1 00:00:09,760 --> 00:00:11,261 పోస్టాఫీసు 2 00:00:20,938 --> 00:00:22,356 డియర్ మిస్ డికిన్సన్, 3 00:00:22,439 --> 00:00:27,110 మీరు రాసింది చదివాక అది సరికొత్తదైన, అసలు సిసలైన కవిత్వంలా అనిపించింది. 4 00:00:27,194 --> 00:00:31,240 "సరికొత్తగానూ అసలు సిసలైనదిగాను." 5 00:00:34,910 --> 00:00:36,161 నా కవిత్వం చనిపోలేదు. 6 00:00:37,120 --> 00:00:38,664 చనిపోలేదు. అది సజీవంగానే ఉంది! 7 00:00:42,751 --> 00:00:44,670 డికిన్సన్ 8 00:00:44,753 --> 00:00:46,713 హృదయలోలోతుల నుండి పాడాను, సర్ 9 00:00:53,345 --> 00:00:57,307 విన్నీ! విన్నీ! నువ్వు ఇది నమ్మలేవు. 10 00:00:57,391 --> 00:01:00,310 నాకు ఇప్పుడే థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్ నుంచి ఉత్తరం వచ్చింది. 11 00:01:01,562 --> 00:01:02,813 ఆయన ఎవరో నీకు తెలుసా? 12 00:01:03,564 --> 00:01:05,482 సరే, అతనొక అద్బుతమైన వ్యక్తి, విన్నీ. 13 00:01:05,566 --> 00:01:08,485 ఆయన బానిసత్వ నిర్మూలనావాది, మంత్రి కూడా, 14 00:01:08,569 --> 00:01:10,237 అట్లాంటిక్ పత్రికకు వ్యాసాలు రాస్తారు. 15 00:01:10,320 --> 00:01:13,532 స్వేచ్ఛా ఆలోచనాపరుడు, విన్నీ, ఆయనొక ఉద్యమకారుడు కూడా, 16 00:01:13,615 --> 00:01:16,451 ఈ ప్రపంచాన్ని ఉత్తమమైనదిగా తీర్చిదిద్దాలని తపన పడుతూ ఉంటారు, 17 00:01:16,535 --> 00:01:18,161 నీకు ఇంకొక విషయం తెలుసా? 18 00:01:18,245 --> 00:01:19,496 ఆయనకు నా కవితలంటే ఇష్టం. 19 00:01:21,331 --> 00:01:23,041 మరిన్ని కవితలు పంపమన్నారు. 20 00:01:23,125 --> 00:01:27,254 నా అంతట నేను యుద్ధభూమికి వెళ్లలేకపోవచ్చు, కానీ, బహుశా, ఈయననుంచి నేర్చుకుని, 21 00:01:27,337 --> 00:01:30,174 ప్రజలకు సహాయపడే విధంగా కవితలు రాయగలను. 22 00:01:30,257 --> 00:01:31,800 వాళ్లకు చేయూతనిచ్చే కవితలు. 23 00:01:36,096 --> 00:01:37,931 నువ్వేమీ మాట్లాడవేం? 24 00:01:41,685 --> 00:01:45,480 ఓహో, సరే. దళాలకు మద్దతుగా మౌన వ్రతం పాటిస్తున్నావన్నమాట. 25 00:01:47,191 --> 00:01:49,610 నీకు తెలుసా, లవీనియా, నువ్వు ఎంచుకున్న కళా రంగంలో 26 00:01:49,693 --> 00:01:52,487 ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నావు. నువ్వొక వినూత్నమైన ఆలోచనాపరురాలివి. 27 00:01:54,740 --> 00:01:57,451 అమ్హెర్స్ట్ బొంతల బజారు మరియు పారిశుద్ధ్య మేళా 28 00:01:58,202 --> 00:02:00,621 యూనియన్ సైనికుల ప్రయోజనార్థం 29 00:02:34,530 --> 00:02:38,033 చూడండి, అంతే తప్ప ముట్టుకోకండి. 30 00:02:38,116 --> 00:02:39,743 -అది చాలా సంక్లిష్టమైన అల్లిక. -అవును. 31 00:02:39,826 --> 00:02:41,954 మేం ఈ విధంగానే రహస్య సందేశాలు పొందుతాం. 32 00:02:42,037 --> 00:02:43,080 ఆగు, ఏంటి? 33 00:02:44,581 --> 00:02:47,876 వావ్. అమెరికా అవతరించి వందేళ్లయినా కాలేదు, 34 00:02:47,960 --> 00:02:50,170 అప్పుడే బొంతలను కనిపెట్టేశానని అనుకుంటోందా? 35 00:02:50,254 --> 00:02:51,296 దానివల్ల కాదు. 36 00:02:52,047 --> 00:02:53,799 -హాయ్, ఎమిలీ. హాయ్, లవీనియా. -హాయ్. 37 00:02:54,883 --> 00:02:56,301 ఇవాళ లవీనియా మాట్లాడదు. 38 00:02:56,385 --> 00:02:59,096 వీరమరణం పొందిన సైనికులకు నివాళిగా మౌనవ్రతం పాటిస్తోంది. 39 00:03:00,097 --> 00:03:01,139 హలో, లవీనియా. 40 00:03:03,183 --> 00:03:05,644 మీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా? 41 00:03:05,727 --> 00:03:09,106 అది... అది చాలా చిన్నది. అది చిన్నపిల్లల కోసమా? 42 00:03:09,189 --> 00:03:10,357 అవును. 43 00:03:10,440 --> 00:03:11,441 మహిళలకు ఓటేయండి! 44 00:03:11,525 --> 00:03:13,652 -స్త్రీవాద పాప. -వావ్. సరే. 45 00:03:16,864 --> 00:03:20,450 ఓరి దేవుడా, బెట్టీ బొంతలు చూడు. అద్భుతంగా ఉన్నాయి. 46 00:03:20,534 --> 00:03:23,453 ధన్యవాదాలు. ఒక సదుద్దేశంతో ధన సేకరణ జరుపుతున్నందుకు సంతోషం. 47 00:03:23,954 --> 00:03:25,080 ఈ చదరాలు అంతగా నప్పలేదు. 48 00:03:25,664 --> 00:03:28,667 ఇవన్నీ వివిధ ఆకృతులు, సైజుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఒకేలా లేవు కదా. 49 00:03:28,750 --> 00:03:31,587 ఏంటిదంతా? ఈ బొంతకు అర్థం పర్థం లేదు. 50 00:03:31,670 --> 00:03:33,255 కళకు అర్థం ఉండక్కర్లేదు. 51 00:03:33,338 --> 00:03:34,381 ఆమె చాలా తెలివైనది. 52 00:03:34,464 --> 00:03:35,883 -నేను దీన్ని కొంటున్నాను. -ముందుగా వచ్చింది నేను. 53 00:03:37,384 --> 00:03:38,385 ధన్యవాదాలు. 54 00:03:39,261 --> 00:03:41,180 తెలుసా? నేను నీ సలహా పాటించాను. 55 00:03:41,263 --> 00:03:42,264 ఏ సలహా? 56 00:03:42,347 --> 00:03:45,184 నేను ప్రపంచానికి ఓ లేఖ రాశాను. బదులుగా ప్రపంచం నాకొక లేఖ రాసింది. 57 00:03:45,267 --> 00:03:46,894 అదా సంగతి. 58 00:03:59,406 --> 00:04:02,326 జనమంతా మనల్ని వింతగా చూస్తున్నట్లు లేదా, ఎడ్వర్డ్? 59 00:04:02,409 --> 00:04:03,243 లేదు. 60 00:04:04,286 --> 00:04:05,287 కొంచెం ఉందేమో. 61 00:04:06,246 --> 00:04:09,166 ఈ ఊరిజనాలందరూ ఎందుకో చికాకుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. 62 00:04:10,042 --> 00:04:11,543 ఇది వేలం పాడే సమయం. 63 00:04:11,627 --> 00:04:13,795 మా బామ్మ నార్క్రాస్ బొంత దానం ఇచ్చాను. 64 00:04:13,879 --> 00:04:15,714 దానికి ధర బాగానే పలుకుతుందనుకుంటా. 65 00:04:15,797 --> 00:04:18,091 దీనికి ఐదు డాలర్ల వద్ద పాట మొదలుపెడదాం. 66 00:04:18,759 --> 00:04:20,010 ఏమంటున్నారు? 67 00:04:20,511 --> 00:04:23,889 మాన్సన్ లో 1822లో జరిగిన బొంతల అల్లికల పోటీలో మా అమ్మ ఈ బొంతను అల్లి 68 00:04:23,972 --> 00:04:24,973 మొదటి బహుమతి గెలుచుకుంది. 69 00:04:25,057 --> 00:04:26,350 ఇది ప్రారంభపు పాట మాత్రమే. 70 00:04:26,433 --> 00:04:29,937 మీరిచ్చిన దానానికి కొనుగోలుదారులు ధర నిర్ణయిస్తారు, మిసెస్ డికిన్సన్. 71 00:04:30,020 --> 00:04:31,313 కానీ, ఇదేం బాగోలేదు. 72 00:04:31,396 --> 00:04:33,273 వేలం అంటే ఇలానే జరుగుతుంది. 73 00:04:33,857 --> 00:04:37,694 నా కుటుంబానికి చెందిన బొంతకు ఐదు డాలర్లా? ఇది చాలా దారుణం. 74 00:04:37,778 --> 00:04:38,987 కాదు. 75 00:04:39,071 --> 00:04:41,907 క్షమించాలి, నేను దీన్ని అమ్మకూడదని అనుకుంటున్నా. నాకు వెనక్కు ఇచ్చేయండి. 76 00:04:41,990 --> 00:04:44,660 మీరు సైనిక దళాలకు మద్దతు పలుకుతారని అనుకున్నా, మిసెస్ డికిన్సన్. 77 00:04:44,743 --> 00:04:46,119 నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. 78 00:04:46,203 --> 00:04:47,663 కానీ నా సోదరి చనిపోయింది, 79 00:04:47,746 --> 00:04:50,374 ఆమె జ్ఞాపకార్థం నాకు ఈ బొంత ఒక్కటే మిగిలింది. 80 00:04:50,457 --> 00:04:51,291 నాకు ఇచ్చేయండి. 81 00:04:51,375 --> 00:04:53,836 మీకు ఈ బొంత కావాలంటే, దాన్ని వేలంలో పాడుకోవాలి. 82 00:04:55,462 --> 00:04:56,588 ఎడ్వర్డ్. 83 00:04:56,672 --> 00:04:57,756 చెప్పు? 84 00:04:57,840 --> 00:04:59,633 ఈ బొంతను మీరు కొనాలి. 85 00:04:59,716 --> 00:05:02,052 మనకు పెళ్లయినప్పటినుంచీ అటకపైనే పడి ఉన్న ఒక బొంత కోసం 86 00:05:02,135 --> 00:05:05,138 నేను కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు చేయను, మిసెస్ డికిన్సన్. 87 00:05:05,222 --> 00:05:08,016 ఎడ్వర్డ్! కుటుంబం అన్నింటికన్నా గొప్పది. 88 00:05:08,100 --> 00:05:11,603 పైగా చనిపోయినా నా సోదరి గుర్తుగా ఈ బొంత ఒక్కటే నాకు మిగిలి ఉంది. 89 00:05:11,687 --> 00:05:12,729 ఇరవై డాలర్లు? 90 00:05:12,813 --> 00:05:13,814 ఈ బొంత మీదే. 91 00:05:13,897 --> 00:05:15,148 ధన్యవాదాలు. 92 00:05:19,945 --> 00:05:21,655 నువ్వు చాలా ఎక్కువ చేశావు, మిసెస్ డికిన్సన్. 93 00:05:21,738 --> 00:05:22,865 -సరే. -కేవలం... 94 00:05:22,948 --> 00:05:23,991 డికిన్సన్. 95 00:05:24,074 --> 00:05:25,325 కాంకీ. 96 00:05:25,409 --> 00:05:26,952 మిమ్మల్ని ఇక్కడ చూడటం ఆశ్చర్యంగా ఉంది. 97 00:05:27,035 --> 00:05:28,287 ఆశ్చర్యమా? దేనికి? 98 00:05:28,787 --> 00:05:30,247 ఇది పౌరులకు సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. 99 00:05:30,330 --> 00:05:32,332 పైగా, నేను కాలేజీ కోశాధికారినని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. 100 00:05:32,416 --> 00:05:34,042 అవును. అవునులే. 101 00:05:34,668 --> 00:05:38,755 కానీ మీరు ఇటీవల సంపాదకుడికి రాసిన లేఖ అనంతరం, 102 00:05:38,839 --> 00:05:40,883 మన యూనియన్ సైనికుల గురించి మీరు పట్టించుకుంటారని 103 00:05:40,966 --> 00:05:42,467 నేను ఊహించలేకపోయాను. 104 00:05:42,551 --> 00:05:43,802 ఏమంటున్నారు, ఇతమార్. 105 00:05:43,886 --> 00:05:45,637 ఇవాళ పత్రికలో వచ్చిన మీ లేఖ గురించి, ఎడ్వర్డ్, 106 00:05:45,721 --> 00:05:49,474 మీరు నీచులైన కాన్ఫెడరేట్లను పొగుడుతూ, వారికి సానుభూతి చూపిస్తూ ఆ ఉత్తరం రాశారు. 107 00:05:49,558 --> 00:05:51,018 నేను అలా రాయలేదు. 108 00:05:51,101 --> 00:05:53,270 లేదు, మీరు అలాగే రాశారు! నమ్మక ద్రోహి! 109 00:05:54,188 --> 00:05:55,939 ఆగు జెరాల్డ్. 110 00:05:59,943 --> 00:06:04,448 1850లో మీరు, పరారైన బానిసల చట్టానికి మద్దతుగా ఓటు వేసినప్పుడు... 111 00:06:04,531 --> 00:06:06,116 -ఇది వరకే చెప్పారుగా. -...విచ్ఛిన్నమవుతున్న మన శాంతిని 112 00:06:06,200 --> 00:06:08,785 పునరుద్ధిరించే దిశగా మీరు ఆ పని చేసి ఉంటారని 113 00:06:08,869 --> 00:06:10,996 నేను సరిపుచ్చుకున్నాను. 114 00:06:11,079 --> 00:06:13,999 కానీ ఇప్పుడు, ఒక పక్క యుద్ధం తీవ్రమవుతుంటే, 115 00:06:14,082 --> 00:06:16,543 ఎందరో వీరపుత్రుల ప్రాణాలను బలిగొంటుంటే, 116 00:06:16,627 --> 00:06:22,049 మీరు మర్యాదను ఒలకబొస్తూ, ఇరు పక్షాల వాదనలనూ వినాలని 117 00:06:22,132 --> 00:06:24,301 పనికిమాలిన, నీచమైన విన్నపం చేశారు. 118 00:06:24,384 --> 00:06:25,385 దేవుడా, ఎడ్వర్డ్. 119 00:06:25,469 --> 00:06:28,805 మీరు దుర్మార్గాన్నీ, దుష్టశక్తుల్నీ సమర్ధిస్తున్నారు. 120 00:06:28,889 --> 00:06:29,973 మీకెంత ధైర్యం. 121 00:06:30,682 --> 00:06:33,060 నేను ఆ ఉత్తరాన్ని నా సోదరుడి తరఫున రాశాను. 122 00:06:33,143 --> 00:06:36,563 జార్జియాలో ఉంటున్నంతమాత్రాన అతన్ని మనం శత్రువుగా చూడకూడదు. 123 00:06:36,647 --> 00:06:39,900 -అందులో సందేహమే లేదు! -యుద్ధం కారణంగా అదే జరుగుతోంది. 124 00:06:39,983 --> 00:06:41,944 -ధన్యవాదాలు. -మీ గొంతు చాలా నమ్రతగా ఉంది, 125 00:06:42,027 --> 00:06:44,613 మీ సందేశం ఇప్పుడు ఇతరులు చేస్తున్నదానికి విరుద్ధంగా ఉంది. 126 00:06:44,696 --> 00:06:47,574 దారుణమేమిటంటే, మీరొక దురభిమానిగా కనిపిస్తున్నారు, పైగా... 127 00:06:48,367 --> 00:06:49,368 ఏంటి? 128 00:06:49,451 --> 00:06:50,285 చేతకాని ముసలాడిలా కనిపిస్తున్నారు. 129 00:06:51,495 --> 00:06:54,414 ఇవాళ్టితో నేను మరో ఏడాది పెద్దవాణ్నయ్యాను కాబట్టి, మీరు చెప్పింది నిజమే కావచ్చు. 130 00:06:54,498 --> 00:06:57,709 దేవుడా, ఇవాళ మీ పుట్టిన రోజా? శుభాకాంక్షలు! 131 00:06:57,793 --> 00:06:58,836 పుట్టిన రోజు శుభాకాంక్షలు. 132 00:06:58,919 --> 00:07:01,255 -నాకు తెలియదు. -నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. 133 00:07:01,338 --> 00:07:03,507 తన పుట్టిన రోజును ఆయన ఎప్పుడూ ఒక విశేషంగా భావించరు. 134 00:07:03,590 --> 00:07:09,638 ఎడ్వర్డ్, మీరు ఎవరివైపో నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది. 135 00:07:13,267 --> 00:07:16,645 నా కుటుంబానికి వ్యతిరేకంగా నేను ఎవరి పక్షమూ వహించను. 136 00:07:17,396 --> 00:07:22,276 సరే, అయితే ఈ కాలేజీ కోశాధికారి పదవిని మీరు కోల్పోవలసి ఉంటుంది, 137 00:07:22,359 --> 00:07:24,778 ఆపై ఇంకేం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. 138 00:07:30,742 --> 00:07:32,160 ఇదంతా మిమ్మల్ని బాధించి ఉండవచ్చు. 139 00:07:39,126 --> 00:07:41,044 -నాన్నా, మీరు బాగానే ఉన్నారా? -బాగున్నాను. 140 00:07:41,128 --> 00:07:43,589 మిస్టర్ కాంకీ ఇంత దారుణంగా మాట్లాడారంటే నేను నమ్మలేకపోతున్నా. 141 00:07:43,672 --> 00:07:47,009 -ఆయన ఎప్పుడూ నాటకీయంగానే మాట్లాడతాడు. -పైగా ఇవాళ మీ పుట్టినరోజు, నాన్నా. 142 00:07:47,092 --> 00:07:48,343 అయితే ఏంటి? 143 00:07:49,261 --> 00:07:50,596 రేపో మాపో చావబోతున్నా కదా. 144 00:07:56,310 --> 00:07:58,478 ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. 145 00:07:58,562 --> 00:08:00,856 తన పుట్టినరోజునాడు ఆయనను ఇలా ఉండనివ్వకూడదు. 146 00:08:00,939 --> 00:08:03,400 ఏం చేద్దామంటావు? నేను ఇప్పటికే వాదించి, ఆయనను బాధపెట్టాను. 147 00:08:05,235 --> 00:08:06,904 -తెలిసింది. తెలిసింది. -ఏంటి? 148 00:08:06,987 --> 00:08:09,740 మనం డికిన్సన్ పాటల కచేరీ పెడితే బాగుంటుంది. 149 00:08:10,490 --> 00:08:14,703 ఎమిలీ, ఇది భలే ఐడియా. మనం కచేరీ పెట్టి చాలా కాలం అయింది. 150 00:08:14,786 --> 00:08:17,414 అవును, పార్లర్ లో చలిమంట వేద్దాం. మనం పియానో చుట్టూ చేరదాం. 151 00:08:17,497 --> 00:08:19,166 ఆయనకు ఇష్టమైన పాత పాటలన్నీ పాడదాం. 152 00:08:19,249 --> 00:08:20,667 అవును. చాలా బాగుంటుంది. 153 00:08:20,751 --> 00:08:22,628 ఇది మళ్లీ పాత రోజుల్ని గుర్తుకు తెస్తుంది, 154 00:08:22,711 --> 00:08:25,506 మీరు చిన్నప్పడు అందరూ మంట చుట్టూ చేరి పాటలు పాడేవారు. 155 00:08:25,589 --> 00:08:27,257 ఇలాంటి కచేరీ అంటే మీ నాన్నకు చాలా ఇష్టం. 156 00:08:27,341 --> 00:08:30,469 అమ్మాయిలూ, మన కుటుంబమంతా రావాలి. 157 00:08:30,552 --> 00:08:31,720 నాకు ఇష్టమే. 158 00:08:32,261 --> 00:08:36,015 తన పుట్టిన రోజునాడు దీన్ని నాన్న ఎంతగానో ఇష్టపడతారు, మనమంతా పాడితే! 159 00:08:37,893 --> 00:08:39,311 విన్నీ. 160 00:08:40,437 --> 00:08:41,980 నువ్వు పాటలకు పెదాలు కదుపుతావుగా? 161 00:08:42,063 --> 00:08:43,690 నీకు అదే మంచిదిలే, లవీనియా. 162 00:08:44,733 --> 00:08:47,486 -మనకు ఇంకో సమస్య ఎదురవుతోంది. -ఏంటది? 163 00:08:47,569 --> 00:08:50,572 మొత్తం కుటుంబ సభ్యులంతా లేకపోతే అది కుటుంబ కచేరీ కాదు. 164 00:08:51,073 --> 00:08:52,741 ఆస్టిన్, సూల సంగతేంటి? 165 00:08:53,325 --> 00:08:54,826 వాళ్లూ రావాలంటున్నావా? 166 00:08:55,536 --> 00:08:58,247 నువ్వు బిడ్డని ఎత్తుకునేందుకు సూ అంగీకరించకపోయినా రమ్మంటున్నావా? 167 00:08:59,331 --> 00:09:02,543 కుటుంబం ముందు అవన్నీ పట్టించుకోకూడదు. అంతే. 168 00:09:02,626 --> 00:09:03,710 అమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. 169 00:09:04,336 --> 00:09:06,547 ఈ రాత్రికి వాళ్లు వచ్చేలా నేను ఒప్పిస్తాను. ఆ సంగతి నాకు వదిలెయ్. 170 00:09:14,429 --> 00:09:15,430 సూ! 171 00:09:20,143 --> 00:09:22,479 సూ, ఏమైంది? 172 00:09:24,398 --> 00:09:28,318 రాత్రంతా బాబు పడుకోనేలేదు, 173 00:09:28,402 --> 00:09:30,612 నేనేమో బాగా అలసిపోయాను. 174 00:09:31,196 --> 00:09:34,992 నిజంగా చెబుతున్నాను, ఇంత అలసట ఉంటుందని నాకు తెలియదు. నేను... 175 00:09:35,576 --> 00:09:38,161 ఎమిలీ, ఒక తల్లిగా నా బాధ్యత నేను నిర్వర్తించలేనేమో. 176 00:09:38,245 --> 00:09:40,914 నువ్వు ఎంతో చేస్తున్నావు, సూ. ఇప్పటికే ఎంతో చేశావు. 177 00:09:40,998 --> 00:09:42,958 బాబును ఎంతో బాగా చూసుకుంటున్నావు. 178 00:09:45,836 --> 00:09:47,129 సూ, బాబు ఎక్కడ? 179 00:09:47,212 --> 00:09:48,839 క్లారా, ఆనాల దగ్గర ఉన్నాడు. 180 00:09:48,922 --> 00:09:50,966 మానసికంగా వాళ్ల పరిస్థితి బాగోలేదని నాకు తెలుసు, 181 00:09:51,049 --> 00:09:54,094 కానీ బాబు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. 182 00:09:54,678 --> 00:09:57,639 నాకు కాస్త విశ్రాంతి కావాలనిపించింది. అది తప్పా? 183 00:09:57,723 --> 00:09:59,808 లేదు. లేదు. ఏం తప్పు కాదు. 184 00:09:59,892 --> 00:10:01,185 సరే. 185 00:10:02,644 --> 00:10:03,854 సూ, నా మాట విను. 186 00:10:05,772 --> 00:10:06,815 నువ్వంటే నాకెంతో ఇష్టం. 187 00:10:08,692 --> 00:10:10,444 నువ్విలా అంటావని అనుకోలేదు. 188 00:10:10,527 --> 00:10:13,739 ఈ భూమిపై అన్నింటికంటే నువ్వంటేనే నాకిష్టం, 189 00:10:13,822 --> 00:10:16,909 ఈ విషయంలో నీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. 190 00:10:18,368 --> 00:10:20,245 ఇది నీకు అర్థమైతే చాలు. 191 00:10:21,747 --> 00:10:23,540 నీకు బాగా అర్థమయ్యేందుకు ఇదే విషయాన్ని 192 00:10:23,624 --> 00:10:26,001 ప్రతి రోజూ చెప్పమన్నా చెబుతాను. 193 00:10:26,668 --> 00:10:29,254 ఎందుకంటే, నువ్వే నా సర్వస్వం, సూ. 194 00:10:29,338 --> 00:10:30,547 ఎమిలీ. 195 00:10:30,631 --> 00:10:32,049 నువ్వు లేకుండా నేను బతకలేను, 196 00:10:32,799 --> 00:10:34,801 నువ్వు లేకుండా నేను ఊపిరైనా తీసుకోలేను, 197 00:10:34,885 --> 00:10:36,428 నువ్వు లేకుండా నేను రాయలేను. 198 00:10:37,429 --> 00:10:38,972 ఇదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? 199 00:10:39,056 --> 00:10:40,766 ఇది నా చిన్న మనసులోంచి వచ్చింది. 200 00:10:45,771 --> 00:10:47,272 ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. 201 00:10:47,356 --> 00:10:49,525 సరే, నర్స్ ఎమిలీ మీ సేవకు సిద్ధంగా ఉంది. 202 00:10:49,608 --> 00:10:52,152 ధన్యవాదాలు, నర్స్. నువ్వు నన్ను ఆదుకున్నావు. 203 00:10:54,112 --> 00:10:57,574 నాన్న పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఈ రోజు పాటల కచేరీ ఏర్పాటు చేశాం. 204 00:10:58,325 --> 00:10:59,618 నువ్వూ వస్తావా? 205 00:11:00,661 --> 00:11:02,496 చాలా బాగుంది. 206 00:11:03,247 --> 00:11:04,456 నాకూ ఇష్టమే. 207 00:11:04,540 --> 00:11:06,083 ధన్యవాదాలు, సూ. 208 00:11:07,751 --> 00:11:11,004 నువ్వు లేకుండా ఈ కుటుంబం పూర్తి కాదు. 209 00:11:13,632 --> 00:11:15,259 ఇక ఇప్పుడు మనం ఆస్టిన్ ను ఒప్పించాలి. 210 00:11:15,342 --> 00:11:18,303 -మరేం పర్వాలేదు. నేను చూసుకుంటాలే. -నువ్వా? 211 00:11:18,887 --> 00:11:22,850 నేను ఇంకా అతని భార్యనే. నేను చెప్పిన మాట అతను వినాల్సిందే. 212 00:11:23,517 --> 00:11:26,812 నువ్వు అతని భార్యవి కావచ్చు. కానీ నేను నీదాన్ని. 213 00:11:31,775 --> 00:11:33,819 దేవుడా, వాడు నాకోసమే ఏడుస్తున్నాడు. 214 00:11:33,902 --> 00:11:34,903 -వెళ్లు. -క్షమించు. 215 00:11:34,987 --> 00:11:36,530 ఫరవాలేదు. ఈ రాత్రికి కలుద్దాం. 216 00:11:37,197 --> 00:11:38,323 సరే మరి. 217 00:11:49,918 --> 00:11:51,378 మిస్ ఇ డికిన్సన్ ఆమ్హర్స్ట్, మసాచుసెట్స్ 218 00:11:51,461 --> 00:11:53,797 కల్నల్ టి డబ్ల్యు హిగ్గిన్సన్ బ్యూఫోర్ట్, ఎస్ సి 219 00:11:54,381 --> 00:11:57,259 తమ అలబాస్టర్ చాంబర్లలో సురక్షితంగా ఉన్నారు - 220 00:11:57,342 --> 00:11:58,677 ఉదయం తాకలేదు - 221 00:11:58,760 --> 00:12:00,345 మధ్యాహ్నమూ తాకలేదు - 222 00:12:00,971 --> 00:12:03,640 నమ్రత గల పునరుత్థాన సభ్యులారా, నిద్రించండి, 223 00:12:04,224 --> 00:12:07,394 ఇంటివాసానికి వేసిన సన్నటి వస్త్రం రాతితో చేసిన పైకప్పు - 224 00:12:09,396 --> 00:12:13,609 పాఠం మొదలుపెట్టేముందు అటెండెన్స్ తీసుకుంటాను. 225 00:12:13,692 --> 00:12:15,986 దయచేసి, ఒక్కొక్కరూ మీ పేరు చెబుతారా? 226 00:12:16,069 --> 00:12:20,365 అలాగే, మీ గురించి మీరు పరిచయం చేసుకోవచ్చు కదా? 227 00:12:20,449 --> 00:12:21,658 నేను మొదలుపెడతాను. 228 00:12:23,160 --> 00:12:24,912 నా పేరు ఎవరెట్. 229 00:12:25,412 --> 00:12:27,497 ఇంటీరియర్ డిజైన్ మీద నాకు ఆసక్తి. 230 00:12:27,581 --> 00:12:30,209 నా చరిత్ర గురించి చెప్పేందుకు నేను ఇష్టపడను, సరేనా? 231 00:12:30,834 --> 00:12:32,336 నేను భవిష్యత్తు గురించే మాట్లాడతాను. 232 00:12:32,419 --> 00:12:34,546 ఈ ప్రాంతం నుంచి బయటపడితేనే భవిష్యత్తు. 233 00:12:34,630 --> 00:12:35,881 అవును. 234 00:12:35,964 --> 00:12:38,509 -బాగా చెప్పావు. బాగా చెప్పావు. -అవును, నేస్తం. ఆమెన్. 235 00:12:38,592 --> 00:12:40,844 నువ్వు ఇక్కడే ఉండేవాడివా? 236 00:12:40,928 --> 00:12:45,098 ఎరాస్మస్ తప్ప మేమంతా ఇక్కడే పుట్టాం. అతను ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు. 237 00:12:45,182 --> 00:12:46,266 కాలమనేది కాల్పనికం. 238 00:12:46,350 --> 00:12:49,853 ఇతర కథల మాదిరిగానే, చరిత్రలను నేను లోపలా, బయటా నేస్తాను. 239 00:12:50,354 --> 00:12:52,564 అరుదుగా, నేను సాలీడు ఆకారం దాలుస్తాను. 240 00:12:52,648 --> 00:12:55,859 గురూ, నీ రూటే సెపరేటు. 241 00:12:56,610 --> 00:12:57,986 సరే. 242 00:12:58,070 --> 00:12:59,530 నీ సంగతి? 243 00:12:59,613 --> 00:13:00,864 నా పేరు గోడ. 244 00:13:00,948 --> 00:13:02,449 నేను పెద్దగా ఉన్నాను కదా, అందరూ నన్ను గోడ అనే పిలుస్తారు. 245 00:13:02,533 --> 00:13:05,744 కానీ వీటన్నింటికంటే వ్యక్తిత్వమే నా బలం. 246 00:13:05,827 --> 00:13:06,954 మీరు అతని సాయం తీసుకోవచ్చు. 247 00:13:07,037 --> 00:13:08,205 నేను గోడని. 248 00:13:08,288 --> 00:13:09,498 -అర్థమైంది. -సరే. 249 00:13:09,581 --> 00:13:11,667 నీ పేరు? 250 00:13:11,750 --> 00:13:12,751 మైకేల్ జోర్డాన్. 251 00:13:13,418 --> 00:13:14,628 మైకేల్ రివర్ జోర్డాన్. 252 00:13:14,711 --> 00:13:17,005 నీకొక గొప్పతనం ఉంది, మైకేల్ జోర్డాన్. 253 00:13:17,965 --> 00:13:21,260 ఏదో ఒక రోజు, నీ ప్రతిభను చూసేందుకు స్టేడియాలన్నీ నిండిపోతాయి. 254 00:13:21,844 --> 00:13:23,345 ఎరాస్మస్ భవిష్యత్తును చూడగలడు. 255 00:13:23,428 --> 00:13:27,850 నువ్వు చూడగలిగితే, భవిష్యత్తు, గతం సహజీవనం చేస్తూంటాయి. 256 00:13:27,933 --> 00:13:29,726 నల్లజాతి వాళ్ల గొప్పదనం. 257 00:13:31,520 --> 00:13:34,231 వావ్, సరే. 258 00:13:36,024 --> 00:13:37,651 నువ్వు. నువ్వూ ఏదైనా చెబుతావా? 259 00:13:37,734 --> 00:13:39,278 నా పేరు సోలమన్. 260 00:13:39,361 --> 00:13:43,448 కిచెన్ లో పనిచేసేవాణ్ని. మూలికలు, మసాలా దినుసుల గురించి బాగా తెలుసు. 261 00:13:43,532 --> 00:13:44,575 ఓహో, అయితే నువ్వు మంచి వంటవాడివన్నమాట? 262 00:13:44,658 --> 00:13:45,826 నేనొక హంతకుడిని. 263 00:13:45,909 --> 00:13:47,953 మీకు విషం పెట్టేస్తాను. అది వస్తున్నట్టే మీకు తెలియదు. 264 00:13:48,662 --> 00:13:50,372 అయితే నేను జాగ్రత్తగా ఉంటాను. 265 00:13:50,455 --> 00:13:51,748 నువ్వు ప్రయత్నించవచ్చు! 266 00:13:56,420 --> 00:13:59,548 సరే, అటెండెన్స్ అయిపోయింది... 267 00:13:59,631 --> 00:14:01,049 మీరు అక్షర క్రమం నేర్చుకుంటే, 268 00:14:01,133 --> 00:14:04,469 ఇంగ్లీ,షు భాషలోని ఏ పదాన్నయినా మీరు పలకగలుగుతారు. 269 00:14:04,553 --> 00:14:05,762 "నా తుపాకీ ఎక్కడ" అని పలకగలనా? 270 00:14:06,930 --> 00:14:08,348 భలే అన్నావు! 271 00:14:08,432 --> 00:14:11,727 "నేను మీ సైన్యంలో చేరితే, నాకు ఆయుధం ఇస్తారా" అని పలకగలనా? 272 00:14:11,810 --> 00:14:12,895 బూమ్. 273 00:14:12,978 --> 00:14:15,022 మీరు మాకు తుపాకులు ఇప్పిస్తారని అనుకున్నాం, బక్రా. 274 00:14:15,105 --> 00:14:17,191 అవును, హిగ్గిన్సస్ తో మాట్లాడతామని అన్నారు కదా, ఏమైంది? 275 00:14:17,274 --> 00:14:18,692 ఈయనే అన్నాడు కదా? 276 00:14:18,775 --> 00:14:21,361 -నేను ఆయన దృష్టికి తీసుకొచ్చాను. -మరి ఆయన ఏమన్నాడు? 277 00:14:22,196 --> 00:14:24,740 "ఆ సంగతి పరిశీలిస్తున్నాం" అన్నాడు. 278 00:14:24,823 --> 00:14:28,202 "పరిశీలించడం." అంటే ఏంటి అర్థం? 279 00:14:28,785 --> 00:14:29,912 హిగ్గిన్సన్ ఏం చెప్పారంటే, 280 00:14:29,995 --> 00:14:34,082 మొట్టమొదటి దక్షిణ కరొలినా సైనిక దళం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని. 281 00:14:34,166 --> 00:14:35,125 ప్రయోగమట. 282 00:14:35,209 --> 00:14:38,754 మీదింకా అధికారికంగా ధ్రువీకరణ పొందిన దళం కాదని అనిపిస్తోంది. 283 00:14:38,837 --> 00:14:41,423 బానిసత్వ నిర్మూలన ప్రకటనపై లింకన్ సంతకం చేసేంతవరకూ ధ్రువీకరణ రాదు. 284 00:14:41,507 --> 00:14:43,258 సరే, మరి అది ఎప్పుడు జరుగుతుంది? 285 00:14:43,342 --> 00:14:44,801 జనవరి 1, 1863. 286 00:14:44,885 --> 00:14:46,720 త్వరలోనే జరుగుతుందని హిగ్గిన్సన్ భావిస్తున్నారు, 287 00:14:47,304 --> 00:14:49,264 కానీ ఆయన తనంతట తానుగా మీకు ఆయుధాలు ఇవ్వలేడు. 288 00:14:49,973 --> 00:14:51,892 ఆయన జనరల్ శాక్స్టన్ నుంచి అనుమతి తీసుకోవాలి, 289 00:14:51,975 --> 00:14:54,686 ఆయనేమో నేరుగా లింకన్ నుంచే అనుమతి తీసుకోవాలి. 290 00:14:54,770 --> 00:14:58,190 ఇలా తెల్లవాళ్లంతా మన దారికి అడ్డుపడుతున్నారు. 291 00:14:58,273 --> 00:15:02,319 నేను మీకు సాయం చేయగలనని అనుకున్నా, కానీ నేను వచ్చింది మీకు చదువు నేర్పడానికే. 292 00:15:02,402 --> 00:15:05,739 -మాకు చదువు వద్దు. మేం యుద్ధం చేస్తాం. -మాకు భవిష్యత్తు కావాలి. 293 00:15:06,615 --> 00:15:07,950 సరే, మీకు ఒక సంగతి చెబుతాను. 294 00:15:09,618 --> 00:15:12,746 చక్కటి భవిష్యత్తును పొందాలంటే, మీరు గతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 295 00:15:13,664 --> 00:15:16,333 అంటే చరిత్రను చదవాలి, 296 00:15:17,334 --> 00:15:21,004 అంధకారం గురించి చదవాలి, 297 00:15:21,088 --> 00:15:22,756 బాధల గురించి చదవాలి, 298 00:15:22,840 --> 00:15:24,132 వైరుధ్యం గురించి చదవాలి. 299 00:15:25,467 --> 00:15:29,137 అమెరికా తనంతట తానుగా విరుద్ధ భావాలతో ఉంది. అది చదవాలి. 300 00:15:30,556 --> 00:15:33,475 ఎందుకంటే, మీరు అంధకారంతో పోరాడకపోతే, 301 00:15:34,351 --> 00:15:37,354 వెలుతురులోకి ఎలా పయనించగలరు? 302 00:15:42,818 --> 00:15:44,862 ఈ బక్రా చెప్పిన దాంట్లో పాయింట్ లేకపోలేదు. 303 00:15:45,529 --> 00:15:46,530 అవును. 304 00:15:49,157 --> 00:15:50,659 చదవడం నేర్చుకుందాం. 305 00:15:56,623 --> 00:15:58,292 ఆస్టిన్, ఇక్కడున్నావా. 306 00:15:58,375 --> 00:16:00,961 వెళ్లి బట్టలేసుకో. మనం ఈ రాత్రికల్లా మీ నాన్నగారి ఇంటికి వెళ్లాలి. 307 00:16:01,044 --> 00:16:03,589 ఏమంటున్నావు? నేను మా నాన్నతో మాట్లాడటం లేదు. 308 00:16:03,672 --> 00:16:07,467 తెలుసు. కానీ ఇవాళ ఆయన పుట్టినరోజు, మనం పాటల కచేరీలో పాల్గొనాలి... 309 00:16:07,551 --> 00:16:09,928 నేను చెప్పేదేమీ పట్టించుకోవేం? 310 00:16:10,512 --> 00:16:12,598 మా నాన్నతో నేను తెగదెంపులు చేసుకున్నాను. 311 00:16:12,681 --> 00:16:16,685 ఆయన పుట్టినరోజుకు రాను. కానీ నిన్ను మాత్రం ఆపను. 312 00:16:16,768 --> 00:16:19,396 నిజానికి, నువ్వు వెళ్తేనే నాకు సంతోషం. 313 00:16:19,479 --> 00:16:21,565 నన్నూ, బాబునూ ఒంటరిగా వదిలెయ్. 314 00:16:21,648 --> 00:16:24,985 వాడితో గడిపేందుకు నాకు సమయం దొరికింది. మేమిద్దరం ఈ రాత్రి సరదాగా గడుపుతాం. 315 00:16:25,611 --> 00:16:29,323 తండ్రి తన కొడుకుతో కలిసి ఒక రాత్రి ఎందుకు గడపకూడదు? 316 00:16:29,406 --> 00:16:32,409 నువ్వు రాకపోతే, బాబు క్లారా, ఆనాలతో ఉంటాడు. 317 00:16:32,492 --> 00:16:33,744 వాణ్ని వాళ్లు చూసుకుంటారు. 318 00:16:33,827 --> 00:16:35,370 నువ్వు మళ్లీ నా మాట వినట్లేదు. 319 00:16:36,747 --> 00:16:39,541 వాణ్ని నేను చూసుకుంటానని చెబుతున్నాగా. 320 00:16:40,626 --> 00:16:43,587 నీ గురించే నువ్వు చూసుకోలేవు. 321 00:16:44,171 --> 00:16:46,215 ఈ సాయంత్రమంతా ఎక్కడికి వెళ్లావు? 322 00:16:46,298 --> 00:16:48,425 మళ్లీ తాగొచ్చావనుకుంటా. 323 00:16:49,218 --> 00:16:52,221 లేదు. బాబుతో నువ్వు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. 324 00:16:52,304 --> 00:16:55,766 వాణ్ని ఏ కిటికీలోంచో వదిలేస్తావు లేకపోతే ఏదైనా ప్రమాదానికి గురి చేస్తావు. 325 00:16:57,017 --> 00:17:00,187 తండ్రులు పిల్లల్ని సరిగా చూసుకోలేరు, ఆస్టిన్. 326 00:17:00,270 --> 00:17:01,772 దాన్ని నువ్వేమీ మార్చలేవు. 327 00:17:01,855 --> 00:17:03,273 మగవాళ్లు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. 328 00:17:03,941 --> 00:17:05,817 అలాగా? ఏంటో అవి? 329 00:17:06,318 --> 00:17:08,069 యుద్ధంలో పాల్గొనడం వంటివి. 330 00:17:08,779 --> 00:17:12,449 నువ్వు యూనిఫారం వేసుకుని ఏం చేయాలో అది ఎందుకు చేయవు? 331 00:17:12,950 --> 00:17:14,034 మగవాళ్లు చేయాల్సిన పని అదే. 332 00:17:15,661 --> 00:17:18,539 బహుశా అప్పుడు మీ నాన్న నిన్ను చూసి గర్వపడతారు. 333 00:17:23,502 --> 00:17:24,545 నీ దగ్గర నా పాట ఉందా? 334 00:17:25,295 --> 00:17:27,923 భలే మంచి పాట. నీ వద్ద "ప్లెంటీ ఆఫ్ ఫిష్ ఇన్ ద సీ" ఉందా? 335 00:17:28,006 --> 00:17:29,466 -ఉంది. -అవన్నీ వరుస క్రమంలో ఉన్నాయా? 336 00:17:29,550 --> 00:17:31,134 -ఉన్నాయి, ఉన్నాయి, ఇంకా... -బాగుంది. 337 00:17:37,140 --> 00:17:40,644 అతను ఉల్లాసమైన మంచి వ్యక్తి అతను ఉల్లాసమైన మంచి వ్యక్తి 338 00:17:41,520 --> 00:17:42,688 ఎడ్వర్డ్! 339 00:17:42,771 --> 00:17:44,773 ఎడ్వర్డ్, నా మాట వినబడుతోందా? 340 00:17:44,857 --> 00:17:46,859 వినబడుతోంది. 341 00:17:47,693 --> 00:17:49,361 ఆ అరుపే నన్ను చంపేసేంత పని చేసింది. 342 00:17:49,444 --> 00:17:51,321 హమ్మయ్య. నువ్వు మాకు దక్కవనుకున్నాను. 343 00:17:53,490 --> 00:17:54,741 ఏంటి ఈ హడావిడంతా? 344 00:17:55,325 --> 00:17:58,704 -ఇది నా ఐడియానే. -అలాగా? 345 00:17:58,787 --> 00:18:01,957 మీ పుట్టిన రోజు సందర్భంగా, ఇవాళ పాతకాలపు పాటల కచేరీ 346 00:18:02,040 --> 00:18:03,166 పెట్టాలనుకున్నాం. 347 00:18:03,750 --> 00:18:04,793 బాగుంది... 348 00:18:05,711 --> 00:18:07,880 నాకు కూడా సంగీతమంటే కాస్త మక్కువే. 349 00:18:07,963 --> 00:18:09,756 అవును. నాకు చాలా ఇష్టం. 350 00:18:10,883 --> 00:18:14,553 అతను ఉల్లాసమైన మంచి వ్యక్తి అతను ఉల్లాసమైన మంచి వ్యక్తి 351 00:18:14,636 --> 00:18:19,641 అతను ఉల్లాసమైన మంచి వ్యక్తి దానినెవరూ కాదనలేరు 352 00:18:23,937 --> 00:18:26,523 మనం సంక్లష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం 353 00:18:26,607 --> 00:18:29,151 ఉల్లాసానికి చోటు లేదు పాటలు పద్యాలకు అవకాశం లేదు 354 00:18:29,234 --> 00:18:31,862 శాంతి గీతాలు తమ శోభను కోల్పోయాయి 355 00:18:31,945 --> 00:18:34,531 అదీ అసలు విషయం 356 00:18:34,615 --> 00:18:37,034 మేం సోదరులుగా భావించిన వాళ్లు 357 00:18:37,117 --> 00:18:39,786 తిరుగుబాటుదారులుగా మారిపోయారు 358 00:18:39,870 --> 00:18:42,497 ఇప్పుడు మేం వాళ్లకి గుణపాఠం నేర్పాలి 359 00:18:42,581 --> 00:18:45,417 అదీ అసలు విషయం 360 00:18:45,501 --> 00:18:47,794 అదీ సంగతి 361 00:18:47,878 --> 00:18:50,547 తిరుగుబాటుదారులు చెల్లాచెదురై పోవాలి 362 00:18:50,631 --> 00:18:53,634 వాళ్లని ఈ నేలపైనా, సముద్రంపైనా ఉండకుండా మేం తరిమి కొడతాం 363 00:18:53,717 --> 00:18:56,678 అదీ అసలు విషయం 364 00:18:56,762 --> 00:18:59,681 సూర్యుడు ప్రకాశిస్తున్నాడు 365 00:18:59,765 --> 00:19:02,976 కెంటకీలోని నా పాత ఇంటిపై 366 00:19:03,060 --> 00:19:08,482 ఇది వేసవికాలం, జనమంతా ఉల్లాసంగా ఉన్నారు 367 00:19:09,149 --> 00:19:11,902 జొన్న కంకులు ఎదుగుతున్నాయి 368 00:19:11,985 --> 00:19:14,905 బయళ్లు పచ్చగా కళకళలాడుతున్నాయి 369 00:19:14,988 --> 00:19:20,494 పక్షులు రోజంతా కిలకిలారవాలు చేస్తున్నాయి 370 00:19:21,495 --> 00:19:24,456 ఒక మహిళ తన జుత్తును విసిరికొట్టింది 371 00:19:24,540 --> 00:19:27,417 తనను ఆకట్టుకునేందుకు వచ్చినవారిపై 372 00:19:27,501 --> 00:19:30,504 వారి హృదయాలను ముక్కలు చేసేలా 373 00:19:30,587 --> 00:19:33,632 నవ్వింది, అది నిజమైనా అబద్ధమైనా 374 00:19:33,715 --> 00:19:36,718 సంతోషంగా ఆమె పాట పాడింది 375 00:19:36,802 --> 00:19:39,930 రోజంతా శ్రమ తెలియకుండా 376 00:19:40,013 --> 00:19:42,933 సముద్రంలో ఎన్నో చేపలు ఉన్నాయి 377 00:19:43,016 --> 00:19:46,103 ఎప్పటిలాగే పట్టుబడ్డాయి 378 00:19:46,186 --> 00:19:49,314 సముద్రంలో ఎన్నో చేపలు ఉన్నాయి 379 00:19:49,398 --> 00:19:52,609 ఎప్పటిలాగే పట్టుబడ్డాయి 380 00:19:57,531 --> 00:19:59,658 మాకింగ్ బర్డ్ పాడే పాట విను 381 00:19:59,741 --> 00:20:01,952 మాకింగ్ బర్డ్ పాడే పాట విను 382 00:20:02,035 --> 00:20:06,164 తన సమాధిపైనుంచి మాకింగ్ బర్డ్ పాట పాడుతూనే ఉంది 383 00:20:06,248 --> 00:20:08,542 మాకింగ్ బర్డ్ పాడే పాట విను 384 00:20:08,625 --> 00:20:10,752 మాకింగ్ బర్డ్ పాడే పాట విను 385 00:20:10,836 --> 00:20:15,090 శోక వృక్షాలు ఊగే చోట ఇంకా పాడుతూనే ఉంది 386 00:20:15,174 --> 00:20:17,718 -ఏయ్, విన్నీ! -విన్నీ! ఏయ్! ఇంకా. ఇంకా. ఇంకా. 387 00:20:18,594 --> 00:20:19,636 వాయిస్తూనే ఉండు. 388 00:20:20,929 --> 00:20:22,222 నాకు ఈ సంతోషం కావాలి. 389 00:20:22,973 --> 00:20:23,974 ధన్యవాదాలు. 390 00:20:24,558 --> 00:20:26,894 దేవుడా, ఇప్పుడు నా మెదడులో అలముకున్న చీకట్లు తొలగిపోయాయి, నేను... 391 00:20:27,561 --> 00:20:30,647 నువ్వు రాసిన కవిత గురించి నీతో పంచుకోవాలనుకున్నాను. 392 00:20:30,731 --> 00:20:32,566 నా కవితా? ఏంటది? 393 00:20:32,649 --> 00:20:35,485 చివరిసారి నాకు పంపించావే అది, బాబు పుట్టడానికి సరిగ్గా ముందు. 394 00:20:36,695 --> 00:20:38,780 "తమ అలబాస్టర్ చాంబర్లలో సురక్షితంగా ఉన్నారు" ఆ కవిత. 395 00:20:38,864 --> 00:20:40,699 నేను పంపిన వాటిలో అదొకటి... 396 00:20:40,782 --> 00:20:42,534 వాటిలో అదొకటా, ఎవరికి పంపావు? 397 00:20:42,618 --> 00:20:45,537 నీకే. అది, అవును. చెప్పు. 398 00:20:46,788 --> 00:20:51,668 అలాగే, మరి, అదొక అద్భుతమైన కవిత. 399 00:20:51,752 --> 00:20:55,506 మరణం, మంచు గురించి ఊహాజనిత కవిత. 400 00:20:55,589 --> 00:20:57,633 అది ఎంతో బాగుంటుంది, ఎమిలీ. 401 00:20:58,842 --> 00:20:59,843 కానీ? 402 00:21:00,969 --> 00:21:03,096 -ఏంటి కానీ? -లేదు, లేదు. 403 00:21:03,180 --> 00:21:06,642 లేదు. కానీ ఏం లేదు. ఏమో... నేను... 404 00:21:07,851 --> 00:21:11,021 రెండో చరణం లేకపోతే అది ఇంకా బాగుండేది. 405 00:21:11,104 --> 00:21:12,272 అది లేకుండానా? 406 00:21:12,356 --> 00:21:14,441 ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. 407 00:21:15,192 --> 00:21:19,363 కానీ, నీకు అందరికన్నా నా అభిప్రాయం ఎంతో విలువైనదని నాకు తెలుసు. 408 00:21:19,947 --> 00:21:22,074 పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే సమయం ఇది. 409 00:21:22,157 --> 00:21:24,409 ఎడ్వర్డ్, కొన్ని జ్ఞాపకాలను మాకు గుర్తు చెయ్యి. 410 00:21:24,493 --> 00:21:25,827 మనకు అలాంటివి ఉన్నాయా? 411 00:21:25,911 --> 00:21:27,037 ఉన్నాయి. 412 00:21:27,120 --> 00:21:29,414 మనం మొదటిసారి ఎలా కలుసుకున్నామో చెప్పవచ్చుగా? 413 00:21:29,498 --> 00:21:30,499 సరే. 414 00:21:31,291 --> 00:21:33,627 -అది 15వ శతాబ్దం... -ఎడ్వర్డ్! 415 00:21:33,710 --> 00:21:35,128 -...అప్పుడు నేను... -అసలు విషయం చెప్పు. 416 00:21:35,212 --> 00:21:37,840 సరే. సరే. సరే. సరే. 417 00:21:37,923 --> 00:21:39,049 సరే. మరి... 418 00:21:40,050 --> 00:21:44,012 అప్పుడు నేను యువకుడిని. మసాచుసెట్స్ స్టేట్ మిలీషియాలో సభ్యుడిని. 419 00:21:44,513 --> 00:21:46,431 నన్ను మాన్సన్ లో నియమించారు. 420 00:21:46,515 --> 00:21:47,975 నేను పెరిగింది అక్కడే. 421 00:21:48,058 --> 00:21:50,811 ఒక రోజు రాత్రి, మాన్సన్ అకాడమీలో జరిగిన కెమిస్ట్రీ లెక్చర్ కి హాజరయ్యాను, 422 00:21:50,894 --> 00:21:51,895 నాకు తెలియని సంగతి ఏంటంటే, 423 00:21:51,979 --> 00:21:55,148 మిస్ ఎమిలీ నార్క్రాస్ నా పక్కనే కూర్చుంది. 424 00:21:55,232 --> 00:21:56,942 ఏంటీ? అమ్మా నువ్వు కెమిస్ట్రీ లెక్చర్ కి వెళ్ళావా? 425 00:21:57,025 --> 00:22:00,237 నేను వెళ్లింది కేవలం నా తమ్ముడికోసం ఒక సీటు ఉంచుదామని, అంతే. 426 00:22:00,320 --> 00:22:03,490 ఏదైనా సైన్సు క్లాస్ మొదలయ్యేలోగానే ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను. 427 00:22:03,574 --> 00:22:06,910 అవును, కానీ తను కెమిస్ట్రీ లెక్చర్ కోసం అక్కడే ఉండిపోయింది. 428 00:22:08,370 --> 00:22:12,624 ఆయనేమో సైన్యంలో మేజర్, పట్టీ, కత్తీ అన్నీ ధరించి ఉన్నారు. 429 00:22:13,333 --> 00:22:14,668 అది తొలి చూపులోనే ప్రేమ. 430 00:22:14,751 --> 00:22:17,921 అందుకేనా నేను రాసిన ప్రేమలేఖకు మూడు నెలల దాకా జవాబివ్వలేదు? 431 00:22:18,505 --> 00:22:19,840 అంతకాలం ఏమీ కాదు. 432 00:22:19,923 --> 00:22:22,176 మూడు నెలలు. ఆమె నన్ను అయోమయంలో పడేసింది. 433 00:22:22,259 --> 00:22:24,428 -అది చాలా దారుణం. -మీ పెళ్లి ఎలా జరిగింది? 434 00:22:24,511 --> 00:22:26,680 పెళ్లి. చెబుతా, విను. 435 00:22:27,431 --> 00:22:30,517 నాకు బాగా గుర్తు. ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. 436 00:22:30,601 --> 00:22:33,770 వెలుగుతున్న కొవ్వొత్తిని అలా చూస్తూ ఉన్నాను, 437 00:22:33,854 --> 00:22:37,024 అది ఆరిపోయేంతవరకూ. 438 00:22:40,611 --> 00:22:45,199 నా సోదరి లవీనియాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక. 439 00:22:45,282 --> 00:22:47,117 నేను బాగా చిన్నదాన్నని ఆమె ఉద్దేశం. 440 00:22:47,201 --> 00:22:49,536 నేను లేకుండా తను ఎలా ఉండగలనో ఆమెకు తెలియలేదు. 441 00:22:49,620 --> 00:22:51,121 ఆమె నిజంగానే భయపడిపోయింది. 442 00:22:51,205 --> 00:22:54,082 మా పెళ్లి రోజంతా తను ఏడుస్తూనే ఉంది. 443 00:22:54,958 --> 00:22:55,959 అది... 444 00:22:58,921 --> 00:23:01,507 మొత్తానికి అలా జరిగింది. 445 00:23:01,590 --> 00:23:04,718 ఎడ్వర్డ్ తో కలసి గొప్ప జీవితాన్ని ఆస్వాదించాను, ముగ్గురు చక్కటి పిల్లలు. 446 00:23:05,302 --> 00:23:07,304 మా అమ్మను పట్టించుకోకపోతే ఎవరు ఖాతరు చేసేవారు 447 00:23:07,387 --> 00:23:09,389 ఎందుకంటే, మీ ముగ్గురూ పుట్టాక 448 00:23:09,473 --> 00:23:10,766 నేను మాన్సన్ వెళ్లినప్పుడు చూస్తే, 449 00:23:10,849 --> 00:23:12,768 అప్పటికే ఆమె ఎల్లో ఫీవర్ తో చిక్కిశల్యమైంది. 450 00:23:17,773 --> 00:23:18,774 ఎన్నో తీపి జ్ఞాపకాలు. 451 00:23:18,857 --> 00:23:22,027 అవును. అద్భుతం. 452 00:23:22,110 --> 00:23:24,780 తెలుసా, నా పెళ్లి దుస్తుల్ని నేను మళ్లీ ఈ రోజే చూశాను. 453 00:23:24,863 --> 00:23:28,116 అవి మా బామ్మ నార్క్రాస్ బొంతతో సహా ప్యాక్ చేయబడి ఉన్నాయి, 454 00:23:28,200 --> 00:23:29,201 దుమ్ము పట్టేసి ఉన్నాయవి. 455 00:23:29,284 --> 00:23:30,536 ఆ డ్రస్సు నాకింకా గుర్తుంది. 456 00:23:32,162 --> 00:23:34,081 నీకు గుర్తుందా? 457 00:23:34,164 --> 00:23:36,542 -అవును, నువ్వు ఆ డ్రస్సు వేసుకురా. -ఎడ్వర్డ్. 458 00:23:37,417 --> 00:23:39,419 ఎడ్వర్డ్, ఇక ఆగు. 459 00:23:39,503 --> 00:23:41,630 -అది ఇప్పుడు నాకు సరిపోదు. -మామ్, వేసుకుని చూడు. 460 00:23:41,713 --> 00:23:44,007 ఊరుకోండి, నేనేం పదహారేళ్ళ పెళ్లి కూతుర్ని కాను 461 00:23:44,091 --> 00:23:47,052 మీ నాన్న ఆమెను తన కుటుంబం నుంచి తీసుకొచ్చేశాడు కూడా. 462 00:23:47,135 --> 00:23:49,596 నువ్వెప్పుడూ నా దృష్టిలో అప్పటి పెళ్లి కూతురివే. 463 00:23:49,680 --> 00:23:50,931 సరే, అది... 464 00:23:53,016 --> 00:23:54,351 నా సోదరిని నేను మిస్ అవుతున్నాను. 465 00:23:58,856 --> 00:24:00,899 మనందరికీ జీవితం సంక్లిష్టంగా మారింది కదా? 466 00:24:03,360 --> 00:24:05,529 హేయ్, దాని గురించి నాకొక పాట గుర్తుకొస్తోంది. 467 00:24:06,488 --> 00:24:07,823 అయితే పాడు మరి. 468 00:24:31,680 --> 00:24:35,475 జీవన ప్రయాణంలో విరామం తీసుకుందాం 469 00:24:35,559 --> 00:24:38,228 అది కార్చిన కన్నీటి బొట్టను లెక్కపెడదాం 470 00:24:38,312 --> 00:24:43,692 పేదలతో కలసి మనం ఎన్నో కష్టాలు పడ్డాం 471 00:24:45,319 --> 00:24:49,281 ఒక పాట మన చెవుల్లో 472 00:24:49,364 --> 00:24:51,909 మారుమోగుతోంది 473 00:24:51,992 --> 00:24:57,164 కష్టకాలమా మళ్లీ రాకు 474 00:24:58,916 --> 00:25:01,084 ఈ పాట 475 00:25:01,168 --> 00:25:03,962 అలసిసొలసిన వారి నిట్టూర్పు 476 00:25:04,046 --> 00:25:06,256 ప్రియమైన బెట్టీ, హెలెన్ 477 00:25:06,340 --> 00:25:09,801 కష్ట కాలం, కష్ట కాలం 478 00:25:09,885 --> 00:25:12,513 మళ్లీ రాకు 479 00:25:12,596 --> 00:25:16,350 చాలా రోజులు నువ్వు నా కేబిన్ తలుపు దగ్గరే 480 00:25:16,433 --> 00:25:19,102 తచ్చాడావు 481 00:25:19,186 --> 00:25:22,147 కష్టకాలమా 482 00:25:22,231 --> 00:25:24,441 మళ్లీ రాకు 483 00:25:26,235 --> 00:25:30,197 ఉల్లాసం, అందం మ్యూజిక్ లైట్, ఆనందం 484 00:25:30,280 --> 00:25:32,866 మేం కావాలనుకుంటే 485 00:25:32,950 --> 00:25:35,744 తలుపు వద్ద మూర్చపోయిన 486 00:25:35,827 --> 00:25:37,829 బలహీనమైన రూపాలు ఉన్నాయి 487 00:25:39,373 --> 00:25:43,544 వాటి స్వరాలు మూగవోయినా 488 00:25:43,627 --> 00:25:46,046 వాటి దయనీయమైన చూపులు ఏమంటాయంటే 489 00:25:46,129 --> 00:25:49,049 ఓ కష్టకాలమా 490 00:25:49,132 --> 00:25:52,052 మళ్లీ రాకు 491 00:25:52,970 --> 00:25:56,098 కష్టకాలమా 492 00:25:56,765 --> 00:25:58,892 మళ్లీ రాకు 493 00:26:00,143 --> 00:26:01,520 నువ్వు వచ్చావా. 494 00:26:03,313 --> 00:26:04,982 పుట్టిన రోజు శుభాకాంక్షలు, ముసలాయనా. 495 00:26:05,858 --> 00:26:08,610 ధన్యవాదాలు. నువ్వు వచ్చినందుకు సంతోషం. 496 00:26:09,194 --> 00:26:10,821 ఇది చాలా చక్కటి పాట. 497 00:26:11,321 --> 00:26:12,906 అవును, ఇదంటే నాకెంతో ఇష్టం. 498 00:26:12,990 --> 00:26:16,034 బహుశా ఏదో ఒక రోజు ఈ పాటను మీరిద్దరూ మీ బాబుకు నేర్పాలి. 499 00:26:16,118 --> 00:26:17,452 నేనూ, ఎమిలీ అనా మీ ఉద్దేశం? 500 00:26:18,203 --> 00:26:19,830 కాదు. నువ్వూ, ఆస్టిన్ అని. 501 00:26:22,040 --> 00:26:24,334 ఈ రాత్రి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పదిల పరచుకుంటున్నాం. 502 00:26:24,418 --> 00:26:27,796 జ్ఞాపకాలంటే గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడే వస్తా. 503 00:26:27,880 --> 00:26:29,548 -ఎక్కడికి వెళ్తున్నావు? -పైకి. 504 00:26:30,257 --> 00:26:31,341 ఏంటీ? 505 00:26:31,425 --> 00:26:33,260 ఒక్క నిమిషంలో వస్తాను. 506 00:26:36,180 --> 00:26:38,765 ఆస్టిన్, ఇప్పటివరకూ తాగింది చాలదా? 507 00:26:39,600 --> 00:26:41,810 నీ భార్య చెప్పిన మాట విను. అమె చెప్పింది నిజం. 508 00:26:43,478 --> 00:26:48,192 నిజానికి, మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 509 00:26:48,275 --> 00:26:50,527 ఇది బర్త్ డే బహుమానామా. ఇవ్వు మరి. 510 00:26:51,153 --> 00:26:52,863 ఇది బహుమానం కాదు. 511 00:26:55,490 --> 00:26:57,075 అబ్బా. 512 00:26:57,159 --> 00:26:59,036 సరే. చెబుతున్నా. 513 00:27:00,037 --> 00:27:01,371 నేను కొంతకాలంగా ఆలోచిస్తున్నా. 514 00:27:01,455 --> 00:27:03,332 అది మీకు వింతగా అనిపించవచ్చు. 515 00:27:04,458 --> 00:27:08,795 నేను సంతోషంగా లేనని చెబితే మీకు అందులో వింతేమీ లేకపోవచ్చు. 516 00:27:09,505 --> 00:27:13,800 నిజానికి ఈ దేశమే సంతోషంగా లేదు. బాధల్లో, దుఃఖంలో ఉంది. 517 00:27:14,301 --> 00:27:19,431 ఒక్కోసారి, మన బాధను, సమాజం పడుతున్న బాధను వేరు చేయడం కష్టంగా అనిపిస్తుంది, 518 00:27:19,515 --> 00:27:20,516 తెలుసా? 519 00:27:20,599 --> 00:27:24,269 నిజం చెప్పాలంటే, నా జీవితం మారిన విధానం నాకు నచ్చలేదు. 520 00:27:24,937 --> 00:27:26,939 అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. 521 00:27:27,648 --> 00:27:31,193 "మారిందా"? నువ్వింకా చిన్నవాడివే. 522 00:27:31,276 --> 00:27:32,819 అవును, అది నిజమే. 523 00:27:33,570 --> 00:27:35,322 నా జీవితం ఇంకా అయిపోలేదు, 524 00:27:35,405 --> 00:27:38,075 అంటే దానర్ధం కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే శక్తి నాకుందని. 525 00:27:38,158 --> 00:27:39,451 "మార్పులా," అంటే? 526 00:27:39,535 --> 00:27:41,912 -అవన్నీ చెప్పేందుకు ఇది తగిన సమయం... -నన్ను మాట్లాడనీ, ఎమిలీ. 527 00:27:43,580 --> 00:27:45,207 ఈ రాత్రి నేను కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాను, 528 00:27:45,290 --> 00:27:46,708 వాటిని మీకు చెప్పేందుకు వచ్చాను. 529 00:27:48,585 --> 00:27:53,674 ముందుగా, ఎడ్వర్డ్ డికిన్సన్ అండ్ సన్ లా ఆఫీసునుంచి నేను తప్పుకుంటున్నాను. 530 00:27:54,299 --> 00:27:56,343 నేను స్వయంగా ఒక సంస్థను ప్రారంభిస్తున్నాను. 531 00:27:56,426 --> 00:27:57,594 నీ సొంత సంస్థా? 532 00:27:58,387 --> 00:27:59,721 అందుకు నువ్వింకా సిద్ధం కాలేదు. 533 00:28:00,305 --> 00:28:02,683 పైగా నీకు క్లయింట్లు ఎక్కడ దొరుకుతారు? 534 00:28:02,766 --> 00:28:04,393 లేకపోతే నాకు సాయం చేసేందుకు ప్లాన్ చెయ్యి? 535 00:28:04,476 --> 00:28:06,728 నేను ఇప్పటికే కొందరు క్లయింట్లను చూసుకున్నాను, 536 00:28:06,812 --> 00:28:09,314 ఎందుకంటే నేను న్యాయశాస్త్రంలో ఒక కొత్త సబ్జెక్టును అధ్యయనం చేయబోతున్నాను. 537 00:28:09,398 --> 00:28:12,067 ఏమన్నావు? కొత్త సబ్జెక్టా? 538 00:28:13,026 --> 00:28:14,027 విడాకులు. 539 00:28:15,487 --> 00:28:17,573 నేను ఆ సబ్జెక్టును అధ్యయనం చేస్తున్నాను. 540 00:28:17,656 --> 00:28:21,785 ఈ రోజుల్లో విడాకుల లాయర్లకు ఎంతో డిమాండ్ ఉంది. 541 00:28:21,869 --> 00:28:25,330 మీరు నిశితంగా గమనిస్తే, బోలెడు పెళ్ళిళ్లు జరుగుతున్నాయి, 542 00:28:25,414 --> 00:28:28,166 సరిదిద్దలేని విభేదాల కారణంగా ఆ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి, 543 00:28:28,250 --> 00:28:30,627 యాంకీలు మరియు కాన్ఫెడెరేట్ల మాదిరిగా. 544 00:28:30,711 --> 00:28:34,298 వాళ్లు ఏదో ఒక విషయం వద్ద విభేదించి, ఇక కలసి జీవించలేమనుకుంటారు. 545 00:28:34,923 --> 00:28:36,925 కాబట్టి, ఆ సబ్జెక్టుపై నాకు పట్టుంది, 546 00:28:37,426 --> 00:28:39,803 ఎందుకంటే, నా జీవితంలోనే నాకు అలాంటి అనుభవం ఎదురైంది కనుక. 547 00:28:41,972 --> 00:28:43,432 నీకు విడాకులు ఇస్తున్నాను, సూసన్. 548 00:28:44,516 --> 00:28:46,685 బాబు పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటాను. 549 00:28:48,729 --> 00:28:51,440 టట్టడాయ్! పెళ్లి రోజు దుస్తులు ధరించాను. 550 00:28:52,941 --> 00:28:54,860 -ఒక్క నిమిషం, ఏం జరుగుతోంది? -ఇది... 551 00:28:58,113 --> 00:29:00,324 నా నిర్ణయం ఇదే. మన బంధం ముగిసింది. 552 00:29:00,407 --> 00:29:05,621 ఇక ఇది ముగిసిన కథ. 553 00:29:13,420 --> 00:29:15,964 ఉదయం నీకు ఈ విషయం గుర్తుండదులే. 554 00:29:17,216 --> 00:29:19,301 నేను ఇప్పుడే పైకి వెళ్లి వస్తాను. 555 00:29:27,309 --> 00:29:29,186 ఆస్టిన్, ఇలా ఎలా చేశావు? 556 00:29:29,269 --> 00:29:30,812 ఈ నిర్ణయం ఎలా తీసుకున్నానో నీకు తెలుసనే అనుకుంటున్నాను, ఎమిలీ. 557 00:29:30,896 --> 00:29:32,898 మిగతావారికంటే ఆ సంగతి నీకే బాగా తెలుసునంటాను. 558 00:29:32,981 --> 00:29:35,317 నువ్వు అడ్డూ ఆపూ లేకుండా తాగుతున్నావు. 559 00:29:35,400 --> 00:29:37,361 ఆస్టిన్, నువ్విలా పాడైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. 560 00:29:37,903 --> 00:29:40,072 నీ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోను! 561 00:29:40,155 --> 00:29:42,658 దాని గురించి ఏమీ బాధపడకండి. మీరు ఇప్పటికే నా జీవితాన్ని నాశనం చేశారు. 562 00:29:42,741 --> 00:29:45,327 ఇక ఆపు! ఇక్కడితో ఆపేయ్! 563 00:29:45,410 --> 00:29:48,080 ఏం, కొడతారా? కొట్టండి. 564 00:29:48,664 --> 00:29:50,123 దాన్ని కొట్టినట్టే నన్నూ కొట్టండి. 565 00:29:51,708 --> 00:29:52,584 ఆస్టిన్. 566 00:29:53,210 --> 00:29:54,211 ఏంటీ? 567 00:29:54,711 --> 00:29:57,339 మనందరికీ ఈ సంగతి తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తున్నాం, అంతే. 568 00:29:57,923 --> 00:30:01,635 ఈ ముసలాయన అభిప్రాయాలను నేను ఇంక ఎంతమాత్రం పట్టించుకోను. 569 00:30:01,718 --> 00:30:03,595 -ఎమ్. -గతం గురించి అబద్ధాలు చెబుతూ పోతుంటే 570 00:30:03,679 --> 00:30:06,098 నేను నాకోసం కొత్త భవిష్యత్తును నిర్మించుకోలేను. 571 00:30:13,772 --> 00:30:15,482 నేను గతాన్ని మార్చలేను. 572 00:30:16,066 --> 00:30:18,068 కానీ, నా కుటుంబాన్ని వదులుకోను, 573 00:30:18,819 --> 00:30:20,445 నిన్ను కూడా వదులుకోలేను. 574 00:30:23,824 --> 00:30:25,659 ఆస్టిన్, బయటికి పో. ఇక్కడినుంచి వెళ్లిపో. 575 00:30:25,742 --> 00:30:27,744 నువ్వు ఉండమన్నా ఇక్కడ ఉండను. 576 00:30:30,706 --> 00:30:32,791 హేయ్, నా మాట విను. 577 00:30:33,292 --> 00:30:34,293 ఏంటి? 578 00:30:37,671 --> 00:30:40,257 మీ ఇద్దరిలో ఎవరు కావాలో నిర్ణయించుకోమన్నావు కదా. 579 00:30:41,049 --> 00:30:43,802 నువ్వో, ఆయనో ఎవరు కావాలని అడిగావుగా. 580 00:30:45,596 --> 00:30:46,889 ఏంటో తెలుసా? 581 00:30:48,473 --> 00:30:49,641 నాకు ఆయనే కావాలి. 582 00:30:50,767 --> 00:30:52,769 నాకు నాన్నే కావాలి. 583 00:30:58,525 --> 00:31:00,819 సరే, నీ ఖర్మ. 584 00:31:00,903 --> 00:31:02,696 విన్నీ, ప్రియమైన సోదరీ. 585 00:31:02,779 --> 00:31:04,907 -అమ్మా? -విన్నీ, నన్ను క్షమించు... 586 00:31:10,495 --> 00:31:11,538 దేవుడా! 587 00:31:15,292 --> 00:31:18,795 ఎడ్వర్డ్, క్షమించు. నిజంగానే క్షమించు. 588 00:31:19,838 --> 00:31:21,048 దేవుడా. 589 00:31:22,466 --> 00:31:23,717 నాకేం బాధ లేదు. 590 00:31:23,800 --> 00:31:26,345 అందరినీ సంతోషంగా ఉంచాలనుకున్నాను. 591 00:31:26,428 --> 00:31:28,013 ఎమిలీ, ఊరుకో. 592 00:31:30,766 --> 00:31:33,602 సరే, ఈ కుటుంబం ఒక పిచ్చిమాలోకమని చెప్పేందుకు 593 00:31:34,228 --> 00:31:36,230 నేను నా మౌనవ్రతాన్ని వదిలేస్తున్నాను. 594 00:31:46,073 --> 00:31:47,157 సూ, నేను... 595 00:31:47,241 --> 00:31:48,992 ఎమిలీ, నన్ను ముట్టుకోకు. 596 00:31:51,411 --> 00:31:53,288 నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. 597 00:31:53,830 --> 00:31:55,207 ఆ మాటలు అతని మనస్సులో నుండి వచ్చినవి కాదు. 598 00:31:55,290 --> 00:31:57,793 -అతను నిన్ను వదిలిపెట్టి వెళ్లడు, సూ. -ఎమిలీ, ఆస్టిన్ ను నేను పట్టించుకోను. 599 00:31:57,876 --> 00:31:59,294 నీ గురించే నా బాధ. 600 00:32:00,212 --> 00:32:02,297 ఇదేమిటో నాకు చెప్పు. 601 00:32:09,471 --> 00:32:12,015 -అతని పేరు హిగ్గిన్సన్... -నాకు అతను తెలుసు. 602 00:32:12,641 --> 00:32:13,934 అతను రాసిన కవిత్వం నేను చదివాను. 603 00:32:14,434 --> 00:32:17,020 -నాకు కూడా బుర్ర ఉంది, తెలుసా? -అవును. 604 00:32:17,104 --> 00:32:19,439 నాకు అర్థం కాని విషయం ఏంటంటే అతనికి పంపిన కవితే 605 00:32:19,523 --> 00:32:21,984 నాకూ ఎందుకు ఇచ్చావన్నది. 606 00:32:24,236 --> 00:32:28,532 యువ రచయితల కవితలకోసం అతను ఆహ్వానం పంపాడు, అందుకని పంపాను. 607 00:32:29,032 --> 00:32:31,994 అందుకని "అలబాస్టర్ చాంబర్లలో సురక్షితంగా ఉన్నారు" కవిత పంపేశావు కదూ. 608 00:32:33,871 --> 00:32:35,122 అవును. 609 00:32:39,793 --> 00:32:44,381 "నాకూ ఓ స్నేహితుడి తోడు కావాలన్న ఆలోచన నీకు రాలేదా? 610 00:32:44,464 --> 00:32:46,341 నాకు కాస్త ఒక రూపం ఉంది. 611 00:32:46,425 --> 00:32:51,388 అది మీ డెస్కును పూర్తిగా నింపేయదు లేదా ఎలుకలా శబ్దం చేయదు." 612 00:32:51,471 --> 00:32:56,852 "నాకు మార్గదర్శిగా ఉండగలరా, హిగ్గిన్సన్? నేను ప్రమాదంలో ఉన్నాను, సర్..." 613 00:32:56,935 --> 00:32:58,228 దేవుడా, ఎమిలీ. 614 00:32:58,312 --> 00:33:01,106 ఇది చూస్తుంటే నువ్వొక నిస్సహాయురాలిగా ఉన్నావని అనిపిస్తోంది. 615 00:33:01,732 --> 00:33:05,068 ఒంటరిదానిలా ఉన్నావని. ఇందులో నా ప్రస్తావన కూడా లేదు. 616 00:33:05,152 --> 00:33:08,405 -చూడు, నేను కేవలం... -నాకు బాబు పుట్టాక ఇలా అయిపోయావు. 617 00:33:08,488 --> 00:33:10,407 నేను ఉన్నా లేనట్టే! 618 00:33:10,490 --> 00:33:11,533 సూ, దయచేసి విను! 619 00:33:12,784 --> 00:33:13,785 ఓ విషయం తెలుసా? 620 00:33:16,955 --> 00:33:18,373 నువ్వూ ఆస్టిన్ లాంటిదానివే. 621 00:33:21,084 --> 00:33:22,920 అంటే ఏంటి అర్థం? 622 00:33:23,670 --> 00:33:25,881 నువ్వు దేని గురించో పోరాడుతున్నానని అనుకుంటున్నావు, కానీ నిజానికి, 623 00:33:27,132 --> 00:33:28,592 నువ్వు పారిపోతున్నావు. 624 00:34:22,396 --> 00:34:24,398 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య