకి ఒప్పుకోవడం తప్పనిసరి, నీకు అర్ధమైందనుకుంటా? 145 00:07:06,343 --> 00:07:09,137 వాళ్లు పరిశుభ్రంగా, హుషారుగా కనిపించాలి. 146 00:07:09,221 --> 00:07:11,849 వాళ్లను ఈ సాయంత్రం తనిఖీ చేసేందుకు నేను అక్కడికి వస్తాను. 147 00:07:12,766 --> 00:07:13,767 సరే. 148 00:07:15,394 --> 00:07:16,562 మీరు చెప్పింది విన్నాను. 149 00:07:18,230 --> 00:07:19,940 నేను చేయగలిగింది చేస్తాను. 150 00:07:20,023 --> 00:07:21,024 మంచిది. 151 00:07:21,650 --> 00:07:23,151 ఈ ప్రక్రియ పనిచేస్తుంది. 152 00:07:23,902 --> 00:07:24,987 నాకు అలా అనిపిస్తోంది. 153 00:07:29,491 --> 00:07:32,786 ఇది మన విశాలమైన హాలు. 154 00:07:32,870 --> 00:07:35,789 ఇక్కడ అద్బుతమైన కళాత్మకతను మన అమ్మాయిలు చూడవచ్చు. 155 00:07:35,873 --> 00:07:39,334 మానసిక అస్వస్థత గురించి మేం ప్రగతిశీల అవగాహన కలిగి ఉంటాం, 156 00:07:39,418 --> 00:07:42,546 స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల మానసిక వ్యాధులు, 157 00:07:42,629 --> 00:07:49,553 అలసట, అతిగా చదవటం, రుతుచక్రం, మందకొడితనం, పెళ్ళికాకపోవడం వంటివి... 158 00:07:49,636 --> 00:07:51,471 పెళ్లి కాకపోవడం కూడా మానసిక రోగమేనా? 159 00:07:52,472 --> 00:07:53,932 అది నిజమే అనుకుంటా. 160 00:07:54,808 --> 00:07:59,980 తీవ్రమైన ఉన్మాదం, దీర్ఘకాలిక ఉన్మాదం. అధిక కాముకత, కుంగుబాటు. 161 00:08:00,063 --> 00:08:02,191 దీన్ని సాధారణంగా బాధ అంటారు. 162 00:08:02,274 --> 00:08:04,902 ఈ మధ్య తన సోదరి మరణం పట్ల మిసెస్ డికిన్సన్ 163 00:08:04,985 --> 00:08:06,612 ఎంతో విషాదంలో మునిగిపోయింది. 164 00:08:08,614 --> 00:08:12,409 ఎడ్వర్డ్, నేనేం బాధపడటం లేదు. మీరే అబద్ధం చెబుతున్నారు! 165 00:08:12,492 --> 00:08:15,954 నా ఏకైక సోదరి గురించి నేను బాధపడుతున్నానా? అలాంటిదేం లేదు! 166 00:08:16,038 --> 00:08:18,957 నాకెలాంటి బాధా లేదు. ఆమెకు మోక్షం లభించింది. 167 00:08:20,250 --> 00:08:21,251 ఇలా రండి. 168 00:08:36,475 --> 00:08:37,601 అది మీరు విన్నారా? 169 00:08:37,683 --> 00:08:38,684 ఏంటి వినడం? 170 00:08:42,272 --> 00:08:43,815 బహుశా నా తలలో అలా అరుపు వినిపించిందేమో. 171 00:08:43,899 --> 00:08:46,818 అలా నీకు తరచూ అనిపిస్తుందా, తలలో ఏవేవో వినిపిస్తూ ఉంటాయా? 172 00:08:46,902 --> 00:08:51,114 అవును, ఎమిలీకి ఊహాశక్తి చాలా ఎక్కువ. ఆ విషయంలో ఆమె ప్రతిభావంతురాలు. 173 00:08:51,615 --> 00:08:52,616 ఆసక్తిగా ఉంది. 174 00:08:53,784 --> 00:08:54,910 రండి. 175 00:08:59,289 --> 00:09:00,832 ఈ ప్రదేశం గురించి నాకు ఏదో అనుమానం కలుగుతోంది. 176 00:09:01,375 --> 00:09:05,295 ఎమిలీ, కుటుంబమంతా కలిసి వచ్చినప్పుడైనా కాస్త సంతోషంగా ఉండవచ్చుగా? 177 00:09:05,379 --> 00:09:07,631 నాన్నకు మంచి పేరు రావడంలో నువ్వు సహాయ పడతావని అనుకున్నాను. 178 00:09:07,714 --> 00:09:09,842 అలాగే. కానీ ఇక్కడేదో అనుమానాస్పదమైన 179 00:09:09,925 --> 00:09:12,094 వ్యవహారం జరుగుతోందని నాన్న తెలుసుకోవాలి. 180 00:09:12,719 --> 00:09:14,304 ప్రవేశించవద్దు 181 00:09:14,388 --> 00:09:16,181 డాక్టర్, ఈ తలుపు దేనికి? 182 00:09:18,475 --> 00:09:19,893 ఇది మరో గదిలోకి దారి తీస్తుంది. 183 00:09:20,519 --> 00:09:22,521 అలాగా, అది ఏం గది? 184 00:09:22,604 --> 00:09:26,859 ఏకాంతం అవసరమైన రోగులకోసం ఆ గదిని కేటాయించాం. 185 00:09:26,942 --> 00:09:30,153 అలాగా, అది దేనికో నీకు అర్ధమయ్యే ఉంటుంది, ఎమిలీ? 186 00:09:30,237 --> 00:09:32,906 ఆమెకు ఎప్పుడూ ఏకాంతంగా ఉండాలనే కోరిక ఎక్కువ. 187 00:09:33,532 --> 00:09:34,533 ఇప్పుడూ ఆమెకు అలానే ఉందా? 188 00:09:37,452 --> 00:09:41,999 ఎడ్వర్డ్, మీతో కాస్త ప్రైవేటుగా మాట్లాడాలి. 189 00:09:42,082 --> 00:09:43,750 తప్పకుండా, అలాగే. 190 00:09:43,834 --> 00:09:45,085 మరి వీళ్ల సంగతి? 191 00:09:45,169 --> 00:09:47,838 మరేం పర్వాలేదు. వాళ్లని కనిపెడుతూనే ఉంటాం. 192 00:09:47,921 --> 00:09:49,631 ఇక్కడ అంతటా కళ్లున్నాయి. 193 00:09:51,383 --> 00:09:55,804 ఊరికే అడుగుతున్నా, ఈ భవనంలో పేర్లు చెక్కించడంపై మీ విధానం ఏమిటి? 194 00:09:58,515 --> 00:10:00,893 ఆగు. అమ్మ ఎక్కడికి వెళ్లింది? 195 00:10:03,854 --> 00:10:06,190 అబ్బో. ఈ గది చాలా బాగుంది. 196 00:10:07,149 --> 00:10:08,066 నేను మీకు ఏం సాయం చేయగలను? 197 00:10:08,859 --> 00:10:10,027 నన్ను క్షమించాలి. 198 00:10:10,110 --> 00:10:12,404 -మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు... -జోక్ చేస్తున్నారా? 199 00:10:12,487 --> 00:10:15,908 నాకు ఇక్కడ ఇబ్బందేమీ లేదు. నేను ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. 200 00:10:15,991 --> 00:10:17,159 నిజంగా? 201 00:10:17,242 --> 00:10:19,912 మహిళలను మానసిక రోగుల శరణాలయంలో చూసుకున్నంత బాగా ప్రపంచంలో 202 00:10:19,995 --> 00:10:21,830 మరెక్కడా చూడరు. 203 00:10:22,581 --> 00:10:27,085 ఇక్కడ వంట పని, శుభ్రం చేయడం, తలగడలు మార్చడం వంటివన్నీ సిబ్బందే చూసుకుంటారు. 204 00:10:27,169 --> 00:10:28,504 ఇదొక స్వర్గంలాంటిది. 205 00:10:29,505 --> 00:10:33,133 గోడ పత్రిక. ఆ గోడ పత్రికలో చాలా మందే ఉన్నారు, డాక్టర్! 206 00:10:37,679 --> 00:10:39,932 డాక్టర్లు కూడా ఎంతో బాగా చూసుకుంటారు, ఆయనలాగే. 207 00:10:40,766 --> 00:10:41,767 ఆగండి. 208 00:10:42,392 --> 00:10:43,644 అయితే మీకు... 209 00:10:43,727 --> 00:10:44,853 పిచ్చి లేదా? 210 00:10:44,937 --> 00:10:47,064 లేదు. మీకంటే ఎక్కువ పిచ్చేమీ లేదు. 211 00:10:47,606 --> 00:10:50,317 విశ్రాంతిగా ఉంటుందని, ఆరోగ్యపరంగా పుంజుకుందామని ఇక్కడ చేరానంతే. 212 00:10:50,400 --> 00:10:54,404 అయితే మీరు కేవలం విశ్రాంతి తీసుకుంటారంతేనా, ఎవరూ ఏ పనీ చెప్పరా? 213 00:10:54,905 --> 00:10:55,906 లేదు. 214 00:10:58,242 --> 00:11:00,160 డాక్టర్. డాక్టర్! 215 00:11:00,869 --> 00:11:03,163 ఈ గోడ పత్రికలో సరదా గొలిపే విషయం ఒకటుంది! 216 00:11:06,333 --> 00:11:10,754 హేయ్! అది నా ఊత పదం. నువ్వొకటి ఎంచుకో. 217 00:11:16,426 --> 00:11:18,470 నువ్వు వెళ్లి అమ్మని వెతుకు. నేను ఈ లోపల ఏముందో చూసి వస్తాను. 218 00:11:37,322 --> 00:11:39,157 ఓహో, భలే బాగుంది. 219 00:11:41,743 --> 00:11:43,745 ఇది పెద్దగా భయపెట్టడం లేదు. 220 00:12:03,682 --> 00:12:05,601 అమ్మా, ఒట్టు, నువ్వు కనిపించకపోతే, 221 00:12:05,684 --> 00:12:08,020 తప్పిపోయావని ఆస్పత్రి వారికి ఫిర్యాదు చేస్తానంతే. 222 00:12:08,812 --> 00:12:11,690 హాయ్. మీరొక మహిళను చూశారా... 223 00:12:13,358 --> 00:12:16,695 క్షమించు. మిమ్మల్ని విసిగించను. 224 00:12:16,778 --> 00:12:20,282 పర్వాలేదు. ఎవరైనా మాట్లాడితేనే నాకు సంతోషంగా ఉంటుంది. 225 00:12:20,365 --> 00:12:21,950 నా పేరు ఫ్లోరెన్స్. 226 00:12:24,161 --> 00:12:27,206 నిజంగా? మీకు అంతరాయం కలిగించాలని లేదు. 227 00:12:27,289 --> 00:12:31,210 లేదు. నేనెప్పుడూ ఏడుస్తూనే ఉంటాను. తీవ్రమైన విచారం అనే రోగంతో బాధపడుతున్నాను. 228 00:12:31,293 --> 00:12:35,255 నేను ఏడవడం ఆపుకోలేను. 229 00:12:36,715 --> 00:12:39,468 కనీసం అదే మీకు ఓదార్పేమో. 230 00:12:39,551 --> 00:12:42,429 రెండు నెలల క్రితం నా ప్రియుడు యుద్ధంలో చనిపోయాడు 231 00:12:42,513 --> 00:12:44,389 అప్పటినుంచీ ఇలాగే ఏడుస్తున్నాను. 232 00:12:45,766 --> 00:12:49,770 నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు పడుతున్న బాధ గురించి 233 00:12:49,853 --> 00:12:53,607 నాకు 1000% తెలుసు, నన్ను నమ్మండి. 234 00:12:54,358 --> 00:12:57,319 అతని మృతదేహం యుద్ధభూమిలో పడి ఉండగా నేను ఫోటో తీశాను. 235 00:12:58,487 --> 00:13:01,573 నన్ను కౌగలించుకున్న ఆ చేతులు. 236 00:13:01,657 --> 00:13:04,451 -నన్ను ముద్దు పెట్టుకున్న ఆ పెదాలు. -అవును. 237 00:13:05,118 --> 00:13:10,123 ఓ దేవుడా, అతని జుట్టు. అతనికి భలే జుట్టు ఉండేది. 238 00:13:11,750 --> 00:13:13,085 అతని పేరేంటి? 239 00:13:13,669 --> 00:13:15,796 ఈ ప్రపంచంలోనే అందరికంటే తియ్యటి పేరు అతనిది. 240 00:13:17,673 --> 00:13:20,259 జోసెఫ్ లైమన్. 241 00:13:21,468 --> 00:13:22,636 జోసెఫ్ నీ ప్రియుడా? 242 00:13:23,220 --> 00:13:25,889 అవకాశం ఉంటే అతన్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. 243 00:13:25,973 --> 00:13:28,308 అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? 244 00:13:28,392 --> 00:13:30,102 అలాంటిదే. 245 00:13:30,185 --> 00:13:31,562 ఏంటీ? 246 00:13:31,645 --> 00:13:35,899 నేను జోసెఫ్ ని మనస్ఫూర్తిగా ప్రేమించినా... 247 00:13:35,983 --> 00:13:37,067 చెప్పు. 248 00:13:37,150 --> 00:13:40,195 ...అతని హృదయంలో మాత్రం మరొకరు ఉండేవారు. 249 00:13:41,530 --> 00:13:45,075 ఎవరామె? ఆ జిత్తులమారి. అబిగేయిల్? వర్జీనియా? 250 00:13:45,158 --> 00:13:48,328 కాదు. అమ్హెర్స్ట్ కు చెందిన ఎవరో సోకులాడి. 251 00:13:48,954 --> 00:13:50,497 అతను ఆమెను విన్నీ అని పిలిచేవాడు. 252 00:13:52,457 --> 00:13:53,458 నిజంగా చెబుతున్నావా? 253 00:13:55,752 --> 00:13:56,920 అది చాలా దారుణం. 254 00:13:59,131 --> 00:14:00,132 నాకు తెలుసు. 255 00:14:00,716 --> 00:14:03,760 కానీ, ఏదిఏమైనా, అతను చనిపోయాడు కదా. 256 00:14:04,845 --> 00:14:05,846 దేవుడా. 257 00:14:07,139 --> 00:14:08,473 అవును, నిజమే కదా. 258 00:14:24,072 --> 00:14:25,199 ఏం చేస్తున్నావు? 259 00:14:26,366 --> 00:14:28,035 నా ఆఫీసుని సర్దుతున్నాను. 260 00:14:28,118 --> 00:14:30,829 సొంతంగా ఒక లా సంస్థను పెడుతున్నానని చెప్పాను, గుర్తుంది కదా. 261 00:14:31,538 --> 00:14:33,874 నువ్వు ఇంత సీరియస్ గా ప్రయత్నిస్తావని నేను అనుకోలేదు. 262 00:14:33,957 --> 00:14:36,210 అవును. నేను దానికి కొత్త పేరు కూడా ఆలోచించాను. 263 00:14:36,835 --> 00:14:38,170 "విశ్వాసం." 264 00:14:38,253 --> 00:14:40,464 పేరు చివరన "బహద్దూర్" అనో లేక "మరియు కొడుకు" అనో ఉండకూడదు. 265 00:14:40,547 --> 00:14:43,091 "విశ్వాసం", అంతే. 266 00:14:44,343 --> 00:14:47,262 నేను దీనిపై సీరియస్ గానే ఉన్నాను. 267 00:14:47,346 --> 00:14:50,349 అయితే నాకు విడాకులు ఇవ్వడంపైనా, బాబు బాధ్యతలు తీసుకోవడంపైనా కూడా 268 00:14:50,432 --> 00:14:53,060 అంతే సీరియస్ గా ఉన్నావనుకుంటా. 269 00:14:53,143 --> 00:14:54,144 అవును. 270 00:14:55,395 --> 00:14:58,273 ఆ దిశగా పేపర్లు కూడా సిద్ధం చేస్తున్నాను. 271 00:14:58,357 --> 00:15:00,150 నువ్వు ఆ పని చేయకపోతే బాగుంటుంది. 272 00:15:02,027 --> 00:15:03,779 నువ్వు నన్ను వదిలి వెళ్ళకు, ఆస్టిన్. 273 00:15:05,364 --> 00:15:06,657 నేనెందుకు ఉండాలి? 274 00:15:07,199 --> 00:15:10,827 మనం సాంప్రదాయ విరుద్ధంగా పెళ్లి చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. 275 00:15:12,162 --> 00:15:13,330 అది చాలా చిన్న మాట. 276 00:15:13,413 --> 00:15:17,417 కాబట్టి, మనం తల్లిదండ్రులుగా కూడా సాంప్రదాయ విరుద్ధంగానే ఉందాం. 277 00:15:18,001 --> 00:15:19,002 అంటే? 278 00:15:19,086 --> 00:15:21,839 నువ్వూ నాతో కలసి బాబుని పెంచు. 279 00:15:23,340 --> 00:15:27,386 మా నాన్నలాగ నువ్వు ఒక తండ్రిగా బిడ్డకు దూరంగా ఉండాలని నేను అనుకోవట్లేదు. 280 00:15:27,469 --> 00:15:29,555 ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు క్షమించు, కానీ, 281 00:15:29,638 --> 00:15:34,434 నన్ను నమ్మి, ఒక అవకాశం ఇస్తావని ఆశిస్తున్నా. 282 00:15:40,899 --> 00:15:41,900 ధన్యవాదాలు. 283 00:15:43,527 --> 00:15:44,778 నీ ఆలోచన నాకు నచ్చింది. 284 00:15:49,283 --> 00:15:54,580 సరే, అక్కడ ఇంకా పేరు పెట్టని బాబు ఉన్నాడు, వాటికి శుభ్రమైన డయపర్ వేయాలి. 285 00:15:54,663 --> 00:15:55,664 పద మరి. 286 00:16:05,757 --> 00:16:06,925 డికిన్సన్. 287 00:16:07,009 --> 00:16:09,761 మీకు ట్రస్టీహోదాపై ఆసక్తి ఉంది కనుక, 288 00:16:09,845 --> 00:16:12,139 నా వైద్య సలహాని కూడా మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను, అవునా? 289 00:16:12,222 --> 00:16:13,223 తప్పకుండా, డాక్టర్. 290 00:16:13,307 --> 00:16:15,726 అయితే, నేను చేసిన రోగ నిర్ధారణను కూడా మీరు విశ్వసించాలి మరి, 291 00:16:16,268 --> 00:16:18,145 అది మీ కూతురు ఎమిలీ గురించి... 292 00:16:19,313 --> 00:16:20,314 ఆమెకు పిచ్చి. 293 00:16:21,690 --> 00:16:23,066 ఆమె పిచ్చిది కాదు. 294 00:16:23,942 --> 00:16:25,736 కాదు. తను ఒక కవయిత్రి. 295 00:16:25,819 --> 00:16:28,530 దేవుడా. ఏం జరుగుతోందో మీరు చూడలేదా? 296 00:16:29,364 --> 00:16:31,658 ఇంట్లో ఎవరికైనా పిచ్చి ఉంటే, దాని ప్రభావం 297 00:16:32,284 --> 00:16:34,244 మొత్తం కుటుంబం అంతటిపైనా పడుతుంది. 298 00:16:34,953 --> 00:16:36,455 కొంత కాలం ఆమెను ఇక్కడ ఉండనివ్వండి. 299 00:16:37,039 --> 00:16:40,250 మా వినూత్నమైన... వైద్య పద్ధతులను ఆమె పొందనివ్వండి 300 00:16:40,334 --> 00:16:41,335 అన్నింటికీ మించి, 301 00:16:41,919 --> 00:16:44,463 ఈ తూర్పు తీరంలోనే మాది అత్యుత్తమమైన మహిళా మానసిక రోగుల శరణాలయం. 302 00:16:45,589 --> 00:16:47,382 అందుకు మీరు రాతపూర్వకంగా అనుమతి ఇస్తే చాలు. 303 00:17:11,031 --> 00:17:14,492 ఒక్క అడుగు ముందుకు వేశావంటే ఈ కత్తితో నా బృహద్ధమనిని తెంపుకుంటా! 304 00:17:15,117 --> 00:17:16,578 బృహద్ధమని నీ ఛాతీలో ఉంటుంది. 305 00:17:16,662 --> 00:17:17,829 నీకు తెలిసినందుకు సంతోషం. 306 00:17:28,214 --> 00:17:29,883 తను ఆబీయా? 307 00:17:29,967 --> 00:17:32,845 చివరిసారి, నాలుక కింద నేను టాబ్లెట్లు దాయలేదు. 308 00:17:32,928 --> 00:17:33,804 ఆబీ. 309 00:17:34,388 --> 00:17:35,556 ఆగు, ఎమిలీ డికిన్సన్? 310 00:17:36,139 --> 00:17:40,644 నా స్నేహితురాలు నన్ను చూసేందుకు వచ్చిందా? నాకు చాలా సంతోషంగా ఉంది! 311 00:17:40,727 --> 00:17:42,855 ఆబీ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావా? 312 00:17:42,938 --> 00:17:46,275 బ్రహ్మాండంగా ఉన్నాను! అయితే, నాకేమీ కనిపించడం లేదు. 313 00:17:46,358 --> 00:17:49,361 ఆ నర్సు నా కళ్లద్దాలు తీసేసుకుంది. వాటితో నాకు నేను హాని చేసుకుంటానట. 314 00:17:49,444 --> 00:17:50,737 నువ్వెలా ఉన్నావు? 315 00:17:50,821 --> 00:17:52,406 అసలు ఇక్కడికి ఎలా వచ్చి పడ్డావు? 316 00:17:52,990 --> 00:17:54,992 ఇక్కడికి ఎలా వచ్చావు? 317 00:17:55,075 --> 00:17:57,119 నేను యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లాను. వాళ్లేమో నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు. 318 00:17:57,202 --> 00:17:58,537 నేను మహిళనని వాళ్లు సహించలేకపోయారు. 319 00:17:58,620 --> 00:18:00,789 నా భర్త, మినిస్టర్ డేనియల్ బ్లిస్, నన్ను ఇక్కడ చేర్పించాడు. 320 00:18:00,873 --> 00:18:03,417 కానీ ఇక్కడ బాగుంది, ఎందుకంటే నాకు కొత్త ప్రియుడు దొరికాడు. 321 00:18:04,251 --> 00:18:06,211 నీ భర్త ఇక్కడ ఎందుకు చేర్పించాడు? 322 00:18:06,295 --> 00:18:07,296 నేను తోటి మహిళలతో ఉద్యమం చేస్తూ, 323 00:18:07,379 --> 00:18:10,883 జెండాను తగులబెట్టానట, అందుకే చేర్పించానని నా భర్త చెప్పాడు. 324 00:18:10,966 --> 00:18:15,053 నా నిర్ణయాలతో అతను "సంతోషంగా లేడు." నేను "అందరిపైనా కోప్పడుతున్నానట." 325 00:18:15,554 --> 00:18:18,307 నేను గాల్లో చేతులూపుతూ సైగలు చేస్తున్నా, కానీ అవేమిటో నువ్వు చెప్పలేవు. 326 00:18:18,390 --> 00:18:19,641 ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు? 327 00:18:20,225 --> 00:18:21,435 మంచి ప్రశ్న. 328 00:18:22,102 --> 00:18:24,438 వాళ్లు రోజులు లెక్కపెట్టనివ్వరు, 329 00:18:24,521 --> 00:18:26,315 చదవనివ్వరు, రాయనివ్వరు. 330 00:18:26,398 --> 00:18:28,567 ఈ మాత్రలు తప్ప తినేందుకు ఏమీ ఇవ్వరు కూడా. 331 00:18:28,650 --> 00:18:31,195 ఈ మాత్రలు భలే ఉంటాయి! ఇవి తింటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. 332 00:18:31,278 --> 00:18:35,490 మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి! 333 00:18:35,574 --> 00:18:36,575 పైగా ఇక్కడ పరిశుభ్రత లేదని... 334 00:18:38,076 --> 00:18:39,077 ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 335 00:18:39,995 --> 00:18:42,247 ఇక్కడ పరవాలేదు. నాకు కొందరు స్నేహితులు కూడా ఉన్నారు! 336 00:18:42,331 --> 00:18:43,999 హేయ్! బుట్టబొమ్మా! 337 00:18:45,250 --> 00:18:46,251 ఆ ముండంటే నాకిష్టం. 338 00:18:46,335 --> 00:18:48,045 నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాను. 339 00:18:48,128 --> 00:18:49,963 మిమ్మల్నందరినీ తప్పిస్తాను. 340 00:18:50,047 --> 00:18:51,131 ఈ శరణాలయం నేలమాళిగలో 341 00:18:51,215 --> 00:18:53,383 ఏం జరుగుతోందో మా నాన్న తెలుసుకోవలసిన అవసరం ఉంది. 342 00:18:53,467 --> 00:18:56,261 ఇది మహిళా హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించడమే. 343 00:18:56,345 --> 00:18:57,679 అదీ సంగతి! 344 00:18:57,763 --> 00:19:00,807 మహిళలూ, అంతా వినండి. మనం ఏం చేయాలో చెబుతాను. 345 00:19:03,143 --> 00:19:04,811 మీరంతా నిన్న రాత్రి హోం వర్క్ చేశారా? 346 00:19:05,395 --> 00:19:07,814 నేను చాలా అవస్థ పడ్డాను. అబద్ధం చెప్పను. 347 00:19:08,315 --> 00:19:10,400 నేను ఒక వాక్యం రాశాను. 348 00:19:12,152 --> 00:19:13,987 "ఇది నేను రాసిన అద్బుతమైన వాక్యం." 349 00:19:14,071 --> 00:19:15,447 తీసుకో... 350 00:19:15,531 --> 00:19:17,741 -అబ్బా, ఎవరెట్, ఎంత బాగా రాశావు! -ఏంటీ? 351 00:19:17,824 --> 00:19:18,909 -సరే. -అద్భుతం. 352 00:19:18,992 --> 00:19:20,619 -విద్యార్ధులూ. -అభినందనలు. 353 00:19:21,328 --> 00:19:23,038 ఇవాళ మీకు పాఠం చెప్పను. 354 00:19:23,121 --> 00:19:27,417 బదులుగా, మనం యూనిఫారం తనిఖీలో పాల్గొనబోతున్నాం. 355 00:19:28,710 --> 00:19:31,129 వావ్, హిగ్గిన్సన్ కు అసలు సిగ్గనేది ఉందా? 356 00:19:31,213 --> 00:19:33,048 గురూ, నన్ను వదిలేయండి. 357 00:19:33,131 --> 00:19:34,299 మరో తనిఖీ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. 358 00:19:34,383 --> 00:19:36,468 లేదు. లేదు. ఈ తనిఖీలో గనుక మీరు 359 00:19:36,552 --> 00:19:39,972 పాసైతే మీకు మీ ఆయుధాలు లభిస్తాయని హిగ్గిన్సన్ నాకు హామీ ఇచ్చాడు. 360 00:19:40,055 --> 00:19:42,099 ఆహా, కానీ మేం పాస్ కాము. ఎప్పటికీ పాస్ కాము. 361 00:19:42,182 --> 00:19:45,143 అంత మొండివైఖరితో ఉండకండి. 362 00:19:45,227 --> 00:19:48,605 లేదు, గురూ. ఈ చెత్త యూనిఫారాలతో అది కుదిరే పని కాదు. 363 00:19:48,689 --> 00:19:50,524 వీటిలో సగం వరకూ మృతదేహాల నుండి సేకరించినవే. 364 00:19:50,607 --> 00:19:52,484 లేకపోతే బానిసల ఇళ్లలోంచి దొంగిలించి తెచ్చినవి. 365 00:19:52,568 --> 00:19:55,445 ఇది యూనిఫారం ఎలా అవుతుంది? నేను తాతల కాలంనాటి కోటు వేసుకుంటున్నాను! 366 00:19:55,529 --> 00:19:56,822 మేం ఫెయిల్ అవ్వాలనే వాళ్లు అనుకుంటున్నారు. 367 00:19:56,905 --> 00:20:00,284 అవును. మా వైఫల్యాన్ని చూపించి, మాకు ఆయుధాలను ఎగ్గొట్టాలన్నది వాళ్ల ఎత్తుగడ. 368 00:20:00,367 --> 00:20:01,326 వద్దు, సోదరా. 369 00:20:02,286 --> 00:20:04,621 అందరూ వినండి. 370 00:20:05,205 --> 00:20:07,332 ఈ తనిఖీని మనం కాదని అనలేం. 371 00:20:07,416 --> 00:20:11,503 మీరు అలా చేస్తే ఇకపై మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకుండా పోయే అవకాశం ఉంటుంది. 372 00:20:12,087 --> 00:20:13,255 ఏమో ఎవరికి తెలుసు? 373 00:20:13,338 --> 00:20:16,466 మీరు పాసైతే, మీకు వీలైనంత త్వరగా ఆయుధాలు అందే అవకాశం ఉంటుంది. 374 00:20:16,550 --> 00:20:19,261 నేను "త్వరలో" అనే మాట విని అలసిపోయా. నాకు "ఇప్పుడే" కావాలి. నాకు భవిష్యత్తు కావాలి. 375 00:20:19,344 --> 00:20:20,804 నీ భవిష్యత్తులో, మైకేల్ జోర్డాన్, 376 00:20:20,888 --> 00:20:24,725 చర్మకారులు నీ గౌరవార్థం ప్రత్యేకమైన బూట్లు చేసి ఇస్తారులే. 377 00:20:24,808 --> 00:20:27,436 ఛీ, అదే మంచిదేమో. ఈ చెత్త బూట్లకంటే అవే మంచివి. 378 00:20:27,519 --> 00:20:28,687 వీటికంటే ఏవైనా బాగుంటాయి. 379 00:20:28,770 --> 00:20:30,480 -ఛీ. -ఛీ! 380 00:20:31,148 --> 00:20:32,149 వినండి. 381 00:20:35,235 --> 00:20:37,863 మీరంతా ఈ తనిఖీలో పాస్ కాబోతున్నారు, సరేనా? 382 00:20:39,198 --> 00:20:41,533 ఎందుకంటే, అందుకు నేను సాయం చేస్తాను కాబట్టి. 383 00:20:41,617 --> 00:20:43,994 అలాగా? ఎలా చేస్తారు? 384 00:20:44,620 --> 00:20:48,749 ఈ జాకెట్ ను చూడు. వీటికి చేతులే లేవు. 385 00:20:48,832 --> 00:20:52,127 సరే, నా దగ్గర ఇది ఉంది, ఇదే మీకు ఉపయోగపడేది. 386 00:20:56,507 --> 00:20:58,050 ఏంటది? 387 00:20:58,133 --> 00:20:59,843 ఇది నా ఇల్లాలి కిట్. 388 00:20:59,927 --> 00:21:00,844 ఇల్లాలు ఏంటి? 389 00:21:01,762 --> 00:21:05,724 సూది, దారం, వేలికి స్టీలు తొడుగు, రంగుల దారాలు. 390 00:21:06,850 --> 00:21:09,102 నేను వేసుకున్న ఈ చక్కటి సూట్ 391 00:21:09,186 --> 00:21:11,104 ఇలా కుట్టిందే, తెలుసా? 392 00:21:12,981 --> 00:21:14,358 నేను ప్రతి రోజూ కుడతాను. 393 00:21:14,942 --> 00:21:19,279 నేను చక్కగా కనిపించేందుకు. 394 00:21:22,574 --> 00:21:26,036 ఆశ్చర్యంగా ఉంది. మనవాడికి కుట్టు కళ కూడా వచ్చే. 395 00:21:26,119 --> 00:21:27,579 -అవును. -నాకు కొన్ని ట్రిక్కులు వచ్చు. 396 00:21:28,121 --> 00:21:31,542 కుట్టడంలో నా భార్య బెట్టీకి న్యూ ఇంగ్లండ్ లో గొప్ప పేరుంది. 397 00:21:32,042 --> 00:21:34,628 ఆమెకి ఉన్న నేర్పరితనంలో నాకూ కొంత వచ్చింది. 398 00:21:34,711 --> 00:21:35,921 నీకు భార్య ఉందా? 399 00:21:38,131 --> 00:21:39,675 ఒకప్పుడు తనే నా భార్య. 400 00:21:41,218 --> 00:21:43,136 కానీ ఇప్పుడు తనని ఎలా పిలవాలో తెలియదు. 401 00:21:43,220 --> 00:21:45,806 ఆమెకేనా నువ్వు రోజూ రాత్రి ఉత్తరాలు రాసేది? 402 00:21:46,390 --> 00:21:47,391 అవును. 403 00:21:48,100 --> 00:21:51,270 నా భార్య, నా కూతురు హెలెన్. 404 00:21:52,980 --> 00:21:55,274 వాళ్లకు ఉత్తరాలు రాస్తాను, కానీ ఎప్పుడూ వాటిని పోస్ట్ చేయను. 405 00:21:55,357 --> 00:21:57,693 అవును, ఆ సంగతి నేను గమనించాను. ఎందుకని? 406 00:21:58,777 --> 00:22:01,196 వాళ్లు నన్ను మరచిపోతేనే మంచిదని. 407 00:22:04,950 --> 00:22:07,160 ఎందుకంటే, నేను వాళ్లని ఇకపై ఎన్నడూ కలుసుకోలేను కాబట్టి. 408 00:22:07,244 --> 00:22:10,622 అలాంటప్పుడు మానని గాయాన్ని రోజూ రేపడమెందుకు? 409 00:22:11,415 --> 00:22:12,958 వాళ్లయినా చక్కగా బతికితే చాలు, 410 00:22:13,041 --> 00:22:15,961 వాళ్ల జ్ఞాపకాలు ఎప్పటికీ నా మనసులోనే... 411 00:22:17,838 --> 00:22:18,839 ఉంచుకుంటాను. 412 00:22:19,673 --> 00:22:22,593 ఛీ. ఎంత దారుణం. 413 00:22:24,595 --> 00:22:28,640 ఈ ప్రపంచం నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. 414 00:22:30,267 --> 00:22:32,644 మనలో చాలామంది కుటుంబాలను కూడా. 415 00:22:33,729 --> 00:22:39,401 కుట్టడంలో నా ప్రతిభ ముక్కలైన సమాజాన్ని, విరిగిన మనస్సును గాని బాగుచేయలేకపోయింది. 416 00:22:43,363 --> 00:22:44,990 కానీ నేను ఒక యూనిఫారాన్ని... 417 00:22:47,034 --> 00:22:48,202 కుట్టగలను. 418 00:22:52,998 --> 00:22:54,208 దీన్ని చూడండి. 419 00:22:54,291 --> 00:22:55,542 భలే! 420 00:22:55,626 --> 00:22:56,710 -యో. -వావ్. 421 00:22:57,336 --> 00:22:59,004 ఈ కుట్లు చాలా గట్టిగా ఉన్నాయి. 422 00:22:59,087 --> 00:23:01,632 ఈ తనిఖీలో మనం పాసయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 423 00:23:01,715 --> 00:23:03,550 నాకు మనపై నమ్మకం ఉంది. 424 00:23:04,134 --> 00:23:08,305 ఓ ఎరాస్మస్, నీ ముందు చూపు ఏం చెబుతోంది? 425 00:23:08,388 --> 00:23:10,682 అది "ఆ పని చెయ్యండి" అంటోంది. 426 00:23:10,766 --> 00:23:11,767 సరే. నేను సిద్ధం. 427 00:23:12,643 --> 00:23:14,811 -మనం మారి చూపిద్దాం! -సరే! 428 00:23:16,688 --> 00:23:18,774 ప్రావిజన్స్ 429 00:24:14,872 --> 00:24:15,873 మరి... 430 00:24:17,624 --> 00:24:22,254 ఇప్పుడు మీరంతా అసలు సిసలైన సైనిక దళంలా ఉన్నారు. 431 00:24:22,963 --> 00:24:24,965 ఒక వాలంటీర్ సైన్యంలా కాదు. 432 00:24:25,549 --> 00:24:26,925 మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 433 00:24:28,510 --> 00:24:29,678 మీకు ఆకలిగా ఉందా? 434 00:24:30,304 --> 00:24:31,805 ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, దేనికి? 435 00:24:31,889 --> 00:24:34,057 ఎందుకంటే ఇంత అద్భుతంగా తయారయ్యారు కదా, మీ కడుపు నిండిపోయిందనుకున్నా. 436 00:24:37,978 --> 00:24:42,107 మిత్రులారా, సిద్ధంగా ఉండండి. మామూలుగా ఉన్నట్టు నటించండి. 437 00:24:42,191 --> 00:24:44,234 కొంతమంది మాత్రం పిచ్చిగా ప్రవర్తించండి. 438 00:24:47,029 --> 00:24:49,364 నర్సు మాత్రలతో లోపలికి రాగానే, మనం పారిపోదాం. 439 00:24:50,073 --> 00:24:51,074 త్వరగా. 440 00:24:58,498 --> 00:25:01,043 మందులు వేసుకోవలసిన సమయం ఇది. అంతా వరుసలో నించోండి. 441 00:25:03,837 --> 00:25:06,256 వరుసలో నిలబడమని చెప్పా కదా. 442 00:25:06,340 --> 00:25:07,341 ఇక... 443 00:25:08,509 --> 00:25:09,510 పారిపోండి! 444 00:25:12,930 --> 00:25:14,765 వసంత కాలం గొప్పతనం 445 00:25:16,725 --> 00:25:19,144 రాజుకు కూడా ఎంతో ఆహ్లాదకరమైనది. 446 00:25:20,687 --> 00:25:22,564 కానీ విదూషకుడితోనే దేవుడు ఉంటాడు - 447 00:25:24,107 --> 00:25:26,360 ఈ అద్బుతమైన దృశ్యం గురించి ఎవరు ఆలోచిస్తారు - 448 00:25:28,278 --> 00:25:30,489 ఈ ఆకుపచ్చ ప్రయోగం - 449 00:25:31,198 --> 00:25:33,325 ఇదంతా తన సొంతం అయినట్లు! 450 00:25:34,576 --> 00:25:37,538 మనం అప్పుడే బయల్దేరాలా? ఇక్కడ నాకు ఎంతో బాగుంది. 451 00:25:37,621 --> 00:25:39,748 అవును, మనం ఇక్కడే ఉంటే బాగుంటుంది. 452 00:25:39,831 --> 00:25:42,793 ఆ గోడ పత్రికలో ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. 453 00:25:42,876 --> 00:25:44,545 కాస్త టీ తాగుదాం. 454 00:25:44,628 --> 00:25:46,129 మాకు అంతా చూపించినందుకు ధన్యవాదాలు, డాక్టర్. 455 00:25:46,213 --> 00:25:49,049 ట్రస్టీ హోదాకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తారని భావిస్తున్నాను. 456 00:25:49,132 --> 00:25:52,761 మీరేమీ అనుకోనంటే, మీ కూతురు గురించి నేను ఇచ్చిన వైద్య సలహాను మీరు తోసిపుచ్చినందుకు 457 00:25:52,845 --> 00:25:55,639 మీకు బోర్డులో సభ్యత్వం కల్పించలేను. 458 00:25:55,722 --> 00:25:56,849 ఏంటిదంతా? 459 00:25:56,932 --> 00:25:58,642 ఎమిలి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందని ఈయన అంటున్నారు. 460 00:25:58,725 --> 00:26:02,020 ఏంటీ? ఎమిలీకి పిచ్చేమీ లేదు. నేనే పిచ్చిదాన్ని! 461 00:26:02,104 --> 00:26:04,439 నన్ను బంధించండి. దశాబ్దాల తరబడి బంధించండి! 462 00:26:04,523 --> 00:26:06,149 అందుబాటులో ఉంటే, ఆ నీలం రంగు గదిని నాకు కేటాయించండి. 463 00:26:06,233 --> 00:26:09,152 నేనిదంతా ముందే ఊహించాను. పిల్లల గురించి తల్లులు త్యాగం చేస్తారు. 464 00:26:09,236 --> 00:26:10,988 గొప్ప త్యాగం. కానీ నేను అందుకు ఒప్పుకోను. 465 00:26:11,071 --> 00:26:13,991 ఇక్కడ ఉండాల్సింది ఎమిలీ మాత్రమే. 466 00:26:14,074 --> 00:26:16,743 హేయ్, ఆగండి. మనం ఆమె గురించి మాట్లాడుతున్నాం గానీ, ఇంతకీ ఆమె ఎక్కడ? 467 00:26:16,827 --> 00:26:18,036 ఎమిలీ ఎక్కడ? 468 00:26:20,038 --> 00:26:21,748 ఇది ఒక నిరసన! 469 00:26:23,208 --> 00:26:25,586 నువ్వు సిగ్గుపడాలి. 470 00:26:25,669 --> 00:26:28,505 ఈ అమ్మాయిలందరినీ నువ్వు నిర్బంధించి, వాళ్ల జీవితాలను నాశనం చేశావు. 471 00:26:28,589 --> 00:26:31,717 నాకూ పిచ్చి పట్టింది. వింతవింతగా ప్రవర్తిస్తున్నాను. 472 00:26:31,800 --> 00:26:33,177 అమ్మా, నేనొక నిరసనకు నాయకత్వం వహించబోతున్నాను. 473 00:26:33,260 --> 00:26:35,429 చూస్తున్నారా మీరు? నిరసన? 474 00:26:35,512 --> 00:26:37,764 మహిళా హక్కుల కోసం డిమాండ్ చేయడం? సహాయ నిరాకరణ? 475 00:26:37,848 --> 00:26:40,851 మనసు చెడిందని చెప్పేందుకు ఇవన్నీ పాఠ్య పుస్తకాల్లో పేర్కొన్న ఉదాహరణలు. 476 00:26:40,934 --> 00:26:42,978 పిచ్చి ప్రపంచంలో నా మానసిక స్వస్థతకు నన్ను క్షమించండి. 477 00:26:43,061 --> 00:26:44,438 ఈ అమ్మాయికి ఏమయ్యిందో అర్ధం కావట్లేదు. 478 00:26:44,521 --> 00:26:46,648 నాన్నా, ఈ శరణాలయం గురించి మీరు నిజం తెలుసుకోవాలి. 479 00:26:46,732 --> 00:26:48,901 ఇక్కడ మహిళల్ని తమ ఇష్టానికి భిన్నంగా బంధించి ఉంచుతున్నారు. 480 00:26:49,568 --> 00:26:52,863 వారికి రోగం లేదు, వారిని హింసిస్తున్నారు, అధిక మోతాదులో మందులు ఇస్తున్నారు... 481 00:26:52,946 --> 00:26:53,947 నాకు ఆ మాత్రలంటే ఇష్టం. 482 00:26:54,031 --> 00:26:55,657 -సరే, ఆబీ. నేను మాట్లాడుతున్నాగా. -నాకు తెలుసు. 483 00:26:55,741 --> 00:26:58,535 నాన్నా, ఇదొక ప్రగతిశీల శరణాలయం కాదు. 484 00:26:58,619 --> 00:27:01,121 నిజానికి, ఇలాంటిది భవిష్యత్తులో నిలబడుతుందని నేను అనుకోవట్లేదు. 485 00:27:01,205 --> 00:27:04,333 ఇది మానవత్వానికే మచ్చ. 486 00:27:05,083 --> 00:27:06,752 ఇదొక అవశేషంగా నిలిచిపోతుంది. 487 00:27:06,835 --> 00:27:08,795 ఎడ్వర్డ్, మీరు మీ కూతురికి సాయం చేద్దామనుకుంటున్నారా, లేదా? 488 00:27:08,879 --> 00:27:09,755 సాయం చేయాలనే ఉంది. 489 00:27:09,838 --> 00:27:11,548 అయితే ఎమిలీని నా దగ్గర వదిలేసి, మీరంతా వెళ్లండి. 490 00:27:11,632 --> 00:27:13,342 బహుశా తన జీవితాంతం. 491 00:27:13,425 --> 00:27:15,594 మీరు ఒక్క మాట చెబితే, నేను మిగిలిన ఏర్పాట్లు చూసుకుంటాను. 492 00:27:15,677 --> 00:27:17,554 -లేదు. నేను ఇక్కడ... -ఆగు, ఏంటి? 493 00:27:17,638 --> 00:27:19,806 నాన్నా, ఈయన అనేది ఏమిటి? 494 00:27:19,890 --> 00:27:21,934 -ఎమ్. -నన్ను ఇక్కడ వదలొద్దు. 495 00:27:22,476 --> 00:27:24,353 వద్దు, నాన్నా. నువ్వు... నువ్వు ఆ పని చేయకు, సరేనా? 496 00:27:24,436 --> 00:27:27,189 మీరు ఒప్పుకోకపోతే, ఈ సంస్థకు ట్రస్టీ కాలేరు. 497 00:27:33,237 --> 00:27:35,405 లేదు. నేను అలా చేయలేను. 498 00:27:37,282 --> 00:27:39,785 డాక్టర్, నా కూతురు ఎమిలీ నాతో నా ఇంట్లోనే ఉంటుంది. 499 00:27:40,577 --> 00:27:44,873 దానివల్ల నేను ట్రస్టీ హోదాను కోల్పోవలసి వస్తే, అలాగే కానివ్వండి. 500 00:27:52,965 --> 00:27:56,218 ఆగండి, అయితే మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్లట్లేదా... 501 00:27:59,805 --> 00:28:01,181 గుడ్ ఈవినింగ్, ఫ్రెడ్డీ. 502 00:28:02,808 --> 00:28:05,477 ఈ రోజు ఎంత బాగుందో కదా? ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? 503 00:28:06,228 --> 00:28:08,272 ఇదిగో, మిస్టర్ డికిన్సన్. 504 00:28:11,525 --> 00:28:12,734 మిస్టర్ ఆస్టిన్ డికిన్సన్ 505 00:28:13,902 --> 00:28:14,903 క్షమించండి. 506 00:28:14,987 --> 00:28:16,572 క్షమించడమా? దేనికి? 507 00:28:18,031 --> 00:28:19,032 ప్రోవాస్ట్ మార్షల్ ఆఫీస్ 508 00:28:19,116 --> 00:28:21,243 ...యునైటెడ్ స్టేట్స్ సేవలో చట్టపరంగా డ్రాఫ్ట్ చేయబడింది... 509 00:28:23,871 --> 00:28:25,914 తనిఖీ! కంపెనీ. 510 00:28:37,259 --> 00:28:38,468 కాలర్ సరిగ్గా పెట్టుకో. 511 00:28:41,972 --> 00:28:47,269 హెన్రీ, నీ ప్రభావం బాగానే పనిచేసింది. వీళ్లంతా అసలైన సైనికుల్లా కనిపిస్తున్నారు. 512 00:28:50,230 --> 00:28:52,524 మిత్రులారా, మీ మొదటి తనిఖీలో మీరంతా పాసయ్యారు. 513 00:28:52,608 --> 00:28:54,193 నాకు చాలా గర్వంగా ఉంది. 514 00:28:55,235 --> 00:28:56,737 వాళ్లు పాసవుతారని నాకు తెలుసు. 515 00:28:57,821 --> 00:28:58,906 అదీ ఇంత త్వరగా. 516 00:28:59,865 --> 00:29:00,949 సర్? 517 00:29:02,451 --> 00:29:04,453 కాన్ఫెడెరేట్ల బెటాలియన్ కదం తొక్కుతూ వస్తోంది. 518 00:29:05,120 --> 00:29:06,914 యుద్ధం బ్యూఫోర్ట్ సమీపానికి చేరుకుంటోంది. 519 00:29:07,873 --> 00:29:09,583 హింస చెలరేగవచ్చు. 520 00:29:09,666 --> 00:29:12,169 కానీ, ఏమాత్రం వీలున్నా, 521 00:29:13,670 --> 00:29:16,089 మనం చర్చలు సాగించే అవకాశం కూడా ఉంది. 522 00:29:16,173 --> 00:29:18,217 మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా సర్? 523 00:29:19,009 --> 00:29:19,927 మాట్లాడు. 524 00:29:20,010 --> 00:29:21,970 -యుద్ధం ముంచుకొస్తోందని అన్నారు కదా? -అవును. 525 00:29:22,054 --> 00:29:24,389 దానర్ధం మాకు ఆయుధాలు ఇస్తారనే కదా, సర్? 526 00:29:25,057 --> 00:29:27,684 ఆ సౌకర్యం మీకు కల్పించగలనని ఆశిస్తున్నాను. 527 00:29:27,768 --> 00:29:29,770 "కల్పించడమా"? దానర్దం ఏంటి? 528 00:29:29,853 --> 00:29:32,272 మాకు తుపాకులు ఎప్పుడు ఇస్తారు, సర్? 529 00:29:33,023 --> 00:29:34,983 ఎప్పుడు ఇస్తామో ఖచ్చితంగా చెప్పలేను. 530 00:29:36,026 --> 00:29:37,069 కానీ... 531 00:29:39,154 --> 00:29:43,116 జనరల్ శాక్స్టన్ కు ఘాటైన పదజాలంతో ఇప్పుడే ఉత్తరం రాస్తాను, 532 00:29:43,200 --> 00:29:46,286 ఆ తర్వాత ఏం జరుగుతుందో... చూద్దాం. 533 00:29:47,120 --> 00:29:51,375 మళ్లీ చెబుతున్నా, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. మీరంతా చాలా కష్టపడ్డారు. 534 00:29:51,458 --> 00:29:53,168 మీ కృషిని నేను గుర్తిస్తున్నాను. 535 00:29:54,461 --> 00:29:55,462 ధన్యవాదాలు. 536 00:29:57,506 --> 00:29:59,550 కంపెనీ. ఇక వెళ్లండి. 537 00:30:03,804 --> 00:30:06,765 చూశారు కదా? ఈ పరిస్థితిలో ఎప్పటికీ మార్పుండదు. 538 00:30:06,849 --> 00:30:08,934 సాయం చేస్తానంటున్నాడు కానీ అది ఎన్నటికీ జరగదు. 539 00:30:09,017 --> 00:30:11,937 యుద్ధం వస్తే మనమంతా చేతకాని వెధవల్లాగా చూస్తూ నిలబడతాం, అంతే. 540 00:30:12,020 --> 00:30:15,732 మేమేం చేయాలట? వరసగా నిలబడి పిట్టల్లా చావాలా? 541 00:30:15,816 --> 00:30:16,942 హలో! 542 00:30:17,776 --> 00:30:21,822 ఆర్థిక సంక్షోభంలో పడిన జాత్యహంకారులతో మేం యుద్ధం చేస్తున్నాం. 543 00:30:22,406 --> 00:30:24,533 నాకు ఆయుధం కావాలి. 544 00:30:26,952 --> 00:30:27,828 తుపాకీని మళ్లీ నింపండి. 545 00:30:34,710 --> 00:30:35,711 నాకు చాలా భయంగా ఉంది. 546 00:30:36,670 --> 00:30:37,880 మనమంతా కలిసి ఒకసారి కౌగలించుకుందామా? 547 00:30:37,963 --> 00:30:39,798 -తప్పకుండా. -రండి. 548 00:30:39,882 --> 00:30:41,133 రా, గురూ, నీకు మద్దతుగా మేమున్నాం. 549 00:30:43,677 --> 00:30:44,720 మనమంతా కలిసే ఉందాం. 550 00:30:50,934 --> 00:30:52,519 నేను అతని మాటలు విన్నందుకు నన్ను క్షమించండి. 551 00:30:53,312 --> 00:30:57,232 ఏం లాభం లేదు, గురూ. మేం ఎన్నటికీ అసలైన సైనికులం కాలేము. 552 00:30:58,150 --> 00:30:59,484 దీనికి ఒక దారి ఉంది. 553 00:31:00,235 --> 00:31:03,780 మీరు చెప్పింది నిజం. మనం ఇక ఎంతో కాలం వేచి ఉండలేం. 554 00:31:04,364 --> 00:31:05,699 అయితే, ఏం చేస్తావు మరి? 555 00:31:06,950 --> 00:31:09,578 నేను వెళ్లి ఆయన్ని నిలదీస్తాను. 556 00:31:16,585 --> 00:31:17,586 ధన్యవాదాలు. 557 00:31:19,296 --> 00:31:21,590 ఆ శరణాలయంనుంచి ఆబీని తప్పించి, ఇంటికి చేర్చినందుకు సంతోషంగా ఉంది. 558 00:31:21,673 --> 00:31:24,301 అవును, ఆమెను మొదట ఆమె భర్తే అక్కడ చేర్పించాడు. 559 00:31:25,511 --> 00:31:27,304 నాన్నా, నిజంగా నన్ను క్షమించు. 560 00:31:27,387 --> 00:31:29,723 ఈ రోజంతా సరదాగా గడుస్తుందని అనుకున్నా. నీ హోదా చేజారిపోతుందని అనుకోలేదు. 561 00:31:29,806 --> 00:31:33,143 ఏం కాదు. పర్వాలేదు. పైగా అందుకు నేను తగినవాణ్ని కూడా కాను. 562 00:31:34,311 --> 00:31:35,729 నన్ను అక్కడ వదిలెయ్యనందుకు ధన్యవాదాలు. 563 00:31:36,313 --> 00:31:38,649 ఏంటమ్మా. నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు. 564 00:31:38,732 --> 00:31:39,900 నేనే నీకు రుణపడి ఉన్నాను. 565 00:31:39,983 --> 00:31:41,235 దేనికి? 566 00:31:41,318 --> 00:31:44,279 అందరూ నన్ను విమర్శిస్తున్నప్పుడు నా పక్కన నిలబడినందుకు. 567 00:31:45,572 --> 00:31:48,075 నేను ఆ సంగతి గమనించేలేదనుకున్నావా, తల్లీ. 568 00:31:51,119 --> 00:31:52,371 నాకు ఆకలేస్తోంది, నీకు వేయట్లేదా? 569 00:31:52,454 --> 00:31:54,748 అమ్మా? ఈ రాత్రికి వంట ఏం చేస్తున్నావు? 570 00:31:56,667 --> 00:31:57,918 అమ్మా, ఏం చేస్తున్నావు? 571 00:31:58,001 --> 00:31:59,753 పడుకుంటున్నాను. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. 572 00:32:01,171 --> 00:32:03,423 ఇరవై నిమిషాల కునుకా, లేకపోతే... 573 00:32:03,507 --> 00:32:05,008 యుద్ధం ముగిసేంతవరకూనా. 574 00:32:56,518 --> 00:32:58,520 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య