1 00:00:16,808 --> 00:00:18,227 డాంటే అలిజియేరీ రచించిన డివైన్ కామెడీ 2 00:00:18,310 --> 00:00:19,311 ఒకటవ సంపుటి ఇన్ఫర్నో 3 00:00:23,023 --> 00:00:24,858 హమ్మయ్య! శుభప్రదమైన ఉదయం, అమ్మాయి. 4 00:00:24,942 --> 00:00:25,817 -నాన్నా. -అవును. 5 00:00:25,901 --> 00:00:27,194 నువ్వు బెడ్ మీద నుండి లేచావు! 6 00:00:27,277 --> 00:00:28,654 బాగా తయారయ్యావు. 7 00:00:28,737 --> 00:00:30,447 మళ్లీ నీ ముఖంలో కళ వచ్చింది. 8 00:00:30,531 --> 00:00:33,075 నాకు తెలుసు. నాకు చాలా బాగుంది. 9 00:00:33,158 --> 00:00:37,329 నాకు కావలసిందల్లా కొన్ని రోజుల విశ్రాంతి, అంతే, ఇప్పుడు చూడు నాకు చాలా బాగుంది. 10 00:00:37,412 --> 00:00:41,208 అయితే, ఆరోగ్యం బాగవ్వడంతో పాటు నాకొక ముఖ్యమైన విషయం తెలిసొచ్చింది. 11 00:00:41,291 --> 00:00:42,918 -ఏంటది? -నేను చనిపోబోతున్నాననే విషయం. 12 00:00:43,001 --> 00:00:44,795 -ఏంటి? -ఏడవద్దు, ఏడవద్దు. 13 00:00:44,878 --> 00:00:48,215 లేదు, అది మామూలు విషయమే. నేను ఇంకా ఎంతో కాలం బతకను. 14 00:00:48,298 --> 00:00:51,218 అవును. జీవితం తాత్కాలికమైనది, గాల్లో పెట్టిన దీపం లాంటిది... 15 00:00:52,010 --> 00:00:53,011 సెలవు, ఎడ్డీ. 16 00:00:53,929 --> 00:00:55,264 నువ్వు గ్రహించే లోపే, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, 17 00:00:55,347 --> 00:00:57,933 అంటే, నేను వీలునామా పనులు గట్రా అంతా క్రమబద్ధీకరించాలి. 18 00:00:59,351 --> 00:01:00,352 వీలునామానా? 19 00:01:00,435 --> 00:01:02,729 అవును. ఇది అత్యవసర పరిస్థితి. 20 00:01:02,813 --> 00:01:05,357 లేదు. నేను నా ఎస్టేట్ అంతటినీ ఒక క్రమ పద్ధతిలో సెట్ చేయాలి. 21 00:01:05,440 --> 00:01:08,360 నా వీలునామాలో మార్పులు జరపాలి, ఒప్పందాలకు నోటరీ చేయించాలి, 22 00:01:08,443 --> 00:01:10,696 ఇంకా నా వ్యాసాల సంగ్రహాన్ని రైటర్ కు పంపాలి, 23 00:01:10,779 --> 00:01:13,532 అలాగే, న్యూ ఇంగ్లాండ్ లోని మంచి మంచి సంస్థలన్నింటికీ 24 00:01:13,615 --> 00:01:16,034 గౌరవప్రదంగా ఉండేంత మొత్తాన్ని విరాళాలుగా కూడా ఇవ్వాలి. 25 00:01:16,118 --> 00:01:17,870 ఎమిలీ, సమయం మించిపోతోంది. 26 00:01:17,953 --> 00:01:22,499 నేను అమ్హెర్స్ట్ లో నాకంటూ ఒక చెరగని ముద్ర వేసుకోవాలి, 27 00:01:22,583 --> 00:01:24,293 అలాగే ప్రపంచంలో కూడా వేసుకోవాలి. 28 00:01:25,419 --> 00:01:26,837 నేను ఒక నెలలో చనిపోవచ్చు, 29 00:01:26,920 --> 00:01:31,133 కానీ ఎడ్వర్డ్ డికిన్సన్ అనే పేరును జనాలు మర్చిపోకూడదు. 30 00:01:34,261 --> 00:01:39,391 సరే. నాన్నా, నువ్వు కోలుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 31 00:01:40,517 --> 00:01:42,269 నేను నీతో ఓ విషయం గురించి మాట్లాడాలి. 32 00:01:42,352 --> 00:01:45,898 త్వరగా చెప్పు. నేను భారీ విరాళాలకు సంబంధించిన పనులు చూసుకోవాలి. 33 00:01:46,690 --> 00:01:50,736 సరే. నీకూ, ఆస్టిన్ కి మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడాలనుకుంటున్నా. 34 00:01:50,819 --> 00:01:51,945 గొడవ ఏంటి? 35 00:01:52,029 --> 00:01:55,032 అంటే, ఆ రోజు ఆస్టిన్ తాగేసి ఏవేవో మాట్లాడినప్పుడు 36 00:01:55,115 --> 00:01:57,034 నీ గుండె ఒక్క క్షణం పాటు కొట్టుకోవడం ఆగిపోయింది కదా. 37 00:01:57,117 --> 00:01:58,243 ఆ విషయమా. 38 00:01:58,327 --> 00:02:02,414 చూడు, వాడు చేసిన పనికి, ఇక నువ్వు వాడితో మాట్లాడుకోకూడదు అనుకోవచ్చు, 39 00:02:03,540 --> 00:02:08,753 కానీ నేను మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నా, వాడిని క్షమించేయ్. 40 00:02:10,714 --> 00:02:12,341 నా బంగారు సెంటిమెంటల్ పాపా. 41 00:02:12,841 --> 00:02:15,427 మీ అన్నయ్య మీద నాకు రవ్వంత కోపం కూడా లేదు. 42 00:02:16,178 --> 00:02:17,387 -లేదా? -లేదు. 43 00:02:17,971 --> 00:02:20,516 చావు అంచుల దాకా వెళ్లొచ్చిన నాకు తెలిసొచ్చిన విషయం ఏంటంటే, 44 00:02:20,599 --> 00:02:23,852 జీవితం చాలా చిన్నది, అలాంటప్పుడు నా ఒక్కగానొక్క కొడుకుపై నేను పగ పెంచుకోలేను. 45 00:02:23,936 --> 00:02:25,646 నాన్నా, నువ్వు కోపంగా ఉంటావనుకున్నా. 46 00:02:25,729 --> 00:02:28,732 ఎమిలీ, ఏ విషయంలోనో ఇప్పుడు ఆస్టిన్ మానసికంగా బాధపడుతున్నాడు. 47 00:02:28,815 --> 00:02:30,400 దాని ప్రభావం అతనిపై పడేలా చేయాలని నాకు లేదు. 48 00:02:30,484 --> 00:02:32,986 వాడికి ఏ సపోర్ట్ కావాలన్నా, అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 49 00:02:33,070 --> 00:02:36,615 అందు కోసం వాడికి నాతో కొంత కాలం మాట్లాడాలని లేకపోతే... అలాగే కానిమ్మను. 50 00:02:37,574 --> 00:02:39,701 ఇంత మాత్రానికి వీలునామా నుండి వాడి పేరును నేనేమీ తీసేయను కదా. 51 00:02:39,785 --> 00:02:44,414 నాన్నా. ఇది సూపర్ విషయం. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను. 52 00:02:44,498 --> 00:02:49,211 మనం ప్రశాంతంగా ఉండవచ్చు. ఎట్టకేలకు, మన కుటుంబంలోకి ప్రశాంతత రాగలిగింది. 53 00:02:54,341 --> 00:02:56,260 డికిన్సన్ 54 00:02:56,343 --> 00:02:58,345 ఆత్మ బంధీ అయిన క్షణాలు 55 00:03:06,937 --> 00:03:10,065 -నువ్వు ఇంకొన్ని ముత్యాలు కుడతావనుకున్నా. -ఇది బాధపడటానికి ఉద్దేశించిన డ్రెస్. 56 00:03:10,148 --> 00:03:13,777 నాకు తెలుసు. ఇతర మహిళలయితే ఒక భర్త పోయినందుకు బాధపడతారు, 57 00:03:13,861 --> 00:03:17,072 కానీ నేనయితే ఇక కలుసుకొనే అవకాశమే లేని ఎంతో మంది మొగుళ్ల కోసం బాధపడుతున్నా. 58 00:03:17,155 --> 00:03:19,366 అందుకని మనం ఈ డ్రెస్సుకు మరిన్ని మెరుగులు దిద్దాలి. 59 00:03:19,950 --> 00:03:24,037 నా దృష్టిలో డ్రెస్సుకు ముత్యాలు ఉంటే, అది బాధపడుతున్నట్టు అనిపించదు. 60 00:03:24,121 --> 00:03:26,999 నిజంగా? అయితే క్లీవేజ్ ఇంకాస్త పెడితే బాగుంటుందంటావా? 61 00:03:27,666 --> 00:03:29,918 విన్నీ. విన్నీ. హాయ్, బెట్టీ. 62 00:03:30,002 --> 00:03:31,920 మంచి వార్తలు. నాన్నకి ఆస్టిన్ మీద కోపం లేదు. 63 00:03:32,421 --> 00:03:35,340 -డికిన్సన్ యుద్దం ముగిసింది. -యాహూ! 64 00:03:35,424 --> 00:03:40,053 కానీ, అసలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది, అందుకే నాకు నీ సాయం కావాలి. 65 00:03:40,137 --> 00:03:41,263 ఏ విషయంలో? 66 00:03:41,346 --> 00:03:43,098 ఇవాళ, నేను మన మహిళా టైలర్లు అందరినీ పిలుస్తున్నాను. 67 00:03:43,182 --> 00:03:46,226 నేను "అమ్హెర్స్ట్ లేడీస్ ఎయిడ్ సొసైటీ" అని పేరు కూడా పెట్టాను, 68 00:03:46,310 --> 00:03:48,145 మేము సైనికులకు బ్యాండేజీలు చేస్తాం. 69 00:03:48,228 --> 00:03:51,273 సూపర్, విన్నీ. నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావు. 70 00:03:51,356 --> 00:03:54,735 అవును, కాబట్టి నువ్వు కూడా కాసేపటికి రావాలి. 71 00:03:55,360 --> 00:03:57,654 ఈ రాత్రికి నాకు రాసే పనుంది. 72 00:03:57,738 --> 00:03:59,907 నా తలలో చాలా కవిత్వం పాతుకుపోయుంది. 73 00:03:59,990 --> 00:04:03,493 మన కుటుంబంలోని ఘర్షణల కారణంగా, అది బయట పడలేకపోయింది. 74 00:04:03,577 --> 00:04:06,663 ఎట్టకేలకు, ఈ రాత్రి నేను శాంతంగా కూర్చొని రాయగలను. 75 00:04:06,747 --> 00:04:07,998 మన్నించాలి. 76 00:04:08,081 --> 00:04:09,583 ఇప్పుడు శాంతికి అవకాశమే లేదు. 77 00:04:09,666 --> 00:04:10,667 ఈ దేశంలో యుద్ధం జరుగుతోంది, 78 00:04:10,751 --> 00:04:12,878 నా మాజీ ప్రియులందరూ చనిపోతున్నారు, నువ్వు తప్పనిసరిగా సాయం చేయాలి. 79 00:04:12,961 --> 00:04:13,962 కానీ నాకు కుట్టడం అస్సలు రాదు. 80 00:04:14,046 --> 00:04:16,507 అది నిజమే. తనకి సూది పట్టుకోవడం కూడా రాదు. 81 00:04:18,800 --> 00:04:20,636 సర్లే. వెక్కిరించాల్సిన అవసరం లేదు. 82 00:04:20,719 --> 00:04:23,680 ఒకొక్కొరికీ ఒక్కో బలం ఉంటుంది. కుట్టడం నా బలం కాదు, అంతే. 83 00:04:23,764 --> 00:04:26,391 అందుకే ఈరాత్రి బెట్టీ కూడా వస్తోంది. 84 00:04:26,475 --> 00:04:30,145 కుట్టడంలో అమ్హెర్స్ట్ లో తనని మించినవాళ్లు ఎవరూ లేరు, సైనికులకు రోలర్ బ్యాండేజీలను, 85 00:04:30,229 --> 00:04:31,980 ఇతర పనికొచ్చే వాటిని ఎలా కుట్టాలో తనే నేర్పుతుంది. 86 00:04:32,064 --> 00:04:35,150 -నీకు కూడా, ఎమిలీ. -అవును, కానీ నేను ఎక్కువ సేపు ఉండలేను. 87 00:04:35,234 --> 00:04:38,195 గుర్తుందిగా, నాకు... క్షమించాలి. 88 00:04:38,278 --> 00:04:42,574 మా ఇంట్లో ఒక అతిథి ఉంటున్నారు. నేను బాగా అలసిపోయున్నాను. 89 00:04:42,658 --> 00:04:43,909 నిన్న రాత్రి పడుకోలేదు కూడా. 90 00:04:43,992 --> 00:04:46,620 ఆ అతిథి, రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేస్తుంది. 91 00:04:46,703 --> 00:04:48,539 -ఎవరు ఆ అతిథి? -గట్టిగా గురకపెడుతోందా ఏంటి? 92 00:04:49,122 --> 00:04:53,252 లేదు, తను చెప్తూ ఉంటుంది. తన ఆత్మ కథను రాయడంలో తనకి సాయపడుతున్నా. 93 00:04:53,335 --> 00:04:57,631 తను చాలా గొప్ప మనిషి. అసాధారణమైన జీవనాన్ని గడిపింది, 94 00:04:57,714 --> 00:05:00,634 కానీ తనకి చదవడం, రాయడం రాదు, కాబట్టి, తను చెప్పేదంతా నేను రాస్తుంటాను. 95 00:05:00,717 --> 00:05:03,428 ఏకధాటిగా మూడు రాత్రుళ్ల నుండి తను చెప్తూనే ఉంది, నేను రాస్తూనే ఉన్నాను, 96 00:05:03,512 --> 00:05:05,472 తను అస్సలు విరామమే ఇవ్వడం లేదు. 97 00:05:05,556 --> 00:05:08,433 ఒక కథ తర్వాత మరొకటి చెప్తూనే ఉంటుంది. నేను తన వేగాన్ని అందుకోలేకపోతున్నా. 98 00:05:08,517 --> 00:05:11,687 అది చాలా గొప్ప విషయం, బెట్టీ. ఇతరులకు మనం అంత కన్నా ఇంకేం మేలు చేయగలం. 99 00:05:11,770 --> 00:05:15,691 -వారి గాథను రాయడంలో సహాయపడటం కన్నా. -హెన్రీ నుండి డైవర్ట్ అయినా చేస్తుందిలే. 100 00:05:16,316 --> 00:05:17,818 ఇంకా అతను లేఖ రాయలేదా? 101 00:05:18,402 --> 00:05:21,113 ఓరి దేవుడా. హెన్రీకి ఏమైంది? 102 00:05:21,697 --> 00:05:22,948 ఏమో తెలీదు. 103 00:05:23,031 --> 00:05:25,409 అతని నుండి లేఖ వచ్చి నెలపైనే అయింది. 104 00:05:25,993 --> 00:05:29,288 -మీ ఇద్దరి మధ్య ఇంకా బంధం ఉంది కదా? -విన్నీ, ఆగు. బాధపెట్టేలా మాట్లాడకు. 105 00:05:30,163 --> 00:05:34,126 చూడు, బెట్టీ. నేను అర్థం చేసుకోగలను. 106 00:05:34,209 --> 00:05:36,962 ప్రేమించిన వారిని, లేదా ఏదైనా పార్టీలో గడిపిన వారిని కోల్పోవడం 107 00:05:37,045 --> 00:05:39,339 ఎలా ఉంటుందో నాకు తెలుసు. 108 00:05:39,423 --> 00:05:41,175 హెన్రీకి ఏమీ కాలేదు. 109 00:05:41,675 --> 00:05:45,012 అతను ఎక్కడో చోట బతికే ఉన్నాడు, త్వరలోనే బెట్టీకి ఉత్తరం రాస్తాడు. 110 00:05:45,888 --> 00:05:48,390 కనీసం హెలెన్ కోసమైనా రాస్తాడని ఆశిస్తున్నాను. 111 00:05:48,473 --> 00:05:52,227 అతను బతికే ఉన్నాడు. బెట్టీ, నిజంగానే చెప్తున్నా. నేను ఆశ వదులుకోను. 112 00:05:54,229 --> 00:05:55,647 ధన్యవాదాలు, ఎమిలీ. 113 00:05:56,356 --> 00:05:59,109 అది... నాకు ఊరటని ఇచ్చింది. 114 00:05:59,902 --> 00:06:01,361 నేను చేయాలనుకునేది కూడా అదే. 115 00:06:01,445 --> 00:06:02,905 -ఇతరులకు సాయపడటం. -మంచిది. 116 00:06:02,988 --> 00:06:05,908 అయితే ఈరాత్రి జరిగే అమ్హెర్స్ట్ మహిళా టైలర్ల పార్టీకి నువ్వు కూడా వస్తున్నావన్నమాట. 117 00:06:05,991 --> 00:06:08,911 విన్నీ, బెట్టీ, మీరు నాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. 118 00:06:08,994 --> 00:06:10,871 మనందరం చేతులు కలిపి సాయపడవచ్చు. 119 00:06:10,954 --> 00:06:13,498 మనందరం మన వంతు సహాయపడి, ఈ లోకాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్ది, 120 00:06:13,582 --> 00:06:16,710 ఈ దేశాన్ని ప్రేమతో, కరుణతో ముంచేయవచ్చు. 121 00:06:16,793 --> 00:06:20,464 ఆ పిచ్చిది బిడ్డని ముట్టుకోనివ్వట్లేదు! 122 00:06:20,547 --> 00:06:22,508 సరే మరి, ఇక నేను బయలుదేరితే మంచిదనుకుంటా. 123 00:06:22,591 --> 00:06:24,968 తర్వాత కలుద్దాం మరి. ఒక అదనపు తుడుపును తేవడం మర్చిపోకు. 124 00:06:25,052 --> 00:06:27,471 అసలు తన గురించి తనేమనుకుంటోంది? 125 00:06:27,554 --> 00:06:28,722 ఏంటి ఇక్కడ గోల? 126 00:06:28,805 --> 00:06:31,016 ఎడ్వర్డ్! నువ్వు బెడ్ దిగావే! 127 00:06:31,099 --> 00:06:32,601 అవును. నాకు బాగానే ఉండింది, 128 00:06:32,684 --> 00:06:34,603 అందుకని నేను కిందికి వచ్చి, నా వీలునామాను మారుద్దామనుకున్నా. 129 00:06:34,686 --> 00:06:36,813 సూకి మాత్రం ఏమీ రాయకు. 130 00:06:36,897 --> 00:06:39,691 -తనేం చేసింది? -నన్ను నా మనవడినే ముట్టుకోనివ్వడంలేదు. 131 00:06:40,442 --> 00:06:43,153 ఆ బిడ్డకి బతికి ఉన్న బామ్మ అంటే నేనొక్కదాన్నే కదా. 132 00:06:43,237 --> 00:06:44,530 ఇదేనా నాకు ఇచ్చే గౌరవం? 133 00:06:44,613 --> 00:06:47,783 అదీగాక, వాడిని ఈ లోకంలోకి తెచ్చింది కూడా నేనే, 134 00:06:47,866 --> 00:06:50,118 ఒక విధంగా చెప్పాలంటే, వాడిని ఇక్కడికి తెచ్చింది, సూ. 135 00:06:50,202 --> 00:06:53,413 అబ్బా. తను పడుకొని కాస్తంత నెట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు. 136 00:06:53,497 --> 00:06:57,709 కానీ నేను, ఎంతో పేరున్న నార్క్రాస్ మంత్రసానిత నైపుణ్యాలను ఉపయోగించి, 137 00:06:57,793 --> 00:07:02,422 వాడిని ఈ లోకంలోకి తెచ్చాను, దానికి ఇలాగేనా తను కృతజ్ఞత చూపేది? 138 00:07:02,506 --> 00:07:04,049 కనీసం నన్ను గదిలోకి కూడా రానివ్వడం లేదు. 139 00:07:04,132 --> 00:07:06,552 సరే, ఓ విషయం చెప్పనా? నిజం చెప్పాలంటే, తనంటే నాకు మొదట్నుంచీ ఇష్టం లేదు. 140 00:07:06,635 --> 00:07:09,096 ఎమిలీ, నాకు నీ సాయం కావాలి. 141 00:07:09,179 --> 00:07:10,806 నా సాయమా? నేనేం చేయగలను? 142 00:07:10,889 --> 00:07:12,683 తను కేవలం నీ మాట మాత్రమే వింటుంది. 143 00:07:12,766 --> 00:07:15,018 ఇప్పుడే ప్రత్యేకంగా నీ గురించి అడిగింది. 144 00:07:15,102 --> 00:07:17,229 "ఈ పడక గదిలోకి ఎమిలీ తప్ప ఇంకెవరూ రావడానికి వీల్లేదు," అని అంది. 145 00:07:17,312 --> 00:07:19,565 నువ్వు వెళ్లి, కాస్త తన ప్రవర్తనను మార్చుకోమని హితవు చెప్పు. 146 00:07:20,774 --> 00:07:23,527 సరే. నేను ఇప్పుడే పైకి వెళ్లి, రాయడానికి ఆలోచించే పని మొదలుపెడదామనుకున్నా. 147 00:07:23,610 --> 00:07:25,654 ఎమిలీ, నీ ఆలోచనలకి ఇప్పుడు మనకి సమయం లేదు. 148 00:07:25,737 --> 00:07:28,407 ఈ కుటుంబం ముక్కలయ్యే దశలో ఉంది, మనం త్వరగా ఏదైనా చేయకపోతే, 149 00:07:28,490 --> 00:07:30,826 ఆ బిడ్డకి ఎప్పటికీ తన నానమ్మ, తాతయ్యలు ఎవరో తెలిసే అవకాశం ఉండదు. 150 00:07:30,909 --> 00:07:32,452 అబ్బా, అర్థం లేకుండా మాట్లాడకు. 151 00:07:32,536 --> 00:07:35,247 బిడ్డ పుట్టి వారం కూడా కాలేదు. కాస్త ఓపిగ్గా ఉండు. 152 00:07:35,330 --> 00:07:38,166 ఓపికనా? అయితే వాడు పెరిగేదాకా నేను ఏం చేయకుండా ఇలాగే ఉండాలా? 153 00:07:38,250 --> 00:07:40,586 -అవును. -బంధం అనేది వెంటనే చిగురిస్తుంది. 154 00:07:41,295 --> 00:07:43,172 వాడికి నా వాసన తెలియాలి. 155 00:07:43,255 --> 00:07:46,550 ఎడ్వర్డ్, నీ మనవడిని ఇప్పటిదాకా నువ్వు చూడను కూడా లేదు. 156 00:07:46,633 --> 00:07:50,179 నేను వాడిని చూడనక్కర్లేదు. వాడు డికిన్సన్ వారసత్వాన్ని కొనసాగిస్తాడు, 157 00:07:50,262 --> 00:07:52,014 నాకు అది చాలు. 158 00:07:52,097 --> 00:07:55,142 అందుకని, నేను నా వీలునామా పనిని చూసుకోవాలి, 159 00:07:55,225 --> 00:07:57,311 మీరు ఇంత గోల చేస్తుంటే నేను సరిగ్గా పని చేయలేను. 160 00:07:57,394 --> 00:07:59,771 కాబట్టి, దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోతారా? 161 00:07:59,855 --> 00:08:02,149 ఎమిలీ సూతో మాట్లాడతాను అంటే, నేను వెళ్లిపోతాను. 162 00:08:05,611 --> 00:08:07,112 సరే. 163 00:08:07,196 --> 00:08:09,990 సరే. నేను... మాట్లాడి చూస్తా. 164 00:08:11,366 --> 00:08:13,535 ఎమిలీ, ఈ రాత్రి జరిగే మహిళా టైలర్ల పార్టీకి రావడం మర్చిపోకు. 165 00:08:13,619 --> 00:08:15,829 ఎమిలీ, ఈ కుటుంబం ఇప్పుడు నీ మీద ఆధారపడుంది. 166 00:08:15,913 --> 00:08:17,164 అవును, ఎమిలీ. దయచేసి వెళ్లు. వెళ్లు. 167 00:08:17,247 --> 00:08:18,373 ఎమిలీ, ఏదోకటి చేయ్. 168 00:08:18,457 --> 00:08:21,877 కంగారుపడకండి. ఎమిలీ డికిన్సన్ ఉండగా, కంగారు ఎందుకు దండగ. 169 00:08:28,884 --> 00:08:31,929 నిజమేనా, సూ? 170 00:08:32,011 --> 00:08:33,972 లోపల ఇద్దరు ఉన్నారా? 171 00:08:39,311 --> 00:08:40,562 వెళ్లిపోండి. 172 00:08:42,397 --> 00:08:43,482 సూ, నేను. 173 00:08:44,274 --> 00:08:47,694 ఎమిలీ? లోపలికి రా. రా. 174 00:08:52,574 --> 00:08:55,661 ఇక్కడికి వచ్చి కూర్చో. ఇక్కడ కూర్చోవడానికి చోటు ఉంది. 175 00:08:58,163 --> 00:09:00,874 ఇప్పుడే పాలు ఇచ్చాను. నిద్రపోతున్నాడు. 176 00:09:02,459 --> 00:09:03,836 వీడిని ఎత్తుకుంటావా? 177 00:09:05,629 --> 00:09:08,715 నేనా? వద్దులే, పర్వాలేదు. అంటే... నా చేతుల నుండి జారిపోతాడేమో. 178 00:09:08,799 --> 00:09:09,800 బాగుంది. 179 00:09:10,634 --> 00:09:14,763 నీకేమో అస్సలు వీడిని ముట్టుకోవాలనే లేదు, మీ అమ్మేమో వీడిని ఎత్తుకుంటే ఇక ఇవ్వదు. 180 00:09:15,889 --> 00:09:18,100 అవును, ఆ విషయం గురించి... 181 00:09:18,183 --> 00:09:21,645 ఒక్క నిమిషం. ఆమె పంపితేనే నువ్వు ఇక్కడికి వచ్చావా? 182 00:09:22,896 --> 00:09:23,939 అవునేమో. 183 00:09:25,190 --> 00:09:28,151 -అసలు ఏం జరిగిందో చెప్తావా? -మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా. 184 00:09:28,235 --> 00:09:30,320 నేను రవ్వంత సంధు ఇచ్చినా, ఆవడే స్వయంగా 185 00:09:30,404 --> 00:09:31,947 వీడికి పాలు ఇచ్చినా ఇస్తుంది. 186 00:09:35,158 --> 00:09:39,872 తను ఇక్కడ ఉన్నప్పుడు, ఆగకుండా నన్ను విమర్శిస్తూనే ఉండింది, 187 00:09:39,955 --> 00:09:44,668 నాపై పెత్తనం చలాయిస్తూ, నాకు అక్కర్లేని సలహాలు ఇస్తూనే ఉండింది. 188 00:09:46,336 --> 00:09:47,337 తను... 189 00:09:48,797 --> 00:09:50,799 తను నా మనస్తత్వాన్ని కూడా గౌరవించాలి కదా. 190 00:09:52,467 --> 00:09:55,053 నాకు అర్థమైంది. బాగా అర్థమైంది, 191 00:09:55,137 --> 00:10:00,017 కానీ తన తొలి మనవడితో అనుబంధం ఏర్పరచుకోవాలని తహతహలాడిపోతోంది. 192 00:10:00,100 --> 00:10:04,146 తనకి కాస్తంత అవకాశమివ్వరాదు? దయచేసి ఇవ్వరాదు? 193 00:10:09,067 --> 00:10:11,445 ముందుగా, వీడితో నేను ఇంకాస్త సమయం గడపాలి. 194 00:10:13,238 --> 00:10:15,866 త్వరలోనే వీడు డికిన్సన్ వారసుడు అయిపోతాడు. 195 00:10:16,742 --> 00:10:17,743 కొద్దిసేపటికైనా... 196 00:10:19,244 --> 00:10:21,163 వీడిని గిల్బెర్ట్ గా ఉండనిద్దాం. 197 00:10:23,707 --> 00:10:25,834 సరే. ఈ చిట్టి గిల్బెర్ట్ ని చూపించు. 198 00:10:35,844 --> 00:10:37,513 వీడితో ఏదైనా మాట్లాడు. 199 00:10:38,722 --> 00:10:40,265 వీడు నీ గొంతును గుర్తుపట్టాలి. 200 00:10:42,392 --> 00:10:43,727 హేయ్, బుడ్డోడా. 201 00:10:45,187 --> 00:10:46,855 నీ అంకుల్ ఎమిలీని. 202 00:10:50,484 --> 00:10:53,862 అంకుల్ ఎమిలీకి, జట్కా బండిని సునాయసంగా నడిపే ఒక వ్యక్తి తెలుసు. 203 00:10:55,280 --> 00:10:57,991 రోజంతా అతను ఆ బండిని నడుపుతూనే ఉంటాడు. 204 00:10:59,535 --> 00:11:00,744 అతని పేరేంటంటే... 205 00:11:02,162 --> 00:11:03,413 అతని పేరేంటో నీకు తెలుసా? 206 00:11:04,873 --> 00:11:07,251 -చెప్పు. ఊహించి చెప్పు. -చెప్పమ్మా. 207 00:11:09,044 --> 00:11:13,298 సరే, నేనే చెప్తాలే. వాడి పేరు బంబుల్ బీ. 208 00:11:18,762 --> 00:11:20,973 వీడిని మనిద్దరం పెంచితే ఏమవుతాడో ఊహించుకో. 209 00:11:21,890 --> 00:11:23,100 పెద్ద మేధావి అవుతాడు. 210 00:11:23,851 --> 00:11:26,270 గొప్పవాడు అవుతాడు. 211 00:11:28,981 --> 00:11:30,357 సూ, అది అసంభవం. 212 00:11:33,235 --> 00:11:34,570 అసంభవమా? 213 00:11:35,112 --> 00:11:39,783 లేదా నీకు... ఆ ఉద్దేశం లేదా? 214 00:11:43,537 --> 00:11:44,872 ఆస్టిన్ ఎక్కడ? 215 00:11:45,747 --> 00:11:47,124 జార్జ్ తో బయటకు వెళ్లాడు. 216 00:11:47,916 --> 00:11:51,962 పఫర్స్ పాండ్ లో ఈతకు వెళ్లాడు. ఇంట్లో చేసిన విస్కీని ఇద్దరూ బాగా తాగారు. 217 00:11:52,045 --> 00:11:54,548 పాండ్ కి వెళ్లారా? బాగా చలిగా ఉంది. పైగా ఇది మధ్యాహ్నం కూడా కాదు. 218 00:11:55,299 --> 00:11:57,217 మీ అన్నయ్యది పిల్లాడి మనస్తత్వం. 219 00:11:57,968 --> 00:12:01,221 రాత్రి భోజన సమయానికి కూడా రాకపోవచ్చు. ఎప్పుడూ ఆలస్యంగానే ఇంటికి వస్తాడు. 220 00:12:02,181 --> 00:12:04,933 ఎమిలీ. నువ్వు రావచ్చు. 221 00:12:05,893 --> 00:12:10,981 ఈ బుడ్డోడితో, అగ్నికుండం దగ్గర మనిద్దరమూ ఎంచక్కా భోజనం చేయవచ్చు. 222 00:12:12,274 --> 00:12:13,525 అది చాలా బాగుంటుంది కదా? 223 00:12:16,612 --> 00:12:17,613 నేను రాలేను. 224 00:12:18,322 --> 00:12:19,364 ఎందుకని? 225 00:12:22,492 --> 00:12:26,246 లవీనియాకి, తన మహిళా టైలర్ల పార్టీకీ వస్తానని మాటిచ్చాను. 226 00:12:28,290 --> 00:12:30,542 మేము సైనికుల కోసం బ్యాండేజీలను చేస్తున్నాం. 227 00:12:31,376 --> 00:12:32,628 ఛ. 228 00:12:35,172 --> 00:12:36,882 ఎందుకు ప్రతిసారి ఇలా చేస్తావు? 229 00:12:38,300 --> 00:12:39,301 ఏం చేశాను? 230 00:12:41,053 --> 00:12:42,930 నా కన్నా నీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తావు? 231 00:12:44,264 --> 00:12:45,974 నేను అలా... అది న్యాయం కాదు, సూ. 232 00:12:46,058 --> 00:12:47,434 నేనెవరికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 233 00:12:49,353 --> 00:12:50,979 బహుశా సమస్య అదేనేమో. 234 00:12:51,939 --> 00:12:56,735 అప్పుడప్పుడూ, నాకు ప్రాధాన్యత ఇవ్వడమే నాకు కావాలి అనిపిస్తూ ఉంటుంది. 235 00:12:59,196 --> 00:13:05,786 నేను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి కన్నా అయినా నీకే ప్రాధాన్యతనిస్తాను. 236 00:13:08,330 --> 00:13:11,667 నా కుటుంబం ముక్కలయ్యే దశలో ఉంది. 237 00:13:11,750 --> 00:13:14,795 అలా కాకుండా, అందరూ బాగుండేలా చూడాలనుకుంటున్నాను, అంతే. 238 00:13:14,878 --> 00:13:16,463 నేను సాయపడాలనుకుంటున్నానంతే, సూ. నేనేమీ... 239 00:13:16,547 --> 00:13:19,132 నాకు కూడా నువ్వు చాలా విధాలుగా సాయపడవచ్చు. 240 00:13:23,387 --> 00:13:26,390 నిజానికి, అసలు ఈ రాత్రి ఆ మహిళా టైలర్ల పార్టీకి వెళ్ళాలనే నాకు లేదు. 241 00:13:26,473 --> 00:13:30,477 నేను శుద్ధంగా కవితలు రాసుకుందామనుకున్నా, కానీ జీవితం ఆ పని చేయనివ్వడం లేదు. 242 00:13:30,561 --> 00:13:33,730 అవును. జీవితమంటేనే అలా గందరగోళంగా ఉంటుంది. 243 00:13:37,860 --> 00:13:40,445 నేను నీ గురించి రాద్దామనుకున్న కవితలు కొన్ని ఉన్నాయి. 244 00:13:42,614 --> 00:13:43,907 సరే, ఎమిలీ. 245 00:13:44,825 --> 00:13:45,868 కానీ... 246 00:13:45,951 --> 00:13:49,329 కానీ నీ నుండి నాకు కవితల కన్నా ఇంకా ఎక్కువ కావాలి అంటే? 247 00:13:51,248 --> 00:13:55,210 నాకు ఇప్పుడు కావాల్సింది కేవలం నీ తోడే అంటే? 248 00:14:01,300 --> 00:14:03,886 మీకు సేవలు అందించడానికి ఆయాలు సంసిద్ధంగా ఉన్నారు. 249 00:14:03,969 --> 00:14:07,222 -హేయ్, చూడు. నీకు సాయపడటానికి వచ్చారు. -అవును. 250 00:14:07,306 --> 00:14:10,559 ఎందుకంటే "దత్త పుత్రికల"కు మించిన "ఉచిత ఆయాలు" ఎక్కడా లభించరు కదా. 251 00:14:49,973 --> 00:14:53,101 మధ్యలో నున్నగా ఉండాలని, 252 00:14:53,977 --> 00:14:56,188 అంచుల దగ్గర ధారాలు బయటకు కనబడకూడదని గుర్తుంచుకోండి. 253 00:14:57,606 --> 00:14:59,942 చక్కగా కుడుతున్నావు, అబయా. 254 00:15:00,901 --> 00:15:02,569 బాగా కుడుతున్నారు, మిసెస్ డికిన్సన్. 255 00:15:02,653 --> 00:15:05,572 సైనికులకు ఆ దిండు చాలా బాగా నచ్చుతుంది. 256 00:15:05,656 --> 00:15:06,657 ధన్యవాదాలు. 257 00:15:06,740 --> 00:15:09,743 కానీ ఇది సైనికులకు కాదు. నా మనవడికి. 258 00:15:10,327 --> 00:15:13,080 ఏదోకరోజు నేనే స్వయంగా వాడికి ఇవ్వగలనేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 259 00:15:13,580 --> 00:15:16,792 -అమ్మా, నేను ప్రయత్నించాను, సరేనా? -గట్టిగా ప్రయత్నించలేదు. 260 00:15:16,875 --> 00:15:20,379 సూ, మిసెస్ డికిన్సన్ ని బిడ్డతో గడపనివ్వడం లేదు. 261 00:15:20,462 --> 00:15:23,590 సరే, ఈ కుట్టు పార్టీలలోని గుసగుసలంటే నాకు భలే ఇష్టమబ్బా. 262 00:15:23,674 --> 00:15:27,052 నా తొలి మనవడిని ఎత్తుకోవడానికి నేనేమేమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానో మీకు తెలుసా? 263 00:15:27,135 --> 00:15:29,596 "నానమ్మ" అని పిలిపించుకోవడానికి. 264 00:15:30,138 --> 00:15:31,390 లేదా "బామ్మ" అని. 265 00:15:31,473 --> 00:15:35,936 -లేదా "నామ్మా". "కుకీ" కూడా కావచ్చు. -బిడ్డకే ఇంకా ఏ పేరూ పెట్టలేదు. 266 00:15:36,019 --> 00:15:39,147 కానీ వాడికి పేరు పెట్టాక, నన్ను కుకీ అని వాడు పిలవకూడదా ఏంటి? 267 00:15:39,231 --> 00:15:40,607 -అది యూత్ ఫీలింగ్ తెప్పిస్తోంది. -అవును. 268 00:15:40,691 --> 00:15:45,195 బిడ్డలంటే గుర్తొచ్చింది, జేన్ వియత్నాంకి వెళ్లిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. 269 00:15:45,279 --> 00:15:48,115 -తను నాకు ఒక లేఖ రాసింది కూడా. -దేవుడా. ఏమని రాసింది? 270 00:15:48,198 --> 00:15:51,076 సైగాన్ లోని ఒక రెస్టారెంట్లోకి మ్యాపుల్ సిరప్ ని తీసుకువెళ్లి, 271 00:15:51,159 --> 00:15:53,287 దాన్ని వాళ్లు తినే కుడుముల మీద వేసుకొని తినేలా చేసిందట. 272 00:15:53,370 --> 00:15:56,081 దానికి "న్యూ ఇంగ్లాండ్ ఏషియాల కలయిక" అని పేరు పెట్టింది. 273 00:15:56,582 --> 00:15:57,916 తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. 274 00:15:58,000 --> 00:16:00,961 ఎమిలీ, ఏం చేస్తున్నావు? నువ్వు మంచి గుడ్డని వృథా చేస్తున్నావు. 275 00:16:01,044 --> 00:16:04,089 మన్నించాలి, ఈ ధారం నా మాట వినడం లేదు. 276 00:16:04,173 --> 00:16:06,008 నువ్వు సాయపడాలనుకుంటున్నా అన్నావు కదా. 277 00:16:06,091 --> 00:16:09,386 అవును. సైనికులు, తమ గాయాలకు దాన్ని బ్యాండేజీగా వాడే అవకాశమే లేదు. 278 00:16:09,469 --> 00:16:11,221 మీకు ముందే చెప్పా. నాకు కుట్టడం అస్సలు రాదు. 279 00:16:11,305 --> 00:16:13,390 అయితే కుట్లని ఊడపీకేసి, కుట్టడం మళ్లీ మొదట్నుంచీ మొదలుపెట్టు. 280 00:16:13,473 --> 00:16:15,100 మనం మంచి గుడ్డను వృథాపోనివ్వకూడదు. 281 00:16:16,310 --> 00:16:18,312 నేను సాలీడును అయ్యుంటే బాగుండు. 282 00:16:18,395 --> 00:16:19,646 ఏమన్నావు? 283 00:16:21,064 --> 00:16:23,192 ఒక సాలీడు రాత్రి పూట తన గూడును అల్లుకుంది 284 00:16:23,275 --> 00:16:25,194 అప్పుడు ఏ వెలుతురూ లేదు 285 00:16:25,277 --> 00:16:27,487 ఒక తెల్లని పీఠం మీద అల్లింది. 286 00:16:28,655 --> 00:16:29,865 అది కవితలా బాగా చెప్పావు. 287 00:16:29,948 --> 00:16:31,283 అది నిజంగా కవితే. 288 00:16:32,492 --> 00:16:33,911 కుట్టు పని మీద దృష్టి పెట్టు, ఎమిలీ. 289 00:16:33,994 --> 00:16:36,705 అంచులు చాలా బాగా కుట్టావు, విన్నీ. 290 00:16:36,788 --> 00:16:40,042 నీకు ఆ గుడ్డ ఎక్కడిది? చాలా మృదువుగా ఉంది. 291 00:16:40,125 --> 00:16:42,544 బ్యాండేజీల కోసం నా పాత డ్రెస్సులను చించేసి ఉపయోగిస్తున్నాను. 292 00:16:43,253 --> 00:16:47,007 నాకు నచ్చినవారికి నేను నచ్చడానికి ఈ బట్టలు వేసుకొనేదాన్ని అంటే ఆశ్చర్యంగా ఉంది. 293 00:16:47,090 --> 00:16:48,884 ఇలా చేయడం ద్వారా అయినా, ఒక మగాడు తన గాయానికి 294 00:16:48,967 --> 00:16:52,638 నా బ్యాండేజీని చుట్టుకున్నప్పుడు నేను అతనికి అత్యంత దగ్గరగా ఉండవచ్చు. 295 00:16:53,764 --> 00:16:55,641 పాపా, అది మామూలు పిచ్చిలా లేదు. 296 00:16:55,724 --> 00:16:58,602 నేనైతే, అసలు ఈ యుద్ధం ఇన్ని రోజుల పాటు సాగుతుందని అనుకోనే లేదు. 297 00:16:58,685 --> 00:17:00,437 చూస్తుంటే, అసలు దానికి ముగింపు లేదేమో అనిపిస్తోంది. 298 00:17:00,521 --> 00:17:05,108 అదే కదా. అదీగాక... అమెరికా ఏర్పడి వంద ఏళ్ళు కూడా కాలేదు. 299 00:17:05,192 --> 00:17:07,653 మన దేశం పతనమైపోతోందా? అప్పుడే? 300 00:17:07,736 --> 00:17:11,365 కాస్త సరదా విషయాలు మాట్లాడుకుందామా? ఇంకా ఎవరి దగ్గరైనా టీ ఉందా? 301 00:17:11,990 --> 00:17:14,284 టీ? మీరు టీ అడుగుతారని నేను అస్సలు ఊహింలేదు. 302 00:17:14,367 --> 00:17:16,411 అమ్మాయిలూ, వెళ్లి టీ చేయండి. 303 00:17:17,079 --> 00:17:18,997 ఆ టీ కాదు, నేననే "టీ" వేరు, 304 00:17:19,080 --> 00:17:20,958 గుసగుసలు, పుకార్లు. 305 00:17:21,040 --> 00:17:24,670 ఇదిగో నీకు కావలసిన టీ. యుద్ధంలో చనిపోయే ప్రతీ ముగ్గురు సైనికులకూ, 306 00:17:24,752 --> 00:17:26,255 మరో అయిదు మంది వ్యాధుల కారణంగా చనిపోతున్నారు. 307 00:17:26,839 --> 00:17:30,175 ఆ అయిదుగురిలో, అందరికీ పెళ్ళాలూ కానీ, ప్రేయసిలు కానీ, 308 00:17:30,259 --> 00:17:32,845 లేదా వారి పట్ల ఇష్టం ఎప్పటికీ తగ్గని మాజీ ప్రేయసిలు కూడా ఉన్నారు. 309 00:17:32,928 --> 00:17:35,848 కానీ ఆ మాజీ ప్రేయసుల బుర్ర సరిగ్గా పని చేయక మాజీలుగానే మిగిలిపోయారు. 310 00:17:35,931 --> 00:17:37,808 నువ్వు షిప్ మరియు జోసెఫ్ లైమన్ గురించి మాట్లాడుతున్నావు కదా. 311 00:17:37,891 --> 00:17:40,394 జోసెఫ్ లైమన్, కన్ఫెడరేట్ల తరఫున పోరాడుతూ చనిపోయాడు. 312 00:17:41,228 --> 00:17:43,480 -ఆ సంభాషణ ఇప్పుడు సముచితం కాదా? -అది నిజమేనా? 313 00:17:44,064 --> 00:17:45,399 ఈ సూదులు ఎందుకు ఇంత పదునుగా ఉంటాయి? 314 00:17:45,482 --> 00:17:48,819 ఎమిలీ, నీకు కుట్టడం రాకపోతే. ఏదైనా అల్లరాదూ. 315 00:17:48,902 --> 00:17:51,697 ఈ సంప్రదాయ ఆడవారి హస్తకళల్లో నాకు అంత పట్టు లేదు. 316 00:17:51,780 --> 00:17:53,532 ఎమిలీ, మనందరం మన వంతు సాయం చేయాలి. 317 00:17:53,615 --> 00:17:54,825 అవును, నువ్వు సాయపడాలి. 318 00:17:54,908 --> 00:17:56,410 నేను సాయపడాలనే చూస్తున్నా! 319 00:17:56,493 --> 00:17:58,036 రోజంతా, ప్రయత్నిస్తూనే ఉన్నా, 320 00:17:58,120 --> 00:18:00,706 కానీ నేనేం చేసినా అది నిష్ప్రయోజనకరంగానే తయారవుతోంది. 321 00:18:00,789 --> 00:18:02,833 ఎంతైనా మనం బ్యాండేజీలను చేసేది అసలైన గాయాల కోసం కాదు కదా. 322 00:18:02,916 --> 00:18:04,918 అసలైన గాయాలకు కాదంటే? 323 00:18:05,002 --> 00:18:08,505 నా ఉద్దేశం, జనాల హృదయాల్లో ఉండే బాధ కోసం కాదు కదా అని. 324 00:18:09,715 --> 00:18:13,427 హింస, విద్వేషం, వారి అంతరాత్మలు అనుభవించే క్షోభ. 325 00:18:13,510 --> 00:18:15,637 నేను వాటిని దూరం చేయాలనుకుంటున్నాను. 326 00:18:16,471 --> 00:18:17,556 నా కవిత్వం ద్వారా. 327 00:18:18,182 --> 00:18:21,476 -ఆ విషయం జరిగేది కాదులే. -కవిత్వం ముఖ్యమైనది కాదనుకుంటున్నావా? 328 00:18:22,144 --> 00:18:26,523 మీ అందరికీ ఒక ప్రశ్న: ఇప్పుడు అమెరికాలో ఉన్న కవుల్లో గొప్ప కవి ఎవరు? 329 00:18:26,607 --> 00:18:29,026 -వాల్ట్ విట్మన్. -అవును. 330 00:18:29,109 --> 00:18:31,403 మరి ఇప్పుడు వాల్ట్ విట్మన్ ఏం చేస్తున్నాడు? 331 00:18:32,154 --> 00:18:34,990 యుద్ధ క్షతగాత్రుల కోసం నర్సుగా పని చేస్తున్నాడు. 332 00:18:35,991 --> 00:18:39,870 ఎందుకంటే వాల్ట్ విట్మన్ కూడా ఇప్పుడు తన కవితలు ముఖ్యం కాదని గ్రహించాడు. 333 00:18:39,953 --> 00:18:42,206 తను ఏం చేస్తున్నాడనో, తన తోటి మనుషులకు 334 00:18:42,289 --> 00:18:45,667 క్ష్తేత్రస్థాయిలో ఎంత సాయం అందిస్తున్నాడనేదే ముఖ్యం. 335 00:18:46,210 --> 00:18:47,669 నేను ఎకీభవించడం లేదు. 336 00:18:48,670 --> 00:18:50,923 మనం డ్రమ్ బీట్ లో కవితలను ప్రచురిద్దాం. 337 00:18:51,465 --> 00:18:55,385 అది స్బయంగా ఆబ్రహం లింకన్ నాయకత్వంలో నేనూ, నా భర్త కలిసి 338 00:18:55,469 --> 00:18:58,805 నడిపిస్తున్న యూనియన్ వార్తాపత్రిక. 339 00:18:58,889 --> 00:19:01,475 మాకు అర్థమైంది. నీ భర్త అధ్యక్షుడిని కలిశాడు. 340 00:19:01,558 --> 00:19:04,311 యూనియన్ కోసం మేము చాలా మంచి పనులు చేస్తున్నామని లింకన్ అన్నాడు. 341 00:19:04,394 --> 00:19:08,398 సైనికులకు డ్రమ్ బీట్ అంటే ప్రాణం. అంపశయ్యల మీద ఉన్నప్పుడు కూడా చదువుతున్నారు. 342 00:19:08,482 --> 00:19:10,400 చూశావా? కవిత్వం చనిపోయేవాడికి కూడా స్వాంతన చేకూరుస్తుంది. 343 00:19:10,484 --> 00:19:13,320 నీకు అంతే చేయాలనుందా? జనాలకు స్వాంతన చేకూర్చాలనుందా? 344 00:19:13,403 --> 00:19:17,032 క్షమించాలి, కానీ మనం జనాలకు స్వాంతన అందించకూడదు. 345 00:19:17,115 --> 00:19:19,576 మనం మన ఆక్రోశానికి వీధుల్లోకి వచ్చి వెళ్లగక్కాలి. 346 00:19:19,660 --> 00:19:22,704 మహిళలకు ఓటు హక్కు ఉండాలి. రాజ్యాంగం మహిళలకు హక్కులు 347 00:19:22,788 --> 00:19:25,415 కల్పించాలని మనం స్పష్టంగా డిమాండ్ చేయాలి, 348 00:19:25,499 --> 00:19:29,753 ఇంకా నేనిలా అన్నట్టు మీరు నా భర్తకు చెప్పనక్కర్లేదు. 349 00:19:29,837 --> 00:19:32,422 నా డైనింగ్ రూమ్ లో అలాంటి మాటలు మాట్లాడకమ్మా. 350 00:19:32,506 --> 00:19:34,007 నాకు తెలిసి కవిత్వం సహాయకరంగానే ఉంటుంది. 351 00:19:34,633 --> 00:19:36,218 నేనైతే అలానే అనుకుంటున్నా మరి. 352 00:19:37,261 --> 00:19:39,179 లేకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు. 353 00:19:39,263 --> 00:19:40,681 ఎమిలీ అన్నది నిజమే అనుకుంటా. 354 00:19:40,764 --> 00:19:41,974 బెట్టీ, చెప్పు. 355 00:19:47,312 --> 00:19:49,147 హెన్రీ కూడా రచయితే. 356 00:19:49,231 --> 00:19:54,444 మా కుటుంబం కన్నా రచనకే ప్రాధాన్యమం ఇచ్చినందుకు నేను హెన్రీతో గొడవపడ్డాను. 357 00:19:54,528 --> 00:19:57,406 మా కుటుంబం చీలిపోయిందన్న మాట నిజమే. 358 00:19:59,199 --> 00:20:00,242 కానీ... 359 00:20:01,702 --> 00:20:04,162 అతని రచనే మమ్మల్ని మళ్లీ ఏకం చేసింది. 360 00:20:06,498 --> 00:20:11,211 హెలెన్ కి అతను రాసిన ఉత్తరాలు... 361 00:20:13,589 --> 00:20:15,674 హెలెన్ కి ఆశ కలిగించేవి ఏవైనా ఉన్నాయంటే, అవే. 362 00:20:17,885 --> 00:20:19,261 హెలెన్ కి లేఖలు రావడం ఆగిపోతే 363 00:20:19,344 --> 00:20:21,805 నేనేం చేయాలో నాకు అర్థమవ్వడం లేదు. 364 00:20:49,124 --> 00:20:50,167 కాబట్టి... 365 00:20:51,710 --> 00:20:55,714 రచనా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. 366 00:20:58,467 --> 00:21:00,552 అప్పుడప్పుడూ, మనకి అది తప్ప ఇంకేమీ మిగలదు. 367 00:21:01,178 --> 00:21:04,014 అవును. బాగా చెప్పావు, బెట్టీ. 368 00:21:04,097 --> 00:21:06,433 నా నైపుణ్యం కూడా రచించడమే. 369 00:21:07,601 --> 00:21:11,104 కాబట్టి నాకు కుట్టులు, అల్లికలు లేదా చంటిబిడ్డలను ఎత్తుకోవడం రాకపోతే ఏంటి? 370 00:21:11,188 --> 00:21:14,942 లేదా నా కుటుంబంలోని భేదాలను పోగొట్టడం రాకపోతే ఏంటి? 371 00:21:15,526 --> 00:21:22,366 ప్రపంచానికి నేను చేయగల మంచి పనేంటంటే నా గదిలో కూర్చొని కవిత్వాలను రాయడమే. 372 00:21:23,033 --> 00:21:25,619 కానీ, నువ్వలా చేస్తే నీ కవితల వల్ల ఉపయోగం ఏముంది? 373 00:21:27,788 --> 00:21:28,789 ఏంటి? 374 00:21:28,872 --> 00:21:30,624 నువ్వు ప్రపంచంలోని కష్టనష్టాలను ఎదుర్కోకలేకపోతే, 375 00:21:30,707 --> 00:21:34,044 నువ్వు చేప్పే దాన్ని ఎవరైనా ఎందుకు వింటారు? 376 00:21:36,129 --> 00:21:39,466 నిజ జీవితాన్ని పట్టించుకోని రచనలు కూడా... 377 00:21:41,385 --> 00:21:43,178 శవాలతో సమానమే. 378 00:21:50,102 --> 00:21:52,062 బహుశా మనం కుట్టుపనిని కొనసాగించాలేమో, 379 00:21:52,145 --> 00:21:55,774 ఎందుకంటే, వందల సంఖ్యలో అందగాళ్ళు గాయాలపాలవుతున్నారు. 380 00:21:55,858 --> 00:21:56,859 కాబట్టి... 381 00:21:56,942 --> 00:21:58,569 నా కాలు! 382 00:21:58,652 --> 00:22:00,529 -లోపలికి వస్తున్నాం. ఒకరికి గాయమైంది. -ఆస్టిన్? 383 00:22:00,612 --> 00:22:02,197 -ఏంటి ఈ గోల అంతా? -మీకు బాగానే ఉన్నారా? 384 00:22:02,281 --> 00:22:03,991 -ఆ దరిద్రుడు నన్ను గాయపరిచాడు! -ఏమైంది? 385 00:22:04,074 --> 00:22:07,202 బార్లో చిన్న గొడవ. సీసాలు పగలగొట్టి విసురుకున్నారు. 386 00:22:07,286 --> 00:22:10,664 -ఒకటి ఆస్టిన్ కాలికి తగిలి కోసుకుంది. -అయ్యయ్యో. రక్తం. 387 00:22:10,747 --> 00:22:12,791 నా కొడుకు! నా కొడుక్కి గాయమైంది! 388 00:22:12,875 --> 00:22:13,959 వెళ్లి బ్యాండేజీలను తీసుకురండి! 389 00:22:14,042 --> 00:22:15,627 కానీ ఇవి సైనికుల కోసం కదా. 390 00:22:15,711 --> 00:22:17,462 -ఆస్టిన్, కూర్చో. -జేన్. 391 00:22:17,546 --> 00:22:20,048 -కూర్చో. -ఎక్కడ... ఎక్కడ... జేన్ ఏది? 392 00:22:20,132 --> 00:22:23,093 -జేన్! -ఎంత తాగావేంటి? 393 00:22:23,177 --> 00:22:25,137 నా బాధలను మర్చిపోయేంత తాగలేదులే. 394 00:22:25,971 --> 00:22:28,557 -ఆస్టిన్, ఓ మాట. నీకు ఓ శుభవార్త చెప్పాలి. -లేదు. 395 00:22:28,640 --> 00:22:29,808 -శుభవార్తనా? -అవును. 396 00:22:29,892 --> 00:22:32,227 నౌక మళ్లీ వెనక్కి వస్తోందా? జేన్ వెనక్కి వస్తోందా? 397 00:22:32,311 --> 00:22:35,022 -అది కాదు. ముందు చెప్పేది విను. -కాదు! మిసెస్ డికిన్సన్... 398 00:22:35,105 --> 00:22:37,357 -నాన్న నిన్ను క్షమించేశాడు. -హా? 399 00:22:38,233 --> 00:22:41,403 అవును, నేను ఆయనతో మాట్లాడాను, ఆయనకు నీ మీద అస్సలు కోపం లేదు. 400 00:22:41,486 --> 00:22:43,822 -ఆయన సౌమ్యంగా స్పందించాడు. -మనం రోజంతా ఇక్కడే ఉన్నాం. 401 00:22:43,906 --> 00:22:46,658 నువ్వు అంత భయంకరమైన మాటలు అన్నా, 402 00:22:46,742 --> 00:22:47,951 ఆయన దాన్ని కడుపులో ఏం దాచుకోలేదు. 403 00:22:48,035 --> 00:22:49,494 ఆయన దాన్ని మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 404 00:22:49,578 --> 00:22:51,246 వావ్. 405 00:22:52,039 --> 00:22:54,333 అయితే, ఆయన నేననుకున్నదాని కన్నా వెధవలా ఉన్నాడు. 406 00:22:55,417 --> 00:22:57,503 ఆస్టిన్, అలా ఎలా అనగలవు? 407 00:22:58,378 --> 00:23:01,798 ఎప్పటిలాగానే నా ఆలోచనలకు ఆయన ఇవ్వడం లేదు. 408 00:23:01,882 --> 00:23:06,178 నాన్న మా ఇద్దరి మధ్యా ఏ సమస్యా లేదని చెప్పేయగలడు. 409 00:23:06,261 --> 00:23:08,222 ఎందుకంటే, అసలు సమస్యే ఆయన కదా. 410 00:23:08,931 --> 00:23:11,391 ఆయన ఏమనుకున్నా నాకు అనవసరం. 411 00:23:11,475 --> 00:23:13,685 నేను మన కుటుంబంతో తెగతెంపులు చేసేసుకున్నాను! 412 00:23:13,769 --> 00:23:15,979 -పక్కకు జరగండి. నా కొడుక్కి గాయమైంది. -లేదు. 413 00:23:16,063 --> 00:23:18,690 కానీ, మిసెస్ డికిన్సన్, అవి సైనికుల కోసం... 414 00:23:19,316 --> 00:23:21,068 నా బంగారుకొండ. 415 00:23:21,151 --> 00:23:23,153 నేను బ్యాండేజీ వేస్తాను. 416 00:23:23,237 --> 00:23:24,988 నేనున్నాలే, నేను చూసుకుంటాలే. 417 00:23:25,072 --> 00:23:26,490 ఇదేనా తెగతెంపులు చేసుకోవడమంటే? 418 00:23:26,573 --> 00:23:29,076 -జేన్. -ఎమిలీ, వీడికి నీళ్లు తీసుకురా. ఏమైనా చేయ్. 419 00:23:30,953 --> 00:23:32,162 జేన్. 420 00:23:48,762 --> 00:23:49,763 లోనికి రండి. 421 00:23:51,515 --> 00:23:53,809 హేయ్, ఎమిలీ. లోపలికి రావచ్చా? 422 00:23:53,892 --> 00:23:57,271 జార్జ్, నువ్వు... సరే, మంచిది. నువ్వు నా గదిలోకి వచ్చేశావుగా. 423 00:23:57,354 --> 00:23:59,439 హమ్మయ్య. ఆ గోలకి క్షమాపణలు. 424 00:24:00,190 --> 00:24:04,361 -నేను అంత గోల సృష్టించాలనుకోలేదు. -జార్జ్, చాలా పొద్దుపోయింది. ఏంటి సంగతి? 425 00:24:05,737 --> 00:24:09,199 నేను... నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. 426 00:24:12,160 --> 00:24:13,161 "అట్లాంటిక్"? 427 00:24:13,245 --> 00:24:15,622 ఇందులో ఒక వ్యాసం ఉంది, అది నీకు నచ్చుతుందనుకుంటా. 428 00:24:15,706 --> 00:24:19,001 "యువ సహకారులకు లేఖ." యువ కవులకు సలహాలు సూచనల సమాహారం అది. 429 00:24:19,084 --> 00:24:20,878 ఆ వ్యాసాన్ని థామస్ వెంట్వర్త్ హిగ్గిన్సన్ రాశాడు. 430 00:24:23,088 --> 00:24:24,548 హిగ్గిన్సన్ అంటే, బానిసవ్యతిరేకా? 431 00:24:24,631 --> 00:24:27,092 అవును. అతను చాలా మంచోడు. 432 00:24:27,176 --> 00:24:30,470 జాన్ బ్రౌన్ తిరుగుబాటుకు నిదులందించిన మిస్టరీ ఆరుగురిలో ఇతను కూడా ఒకడు, తెలుసా? 433 00:24:30,554 --> 00:24:33,599 ఇప్పుడు అతను దక్షిణం వైపుకు వెళ్లి యుద్ధంలో పోరాడుతున్నాడు. 434 00:24:34,224 --> 00:24:37,144 యూనియన్ యొక్క తొలి నల్లజాతి సైనికుల దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. 435 00:24:38,437 --> 00:24:39,813 ప్రయాణానికి చాలా రోజులు పట్టినట్టుందే? 436 00:24:39,897 --> 00:24:41,064 చచ్చిపోయాననుకో. 437 00:24:41,857 --> 00:24:43,317 కానీ ఎలాగో వచ్ఛేశానులే. 438 00:24:44,818 --> 00:24:46,069 అదే కదా ముఖ్యం. 439 00:24:47,654 --> 00:24:50,699 కాబట్టి, ఆయన యుద్ధం చేస్తూ ఉండి కూడా 440 00:24:50,782 --> 00:24:53,285 కవిత్వాలు రాయగలుగుతున్నాడు. 441 00:24:53,368 --> 00:24:56,997 అంటే... అది మామూలు విషయం కాదు. 442 00:24:57,080 --> 00:24:58,123 అది చాలా గొప్ప విషయం. 443 00:24:58,207 --> 00:25:00,250 నేను తప్పకుండా చదువుతాను. ధన్యవాదాలు, జార్జ్. 444 00:25:01,001 --> 00:25:02,836 అవును, అంటే, అది నీ ఇష్టం. 445 00:25:03,795 --> 00:25:05,964 ఏదేమైనా, నీకు సలహా ఇచ్చేంత స్థాయి ఇతరులకు లేదనుకుంటా. 446 00:25:06,048 --> 00:25:08,175 ఎందుకంటే, నీ రచనలు చాలా బాగుంటాయి. 447 00:25:08,800 --> 00:25:11,178 అలా... అలా చెప్పడం నీ మంచితనం. 448 00:25:11,803 --> 00:25:14,723 మొదట్నుంచీ కూడా నేను నీకు పెద్ద అభిమానినే. 449 00:25:19,019 --> 00:25:21,563 నా కవితల వల్ల ఏ ఉపయోగమూ లేదనే భావనలోకి వస్తూ ఉన్నాను. 450 00:25:21,647 --> 00:25:23,232 ఏంటి? అది చాలా ఘోరమైన విషయం. 451 00:25:24,942 --> 00:25:29,238 ప్రస్తుత పరిస్తితులను చూస్తుంటే, అది ప్రపంచంలో గానీ, మా ఇంట్లో గానీ... 452 00:25:31,073 --> 00:25:33,659 నేను రాయడం ఆపేస్తేనే మేలనిపిస్తోంది. 453 00:25:33,742 --> 00:25:35,827 నువ్వు పుట్టిందే కవిత్వాలు రాయడానికి. 454 00:25:35,911 --> 00:25:36,745 అంతే అంటావా? 455 00:25:38,080 --> 00:25:41,917 బహుశా నిజంగా సహాయపడేందుకు అంతకు మించిందేమైనా చేయాలేమో. 456 00:25:42,000 --> 00:25:43,961 నాకు ఒకటి మాత్రం చాలా బాగా తెలుసు. 457 00:25:44,044 --> 00:25:47,714 నిన్నూ, నీ కవితలని పక్కపక్కనే పెట్టి ఏదైనా ఒక్కదాన్నే ఎంచుకోమని నాకు చెప్పారనుకో, 458 00:25:47,798 --> 00:25:48,799 చెప్తే? 459 00:25:49,341 --> 00:25:51,051 నేను నీ కవితలనే ఎంచుకుంటాను. 460 00:25:54,012 --> 00:25:57,140 సరే, అలా చెప్పడం నిజంగా నీ మంచితనం. 461 00:26:01,103 --> 00:26:03,146 -జార్జ్, ఏం చేస్తున్నావు? జార్జ్? -నేను... 462 00:26:04,064 --> 00:26:05,941 అంటే, ఈ యుద్ధంతో, అలాగే ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితులతో, బహుశా... 463 00:26:06,024 --> 00:26:07,609 జార్జ్, ఇది నేను చేయలేను. 464 00:26:09,570 --> 00:26:13,240 నా మనస్సు వేరేవాళ్లకి ఇచ్చేశాను. 465 00:26:16,952 --> 00:26:18,495 దేవుడా, జీవితం అంటేనే గందరగోళం కదా? 466 00:26:19,621 --> 00:26:21,206 ది అట్లాంటిక్ మంత్లీ 467 00:26:37,556 --> 00:26:40,309 బెట్టీ వచ్చేసింది. వచ్చేసింది నా పాపాయి. 468 00:26:40,392 --> 00:26:45,272 సోజోర్నర్. ఆ డ్రెస్ చాలా బాగుంది. 469 00:26:45,355 --> 00:26:47,983 నాకు ఈ డ్రెస్ అదిరిపోతుందని అందరికీ తెలిసిపోతుంది. 470 00:26:48,066 --> 00:26:51,445 తప్పకుండా. వాళ్లకి నువ్వు ఒక గొప్ప సోజోర్నర్ ట్రుత్ అని తెలుస్తుంది, 471 00:26:51,528 --> 00:26:55,324 అలాగే బానిస వ్యతిరేకివని, ధర్మోపదేశకురాలివని, ధీనజనోద్ధారక... 472 00:26:55,407 --> 00:26:57,284 ఇంకా మగతోడులేని దాన్ని అని. 473 00:26:58,118 --> 00:27:00,913 ఒక్క నిమిషం. నీ కలం ఎక్కడే, సకల కళా పోషకురాలా? 474 00:27:00,996 --> 00:27:02,414 పని మొదలుపెడదాం కానివ్వు. 475 00:27:02,497 --> 00:27:08,086 నాకు మీ గాథని రాయాలనే ఉంది, కానీ నాకు బాగా అలసటగా ఉంది. 476 00:27:08,170 --> 00:27:14,426 బెట్టీ, తెల్లవాడి మీద కేసు వేసి, గెలవగలిగిన తొలి నల్ల మహిళను నేను అయ్యానంటే, 477 00:27:14,510 --> 00:27:18,263 నేనలా ఎలా చేయగలిగానో రాయడానికి ఇంకో రాత్రి నువ్వు పడుకోకుండా రాయలేవా? 478 00:27:19,139 --> 00:27:20,933 సరే. సరే! 479 00:27:22,559 --> 00:27:24,394 -అవును, నువ్వన్నది నిజమే. -అవును. 480 00:27:24,478 --> 00:27:27,564 మనం పోరాటాన్ని ఆపకూడదు. మధ్యలో వదిలేయకూడదు. 481 00:27:27,648 --> 00:27:29,274 -హెన్రీ కూడా అదే అనేవాడు. -అవును. 482 00:27:29,358 --> 00:27:32,694 ఎందుకంటే, నేను చావను. ధృవతారలాగా నింగిలో కలకాలం ఉండిపోతాను. 483 00:27:32,778 --> 00:27:35,072 రాత్రి వేళ నా కాంతితో ఆకాశంలో ఎలా కాంతులు నింపుతానో నువ్వే చూడు. 484 00:27:35,155 --> 00:27:36,907 నాకు 60 ఏళ్లంటే నువ్వు నమ్మగలవా? 485 00:27:36,990 --> 00:27:40,077 నీ ఖచ్చితమైన పుట్టిన తేది ఎప్పుడో మనకి తెలీదు కదా. 486 00:27:40,160 --> 00:27:43,497 బెట్టీ, నాకు సుమారుగా 66 ఏళ్లుంటాయి, కానీ16 ఏళ్ల పడుచులా ఉన్నాను. 487 00:27:45,207 --> 00:27:46,708 సరే మరి. మనం ఎక్కడి దాకా రాశాం? 488 00:27:46,792 --> 00:27:50,629 వాళ్ళు నీ అయిదేళ్ల కొడుకును చట్టబద్ధంగా అట్లాంటాకు చెందిన 489 00:27:50,712 --> 00:27:52,756 ఒక తోట యజమానికి అమ్మేశారు. 490 00:27:52,840 --> 00:27:56,134 తెల్లజాతీయులు దుర్మార్గులు. ఇక రాయడం మొదలుపెట్టు. 491 00:28:01,640 --> 00:28:06,895 నిజ జీవితాన్ని పట్టించుకోని రచనలు కూడా శవాలతో సమానమే 492 00:28:31,879 --> 00:28:33,297 మిస్టర్ హిగ్గిన్సన్, 493 00:28:34,006 --> 00:28:37,634 నా కవితకు ప్రాణముందో లేదో మీకు వీలు కుదిరినప్పుడు చూసి చెప్పగలరా? 494 00:29:26,350 --> 00:29:28,352 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య