1 00:00:58,767 --> 00:01:02,729 ...మా ఛానెల్ కే చెందిన 28 ఏళ్ళ ఇసబెల్ కారిక్, సంఘటనా స్థలిలోనే 2 00:01:02,813 --> 00:01:07,985 మరణించినట్టు ప్రకటించబడిన వార్త మా అందరినీ కలచివేసింది. తన ప్రతిభతో కీర్తి... 3 00:01:10,112 --> 00:01:11,321 నువ్వు బాగానే ఉన్నావా? 4 00:01:12,656 --> 00:01:13,657 లేదు. 5 00:01:17,744 --> 00:01:19,162 అక్కడ ఏం జరిగింది, లియన్? 6 00:01:21,206 --> 00:01:22,833 నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నా. 7 00:01:27,254 --> 00:01:30,132 నాతో కలిసి పని చేసిన ఒక మహిళ ఇందాకే చనిపోయింది, కానీ నీ... 8 00:01:32,342 --> 00:01:34,887 నీ ముఖంలో ఆనందం కనిపించింది. 9 00:01:35,554 --> 00:01:37,389 ఇసబెల్ నీకు హాని తలపెట్టాలనుకుంది. 10 00:01:38,348 --> 00:01:40,642 తను బతికి ఉన్నంత కాలం ఆ పనిని అస్సలు ఆపదు. 11 00:01:42,060 --> 00:01:43,270 నేను సాయపడదామనుకున్నాను. 12 00:01:45,522 --> 00:01:46,607 "సాయమా"? 13 00:01:49,651 --> 00:01:50,861 అది ఎలా సాయం అవుతుంది? 14 00:02:01,288 --> 00:02:02,289 క్షమించు. 15 00:02:08,002 --> 00:02:09,588 మీరు అప్పుడే వెళ్లిపోతున్నారా? 16 00:02:11,381 --> 00:02:13,717 కోర్ట్నీకి మనస్సేమీ బాగా లేదట. 17 00:02:14,885 --> 00:02:16,094 నేను కారులో ఉంటాను. 18 00:02:17,179 --> 00:02:20,474 ఈ రాత్రి జరిగినదానికి నన్ను క్షమించు. 19 00:02:21,683 --> 00:02:23,852 నువ్వు ఎందుకు క్షమాపణలు చెప్తున్నావు, బంగారం. 20 00:02:23,936 --> 00:02:25,729 నీకు ఏమీ కానందుకు నాకు ఆనందంగా ఉంది. 21 00:02:25,812 --> 00:02:30,275 మనం ఇందాక మాట్లాడుకున్నదాన్ని కొనసాగించగలం అనుకున్నా. 22 00:02:30,359 --> 00:02:33,987 తప్పకుండా, మీ ఆయా గురించి మనం ఈ వారమే మరోసారి మాట్లాడుకుందాం. 23 00:02:34,530 --> 00:02:37,074 కానీ ఇప్పుడు మాత్రం నీకు నిద్ర అవసరం. 24 00:02:38,200 --> 00:02:40,827 అవును. కాస్త నడుము వాల్చు. 25 00:03:06,520 --> 00:03:07,688 హేయ్. 26 00:03:08,939 --> 00:03:10,107 నీ డ్రగ్స్ ఏమైపోయాయి? 27 00:03:10,774 --> 00:03:13,443 వాటిని పారేశాను, మహాతల్లీ. 28 00:03:13,527 --> 00:03:14,528 ఎందుకు? 29 00:03:16,697 --> 00:03:18,866 మళ్లీ మొదలుపెట్టానంటే, ఇక ఆపడం నా వల్ల కాదు. 30 00:03:20,993 --> 00:03:22,202 నాకు అవి కావాలి. 31 00:03:22,953 --> 00:03:27,332 చెప్తున్నా కదా, వాటి వల్ల నీకు కొంచెం కూడా ఉపయోగం ఉండదు. 32 00:03:34,464 --> 00:03:35,465 ఏంటి? 33 00:03:44,183 --> 00:03:45,392 నీ ప్యాంట్ విప్పు. 34 00:03:46,226 --> 00:03:47,269 ఏంటి? 35 00:03:48,437 --> 00:03:49,438 ఇప్పుడా? 36 00:03:50,105 --> 00:03:51,607 అందరూ ఎప్పుడో పడుకున్నారు. 37 00:04:18,509 --> 00:04:22,930 నాల్గవ కెమెరా ఇంటి వెనుక భాగం 38 00:04:42,699 --> 00:04:44,493 దహీ వడ తింటావా? 39 00:04:45,577 --> 00:04:47,621 నేను కాఫీ తాగుదామని వచ్చానంతే. 40 00:04:54,461 --> 00:04:55,546 ఇక్కడ కూర్చో. 41 00:05:15,732 --> 00:05:17,442 నువ్వు తీనేదాకా బుడ్డోడిని నేను పట్టుకుంటాను, ఇలా ఇవ్వు. 42 00:05:17,526 --> 00:05:19,278 వీడు నాతో ఉంటేనే బాగుంటాడు. 43 00:05:24,533 --> 00:05:26,326 -మనం కాసేపు మాట్లాడుకోవచ్చా? -దేని గురించి? 44 00:05:27,202 --> 00:05:28,328 నిన్న రాత్రి జరిగిన దాని గురించి. 45 00:05:29,621 --> 00:05:30,956 మాట్లాడుకోవడానికి ఏముంది? 46 00:05:32,875 --> 00:05:36,420 డొరోతీ, నువ్వు నన్ను పట్టించుకోవాలంటే నేనేం చేయాలి? 47 00:05:37,588 --> 00:05:40,591 నువ్వేం చేయాలో నీకు తెలుసు, నువ్వెవరి పక్షాన ఉంటున్నావో కూడా నువ్వు స్పష్టంగా చెప్పేశావు. 48 00:05:41,925 --> 00:05:43,719 నేను ఎప్పుడూ నీ పక్షానే ఉంటాను, డొరోతీ. 49 00:05:56,481 --> 00:05:58,025 ఇవాళ నీకు పని ఉందా? 50 00:05:59,318 --> 00:06:02,404 ఉంది, రాత్రంతా జడ్జిమెంట్ ప్యానెళ్ల షూటింగ్ ఉంది, కాబట్టి నేను వచ్చేసరికి పొద్దుపోతుంది. 51 00:06:02,487 --> 00:06:04,072 కానీ వాళ్లకి చెప్పి నేను దాన్ని వాయిదా వేయించగలను. 52 00:06:04,156 --> 00:06:08,035 వద్దు. ఆ పని మాత్రం చేయకు. టీవీ షోలో పని చేయడం చిన్న విషయం కాదు, షాన్. 53 00:06:08,118 --> 00:06:11,246 ఎలాంటి పరిస్థితినైనా మనం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. 54 00:06:13,957 --> 00:06:15,209 ఏం చేస్తున్నావు? 55 00:06:18,587 --> 00:06:19,671 నేను చదువుతున్నాను. 56 00:06:20,547 --> 00:06:21,673 దేని గురించి? 57 00:06:22,299 --> 00:06:25,052 నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేలోపు నేను వాడిని పట్టుకుంటానులే. 58 00:06:25,135 --> 00:06:26,678 నేను ఇక్కడే ఉన్నాగా. 59 00:06:27,387 --> 00:06:29,681 లేదు. దీన్ని నేను తినలేను. 60 00:06:31,475 --> 00:06:33,060 ఎన్నో గంటలు కష్టపడి దీన్ని చేశాను. 61 00:06:41,610 --> 00:06:43,028 ఆ చెత్తంతా తినకు. 62 00:06:47,241 --> 00:06:48,742 పాలు కావాలా? వద్దా? 63 00:06:52,996 --> 00:06:53,997 ఏమైంది? 64 00:06:57,167 --> 00:06:58,627 బాబోయ్. 65 00:06:58,710 --> 00:06:59,837 అది నా గొంతులోకి వెళ్లిందనుకుంటా. 66 00:07:00,587 --> 00:07:01,630 వాటిని గానీ మింగావా? 67 00:07:01,713 --> 00:07:03,257 నా నోట్లో ఉన్నప్పుడు అవి కదిలాయి. 68 00:07:03,340 --> 00:07:04,341 మింగేశావా? 69 00:07:22,693 --> 00:07:28,991 ముందు ద్వారం 70 00:08:51,990 --> 00:08:56,453 నీ కోసమే, తాతయ్య షాన్ 71 00:09:25,357 --> 00:09:26,441 లియన్? 72 00:09:29,820 --> 00:09:31,446 జాగింగ్ బాగా చేసి వచ్చావా? 73 00:09:32,155 --> 00:09:33,156 అవును. 74 00:09:34,449 --> 00:09:36,493 నాతో ఒక్క నిమిషం ఇలా రాగలవా? 75 00:09:36,577 --> 00:09:38,537 నా డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు, 76 00:09:38,620 --> 00:09:40,998 నీకు ఇంకో డ్రెస్ కూడా ఇద్దామనుకున్నా. 77 00:09:45,043 --> 00:09:46,253 లియన్. 78 00:09:49,256 --> 00:09:50,883 ఈ గాయాలన్నీ నీకు ఎలా తగిలాయి? 79 00:09:57,806 --> 00:09:59,433 నన్ను నేనే శిక్షించుకొనేదాన్ని. 80 00:10:01,977 --> 00:10:03,979 మేము నూటికి నూరు శాతంగా ఏ లోపం లేకుండా ఉండాలి. 81 00:10:05,772 --> 00:10:08,984 ఎలాంటి దురాలోచనలూ, స్వార్థమూ ఉండకూడదు. 82 00:10:10,861 --> 00:10:12,279 కేవలం దేవునికే సేవ చేయాలి. 83 00:10:14,740 --> 00:10:15,908 నిన్న రాత్రి, 84 00:10:16,950 --> 00:10:20,078 నీకు సాయపడాలనుంది అని అన్నావు కదా... 85 00:10:22,497 --> 00:10:26,335 ఇసబెల్ కి జరిగిన దానికి నువ్వే కారణమని అనుకున్నావా? 86 00:10:30,297 --> 00:10:32,257 నువ్వు మళ్లీ ఇలా గాయపరచుకోకూడదు అనే నా అభిమతం, 87 00:10:32,341 --> 00:10:36,178 నీ విశ్వాసాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నానంతే. 88 00:10:36,720 --> 00:10:37,721 అంతకు మించీ ఇంకేమీ లేదు. 89 00:10:39,473 --> 00:10:40,641 నువ్వు కంగారు పడనక్కర్లేదు. 90 00:10:41,225 --> 00:10:42,226 అవునా? 91 00:10:43,310 --> 00:10:45,521 ఇప్పుడు నన్ను నేను గాయపరుచుకోవడం మానేశాను. 92 00:10:46,522 --> 00:10:48,190 ఇప్పుడు వాళ్ల నియమాలను నేను పాటించట్లేదు. 93 00:10:49,483 --> 00:10:51,109 ఇప్పుడు నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటున్నాను. 94 00:10:53,904 --> 00:10:55,739 అది సంతృప్తికరంగా అనిపిస్తుంది కదా. 95 00:10:57,241 --> 00:10:58,534 అవును. 96 00:11:01,203 --> 00:11:02,538 చూడు ఎంత అందంగా ఉన్నావో. 97 00:11:03,705 --> 00:11:07,042 ఆగు, నీతో ఒక ఫోటో తీసుకుంటాను. అవును. 98 00:11:09,670 --> 00:11:10,671 తీస్తున్నా. 99 00:11:22,975 --> 00:11:24,017 ఎలా వచ్చిందో చూస్తా. 100 00:11:45,831 --> 00:11:48,083 నా పేరు ఫ్రాంక్ పియర్స్. ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి. 101 00:11:48,834 --> 00:11:52,296 హాయ్, నాన్నా. నీకు ఈ మెసేజ్ అందగానే నాకు కాల్ చేయ్. 102 00:11:52,379 --> 00:11:53,547 థ్యాంక్యూ. 103 00:11:55,215 --> 00:11:56,216 అబ్బా. 104 00:12:00,470 --> 00:12:01,763 నా పేరు ఫ్రాంక్ పియర్స్. 105 00:12:10,522 --> 00:12:12,733 నాకు త్వరగా కాల్ చేయ్, మనం కొంచెం మాట్లాడుకోవాలి 106 00:12:12,816 --> 00:12:15,485 నీ సైకియాట్రిస్ట్ మిత్రుని పేరేంటి? 107 00:12:38,217 --> 00:12:40,511 ఇప్పుడు సమయం అర్ధరాత్రి రెండు గంటలు. 108 00:12:40,594 --> 00:12:42,346 నాన్నా, నన్ను క్షమించు. 109 00:12:42,429 --> 00:12:44,556 నేను రాత్రంతా నీకు కాల్ చేస్తూనే ఉన్నాను. 110 00:12:48,435 --> 00:12:49,645 ఉన్నావా? 111 00:12:52,189 --> 00:12:54,191 క్షమించు, నాన్నా. నేను నీకు మళ్లీ కాల్ చేస్తాను. 112 00:13:09,581 --> 00:13:11,416 నువ్వు ఇంకా డేల్ మెక్ కెంజీతో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నావా? 113 00:13:12,292 --> 00:13:13,293 ఏంటి? 114 00:13:13,836 --> 00:13:15,546 నీ డాక్టర్ స్నేహితుడితో. 115 00:13:15,629 --> 00:13:19,633 అలాగే. డేల్, నేనూ ప్రతీ మంగళవారం టెన్నిస్ ఆడుతాం. 116 00:13:19,716 --> 00:13:23,011 మంచిది. అతడిని ఒక పేషెంట్ ని చూడటానికని ఇంటికి పంపించు. 117 00:13:24,388 --> 00:13:25,973 దాని వల్ల లాభం ఉంటుందని నీకు అనిపిస్తే, 118 00:13:26,056 --> 00:13:28,308 నేను అతడిని ఇంటికి పంపించి... 119 00:13:28,392 --> 00:13:32,896 అతను లియన్ ని ఇంటర్వ్యూ చేసి, పిచ్చాసుపత్రిలో చేర్పించాలని సంతకం పెట్టాలి. 120 00:13:32,980 --> 00:13:34,857 నువ్వు నిజంగా అంటున్నావా? 121 00:13:34,940 --> 00:13:36,984 అవును. నేను పరిశోధన చేసి చూశాను. 122 00:13:37,484 --> 00:13:40,153 తన వల్ల తనకి, అలాగే ఇతరులకు కూడా చాలా ప్రమాదం. 123 00:13:40,237 --> 00:13:41,613 తనకు పిచ్చి. 124 00:13:41,697 --> 00:13:44,241 నిజమేదో, భ్రమ ఏదో తను గుర్తించలేదు. 125 00:13:44,324 --> 00:13:46,869 బాగా మభ్యపెట్టేస్తుంది. స్వీయ హానీ చేసుకుంటుంది. 126 00:13:46,952 --> 00:13:48,203 ఇది మానసిక లోపమో లేకపోతే 127 00:13:48,287 --> 00:13:51,039 ఏదో మూఢ మఠం వారు తనకి లేనిపోనివి చెప్పి ఇలా చేశారో నాకు తెలీదు కానీ, 128 00:13:51,123 --> 00:13:53,458 తను మాత్రం ఇక్కడ ఉండకూడదు. 129 00:13:54,418 --> 00:13:56,086 అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. 130 00:13:56,670 --> 00:13:58,255 నేను నీకు కొన్ని ఫోటోలను పంపుతాను. 131 00:13:58,338 --> 00:14:03,135 నువ్వు ఆయన్ని పంపించగలిగితే, ఆయనతో మాట్లాడమని నేను లియన్ ని ఒప్పించగలను. 132 00:14:07,639 --> 00:14:10,225 నేను ఉదయమే డేల్ తో మాట్లాడతాను. 133 00:14:10,309 --> 00:14:11,685 మంచిది. మళ్లీ మాట్లాడదాం. 134 00:14:14,146 --> 00:14:21,111 నాల్గవ కెమెరా ఇంటి వెనుక భాగం 135 00:14:24,114 --> 00:14:27,993 సరే మరి. నిన్ను ఇందులో కూర్చోబెడతాను. 136 00:14:28,076 --> 00:14:29,620 అంతే. 137 00:14:29,703 --> 00:14:31,705 ఇప్పుడు బాగా ఉందా? 138 00:14:38,086 --> 00:14:43,050 కొన్నేళ్ళ క్రితం, నేనూ, షాన్ కూడా అనోన్యంగా ఉండటానికి థెరపీ తీసుకున్నాము. 139 00:14:43,926 --> 00:14:45,761 అది మా జీవితాలను చాలా మార్చింది. 140 00:14:46,553 --> 00:14:47,596 ఎలా? 141 00:14:48,472 --> 00:14:52,476 అప్పుడు మా మధ్య చాలా మనస్పర్థలు ఉండేవి, 142 00:14:52,559 --> 00:14:54,186 అప్పుడు నా సంపాదన మీదే కదా ఇల్లు నడిచింది. 143 00:14:54,937 --> 00:14:57,689 అప్పట్లో, నేను అందరికీ నచ్చేలా ఉండాలని, ప్రతీ చిన్న విషయం కూడా సరిగ్గా ఉండాలని 144 00:14:57,773 --> 00:14:59,358 తెగ తాపత్రయపడేదాన్ని. 145 00:15:01,151 --> 00:15:02,528 కానీ ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు. 146 00:15:03,487 --> 00:15:05,239 అది పుటుక్కున పోయేది కాదు. 147 00:15:07,449 --> 00:15:11,537 నీ బాల్యంలో నువ్వు చాలా అనుభవించావు, వాటి నుండి బయటపడటానికి నీకు చాలా సమయం పడుతుంది. 148 00:15:12,371 --> 00:15:14,623 దాని గురించి నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా? 149 00:15:16,375 --> 00:15:18,252 నాకేమీ మారాలని అనిపించట్లేదు. 150 00:15:19,419 --> 00:15:22,840 ఒకవేళ మనిద్దరం కలిసి పాల్గొంటే, అప్పుడు నీకు ఓకేనా? 151 00:15:24,591 --> 00:15:26,885 నేను మనిద్దరి గురించి చాలా ఆలోచిస్తూ గడిపాను. 152 00:15:29,263 --> 00:15:33,767 మనిద్దరం మళ్లీ దగ్గర అవ్వాలని నాకు ఉంది, అందుకని నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. 153 00:15:35,561 --> 00:15:36,770 మనిద్దరం కలిసి పాల్గొనవచ్చా? 154 00:15:42,025 --> 00:15:43,026 పాల్గొనవచ్చు. 155 00:15:48,073 --> 00:15:49,408 సరే. 156 00:16:37,539 --> 00:16:40,834 ఊరుకో, బంగారు కొండా, నిశ్శబ్దంగా ఉండు 157 00:16:42,002 --> 00:16:45,756 అమ్మ నీకు ఒక కోయిలని కొనిస్తుంది 158 00:16:47,382 --> 00:16:51,428 ఒకవేళ ఆ కోయిల పాడకపోతే 159 00:16:52,346 --> 00:16:55,224 అప్పుడు అమ్మ నీకు ఒక వజ్రపు ఉంగరం కొనిస్తుంది 160 00:16:57,100 --> 00:17:00,938 ఒకవేళ ఆ ఉంగరం ఇత్తడిది అయిపొతే 161 00:17:02,147 --> 00:17:05,567 అప్పుడు అమ్మ నీకు ఒక అద్ధం కొనిస్తుంది 162 00:17:06,944 --> 00:17:11,156 ఒకవేళ ఆ అద్ధం విరిగిపోతే 163 00:17:12,532 --> 00:17:16,494 అప్పుడు నీకు ఒక మేకపోతును కొనిస్తుంది 164 00:17:32,261 --> 00:17:33,262 హలో, డొరోతీ. 165 00:17:33,345 --> 00:17:37,057 డాక్టర్ మెక్ కెంజీ, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. లోపలికి రండి. 166 00:17:40,811 --> 00:17:41,979 ఇది సరిపోతుందా? 167 00:17:43,021 --> 00:17:45,148 ఇక్కడ అయితే గోప్యంగా ఉంటుందని నాకు అనిపించింది. 168 00:17:45,232 --> 00:17:46,567 ఇది సరిపోతుంది. 169 00:17:57,369 --> 00:17:58,871 తను వచ్చేసింది. 170 00:17:59,454 --> 00:18:02,332 లియన్, ఈయనే డాక్టర్ మెక్ కెంజీ. 171 00:18:02,416 --> 00:18:03,750 నిన్ను కలవడం సంతోషంగా ఉంది, లియన్. 172 00:18:04,585 --> 00:18:05,586 హలో. 173 00:18:06,253 --> 00:18:11,633 డాక్టర్ మెక్ కెంజీ మనిద్దరితో విడివిడిగా మాట్లాడాలని అనుకుంటున్నట్టున్నారు. 174 00:18:11,717 --> 00:18:12,843 అంతే కదా? 175 00:18:12,926 --> 00:18:14,845 మనిద్దరం కలిసి మాట్లాడుతున్నాం అనుకున్నా. 176 00:18:16,305 --> 00:18:19,099 ఇలా అయితే నువ్వు ఏ బెరుకూ లేకుండా అన్నీ చెప్పేయవచ్చు, లియన్. 177 00:18:19,183 --> 00:18:21,560 నీ గురించి, అలాగే నా గురించి కూడా. 178 00:18:22,144 --> 00:18:24,188 నువ్వు దేని గురించి కూడా కంగారు పడనక్కర్లేదు. 179 00:18:24,771 --> 00:18:25,772 అవును కదా? 180 00:18:25,856 --> 00:18:27,065 అవును, డొరోతీ. 181 00:18:33,030 --> 00:18:34,948 ఇక్కడ కూర్చోరాదూ, లియన్? 182 00:18:48,003 --> 00:18:49,838 నీకు ఇక్కడ ఏం పని? 183 00:18:49,922 --> 00:18:51,131 అసలు నీకు ఇక్కడ ఏం పని? 184 00:18:51,632 --> 00:18:52,841 మొత్తం శుభ్రం చేస్తున్నాను. 185 00:18:54,551 --> 00:18:55,969 షాన్... 186 00:18:56,053 --> 00:18:57,721 షాన్ ఇంట్లో ఉన్నాడా? 187 00:18:59,097 --> 00:19:00,182 పనికి వెళ్లాడు. 188 00:19:02,100 --> 00:19:03,936 ఇక్కడికి నువ్వు లియన్ కోసమే వచ్చావు కదా? 189 00:19:06,772 --> 00:19:09,149 కనీస విధేయత అన్నా చూపమని నిన్ను కోరాను. 190 00:19:09,233 --> 00:19:11,693 నా జీవితాన్ని నాశనం చేస్తున్న మహిళతో పడక పంచుకోవద్దు అని. 191 00:19:11,777 --> 00:19:14,404 అది కూడా నా ఇంట్లోనే, నా ఇంటి వెనుక గదిలోనే చేస్తున్నావు నువ్వు! 192 00:19:17,241 --> 00:19:18,617 నాకు ఆపడం ఎలాగో అర్థం కావట్లేదు. 193 00:19:19,993 --> 00:19:21,662 తను ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదు. 194 00:19:21,745 --> 00:19:23,872 ఆ అమ్మాయి గురించి మీ అందరి కన్నా నాకే బాగా తెలుసు. 195 00:19:25,290 --> 00:19:28,001 నువ్వు లియన్ తో స్నేహంగా మెలగగలిగితే 196 00:19:28,085 --> 00:19:29,503 అది అందరికీ మేలు అనుకుంటా. 197 00:19:30,462 --> 00:19:33,090 మీరిద్దరూ తనంటే ఎందుకు అంత భయపడుతున్నారు? మీ ఇద్దరికీ ఏమైంది? 198 00:19:33,173 --> 00:19:34,466 నన్ను తనతో మాట్లాడనివ్వు. 199 00:19:34,550 --> 00:19:35,759 అది కుదరదు, 200 00:19:35,843 --> 00:19:38,262 ఎందుకంటే, తను ఇప్పుడు ఆఫీసు గదిలో డేల్ మెక్ కెంజీతో మాట్లాడుతూ ఉంది. 201 00:19:38,762 --> 00:19:40,430 ఏంటి? అంటే, నాన్న స్నేహితుడా? 202 00:19:40,514 --> 00:19:42,307 అవును, ఆయన లియన్ ని పరిశీలిస్తున్నాడు. 203 00:19:42,391 --> 00:19:45,143 వాడొక వెధవ. ఈ విషయంలో అసలు నాన్నను ఎందుకు లాగావు? 204 00:19:45,227 --> 00:19:46,979 ఏం చేయమంటావు మరి, నీలా ఆయనేమీ ఆయాతో సంబంధం నెరపడం లేదు! 205 00:19:47,062 --> 00:19:49,314 లేదు, కాస్త ఆగి చూస్తే, నీకే అర్థమవుతుంది. 206 00:19:49,398 --> 00:19:52,067 మళ్లీ నీ మీద నాకు నమ్మకం కలగాలంటే, నువ్వు తక్షణమే బయటకు వెళ్లిపోయి, 207 00:19:52,150 --> 00:19:53,777 ఈ విషయాన్ని నాకు వదిలేయాలి! 208 00:19:56,738 --> 00:19:57,865 సరే. 209 00:19:57,948 --> 00:20:00,701 నీ ఇష్ట ప్రకారమే కానివ్వు, కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. 210 00:20:04,413 --> 00:20:06,665 హేయ్, నా పేరు షాన్. మీ మెసేజ్ చెప్పండి. 211 00:20:06,748 --> 00:20:11,044 షాన్, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయాలి. పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నాకు కాల్ చేయ్. 212 00:20:22,890 --> 00:20:24,600 మీ సెషన్ అయిపోవస్తోందేమో అనుకున్నా. 213 00:20:26,560 --> 00:20:27,811 ఎలా జరిగింది? 214 00:20:27,895 --> 00:20:28,896 బాగా జరిగింది. 215 00:20:29,521 --> 00:20:30,856 ఇప్పుడు నీ వంతే. 216 00:20:34,943 --> 00:20:36,945 మీరు ఆమెతో ఎలా మాట్లాడారో తెలియడం లేదు కానీ, 217 00:20:37,029 --> 00:20:41,700 తను మాత్రం బెరుకుగా కానీ, భయంగా కానీ ఉన్నట్లుగా అనిపించట్లేదు. 218 00:20:42,576 --> 00:20:44,661 అంటే, ఈ విషయంలో మీరు మంచి నేర్పరులు అన్నమాట. 219 00:20:45,913 --> 00:20:47,789 వాడిని కింద ఎక్కడైనా పెడతావా? 220 00:20:47,873 --> 00:20:49,791 అయ్యో, పర్వాలేదులే. 221 00:20:50,918 --> 00:20:52,961 అయితే, మీకు కావలసింది దక్కిందా? 222 00:20:53,045 --> 00:20:56,798 దాదాపుగా. నువ్వు మీ నాన్నకు చెప్పినవన్నీ నా దగ్గర ఉన్నాయి. 223 00:20:57,591 --> 00:21:00,886 నీకు అభ్యంతరం లేకపోతే, నేను ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. 224 00:21:03,222 --> 00:21:04,515 అంటే, 225 00:21:05,390 --> 00:21:08,727 తను నాకు చెప్పినవన్నీ మీకు చెప్పిందో లేదో. 226 00:21:09,937 --> 00:21:11,772 ఇంకా తను ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నవిగా ఊహించుకుంటుంది. 227 00:21:13,565 --> 00:21:17,194 చెప్తున్నా కదా, తను తర్వాత ఏం చేస్తుందో అని నేను అనుక్షణం భయపడుతూనే ఉంటాను. 228 00:21:18,362 --> 00:21:20,906 షాన్ కి, జూలియన్ కి, ఈ విషయం అస్సలు అర్థం కావట్లేదు. 229 00:21:20,989 --> 00:21:23,450 తన రోగాన్ని వాళ్లు పెంచి పోషిస్తూనే ఉన్నారు. 230 00:21:23,534 --> 00:21:25,953 తను వాళ్లిద్దరినీ పూర్తిగా బుట్టలో పడేసుకుంది. 231 00:21:26,036 --> 00:21:28,830 తను ఒక కలుపు మొక్క లాంటిది, పీకకుండా ఉంటే 232 00:21:28,914 --> 00:21:32,167 పొలమంతా వ్యాపించి మొత్తం పంటనే నాశనం చేసేస్తుంది. 233 00:21:37,297 --> 00:21:38,549 థ్యాంక్యూ. 234 00:21:39,383 --> 00:21:40,467 థ్యాంక్యూ. 235 00:21:40,551 --> 00:21:43,595 చివరికి నా మాటలను ఆలకించే వారు ఒక్కరైనా దొరికినందుకు ఆనందంగా ఉంది. 236 00:21:50,352 --> 00:21:52,896 నన్ను క్షమించు. అతడిని అసలు తను ఎందుకు పిలిచిందో నాకు అర్థమవ్వట్లేదు. 237 00:21:52,980 --> 00:21:54,815 హేయ్. మరేం పర్వాలేదులే. 238 00:21:55,941 --> 00:21:57,442 డొరోతీ నా మేలు కోరే ఇలా చేసింది. 239 00:21:58,735 --> 00:22:02,489 అవును, డొరోతీ ఎవరి మేలైనా కోరుకుంటే, తను ఏం చేస్తోందో కూడా... 240 00:22:06,577 --> 00:22:07,744 ఇది మైలోది. 241 00:22:08,787 --> 00:22:09,997 ఇది ఇంటి ముందు ఉండింది. 242 00:22:11,999 --> 00:22:13,333 వాడిని అన్ని చోట్లా వెతికాం, కానీ ఎక్కడా కనబడలేదు. 243 00:22:19,131 --> 00:22:20,257 థ్యాంక్యూ. 244 00:22:22,968 --> 00:22:25,971 ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. 245 00:22:35,314 --> 00:22:37,399 మేము మీ సమయాన్ని మరీ అంతగా వృధా చేయలేదనే ఆశిస్తున్నా. 246 00:22:37,482 --> 00:22:38,692 అలాంటిదేమీ లేదు. 247 00:22:38,775 --> 00:22:39,902 సరే. 248 00:22:48,660 --> 00:22:49,661 నాన్నా? 249 00:22:51,079 --> 00:22:52,789 నువ్వు వస్తున్నావని నాకు తెలీదు. 250 00:22:54,583 --> 00:22:58,712 మనం కాసేపు మాట్లాడుకుందామా? 251 00:23:01,006 --> 00:23:02,674 ఇప్పుడా? అలాగే. 252 00:23:05,010 --> 00:23:08,597 వంటగదిలో కొద్దిగ కాఫీ ఉంది, తెస్తాను. లియన్ ని కూడా తీసుకువస్తాను. 253 00:23:08,680 --> 00:23:12,476 డొరోతీ, ఈ ఇంట్లో పరిస్థితులు అంత బాగా లేవని 254 00:23:12,559 --> 00:23:14,770 తన ఆందోళనని మీ నాన్న నాతో పంచుకున్నాడు. 255 00:23:14,853 --> 00:23:15,854 సరే. 256 00:23:15,938 --> 00:23:18,524 అతనికి అన్నింటికన్నా తన మనవడి శ్రేయస్సే ముఖ్యం. 257 00:23:18,607 --> 00:23:21,360 అవును. జెరికో బాగును దృష్టిలో పెట్టుకొనే కదా ఇదంతా చేసేది. 258 00:23:21,443 --> 00:23:23,111 -లియన్? -ఇవాళ నన్ను ఇక్కడికి పంపింది 259 00:23:23,195 --> 00:23:25,030 లియన్ మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి కాదు. 260 00:23:29,034 --> 00:23:30,035 ఏమన్నారు? 261 00:23:31,203 --> 00:23:34,790 మాకు నీ మీద, నీ ఆరోగ్యం మీద ఆందోళనగా ఉంది. 262 00:23:36,416 --> 00:23:37,709 నాన్నా? 263 00:23:38,210 --> 00:23:39,211 హేయ్. 264 00:23:41,129 --> 00:23:43,799 -నువ్వు ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చావు? -జూలియన్ కాల్ చేశాడు. ఏదో జరగకూడనిది... 265 00:23:43,882 --> 00:23:45,425 అసలు ఇక్కడ ఏం జరుగుతోందో ఎవరైనా నాకు చెప్పగలరా? 266 00:23:45,509 --> 00:23:47,511 ఫ్రాంక్, నేనూ డొరోతీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. 267 00:23:47,594 --> 00:23:49,638 -ఒక్క నిమిషం ఆగు. -డొరోతీ, ఏం జరుగుతోంది? 268 00:23:49,721 --> 00:23:51,557 నాకు అస్సలు తెలియడం లేదు. 269 00:23:51,640 --> 00:23:53,100 లియన్? 270 00:23:54,017 --> 00:23:56,728 డోతి, నువ్వు అస్సలు నిద్రపోవడం లేదు. 271 00:23:56,812 --> 00:23:58,939 ఇంకెవరినీ బుడ్డోడిని తాకనివ్వడం లేదు కదా. 272 00:23:59,022 --> 00:24:02,192 ఈ స్థితి నీకు కానీ, జెరికోకి కానీ అస్సలు మంచిది కాదు. 273 00:24:02,276 --> 00:24:04,027 -ఒక్క నిమిషం ఆగండి. -ఆయన్ని పూర్తిగా చెప్పనివ్వు, షాన్. 274 00:24:04,111 --> 00:24:07,239 అంతే కాకుండా, మీ ఇంట్లో జీవించే ఆ అమ్మాయి వల్ల 275 00:24:07,322 --> 00:24:10,409 -నీకు ఏదో హాని జరగబోతుందని భ్రమ పడుతున్నావు. -భ్రమనా? 276 00:24:11,034 --> 00:24:13,036 తను తననే గాయపరుచుకుంటుంది. 277 00:24:13,120 --> 00:24:14,872 నా బిడ్డను ఎత్తుకెళ్లిపోయింది! 278 00:24:14,955 --> 00:24:17,291 మీరు కూడా ఆయనకి చెప్పండి! చెప్పండి! 279 00:24:17,374 --> 00:24:19,668 ఆయనకి నిజం చెప్పండి. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. 280 00:24:19,751 --> 00:24:22,921 ఒకసారి నువ్వేం మాట్లాడుతున్నావో ఆలకించు, బంగారం. నీ మానసిక స్థితి దిగజారిపోతోంది. 281 00:24:23,005 --> 00:24:24,673 జూలియన్ నిజమే అన్నాడు. 282 00:24:24,756 --> 00:24:25,841 వెధవ. 283 00:24:25,924 --> 00:24:30,053 ఇక నీ విషయానికి వస్తే, కనీసం ఈసారైనా ఒక సరైన పని చేస్తావని నిన్ను నమ్మాను! 284 00:24:30,137 --> 00:24:34,016 నువ్వు ఒక సురక్షితమైన ప్రాంతంలో ప్రశాంతంగా విరామం తీసుకోవడమే మాకు కావాలి. 285 00:24:34,099 --> 00:24:35,726 -నాన్నా! బాబోయ్! -అంటే ఏంటి? 286 00:24:35,809 --> 00:24:38,187 అది నేను చెప్తాను. బిడ్డకి ప్రమాదమని నాకు అనిపించితే, 287 00:24:38,270 --> 00:24:40,314 ఆ పరిస్థితిని రిపోర్ట్ చేయడం నా చట్టపరమైన బాధ్యత. 288 00:24:40,397 --> 00:24:42,816 -ఆపరా బట్టపుర్రోడా! -ఆ మర్యాదపూర్వక పలకరింపుకు థ్యాంక్స్, జూలియన్. 289 00:24:42,900 --> 00:24:46,069 ఈ విషయంలో న్యాయస్థానం దాకా వెళ్లవద్దని నేనే డేల్ ని అభ్యర్థించాను. 290 00:24:46,153 --> 00:24:47,696 కానీ నువ్వు చికిత్స చేసుకోను అని మొండికేస్తే... 291 00:24:47,779 --> 00:24:49,823 -తనని బెదిరించవద్దు! -డొరోతీ సహాయాన్ని తిరస్కరిస్తే, 292 00:24:49,907 --> 00:24:53,035 -నాకు మరో దారి లేదు, నేను బాల సంక్షేమ... -అది తన మంచి కోసమే, షాన్. 293 00:24:53,118 --> 00:24:54,578 ఇంతకు ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 294 00:24:54,661 --> 00:24:57,039 ఇప్పటిదాకా మీరు సరిగ్గా చూసుకోలేకపోయారు, ఇక నేను జోక్యం చేసుకోక తప్పడం లేదు. 295 00:24:57,122 --> 00:24:59,249 ఇక ఆపు. అలా మాట్లాడకు. డొరోతీ చాలా ఒత్తిడిలో ఉంది. 296 00:24:59,333 --> 00:25:02,544 ఇది తప్పు, చాలా పెద్ద తప్పు, ఫ్రాంక్. 297 00:25:05,130 --> 00:25:06,423 షాన్ అన్నది నిజమే. 298 00:25:08,509 --> 00:25:12,387 మేమందరం ఇక్కడే తనని జాగ్రత్తగా చూసుకుంటూ తను కోలుకొనేలా చేయగలం. 299 00:25:14,181 --> 00:25:18,727 ఈ సమయంలో జెరికోని, ఆమెని దూరం చేస్తే అది ఇద్దరికీ చేటే చేస్తుంది. 300 00:25:21,230 --> 00:25:23,857 డొరోతీ చాలా మంచి తల్లి. 301 00:25:25,067 --> 00:25:27,903 తన వల్లే ఈ కుటుంబం కలిసి ఉంది. 302 00:25:28,987 --> 00:25:30,822 తను నాకు చాలా నేర్పింది. 303 00:25:32,199 --> 00:25:34,451 ఇంకా జెరికోకి కూడా ఏ ప్రమాదమూ లేదు. 304 00:25:35,160 --> 00:25:38,413 వీడిని నేను పట్టుకోవడంలో డొరోతీకి ఏ సమస్యా లేదు. అంతే కదా? 305 00:25:39,498 --> 00:25:42,084 నిన్న మొన్న పెరట్లో ఆడుకున్నాం కదా? 306 00:25:42,709 --> 00:25:43,877 అది వాళ్లకి చూపుదామా? 307 00:25:45,170 --> 00:25:46,171 ఆగు. 308 00:25:49,591 --> 00:25:50,843 థ్యాంక్యూ, లియన్. 309 00:25:53,345 --> 00:25:54,596 హాయ్. 310 00:25:54,680 --> 00:25:56,056 ఇస్తావా? 311 00:26:04,273 --> 00:26:05,274 చూశారా? 312 00:26:06,441 --> 00:26:11,488 నాన్నా, తనకి ఆసరాగా ఉండటానికి నేను ఇక్కడే ఉండిపోగలను. మేము ఏమీ జరగనివ్వం. 313 00:26:11,572 --> 00:26:13,949 అవును. మేమందరం తనకి ఆసరాగా ఉంటాం. 314 00:26:14,032 --> 00:26:17,119 మీరందరూ మీ మాటకు కట్టుబడి ఉండి, తనపై ఓ కన్నేసి ఉంచి, 315 00:26:17,202 --> 00:26:19,538 తనకి కాస్త విరామం ఇవ్వగలరంటే, 316 00:26:19,621 --> 00:26:21,331 నాకేమీ ఇబ్బంది లేదు. 317 00:26:23,208 --> 00:26:24,334 థ్యాంక్యూ. 318 00:26:25,085 --> 00:26:27,129 మీరిద్దరూ ఇంత దిగజారేదాకా ఎలా చూస్తూ ఊరుకున్నారో అర్థం కావట్లేదు. 319 00:26:27,212 --> 00:26:29,131 -చెప్పావులే ఇక ఆపు, నాన్నా. -నీ ముఖం. 320 00:26:29,214 --> 00:26:32,009 నేను తనకి డిప్రెషన్ కి మందు రాసిస్తున్నాను. 321 00:26:33,677 --> 00:26:38,473 నువ్వు కొత్తది తెచ్చుకొనే దాకా నా దగ్గర ఒక ప్యాకెట్ ఉంది, అది వాడవచ్చు. 322 00:26:38,557 --> 00:26:42,060 దీన్ని ఇప్పుడే వేసుకో. కాస్త నిద్ర పడుతుంది. 323 00:26:55,574 --> 00:26:56,575 మంచి పిల్లవి. 324 00:26:56,658 --> 00:26:58,202 రా. వెళ్లి కూర్చుందాం పద. 325 00:27:05,542 --> 00:27:09,171 ఊరుకో, బంగారు కొండా, నిశ్శబ్దంగా ఉండు 326 00:27:09,713 --> 00:27:13,342 అమ్మ నీకు ఒక కోయిలని కొనిస్తుంది 327 00:27:14,343 --> 00:27:18,680 ఒకవేళ ఆ కోయిల పాడకపోతే 328 00:27:19,306 --> 00:27:23,519 అప్పుడు అమ్మ నీకు ఒక వజ్రపు ఉంగరం కొనిస్తుంది 329 00:27:24,770 --> 00:27:28,899 ఒకవేళ ఆ ఉంగరం ఇత్తడిది అయిపొతే 330 00:27:29,608 --> 00:27:33,362 అప్పుడు అమ్మ నీకు ఒక అద్ధం కొనిస్తుంది 331 00:27:34,321 --> 00:27:38,492 ఒకవేళ ఆ అద్ధం విరిగిపోతే 332 00:27:39,243 --> 00:27:42,913 అప్పుడు నీకు ఒక మేకపోతును కొనిస్తుంది 333 00:27:43,789 --> 00:27:47,626 ఒకవేళ ఆ మేకపోతు లాగలేకపోతే 334 00:27:48,460 --> 00:27:52,506 అమ్మ నీకు ఓ ఎడ్ల బండి కొనిస్తుంది 335 00:28:21,118 --> 00:28:23,120 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య