1 00:00:11,845 --> 00:00:12,846 విన్నీ. 2 00:00:13,722 --> 00:00:15,015 చెప్పు. 3 00:00:15,933 --> 00:00:17,267 నాన్న చనిపోయాడా? 4 00:00:17,893 --> 00:00:18,894 లేదు. 5 00:00:19,645 --> 00:00:20,646 ఓరి దేవుడా. 6 00:00:20,729 --> 00:00:23,649 చిన్న గుండె పోటు అంతే. ఆయన బాగానే ఉన్నాడు. 7 00:00:24,608 --> 00:00:26,068 మళ్లీ చెప్పు. 8 00:00:26,818 --> 00:00:27,945 ఏం చెప్పాలి. 9 00:00:28,028 --> 00:00:30,280 ఆయన చావలేదని మళ్లీ చెప్పు. 10 00:00:30,364 --> 00:00:32,573 ఆయన చనిపోలేదు. 11 00:00:32,658 --> 00:00:36,370 మూర్ఛపోవడం వలన తల నేలకు తగిలింది, దాని వలన స్పృహ కోల్పోయాడంతే. 12 00:00:36,453 --> 00:00:39,081 కానీ మనం అతనికి ఉప్పు వాసన చూపించి, 13 00:00:39,164 --> 00:00:42,042 గొంతులో కొంత విస్కీ పోసినప్పుడు ఆయన స్పృహలోకి వచ్చాడు కదా. 14 00:00:42,125 --> 00:00:46,755 కొన్ని రోజుల పాటు పడక మీదే ఉండాల్సి వస్తుందేమో, కానీ అయన బాగానే ఉన్నాడులే. 15 00:00:46,839 --> 00:00:49,424 శ్వాస ఆడుతోంది. అతనెవరో ఏంటో కూడా స్పృహ ఉంది. 16 00:00:50,259 --> 00:00:52,427 డాక్టర్ ని పిలవాల్సిన అవసరం కూడా రాలేదు కదా. 17 00:00:54,096 --> 00:00:57,015 దేవుడా, అది భయంకరమైన డిన్నర్ రా బాబు. బాబోయ్. 18 00:00:57,099 --> 00:00:58,684 నీకు నేను చేసిన వడలు నచ్చలేదా? 19 00:00:58,767 --> 00:01:01,478 నేను మాట్లాడేది భోజనం గురించి కాదు, విన్నీ, 20 00:01:02,145 --> 00:01:05,691 నిన్న ఆస్టిన్ చెప్పిన భయంకరమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. 21 00:01:07,109 --> 00:01:09,319 మన కుటుంబం గురించి, నాన్న గురించి. 22 00:01:10,153 --> 00:01:12,573 -అవి నిజమే అయితే? -ఏంటి? 23 00:01:12,656 --> 00:01:14,700 చూడు, నాకు అంతా గందరగోళంగా ఉంది, సరేనా? 24 00:01:15,450 --> 00:01:19,371 నా జీవితంలో ఎక్కడ తేడా జరిగిందో తెలీదు, కానీ తేడా మాత్రం జరిగింది. 25 00:01:19,454 --> 00:01:21,582 నేను ఏమవ్వాలనుకున్నానో అది కాలేకపోయాను. 26 00:01:22,165 --> 00:01:23,709 నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు. 27 00:01:23,792 --> 00:01:26,920 నేను ఎంచుకొన్న దారులన్నీ తప్పే అన్నట్టుగా అన్నమాట. అన్నీ కూడా. 28 00:01:27,004 --> 00:01:31,008 నా... నాలో సంతోషం లేదు, ఎమిలీ. పశ్చాత్తాప భావాన మాత్రమే ఉంది. 29 00:01:32,259 --> 00:01:35,721 నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది, నా పని అయిపోయింది. 30 00:01:35,804 --> 00:01:37,181 అలా అవ్వడానికి నాన్న పాత్ర కూడా 31 00:01:37,264 --> 00:01:42,394 ఉందేమో అని నాకు అనిపిస్తోంది. 32 00:01:45,480 --> 00:01:47,274 జోసెఫ్ లైమన్ విషయంలో జరిగినదాని గురించి మాట్లాడుతున్నావా? 33 00:01:48,025 --> 00:01:49,985 నేను చనిపోయిన నా మాజీ ప్రియులందరి గురించి మాట్లాడుతున్నాను... 34 00:01:52,154 --> 00:01:56,241 వాళ్లని అవకాశమున్నప్పుడే నేను పెళ్లి చేసుకొని ఉండాల్సింది. 35 00:01:57,159 --> 00:02:02,289 కానీ అలా కాకుండా, నాకు ఇంకేదైనా బంగారు భవిష్యత్తు ఉందేమో అని ఆగాను. 36 00:02:02,372 --> 00:02:05,209 మరి నా ఈ భవిష్యత్తు చూడు ఎంత ఘోరంగా ఉందో. 37 00:02:05,792 --> 00:02:07,628 నేను ప్రేమించినవాళ్లందరూ నాకు దూరమైపోయారు. 38 00:02:07,711 --> 00:02:09,003 అది నిజం కాదు. 39 00:02:11,256 --> 00:02:12,299 నేను బతికే ఉన్నాగా. 40 00:02:13,842 --> 00:02:16,053 మన కుటుంబం కూడా ఉంది. 41 00:02:16,136 --> 00:02:18,430 -దైవ కృప వల్ల నాన్నకి కూడా ఏం కాలేదు. -అవును. 42 00:02:18,514 --> 00:02:20,849 ఆయన నిన్న రాత్రి చనిపోయి ఉండేవాడే, కానీ అలా జరగలేదు. 43 00:02:22,351 --> 00:02:24,436 మనమందరం ఇంకా బతికే ఉన్నాం, విన్. 44 00:02:25,229 --> 00:02:26,855 ఇంకా మనం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. 45 00:02:28,273 --> 00:02:30,359 ఈ కుటుంబాన్ని నేను చిన్నాభిన్నం కానివ్వను. 46 00:02:30,442 --> 00:02:35,447 ఇప్పటికే ప్రపంచమంతటా శోకం అలుముకొని ఉంది. 47 00:02:37,241 --> 00:02:38,367 నువ్వు అన్నది నిజమే. 48 00:02:39,034 --> 00:02:41,161 నేను ఇప్పటికే చాలా విషయాల్లో బాధపడాలి. 49 00:02:41,245 --> 00:02:43,330 ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక అంతర్యుద్ధం జరిగితే, నేను తట్టుకోలేను. 50 00:02:43,413 --> 00:02:46,291 నిన్న రాత్రి జరిగిన విషయాన్ని మనం మర్చిపోవాలి. సరేనా? 51 00:02:47,292 --> 00:02:50,712 ఆస్టిన్ నాన్నకి క్షమాపణలు చెప్పి, ఈ కుటుంబాన్ని ఏకం చేయాలి. 52 00:02:51,755 --> 00:02:52,965 నేను ఆశను వదులుకోను. 53 00:02:53,549 --> 00:02:54,925 కానీ వాడు క్షమాపణ చెప్తాడంటావా? 54 00:02:55,843 --> 00:02:57,344 "తెగతెంపులు చేసుకుంటున్నాను" అని అన్నాడు. 55 00:02:57,427 --> 00:03:01,014 అవును. అలా అనడానికి వాడేవడు. 56 00:03:02,766 --> 00:03:04,893 రాత్రి నన్ను ఇక్కడ పడుకోనిచ్చినందుకు ధన్యవాదాలు. 57 00:03:06,478 --> 00:03:08,438 పెళ్లి చేసుకోకపోవడంలో ఉన్న మంచి విషయమేంటో తెలుసా? 58 00:03:09,147 --> 00:03:13,360 -ఏంటి? -నాతో ఎక్కువ సేపు గడిపేంత... 59 00:03:14,570 --> 00:03:15,779 అదృష్టం నీకు దక్కుతుంది! 60 00:03:21,493 --> 00:03:23,412 డికిన్సన్ 61 00:03:23,495 --> 00:03:25,497 బతికి ఉన్నందుకు సిగ్గుగా ఉంది - 62 00:03:46,518 --> 00:03:47,603 ఆస్టిన్? 63 00:04:00,199 --> 00:04:01,200 శుభోదయం, సూ. 64 00:04:02,159 --> 00:04:03,160 నమస్తే. 65 00:04:04,328 --> 00:04:05,662 విందు భోజనంలా చాలా ఐటెమ్లు ఉన్నాయే ఇక్కడ. 66 00:04:06,997 --> 00:04:08,081 ఆస్టిన్ ఎక్కడ? 67 00:04:08,165 --> 00:04:09,374 అతను నాకు కనబడనేలేదు. 68 00:04:09,458 --> 00:04:11,251 అంటే, ఈ ఆహారమంతా నీకోసమేనా? 69 00:04:11,960 --> 00:04:14,671 బిడ్డ పుట్టేశాక, మళ్లీ ఇంత తినడం సాధ్యం కాదు కదా. 70 00:04:14,755 --> 00:04:16,839 నీ తిండిని చూస్తుంటే, నువ్వు ముగ్గురిని కనేలా ఉన్నావు. 71 00:04:16,923 --> 00:04:20,177 నిన్న రాత్రి బిడ్డ బాగా గట్టిగా తన్నింది. 72 00:04:20,260 --> 00:04:22,554 అంటే, రెండు కంటే ఎక్కువ కాళ్ళే ఉండుండాలి. 73 00:04:22,638 --> 00:04:24,431 నీకు పురిటి నొప్పులు వచ్చాయేమో అనుకున్నా. 74 00:04:24,515 --> 00:04:26,183 నేను కూడా అదే అనుకున్నా. 75 00:04:26,266 --> 00:04:27,935 చివరికి అది గ్యాస్ అని తేలింది. 76 00:04:28,018 --> 00:04:29,269 -బాబోయ్. -ఎమిలీ. 77 00:04:29,353 --> 00:04:32,064 అది ప్రకృతిపరంగా జరిగేదే. నీకు ప్రకృతి అంటే ప్రాణం కదా. 78 00:04:32,147 --> 00:04:34,691 -నాకు గ్యాస్ గురించి మాట్లాడాలని లేదు. -మఫిన్ కావాలా? 79 00:04:34,775 --> 00:04:37,110 వద్దు. నాకు... వద్దు. 80 00:04:37,903 --> 00:04:39,613 నాకు తినాలంటే అదోలా ఉంది. 81 00:04:41,573 --> 00:04:43,825 బాబోయ్, నిన్న రాత్రి చాలా భయమేసింది, సూ. 82 00:04:44,535 --> 00:04:46,662 నిజంగానే నాకు నాన్న చనిపోయాడని అనిపించింది. 83 00:04:46,745 --> 00:04:48,330 ఆయన్ని ఆస్టిన్ చంపేశాడని అనుకున్నా. 84 00:04:48,914 --> 00:04:49,957 అవును, కానీ... 85 00:04:51,166 --> 00:04:54,711 అదృష్టవశాత్తు, మాటలు జనాలని చంపలేవులే. 86 00:04:55,879 --> 00:04:57,631 అలా చేయడం నీ మాటల వల్ల కూడా కాదు. 87 00:04:57,714 --> 00:05:00,008 అందులోనూ, నువ్వు ఆస్టిన్ కన్నా గొప్ప కవయత్రివి. 88 00:05:01,093 --> 00:05:02,970 అవును, ఆస్టిన్ క్షమాపణ చెప్పాలి. 89 00:05:03,053 --> 00:05:05,931 అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను మళ్లీ అందరినీ కలపాలి. 90 00:05:06,890 --> 00:05:08,559 నువ్వు ఇక్కడికి నన్ను చూడటానికే వచ్చావు అనుకున్నానే. 91 00:05:10,102 --> 00:05:11,103 సూ. 92 00:05:12,312 --> 00:05:13,730 సూ, నీకు అర్థం కావడం లేదా? 93 00:05:14,857 --> 00:05:18,318 నా కుటుంబంలో ఇప్పుడు అల్లకల్లోలం అలుముకుని ఉంది. 94 00:05:19,486 --> 00:05:22,906 నిన్న రాత్రి ఆస్టిన్ ఎంత పెద్ద పెద్ద మాటలు అన్నాడో చూశావు కదా? దేవుడా. 95 00:05:24,324 --> 00:05:25,158 అవును. 96 00:05:26,869 --> 00:05:29,705 నిజం చెప్పాలంటే, అతను అన్నదాంట్లో నిజముంది. 97 00:05:32,332 --> 00:05:33,333 ఏంటి? 98 00:05:33,417 --> 00:05:36,253 మీ కుటుంబంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. 99 00:05:36,336 --> 00:05:38,463 దురదృష్టవశాత్తు, ఆ సమస్యలకు పరిష్కారం లేదు. 100 00:05:38,547 --> 00:05:40,132 ఏమంటున్నావు నువ్వు? 101 00:05:41,842 --> 00:05:45,095 అంటే, వాళ్లు నిన్ను ఎలా చూస్తారో ఓసారి గమనించు. 102 00:05:45,179 --> 00:05:47,848 మీ అమ్మానాన్నలు నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. 103 00:05:49,975 --> 00:05:52,186 నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో వాళ్లకు అస్సలు తెలీదు. 104 00:05:52,269 --> 00:05:55,564 నా ఉద్దేశం, వాళ్లు... గుర్తించకపోగా, నిన్ను పిచ్చిదానిలా చూశారు. 105 00:05:57,900 --> 00:06:01,695 చూడు, ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను కనుక 106 00:06:01,778 --> 00:06:04,114 నాకు ఇప్పుడు అది బాగా తెలుస్తోందేమో, 107 00:06:04,198 --> 00:06:08,285 నా బిడ్డ పుట్టాక, అది ఎలాంటిదైనా కానీ, 108 00:06:08,368 --> 00:06:12,664 దానిపై నాకు ప్రేమ తగ్గదని తనకి తెలియజేస్తాను. 109 00:06:13,498 --> 00:06:14,917 నిన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నానో, అలాగే. 110 00:06:21,381 --> 00:06:24,760 నువ్వంటే నాకు ప్రాణం, ఎమిలీ. 111 00:06:26,470 --> 00:06:29,681 నా చేతుల్లోనే కనుక నిర్ణయముంటే, మనం... 112 00:06:30,933 --> 00:06:34,603 మనం మీ కుటుంబం నుండి దూరంగా వెళ్లిపోయి, కలిసి ఈ బిడ్డని పెంచేవాళ్ళం. 113 00:06:35,479 --> 00:06:36,813 అది చాలా బాగుంటుంది కదా? 114 00:06:37,397 --> 00:06:38,941 మనం ఇక్కడి నుండి పారిపోవచ్చు, 115 00:06:39,691 --> 00:06:41,818 ఇక జీవితంలో వీళ్ళ వైపు కనెత్తి కూడా చూడకూండా బతికేయవచ్చు. 116 00:06:44,488 --> 00:06:46,240 నేను వీళ్లని మిస్ అవుతాననుకుంటా. 117 00:06:47,658 --> 00:06:48,659 నిజంగానా? 118 00:06:53,038 --> 00:06:55,415 ఆస్టిన్ ఎక్కడ? నేను వాడితో మాట్లాడాలి. 119 00:06:55,499 --> 00:06:57,793 నేను అతడిని చూడలేదు. అతను నిన్న రాత్రి ఇంటికి కూడా రాలేదు. 120 00:06:57,876 --> 00:07:01,255 -కనీసం సాసేజ్ అయినా నీకు తినాలని లేదా? -లేదు. నాకు నిజంగానే తినాలని లేదు. 121 00:07:01,338 --> 00:07:02,339 ఇది చాలా రుచిగా... 122 00:07:03,549 --> 00:07:04,967 -ఏంటి? -ఓరి దేవుడా! 123 00:07:05,050 --> 00:07:07,052 -ఏం జరుగుతోంది? -ఓరి దేవుడా. బిడ్డ బయటకు వస్తోంది. 124 00:07:07,135 --> 00:07:08,428 -గ్యాస్ కాదా? -కాదు. 125 00:07:08,512 --> 00:07:10,597 -ఇప్పుడు నేనేం చేయాలి? -సాయం కోసం ఎవరినైనా తీసుకురా! 126 00:07:10,681 --> 00:07:12,307 -సరే! వెళ్తున్నాను! నువ్వు బాగానే... -వెళ్లవమ్మా! 127 00:07:12,391 --> 00:07:13,475 -సరే. -వెళ్లి ఎవరినైనా తీసుకురా! 128 00:07:13,559 --> 00:07:15,227 -అమ్మా! -నాకు బాగా లేదు. 129 00:07:17,187 --> 00:07:20,190 నన్ను క్షమించాలి. నిన్ను భయపెట్టాలనుకోలేదు, మిసెస్ డికిన్సన్. 130 00:07:20,274 --> 00:07:22,276 పర్వాలేదులే, ఎడ్వర్డ్. నువ్వు చనిపోలేదని నాకు తెలుసు. 131 00:07:22,359 --> 00:07:23,694 తెలుసా? ఎలా? 132 00:07:23,777 --> 00:07:25,863 భార్యకు ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. 133 00:07:25,946 --> 00:07:28,073 అంతేగాక, నువ్వు అలా హఠాత్తుగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోవు. 134 00:07:28,156 --> 00:07:29,992 నువ్వు బాగా సాగదీసి సాగదీసి, ఆ తర్వాత చస్తావులే. 135 00:07:30,576 --> 00:07:31,743 ఇంకో కప్పు తాగుతావా, నాన్నా? 136 00:07:31,827 --> 00:07:33,871 విన్నీ టీ తెచ్చింది. చాలా మంచి పని చేశావు. 137 00:07:33,954 --> 00:07:38,250 అవును, పెళ్లీ పెటాకుల్లేని ఒక యువతి తన తండ్రికి సపర్యలు చేయకపోతే ఇంకేం చేస్తుంది? 138 00:07:38,333 --> 00:07:39,376 అక్కడ పెట్టు. 139 00:07:40,502 --> 00:07:43,005 సహాయపడండి! సహాయపడండి! సూ బిడ్డకు జన్మనివ్వబోతోంది! 140 00:07:43,088 --> 00:07:44,840 బిడ్డ? నీకు ఖచ్చితంగా తెలుసా? 141 00:07:44,923 --> 00:07:48,135 అవును. తనకు పురుటి నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? డాక్టర్ ని తీసుకురానా? 142 00:07:48,218 --> 00:07:50,429 నేను పట్టణానికి శరవేగంగా వెళ్లి రాగలను. 143 00:07:50,512 --> 00:07:52,890 అక్కర్లేదు. డాక్టర్ల అవసరం లేదు. 144 00:07:52,973 --> 00:07:55,976 -అవసరం లేదా? -నేను పురుడు పోస్తాను. 145 00:07:56,059 --> 00:07:57,436 ఒక్క నిమిషం. ఏంటి? 146 00:07:57,519 --> 00:08:00,189 అవును, మీరు సరిగ్గానే విన్నారు. నేనే పురుడు పోస్తాను. 147 00:08:00,272 --> 00:08:03,609 నార్క్రాస్ పరివారపు ఫార్మ్ లో, మాకు డాక్టర్ల అవసరమే ఉండేది కాదు. 148 00:08:03,692 --> 00:08:07,487 పురుడు పోసే సమయం వచ్చినప్పుడు, ఇలా చేతులను మడతెట్టి, మేమే కానిచ్చేసేవాళ్ళం. 149 00:08:07,571 --> 00:08:09,823 -దూడలు, గుర్రపు పిల్లలకైతే లెక్కే లేదు. -సరే. అలాగా. 150 00:08:10,490 --> 00:08:12,743 ఇప్పుడు మొత్తం గుర్తుకు వస్తోంది. 151 00:08:12,826 --> 00:08:15,704 సూర్యోదయాన కొటారం వాసన. 152 00:08:15,787 --> 00:08:20,334 నేనూ, ఆంట్ లవీనియా గొర్రె పిల్లకి పురుడు పోశాక, శుభ్రం చేస్తూ ఉన్నాం. 153 00:08:20,417 --> 00:08:24,755 -ఇప్పుడు సూ బిడ్డ బయటకు రాబోతోంది, కనుక... -లేదు, ఒక్క నిమిషం! 154 00:08:24,838 --> 00:08:27,341 -నన్ను ఎవరు చూసుకుంటారు? -నీకేమీ కాలేదులే, ఎడ్వర్డ్. 155 00:08:27,424 --> 00:08:31,386 -నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావంతే. -అది గుండె పోటే అని నాకు ఖచ్చితంగా తెలుసు. 156 00:08:31,470 --> 00:08:34,264 నువ్వు కాస్త విశ్రమిస్తే సరిపోతుంది. అదీగాక, విన్నీ నీకు తోడుగా ఉంటుందిలే. 157 00:08:34,347 --> 00:08:36,140 -ఏమంటావు, లవీనియా? -సరే. 158 00:08:36,225 --> 00:08:38,852 మన మధ్య ఉన్న బంధం విషయంలో నేను పునరాలోచనలో పడ్డాను కాబట్టి, 159 00:08:38,936 --> 00:08:42,188 -ఇది కాస్త వింతగా ఉండవచ్చు. -సూపర్. 160 00:08:42,272 --> 00:08:43,941 ఎమిలీ, నువ్వు వెళ్లి దుప్పట్లు తీసుకురాపో. 161 00:08:44,024 --> 00:08:47,819 -దుప్పట్లు. -మ్యాగీ, నువ్వు బక్కెట్లు తీసుకురా! 162 00:08:51,949 --> 00:08:53,951 తనకి నొప్పి తగ్గించడానికి ఏమైనా ఉందా? 163 00:08:54,535 --> 00:08:55,869 ఇదే నొప్పి అని అనుకుంటున్నావా? 164 00:08:55,953 --> 00:08:57,454 మనం ఇంకా మొదలుపెట్టను కూడా లేదు. 165 00:08:57,538 --> 00:09:00,374 క్లోరోఫార్మ్ ఇస్తే బాగుంటుందేమో. ఇప్పుడు దాన్ని బాగా వాడుతున్నారని విన్నాను. 166 00:09:00,457 --> 00:09:02,793 -విక్టోరియా రాణి కూడా దాన్ని నమ్ముతుంది. -అవును. అది చాలా మంచి పనిలా ఉంది. 167 00:09:02,876 --> 00:09:07,089 తొక్కలే. నార్క్రాస్ ఫామ్ లో అలాంటివేవీ ఉండవు. 168 00:09:07,172 --> 00:09:10,050 సూ బిడ్డని సహజంగానే జన్మనిస్తుంది. ఏమంటావు, సూ? 169 00:09:10,133 --> 00:09:11,593 నాకు భరించలేనంత నొప్పిగా ఉంది. 170 00:09:11,677 --> 00:09:12,761 మంచిదే. 171 00:09:12,845 --> 00:09:15,013 -నొప్పి ఉంటేనే బతికున్నావని తెలుస్తుంది. -అమ్మా! 172 00:09:15,097 --> 00:09:18,433 అలా అనకు. సూ వాళ్ళ అమ్మ జన్మనిస్తూ మరణించిందని నీకు తెలుసు కదా. 173 00:09:18,517 --> 00:09:20,018 అవునా? 174 00:09:20,102 --> 00:09:23,272 -అలా చనిపోవాలంటే రాసి పెట్టుండాలి. -అమ్మా. 175 00:09:23,355 --> 00:09:24,898 -అది చాలా గొప్ప త్యాగం. -ఓరి దేవుడా. 176 00:09:24,982 --> 00:09:26,942 తనకేమీ కాదు. అంతే కదా, మ్యాగీ? 177 00:09:27,025 --> 00:09:29,111 ఏమో మరి. నడుము సన్నగా ఉంది. 178 00:09:29,736 --> 00:09:32,573 -బిడ్డ సజీవంగా బయటకు రావడమే ముఖ్యం. -భగవంతుడా. 179 00:09:32,656 --> 00:09:34,116 మనం తల్లీ, బిడ్డా, ఇద్దరి క్షేమం గురించి ఆలోచిద్దామా? 180 00:09:34,199 --> 00:09:37,536 ఎమిలీ? ఎమిలీ, ఇది నా వల్ల కాదు అనిపిస్తోంది. 181 00:09:37,619 --> 00:09:43,041 అంటే, అంత చిన్న రంధ్రం నుండి ఒక ప్రాణి ఎలా బయటకు వస్తుంది? 182 00:09:43,125 --> 00:09:45,961 అది అసలు అర్థవంతంగానే లేదు. అసలు ఎవరైనా ఈ పనిని ఏలా చేయగలరు? 183 00:09:46,044 --> 00:09:47,588 ఇక చాలు! 184 00:09:48,213 --> 00:09:49,965 నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి కాదు. 185 00:09:50,048 --> 00:09:53,010 నీలో ఒక అమూల్యమైన ప్రాణి ఉంది, ఆ ప్రాణి కోసం నువ్వు ఇప్పుడు స్థైర్యంగా ఉండాలి. 186 00:09:53,093 --> 00:09:55,304 -నీకు అర్థమైందా? -అర్థమైంది. 187 00:09:55,387 --> 00:09:58,223 మంచిది. ఇప్పుడు ఎవరైనా నాకు ఒక కత్తెర ఇవ్వండి. 188 00:09:58,307 --> 00:10:00,350 -కత్తెర? -అది ఎందుకు? 189 00:10:00,434 --> 00:10:03,103 నేను తోటపని కోసం ఉపయోగించే ఇలాంటి పరికరాలను చాలానే వాడతాను. 190 00:10:05,731 --> 00:10:07,232 పురిటి నొప్పులు అధికమవుతున్నాయి. 191 00:10:08,275 --> 00:10:09,359 సరే, చూడు. 192 00:10:09,443 --> 00:10:11,945 బిడ్డ పుట్టే సమయం కనుక, ఆస్టిన్ ఇక్కడ ఉండాలి. నేను వెళ్లి... 193 00:10:12,029 --> 00:10:14,698 ఎమిలీ డికిన్సన్, ఈ గది దాటి బయటకువెళ్ళావంటే చంపేస్తా. 194 00:10:14,781 --> 00:10:17,034 కానీ తనే కదా తండ్రి. తను ఇక్కడ ఉండాలి కదా. 195 00:10:17,117 --> 00:10:19,077 నాకు ఆస్టిన్ అక్కర్లేదు. నువ్వు పక్కనుంటే చాలు. 196 00:10:19,161 --> 00:10:22,623 సరే. సరే. దేవుడా. సున్నితమైన నీ చేతికే ఇంత బలం ఎక్కడిది? 197 00:10:22,706 --> 00:10:25,709 ఎందుకంటే, నేను భరించలేని నొప్పితో ఉన్నాను. 198 00:10:25,792 --> 00:10:28,253 ఇది కాస్త తాగు, బంగారం. 199 00:10:28,337 --> 00:10:29,880 -అది కాస్తయినా నొప్పిని తగ్గిస్తుంది. -సరే. 200 00:10:29,963 --> 00:10:32,049 ఎందుకైనా మంచిదని, తెచ్చేశా. 201 00:10:32,758 --> 00:10:35,594 ఈ కత్తెర సరిపోదు. ఇంకా చాలా పెద్ద కత్తెర కావాలి. 202 00:11:07,793 --> 00:11:10,712 -ఇందుకేనా జనాలు న్యూ ఇంగ్లాండ్ లో గడిపేది. -ఓరి దేవుడా. అందులో సందేహమే లేదు. 203 00:11:10,796 --> 00:11:13,507 మ్యాపుల్ చెట్ల నుండి చక్కెరని తీయడమంటే నాకు ప్రాణం. 204 00:11:13,590 --> 00:11:14,633 అదంటే నాకు కూడా ప్రాణమే. 205 00:11:14,716 --> 00:11:16,844 మొన్న, గుమ్మడికాయల మీద గీయడమంటే నీకు ప్రాణమని చెప్పావు. 206 00:11:16,927 --> 00:11:19,721 -ప్రాణమైన పనులు రెండు ఉండకూడదా? -అబీ, అలా ఉండకూడదు. 207 00:11:19,805 --> 00:11:23,809 హేయ్! నన్నేం చేయమంటావు. న్యూ ఇంగ్లాండ్ లో ఉంటే ఉల్లాసమే ఉల్లాసం.న్యూ ఇంగ్లాండ్ 208 00:11:23,892 --> 00:11:25,644 నా చెట్టు నుండి అస్సలేమీ రాలేదు. 209 00:11:25,727 --> 00:11:28,564 మ్యాపుల్ చెట్టు నుండి మంచి రసం రావాలంటే, దాని వయస్సు 45 ఏళ్ళు ఉండాలి. 210 00:11:28,647 --> 00:11:30,649 పుస్తకాల బాబా, జార్జ్ వచ్చాడమ్మా. 211 00:11:30,732 --> 00:11:32,901 అసలు ఫ్రేజర్ ఎక్కడ ఉన్నాడు? 212 00:11:32,985 --> 00:11:35,112 ఈ ఫేర్వెల్ పార్టీ మనం అతని కోసమే కదా చేసేది. 213 00:11:35,195 --> 00:11:36,780 అతను యుద్ధంలో సైనికునిగా చేరుతున్నాడంటే నమ్మలేకపోతున్నా. 214 00:11:36,864 --> 00:11:39,116 యుద్ధంలో పాల్గోనాల్సిందిగా ఒత్తిడి నానాటికీ అధికమవుతోంది. 215 00:11:39,199 --> 00:11:41,994 మనందరం కూడా త్వరలోనే యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. 216 00:11:42,077 --> 00:11:44,037 నీ సంగతేంటి, గురూ? యుద్ధంలో పాల్గొంటావా? 217 00:11:44,121 --> 00:11:46,331 సైన్యం నన్ను తీసుకోదులే. 218 00:11:46,415 --> 00:11:47,875 ఈ మధ్య నా ప్రవర్తన ఏంటో నాకే అంతుపట్టడం లేదు. 219 00:11:47,958 --> 00:11:49,293 అందులోనూ, నీకు బిడ్డ పుట్టబోతోంది. 220 00:11:49,376 --> 00:11:51,795 యుద్ధంలో పాల్గొనేవాళ్లకి చిన్నచిన్న పిల్లలున్నారు, అది చాలా విచారకరమైన విషయం. 221 00:11:52,421 --> 00:11:56,258 అవును. ఏదేమైనా, పురుషుడన్నాక తన బాధ్యత నిర్వర్తించక తప్పదు. 222 00:11:56,341 --> 00:11:57,801 మహిళలు ఎందుకు సైనికులు కాకూడదు? 223 00:11:57,885 --> 00:12:00,470 -సమానత్వమనేది ఉండదా? -ఆబీ. 224 00:12:00,554 --> 00:12:03,640 తాజా మ్యాపుల్ సిరప్ లో ముంచి తీయబడిన మట్టి ముద్ద ఎక్కడ దొరుకుతుందో ఎవరికైనా తెలుసా? 225 00:12:05,225 --> 00:12:07,561 -హేయ్, గురూ. -ఫ్రేజర్! 226 00:12:07,644 --> 00:12:09,771 -బాగున్నావు. చాలా బాగున్నావు. -అవును. 227 00:12:09,855 --> 00:12:11,690 ఇందాకే మా అమ్మ ఈ కోటుకు కాలర్ కుట్టి ఇచ్చింది. 228 00:12:11,773 --> 00:12:14,484 -బాగా స్టైలిష్ గా ఉంది. -అసలైన వీరుడిలా ఉన్నావు, స్టర్న్స్. 229 00:12:14,568 --> 00:12:17,154 -సిపాయి స్టర్న్స్ అని పిలవాలి నువ్వు. -అవును. 230 00:12:17,237 --> 00:12:20,324 -అమ్హెర్స్ట్ ముద్దు బిడ్డ ఇదుగోండి. -నిన్ను చూసి మేం గర్వపడుతున్నాం, ఫ్రేజర్. 231 00:12:20,407 --> 00:12:23,076 అందరూ వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు. 232 00:12:23,160 --> 00:12:25,162 మీ అందరినీ ఆఖరి సారిగా చూడటం నిజంగా చాలా మంచి విషయం. 233 00:12:26,121 --> 00:12:27,956 కాస్త ఆగు. ఆఖరి సారిగానా? నీ మొహంలే. 234 00:12:28,040 --> 00:12:31,793 -యుద్ధం అయ్యాక మళ్లీ కలుసుకుంటాంలే. -అవునవును. కావచ్చులే. 235 00:12:32,419 --> 00:12:35,047 అలా అనకు. అమ్హెర్స్ట్ ముద్దుబిడ్డను ఎవరూ ఏమీ చేయలేరు. 236 00:12:35,130 --> 00:12:37,591 అవును, ఫీల్డ్ హాకీ టీమ్ లో నువ్వే స్టార్ ఆటగాడివి, 237 00:12:37,674 --> 00:12:41,303 -కాలేజ్ ప్రెసిడెంట్ కొడుకువి... -యుద్ధం కూడా ఫీల్డ్ హాకీ లాంటిదే. 238 00:12:43,722 --> 00:12:45,849 ఏదేమైనా, ఇప్పుడు మాత్రం చావు తప్పేలా లేదులే. 239 00:12:45,933 --> 00:12:48,352 అలా అనకు. మొదట్నుంచీ కూడా మన గ్యాంగ్లో నువ్వే తోపువి. 240 00:12:48,435 --> 00:12:50,604 -నువ్వు నిజమైన హీరోవి. -హేయ్, ఎమిలీ ఏది? 241 00:12:50,687 --> 00:12:53,357 -ఎవరు? -ఎమిలీ డికిన్సన్. 242 00:12:53,440 --> 00:12:54,816 నీ చెల్లి? 243 00:12:54,900 --> 00:12:57,319 వెళ్లేముందు పలకరించి వెళ్దామనుకున్నా. తను కూడా ఇక్కడికి వస్తుందా? 244 00:12:58,946 --> 00:12:59,947 ఏమో. 245 00:13:00,739 --> 00:13:02,449 ఇప్పుడు నేను మా కుటుంబంతో సరిగ్గా మాట్లాడటం లేదులే. 246 00:13:02,533 --> 00:13:05,327 -ఆస్టిన్, ఏమైంది? -తర్వాత చెప్తాలే. 247 00:13:05,410 --> 00:13:08,497 సరే మరి, ఇతగాడికి మనం సరైన వీడ్కోలు పలుకుదాం, ఏమంటారు? 248 00:13:08,580 --> 00:13:11,083 ఫ్రేజర్ స్టర్న్స్ కోసం మూడు సార్లు చీర్స్ కొడదాం. హిప్, హిప్... 249 00:13:11,166 --> 00:13:12,626 -హురే! -హిప్, హిప్... 250 00:13:12,709 --> 00:13:14,628 -హురే! -హిప్, హిప్... 251 00:13:14,711 --> 00:13:17,548 ఎదురు చూసే మన వల్ల - అంత ఉపయోగం ఉందా - 252 00:13:18,674 --> 00:13:20,384 అంతటి మహత్తరమైన విషయమైన 253 00:13:21,218 --> 00:13:24,221 మన ప్రాణం - యుద్ధంలో - 254 00:13:25,681 --> 00:13:27,516 ఆవిరి - కావలసిందేనా? 255 00:13:32,896 --> 00:13:36,525 మన్నించాలి. నాకు వికారంగా ఉంది. ఇది అస్సలు నాకు నచ్చట్లేదు. 256 00:13:50,330 --> 00:13:52,374 కాస్తయినా నెట్టే ఓపిక ఉందా... 257 00:13:52,457 --> 00:13:53,458 సరే. 258 00:13:55,252 --> 00:13:59,756 పురుడు పోయడానికి ఇంత సమయం పడుతుందని నేను అనుకోనే లేదు. 259 00:13:59,840 --> 00:14:02,342 బిడ్డ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వస్తుంది. 260 00:14:02,426 --> 00:14:03,927 గాడిదల విషయంలో కూడా ఇంతే. 261 00:14:04,595 --> 00:14:06,388 జన్మనివ్వడంలో ఉన్న మంచి విషయమేంటో తెలుసా? 262 00:14:06,471 --> 00:14:09,474 సస్పెన్స్. పుట్టే దాకా ఏ బిడ్డ పుడుతుందో, ఎలాంటి బిడ్డ పుడుతుందో తెలీదు. 263 00:14:10,058 --> 00:14:13,187 ఒకసారి, మా కజిన్ కి అవిభక్త కవలలు పుట్టారు. 264 00:14:13,270 --> 00:14:16,607 మూడు చేతులు, రెండు తలలు. బహుశా సూకి కూడా అలాంటి కవలలే పుడతారేమో. 265 00:14:18,275 --> 00:14:21,778 -దీనికి ఇంకెంత సమయం పడుతుంది? -అదొక మిస్టరీ, బంగారం. ఎవరికీ తెలీదు. 266 00:14:21,862 --> 00:14:25,199 కానీ నేను ఒక అంచనా వేసి చెప్పగలను. ఓసారి చూసి చెప్తాను, ఏమంటావు? 267 00:14:25,282 --> 00:14:26,867 ఓరి దేవుడా. వద్దు... వద్దు. 268 00:14:29,077 --> 00:14:30,495 కదలకు, సూసన్. 269 00:14:30,579 --> 00:14:33,248 ఇంకా మూడు గంటలు పడుతుంది. తనది ఒక అంగుళమే పెరిగింది. 270 00:14:34,416 --> 00:14:36,168 మూడు గంటలంటే నేను భరించగలనో లేదో మరి. 271 00:14:36,251 --> 00:14:37,419 నువ్వు భరించలేవా? మరి నా సంగతేంటి? 272 00:14:37,503 --> 00:14:40,589 చూడు, ఎమిలీ, నేనూ, ఆంట్ లవీనియా ఎప్పుడూ చెప్తూనే ఉంటాం, 273 00:14:40,672 --> 00:14:42,758 నవ్వు కొటారంలో ఉండలేకపోతే బయటకు వెళ్లడమే ఉత్తమం. 274 00:14:42,841 --> 00:14:44,801 బహుశా నువ్వు బయటకువెళ్లాలేమో. 275 00:14:44,885 --> 00:14:46,970 కాస్తంత తాజా గాలి పీల్చుకో, బంగారం. అది నీకు అవసరం అవుతుంది. 276 00:14:49,306 --> 00:14:51,850 -నేను బయటకు వెళ్తే పర్వాలేదు కదా... -వెళ్లు మహాతల్లీ. 277 00:14:54,436 --> 00:14:56,647 తన కాళ్ల సహాయంతో తను ఇంకా బాగా నెట్టగలదు. 278 00:14:56,730 --> 00:15:00,359 -సిద్ధాంతం బాగుంది. -మోకాళ్ళ మీద, చేతుల మీద నిలబడు, బంగారం. 279 00:15:05,822 --> 00:15:07,783 ఎవరు వచ్చారో? ఆస్టిన్ అయ్యుంటాడు. 280 00:15:09,910 --> 00:15:12,204 ఫ్రేజర్. నువ్వా. 281 00:15:12,287 --> 00:15:15,290 ఎమిలీ. నీకు బై చెప్దామని వచ్చాను. 282 00:15:16,458 --> 00:15:18,001 బై. 283 00:15:18,085 --> 00:15:20,879 అయితే, నువ్వు... యుద్ధంలో పాల్గొంటున్నావన్నమాట? 284 00:15:20,963 --> 00:15:23,757 అవును, రేపు వర్జీనియాకి వెళ్తున్నాను. 285 00:15:23,841 --> 00:15:25,634 అక్కడి నుండి ఉత్తర కరొలినాకి వెళ్తాం. 286 00:15:25,717 --> 00:15:27,052 వావ్. 287 00:15:27,135 --> 00:15:30,222 -అయ్యో, ఆస్టిన్ ఇక్కడ లేడే. -తెలుసు, ఇప్పుడే అతడిని కలిసే వస్తున్నా. 288 00:15:31,181 --> 00:15:32,933 నీకు గుడ్ బై చెప్దామని వచ్చాను. 289 00:15:34,226 --> 00:15:35,602 నీకు వేరే పనేమీ లేదు కదా? 290 00:15:35,686 --> 00:15:39,356 లేదు. సూ బిడ్డ పుట్టేదాకా ఊరికే అటూఇటూ తిరుగుతూ ఉన్నా. 291 00:15:39,982 --> 00:15:41,525 ఆ విషయం నాకు తెలీదు. నేను అంతరాయం కలిగించాలనుకోలేదు. 292 00:15:41,608 --> 00:15:46,029 అబ్బే. మరేం పర్వాలేదు. అది చాలా సమయం తీసుకుంటోంది, నాకు డ్రింక్ కావాలి. 293 00:15:46,113 --> 00:15:47,114 లోపలికి రారాదు? 294 00:15:54,621 --> 00:15:55,622 మనం ఇంటికి వెళ్లిపోవాలంటావా? 295 00:15:58,292 --> 00:15:59,459 ఇదుగో. 296 00:16:03,547 --> 00:16:04,548 చీర్స్. 297 00:16:13,807 --> 00:16:15,684 నువ్వు నన్ను చూసిపోవడానికి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. 298 00:16:18,437 --> 00:16:21,565 మనకి గుడ్ బై చెప్పుకొనే అవకాశం రాకపోయుంటే నేను నిజంగానే బాధపడేదాన్ని. 299 00:16:21,648 --> 00:16:24,276 నేను కూడా. అందుకే వెళ్లడానికి ముందు కనిపించి పోదామని వచ్చా. 300 00:16:24,985 --> 00:16:28,739 అంటే, మళ్లీ నేను వస్తానో రానో అని చూసిపోదామని వచ్చా. 301 00:16:32,201 --> 00:16:33,577 అదన్నమాట? 302 00:16:34,912 --> 00:16:38,207 చూడు, నువ్వు ఎలా చనిపోతావనేదాని గురించి 303 00:16:38,290 --> 00:16:40,375 నాకు వచ్చిన విజన్ ని నువ్వు సీరియస్ గా తీసుకోకు. 304 00:16:40,459 --> 00:16:43,003 నేనో పిచ్చిదాన్ని. అది నీకు కూడా తెలుసు. 305 00:16:43,086 --> 00:16:45,297 నేను వెర్రిదాన్ని. అంతే కదా? 306 00:16:45,380 --> 00:16:48,634 -నీకేం కాదని నాకు బాగా తెలుసు, ఇంకా... -దయచేసి అలా ప్రవర్తించకు. 307 00:16:50,385 --> 00:16:51,678 ఎలా? 308 00:16:52,387 --> 00:16:55,599 అందరిలాగానే నువ్వు కూడా ఆనందంగా ఉన్నట్టు నటించకు. 309 00:16:57,226 --> 00:17:00,812 ఈ యుద్ధం ఎంత ప్రమాదకరమో అని నాతో నువ్వొక్కదానివే నిజాలు చెప్పావు. 310 00:17:02,898 --> 00:17:05,442 నువ్వు ఒక్కదానివే ధైర్యంగా వాస్తవాన్ని ఎదుర్కోగలుగుతున్నావు. 311 00:17:06,359 --> 00:17:08,654 నాలో అనవరంగా లేనిపోని ఆశలు కలిగించే ప్రయత్నం చేయకు. 312 00:17:11,448 --> 00:17:13,867 మనకి ఆశ తప్ప ఇంకేమీ లేకపోతే? 313 00:17:18,038 --> 00:17:19,665 ఒక్కోసారి... 314 00:17:22,584 --> 00:17:24,502 నేరుగా అంధకారంలోకి చూడటమే 315 00:17:24,586 --> 00:17:28,632 మనం చేయగల అత్యంత ఆశాజనకమైన విషయం అవుతుంది. 316 00:17:32,553 --> 00:17:34,805 -ఇంకో మాట, నీకు పిచ్చేమీ లేదు. -అవునా? 317 00:17:34,888 --> 00:17:35,889 లేదు! 318 00:17:37,474 --> 00:17:38,934 ఈ లోకానికే పిచ్చి. 319 00:17:40,310 --> 00:17:42,145 నీకూ, ఇతరులకూ మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా, 320 00:17:42,229 --> 00:17:44,273 నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా చెప్పేయగలవు. 321 00:17:46,608 --> 00:17:49,987 ఒక గొప్ప రచయుతకు కూడా ఉండాల్సింది అదే. ఏమంటావు? 322 00:17:50,070 --> 00:17:53,740 గొప్ప రచయితలు నిజాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించరు, అది బాధాకరమైనదైనా కూడా. 323 00:17:54,449 --> 00:17:55,909 డాంటే విషయాన్నే తీసుకుందాం. 324 00:17:56,660 --> 00:17:57,870 "ఇన్ఫర్నో." 325 00:17:59,746 --> 00:18:01,582 ఆయన నరకం దాకా వెళ్లి, 326 00:18:02,499 --> 00:18:04,376 దాన్ని మనకి వర్ణించడానికి మళ్లీ వచ్చాడు. 327 00:18:05,502 --> 00:18:06,503 అంటే... 328 00:18:11,717 --> 00:18:13,719 నువ్వు తిరిగి రావాలని నేను నిజంగానే కోరుకుంటున్నాను. 329 00:18:17,931 --> 00:18:18,932 బోస్టన్ పోస్ట్ 330 00:18:19,016 --> 00:18:22,436 "జనరల్ లీకి మరో గొప్ప విజయం దక్కింది, కానీ రెండు వేల మంది యూనియన్ సైనికులు మరణించారు, 331 00:18:22,519 --> 00:18:24,146 మరో 7,000 మంది గాయపడ్డారు." 332 00:18:24,229 --> 00:18:27,774 మంచిది. నేను పెళ్లి చేసుకొనే అవకాశమున్న వాళ్లలో మరో 2,000 మంది చనిపోయారు. 333 00:18:27,858 --> 00:18:29,651 రెండు వేల మంది తక్కువయ్యారు. 334 00:18:29,735 --> 00:18:32,487 -కాన్ఫెడరేట్ల సంగతేంటి? -వాళ్ల గురించి ఏం చెప్పాలి? 335 00:18:32,571 --> 00:18:34,281 వాళ్ల వైపున ఎంత నష్టం జరిగింది? 336 00:18:34,364 --> 00:18:38,035 -పేర్ల జాబితా ఉందా? -నీ ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. 337 00:18:38,118 --> 00:18:42,039 వాళ్లని కూడా నేను పెళ్లాడి ఉండవచ్చు. రాజకీయపరంగా భేదాభిప్రాయాలు ఉండవచ్చు, 338 00:18:42,122 --> 00:18:45,959 కానీ దాని వల్ల టిఫిన్ తినేటప్పుడు ఆసక్తికర సంభాషణలు జరపవచ్చులే. 339 00:18:46,043 --> 00:18:48,921 నా సోదరుడు కూడా ఉన్నాడో లేడో చూద్దామనుకుంటున్నానంతే. 340 00:18:49,671 --> 00:18:52,674 సవానాలో ఉన్న మీ అంకుల్, శామ్, అవతలి పక్షాన పోరాడుతున్నాడు. 341 00:18:57,888 --> 00:19:01,517 దక్షిణం వారి పేర్లు ఇక్కడ వేయలేదు. 342 00:19:01,600 --> 00:19:03,977 వాళ్లని ఇప్పుడు మనం మనుషుల్లా కూడా చూడమేమో. 343 00:19:05,896 --> 00:19:08,190 విద్వేషాల వల్ల జరిగేదదే, విన్నీ. 344 00:19:08,982 --> 00:19:10,817 విద్వేషాలు, వైషమ్యాలు. 345 00:19:12,319 --> 00:19:14,530 ఈ కాలంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది. 346 00:19:16,490 --> 00:19:19,493 నిన్న రాత్రి నిజంగానే నేను చనిపోయుంటే బాగుండేదేమో. 347 00:19:21,119 --> 00:19:23,038 నువ్వు చనిపోనందుకు నాకు ఆనందంగా ఉంది. 348 00:19:23,121 --> 00:19:24,414 నిజంగానా? 349 00:19:24,498 --> 00:19:25,707 అవును. 350 00:19:26,500 --> 00:19:29,711 ఈ యుద్ధం పుణ్యమా అని, నాకు భర్త కాబోయే అవకాశమున్న వాళ్లందరూ చనిపోతున్నారు. 351 00:19:30,671 --> 00:19:33,340 మా నాన్న కూడా చనిపోతే నేను తట్టుకోలేను. 352 00:19:35,092 --> 00:19:37,469 కాస్త క్రీడల విభాగాన్ని చదివి పెట్టరాదు. 353 00:19:39,596 --> 00:19:40,597 సరే. 354 00:19:45,769 --> 00:19:49,106 నువ్వు ఇవాళ బిల్లీని తీసుకురాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. 355 00:19:49,189 --> 00:19:51,191 వాడికి మ్యాపుల్ మంచు ముద్దలంటే చాలా ఇష్టం. 356 00:19:51,984 --> 00:19:53,861 నిన్న రాత్రి వాడు సరిగ్గా నిద్రపోలేదు. 357 00:19:55,112 --> 00:19:56,405 నేను కూడా. 358 00:19:56,488 --> 00:19:59,408 నువ్వు పక్కన లేకుంటే నాకు నిద్ర అస్సలు సరిగ్గా పట్టదు. 359 00:20:03,036 --> 00:20:04,496 నువ్వు నా జీవితాన్ని కాపాడావు. 360 00:20:05,414 --> 00:20:07,416 అది నీకు కూడా తెలుసు కదా? 361 00:20:08,750 --> 00:20:10,127 నీతో ఉండటం, 362 00:20:10,919 --> 00:20:12,921 బిల్లీని చూసుకుంటూ ఉండటం, 363 00:20:14,047 --> 00:20:16,258 నా జీవితంలో నాకు ఆనందాన్నిచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, అవే. 364 00:20:17,384 --> 00:20:18,385 అదే నా సర్వస్వం. 365 00:20:20,137 --> 00:20:21,763 నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. 366 00:20:22,890 --> 00:20:25,142 మీ కోసం నేనేమైనా చేస్తాను, జేన్. 367 00:20:25,225 --> 00:20:26,643 ఆస్టిన్, ఇక ఆపు. 368 00:20:28,437 --> 00:20:30,772 మనం ఇప్పుడు అలా ఉండలేము. అది నేను నీకు చెప్పా కూడా. 369 00:20:31,356 --> 00:20:32,357 ఎందుకని? 370 00:20:33,317 --> 00:20:35,319 ఎందుకంటే, సూ ఓ బిడ్డకి జన్మనిస్తోంది. 371 00:20:36,278 --> 00:20:37,988 దాని వల్ల మన మధ్య సంబంధం తెగిపోవాల్సిన అవసరం లేదు కదా. 372 00:20:38,071 --> 00:20:39,990 ఉంది. అదేగాక, నేను... 373 00:20:41,450 --> 00:20:43,118 నేను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నాను. 374 00:20:44,077 --> 00:20:45,078 నువ్వు... 375 00:20:46,914 --> 00:20:47,915 పెళ్లి చేసుకోబోతున్నావా? 376 00:20:48,498 --> 00:20:51,126 ఆయన మా నాన్నకు వ్యాపారంలో భాగస్వామి అన్నమాట. 377 00:20:51,210 --> 00:20:52,628 అతని పేరు పియర్. 378 00:20:53,921 --> 00:20:55,547 అతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. 379 00:20:56,924 --> 00:20:59,468 పియర్... ఏ పియర్? అతను నాకు తెలుసా? 380 00:20:59,551 --> 00:21:01,762 లేదు. అతను ఇక్కడి వాడు కాదు. 381 00:21:02,387 --> 00:21:05,390 అతనిది ఫ్రాన్స్. నిజానికి, వియత్నాం. 382 00:21:08,936 --> 00:21:10,395 ఆయనకి పెద్ద తోట కూడా ఉంది. 383 00:21:11,188 --> 00:21:12,439 ఇంకా ఆయన... 384 00:21:13,815 --> 00:21:15,192 ఫ్రెంచి వారితో వ్యాపారం చేసేందుకు వీలుగా 385 00:21:15,275 --> 00:21:18,278 ఆయన నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. 386 00:21:19,279 --> 00:21:20,280 వావ్. 387 00:21:21,114 --> 00:21:22,783 పెద్ద తలకాయ నొప్పి క్యాండిడేట్ లా ఉన్నాడే. 388 00:21:23,325 --> 00:21:25,827 నాకు తెలిసిందల్లా, అతని దగ్గర చాలా డబ్బు ఉందని, 389 00:21:25,911 --> 00:21:28,163 బిల్లీకి మంచి చదువు చెప్పించగలడని, అంతే. 390 00:21:28,247 --> 00:21:31,208 -చదువు నేను కూడా చెప్పించగలను కదా. -ఆస్టిన్... 391 00:21:33,126 --> 00:21:37,172 అది... అది పని చేయని వ్యవహారం. సరేనా? ఇది చాలా చిన్న ఊరు. 392 00:21:37,256 --> 00:21:38,799 మనం కొనసాగిస్తే, జీవితాంతం నేను తల దించుకొని బతకాలి, 393 00:21:38,882 --> 00:21:40,717 -అది నేను చేయలేను. -లేదు, లేదు. 394 00:21:40,801 --> 00:21:42,094 జేన్, జేన్. 395 00:21:42,803 --> 00:21:43,804 బతిమాలుతున్నాను. 396 00:21:44,638 --> 00:21:47,558 దయచేసి వెళ్లిపోకు. 397 00:21:48,725 --> 00:21:51,311 వియత్నాంకి మా టిక్కెట్లు ఎప్పుడో బుక్ అయిపోయాయి. 398 00:21:53,856 --> 00:21:55,482 నాకు మరో దారి లేదు. 399 00:21:56,650 --> 00:21:59,152 ఏదోకరోజు ఆ విషయం నీకు అర్థమవుతుందనుకుంటా. 400 00:22:02,698 --> 00:22:03,866 నీ భార్య... 401 00:22:04,867 --> 00:22:08,370 నీ భార్య నిన్ను బాగా చూసుకోవడం ఎలాగో తెలుసుకుంటుందని ఆశిస్తున్నా. 402 00:22:25,179 --> 00:22:26,763 పొద్దుపోతోంది. 403 00:22:27,389 --> 00:22:28,807 నేనింకా బట్టలు సర్దుకోలేదు. 404 00:22:30,475 --> 00:22:31,977 నువ్వు వెళ్లకుండా ఉంటే బాగుండు. 405 00:22:33,312 --> 00:22:34,688 వెళ్లక తప్పదు. 406 00:22:37,733 --> 00:22:40,235 నేను ఈ ఊరిని మిస్ అవుతాను. నా అందమైన అమ్హెర్స్ట్ ని. 407 00:22:40,319 --> 00:22:43,197 అవును, నాకు కూడా ఈ ఊరంటే చాలా ఇష్టం. 408 00:22:43,280 --> 00:22:47,284 హేయ్, నాతో యుద్ధంలోకి తీసుకువెళ్లడానికి నేను నిన్ను ఒకటి అడుగుదామనుకుంటున్నాను. 409 00:22:47,367 --> 00:22:48,368 ఏమైనా అడుగు. 410 00:22:50,120 --> 00:22:51,121 ఒక కవిత కావాలి. 411 00:22:54,291 --> 00:22:55,959 ఎప్పుడూ ఈ జేబులోనే పెట్టుకొని తిరుగుతాను. 412 00:22:59,922 --> 00:23:01,673 నీ పదాలు నాలో ఆశను చిగురింపజేస్తాయి. 413 00:23:03,383 --> 00:23:04,635 లేనిపోని ఆశలను కలిగించేదు కాదు కదా? 414 00:23:04,718 --> 00:23:05,719 కాదు. 415 00:23:06,803 --> 00:23:08,013 నిజమైన ఆశను కలిగించేది. 416 00:23:10,140 --> 00:23:13,810 కొన్నిసార్లు పరిస్థితులు మెరుగవ్వవు అని ధైర్యంగా ఒప్పుకొనే రకమైనవి. 417 00:23:20,484 --> 00:23:22,152 ఇదుగో. ఇది తీసుకో. 418 00:23:23,278 --> 00:23:24,696 ఇవాళే రాశాను. 419 00:23:28,158 --> 00:23:29,826 ఇది ఎవరి కోసం రాశావు? 420 00:23:31,203 --> 00:23:32,204 నేను దీన్ని... 421 00:23:33,914 --> 00:23:34,915 ఎవరి కోసమూ రాయలేదు. 422 00:23:44,424 --> 00:23:46,176 బతికి ఉన్నందుకు సిగ్గుగా ఉంది - 423 00:23:47,010 --> 00:23:49,680 ఎంతో మంది ధీరులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు - 424 00:23:50,681 --> 00:23:52,599 అమరులైన వారిని చూసి అసూయ కలుగక మానదు - 425 00:23:53,934 --> 00:23:56,562 అటువంటి - రాతి సమాధి - 426 00:23:58,605 --> 00:23:59,815 ధన్యవాదాలు, ఎమిలీ. 427 00:24:14,413 --> 00:24:16,206 బిడ్డ తల బయటకు వచ్చింది. ఎమిలీ, త్వరగా రా. 428 00:24:21,837 --> 00:24:25,340 మా ప్రాణం సర్వం నీవే ప్రభువా 429 00:24:26,508 --> 00:24:32,055 ఆయన సూత్రమే మనల్ని నడిపిస్తోంది 430 00:24:33,473 --> 00:24:34,474 భగవంతుడా. 431 00:24:34,558 --> 00:24:35,726 నువ్వు వచ్చేశావు. 432 00:24:37,144 --> 00:24:38,145 ఏంటి సంగతి, చెల్లాయి? 433 00:24:40,689 --> 00:24:42,149 ఆస్టిన్, నువ్వు మిస్ అయ్యావు. 434 00:24:42,232 --> 00:24:44,568 నువ్వు సరిగ్గా చూస్తే నేను గురితప్పలేదని గ్రహిస్తావు. 435 00:24:44,651 --> 00:24:47,279 అది కాదు. నేను బిడ్డ గురించి చెప్తున్నా. 436 00:24:47,905 --> 00:24:50,490 నీ బిడ్డ ఇప్పుడే పుట్టింది. ఆస్టిన్, నువ్వు తండ్రివి అయ్యావు. 437 00:24:57,456 --> 00:24:58,874 మరి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నాకు చెప్పలేదే? 438 00:24:59,458 --> 00:25:02,085 అంటే, నేను వద్దామనుకున్నా. నిజంగానే. నేను... నేను... 439 00:25:03,003 --> 00:25:05,088 నేను వెళ్తానని కూడా చెప్పా... అదంతా... 440 00:25:05,172 --> 00:25:07,424 అదంతా... చాలా వేగంగా గడిచిపోయింది. 441 00:25:09,593 --> 00:25:12,179 ఆగు. నేను నిన్న రాత్రి జరిగినదాని గురించి రెండు ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను. 442 00:25:12,262 --> 00:25:14,139 నిన్న రాత్రి జరిగినదాని గురించి నాకు మాట్లాడాలని లేదు. 443 00:25:14,806 --> 00:25:16,225 నేను వెళ్లి నా బిడ్డని చూడాలి. 444 00:25:16,308 --> 00:25:17,643 సరే. ఆ విషయం నాకు తెలుసు. 445 00:25:17,726 --> 00:25:20,312 కానీ నువ్వు అన్న కొన్ని మాటలను నువ్వు ఉపసంహరించుకోవాలి. 446 00:25:22,481 --> 00:25:24,942 ఇప్పుడు ఒక బిడ్డ పుట్టింది కనుక, మన కుటుంబం అంతా కలిసి ఉండటం 447 00:25:25,025 --> 00:25:26,693 ముఖ్యమని నీకు అనిపించడం లేదా? 448 00:25:26,777 --> 00:25:28,445 ఇంత జరిగాక మళ్లీ కలవడమనేది కుదరదు అనుకుంటా. 449 00:25:28,529 --> 00:25:31,448 అప్పుడే ఏమీ అయిపోలేదు, ఆస్టిన్. 450 00:25:31,532 --> 00:25:34,159 మనం దీన్ని సరి చేయవచ్చు. నువ్వు నాన్నకు క్షమాపణలు చెప్తే సరిపోతుంది. 451 00:25:35,160 --> 00:25:39,039 జీవితంలో మళ్లీ ఆ మనిషితో మాట్లాడాలని నాకు అస్సలు లేదు. 452 00:25:39,122 --> 00:25:40,123 నువ్వు అలా అనకూడదు. 453 00:25:41,625 --> 00:25:42,626 నేను నిజంగా అంటున్నాను. 454 00:25:43,460 --> 00:25:45,671 ఈ కుటుంబం ముక్కలైపోయింది, ఎమిలీ. 455 00:25:46,421 --> 00:25:49,842 ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా, నువ్వు ఏదోక పక్షాన్ని ఎంచుకోవలసి వస్తుంది. 456 00:26:56,283 --> 00:26:58,285 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య